
సీఈసీగా నజీం జైదీ!
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్(సీఈసీ)గా ఎన్నికల కమిషనర్ నజీం జైదీని నియమించే అవకాశం ఉంది.
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్(సీఈసీ)గా ఎన్నికల కమిషనర్ నజీం జైదీని నియమించే అవకాశం ఉంది. సీఈసీ హెచ్‌ఎస్ బ్రహ్మ పదవీకాలం ఏప్రిల్ 19తో ముగియనుంది. ఈ నేపథ్యంలో నజీం జైదీ పేరును కేంద్ర న్యాయ శాఖ ఖరారు చేసినట్లు సమాచారం. ప్రధాని గురువారం నుంచి విదేశీ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో జైదీ నియామకానికి సంబంధించిన లాంఛనాలను న్యాయశాఖ పూర్తి చేసి రాష్ట్రపతి భవన్‌కు పంపించింది.
గత జనవరిలో సంపత్ పదవీ విరమణ అనంతరం అప్పటి ముగ్గురు సభ్యులలో ఒకరైన బ్రహ్మ సీఈసీగా బాధ్యతలు చేపట్టారు. సంపత్ పదవీ విరమణతో ఖాళీ అయిన స్థానాన్ని అప్పుడు భర్తీ చేయలేదు. ఇప్పుడు బ్రహ్మ స్థానంలో జైదీ సీఈసీగా నియమితులైన తరువాత రెండు కమిషనర్ల పోస్టులూ ఖాళీగా ఉంటాయి.