Mayor Elections
-
తెలుగోడు.. టెక్సాస్ మేయర్ ఎన్నికల బరిలో!
విదేశాల్లో స్థిరపడిన భారతీయులు, భారత సంతతికి చెందిన వ్యక్తులూ.. అక్కడి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించడం చూస్తున్నాం. చిన్న పదవుల మొదలుకుని జడ్జిలు, చట్ట సభలు, దేశ ప్రధానుల్లాంటి ఉన్నత పదవులనూ అధిరోహిస్తున్నారు. తాజాగా.. ఓ తెలుగోడు టెక్సాస్ స్టేట్‌లో మేయర్ ఎన్నికల్లో తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. ట్రాన్స్పరెన్సీ(పారదర్శకత) ఈజ్ ద గేమ్.. కార్తీక్ ఈజ్ ది నేమ్ అంటూ.. 35 ఏళ్ల యువకుడు ట్రావిస్ కౌంటీలోని ది హిల్స్ మేయర్ ఎన్నికల ప్రచారంతో హాట్ టాపిక్‌గా మారాడు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు(ప్రస్తుతం బాపట్ల) చెందిన కార్తీక్ నరాలశెట్టి Karthik Naralasetty.. ది హిల్స్ మేయర్ ఎన్నికల బరిలో నిలబడ్డారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన కార్తీక్.. న్యూజెర్సీ రట్టర్స్ యూనివర్సిటీలో కంప్యూటర్‌సైన్స్ డిపార్ట్మెంట్లో చేరాడు. ఆపై చదువు ఆపేసి ఇండియాకు తిరిగొచ్చి సోషల్‌బ్లడ్ పేరుతో ఓ ఎన్జీవో ఏర్పాటు చేసి.. క్రమక్రమంగా వ్యాపారవేత్తగా ఎదిగాడు. అదే టైంలో పెంపుడు జంతువులకు సంబంధించిన మరో కంపెనీ స్థాపించాడు.అమెరికాలో ఉన్న తొలినాళ్లలోనే అధితితో పరిచయం.. ఆపై వివాహం జరిగింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. ఈ క్రమంలో ప్రస్తుతం నివాసం ఉంటున్న ‘ది హిల్స్’ మేయర్ ఎన్నికలపై దృష్టి సారించాడు కార్తీక్. ఆగస్టు నుంచే ప్రచారం మొదలుపెట్టిన కార్తీక్.. ఎంటర్‌ప్రెన్యూర్‌గా తన అనుభవంతో ది హిల్స్ అభివృద్ధికి దోహదపడతానని ప్రచారం చేశాడు కూడా. ది హిల్స్‌లో 2,000 జనాభా ఉంది. కేవలం ఐదు భారతీయ కుటుంబాలు మాత్రమే అక్కడ స్థిరపడ్డాయి. అయితే న్యూజెర్సీలో ఉన్న బంధువుల సహకారంతో ప్రచారం ఉధృతం చేశాడు కార్తీక్. నవంబర్ 5న ఇక్కడ మేయర్ ఎన్నిక జరగనుంది. ఒకవేళ.. కార్తీక్ ఈ ఎన్నికల్లో గెలిస్తే గనుక.. ‘ది హిల్స్’ మేయర్ పదవి చేపట్టిన అతిపిన్న వయస్కుడిగా, తొలి భారతీయ వ్యక్తిగా నిలుస్తాడు. -
సీనియర్ , డిప్యూటీ మేయర్ బీజేపీ కైవసం
చండీగఢ్: సర్వోన్నత న్యాయస్థానం జోక్యంతో చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో భంగపాటుకు గురైన బీజేపీ చివరకు సీనియర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో విజయబావుటా ఎగరేసింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆప్ అభ్యరి్ధకి పడిన 8 ఓట్లను చెల్లనివిగా ప్రకటించి బీజేపీ నేత మేయర్ అయ్యేలా చేసిన రిటరి్నంగ్ అధికారిపై సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన దరిమిలా చండీగఢ్ సీనియర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు సైతం అందరి దృష్టినీ ఆకర్షించాయి. సోమవారం జరిగిన ఎన్నికల్లో బీజేపీ రెండు విజయాలను నమోదుచేసుకుంది. ఫిబ్రవరి 19వ తేదీన ముగ్గురు ఆప్ కౌన్సిలర్లు బీజేపీలో చేరడంతో 35 సభ్యులుండే మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ బలం మరింత పెరిగింది. దీంతో సీనియర్ మేయర్ ఎన్నికల్లో ఆప్ మద్దతు పలికిన కాంగ్రెస్ అభ్యర్థి గుర్ప్రీత్ గబీపై బీజేపీ అభ్యర్థి కుల్జీత్ సంధూ విజయం సాధించారు. డెప్యూటీ మేయర్ ఎన్నికల్లోనూ ఆప్ మద్దతు పలికిన కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలా దేవిపై బీజేపీ అభ్యర్ధి రాజీందర్ శర్మ గెలిచారు. -
చండీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ: చండీగఢ్ మేయర్ ఎన్నిక వివాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. గత నెలలో జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నిక ఫలితాలు చెల్లవని సుప్రీంకోర్టు ప్రకటించింది. రిట్ర్నింగ్ అధికారి చట్ట విరుద్దంగా వ్యహరించారన్న సర్వోన్నత న్యాయస్థానం .. ఆప్ కౌన్సిలర్ కుల్దీప్ కుమార్‌ను చండీగఢ్ మేయర్‌గా ప్రకటించింది. మేయర్ఎ న్నికలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ డీవీ చంద్రచూడ్ నేతృత్వంలోని జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. ఈ మేరకు రిటర్నింగ్ అధికారిపై తీవ్రంగా విరుచుకుపడింది. ఉద్దేశపూర్వకంగానే అనిల్ మసీహ్ 8 బ్యాలెట్ పేపర్లను కొట్టివేశారని మండిపడింది. అంతకముందు మేయర్ ఎన్నికల ఓట్లను రీకౌంటింగ్ చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. రిటర్నింగ్ అధికారి చెల్లని ఓట్లుగా ప్రకటించి పక్కకు పెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎనిమిది బ్యాలెట్ పేపర్లను కూడా లెక్కించాలని ఆదేశించింది. ఈ మేరకు చెల్లుబాటు కాని ఎనిమిది బ్యాలెట్ పత్రాలను