chief election commissioner
-
CEC appointment hearing: వాయిదా కోరిన కేంద్రం.. సరికాదన్న పిటిషనర్ లాయర్
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానెల్‌పై విచారణను వాయిదా వేయాలని కేంద్రం కోరింది. అయితే దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అభ్యంతరం వ్యక్తం చేయగా.. ధర్మాసనం జోక్యం చేసుకుంది. ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానెల్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించడం, ఆ స్థానంలో ప్రత్యేక చట్టం ద్వారా కేంద్ర మంత్రిని కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిని జస్టిస్ సూర్యకాంత్,ఎన్ కోటీశ్వర్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం అత్యవసర విచారణ చేపట్టింది.అయితే విచారణ ప్రారంభమైన కాసేపటికే.. రాజ్యాంగ ధర్మాసనం ముందు తాను హాజరు కావాల్సి ఉందని చెబుతూ సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విచారణ వాయిదా వేయాలని కోరారు. అయితే ప్రతీ కేసు విచారణ వాయిదా కోరడం సరికాదని పిటిషనర్ అసోషియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫామ్స్ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎస్జీ కాకుంటే.. 17 మంది లా ఆఫీసర్లు ఉంటారని, అలాంటప్పుడు వాయిదా కోరడం సరికాదని అన్నారు. ఈ తరుణంలో ధర్మాసనం జోక్యం చేసుకుంది. సోలిసిటర్ జనరల్ ఎప్పుడు అందుబాటులో ఉంటారో చెప్పాలని ధర్మాసనం కోరింది.ఇదిలా ఉంటే.. ప్రతిపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న వేళ.. కొత్త సీఈసీగా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి(Chief Election Commissioner)గా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. జాతి నిర్మాణానికి తొలి అడుగు ఓటు అని, ఎన్నికల సంఘం ఎప్పుడూ ఓటర్లకు మద్ధతుగా నిలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. నూతన సీఈసీగా జ్ఞానేశ్వర్ ఎంపికపై విపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సీఈసీ ఎంపికపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుండగానే.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా లు అర్ధరాత్రి వేళ నిర్ణయం తీసుకోవడం సరికాదని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించడం తెలిసిందే.వివాదం ఏంటంటే..2023లో సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం కేంద్ర ఎన్నికల సంఘం నియామకాలపై స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అందులో సీఈసీ, ఈసీల ఎంపిక కోసం ఏర్పాటు చేసే ప్యానెల్లో భారత ప్రధాన న్యాయమూర్తిని చేర్చాలని పేర్కొంది. అంటే.. ప్రధానితో పాటు ప్రతిపక్ష నేత, సీజేఐ ఆ ప్యానెల్లో ఉండాలి. కేంద్రం కొత్త చట్టం చేసేంత వరకు ఈ విధానం పాటించాలని స్పష్టం చేసింది. అయితే కేంద్రం ఆ తీర్పును పట్టించుకోకుండా సీజేఐని మినహాయించింది. సీజేఐ బదులుగా కేంద్ర మంత్రిని చేర్చింది. ఈ మేరకు 2023లోనే ఓ కొత్త చట్టం(Chief Election Commissioner and Other Election Commissioners Act, 2023) తీసుకొచ్చింది. అయితే కొత్త చట్టం ప్రకారం నియామకాలు చేపడుతున్నట్లు కేంద్రం చెబుతున్నప్పటికీ.. ఈ చట్టం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉందని, ఈసీ నియామకాల్లో ప్రభుత్వ జోక్యం ఎక్కువయ్యేలా ఉందని, అన్నింటికి మంచి అది ప్రజా స్వామ్యానికి ప్రమాదమని చెబుతూ పలువురు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కాబట్టి సీజేఐనే కొనసాగించాలని కోరుతున్నారు. దీంతో సుప్రీం కోర్టు ఇవాళ ఈ అంశంపై అత్యవసర విచారణ జరపనుంది. ఇదిలా ఉంటే.. మార్చి 15, 2024 కొత్త చట్టం ప్రకారం కేంద్రం చేపట్టిన ఈసీ నియామకాలపై స్టే విధించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించడం విశేషం. అయినప్పటికీ ప్రతిపక్షాలు సహా కొన్ని సంస్థలు న్యాయ స్థానాలను ఆశ్రయిస్తూనే ఉన్నాయి. -
ప్రజాస్వామ్య దేవాలయమిది
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ప్రజాస్వామ్య దేవాలయంగా పరిఢవిల్లుతోందని మంగళవారం ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)గా పదవీ విరమణ చేసిన రాజీవ్ కుమార్ వ్యాఖ్యానించారు. 2022 మే 15వ తేదీన సీఈసీగా బాధ్యతలు చేపట్టి అత్యంత కీలకమైన లోక్‌సభ ఎన్నికలు, జమ్మూకశీ్మర్ అసెంబ్లీ ఎన్నికలుసహా పలు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను సీఈసీ హోదాలో సమర్థవంతంగా నిర్వహించిన రాజీవ్ మంగళవారం సాయంత్రం రిటైర్ అయ్యాక నిర్వాచన్ సదన్ కార్యాలయ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ‘‘ నా దృష్టిలో కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రజాస్వామ్య దేవాలయం.గత 75 ఏళ్లుగా ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ ప్రజాస్వామ్యాన్ని సమున్నత శిఖరాలపై నిలిపింది. తీరా ఎన్నికలప్పుడే ఎన్నికల ప్రక్రియపై పలు పార్టీలు, నేతలు అనుమానాలు వ్యక్తం చేయడమనేది కేవలం ఈసీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు, మొత్తం ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేసేందుకు వేసే ఎత్తుగడలు. ఎన్నికలకు సంబంధించి చాన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణ కోర్టులో ప్రత్యక్ష ప్రసారాలు కావడం కొన్నిసార్లు అపనమ్మకాలకు దారితీయొచ్చు’’ అని వ్యాఖ్యానించారు. ఆర్థికభారం కావొద్దు ‘‘అనుచిత ఉచిత వాగ్దానాలు, స్థాయికి మించిన వాగ్దానాలు చేస్తున్న రాజకీయ పార్టీల పట్ల ఈసీ ఎప్పటికప్పుడు అప్రమత్త ధోరణితో వ్యవహరించాలి. కేంద్ర, రాష్ట్రాలకు ఆర్థికభారం కాకుండా ఉచిత పథకాలు, హామీలు ఇస్తే మంచిది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ఇంతకు మించి మాట్లాడను’’అని ఆయన అన్నారు. ‘‘ ఎగ్జిట్ పోల్స్ అనేవి అంచనాలను అమాంతం పెంచేసి వాస్తవ పరిస్థితుల నుంచి ఓటర్లను దూరంగా తీసుకెళ్తాయి. ఈ విషయంలో మీడియా మరీముఖ్యంగా ఎల్రక్టానిక్ మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఎగ్జిట్ పోల్స్‌పై మాకు పూర్తి అజమాయిషి, నియంత్రణ లేదు.అందుకే ఈ ఎగ్జిట్ పోల్స్ చేపట్టే సంస్థలే స్వీయనియంత్రణ కల్గిఉండాలి. సర్వేకు శాంపిల్ సైజు ఎంత? అసలు ఎంత విస్తృత స్థాయిలో సర్వే చేశారు?. సర్వే ఫలితాలు వాస్తవ ఫలితాలను ఏ మేరకు ప్రతిబింబిస్తాయి?. అనేవి చూసుకోవాలి’’ అని రాజీవ్ అన్నారు. ‘‘ కొత్త సారథి నాయకత్వంలో ఈసీ మరింతగా సమర్థవంతంగా ఎన్నికలు చేపట్టాలని ఆశిస్తున్నా. భారతీయ ప్రజాస్వామ్యం పటిష్టతకు ఓటర్లు, రాజకీయపార్టీలు తమ వంతు కృషిచేయాలి.ఈ బాధ్యతలను భుజాలకెత్తుకున్న ఓటర్లందరికీ నా శుభాకాంక్షలు’’ అని అన్నారు. 2020 ఏప్రిల్–ఆగస్ట్ కాలంలో పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ చైర్మన్‌గా ఉన్న రాజీవ్ అదే ఏడాది సెపె్టంబర్ ఒకటిన ఎలక్షన్ కమిషనర్‌గా ఈసీలో చేరారు. 2022 మే 15న 25వ సీఈసీగా బాధ్యతలు చేపట్టారు. సీఈసీగా ఆయన అన్ని రకాల ఎన్నికలను నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలు, 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, రాజ్యసభ ఎన్నికలు సమర్థవంతంగా చేపట్టారు.నేడే సీఈసీగా జ్ఞానేశ్ బాధ్యతల స్వీకరణకేంద్ర ఎన్నికల సంఘానికి నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. 2024 జనవరిలో కేంద్ర సహకార మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా రిటైర్ అయిన జ్ఞానేశ్ ఆ తర్వాత రెండు నెలలకే కేంద్ర ఎన్నికల సంఘంలో ఎలక్షన్ కమిషనర్‌గా కొత్త పాత్రలో కొలువుదీరారు. ఈసీ సభ్యుల నియామకానికి సంబంధించి మోదీ సర్కార్ తీసుకొచ్చిన కొత్త చట్టం అమల్లోకి వచ్చాక సీఈసీగా బాధ్యతలు చేపడుతున్న తొలి వ్యక్తి జ్ఞానేశ్ కావడం విశేషం. కేంద్ర సహకార మంత్రి అమిత్ షాకు అత్యంత ఆప్తునిగా పేరొందారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని అమలుచేయడంలో జ్ఞానేశ్ కీలకపాత్ర పోషించారు. సీఈసీగా జ్ఞానేశ్ 2029 జనవరి 27వ తేదీన రిటైర్ అవుతారు. -
‘కొత్త ‘సీఈసీ’ నియామకం రాజ్యాంగ విరుద్ధం’
న్యూఢిల్లీ:నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ నియామక ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు పార్టీ ముఖ్య నేత ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు పెట్టారు. ‘సీఈసీగా జ్ఞానేష్‌కుమార్ నియామక నిర్ణయం తొందరపడి చేశారు. సీఈసీ నియామక ప్యానెల్లో సుప్రీంకోర్టు ప్రాతినిథ్యం లేకుండా ఉండేందుకే కేంద్ర ప్రభుత్వం తొందరపడి ఈ నియామకం చేపట్టింది.ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. సీఈసీ నియామక ప్యానెల్ నుంచి సీజేఐని తొలగించడంపై బుధవారం(ఫిబ్రవరి)19 సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈలోపే కొత్త సీఈసీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. సుప్రీంకోర్టు పరిశీలన లేకుండా సీఈసీని నియమించాలనే తొందరపాటు కేంద్ర ప్రభుత్వ చర్యలో కనిపిస్తోంది.ఎన్నికల ప్రక్రియను బీజేపీ ఎంత నాశనం చేస్తోందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి చర్యల వల్ల నకిలీ ఓటర్ల జాబితా, బీజేపీ అనుకూల ఎన్నికల షెడ్యూల్,ఈవీఎంల ట్యాంపరింగ్‌పై అనుమానాలు బలపడతాయి’అని కేసీ వేణుగోపాల్ తన పోస్టులో పేర్కొన్నారు. కాగా, కొత్త సీఈసీగా జ్ఞానేష్‌కుమార్ సోమవారమే నియమితులైన విషయం తెలిసిందే. -
టోటలైజర్ విధానం తేవాలి
న్యూఢిల్లీ: ఓటరు గోప్యతను కాపాడేందుకు టోటలైజర్ విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని పదవీ విరమణ చేస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ చెప్పారు. దీనివల్ల, బూత్‌ల వారీ ఓటింగ్ సరళిని బయటకు తెలియదని చెప్పారు. ప్రవాస భారతీయులు స్థానికంగానే ఓటు హక్కు వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించాల్సిన సమయం వచ్చిందన్నారు. ఎన్నికల సమయంలో కమిషన్‌పై తప్పుదోవ పట్టించే ఆరోపణల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ నెల 18వ తేదీన పదవీ విరమణ చేయనున్న సీఈసీ రాజీవ్ కుమార్ సోమవారం జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో మాట్లాడారు. ‘ప్రస్తుతం ప్రతి ఈవీఎం నుంచి పోలైన ఓట్లను సేకరిస్తున్నాం. ఇందులో ఒక్కో అభ్యర్థికీ పడిన ఓట్లను కలిపి ఫలితాలను ప్రకటిస్తున్నాం. ఇందులో లోపమేమంటే..ఏ ప్రాంతం నుంచి తమకు ఎన్ని ఓట్లు పడ్డాయనే వివరాలు అభ్యర్థులకు తెలిసిపోతాయి. ఎన్నికల అనంతర హింసకు ఇదే కారణంగా మారుతోంది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఓటర్లను వేధించడం, అభివృద్ధి కార్యక్రమాల నుంచి వారిని దూరంగా పెట్టడం వంటి చర్యలకు దిగుతున్నారు’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘దీనిని నివారించడానికి టోటలైజర్ విధానాన్ని తేవాలి. దీనిని ఇప్పటికే ఎన్నికల సంఘం అభివృద్ధి పరిచింది. ఇందులో భాగంగా అభ్యర్థులకు పోలింగ్ బూ త్ల వారీగా పడిన ఓట్లను వెల్లడించబోరు. రాజకీ య ఏకాభిప్రాయంతో ఈ విధానాన్ని అమ ల్లోకి తేవాలి. ఓటరు గోప్యతను కాపాడేందుకు, ఓటింగ్ ప్రక్రియ సమగ్రతను పెంచేందుకు ఇది ఎంతో అవసరమని నమ్ముతున్నా’అని ఆయన అన్నారు. రిమోట్ ఓటింగ్ విధానం రావాలికోట్లాది మంది వలస కార్మికులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు రిమోట్ ఓటింగ్ విధానాన్ని తప్పనిసరిగా అందుబాటులోకి తేవాలన్నారు. దొంగ ఓట్లు, ఒకే వ్యక్తి పలుమార్లు ఓటేసే వ్యవహారాలను సమర్థంగా అడ్డుకునేందుకు పోలింగ్ బూత్‌లలో బయోమెట్రిక్ ధ్రువీకరణను ప్రవేశపెట్టాలని సూచించారు. రాజకీయ పార్టీలు నిధులు, ఖర్చు వివరాలను ఆన్లైన్లో వెల్లడించే ప్రక్రియ మొదలైందన్నారు. ఆర్థిక పారదర్శకత, విశ్లేషణల కోసం ఈ ప్రక్రియను తప్పనిసరి చేయాలని సూచించారు. ఆరోపణలు ఆందోళనకరంఓటర్లు ఉత్సాహంగా, పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న చోట కూడా ఫలితాల అనంతరం రాజకీయ పార్టీలు ఈసీ, అధికారులపై సందేహాలను వ్యక్తం చేయడం ఖండించాల్సిన అంశమని రాజీవ్ కుమార్ చెప్పారు. ‘పోలింగ్ లేదా కౌంటింగ్ ముమ్మరంగా జరుగుతున్న వేళ తప్పుడు ఆరోపణలు, వదంతులు మీడియాతోపాటు సామాజిక మాధ్యమ వేదికలపై ఒక్కసారిగా వ్యాప్తి చెందుతున్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించడం, వారిని అయోమయానికి గురి చేయడమే వీటి లక్ష్యం. అయితే, ఎన్నికల సమగ్రతను కాపాడటం, ప్రశాంతంగా ఎన్నికలు జరపడాన్నే లక్ష్యంగా పెట్టుకున్న ఈసీ ఇటువంటి వాటిని పట్టించుకోలేదు’అని అన్నారు. ఎన్నికల ఫలితాలను జీర్ణించుకోలేని వారు ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేసే ధోరణులు పెరుగుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవస్థలపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేసే వారిని ప్రజలు నమ్మబోరని ఆయన వ్యాఖ్యానించారు. ఇటువంటి అంశాలపై ఎన్నికల కమిషన్ సంయమనం పాటిస్తోందన్నారు. ఎన్నికల కమిషన్ అధికార బీజేపీకి కొమ్ముకాస్తోందని, ఓటింగ్‌లో అవకతవకలపై తాము చేసే ఫిర్యాదులను పట్టించుకోవడం లేదంటూ ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. నియంత్రణలు లేని సోషల్ మీడియా విశ్లేషణలు, అంచనాలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియకు తీవ్ర ప్రమాదకరంగా మారాయంటూ రాజీవ్‌కుమార్.. ఇవి చేసే నిరాధార, ఉద్దేశపూర్వక విమర్శలను ఎదుర్కోవడానికి ఎన్నికల సంఘం సామర్థ్యాలను పెంపొందించుకోవాలని నొక్కి చెప్పారు. -
నూతన సీఈసీగా జ్ఞానేశ్ కుమార్
సాక్షి, న్యూఢిల్లీ: నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)గా జ్ఞానేశ్ కుమార్(61) పేరును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఖరారు చేసింది. కమిటీ సోమవారం సాయంత్రం ఢిల్లీలోని సౌత్‌బ్లాక్‌లో సమావేశమైంది. మోదీతోపాటు కమిటీలో సభ్యులైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పాల్గొన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రాం మేఘ్వాల్ నేతృత్వంలోని సెర్చ్ కమిటీ ప్రతిపాదించిన ఐదుగురు అభ్యర్థుల జాబితా నుంచి జ్ఞానేశ్ కుమార్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఎంపిక చేశారు. కొత్త సీఈసీ పేరును సెలక్షన్ కమిటీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సిఫార్సు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. నూతన సీఈసీ నియామకంపై రాష్ట్రపతి సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 26వ సీఈసీగా జ్ఞానేశ్ కుమార్ ఎంపికైనట్లు కేంద్ర న్యాయ శాఖ ప్రకటించింది. ఆయన ఈ నెల 19న బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించింది. సీఈసీగా జ్ఞానేశ్ కుమార్ పదవీ కాలం 2029 జనవరి 26 దాకా ఉంది. అలాగే ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్ స్థానంలో హరియాణా కేడర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ వివేక్ జోషి నియమితులయ్యారు. కొత్తం చట్టం కింద తొలి సీఈసీ 1988 బ్యాచ్ కేరళక్యాడర్ ఐఏఎస్ అధికారి అయిన జ్ఞానేశ్ కుమార్ ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఐఐటీ–కాన్పూర్‌లో సివిల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తిచేశారు. ఇక్ఫాయ్ యూనివర్సిటీలో బిజినెస్ ఫైనాన్స్ చదివారు. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ అభ్యసించారు. కేరళలో ఐఏఎస్ అధికారిగా వివిధ హోదాల్లో సేవలందించారు. కేంద్ర సరీ్వసుల్లో చేరి, రక్షణ శాఖలో జాయింట్ సెక్రెటరీగా సేవలందించారు. హోంశాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేశారు. కేంద్ర ఎన్నికల సంఘం సభ్యుల నియామకంపై కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నియమితులైన తొలి సీఈసీ జ్ఞానేశ్ కుమార్. ఆయన ఆధ్వర్యంలోనే బిహార్, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆయన 2024 మార్చి 15న ఎన్నికల సంఘం కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. కేంద్ర హోంశాఖలో పని చేస్తున్నప్పుడు ఆరి్టకల్ 370 రద్దుకు సంబంధించిన బిల్లు రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు. అయోధ్య రామమందిరానికి సంబంధించి సుప్రీంకోర్టు కేసులో కేంద్రానికి సహకరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు జ్ఞానేశ్ కుమార్ సన్నిహితుడిగా పేరుంది. సమావేశం వాయిదా వేయాలన్న కాంగ్రెస్ సెలక్షన్ కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాలని కాంగ్రెస్ పార్టీ తొలుత డిమాండ్ చేసింది. సెలక్షన్ కమిటీ ఏర్పాటుపై ఈ నెల 19వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉందని వెల్లడించింది. కోర్టులో విచారణ పూర్తయ్యేదాకా కమిటీ సమావేశం నిర్వహించవద్దని కోరింది. సెలక్షన్ కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించి, కేంద్ర మంత్రిని నియమించడం పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత అభిõÙక్ మనూ సింఘ్వీ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఎన్నికల సంఘాన్ని చెప్పుచేతల్లో ఉంచుకోవడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తోందని విమర్శించారు. ఎన్నికల సంఘం విశ్వసనీయతను దెబ్బతీయడం తగదని సూచించారు. -
కొత్త సీఈసీగా జ్ఞానేశ్ కుమార్?
ఢిల్లీ: భారత ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఫిబ్రవరి 18న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో కొత్త ఎన్నికల కమిషనర్ ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. కాగా, నూతన సీఈసీని ఎన్నుకునేందుకు ఫిబ్రవరి 17న ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ భేటీ కానుంది. ఈ కమిటీలో ప్రధాని మోదీ, కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘల్, ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సభ్యులుగా ఉన్నారు.ఈ కమిటీ సభ్యులు కొత్త సీఈసీని ఎంపిక చేయనున్నారు. నూతన సీఈసీగా జ్ఞానేశ్ కుమార్‌ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న జ్ఞానేశ్ కుమార్.. కేరళ కేడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. కాగా, మంగళవారం రిటైర్డ్ కానున్న రాజీవ్ కుమార్ సీఈసీగా మే 15, 2022న బాధ్యతలు స్వీకరించారు. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సహా అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలోనే జరిగాయి.ఎన్నికల కమిషనర్.. బీజేపీకి అనుకూలంగా పని చేస్తున్నారంటూ రాజీవ్ కుమార్‌పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఈ ఎన్నికలు కొత్త సీఈసీ ఆధ్వర్యంలోనే జరగనున్నాయి.ఇదీ చదవండి: ఢిల్లీ సీఎం ఎంపికలో సర్ప్రైజింగ్ నిర్ణయం! -
సీఈసీ రాజకీయాలు చేస్తున్నారు
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ రాజకీయాలు చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. యమునా నదిని హరియాణాప్రభుత్వం విషపూరితం చేస్తోందంటూ తాను చేసిన వ్యాఖ్యలకు గాను ఎన్నికల సంఘం నోటీసు ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తంచేశారు. కేజ్రీవాల్ గురువారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సంఘం విశ్వసనీయతను రాజీవ్ కుమార్ దెబ్బతీస్తున్నారని, పదవీ విరమణ తర్వాత పెద్ద హోదాను కోరుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల సంఘానికి రాజీవ్ కుమార్ కలిగిస్తున్న నష్టం గతంలో ఎవరూ కలిగించలేదని ఆక్షేపించారు. రాజకీయాలపై ఆసక్తి ఉంటే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయనకు సూచించారు. తాను బతికి ఉన్నంత వరకూ ఢిల్లీ ప్రజలను విషపూరిత జలాలు తాగనివ్వనని కేజ్రీవాల్ తేల్చిచెప్పారు. రెండు రోజుల్లో తనను అరెస్టు చేస్తారని తెలుసని, అయినప్పటికీ భయపడబోనని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ చేతులు కలిపాయని, ఢిల్లీ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయని మండిపడ్డారు. హరియాణా ముఖ్యమంత్రి నాయబ్‌సింగ్ సైనీపై కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. యుమునా నది నీరు తాగకపోయినా తాగినట్లు ఆయన డ్రామాలాడుతున్నారని విమర్శించారు. యమునా నది నీటిలో విష రసాయనాలు కలవకుండా చర్యలు తీసుకోవాలని తమ ముఖ్యమంత్రి అతిశీ కోరితే సైనీ పట్టించుకోలేదని ఆక్షేపించారు. యమునా నీటిని సీసాల్లో నింపి బీజేపీ, కాంగ్రెస్ పెద్దలకు ఇస్తామని, వారు ఆ నీటిని తాగితే... తాము చేసిన ఆరోపణలన్నీ తప్పు అని ఒప్పుకుంటామని చెప్పారు. తన సవాలును అమిత్ షా, నాయబ్‌సింగ్ సైనీ, రాహుల్ గాంధీ స్వీకరించాలని డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ స్పష్టమైన వివరణ ఇవ్వాలి: ఈసీ యమునా నదిలో అమ్మోనియం స్థాయి పెరగడాన్ని విషంతో ముడిపెట్టొద్దని అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్నికల సంఘం సూచించింది. యమునా నది నీటి విషయంలో కేజ్రీవాల్ ఇచి్చన వివరణపై ఎన్నికల సంఘం సంతృప్తి చెందలేదు. హరియాణా ప్రభుత్వంపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఏమిటో చెప్పాలని, అందుకు మరో అవకాశం ఇస్తున్నామని స్పష్టంచేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘం గురువారం కేజ్రీవాల్‌కు లేఖ రాసింది. బుధవారం ఇచ్చిన వివరణలో స్పష్టత లేదని పేర్కొంది. శుక్రవారం ఉదయం 11 గంటల కల్లా పూర్తిస్థాయిలో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అందులో అన్ని అంశాలు ఉండాలని పేర్కొంది. తమ ఎదుట హాజరు కాకపోతే తగిన చర్యలు తీసుకోక తప్పదని తేల్చిచెప్పింది. ఎన్నికల సంఘం నుంచి లేఖ వచ్చిన తర్వాత కేజ్రీవాల్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి, సీఈసీ రాజీవ్ కుమార్‌పై ఆరోపణలు గుప్పించారు. -
రాష్ట్రపతి ముర్ముతో ఈసీ భేటీ
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్, ఇద్దరు ఎన్నికల కమిషనర్లతో కలిసి గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో భేటీ అయ్యారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో సీఈసీ రాజీవ్ కుమార్, కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్ సింగ్‌లు రాష్ట్రపతి ముర్మును కలిశారని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజాప్రాతినిధ్య చట్టం–1951లోని సెక్షన్ 73ను అనుసరించి సార్వత్రిక ఎన్నికల్లో 18వ లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికైన, నామినేట్ అయిన సభ్యుల వివరాలతో కూడిన ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ప్రతిని ఆమెకు అందజేశారని వివరించింది. -
EC: ఓటర్లకు వందనం
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో మొత్తంగా 64.2 కోట్ల మంది భారతీయ పౌరులు ఓటు హక్కును వినియోగించుకుని నూతన ప్రపంచ రికార్డును సృష్టించారని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ ప్రకటించారు. దేశ చరిత్రలో తొలిసారి ఓట్ల లెక్కింపునకు ముందు తోటి కమిషనర్లతో సహా సీఈసీ సోమవారం ఢిల్లీలో పత్రికాసమావేశం ఏర్పాటుచేసి పలు అంశాలపై మాట్లాడారు. జీ7 దేశాల ఓటర్ల కంటే 1.5 రెట్లు ఎక్కువ ‘‘ 31.2 కోట్ల మంది మహిళలుసహా 64.2 కోట్ల మంది ఓటేశారు. ఈ సంఖ్య జీ7 దేశాల ఓటర్ల కంటే 1.5 రెట్లు ఎక్కువ. 27 యురోపియన్‌యూనియన్ దేశాల ఓటర్ల కంటే 2.5 రెట్లు ఎక్కువ. ఈ ఎన్నికల్లో పాల్గొన్న ఓటర్లందరికీ అభినందనలు’’ అంటూ సీఈసీ వేదికపై లేచి నిలబడి ఓటర్లకు అభినందనలు తెలిపారు. ‘‘ఎన్నికల సిబ్బంది జాగ్రత్త, అప్రమత్తత వల్లే తక్కువ చోట్ల మాత్రమే రీపోలింగ్ చేపట్టాల్సి వచి్చంది. 2019లో 540 చోట్ల రీపోలింగ్ జరిగితే ఈసారి 39 మాత్రమే జరిగాయి’’ అని పేర్కొన్నారు. మా గురించి మాట్లాడుకోరు ‘ 1.5 కోట్ల పోలింగ్, భద్రతా సిబ్బంది పోలింగ్ పర్వంలో పాల్గొన్నారు. 4 లక్షల వాహనాలను వినియోగించాం. 135 ప్రత్యేక రైళ్లలో సిబ్బంది, బలగాలను తరలించాం. 1,692 సార్లు హెలికాప్టర్లను వాడాం. కరెన్సీ కట్టలు, ఉచిత తాయిలాలుగా పంపిణీచేస్తున్న వస్తువులు, మద్యం, మత్తుపదార్థాలు సహా రూ.10,000 కోట్లు సీజ్‌చేశాం. ఇంత చేస్తే ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధూల జాడ లేదంటూ ‘లాపతా జెంటిల్మెన్’ అని మీమ్స్ వేస్తున్నారు. మేం ఎక్కడికీ పోలేదు. మీ ముందే ఉన్నాంకదా. ఎప్పుడూలేనంతగా ఎన్నికలవేళ 100 పత్రికా ప్రకటనలు, అడ్వైజరీలతో అందర్నీ చైతన్యపరిచాం. మమ్మల్ని చూశాకైనా ‘లా పతా జెంటిల్మెన్ ఆర్ బ్యాక్’ అని మీమ్స్ మారుస్తారేమో. విరబూసిన పువ్వులనే చూస్తారుగానీ తోటమాలిని ఎవరూ పట్టించుకోరు. ప్రజాస్వామ్యంలో గెలుపుఓటములనే అందరూ పట్టించుకుంటారుగానీ సమర్థవంతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించిన మా గురించి ఎవరూ మాట్లాడుకోరు’’ అని అన్నారు. దమ్ముంటే నిరూపించండి ‘‘ ఎన్నికలను విదేశీ శక్తులు ప్రభావితం చేసే ప్రమాదముందని, వాటిని అడ్డుకునేందుకు మేం ఎప్పుడో సిద్ధమయ్యాం. తీరాచూస్తే ఇక్కడి విపక్షాలే అనవసర ఆరోపణలు చేస్తున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రభావితం చేయనున్నారని రిటర్నింగ్ అధికారులపై విపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయి. దమ్ముంటే మీ ఆరోపణలను సాక్ష్యాధారాలతో నిరూపించండి. పుకార్లు వ్యాపించజేసి అనుమాన మేఘాలు కమ్ముకునేలా చేయకండి. రిటరి్నంగ్ అధికారులుగా పనిచేసే జిల్లా మేజి్రస్టేట్, కలెక్టర్లపై మీరు చేస్తున్న ఆరోపణలను నిరూపిస్తే కౌంటింగ్‌కు ముందే వారిపై కఠిన చర్యలకు మేం సిద్ధం’ అని అన్నారు. ఎన్నికల తర్వాత హింసనూ అడ్డుకుంటాం ‘‘ ఎన్నికల కోడ్ ముగిసినా సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలు కొనసాగుతాయి. ఫలితాలు వచ్చాక ఎన్నికల తర్వాత హింసను అడ్డుకునే లక్ష్యంగా తొలిసారిగా ఈ పద్ధతిని అమలుచేస్తున్నాం. ఎన్నికల వేళ ఘర్షణ ఘటనలు చోటుచేసుకున్న పశి్చమబెంగాల్, మణిపూర్, ఆంధ్రప్రదేశ్‌సహా పలు రాష్ట్రాల్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మొహరిస్తాం. రాష్ట్రాలు, కేంద్ర పరిశీలకుల సూచనలు, సలహాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం. ఏపీ, బెంగాల్‌లలో ఓట్ల లెక్కింపు తర్వాత 15 రోజులపాటు, యూపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌లో రెండు రోజులపాటు బలగాలు కొనసాగుతాయి’’ అని సీఈసీ వివరించారు. జమ్మూకశ్మీర్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి జమ్మూకశీ్మర్‌లో నాలుగు దశాబ్దాల చరిత్రలో తొలిసారిగా గరిష్టంగా 58.58 శాతం పోలింగ్ నమోదైంది. కశీ్మర్ లోయలో గరిష్టంగా 51.05 శాతం రికార్డయింది. సెపె్టంబర్ 30లోపు జమ్మూకశీ్మర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశించింది. అందుకే అక్కడ త్వరలోనే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ బాధ్యతలు తలకెత్తుకుంటాం. ఇవి నిజంగా అత్యంత సంతృప్తికరమైన క్షణాలు అని అన్నారు. -
ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
ఎన్టీఆర్, సాక్షి: రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి(AP CEO) ఎంకే మీనా అన్నారు. గురువారం సాయంత్రం పోలింగ్ ఏర్పాట్లపై ఈసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.నామినేషన్ల ఉప సంహరణ తర్వాత తుది అభ్యర్థుల జాబితా సిద్ధం అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,13,33,702 ఓటర్లు ఉన్నారు. గతంతో పోలిస్తే 5,94,631 మంది ఓటర్లు పెరిగారు. వీరిలో పురుషులు 2,02,74,144 మంది. మహిళా ఓటర్లు 2,10,56,137 మంది. అదనంగా సర్వీస్ ఓటర్లు 68,185 మంది ఉన్నారు. ఇక రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ కోసం 46,389 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశాం అని తెలిపారాయన.ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా.. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఇప్పటిదాకా 864 ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. సీ విజిల్ యాప్‌కి 16,345 ఫిర్యాదులు వచ్చాయి. కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. ఇద్దరు మృతి చెందగా..156 మందికి గాయాలు అయ్యాయి. ఇప్పటి వరకు రూ.203 కోట్ల విలువైన నగదు, మద్యం సీజ్ చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 29,897 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ అంటే.. దాదాపు 64% పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ చేయబోతున్నాం. అలాగే రాష్ట్రంలోని 14 నియోజక వర్గాల్లో 100శాతం వెబ్ కాస్టింగ్ చేయాలని నిర్ణయించాం. మాచర్ల, పెదకూరపాడు ఒంగోలు, అల్లగడ్డ్ , తిరుపతి, చంద్రగిరి, విజయవాడ సెంట్రల్, పుంగనూరు, పలమనేరు, పీలేరు, రాయచోటి, తంబళ్ళపల్లి ల్లలో వంద శాతం వెబ్ కాస్టింగ్ చేస్తున్నాం. పెరిగిన అభ్యర్థుల కారణంగా అదనం గా 15 వేల బ్యాలెట్ యూనిట్ లు అవసరం అయ్యాయి. వీటిని తెప్పించి జిల్లాకు పంపించాం.ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అందుకే పోలింగ్ కేంద్రాల వద్ద నీడ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే.. మెడికల్ కిట్లు ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 28 వేల మంది హోమ్ ఓటింగ్ కు సమ్మతి తెలిపారు. ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హోమ్ ఓటింగ్ మొదలు పెట్టాం.జనసేన పోటీ చేస్తున్న లోక్ సభ, శాసన సభ నియోజకవర్గాల పరిధుల్లో ఎవరికీ గ్లాస్ గుర్తు కేటాయించలేదు. ఇప్పటికే కేటాయించిన 7 లోక్ సభ, 8 శాసన సభ నియోజక వర్గాల్లో గుర్తు ను మార్పు చేసి ఇతర అభ్యర్థులకు ఇచ్చాం అని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా తెలిపారు. -
తెలుగు తేజం రమాదేవి...
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా 25 మంది చీఫ్ ఎలక్షన్ కమిషనర్లుగా పనిచేశారు. వీరిలో ఒకే ఒక్క మహిళ ఉన్నారు! ఆమె తెలుగువారు కావడం విశేషం. ఆమే వి.ఎస్.రమాదేవి. అయితే ఆమె కేవలం 16 రోజులే ఆ పదవిలో కొనసాగారు. ఏలూరు జిల్లా చేబ్రోలుకు చెందిన రమాదేవి సివిల్ సర్వెంట్‌గా కేంద్రంలో పలు శాఖల్లో పని చేసి సత్తా చాటారు. కేంద్ర న్యాయ శాఖ స్పెషల్ సెక్రటరీగా, లా కమిషన్ మెంబర్ సెక్రటరీగా, రాజ్యసభ సెక్రటరీ జనరల్‌గా పలు హోదాల్లో పని చేశారు. అనంతరం 1990 నవంబర్ 26న 9వ సీఈసీగా బాధ్యతలు చేపట్టారు. 16 రోజుల అనంతరం డిసెంబర్ 11న రిటైరయ్యారు. ఆమెకు ముందు గానీ, తర్వాత గానీ మరో మహిళ సీఈసీ కాలేదు. అలా ఏకైక మహిళా సీఈసీగా రమాదేవి రికార్డు నెలకొల్పారు. పదవీ విరమణ తర్వాత ఆమె హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక గవర్నర్‌గా చేశారు. కర్ణాటకకు తొలి మహిళా గవర్నర్ కూడా రికార్డు నెలకొల్పారు. ► కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా అత్యధిక కాలం పదవిలో ఉన్న రికార్డు రెండో సీఈసీ కె.వి.కె.సుందరానిది. ఆయన 8 ఏళ్ల 284 రోజులు పదవిలో కొనసాగారు. ► ఆ తర్వాతి స్థానంలో తొలి సీఈసీ సుకుమార్ సేన్ ఉన్నారు. ఆయన 8 ఏళ్ల 273 రోజులు పదవిలో ఉన్నారు. -
‘సీఈసీ’ రాజీవ్‌కుమార్‌కు జెడ్ కేటగిరీ భద్రత.. కారణమిదే..
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్‌కు కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించింది. ఎన్నికల వేళ ఆయనకు సంఘ విద్రోహ శక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉందన్న ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక ఆధారంగానే భద్రత పెంచినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జెడ్ సెక్యూరిటీ భద్రతలో భాగంగా రాజీవ్ కుమార్ (సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్) సీఆర్పీఎఫ్ కమాండోల రక్షణలో 24 గంటలు ఉండనున్నారు. 40నుంచి45 మంది సీఆర్పీఎఫ్ కమాండోలు ఎల్లప్పడూ ఆయనకు భద్రత కల్పిస్తారని హోం మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి.. మా అబ్బాయి ఓడిపోవాలి.. మాజీ కేంద్ర మంత్రి -
సీఈసీ, ఈసీల నియామక చట్టంపై స్టే ఇవ్వలేం: సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ: ‘ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల (అపాయింట్మెంట్, కండీషన్స్ ఆఫ్ సరీ్వస్, టర్మ్స్ ఆఫ్ ఆఫీస్) చట్టం–2023’పై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సీఈసీ, ఈసీల నియామకానికి సంబంధించిన సెలక్షన్ కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత జయ ఠాకూర్, ఇటీవల ఇద్దరు నూతన ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ఇతర పిటిషన్లను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారించింది. పిటిషనర్లలో ఒకరి తరఫున సీనియర్ లాయర్ వికాస్ సింగ్ వాదనలు వినిపించారు. ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సీజేఐలతో కూడిన కమిటీ సిఫార్సుల మేరకు సీఈసీ, ఇతర కమిషనర్ల నియామకాలు చేపట్టాలని అనూప్ బరన్వాల్ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచి్చందని గుర్తుచేశారు. కొత్త చట్టంపై స్టే విధించాల్సిందేనని అసోసియేషన్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ప్రభుత్వ పాలనాయంత్రాంగం కింద పని చేస్తోందని ఆరోపించారు. అయితే, ఎన్నికల సంఘం స్వతంత్ర సంస్థ అని, పాలనాయంత్రాంగం కింద పనిచేస్తోందని అనడం సరికాదని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యా నించారు. ‘‘ఇద్దరు నూతన ఎన్నికల కమిషనర్లు ఇప్పటికే నియమితులయ్యారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. నియమితులైన ఇద్దరు కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్సింగ్ సంధూపై ఎలాంటి ఆరోపణలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో చట్టంపై మధ్యంతర ఉత్తర్వు ద్వారా స్టే విధించడం గందరగోళానికి దారి తీస్తుంది. అలాగే వారి నియామకాన్ని నిలిపివేయలేం’’ అని జస్టిస్ సంజీవ్ ఖన్నా తేల్చిచెప్పారు. నూతన చట్టం ప్రకారం ఎంపికైన ఇద్దరు కమిషనర్ల నియామకంపై స్టే ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరింది. అయితే, ఈ చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన ప్రధాన పిటిషన్లను పరిశీలిస్తామని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా స్పందించాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఆగస్టు 5 తేదీకి వాయిదా వేసింది. -
సీఈసీ, ఈసీల నియామక చట్టంపై 15న సుప్రీం అత్యవసర విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్య ఎన్నికల కమిషనర్(సీఈసీ), ఎన్నికల కమిషనర్ల(ఈసీలు) నియామకం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచి్చన నూతన చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఈ నెల 15వ తేదీన విచారణ చేపడతామని సుప్రీంకోర్టు బుధవారం వెల్లడించింది. సీఈసీ, ఈసీ నియామకం కోసం ఉద్దేశించి ప్యానెల్ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కేంద్రం తప్పించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స(ఏడీఆర్) అనే ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని ఏడీఆర్ విజ్ఞప్తి చేసింది. ‘చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఆదర్ ఎలక్షన్ కమిషనర్స్ యాక్ట్– 2023’లోని సెక్షన్ 7 అమలుపై స్టే విధించాలని కోరింది. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం స్పందించింది. శుక్రవారం విచారణ చేపట్టేందుకు అంగీకరించింది. -
ఎన్నికల్లో అలాంటి వాటికి తావులేదు.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
దేశంలో ఎన్నికల ప్రచారం ఇప్పటికే మొదలైపోయింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ జెండా ఎగురవేయడానికి కావలసిన ప్రయత్నాలు చేస్తున్నారు. కీలక నేతల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ తరుణంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీలకు సరైన ప్రాధాన్యత ఉండేలా పశ్చిమ బెంగాల్ బ్యూరోక్రసీకి కచ్చితమైన ఆదేశాలు జారీ చేశామని, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎలాంటి హింసాకాండకు తావు లేదని, ఆలా జరిగితే సహించేది లేదని చీప్ ఎలక్షన్ కమిషనర్ ఈ రోజు (మంగళవారం) ప్రకటించారు. విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ, రాష్ట్రంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, హింస రహిత ఎన్నికలను నిర్వహించడమే ఎన్నికల సంఘం లక్ష్యమని.. ఎన్నికల్లో భయానికి, బెదిరింపులకు తావు లేదని, అధికార యంత్రాంగం పక్షపాత ధోరణిని సహించేది లేదని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ఇదీ చదవండి: రాజకీయాల్లోకి అభిజిత్ గంగోపాధ్యాయ.. త్వరలో ఆ పార్టీలోకి పశ్చిమ బెంగాల్లో తగిన సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరిస్తామని, దీంతో తప్పకుండా ఎన్నికలు సజావుగా జరుగుతాయని ఆయన అన్నారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు వస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీలకు చెప్పినట్లు, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకుంటే.. ఆ తరువాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రాజీవ్ అన్నారు. కాబట్టి పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా ఉండాలని, జిల్లా స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. -
హామీలపై సమాచారం.. ఓటర్ల హక్కు: సీఈసీ
చెన్నై: ఎన్నికల సమయంలో రాజకీయ పారీ్టలు ఇచ్చే హామీలు ఆచరణ సాధ్యమేనా? అనేది తెలుసుకొనే హక్కు ఓటర్లకు ఉందని ముఖ్య ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ చెప్పారు. అయితే, ఈ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని గుర్తుచేశారు. మేనిఫెస్టోలో హామీలను పొందుపర్చే హక్కు రాజకీయ పారీ్టలకు ఉన్నట్లే.. ఆయా హామీల్లో నిజమెంత? వాటిని అమలు చేయడానికి నిధులు ఎక్కడి నుంచి ఎలా సేకరిస్తారో తెలుసుకునే హక్కు ఓటర్లు ఉందని పేర్కొన్నారు. ఈ అంశంపై న్యాయస్థానం విచారణ కొనసాగిస్తోందని వెల్లడించారు. రాజీవ్ కుమార్ శనివారం చెన్నైలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల హామీలు, వాటిని అమలు చేసే విధానం, నిధుల సేకరణ మార్గాలను రాజకీయ పారీ్టలు తప్పనిసరిగా వెల్లడించేలా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఒక ‘ప్రొఫార్మా’ సిద్ధం చేశామని తెలిపారు. -
Winter Parliament Session 2023: సీఈసీ, ఈసీల నియామకానికి ప్రధానమంత్రి ప్యానెల్!
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ), ఎన్నికల కమిషనర్ల(ఈసీ) నియామకం కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన కీలక బిల్లును లోక్‌సభ గురువారం ఆమోదించింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అదర్ ఎలక్షన్ కమిషనర్స్ (అపాయింట్మెంట్, కండీషన్స్ ఆఫ్ సరీ్వస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్) బిల్లు–2023ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ సభలో ప్రవేశపెట్టారు. స్వల్పకాలిక చర్చ అనంతరం మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లును ఈ నెల 12న రాజ్యసభ ఆమోదించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే బిల్లును తీసుకొచి్చనట్లు అర్జున్‌రామ్ మేఘ్వాల్ లోక్‌సభలో చర్చ సందర్భంగా ప్రకటించారు. ఈసీసీ, ఈసీల సరీ్వసు నిబంధనలకు సంబంధించి 1991 నాటి చట్టంలో కొన్ని అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయని, వాటిని పరిష్కరిస్తూ కొత్త బిల్లును రూపొందించినట్లు తెలియజేశారు. ప్రతిపాదిత కొత్త చట్టం సుప్రీంకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఉందన్న వాదనను ఆయన కొట్టిపారేశారు. సీఈసీ, ఈసీల నియామకానికి చట్టాన్ని తీసుకొచ్చేవరకూ ముగ్గురు సభ్యులతో ఒక ప్యానెల్ ఏర్పాటు చేయాలని ఈ ఏడాది మార్చి నెలలో ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించిందని అన్నారు. ఈ ప్యానెల్లో ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉండాలని పేర్కొందని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగానే బిల్లును తయారు చేసినట్లు స్పష్టం చేశారు. రాజ్యాంగం నిర్దేశించిన అధికారాల విభజనకు అనుగుణంగా రూపొందించామని అన్నారు. అలాగే సీఈసీ, ఈసీల హోదా, వేతనాలకు సంబంధించిన సవరణలను కూడా బిల్లులో పొందుపర్చారు. బిల్లులో ఏముంది? ► ప్రస్తుతం సీఈసీ, ఈసీలను కేంద్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు రాష్ట్రపతి నియమిస్తున్నారు. ► సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సీఈసీ, ఈసీల నియామకం ఇకపై ప్రధానమంత్రి నేతృత్వంలోని ప్యానెల్ పరిధిలోకి రానుంది. అంటే కార్యనిర్వాహక వర్గమే సీఈసీ, ఈసీలను నియమిస్తుంది. ► బిల్లు చట్టంగా మారిన తర్వాత సీఈసీ, ఈసీల నియామకం కోసం కేంద్ర న్యాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలో సెర్చ్ కమిటీని ఏర్పాటు ఏయాల్సి ఉంటుంది. ఇందులో ఇద్దరు కేంద్ర కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. సీఈసీ, ఈసీల నియామకం కోసం ఐదుగురి పేర్లతో షార్ట్‌లిస్టు తయారు చేసి సెలక్షన్ కమిటీకి పంపించాలి. ► ఆ తర్వాత ప్రధానమంత్రి నేతృత్వంలో ఒక కేంద్ర మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేతతో కూడిన ప్యానెల్ ఎన్నికల సంఘం సభ్యులను ఎంపిక చేస్తుంది. ► ఒకవేళ లోక్‌సభలో ప్రతిపక్ష నేత లేకపోతే సభలోని ఏకైక అతిపెద్ద పార్టీ నాయకుడిని సెలక్షన్ ప్యానెల్లో సభ్యుడిగా నియమిస్తారు. ► సెర్చ్ కమిటీ సూచించిన షార్ట్‌లిస్టులో లేని పేర్లను కూడా పరిగణనలోకి తీసుకొనే అధికారం ప్యానెల్‌కు ఉంటుంది. ► సవరించిన బిల్లు ప్రకారం.. సీఈసీ, ఈసీలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమాన హోదా లభిస్తుంది. ► సీఈసీ, ఈసీలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమానంగా వేతనం చెల్లిస్తారు. ► అధికారిక విధులు నిర్వర్తించే క్రమంలో సీఈసీ, ఈసీలకు కోర్టు కేసుల నుంచి రక్షణ కలి్పస్తూ సవరణ బిల్లులో కొన్ని అంశాలు చేర్చారు. ► సీఈసీ సిఫార్సు లేకుండా ఈసీలను పదవి నుంచి తొలగించడానికి వీల్లేదు. ► సుప్రీంకోర్టు జడ్జిని పదవి నుంచి తొలగించడానికి ఉపయోగించే ప్రక్రియనే సీఈసీ విషయంలోనూ ఉపయోగించాలి. ► సెక్రెటరీ ర్యాంకు లేదా సమాన హోదా ఉన్నవారిని మాత్రమే సీఈసీ, ఈసీలుగా నియమించాలి. ► సీఈసీ, ఈసీలపై గతంలోనే కేసులు ఉంటే.. వారు పదవుల్లో ఉన్నంతకాలం ఆయా కేసుల్లో విచారణ కొనసాగించకూడదు. గతంలో సీఈసీ రాజీవ్ కుమార్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించిన స్పెషల్ సెషన్స్ జడ్జిని తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని పదవుల్లో ఉన్న సీఈసీ, ఈసీలపై విచారణ కొనసాగించకూడదన్న నిబంధననను బిల్లులో చేర్చారు. -
CEC Bill: ఎన్నికల కమిషనర్ల నియామకం బిల్లుకు పార్లమెంట్ ఆమోదం
ఢిల్లీ: వివాదాస్పద ఈసీ బిల్లును లోక్‌సభ నేడు ఆమోదించింది. దీంతో చీఫ్ ఎలక్షన్ కమీషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లును గురువారం పార్లమెంట్ ఆమోదించినట్లైంది. ఈ బిల్లును రాజ్యసభ ఇప్పటికే ఆమోదించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఆమోదిస్తే బిల్లు చట్టంగా రూపొందుతుంది. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)లోని ముగ్గురు సభ్యుల నియామకానికి సంబంధించిన విధివిధానాలను ఏర్పాటు చేయడం ఈ బిల్లు లక్ష్యం. ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన ప్యానెల్ ఎన్నికల కమిషన్‌ను ఎన్నుకోవాలనే సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ బిల్లు విబేధిస్తుంది. ఎన్నికల సంఘాన్ని నియమించాల్సిన విధివిధానాలపై సుప్రీంకోర్టు ఈ ఏడాది మార్చిలో ఓ తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ.. ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేస్తుంది. జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. పార్లమెంట్ కొత్త బిల్లును ఆమోదించే వరకు ఈ విధివిధానాలను అనుసరించాలని స్పష్టం చేసింది. అయితే.. పార్లమెంట్ తీసుకువచ్చిన కొత్త బిల్లులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాత్రను పక్కన పెట్టేశారు. సీఈసీ, ఈసీ కమిషనర్ల నియామకంలో సుప్రీంకోర్టును దూరంగా ఉంచారు. ఈ బిల్లు ప్రకారం ఎన్నికల కమిషనర్లపై సుప్రీంకోర్టు సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా అర్హత ఉండదు. ఇదీ చదవండి: పార్లమెంట్ భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం -
53 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ సీఈసీ లైన్‌క్లియర్
-
కశ్మీర్లో ‘సరైన సమయం’లో ఎన్నికలు: ఈసీ
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని సరైన సమయంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాన ఎన్నికల కమిషన్(సీఈసీ) రాజీవ్ కుమార్ సోమవారం చెప్పారు. ఏది సరైన సమయం అని తాము భావిస్తామో అప్పుడే అసెంబ్లీ ఎన్నికలతోపాటు ఇతర ఎన్నికలు జరుగుతాయని అన్నారు. ఆరి్టకల్ 370ని రద్దు చేసి, జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత అక్కడ ఎన్నికలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ స్థానాల సంఖ్య 83 నుంచి 90కి పెరిగింది. -
ఏకపక్షంగా ఓట్లు తొలగించామనడం సరికాదు: సీఈసీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మినీ భారత్ లాంటిదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించామని, అన్ని పార్టీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. అభ్యర్థుల ప్రచార వ్యయాన్ని పెంచాలని పార్టీలు కోరినట్లు వెల్లడించారు. తొలిసారి రాష్ట్రంలో వృద్ధులు ఇంటివద్దే ఓటు వేయడానికి ఫామ్ 12d ఏర్పాటు చేస్తున్నామన్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల బృందం గురువారం మీడియా సమావేశం నిర్వహించింది. 2022-23లో తెలంగాణలో 22 లక్షల ఓట్లను తొలగించామని సీఈసీ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. మరణాలు ఉన్నా ధృవీకరణ ఫామ్ అందిన తర్వాతే ఓటర్ల జాబితాలో పేర్లు తొలగించామని అన్నారు. ఏకపక్షంగా ఓట్లు తొలగించామనడం సరికాదన్నారు. . పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపొందించామని, ప్రతి ఒక్కరూ ఓటింగ్‌లో పాల్గొనాలని సూచించారు. తెలంగాణలో 35, 356 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో ఓటర్ల సంఖ్య 3.17 కోట్లు ఉన్నట్లు రాజీవ్ కుమార్ చెప్పారు. మహిళా ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు.100 ఏళ్లు దాటిన ఓటర్ల సంఖ్య 7.689 ఉన్నట్లు పేర్కొన్నారు. కొత్తగా 8,11,640 లక్షల యువత ఓటు నమోదు చేసుకున్నారని తెలిపారు. కాగా తెలంగాణలో మూడు రోజులపాటు పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం.. వివిధ రాజకీయ పార్టీలు, సీఎస్, డీజీపీ, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో బుధవారం సమావేశమైంది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించింది. బుధవారం రాష్ట్ర ఓటర్ల జాబితాను సైతం ప్రకటించింది. సీఈసీ రాజీవ్ కుమార్ ఇంకేమన్నారో ఆయన మాటల్లోనే ► యంగెస్ట్ స్టేట్ తెలంగాణ... తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ► ఫ్రీ అండ్ ఫెర్ ఎన్నికల నిర్వహణ కోసం మేము కమిట్మెంట్తో పనిచేస్తున్నాం. ►రాజకీయ పార్టీలతో కలిసినప్పుడు వాళ్ళ నుంచి అనేక విజ్ఞప్తులు వచ్చాయి ►అక్రమ నగదు - మద్యం ను కట్టడి చేయాలని విజ్ఞప్తి చేశారు. ► అర్బన్ ఏరియాల్లో మైక్రో అబ్జార్వార్లను పెట్టాలని కోరారు. ►119 సెగ్మెట్లలో 88 జనరల్, ఎస్టీ 12, ఎస్సీ 19 ఉన్నాయి. ►80ఏళ్లకు పైబడిన వాళ్ళు 4.43 లక్షలు ఉన్నారు. 100 ఏళ్లకు పైబడిన వాళ్ళు 7689 ఉన్నారు. ► 22లక్షల ఓట్లను 2022-23 డిలీట్ చేశాం. ►తెలంగాణ రాష్ట్రంలో అడ్రెస్స్ ఇష్యూ ఉంది. ► రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీలతో దాదాపు వెయ్యి సమావేశాలు నిర్వహించాం. ►ఎన్నికల ప్రక్రియ ఎంతో పారదర్శకంగా జరిగింది. ► ఈ సారి 8.11లక్షల మొదటిసారి ఓటర్స్‌ను నమోదు చేశాం. ►యువత - మహిళా ఓట్లను పెంచేందుకు మేమెంతో కృషి చేశాం. సక్సెస్ అయ్యాము. ► 3.45 లక్షల యంగ్ విమెన్ ఓట్లు నమోదు అయ్యాయి. ► థర్డ్ జెండర్స్ తో సమావేశాలు పెట్టాం. ► 35వేల పీస్‌లు, ప్రతీ పీఎస్‌కు 897 ఉన్నారు. ►మినిమమ్ వసతులు అన్ని కల్పిస్తున్నాం. ►అక్రమంగా నగదు మద్యం సరఫరా చేస్తే c vigil యాప్‌లో ఫోటో పెడితే 100 నిమిషాల్లో చర్యలు ఉంటాయి. ► ప్రతీ ఒక్కరూ ఓటర్ helpline app డౌన్లోడ్ చేసుకోవాలి. ►suvidha పోర్టల్ ప్రతీ అభ్యర్థి డౌన్లోడ్ చేసుకోవాలి.. సమాచారం తెలుసుకోవచ్చు. ► KYC అంటే KNOW YOUR CANDIDATE క్రిమినల్ బ్యాగ్రండ్ చెక్ చేసుకోవచ్చు. ► సరిహద్దుల్లో చెక్ పోస్ట్‌లు 89, మొత్తం 148 చెక్ పోస్టులు ఏర్పాటు. ► అక్రమంగా నగదు - మద్యం సరఫరా చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయి. ► ఆన్లైన్ లో నగదు బదిలీల పై EC నిఘా ఉంటుంది. ► ఎలిప్యాడ్స్, ఎయిర్‌పోర్ట్స్ లో ప్రత్యేక నిఘా. ►ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ లు ప్రతీ వారానికి ఒకసారి రిపోర్ట్ చేయాలని ఆదేశించాం. ► ఆరోపణలు(ఫిర్యాదు )వచ్చిన ప్రతీ నాయకులు సమాధానం చెప్పాలి. ► ప్రకటనలు - సోషల్ మీడియా లో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ఉంటాయి. ►ఫ్రీ అండ్ ఫెర్ ఎన్నికల కోసం అబ్జర్లు కేంద్రం నుంచి విధులు నిర్వహిస్తారు ► ఎన్నికలు పారదర్శనంగా జరిపేందుకు అన్ని పక్కడ్బంధీ ఏర్పాట్లు చేస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సన్నాహాక సమీక్ష సారాంశం కోసం క్లిక్ చేయండి -
TS: 6 లేదా 7న ఎన్నికల షెడ్యూల్?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నేటి(మంగళవారం) నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటించనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలో 17 మంది సభ్యుల బృందం హైదరాబాద్‌లో వరుస భేటీలు జరపనుంది. వివిధ రాజకీయ పార్టీలతో.. ఎన్నికల ఏర్పాట్లు, సంసిద్ధత తదితర అంశాలపై సీఎస్, డీజీపీ, ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఓ ప్రముఖ హోటల్లో మంగళవారం మధ్యాహ్నం 2.30 నుండి 4.30 వరకు గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలతో సమావేశం అవ్వనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 7.30 గంటల వరకు పలు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో సమీక్షించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, అధికారులు ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ, ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాలు, మోడల్ కోడ్‌తో పాటు డబ్బు, ఉచిత పంపిణీలు, మద్యం సరఫరా సహాపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక 4వ తేది ఉదయం 6.30 గంటలకు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జీపై సైక్లోథాన్, వాక్ థాన్ నిర్వహించనుంది. ఉదయం 9.30 గంటల నుంచిసాయంత్రం 7 వరకు జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సీపీలతో ఎన్నికల బృందం సమావేశమవ్వనుంది. 5వ తేదీ ఉదయం 9 గంటలకు టెక్ మహీంద్రలో స్టేట్ ఐకాన్స్, దివ్యాంగ ఓటర్లు, యువ ఓటర్లతో ఇంటరాక్షన్ అవ్వనుంది. 11 గంటలకు సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్‌లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుంది. అలాగే మధ్యాహ్నాం 1 గంటకు ప్రెస్ కాన్ఫరెన్స్, ఓటర్ల జాబితా, ఎన్నికల ఏర్పాట్లు, నిఘాపై కేంద్ర ఎన్నికల బృందం ఆరా తీయనుంది. గత ఎన్నికల సమయంలో.. అక్టోబర్ నెలలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఈసారి కూడా అక్టోబర్ 6 లేదా 7వ తేదీల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చదవండి: తెలంగాణలో మోదీ పర్యటన.. ప్రధాని ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి -
Jamili Elections: ‘జమిలి’ సర్వరోగ నివారిణా?
జమిలి ఎన్నికలపై చర్చ సద్దుమణిగిందని అనుకున్నప్పుడల్లా అది మళ్లీ మళ్లీ రాజుకోవటం ఏడెనిమిదేళ్లుగా రివాజైంది. కానీ ఈసారి ఉన్నట్టుండి అందుకు సంబంధించి తొలి అడుగుపడింది. మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కమిటీ విధివిధానాలు, అందులో ఉండే నిపుణుల వివరాలు ఇంకా తెలియాల్సేవున్నా ఇండియా కూటమి సమావేశాల్లో తీరిక లేకుండా వున్న విపక్షాలకు ఇది ఊహించని పరిణామం. పార్లమెంటుకూ, అసెంబ్లీలకూ ఏకకాలంలో ఎన్నికలు జరగాలనీ, అందువల్ల ఎంతో ప్రజాధనం ఆదా అవుతుందనీ ఆ విధానాన్ని సమర్థిస్తున్నవారు చెబుతున్నారు. అంతేకాదు, తరచు ఎన్నికలవల్ల అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడుతున్నదని కూడా వారి వాదన. కానీ ఈ రకమైన వాదనలను కొట్టి పారేస్తున్నవారు కూడా గణనీయంగానే ఉన్నారు. అభివృద్ధి పనులకు ఎక్కడ ఆటంకం ఏర్పడిందో చూపాలని సవాలు చేస్తున్నారు. ప్రకృతి విపత్తుల సమయంలోనో, మరే అత్యవసర సందర్భాల్లోనో ప్రభుత్వాలను ఎన్నికల సంఘం నిరోధించిన దాఖలాలు లేవు. కాకపోతే ఓటర్లను ప్రలోభపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందటానికి ఉద్దేశించే పథకాలను మాత్రం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ప్రకటించకుండా ఆపుతున్నారు. అందువల్ల జనం నష్టపోయారని చెప్పడానికి ఎటువంటి దాఖలాలూ లేవు. దేశంలో ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీల ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. మిగతా రాష్ట్రాలను కూడా ఈ చట్రంలోకి తీసుకు రావటమే కేంద్రం ఉద్దేశం. ‘ఒకే దేశం–ఒకే ఎన్నికలు’ అన్న నినాదం కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచీ వినిపిస్తోంది. అంతక్రితం 2003లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి ఈ విషయంలో కొంత ప్రయత్నం చేశారు. అప్పటి కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీతో ఆయన చర్చించారు. కానీ ఎందుకనో తదుపరి చర్యలేమీ లేవు. జస్టిస్ బీపీ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలోని లా కమిషన్ సమర్పించిన 170వ నివేదిక సైతం చట్టసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇంకా వెనక్కు వెళ్తే 1983లో కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈమాటే చెప్పింది. అయితే రాజ్యాంగ సవరణ, ప్రజాప్రాతినిధ్య చట్టం సవరణ, చట్టసభల నియమనిబంధనల సవరణ వగైరాలు చేయకుండా జమిలి ఎన్నికలు సాధ్యంకాదని 2018లో జస్టిస్ బీఎస్ చౌహాన్ నేతృత్వంలోని లా కమిషన్ తన ముసాయిదా నివేదికలో అభిప్రాయపడింది. ఒక ఏడాది వేర్వేరు నెలల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలన్నిటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించటం ఉత్తమమని సూచించింది. దేశంలో జమిలి ఎన్నికలు 1952 నుంచి 1967 వరకూ జరిగాయి. కానీ దానికి తూట్లు పొడిచింది కేంద్రంలోని పాలకులే. అప్పటి నెహ్రూ సర్కారు 1959 జూలైలో ఈఎంఎస్ నంబూద్రిపాద్ నాయకత్వంలోని తొలి కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వాన్ని 356వ అధికరణ ప్రయోగించి బర్తరఫ్ చేసింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని చక్కదిద్దేవరకూ ఆ అధికరణ దశాబ్దాలపాటు దుర్వినియోగం చేశారు. ఫిరాయింపులను ప్రోత్సహించే ధోరణి వెర్రితలలు వేసి ప్రభుత్వాలు కుప్పకూలాయి. అసెంబ్లీలు రద్దయ్యాయి. ఈ కారణాలన్నిటివల్లా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలది తలోదారీ అయింది. పాలక పార్టీలను చీల్చటం, చీలికవర్గంతో కొత్త ప్రభుత్వాలను ప్రతిష్టించటం రివాజైంది. తరచు ఎన్నికల వల్ల ఖజానాకు తడిసిమోపెడు ఖర్చు అవుతున్నదన్నది వాస్తవం. దీనికితోడు రాజమార్గాల్లో, దొంగదారుల్లో ఎన్నికల జాతరకు వచ్చిపడే వేల కోట్ల రూపాయలు ద్రవ్యోల్బణాన్ని పెంచుతున్నాయి. ఉదాహరణకు 2009 సార్వత్రిక ఎన్నికలకు ఖజానాకు రూ.1,115 కోట్లు ఖర్చ యితే, 2014 నాటికి ఇది రూ.3,870 కోట్లకు పడగలెత్తింది. ఇదంతా సర్కారుకయ్యే వ్యయం. పార్టీలూ, అభ్యర్థులూ చేసే ఖర్చు ఇందుకు ఎన్నో రెట్లు ఎక్కువుంటుంది. కానీ రోగం ఒకటైతే మందు మరొకటన్నట్టు ఈ సమస్యలకు జమిలి ఎన్నికలే పరిష్కారమని పాలకులు చేస్తున్న వాదన సరికాదు. ఎన్నికల్లో ధనప్రభావం అరికట్టడానికి ఎన్నికల సంస్కరణలు అవసరం. ఎన్నికల విశ్వసనీయత పెంచటానికి దొంగ ఓట్లను అరికట్టడం అవసరం. అలవిమాలిన వాగ్దానాలతో ప్రజలను ఆకర్షించి, అధికారంలోకొచ్చాక వంచించే పార్టీలపై చర్యలు తీసుకోవటం అవసరం. కానీ జరిగిందేమిటి? అసలే పార్టీలు వెచ్చించే కోట్లాది రూపాయల సొమ్ము ఎక్కడిదో తెలిసే అవకాశంలేని ప్రస్తుత పరిస్థితిని మరింత జటిలం చేసేలా ఎన్నికల బాండ్ల విధానానికి తెరలేపారు. ‘ఒకే దేశం–ఒకే ఎన్ని కలు’ గొప్ప ఆదర్శంగా కనిపించవచ్చు. చూడదల్చుకున్నవారికి ఇందులో జాతీయతా భావన కూడా దర్శనమీయొచ్చు. కానీ ఎన్నికల ప్రక్షాళనకు ఇది దోహదపడేదెంత? ఇంతకూ జమిలి ఎన్నికల విధానం అమలు చేయటం మొదలెట్టాక రాష్ట్రాల్లో గడువుకు ముందే అసెంబ్లీలు రద్దు చేయాల్సివస్తే ఏం చేస్తారు? 90వ దశకంలో మాదిరే కేంద్రంలోనే అస్థిరత ఏర్పడి లోక్‌సభ రద్దు చేయాల్సివస్తే మార్గం ఏమిటి? ఇవన్నీ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ఎటూ పరిశీలిస్తుంది. ఇక రెండు చట్టసభలకూ ముడివేయటంవల్ల ఫెడరలిజం దెబ్బతింటుందనేవారూ... జాతీయ అంశాల ప్రాముఖ్యత పెరిగి స్థానిక అవసరాలు, ఆకాంక్షలు మరుగునపడతాయనేవారూ ఉన్నారు. అయితే 2019లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీల ఎన్నికలతోపాటు లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు వెలువడిన ఫలితాలు గమనిస్తే ఇది అర్ధసత్యమే అనిపిస్తుంది. ఏదేమైనా జమిలి ఎన్నికల విధానంపై విస్తృతమైన చర్చకు చోటిచ్చి, అందులో వ్యక్తమయ్యే అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తదుపరి అడుగులు వేయాలి. తొందరపాటు పనికిరాదు. ఇది కూడా చదవండి: Arunachal Pradesh: మ్యాపులతో మడతపేచీ -
తటస్థతకు తిలోదకాలు
పోసేవాడు ఒకందుకు పోస్తే... తాగేవాడు మరొకందుకు తాగాడని మోటు సామెత. ఎన్నికల కమిషనర్లు, ప్రత్యేకించి ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) నియామకంపై కేంద్ర ప్రభుత్వం ఆగస్ట్ 10న రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లు వ్యవహారం అచ్చం ఆ సామెతనే గుర్తు చేస్తోంది. ఎన్నికల కమిషనర్ల నియామకంపై పాలనావ్యవస్థ ఉడుంపట్టును సడలించేలా గత మార్చిలో సుప్రీమ్ కోర్డ్ రాజ్యాంగ ధర్మాసనం ఒక ఉద్దేశంలో తీర్పు చెబితే, అయిదునెలల్లో కేంద్రం ఏకంగా ఆ తీర్పు స్ఫూర్తికే విరుద్ధమైన బిల్లుతో ముందుకొచ్చింది. ఎంపిక ప్రక్రియ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)ని తప్పించింది. తటస్థంగా ఉండాల్సిన ఎంపిక కమిటీని అధికారపక్షం తన అదుపాజ్ఞల్లో ఉంచుకొనేలా తెగబడింది. పార్టీ, ప్రభుత్వాలకతీతంగా నడవాల్సిన ఎన్నికల సంఘ స్వతంత్రతను దెబ్బతీస్తోంది. భారత ప్రధాని, ప్రతిపక్ష నాయకుడు (ఎల్ఓపీ), కేంద్ర క్యాబినెట్ మంత్రితో కూడిన ముగ్గురు సభ్యుల ప్యానెల్ ఇకపై సీఈసీని నియమిస్తుందని ప్రభుత్వం బిల్లులో ప్రతిపాదించింది. ఇప్పటి దాకా కేంద్ర మంత్రిమండలి సలహా మేరకు సీఈసీని రాష్ట్రపతి నియమిస్తున్నారు. తాజాగా ప్రతిపక్ష నేతను కూడా చేర్చి, విస్తృత ప్రాతినిధ్యంతో ప్యానెల్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన మామూలుగా నైతే స్వాగతించాలి. కానీ, ఇక్కడే తిరకాసుంది. సీఈసీ సహా ఎన్నికల కమిషనర్ల ఎంపికపై ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసే వరకు, సదరు ఎంపిక కమిటీలో సీజేఐకి కూడా చోటిచ్చి, ఈ ప్రక్రియను మరింత ప్రజాస్వామ్యయుతం చేయాలని మార్చి 2న అయిదుగురు సభ్యుల సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది. సహజంగానే ఇది మింగుడుపడని సర్కార్ ఆగమేఘాలపై బిల్లు తెచ్చేసింది. ఆ బిల్లులో సీజేఐకి బదులుగా కేంద్ర మంత్రికి చోటిచ్చింది. మంత్రులంటే ప్రధాని గీచిన గీత దాటలేరు. వెరసి, ఎంపిక కమిటీలో పేరుకు ప్రతిపక్ష నేత ఉన్నా మొత్తం ముగ్గురిలో ఇద్దరు సభ్యులు పాలక పక్షీయులే గనక మెజారిటీ ఎటు మొగ్గుతుందో వేరుగా చెప్పనక్కర లేదు. పార్లమెంట్ చేసిన చట్టాలకు అనుగుణంగా ఎన్నికల కమిషనర్ నియామకం జరగాలని భారత రాజ్యాంగ పరిషత్ చర్చలు పేర్కొన్న మాట నిజమే. దాన్ని ఆసరాగా చేసుకొనే సుప్రీమ్ సైతం ప్రభుత్వం చట్టం చేసే వరకు ప్రధాని, ప్రతిపక్ష నేత, సీజేఐతో కూడిన ఎంపిక సంఘమంటూ అయిదు నెలల క్రితం తాత్కాలిక ప్రతిపాదన తన తీర్పులో చెప్పింది. తీరా ఇప్పుడు ప్రభుత్వం చట్టం చేస్తోంది కానీ పరోక్షంగా అధికార పక్షం చేతిలోకే అంతా తెచ్చి, రాజ్యాంగబద్ధ సంస్థ స్వతంత్రతను పణంగా పెట్టింది. ఇదీ అసలు సమస్య. అలాగే, ఎంపిక సంఘం తనదైన సొంత ప్రక్రియను ఎంచుకోవచ్చట. ఆ సంఘం ముందు ఉంచాల్సిన తొలి జాబితాను క్యాబినెట్ సెక్రటరీ సారథ్యంలోని సెర్చ్ కమిటీ సిద్ధం చేస్తుందట. వెరసి, ప్రతిపక్ష నేత వట్టి ఉత్సవ విగ్రహమవుతారు. ఆయన అభిప్రాయం అరణ్యఘోషగా మిగులుతుంది. కొద్దినెలల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణల్లోనూ, సరిగ్గా మరో 9 నెలల్లో లోక్‌సభకూ ఎన్నికలు జరగాల్సి ఉండగా కేంద్రం ఈ బిల్లు ద్వారా ఎన్నికల సంఘంపై పూర్తిగా పట్టు బిగించాలన్నది పాలకుల తాపత్రయమనిపిస్తోంది. ప్రభుత్వ ప్రమేయం లేకుండా నడవాల్సిన వ్యవస్థకు పెద్ద తలకాయలెవరో అధికారంలో ఉన్నవారే నిర్ణయించడం ఎన్నికల ప్రజాస్వామ్యపు ప్రాథమిక లక్ష్యానికే విఘాతం. ఆ మాటకొస్తే దేశంలో ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించే ఎన్నికల సంఘం, కమిషనర్ల నియామకం పారదర్శకంగా లేదని కొన్నేళ్ళుగా వింటున్నదే. వారిపై ప్రభుత్వం పరోక్షంగా స్వారీ చేస్తున్నదన్న ఆరోపణలూ ఉన్నాయి. 2021 నవంబర్‌లో న్యాయశాఖ ఆదేశాల మేరకు సీఈసీ, ఎన్నికల కమిషనర్లు ఉమ్మడి ఓటర్ల జాబితాపై చర్చించడానికి ప్రధానమంత్రి కార్యాలయంతో సమావేశానికి వెళ్ళడం దుమారం రేపింది. ఇది ఎన్నికల సంఘం అధికారం, స్వతంత్రతను తగ్గించడమేనని రాజ్యాంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. పాలకవ్యవస్థ జోక్యం నుంచి ఎన్నికల సంఘాన్ని కాపాడాలన్న సదుద్దేశంతో సుప్రీమ్ తీర్పునిస్తే అంతా సంతోషించారు. తీరా కొత్త బిల్లుతో ఎన్నికల సంఘం ఇక అధికారి కంగానే పాలకుల గూటి చిలకగా మారిపోనుంది. ఎన్నికలు కురుక్షేత్ర సమరంగా మారిన వర్తమాన పరిస్థితుల్లో ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా ఉందని సంబంధిత పక్షాలన్నిటికీ నమ్మకం కలగడం ముఖ్యం. పాలకులేమో చట్టం తెచ్చి మరీ ఆ నమ్మకానికి చరమగీతం పలుకుతున్నారు. ఎన్నికల సంస్కరణలపై ఏర్పాటైన దినేశ్ గోస్వామి కమిటీ 1990లోనే ఎన్నికల సంఘపు స్వతంత్రతను కాపాడే మార్గాలతో కొన్ని సిఫార్సులు చేసింది. న్యాయ సంఘం 2015 నాటి తన 255వ నివేదికలో ఆ కమిటీ ప్రతిపాదనకు మార్పులు చేస్తూ, ఎంపిక కమిటీలో ప్రధానికి చోటుకల్పించింది. సీజేఐకీ అందులో స్థానం ఉంటే అధికార, ప్రతిపక్షాలు వేటికీ మొగ్గు లేకుండా తటస్థత నెలకొనేది. కొత్త బిల్లుతో ఆ తటస్థత నిర్వీర్యమైంది. ఇది గ్రహించి ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియకు కావలిసంస్థ స్వతంత్రతను కాపాడుకోవాలి. రాజ్యాంగ రూపకల్పన వేళ అంబేడ్కర్ సైతం పాలనా వ్యవస్థ జోక్యానికి దూరంగా ఎన్నికల సంఘం ఉండాలన్నారు. సీఈసీ ఎంపిక ప్రక్రియ నుంచి సీజేఐని తప్పించకుండా ఉంటేనే అది సాధ్యం. కాదూ కూడదనుకుంటే, ప్రత్యామ్నాయంగా ఎంపిక కమిటీ నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగా ఉండాలనే షరతు పెట్టాలి. తద్వారా ప్రతిపక్ష నేత మాటకు విలువ ఉంటుంది. ఎన్నికల సంఘం సమగ్రతను కాపాడినట్టూ అవుతుంది. మార్గం ఏదైనా, ఎన్నికల సంఘం నియామకాల ప్రక్రియను అపహాస్యం చేస్తున్న ఈ కొత్త బిల్లుపై తక్షణ సమీక్ష అవసరం. ప్రభుత్వం పునరాలోచించి, ఆ పని చేస్తేనే స్వతంత్ర భారతావనికి శోభ! ప్రజాస్వామ్యానికి రక్ష!! -
