
ఈసీ నూతన సారథిగా బాధ్యతలు చేపట్టిన సునీల్ అరోరా
సాక్షి, న్యూఢిల్లీ : దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా సునీల్ అరోరా ఆదివారం పదవీ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అరోరాను సీఈసీగా నియమించారు. ఓపీ రావత్ పదవీ విరమణ చేయడంతో ఆయన స్ధానంలో అరోరా ఈసీ పగ్గాలు స్వీకరించారు. రానున్న సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ, హరియాణా, జమ్మూ కశ్మీర్, సిక్కిం, ఒడిషా, మహారాష్ట్ర, అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు అరోరా సారథ్యంలో జరగనున్నాయి.
పదవీవిరమణ చేసిన ఐఏఎస్ అధికారి అయిన సునీల్ అరోరా గతంలో కేంద్ర సమాచార ప్రసార, నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖల కార్యదర్శిగా వ్యవహరించారు. ఆర్థిక, జౌళి మంత్రిత్వ శాఖతో పాటు ప్రణాళిక సంఘంలోనూ కీలక బాధ్యతల్లో అరోరా పనిచేశారు.1999-2002 మధ్య అరోరా పౌరవిమానయాన శాఖ సంయుక్త కార్యదర్శిగాను బాధ్యతలు నిర్వర్తించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా సునీల్ అరోరా ఆరేళ్ల పాటు కొనసాగుతారు.
Comments
Please login to add a commentAdd a comment