tenure
-
పాక్ సుప్రీం సీజే పదవీ కాలం ఇక మూడేళ్లే
ఇస్లామాబాద్: పాకిస్తాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) పదవీ కాలాన్ని మూడేళ్లకు పరిమితం చేసేందుకు ఉద్దేశించిన చట్ట సవరణకు అధ్యక్షుడు ఆసిఫ్ ఆలీ జర్దారీ సోమవారం ఆమోదముద్ర వేశారు. అంతేకాదు, సీజేను ఎంపిక చేసేందుకు సుప్రీంకోర్టులోని నలుగురు సీనియర్ జడ్జిలతో ప్రత్యేక కమిటీ నియామకం ఉత్తర్వుపైనా ఆయన సంతకం చేశారు. ఇందుకు సంబంధించిన 26వ రాజ్యాంగ సవరణపై నేషనల్ అసెంబ్లీ, సెనేట్లతో ఆదివారం మొదలైన చర్చలు, సోమవారం ఉదయం 5 గంటల వరకు కొనసాగాయి. అనంతరం ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. తాజా సవరణ ద్వారా ఈ నెల 25న పదవీ విరమణ చేసే సీజే జస్టిస్ కాజీ ఇసా స్థానంలో జస్టిస్ మన్సూర్ అలీ షా కొత్తగా బాధ్యతలు చేపట్టకుండా షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం అడ్డుకోగలిగింది. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 65 ఏళ్లు వచ్చే వరకు బాధ్యతల్లో కొనసాగుతారు. ఆయన స్థానంలో సీనియర్ మోస్ట్ జడ్జి ఆటోమేటిక్‌గా ఆ పదవిని చేపడతారు. తాజా పరిణామంతో ఈ సంప్రదాయానికి ముగింపు పలికినట్లయింది. అంతేకాకుండా, సీజే ఎంపిక కోసం ప్రత్యేకంగా ఒక కమిటీ ఏర్పాటుకానుంది. ఇందులో సుప్రీంకోర్టులోని నలుగురు సీనియర్ జడ్జీలతోపాటు, సెనేట్, నేషనల్ అసెంబ్లీ నుంచి ఇద్దరు చొప్పున సభ్యులుగా ఉంటారు. చట్ట సవరణను నవ శకానికి నాందిగా ప్రధాని షెహబాజ్ షరీఫ్ అభివర్ణించగా దేశ స్వతంత్ర న్యాయవ్యవస్థకు చావుదెబ్బగా ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పీటీఐ పార్టీ పేర్కొంది. -
DY Chandrachud: చరిత్ర ఎలా గుర్తుపెట్టుకుంటుందో?!
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పూర్తి అంకితభావంతో దేశానికి సేవలందించానని జస్టిస్ డి.వై.చంద్రచూడ్ చెప్పారు. తన పదవీ కాలాన్ని చరిత్ర ఎలా గుర్తు పెట్టుకుంటుందో అనే భయం, ఉత్కంఠ తనలో ఉన్నాయని తెలిపారు. భారతదేశ సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ చంద్రచూడ్ పదవీ కాలం నవంబర్ 10వ తేదీన ముగియనుంది. మరో నెల రోజుల్లో పదవీ విరమణ చేయబోతున్నారు. బుధవారం భూటాన్‌లోని ‘జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్ స్కూల్ ఆఫ్ లా’ మూడో స్నాతకోత్సవంలో జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడారు. ‘‘నా పదవీ కాలం ముగింపునకు వచి్చంది. భవిష్యత్తు, గతానికి సంబంధించి భయాలు, ఆందోళనలు నా మనసులో నిండిపోయాయి. ఎన్నో ప్రశ్నలు నాలో తలెత్తుతున్నాయి. నేను సాధించాల్సినవన్నీ సాధించానా? ప్రధాన న్యాయమూర్తిగా నా పదవీ కాలాన్ని చరిత్ర ఏ విధంగా నిర్ణయిస్తుంది? ఎలా గుర్తుపెట్టుకుంటుంది? చేయాల్సిన పనులు భిన్నంగా చేశానా? లేదా? భవిష్యత్తు తరాల న్యాయమూర్తులకు, న్యాయ నిపుణులకు, న్యాయవాద వృత్తిలో ఉన్నవారికి ఎలాంటి వారసత్వాన్ని అందించబోతున్నాను? ఈ ప్రశ్నల్లో చాలావాటికి సమాధానాలు నా నియంత్రణలో లేవు. బహుశా కొన్ని ప్రశ్నలకు ఎప్పటికీ సమాధానాలు కనిపెట్టలేనేమో! గత రెండేళ్లుగా అంకితభావంతో పనిచేశా. పదవికి పూర్తి న్యాయం చేయాలని ప్రతినిత్యం ఉదయం నిద్రలేవగానే నిర్ణయించుకునేవాడిని. రాత్రి సంతృప్తితో నిద్రకు ఉపక్రమించేవాడిని. న్యాయవాద వృత్తి అనే ప్రయాణంలో ఎన్నో అవరోధాలు ఎదురవుతాయి. అలాంటప్పుడు ఒక అడుగు వెనక్కి వేయడానికి, మనల్ని మనం పునఃసమీక్షించుకోవడానికి సంకోచించాల్సిన పనిలేదు. లక్ష్యం వైపు ప్రయాణిస్తున్నానా? లేక నా వైపు నేను ప్రయాణిస్తున్నానా? అని న్యాయవాదులు, న్యాయమూర్తులు ప్రశ్నించుకోవాలి. భయాలు, సందేహాలు విడిచిపెట్టాలి. లక్ష్యం వైపు సాగే ప్రయాణాన్ని ఆస్వాదించాలి. భయాలను ఎదిరించడంలోనే మన అభివృద్ధి దాగి ఉంటుంది’’ అని జస్టిస్ చంద్రచూడ్ ఉద్బోధించారు. ఆయన 2022 నవంబర్ 9న సీజేఐగా బాధ్యతలు చేపట్టారు. ఎన్నో కీలకమైన తీర్పులు వెలువరించారు. న్యాయ వ్యవస్థలో పారదర్శకతకు పెద్దపీట వేశారు. -
రాజ్యసభలో టీడీపీ అడ్రస్ గల్లంతే..
సాక్షి, అమరావతి: రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ అడ్రస్ వచ్చే మార్చి తర్వాత గల్లంతు కానుంది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ అంటే గత 41 ఏళ్లలో రాజ్యసభలో ఆ పార్టీకి సభ్యులు లేకపోవడం ఇదే తొలిసారి అవుతుంది. నిజానికి.. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు ఆ పార్టీని చేజిక్కించుకున్న తర్వాత టీడీపీ క్రమంగా ప్రాభవం కోల్పోతూ వస్తోంది. ఈ నేపథ్యంలో.. త్వరలో ఖాళీకానున్న మూడు రాజ్యసభ స్థానాలూ అసెంబ్లీలో సంఖ్యా బలం ద్వారా వైఎస్సార్సీపీనే కైవసం చేసుకుంటుంది. దీంతో రాజ్యసభలో టీడీపీ తొలిసారిగా కనుమరుగు కావడం ఖాయం. రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 250 లోపు ఉండాలి. ప్రస్తుతమున్న సభ్యుల సంఖ్య 245. ఇందులో 233 మందిని ఆయా రాష్ట్రాల శాసనసభ్యులు ఎన్నుకుంటారు. మిగతా 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. రాష్ట్ర కోటాలో రాజ్యసభ సభ్యుల సంఖ్య 11. ఇక రాజ్యసభలో 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీకి ఇద్దరు.. టీడీపీకి 9 మంది సభ్యులు ఉండేవారు. రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 50 శాతం ఓట్లతో 151 శాసనసభ స్థానాల్లో ఘనవిజయం సాధించగా.. టీడీపీ 23 స్థానాలకే పరిమితమై ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని మచ్చిక చేసుకుని కేసుల నుంచి బయటపడేందుకు టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్‌రావు, టీజీ వెంకటేశ్‌లను బీజేపీలోకి ఫిరాయించేలా చంద్రబాబు పావులు కదిపారు. ఇక రాష్ట్ర కోటాలో ఎన్నికైన రాజ్యసభ సభ్యుల్లో 2020లో నలుగురు (టీడీపీ), 2022లో నలుగురు (ముగ్గురు టీడీపీ, ఒకరు వైఎస్సార్సీపీ) పదవీకాలం పూర్తవడంతో ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించింది. నాడు అసెంబ్లీలో వైఎస్సార్సీపీకి ఉన్న సంఖ్యాబలం ఆధారంగా ఎనిమిది రాజ్యసభ స్థానాలు ఆ పార్టీకే దక్కాయి. ఇందులో నలుగురు బీసీలను రాజ్యసభకు పంపి సామాజిక న్యాయమంటే ఇదీ అని సీఎం వైఎస్ జగన్ దేశానికి చాటిచెప్పారు. ఆ మూడూ వైఎస్సార్సీపీ ఖాతాలోకే.. ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 2 నాటికి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి (వైఎస్సార్సీపీ), సీఎం రమేష్ (బీజేపీ), కనకమేడల రవీంద్రకుమార్ (టీడీపీ)ల పదవీకాలం పూర్తికానుంది. ఖాళీ అయ్యే ఈ మూడు స్థానాలకు ఫిబ్రవరి ఆఖరు లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేయనుంది. రాజ్యసభకు ఎన్నికకు కావాలంటే 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. ప్రస్తుతం శాసనసభలో వైఎస్సార్సీపీకి ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే.. ఈ మూడు స్థానాలు ఆ పార్టీ ఖాతాలో చేరడం ఖాయం. దీంతో రాజ్యసభలో వైఎస్సార్సీపీ బలం 11కు చేరనుంది. అంటే రాష్ట్ర కోటాలో సీట్లన్నీ వైఎస్సార్సీపీ ఖాతాలోకే చేరుతాయి. టీడీపీ ఉనికే లేకుండాపోతుంది. -
ఆర్టీసీ చైర్మన్ గోవర్ధన్‌కు వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ చైర్మన్‌గా పదవీకాలం ముగియటంతో ఆ పదవి నుంచి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తప్పుకున్నారు. మరికొద్ది నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల వరకు బాజిరెడ్డి ఆ పదవిలో కొనసాగుతారని ఆర్టీసీ వర్గాలు భావించాయి. కానీ, పదవీకాలం ముగిసినా ప్రభుత్వం నుంచి పొడగింపు ఆదేశాలు వెలువడలేదు. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపులో ఆశాభంగం కలిగిన సిట్టింగ్‌లను బుజ్జగించేందుకు ఆర్టీసీ చైర్మన్ పదవి లాంటి వాటిని వారికి అప్పగించవచ్చని, అందుకే బాజిరెడ్డికి కొనసాగింపు అవకాశం ఇవ్వలేదన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఇక్కడి బస్‌భవన్‌లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆధ్వర్యంలో బాజిరెడ్డికి వీడ్కోలు సమావేశం జరిగింది. బాజిరెడ్డి దంపతులను ఆర్టీసీ ఉన్నతాధికారులు ఘనంగా సన్మానించారు. రెండేళ్ల పదవీకాలంలో, ఆర్టీసీ అభ్యున్నతికి బాజిరెడ్డి ఎంతో కృషి చేశారంటూ అధికారులు కితాబిచ్చారు. ‘‘రెండేళ్లపాటు ఆర్టీసీ చైర్మన్‌గా పనిచేయటం, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఆర్టీసీని బాగు చేసేందుకు ఎండీ సజ్జనార్‌తో కలిసి కృషి చేయడం జీవితంలో మరవలేను. నేను చైర్మన్‌గా ఉన్న సమయంలోనే, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయటం నాకు ఎంతో సంతోషం కలిగించింది’’అని బాజిరెడ్డి పేర్కొన్నారు. -
అదిరిపోయే ఫిక్స్డ్ డిపాజిట్ పథకం.. తక్కువ కాలపరిమితి.. ఎక్కువ వడ్డీ!
తక్కువ కాలపరిమితితో ఎక్కువ వడ్డీనిచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ల కోసం చూస్తున్నవారి కోసం ఐడీబీఐ బ్యాంక్ అదిరిపోయే ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని తీసుకొచ్చింది. 375 రోజుల కాలపరిమితితో కొత్త ఎఫ్డీ పథకాన్ని ప్రవేశపెట్టింది. జూలై 14వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన ఈ ఎఫ్డీ పథకంపై సాధారణ ప్రజలకు 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీ రేటును ఐడీబీఐ అందిస్తోంది. ‘అమృత్ మహోత్సవ్ ఎఫ్డీ’ ప్రోగ్రాంలో భాగంగా ఈ కొత్త పథకాన్ని ఐడీబీఐ ప్రారంభించింది. కాగా ఇదే ప్రోగ్రాం కింద 444 రోజుల కాలపరిమితితో ఓ ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని ఇదివరకే ప్రవేశపెట్టింది. ఈ రెండు ఎఫ్డీ పథకాలు ఆగస్టు 15 వరకు చెల్లుబాటులో ఉంటాయని ఐడీబీఐ తన వెబ్సైట్లో పేర్కొంది. ఇదీ చదవండి ➤ ‘ఎస్బీఐ యోనో’ను ఇక ఏ బ్యాంక్ కస్టమర్ అయినా వాడొచ్చు.. ఆ యూపీఐ యాప్‌లకు గట్టిపోటీ! ప్రస్తుతం ఉన్న 444 రోజుల వ్యవధి ఎఫ్డీ పథకానికి సంబంధించి కాలబుల్ (మెచ్యూరిటీ కంటే ముందే విరమించుకోవడం) ఆప్షన్‌పై గరిష్టంగా 7.65 శాతం, నాన్-కాల్ ఎంపిక కింద గరిష్టంగా 7.75 శాతం వడ్డీ లభిస్తుంది. -
ఇంటి ఋణ భారం తగ్గే దారేది..!
ఇంటిని కొనుగోలు చేయడం ప్రతి ఒక్కరి జీవితంలో అదిపెద్ద ఆర్ధిక లక్ష్యం. ఇందుకోసం భారీ మొత్తం అవసరంపడుతుంది. ఎన్నో ఏళ్లపాటు కష్టార్జితాన్ని పొదుపు, మదుపు చేసి ఇల్లు కొనుక్కోవడం ఒక మార్గం అయితే, 20–25 ఏళ్ల కాలానికి రుణం తీసుకుని ఇంటిని సమకూర్చుకోవడం రెండో మార్గం. రెండు దశాబ్దాల క్రితం అయితే ఎక్కువ మంది జీవితాంతం కష్టపడి పొదుపు చేసి ఇంటిని సమకూర్చుకునే వారు. కానీ, ఇందులో మార్పు వచి్చంది. రుణం మార్గంలో చిన్న వయసులోనే సొంతింటివారయ్యే అవకాశం ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. కానీ, ఇదేమంత చిన్న విషయం కానే కాదు. తీసుకున్న అసలు రుణాన్ని, వడ్డీ సహా చెల్లించుకోవాలి. పైగా రుణం ఎంత ఇవ్వాలి, ఎంత వడ్డీ, ఎన్నేళ్ల కాల వ్యవధి అనే అంశాలను రుణమిచ్చే సంస్థే నిర్ణయిస్తుంటుంది. ఈ విషయంలో రుణదాతకు ఉన్న స్వేచ్ఛ తక్కువ. అందుకే రుణంపై ఇంటిని సమకూర్చుకునే వారు తప్పకుండా కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. దీర్ఘకాలం పాటు రుణ బాధ్యత మోయకుండా, ఆ భారాన్ని దింపుకునే, తగ్గించుకునే మార్గాల గురించి తెలుసుకోవాలి. ఇంటి రుణంపై చెల్లించే ఈఎంఐ ఓ సగటు మధ్య తరగతి కుటుంబానికి చాలా పెద్ద మొత్తమే అవుతుంది. నెలవారీ ఆర్జనలో 30–40 శాతం వరకు ఉండొచ్చు. 20 ఏళ్ల కాలానికి గృహ రుణం తీసుకున్నారని అనుకుంటే.. గడువు పూర్తయ్యే నాటికి రుణదాత చెల్లించే మొత్తం రెట్టింపు అవుతుంది. అంటే తీసుకున్న రుణం ఎంతో, అంత మేర వడ్డీ కూడా ఇక్కడ చెల్లించాల్సి వస్తుంది. కానీ, ఆరి్థక కోణం నుంచి చూస్తే ఇదేమంత లాభదాయక విషయం కాదన్నది వాస్తవం. ఇంటి రుణం విషయంలో కొంత లాభపడాలంటే ఆ రుణాన్ని వీలైనంత తొందరగా ముగించేయడం మెరుగైన ఆలోచన అవుతుంది. ‘రుణ’ వాటా తగ్గాలి ఇంటిని కొనుగోలు చేసే వారు రుణాన్ని వీలైనంత తక్కువకు పరిమితం చేసుకోవాలన్నది ప్లాన్ రూపీ ఇన్వెస్ట్మెంట్ సరీ్వసెస్ వ్యవస్థాపకుడు అమోల్ జోషి సూచించారు. అంటే రుణం వీలైనంత తక్కువగా ఉండాలి. కానీ, ఆచరణలో ఎక్కువ కేసుల్లో దీనికి విరుద్ధంగా జరుగుతుందంటున్నారు అమోల్ జోషి. ‘‘ఇంటి రుణం తీసుకునే వారు సరిపడా సైజు, చక్కని వసతులు వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. దీనివల్ల వారు తీసుకోవాల్సిన రుణం మొత్తం పెరిగిపోతుంటుంది’’అని జోషి వివరించారు. కానీ, రుణం వస్తుంది కదా అని ఖరీదైన ఇంటిని సులభంగా కొనుగోలు చేయడం కాకుండా, తిరిగి నెలవారీ ఎంత మేర చెల్లించాల్సి వస్తుందన్నది కూడా పట్టించుకోవాలి. ఒక వ్యక్తి 20 ఏళ్ల కాలానికి గృహ రుణం తీసుకున్నారని అనుకుంటే.. 8.5 శాతం వార్షిక వడ్డీపై 20 ఏళ్లకూ కలిపి అసలుకు సరిపడా వడ్డీని చెల్లించాల్సి వస్తుంది. ఉదాహరణకు రూ. కోటి రుణం తీసుకుంటే 8.5 శాతం రేటుపై, 20 ఏళ్లలో రూ.1.08 కోట్లను వడ్డీ రూపంలోనే చెల్లించాల్సి వస్తుంది. వడ్డీ భారం తగ్గాలంటే..? పైన చెప్పుకున్నట్టు అసలుకు సమానంగా వడ్డీ చెల్లించకూడదని మీరు కోరుకునేట్టు అయితే, రుణాన్ని నిర్ధేశిత గడువు కంటే ముందుగానే చెల్లించేసేలా ప్రణాళిక ప్రకారం నడుచుకోవడం చక్కని మార్గం. అది కూడా రుణాన్ని తీసుకున్న తొలినాళ్లలోనే ముందస్తు అదనపు చెల్లింపులను ప్రారంభించాలి. ఎందుకంటే ఆరంభంలోనే రుణంపై వడ్డీ భారం ఎక్కువ పడుతుంది. కాలం గడుస్తున్న కొద్దీ వడ్డీ భారం తగ్గుతూ, అసలులో ఎక్కువ జమ అవుతుంది. పైన చెప్పుకున్న ఉదాహరణలో రూ.కోటి రుణాన్ని తీసుకున్న మూడేళ్ల తర్వాత నుంచి నెలవారీ ఈఎంఐకి అదనంగా ముందస్తు చెల్లింపులు మొదలు పెట్టి.. రుణాన్ని 14–15 ఏళ్లలోనే తీర్చేసేట్టు అయితే, రూ.20–25 లక్షల వరకు వడ్డీ రూపంలో ఆదా చేసుకోవచ్చు. అలా కాకుండా అదనపు ముందస్తు చెల్లింపులను జాప్యం చేశారనుకుంటే.. పదో ఏట తర్వాతే మొదలు పెట్టేట్టు అయితే అప్పుడు వడ్డీ రూపంలో ఆదా చేసుకునేది స్వల్పంగానే ఉంటుంది. అందుకే రుణం తీసుకున్న తర్వాత వీలైనంత ముందుగా అదనపు చెల్లింపుల మార్గాలను అన్వేషించుకోవాలి. ‘‘వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలోనే ఉన్నాయి. ఇంకొంత పెరిగే అవకాశాలు లేకపోలేదు. కనుక వడ్డీ భారాన్ని వీలైనంత తగ్గించుకునేందుకు ముందస్తు చెల్లింపులు మంచి ఆప్షన్ అవుతుంది. ఒకవేళ వడ్డీ రేట్లు ఇక్కడి నుంచి తగ్గుముఖం పడితే ముందస్తు చెల్లింపుల రూపంలో వడ్డీని మరింత మేర ఆదా చేసుకున్నట్టు అవుతుంది’’అని సృజన్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వ్యవస్థాపక భాగస్వామి దీపాలి సేన్ సూచించారు. ముందస్తు చెల్లింపుల్లో మరో ఆప్షన్‌ను కూడా పరిశీలించొచ్చు. ఈఎంఐ రుణ కాలవ్యవధి అంతటా మారకుండా స్థిరంగా ఉంటుంది. కానీ, వేతన జీవి ఆదాయం ఏటా పెరుగుతూ వెళుతుంది. దీనికి తగ్గట్టుగా రుణ ఈఎంఐని ఏటా పెంచుకుంటూ, మధ్యలో అదనంగా సమకూరే మొత్తాన్ని కూడా ముందస్తు చెల్లింపులకు వినియోగించుకుంటే, 20 ఏళ్ల రుణాన్ని 10 ఏళ్లలోనే ముగించేయవచ్చు. దీనివల్ల వడ్డీ రూపంలో గణనీయమైన మొత్తం ఆదా అవుతుంది. ఏటా ఈఎంఐ పెంచుకోవడాన్ని స్టెపప్ ఈఎంఐగా చెబుతారు. పెరిగే వేతనాలు, బోనస్‌లను ఇందుకు వినియోగించుకోవాలి. వీలైనంత ముందుగా.. నిరీ్ణత గడువు కంటే ముందుగానే గృహ రుణాన్ని వదిలించుకోవడం వల్ల వడ్డీ రూపంలో పెద్ద మొత్తమే ఆదా అవుతుందని స్పష్టంగా తెలుస్తోంది. కనుక దీన్ని విస్మరించకూడదు. అయితే, రుణ గ్రహీత చెల్లింపుల సామర్థ్యమే అంతిమంగా దీన్ని నిర్ణయిస్తుంది. భారతీయుల్లో ఎక్కువ మంది దీర్ఘకాలం పాటు రుణ భారాన్ని మోయడానికి ఇష్టపడని వారేనని నిపుణులు సైతం చెబుతున్నారు. ‘‘పదేళ్ల క్రితం వరకు ఎక్కువ శాతం రుణాలు ఏడు నుంచి 9 ఏళ్ల మధ్యలోనే ముగించినట్టు మా డేటా తెలియజేస్తోంది. కాకపోతే ముందస్తుగా రుణాన్ని తీర్చేయడం అన్నది ఇప్పుడు 9–12 ఏళ్లకు మారింది. భారత్‌లో ఎక్కువ మంది రుణాల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు’’అని మార్ట్గేజ్ వరల్డ్ సీఈవో విపుల్ పటేల్ తెలిపారు. ఏక మొత్తంలో కొంత రుణాన్ని తీర్చి వేయడానికి సాధారణంగా మూడు నుంచి ఐదేళ్లు అయినా వ్యవధి అవసరం పడొచ్చు. ఎందుకంటే ఎంతో కొంత సమకూర్చుకోవడానికి ఇంత మేర కాల వ్యవధి అవసరం కనుక. ఏటా ఈఎంఐను పెంచుతూ చెల్లించడం ఒక ఆప్షన్ అయితే, మధ్యలో వచ్చే బోనస్, ఇతరత్రా వెసులుబాటు లభించినప్పుడు అదనంగా ఒకే విడత చెల్లించడం మరో మార్గం. ‘‘రుణ గ్రహీత తన ఇష్టం ప్రకారం ఈఎంఐని పెంచి చెల్లించడం కాకుండా, స్టెపప్ ఈఎంఐ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. దీనివల్ల ఆటోమేటిక్‌గా ఈఎంఐ పెరుగుతుంది. లేకపోతే కొన్ని ఆకర్షణీయమైన ఖర్చులతో ముందస్తు చెల్లింపులపై ప్రభావం పడుతుంది’’అని దీపాలిసేన్ సూచించారు. అన్ని అంశాలు చూసిన తర్వాతే వ్యక్తిగత ఆరి్థక అంశాల్లో గృహ రుణం అన్నది ఒక్క భాగం మాత్రమే. కనుక ముందస్తుగా రుణాన్ని చెల్లించే ముందు, ఇతర బాధ్యతలు, అవసరాలు, వెసులుబాటును కూడా చూసుకోవాలన్నది నిపుణుల సూచన. అందరి ఆరి్థక పరిస్థితులు ఒకే మాదిరిగా ఉండవు. తమ క్లయింట్ల విషయంలో భిన్న వ్యవహార శైలిని చూస్తుంటామని అమోల్ జోషి వెల్లడించారు. ‘‘పెరుగుతున్న జీవనశైలి ఖర్చులతో నెలవారీ పొదుపు కష్టంగా మారుతోంది. కనుక వ్యక్తులు సింగిల్ షాట్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏడాదికోసారి ముందస్తు చెల్లింపునకే ప్రాధాన్యం ఇస్తున్నారు’’ అని జోషి వివరించారు. జీవితంలో ఎన్నో అవసరాలు పెరుగుతుంటాయి. కనుక వాటికి కూడా ప్రాధాన్యం ఇస్తూ గృహ రుణాన్ని ముందుగా తీర్చివేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గృహ రుణాన్ని ముందుగా తీర్చివేయాలని భావించే వారు తమ ఆదాయపన్ను కోణంలోనూ దీన్ని ఓ సారి విశ్లేíÙంచుకోవాలి. ఎందుకంటే పాత పన్ను విధానంలో గృహ రుణంపై అసలు, వడ్డీ మొత్తం కలిపి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.3.5 లక్షల మొత్తంపై పన్ను మినహాయింపు ప్రయోజనం పొందొచ్చు. కనుక రూ. 