సుప్రీంకోర్టు పరిశీలించింది. అనంతరం ఆ 8 ఓట్లను కూడా లెక్కలోకి తీసుకుని.. వాటితో కలిపి మరోసారి మొత్తం ఓట్ల లెక్కింపు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. దాని ప్రకారం అత్యధిక ఓట్లు వచ్చిన అభ్యర్థిని చండీగఢ్ మేయర్‌గా ప్రకటించాలని తెలిపింది. తాజాగా ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్‌ను చండీగఢ్ మేయర్‌గా ప్రకటించడంతో ఈవివాదానికి తెరపడింది. చదవండి: పరువు నష్టం కేసులో రాహుల్‌గాంధీకి ఊరట కాగా జనవరి 30న జరిగిన ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కుల్దీప్ కమార్‌ను ఓడించి మనోజ్ సోంకర్ మేయర్‌గా గెలుపొందారు. బీజేపీకి 16 ఓట్లు రాగా.. కాంగ్రెస్ ఆప్‌కు సంబంధించి ఉమ్మడి అభ్యర్ధి కుల్దీప్ సింగ్‌కు 12 ఓట్లు సాధించారు. అయితే ఆప్ అభ్యర్థికి వచ్చిన 8 ఓట్లు చెల్లవని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ ప్రకటించారు. దీంతో బీజేపీ అభ్యర్థి మనోజ్ సోంకర్ విజయం సాధించారు. ఈ క్రమంలోనే ఆ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. బ్యాలెట్ పేపర్లను మార్కింగ్ చేస్తూ రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ కెమెరాకు చిక్కారు. దీంతో ఆప్ కౌన్సిలర్ సుప్రీంను ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టులో విచారణ చేపట్టిన నేపథ్యంలో ఆదివారం సోంకర్ మేయర్ పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆప్‌కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు బీజేపీలో చేరారు. -
బ్యాలెట్‌పై ‘ఎక్స్’ మార్కు ఎందుకేశారు?
న్యూఢిల్లీ: చండీగఢ్ మేయర్ ఎన్నిక సమయంలో బ్యాలెట్ పత్రాలను పాడుచేసిన ఆరోపణలను సుప్రీంకోర్టు సీరియస్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకున్నందుకు గాను రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్‌ను ప్రాసిక్యూట్ చేయాలని పేర్కొంది. అనిల్ మసీహ్‌ను ప్రశ్నించడం ద్వారా, రిటర్నింగ్ అధికారిని దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ క్రాస్ ఎగ్జామినేట్ చేయడం స్వతంత్ర భారత చరిత్రలో మొదటిసారిగా భావిస్తున్నారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. చండీగఢ్ మేయర్‌గా ఎన్నికైన మనోజ్ సోంకార్ రాజీనామా, ఆప్ కౌన్సిలర్లు ముగ్గురు ఆదివారం బీజేపీ పంచన చేరినట్లు వచ్చిన వార్తలపై స్పందిస్తూ.. అభ్యర్థులను ప్రలోభ పెట్టడాన్ని తీవ్రమైన అంశంగా పేర్కొంది. తాజాగా ఎన్నికలు జరపటానికి బదులుగా కొత్త రిటర్నింగ్ అధికారి పర్యవేక్షణంలో మరోసారి ఓట్లను లెక్కించడం మంచిదని భావిస్తున్నట్లు తెలిపింది. అయితే, మంగళవారం బ్యాలెట్ పత్రాలను పరిశీలించాకే ఈ అంశంలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. నిజాయతీగా సమాధానమివ్వండి సోమవారం విచారణ సందర్భంగా జస్టిస్ డీవై చంద్రచూడ్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన అనిల్ మసీహ్‌ను కొన్ని ప్రశ్నలు సంధించారు. ‘ఇది చాలా తీవ్రమైన వ్యవహారం. నిజాయతీగా సమాధానాలు చెప్పకుంటే ప్రాసిక్యూట్ చేస్తాం. ఆ ఫుటేజీ చూశాం. మీరు బ్యాలెట్ పేపర్లపై క్రాస్ మార్కులు పెడుతూ కెమెరా వైపు ఎందుకు చూస్తున్నారు? ఎందుకు క్రాస్ మార్కులు పెట్టారు?’ అని అడిగారు. ఎనిమిది బ్యాలెట్ పేపర్లపై క్రాస్ మార్కు పెట్టింది నిజమేనని మసీహ్ అంగీకరించారు. అవి అప్పటికే పాడైపోయి ఉన్నందున, వేరు చేసేందుకే అలా చేశాన’ని చెప్పారు. ‘బ్యాలెట్ పేపర్లపై మీరు కేవలం సంతకం మాత్రమే చేయాలి. అలాంటప్పుడు వాటినెందుకు పాడు చేశారు? బ్యాలెట్ పేపర్లపై రిటర్నింగ్ అధికారులు ఇతరత్రా మార్కులు వేయొచ్చని ఏ నిబంధనల్లో ఉంది?’అని సీజేఐ అడిగారు. ఎన్నికల ప్రక్రియలో కలుగ జేసుకున్నందుకు మసీహ్‌ను ప్రాసిక్యూట్ చేయాల్సిందేనని చండీగఢ్ యంత్రాంగం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతానుద్దేశించి సీజేఐ పేర్కొన్నారు. మంగళవారం జరిగే విచారణకు కూడా హాజరుకావాలని అనిల్ మసీహ్‌ను ఆదేశించారు. ధర్మాసనంలో జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ఉన్నారు. బ్యాలెట్ పత్రాలు, కౌంటింగ్ వీడియో పరిశీలిస్తాం బ్యాలెట్ పత్రాలతోపాటు ఎన్నిక ప్రక్రియకు సంబంధించిన మొత్తం వీడియో ఫుటేజీని తమకు పంపించాలని పంజాబ్, హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించింది. రికార్డులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రత్యేకంగా ఒక న్యాయాధికారికి బాధ్యతలు అప్పగించాలని, పటిష్ట బందోబస్తు నడుమ ఆయన్ను ఢిల్లీకి పంపాలని స్పష్టం చేసింది. ఏం జరిగిందంటే..? జనవరి 30వ తేదీన మేయర్ ఎన్నికలో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎనిమిది ఓట్లను చెల్లనివిగా రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ ప్రకటించడం, బీజేపీ అభ్యర్థి మనోజ్ సోంకార్ చేతిలో ఆప్–కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి నాలుగు ఓట్ల తేడాతో ఓటమిపాలవడం తెలిసిందే. బీజేపీ మైనారిటీ సెల్‌కు చెందిన అనిల్ మసీహ్ కావాలనే ఓట్లను చెల్లనివిగా ప్రకటించారని ఆప్ ఆరోపించింది. కెమెరా వైపు చూసుకుంటూ ఆప్ కౌన్సిలర్లకు చెందిన బ్యాలెట్ పేపర్లపై మసీహ్ ‘ఎక్స్’ మార్కువేస్తున్న ఫుటేజీని ఆప్ కోర్టుకు సమర్పించింది. ఈ నెల 5వ తేదీన జరిగిన విచారణ సందర్భంగా రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ చర్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. -
‘ఇండియా కూటమి చారిత్రక గెలుపు నమోదు చేస్తుంది’
న్యూఢిల్లీ: చంఢీఘర్ మేయర్ స్థానాన్ని ఇండియా కూటమి కైవసం చేసుకుంటుందని అమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత రాఘవ్ చద్దా జోష్యం చెప్పారు. ఎప్రిల్/మే నెలల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికలకు చంఢీఘర్ మేయర్ విజయం.. ఇండియా కూటమి విజయానికి నాంది పలకనుందని తెలిపారు. జనవరి 18వ తేదీ జరిగే చంఢీఘర్ మేయర్ ఎన్నికలపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘‘చంఢీఘర్ మేయర్ ఎన్నికల్లో ఇండియా కూటమి చారిత్రక, నిర్ణయాత్మక గెలుపు సొంతం చేసుకుంటుంది. మొదటి సారిగా ఇడియా కూటమి, బీజేపీ మధ్య పోరు జరగనుంది. మేయర్ ఫలితాలు విడుదలయ్యాక ఇండియా కూటమి-1, బీజేపీ-0గా మారబోతుంది. ఈ గెలుపుతో రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు ఇండియా కూటమి విజయానికి నాంది పలకనుంది’ అని రాఘవ్ చద్దా పేర్కొన్నారు. #WATCH | Delhi | AAP MP Raghav Chadha says, "INDIA Alliance will fight the Chandigarh Mayor elections with all its strength and register a historic and decisive victory. Don't consider this an ordinary election. This will be an election where for the first time it will be INDIA… pic.twitter.com/l7d4Ej1kpg — ANI (@ANI) January 16, 2024 ఇండియా కూటమి చంఢీఘర్ మేయర్ ఎన్నికల్లో పూర్తి సామర్థ్యంతో పోరాడి గెలుపొందుతుందని తెలిపారు. ఈ ఎన్నికలను సాధారణ ఎన్నికలుగా భావించమని పూర్తిస్థాయిలో కృషి చేస్తామని తెలిపారు. 2024 పార్లమెంట్ ఎన్నికల ముందు తాము ఈ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తామని తెలిపారు. చదవండి: ‘రామ మందిర కార్యక్రమం... మోదీ రాజకీయ కార్యక్రమం’ -
ఎంసీడీ భేటీకి ఎల్జీ ఓకే
న్యూఢిల్లీ: రెండుసార్లు సమావేశమైనా మేయర్‌ను ఎన్నుకోకుండానే అర్ధాంతరంగా వాయిదాపడిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) భేటీని ఈసారి 6వ తేదీన నిర్వహించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనా అనుమతి ఇచ్చారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ఎల్జీ∙ఆమోదం తెలిపారని ఉన్నతాధికారులు బుధవారం చెప్పారు. ఇటీవలి ఎంసీడీ ఎన్నికల్లో 250 స్థానాలకుగాను ఆప్ 134 చోట్ల, బీజేపీ 104 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెల్సిందే. అయితే, మేయర్, డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకునేందుకు ఎంసీడీ జనవరి 6, 24వ తేదీల్లో సమావేశమైన సందర్భంగా కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదంచోటుచేసుకున్న విషయం విదితమే. -
మధ్యప్రదేశ్‌లో ‘ఆప్’ పాగా.. మేయర్ పీఠం కైవసం
భోపాల్: దేశ రాజధాని ఢిల్లీతోపాటు పంజాబ్‌లో అధికారం దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యప్రదేశ్‌లో కూడా కాలుమోపింది. సింగ్రౌలీ మున్సిపల్ ఎన్నికల్లో మేయర్‌గా ఆప్ అభ్యర్థి రాణి అగర్వాల్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి ప్రకాశ్ విశ్వకర్మను 9,352 ఓట్ల తేడాతో ఓడించారు. కాంగ్రెస్ అభ్యర్థి మూడో స్థానానికి పరిమితమయ్యారు. మధ్యప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ నెగ్గడం ఇదే తొలిసారి. 2014లో తొలిసారి జిల్లా పంచాయతీ సభ్యురాలిగా ఎన్నికైన రాణి అగర్వాల్.. తాజాగా సింగ్రౌలీ మేయర్‌గా విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆమె పోటీ చేసినప్పటికీ పరాజయం పాలయ్యారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఆమెకు మద్దతుగా ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రచారంలో పాల్గొని రోడ్ షో నిర్వహించారు. తాజా ఫలితాల్లో రాణి అగర్వాల్ విజయం సాధించటంతో సింగ్రౌలీ మేయగా గెలిచారు. సింగ్రౌలీ మేయర్‌గా ఎన్నికైన రాణి అగర్వాల్‌తో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన ఆప్ నేతలకు ఆ పార్టీ కన్వినర్ అరవిందక్ కేజ్రీవాల్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల కోసం కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆప్ నిజాయతీ రాజకీయలాను దేశవ్యాప్తంగా ప్రజలందరూ విశ్వసిస్తున్నారని అన్నారు. ఇదీ చూడండి: Margaret Alva: విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ ఆల్వా -
