Sunil arora
-
2024 లోక్‌సభ ఎన్నికల నాటికి రిమోట్ ఓటింగ్!
న్యూఢిల్లీ: దేశ ఎన్నికల వ్యవస్థలో రిమోట్ ఓటింగ్ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నామని కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి సునీల్ ఆరోరా వెల్లడించారు. వచ్చే రెండు, మూడు నెలల్లో దీనికి సంబంధించిన పైలెట్ ప్రాజెక్టు మొదలవుతుందని, 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి ఇది కార్యరూపం దాల్చే అవకాశాలున్నాయని అన్నారు. రిమోట్ ఓటింగ్‌కు సంబంధించిన అధ్యయనాన్ని ఈ ఏడాది మొదట్లో ప్రారంభించామని చెప్పారు. ఐఐటీ మద్రాసుతో పాటు దేశంలోని ఇతర ఐఐటీల్లోని సాంకేతిక నిపుణుల సహకారంతో దీనిపై కసరత్తు చేస్తున్నట్టుగా అరోరా చెప్పారు. రిమోట్ ఓటింగ్ అంటే ఆన్లైన్ ఓటింగ్ కాదని, ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకోవడం కూడా కాదని సీఈసీ స్పష్టం చేశారు. ఎన్నికల వ్యవస్థకి మరింత విశ్వసనీయత తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా ఈ విధానాన్ని రూపొందిస్తున్నట్టుగా చెప్పారు. త్వరలోనే దీనికి తుదిరూపు రేఖ వస్తాయని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు సహా అన్ని వర్గాల వారితో దీనిపై సంప్రదింపులు జరపవలసి ఉందని అన్నారు. గతంలో మాజీ డిప్యూటీ ఎన్నికల అధికారి సందేప్ సక్సేనా ఈ ప్రాజెక్టుని ‘‘బ్లాక్‌చైన్’’టెక్నాలజీ ద్వారా రూపొందిస్తున్నట్టుగా చెప్పారు. టూ–వే ఎలక్ట్రానిక్ ఓటింగ్ వ్యవస్థ కలిగి ఉండే ఈ విధానంలో వైట్ లిస్ట్‌లో ఉండే ఐపీ పరికరాలు, వెబ్ కెమెరాలు, బయోమెట్రిక్ డివైస్‌లు వంటివన్నీ ఉంటాయన్నారు. రిమోట్ ఓటింగ్ సదుపాయాన్ని వినియోగించుకోవాలనుకునే ఓటర్లు ముందుగా నిర్ణయించిన సమయానికి, నిర్దేశిత ప్రాంతానికి రావల్సి ఉంటుందని అప్పట్లో సక్సేనా వెల్లడించారు. (చదవండి: ఏప్రిల్ 17న తిరుపతి ఉప ఎన్నిక) -
తిరుపతి ఉప ఎన్నికపై స్పష్టత
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నికపై స్పష్టత వచ్చింది. దేశ వ్యాప్తంగా వివిధ కారణాలతో 14 రాష్ట్రాల్లో ఖాళీ అయిన 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు, నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలను ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో కలిసి నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా వెల్లడించారు. శుక్రవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్, తెలంగాణలోని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మృతితో ఏర్పడిన ఖాళీలకు కూడా ఈ సమయంలోనే ఉప ఎన్నికలను నిర్వహిస్తామని అరోరా ప్రకటించారు. అయితే ఈ ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ప్రకటిస్తుందని తెలిపారు. -
మోగిన ఎన్నికల నగారా
సాక్షి , న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉత్కంఠకు తెరలేపిన పశ్చిమ బెంగాల్ సహా తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల నగారాను శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం మోగించింది. ఐదు అసెంబ్లీలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా విడుదలచేశారు. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని ఆయన ప్రకటించారు. అత్యధికంగా పశ్చిమబెంగాల్లోని 294 నియోజకవర్గాలకు 8 విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అసోంలోని 126 స్థానాలకు 3 విడతల్లోను, 234 స్థానాలు ఉన్న తమిళనాడు, 140 స్థానాలు ఉన్న కేరళ, 30 నియోజకవర్గాలున్న పుదుచ్చేరిల్లో ఒకే దశలో ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయనున్నారు. ఈ ఐదు అసెంబ్లీల్లోని 824 నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలను మే 2వ తేదీన ప్రకటించనున్నారు. మొత్తం 18.68 కోట్ల ఓటర్లు 2.7లక్షల పోలింగ్ స్టేషన్లలో తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. కోవిడ్ –19 ముప్పు కారణంగా ఈ ఎన్నికల్లో పోలింగ్ స్టేషన్ల సంఖ్యను భారీగా పెంచారు. పోలింగ్ సమయాన్ని కూడా ఒక గంట పాటు పెంచారు. అలాగే, పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందికి ముందే కోవిడ్–19 టీకా వేస్తామని సీఈసీ అరోరా తెలిపారు. సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరిస్తామని, ఎన్నికల ప్రక్రియను వెబ్ కాస్టింగ్ చేస్తామని వెల్లడించారు. 8 దశల్లో బెంగాల్ ‘దంగల్’ ఈ ఏడాది మే 30వ తేదీతో ముగిసే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలోని 294 నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ఈసారి 8 దశల్లో జరుగనుంది. మొదటి దశలో ఐదు జిల్లాల్లోని 30 నియోజకవర్గాలకు మార్చి 2వ తేదీన నోటిఫికేషన్ జారీ అవుతుంది. మొదటిదశ పోలింగ్ మార్చి 27న జరుగుతుంది. రెండవ దశలో 4 జిల్లాల్లోని 30 స్థానాలకు ఏప్రిల్ 1వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. మూడో దశలో 3 జిల్లాల్లోని 31 నియోజకవర్గాలకు ఏప్రిల్ 6వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. నాలుగో దశలో 5 జిల్లాల్లోని 44 నియోజకవర్గాలకు ఏప్రిల్ 10వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఏప్రిల్ 17న పోలింగ్ జరుగబోయే ఐదో దశలో 6 జిల్లాల్లోని 45 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆరో దశలో 4 జిల్లాల్లోని 43 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ ఏప్రిల్ 22న జరుగుతుంది. ఏడవ దశ పోలింగ్ ప్రక్రియలో 5 జిల్లాల్లోని 36 నియోజకవర్గాలు ఉన్నాయి. వాటికి ఏప్రిల్ 26న పోలింగ్ జరుగుతుంది. 4 జిల్లాల్లోని 35 నియోజకవర్గాలకు చివరగా ఎనిమిదవ దశలో ఏప్రిల్ 29న ఎన్నికలు జరుగుతాయి. పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 294 స్థానాల్లో 68 ఎస్సీ, 16 ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయని ఈసీ ప్రకటించింది. 2016లో 7 దశల్లో జరిగిన ఎన్నికలకు 77,413 పోలింగ్ స్టేషన్లను వినియోగించగా, ఈసారి 31.65శాతం పెంచి 1,01,916 పోలింగ్ స్టేషన్లను వినియోగించనున్నారు. పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో ఇద్దరు ప్రత్యేక పరిశీలకులను నియమిస్తామని, అవసరమైతే మరో పరిశీలకుడిని కూడా ఏర్పాటు చేస్తామని సునీల్ ఈరోరా వెల్లడించారు. అసోంలో మూడు దశల్లో ఎన్నికలు అసోంలోని 126 నియోజకవర్గాలకు మూడు దశల్లో ఎన్నికల ప్రక్రియను చేపట్టనున్నారు. మొదటి దశలో 47 నియోజకవర్గాలకు మార్చి 2వ తేదీన నోటిఫికేషన్ జారీ అవుతుంది. నామినేషన్ దాఖలుకు మార్చి 9 ఆఖరు తేదీగా నిర్ణయించారు. మొదటిదశ పోలింగ్ మార్చి 27న జరుగుతుంది. రెండవ దశలో 30 స్థానాలకు మార్చి 5వ తేదీన నోటిఫికేషన్ జారీ అవుతుంది. నామినేషన్ దాఖలుకు మార్చి 12 తేదీని ఆఖరు తేదీగా ప్రకటించారు. రెండోదశ పోలింగ్ ఏప్రిల్ 1వ తేదీన జరుగనుంది. మూడో దశలో 31 నియోజకవర్గాలకు మార్చి 12న నోటిఫికేషన్ జారీ అవుతుంది. మార్చి 19లోగా నామినేషన్ల దాఖలుకు అవకాశం కల్పించారు. మూడో దశ పోలింగ్ ప్రక్రియను ఏప్రిల్ 6వ తేదీన నిర్వహించనున్నారు. కోవిడ్–19 ప్రోటోకాల్స్ తప్పనిసరి కరోనా వైరస్ సంక్రమణ దృష్ట్యా ఎన్నికల నిర్వహణలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సునీల్ అరోరా వెల్లడించారు. ఎన్నికలు జరుగబోయే 2.7లక్షల పోలింగ్ స్టేషన్లు అన్నీ గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఉంటాయని ఆయన తెలిపారు. కరోనా కారణంగా ఆన్లైన్లో నామినేషన్ల స్వీకరణకు అవకాశం కల్పిస్తున్నామని, నామినేషన్లు వేసేందుకు రిటర్నింగ్ అధికారి వద్దకు అభ్యర్థితో కలిసి కేవలం ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ఇంటింటికి తిరిగి చేసే ప్రచారంలోనూ అభ్యర్థితో కలిసి 5గురికి మాత్రమే అనుమతి ఉంటుందని, రోడ్‌షోలు, ఎన్నికల సభల విషయంలో కోవిడ్ ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించాల్సిందేనని ఈసీ స్పష్టంచేసింది. రోడ్ షోలో గరిష్టంగా ఐదు వాహనాలనే అనుమతిస్తామన్నారు. నిబంధనల ఉల్లంఘనపై సీ విజిల్ యాప్‌ను వినియోగించుకొని ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ ఐదు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలోని ఓటర్ల జాబితాను జనవరిలోనే ముద్రించామని ఈసీ ప్రకటించింది. కౌంటింగ్ ప్రక్రియలో సాధారణంగా ఉండే 14 టేబుల్స్ బదులుగా కోవిడ్ కారణంగా కేవలం 7 టేబుల్స్ వినియాగించాలని నిర్ణయించారు. వీటితో పాటు 14 రాష్ట్రాల్లోని 18 అసెంబ్లీ నియోజక వర్గాలకు, 4 లోక్‌సభ నియోజకవర్గాల ఉప ఎన్నికలను ఈ 5 అసెంబ్లీల ఎన్నికలతో కలిసి నిర్వహిస్తామని అరోరా వెల్లడించారు. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో ఒకే దశ తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి మూడు అసెంబ్లీలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. 234 స్థానాలు ఉన్న తమిళనాడు, 140 నియోజకవర్గాలున్న కేరళ, 30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీలకు మార్చి 12న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ దాఖలుకు ఆఖరు తేదీ మార్చి 19కాగా, నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 22 వరకు అవకాశం కల్పించారు. ఈ మూడు అసెంబ్లీలకు ఏప్రిల్ 6వ తేదీన పోలింగ్ ప్రక్రియ జరుగనుంది. కేరళలోని మల్లుపురం, తమిళనాడులోని కన్యాకుమారి లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలను అసెంబ్లీ ఎన్నికలతో పాటే నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. మహిళలకు తమిళ సీఎం వరాలు సాక్షి ప్రతినిధి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైన వేళ తమిళనాడు ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు పలు వరాలు ప్రకటించారు. ఆరు పౌన్ల(48 గ్రాములు) వరకు బంగారు ఆభరణాలను తనఖా పెట్టి సహకార సొసైటీల వద్ద తీసుకున్న రుణాలను మాఫీ చేస్తున్నామని శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. అలాగే, సహకార బ్యాంకులు, సొసైటీల్లో స్వయం సహాయ బృందాల్లోని మహిళలు తీసుకున్న రుణాలను కూడా మాఫీ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో లక్షకు పైగా స్వయం సహాయ బృందాలున్నాయని, వాటిలో 15 లక్షల పేద మహిళలు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. కరోనాతో పాటు భారీ తుపాన్లు రాష్ట్ర ప్రజలను భారీగా దెబ్బతీశాయన్నారు. మోదీ, షా చెప్పారా? పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలను 8 విడతలుగా నిర్వహించాలన్న నిర్ణయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రంగా తప్పుబట్టారు. బీజేపీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారం నిర్వహించుకునేందుకు వీలుగా ఈ తేదీలను ప్రకటించారని ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచనల మేరకు ఈ తేదీలను ప్రకటించారా? అని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. బీజేపీని ఉద్దేశిస్తూ ‘కాషాయ క్యాంప్’ కళ్ల ద్వారా రాష్ట్రాన్ని చూడొద్దంటూ ఎన్నికల సంఘానికి సూచించారు. ఇతర రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలను ముగించి, పశ్చిమబెంగాల్లో మాత్రం 8 విడతలుగా ఎన్నికలు నిర్వహిం చడంపై ఈసీపై అనుమానాలు తలెత్తుతున్నాయని వ్యాఖ్యానించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ ఎన్నికల్లో తృణమూల్ విజయాన్ని అడ్డుకోలేరని ఆమె స్పష్టం చేశారు. మరోవైపు, ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు కొద్ది గంటల ముందు మమతా బెనర్జీ రాష్ట్రంలోని కార్మికులకు వేతన పెంపు ప్రకటించారు. రాష్ట్ర పట్టణ ఉపాధి పథకం ద్వారా ఉపాధి పొందుతున్న కార్మికుల దినసరి వేతనాన్ని పెంచుతున్నామన్నారు. నైపుణ్యత లేని కార్మికుల రోజువారీ వేతనాన్ని రూ. 144 నుంచి రూ. 202కి, సాధారణ నైపుణ్యాలున్న కార్మికుల దినసరి వేతనాన్ని రూ. 172 నుంచి రూ. 303కి పెంచుతున్నామన్నారు. కొత్తగా నిపుణులైన కార్మికుల విభాగాన్ని కూడా ప్రారంభిస్తున్నామని, వారికి రూ. 404 దినసరి వేతనంగా నిర్ధారించామని తెలిపారు. మీడియా సమావేశం అనంతరం సీఈసీ సునీల్ అరోరా, కమిషనర్లు సుశీల్ చంద్ర, రాజీవ్‌కుమార్ -
స్వేచ్ఛ, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు
సాక్షి, అమరావతి: ఎన్నికల పరిశీలకులంటే ఎన్నికల కమిషన్‌కు కళ్లు, చెవులు వంటి వారని, స్వేచ్ఛ, శాంతియుత, పారదర్శక విధానంలో ఎన్నికలు జరిగేలా ఎన్నికల పరిశీలకులు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) సునీల్ అరోర పేర్కొన్నారు. బిహార్ అసెంబ్లీతో పాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులతో పాటు ఎన్నికల పరిశీలకులుగా వెళ్తున్న అధికారులతో సోమవారం ఢిల్లీ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అరోరా ఏం మాట్లాడారంటే.. ► కోవిడ్ నేపథ్యంలో రానున్న ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి. ► ఓటర్ల రక్షణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ► ఎన్నికల్లో పెద్ద ఎత్తున ధనం, మద్యం పంపిణీ చేయడం ద్వారా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించే వారిపై స్థానిక ఎన్నికల అథారిటీల సమన్వయంతో నిరంతర నిఘా ఉంచాలి. ► ఎన్నికల ప్రవర్తనా నియమావళి కచ్చితంగా అమలు జరిగేలా చూడాలి. సీ–విజిల్, 1950 కాల్ సెంటర్‌పై ఓటర్లలో విస్తృత అవగాహన కల్పించాలి. ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ఈసారి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు 80 ఏళ్లు నిండిన వారికి, దివ్యాంగులకు అవకాశం కల్పించామన్నారు. ► మరో ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర మాట్లాడుతూ కోవిడ్ నేపథ్యంలో సేఫ్ ఎలక్షన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ► వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్, బిహార్ ఎన్నికల పరిశీలకులుగా వెళ్తున్న ముఖ్య కార్యదర్శులు ఆర్పీ సిసోడియా, రాంగోపాల్‌తో పాటు కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్సెస్ పీయూష్‌కుమార్ సహా మరో 20 మంది ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు. -
మోగిన బిహార్ ఎన్నికల నగారా
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. అక్టోబర్ 28వ తేదీ మొదలుకొని మూడు దశల్లో పోలింగ్ జరపనున్నట్లు ఎన్నికల సంఘం(ఈసీ) శుక్రవారం ప్రకటించింది. ఓట్ల లెక్కింపు నవంబర్ 10వ తేదీన ఉంటుందని వెల్లడించింది. కోవిడ్–19 నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై కొనసాగుతున్న సందిగ్ధతకు పుల్‌స్టాప్ పెట్టింది. ఓటింగ్ ప్రక్రియ ఎప్పటి మాదిరిగానే ఉదయం 7 గంటలకు మొదలవుతుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా తెలిపారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో మినహా మిగతా చోట్ల కోవిడ్ బాధిత ఓటర్ల కోసం అదనంగా ఒక గంట అంటే..సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని వివరించారు. మహమ్మారి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా జరగనున్న అతిపెద్ద ఎన్నికల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒకటని ప్రధాన ఎన్నికల కమిషనర్ వ్యాఖ్యానించారు. మొదటి విడతలో అక్టోబర్ 28వ తేదీన 71 అసెంబ్లీ సీట్లకు, రెండో విడతలో నవంబర్ 3న 94 స్థానాలకు, నవంబర్ 7న జరిగే చివరి, మూడో విడతలో 78 స్థానాలకు పోలింగ్ ఉంటుందన్నారు. అన్ని స్థానాలకు ఓట్ల లెక్కింపు నవంబర్ 10వ తేదీన జరుగుతుందని తెలిపారు. మొదటి విడత పోలింగ్‌కు నోటిఫికేషన్‌ను అక్టోబర్ 1న, రెండో దశ పోలింగ్‌కు అక్టోబర్ 9వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తామనీ, మూడో దశ పోలింగ్‌కు అక్టోబర్ 13వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో అభ్యర్థుల ఎన్నికల ప్రచారం, సభలు, సమావేశాల విషయంలో కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుందన్నారు. ఇలా ఉండగా, కోవిడ్–19 మహమ్మారి దృష్ట్యా బిహార్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
మూణ్నెళ్ల అనంతరం ఈసీ ప్రత్యక్ష భేటీ
న్యూఢిల్లీ: భారత ఎన్నికల సంఘం దాదాపు మూడు నెలల అనంతరం పూర్తిస్థాయిలో ప్రత్యక్షంగా భేటీ అయింది. ప్రధాన ఎన్నికల అధికారి, ఇద్దరు కమిషనర్లు భారత ఎన్నికల సంఘం కార్యాలయంలో సోమవారం సమావేశమయ్యారు. మార్చి నెలలో అమెరికా వెళ్లిన సీఈసీ సునీల్ అరోరా కరోనా లాక్డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. దాంతో వీడియో కాన్ఫరెన్స్‌లతోనే ఇన్ని రోజులు ఎన్నికల సంఘం సమావేశమైంది. ఇటీవలే భారత్‌కు తిరిగొచ్చిన సునీల్ అరోరా.. స్వీయ నిర్బంధం పూర్తయిన అనంతరం తాజా సమావేశానికి హాజరయ్యారు. సీఈసీ అమెరికాలో ఉన్న సమయంలోనే మహారాష్ట్రలో మండలి ఎన్నికలపై నిర్ణయం తీసుకున్నారు. అయితే, కరోనా వ్యాప్తి కారణంగా ఈ ఎన్నికలు తొలుత వాయిదాపడ్డాయి. అనంతరం మహారాష్ట్ర శాసన మండలిలో ఖాళీగా ఉన్న 9 స్థానాలకు తొమ్మిది మంది సభ్యులే నామినేషన్ దాఖలు చేయడంతో వీరంతా మే 14న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉద్దవ్ ఠాక్రేతో పాటు శివసేన నుంచి నీలం గోర్హే, బీజేపీ నుంచి గోపీచంద్ పడల్కర్, ప్రవీణ్ దాట్కే, రంజీత్‌సింహ్ మోహితే పాటిల్, రమేష్ కరాద్, కాంగ్రెస్‌కు చెందిన రాజేష్ రాథోడ్, ఎన్సీపీకి చెందిన శశికాంత్ షిండే, అమోల్ మిట్కారి ప్రమాణ స్వీకారం చేశారు. -
ఎన్నికలు నిర్వహించండి.. ఈసీకి గవర్నర్ లేఖ
ముంబై : ముఖ్యమంత్రి ఉద్దవ్‌ఠాక్రేకు కరోనా కన్నా పదవీ సంక్షోభం ఎక్కువగా పట్టుకుంది. సీఎం పదవి ఉంటుందా ఊడుతుందా అన్న దానిపై టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ర్టంలో ఖాళీ అయిన 9 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. లాక్‌డౌన్‌ను అమలుచేస్తున్న నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన సడలింపుల దృష్ట్యా కొన్ని మార్గదర్శకాలతో ఎన్నికలు నిర్వహించాల్సిందిగా కోరారు. (ఉద్దవ్ ఠాక్రే పదవీ గండం నుంచి బయటపడతారా? ) Revised Press Release 30.04.2020 pic.twitter.com/mw64xYgpO9 — Governor of Maharashtra (@maha_governor) April 30, 2020 గత ఏడాది నవంబర్ 28న ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించినా.. ఇప్పటి వరకు ఏ సభల్లోనూ (అసెంబ్లీ, మండలి) ఆయనకు ప్రాతినిధ్యం లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల లోపు ఉభయ సభల్లో ఏదో ఒక సభకు కాకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మే 28న గడువు ముగుస్తున్నందున ఎన్నికలు నిర్వహించాల్సిందిగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరాకు లేఖ రాశారు. గవర్నర్ కోటాలో ఉద్దవ్ ఠాక్రేను ఎమ్మెల్సీగా నామినెట్ చేసే అవకాశం ఉన్నా కోశ్యారీ అందుకు సుముఖంగా లేరు. ఇదివరకే రెండుసార్లు రాష్ర్ట మంత్రివర్గం ఈ ప్రతిపాదనను గవర్నర్ ముందుంచినా ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించారు. రాజకీయ సంక్షోభం ఏర్పడే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నందున జోక్యం చేసుకోవాలని ఉద్దవ్ ప్రధాని మోదీని కోరారు. సమయం లేదు మిత్రమా అంటూ మే 28 గుర్తుచేస్తున్న నేపథ్యంలో ఈసీ ఎలా స్పందిస్తుందో చూడాలి. దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధికంగా మహారాష్ర్టలోనే వెలుగుచూస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఎన్నికలు నిర్వహిస్తారా అంటే లేదనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. మరి ఎన్నో ట్విస్టుల మధ్య సీఎం పదవిని సొంతం చేసుకున్న ఉద్దవ్ ఠాక్రే సంబరం ఆరు నెలల్లోనే ముగుస్తుందా అనేది ఉత్కంఠగా మారింది. (సీఎం పదవి ఊడకుండా కాపాడండి: ఠాక్రే ) -
సంస్కరణలపై స్పందించండి
న్యూఢిల్లీ: తప్పుడు అఫిడవిట్లు, చెల్లింపు వార్తలను ఎన్నికల నేరాలుగా పరిగణించడం సహా ఎన్నికల సంస్కరణలకు సంబంధించిన పలు ప్రతిపాదనలను ఎన్నికల సంఘం కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది. ప్రధాన ఎన్నికల అధికారి సునీల్ అరోరా, కమిషనర్లు అశోక్ లావాసా, సుశీల్ చంద్ర మంగళవారం లెజిస్లేటివ్ సెక్రటరీ నారాయణరాజుతో భేటీ అయ్యారు. ఓటరు జాబితాతో ఆధార్ నెంబర్‌ను అనుసంధానించే విషయం భేటీలో చర్చకొచ్చింది. ఓటర్లుగా నమోదు చేసుకోవాలనుకునే వారు, ఇప్పటికే ఓటర్లుగా నమోదైనవారు తమ ఆధార్ నెంబర్‌ను అనుసంధానం చేసుకోవాలని కోరేందుకు వీలుగా ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించాలని కోరుతూ ఇటీవల ఎన్నికల సంఘం కేంద్ర న్యాయ శాఖకు లేఖ రాసింది. అందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిన న్యాయశాఖ.. ఆధార్ డేటా భద్రత విషయంలో తమకు హామీ ఇవ్వాలని కోరింది. దీనిపై డేటా భద్రతకు తీసుకోనున్న చర్యలను వివరిస్తూ ఎన్నికల సంఘం సమాధానమిచ్చింది. ఎన్నికల సంస్కరణలకు సంబంధించిన దాదాపు 40 ప్రతిపాదనలు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న విషయాన్ని న్యాయశాఖ దృష్టికి తీసుకువెళ్లామని ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. కాగా, 20 మంది చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లు, పలువురు ఎన్నికల సంఘం అధికారులతో కూడిన 9 బృందాలు తాము రూపొందించిన సంస్కరణల ప్రతిపాదనలను మంగళవారం ఎన్నికల సంఘానికి సమర్పించాయి. ఇటీవలి లోక్‌సభ, ఇతర అసెంబ్లీ ఎన్నికల అనుభవాల ఆధారంగా ఈ సిఫారసులను రూపొందించారు. -
ఎన్నికల్లో బ్లాక్‌చైన్ వ్యవస్థ
న్యూఢిల్లీ: ఐఐటీ మద్రాస్‌తో కలసి బ్లాక్ చైన్ వ్యవస్థపై పనిచేస్తున్నామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా చెప్పారు. ఢిల్లీలో బుధవారం జరిగిన ‘టైమ్స్ నౌ సమిట్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈవీఎంల గురించి పలు విషయాలు మాట్లాడారు. బ్లాక్‌చైన్ వ్యవస్థ అందుబాటులోకి వస్తే ఒక ఓటర్ వేరే రాష్ట్రంలో ఉండి కూడా తమ రాష్ట్రంలోని ఎన్నికల్లో ఓటేయవచ్చని చెప్పారు. ఉదాహరణకు రాజస్తాన్‌కు చెందిన వ్యక్తి చైన్నైలో ఉద్యోగం చేస్తుంటే, రాజస్తాన్‌లో జరిగే ఎన్నికలకు చైన్నైలోనే ఓటేయవచ్చు. కారు లేదా పెన్నులాగే ఈవీఎంలు కూడా మొరాయించవచ్చేమోగానీ టాంపర్ చేయడం అసాధ్యమని చెప్పారు. -
బ్యాలెట్‌కు వెళ్లే ప్రసక్తే లేదు : సీఈసీ
న్యూఢిల్లీ : బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలను నిర్వహించే ప్రసక్తే లేదని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) సునీల్ అరోరా స్పష్టం చేశారు. ఈవీఎంలను ట్యాంపర్ చేయడం సాధ్యం కాదని తెలిపారు. బుధవారం టైమ్స్ నౌ సమిట్‌లో పాల్గొన్న సునీల్ ఆరోరా ఈ విషయాలను వెల్లడించారు. ఈవీఎంల పనితీరుపై ఆరోపణలు చేయడం సరికాదని ఆయన అన్నారు. ఇటువంటి ఆరోపణలను అడ్డుకట్టవేసేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల సంస్కరణలు, మోడల్ కోడ్‌పై చర్చించేందుకు రాబోయే రోజుల్లో రాజకీయ పార్టీలతో సమావేశం కానున్నట్టు చెప్పారు. కారు, పెన్నులు మెరాయించినట్టు ఈవీఎంలలో కూడా సమస్యలు తలెత్తుత్తాయి.. కానీ వాటిని ట్యాంపరింగ్ చేసే అవకాశం లేదని సునీల్ ఆరోరా తెలిపారు. 20 ఏళ్లుగా ఈవీఎంలు వాడుకలో ఉన్నాయని.. తిరిగి బ్యాలెట్ పేపర్ విధానానికి వెళ్లే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు. సుప్రీం కోర్టుతో సహా వివిధ కోర్టులు ఈవీఎంల వాడాకాన్ని సమర్థించాయని గుర్తుచేశారు. కాగా, ఈవీఎంల పనితీరుపై కొన్ని రాజకీయ పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఢిల్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం ఓటింగ్ శాతం వెల్లడించం ఆలస్యం కావడంతో ఈవీఎంల పనితీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఓటింగ్ శాతం వెల్లడి ఆలస్యం కావడంతో ఆప్ నేతలు విమర్శలు గుప్పించారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఎన్నికల సంఘం ఓటింగ్ శాతం ప్రకటించడానికి సిద్ధంగా లేకపోవడం చరిత్రలో ఇదే తొలిసారి అని ఎంపీ సంజయ్ సింగ్ విమర్శించారు. లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు కేవలం గంట వ్యవధిలోనే ఓటింగ్ శాతం వెల్లడించిన ఈసీ.. చిన్న రాష్ట్రమైన ఢిల్లీలో పోలింగ్ వివరాలు తెలిపేందుకు ఎందుకు ఇంత సమయం తీసుకుంటుందని ప్రశ్నించారు. -
ఢిల్లీ అసెంబ్లీకి మోగిన ఎన్నికల నగారా
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఫిబ్రవరి 8వ తేదీన ఎన్నికలు, 11న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 14వ తేదీన విడుదలవుతుందని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) సునీల్ అరోరా ప్రకటించారు. సోమవారం ఆయన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈసారి ఎన్నికలలో 1.46 కోట్లకు పైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటారని తెలిపారు. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ పదవీ కాలం ఫిబ్రవరి 22వ తేదీతో ముగియనుంది. ఓటర్ల గుర్తింపు సులువుగా వేగంగా పూర్తయ్యేందుకు అధికారులు అందరికీ క్యూఆర్ కోడ్‌తో కూడిన ఓటర్ స్లిప్పులను అందజేస్తారు. 13,659 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. దివ్యాంగులు, 80 ఏళ్లు పైబడిన పోలింగ్ స్టేషన్‌కు రాలేని వారి కోసం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించనున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన జార్ఖండ్‌లోని ఏడు నియోజకవర్గాల్లో దేశంలోనే మొదటిసారిగా ఈ వెసులుబాటును కల్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లోలో తమ పార్టీ రిపోర్టు కార్డుతోనే మరోసారి విజయం సాధించాలని ఆప్ చీఫ్ కేజ్రీవాల్ అశిస్తున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వ విజయాలు, ఆయన సమ్మోహకశక్తి తమ ప్రచారాస్త్రాలని బీజేపీ అంటోంది. అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అకాలీదళ్‌తో కలిసి పోటీ చేయనుంది. చాన్నాళ్లుగా ఢిల్లీ కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉన్న షీలాదీక్షిత్ మరణంతో చతికిలబడ్డ ఢిల్లీ కాంగ్రెస్‌కు ఇటీవల పార్టీ జార్ఖండ్‌లో సాధించిన విజయం నూతనోత్సాహాన్ని ఇచ్చింది. ముక్కోణపు పోటీ 2015 ఎన్నికల్లో ఆప్ 67 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చింది. నాడు బీజేపీ మూడు సీట్లు గెలవగా, కాంగ్రెస్‌కు ఒక్కటీ దక్కలేదు. ఈసారి ఎన్నికలలో అరడజను పైగా పార్టీలు తలపడనున్నా ప్రధాన పోటీ ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ఉండనుంది. ఈ మూడు పార్టీలు ఢిల్లీలో ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించాయి. ఆప్ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తుండగా 22 ఏళ్లుగా ఢిల్లీ పీఠానికి దూరమైన బీజేపీ, 15 ఏళ్లు ఢిల్లీని ఏకధాటిగా ఏలినా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటూ గెలవని కాంగ్రెస్.. సత్తా చాటుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. -
మోగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా
-
మోగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం వెల్లడించింది. 70 అసెంబ్లీ స్థానాలకు జనవరి 14న నోటిఫికేషన్ విడుదల కానుందని సీఈసీ సునీల్ అరోరా తెలిపారు. అలాగే ఫిబ్రవరి 8న పోలింగ్, ఫిబ్రవరి 11న ఎన్నికల ఫలితాలను విడుదల చేస్తామని ప్రకటించారు. ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి రానుందని అరోరా పేర్కొన్నారు. ఫిబ్రవరి 22తో ఢిల్లీ అసెంబ్లీ గడువు ముగియనున్న విషయం తెలిసిందే. అధికార ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు బీజేపీ, కాంగ్రెస్ ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. సంక్షేమ పథకాలపై నమ్మకంతో మరోసారి అధికారంలోకి రావాలని ఆప్ ప్రయత్నిస్తుండగా, పూర్వ వైభవం కోసం బీజేపీ, కాంగ్రెస్ తీవ్రంగా కృషిచేస్తున్నాయి. గత ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 67 స్థానాలను దక్కించుకుని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ చరిత్ర సృష్టించింది. దేశ రాజధాని కావడంతో ఈ ఎన్నికల కోసం దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. -
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నగారా
సాక్షి, న్యూఢిల్లీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహిం చనున్నట్టు కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి సునీల్ అరోరా వెల్లడించారు. డిసెంబర్ 23న ఫలితాలను వెల్లడించనున్నట్టు తెలిపారు. 2020 జనవరి 5వ తేదీతో ప్రస్తుత రాష్ట్ర శాసనసభ గడువు ముగియనుంది. మావోయిస్టు ప్రభావిత జార్ఖండ్ రాష్ట్రంలో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30వ తేదీన నిర్వహించనున్నారు. డిసెంబర్ 7న రెండో దశ, డిసెంబర్ 12, 16, 20వ తేదీల్లో మిగిలిన మూడు దశల్లో పోలింగ్ జరుపుతారు. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్‌లో 2014లో మాదిరిగానే ఐదు దశలుగా ఎన్నికలు నిర్వహించనునట్టు సునీల్ అరోరా వెల్లడించారు. రఘుబర్ దాస్ సీఎంగా 2014, డిసెంబర్ 28న జార్ఖండ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయింది. -
మహారాష్ట్ర, హరియాణాల్లో ఎన్నికల నగారా
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల శాసనసభ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో లోక్‌సభ, శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) షెడ్యూలు విడుదల చేసింది. దీంతోపాటు తెలంగాణలోని హుజూర్నగర్ శాసనసభ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక జరగనుంది. ఎన్నికల షెడ్యూలు విడుదలైన మరుక్షణం నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా మీడియాకు వెల్లడించారు. ఈ రెండు రాష్ట్రాలకు ఒకే విడతలో ఎన్నికలు జరపనున్నట్లు ప్రకటించారు. కాగా, హరియాణాలోని 90 అసెంబ్లీ స్థానాల్లో 17 స్థానాలు షెడ్యూలు కులాలకు రిజర్వ్ అయి ఉన్నాయి. ఇక్కడ ఎస్టీ నియోజకవర్గాలేవీ లేవు. మహారాష్ట్రలో మొత్తం 288 నియోజకవర్గాలకు గాను 29 ఎస్సీ, 25 ఎస్టీ రిజర్వు అయి ఉన్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ 2014 నవంబరు 10వ తేదీన కొలువుదీరగా శాసనసభ కాల పరిమితి 2019 నవంబరు 9వ తేదీతో ముగియనుంది. అలాగే, హరియాణా శాసనసభ 2014, నవంబరు 3వ తేదీన కొలువుదీరగా 2019, నవంబరు 2న ముగియనుంది. 64 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక దేశవ్యాప్తంగా ఒక లోక్‌సభ స్థానం, వివిధ రాష్ట్రాల్లోని 64 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసింది. ఎంపీ రామచంద్ర పాశ్వాన్ మరణించడంతో బిహార్‌లోని సమస్తిపూర్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. సమస్తిపూర్ లోక్‌సభ నియోజకవర్గంతో పాటు హుజూర్నగర్ సహా దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 64 శాసన సభ స్థానాలకూ అక్టోబరు 21న ఎన్నిక జరగనుంది. ప్రధానంగా కర్ణాటకలో 15, యూపీలో 11, బిహార్, కేరళ రాష్ట్రాల్లో 5, అస్సాం, గుజరాత్‌లలో 4 చొప్పున స్థానాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలో ఫిరాయింపు నిరోధక చట్టం పరిధిలో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడంతో అక్కడ ఎక్కువ స్థానాల్లో ఉప ఎన్నిక జరుగుతోంది. ఉప ఎన్నిక జరిగే నియోజకవర్గాల్లో ఎన్నికల నిబంధనావళి తక్షణం అమల్లోకి వస్తుంది. సుప్రీంను ఆశ్రయిస్తాం: కర్ణాటక ఎమ్మెల్యేలు సాక్షి, బెంగళూరు: ఎన్నికల సంఘం ప్రకటనపై అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు బెంగళూరులో మాట్లాడుతూ.. తమపై అనర్హత పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండగా ఎన్నికలు జరపాలన్న ఈసీ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. ఈసీ నిర్ణయంపై స్టే కోరుతామన్నారు. మొత్తం 17 మందిపై అనర్హత వేటు పడగా ఈసీ 15 స్థానాలకు మాత్రమే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం గమనార్హం. మిగతా ఇద్దరి ఎన్నికకు సంబంధించిన పిటిషన్లు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున నిర్ణయం తీసుకోలేదని ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా అన్నారు. వీరికి అనర్హత వేటు పడిన వారితో సంబంధం లేదని వివరించారు. జూలైలో కర్ణాటకలో జరిగిన వివిధ రాజకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్, జేడీఎస్‌కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి గైర్హాజరు కావడంతో హెచ్డీ కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వం కూలిపోగా, బీజేపీ పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. -
మోగిన ఎన్నికల నగారా
న్యూఢిల్లీ : మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఎన్నికల నిర్వహణ విషయమై సెప్టెంబరు 27న నోటిఫికేషన్ విడుదల చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్ అరోరా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నవంబరు 2న హర్యానా అసెంబ్లీ గడువు, మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబరు 9న ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. హర్యానాలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు, మహారాష్ట్రలోని 288 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అదే విధంగా ఇరు రాష్ట్రాల్లోనూ ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నామినేషన్ల ప్రక్రియ ఈనెల 27 మొదలై.. అక్టోబరు 4 నాటికి ముగుస్తుందని తెలిపారు. అక్టోబరు 21న పోలింగ్ జరుగుతుందని.. అదే నెల 24న కౌంటింగ్ ఉంటుందని వెల్లడించారు. అదే విధంగా ఎన్నికల ప్రచారంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాల్సిందిగా రాజకీయ పార్టీలకు విఙ్ఞప్తి చేశారు. 64 స్థానాలకు ఉప ఎన్నికలు దేశ వ్యాప్తంగా 64 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఈసీ సునీల్ అరోరా తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, అసోం, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మేఘాలయ, ఒడిశా, పుదుచ్చేరి, పంజాబ్, రాజస్తాన్, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు స్థానాలకు అక్టోబరు 21న ఉప ఎన్నికలు జరుగుతాయని, అదే నెల 24న కౌంటింగ్ నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. కాగా తెలంగాణలోని హుజూర్నగర్ శాసనసభ స్థానానికి ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి ఆయన భార్య పద్మావతి ఉత్తమ్ ఉప ఎన్నికల బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. -
మళ్లీ బ్యాలెట్‌కు వెళ్లం!
కోల్‌కతా: ప్రస్తుతం ఈవీఎంలను వినియోగించి జరుపుతున్న ఎన్నికల స్థానంలో బ్యాలెట్ పద్ధతిని ప్రవేశపెట్టే అవకాశం లేదని ఎన్నికల కమిషన్ చీఫ్ సునీల్ అరోరా స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టు కూడా గతంలో పలుమార్లు స్పష్టం చేసిందని గుర్తు చేశారు. తిరిగి బ్యాలెట్ పద్ధతిలోకి వెళ్లే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కశ్మీర్లో ఎన్నికలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వగానే ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. వెస్ట్ బెంగాల్ నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ జురిడికల్ సైన్సెస్, ఐఐఎం కలకత్తాలు శుక్ర, శనివారాల్లో నిర్వహించిన కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జాతీయ పౌరుల సభ్యత్య కార్యక్రమం(ఎన్నార్సీ) పశ్చిమ బెంగాల్లో కూడా అమలు చేస్తారా అన్న ప్రశ్నకు, అస్సాంకు చెందిన ఎన్నార్సీనే ఇంకా కోర్టులో ఉందని అన్నారు. సుప్రీంకోర్టు తీర్సు ఇచ్చే వరకు ఏమీ చెప్పలేమన్నారు. ఈవీఎంలను టాంపర్ చేసే అవకాశం ఉన్నందును బ్యాలెట్ పద్ధతిని తిరిగి ప్రవేశ పెట్టాలంటూ తృణమూల్ కాంగ్రెస్, తెలుగు దేశం, నేషనల్ కాన్ఫరెన్స్, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన వంటి పార్టీల అధ్యక్షులు, నాయకులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
రాష్ట్రపతికి నూతన ఎంపీల జాబితా సమర్పించిన ఈసీ
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ంపీల జాబితాను ఎన్నికల కమిషన్ (ఈసీ) రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు అందజేసింది. 17వ లోక్‌సభ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ సునిల్ ఆరోరా, ఇద్దరు కమిషనర్లు అశోక్ లావాసా, సుశీల్ చంద్రలు.. శనివారం కోవింద్‌ను రాష్ట్రపతి భవన్లో కలిశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం కొత్త లోక్‌సభ ఏర్పాటుకు ఫలితాల్లో వెల్లడైన ఎంపీల పేర్లను రాష్ట్రపతికి అందజేశారు. ఇది లోక్‌సభ ఏర్పాటుకు సంబంధించి ప్రక్రియను ప్రారంభించడానికి రాష్ట్రపతికి ఉపయోగపడనుంది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించినందుకు ఎన్నికల ప్రధానాధికారి, ఇతర కమిషనర్లను రాష్ట్రపతి కోవింద్ అభినందించారు. -
ఎన్నికల కమిషనర్ వ్యవహారంపై ఈసీ సమావేశం..!
సాక్షి, న్యూడిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాకు కేంద్ర ఎన్నికల సంఘం క్లీన్చిట్ ఇవ్వడంతో ఈసీలో అసమ్మతి రేగిన సంగతి తెలిసిందే. ఈసీ పనితీరుపై కమిషనర్ అశోక్ లావాసా అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనల ఫిర్యాదులపై మైనారిటీ అభిప్రాయాన్ని రికార్డు చేయడం లేదని పేర్కొంటూ ఆయన సీఈసీ సునీల్ అరోరాకు లేఖ కూడా రాశారు. ఫిర్యాదులపై చర్యలు తీసుకునే క్రమంలో మైనారిటీ అభిప్రాయాల్ని కూడా గౌరవించాలని, చర్యలు తీసుకునే విషయంలో పారదర్శకత పాటించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. (చదవండి : ఈసీలో అసమ్మతి ‘లావా’సా) కాగా, లవాస వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం సమావేశమైంది. ఎన్నికల కోడ్‌కు సంబంధించిన అంశాలపై మైనారిటీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా నమోదు చేయాల్సిన అవసరం లేదని సీఈసీ సునీల్ అరోరా అభిప్రాయపడినట్టు తెలిసింది. కేవలం క్వాసీ-జ్యూడిషియల్ వ్యవహారాల్లో మాత్రమే మైనారిటీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా నమోదు చేయాలని సీఈసీ అభిప్రాయపడినట్టు సమాచారం. ముగ్గురు ఈసీ కమినర్ల బృందంలో లావాసా ఒకరు కాగా, సీఈసీ సునీల్ అరోరా, మరో కమిషనర్ సుశీల్ చంద్ర ప్రధాని మోదీకి క్లీన్చిట్ ఇచ్చేందుకు అనుకూలంగా ఉండగా.. లావాసా వ్యతిరేకించారు. -
ఈసీలో అసమ్మతి ‘లావా’సా
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు పూర్తయి, ఓట్ల లెక్కింపునకు గడువు సమీపిస్తున్న సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)లో విభేదాలు బయటపడ్డాయి. నియమావళి ఉల్లంఘన ఫిర్యాదులపై తీసుకునే నిర్ణయాల్లో తన అసమ్మతిని రికార్డు చేయనందుకు నిరసనగా ఈసీ సమావేశాలకు దూరంగా ఉంటానని ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా ప్రకటించారు. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) సునీల్ అరోరాకు లావాసా లేఖ రాయడం కలకలం రేపింది. మరోమార్గం లేకనే దూరంగా ఉంటున్నా ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా ఎన్నికల ప్రచారం సందర్భంగా నియమావళిని ఉల్లంఘించడంపై వచ్చిన ఫిర్యాదులపై చర్యల విషయంలో తన అభిప్రాయాన్ని రికార్డు చేయనందుకు కమిషనర్ అశోక్ లావాసా అసంతృప్తి వ్యక్తం చేశారు. 16న సీఈసీ అరోరా లేఖ రాశారు. అందులో ‘ఈసీలో పారదర్శకత ఉండాలన్న తన నోట్‌పై స్పందించనందుకు, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు సంబంధించిన ఫిర్యాదులపై దూరంగా ఉండటం మినహా మరోమార్గం లేదని భావిస్తున్నా. మైనారిటీ అభిప్రాయాలను రికార్డు చేసేదాకా కమిషన్ సమావేశాలకు గైర్హాజరు కావాల్సిన పరిస్థితిని కల్పించారు. అసమ్మతిని రికార్డు చేయనప్పుడు సమావేశాల్లో పాల్గొనడంలో అర్థంలేదు’ అని లేఖలో పేర్కొన్నారు. ‘చాలా సందర్భాల్లో నేను వ్యక్తం చేసిన మైనారిటీ అభిప్రాయం బహుళ సభ్యుల చట్టబద్ధ సంస్థలు పాటించే సంప్రదాయాలకు భిన్నంగా అణచివేతకు గురైంది’ అని పేర్కొన్నారు. న్యాయ నిపుణులు ఏమన్నారంటే.. నిబంధనల ప్రకారం.. ఎన్నికల సంఘం ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అది సాధ్యం కానప్పుడు మెజారిటీ అభిప్రాయమే అంతిమం అవుతుంది. నియమావళి ఉల్లంఘనల ఫిర్యాదులపై నిర్ణయాలు తీసుకునే సమయంలో ట్రిబ్యునల్‌లో మాదిరిగా విచారణ ఉండదని, ఈసీ నిర్ణయాలపై సీఈసీతోపాటు మిగతా ఇద్దరు సంతకాలు చేస్తున్నందున మైనారిటీ అభిప్రాయాన్ని రికార్డు చేయాల్సిన అవసరం లేదని న్యాయ నిపుణులు చెప్పారు. మెజారిటీ అభిప్రాయాన్నే ఈసీ నిర్ణయంగా వెలువరిస్తారని, అసమ్మతి అభిప్రాయాన్ని రికార్డు చేస్తారే తప్ప బహిర్గతం చేయబోరని అంటున్నారు. మోదీ, అమిత్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ వచ్చిన 11 ఫిర్యాదులపై లావాసా అసమ్మతిని తెలపగా కమిషన్‌లోని సీఈసీ, మరో సభ్యుడు సుశీల్‌చంద్ర అన్ని ఫిర్యాదులపై క్లీన్చిట్ ఇచ్చారు. ఆరోపణలపై విచారణ: కాంగ్రెస్ ఈసీపై మోదీ ప్రభుత్వం ఒత్తిడి చేసిందన్న లావాసా ఆరోపణలపై విచారణ జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా.. ‘మోదీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను ‘ఎలక్షన్ ఒమిషన్’గా మార్చేసింది. లావాసా అసమ్మతిని రికార్డు చేసి ఉన్నట్లయితే ఈసీని ప్రభుత్వం మరిన్ని ఇబ్బందులు పెట్టి ఉండేది’ అని అన్నారు. మోదీ– అమిత్ షా ద్వయం ఉల్లంఘనలపై కమిషనర్ లావాసా పలు పర్యాయాలు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఎన్నికల సంఘం వారికి క్లీన్చిట్ ఇవ్వడమే పనిగా పెట్టుకుందని ఆరపించారు. లేఖలో పేర్కొన్న అంశాలను తీవ్రమైనవిగా పరిగణించాలన్నారు. సుప్రీంకోర్టులో తీర్పుల సందర్భంగా జడ్జీలు వ్యక్తం చేసిన మెజారిటీతోపాటు మైనారిటీ అభిప్రాయాన్ని వెల్లడిస్తుండగా ఈసీలో అసమ్మతి అభిప్రాయాన్ని ఎందుకు బహిర్గతం చేయరని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రశ్నించారు. ఎన్నికల సంఘంలో సంభవిస్తున్న పరిణామాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, ఈసీ నిష్పాక్షికతపై అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. ఇది ఈసీ అంతర్గత విషయం: సీఈసీ అరోరా ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా లేఖ ఎన్నికల సంఘం అంతర్గత విషయమని సీఈసీ అరోరా అన్నారు. ఉల్లంఘన ఫిర్యాదులపై చర్యల విషయంలో ఈసీ పనితీరుపై మీడియాలో వచ్చిన కథనాలు ‘అభ్యంతరకరం. ఇది ఈసీ అంతర్గత విషయం’ అని అన్నారు. ‘కేంద్ర ఎన్నికల సంఘంలోని ముగ్గురు సభ్యులు కూడా ఒకే వైఖరితో ఉండాలని ఏమీ లేదు. గతంలో ఎన్నోసార్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అది సహజం. కానీ, అదంతా ఎన్నికల సంఘం పరిధికి లోబడి జరిగింది. ఇటీవల మే 14వ తేదీన జరిగిన సమావేశంలోనూ ప్రవర్తనా నియమావళిసహా 13 అంశాలను పరిష్కరించేందుకు గ్రూపుల ఏర్పాటుపై ఏకాభిప్రాయం వ్యక్తమయింది. అవసరమైన సందర్భాల్లో బహిరంగ చర్చకు నేను వెనుకాడలేదు. ఆఖరి దశ ఓటింగ్,23న లెక్కింపు వేళ లావాసా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు మిగతా విషయాలపై చర్చించేందుకు 21న ఈసీ పూర్తిస్థాయి సమావేశం ఉంటుంది’ అని అరోరా వెల్లడించారు. -
పోలింగ్ అధికారిని ప్రద్యుమ్న బెదిరించారు
సాక్షి, న్యూఢిల్లీ: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రిగ్గింగ్ జరిగిన తీరుపై ఎన్నికలు జరిగిన మరుసటి రోజే తాము ఫిర్యాదు చేసినా నిజాలు వెలుగులోకి రాకుండా తొక్కిపెట్టిన కలెక్టర్ ప్రద్యుమ్నపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. టీడీపీ ఏజెంట్లా వ్యవహరిస్తున్న అనంతపురం జిల్లా రాప్తాడు ఆర్వోను కూడా కౌంటింగ్ విధుల నుంచి తప్పించాలని విన్నవించింది. గురువారం జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఆటంకాలు సృష్టించేలా అధికార టీడీపీ కుట్రలు పన్నిందని ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈమేరకు వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బుట్టా రేణుక, పి.రవీంద్రబాబు, అవంతి శ్రీనివాసరావు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డిలతో కూడిన బృందం శనివారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా, కమిషనర్లు అశోక్ లావాసా, సుశీల్ చంద్రలతో సమావేశమై పలు వినతిపత్రాలు ఇచ్చింది. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన పేషీలో పనిచేసిన అధికారిని చంద్రబాబు చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా నియమించి ఆయన ద్వారా చంద్రగిరిలో చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ఏం మాట్లాడారో వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రాణాలు తీస్తామంటూ హెచ్చరించారు... ‘ఎన్నికలు పూర్తయిన మర్నాడే ఏప్రిల్ 12వతేదీన ఈవీఎంలన్నీ సీల్ చేసే రోజు మా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చంద్రగిరిలో రిగ్గింగ్ జరిగినట్లు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు ఎన్నికల అధికారులతో ముఖ్యంగా కలెక్టర్ ప్రద్యుమ్నతో కుమ్మక్కై దళితులను ఓటు వేయకుండా అడ్డుకున్నారని ఫిర్యాదు చేశాం. కొందరు వచ్చినా సిరా చుక్క వేసి పంపించేశారు. అందరి ఓట్లనూ టీడీపీకి చెందిన వ్యక్తి వేశారని ఫిర్యాదులో నివేదించాం. ఏడు పోలింగ్ బూత్‌ల్లో ఇలాగే చేశారని ఫిర్యాదు ఇచ్చాం. అయితే పోలింగ్ ఆఫీసర్‌ను చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న బెదిరించారు. పోలింగ్ ఆఫీసర్‌ను ప్రాణాలు తీస్తామని బెదిరించి రిగ్గింగ్ జరగలేదని రాయించారు. సీసీ ఫుటేజీని పరిశీలించాలని మేం కోరినా కలెక్టర్ పట్టించుకోలేదు. మా వినతిని తిరస్కరించి రిగ్గింగ్ జరగలేదని నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో దీనిపై సాక్ష్యాధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. వీడియో ఫుటేజీలు చూశాక ప్రజాస్వామ్య చరిత్రలోనే ఇంత దుర్మార్గం ఎక్కడా జరిగి ఉండదని భావిస్తూ రీ పోలింగ్‌కు ఆదేశించారు. గతంలో కూడా... ఈ ఎన్నికల్లోనే కాదు.. 2014 ఎన్నికల్లో కూడా ఈ ఐదు బూత్‌ల్లో మొత్తం పోలైన ఓట్లు తెలుగుదేశానికే వచ్చాయి. ఏ ఒక్క ఓటూ ఇతర పార్టీకి పడలేదు. కలెక్టర్ ప్రద్యుమ్న లాలూచీ పడి రేపు కౌంటింగ్ రోజు కూడా తప్పుడు నివేదికలు ఇచ్చే ప్రమాదం ఉందని, ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడటంపై చర్యలు తీసుకోవాలని కోరాం. వీవీ ప్యాట్ల స్లిప్పులపై స్పష్టత కోరాం... కౌంటింగ్‌కు సంబంధించి కూడా ఈసీకి పలు విన్నపాలు చేశాం. పోలింగ్ ప్రారంభానికి ముందు 50 ఓట్లకు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఈవీఎంలన్నీ క్లియర్ చేశాక వీవీ ప్యాట్ల స్లిప్పులను క్లియర్ చేయని పక్షంలో వీవీ ప్యాట్ల స్లిప్పుల లెక్క ఎక్కువగా వస్తుంది. ఈవీఎంలలో తక్కువ ఓట్లు వస్తాయి. దీనిమీద స్పష్టత ఇవ్వాలని ఈసీనికోరాం. రాప్తాడు ఆర్వోను తప్పించాలి... అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో రిటర్నింగ్ ఆఫీసర్‌గా ఉన్న ప్రాజెక్టు డైరెక్టర్ మంత్రి సునీతమ్మకు తొత్తులా వ్యవహరిస్తున్నారు. కౌంటింగ్ విధుల నుంచి ఆమెను తొలగించాలని కోరాం. టీడీపీ అసాంఘిక శక్తులకు, గూండాలు, రౌడీలకు శిక్షణ ఇచ్చి పోలింగ్ ఏజెంట్లుగా, కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించింది. అధికార పార్టీకి ఓట్లు తక్కువగా వచ్చే చోట శాంతి భద్రతల సమస్యలు సృష్టించాలని వారికి స్పష్టంగా ఆదేశాలున్నాయి. ఈ విషయాన్ని కూడా ఈసీ దృష్టికి తెచ్చాం. ఈసీ దృష్టికి డూప్లికేట్ ఓటింగ్ పోస్టల్ బ్యాలెట్ల విషయంలో విద్యార్థులను, అంగన్వాడీలు, ఆశా వర్కర్లను పోలింగ్ ఏజెంట్లకు సహాయకులుగా ఇచ్చారు. బహుశా విద్యార్థులను వినియోగించడం చరిత్రలో మొదటిసారి. పోలింగ్ విధుల్లో ఉన్న సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు. కానీ వీరి ఓట్లు అటు వారి పోలింగ్ స్టేషన్లలోనూ ఇటు పోస్టల్ బ్యాలెట్ ద్వారా కూడా పడ్డాయి. ఇలా డూప్లికేట్ ఓటింగ్ జరిగిన విషయాన్ని కూడా ఈసీ దృష్టికి తెచ్చాం. కౌంటింగ్‌కు ఆంధ్రప్రదేశ్ పోలీసులనే కాకుండా అదనంగా కేంద్ర బలగాలను పంపి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరాం. ప్రద్యుమ్నకు అక్రమాలన్నీ తెలుసు.. పశ్చిమ బెంగాల్లో కార్యదర్శిని బదిలీ చేశారు కానీ ఏపీలో సీఎస్ లేఖ రాసినా చర్యలు తీసుకోలేదంటూ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలను ప్రస్తావించగా ‘చంద్రగిరిలో ఐదు పోలింగ్ బూత్‌లను ఆక్రమించి ఒకే వ్యక్తి అందరి ఓట్లను రిగ్గింగ్ చేసినందువల్లే రీపోలింగ్‌కు ఆదేశించారు. సీసీ ఫుటేజీలో ఒకే వ్యక్తి బటన్ నొక్కుతున్న విషయాన్ని ఈసీ గుర్తించింది. నిజానికి మేం ఏడు పోలింగ్ బూత్‌ల్లో రిగ్గింగ్ జరిగిందని ఫిర్యాదు చేశాం. కానీ ఈసీ ఐదు పోలింగ్ బూత్‌లలో మాత్రమే రీపోలింగ్‌కు ఆదేశించింది. చిత్తూరు కలెక్టర్ ప్రద్యుమ్నకు లై డిటెక్టర్‌తో పరీక్ష నిర్వహిస్తే చంద్రగిరిలో జరిగిన పోలింగ్ అక్రమాలన్నీ బయటకు వస్తాయి. సీఎస్‌కు ఫిర్యాదు కాపీ పంపితే తప్పేముంది? సీఎస్‌కు ఫిర్యాదు చేయడంపైనా విమర్శలు వస్తున్నాయని మీడియా ప్రతినిధులు పేర్కొనగా ‘ఏ ఫిర్యాదునైనా సీఈవోకు, సీఎస్‌కు ఇస్తాం. సీఎస్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. మేం పంపే ప్రతి ఫిర్యాదునూ ఆయనకు ఒక కాపీ పంపిస్తున్నాం. ఇందులో తప్పులేదు. వీరంతా ఎన్నికల సంఘం పరిధిలోకే వస్తారు..’ అని బదులిచ్చారు. మా పార్టీ పాత్రపై జగన్ నిర్ణయిస్తారు ‘దేశ రాజకీయాల్లో వైఎస్సార్ సీపీ పాత్ర ఏమిటన్నది ఎన్నికల ఫలితాల తర్వాత .. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉంటారు..’ అని విజయసాయిరెడ్డి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సీఎం రమేశ్ వ్యాఖ్యలపై స్పందించాలాసీఎం రమేశ్ ? కేంద్ర హోంశాఖలో ఓ అధికారి వైఎస్సార్సీపీ తరపున లాబీయింగ్ చేసి రీ పోలింగ్‌కు ఆదేశించేలా చేశారని టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ ఆరోపణలు చేయటాన్ని మీడియా ప్రస్తావించగా.. ‘సీఎం రమేష్ లాంటి క్యారెక్టర్ లేని వ్యక్తి ఆరోపణలు చేస్తే దానిపై నేను స్పందించాలా? ఆయన గత చరిత్ర అందరికీ తెలుసు. క్యారెక్టర్ గురించి మీకు తెలుసు. ఆయన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదు..’ అని వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే ఈసీ వ్యవహారాలపై దర్యాప్తు చేయిస్తామని టీడీపీ ఎంపీ రమేశ్ చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావించగా ‘ఎన్నికల సంఘం రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన సంస్థ. సీఎం రమేష్ లాంటి బుర్ర లేని వ్యక్తి దానిపై ఇన్వెస్టిగేషన్ చేయిస్తామనడం హాస్యాస్పదం..’ అని పేర్కొన్నారు. దళితులంటే బాబుకు చిన్నచూపు ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే టీడీపీ నేతలు దళితులను ఓటేయకుండా చేశారు. సీఎం చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యలు మీరు కూడా చూశారు. ఎవరైనా దళితుల్లో పుట్టాలని కోరుకుంటారా? అంటూ చంద్రబాబు గతంలో దళితులను కించపరిచేలా మాట్లాడారు. ఓట్లేయకుండా చంద్రబాబు దళిత ద్రోహిలా వ్యవహరిస్తున్నారు. దళితులను హింసించిన వ్యక్తి చింతమనేని ప్రభాకర్. టీడీపీలో చాలా మంది నేతలు దళితులను చిన్నచూపు చూస్తున్నారు. అధికారులను బెదిరించారు: మేకపాటి ‘చంద్రగిరిలోని ఐదు పోలింగ్ బూత్‌లలో రిగ్గింగ్‌కు పాల్పడిన తీరుపై ఎన్నికలు జరిగిన మరుసటి రోజే మేం ఈసీకి ఫిర్యాదు చేసినా అధికారులను భయపెట్టి ఏమీ జరగలేదని నివేదిక ఇచ్చారు. వీడియో ఫుటేజీలు చూశాక ఈసీ రీ పోలింగ్‌కు ఆదేశించింది. అధికారానికి బానిసగా మారిన సీఎం చంద్రబాబు ఎలాగైనా గెలవాలని గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు శాంతియుతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరాం’ అని మేకపాటి వెల్లడించారు. -
ఎన్నికల కమిషన్‌లో అసమ్మతి..!
సాక్షి, న్యూడిల్లీ : ఎన్నికల కమిషన్‌లో అసమ్మతి రేగింది. ప్రధాని నరేంద్ర మోదీకి ఈసీ క్లీన్చిట్ ఇవ్వడంపై ఎన్నికల కమిషనర్ అశోక్ లవాసా అసహనం వ్యక్తం చేశారు. కమిషన్‌లో మైనారిటీ నిర్ణయాలకు ప్రాధాన్యం లేనప్పుడు ఫిర్యాదులపై కమిషన్ నిర్వహించే సమావేశాలకు హాజరవడమెందుకని ప్రశ్నించారు. ఈ మేరకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరాకు లేఖ రాశారు. మోదీ ఎన్నికల కోడ్ ఉల్లఘించారని అందిన ఆరు ఫిర్యాదులపై మే 4న విచారించిన ఈసీ ఆయనకు క్లీన్చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫిర్యాదులపై చర్యలు తీసుకునే క్రమంలో మైనారిటీ అభిప్రాయాల్ని కూడా గౌరవించాలని, చర్యలు తీసుకుని విషయంలో పారదర్శకత పాటించాలని లేఖలో పేర్కొన్నారు. ముగ్గురు ఈసీ కమినర్ల బృందంలో లావాసా ఒకరు. సీఈసీ సునీల్ అరోరా, మరో కమిషనర్ సుశీల్ చంద్ర ప్రధాని మోదీకి క్లీన్చిట్ ఇచ్చేందుకు అనుకూలంగా ఉండగా.. లావాసా వ్యతిరేకించారు. కాగా, లావాసా లెటర్‌పై స్పందించిన సీఈసీ అరోరా.. ఖ్వాసీ-జ్యూడిషియల్ వ్యవహారాల్లో మాదిరిగా మైనారిటీల అభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోలేమని స్పష్టం చేశారు. -
ఈవీఎంలపై విచారణ జరపండి
సాక్షి, న్యూఢిలీ: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి భద్రతను పర్యవేక్షించే ఇంటెలిజెన్స్ డీజీని బదిలీ చేసి తన రక్షణ వ్యవస్థకు విఘాతం కలిగించారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈవీఎంల ద్వారా ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోందని, ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే పేపర్ బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. మొత్తం 618 కేంద్రాల్లో అడ్జర్న్డ్ పోల్ (వివిధ కారణాలతో పోలింగ్‌కు విఘాతం కలిగితే వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి తిరిగి ఎన్నిక నిర్వహించడం) చేపట్టాలని కోరారు. చంద్రబాబు శనివారం మధ్యాహ్నం పలువురు మంత్రులు, పార్టీ సహచరులతో కలిసి ఢిల్లీలో కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈసీ) సునీల్ అరోరాతో సుదీర్ఘంగా సమావేశమై 18 పేజీల వినతిపత్రం అందజేశారు. పేపర్ బ్యాలెట్‌తోనే ఎన్నికలు నిర్వహించాలని, ఈవీఎంలను హ్యాకింగ్ చేసిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, ఈవీఎంల మొరాయింపుపై విచారణ నిర్వహించాలని, ఫామ్ – 7 దరఖాస్తులకు సంబంధించి ఐపీ చిరునామాను రాష్ట్ర పోలీసులకు అందచేయాలని సీఈసీని కోరారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలపై ఇండిపెండెంట్ ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... అధికారులను ఎందుకు బదిలీ చేశారు? ‘‘ఈసీ ద్వారా జరిగిన అవకతవకలు, పక్షపాత వైఖరిపై తీవ్ర అసంతృప్తి, నిరసన తెలియజేశా. ఒక పద్ధతి లేకుండా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం మాట వినకుండా, నేరస్తులు ఇష్టానుసారంగా పిటిషన్లు ఇస్తే దానికి అనుగుణంగా అధికారులను బదిలీలు చేయడం, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఐటీ, ఈడీ దాడులు చేసినప్పుడు ఈసీ గమ్మున కూర్చోవడం, ఏపీ ప్రజానీకంపై మూకుమ్మడి దాడి చేయడాన్ని ఖండిస్తూ నిరసన తెలిపా. ఏకే శర్మ పనికి రాడని పంపిస్తే ఆయనను పరిశీలకుడిగా నియమించడం, కడప ఎస్పీని మార్చడం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మార్చడం చేశారు. మార్చి ఎవరిని నియమించారు? జగన్మోహన్రెడ్డి కేసులో నిందితుడిని వేశారు. ఇలాంటి తప్పుడు పనులు చేస్తూ ఎక్కడికి పోతున్నారు మీరు..? యంత్రాంగాన్ని డీమోరలైజ్ చేశారు. తొలుత ఈవీఎంలు మొరాయించాయి. అవి ప్రారంభమయ్యే సమయానికి స్పీకర్‌పై, ఎమ్మెల్యేలపై దాడులు చేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత అరాచకం ఎన్నడూ లేదు. తొలిసారి జరిగింది. దీనికి కారణం ఎవరు? ఎన్నికల సంఘం బాధ్యత తీసుకుంటుందా? మీ ఇష్టారీతిన బదిలీలు చేసి ఏపీని రావణకాష్టం చేశారు. దుర్మార్గంగా ప్రవర్తించారు. రెచ్చిపోయి రౌడీలంతా రోడ్డు మీదకు చేరారు. చేతగానితనం వల్ల మీరు పూర్తిగా విఫలమయ్యారు. ఒంటి గంటకు మిషన్లు పెట్టారు. మేం పోలింగ్ వాయిదా వేయాలని అడిగితే వినలేదు. మధ్యాహ్నం 3.30, 4.30 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. క్యూలో నిలబడిన వాళ్లంతా రాతింబవళ్లూ చంటిపిల్లలను చంకనేసుకుని అవస్థలు పడ్డారు. ఎవరిది బాధ్యత? ఈసీది కాదా? ఓటర్లు బిచ్చగాళ్లా? ఓటర్లను గౌరవంగా చూసే బాధ్యత లేదా? సాయంత్రం 5 గంటలకు ఒక పిలుపునిస్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని సామాన్య ప్రజానీకం కంకణం కట్టుకుని వచ్చి క్యూలో నిలబడ్డారు. ఈవీఎంలపై సామాన్యులకు సందేహం ఉంది. వీవీ ప్యాట్లపై సందేహం ఉంది. సుప్రీం కోర్టు అడిగితే వీవీప్యాట్ పత్రాలు లెక్కించేందుకు ఆరు రోజులు పడుతుందని చెప్పారు. ఇలా ఇష్టారీతిన ప్రవర్తిస్తే ఎలా? ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా ఉండాలి. ఈవీఎంల మీద ఎప్పటి నుంచో పోరాడాం. మేం పోరాడితేనే వీవీ ప్యాట్లు వచ్చాయి. వీవీ ప్యాట్లు కూడా సరికాదని ఎప్పుడో చెప్పాం. పేపర్ బ్యాలెట్లే ఈ దేశానికి సరైన నిర్ణయం. పేపర్ బ్యాలెట్లపై అందరికీ ఒక అవగాహన ఉంటుంది. ఎక్కడెక్కడో పట్టుకొచ్చి ఆపరేట్ చేయమంటే ఎలా చేస్తారు? థర్మల్ పేపర్ మీద చాలా అనుమానం ఉంది. ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారు. అందుకే వచ్చాం. రాష్ట్రంలో జరిగిన అవకతవకలను దేశానికి చెప్పాలని వచ్చాం. ప్రజాస్వామ్యవాదులందరూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి’’ అని పేర్కొన్నారు. ఈవీఎంలను ఎవరు మానిప్యులేట్ చేశారు? ఓడిపోతామనే భయంతోనే చంద్రబాబు హడావుడి చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శించటాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. ‘ఈవీఎంలు పనిచేయకపోతే ప్రతిపక్షాలు ఎందుకు అడగలేదు? హింస జరిగితే ఎందుకు మాట్లాడలేదు? హింస మీరే చేశారా? రాత్రి మూడు గంటలకు ఎవరు ఓటేశారు? వాళ్లంతా ప్రెస్టీజ్‌గా తీసుకున్నారు. మోదీ, కేసీఆర్, జగన్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని తిరుగుబాటు చేశారు. తెల్లవారుజాము వరకు ఓట్లేశారంటే చరిత్రలో ఎప్పుడు ఇలా జరగలేదు. లేటుగా పోలింగ్ జరిగిన కేంద్రాల్లో అడ్జర్న్డ్ పోల్గా ప్రకటించాలి. ఫారం– 7ఏపై తప్పనిసరిగా చర్య తీసుకోవాలి. తొలి గంటలో పోలింగ్ ఎందుకు జరగలేదు? ఎవరు హ్యాకింగ్ చేశారు? ఎవరు మానిప్యులేట్ చేశారు? వీటికి సమాధానం కావాలి. ఇలాంటిది జరగకుండా ఉండాలంటే పేపర్ బ్యాలెట్ రావాలి..’ అని బదులిచ్చారు. 50 శాతం వీవీ ప్యాట్ల పత్రాలు లెక్కించాలి ‘అన్ని రాజకీయ పార్టీలు, మేధావులతో మాట్లాడతా. జాతీయ స్థాయిలో డిబేట్ చేస్తా. వీవీ ప్యాట్ల పత్రాలు లెక్కించేందుకు ఎందుకు ఇబ్బంది పడుతున్నారని ప్రశ్నిస్తున్నా. 50 శాతం వీవీ ప్యాట్ల పత్రాలను లెక్కించాలి..’ అని పేర్కొన్నారు. ‘హింస రెండు వైపులా జరగలేదు. మావాళ్లు త్యాగాలు చేశారు. అవతల రౌడీలు వస్తే పారిపోయారనుకోండి ఏమవుతుంది? ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు బలయ్యారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం భారీగా తరలివచ్చి ఓటింగ్‌లో పాల్గొన్నారు..’ అని మరో ప్రశ్నకు బదులిచ్చారు. నేడు ఢిల్లీలో సీఎం, విపక్ష నేతల భేటీ ఈవీఎంల పనితీరు, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై చంద్రబాబు, ఇతర విపక్ష నేతలు ఆదివారం ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఉదయం 11.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఈ సమావేశం జరగనుంది. 12.30 గంటలకు నేతలు మీడియాతో మాట్లాడనున్నారు. -
ఆ పార్టీ గుర్తుని మార్చండి: వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేస్తోన్న అక్రమాల గురించి సాక్ష్యాధారాలతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. సీఈసీ సునీల్ అరోరాకి ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలలో అక్రమాలకు పాల్పడేందుకు చంద్రబాబు నాయుడు తగిన ఏర్పాట్లు చేసుకున్నారని ఆరోపించారు. ఎలాగైనా అధికారంలోకి రావాలని చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. నూతన డీజీపీ నియామకం, ప్రస్తుత డీజీపీ తొలగింపు అంశాలతోపాటు ఇంటిలిజెన్స్ విభాగం అధికారి వెంకటేశ్వరరావు, పోలీసు అధికారులు యోగానంద్, విక్రాంత్ పాటిల్ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు ఈసీ దృష్టికి తీసుకెళ్లామని విజయసాయిరెడ్డి తెలిపారు. పోలీసు విభాగంలో 37 మంది అధికారులకు పదోన్నతి కల్పించారని, సూపర్ న్యూమరీ ద్వారా కొంత మంది అధికారులను ఎలివేట్ చేశారని ఆయన వెల్లడించారు. చట్ట వ్యతిరేకంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లా ఎస్పీలుగా నాన్ క్యాడర్ ఆఫీసర్లను నియమించారని పేర్కొన్నారు. పోలీసుల సాయంతో డబ్బును ఓటర్లకు పంచేందుకు వీలుగా తగిన బందోబస్తును ఏర్పాటు చేసి తరలిస్తున్నారని ఆరోపించారు. శ్రీకాకుళంలో నారాయణ కాలేజీ నుంచి కారులో డబ్బు తరలిస్తుండగా ఎమ్మార్వో పట్టుకున్నారని, తీరా ఎన్నికల సామాగ్రి ఉందని అధికారులు బుకాయించారని మండిపడ్డారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పోలీసులు అనుసరిస్తోన్న విధానాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లామని వెల్లడించారు. వైఎస్సార్సీపీ నేతలు ఫోన్లను అక్రమంగా టాపింగ్ చేస్తున్నారని, దీనికి సంబంధించిన ఆధారాలను ఈసీకి అప్పగించామని ఆయన తెలిపారు. ప్రజాశాంతి పార్టీ గుర్తు హెలికాప్టర్ రెక్కలు వైఎస్సార్సీపీ ఫ్యానుతో పోలి ఉందని, ఆ గుర్తును మార్చాలని ఈసీకి విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. ప్రజాశాంతి పార్టీ కండువా కూడా తమ పార్టీలా మూడు రంగులు కలిగి ఉందని గుర్తు చేశారు. చంద్రబాబుతో అనైతిక సయోధ్య వల్లే కేఏ పాల్ మోసానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు అక్రమాల గురించి సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ఈసీ ఉన్నతాధికారులకు మరోసారి వివరిస్తామని వెల్లడించారు. -
ఆ పార్టీ గుర్తుని మార్చండి: ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
-
డేటా చౌర్యంపై దర్యాప్తు చేస్తున్నాం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో అక్రమంగా ఓట్ల తొలగింపు, డేటా చౌర్యంపై విచారణ జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘంతో సంబంధం లేకుండా ప్రత్యేక బృందాన్ని పంపినట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ ఆరోరా చెప్పారు. ఆదివారం ఢిల్లీలో ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్భంగా మీడియా ప్రశ్నించగా అరోరా పైవిధంగా బదులిచ్చారు. ‘‘రాష్ట్రాల నుంచి ఇలాంటి కొన్ని ఫిర్యాదులందాయి. ప్రతి కేసు విచారణకు ప్రత్యేక బృందాలను పంపాం. ఏపీ, తెలంగాణ నుంచి రెండు రకాల ఫిర్యాదులందాయి. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడి నుంచి ఒకటి, ఇతర పార్టీల నుంచి ఫిర్యాదులందాయి. వీటిపై దర్యాప్తు జరిపి, పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని ఆదేశించాం. ఒకటి, రెండు చోట్ల రాష్ట్ర ఎన్నికల సంఘంతో సంబంధం లేకుండా ఎన్నికల నిర్వహణలో నిపుణులైనవారిని పంపి నివేదిక ఇవ్వాలని ఆదేశించాం’’ అని సునీల్ అరోరా తెలిపారు. -
దేశవ్యాప్తంగా ఏడు దశల్లో ఎన్నికలు
సాక్షి, న్యూఢిల్లీ : స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు చేసినట్లు సీఈసీ సునీల్ ఆరోరా తెలిపారు. దేశవ్యాప్తంగా ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. 17వ లోక్‌సభ ఎన్నికలకు సుదీర్ఘ కసరత్తు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేసేముందు అన్ని రాష్ట్రల సీఈవోలతో సమీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం మీడియ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా సీఈసీ మీడియాతో మాట్లాడుతూ.. పరీక్షలు, పండుగలు వంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నామన్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలన్న ఆయన ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాలకు భారత్ దిక్సూచిగా ఆయన అభివర్ణించారు. దేశవ్యాప్తంగా 90 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, 2014 నుంచి ఇప్పటివరకూ 8.4 కోట్ల మంది కొత్త ఓటర్లు నమోదు అయినట్లు చెప్పారు. ఓటర్ సిప్ల్‌లు ఎన్నికలకు ఐదు రోజుల ముందే పంపిణీ చేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా 10 లక్షల పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశామని, అలాగే 1950 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఓటు చెక్ చేసుకోవచ్చని తెలిపారు. అన్ని పోలింగ్ స్టేషన్లలో వీవీ ప్యాట్లు ఉపయోగిస్తామన్నారు. తుది జాబితా ప్రకటించాక ఓటర్ల జాబితాలో ఇక మార్పులుండని, దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ నేటి నుంచి అమల్లో ఉంటుందని వెల్లడించారు. ఓటర్ కార్డుతో పాటు 11 రకాల కార్డులకు అనుమతి ఇస్తామని తెలిపారు. ఎన్నికల ఖర్చుకు సంబంధించి నిఘా కోసం ఎస్పీలు, కలెక్టర్లతో సదస్సులు నిర్వహిస్తామని సీఈసీ పేర్కొన్నారు. ఎన్నికల తేదీలు ప్రకటించే ముందు విద్యార్థుల పరీక్షలకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, ఎన్నికల తేదీలు నిర్ణయించడానికి ముందు వాతావరణ శాఖ నుంచి నివేదికలు తెప్పించుకున్నామన్నారు. ఏప్రిల్ 11న జరిగే తొలివిడతలో 20 రాష్ట్రాల్లోని 91 స్ధానాలకు పోలింగ్ జరగనుంది. రెండో దశలో 13 రాష్ట్రాల్లోని 115 స్ధానాలకు, మూడవ దశలో 14 రాష్ట్రాల్లోని 115 స్దానాలకు పోలింగ్ జరుగుతుంది. ఇక నాలుగో దశలో 9 రాష్ట్రాల్లోని 71 స్దానాలకు, ఐదో దశలో 5 రాష్ట్రాల్లోని 51 స్ధానాలకు పోలింగ్ జరుగుతుందని ఈసీ వెల్లడించింది. ఇక ఆరో దశలో ఏడు రాష్ట్రాల్లోని 59 స్ధానాలకు, తుది ఏడవ దశలో 8 రాష్ట్రాల్లోని 59 స్ధానాలకు పోలింగ్ జరుగుతుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా తెలిపారు. ఇక తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తొలి దశలోనే ఏప్రిల్ 11న పోలింగ్ జరగనుంది. మొదటి విడత 20 రాష్ట్రాల్లో 91 నియోజకవర్గాలు రెండో విడత 13 రాష్ట్రాల్లో 97 నియోజకవర్గాలు మూడో విడత 14 రాష్ట్రాల్లో 115 నియోజకవర్గాలు నాలుగో విడత 9 రాష్ట్రాల్లో 71 నియోజకవర్గాలు ఐదో విడత 7 రాష్ట్రాల్లో 51 నియోజకవర్గాలు ఆరో విడత 7 రాష్ట్రాల్లో 59 నియోజకవర్గాలు ఏడో విడత 8 రాష్ట్రాల్లో 59 నియోజకవర్గాలు ఒకే విడతలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు అరుణాచల్ ప్రదేశ్ గోవా గుజరాత్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ కేరళ మేఘాలయ మిజోరాం నాగాలాండ్ పంజాబ్ సిక్కిం ఉత్తరాఖండ్ అండమాన్ నికోబార్ దాద్రా నగర్ హవేలీ డయ్యూ డామన్ ఢిల్లీ పాండిచ్చేరి చండీగఢ్ రెండు విడతల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు కర్ణాటక మణిపూర్ రాజస్థాన్ త్రిపుర మూడు విడతల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు అసోం ఛత్తీస్ గఢ్ నాలుగు విడతల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు జార్ఖండ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఒడిశా ఐదు విడతల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు జమ్మూకాశ్మీర్ ఏడు విడతల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు బీహార్ ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ -
షెడ్యూల్ ప్రకారమే సార్వరిక ఎన్నికలు
-
అనుకున్న సమయానికే ఎన్నికలు
లక్నో: సార్వత్రిక ఎన్నికలపై భారత్–పాకిస్తాన్ ఉద్రిక్తతల ప్రభావం ఉండదని, వాటిని సమయానికే నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) స్పష్టం చేసింది. గురు, శుక్రవారాల్లో సీఈసీ ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల సన్నాహాలను సమీక్షించింది. సరిహద్దుల్లో పరిస్థితి నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ గురించి అడిగిన ప్రశ్నకు ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా స్పందిస్తూ..సార్వత్రిక ఎన్నికలు అనుకున్న సమయానికే జరుగుతాయని తెలిపారు. పోటీచేసే అభ్యర్థులు విదేశాల్లో ఉన్న ఆస్తుల్ని కూడా వెల్లడించాల్సి ఉంటుందని చెప్పారు. అభ్యర్థులు ప్రకటించే ఆస్తుల వివరాల్ని ఆదాయపన్ను శాఖ పరిశీలిస్తుందన్నారు. 1,63,331 పోలింగ్ కేంద్రాల్లో వీవీప్యాట్ యంత్రాల సాయంతో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. వచ్చే వారమే షెడ్యూల్! సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: వచ్చే వారంలో ఎప్పుడైనా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం వర్గాలు చెప్పాయి. మీడియా సమావేశంలో ప్రధాన కమిషనర్, కమిషనర్లు ఈ మేరకు ప్రకటన చేస్తారని తెలిపాయి. ఇప్పటికే కమిషన్ 2–3 ప్రత్యామ్నాయ షెడ్యూల్స్‌ను ఖరారుచేసిందని, అందులో నుంచి ఒకదాన్ని ప్రకటిస్తుందని వెల్లడించాయి. మరోవైపు, షెడ్యూల్ రాకముందే మరో కేబినెట్ సమావేశం నిర్వహించబోతున్నట్లు కొందరు కేంద్ర మంత్రులు సంకేతాలిచ్చారు. ఇక ఎన్నికల సన్నాహాల తుది సమీక్షలో భాగంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ సునిల్ అరోరా శనివారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. -
సరిహద్దులో యుద్ధమేఘాలు: సీఈసీ కీలక వ్యాఖ్యలు
లక్నో: భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దుల్లో నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని సార్వత్రిక ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు ఉండొచ్చంటూ వస్తున్న వార్తలను కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది. దేశంలో ఎన్నికలు సకాలంలో నిర్వహిస్తామని, వాయిదా వేసే ఆలోచనే లేదని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు రెండు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన సునీల్ అరోరా శుక్రవారం లక్నోలో అక్కడి అధికారులతో సమీక్ష సందర్భంగా మాట్లాడారు. ఎన్నికల నిబంధనల్లో కొత్తగా కొన్ని మార్పులను ప్రతిపాదించామని సునీల్ అరోరా చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు విదేశాల్లో ఉన్న ఆస్తులను కూడా చూపాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు ఇచ్చే ఆస్తుల వివరాలపై ఆదాయపు పన్ను శాఖ పరిశీలిస్తుందని, తేడాలు వస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆస్తుల వివరాలన్నింటినీ తాము అధికారిక వెబ్ సైట్లో పొందుపరుస్తామని, ఆదాయపు పన్ను శాఖ సుమోటోగా ఆస్తుల వివరాలను పరిశీలిస్తుందని తెలిపారు. దీనికోసం తమ అనుమతి తీసుకోవాల్సిన అవసరం కూడా రాదని చెప్పారు. త్వరలో తాము సీ-విజిల్ యాప్ ను అందుబాటులోకి తీసుకుని రానున్నామని, దీనిద్వారా అభ్యర్థులపై ప్రజలు స్వచ్ఛందంగా ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. ఫిర్యాదిదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని అన్నారు. ప్రజలను రెచ్చగొట్టేలా, విధ్వేషపూరితమైన ప్రసంగాలపై నిఘా ఉంటుందని సునీల్ అరోరా చెప్పారు. గత ఎన్నికల ప్రచారంలో కొన్ని కేసులను నమోదు చేశామని గుర్తుచేశారు. ఇలాంటి ప్రసంగాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంటుందని అన్నారు. తమ దృష్టికి వచ్చిన విధ్వేష పూరిత ప్రసంగాలను ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీల పరిశీలనకు పంపిస్తామని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో ఎన్నికల ప్రచారంపై దృష్టి పెడతామని చెప్పారు. పెయిడ్ ఆర్టికల్స్ లపై ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. -
కదులుతున్న దొంగ ఓట్ల డొంక
సాక్షి, అమరావతి బ్యూరో: ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. అందుకు బాధ్యులైన అధికారులపై కొరడా ఝుళిపించింది. రాష్ట్రంలో డబుల్, ట్రిపుల్ అనుమానాస్పద, దొంగ ఓట్లపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ఢిల్లీలో ఎన్నికల ప్రధానాధికారి సునీల్ అరోరాకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో అనుమానాస్పద ఓట్లపై విచారణ ప్రారంభమైంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో భారీ అవకతవకలకు పాల్పడినట్లు అధికారుల విచారణలో తేలింది. దీంతో అందుకు బాధ్యులైన ఐదుగురు బీఎల్వోలపై సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెండ్ అయినవారిలో మండల కేంద్రమైన నాదెండ్లలోని 35వ నంబర్ పోలింగ్ కేంద్రం బీఎల్వో నాదెండ్ల శివయ్య (పంచాయతీ కార్యదర్శి), నాదెండ్ల మండలం తూబాడులోని 43వ నంబర్ పోలింగ్ కేంద్రం బీఎల్వో జంగు జరీనా (పంచాయతీ కార్యదర్శి), యడ్లపాడు మండలం ఉన్నవలోని 85వ నంబర్ పోలింగ్ కేంద్రానికి చెందిన బీఎల్వో వై.ప్రమీల, (అంగన్వాడీ వర్కర్), చిలకలూరిపేట మండలం కోమటినేనివారిపాలెంలోని 212వ నంబర్ పోలింగ్ కేంద్రానికి చెందిన బీఎల్వో గుంటి రవి (వీఆర్వో), చిలకలూరిపేట మండలం కోమటినేనివారిపాలెంలోని 214వ నంబర్ పోలింగ్ కేంద్రం బీఎల్వో అంగళ మరియమ్మ (అంగన్వాడీ వర్కర్) ఉన్నారు. వారితో పాటు చిలకలూరిపేట తహసీల్దార్ వీసీహెచ్ వెంకయ్య, నాదెండ్ల తహసీల్దార్ మేరిగ శిరీష, యడ్లపాడు తహసీల్దార్ ఆర్.రామాంజనేయులుకు షోకాజ్ నోటీసులిచ్చారు. పల్నాడు అధికారుల్లో భయం భయం.. అనుమానాస్పద ఓట్లపై విచారణ ప్రారంభించడం, చిలకలూరిపేట నియోజకవర్గంలో పలువురు అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవడంతో జిల్లాలోని పల్నాడు ప్రాంత అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలో ఓటర్ల జాబితాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు చోటుచేసుకోవడమే దీనికి కారణం. విచారణలో తమ గుట్టురట్టవుతుందని బీఎల్వోలు, తహసీల్దార్లు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. అనుమానాస్పద ఓట్లపైనే ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా 54 లక్షలకు పైగా అనుమానాస్పద ఓట్లు ఉన్నట్టు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధారాలతో ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లాలో అనుమానాస్పద ఓట్లు 2,07,209 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో అధికంగా మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గంలో 16,659, స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రాతినిథ్యం వహిస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గంలో 15,498, నరసరావుపేటలో 14,746, గురజాలలో 15,498, పెదకూరపాడులో 15,314, మంగళగిరిలో 12,495, ప్రత్తిపాడులో 12,480, తాడికొండలో 11,971 ఉన్నాయి. వీటిపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిష్పక్షపాతంగా ఓట్ల మార్పులు, చేర్పులు చేస్తారా అనే విషయంపై రాజకీయ పార్టీలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి పోలింగ్ కేంద్రాల మార్పు, ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులపై వైఎస్సార్సీపీ నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సత్తెనపల్లి నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. గురజాల నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు ఎన్నికల సిబ్బందిపై ఒత్తిడి తెచ్చి దొంగ ఓట్లను చేర్పించుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. మొత్తం మీద పల్నాడు ప్రాంతంలోనే అధికంగా దొంగ ఓట్లు, అనుమానాస్పద ఓట్లుండటం గమనార్హం. అధికార పార్టీ నేతలు బూత్ లెవల్ అధికారులపై ఒత్తిడి తెచ్చి.. తమకు అనుకూలంగా ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు చేసినట్లు ఆరోపణలొస్తున్నాయి. ఓటర్ల జాబితాను పరిశీలించుకుని.. పేరు లేకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని వైఎస్సార్సీపీ నేతలు సూచిస్తున్నారు. -
వీవీప్యాట్లు లెక్కించవచ్చు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఎన్నికలు 35 వేలకుపైగా పోలింగ్ కేంద్రాల్లో జరిగాయని, అందులో దాదాపు 200 పోలింగ్ కేంద్రాలకు ప్రిసైడింగ్ అధికారులు సరైన అవగాహన లేకుండా ఈవీఎంలను వినియోగించి పొర పాట్లు చేశారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) రజత్‌కుమార్ తెలిపారు. మాక్ పోల్ సందర్భంగా వేసిన ఓట్లను తొలగించే మీటను నొక్కకుండానే పోలింగ్ ప్రారంభించడంతో వాస్తవంగా పోలైన ఓట్ల సంఖ్య, ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లసంఖ్య మధ్య వ్యత్యాసం ఏర్పడిందన్నారు. ఈ సందర్భం గా నెలకొనే అనుమానాలను నివృత్తి చేసేందుకు వీవీ ప్యాట్ రసీదులను లెక్కించవచ్చన్నారు. లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతలో భాగం గా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో బుధ, గురువారాల్లో జిల్లా ఎన్నికల అధికారు(డీఈవో)లైన కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్‌తోపాటు రిటర్నింగ్ అధికారులకు ఇక్కడ శిక్షణ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. శిక్షణ అనంతరం ఆర్వోలకు పరీక్షలు నిర్వహించామని, పాసైతేనే లోక్‌సభ ఎన్నికల నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తామన్నారు. ఈ పరీక్షల్లో విఫలమైన అధికారులను ఈ నెల 20, 21 తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న శిక్షణ తరగతులకు పంపిస్తామన్నారు. ఎన్నికల నిర్వహణ, ఎన్నికల ఖర్చుల అధ్యయనం, నామినేషన్లను భర్తీ చేసే విధానం, వికలాంగులకు కల్పించాల్సిన ఏర్పాట్లు, ఓటు చేసే విధానం తదితర అన్ని అంశాలపై డీఈవోలకు, ఆర్వోలకు శిక్షణనిచ్చినట్లు ఆయన వివరించారు. ఎన్నికల్లో డీఈవోలు, ఆర్వోల పాత్ర అనే అంశంపై అవగాహన కల్పించినట్లు చెప్పారు. ఇప్పటివరకు ఖాళీగా ఉన్న డీఈవోలు, ఆర్వోలను భర్తీ చేసే కార్యక్రమం కొనసాగుతోందని, ఇప్పుడున్న కొంతమంది ఆర్వోలను మార్చనున్నామని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే మరింత మెరుగైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తామని రజత్‌కుమార్ తెలిపారు. అన్ని టెక్ని కల్ విషయాలపై అధికారులు అవగాహన కలిగి ఉండాలన్నారు. న్యాయపరమైన సమస్యలను కూడా చర్చించినట్లు తెలిపారు. సీ– విజిల్ యాప్, 1950 కాల్‌సెంటర్ కూడా ఉపయోగిస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందస్తు చర్యలు చేపడుతున్నామని చెప్పా రు. శాంతిభద్రతల విషయంలో లోతుగా అధ్యయనం చేసి ముందుకు వెళ్తామన్నారు. కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ సమీక్ష లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు రాష్ట్రంలో జరుగుతున్న ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ సునీల్ అరోరా ఆరా తీశారు. ఏపీ పర్యటన ముగించుకుని మంగళవారం హైదరాబాద్‌కు చేరుకుని ఇక్కడే రాత్రి బస చేశారు. బుధవారం ఉదయం సీఎస్ ఎస్కే జోషి, డీజీపీ మహేందర్ రెడ్డిలతో సమావేశమై లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఖాళీలున్న చోట్లలో జిల్లా ఎన్నికల అధికారుల నియామకం, అవసరమైన చోట్లలో బదిలీలు, రిటర్నింగ్ అధికారులకు శిక్షణను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలపై చర్యలు తీసుకునేందుకు సీఎస్ ఎస్కే జోషితో సీఈవో రజత్‌కుమార్ సచివాలయంలో సమావేశమై చర్చించారు. ఆ కలెక్టర్ అనుకోకుండా పొరపాటు చేశారు ‘శాసనసభ ఎన్నికల సందర్భంగా జిల్లా కలెక్టర్లు తీవ్రంగా కష్టపడ్డారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఒమర్ జలీల్ సైతం బాగా కష్టపడి పనిచేశారు. అయితే, ఆయన పొరపాటుగా ఈవీఎం యంత్రాలను తెరిచి చిక్కుల్లోపడ్డారు. ఆయన ఉద్దేశపూర్వకంగా ఈ పనిచేయలేదు. పొరపాటుగా ఈవీఎంలను తెరిచి హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడంతో ఆయన్ను సస్పెండ్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. న్యాయస్థానం ఆదేశాలు ఉల్లంఘించడంతో కఠిన చర్యలు తీసుకోకతప్పలేదు’అని రజత్‌కుమార్ పేర్కొన్నారు. 27.31 లక్షల దరఖాస్తులు... ఓటర్ల జాబితా సవరణ కింద దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణ ఈ నెల 4తో ముగిసిందని, గడువులోగా 27.31 లక్షల దరఖాస్తులొచ్చాయని రజత్‌కుమార్ అన్నారు. ఇప్పటివరకు 10 లక్షల దరఖాస్తులను పరిశీలించగా, అందులో 7 లక్షల దరఖాస్తులు తొలిసారిగా ఓటరుగా నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నవారే ఉన్నారన్నారు. మిగిలిన పెండింగ్ దరఖాస్తులను సైతం పరిష్కరిస్తే తొలిసారిగా ఓటేయనున్న యువ ఓటర్ల సంఖ్య 12 లక్షల నుంచి 13 లక్షల వరకు పెరిగే అవకాశముందని చెప్పారు. ఈ నెల 22న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తామన్నారు. -
దొంగ ఓట్ల బెడద
ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ వ్యవస్థ. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్ప క్షపాతంగా నిర్వహించడం ఈ సంస్థ నైతిక బాధ్యత. ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజులు పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాకు క్షేత్రవాస్తవికత చూచాయగా తెలిసి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న పోస్ట్–డేటెడ్ చెక్కుల విషయం, సర్వేల పేరుతో ఓట్లు తొలగిస్తున్న సంగతీ ఆయన అమరావతిలో ప్రస్తావించారు. ఎన్నికలలో అవకతవకలకు పాల్పడిన అధికారులు ఎంతవారైనా వారిపైన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. బదిలీలూ. పదోన్నతుల పైనా, దొంగ ఓట్ల నమోదుపైనా, ఓటర్ల జాబితాలో తప్పులపైనా ఫిర్యాదులు అందాయనీ, అన్నిం టినీ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామనీ హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రా లలో రెండు చోట్లా ఓటర్ల జాబితాలలో ఉన్న పేర్లపైనా దృష్టి పెడతామని చెప్పారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డీజీపీ) ఆర్పీ ఠాకూర్‌నూ, ఇంటెలిజెన్స్ శాఖ అధిపతి, అడిషనల్ డీజీపీ వెంక టేశ్వరరావునూ, కొత్తగా సృష్టించిన కోఆర్డినేటర్, లా అండ్ ఆర్డర్ పదవిలో నియమించిన ఘట్టమ నేని శ్రీనివాస్‌నూ ఎన్నికల ప్రక్రియకు దూరంగా పెట్టకపోతే ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగే ప్రసక్తే ఉండదంటూ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన సూచనను కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రస్తావించారు. అన్ని ఫిర్యాదులపైనా తగిన చర్యలు తీసుకుంటానంటూ నమ్మబలికారు. కానీ ప్రజలను కొన్ని సందేహాలు పట్టిపీడిస్తూనే ఉన్నాయి. ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిపైనా, రాష్ట్రప్రభుత్వ సిబ్బందిపైనా ఆధారపడి చర్యలు తీసుకోవలసి ఉంటుంది. రాష్ట్ర అధికారులు సహజంగానే అధికారపార్టీకి విధేయంగా ఉంటారు. అటువంట ప్పుడు అధికారపార్టీ బుద్ధిపూర్వకంగా రకరకాల ఎన్నికల అక్రమాలకు ఒడిగట్టితే వాటిని ఎన్నికల కమిషన్ ఏవిధంగా నివారించగలదనే సందేహం వేధిస్తున్నది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల ప్రమేయం లేకుండా ఈవీఎంలు (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్) భద్రపరచిన స్ట్రాంగ్‌రూంలోకి ప్రవేశించినందుకు వికారాబాద్ కలెక్టర్‌ను సస్పెండ్ చేయడం వల్ల అధికారులలో కొంత భయం పెరిగింది. దొంగ ఓట్ల విషయంలో కొన్ని ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కొంతమంది అధికారులను పంపుతుందని సునీల్ అరోరా చెప్పారు. అధికారుల పరిశీలనలో దొంగ ఓట్లు నమోదైనట్టు రుజువైతే అందుకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులపైన తక్షణమే చర్య తీసుకుంటే తక్కిన అధికార యంత్రాంగం జాగ్రత్తగా ఉంటుంది. నామినేషన్ వేయడానికి గడువు ముగిసే క్షణం వరకూ కొత్త ఓట్లను చేర్చుకునే ప్రక్రియ కొనసాగుతుంది. కొన్ని రాజకీయ పక్షాలు అదే పని మీద ఉంటాయి. ఉదాహరణకు కర్నూలు జిల్లాలో అధికారపార్టీ నేతలు బోగస్ ఓట్లను చేర్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారనీ, నవంబర్ 1 నుంచి ఫిబ్ర వరి 11 వరకూ ఫారం–6 కింద ఓటరు నమోదు కోసం 1,43,568 మంది దరఖాస్తు చేసుకున్నారనీ సమాచారం. అంతకుముందే జిల్లాలో 1,36,000 మంది కొత్త ఓటర్లు నమోదైనారు. ఏవిధంగా చూసినా ఇది పెద్ద సంఖ్య. సర్వేల పేరిట జరుగుతున్న తతంగం కూడా తెలుగుదేశంపార్టీ (టీడీపీ) నాయకుల పర్యవేక్షణలోనే సాగుతోందని ప్రతిపక్షాలు అంటున్నాయి. రెవెన్యూ అధికారులు ఎటు వంటి విచారణ లేకుండానే బోగస్ ఓటర్లను నమోదు చేసుకుంటున్నారంటూ ఆరోపణలు వస్తు న్నాయి. దొంగ ఓట్లు ఫలానా ప్రాంతంలో ఉన్నాయనీ, దర్యాప్తు జరిపించి నిజం నిగ్గు తేల్చాలనీ ఎన్నికల ప్రధానాధికారి జిల్లా ఎన్నికల అధికారి (కలెక్టర్)ని ఆదేశిస్తే, కలెక్టర్ ఎలక్టోరల్ రోల్ ఆఫీసర్ (ఆర్డీవో)ను పురమాయిస్తే, ఆర్డీవో అసిస్టెంట్ ఎలక్టోరల్ రోల్ ఆఫీసర్ (ఎంఆర్వో)కు చెబుతారు. ఎంఆర్ఓ బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎస్‌వో)కి బాధ్యత అప్పగిస్తారు. సర్వసాధారణంగా ఎవ్వరూ ఏమీ పరిశీలించకుండా, తనిఖీ చేయకుండా అంతా సవ్యంగా ఉన్నట్టు నివేదికలు పంపుతారు. తెలంగాణలో ఇదే జరిగింది. ఒక నియోజకవర్గంలో సెప్టెంబర్ 10న మొదటి జాబితా విడుదల చేశారు. అక్టోబర్ 12న మొదటి అనుబంధ జాబితా (సప్లి మెంట్–1) జారీ చేశారు. నవంబర్ మూడో వారంలో రెండో అనుబంధ జాబితా (సప్లిమెంట్–2) విడుదలైంది. రెండున్నర మాసాల వ్యవధిలో ఆ నియోజకవర్గంలో 47 వేల ఓట్లు పెరిగాయి. హైకో ర్టులో పిటిషన్ వేసినా, న్యాయమూర్తులు ఎన్నికల ప్రధానాధికారిని ఆదేశించినా బోగస్ ఓట్లను అరి కట్టలేకపోయారు. అంతా సవ్యంగానే ఉన్నదంటూ న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేశారు. చివరికి ఎన్నికల ప్రక్రియ పూర్తయిన అనంతరం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రజత్‌కుమార్ ‘సారీ’తో సరిపుచ్చారు. దొంగ ఓట్లను తొలగించాలనే పట్టుదల కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నిజంగా ఉంటే అందుకోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. అంకితభావంతో పనిచేసే సిబ్బందిని తగి నంతగా సమకూర్చాలని రాష్ట్రపతిని అభ్యర్థించాలి. నామినేషన్ల గడువు ముగియడానికి ముందు కొద్దివారాలలో అంతదాకా ఉన్న ఓట్లకు పదిహేను లేదా ఇరవై శాతం కొత్త ఓట్లు నమోదు చేస్తు న్నారు. రెవెన్యూ సిబ్బంది సహకారం లేకుండా ఇది సాధ్యం కాదు. నామినేషన్లు ముగిసిన తర్వాత దొంగ ఓట్లను గుర్తించి, తొలగించడానికి తగిన సమయం ఉండటం లేదు. అక్రమాలు జరిగినట్టు తెలుసుకొని ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత అధికారులపైన ఎటువంటి చర్య తీసుకున్నా అది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందమే అవుతుంది. శేష¯Œ లగాయతు చీఫ్ ఎలక్షన్ కమి షనర్లకు మంచి పేరు ఉన్నప్పటికీ ఎన్నికలలో ధన ప్రభావం విపరీతంగా పెరిగింది. అక్రమాలకు అంతులేకుండా పోతున్నది. అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం యథావిధిగా జరు గుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎన్నికలు ప్రాణప్రదమైనవి. ఓటర్ల జాబితాలు ఎంత స్వచ్ఛంగా, దోషరహితంగా ఉంటే ఎన్నికలు అంత సవ్యంగా జరుగుతాయి. -
ఈవీఎంలతోనే ఎన్నికలు నిర్వహిస్తాం..
-
ప్రలోభాలపై ఈసీ డేగ కన్ను
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రలోభాలపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) డేగ కన్ను వేసింది. సంక్షేమ పథకాల పేరుతో ఎన్నికల ముందు వివిధ వర్గాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న పోస్టు డేటెడ్ చెక్కులపై ఆరా తీస్తోంది. సరిగ్గా ఎన్నికల ముందు బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకునే విధంగా జారీ చేసిన చెక్కులపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్(సీఈసీ) సునీల్ అరోరా తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించడా నికి సునీల్ అరోరా రాష్ట్రానికి వచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ ఓటును తొలగించాలంటూ ప్రజలు దరఖాస్తు చేయకపోయినా ఇష్టారాజ్యంగా వారి ఓటును తొలగిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రేషన్ కార్డులు, పెన్షన్లు ఇస్తున్నప్పుడు లబ్ధిదారులతో కొందరు వ్యక్తులు ప్రమాణాలు చేయించుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై కూడా ప్రభుత్వం నుంచి పూర్తి సమాచారం తెప్పించుకుంటున్నామని అన్నారు. సునీల్ అరోరా ఇంకా ఏం చెప్పారంటే... ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాలో తప్పులపై వివిధ రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. వీటన్నింటినీ సమగ్రంగా పరిశీలిస్తాం. బోగస్ ఓట్లు, దొంగ ఓట్లపై ఫిర్యాదులు అందుతున్నాయి. రెండు మూడు రోజుల్లోనే మచ్చుకు కొన్ని ఓట్లపై ఆడిట్ చేస్తాం. చాలామంది యువ ఓటర్ల పేర్లు ఓటర్ల జాబితాలో నమోదు కాలేదని ఫిర్యాదులు వచ్చాయి. నామినేషన్ల స్వీకరణ చివరి రోజు వరకూ కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. రాష్ట్రంలో కొంతమంది సర్వేల పేరిట, కులాల పేరిట ఓట్లు తొలగిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి సూచించాం. కొత్త ఓటర్ల నమోదు కోసం నియమించిన ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఓటర్ నమోదు పాస్వర్డ్ ఇస్తున్నాం. ఇది దుర్వినియోగం అవుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రెండు చోట్లా ఓటర్లుగా ఉన్నవారిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాం. బదిలీలు, పదోన్నతులపై ఫిర్యాదులు ఎన్నికల ముందు బదిలీలు, ప్రమోషన్లపై.. ముఖ్యంగా పోలీసు శాఖపై చాలా ఫిర్యాదులు అందాయి. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా లేని బదిలీలు, పదోన్నతులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుత రాష్ట్ర డీజీపీ అధికార పార్టీకి అనుగుణంగా పనిచేస్తున్నారంటూ దీనికి ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాయత్నం కేసును ఉదాహరణగా చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు ఎన్ఐఏ పరిధిలో ఉంది. ఇవికాకుండా డీజీపీపై లిఖితపూర్వకంగా ఫిర్యాదులు ఏమైనా వస్తే పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. ఎన్నికలను పూర్తి పారదర్శకంగా నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నాం. ఎన్నికల విధుల్లో అవకతవకలకు పాల్పడితే ఎంతటి ఉన్నతాధికారి అయినా ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఈవీఎంలతోనే ఎన్నికలు నిర్వహిస్తాం.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై(ఈవీఎం) అనుమానాలు వ్యక్తం చేయడం అర్థరహితం. 2014 తర్వాత ఎన్నికలు జరిగిన పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు కాకుండా వేరే పార్టీలు గెలిచాయి. ఈవీఎంల్లో అవకతవకలు లేవనడానికి ఇదే నిదర్శనం. వచ్చే ఎన్నికలను ఈవీఎంలతోనే నిర్వహిస్తాం. రాష్ట్రంలో తొలిసారిగా శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలను వీవీ ప్యాట్లతో నిర్వహించబోతున్నాం. వచ్చే ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అరికట్టడానికి ఆదాయపు పన్ను(ఐటీ), వాణిజ్య శాఖలతో గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నాం. గత ఎన్నికల్లో కేసులు నమోదైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులను ఆదేశించాం. పత్రికల్లో వచ్చే చెల్లింపు వార్తలను(పెయిడ్ న్యూస్) పరిశీలించడానికి మీడియా మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా చేయాల్సిన బదిలీలకు ఫిబ్రవరి 20వ తేదీ వరకు గడువు ఇస్తున్నాం. ఫిర్యాదులపై వంద నిమిషాల్లో చర్యలు గతంలో జరిగిన కర్ణాటకతోపాటు ఇటీవలే జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్దఎత్తున వినియోగించడం వల్ల సత్ఫలితాలు వచ్చాయి. సి–విజిల్ యాప్ ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తాం. ఈ ఫిర్యాదులపై వంద నిమిషాల్లో చర్యలు తీసుకుంటాం. వచ్చిన ఫిర్యాదులను 24 గంటల్లో పరిష్కరించడానికి సమాధాన్ యాప్.. నామినేషన్లు, అనుమతులు, ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాలను తెలుసుకోవడానికి న్యూసువిధ యాప్‌ను తీసుకొచ్చాం. ఈవీఎంలు, వీవీ ప్యాట్లు, యాప్‌లపై ప్రజలకు అవగాహన కల్పించడానికి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తాం’’ అని సీఈసీ సునీల్ అరోరా వెల్లడించారు. ఈ సమావేశంలో సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ఉమేష్ సిన్హా, డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సందీప్ సక్సేనా, సుదీప్ జైన్, ఎన్నికల కమిషనర్ అశోక్ లావాస్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ తదితరులు పాల్గొన్నారు. -
ఈవీఎంలపై సందేహాలు అవసరం లేదు
-
పోస్ట్ డేటెడ్ చెక్కులపై ఫిర్యాదులు అందాయి
-
పోస్ట్ డేటెడ్ చెక్కులపై ఫిర్యాదులు అందాయి
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకే సారి జరుగుతాయని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరా స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యామని.. వాళ్లు కొన్ని అభ్యంతరాలు చెప్పారన్నారు. ఓటర్ల జాబితాలో తప్పులున్నాయని.. ఒక్కరికే రెండు, మూడు ఓట్లున్నాయన్న విషయం తమ దృష్టికి తీసుకొచ్చారని సీఈసీ చెప్పారు. కొన్ని పార్టీలు రేషన్ కార్డులు, పెన్షన్లు ఇచ్చేటప్పుడు ప్రమాణాలు చేయించుకుంటున్నట్లు ఫిర్యాదులు అందాయన్నారు. మహిళా ఓటర్లకు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తున్నారని ఫిర్యాదులు రావడంతో వాటిపై ప్రభుత్వం నుంచి నివేదిక కోరామని చెప్పారు. ఫిర్యాదులు వచ్చిన చోట్ల ర్యాండమ్ ఆడిట్ చేయాలని నిర్ణయించినట్లు సునీల్ అరోరా అన్నారు. ఎన్నికల దృష్టిలోనే కొన్ని బదిలీలు జరిగాయని ఫిర్యాదులు అందాయన్నారు. ఈ విషయంపై సీఎస్, డీజీపీలతో చర్చించామని, వాళ్లు సర్టిఫికెట్ ఇచ్చాక వాటిపై విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు. కులాల ఆధారంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం కుదరదని ఆయన స్పష్టం చేశారు. (పార్టీలకు అనుబంధ సంఘంగా పనిచేయొద్దు) ఈవీఎంలపై సందేహాలు అవసరం లేదు ఈవీఎంలు దుర్వినియోగం అయినట్టుగా ఇప్పటి వరకు తమ దృష్టికి రాలేదని సీఈసీ సునీల్ అరోరా అన్నారు. ప్రస్తుత డీజీపీపై లిఖిత పూర్వక ఫిర్యాదులు రాలేదని.. వస్తే పరిశీలిస్తామని ఆయన అన్నారు. ఈవీఎంలపై సందేహాలు అవసరం లేదన్నారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగడం అసాధ్యమని చెప్పారు. దాదాపు అన్ని పార్టీలు ఈవీఎంలపై సంతృప్తి వ్యక్తం చేశాయని చెప్పారు. కొన్ని పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయన్నారు. ఆర్టీజీస్ ద్వారా జరిగిన సర్వే అంశాన్ని ఏపీ ఎన్నికల అధికారి పరిశీలించి విచారణ చేస్తారని ఆయన చెప్పారు. -
రెండో రోజు సీఈసీ సునీల్ అరోరా సమీక్ష
-
పార్టీలకు అనుబంధ సంఘంగా పనిచేయొద్దు
సాక్షి, అమరావతి: ఎన్నికల సమయంలో అధికార పక్షానికో, ప్రతిపక్షానికో అనుకూలంగా పనిచేశారనే ఆరోపణలకు ఆస్కారం ఇవ్వొద్దని, ఎన్నికల నిర్వహణలో తటస్థంగా వ్యవహరించకపోతే చర్యలు తప్పవని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరా స్పష్టం చేశారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని కలెక్టర్లు, ఐపీఎస్‌లతో సోమవారం ఆయన సమీక్షించారు. విజయవాడ నోవాటెల్ హోటల్లో దాదాపు ఆరు గంటలకు పైగా జరిగిన సుదీర్ఘ అంతరంగిక సమావేశంలో ఈసీ దృష్టికి వచ్చిన వివిధ అంశాల్ని సీఈసీ సూటిగా ప్రస్తావించినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొందరు అధికారులు రాజకీయ విభాగం(పొలిటికల్ ఎక్స్టెన్షన్ వింగ్)గా పనిచేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయంటూ తన దృష్టికి వచ్చిన అంశాల్ని ప్రస్తావించారు. అలాంటి లోపాలు ఉంటే సరిచేసుకోవాలని, తెలిసి తప్పుచేస్తే కఠిన చర్యలు తప్పవని ఈసీ గట్టిగా చెప్పడంతో సమావేశం అనంతరం పలువురు అధికారులు ఈ అంశంపై చాలా సేపు చర్చించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. సమావేశంలో ఎన్నికల కమిషన్ ప్రస్తావించిన అంశాల్లో కొన్ని.. ‘కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసాధారణంగా ఓట్ల చేర్పులు, తొలగింపులు జరిగాయి. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 16 నుంచి 18 వేల కొత్త ఓట్లు చేర్చారు. కొన్ని నియోజకవర్గాల్లో 8 వేల వరకు ఓట్లు తొలగించారు. వీటిపై కూడా ఫిర్యాదులు అందాయి. అమాంతం ఓట్లు పెరిగితే పరిశీలించుకోవాలి. ఇప్పటికైనా ఆయా నియోజకవర్గాల్లో ఓట్ల చేర్పులు, తొలగింపులపై సమీక్షించేలా కలెక్టర్లు బాధ్యత వహించాలి. లేదంటే జాతీయ ఎన్నికల కమిషన్ నుంచే ప్రత్యేక టీంలను పంపి సమీక్షించాల్సి ఉంటుంది. ఏకంగా 18 శాతంపైగా ఓట్ల చేర్పులు జరిగితే వాటిపై లెక్క చూపించాల్సిన అవసరం ఉంది. ఓటర్ల లిస్టులపై రాజకీయ పార్టీల నుంచి వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందించి సత్వర చర్యలు చేపట్టాలి. నియోజకవర్గాల వారీగా మొత్తం ఓట్లు, కొత్త ఓట్లు, తొలగించిన ఓట్ల పూర్తి వివరాలతో ఎన్నికల కమిషన్‌కు నివేదిక ఇవ్వాలి. జిల్లాల్లో ఓటర్ల కోసం 1950 కాల్ సెంటర్ ఏర్పాటు చేశాం. ఓటర్ల అనుమానాల నివృత్తికి, సాయం కోసం కాల్‌సెంటర్‌ను ఉపయోగించుకునేలా ప్రచారం చేయాలి. ఈ కాల్ సెంటర్ 24 గంటలు పనిచేయాలి. గత ఎన్నికల్లో నమోదైన కేసులు ఇంకా పెండింగ్‌లో పెడితే ఉపేక్షించేది లేదు. నాన్‌బెయిల్‌బుల్ వారెంట్(ఎన్బీడబ్ల్యూ) పెండింగ్‌లో ఉంటే అలాంటి వారిని వెంటనే అదుపులోకి తీసుకుని బైండోవర్ చేయాలి. లైసెన్స్డ్ వెపన్స్(ఆయుధాలు)ను స్వాధీనం(డిపాజిట్) చేసుకోవాలి’ అని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరా సూచించినట్లు సమాచారం. వీవీప్యాట్లపై అవగాహన కల్పించండి ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ఎన్నికల్లో వీవీప్యాట్లను వినియోగిస్తున్నామని, వాటిపై ఓటర్లలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని సీఈసీ సూచించారు. ఫిర్యాదులపై స్పందించకపోతే ఎన్నికల కమిషన్ ఉపేక్షించదని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన చెప్పారు. జిల్లాల వారీగా ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్లు, ఎస్పీలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. -
‘చంద్రబాబు కుట్రలను ఈసీ దృష్టికి తీసుకెళ్లాం’
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఎన్నికల కుట్రలన్నింటినీ ఈసీ దృష్టికి తీసుకెళ్లామని వైఎస్సార్ సీపీ నేత పార్థసారథి తెలిపారు. సోమవారం ఏపీ రాజకీయ పక్షాలతో కేంద్ర ఎన్నికల కమీషనర్ సునీల్ అరోరా భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారథి, బీజేపీ నేత జూపూడి రంగరాజు, సీపీఐ నేత జల్లి విల్సన్, సీపీఎం నేత వై వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నేత తాంతియా కుమారి, టీడీపీ నేత పట్టాభి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ.. టీడీపీ ఎన్నికల అక్రమాల గురించి ఎన్నికల అధికారి సునీల్ అరోరాకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ యంత్రాంగాలను దుర్వినియోగం చేసి, రిగ్గింగ్ చేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 59 లక్షల డూప్లికేట్ ఓటర్లు ఉన్నారని తెలిపారు. దీనిపై ఫిర్యాదు చేసినా.. ప్రభుత్వం ఆ ఓటర్లను తొలగించకుండా అధికారులను బెదిరిస్తున్నారని చెప్పారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ద్వారా ఓటర్ల జాబితాలో అవకతవకలకు ప్రభుత్వం పాల్పడుతోందని ఆరోపించారు. సర్వేల పేరుతో ట్యాబ్‌లు ఇచ్చి, ప్రత్యేకమైన యాప్ సృష్టించి ఓటర్లను తొలగిస్తున్నారన్నారు. ట్యాబ్‌లలో ఓటర్ల జాబితాలను పెట్టి.. ఓట్లను తొలగిస్తున్న విషయాన్ని స్వయంగా ఆధారాలతో వివరించామన్నారు. కానూరు బూత్ నెంబర్ 1లో ఆదినారాయణ అనే వ్యక్తికి ఏడు ఓట్లున్నాయని వెల్లడించారు. ఇలాంటి ఉదాహరణలతో ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. బూత్‌లను స్వాధీనపరుచుకోవడానికి నచ్చిన పోలీసు అధికారులను నియమించుకుంటున్నారని తెలిపారు. నాన్ క్యాడర్ అధికారులను జిల్లా ఎస్పీలుగా నియమిస్తున్నారన్నారు. చంద్రబాబు బీజేపీ కార్యకర్తలను బెదిరిస్తున్నారు: జూపూడి రంగరాజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా బీజేపీ కార్యకర్తలను బెదిరిస్తున్నారని బీజేపీ నేత జూపూడి రంగరాజు తెలిపారు. సోమవారం కేంద్ర ఎన్నికల కమీషనర్ సునీల్ అరోరాతో భేటీ అయిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో శాంతి, భద్రతల పరిస్థితి ఆందోళనకరంగా వుందన్నారు. కన్నా లక్ష్మీనారాయణ ఇంటిపై దాడి చేస్తే.. కనీసం కేసు కూడా నమోదు చేయట్లేదంటూ వాపోయారు. ఎన్నికలకు ముందు అధికారులను బదిలీలు చేస్తున్నారని, వాటిపై ఫిర్యాదు చేసామని తెలిపారు. డీజీపీ ఠాకూర్‌కి తాము ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా చర్యలు తీసుకోలేదన్నారు. ఆయనపై కూడా ఫిర్యాదు చేశామని చెప్పారు. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన పోస్ట్ డేటెడ్ చెక్కుల విషయంపై కూడా ఫిర్యాదు చేశామన్నారు. ఎన్నికల సమయంలో ఇలా చేయడంపై ఈసీ చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఓటర్లను మభ్యపెట్టే చర్య కాబట్టి.. దీనిపై ఫిర్యాదు చేశామని, ఈ చెక్కుల వ్యవహారంపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరామన్నారు. -
సీఈసీతో సమావేశమైన చంద్రబాబు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈసీ) సునిల్ ఆరోరాని ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఢిల్లీలో ప్రత్యేకంగా కలిశారు. సాయంత్రం జరిగిన విపక్షాల సమావేశంలో ముందుగా చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఈవీఎంలపై ఉన్న అనుమానాలపై ఫిర్యాదు చేసేందుకు పలు విపక్ష పార్టీల నేతలు సోమవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని నిర్ణయించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇదే విషయాన్ని వెల్లడించారు. అయితే సీఎం చంద్రబాబు రాత్రి 8.35 గంటలకు కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వెళ్లి ఎన్నికల ప్రధానాధికారితో సుమారు అరగంటపాటు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సీఈసీతో భేటీ అనంతరం బాబు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశారు. రాహుల్ కారులో ఆయన ఇంటి వరకు.. విపక్ష పార్టీల సమావేశంలో పాల్గొన్న అనంతరం రాహుల్, చంద్రబాబు ఒకే కాన్వాయ్‌లో బయలుదేరారు. ఈ సందర్భంగా పలు విషయాలపై ఇరువురు చర్చించుకున్నారు. అనంతరం రాహుల్ నివాసం వద్ద కారు దిగిన చంద్రబాబు అక్కడి నుంచి తన కాన్వాయ్‌లో ఏపీ భవన్‌కు చేరుకున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్‌ను సందర్శించి మీడియాతో మాట్లాడారు. దేశంలో ఈవీఎంలను మ్యానిప్యులేట్ చేయవచ్చని అనుమానాలు వస్తున్నాయని, దీనిపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. -
మళ్లీ బ్యాలెట్‌కు నో
న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) విశ్వసనీయతపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) సునీల్ అరోరా స్పందించారు. ఈవీఎంలకు బదులుగా బ్యాలె ట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలన్న కొన్ని రాజకీయ పక్షాల డిమాండ్‌కు తలొగ్గబోమని స్పష్టం చేశారు. మళ్లీ బ్యాలెట్ బాక్సులను వినియోగించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఈవీఎంలను కొందరు ఫుట్బాల్లా ఆడుకుంటున్నారనీ, వాటి పనితీరుపై ఉద్దేశపూర్వకంగానే బురద చల్లుతున్నారని మండిపడ్డారు. బ్యాలెట్‌తో సిబ్బందికి నరకమే.. ఢిల్లీలో గురువారం జరిగిన ‘మేకింగ్ అవర్ ఎలక్షన్స్ ఇన్‌క్లూజివ్ అండ్ యాక్సెసబుల్’ అనే కార్యక్రమంలో అరోరా మాట్లాడుతూ.. ‘నేను ఒక విషయాన్ని స్పష్టం చేయదలచుకున్నాను. ఇప్పుడే కాదు.. భవిష్యత్‌లో కూడా మేం బ్యాలెట్ పేపర్ల విధానానికి మొగ్గుచూపబోం. మనుషుల సాయంతో బ్యాలెట్ బాక్సులను ఎత్తుకెళ్లడం, కౌంటింగ్‌లో తీవ్రమైన ఆలస్యం.. ఇదంతా పోలింగ్ సిబ్బందికి నరకంలా ఉంటుంది. రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి విమర్శలు, సలహాలు స్వీకరించేందుకు సిద్ధం గా ఉన్నాం. ఇదే సమయంలో బెదిరింపులు, ఒత్తిడి, విజ్ఞప్తులకు తలొగ్గి ఈవీఎంలను వదిలి బ్యాలెట్ విధానానికి మళ్లే ప్రసక్తే లేదు. మనం ఈవీఎంలను ఫుట్‌బాల్‌గా ఎందుకు మార్చేశాం? వాటిపై ఉద్దేశపూర్వకంగా బురదచల్లే కార్యక్రమం కొనసాగుతోంది’ అని తెలిపారు. ఒకే ఫలితం రావాలి కదా.. ఈవీఎంల సమర్థతపై స్పందిస్తూ..‘2014 లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్నిరోజులకే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భిన్నమైన ఫలితాలు వచ్చాయి. ఆ తర్వాత హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, త్రిపుర, నాగాలాండ్, మిజోరంతో పాటు తాజాగా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్తాన్.. ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కోరకంగా ఎన్నికల ఫలితాలు నమోదయ్యాయి. నిజంగా ఈవీఎంలలో సమస్య ఉంటే ఇక్కడంతా ఒకేరకమైన ఫలితాలు రావాలి కదా. ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలను అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్)లో రూపొందిస్తారు. వీటిని హ్యాక్ లేదా ట్యాంపరింగ్ చేయడం అసాధ్యం. ఇటీవల రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 1.76 లక్షల పోలింగ్ కేంద్రాల్లో కేవలం ఆరంటే ఆరు చోట్ల మాత్రమే ఈవీఎంల్లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ విషయంలో అలసత్వం చూపకుండా మేం వెంటనే స్పందించి పరిస్థితిని చక్కదిద్దాం’ అని అరోరా వెల్లడించారు. ఇక వీవీప్యాట్ యంత్రాలకు సంబంధించి చిన్నచిన్న ఘటనలు నమోదయ్యాయని అంగీకరించారు. వీవీప్యాట్ యంత్రాల వినియోగం విషయంలో ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నామనీ, ఈ తప్పుల నుంచి నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు. ‘బ్యాలెట్’తోనే ఎన్నికలు జరపండి త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించాలని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఈవీఎంల సమర్థతపై తలెత్తిన వివాదంతో మొత్తం ఎన్నికల ప్రక్రియపైనే నీలినీడలు కమ్ముకున్నాయని వ్యాఖ్యానించారు. రాజకీయ అవసరాల కోసం సాంకేతికను దుర్వినియోగం చేస్తున్నారనీ, ఇందులో తమకు ఎలాంటి అనుమానం లేదని స్పష్టం చేశారు. విద్యావంతులైన ప్రజలు ఈవీఎంలకు వ్యతిరేకంగా గొంతు విప్పాలన్నారు. హ్యాకర్ సయిద్ షుజా చేసిన ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని డిమాండ్‌చేశారు. -
మళ్లీ బ్యాలెట్ పేపర్లను వాడే ప్రసక్తే లేదు: ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాలెట్ పేపర్లను వాడే ప్రసక్తే లేదని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలు ఈవీఎంల పనితీరుపై వ్యక్తం చేస్తున్న అనుమానాలను కొట్టిపారేసింది. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నికల ప్రధాన కమిషనర్(సీఈసీ) సునీల్ అరోరా బ్యాలెట్ పేపర్ల వినియోగంపై స్పష్టత ఇచ్చారు. మన దేశంలో ఎన్నికల సంఘం వినియోగిస్తున్న ఈవీఎంలను ఎవరూ హ్యాక్ చేయలేరని పేర్కొన్నారు. ఈవీఎంలపై అనుమానమే లేనపుడు ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లను ఎందుకు వినియోగించాలని ప్రశ్నించారు. బీఈఎల్, ఈసీఐఎల్ రూపొందించే ఈవీఎంలను ఎవ్వరూ హ్యాక్ చేయలేరని స్పష్టం చేశారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈవీఎంలను రూపొందిస్తామనీ, సాంకేతిక కమిటీ సమక్షంలో నిబంధనల మేరకు ఈ యంత్రాలను కఠినమైన పరీక్షలకు లోనుచేస్తామని వెల్లడించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను(ఈవీఎం) హ్యాక్ చేయడం ద్వారానే బీజేపీ విజయం సాధించిందని సయిద్ షుజా అనే హ్యాకర్ చేసిని ఆరోపణలపై తీవ్ర రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. -
బ్యాలెట్‌తో ఎన్నికలు జరిపే ప్రసక్తే లేదు
-
ఈవీఎంలపై అనుమానం అక్కర్లేదు
చంఢీగఢ్: ఈవీఎంల (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్)పై ఎటువంటి అనుమానం అక్కర్లేదని, వాటి పనితీరును అత్యంత సాంకేతిక పరిజ్ఞానం గల నిపుణులతో పర్యవేక్షిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎమ్ఈఆర్)నూతన విద్యా సంవత్సర ప్రారంభోత్సవ సమావేశంలో ‘ముందుకు సాగడానికి అవకాశాలు, సవాళ్లు’ అనే అంశంపై మాట్లాడారు. ఈవీఎం వ్యవస్థ పనితీరుపై అసలు సందేహ పడాల్సిన అవసరమే లేదని ఆయన స్పష్టం చేశారు. పలు రాజకీయ పార్టీలు ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ సీఈసీపై విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో అరోరా ఈమేరకు వ్యాఖ్యానించారు. ‘ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిందేమిటంటే ఏ యంత్రమైనా పాడవుతుంది. కానీ పాడవడానికి, సరిగా పనిచేయకపోవడానికి మధ్య తేడా ఉంది. మీరు ఒక కారు కొన్నారు అనుకోండి అది ఓ వారం లోపు పనిచేయకపోవచ్చు’అని ఉదహరించారు. ఇవేమీ పట్టించుకోకుండా ప్రజలు ఇష్టమొచ్చినట్లు ఈవీఎంలపై విమర్శలు చేస్తున్నారన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికలను విశ్వసనీయతతో, నిష్పాక్షికతతో, నైతికతతో నిర్వహించడానికి మాకు సాధ్యమైనంత వరకు పనిచేస్తామని వెల్లడించారు. పీజీఐఎమ్ఈఆర్ 2018లో దేశంలోని అన్ని మెడికల్ కాలేజీల్లో 2వ ర్యాంకు సాధించినందుకు అభినందించారు. సమావేశంలో పీజీఐఎమ్ఈఆర్ డైరెక్టర్ జగత్ రామ్, కాలేజీ ఫ్యాకల్టీ, విద్యార్థులు పాల్గొన్నారు. -
ట్రక్కు గుర్తు ఎవరికీ ఇవ్వొద్దు!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ : 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీకీ ట్రక్కు గుర్తును కేటాయించవద్దంటూ.. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) సునీల్ అరోరాను సీఎం కేసీఆర్ కోరారు. గురువారం ఢిల్లీలో సీఈసీని కలిసిన కేసీఆర్ ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈవీఎంలో ట్రక్కు గుర్తు, తమ పార్టీ గుర్తయిన కారు ఒకే రకంగా ఉండటం వల్ల ఓటర్లు అయోమయానికి గురవుతున్నారని కేసీఆర్ వివరించారు. ఇటీవల పూర్తయిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రులకు కేటాయించిన ట్రక్కు (ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి కేటాయించారు), కెమెరా, ఇస్త్రీ పెట్టె, టోపీ తదితర గుర్తుల కారణంగా ఓటర్లు తికమకపడడంతో తమ పార్టీ కొన్ని ఓట్లు కోల్పోవాల్సి వచ్చిందని సీఎం పేర్కొన్నారు. కారు, ట్రక్కు గుర్తులు దాదాపు ఒకేరకంగా ఉన్నందున.. 15 మంది టీఆర్ఎస్ అభ్యర్థులు 1000 నుంచి 15,000 ఓట్లు నష్టపోయారని సీఈసీకి ఆయన వివరించారు. అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు కనీసం వెయ్యి ఓట్లు.. ఈ ట్రక్కు గుర్తు కారణంగా పొందలేకపోయారన్నారు. 119 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు 100 స్థానాల్లో టీఆర్ఎస్ గెలిచేందుకు విస్తృతావకాశాలున్నప్పటికీ.. ఈ సమస్య కారణంగా 88 సీట్లే పొందగలిగిందన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మరిన్ని స్థానాలు వచ్చి ఉండేవని కేసీఆర్ అభిప్రాపడ్డారు. తమ ప్రభుత్వం నాలుగున్నరేళ్ల పాలనపై ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారని.. అయితే, టీఆర్ఎస్కు అఖండ మెజారిటీని కట్టబెట్టే ప్రయత్నంలో ట్రక్కు గుర్తు కారణంగా ఓటర్లు అయోమయానికి గురయ్యారన్నారు. ఓట్లు తొలగింపుపై ఫిర్యాదు ఎన్నికల సందర్భంగా రూపొందించిన ఓటర్ల జాబితాలో 22 లక్షల మంది పేర్లను తొలగించిన అంశాన్నీ సునీల్ అరోరా దృష్టికి సీఎం తీసుకెళ్లారు. టీఆర్ఎస్ 100 సీట్లను పొందలేకపోవడానికి ఎన్నికల జాబితాలో తప్పులు కూడా ఓ కారణమన్నారు. తన ఫిర్యాదును స్వీకరించి వచ్చే లోక్‌సభ ఎన్నికల వరకు తొలగించిన పేర్లను తిరిగి జాబితాలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని సీఈసీని కోరారు. 2014 ఎన్నికల్లో తెలంగాణలో 2.81 కోట్ల ఓటర్లుండగా.. తాజా అసెంబ్లీ ఎన్నికలకు ముందు హడావుడిగా ప్రచురించిన (సెప్టెంబర్ 2018 వరకున్న వివరాల ఆధారంగా) కొత్త జాబితాలో 22 లక్షల ఓట్లు గల్లంతయిన సంగతి తెలిసిందే. ట్రక్కు గుర్తు, 22లక్షల ఓట్ల గల్లంతుతోపాటుగా.. ఈవీఎంలో తమ పార్టీ గుర్తు కారు రంగును కాస్త ముదురురంగులోకి మార్చాలని కూడా కేసీఆర్ కోరారు. కేసీఆర్ డిమాండ్లకు సీఈసీ సానుకూలంగా స్పందించారు. ఈ విషయంపై మిగిలిన సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇటీవల తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా జరిపినందుకు ఎన్నికల సంఘానికి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ భేటీలో సీఎం తోపాటు పార్టీ ఎంపీ బి.వినోద్ కుమార్, బండ ప్రకాశ్‌లు పాల్గొన్నారు. రిజిస్టర్ పార్టీయే: వినోద్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ (ఎఫ్బీపీ) గుర్తింపు పొందిన పార్టీయేం కాదని.. కేవలం రిజిస్టర్డ్ పార్టీయేనని కేసీఆర్ గుర్తుచేశారు. అందువల్ల సార్వత్రిక ఎన్నికల్లో ట్రక్కు గుర్తు ఎఫ్బీపీ సహా ఎవరికీ కేటాయించవద్దంటూ కేసీఆర్ విజ్ఞప్తి చేశారని ఎంపీ వినోద్ వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో ఓటర్లు గుర్తించేందుకు అనువుగా పార్టీల గుర్తులుండాలే తప్ప వారిని అమోమయానికి గురిచేసేలా ఉండకూడదని సీఈసీని సీఎం కోరారన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ అంశంపై సీఈసీకి ఫిర్యాదు చేశామని అయితే.. అప్పటికే ఎన్నికల ప్రక్రియ మొదలైనందున ఏమీ చేయలేమని ఎన్నికల సంఘం చెప్పిందన్నారు. -
ఇస్త్రీ పెట్టె, ట్రక్కు గుర్తులను రద్దు చేయండి: కేసీఆర్
న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం నిర్వచన్ సదన్‌లో కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి సునీల్ అరోరాతో సమావేశమయ్యారు. ఇస్త్రీ పెట్టె, ట్రక్కు వంటి కారు గుర్తును పోలిన గుర్తులను రద్దు చేయాలని ఈ సందర్భంగా అరోరాని కేసీఆర్ కోరారు. తెలంగాణలో ఓట్ల తొలగింపు వల్ల టీఆర్ఎస్కు నష్టం జరిగిందని, తొలగించిన ఓట్లను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. లోక్ సభ ఎన్నికలకు ముందే సవరణలు చేయాలని కోరారు. ఎంపీలు వినోద్ కుమార్, బండ ప్రకాశ్‌లు కేసీఆర్ వెంట ఉన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ బుధవారం ప్రధాని మోదీని కలిసి పలు కీలక అంశాలపై చర్చించిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన శాసన సభ ఎన్నికల్లో ట్రక్కు గుర్తుతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు నష్టం జరిగిందని ఎంపీ వినోద్ అన్నారు. 'ట్రక్కు, కెమెరా, ఇస్త్రీ పెట్టె, హ్యాట్ గుర్తులపై సునీల్ అరోరాతో కేసీఆర్ చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో కారు గుర్తును పోలిన ట్రక్కుతో ఓటర్లు గందరగోళానికి గురయ్యారు. 15 మంది అభ్యర్థులకు వెయ్యి నుంచి 15 వేల ఓట్ల నష్టం జరిగింది. వెయ్యి ఓట్ల వరకు చాలా నియోజక వర్గాల్లో నష్టం జరిగింది. అందువల్ల ట్రక్కు సింబల్ ఇకపై ఇవ్వొద్దని, ఎవరికీ కేటాయించవద్దని కేసీఆర్ సునీల్ అరోరాను కోరారు. ప్రజా స్వామ్యంలో ఓటర్లకు అనువుగా గుర్తులు ఉండాలి. ఓటర్లను గందరగోళానికి గురి చేసేలా గుర్తులు ఉండకూడదని సీఎం కోరారు. ఎన్నికల ముందే ఈ అంశంపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఎంపీలందరం ఫిర్యాదు చేశాము. కానీ, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఏమి చేయలేమని అన్నారు. మరో మూడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కారును పోలిన గుర్తులను కేటాయించవద్దని, కారు గుర్తు సైతం పలుచని రంగులో ఉన్నందున ఆ రంగును పెంచాలని సీఎం కేసీఆర్ కోరారు. త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘం భేటి అయి నిర్ణయం తీసుకుంటామని సునిల్ అరోరా కేసీఆర్‌కు తెలిపారు. తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా సాగినందుకు కేసీఆర్ కృతజ్ఙతలు తెలిపారు' అని ఎంపీ వినోద్ తెలిపారు. (కారుకు ట్రక్కు బ్రేకులు!) -
నేడు ప్రధాని మోదీతో కేసీఆర్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఇక్కడ సమావేశం కానున్నారు. రెండో సారి సీఎం అయిన తర్వాత తొలిసారిగా సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న కేసీఆర్ బుధవారం సాయంత్రం 4 గంటలకు ప్రధాని నివాసంలో భేటీ కానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అలాగే బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరాతో భేటీ అయ్యే అవకాశాలున్నా యని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
ఈవీఎంలలో లోపాలను తగ్గిస్తాం
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) పనితీరుని రాజకీయ పార్టీలు తప్పుపట్టడం సరికాదని గురువారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా అన్నారు. ఈవీఎంల విషయంలో రాజకీయ నేతలు ఎవరికి వారు తమకు అనుకూలంగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఈవీఎంలలో తలెత్తుతున్న లోపాలు, పొరపాట్లను సాధ్యమయ్యేంత తగ్గించేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోందని ఆయన వెల్లడించారు. ‘మేం సంతృప్తి చెందలేదు. కొన్ని సంఘటనలు (పొరపాట్లు, లోపాలు) పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం’అని చెప్పారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం, ఈవీఎంలలో లోపాలు తలెత్తడం రెండు వేర్వేరు అంశాలని అన్నారు. ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం, తెలంగాణల్లో జరిగిన అసెంబ్లీల ఎన్నికల్లో 1.76 లక్షల పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ ఎన్నికల్లో కొన్ని చోట్ల మాత్రమే (ఒక శాతానికి తక్కువే) ఈవీఎంలలో పొరపాట్లు తలెత్తాయని.. ఇంతమాత్రానికే ఈవీఎంలను తప్పుపట్టడం సరికాదన్నారు. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు పూర్తి భిన్నంగా వచ్చాయని వాటిని చూసి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సైతం వేర్వేరు ఫలితాలు వచ్చాయని, అంతకుముందు నిర్వహించిన ఉప ఎన్నికల ఫలితాల్లో ఇదే విషయం రుజువైందని చెప్పారు. ఈవీఎంల విశ్వసనీయతపై రాజకీయ పార్టీల ఆరోపణలపై అరోరా స్పందిచారు. ‘ఓటర్ల తర్వాత రాజకీయపార్టీలే కీలక భాగస్వామి. అయితే కొన్ని పొరపాట్ల కారణంగా పార్టీలన్ని ఇష్టారీతిన వ్యాఖ్యానిస్తున్నాయి. ఇది సరికాదు..’అని అన్నారు. అలాగే బ్యాలెట్ పేపర్ వైపు మరోసారి దేశం చూడాల్సిన అవసరం రాదని అరోరా పేర్కొన్నారు. -
ఫిబ్రవరిలో ‘లోక్‌సభ’ షెడ్యూల్?
న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) సునీల్ అరోరా నేతృత్వంలోని కమిషన్ వచ్చే వారంలో సమావేశం కానుంది. ఈ సందర్భంగా ఎన్నికల సామగ్రి లభ్యత, రవాణా తదితర అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకోనుంది. ఈ భారీ కార్యక్రమానికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల యంత్రాంగాల సన్నద్ధత, ఏర్పాట్లపై ఈసీ విస్తృత కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు 2019 ఫిబ్రవరి చివర్లో గానీ, మార్చి మొదటి వారంలో గానీ షెడ్యూల్ విడుదల చేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. పార్లమెంట్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది కాబట్టి, ఎన్నికల షెడ్యూల్‌ను ఇంకా ఖరారు చేయలేదని ఈసీ వర్గాలు అంటున్నాయి. స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగేందుకు అవసరమైన భద్రతా సిబ్బంది తరలింపు, మార్చి, ఏప్రిల్ నెలల్లో వచ్చే పండగలు, ఇతర ముఖ్యమైన రోజులను పరిగణనలోకి తీసుకుని పలు తేదీలను ఈసీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ 2014 మార్చి 5వ తేదీన విడుదల కాగా, ఎన్నికలు 9 విడతలుగా ఏప్రిల్ 7– మే 12వ తేదీల మధ్యలో జరిగాయి. ఈసారి ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఆ మేరకు మొదటి విడత ఎన్నిక ఏప్రిల్ 10వ తేదీ తర్వాత జరిగే అవకాశాలున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో పార్లమెంట్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బడ్జెట్ ద్వారా జూన్ 30వ తేదీ వరకు దాదాపు మూడు నెలలపాటు ప్రభుత్వ నిర్వహణ వ్యయానికి ఆమోదం లభిస్తుంది. ఎన్నికలు పూర్తయి, ఫలితాలు వెలువడ్డాక మే మూడో వారంలో లేదా కాస్త ముందుగా ఏర్పడే కొత్త ప్రభుత్వం 2019–20 ఆర్థిక సంవత్సరానికిగాను పూర్తి స్థాయి బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెడుతుంది. -
‘ఓటరు కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయాలి’
ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాతో వైఎస్సార్సీపీ అగ్రనేతలు గురువారం భేటీ అయ్యారు. ఏపీలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సర్వేల పేరుతో టీడీపీ కార్యకర్తలు గ్రామాల్లోకి వెళ్లి వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని కమిషనర్‌కు వివరించారు. ఓట్లు తొలగించబడిన ప్రతి ఒక్కరికీ ఓటు కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. ఓటర్ల జాబితాలో ఉన్న అన్ని తప్పులను క్షుణ్ణంగా పరిశీలించి సరిదిద్దాలని వినతి పత్రం సమర్పించారు. వైఎస్సార్సీపీ బృందంలో ఎంపీలు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నేతలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, వరప్రసాద్, మిథున్ రెడ్డి, తదితరులు ఉన్నారు. 35 లక్షలకు పైగా నకిలీ ఓట్లు: విజయసాయి రెడ్డి ఎన్నికల కమిషనర్‌ను కలిసిన అనంతరం విజయసాయి రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఏపీలో ఒకే వ్యక్తి పేరుతో నాలుగు, ఐదు ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. సుమారు 35 లక్షలకు పైగా నకిలీ ఓట్లు ఏపీలో ఉన్నాయని స్పష్టం చేశారు. మరో 18 లక్షల మందికి ఏపీ, తెలంగాణాలో రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని వివరించారు. ఓటర్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయాలని సూచించారు. ప్రజాప్రాతినిథ్య చట్టానికి సవరణలు తీసుకురావాలి లేదంటే ఆర్డినెన్స్ చేయాలని కోరారు. చంద్రబాబు ప్రతి నియోజకవర్గంలో దొంగ ఓట్లను నమోదు చేయించారని ఆరోపించారు. -
ఈసీ చీఫ్‌గా సునీల్ అరోరా
సాక్షి, న్యూఢిల్లీ : దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా సునీల్ అరోరా ఆదివారం పదవీ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అరోరాను సీఈసీగా నియమించారు. ఓపీ రావత్ పదవీ విరమణ చేయడంతో ఆయన స్ధానంలో అరోరా ఈసీ పగ్గాలు స్వీకరించారు. రానున్న సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ, హరియాణా, జమ్మూ కశ్మీర్, సిక్కిం, ఒడిషా, మహారాష్ట్ర, అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు అరోరా సారథ్యంలో జరగనున్నాయి. పదవీవిరమణ చేసిన ఐఏఎస్ అధికారి అయిన సునీల్ అరోరా గతంలో కేంద్ర సమాచార ప్రసార, నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖల కార్యదర్శిగా వ్యవహరించారు. ఆర్థిక, జౌళి మంత్రిత్వ శాఖతో పాటు ప్రణాళిక సంఘంలోనూ కీలక బాధ్యతల్లో అరోరా పనిచేశారు.1999-2002 మధ్య అరోరా పౌరవిమానయాన శాఖ సంయుక్త కార్యదర్శిగాను బాధ్యతలు నిర్వర్తించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా సునీల్ అరోరా ఆరేళ్ల పాటు కొనసాగుతారు. -
తదుపరి సీఈసీ సునీల్ అరోరా!
న్యూఢిల్లీ: తదుపరి ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)గా సునీల్ అరోరా నియమితులు కానున్నారు. ఆయన నియామకాన్ని కేంద్రం నిర్ధారించిందని, సంబంధిత ఫైల్ రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్లిందని న్యాయశాఖలోని విశ్వసనీయ వర్గాలు సోమవారం వెల్లడించాయి. ఈ నియామకానికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలిపాయి. ప్రస్తుత సీఈసీ ఓపీ రావత్ స్థానంలో డిసెంబర్ 2న ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశముందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల నిర్వహణను సీఈసీగా ఆయనే పర్యవేక్షిస్తారన్నారు. 2019లో లోక్‌సభ ఎన్నికలతో పాటు ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, హరియా ణా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరుగు తాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఆరేళ్లు, లేదా 65 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆ పదవిలో కొనసాగుతారు. 1980 బ్యాచ్ రాజస్తాన్ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన సునీల్ అరోరా ఎన్నికల కమిషనర్‌గా 2017, ఆగస్ట్ 31న నియమితులయ్యారు. అంతకుముందు సమాచార, నైపుణ్యాభివృద్ధి శాఖల్లో కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. ప్లానింగ్ కమిషన్‌లో, ఆర్థిక, టెక్స్టైల్ శాఖల్లో, ఇండియన్ ఎయిర్ లైన్స్ సీఎండీగా కీలక బాధ్యతలు నిర్వహించారు. -
బోగస్ ఓటర్లను తొలగించండి
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఓ రాజకీయ పార్టీకి సహకరించేందుకు వీలుగా ఎన్నికల అధికారులు లక్షలాది బోగస్ ఓటర్లను నమోదు చేశారని తెలంగాణ బీజేపీ నేతలు మంగళవారం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన పలు ఉదంతాలను ఫిర్యాదులో పేర్కొన్నారు. బోగస్ ఓటర్లను ఏరివేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరాను నేతలు కోరారు. బీజేపీ సెంట్రల్ కో ఆర్డినేటర్ నూనె బాలరాజు, బీజేవైఎం నేత పొన్న వెంకటరమణ తదితరులు కమిషనర్‌ను కలసిన వారిలో ఉన్నారు. -
కీలక నియామకాలు చేపట్టిన కేంద్రం
-
కీలక నియామకాలు చేపట్టిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ : కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్), ఎలక్షన్ కమిషనర్ పదవులకు కేంద్ర ప్రభుత్వం నియామకాలు చేపట్టింది. కాగ్ గా హోంశాఖ మాజీ కార్యదర్శి రాజీవ్ మెహర్షిని, ఎలక్షన్ కమిషనర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి సునీల్ అరోరాను, సీబీఎస్ఈ బోర్డు ఛైర్మన్‌గా అనితా కార్వాల్‌ను నియమించింది. హోంశాఖ కార్యదర్శిగా రెండేళ్లపాటు సేవలు అందించిన రాజీవ్ మెహర్షీ నేడు ఆ పదవీ కాలం ముగిసింది. దీంతో ఆయనకు కాగ్ గా సరికొత్త బాధ్యతలు అప్పగించారు. 1978 రాజస్థాన్ బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన మెహర్షీ 2015 ఆగస్ట్ 31 నుంచి హోంశాఖ కార్యదర్శిగా సేవలిందిస్తున్నారు. ఆయన గతంలో ఆర్థికశాఖ కార్యదర్శిగా, రాజస్థాన్ సీఎస్‌గా విధులు నిర్వహించారు. సెప్టెంబర్ 24న కాగ్‌గా పదవీ విరమణ చేయనున్న శశికాంత్ శర్మ అనంతరం మెహర్షీ బాధ్యతలు స్వీకరిస్తారు. 1980 బ్యాచ్, రాజస్థాన్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి.. కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ రిటైర్డ్ కార్యదర్శి సునీల్ అరోరా(61)ను ఎలక్షన్ కమిషనర్‌గా నియమించారు. ప్రసార భారతికి సలహాదారుడిగా, మినిస్ట్రి ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్కి కార్యదర్శిగా సేవలందించిన ఆరోరా త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. -
సునీల్ ఆరోరా నియామకంపై విమర్శలు
న్యూఢిల్లీ: ఎయిర్టెల్ మాజీ చైర్మన్, కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ రిటైర్డ్ కార్యదర్శి సునీల్ అరోరాను ప్రసార భారతి సలహాదారుగా కేంద్రం నియమించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కువ విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే నీరా రాడియా టేపుల కుంభకోణంలో ఆయన పేరు ఎక్కువగా వినిపించడమే కారణం. రతన్ టాటా, తరుణ్ దాస్‌లకు ఎయిర్‌లైన్స్ పరిశ్రమకు సంబంధించిన కావాల్సిన సమాచారాన్ని చేరవేసేందుకు నీరా రాడియాతో అరోరా మాట్లాడిన అంశాలు రాడియా టేపుల్లో రికార్డయి ఉన్నాయి. 1980వ బ్యాచ్, రాజస్థాన్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సునీల్ అరోరాను కేంద్ర ప్రభుత్వ ప్రసారాల సంస్థ ‘ప్రసార భారతి’కి సలహాదారుగా నియమించబోతున్నట్లుగా ముందుగానే వార్తలు వెలువడ్డాయి. ఆ వార్తలను నిజయం చేస్తూ ఇప్పుడు ఖరారు ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. అరోరాను ఎందుకు నియమించాల్సి వచ్చిందో పీఎంవో వివరణ ఇవ్వాలంటూ కొందరు డిమాండ్ చేయగా, దాదా, తమరంటే తమకెంతో గౌరవమని, అలాంటిప్పుడు ఆరోరా మళ్లీ సలహాదారుగా ఎలా తీసుకొచ్చారని మరి కొందరు ప్రశ్నించారు. ఇంతవరకు వచ్చిన వ్యక్తి ప్రసార భారతిలో ఎంతవరకైనా ఎదగగలరంటూ ఇంకొందరు వ్యాఖ్యానించారు.