ఒకే ఇంటి నంబరుపై అధిక ఓటర్లు తక్కువే.. డూప్లికేట్లను తొలగిస్తున్నాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్న మొత్తం ఓటర్లతో పోలిస్తే ఒకే ఇంటి నంబర్‌పై అధిక ఓటర్లు నమోదైన సంఖ్య చాలా తక్కువని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ఒకే ఇంట్లో 500 కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న ఆరు ఇంటి నంబర్లను గుర్తించామన్నారు. 2018కు ముందు నుంచే ఇలా ఉందని చెప్పారు. పట్టణాల్లో అపార్ట్మెంట్లలో నివసించేవారు ఒకటే ఇంటి నంబరు, కొన్నిచోట్ల ఒకటే వీధి పేరు మీద ఓటర్‌గా నమోదు చేసుకోవడం వల్ల ఇలాంటి తప్పులు దొర్లాయని వెల్లడించారు. 50 కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న ఇళ్లు 2,100 ఉన్నాయని తెలిపారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3.98 కోట్ల ఓటర్లకుగానూ ఒకే రకమైన ఇంటి నంబర్లు కలిగినవారు 1.62 లక్షల మంది ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. వీటిని ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల సవరణ–2024 (ఎస్ఎస్ఆర్–2024) కార్యక్రమంలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. సోమవారం సచివాలయంలో మీనా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ఆర్–2024 షెడ్యూల్‌ను ప్రకటించారు. ఆధార్‌తో అనుసంధానించలేదు.. అలాగే రెండు, మూడు చోట్ల ఒకరే ఓటర్లుగా ఉన్నవారిని గుర్తించామని మీనా తెలిపారు. వారు కోరుకున్న చోట ఓటు ఉంచి మిగిలిన చోట్ల రద్దు చేశామన్నారు. ఒకే ఫొటోతో రెండు, మూడు కార్డులున్న 15 లక్షల మంది ఓటర్లను గుర్తించి.. అందులో 10.20 లక్షల నకిలీ ఓటర్లను తొలగించామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఓటరు కార్డుతో ఆధార్ నంబర్‌ను లింక్ చేయలేదన్నారు. 80 శాతం మంది ఓటర్ల నుంచి ఆధార్ సమాచారం తీసుకున్నామే కానీ వాటిని ఇంకా అనుసంధానించలేదని స్పష్టం చేశారు. యువ ఓటర్ల నమోదుపై దృష్టి మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో యువ ఓటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని ముకేశ్ కుమార్ మీనా చెప్పారు. వీరిని ఓటర్లుగా నమోదు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించామన్నారు. 18–19 ఏళ్ల వయసు ఉన్నవారు.. దేశ సగటు ప్రకారం చూస్తే రాష్ట్ర ఓటర్ల సంఖ్య ప్రకారం కనీసం 12 లక్షలు ఉండాలన్నారు. కానీ అది మన రాష్ట్రంలో 3.5 లక్షలకు మాత్రమే పరిమితమైందని తెలిపారు. జనవరి 1, 2024 నాటికి 18 ఏళ్లు నిండే వాళ్లు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులన్నారు. ఇందుకు ఎస్ఎస్ఆర్–2024ను వినియోగించుకోవాలని సూచించారు. ఎస్ఎస్ఆర్ కోసం జూలై 20 వరకు ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, బీఎల్వోలకు శిక్షణ ఇస్తామన్నారు. బీఎల్వోలు ఇంటింటా సర్వే చేశాక అక్టోబర్ 17న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసి అన్ని రాజకీయపార్టీలకు అందిస్తామన్నారు. దీనిపై అభ్యంతరాలు, సూచనలను నవంబర్ 30 వరకు స్వీకరిస్తామని వెల్లడించారు. ఇందుకోసం అక్టోబర్ 28, 29, నవంబర్ 18, 19 తేదీల్లో ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. వచ్చినఅభ్యంతరాలను డిసెంబర్ 26లోగా పరిష్కరించి వచ్చే ఏడాది జనవరి 5న తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని వివరించారు. రాజకీయ పార్టీలు సర్వేలో పాల్గొనాలి.. కాగా విజయవాడలో ఒకే ఇంటి నంబరుపై అధిక ఓటర్లు ఉన్నట్లు పత్రికల్లో వచ్చిన వార్తలపై విచారణ చేస్తున్నామని మీనా తెలిపారు. ఇలా 2018 నుంచి ఒకటే ఇంటి పేరు మీద అధిక ఓటర్లు ఉన్నట్లు తేలిందన్నారు. 2018లో 674 మంది ఓటర్లు ఉంటే 2019లో 675 మంది.. ఇప్పుడు 516 మంది ఓటర్లు ఉన్నారన్నారు. వీటిని పరిశీలించాక చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తారని చెప్పారు. ఈ క్రమంలో ఓటర్ల సవరణ చేస్తారన్నారు. ఈ సమయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు బీఎల్ఏలను నియమించుకొని బీఎల్వోలతో కలిసి సర్వేలో పాల్గొనాలని కోరారు. -
విదేశాల్లోని భారతీయులకు ఓటు హక్కు!
న్యూఢిల్లీ: విదేశాల్లో నివసించే భారతీయులకు సైతం మన దేశంలో జరిగే ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కల్పించాల్సిన సమయం వచ్చిందని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ చెప్పారు. ఇందుకోసం ఈ–పోస్టల్ బ్యాలెట్ వంటి టెక్నాలజీ ఆధారిత ఆధునిక విధానాలను ఉపయోగించాలని అన్నారు. మన దేశ ఎన్నికల వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోందని హర్షం వ్యక్తం చేశారు. రాజీవ్ కుమార్ శుక్రవారం నిర్వాచన్ సదన్‌లో ‘భారత్–ప్రజాస్వామ్యాలకు మాతృమూర్తి, భారత ఎన్నికల సంఘం పాత్ర’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో 2022 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్(ఐఎఫ్ఎస్) అధికారుల(ట్రైనీలు)ను ఉద్దేశించి ప్రసంగించారు. ఇటీవలి కాలంలో స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ, ఫలితాలపై సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, కుట్రపూరిత ప్రచారం సాగుతున్నాయని అన్నారు. విదేశాల్లో ఉంటున్న భారతీయులకు ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్(ఈటీబీపీఎస్) ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం గతంలోనే ప్రతిపాదించింది. విదేశాల్లోని భారతీయుల్లో 1.15 లక్షల మంది అర్హులైన ఓటర్లు ఉన్నట్లు అంచనా. -
80 ఏళ్లు పైబడ్డ వారికి ‘ఇంటి నుంచే ఓటు’
బెంగళూరు: 80 ఏళ్లు పై బడ్డ వారికి ఇంటినుంచే ఓటేసే అవకాశం కల్పిస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో దీన్ని అమలు చేస్తున్నట్టు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ తెలిపారు. ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు మూడు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘80 ఏళ్లు దాటిన వారు కూడా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటేయడాన్నే మేమూ ప్రోత్సహిస్తాం. అలా వెళ్లలేని వారికోసం తొలిసారిగా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తున్నాం’’ అని తెలిపారు. ‘‘ఇందుకోసం ‘సక్షమ్’ పేరిట మొబైల్యాప్ రూపొందించాం. అందులోకి వెళ్లి ఇంటి నుంచి ఓటేసే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ఎన్నికల సిబ్బంది వారింటికి వెళ్తారు. వారిచ్చే ఫామ్ 12డి ద్వారా ఓటేయవచ్చు. మొత్తం ప్రక్రియను వీడియో తీస్తాం. గోప్యతకు ఎలాంటి భంగం వాటిల్లకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటాం’’ అని వివరించారు. అలాగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు, అఫిడవిట్లు ఆన్లైన్లోనే దాఖలు చేసేందుకు వీలుగా సువిధ పేరిట మరో మొబైల్ యాప్ రూపొందించినట్టు సీఈసీ వెల్లడించారు. సమావేశాలు, ర్యాలీలకు కూడా దీని ద్వారానే అనుమతి కోరవచ్చన్నారు. అభ్యర్థి గురించి ఓటర్లకు అవగాహన కోసం నో యువర్ క్యాండిడేట్ (కేవైసీ) ఉద్యమం కూడా చేపట్టినట్టు చెప్పారు. ‘‘నేరచరిత్ర ఉన్న వారిని అభ్యర్థిగా ఎంచుకునే పార్టీలు అందుకు కారణాలను తమ వెబ్సైట్లు, సోషల్ మీడియా వేదికల ద్వారా ఓటర్లకు తెలియజేయాల్సి ఉంటుంది. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఇ–విజిల్ యాప్‌లో ఫిర్యాదు చేయొచ్చు’’ అన్నారు. కర్నాటకలో ఎన్నికల తేదీని త్వరలో నిర్ణయిస్తామన్నారు. -
ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీం సంచలనాత్మక తీర్పు
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ), ఎన్నికల కమిషనర్(ఈసీ)ల నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తమకు అనుకూలమైన వ్యక్తులను నియమిస్తోందనే తీవ్ర ఆరోపణల నడుమ సర్వోన్నత న్యాయస్థానం సంచలనాత్మక తీర్పును వెలువరిచింది. ఇన్నాళ్లూ కేంద్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు ఎన్నికల సంఘంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తున్నారు. ఇకపై ఈ వ్యవస్థను రద్దుచేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. ప్రధాన మంత్రి, లోక్‌సభలో విపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉండే త్రిసభ్య కమిటీ సిఫార్సు మేరకు రాష్ట్రపతి కేంద్ర ఎన్నికల సంఘంలో నియామకాలు జరపాలని జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం చరిత్రాత్మక తీర్పు చెప్పింది. అది ప్రజాస్వామ్యానికి సమాధి కడుతుంది ‘శక్తివంతమైన తుపాకీ కంటే బ్యాలెట్ మరింత శక్తిమయం. ఎన్నికల ప్రక్రియ అతిగా దుర్వినియోగానికి గురైందంటే అది చివరకు ప్రజాస్వామ్యానికి సమాధి కడుతుంది. అధికారం ముందు సాగిలపడే వ్యక్తి ఎన్నికల కమిషనర్‌గా ఎన్నికకాకూడదు. ఇంకొకరి ఆదేశాలను శిరసావహించే వ్యక్తి ప్రజాస్వామ్య తలరాతను మార్చే హోదాలో ఉండకూడదు. ఎన్నికల ప్రక్రియ స్వతంత్రతను మరింతగా ఇనుమడింపజేసేందుకే ఈ ఆదేశాలు ఇస్తున్నాం. స్వచ్ఛత తగ్గిపోతే వినాశక పరిణామాలు సంభవిస్తాయి. పార్లమెంట్లో కొత్త చట్టం వచ్చేవరకు నూతన నియామక ప్రక్రియ అమలులో ఉంటుంది’ అని ధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఇన్నాళ్లూ కేంద్రప్రభుత్వం రాష్ట్రపతికి కొత్త సీఈసీ, ఈసీల కోసం సిఫార్సుచేసేది. సిఫార్సులమేరకు రాష్ట్రపతి వారిని నియమించేవారు. ఇకపై కొత్త ప్రక్రియ ప్రకారం లోక్‌సభలో విపక్షనేత లేని సందర్భంలో లోక్‌సభలో సంఖ్యపరంగా అతిపెద్ద విపక్ష పార్టీ నేత త్రిసభ్య కమిటీలో సభ్యునిగా ఉంటారు. సీఈసీ, ఈసీల నియామకం కోసం కొలీజియం తరహా వ్యవస్థను ఏర్పాటుచేయాలంటూ పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో గతంలో దాఖలైన నేపథ్యంలో వాటిని విచారించిన కోర్టు గురువారం ఈ తీర్పు చెప్పింది. రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ అనురుద్ధ బోస్, జస్టిస్ హ్రిషికేశ్ రాయ్, జస్టిస్ సీటీ రవికుమార్‌లు సభ్యులుగా ఉన్నారు. తీర్పును స్వాగతించిన విపక్షాలు ‘ప్రభుత్వ ప్రమేయం, ప్రభావం బారిన పడకుండా ఈసీని కాపాడుతూ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు కోర్టు తీర్పు బాటలు పరిచింది’ అని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. తీర్పును ప్రజాస్వామ్యం సాధించిన విజయంగా తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ అభివర్ణించారు. ‘ఇంతకాలం ప్రధాని ఎన్నికల ర్యాలీలు, ప్రభుత్వ పథకాల ప్రకటనలకు అనుగుణంగా ఎన్నికల తేదీలను ఈసీ నిర్ణయించేది. ఇకపై ఎన్నికల సంఘంలో ఎవరు ఉంటారనే త్రిసభ్య కమిటీ చూసుకుంటుంది’ అని ఆప్ నేత సంజయ్ సింగ్ ఆశాభావం వ్యక్తంచేశారు. -
National Voters Day 2023: ప్రజల చేతిలోని పాశుపతాస్త్రం
ఈ రోజు భారత ఎన్నికల సంఘాన్ని స్థాపించిన రోజు. 2011 నుండి జాతీయ ఓటర్ల దినోత్సవంగా కూడా జనవరి 25ను జరుపు కొంటున్నాం. దీని ఉద్దేశం ఓటర్లుగా భారత పౌరులకు ఉన్న హక్కులు, బాధ్యతల గురించి అవగాహన కల్పించడమే. ఎన్నిల సంఘం (ఈసీ) పనితీరు, నిర్ణయం తీసుకునే స్వతంత్రతను నిర్ధారించడానికి రాజ్యాంగ సభ ఆర్టికల్ 324 ద్వారా రాజ్యాంగ హెూదాను ఇచ్చింది. తక్కువ అక్షరాస్యత, ఉనికిలో లేని ఓటర్ల జాబితా యుగంలో వయోజన ఓటు హక్కు ఆధారంగా ఎన్నికలను నిర్వహించడానికి శాశ్వతమైన స్వయంప్రతిపత్తి గల కమిషన్‌ను ఏర్పాటు చేయడం రాజ్యాంగ సభ దూరదృష్టికి ప్రతీక. ఈసీ నిష్పాక్షికత, విశ్వసనీయత ఆధారంగా ఇప్పటివరకు 17 లోక్‌సభ ఎన్నికలు; రాష్ట్రపతి ఎన్నికలు 16 సార్లు, అదే విధంగా ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి మరో 16 సార్లు ఎన్నికలు నిర్వహించింది. అలాగే 399 సార్లు శాసనసభ ఎన్నికలు నిర్వహించింది. 400వ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. చాలావరకు రాజకీయపార్టీల, ప్రజల విశ్వాసాన్ని ఎన్నికల సంఘం చూరగొన్నదనే చెప్పాలి. పటిష్ఠమైన ప్రజాస్వామ్య నిర్మాణానికి బలమైన, సమ్మిళిత ఎన్నికల భాగస్వామ్యం చాలా కీలకం. శక్తిమంతమైన ప్రజాస్వామ్యంలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, సక్రమంగా, విశ్వసనీయంగా ఉండాలి. అదే సమయంలో ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఈ సందర్భంగా ‘మనం విధులను నిర్వర్తించ కుండా వదిలేస్తే, హక్కుల కోసం పరుగు తీయాల్సి ఉంటుంది. అవి మనల్ని ఇష్టానుసారంగా తప్పించుకుంటాయి’ అన్న మహాత్మాగాంధీ మాటలు గుర్తు కొస్తున్నాయి. 94 కోట్లకు పైగా నమోదిత ఓటర్లను కలిగి ఉన్న భారత్... ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. గత సార్వత్రిక ఎన్నికలలో (2019) 67.4 శాతం ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొన్నారు. మిగిలిన 30 కోట్ల మంది ఓటర్లను పోలింగ్ బూత్‌కు తీసుకురావడం ఇప్పుడు మనముందున్న పెద్ద సవాల్. యువత లోనూ, పట్టణ ఓటర్లలోనూ ఉన్న ఉదాసీనత; బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వలసపోవడం వంటి అనేక కారణాల వల్ల ఇంతమంది ఓటింగ్‌లో పాల్గొనలేదని చెప్పవచ్చు. 2022 నవంబర్ 5న హిమాచల్‌ప్రదేశ్ కల్పాలో మరణించిన మొట్టమొదటి భారత ఓటర్ శ్యామ్ శరణ్ నేగీకి నివాళులు అర్పించే గౌరవం నాకు లభించింది. ఆయన తన 106వ ఏట మరణించే ముందు కూడా ఓటు హక్కును ఉపయోగించుకుని ఓటు వేయకుండా ఉండే ఉదాసీన పౌరులకు తమ విధి ఏమిటో తెలియచేశారు. ఆయన స్ఫూర్తిని అందరూ అందుకోవాలి. యువ ఓటర్లే భారత ప్రజాస్వామ్యానికి భవిష్యత్తు. 2000 సంవత్సరం తర్వాత జన్మించిన తరం మన ఓటర్ల జాబితాలో చేరడం ప్రారంభించింది. ఓటర్లుగా వారి భాగస్వామ్యం మొత్తం శతాబ్దమంతా ప్రజాస్వామ్య భవిష్యత్తును రూపుదిద్దబోతోంది. అందువల్ల ఓటు వేసే వయస్సు వచ్చేలోపు పాఠశాల స్థాయిలోనే ప్రజాస్వామ్య బీజం విద్యార్థుల్లో నాటడం అత్యంత క్లిష్టమైనదే కాదు, ముఖ్యమైనది కూడా. ప్రజాస్వామ్యంలో, ఓటర్లకు తాము ఓటు వేసే అభ్యర్థి నేపథ్యం గురించి తెలుసుకునే హక్కు ఉంది. ఈ కారణంగానే అభ్యర్థులపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల గురించి వార్తాపత్రికల్లో తెలియ జేయాలి. ఇప్పటికీ ఎన్నికల్లో కండబలాన్ని ఉపయోగించడానికి ప్రయత్నించేవారు కొన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం ఉండకూడదు. ఎన్నికల్లో ధనబలాన్ని అరి కట్టడం పెద్ద సవాల్‌గా మిగిలిపోయింది. చట్టాన్ని అమలు చేసే సంస్థల కఠినమైన నిఘా కారణంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో చాలా వరకు ఇటువంటి విపరీత ధోరణులకు అడ్డుకట్ట పడింది. ఎన్నికలను ప్రభావితం చేయగల స్థాయిలో ఇవ్వాళ సోషల్ మీడియా ఉంది. అందులో నకిలీ వార్తల ప్రచారం జరగకుండా చూడాల్సి ఉంది. ఎన్నికలను అన్ని జాగ్రత్తలతో నిర్వహించడం ఎన్నికల సంఘం విధి. ఎన్నికల ప్రక్రియలో ఓటరే ప్రధాన భాగస్వామి. అందుకే ఓటు వేయడానికి కావలసిన స్నేహపూర్వక, సుహృద్భావ వాతావరణాన్ని కల్పించడం ద్వారా ఓటర్లు అధిక సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనేలా ఈసీ తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడానికి కంకణబద్ధమై ఉంది. పౌరులు ఓటరుగా తన కర్తవ్యాన్ని నిర్వహించడానికి గర్వపడగలిగితే అది వారు ఎన్నుకున్న ప్రభుత్వ పాలనా స్థాయి మీద కూడా ప్రభావం చూపుతుంది. పౌరు లందరికీ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు! (క్లిక్ చేయండి: నిర్లక్ష్యానికి గురవుతున్న బాలికా విద్య) - రాజీవ్ కుమార్ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవం) -
ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయల్ నియామకంపై సుప్రీంలో విచారణ
-
అదే రోజు ప్రధాని ఎందుకు ఆమోదించారు: సుప్రీం కోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా మాజీ ఐఏఎస్ అధికారి అరుణ్ గోయల్ నియామకం కాంతి వేగంతో జరిగిందని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యానించింది. సీఈసీ, ఈసీ నియామకాలపై దాఖలైన పిటిషన్లపై.. సుప్రీం కోర్టులో విచారణ గురువారం కొనసాగింది. ఈ క్రమంలో వరుసగా మూడవ రోజు విచారణలోనూ కేంద్రం తీరును తీవ్రంగా తప్పుబట్టింది బెంచ్. తాజా ఎన్నికల కమిషనర్ నియామకంపై ఎందుకు అంత తొందర పడ్డారని ప్రశ్నించింది ధర్మాసనం. ‘‘మా అభ్యంతరం అంతా ఎంపిక ప్రక్రియపైనే’’ అని ధర్మాసనం.. కేంద్రం తరుపున వాదనలు వినిపిస్తున్న అటార్నీ జనరల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. ‘‘మే 15వ తేదీ నుంచి ఎన్నికల కమిషనర్ స్థానం ఖాళీగానే ఉంది. అప్పటి నుంచి నవంబర్ 18వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం అసలు ఏం చేసింది. అంతేకాదు ఒకవైపు ఈ వ్యవహారానికి సంబంధించి పిటిషన్లు విచారణలో ఉండగా ఆయన్ని ఎలా నియమించార’’ని అభ్యంతరం వ్యక్తం చేసింది. నవంబర్ 18న అంత హడావుడిగా నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?. నవంబర్ 18వ తేదీనే ఫైల్ మూవ్ చేసి.. అదే రోజు ప్రధాని ఎందుకు ఆమోదించారు అని కేంద్రాన్ని సూటిగా నిలదీసింది రాజ్యాంగ ధర్మాసనం. ‘‘న్యాయ మంత్రిత్వ శాఖ నాలుగు పేర్లను పరిశీలనలోకి తీసుకుంది. ఆ ఫైల్ నవంబర్ 18వ తేదీన ముందుకు కదిలింది. అదేరోజు ప్రధాని కూడా పేరును రికమండ్ చేశారు. ఈ విషయంలో మాకు మీతో ఎలాంటి సంఘర్షణ అక్కర్లేదు. కానీ, ఎందుకు అంత తొందర అనే విషయాన్ని మాత్రమే మాకు తెలియజేయండి’’ అని కేంద్ర తరపున వాదనలు వినిపిస్తున్న అటార్నీ జనరల్ వెంకటరమణిని ప్రశ్నించింది. ఎన్నికల సంఘంలో నియామకాల కోసం కొలీజియం లాంటి వ్యవస్థ అవసరమంటూ దాఖలైన పిటిషన్లపై.. జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధఱ్మాసనం వరుసగా మూడు రోజులపాటు విచారణ చేపట్టింది. గురువారం నాటికి వాదనలు పూర్తి కావడంతో.. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఎన్నికల సంఘంలో సభ్యులకు ఆరేళ్లపాటు పదవిలో ఉండడం లేదంటే 65 ఏళ్ల వయసు పదవీవిరమణ నడుస్తోంది. కానీ, ఈ రెండింటిలో ఏ ఒక్క దానికి సరిపడా అభ్యర్థుల జాబితాను న్యాయశాఖ సిద్ధం చేయలేకపోతోందని అసహనం వ్యక్తం చేసింది సుప్రీం ధర్మాసనం. అంతేకాదు.. రాజకీయాలకు దూరంగా, స్వతంత్రంగా ఉండే ఎన్నికల కమిషనర్లు.. దేశానికి ఇప్పుడు అవసరమంటూ సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది. ప్రధాని తప్పు చేసినా చర్యలు తీసుకునేంత పారదర్శకత ఉన్న ఈసీలు దేశానికి కావాలంటూ వ్యాఖ్యానించింది కూడా. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నవంబర్ 21వ తేదీన బాధ్యతలు స్వీకరించారు అరుణ్ గోయల్. 1985 బ్యాచ్ పంజాబ్ క్యాడర్‌కు చెందిన ఈ మాజీ ఐఏఎస్‌ను ఇంతకు ముందు కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పని చేశారు. ఇక వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఆయన్ని.. ఆ వెంటనే ఎన్నికల సంఘం కమిషనర్‌గా నియమించింది కేంద్రం. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, మరో ఎన్నికల కమిషనర్ ఏసీ పాండేతో పాటు అరుణ్ గోయాల్ ఎన్నికల కమిషనర్‌గా కొనసాగుతున్నారు. దయచేసి.. నోరు మూస్తారా! కేంద్ర ఎన్నికల సంఘం నియామకాల పిటిషన్ గురువారం విచారణ సందర్భంగా ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఒకవైపు సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం.. కేంద్రాన్ని ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వచ్చింది. అయితే కేంద్రం తరపున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి మాత్రం సహనం కోల్పోయి.. కాస్త దురుసుగా వాదిస్తూ పోయారు. నియామక ప్రక్రియకు సంబంధించిన మొత్తం అంశాన్ని పరిశీలించకుండా పరిశీలనలు చేయవద్దంటూ బెంచ్‌ను ఆయన గట్టిగా కోరారు. మరోవైపు వాదనల సమయంలో ఏజీ వాదిస్తుండగా న్యాయవాది ప్రశాంత్ భూషణ్ జోక్యం చేసుకుని కోర్టుకు నివేదిక సమర్పించబోతుండగా.. ఏజీ తీవ్రంగా స్పందించారు. ‘‘దయచేసి మీరు కాసేపు నోరు మూయండి’ అంటూ ప్రశాంత్ భూషణ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాసేపటికి రాజ్యాంగ ధర్మాసనంలోకి జస్టిస్ అజయ్ రాస్తోగి కలుగుజేసుకుని.. మీరు(ఏజీని ఉద్దేశిస్తూ..) కోర్టు చెప్పింది జాగ్రత్తగా వినాలి. ప్రశ్నలకు సమాధానం మాత్రమే ఇవ్వాలి. మేమంతా సంఘటితంగా ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తున్నాం. మీ ఇష్టానుసారం వ్యవహరించడం కుదరదంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఆ వెంటనే ఏజీ స్పందిస్తూ.. కోర్టుకు సమాధానాలు ఇవ్వడంపై కట్టుబడి ఉన్నానంటూ వ్యాఖ్యానించారు. కేంద్రం ఏం చెప్పిందంటే.. ఎన్నికల సంఘం కోసం ముందుగా సీనియర్ బ్యూరోక్రట్స్తో కూడిన ఓ జాబితాను సిద్ధం చస్తుంది. ఆపై న్యాయశాఖ పరిశీలనకు ఆ జాబితాను పంపుతుంది. అక్కడి నుంచి అది ప్రధాని దగ్గరకు వెళ్తుంది. ఇలా ప్రస్తుతం నడుస్తున్న వ్యవస్థ సజావుగానే ఉంది. ఇందులోన్యాయస్థానాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు అని అటార్నీ జనరల్ బృందం వాదించింది. అయితే కోర్టు మాత్రం వ్యవస్థ తీరు సక్రమంగా లేదని.. పారదర్శకతతో కూడిన వ్యవస్థ అవసరం ఉందని అభిప్రాయపడింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 - ఎన్నికల కమీషనర్ల నియామకం - ప్రక్రియను ఎలా నిర్దేశించలేదని కోర్టు కేంద్రంపై ధ్వజమెత్తింది. ఈ ఆర్టికల్ ఎన్నికల సంఘం నియామక ప్రక్రియను నిర్వచించడానికి పార్లమెంటు ద్వారా ఒక చట్టాన్ని ఉంచింది. కానీ అది గత 72 ఏళ్లలో జరగలేదంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేసింది కూడా. -
..‘ఎస్ సర్’లే సీఈసీలా?!
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు బుధవారం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పలు కీలక సందేహాలు లేవనెత్తింది. ‘‘కేంద్రంలో అధికారంలో ఉండే ప్రతి పార్టీ ఎలాగోలా దాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోవాలని భావిస్తుంది. అందుకోసం అన్ని విషయాల్లోనూ తను చెప్పిన దానికి ‘ఎస్ సర్’ అనేవారినే సీఈసీగా నియమించుకునే ఆస్కారముంది’’ అని పేర్కొంది. ప్రస్తుత నియామక వ్యవస్థ అందుకు వీలు కల్పిస్తోందంటూ న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆక్షేపించింది. ఓవైపు ఈ అంశంపై తమ విచారణ కొనసాగుతుండగానే ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయల్‌ను ఎలా నియమిస్తారని కేంద్రాన్ని ప్రశ్నించింది. దీని వెనక వేరే రహస్య ఉద్దేశాలేమీ లేవు కదా అంటూ నిలదీసింది. ‘‘సీఈసీ, ఈసీల నియామక ప్రక్రియపై దాఖలైన పిటిషన్లపై గత గురువారం నుంచి మేం విచారణ జరుపుతున్నాం. ఓవైపు అది కొనసాగుతుండగానే కేంద్ర సర్వీసులో కొనసాగుతున్న ఐఏఎస్ అధికారిని ముందస్తుగా రిటైర్ చేయించి మరీ ఈసీగా ఎందుకు నియమించాల్సి వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నాం. గోయల్ నియామక ఫైలును పరిశీలన నిమిత్తం మాకు సమర్పించండి’’ అని కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్ఆర్.వెంకటరమణి ఇందుకు తీవ్రంగా అభ్యంతరాలు వెలిబుచ్చినా వాటిని తోసిపుచ్చింది. ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ హృషీకేశ్ రాయ్, జస్టిస్ సి.టి.రవికుమార్ సభ్యులుగా ఉన్నారు. ఈసీలు, సీఈసీ నియామకాలకు కొలీజియం తరహా వ్యవస్థ ఉండాలంటూ దాఖలైన పిటిషన్లపై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు మంగళవారం వాదనలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అవి బుధవారం రోజంతా కొనసాగాయి. కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకోవాలంటే అందులోకి నియామకాలను తొలి దశలోనే పూర్తిస్థాయిలో తనిఖీ చేసే వ్యవస్థ ఉండాలని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ అంశంపై ధర్మాసనానికి, కేంద్రం తరఫున వాదించిన ఏజీ వెంకటరమణికి మధ్య సుదీర్ఘ వాదోపవాదాలు జరిగాయి. ఈసీ స్వతంత్ర ప్రతిపత్తికి 1991 నాటి చట్టం పూర్తి రక్షణ కల్పిస్తోందని ఏజీ వాదించారు. ‘దినేశ్ గోస్వామి కమిటీ నివేదిక ఆధారంగా పార్లమెంటు ఆమోదించిన చట్టమిది. కాబట్టి దాని రూపకల్పన వెనక సరైన ఆలోచన చేయలేదని చెప్పలేం. సీఈసీ, ఈసీల జీతభత్యాలు, పదవీకాలం తదితరాలన్నింటికీ రాజ్యాంగపరమైన రక్షణ ఉంది. కనుక ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరమేదీ లేదు’’ అని స్పష్టం చేశారు. ‘‘కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శి స్థాయిల్లో ఉన్న అధికారులను ఎలక్షన్ కమిషనర్లుగా నియమించడం ఆనవాయితీగా వస్తోంది. అమల్లో ఉన్న విధానం ప్రకారం వారిలో సీనియర్ అధికారి సీఈసీగా నియమితులవుతారు’’ అని వివరించారు. ‘‘మేం ఆనవాయితీని పాటిస్తున్నాం. అలాగాకుండా సీఈసీ నియామకానికి జాతీయ స్థాయిలో ఎన్నికలు పెట్డం సాధ్యం కాదు’’ అన్నారు. ఈ వ్యవస్థ సరిగా పని చేయడం లేదని చెప్పడం తమ ఉద్దేశం కాదని ధర్మాసనం పేర్కొంది. అందుకు పారదర్శక వ్యవస్థ ఉండాలన్నది మాత్రమే తమ ఉద్దేశమని స్పష్టం చేసింది. ‘‘కేంద్రం ఒకవేళ తమ భావజాలమే ఉన్న, తాము చెప్పిన దానికల్లా తలూపే వ్యక్తిని సీఈసీగా నియమిస్తే? అందుకే సీఈసీ నియామక ప్రక్రియపై మేం మరింతంగా దృష్టి సారించాలనుకుంటున్నాం. అందులో సీజేఐనీ చేరిస్తే బాగుంటుంది’’ అని పేర్కొంది. గోయల్‌పై వాదోపవాదాలు ఈసీగా గోయల్ నియామకంపై వాడివేడి వాదనలు సాగాయి. ఓవైపు ఈ కేసులో విచారణ జరుగుతుండగానే కేంద్రం హడావుడిగా ఆయనను నియమించిందని పిటిషనర్ అనూప్ బరన్వాల్ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ‘‘గోయల్ గురువారం దాకా కేంద్రంలో కార్యదర్శి స్థాయి అధికారిగా కొనసాగారు. ఉన్నట్టుండి ఆయనకు వీఆర్ఎస్ ఇచ్చి శుక్రవారానికల్లా ఈసీగా నియమించారు’’ అని గుర్తు చేశారు. తనకు తెలిసినంత వరకూ వీఆర్ఎస్ ఆమోదానికి మూడు నెలలు పడుతుందని జస్టిస్ జోసెఫ్ అన్నారు. గోయల్ ఆయన నియామక ఫైలును సమర్పించాలన్న ఆదేశించారు. దీనిపై ఏజీ తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. ‘‘విచారణ జరుగుతున్నది ఈసీలు, సీఈసీ నియామకాలకు సంబంధించిన విస్తృతమైన అంశం మీద. అలాంటప్పుడు ప్రశాంత్ భూషణ్ తెరపైకి తెచ్చిన ఈ వ్యక్తిగత నియామకాన్ని ఎలా పరిశీలనకు తీసుకుంటారు? దీనికి నేను తీవ్రంగా అభ్యంతరం తెలుపుతున్నా. విచారణ మధ్యలో ఇలా నియామక ఫైలును కోర్టు చూడటంపై చాలా అభ్యంతరాలున్నాయి’’ అన్నారు. వాటిని ధర్మాసనం తోసిపుచ్చింది. ‘‘మేం విచారణ మొదలు పెట్టిన తర్వాత నవంబర్ 19న గోయల్ నియామకం జరిగింది. దానికి కారణమేమిటో తెలుసుకోవడానికే ఫైలు చూడాలనుకుంటున్నాం. నియామకం పూర్తిగా నిబంధనలకు లోబడే జరిగిందని మీరంటున్నారు. దాన్నే మేం పరిశీలించదలచాం. నియామకంలో అక్రమాలేవీ జరగని పక్షంలో మీరు భయపడాల్సిందేముంది? రేపట్లోగా సంబంధిత ఫైలును మా ముందుంచాల్సిందే’’ అని స్పష్టం చేసింది. ‘‘ఫైలును సమర్పిస్తారా, లేదా? దాన్ని బయట పెట్టొద్దనుకుంటుంటే అదే విషయం చెప్పండి. మీరు (ఏజీ) గనక బిజీగా ఉంటే ఫైలును మాకు సమర్పించాల్సిందిగా ఇంకెవరికైనా పురమాయించండి’’ అని జస్టిస్ జోసెఫ్ అన్నారు. ఈసీగా మంగళవారం బాధ్యతలు చేపట్టిన గోయల్ 2025లో రాజీవ్‌కుమార్ రిటైర్మెంట్ అనంతరం సీఈసీ కానున్నారు. ఆయన కేంద్ర భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా డిసెంబర్ 31 దాకా పదవిలో కొనసాగాల్సి ఉండగా ముందస్తు రిటైర్మెంట్ తీసుకున్నారు. మనకిప్పుడో శేషన్ కావాలి! సీఈసీ, ఈసీల నియామకం విషయంలో రాజ్యాంగం మౌనాన్ని ప్రభుత్వాలు తమకు అనుకూలంగా దుర్వినియోగం చేసుకుంటూ వస్తున్నాయంటూ మంగళవారం విచారణ సందర్భంగా ధర్మాసనం అసహనం వెలిబుచ్చడం తెలిసిందే. ఇదో అవాంఛిత పోకడ అంటూ ఆక్షేపించింది. వారి నియామకానికి ఎలాంటి ప్రక్రియనూ ఆర్టికల్ 324 నిర్దేశించని విషయాన్ని గుర్తు చేసింది. ఇందుకోసం చట్టం చేయాలని రాజ్యాంగం నిర్దేశించినా 72 ఏళ్లుగా ఆ పని చేయలేదంటూ తప్పుబట్టింది. ‘‘2004 నుంచి ఒక్క సీఈసీ కూడా ఆరేళ్ల పదవీకాలం పూర్తి చేసుకోలేదు. ఇక పదేళ్ల యూపీఏ పాలనలో ఏకంగా ఆరుగురు సీఈసీలు మారారు. ప్రస్తుత ఎన్డీఏ ఎనిమిదేళ్ల పాలనలో ఏకంగా 8 మంది మారారు’’ అంటూ ఆక్షేపించింది. గట్టి వ్యక్తిత్వమున్న టి.ఎన్.శేషన్ వంటివారు సీఈసీగా రావాలని తాము కోరుకుంటున్నట్టు స్పష్టం చేసింది. ప్రధానిపై ఆరోపణలొస్తే.. సీఈసీ చర్యలు తీసుకోగలరా? ప్రధాని స్థాయి వ్యక్తితో సీఈసీ తలపడాల్సిన పరిస్థితి తలెత్తితే? అందుకాయన సిద్ధపడతారా, ససేమిరా అంటారా? మీకేమనిపిస్తోంది? ప్రధానిపై సీఈసీ చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే... ఆయన ఏ చర్యలూ తీసుకోలేదనుకుందాం. అప్పుడది వ్యవస్థ పూర్తిగా కుప్పకూలినట్టు కాదా? అందుకే సీఈసీకి రాజకీయ ప్రభావం నుంచి సంపూర్ణ రక్షణ తప్పనిసరి. – సుప్రీంకోర్టు ధర్మాసనం సీఈసీ, ఈసీలను పార్టీల ప్రభావం నుంచి దూరంగా ఉంచాలి. అప్పుడే వాళ్లు స్వతంత్రంగా పని చేయగలరు. ఇది జరగాలంటే సీఈసీ ఎంపికలో భారత ప్రధాన న్యాయమూర్తిని కూడా భాగస్వామిని చేయాలి. అప్పుడే కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తిని నిలుపుకుంటూ ఒత్తిళ్లకు అతీతంగా బాధ్యతలు నెరవేర్చగలుగుతుంది. – సుప్రీం ధర్మాసనం -
దేశానికి అలాంటి ఎన్నికల కమిషనర్ కావాలి: సుప్రీం
న్యూఢిల్లీ: దేశ ప్రధాన మంత్రిపై సైతం చర్యలు తీసుకునేంత సత్తా ఉన్న ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్రస్తుతం మన దేశానికి అవసరమని దేశ సర్వోత్తమ న్యాయస్థానం అభిప్రాయపడింది. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తుల ఎంపిక సరైందంటూ అభిప్రాయపడింది సుప్రీం కోర్టు. కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి.. ఎన్నికల కమిషనర్ల నియామకానికి ప్రస్తుతం నడుస్తున్న వ్యవస్థ సరికాదని.. కొలీజియంలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ క్రమంలో.. బుధవారం విచారణ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలే చేసింది బెంచ్. ప్రధాన మంత్రికి వ్యతిరేకంగా చర్యలు తీసుకునే ప్రధాన ఎన్నికల కమిషనర్ మనకు అవసరం. ఉదాహరణకు.. ప్రధానికి వ్యతిరేకంగా ఆరోపణలు వచ్చాయనుకుందాం. ఆ సమయంలో సీఈసీ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సీఈసీ గనుక బలహీనంగా ఉంటే ఎలాంటి చర్యలు తీసుకోలేరు కదా అని జస్టిస్ కె.ఎం.జోసెఫ్, జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ హృషీకేశ్ రాయ్, జస్టిస్ సి.టి.రవికుమార్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనే ఉన్నత స్థానం రాజకీయ ప్రభావం నుంచి రక్షించబడాలి. స్వతంత్రంగా ఉండాలి. కానీ, అలా జరగడం లేదు. ఇది పూర్తిగా వ్యవస్థ విచ్ఛిన్నం కాదా అని కేంద్రం తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. ఎన్నికల కమిషనర్ నియామకంలో అనుసరిస్తున్న యంత్రాంగాన్ని తమకు చూపాలని కేంద్రం తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. దీంతో ప్రభుత్వం తరపున వాదిస్తున్న అటార్నీ జనరల్ & బృందం వివరణలు ఇచ్చుకుంది. కేంద్ర మంత్రివర్గం సలహా మేరకు ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమించాలని రాజ్యాంగంలో ఉందని, ఇంతవరకు అదే అమలవుతోందని ఏజీ ఆర్.వెంకటరమణి బెంచ్‌కు వివరించారు. అంతకు ముందు మంగళవారం వాదనల సందర్భంగా.. సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సున్నితంగా ఉండే ఎన్నికల సంఘం భుజాలపై అపారమైన అధికారాలను రాజ్యాంగం మోపిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సర్వోత్తముడైన వ్యక్తిని ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమించేలా ఓ వ్యవస్థను రూపొందించాలని కేంద్రానికి సూచించింది. ఈ క్రమంలో మాజీ సీఈసీ టీఎన్ శేషన్‌ను గుర్తు చేస్తూ.. అలాంటి గట్టి వ్యక్తి, సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. సమర్థతే కాకుండా దృఢమైన వ్యక్తిత్వం ఉన్నవారిని సీఈసీగా నియమించేందుకు సరైన విధానం రూపొందించాలని అటార్నీ జనరల్ (ఏజీ) ఆర్.వెంకటరమణికి సూచించింది. ఏజీ వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన బెంచ్.. 2004 నుంచి ఒక్క సీఈసీ కూడా ఆరేళ్ల పదవీ కాలాన్ని పూర్తిచేయలేదని తెలిపింది. యూపీఏ, ఎన్డీయే హయాంలో సీఈసీలు మారిన విషయాన్ని గుర్తు చేసింది. అందువల్ల దృఢమైన వ్యక్తులను నియమించేందుకు స్పష్టమైన విధానం ఉండాలని అభిప్రాయపడింది. ఎన్నికల కమిషనర్ల నియామకానికి కొలీజియంలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలంటూ పిల్ దాఖలైంది గతంలో. ఈ పిల్‌ను అక్టోబర్ 2018లో సీఈసీ, ఈసీలతో కూడిన ఐదుగురు జడ్జిల బెంచ్‌కు సిఫార్సు చేసింది. అయితే కేంద్రం మాత్రం అలాంటి వ్యవస్థ అవసరం లేదంటూ వాదిస్తూ వస్తోంది. ఇదీ చదవండి: మోర్బీ విషాదం.. తుప్పుపట్టిన కేబుళ్లు, వదులైన బోల్టులు!! -
నిష్పక్షపాతంగానే గుజరాత్ ఎన్నికల షెడ్యూల్
న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వందకు వంద శాతం నిష్పక్షపాతంగా విడుదల చేశామని, ఆలస్యం కావడం వెనుక ఎలాంటి ఉద్దేశం లేదని కేంద్రం ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. గురువారం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన అనంతరం మీడియా చిట్‌చాట్‌లో ఆయన పాల్గొన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు షెడ్యూల్ అంతా సవ్యంగానే ఉంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు రెండు వారాల గ్యాప్‌లోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాం. అయినప్పటికీ ఈ రెండు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ఒకే రోజు ఉంటుంది అని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ఎన్నికల సంఘం నిష్పాక్షికత.. గర్వించదగ్గ వారసత్వం. మేము 100 శాతం నిష్పక్షపాతంగా ఉన్నాం అని ప్రకటించారాయన. కొందరు ప్రతికూల వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తారు. కానీ, మాటల కంటే చర్యలు, ఫలితాలు ఎక్కువగా మాట్లాడతాయి. కొన్నిసార్లు, కమిషన్‌ను విమర్శించే పార్టీలు ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలను పొందాయి. ఈ కేసులో థర్డ్ అంపైర్ లేడు. కానీ ఫలితాలు సాక్ష్యంగా ఉంటాయి అని రాజీవ్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రధాన ప్రతిపక్షాలు గుజరాత్ షెడ్యూల్ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘంపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ప్రధాని మోదీ గుజరాత్ పర్యటన(దశల వారీగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన జరిగాయి) ముగిసే వరకు ఈసీ ఎదురు చూసిందని, తద్వారా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆటంకం ఎదురు కాకుండా పక్షపాతంగా వ్యవహరించిందని విమర్శిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఇవాళ ఎన్నికల సంఘం గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి కొన్ని గంటల ముందు కూడా కాంగ్రెస్-బీజేపీలు ఈసీ తీరుపై పరస్పరం ట్వీట్లు చేసుకున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్ అసెంబ్లీ కాలపరిమితి ఫిబ్రవరి 18వ తేదీతో ముగియనుండగా.. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ కాలపరిమితి జనవరి 8వ తేదీతో ముగుస్తుంది. నిజానికి ఈ రెండు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికల తేదీలను ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ, అది జరగలేదు. వాతావరణ పరిస్థితుల కారణంగా హిమాచల్‌కు కాస్త ముందుగా షెడ్యూల్ విడుదల చేసినట్లు ఈసీ వెల్లడించింది. మోడల్ ప్రవర్తనా నియమావళి 38 రోజుల పాటు అమలులో ఉంటుంది, ఇదే అతి తక్కువ వ్యవధి. అది ఢిల్లీ ఎన్నికల మాదిరిగానే ఉంటుందని రాజీవ్ కుమార్ తెలిపారు. అంతేకాదు.. అసెంబ్లీ కాలపరిమితికి కౌంటింగ్ డేకి మధ్య 72 రోజుల గ్యాప్ ఉందని గుర్తు చేశారాయన. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుంది. వాతావరణం, అసెంబ్లీ చివరిరోజు లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. సాధారణంగా.. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఫలితాలు ఒకేసారి వెలువడడం ఆనవాయితీగా వస్తోంది. కాబట్టి, సమతుల్యంగా వ్యహరించాల్సిన అవసరం మాకు ఉంది అని సీఈసీ వెల్లడించారు. మోర్బి ప్రమాద బాధితుల కోసం వెలువడే ప్రకటనలు.. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉండవచ్చా? అనే ప్రశ్నకు.. ఏదైనా నిర్ణయం వల్ల స్థాయి ఆటంకం ఏర్పడితే, ఎన్నికల సంఘం చర్య తీసుకుంటుందని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. -
పార్టీల నగదు విరాళాలపై నియంత్రణ.. కేంద్రానికి ఈసీ లేఖ
న్యూఢిల్లీ: ఎన్నికల సంస్కరణలకు సంబంధించి కీలక ప్రతిపాదనలను కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి తెరపైకి తెచ్చింది. ‘‘పార్టీలకు అందే విరాళాల విషయంలో మరింత పారదర్శకత అవసరం. ప్రస్తుతం రూ.20 వేలున్న అనామక నగదు విరాళాల పరిమితిని రూ.2 వేలకు తగ్గించాలి. మొత్తం విరాళాల్లో అవి 20 శాతానికి/రూ.20 కోట్లకు (ఏది తక్కువైతే దానికి) మించరాదు’’ అని పేర్కొంది. ఇలాంటి పలు సంస్కరణలను ప్రతిపాదిస్తూ కేంద్ర న్యాయ మంత్రి కిరెణ్ రిజిజుకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్‌కుమార్ లేఖ రాసినట్టు సమాచారం. వీటికి కేంద్రం ఆమోదం లభిస్తే రూ.2,000కు మించి ప్రతి నగదు విరాళానికీ పార్టీలు లెక్కలు చూపించాల్సి ఉంటుంది. -
18 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసిన సీఈసీ
చమోలి: ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మరోసారి ఆదర్శంగా నిలిచారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర చమోలీ జిల్లాలో కొండప్రాంతంలోని మారుమూల పోలింగ్ స్టేషన్‌కు ఆదివారం 18 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లారు. ‘సుదూరంగా ఉండే డుమాక్ గ్రామంలో ఈ పోలింగ్ స్టేషన్ ఉంది. ఎన్నికల సిబ్బందిని ఉత్సాహపరచాలన్నదే నా ఉద్దేశం. ఈ పోలింగ్ స్టేషన్‌కు ఎన్నికల సిబ్బంది పోలింగ్‌కు మూడురోజులు ముందుగానే చేరుకుంటారు’అని సీఈసీ ఒక ప్రకటనలో తెలిపారు. జమ్మూకశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని పోలింగ్ స్టేషన్లకు చేరుకోవడం సిబ్బందికి చాలా కష్టసాధ్యమైన విషయమని ఆయన అన్నారు. ఎన్నికల కమిషనర్‌గా ఉన్న సమయంలో కూడా ఆయన పలు సందర్భాల్లో రహదారి సౌకర్యం లేని పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఆదర్శంగా నిలిచారు. -
ఎన్నికల హామీలపై పర్యవేక్షణ ఉండాలి
మన దేశ ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌గా రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియలో కొన్ని మార్పులను ప్రజలు ఆకాంక్షి స్తున్నారు. ఎన్నికల నిర్వహణ, రాజకీయ పార్టీల నియమావళి, ఓటర్లకు సౌకర్యాలు కల్పించడం వంటి వాటిలో మార్పులు రావాలని ఆశిస్తున్నారు. పార్లమెంట్, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఈ విషయంలో ఇప్పటికే ఆలోచనలు ఉన్నా, అమలు వాయిదా పడుతూ వస్తున్నది. కొత్త కమిషనర్ సారథ్యంలో ఈ ఆలోచనలు కార్యరూపంలోకి వస్తాయని ఆశిద్దాం. అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై పరిమితులు ఉన్నప్పటికీ... నియంత్రణ వైఫల్యం కనిపిస్తోంది. ‘ఓటుకు నోటు’, మద్యం, ఇతర తాయిలాలతో ఓటర్లను ఆకట్టుకోవడాన్ని నివారిస్తే ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగే అవకాశం మెరుగవుతుంది. పార్టీల ఎన్నికల మేనిఫెస్టోపై ఎన్నికల కమిషనర్ నియంత్రణ కలిగి ఉండాలని చాలామంది బలంగా కోరుతున్నారు. మేనిఫెస్టోలోని హామీల అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలించి, అమలుకు సాధ్యంకాని, ప్రజాకర్షక హామీలను తొలగించే అధికారాన్ని ఎన్నికల కమిషన్ కలిగి ఉండాలి. ఎన్నిక తరువాత కూడా, మేనిఫెస్టోలోని హామీల అమలు ప్రక్రియపై నిరంతర పర్యవేక్షణ బాధ్యతను ఎన్నికల కమిషన్ చేపడితే ప్రజాస్వా మ్యంపై ప్రజల నమ్మకం, కమిషన్ ప్రతిష్ఠ తప్పకుండా పెరుగుతాయి. ఇక ఎన్నికల ప్రక్రియ విషయానికొస్తే... ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితాలో సవరణలు నిరంతరం నిష్పాక్షికంగా, అత్యంత పారదర్శకంగా జరగాల్సి ఉంది. బోగస్ ఓటర్ల ఏరివేత, అర్హుల చేర్పు జనామోదంగా ఉండాలి. ఓటర్ల గుర్తింపును ‘ఆధార్’తో అనుసంధానం వేగిరపర్చాలి. ఎన్నికల నిర్వహణకు వినియోగించే ఈవీఎం (ఎలెక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్)లపై ఉన్న అపోహలను, ట్యాంపరింగ్ ఆరోపణలను ఎన్నికల కమిషన్ పారద్రోలి, ప్రజల విశ్వాసం పెంచే చర్యలు చేపట్టాలి. (చదవండి: విపత్తులు సరే... నివారణ ఎలా?) ఓటింగ్ శాతం పెంచేందుకు కూడా కమిషన్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓటింగ్ శాతం తగ్గితే, ఎన్నికలు అత్యధిక ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించవు. ఎన్నో సవాళ్లు, సంస్కరణలు కొత్త ఎన్నికల కమిషన్‌కు స్వాగతం పలుకుతున్నా... సమర్థవంతంగా పరిష్కరిస్తూ ప్రజామోదం పొందాలని ఆకాంక్షిద్దాం. చరిత్రలో నిలిచిపోయేలా పనితీరు ఉండాలని కోరుకోవడం అత్యాశ ఎంతమాత్రం కాబోదు. (చదవండి: వారికో న్యాయం.. ఊరికో న్యాయం) – ఏఎల్ఎన్ రెడ్డి, హైదరాబాద్ -
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ సమయం గంట పొడిగింపు! దేశంలోనే తొలిసారిగా..
ఉత్తరాఖండ్: వచ్చే ఏడాది ఉత్తరాఖండ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్‌కు గంటపాటు ఆదనంగా సమయాన్ని కేటాయిస్తున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుషీల్ చంద్ర శుక్రవారం ప్రకటించారు. కరోనా ఉధృతి కారణంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు చెందిన ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడం కష్టతరంగా మారిందని, అందుకే దేశంలోనే తొలిసారిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ తెలిపారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరాఖండ్‌లో అసెంట్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే! ఐతే ఓటింగ్ సమయాన్ని గంటపాటు పొడిగిస్తున్నట్లు ఈ రోజు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుషీల్ చంద్ర మీడియాకు తెలిపారు. దీనితో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. కాగా ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర రెండు రోజుల ఉత్తరాఖండ్ పర్యటనలో ఉన్నారు. చంద్ర వెంట ఎన్నికల కమిషనర్లు రాజీవ్ కుమార్, అనూప్ చంద్ర పాండే ఉన్నారు. ఐతే రాష్ట్రవ్యాప్తంగా 601 మైదానాలు, 277 భవనాలను గుర్తించామని, వీటిల్లో సామాజిక దూరాన్ని పాటిస్తూ ఎన్నికల సమావేశాలు నిర్వహించవచ్చని ఆయన తెలిపారు. అభ్యర్థులు వాటిని బుక్ చేసుకునేందుకు వీలుగా, వీటికి సంబంధించిన వివరాలు త్వరలో ఆన్లైన్లో అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ బుకింగ్‌లు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన మాత్రమే చేయబడతామని సుషీల్ చంద్ర సూచించారు. చదవండి: Hyderabad: పబ్బుల యాజమాన్యాలకు సీపీ సీరియస్ వార్నింగ్!! -
కేంద్ర ఎన్నికల సంఘంలో కరోనా కలకలం
-
ఢిల్లీ అసెంబ్లీకి మోగిన ఎన్నికల నగారా
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఫిబ్రవరి 8వ తేదీన ఎన్నికలు, 11న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 14వ తేదీన విడుదలవుతుందని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) సునీల్ అరోరా ప్రకటించారు. సోమవారం ఆయన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈసారి ఎన్నికలలో 1.46 కోట్లకు పైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటారని తెలిపారు. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ పదవీ కాలం ఫిబ్రవరి 22వ తేదీతో ముగియనుంది. ఓటర్ల గుర్తింపు సులువుగా వేగంగా పూర్తయ్యేందుకు అధికారులు అందరికీ క్యూఆర్ కోడ్‌తో కూడిన ఓటర్ స్లిప్పులను అందజేస్తారు. 13,659 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. దివ్యాంగులు, 80 ఏళ్లు పైబడిన పోలింగ్ స్టేషన్‌కు రాలేని వారి కోసం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించనున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన జార్ఖండ్‌లోని ఏడు నియోజకవర్గాల్లో దేశంలోనే మొదటిసారిగా ఈ వెసులుబాటును కల్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లోలో తమ పార్టీ రిపోర్టు కార్డుతోనే మరోసారి విజయం సాధించాలని ఆప్ చీఫ్ కేజ్రీవాల్ అశిస్తున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వ విజయాలు, ఆయన సమ్మోహకశక్తి తమ ప్రచారాస్త్రాలని బీజేపీ అంటోంది. అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అకాలీదళ్‌తో కలిసి పోటీ చేయనుంది. చాన్నాళ్లుగా ఢిల్లీ కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉన్న షీలాదీక్షిత్ మరణంతో చతికిలబడ్డ ఢిల్లీ కాంగ్రెస్‌కు ఇటీవల పార్టీ జార్ఖండ్‌లో సాధించిన విజయం నూతనోత్సాహాన్ని ఇచ్చింది. ముక్కోణపు పోటీ 2015 ఎన్నికల్లో ఆప్ 67 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చింది. నాడు బీజేపీ మూడు సీట్లు గెలవగా, కాంగ్రెస్‌కు ఒక్కటీ దక్కలేదు. ఈసారి ఎన్నికలలో అరడజను పైగా పార్టీలు తలపడనున్నా ప్రధాన పోటీ ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ఉండనుంది. ఈ మూడు పార్టీలు ఢిల్లీలో ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించాయి. ఆప్ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తుండగా 22 ఏళ్లుగా ఢిల్లీ పీఠానికి దూరమైన బీజేపీ, 15 ఏళ్లు ఢిల్లీని ఏకధాటిగా ఏలినా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటూ గెలవని కాంగ్రెస్.. సత్తా చాటుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. -
సరిహద్దులో యుద్ధమేఘాలు: సీఈసీ కీలక వ్యాఖ్యలు
లక్నో: భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దుల్లో నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని సార్వత్రిక ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు ఉండొచ్చంటూ వస్తున్న వార్తలను కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది. దేశంలో ఎన్నికలు సకాలంలో నిర్వహిస్తామని, వాయిదా వేసే ఆలోచనే లేదని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు రెండు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన సునీల్ అరోరా శుక్రవారం లక్నోలో అక్కడి అధికారులతో సమీక్ష సందర్భంగా మాట్లాడారు. ఎన్నికల నిబంధనల్లో కొత్తగా కొన్ని మార్పులను ప్రతిపాదించామని సునీల్ అరోరా చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు విదేశాల్లో ఉన్న ఆస్తులను కూడా చూపాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు ఇచ్చే ఆస్తుల వివరాలపై ఆదాయపు పన్ను శాఖ పరిశీలిస్తుందని, తేడాలు వస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆస్తుల వివరాలన్నింటినీ తాము అధికారిక వెబ్ సైట్లో పొందుపరుస్తామని, ఆదాయపు పన్ను శాఖ సుమోటోగా ఆస్తుల వివరాలను పరిశీలిస్తుందని తెలిపారు. దీనికోసం తమ అనుమతి తీసుకోవాల్సిన అవసరం కూడా రాదని చెప్పారు. త్వరలో తాము సీ-విజిల్ యాప్ ను అందుబాటులోకి తీసుకుని రానున్నామని, దీనిద్వారా అభ్యర్థులపై ప్రజలు స్వచ్ఛందంగా ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. ఫిర్యాదిదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని అన్నారు. ప్రజలను రెచ్చగొట్టేలా, విధ్వేషపూరితమైన ప్రసంగాలపై నిఘా ఉంటుందని సునీల్ అరోరా చెప్పారు. గత ఎన్నికల ప్రచారంలో కొన్ని కేసులను నమోదు చేశామని గుర్తుచేశారు. ఇలాంటి ప్రసంగాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంటుందని అన్నారు. తమ దృష్టికి వచ్చిన విధ్వేష పూరిత ప్రసంగాలను ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీల పరిశీలనకు పంపిస్తామని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో ఎన్నికల ప్రచారంపై దృష్టి పెడతామని చెప్పారు. పెయిడ్ ఆర్టికల్స్ లపై ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. -
ఈవీఎంలపై సందేహాలు అవసరం లేదు
-
పోస్ట్ డేటెడ్ చెక్కులపై ఫిర్యాదులు అందాయి
-
పోస్ట్ డేటెడ్ చెక్కులపై ఫిర్యాదులు అందాయి
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకే సారి జరుగుతాయని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరా స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యామని.. వాళ్లు కొన్ని అభ్యంతరాలు చెప్పారన్నారు. ఓటర్ల జాబితాలో తప్పులున్నాయని.. ఒక్కరికే రెండు, మూడు ఓట్లున్నాయన్న విషయం తమ దృష్టికి తీసుకొచ్చారని సీఈసీ చెప్పారు. కొన్ని పార్టీలు రేషన్ కార్డులు, పెన్షన్లు ఇచ్చేటప్పుడు ప్రమాణాలు చేయించుకుంటున్నట్లు ఫిర్యాదులు అందాయన్నారు. మహిళా ఓటర్లకు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తున్నారని ఫిర్యాదులు రావడంతో వాటిపై ప్రభుత్వం నుంచి నివేదిక కోరామని చెప్పారు. ఫిర్యాదులు వచ్చిన చోట్ల ర్యాండమ్ ఆడిట్ చేయాలని నిర్ణయించినట్లు సునీల్ అరోరా అన్నారు. ఎన్నికల దృష్టిలోనే కొన్ని బదిలీలు జరిగాయని ఫిర్యాదులు అందాయన్నారు. ఈ విషయంపై సీఎస్, డీజీపీలతో చర్చించామని, వాళ్లు సర్టిఫికెట్ ఇచ్చాక వాటిపై విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు. కులాల ఆధారంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం కుదరదని ఆయన స్పష్టం చేశారు. (పార్టీలకు అనుబంధ సంఘంగా పనిచేయొద్దు) ఈవీఎంలపై సందేహాలు అవసరం లేదు ఈవీఎంలు దుర్వినియోగం అయినట్టుగా ఇప్పటి వరకు తమ దృష్టికి రాలేదని సీఈసీ సునీల్ అరోరా అన్నారు. ప్రస్తుత డీజీపీపై లిఖిత పూర్వక ఫిర్యాదులు రాలేదని.. వస్తే పరిశీలిస్తామని ఆయన అన్నారు. ఈవీఎంలపై సందేహాలు అవసరం లేదన్నారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగడం అసాధ్యమని చెప్పారు. దాదాపు అన్ని పార్టీలు ఈవీఎంలపై సంతృప్తి వ్యక్తం చేశాయని చెప్పారు. కొన్ని పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయన్నారు. ఆర్టీజీస్ ద్వారా జరిగిన సర్వే అంశాన్ని ఏపీ ఎన్నికల అధికారి పరిశీలించి విచారణ చేస్తారని ఆయన చెప్పారు. -
ఈవీఎం ఫలితాలను వీవీప్యాట్లతో పోల్చాలి
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఫలితాల ప్రకటనకు ముందుగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రా(ఈవీఎం)ల ద్వారా వెల్లడైన ఫలితాలను ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్స్(వీవీప్యాట్లు)లతో సరిపోల్చాలని ప్రతిపక్షాలు కోరాయి. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ ప్రతిపక్షాలు సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ)ని కలిసి వినతిపత్రం ఇచ్చాయి. వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంల ఫలితాలను వీవీ ప్యాట్లతో పోల్చి చూడాలనీ, సగం ఈవీఎంల ఫలితాలనైనా వీవీప్యాట్లతో సరిపోల్చి చూశాకే ఫలితాలను వెల్లడించాలని నేతలు కోరారు. గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థికి, రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థికి 5 శాతం కంటే తక్కువగా ఓట్ల తేడా ఉన్న సందర్భాల్లో కూడా ఆ నియోజకవర్గంలోని అన్ని ఈవీఎంలను వీవీప్యాట్లతో పూర్తిగా సరిచూసిన తర్వాతే ఫలితం ప్రకటించాలన్నారు. ఇటీవల ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, తెలంగాణలో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు తేడా ఉందని తేలినట్లు వివరించారు. ఈసీని కలిసిన నేతల్లో కాంగ్రెస్‌కు చెందిన గులాంనబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, అహ్మద్ పటేల్, ఆనంద్ శర్మ, చంద్రబాబు నాయుడు(టీడీపీ), మజీద్ మెమన్(ఎన్సీపీ), డెరెక్ ఒ బ్రియాన్(టీఎంసీ), ఫరూఖ్ అబ్దుల్లా(ఎన్సీ) తదితరులున్నారు. సాధ్యమైతే చేస్తాం:ఈసీ ప్రతిపక్షాలు పేర్కొన్న అంశాలకు సంబంధించి కోర్టు తీర్పులను, సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా, కమిషనర్ అశోక్ లావాసా తెలిపారు. గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థికి, రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థికి 5 శాతం ఓట్ల తేడా ఉన్నప్పుడు ఈవీఎంలతోపాటు వీవీప్యాట్లను పరిశీలించాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. -
ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్
-
ఢిల్లీ చేరుకున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక రీతిలో అధికార తెలుగుదేశం పార్టీ ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతుండడం, అధికార యంత్రాంగాన్ని, పోలీసు వ్యవస్థను దర్వినియోగం చేస్తున్న తీరుపై వైఎస్ జగన్ సోమవారం ఉదయం 11.30 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు. సర్వేల పేరుతో టీడీపీ వ్యతిరేక ఓటర్లను జాబితా నుంచి తొలిగిస్తుండడాన్ని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈసీ) సునీల్ అరోరా దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరనున్నారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవికి రాజీనామా చేసిన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. -
సీఈసీని కలిసేందుకు ఢిల్లీ బయల్దేరిన వైఎస్ జగన్
-
రేపు సీఈసీని కలవనున్న వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా ఓట్ల తొలగింపు, ఇతర అవకతవకలపై కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. పార్టీకి చెందిన మాజీ ఎంపీలు, ముఖ్య నేతలతో కలిసి ఆయన ఆదివారం సాయంత్రం ఢిల్లీకి పయనమయ్యారు. సోమవారం ఉదయం 11.30గంటలకు వైఎస్ జగన్ పార్టీ నేతలతో కలిసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ)ను కలుస్తారు. ఓటర్ల జాబితాలో పెద్దఎత్తున చోటుచేసుకున్న అవకతవకలు, అక్రమంగా పేర్ల తొలగింపు అంశాలతోపాటు రాష్ట్ర డీజీపీ వ్యవహారశైలిపైనా సీఈసీకి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. -
మళ్లీ బ్యాలెట్‌కు నో
న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) విశ్వసనీయతపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) సునీల్ అరోరా స్పందించారు. ఈవీఎంలకు బదులుగా బ్యాలె ట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలన్న కొన్ని రాజకీయ పక్షాల డిమాండ్‌కు తలొగ్గబోమని స్పష్టం చేశారు. మళ్లీ బ్యాలెట్ బాక్సులను వినియోగించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఈవీఎంలను కొందరు ఫుట్బాల్లా ఆడుకుంటున్నారనీ, వాటి పనితీరుపై ఉద్దేశపూర్వకంగానే బురద చల్లుతున్నారని మండిపడ్డారు. బ్యాలెట్‌తో సిబ్బందికి నరకమే.. ఢిల్లీలో గురువారం జరిగిన ‘మేకింగ్ అవర్ ఎలక్షన్స్ ఇన్‌క్లూజివ్ అండ్ యాక్సెసబుల్’ అనే కార్యక్రమంలో అరోరా మాట్లాడుతూ.. ‘నేను ఒక విషయాన్ని స్పష్టం చేయదలచుకున్నాను. ఇప్పుడే కాదు.. భవిష్యత్‌లో కూడా మేం బ్యాలెట్ పేపర్ల విధానానికి మొగ్గుచూపబోం. మనుషుల సాయంతో బ్యాలెట్ బాక్సులను ఎత్తుకెళ్లడం, కౌంటింగ్‌లో తీవ్రమైన ఆలస్యం.. ఇదంతా పోలింగ్ సిబ్బందికి నరకంలా ఉంటుంది. రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి విమర్శలు, సలహాలు స్వీకరించేందుకు సిద్ధం గా ఉన్నాం. ఇదే సమయంలో బెదిరింపులు, ఒత్తిడి, విజ్ఞప్తులకు తలొగ్గి ఈవీఎంలను వదిలి బ్యాలెట్ విధానానికి మళ్లే ప్రసక్తే లేదు. మనం ఈవీఎంలను ఫుట్‌బాల్‌గా ఎందుకు మార్చేశాం? వాటిపై ఉద్దేశపూర్వకంగా బురదచల్లే కార్యక్రమం కొనసాగుతోంది’ అని తెలిపారు. ఒకే ఫలితం రావాలి కదా.. ఈవీఎంల సమర్థతపై స్పందిస్తూ..‘2014 లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్నిరోజులకే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భిన్నమైన ఫలితాలు వచ్చాయి. ఆ తర్వాత హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, త్రిపుర, నాగాలాండ్, మిజోరంతో పాటు తాజాగా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్తాన్.. ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కోరకంగా ఎన్నికల ఫలితాలు నమోదయ్యాయి. నిజంగా ఈవీఎంలలో సమస్య ఉంటే ఇక్కడంతా ఒకేరకమైన ఫలితాలు రావాలి కదా. ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలను అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్)లో రూపొందిస్తారు. వీటిని హ్యాక్ లేదా ట్యాంపరింగ్ చేయడం అసాధ్యం. ఇటీవల రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 1.76 లక్షల పోలింగ్ కేంద్రాల్లో కేవలం ఆరంటే ఆరు చోట్ల మాత్రమే ఈవీఎంల్లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ విషయంలో అలసత్వం చూపకుండా మేం వెంటనే స్పందించి పరిస్థితిని చక్కదిద్దాం’ అని అరోరా వెల్లడించారు. ఇక వీవీప్యాట్ యంత్రాలకు సంబంధించి చిన్నచిన్న ఘటనలు నమోదయ్యాయని అంగీకరించారు. వీవీప్యాట్ యంత్రాల వినియోగం విషయంలో ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నామనీ, ఈ తప్పుల నుంచి నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు. ‘బ్యాలెట్’తోనే ఎన్నికలు జరపండి త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించాలని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఈవీఎంల సమర్థతపై తలెత్తిన వివాదంతో మొత్తం ఎన్నికల ప్రక్రియపైనే నీలినీడలు కమ్ముకున్నాయని వ్యాఖ్యానించారు. రాజకీయ అవసరాల కోసం సాంకేతికను దుర్వినియోగం చేస్తున్నారనీ, ఇందులో తమకు ఎలాంటి అనుమానం లేదని స్పష్టం చేశారు. విద్యావంతులైన ప్రజలు ఈవీఎంలకు వ్యతిరేకంగా గొంతు విప్పాలన్నారు. హ్యాకర్ సయిద్ షుజా చేసిన ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని డిమాండ్‌చేశారు. -
మళ్లీ బ్యాలెట్ పేపర్లను వాడే ప్రసక్తే లేదు: ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాలెట్ పేపర్లను వాడే ప్రసక్తే లేదని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలు ఈవీఎంల పనితీరుపై వ్యక్తం చేస్తున్న అనుమానాలను కొట్టిపారేసింది. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నికల ప్రధాన కమిషనర్(సీఈసీ) సునీల్ అరోరా బ్యాలెట్ పేపర్ల వినియోగంపై స్పష్టత ఇచ్చారు. మన దేశంలో ఎన్నికల సంఘం వినియోగిస్తున్న ఈవీఎంలను ఎవరూ హ్యాక్ చేయలేరని పేర్కొన్నారు. ఈవీఎంలపై అనుమానమే లేనపుడు ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లను ఎందుకు వినియోగించాలని ప్రశ్నించారు. బీఈఎల్, ఈసీఐఎల్ రూపొందించే ఈవీఎంలను ఎవ్వరూ హ్యాక్ చేయలేరని స్పష్టం చేశారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈవీఎంలను రూపొందిస్తామనీ, సాంకేతిక కమిటీ సమక్షంలో నిబంధనల మేరకు ఈ యంత్రాలను కఠినమైన పరీక్షలకు లోనుచేస్తామని వెల్లడించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను(ఈవీఎం) హ్యాక్ చేయడం ద్వారానే బీజేపీ విజయం సాధించిందని సయిద్ షుజా అనే హ్యాకర్ చేసిని ఆరోపణలపై తీవ్ర రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. -
తదుపరి సీఈసీ సునీల్ అరోరా!
న్యూఢిల్లీ: తదుపరి ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)గా సునీల్ అరోరా నియమితులు కానున్నారు. ఆయన నియామకాన్ని కేంద్రం నిర్ధారించిందని, సంబంధిత ఫైల్ రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్లిందని న్యాయశాఖలోని విశ్వసనీయ వర్గాలు సోమవారం వెల్లడించాయి. ఈ నియామకానికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలిపాయి. ప్రస్తుత సీఈసీ ఓపీ రావత్ స్థానంలో డిసెంబర్ 2న ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశముందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల నిర్వహణను సీఈసీగా ఆయనే పర్యవేక్షిస్తారన్నారు. 2019లో లోక్‌సభ ఎన్నికలతో పాటు ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, హరియా ణా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరుగు తాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఆరేళ్లు, లేదా 65 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆ పదవిలో కొనసాగుతారు. 1980 బ్యాచ్ రాజస్తాన్ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన సునీల్ అరోరా ఎన్నికల కమిషనర్‌గా 2017, ఆగస్ట్ 31న నియమితులయ్యారు. అంతకుముందు సమాచార, నైపుణ్యాభివృద్ధి శాఖల్లో కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. ప్లానింగ్ కమిషన్‌లో, ఆర్థిక, టెక్స్టైల్ శాఖల్లో, ఇండియన్ ఎయిర్ లైన్స్ సీఎండీగా కీలక బాధ్యతలు నిర్వహించారు. -
పింక్ బ్యాలెట్ కొనసాగుతుంది : సీఈసీ
సాక్షి, హైదరాబాద్ : ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో పింక్ బ్యాలెట్ కొనసాగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఓం ప్రకాశ్ రావత్ స్పష్టం చేశారు. సాంకేతికత ద్వారా డూప్లికేట్ ఓటర్లను తొలగించడమనేది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన నగరంలోని తాజ్ కృష్ణా హోటల్లో విలేకరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా... ఎన్నికలు సజావుగా సాగేందుకు అన్ని జిల్లాల టీమ్‌లతో సమీక్ష చేశామని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల ఆరోపణలు- ప్రత్యారోపణల నేపథ్యంలో పర్యవేక్షణ చర్యలు ఉండాలని, శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 32574 పోలింగ్ కేంద్రాలు ఉండగా అదనంగా మరో 222 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈవీఎంలలో ఓట్లు లెక్కపెట్టిన తర్వాత అనుమానాలు ఉంటే వీవీప్యాట్లలో ఓట్లను టాలీ చేస్తామని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 211 పెయిడ్ న్యూస్ కేసులు.. వివిధ రాజకీయ పార్టీలతో ఓపీ రావత్ సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అధికార దుర్వినియోగం, ఉద్యోగుల కేసుల మీద ఇచ్చిన జీవో, టెలిఫోన్ ట్యాపింగ్, మత విద్వేషాలు, మంత్రుల పర్యటనలు వంటి పలు అంశాల మీద ఫిర్యాదులు అందాయని ఆయన పేర్కొన్నారు. అధికార పార్టీ మీద వచ్చిన ఫిర్యాదులపై స్పందించడం లేదన్న ఆరోపణలను కొట్టిపారేశారు. డబ్బులు, చీరలు, మద్యం పంపిణీ మీద కొన్ని పార్టీలు ఫిర్యాదు చేశాయని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించిన ప్రతీ పార్టీపైనా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రచార కార్యక్రమాల్లో నాయకులు వాడుతున్న భాష మీద వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నామన్నారు. అదేవిధంగా డబ్బు ఖర్చు విషయంలో ఉల్లంఘనలకు పాల్పడిన అభ్యర్థుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మీడియాలో పెయిడ్ న్యూస్ వేస్తున్నారని, పార్టీ సొంత పేపర్, ఛానెల్స్ ద్వారా విద్వేషపు ప్రచారం చేస్తున్నారంటూ వివిధ రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేశాయని ఓపీ రావత్ తెలిపారు. ఈ క్రమంలో 211 పెయిడ్ న్యూస్ కేసులు వచ్చాయని పేర్కొన్నారు. ఇటువంటి చర్యలపై కచ్చితంగా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. -
ఆ గుర్తును తెలంగాణలో నిలిపివేశాం : రజత్ కుమార్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి కారు గుర్తుకు, ఆటో గుర్తుకు మధ్య తికమక ఉందన్న ఫిర్యాదు మేరకు ఆటో గుర్తును తెలంగాణలో నిలిపివేసినట్లు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నివేదిక ఇచ్చామన్నారు. అక్టోబర్ 12 నాడు జాబితా విడుదల చేసామని తెలిపారు. అక్టోబర్ 14న హార్డ్ కాపీలు ఎన్నికల అధికారుల కార్యాలయాల్లో అంటించామని, వాటిని అప్డేట్ చేస్తున్నామని పేర్కొన్నారు. నవంబర్ 19 తరువాత రెండవ జాబితా విడుదల చేస్తామన్నారు. అందరూ ఓటర్ల జాబితాలో తమ పేరును చెక్ చేసుకోవాలని సూచించారు. మహిళల కంటే పురుష ఓటర్లు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. 4 లక్షల 12వేల మందికిపైగా వికలాంగులు పెన్షన్ తీసుకుంటున్నారని వెల్లడించారు. బ్రెయిల్ లిపిలో ఓటర్ కార్డులు ఇస్తామన్నారు. వాహన సదుపాయాలు, వీల్ ఛైర్లు అందుబాటులో ఉంచేందుకు ఎంతమంది ఉన్నారో వివరాలు సేకరించాలన్నారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘ పోలింగ్ స్టేషన్లలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. స్లోప్ మరింత పెంచేందుకు ఆదేశాలిచ్చాం. నవంబర్ 24, 25న అబ్జర్వర్లు వచ్చి ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. ఇప్పటి వరకు రూ. 31.41కోట్ల నగదు సీజ్ చేసాం. రూ. 25.83 కోట్ల రూపాయలు పోలీస్ ఫోర్స్ ద్వారా రూ. 5.58 కోట్లు ఐటీ శాఖ ద్వారా సీజ్ చేశాం. కోటి విలువైన మద్యం సీజ్ చేశాం. గుడుంబా నిర్మూలన జరిగింది. చత్తీస్ఘడ్, ఆంధ్రా, మహారాష్ట్ర అధికారులతో సమావేశాలు నిర్వహించాం. కావాల్సిన పోలీస్ సిబ్బంది ఉన్నారు. 307 కంపెనీలను అడిగాం, చర్చలు నడుస్తున్నాయి. 22 కంపెనీలు ఇప్పటికే రాష్ట్రానికి వచ్చారు. ఓటింగ్‌లో ప్రజలు స్వేచ్చగా పొల్గొనేందుకు మార్చ్ ఫాస్ట్‌లు ప్రారంభిస్తాం. 6 లైసెన్సు లేని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం. 7411 లైసెన్సు ఉన్న ఆయుధాలను స్వాధీనం చేశారు. 43,191 మందిని బైండోవర్ చేశాం. 3765 మందికి నోటీసులు పంపించాం. అధికార బంగళాలను పార్టీకోసం వినియోగిస్తున్నారన్న ఫిర్యాదుపై టీఆర్ఎస్ పార్టీకి లేఖ రాశాం. ఓటర్ల అవగాహన కోసం ప్రచారం చేస్తున్నాం. గతంలో కంటే ఇప్పుడు మహిళా ఓటర్ల నమోదు సంఖ్య పెరిగింది. తెలంగాణలో ఆంధ్ర ప్రదేశ్ పోలీసుల వ్యవహారంపై ఏపీ డీజీపీని వివరాలు కోరుతాం. గచ్చిబౌలిలో జరిగే సెన్సేషనల్ ఈవెంట్‌పై విచారణ చేపడతాం. ఏ ఈవెంట్ కైనా స్థానిక అధికారుల అనుమతి ఇస్తారు. నారాయణఖేడ్ నియోజకవర్గ అభ్యర్ది మాటలపై విచారణకు ఆదేశించాం. ఆ కేసు అట్రాసిటి కిందకు వస్తుంది. 11కేసులు పరిష్కరించాం. 46 ఫిర్యాదులపై విచారణ జరుగుతోంది. నామినేషన్ రోజునుంచే ప్రకటనల ఖర్చు లెక్కిస్తాం. ప్రస్తుత ఖర్చుపై పార్టీ అకౌంట్ లెక్కలు చూపించమని అడుగుతాం. అన్ని మీడియాలను 24గంటలు రికార్డ్ చేస్తున్నాం. ఎవరైనా ఫిర్యాదులు చేస్తే మేం చర్యలు తీసుకుంటాం. అవసరమైతే సోషల్ మీడియా సహకారం తీసుకుంటాం. అన్ని శాఖలు, అన్ని సంస్థల నుంచి నాకు రిపోర్టులు వస్తున్నాయి. సీవిజిల్ యాప్ ఆలస్యంపై నేను కూడా సంతృప్తిగా లేను. ఈ యాప్ అందుబాటులోకి వస్తే ఎన్నికల కోడ్ అమలు మరింత సులువవుతుంది. త్వరలోనే ఈ యాప్ అందుబాటులోకి వస్తుంది. మంత్రుల పీఆర్వోల ప్రచారంపైన దృష్టిసారిస్తాం’’ అని అన్నారు. -
ఎన్నికల్లో ధనప్రవాహాన్ని అరికట్టండి
హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో మద్యం, ధన ప్రవాహాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. శనివారం బీసీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిందని విమర్శించారు. అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడే కోట్ల రూపాయలు వెదజల్లడం, మద్యం ప్రలోభా లను చూపడం ప్రారంభించా యని ఆరోపించారు. డిసెం బర్ 7 వరకు బీరు షాపులు, బార్లు మూసివేయాలని, ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, డబ్బులు ఇవ్వడానికి యత్నించే నాయకులపై నిఘా ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో బీసీ నాయకులు జి. కృష్ణ, వెంకటేశ్, సత్యనారాయణ, బర్కకృష్ణ పాల్గొన్నారు. -
‘జమిలి’కి చాన్సే లేదు: సీఈసీ రావత్
ఔరంగాబాద్: దేశంలో జమిలి ఎన్నికలు జరిగే అవకాశమే లేదని ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ స్పష్టం చేశారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ముందుగా న్యాయపరమైన ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుందన్నారు. అందుకే పార్లమెంటు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించటం సాధ్యం కాదన్నారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం ఓటరు ధ్రువీకరణ పత్రాలు (వీవీపీఏటీ) యంత్రాలు 100% సిద్ధంగా ఉన్నాయన్నారు. 2019 ఎన్నికల కోసం 17.5 లక్షల వీవీపీఏటీలు ఆర్డర్ ఇవ్వగా.. ఇందులో 10 లక్షల యంత్రాలు వచ్చేశాయన్నారు. మిగిలినవి కూడా త్వరలోనే వస్తాయని ఆయన వెల్లడించారు. సహజంగానే సార్వత్రిక ఎన్నికలకు 14 నెలల ముందునుంచే ఎన్నికల సంఘం సిద్ధమవుతుందని ఈసారి కూడా 2018 ఫిబ్రవరి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నామని ఆయన చెప్పారు. -
జమిలి ఎన్నికలపై తేల్చేసిన రావత్..
సాక్షి, ముంబై : న్యాయపరమైన ప్రక్రియ చేపట్టకుండా దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ స్పష్టం చేశారు. పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ అలాంటి అవకాశం లేదని తేల్చిచెప్పారు. గురువారం ఔరంగాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై వివరణ ఇచ్చారు. జమిలి ఎన్నికలపై బీజేపీ చీఫ్ అమిత్ షా లా కమిషన్‌కు లేఖ రాయడం, లా కమిషన్ సానుకూలంగా స్పందించిన క్రమంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ వివరణ ప్రాధాన్యత సంతరించకుంది. దేశవ్యాప్తంగా ఏకకాల ఎన్నికలతో నిర్వహణ వ్యయం తగ్గడంతో పాటు దేశమంతటా ఎప్పుడూ ఎన్నికల వాతావరణం నెలకొనే పరిస్థితికి చెక్ పెట్టవచ్చని అమిత్ షా చెబుతున్నారు. జమిలి ఎన్నికలు కేవలం ప్రతిపాదన కాదని, గతంలో విజయవంతంగా ఈ ప్రయోగాన్ని అమలు చేశారని, తిరిగి దీన్ని అమలుపరచవచ్చని లా కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ బీఎస్ చౌహాన్‌కు గతవారం అమిత్ షా రాసిన ఎనిమిది పేజీల లేఖలో పేర్కొన్నారు. కాగా వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలతో పాటు ఎనిమిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వీలైతే నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధంగా ఉందని గతంలో రావత్ పేర్కొన్నారు. అయితే జమిలి ఎన్నికల నిర్వహణకు అవసరమైన యంత్రాంగం, సాధనా సంపత్తి లేవని ఈసీ వర్గాలు స్పష్టం చేశాయి. -
‘లోక్‌సభ, 4 అసెంబ్లీలకు అయితే ఓకే’
న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించాల్సి వస్తే.. అందుకు సిద్ధంగానే ఉన్నామని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. డిసెంబర్లో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభకు ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన సామర్థ్యం తమకుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ బుధవారం తెలిపారు. లోక్‌సభ ఎన్నికలను ముందస్తుగా నిర్వహించనున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ ఎన్నికలకు అవసరమైన అన్ని ఈవీఎంలు సెప్టెంబర్ చివరి నాటికి, వీవీప్యాట్లు నవంబర్ చివరి నాటికి సిద్ధంగా ఉంటాయని రావత్ తెలిపారు. మిజోరం అసెంబ్లీ ఈ డిసెంబర్ 15 నాటికి, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ అసెంబ్లీలు వరుసగా వచ్చే సంవత్సరం జనవరి 5, జనవరి 7, జనవరి 20 నాటికి ముగుస్తాయి. ఈ నెలలోనే జమిలిపై నివేదిక లోకసభ, అన్ని అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన న్యాయ ప్రక్రియను లా కమిషన్ ఈ నెలలోనే కేంద్రానికి సిఫారసు చేయనుంది. కమిషన్‌లోని ఉన్నతాధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. ‘మేం ఏకకాల ఎన్నికలకు మద్దతు తెలుపుతామా లేదా అని మమ్మల్ని అడగలేదు. అందుకు సంబంధించిన మార్గా న్ని సూచించే పనిని మాత్రమే మాకు అప్పజెప్పారు’ అని ఆ అధికారి చెప్పారు. ఏకకాలం లో ఎన్నికలు నిర్వహించేందుకు రాజ్యాంగానికి, ప్రజా ప్రతినిధుల చట్టానికి చేయాల్సిన సవరణలను కమిషన్ సిఫారసు చేయనుంది. ఆ సిఫారసులను కేంద్రం తప్పనిసరిగా పాటించకపోవచ్చనీ, అయితే రాజకీయ పార్టీ లు, భాగస్వామ్య పక్షాల మధ్య చర్చ జరుగుతుందని అధికారి అన్నారు. రాజ్యాంగానికి కనీసం రెండు సవరణలైనా చేసి, మెజారిటీ రాష్ట్రాలు కూడా సవరణలను ఆమోదిస్తేనే ఏకకాల ఎన్నికలను నిర్వహించడం సాధ్యమవుతుందని కమిషన్ ఇప్పటికే చెప్పింది. -
వీవీప్యాట్‌ల్లో చిన్న మార్పులు
న్యూఢిల్లీ: ఓటు ధ్రువీకరణ యంత్రాలు (వీవీప్యాట్) సక్రమంగా పనిచేసేలా వాటికి చిన్న చిన్న మార్పులు చేసినట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓం ప్రకాశ్ రావత్ చెప్పారు. 10 రాష్ట్రాల్లోని నాలుగు లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాలకు ఈ ఏడాది మే 28న ఉప ఎన్నికలు నిర్వహించడం తెలిసిందే. ఇందుకోసం మొత్తం 10,300 వీవీప్యాట్ యంత్రాలను ఉపయోగించగా దాదాపు 1,150 యంత్రాలు మధ్యలో మొరాయించాయి. దీంతో సాంకేతిక నిపుణులు ఆయా యంత్రాలను పరిశీలించి అవి పనిచేయకపోవడానికి మూల కారణాన్ని గుర్తించారు. కాంట్రాస్ట్ సెన్సర్‌పై నేరుగా కాంతి పడుతుండటం వలన కొన్ని యంత్రాలు పనిచేయలేదనీ, దీనిని నివారించడంకోసం కాంట్రాస్ట్ సెన్సర్లపై చిన్న ముసుగును వినియోగించనున్నట్లు రావత్ వెల్లడించారు. అలాగే గాలిలో తేమ ఎక్కువ కావడం వల్ల ఆ తడికి పేపర్ కాస్త మెత్తబడటంతో మరికొన్ని వీవీప్యాట్ యంత్రాలు ఓటు ధ్రువీకరణ కాగితాన్ని ముద్రించలేకపోయాయని ఆయన వివరించారు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ఇకపై గాలిలోని తేమకు మెత్తబడకుండా ఉండే కాగి తాన్నే వీవీప్యాట్ యంత్రాల్లో ఉపయోగిస్తా మని తెలిపారు. ఓటర్లు ఈవీఎంలో ఓటు వేయగానే, వారు ఏ పార్టీకి ఓటు వేశారో ఆ పార్టీ గుర్తును ఓ చిన్న కాగితంపై వీవీప్యాట్ యం త్రాలు ముద్రిస్తాయి. ఏడు సెకన్ల పాటు ఈ కా గితం వీవీప్యాట్ యంత్రంపై ఉండి ఆ తర్వాత దానంతట అదే ఓ డబ్బాలోకి పడిపోతుంది. -
నూతన సీఈసీగా ఓం ప్రకాశ్ రావత్
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా ఓం ప్రకాశ్ రావత్ నియమితులయ్యారు. రావత్ ఈ నెల 23న నూతన సీఈసీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సీఈసీ అచల్ కుమార్ జ్యోతి పదవీ కాలం రేపటి (సోమవారం)తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఓం ప్రకాశ్ రావత్‌ను సీఈసీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గతంలో గుజరాత్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా పనిచేసిన ఏకే జ్యోతి గతేడాది జూలై 6న బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అశోక్ లావసను ఎన్నికల కమిషనర్ గా నిమమించారు. ఆయన మంగళవారం రోజు బాధ్యతలు చేపట్టనున్నారు. 1977 ఐఏఎస్ బ్యాచ్ మధ్యప్రదేశ్ క్యాడర్‌కు చెందిన వారు రావత్. 64 ఏళ్ల రావత్ పలు రాష్ట్రాలతో పాటు కేంద్రంలోనూ పలు హోదాల్లో సేవలు అందించారు. భారీ పరిశ్రమలశాఖ సెక్రటరీగా చేసి ఇటీవల రిటైరయ్యారు. 1993లో రక్షణశాఖలో డైరెక్టర్‌గా విధులు నిర్వహించిన ఆయన ఆ మరుసటి ఏడాది ఐక్యరాజ్యసమితి ఎన్నికలకు పరిశీలకుడిగా దక్షిణాఫ్రికాకు వెళ్లారు. 2010లో ఆయన ఉత్తమ సేవలకుగానూ ప్రధాన మంత్రి నుంచి అవార్డ్ అందుకున్నారు. -
సీఈసీగా అచల్
న్యూఢిల్లీ: 21వ ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)గా అచల్ కుమార్ జోతి గురువారం బాధ్యతలు స్వీకరిం చారు. ఎన్నికలను పారదర్శకంగా, విశ్వసనీయంగా నిర్వహించడానికి ఎన్నికల సంఘం తన కృషిని కొనసాగి స్తుందని ఆయన అన్నారు. ప్రతి ఓటరుతో ఓటు వేయించాలనే తమ ప్రాధాన్యాన్ని అను సరిస్తూనే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఈ–పరిపాలనను ప్రోత్సహిస్తామని తెలిపారు. అచల్ 1975 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన గతంలో గుజరాత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. అనంతరం 2015 మే 8న ఎన్నికల కమిషనర్‌గా నియమితుల య్యారు. ఇప్పటివరకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన నసీం జైదీ బుధవారం పదవీ విరమణ చేయడంతో ఆ పదవిని అచల్ చేపట్టారు. వచ్చే ఏడాది జనవరి 17 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. గతంలో ఎన్నికల కమిషనర్‌గా ఉన్న అచల్‌ను సీఈసీగా నియమించడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. -
బాధ్యతలు స్వీకరించిన అచల్ కుమార్ జోతి
న్యూఢిల్లీ: 21వ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా అచల్ కుమార్ జోతి గురువారం బాధ్యతలు స్వీకరించారు. వచ్చే ఏడాది జనవరి 17 వరకు ఆయన సీఈసీగా కొనసాగుతారు. సీఈసీ, ఈసీల పదవీ కాలం ఆరేళ్లు లేదా 65 ఏళ్ల వయసు. రెండిటిలో ఏది ముందు వస్తే దాన్నే పరిగణ లోకి తీసుకొంటారు. జనవరి 23,1953లో జన్మించిన అచల్ కుమార్ 1975 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి గుజరాత్ కేడర్‌కు చెందిన వారు. నదీం జైదీ పదవీ కాలం నిన్నటితో ముగిసిన విషయం తెలి సిందే. -
నూతన సీఈసీగా అచల్ కుమార్
న్యూఢిల్లీ: భారత ఎన్నికల సంఘం నూతన ప్రధాన కమిషనర్(సీఈసీ)గా అచల్ కుమార్ జొతి నియమితులయ్యారు. ఈ నెల 6న ఆయన బాధ్యతలు చేపడతారని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. ప్రస్తుతం సీఈసీగా ఉన్న నదీం జైది గురువారం పదవీ విమరణ చేయనున్నారు. 64 ఏళ్ల అచల్ కుమార్ 2015, మే నెలలో ఎన్నికల సంఘం కమిషనర్ నియమితులయ్యారు. ఆయన గుజరాత్ కేడర్‌కు చెందిన 1975 ఐఏఎస్ బ్యాచ్ అధికారి. నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. గుజరాత్ విజిలెన్స్ కమిషనర్‌గానూ సేవలందించారు. 21వ సీఈసీగా బాధ్యతలు చేపట్టనున్న అచల్ కుమార్ వచ్చే ఏడాది జరగనున్న గుజరాత్, హిమచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను పర్యవేక్షించనున్నారు. -
నూతన సీఈసీగా అచల్ కుమార్ జోతి
న్యూఢిల్లీ: నూతన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా అచల్ కుమార్ జోతి నియమితులయ్యారు. ఆయన వచ్చే నెల (జూలై) 6న సీఈసీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అచల్ కుమార్ జోతి గతంలో గుజరాత్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా పనిచేశారు. నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అచల్ కుమార్ ప్రభుత్వ సీఎస్‌గా బాధ్యతలు నిర్వహించారు. గుజరాత్లో సర్దార్ సరోవర్ నర్మదా నిగమ్ లిమిటెడ్ ఎండీగా, కంద్లా పోర్ట్ ట్రస్టుకు చైర్మన్‌గా, తదితర పదవులు నిర్వహించిన అచల్‌కుమార్ సర్వీసు నుంచి 2013లో రిటైర్ అయ్యారు. -
ఈవీఎంలపై 12న కీలక భేటీ
అఖిలపక్ష భేటీని నిర్వహించనున్న ఈసీ న్యూఢిల్లీ: ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతున్నదంటూ ప్రతిపక్షాలు గగ్గోలు రేపుతున్న నేపథ్యంలో ఈ అంశంపై సందేహాలను నివృత్తి చేసేందుకు ఈ నెల 12న ఢిల్లీలో అఖిలపక్ష భేటీని నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ఢిల్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంలు ట్యాంపరింగ్‌కు గురవుతున్నాయని విపక్షాలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. యూపీ నేతలు మాయావతి, అఖిలేశ్ యాదవ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈవీఎంల పనితీరుపై అనుమానాలు లేవనెత్తారు. ఈవీఎంలను ఎత్తివేసి తిరిగి బ్యాలెట్ పేపర్లను ఉపయోగించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే విపక్ష నేతల బృందం ఈసీని కలిసి ఓ విజ్ఞాపనను అందజేసింది. అయితే, ఈవీఎంలపై ఆరోపణలు ఖండించిన ఈ విషయంలో స్పష్టత ఇచ్చేందుకు ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఈవీఎంలలో మరింత పారదర్శకతను తెచ్చేందుకు రానున్న ఎన్నికల్లో వోటర్ వెరీఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్)ను ఉయోగించాలని భావిస్తున్నట్టు ఈసీ తెలిపింది. -
యోగి సర్కారు పరీక్షలో నెగ్గుతుందో? లేదో?
లక్నో: ఈవీఎంల ట్యాంపరింగ్ అంశంపై అఖిలపక్ష భేటీ నిర్వహించాలన్న కేంద్ర ఎన్నికల సంఘం ఆలోచనను ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ స్వాగతించారు. గతంలో ప్రతిపక్ష నేతలు ఈ అంశంపై ఎన్నికల సంఘాన్ని కలిసిన నేపథ్యంలోనే ఈ మేరకు కదలిక వచ్చిందని చెప్పారు. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన దేశాలు కూడా ఈవీఎంలను ఉపయోగించడం లేదని, భారత్‌లో ఎందుకు ఉపయోగిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పనిచేస్తుందా? లేదా? అన్నదే తాము ఎదురుచూస్తున్నామని, ఈ పరీక్షలో యోగి ప్రభుత్వం నెగ్గుతుందా? లేదో చూడాలని అన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ విషయమై సందేహాలను నివృత్తికి త్వరలోనే ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ నసీం జైదీ తెలిపారు. -
ఈవీఎంలపై త్వరలోనే కీలక మీటింగ్!
అఖిలపక్ష భేటీని నిర్వహించనున్న ఈసీ చండీగఢ్: ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతున్నదంటూ ప్రతిపక్షాలు గగ్గోలు రేపుతున్న నేపథ్యంలో ఈ అంశంపై సందేహాలను నివృత్తి చేసేందుకు త్వరలోనే ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించనున్నట్టూ కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ నసీం జైదీ తెలిపారు. ఈవీఎంల విషయంలో మరింత పారదర్శకతను ప్రదర్శించేందు రానున్న ఎన్నికల్లో వోటర్ వెరీఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్)ను ఉయోగించాలని భావిస్తున్నట్టు తెలిపారు. ‘త్వరలోనే అఖిలపక్షం భేటీ నిర్వహించి.. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం ఈ విధంగా కుదరదో వివరిస్తాం. ఇందులో భద్రతాపరమైన, పాలనపరమైన రక్షణల గురించి స్పష్టత ఇస్తాం’ అని జైదీ మీడియాకు చెప్పారు. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ఢిల్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంలు ట్యాంపరింగ్‌కు గురవుతున్నాయని విపక్షాలు ఇటీవల ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈసీ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. -
'హైదరాబాద్, ఏపీలలో ఒకేసారి ఎన్నికలు'
► అలా చేయపోతే రెండుచోట్లా ఓట్లేసే ప్రమాదం ► పార్టీలు మేనిఫెస్టోలలో ఇచ్చే హామీలను కూడా చూడాలి ► ఎన్నికల కమిషన్‌కు వైఎస్ జగన్ విజ్ఞప్తి ► ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తాం ► ఏపీలో జరిగే అరాచకాలను ఇప్పుడు దేశం దృష్టికి తీసుకొచ్చాం ► తర్వాత కోర్టులోనూ పోరాటం కొనసాగిస్తాం న్యూఢిల్లీ తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలన్నా.. ఆంధ్రప్రదేశ్‌తో పాటు హైదరాబాద్ నగరంలో (జీహెచ్ఎంసీ పరిధిలో) కూడా ఒకేసారి పోలింగ్ ఉండేలా చూడాలని ఎన్నికల కమిషన్‌కు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రెండుచోట్లా వేర్వేరు సమయాల్లో ఎన్నికలు నిర్వహిస్తే, కొంతమంది ఓటర్లు అక్కడ, ఇక్కడ కూడా ఓట్లు వేస్తున్నారని.. దీనివల్ల ప్రజాస్వామ్యానికి నష్టం కలుగుతుందని కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ నజీమ్ జైదీని గురువారం కలిసి ఈ మేరకు పలు విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లిన అనంతరం వైఎస్ జగన్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పార్టీలు మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అధికారాన్ని అసెంబ్లీ స్పీకర్ చేతుల్లోంచి తీసేసి ఎన్నికల కమిషన్ పరిధిలోకి తెచ్చేలా ప్రతిపాదించాలని కోరామన్నారు. లేకపోతే ప్రజాస్వామ్యం అమ్ముడుపోతుందని చెప్పామన్నారు. ఒక పార్టీ నుంచి గెలిచి, అధికార పార్టీలోకి వెళ్లే ఎమ్మెల్యేలపై అధికార పార్టీకి చెందిన స్పీకర్ అనర్హత వేటు వేయరని, వీళ్లు కూడా రాజీనామా చేయరని తెలిపామన్నారు. అలా పార్టీలు మారిన ఎమ్మెల్యేలు అదే పదవుల్లో కొనసాగే పరిస్థితి మారాలని.. అలాంటివాళ్లు మంత్రి పదవులు పొందడం మరీ దౌర్భాగ్యమని ఎన్నికల కమిషన్‌కు చెప్పామన్నారు. దాంతోపాటు.. ఎన్నికల మేనిఫెస్టోలో పార్టీలు ఇచ్చే 10 ముఖ్యమైన హామీలేంటో అడగాలని.. వాటిని నెరవేర్చకపోతే ఆయా పార్టీలను తర్వాత ఎన్నికల్లో పోటీ చేయకుండా బ్యాన్ చేయాలని ఎన్నికల కమిషన్‌ను కోరామని ఆయన తెలిపారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఏ రకంగా అబద్ధాలు ఆడి ప్రజలను మోసం చేశారో ఎన్నికల కమిషన్‌కు చెప్పామన్నారు. రైతు రుణాలు బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పి.. చివరకు ఇప్పుడు మాత్రం వడ్డీలకు కూడా సరిపోకుండా డబ్బులు విదిలిస్తున్నారని, డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు కూడా పంగనామాలు పెట్టారని ఆయన అన్నారు. జాబు కావాలంటే బాబే సీఎం కావాలని ఎన్నికల సమయంలో ఊదరగొట్టారని, ఉద్యోగాలు ఇవ్వలేకపోతే ఇంటికి 2వేల నిరుద్యోగ భృతి ఇస్తామని కూడా చెప్పారని గుర్తుచేశారు. ఇప్పుడు మాత్రం ఆ హామీలన్నింటినీ తుంగలో తొక్కి ప్రజల జీవితాలను ఎలా మోసం చేస్తున్నారో, దానిపై ప్రజల గొంతు ఎక్కడ వినపడుతుందోనన్న భయంతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఎలా తాపత్రయపడుతున్నారో కూడా ఎన్నికల కమిషన్‌కు చెప్పామన్నారు. పార్టీలు మారిన ఎమ్మెల్యేలను మళ్లీ ఎన్నికల్లో పోటీచేయిస్తే, ప్రజలు వీళ్లకు మళ్లీ ఓట్లేయరేమోనన్న చంద్రబాబుకు ఉందని కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. వ్యవస్థలో మార్పు తేవాలంటే ప్రతిచోటా మనవాణిని గట్టిగా వినిపించాలని, చేతనైనంత ప్రెజర్ పెడితే ఏదో ఒకరోజు సాకారం అవుతుందని.. ప్రజాస్వామ్యంలో న్యాయం జరుగుతుందని తమకు నమ్మకం ఉందన్నారు. ఢిల్లీలో సాగించిన 'సేవ్ డెమొక్రసీ' అనేది ఇది ఒక పోరాటమని, ఇందులో తమకు న్యాయం జరుగుతుందా లేదా అన్నది పక్కన పెడితే రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని ఈ పోరాటం ద్వారా దేశం దృష్టికి తెచ్చామని అన్నారు. ముఖ్య నాయకులందరికీ దీని గురించి చెప్పామని, తర్వాత కోర్టుల్లో కూడా ఈ పోరాటం కొనసాగుతుందని అన్నారు. న్యాయం ఆలస్యం కావచ్చేమో గానీ నిరాకరించరన్నది తన నమ్మకమని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తాము ఇదే విషయమై ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కూడా అడిగాం గానీ, ఇంతవరకు దొరకలేదని, బహుశా టీడీపీ వాళ్ల మిత్రపక్షం కాబట్టి ఇవ్వలేదేమోనని ఆయన చెప్పారు. కానీ తాము ప్రధానికి ఏం చెప్పాలనుకున్నామో అదంతా పోస్టు ద్వారా ఆయనకు పంపిస్తామని తెలిపారు. -
పారదర్శక ఎన్నికలే ఈసీ ధ్యేయం: జైదీ
న్యూఢిల్లీ: ఎన్నికలను పారదర్శకంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించడమే ఎన్నికల సంఘం ధ్యేయమని ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైదీ అన్నారు. 20వ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా ఆదివారం ఆయన బాధ్యతలు చేపట్టారు. తప్పుల్లేని ఓటర్ల జాబితా ద్వారా శాయశక్తులా కృషిచేసి ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడమే ఈసీ లక్ష్యమని పేర్కొన్నారు. ఇప్పటివరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ బాధ్యతలు నిర్వహించిన బ్రహ్మ శనివారం రిటైరయ్యారు. జైదీ జులై 2017 వరకు సీఈసీగా ఉంటారు. 1976 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన ఈయన పౌర విమాన శాఖలో చాలా కాలం పనిచేశారు. కాగా మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్ల నియామకంపై నిర్ణయం కోసం న్యాయ శాఖ ప్రధానికి నివేదికలు అందజేసింది. -
నేడు సీఈసీగా బాధ్యతలు స్వీకరించనున్న జైదీ
న్యూఢిల్లీ: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా నసీం జైదీ ఆదివారం బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటి వరకు ఆ పదవిలో కొనసాగిన హెచ్ ఎస్ బ్రహ్మ పదవి కాలం శనివారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో కొత్త సీఈసీగా నసీం జైదీని నియమిస్తు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు ఆయన ఎన్నిక కమిషనర్‌గా విధులు నిర్వహించిన సంగతి తెలిసిందే. నసీం జైదీ పూర్తి పేరు డాక్టర్ సయ్యద్ అహ్మద్ నసీమ్ జైదీ. 1976 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన జైదీ.. పౌర విమానయాన శాఖలో చాలాకాలం పనిచేశారు. జైదీ సీఈసీగా జులై 2017 వరకు కొనసాగనున్నారు. -
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నసీం జైదీ
న్యూఢిల్లీ: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా సయ్యద్ నసీం అహ్మద్ జైదీని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నియమించారు. ఇప్పటి వరకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉన్నహెచ్ ఎస్ బ్రహ్మ ఏప్రిల్ 18న పదవి విమరణ చేయనున్నారు. దీంతో ఈ నెల 19 నుంచి కొత్త సీఈసీగా నసీం జైదీ బాధ్యతలు స్వీకరించనున్నారు. జైదీ పూర్తిపేరు డాక్టర్ సయ్యద్ అహ్మద్ నసీమ్ జైదీ. 1976 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన జైదీ.. పౌర విమానయాన శాఖలో చాలాకాలం పనిచేశారు. ప్రస్తుతం ఎన్నికల కమిషనర్‌గా కొనసాగుతున్న ఆయన సీఈసీ పదవిని చేపడితే ముగ్గురు సభ్యుల ఎలక్షన్ కమిషన్‌లో కమిషనర్ పదవులు రెండీంటికీ ఖాళీ ఏర్పడినట్లవుతుంది. ఒక సభ్యుడు ఇదివరకే రిటైరయ్యారు. ఆయన ఈ పదవిలో జులై 2017 వరకు కొనసాగనున్నారు. -
సీఈసీగా నజీం జైదీ!
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్(సీఈసీ)గా ఎన్నికల కమిషనర్ నజీం జైదీని నియమించే అవకాశం ఉంది. సీఈసీ హెచ్ఎస్ బ్రహ్మ పదవీకాలం ఏప్రిల్ 19తో ముగియనుంది. ఈ నేపథ్యంలో నజీం జైదీ పేరును కేంద్ర న్యాయ శాఖ ఖరారు చేసినట్లు సమాచారం. ప్రధాని గురువారం నుంచి విదేశీ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో జైదీ నియామకానికి సంబంధించిన లాంఛనాలను న్యాయశాఖ పూర్తి చేసి రాష్ట్రపతి భవన్‌కు పంపించింది. గత జనవరిలో సంపత్ పదవీ విరమణ అనంతరం అప్పటి ముగ్గురు సభ్యులలో ఒకరైన బ్రహ్మ సీఈసీగా బాధ్యతలు చేపట్టారు. సంపత్ పదవీ విరమణతో ఖాళీ అయిన స్థానాన్ని అప్పుడు భర్తీ చేయలేదు. ఇప్పుడు బ్రహ్మ స్థానంలో జైదీ సీఈసీగా నియమితులైన తరువాత రెండు కమిషనర్ల పోస్టులూ ఖాళీగా ఉంటాయి. -
తదుపరి సీఈసీగా నసీమ్ జైదీ
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ)గా నసీమ్ జైదీ నియమితులు కానున్నారు. ప్రస్తుత సీఈసీ హెచ్ ఎస్ బ్రహ్మ పదవీకాలం ఏప్రిల్ 19తో ముగియనుండటంతో నూతన సీఈసీ ఎంపిక అనివార్యమైంది. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం విదేశీ పర్యటనకు బయలుదేరనున్న నేపథ్యంలో జైదీ నియామకానికి సంబంధించిన అధికారిక కార్యక్రమాలను కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ బుధవారమే పూర్తిచేయనున్నట్లు తెలిసింది. ఆ తర్వాత ఫైలును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నారు. జైదీ పూర్తిపేరు డాక్టర్ సయ్యద్ అహ్మద్ నసీమ్ జైదీ 1976 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన జైదీ.. పౌర విమానయాన శాఖలో చాలాకాలం పనిచేశారు. ప్రస్తుతం ఎన్నికల కమిషనర్‌గా కొనసాగుతున్న ఆయన సీఈసీ పదవిని చేపడితే ముగ్గురు సభ్యుల ఎలక్షన్ కమిషన్‌లో కమిషనర్ పదవులు రెండీంటికీ ఖాళీ ఏర్పడినట్లవుతుంది. ఒక సభ్యుడు ఇదివరకే రిటైరయ్యారు. అనతి కాలంలోనే ఈ నియామకాలను కూడా చేపడతామని న్యాయశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. -
'ఆగస్ట్ 15 కల్లా ఆధార్‌తో అనుసంధానం పూర్తి'
హైదరాబాద్: ఓటరు గుర్తింపు కార్డును ఆధార్ తో అనుసంధానం చేసే ప్రక్రియను భారతదేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ హెచ్ ఎస్ బ్రహ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మార్చి 1 నుంచి అనుసంధాన ప్రక్రియ ప్రారంభించి ఆగస్ట్ 15 కల్లా పూర్తి చేస్తామన్నారు. ఈ ప్రక్రియ ద్వారా బోగస్ ఓట్లను నిర్మూలించవచ్చని ఆయన అన్నారు. ఇప్పటివరకు దేశంలో 74 కోట్ల మందికి ఆధార్ కార్డు ఉందని ఆయన తెలిపారు. -
సీఈసీగా బాధ్యతలు చేపట్టనున్న హెచ్ ఎస్ బ్రహ్మ
న్యూఢిల్లీ: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా హెచ్.ఎస్. బ్రహ్మ శుక్రవారం బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన ఈ పదవిలో ఏప్రిల్ 18వ తేదీ వరకు కొనసాగనున్నారు. అసోం రాష్ట్రానికి చెందిన బ్రహ్మ 1975 ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఇప్పటి వరకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉన్న విఎస్ సంపత్ గురువారం పదవి విమరణ చేశారు. దాంతో ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా హెచ్ ఎస్ బ్రహ్మను కేంద్రప్రభుత్వం ఎంపిక చేసింది. సంపత్ కూడా 1975 ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారే. ఈశాన్య రాష్ట్రాల నుంచి ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవిని చేపట్టిన రెండో వ్యక్తి హెచ్ ఎస్ బ్రహ్మ. గతంలో అదే ప్రాంతానికి చెందిన జెఎం లింగ్డో పదవిని చేపట్టిన విషయం విదితమే. -
సీఈసీగా బాధ్యతలు చేపట్టనున్న బ్రహ్మ
-
ఎన్నికల ప్రధాన కమిషనర్ గా హెచ్ ఎస్ బ్రహ్మ!
న్యూఢిల్లీ: భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ గా హెచ్ ఎస్ బ్రహ్మ నియామకానికి రంగం సిద్ధమైంది. ప్రస్తుతం చీఫ్ కమిషనర్ గా ఉన్న వీఎస్ సంపత్ గురువారం పదవీ విరమణ చేయనున్నారు. ఆయన తర్వాత సీనియర్ అయిన హెచ్ ఎస్ బ్రహ్మను చీఫ్ కమిషనర్ గా నియమించాలని ప్రభుత్వానికి న్యాయశాఖ సిఫారసు చేసింది. దీనికి ప్రధాని ఆమోదం తెలిపిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం తెలపాల్సివుంటుంది. 64 ఏళ్ల హెచ్ఎస్ బ్రహ్మ 1975 బ్యాచ్ కు చెందిన ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి. ఏప్రిల్ 19న ఆయన పదవీ విరమణ చేసే అవకాశముంది. -
జిల్లాకు త్వరలో అదనపు బలగాలు
సాక్షి, కాకినాడ: ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాకు ఇరవై నాలుగు కంపెనీల పారా మిలటరీ దళాలు వస్తాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం కలెక్టరేట్లోని కోర్టుహాల్లో పోలీసు సూపరింటెండెంట్లు, నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారు (ఆర్వో)లతోను, రాజకీయ పార్టీల ప్రతినిధులతోనూ వేర్వేరుగా సమావేశమయ్యారు. కలెక్టర్ నీతూప్రసాద్‌తో కలిసి నిర్వహించిన అధికారులసమావేశంలో భన్వర్‌లాల్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ కోసం అందించిన హ్యాండ్ బుక్‌ను అధికారులు అనుసరిస్తే ఎలాంటి ఇబ్బందులు రావన్నారు. వ్యయ పరిశీలన తదితర మార్గదర్శకాలతో కూడిన హ్యాండు బుక్‌లను కూడా త్వరలో పంపుతామన్నారు. జిల్లాలో 37 లక్షల మంది ఓటర్లుండగా ఇంకా 30 వేల దరఖాస్తులు పెండింగులో ఉన్నాయన్నారు.ఓటరు జాబితాలో పేరు లేకపోతే 92462 80027 సెల్ నంబర్‌కు ఓట్ అని టైపు చేసి ఐడీ కార్డునెంబర్ టైపు చేసి ఎస్ఎంఎస్ పంపితే ఓటరుగా ఎక్కడ నమోదయిందీ సమాధానం లభిస్తుందన్నారు. లేకుంటే కొత్తగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
లోక్ సభ ఎన్నికల షెడ్యూల్-2014
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సంతప్‌కుమార్ బుధవారం మీడియా సమావేశం ద్వారా వెల్లడించారు. రాష్ట్రంలోని 42 పార్లమెంట్ స్థానాలకు, 294 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా తొమ్మిది దశల్లో సాధారణ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. రాష్ట్రంలో ఏడు, ఎనిమిది దశల్లో పోలింగ్ జరగనుంది. తెలంగాణ : తొలి విడతలో తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలు, 119 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 30 బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఏప్రిల్ రెండున విడుదల చేస్తారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఏప్రిల్ 9. ఏప్రిల్ 10న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఉప సంహరణకు ఏప్రిల్ 12 చివరి తేదీ. సీమాంధ్ర : రెండో విడతలో సీమాంధ్ర ప్రాంతంలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలకు మే 7 బుధవారం పోలింగ్ నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఏప్రిల్ 12న విడుదల చేస్తారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఏప్రిల్ 19. ఏప్రిల్ 21న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 23. ఓట్ల లెక్కింపు మే 16న చేపడతారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో తక్షణం ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. షెడ్యూల్ వివరాలు: * ఏప్రిల్ 7న మొదటి విడుత పోలింగ్. ఈ దశలో 6 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహణ. * ఏప్రిల్ 9న రెండో విడుత పోలింగ్. ఈ దశలో 5 రాష్ట్రాల్లోని 7 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్. * ఏప్రిల్ 10న మూడోవిడుత పోలింగ్. ఈ దశలో 14 రాష్ట్రాల్లోని 92 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్. * ఏప్రిల్ 12న నాలుగోవిడుత పోలింగ్. ఈ దశలో 3 రాష్ట్రాల్లోని 5 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్. * ఏప్రిల్ 17న ఐదోవిడుత పోలింగ్. ఈ దశలో 13 రాష్ట్రాల్లోని 132 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్. * ఏప్రిల్ 24న ఆరోవిడత పోలింగ్. ఈ దశలో 12 రాష్ట్రాల్లోని 117 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్. * ఏప్రిల్ 30న ఏడోవిడత పోలింగ్. ఈ దశలో 9 రాష్ట్రాల్లోని 89 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్. * మే 7న 8వ విడుత పోలింగ్. ఈ దశలో 7 రాష్ట్రాల్లోని 64 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్. * మే 12న 9వ విడుత పోలింగ్. ఈ చివరి విడతలో 3 రాష్ట్రాల్లోని 41 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్. తొలిసారి నోటా .... మొదటిసారిగా తిరస్కరణ ఓటు నోటాను ప్రవేశపెట్టారు. ఈవీఎంలతోనే ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఎన్నికల ఖర్చు మదింపునకు ఒక పరిశీలకుడిని ఏర్పాటు చేశారు. తప్పులకు పాల్పడే ప్రభుత్వాధికారులపై కఠిన చర్యలుంటాయని ఈసీ హెచ్చరించారు. రుతుపవనాలు, విద్యార్థుల పరీక్షలకు ఇబ్బంది లేకుండా ఎన్నికల తేదీలను నిర్ణయించామన్నారు. ఓటర్ల నమోదుకు మరో అవకాశాన్ని ఇచ్చింది. -
ఆంధ్రప్రదేశ్‌లో రెండు విడతల్లో పోలింగ్