9 లక్షల వరకు వార్షికాదాయం కలిగిన వారికి గృహ రుణం రూపంలో గణనీయమైన మొత్తమే ఆదా చేసుకోవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 2 లక్షల మొత్తం వడ్డీ చెల్లింపులకే పన్ను ప్రయోజనం సెక్షన్ 24(బీ) కింద ఉంటుంది. సెక్షన్ 80సీ కింద అసలుకు జమ చేసే రూ.1.5 లక్షలకు కూడా పన్ను ఆదా ప్రయోజనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, ఒక ఆరి్థక సంవత్సరంలో గృహ రుణంపై వడ్డీ చెల్లింపులు రూ.2 లక్షల లోపునకు తగ్గిపోయినప్పుడు, పన్ను పరిధిలో ఉన్న వారు ముందస్తు చెల్లింపుల వైపు మొగ్గు చూపించొచ్చు. ‘‘గృహ రుణం పెద్ద మొత్తంలో తీసుకుంటే, సమీప కాలంలో వేరే ఇతర పెద్ద ఆరి్థక లక్ష్యాలు లేకుంటే.. వీలైనంత అదనపు మొత్తంతో రుణాన్ని ముందుగా తీర్చివేయడమే మంచిది. అది నెలవారీ కావచ్చు, ఏడాదికోసారి కావచ్చు. మిగిలిన గృహ రుణం కొంతే ఉంటే, అప్పుడు మిగులు మొత్తాన్ని పెట్టుబడులు, ముందస్తు చెల్లింపులు అనే రెండు భాగాలుగా విభజన చేసుకోవాలి’’అని దీపాలి సేన్ సూచించారు. గృహ రుణం అనేది పెద్ద బాధ్యత. సొంతింటి కల సాకారానికి దీని సాయం తీసుకోవడంలో తప్పు లేదు. కానీ, ఈఎంఐ రూపంలో నెలవారీ ఎంత చెల్లింపుల సామర్థ్యం తమకు ఉంది, తమ కుటుంబ ఆదాయం, అవసరాలు, ఆరోగ్య చరిత్ర, ఇతర ఆరి్థక బాధ్యతలు ఇలాంటి ఎన్నో అంశాలు విశ్లేషించిన తర్వాతే దీనిపై స్పష్టతకు రావడానికి వీలుంటుంది. ఈ విషయంలో నిపుణుల సహాయం తీసుకునేందుకు వెనుకాడకూడదు. చెల్లింపుల సామర్థ్యం పూర్తి స్థాయిలో లేదంటే, ఇంటి కొనుగోలుకు అయ్యే వ్యయంలో ఎక్కువ మొత్తాన్ని సమకూర్చుకున్న తర్వాతే, గృహ రుణం విషయంలో ముందుకు వెళ్లడం ఆరి్థక సౌకర్యాన్నిస్తుంది. భారం ఎంత తగ్గుతుంది.. ► గృహ రుణం: రూ.కోటి ► కాలవ్యవధి: 20 ఏళ్లు ► వడ్డీ రేటు: 8.5 శాతం ► ఈఎంఐ: రూ.86,782 ► నికర వడ్డీ చెల్లింపు: 1.08 కోట్లు ► ఉదాహరణ: మూడేళ్ల తర్వాత నుంచి నెలవారీ రూ. 20వేలు అదనంగా చెల్లించడం/మూడేళ్ల తర్వాత నుంచి ఏటా ఒకేసారి రూ. 2 లక్షల చొప్పున చెల్లించడం/ఏడేళ్ల తర్వాత ఒకే విడత రూ.20 లక్షలు జమ చేయడం ► నికర వడ్డీ భారం: రూ.77.67 లక్షలు/రూ.79.39 లక్షలు/రూ.79.45లక్షలు ► ఆదా అయ్యే వడ్డీ: రూ.30.63 లక్షలు/రూ.28.91లక్షలు/రూ.28.85 లక్షలు ► రుణం ముగింపు కాలం: 14ఏళ్లు/15ఏళ్లు/15ఏళ్లు -
ఏపీ ప్రభుత్వ సలహాదారుల పదవికాలం పొడిగింపు
-
మీ వారసున్ని సిఫార్సు చేయండి.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు కేంద్రం లేఖ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పదవీకాలం పూర్తవనున్న నేపథ్యంలో తదుపరి సీజేఐని సిఫార్సు చేయాల్సిందిగా కేంద్రం ఆయన్ను కోరింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ కేంద్ర న్యాయ శాఖ బుధవారం జస్టిస్ రమణకు లేఖ రాసింది. ఆయన పదవీకాలం ఆగస్టు 26తో ముగియనుంది. పదవీ విరమణ చేసే సీజేఐ తన వారసునిగా సీనియర్ మోస్ట్ న్యాయమూర్తి పేరును సూచించడం సంప్రదాయంగా వస్తోంది. సుప్రీంకోర్టు సీనియారిటీ లిస్టులో జస్టిస్ రమణ తర్వాత న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ ఉన్నారు. అయితే ఆయన పదవీకాలం నవంబర్ 8 వరకే ఉంది. సీజేఐగా ఎంపికైతే రెండున్నర నెలలే పదవిలో కొనసాగుతారు. -
హోం లోన్ తీసుకున్నవారికి మరో భారీ షాక్ తప్పదా? ఏం చేయాలి?
సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ సమావేశం (ఎంపీసీ) ఆగస్టు 3 బుధవారం ప్రారంభం కానుంది. అయితే రెపో రేటు బాదుడు తప్పదనే అంచనాల మధ్య హోం లోన్ రేట్లు ఎంత పెరుగుతాయోననే ఆందోళన వినియోగదారుల కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ద్రవ్యోల్బణానికి చెక్ చెప్పేలా ఆర్బీఐ వరుసగా మూడోసారి రెపో రేటును పెంచే అవకాశం ఉందని మార్కెట్‌వర్గాలు, ఇటు నిపుణులు భావిస్తున్నారు. (నిర్మలా సీతారామన్‌పై బీజేపీ సీనియర్ సెటైర్లు: తీవ్ర చర్చ) ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ తాజా రివ్యూలో రెపో రేట్లను పెంచే అవకాశాలపైనే ఎక్కువ అంచనాలు కనిపిస్తున్నాయి. అధిక ద్రవ్యోల్బణం కారణంగా వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని, దాదాపు 35-50 బేసిస్ పాయింట్లకు చేరుకోవచ్చని నిపుణులు ఊహిస్తున్నారు. అంచనాలకనుగుణంగా రెపో రేటు పెరిగితే, అనివ్యారంగా బ్యాంకులు కూడా మొత్తం రేటు పెంపును కస్టమర్లకు బదిలీ చేస్తాయి. రెపో రేటు పెరిగితే ఆర్బీఐకి బ్యాంకులు ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ భారాన్ని బ్యాంకులు కస్టమర్ల మీదే వేస్తాయి. ఈ నేపథ్యంలో ఇంటిలోన్లపై భారం తప్పదు. ఉదా: రూ. 50 లక్షల రుణం, 7.65 శాతం వడ్డీతో 20 సంవత్సరాల కాలవ్యవధితో ఉన్న లోన్‌పై వడ్డీ రేటు 0.50 శాతం పెంచితే, వడ్డీ రేటు 8.15కి పెరుగుతుంది అనుకుంటే, రుణ వ్యవధిని రెండేళ్లు పొడిగింపు ఆప్షన్ ఎంచుకోవచ్చు. అయితే లోన్ కాలం రెండేళ్లు పొడిగించడంతో ఖచ్చితంగా రూ. 10.14 లక్షలు అదనపుభారం తప్పదు. ఒకవేళ చెల్లించాల్సిన కాలం కాకుండా, ఈఎంఐ భారాన్ని పెంచుకుంటే.. ఉదా: 20 సంవత్సరాల కాలవ్యవధిలో రూ. 50 లక్షల రుణంపై, వడ్డీ రేట్లు 50 బేసిస్ పాయింట్లు పెరుగుతాయని భావిస్తే.. మునుపటి ఈఎంఐ రూ. 40,739తో పోలిస్తే రూ. 42,289 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఇంటి రుణం తీసుకున్న వారు ఏ సిస్టంలో ఉన్నారో చెక్ చేసుకోవాలి. దాని ప్రకారం ఈఎంఐ పెంచుకోవడమా, కాల వ్యవధిని పెంచుకోవడమా అనేది రుణగ్రహీత జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఇప్పటికే లోబడ్జెట్‌లో ఉండి ఉంటే పొదుపు, ఖర్చులపై దెబ్బపడకుండా లోన్ టెన్యూర్‌ను లేదా ఈఎంఐని పెంచుకోవడంమంచిది. అలాగే ఏ ఆప్షన్ ఎంచుకన్నా, దీర్ఘకాలిక రాబడి, భవిష్యత్తు అవసరాలకోసం ఎంతో కొంత పొదుపు చేసుకోవడం చాలా ముఖ్యం. (ఆనంద్ మహీంద్ర వీడియో: నెటిజనుల కౌంటర్స్ మామూలుగా లేవు!) కాగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని పాలసీ కమిటీ మూడు రోజుల పాటు సమావేశం కానుంది. పాలసీ విధానాన్ని శుక్రవారం (ఆగస్టు 5న) ప్రకటించనుంది. అయితే ఈ సారి రివ్యూలో కూడా రేటు పెంపు తప్పదని నిపుణులు సూచిస్తున్నారు. ఆర్బీఐ మే 4, 2022 నుండి రెపో రేటును 0.9 శాతం పెంచింది. ఫలితంగా 6.72 శాతం వద్ద గృహ రుణం తీసుకున్న వారు ఇప్పుడు 7.62 శాతం చెల్లించాల్సి వస్తోంది. గత రెండు మానిటరీ పాలసీ సమావేశాల్లో 90 బేసిస్ పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే. దీనికి తోడు ఇటీవల అమెరికా ఫెడ్ రికార్డు స్థాయిలో 75 బేసిస్ పాయింట్లు రేట్లు పెంచింది. అలాగే ఆ తరువాత కూడా పెంపు ఉంటుందనే సంకేతాలు అందించింది. -
ఏ పదవీ శాశ్వతం కాదు
హవేరి: ఏ పదవీ శాశ్వతం కాదని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై అన్నారు. హవేరి జిల్లాలోని సొంత నియోజకవర్గమైన షిగగావ్లో ఆదివారం ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. పదవులు, హోదాలతో సహా ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదన్నారు. జీవితమూ అంతేనన్నారు. ‘ఎంత కాలం ఉంటామో.. ఏ హోదాలో ఉంటామో ఎవరికీ తెలియదు. పదవులు, హోదాలు శాశ్వతం కాదు. ఈ వాస్తవం అనుక్షణం నా మదిలో మెదులుతూ ఉంటుంది. అవతలి వారికి నేను సీఎంను కావొచ్చు. కాని షిగగావ్కు వస్తే మీ బసవరాజ బొమ్మైని మాత్రమే. బసవరాజ అనే పేరు శాశ్వతం. పదవులు కాదు’ అని బొమ్మై వ్యాఖ్యానించారు. దాంతో బొమ్మై ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలుగుతారనే ఊహాగానాలు కొన్నివర్గాల నుంచి మొదలయ్యాయి. బొమ్మై మోకాలి సమస్యతో బాధపడుతున్నారని, చికిత్స కోసం విదేశాలకు వెళతారని వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. ఈ నేపథ్యంలో సీఎంను మారుస్తారనే ఊహాగానాలు కొన్నివర్గాల్లో వినపడుతున్నాయి. -
అంత అవసరం ఏమొచ్చింది?
న్యూఢిల్లీ: సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలాన్ని పెంచుతూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్సుల విషయంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఆగమేఘాల మీద ఆర్డినెన్సులను తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందని కేంద్రంపై విరుచుకుపడుతున్నాయి. కొన్ని వ్యవస్థలకు ఉన్న స్వతంత్రతను ఈ ఆర్డినెన్సులతో కేంద్రం పూర్తిగా తుడిచిపెట్టేసిందని విమర్శించాయి. ఆర్డినెన్స్ రాజ్యాన్ని తీసుకొచ్చి, వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి ఆరోపించారు. రెండు వారాల్లో పార్లమెంటు సమావేశాలు పెట్టుకుని వాటిని తీసుకురావడం పార్లమెంటరీ వ్యవస్థను అపహాస్యం చేయడమేనని దుయ్యబట్టారు. పదవీ కాలం పొడిగింపు చాలా తక్కువ కాలం ఉండాలన్న సుప్రీం కోర్టు తీర్పును తప్పించుకునేందుకే కేంద్రం ఈ ఆర్డినెన్సులను తీసుకొచ్చిందని విమర్శించారు. ‘ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టు.. ఎక్స్టెన్షన్ పట్టు’అన్న చందంగా కేంద్రం తీరు ఉందని పేర్కొంది. ఇప్పటివరకు ఈ సంస్థలకు ఎంతో కొంత సమగ్రత ఉందని, ఆర్డినెన్స్ రాజ్యాన్ని తీసుకొచ్చి, వ్యవస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని మండిపడింది. కాగా, కేంద్ర నిరంకుశ పాలనను ప్రతిపక్షాలమంతా కలసి అడ్డకుంటామని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఒ బ్రియెన్ పేర్కొన్నారు. ఆర్డినెన్సులకు వ్యతిరేకంగా టీఎంసీ రాజ్యసభలో నోటీసులు అందించింది. కేంద్రప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు రూల్స్‌కు సంబంధించి ప్రాథమిక నిబంధనల్లో కేంద్రం సవరణలు చేసింది. సర్వీసులో ఉన్న ఉద్యోగులు, రిటైర్మెంట్ అనంతరం విధులకు సంబంధించి అన్ని అంశాలు ఈ నిబంధనల్లో ఉంటాయి. ఈ నిబంధనల ప్రకారం ఏ ప్రభుత్వ ఉద్యోగి సర్వీసును కూడా రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లకు మించి పొడిగించడానికి వీల్లేదు. కాకపోతే కేబినెట్ సెక్రటరీ, బడ్జెట్ సంబంధిత అంశాలు చూసుకునే అధికారులు, ప్రముఖ శాస్త్రవేత్తలు, ఐబీ, ఆర్ఏడబ్ల్యూ చీఫ్‌లు, సీబీఐ డైరెక్టర్లకు మాత్రం మినహాయింపు ఉంటుంది. అయితే తాజాగా చేసిన సవరణల్లో డిఫెన్స్ సెక్రెటరీ, హోం సెక్రెటరీ, ఐబీ డైరెక్టర్, ఆర్ఏడబ్ల్యూ, సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలాన్ని పెంచే అధికారం కేంద్రానికి వచ్చింది. కాగా, సోమవారం విడుదల చేసిన నోటిఫికేషన్లో ప్రాథమిక నిబంధనల జాబితా నుంచి విదేశీ వ్యవహారాల సెక్రటరీని తొలగించి ఈడీ పేరును చేర్చారు. ఆయన పదవీ కాలాన్ని పొడిగించేందుకేనా? ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్డినెన్స్–2021, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆర్డినెన్స్–2021 ప్రకారం సీబీఐ డైరెక్టర్, ఈడీ చీఫ్‌ల పదవీకాలాన్ని ఒకేసారి ఏడాది పాటు పెంచే వీలుంది. ఆ పొడిగింపు ఐదేళ్లకు మించి ఉండొద్దని ఈ రెండు ఆర్డినెన్సులు స్పష్టం చేస్తున్నాయి. కాగా, ఈడీ చీఫ్ ఎస్కే మిశ్రా బుధవారంతో ఆయన పదవీ కాలాన్ని పూర్తి చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం తాజా ఆర్డినెన్సులు తీసుకురావడం చర్చనీయాంశమైంది. రెండేళ్ల పాటు ఈడీ చీఫ్‌గా పనిచేసిన అనంతరం 2020లో ఆయన పదవీ కాలాన్ని కేంద్రం ఏడాది పాటు పెంచింది. -
జెడ్పీ, ఎంపీటీసీ సభ్యులకు నేడు, రేపటి నుంచి ఐదేళ్ల పదవీ కాలం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఎంపీటీసీ సభ్యులుగా గెలిచిన వారి పదవీ కాలం శుక్రవారం నుంచి, జెడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం శనివారం నుంచి ప్రారంభమై ఐదేళ్ల పాటు కొనసాగుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలంసాహ్ని గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు 2020 మార్చి 7వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయగా, పోలింగ్ 2021 ఏప్రిల్ 8న, కౌంటింగ్ ప్రక్రియ సెప్టెంబర్ 19వ తేదీన ముగిశాయి. మధ్యలో 2020 మార్చిలో 2,371 మంది ఎంపీటీసీ సభ్యులుగా, 126 మంది జెడ్పీటీసీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారి పదవీ కాలం కూడా ఇదీ రీతిలో ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులు స్పష్టం చేశారు. -
ప్రైవేట్ బ్యాంక్ చీఫ్‌లకు ఆర్బీఐ షాక్!
సాక్షి, ముంబై: దేశంలోని ప్రైవేట్ రంగ బ్యాంక్‌లలో సీఈఓ, ఎండీ, ఫుల్ టైం డైరెక్టర్ల (డబ్ల్యూ్టటీడీ) పదవీకాలాన్ని15 ఏళ్లుగా.. ఆయా వ్యక్తులకు గరిష్టంగా 70 ఏళ్ల వయస్సును నిర్ణయిస్తూ రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశాలను జారీ చేసింది. బోర్డ్ సమావేశాలు, కమిటీ ఏర్పాటు, వయసు, పదవీకాలం, డైరెక్టర్ల వేతనాలు వంటివి ఆర్బీఐ జారీ చేసిన సూచనలలో భాగంగా ఉన్నాయి. బ్యాంక్లలోకార్పొరేట్ గవర్నెన్స్‌పై మాస్టర్ డైరెక్షన్స్‌తో వస్తామని ఆర్బీఐ తెలిపింది. అవసరమైన చట్టబద్ధమైన ఆమోదాలకు లోబడి ఎండీ, సీఈఓ లేదా డబ్యూటీడీలను పదిహేనేళ్లకు మించి ఒకే పదవిలో ఉంచలేరని పేర్కొంది. ఒకవేళ అదే వ్యక్తులను పునర్నియామకానికి బోర్డ్ ఆమోదిస్తే గనక.. కనీసం మూడు సంవత్సరాల వ్యవధి తర్వాత.. కొన్నిషరతులకు లోబడి నియమించుకోవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది. అయితే ఈ మూడేళ్ల కాలంలో ఆయా వ్యక్తులు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ బ్యాంక్‌తో లేదా అనుబంధ కంపెనీలతోఎలాంటి సంబంధం లేదా నియామకాలను చేపట్టరాదని ఆదేశించింది. అదేవిధంగా సీఈఓ, ఎండీ, డబ్ల్యూటీడీలు 70 ఏళ్ల వయస్సుకు మించి ఆయా పదవుల్లో కొనసాగలేరని.. అంతకంటేతక్కువ వయసు లోపే పదవీ విరమణను బోర్డ్‌లు సూచించవచ్చని పేర్కొంది. చైర్మెన్, నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల (ఎన్ఈడీ) గరిష్ట వయోపరిమితిని 75 ఏళ్లుగా నిర్ణయించింది. ఎన్‌ఈడీల మొత్తం పదవీకాలం నిరంతరం లేదా బ్యాంక్ బోర్డ్‌లో ఎనిమిది సంవత్సరాలకుమించి ఉండకూడదు. వీరి పునర్నియామకానికి కూడా మూడేళ్ల వ్యత్యాసం ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. అదేవిధంగా ఎన్‌ఈడీల వార్షిక వేతనం రూ.20 లక్షలకు మించరాదనిఆదేశించింది. -
బాబు జమానాలో అంతులేని నిర్బంధకాండ
సాక్షి, అమరావతి: ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు.. నిరసన తెలిపితే చేతులకు బేడీలు.. హక్కుల సాధనకు ఉద్యమిస్తే కటకటాల పాలు.. చంద్రబాబు అధికారంలో ఉండగా అదుపు లేకుండా సాగిన నిర్బంధ కాండ ఇదీ. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియచేసే హక్కులను గత సర్కారు కాలరాసింది. ఇష్టారాజ్యంగా 144, 151, 30 తదితర సెక్షన్లను ప్రయోగించి ఐదేళ్ల పాటు అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేసింది. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని అడుగడుగునా ఇబ్బందులకు గురి చేసింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం 2017 జనవరి 26న విశాఖలో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేందుకు వెళుతున్న వైఎస్ జగన్‌ను విమానాశ్రయం రన్‌వేపైనే అడ్డుకుంది. 2017 ఫిబ్రవరిలో అమరావతిలో జరిగిన జాతీయ మహిళా పార్లమెంట్‌కు హాజరయ్యేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను గన్నవరం విమానాశ్రయంలో దౌర్జన్యంగా అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించి దమన కాండను ప్రదర్శించింది. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటి నుంచి బయటకు రాకుండా నిర్బంధించిన తీరుపై ఇప్పటికీ ఆ సామాజికవర్గంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ముద్రగడ కుమారుడిపై దౌర్జన్యం, మహిళలను దుర్భాషలాడటం లాంటి ఘటనలు ప్రజల మదిలో ఇంకా మెదులుతూనే ఉన్నాయి. వైఎస్సార్సీపీ సీనియర్ నేతలు భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పార్టీ శ్రేణులను, నాటి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, రామకృష్ణలను పలుమార్లు గృహ నిర్బంధాలు, అరెస్టులు చేసిన తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ముస్లిం యువతపై రాజద్రోహం కేసులు.. ముస్లిం యువతపై ఏకంగా రాజద్రోహం, దేశద్రోహం కేసులు నమోదు చేయించిన ఘనత చంద్రబాబు సర్కారుకే దక్కింది. గుంటూరు, నంద్యాలలో చంద్రబాబు నిర్వహించిన సభల్లో న్యాయం కోసం ప్రశ్నించిన మైనార్టీ యువకులపై అక్రమ కేసులు బనాయించి తీవ్రంగా హింసించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం ఈ అక్రమ కేసులను ఎత్తివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ‘హోదా’ గళాలపై ఉక్కుపాదం..; ప్రత్యేక హోదా కోసం నినదించిన వారిపై చంద్రబాబు ఉక్కుపాదం మోపారు. వైఎస్సార్ సీపీతో పాటు ప్రతిపక్షాలపై మూడున్నరేళ్లకుపైగా టీడీపీ సర్కారు నిర్బంధకాండ సాగించింది. పోలీస్ యాక్ట్ 30, ప్రివెంటివ్ సెక్షన్ 151, ఐపీసీ సెక్షన్ 144, 147, 149, 153, 154, 188, 341, 353లతో కేసులు మోపింది. ఒక్కో జిల్లాలో ఒక్కో రీతిలో రెండు, మూడు సెక్షన్లను ప్రయోగించడం గమనార్హం. రాష్ట్రంలో 1,065 మందికి పైగా వైఎస్సార్ సీపీ నాయకులపై కేసులు నమోదు చేయగా పలు జిల్లాల్లో వేల సంఖ్యలో పార్టీ కార్యకర్తలను ముందస్తు అరెస్టులు, బైండోవర్ చేయడం లాంటి చర్యలతో అణచివేతకు పాల్పడింది. రాజధాని రైతులపై తీవ్ర వేధింపులు.. రాజధాని అమరావతికి భూములివ్వలేమన్నందుకు పేద రైతులకు బెదిరింపులు, అక్రమ కేసులు తప్పలేదు. టీడీపీ నేతల అడుగులకు మడుగులొత్తని వారిపై భౌతిక దాడులకు కూడా వెనుకాడలేదు. తమ మాట వినని రైతులకు చెందిన అరటి తోటలు, తాటాకు పాకలు తగలబెట్టిన కొందరు సంఘ విద్రోహశక్తులు అరాచకం సృష్టించారు. రాజధాని ప్రాంతంలో పర్యటించిన మేధాపాట్కర్ లాంటి సామాజిక ఉద్యమకారులు గత సర్కారు దమనకాండను తీవ్రంగా తప్పుబట్టారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ లాంటి వారిని అక్రమ కేసులు, గృహ నిర్బంధాలతో అణచివేసేందుకు టీడీపీ సర్కారు చేయని ప్రయత్నం లేదు. -
మరికొంత సమయం...
న్యూఢిల్లీ: తమ అధ్యక్ష, కార్యదర్శుల పదవీకాలం పొడిగింపు అంశంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మరికొంత కాలం వేచి చూడక తప్పదు. ఈ అంశంపై తగిన మార్గనిర్దేశనం చేయాలంటూ నిబంధనల్లో మార్పులు కోరుతూ బీసీసీఐ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. స్వల్ప వాదన అనంతరం విచారణను రెండు వారాలపాటు వాయిదా వేస్తున్నట్లు చీఫ్ జస్టిస్ శరద్ బాబ్డే, జస్టిస్ లావు నాగేశ్వరరావులతో కూడిన ద్విసభ్య బెంచ్ ప్రకటించింది. కచ్చితమైన తేదీ ప్రకటింకపోయినా... దీనిపై ఆగస్టు 17న మళ్లీ విచారణ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. దాంతో బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా ఎప్పటిలాగే తమ విధులకు హాజరవుతారని తెలుస్తోంది. నేపథ్యమిదీ... బీసీసీఐ పరిపాలనలో మార్పుల కోసం నియమించిన లోధా కమిటీ గతంలో పలు సిఫారసులు చేసింది. బీసీసీఐ విజ్ఞప్తి మేరకు వీటిలో రెండు అంశాలకు చిన్న సవరణలు చేస్తూ... ఇవి మినహా మిగిలిన అన్నింటినీ బోర్డుతో పాటు అనుబంధ రాష్ట్ర క్రికెట్ సంఘాలు అమలు చేయాల్సిందేనంటూ సుప్రీంకోర్టు 2018 ఆగస్టులో దీనికి ఆమోద ముద్ర వేసింది. ఆ సమయంలో వీటిని అమలు చేస్తామంటూ బీసీసీఐ తమ నియమావళిని కూడా సవరించింది. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో తమ నియమావళిలో మళ్లీ సవరణలు చేసేందుకు అనుమతించాలంటూ సుప్రీంకోర్టును బీసీసీఐ ఆశ్రయించింది. గత డిసెంబర్ నుంచి రెండుసార్లు పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుత సమస్య ఏమిటంటే... సుప్రీంకోర్టును బీసీసీఐ కోరుతున్న ప్రధాన అంశం ‘కూలింగ్ ఆఫ్ పీరియడ్’ గురించి. నిబంధనల ప్రకారం బీసీసీఐలోగానీ రాష్ట్ర క్రికెట్ సంఘాల్లోగానీ వరుసగా ఆరేళ్లు ఆఫీస్ బేరర్‌గా పని చేసినవారు ఆ తర్వాత కనీసం మూడేళ్లపాటు ఎలాంటి పదవులు తీసుకోకుండా విరామం ఇవ్వాల్సి ఉంటుంది. అటు సౌరవ్ గంగూలీ (బెంగాల్), ఇటు జై షా (గుజరాత్) కూడా బీసీసీఐ పదవుల్లోకి రాకముందే రాష్ట్ర సంఘాల్లో బాధ్యతలు నిర్వహించారు. ఈ రకంగా వారు ఆరేళ్లు పూర్తి చేసుకున్నారు. గత నెలలోనే జై షా పదవీ కాలం ముగియగా, ఈ నెల 27తో గంగూలీ సమయం కూడా ముగుస్తుంది. అయితే ఇలా తప్పుకోవడం వీరిద్దరికీ ఇష్టం లేదు. దాంతో బోర్డు నియమావళినే మార్చేసి పదవుల్లో కొనసాగాలని వీరు భావిస్తున్నారు. అందుకోసమే మార్పులు చేసుకునే అనుమతి ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు గడప తొక్కారు. అయితే అత్యున్నత న్యాయస్థానం తుది తీర్పు ఇంకా రాలేదంటూ వీరు బోర్డు కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూనే ఉన్నారు. గత అక్టోబరులో గంగూలీ, జై షా ఎంపికయ్యారు. ప్రస్తుత నిబంధన ప్రకారం వీరిద్దరు బోర్డు సమావేశాల్లో పాల్గొనేందుకు అనర్హులవుతారు. అయితే గడువు ముగిసినా వీరిద్దరు ఇప్పటికే పలు సమావేశాల్లో, ఐసీసీ ప్రతినిధులుగా కూడా హాజరవుతున్నారు. వచ్చేవారం ఐపీఎల్ కౌన్సిల్ సమావేశంలో కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఇది ఎప్పటి వరకు సాగుతుందనేది చూడాలి. -
ఆర్టీఐ కమిషనర్ల పదవి మూడేళ్లే!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సమాచార హక్కు కమిషనర్ల పదవీకాలాన్ని మూడేళ్లకు కుదించే ప్రతిపాదన సహా.. సమాచార హక్కు చట్టం నూతన నిబంధనలకు కేంద్రం శుక్రవారం ఆమోదం తెలిపింది. ఇకపై అన్ని నియామకాలకు కొత్త నిబంధనలు వర్తిస్తాయి. వేతనం, ఇతర అలవెన్సులు, సర్వీసు నిబంధనల విషయంలో నిర్ణయాధికారం కొత్త నిబంధనల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి లభించింది. ఆయా నిబంధనలను మార్చే అధికారం కూడా ఇకపై కేంద్రానికి ఉండనుంది. 2005 చట్టంలో సమాచార హక్కు కమిషనర్ల పదవీ కాలాన్ని కచ్చితంగా ఐదేళ్లు లేదా 65 ఏళ్ల వయసు వచ్చేవరకు అని నిర్ణయించగా, తాజా నిబంధనల్లో దాన్ని మూడేళ్లకు కుదించారు. ప్రధాన సమాచార కమిషనర్ వేతనాన్ని రూ. 2.5 లక్షలుగా, సమాచార కమిషనర్ వేతనాన్ని రూ. 2.25 లక్షలుగా నిర్ణయించారు. ఈ మార్పులు సమాచార హక్కు చట్టం స్ఫూర్తిని కాలరాయడమేనని, తాజా నిబంధనల వల్ల సమాచార కమిషన్లు ప్రభుత్వ విభాగాల స్థాయికి తగ్గిపోతాయని ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఐదేళ్ల పాలన ముగిసింది
సాక్షి, ఆదిలాబాద్ : ఉమ్మడి రాష్ట్రం, ఉమ్మడి జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికలు.. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొలువుదీరిన మున్సిపల్ పాలకవర్గాలు.. ఐదేళ్లు పూర్తి చేసుకొని నేటితో పదవీకాలం ముగించనున్నాయి.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికలు జరగని మందమర్రి మున్సిపాలిటీ మినహా ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, కాగజ్‌నగర్, మంచిర్యాల, బెల్లంపల్లిలో మున్సిపాలిటీల్లో ప్రజాప్రతినిధుల పాలనకు నేటితో తెర పడనుంది. మళ్లీ ఎన్నికలు జరిగి కొత్త పాలకవర్గాలు ఏర్పడే వరకు ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలనను విధించే అవకాశం ఉంది. త్వరలో మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకు రావడంతో ఇక పురపాలికల్లో ఎన్నికల సందడి మొదలుకానుంది. ఒకచోట మినహా.. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ ఐదు మున్సిపాలిటీలో 2014లో టీఆర్ఎస్ పాలకవర్గాలే ఏర్పడ్డాయి. ఒక్క భైంసాలో మాత్రం ఏఐఎంఐఎం పాలకవర్గం ఏర్పడింది. ఒక్క నిర్మల్ మినహాయించి ఐదు పురపాలికల్లో మహిళా చైర్పర్సన్లే ప్రాతినిథ్యం వహించడం గమనార్హం. ఆదిలాబాద్‌లో చైర్‌పర్సన్‌గా రంగినేని మనిషా, వైస్ చైర్మన్‌గా ఫారుఖ్అహ్మద్, నిర్మల్‌లో చైర్మన్‌గా అప్పాల గణేష్ చక్రవర్తి, వైస్‌చైర్మన్‌గా అజీమ్బిన్ యాహియ, మంచిర్యాలలో చైర్‌పర్సన్‌గా మామిడిశెట్టి వసుంధర, వైస్‌చైర్మన్‌గా నల్ల శంకర్, బెల్లంపల్లిలో చైర్‌పర్సన్‌గా సునితారాణి, వైస్‌చైర్మన్‌గా సత్యనారాయణ, కాగజ్‌నగర్‌లో చైర్‌పర్సన్‌గా సీపీ విద్యావతి, వైస్ చైర్మన్‌గా సద్దాం హుస్సేన్, భైంసాలో చైర్‌పర్సన్‌గా సఫియా బేగం, వైస్‌చైర్మన్‌గా జాబిర్ అహ్మద్ అప్పట్లో బాధ్యతలు స్వీకరించారు. అయితే బెల్లంపల్లిలో నాలుగేళ్లు చైర్‌పర్సన్‌గా ఉన్న సునితారాణిపై అవిశ్వాస తీర్మాణం పెట్టి తొలగించడంతో మునిమంద స్వరూప చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. వైస్ చైర్మన్‌గా మాత్రం సత్యనారాయణనే కొనసాగారు. ఇక్కడ మినహా ఉమ్మడి జిల్లాలోని ఐదుబల్దియాల్లో పాలకవర్గాలు సంపూర్ణంగా పాలన ముగించనున్నాయి. అయితే మిగితా పాలకవర్గాల్లోనూ నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న తర్వాత సభ్యుల్లో అసంతృప్తి కారణంగా అవిశ్వాసం పెడతారనే ప్రచారం సాగినప్పటికీ ఉమ్మడి జిల్లాలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, అప్పటి మంత్రి, ప్రస్తుత ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆశవాహుల్ని సద్దుమణిగించడంతో అవిశ్వాస వ్యవహారాలు నిలిచిపోయాయి. ఐదేళ్ల పాలన నేటితో పూర్తికానుంది. కొత్త రాష్ట్రంలో బాధ్యతలు.. ఉమ్మడి రాష్ట్రంలో 2014 మార్చి 30న మున్సిపాలిటీ ఎన్నికలు జరిగాయి. 2014 మే 13న వాటి ఫలితాలు వెలుబడ్డాయి. ఆదిలాబాద్‌లో టీఆర్ఎస్, నిర్మల్‌లో బీఎస్పీ, భైంసాలో ఎంఐఎం, కాగజ్‌నగర్‌లో టీఆర్ఎస్, బెల్లంపల్లి, మంచిర్యాలలో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుపొందాయి. అయితే కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 జూలైలో పాలకవర్గాల ఏర్పాటుకు సంబంధించి ప్రత్యేక సమావేశాలు నిర్వహించగా ఆదిలాబాద్, నిర్మల్, కాగజ్‌నగర్, మంచిర్యాల, బెల్లంపల్లిలో టీఆర్ఎస్ విజయకేతనం ఎగరవేసి పాలన పగ్గాలు చేపట్టింది. మంచిర్యాల, బెల్లంపల్లిలో కాంగ్రెస్ సభ్యులు అప్పుడు ప్రత్యేక సమావేశంలో విప్‌ను ధిక్కరించి మరీ టీఆర్ఎస్కు జై కొట్టడంతో ఆ రెండు చోట్ల కూడా టీఆర్ఎస్ పాలకవర్గ బాధ్యతలు చేజిక్కించుకుంది. భైంసాలో ఎంఐఎం పదవీ బాధ్యతలు చేపట్టింది. ప్రధానంగా నిర్మల్‌లో అప్పుడు బీఎస్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఇంద్రకరణ్‌రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆ పార్టీ నుంచే అభ్యర్థులను బరిలో నిలిపి అత్యధికంగా గెలవడం జరిగింది. ఆ తర్వాత ఐకేరెడ్డి టీఆర్ఎస్లో చేరడంతో బీఎస్పీ నుంచి కౌన్సిలర్లుగా గెలిచిన సభ్యులు కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అప్పుడు బీఎస్పీ కౌన్సిలర్‌గా గెలిచిన అప్పాల గణేష్ టీఆర్ఎస్ నుంచి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పాల గణేష్ కాంగ్రెస్‌లోకి మారారు. ఆదిలాబాద్, నిర్మల్, కాగజ్‌నగర్‌లో టీఆర్ఎస్కు మిత్రపక్షంగా వ్యవహరించిన ఎంఐఎంకు వైస్ చైర్మన్ పదవులు ఇచ్చారు. ఇక కొత్త జిల్లాలో.. ఉమ్మడి జిల్లాలో ఏర్పడిన మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం నేటితో ముగిసిపోనుండగా త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల ద్వారా కొత్త జిల్లాలో కొత్త పాలకవర్గాలు ఏర్పడనున్నాయి. ఆదిలాబాద్‌లో ఆదిలాబాద్, నిర్మల్‌లో నిర్మల్, భైంసా, ఖానాపూర్, మంచిర్యాలలో మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, నస్పూర్, క్యాతన్‌పల్లి, లక్సెట్టిపేట, చెన్నూర్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కాగజ్‌నగర్ మున్సిపాలిటీ ఉన్నాయి. ఆదిలాబాద్, కొమురంభీం జిల్లాల్లో ఒక్కో మున్సిపాలిటీ ఉండగా నిర్మల్‌లో 3, మంచిర్యాలలో అత్యధికంగా 7 మున్సిపాలిటీలు ఉండటం గమనార్హం. అయితే మందమర్రి మున్సిపాలిటీ మినహా అన్ని చోట్ల ఎన్నికలు జరగనున్నాయి. -
‘ఈ పదేళ్లు జైలులో గడిపినట్లుంది’
శ్రీనగర్ : ఐఏఎస్ అధికారిగా ఉన్న ఈ పదేళ్లు నాకు జైలులో గడిపినట్లనిపించింది అంటున్నారు మాజీ ఐఏఎస్ అధికారి షా ఫజల్. 2009లో సివిల్ సర్వీస్ పరీక్షలో మొదటి ర్యాంకు సాధించిన తొలి కశ్మీరీగా చరిత్ర సృష్టించిన ఫజల్.. గత నెలలో తన పదవికి రాజీనామ చేసిన సంగతి తెలిసిందే. ఉద్యోగానికి రాజీనామ చేసిన తరువాత తొలిసారి ఓ పబ్లిక్ మీటింగ్‌కు హాజరయ్యారు ఫజల్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘విదేశాలకు వెళ్తే నా కుటుంబంతో కలిసి చాల సౌకర్యవంతమైన జీవితం గడిపే అవకాశం ఉన్నప్పటికి కూడా.. నేను అలా చేయలేదు. నా ప్రజల కోసం ఇక్కడే ఉండాలనుకున్నాను. ప్రజలకు, అధికారులకు మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చాలనుకున్నాను. ఐఏఎస్‌ను ఎంచుకున్నాను’ అని తెలిపారు. అంతేకాక ‘ఈ పదేళ్లలో నా ప్రజలకు ఎన్నో సేవలు చేశాను. దాంతో పాటు సర్వీసు కాలంలో ఎన్నో అన్యాయాలను, అమానుషాలను కూడా చూశాను. వీటన్నింటి గురించి విన్నప్పడు నేను చాలా నిస్సహాయుడినని భావించేవాడిని. నిజం చెప్తున్న.. ఈ పదేళ్లు జైలులో ఉన్నట్లు అనిపించింది. కానీ ఇప్పుడు ఉద్యోగాన్ని వదిలేశాను. ఇక మీదట ఊరూరా తిరుగుతు ప్రజల సమస్యల గురించి పోరాటం చేస్తాన’ని తెలిపాడు. అంతేకాక కశ్మీర్ ప్రజల గురించి మాట్లాడ్డానికి.. వారి సమస్యల గురించి పోరాటం చేయడానికి తాను రాజకీయాల్లోకి వస్తున్నాని ప్రకటించాడు. అవినీతి రహిత రాజకీయాల కోసం తాను పాటుపడతానని.. అందుకే ఏ పార్టీలో చేరబోనని.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని తెలిపాడు షా ఫజల్. -
జనం మదిలో ఏముంది?
► రెండున్నరేళ్ల పాలనపై ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యేలను ఆరా తీస్తున్న సీఎం కేసీఆర్ ► ఒక్కో జిల్లాకు చెందిన శాసనసభ్యులతో ప్రత్యేక భేటీలు ► ఇప్పటికే మూడు జిల్లాల ఎమ్మెల్యేలతో సమావేశం ► అభివృద్ధి, సంక్షేమ పథకాలపై వాకబు.. ప్రతిపక్ష పార్టీల పరిస్థితిపైనా చర్చ ► ప్రజలతో కలసి పనిచేయాలని సూచనలు సాక్షి, హైదరాబాద్ రెండున్నరేళ్ల పాలనపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వీయ సమీక్ష చేసుకుంటున్నారా? ఇందుకు ఆయనే స్వయంగా రంగంలోకి దిగారా? క్షేత్రస్థాయి వాస్తవాలపై ఎమ్మెల్యేలను ఆరా తీస్తున్నారా? అధికార పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఇందుకు అవుననే సమాధానం వస్తోంది! ‘ప్రజలు ఏమనుకుంటున్నారు’ అన్న ప్రశ్న చుట్టూ సమాధానాలు రాబట్టే పనిలో సీఎం తలమునకలయ్యారు. ఇందుకు ఆయన ఒక్కో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మూడు జిల్లాల ఎమ్మెల్యేలతో ఈ భేటీలు ముగిశాయి. ‘‘మీ జిల్లా పరిస్థితి ఏంటి? మనం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు ఏమనుకుంటున్నారు? క్షేత్ర స్థాయిలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారా?’’ అంటూ సీఎం కేసీఆర్ స్వయంగా ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకుంటున్నారు. రెండున్నరేళ్ల పాలన తీరుపై నేరుగా సమాచారం సేకరిస్తున్నారు. ప్రభుత్వ పథకాలపై ఆరా.. గడచిన రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పనులతోపాటు సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు ఏమనుకుంటున్నారన్న అంశంపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధానంగా డబుల్ బెడ్రూం ఇళ్లపై నియోజకవర్గాల్లో ప్రజల మనోగతం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు డబుల్ బెడ్రూం ఇళ్ల మంజూరీపై కొంత అసంతృప్తి ఉందని చెప్పారు. రూ.వెయ్యి చొప్పున ఇస్తున్న పెన్షన్లపై ఎలాంటి అభిప్రాయం ఉందని కూడా సీఎం అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నామని, కానీ కాంగ్రెస్ పార్టీ కేసులతో ప్రభుత్వం కాళ్లలో కట్టెలు పెడుతోందని ఎమ్మెల్యేలతో సీఎం అన్నట్లు సమాచారం. ఈ అంశంపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. దీనిపై ఎమ్మెల్యేలుగా నియోజకవర్గాల్లో ఏం చేశారని కూడా అడిగినట్లు తెలిసింది. సీఎంవోకు చెందిన ఒకర్దిదరు అధికారులు మినహా ఇతర అధికారులెవరూ లేకుండానే ఎమ్మెల్యేలతో ఈ భేటీలు జరుగుతున్నాయి. నియోజకవర్గాల్లో అధికారుల పనితీరు ఎలా ఉంది? వారు సహకరిస్తున్నారా.. లేదా? అన్న విషయాలు అడిగి తెలుసుకుంటున్నారని వినికిడి. మరో రెండున్నరేళ్లలోనే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పట్నుంచే నియోజకవర్గాల పరిస్థితిపై సీఎం ఓ అంచనాకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. ఓడిన అభ్యర్థి ఎవరు? ఏం చేస్తున్నారు? నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీల పరిస్థితిపైనా సీఎం వివరాలు తెలుసుకుంటున్నారు. ఇప్పటిదాకా వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశాల్లో పూర్తిస్థాయిలో ఈ వివరాలు తెలుసుకున్నారని చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి ఎవరు? ఏ పార్టీ? వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా ఆందోళనలు చేశారా? వాటిలో ప్రజలు ఏ స్థాయిలో పాల్గొంటున్నారు.. వంటి సమచారాన్ని కూడా అడిగి తెలుసుకున్నారని సమాచారం. ఒక్కో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలను పిలిపించి అందరి ఎదుటే జిల్లాతోపాటు నియోజకవర్గం పరిస్థితిపైనా చర్చిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన ఎమ్మెల్యేలతో మాత్రం ప్రత్యేకంగా ముఖాముఖి మాట్లాడుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే హైదరాబాద్‌కు వచ్చే ప్రతి ఎమ్మెల్యే విధిగా క్యాంపు కార్యాలయంలో తనను కలిసేలా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. సమస్యలేంటి? పరిష్కారం ఎలా? సమావేశాల్లో పాల్గొంటున్న ఎమ్మెల్యేలతో వారి నియోజకవర్గాల్లోని సమస్యలపైనా సీఎం చర్చిస్తున్నారు. ఏం పనులు కావాలి? ఎలాంటి సమస్యలు ఉన్నాయి? వాటిని ఎలా పరిష్కరించాలి? అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులకే అందుతున్నాయా? మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలపై ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇంకా ఏమైనా కొత్త పథకాలు చేపట్టాలా? అన్న అంశంపైనా సీఎం ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ పనితీరును తెలుసుకుంటూనే ఎమ్మెల్యేల పనితీరును కూడా బేరీజు వేస్తున్నారని సమాచారం. హైదరాబాద్‌లో, నియోజకవర్గ కేంద్రాల్లోనో ఉంటున్నారా? నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారా? అని కూడా ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గాల్లో తమ పరిస్థితి బాగానే ఉందని కొందరు ఎమ్మెల్యేలు జవాబు ఇవ్వగా.. తన వద్ద ఉన్న రిపోర్టు అలా లేదని, జాగ్రత్తగా చూసుకోండని వారికి సీఎం సలహా ఇచ్చారని తెలిసింది. ప్రజలతో కలిసి పనిచేసేందుకు ఎమ్మెల్యేలకు సలహాలు, సూచనలు కూడా ఇస్తున్నారు. మొత్తంగా చాలా ముందుగానే ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని తెలుసుకోవడం, తమను పిలిచి మాట్లాడడంపై ఎమ్మెల్యేల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇదంతా భవిష్యత్ ఎన్నికల ప్రణాళికను పకడ్బందీగా తయారు చేసుకునేందుకు జరుగుతున్న కసరత్తులో భాగమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
పదవులు పదిలం!
♦ స్థానిక సంస్థల భవితవ్యంపై ప్రభుత్వం స్పష్టత ♦ జిల్లాల విభజన నేపథ్యంలో అనుమానాలు నివృత్తి ♦ పదవీకాలం ముగిసేవరకు ప్రస్తుత పాలకవర్గాలకే పీఠం ♦ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతకు తప్పిన పదవీగండం ♦ మండలాల వ్యవస్థలో ఆచరించిన పద్ధతికే మొగ్గు ♦ ఊపిరి పీల్చుకున్న ‘స్థానిక’ ప్రజాప్రతినిధులు 1985లో మండల వ్యవస్థ ప్రవేశపెట్టిన సమయంలో అప్పటికే కొలువుదీరిన పంచాయతీ సమితులను రద్దు చేయలేదు. వాటి పదవీ కాలం వరకు కొనసాగించారు. ఇప్పుడూ అదే పద్ధతిని అవలంబించనున్నారు. ప్రస్తుత జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి యాలాల మండలం నుంచి ఎన్నికయ్యారు. ఈ మండలం పునర్విభజనలో వికారాబాద్ కేంద్రంగా కొనసాగే రంగారెడ్డి జిల్లాలోకి వెళ్లనుంది. స్థానిక సంస్థల ఉనికికి భంగం కలగకుండా జిల్లాల పునర్విభజన ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత పదవీకాలం ముగిసేంతవరకు స్థానిక సంస్థల జోలికి వెళ్లకూడదనే నిర్ణయానికి వచ్చింది. ముఖ్యంగా మరో రెండున్నరే ళ్ల పదవీకాలం ఉన్న జిల్లా పరిషత్ పాలకవర్గాన్ని యథావిధిగా కొనసాగించేందుకు మొగ్గు చూపుతోంది. దసరా నుంచి కొత్త జిల్లాలు మనుగడలోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జిల్లాల పునర్వ్యవస్థీకరణకు తుదిరూపు ఇస్తోంది. తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహా ఇతర జిల్లాల విభజనపై స్పష్టత కూడా వచ్చింది. మరోవారం పది రోజుల్లో మన జిల్లా ఎన్ని ముక్కలు కానుందో తేలనుంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాల పునర్విభజన నేపథ్యంలో స్థానిక సంస్థల భవిష్యత్తు ఏమిటనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజకీయంగా ఈ అంశం ముడిపడి ఉండడంతో ప్రభుత్వం కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది. న్యాయపర, రిజర్వేషన్ల సమస్య తలెత్తకుండా వీటి విభజనపై దృష్టి పెట్టకపోవడమే మంచిదనే భావనకొచ్చాయి. ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వం స్పష్టం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం జిల్లా పరిషత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న జెడ్పీటీసీ సభ్యులు.. రేపు జిల్లాల విభజన తర్వాత మరో జిల్లా పరిధిలోకి చేరితే పరిస్థితేంటనే సందేహాన్ని పలువురు కలెక్టర్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. వీరందరి అనుమానాన్ని నివృత్తి చేసిన ప్రభుత్వ పెద్దలు.. 1985లో మండల వ్యవస్థ ప్రవేశపెట్టిన సమయంలో అప్పటికే కొలువుదీరిన పంచాయతీ సమితులను రద్దు చేయలేదని, వాటి పదవీకాలం వరకు కొనసాగించారని, అదే పద్ధతిని ఇప్పుడు అవలంబిస్తామని స్పష్టం చేశారు. 1987 వరకు సమితులు కొనసాగించారని, ప్రస్తుత పాలకవర్గాలు కూడా ఐదే ళ్ల పదవీకాల ం ముగిసేవరకు ఉంటాయని స్పష్టతనిచ్చారు. ప్రస్తుత జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి యాలాల మండలం నుంచి ఎన్నికయ్యారు. ఈ మండలం జిల్లాల పునర్విభజనలో వికారాబాద్ కేంద్రంగా కొనసాగే రంగారెడ్డి జిల్లాలో ఉండనుంది. చేవేళ్ల, వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాలు ఈ జిల్లా పరిధిలోకి రానున్నాయి. మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లు ఏ జిల్లాలో చేరుతాయి? కొత్త జిల్లాలుగా మారుతాయా? అనే అంశంపై ఇంకా అస్పష్టత నెలకొంది. ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ భవితవ్యంపై రాజకీయవర్గాల్లో చర్చోపచర్చలు జరిగాయి. అయితే, ఇటీవల జరిగిన సమావేశంలో ప్రభుత్వం.. జిల్లా పరిషత్‌లను యథాతథంగా కొనసాగించేందుకే మొగ్గు చూపాయి. జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా పదవుల విభజన కూడా చేపడితే న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశముందనే అభిప్రాయానికొచ్చాయి. అదేసమయంలో అర్ధంత రంగా ఈ పదవులను అర్డినెన్స్ ద్వారా రద్దు చేసి ప్రత్యేకాధికారుల పాలనను తెచ్చినా.. రాజకీయంగా ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందని భావించారు. ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం ముగిసేవరకు కొనసాగిస్తే మంచిదనే నిర్ణయానికొచ్చింది. ఈ పరిణామాలను గమనిస్తే జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి పీఠానికి ఢోకాలేనట్లే! పునర్విభజనతో జిల్లా రెండు, మూడు జిల్లాలుగా ఏర్పడినా.. ఆ జిల్లాల పగ్గాలు కూడా ప్రస్తుత చైర్పర్సన్ చేతిలోనే ఉంటాయని అధికారవర్గాలు తెలిపాయి. -
చైర్మన్, సీఈఓ పదవులకు ఐటీసీ దేవేశ్వర్ గుడ్ బై!
యువ నాయకత్వం కోసమేనని వెల్లడి న్యూఢిల్లీ: ఐటీసీ చైర్మన్ వై.సి. దేవేశ్వర్ తన ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సీఈఓ పదవుల నుంచి వైదొలగనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ఆయన పదవీ కాలం ముగియనున్నది. ఈ పదవుల్లో ఆయన 20 ఏళ్ల పాటు కొనసాగారు. ఈ పదవుల నుంచి వైదొలగిన అనంతరం ఆయనను నాన్-ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, చైర్మన్‌గా నియమించనున్నామని ఐటీసీ తెలిపింది. వచ్చే నెల 22న జరిగే కంపెనీ వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం)లో మూడేళ్ల ఈ నియామకానికి వాటాదారుల ఆమోదం కోరతామని పేర్కొంది. సిగరెట్ కంపెనీ స్థాయి నుంచి.. కంపెనీ దీర్ఘకాలిక ప్రయోజనాల పరంగా అగ్రనాయకత్వంలో యువరక్తం ఉంటే బావుంటుందని దేవేశ్వర్ భావిస్తున్నారని, అందుకు ఎగ్జిక్యూటివ్ రోల్ నుంచి వైదొలగాలనుకుంటున్నారని, వాటాదారులకు పంపిన నోటీస్‌లో ఐటీసీ పేర్కొంది. 1968లో ఐటీసీలో చేరిన దేవేశ్వర్(69) 1996లో ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2012లో చైర్మన్‌గా మళ్లీ నియమితులయ్యారు. ఆయన చైర్మన్‌గా పగ్గాలు చేపట్టినప్పుడు ఐటీసీ వార్షిక ఆదాయం రూ.5,200 కోట్లు, స్థూల లాభం రూ.452 కోట్లుగా ఉంది. ఇప్పుడు ఆదాయం పదింతలై రూ.51,582 కోట్లకు, స్థూల లాభం 33 రెట్లు పెరిగి రూ.14,958 కోట్లకు పెరిగాయి. -
ఆర్బీఐ గవర్నర్ అంశం మీడియాకెందుకు?
♦ రాజన్ పదవీకాలం పొడిగింపుపై మౌనం వీడిన ప్రధాని ♦ ఈ నియామకం పాలనాపరమైన వ్యవహారమని వ్యాఖ్య ♦ ఈ అంశంలో రాజకీయ నాయకుల జోక్యం తగదన్న అసోచామ్ ♦ మరోసారి రాజన్‌పై స్వామి విమర్శలు వాషింగ్టన్/న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ పదవీకాలం పొడిగింపు అంశంపై మీడియాలో వస్తున్న ఊహాగానాలు, రాజకీయ విమర్శల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ మొట్టమొదటిసారి ఈ అంశంపై పెదవి విప్పారు. ఇది పూర్తిగా పాలనాపరమైన నిర్ణయం, వ్యవహారం అనీ, దీనిపై మీడియా ఉత్సుకత తగదని వ్యాఖ్యానించారు. కాగా అసలు ఈ వ్యవహారంలో రాజకీయ నాయకుల వ్యాఖ్యలు సరికాదని అసోచామ్ వ్యాఖ్యానించింది. ఇవేమీ పట్టించుకోని బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యంస్వామి మామూలుగానే మరోసారి రాజన్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. సెప్టెంబర్‌లోనే నిర్ణయం: మోదీ వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మోదీ ఈ అంశంపై మాట్లాడుతూ, ‘‘ పాలనా పరమైన అంశం మీడియా ఉత్సుకత చూపే అంశంగా ఉండాలని నేను భావించడం లేదు. ఈ అంశాన్ని సెప్టెంబర్‌లోనే చేపట్టడం జరుగుతుంది’’ అని స్పష్టంచేశారు. రాజన్ మూడేళ్ల బాధ్యతలు సెప్టెంబర్ మొదటివారంలో ముగియనున్నాయి. రాజన్‌పై స్వామి విమర్శలు... రాజన్ బాధ్యతల పొడిగింపునకు సంబంధించి అడిగిన ఒక ప్రశ్నకు ఇటీవలే ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సమాధానం ఇస్తూ ‘‘ప్రభుత్వం-ఆర్బీఐ మధ్య పరిపక్వతతో కూడిన సంబంధాలు ఉన్నాయి’’ అని వ్యాఖ్యానించారు. వ్యక్తిగత ఆరోపణలను అంగీకరించబోమని కూడా స్పష్టం చేశారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ చీఫ్ ఎకనమిస్ట్‌గా పనిచేసిన రాజన్‌కు... అంతర్జాతీయ ఆర్థిక అంశాలపై విశేష పట్టు ఉంది. 2008 ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే ఊహించిన ఘనత ఆయనకు సొంతం. ప్రతిష్టాత్మక చికాగో యూనివర్సిటీ బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఫైనాన్స్)లో ‘ఆన్‌లీవ్’ ఫ్రొఫెసర్‌గా ఉన్నారు. సెప్టెంబర్ 2013లో ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత క్రమంగా రుణ బెంచ్‌మార్క్ రేటు- రెపో రేటును 7.25 శాతం నుంచి 8 శాతానికి పెంచారు. 2014 మొత్తం భారత్ అధిక వడ్డీరేటు వ్యవస్థలో కొనసాగింది. ఇందుకు ద్రవ్యోల్బణాన్ని ఆయన కారణంగా చూపారు. అటుతర్వాత ఆర్థికశాఖ, పరిశ్రమల నుంచి వచ్చిన ఒత్తిడులు, ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో క్రమంగా రెపో రేటును 1.50 శాతం తగ్గించారు. దీనితో ఈ రేటు ప్రస్తుతం 6.5 శాతానికి దిగివచ్చింది. చేయాల్సింది చాలా ఉందని ఇటీవలే పేర్కొన్న రాజన్.. బాధ్యతల్లో రెండోసారి కొనసాగడానికి సిద్ధమని ఇటీవలే సంకేతాలు ఇచ్చారు. స్వామి మాటలు షరా మామూలే! యథాపూర్వం బీజేపీ నాయకుడు సుబ్రమణ్యం స్వామి శుక్రవారమూ రాజన్‌పై ప్రతికూల వ్యాఖ్యలు చేశారు. ఆయన విధానాలు వ్యవసాయ రంగానికి వ్యతిరేకమని వ్యాఖ్యానించారు. బ్యాంకింగ్ విధానాలు వ్యవసాయ రంగానికి ప్రతికూలంగా ఉన్నాయని విమర్శించారు. అమెరికా బహుళజాతి కంపెనీలకు సహాయం చేసే విధంగా.. దేశంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రయోజనాలను రాజన్ దెబ్బతీసినట్లు భారతీయ కిసాన్ అభియాన్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. ‘రాజన్ బాధ్యతల పొడిగింపులో మీడియా ఉత్సుకత అనవసరం అని మాత్రం ప్రధాని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు’ అని సైతం స్వామి ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాజకీయ నాయకులకు అనవసరం: అసోచామ్ రాజన్ బాధ్యతలు రెండవ విడత పొడిగింపు అంశం రాజకీయ నాయకులకు అనవసరమని పారిశ్రామిక ప్రాతినిధ్య సంస్థ అసోచామ్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ అంశంపై వ్యాఖ్యలు రాజకీయ నాయకులకు తగదని అభిప్రాయపడింది. సంబంధిత వ్యక్తి తీవ్ర తప్పిదం చేస్తేతప్ప, ఆర్బీఐ గవర్నర్ వంటి పదవిని రాజకీయాల్లోకి లాగడం సరికాదని స్పష్టంచేసింది. ఇతర వర్ధమాన దేశాలతో పోల్చిచూస్తే భారత్ స్థూల ఆర్థిక వ్యవస్థ స్థిరత్వంలో రిజర్వ్ బ్యాంక్ పాత్ర కీలకమని వ్యాఖ్యానించింది. ఆర్బీఐ గవర్నర్ వంటి అత్యున్నత స్థాయి నియామకాలు ప్రభుత్వ నిర్ణయ పరిధికి లోబడిన వ్యవహారమని, దీనిపై అనవసర మీడియా ప్రకటనలు తగదని పేర్కొంది. -
ఆయన జీతం.. రూ. 74 కోట్లు!
బెంగళూరు: ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా జీతం భారీగా పెరిగింది. తాజాగా ఇన్ఫోసిస్ విడుదల చేసిన ఫలితాల్లో కంపెనీ మంచి లాభాలు ఆర్జించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఏడాదికి ఆయన దాదాపు 74 కోట్ల రూపాయలను జీతభత్యాలుగా అందుకోనున్నారు. 2016 ఆర్థిక సంవత్సరంలో సిక్కా ఇన్ఫోసిస్ ఆదాయాన్ని 63,446 కోట్ల రూపాయలకు చేర్చారు. అక్కడితో ఆగిపోకుండా నాస్ కామ్ అంచనాలను తలక్రిందులు చేస్తూ 13.3 శాతం వృద్ధిని కూడా నమోదు చేసింది. దీంతో కంపెనీ సీఈవోగా సిక్కా పదవీ కాలాన్ని మరో రెండేళ్ల పాటు పెంచింది. అంటే 2021 వరకు సిక్కానే ఇన్ఫోసిస్ సీఈవోగా కొనసాగనున్నారు. సిక్కా పే స్కేల్లో మార్పులతో కంపెనీ సీనియర్ల జీతభత్యాల్లో కూడా మార్పులు రానున్నాయి. అయితే, మిగతా ఉద్యోగుల జీతాలను కంపెనీ వెల్లడించలేదు. రెండేళ్ల క్రితం ఇన్ఫోసిస్ భారీ నష్టాలను చవిచూసిన విషయం తెలిసిందే. -
సీఐసీ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
న్యూఢిల్లీ: కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) లోని ప్రధాన సమాచార కమిషనర్, సమాచార కమిషనర్ల నియామకాలకు దరఖాస్తులను ఆహ్వానించారు. ప్రస్తుత సీఐసీ విజయ్‌శర్మ పదవీకాలం డిసెంబర్లో పూర్తి కానుంది. మొత్తం పదిమంది సమాచార కమిషనర్ల పోస్టులకుగాను ప్రస్తుతం 3 ఖాళీగా ఉన్నాయి. సీఐసీ, ఇతర సమాచార కమిషనర్లను నియమించాలని ప్రతిపాదించినట్టు సిబ్బంది, శిక్షణ విభాగం ఉత్తర్వుల్లో తెలిపింది. సీఐసీ, ఇతర ఐసీ పదవుల్లో నియమితులయ్యేవారు ప్రజా జీవితంలో పేరుప్రతిష్టలు పొంది ఉండడమేగాక అన్ని అంశాలపై విస్తృత పరిజ్ఞానం కలిగి ఉండాలి. న్యాయ, శాస్త్ర, సామాజిక సేవ, నిర్వహణ, జర్నలిజం, మాస్-మీడియా, గవర్నెన్స్ వంటి విషయాల్లో అనుభవం కలిగినవారై ఉండాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. దరఖాస్తులను పంపేందుకు అక్టోబర్ 12 చివరితేదీ. -
జేడీఏ ‘పదవి’పై ఉత్కంఠ
ఖమ్మం వ్యవసాయం : ఖమ్మం సంయుక్త వ్యవసాయ సంచాలకులుగా పూర్తి అదనపు బాధ్యతలతో పని చేస్తున్న పీ.బీ భాస్కర్‌రావు పదవీకాలంపై ఉత్కంఠ నెలకొంది. గురువారం (ఏప్రిల్ 30)తో ఆయన పదవీకాలం ముగుస్తుంది. అయితే ప్రభుత్వం ఆస్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తుందనే అంశం ఆసక్తి రేపుతోంది. వాస్తవానికి పీబీ భాస్కర్‌రావు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ రైతు శిక్షణ కేంద్రం ఉపసంచాలకులు. 2013లో ఇక్కడ పని చేస్తున్న రఫీక్ అహ్మద్ హైదరాబాద్‌కు బదిలీ కావటంతో కొంతకాలం వరంగల్ జేడీఏ నాగేశ్వరరావు అదనపు బాధ్యతలు నిర్వహించారు. 2013 జూన్‌లో రాజేంద్రనగర్‌లో పని చేస్తున్న పీబీ భాస్కర్‌రావుకు ఖమ్మం జేడీఏగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించి పంపారు. అప్పటి నుంచి రెగ్యులర్ అధికారిని నియమించలేదు. ఈయనే బాధ్యతలు నిర్వహించారు. ఈయన పదవీ కాలం పూర్తయినా ఇన్చార్జి బాధ్యతలు కూడా ఎవరికి అప్పగించాలో రాష్ట్ర కమిషనరేట్ నుంచి బుధవారం రాత్రి పొద్దుపోయే వరకు సమాచారం లేదు. ప్రస్తుతం ఇక్కడ పని చేస్తున్న పి.బి భాస్కర్‌రావు రాజేంద్రనగ్ రైతు శిక్షణ కేంద్రం ఉప సంచాలకులుగా పదవీ విరమణ పొందాల్సి ఉంది. బుధవారం రాత్రి వరకు రాష్ట్ర కమిషనర్ కార్యాలయం నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాక పోవటంతో ప్రభుత్వం ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తుందోనని, లేదా ఎవరికైనా అదనపు బాధ్యతలు అప్పగిస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది. జేడీఏ పదవి ఎవరిని వరించనుంది..! ప్రస్తుతం ఖమ్మం వ్యవసాయ శాఖలో రైతు శిక్షణ కేంద్రం ఉపసంచాలకులుగా పని చేస్తున్న ఎం. రత్నమంజుల రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆప్షన్ పెట్టుకున్నారు. మరో ఉపసంచాలకులు ఆశాకుమారి జిల్లాలోని ఆత్మ డిప్యూటి ప్రాజెక్టు డెరైక్టర్‌గా పని చేస్తున్నారు. రఫీక్‌అహ్మద్ కంటే ముందు ఆశాకుమారికి జేడీఏ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఆమెకు ఈ బాధ్యతలు భారం కావటంతో ఆ తర్వాత తప్పించారు. ప్రస్తుతం జిల్లాలో ఉపసంచాలకులుగా పని చేస్తున్న అధికారి ఆశాకుమారి కావటంతో ఈ సారి కూడా ఆమెకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నూతన అధికారిని జేడీఏగా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేస్తుందా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది.