
సునీల్ అరోరా
న్యూఢిల్లీ: తదుపరి ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)గా సునీల్ అరోరా నియమితులు కానున్నారు. ఆయన నియామకాన్ని కేంద్రం నిర్ధారించిందని, సంబంధిత ఫైల్ రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్లిందని న్యాయశాఖలోని విశ్వసనీయ వర్గాలు సోమవారం వెల్లడించాయి. ఈ నియామకానికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలిపాయి. ప్రస్తుత సీఈసీ ఓపీ రావత్ స్థానంలో డిసెంబర్ 2న ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశముందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల నిర్వహణను సీఈసీగా ఆయనే పర్యవేక్షిస్తారన్నారు.
2019లో లోక్‌సభ ఎన్నికలతో పాటు ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, హరియా ణా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరుగు తాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఆరేళ్లు, లేదా 65 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆ పదవిలో కొనసాగుతారు. 1980 బ్యాచ్ రాజస్తాన్ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన సునీల్ అరోరా ఎన్నికల కమిషనర్‌గా 2017, ఆగస్ట్ 31న నియమితులయ్యారు. అంతకుముందు సమాచార, నైపుణ్యాభివృద్ధి శాఖల్లో కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. ప్లానింగ్ కమిషన్‌లో, ఆర్థిక, టెక్స్‌టైల్ శాఖల్లో, ఇండియన్ ఎయిర్ లైన్స్ సీఎండీగా కీలక బాధ్యతలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment