![AP SEC Release Notification For The Tenure of MPTC and ZPTC Members 5 Years - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/24/ap%20sec.jpg.webp?itok=jMOmsrp1)
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఎంపీటీసీ సభ్యులుగా గెలిచిన వారి పదవీ కాలం శుక్రవారం నుంచి, జెడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం శనివారం నుంచి ప్రారంభమై ఐదేళ్ల పాటు కొనసాగుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలంసాహ్ని గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు 2020 మార్చి 7వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయగా, పోలింగ్ 2021 ఏప్రిల్ 8న, కౌంటింగ్ ప్రక్రియ సెప్టెంబర్ 19వ తేదీన ముగిశాయి.
మధ్యలో 2020 మార్చిలో 2,371 మంది ఎంపీటీసీ సభ్యులుగా, 126 మంది జెడ్పీటీసీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారి పదవీ కాలం కూడా ఇదీ రీతిలో ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment