
ఢిల్లీ: ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అక్రమాలపై మూడు రోజుల్లోగా జవాబు చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరపాలన్న వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి ఫిర్యాదుపై ఏపీ ఎన్నికల సంఘం స్పందించింది.ఏపీ డీజీపీ నుంచి వివరణ కోరింది.

Comments
Please login to add a commentAdd a comment