చెన్నై తొలి దళిత మహిళా మేయర్: ఆమెకు అభినందనలు
నార్త్ చెన్నై అంటే తమిళ సినిమాల్లో రౌడీల పుట్టిల్లుగా చూపిస్తారు. మురికివాడలు.. ఇరుకు గల్లీలు పంపుల దగ్గర స్త్రీల బాహాబాహీ అలాంటి చోట నుంచి ఇప్పుడు 29 ఏళ్ల ఆర్.ప్రియ మేయర్‌గా నగరాన్ని పాలించడానికి వచ్చింది. తమిళనాడు సి.ఎం. స్టాలిన్ స్ఫూర్తితో రాజకీయాలలో వచ్చిన ప్రియ చెన్నై మేయర్ పీఠం పై కూచున్న తొలి దళిత యువతిగా చరిత్ర సృష్టించింది. చెన్నైకు ఆర్.ప్రియ 49వ మేయర్. అంటే ఆమెకు ముందు 48 మంది మేయర్లు ఆ నగరానికి పని చేస్తే వారిలో ఇద్దరే మహిళా మేయర్లు. 1957లో కాంగ్రెస్ నుంచి తారా చెరియన్, 1971లో డి.ఎం.కె నుంచి కామాక్షి జయరామన్‌లు మాత్రమే మేయర్లుగా పని చేశారు. మిగిలిన వారంతా పురుషులే. ఇక దళిత మహిళ ఈ స్థానంలో కూచోవడం అనేది చరిత్రలోనే లేదు. కాని ఆర్.ప్రియ దళిత మహిళగా ఆ రికార్డును తన సొంతం చేసుకుంది. ఇదంతా ఆమెకు రాసి పెట్టినట్టుగా క్షణాల్లో జరిగిపోయింది గాని సరైన సమయంలో తాను రాజకీయాల్లో దిగాలి అని ప్రియ భావించడం వల్ల కూడా ఈ ఘనత సాధ్యమైంది. చెన్నై నగరానికి గత ఐదేళ్లుగా కార్పొరేషన్ ఎన్నికలు జరగలేదు. స్టాలిన్ ప్రభుత్వం వచ్చాక ఫిబ్రవరి 3వ వారంలో ఎన్నికలు నిర్వహిస్తే గ్రేటర్ చెన్నైలోని 200 వార్డులలో 153 స్థానాలు డి.ఎం.కెకు వచ్చాయి. ఇంకో 25 స్థానాలు డి.ఎం.కె మిత్రపక్షాలు గెలుచుకున్నాయి. అన్నా డిఎంకెకు కేవలం 15 వార్డులు దక్కాయి. ఈసారి ఎన్నికలలో చెన్నై మేయర్ పదవిని దళిత మహిళకు రిజర్వ్ చేయడం వల్ల నార్త్ చెన్నై 74వ వార్డు (తిరువికనగర్) నుంచి గెలిచిన ఆర్.ప్రియకు ఏకగ్రీవంగా ఈ పదవి దక్కింది. మార్చి 4, శుక్రవారం ఆమె మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేసింది. ‘చెన్నైకి మేయర్‌గా చేసిన స్టాలిన్ మార్గదర్శనంలో నేను మేయర్‌గా పని చేసే అవకాశం రావడం గొప్ప విషయం’ అంది ప్రియ. ఆమె కుటుంబం డిఎంకెకి వీరభక్తులు. ఆమె తండ్రి ఆర్.రాజన్ ముప్పై ఏళ్లుగా పార్టీలో పని చేస్తున్నాడు. ఇంట్లో రాజకీయ వాతావరణం ఉండటంతో 18 ఏళ్ల వయసులో ప్రియ కూడా డి.ఎం.కె కార్యకర్త అయ్యింది. ‘అయితే నేను నిజంగా పార్టీ పనుల్లో చురుగ్గా పాల్గొంది స్టాలిన్ సి.ఎం అయ్యాకే. ఆయన పాలనా పద్ధతులు గమనించాక నా ప్రాంత సమస్యలు తీరాలంటే ఇదే అదను అని నాకు అనిపించి నేను కూడా పని చేయడం మొదలుపెట్టాను’ అంది ప్రియ. ఎం.కాం చేసిన ప్రియకు నాలుగేళ్ల కుమార్తె ఉంది. ‘నిజానికి ఎలక్షన్లకు ముందే నా గెలుపు ఖాయమైపోయింది. నా ప్రాంత సమస్యలను వేటి వేటిని తీరుస్తానో నేను చెప్పాక అందరూ నాకే ఓటు వేస్తామని చెప్పేశారు’ అంది ప్రియ. సాధారణంగా నార్త్ చెన్నై ప్రాంతం చాలా ఏళ్లుగా సౌకర్యాల ఏర్పాట్లలో నిర్లక్ష్యానికి గురవుతూ ఉంది. ఆ ప్రాంతం నుంచి ఇప్పుడు ఏకంగా మేయరే రావడం అందరూ ఎన్నో అంచనాలతో ప్రియ వైపు చూస్తున్నారు. ‘మా ఏరియా స్త్రీలు వేసవిలో 100 రూపాయలు ఖర్చు పెట్టి ఆటోల్లో 4 కిలోమీటర్ల దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది. ముందు దీనిని మార్చాలి. పారిశుద్ధ్యం ముఖ్యం. అలాగే పిల్లలకు ఆటస్థలాలు ఏర్పాటు చేయాలి. స్టాలిన్ యువ శక్తికి పూర్తి అవకాశం ఇస్తున్నారు. నేను బాగా పని చేయాలనుకుంటున్నాను’ అంది ప్రియ. స్టాలిన్ ప్రభుత్వం ఈసారి స్త్రీలకు పట్టణ, నగర పాలనా వ్యవస్థల బాధ్యతలు అప్పజెప్పడంలో శ్రద్ధ పెట్టింది. తమిళనాడులో మొత్తం 11 మేయర్ పదవులను, 5 డిప్యూటీ మేయర్ పదవులను స్త్రీలకు కేటాయించింది. కోయంబత్తూరు మేయర్‌గా మధ్యతరగతికి చెందిన ఏ.కల్పన అనే మహిళను ఎంపిక చేసింది. అయితే జయలలిత హయాంలో స్త్రీలు పదవుల్లోకి వచ్చాక వారి భర్తలు, తండ్రులు, సోదరులు పెత్తనం చెలాయించి ఆ గెలిచిన స్త్రీలను వెనక్కు నెట్టడం కొన్నిచోట్ల కనిపించేది. ‘అలా నా విషయంలో జరగదు. ఇప్పుడు స్త్రీలు తమ ఇళ్ల పురుషులకు ఆ అవకాశం ఇవ్వరు. వారు తమ పూర్తి శక్తి సామర్థ్యాలతో పని చేయాలనుకుంటున్నారు. మీరే చూస్తారుగా’ అంది ప్రియ. ఆమె నిర్ణయాలు చెన్నైకి మేలు చేస్తాయని ఆశిద్దాం. నిజానికి ఎలక్షన్లకు ముందే నా గెలుపు ఖాయమైపోయింది. నా ప్రాంత సమస్యలను వేటి వేటిని తీరుస్తానో నేను చెప్పాక అందరూ నాకే ఓటు వేస్తామని చెప్పేశారు. – ఆర్.ప్రియ -
22న నెల్లూరు మేయర్ ఎన్నిక
సాక్షి, అమరావతి: నెల్లూరు నగర మేయర్‌తో పాటు ఇద్దరు డిప్యూటీ మేయర్ల ఎన్నిక ఈ నెల 22న నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆదివారం నోటిఫికేషన్ జారీ చేశారు. సోమవారం ఎన్నికలు జరుగుతున్న ఆకివీడు (ప.గో), జగ్గయ్యపేట, కొండపల్లి (కృష్ణా), దాచేపల్లి, గురజాల (గుంటూరు), దర్శి (ప్రకాశం), బుచ్చిరెడ్డిపాలెం (నెల్లూరు), బేతంచెర్ల (కర్నూలు), కమలాపురం, రాజంపేట (వైఎస్సార్), పెనుకొండ (అనంతపురం), కుప్పం (చిత్తూరు) మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో చైర్మన్ల ఎన్నికను అదే రోజు నిర్వహిస్తారు. ఆయా మునిసిపాలిటీల్లో రెండేసి చొప్పున వైస్ చైర్మన్ పదవులకు ఆ రోజే ఎన్నికలు జరుపుతారు. ఆయా నగర, పట్టణ, నగర పంచాయతీల్లో డివిజన్, వార్డు స్థానాలకు సోమవారం ఉ.7 గంటల నుంచి సా.5 గంటల వరకు పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. బుధవారం ఓట్ల లెక్కింపు చేపడతారు. ఆయా చోట్ల పరోక్ష పద్ధతిలో మేయర్, డిప్యూటీ మేయర్, మునిసిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఎన్నుకునేందుకు అక్కడ గెలిచిన అభ్యర్థులతో 22వ తేదీన ఉ.11 గంటలకు నగరపాలక సంస్థ, మునిసిపాలిటీ, నగర పంచాయతీల వారీగా ప్రత్యేక సమావేశాలు జరపాలని ఎస్ఈసీ ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకు ఆయా మునిసిపాలిటీల్లో గెలిచిన అభ్యర్థులకు మేయర్, చైర్మన్ల ఎన్నికకు సంబంధించిన సమాచారాన్ని 18వ తేదీలోగా వ్యక్తిగతంగా తెలియజేయాలని పేర్కొన్నారు. డిప్యూటీ, వైస్ చైర్మన్ల ఎన్నిక ఇలా.. మేయర్, చైర్మన్ ఎన్నిక పూర్తయిన తర్వాతనే డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ ప్రారంభించాలని.. ఎక్కడైనా వివిధ కారణాలతో మేయర్, చైర్మన్ ఎన్నిక వాయిదా పడితే డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ల ఎన్నికలు కూడా వాయిదా పడినట్టే అవుతుందని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. 22న జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడినచోట 23వ తేదీన తిరిగి ఎన్నిక జరిపేందుకు ఆయా జిల్లా కలెక్టర్లు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. జెడ్పీ వైస్ చైర్మన్, ఎంపీపీ ఎన్నికలు సైతం.. ► విజయనగరం జెడ్పీలో ఇద్దరు వైస్ చైర్మన్లకు గాను ఒకరు ఇటీవల మృతి చెందడంతో ఆ పదవికి కూడా ఈ నెల 22వ తేదీన ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని వేరొక నోటిఫికేషన్ జారీ చేశారు. ► గతంలో ఎంపీపీ ఎన్నిక వాయిదా పడిన వాల్మీకిపురం, గుడిపల్లి (చిత్తూరు)తోపాటు తాజాగా ఎంపీటీసీ ఎన్నికలు జరిగిన ఎటపాక (తూ.గో) మండలంలో మండలాధ్యక్ష పదవులకు ఈ నెల 22వ తేదీన ఎన్నిక నిర్వహిస్తారు. ఆయా మండలాల్లో ఒక్కొక్క ఉపాధ్యక్ష , ఒక్కో కో–ఆప్టెడ్ సభ్యుని స్థానాలకు అదే రోజు ఎన్నికలు నిర్వహిస్తారు. గతంలో ప్రత్యేకంగా ఒక్క మండల ఉపాధ్యక్ష పదవి ఎన్నిక వాయిదా పడిన నరసరావుపేట (గుంటూరు), గాలివీడు, సిద్ధవటం (వైఎస్సార్)లలో 22నే ఉపాధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తారు. ► ఈ ఏడాది జనవరి–ఫిబ్రవరి నెలలో పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు వార్డు సభ్యుల ఆధ్వర్యంలో పరోక్ష పద్ధతిన జరగాల్సిన ఉప సర్పంచ్ ఎన్నిక వాయిదా పడింది. అలా మిగిలిపోయిన 130 గ్రామ పంచాయతీల్లోనూ 22వ తేదీనే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించాలని ఎస్ఈసీ జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులిచ్చారు. -
పుర పోరులో సామాన్యుడికి పట్టం కట్టిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాజకీయాలంటే బాగా డబ్బున్న వాళ్లు.. ఉన్నత వర్గానికి చెందిన వారు.. బలమైన బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారికి మాత్రమే అనే భావన బలంగా ఉంది సమాజంలో. అధికారంలో ఉన్న వారు కూడా తాము పేదల పక్షం అని చెప్తారు. కానీ ఎన్నికల బరిలో నిలబడే విషయంలో మాత్రం పేరు ప్రఖ్యాతులు, అంగబలం, అర్థబలానికే అగ్రతాంబులం ఇస్తారు. సామాన్యులంటే ఓటు వేయడానికి మాత్రమే అని భావించే నేతలున్న దేశం మనది. అయితే ఈ అభిప్రాయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తప్పని నిరూపించారు. నీతి నిజాయతీ, ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్న వారు రాజకీయాల్లోకి రావాలనేది సీఎం జగన్ అభిమతం. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో సామాన్యులకు టికెట్ ఇచ్చి.. వారిని మున్సిపల్ చైర్మన్, మేయర్లుగా నియమించి.. ఇచ్చిన మాటలను నిజం చేసే నాయకుడిని అని మరోసారి నిరూపించుకున్నారు. కట్టెలు కొట్టి బతకు బండిని లాగే వ్యక్తికి.. కూరగాయలు అమ్ముకునే వ్యక్తికి.. అటెండర్ కోడలికి.. తోపుడు బండి వ్యాపారికి మున్సిపల్ ఎన్నికల్లో అవకాశం ఇచ్చి.. బడుగు వర్గాలకు పాలనా పగ్గాలు అందించి దేశ రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. మున్సిపల్ చైర్మన్, మేయర్లుగా నియమితులైన ఆ సామాన్యుల వివరాలు... రాయచోటి మున్సిపల్ చైర్మన్‌గా కూరగాయల వ్యాపారి రాయచోటికి చెందిన షేక్ బాష డిగ్రీ వరకు చదువుకున్నారు. ఉద్యోగం దొరక్కపోవటంతో గ్రామంలోనే కూరగాయలు అమ్ముతూ జీవనం కొనసాగిస్తున్నారు. స్థానికంగా ప్రజల్లో మంచి పేరున్న షేక్ భాషకు వైఎస్సార్ సీపీ మున్సిపాలిటీ ఎన్నికలలో కౌన్సిలర్ టికెట్ ఇచ్చింది. దీంతో ప్రజలు షేక్ భాషను గెలిపించారు. గురువారం రాయచోటి మున్సిపాలిటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా షేక్ బాష సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తన జీవితంలో ఇలాంటి అవకాశం వస్తుందని ఊహించలేదన్నారు. తోపుడుబండి వ్యాపారి.. మునిసిపల్ చైర్మన్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్‌గా తలారి రాజ్‌కుమార్ ఎన్నికయ్యారు. ఇంటర్ చదివిన రాజ్‌కుమార్‌కు భార్య విజయలక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ పోషణకు తోపుడుబండిపై పండ్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. వైఎస్సార్సీపీపై అభిమానంతో కార్యకర్తగా సేవలందిస్తున్నారు. మునిసిపల్ ఎన్నికల్లో 10వ వార్డు బీసీ జనరల్‌కు రిజర్వు కాగా.. వైఎస్సార్సీపీ టికెట్ రాజ్‌కుమార్‌కు లభించింది. ఎన్నికల్లో పోటీకైతే దిగాడు కానీ కనీస ఖర్చు కూడా పెట్టుకునే ఆర్థిక స్థోమత లేకపోయింది. కానీ సీఎం వైఎస్ జగన్‌పై ప్రజలకున్న అభిమానం రాజ్‌కుమార్‌కు ఓట్ల వర్షం కురిపించి కార్పొరేటర్‌గా గెలిపించింది. ఇప్పుడు ఏకంగా మునిసిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. నాడు కట్టెలు కొట్టిన మహిళ.. నేడు చిత్తూరు మేయర్ చిత్తూరు కార్పొరేషన్ నూతన మేయర్‌గా ఎన్నికైన అముద ప్రస్థానం.. కష్టాల్లో ఆగిపోకుండా నిలదొక్కుకోవాలనే ఎందరో మహిళలకు ఆదర్శం. కుటుంబం గడవడం కోసం ఒకప్పుడు అముద కట్టెలు కొట్టి అమ్మారు. ఇప్పుడిప్పుడే జీవితంలో స్థిరపడుతున్నారు. జగన్ రూపంలో అదృష్టం ఆమె తలుపు తట్టింది. వైఎస్సార్సీపీ తరఫున కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసి గెలవడమేగాక ఇప్పుడు ఏకంగా చిత్తూరు మేయర్‌గా ఎన్నికయ్యారు. మామ అటెండర్‌గా పనిచేసిన చోట..నేడు కోడలు మేయర్ మునెయ్య.. ఆరేళ్లక్రితం వరకు తిరుపతి మునిసిపాలిటీలో అటెండర్‌గా పనిచేశారు. కార్పొరేషన్ స్థాయికి ఎదిగిన తిరుపతికి ఈసారి మొదటిసారి ఎన్నికలు నిర్వహించారు. మునెయ్య కోడలే ఇప్పుడు తిరుపతి కార్పొరేషన్‌కు తొలి మేయర్‌గా ఎన్నికయ్యారు. నిన్న వలంటీర్లు.. నేడు కౌన్సిలర్, కార్పొరేటర్లు నిన్నమొన్నటివరకు విశేష సేవలందించి అందరి ప్రశంసలు పొందిన ఇద్దరు వలంటీర్లు నేడు కౌన్సిలర్, కార్పొరేటర్‌గా ఎన్నికై రికార్డు సృష్టించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మునిసిపాలిటీలో 12వ వార్డు నుంచి వైఎస్సార్సీపీ తరఫున వలంటీర్ లోకా కల్యాణి బరిలోకి దిగారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీకి చెందిన సరికొండ జ్యోతిపై 504 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు విశాఖలో.. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఎన్నికల్లో ఓ వార్డు వలంటీర్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 47వ వార్డు కంచర్లపాలెం అరుంధతినగర్ కొండవాలు ప్రాంతానికి చెందిన కంటిపాము కామేశ్వరి గతంలో వార్డు వలంటీర్‌గా పనిచేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన ఆమె తన సమీప ప్రత్యర్థిపై 3,898 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. వీరితో పాటు మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ జగన్ మహిళా సాధికారతకు, సామాజిక న్యాయానికి పెద్ద పీట వేశారు సీఎం జగన్. చరిత్రలో తొలిసారిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 78 శాతం పదవులు ఇచ్చారు. దీంతోపాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ల మేయర్లుగా బీసీ వర్గానికి చెందిన ముగ్గురు మహిళలు ఎన్నిక కావడం ఊహలకు కూడా అందని పరిణామం. మహిళాభ్యున్నతిని చేతల్లో చూపించిన ముఖ్యమంత్రి జగన్... పార్టీ సాధించిన 11 కార్పొరేషన్లలో ఏకంగా ఏడింటి పగ్గాలు మహిళలకే అప్పగించారు. పురపాలక అధ్యక్ష పదవుల్లో 60.46 శాతం మహిళలకే దక్కటం ఒక రికార్డేనని చెప్పాలి. -
మైదుకూరు ఛైర్మన్ పీఠం వైఎస్సార్సీపీదే
మైదుకూరు: వైఎస్సార్ జిల్లాలోని మైదుకూరు మున్సిపల్ ఛైర్మన్ స్థానాన్ని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. మైదుకూరు మున్సిపాలిటీలో 24 వార్డులుండగా, టీడీపీ 12 వార్డుల్లో, వైసీపీ 11 వార్డుల్లో , జనసేన ఒక చోట గెలుపొందాయి. దీంతో ఏ పార్టీకి కూడా మెజార్టీ దక్కని పరిస్థితి ఏర్పడింది. ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలుపుకుంటే వైసీపీ బలం 13కి పెరిగింది. టీడీపీ, జనసేన కలిస్తే సంఖ్యా బలం 13గా ఉంది. కాగా, టీడీపీ ఆరో వార్డు సభ్యురాలు మహబూబ్‌బీతో పాటు జనసేన సభ్యుడు బాబు గైర్హాజరు కావడంతో టీడీపీ బలం 11కి పడిపోయింది. మరోవైపు అధికార పార్టీ వైఎస్సార్సీపీ తమకున్న రెండు ఎక్స్ అఫీషియా ఓట్లతో బలాన్ని 13కి పెంచుకుని చైర్మన్ పీఠాన్ని చేజిక్కించుకుంది. మైదుకూరు మున్సిపల్ ఛైర్మన్‌గా మాచనూరి చంద్ర, వైస్ ఛైర్మన్‌గా మహబూబ్ షరీఫ్ ఎన్నికయ్యారు. చదవండి: దేశ చరిత్రలోనే ఇది ఓ అరుదైన ఘట్టం: సజ్జల అక్రమాల పుట్ట ‘అమరావతి’ -
మునిసిపల్ పదవుల్లో సీఎం వైఎస్ జగన్ మార్క్
సాక్షి, అమరావతి: సమాజంలోని మెజారిటీ ప్రజలకే పాలనాధికారం కల్పించే దిశగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులేస్తున్నారని, ఇందులో భాగంగానే పురపాలక పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకే ప్రాధాన్యత కల్పించారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. దేశ చరిత్రలోనే ఇది అరుదైన ఘట్టం అని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని క్షేత్ర స్థాయికి తీసుకెళ్లడం సీఎం లక్ష్యమని తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అందరికీ చేరవేసే నాయకత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నుంచే రావాలని ముఖ్యమంత్రి ఆశించారన్నారు. ఈ ఆలోచనల ఫలితంగానే పురపాలక పదవుల్లో ఆ వర్గాలకు పెద్దపీట వేశారని వివరించారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే.. చట్టం చెప్పిన దానికంటే ఎక్కువగా.. ►ప్రస్తుతం 11 మేయర్, 75 మునిసిపల్ చైర్మన్ల పదవుల్లో (మొత్తం 86)ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 45 మందికి పదవులివ్వాలని చట్టం చెబుతోంది. కానీ వైఎస్ జగన్ 67 మందికి ప్రాతినిధ్యం కల్పించారు. రాష్ట్ర జనాభాలో 70 శాతం వరకు ఉన్న ఈ వర్గాలకు అత్యధిక శాతం పాలనాధికారం అప్పగించడాన్ని కార్యకర్తలు గర్వంగా భావిస్తున్నారు. ►పురపాలక పదవుల ప్రాతినిథ్యంలోనూ సీఎం జగన్ మహిళా పక్షపాతి అని నిరూపించుకున్నారు. 86 పదవుల్లో చట్ట ప్రకారం 43 (50 శాతం) మహిళలకు ఇవ్వాలి. కానీ వైఎస్ జగన్ 52 మంది (60.4 శాతం) మహిళలకు చైర్పర్సన్, మేయర్లుగా అవకాశం కల్పించారు. బ్యాక్ బోన్‌గా బీసీలు ►86 పదవుల్లో బీసీలకు చట్ట ప్రకారం మైనార్టీలతో కలిపి 30 పదవులిస్తే సరిపోతుంది. కానీ 52 పదవులిచ్చారు. 40 మంది (46.51 శాతం) బీసీలకు, 12 మంది (13.95 శాతం) మైనార్టీలకు అధికారం అప్పగించారు. తిరుపతిలో భారీ మెజారిటీ ఖాయం తిరుపతి పార్లమెంట్ స్థానాన్ని గతంలో కన్నా భారీ మెజారిటీతో వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంటుంది. ఈ ఎన్నికను ప్రతిపక్షాలు రెఫరెండం అనుకున్నా పర్వాలేదు. మేము సీరియస్‌గానే తీసుకుంటున్నాం. ఎన్నికలను ఎస్ఈసీ సకాలంలో జరిపి ఉంటే శాసన సభ బడ్జెట్ సమావేశాలు జరిగి ఉండేవి. ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చి అయినా బడ్జెట్ సమావేశాలు జరపాల్సి ఉంటుంది. చంద్రబాబు ఏదీ ధైర్యంగా ఎదుర్కోలేరు ప్రతిపక్ష నేత చంద్రబాబు జీవితం అంతా అడ్డదారులు, అక్రమాలే. ఏదీ ధైర్యంగా ఎదుర్కోలేడు. నిన్నటి వరకు మమ్మల్ని పట్టుకొండని తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేశ్‌లు మేకపోతు గాంభీర్యం ప్రకటించారు. తాజాగా అసైన్డ్ భూ కుంభకోణంలో దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు అడ్డదారులు వెతుకుతున్నారు. సీఎం జగన్మోహన్రెడ్డిపై ఆనాడు అక్రమంగా కేసులు బనాయించి, జైలుకు పంపి.. అష్టకష్టాలు పెట్టినా, నిర్భయంగా, ధైర్యంగా న్యాయబద్ధంగా ఎదుర్కొన్నారు. బాబు కూడా ఈ నెల 23న విచారణకు హాజరు కావాలి. నిజాలు చెప్పాలి. కానీ రాచ మార్గంలో వెళ్లటం అనేది బాబు డీఎన్ఏలోనే లేదు. బాబు లాగా వ్యవస్థలను మేనేజ్ చేసుకునే లక్షణాలు సీఎం జగన్‌కు లేవు. చంద్రబాబులా మేము చేసి ఉంటే తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ పదవి ఈజీగా వశం అయ్యేది. కానీ సీఎం జగన్ ప్రజల తీర్పు ప్రకారం జరిగితేనే బాగుంటుందని చెప్పారు. చదవండి: సామాజిక సమతుల్యతకే ప్రాధాన్యత -
ఆంధ్ర ప్రదేశ్ : కొనసాగుతున్న మేయర్, ఛైర్మన్ల ఎన్నిక
-
బడుగుబలహీన వర్గాలకే అగ్రాసనం..
సాక్షి, అమరావతి: సామాజిక న్యాయానికి, మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం సరికొత్త చరిత్రను లిఖించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, మహిళలకు అధికారాన్ని అప్పగించడం ద్వారా వారి అభ్యున్నతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన చిత్తశుద్ధిని మరోసారి నిరూపించుకున్నారు. ఈ సారి పురపాలక అధ్యక్ష పదవుల్లో 60.46 శాతం మహిళలకే దక్కటం ఒక రికార్డేనని చెప్పాలి. అంతేకాదు!! చరిత్రలో తొలిసారిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 78 శాతం పదవులు లభించాయి. దీంతోపాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ల మేయర్లుగా బీసీ వర్గానికి చెందిన ముగ్గురు మహిళలు ఎన్నిక కావడం ఊహలకు కూడా అందని పరిణామం. మహిళాభ్యున్నతిని చేతల్లో చూపించిన ముఖ్యమంత్రి జగన్... పార్టీ సాధించిన 11 కార్పొరేషన్లలో ఏకంగా ఏడింటి పగ్గాలు మహిళలకే అప్పగించారు. ఎలాంటి రాజకీయ నేపథ్యంలేని సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన గృహిణులను పలువురిని ఈ పదవులు వరించటం ఒక మంచి మార్పుకు నాందిగానే పేర్కొనాలి. ఆయా వర్గాల రాజకీయ సాధికారతను చేతల్లో చూపించటం ద్వారా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అసలైన ప్రజాస్వామ్యానికి నిర్వచనం చెప్పింది. తన మంత్రివర్గంలో 60 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కేటాయించి జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన ముఖ్యమంత్రి... నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 50 శాతం కేటాయించేలా... అందులోనూ సగం మహిళలకే ఇవ్వాలని చట్టం చేశారు. తద్వారా సామాజిక న్యాయ సాధన దిశగా కొత్త ఒరవడి సృష్టించారు. ఇప్పుడు మేయర్లు, మునిసిపల్ చైర్ పర్సన్ల ఎంపికలోనూ అదే విధానాన్ని అనుసరించి తన నిబద్ధతను రుజువు చేసుకున్నారు. చెప్పిన దానికి మించి... 11 మేయర్, 75 మునిసిపల్ చైర్పర్సన్ పదవులతో కలిపి మొత్తం 86కిగానూ చట్ట ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 45 కేటాయించాల్సి ఉంది. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏకంగా 67 పదవులను వారికి కేటాయించింది. బీసీ ‘ఇ’ కేటగిరీ కిందకు వచ్చే ముస్లిం మైనార్టీలతో సహా బీసీలకు కేటాయించాల్సిన వాటికంటే అత్యధికంగా ముఖ్యమంత్రి జగన్ పదవులు ఇవ్వటంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద 86 పదవుల్లో మైనార్టీలతో సహా బీసీలకు 30 పదవులు కేటాయించాల్సి ఉండగా 52 ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో బీసీలకు కేటాయించాల్సిన పదవులకన్నా ఏకంగా 70.3 శాతం పదవులను అదనంగా ఇచ్చినట్లయింది. మహిళలకే అగ్రస్థానం ఇక మహిళలకు సంబంధించి తమది మాటలు చెప్పే ప్రభుత్వం కాదని... చేతల్లోనే చూపిస్తామని ముఖ్యమంత్రి మరోసారి నిరూపించారు. పదవుల్లో మహిళలకు అగ్రాసనం వేశారు. మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు కలిపి మొత్తం మీద 86 పదవుల్లో మహిళలకు 50 శాతం కేటాయించాలి. ఆ ప్రకారం 44 పదవులు కేటాయించాల్సి ఉండగా ముఖ్యమంత్రి ఏకంగా 52 మంది మహిళలకు పదవులు ఇచ్చారు. మహిళలకు 60.46 శాతం పదవులు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. జనరల్, బీసీ జనరల్, ఎస్సీ జనరల్‌గా రిజర్వ్ అయిన స్థానాల్లో కూడా చాలా చోట్ల మహిళలకే అవకాశం కల్పించారు. 75 మున్సిపాలిటీల్లో 45 చోట్ల చైర్పర్సన్లుగా మహిళలకే పగ్గాలు అప్పగించారు. అధికార పార్టీకే అన్నీ.. రాష్ట్రంలో ఇటీవల 12 కార్పొరేషన్లు, 75 మునిసిపాలిటీల్లో ఎన్నికలు జరగ్గా వాటిలో తాడిపత్రి మినహా 74 మున్సిపాలిటీలను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. కోర్టు ఉత్తర్వుల కారణంగా ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెల్లడించకపోగా... ఫలితాలు వెల్లడించిన 11 కార్పొరేషన్లలోనూ వైఎస్సార్ సీపీ జయకేతనం ఎగురవేసింది. వాటిలో పాలక వర్గాలు గురువారం కొలువుదీరాయి. కార్పొరేషన్లలో ఎన్నికైన కార్పొరేటర్లు, ముసిసిపాలిటీల్లో ఎన్నికైన కౌన్సిలర్లు తొలుత పదవీ స్వీకార ప్రమాణం చేశారు. అనంతరం కార్పొరేషన్లలో మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మునిసిపాలిటీల్లో చైర్ పర్సన్లు, వైస్ చైర్ పర్సన్ల పదవులకు ఎన్నికలు నిర్వహించి గెలిచిన వారిచేత ప్రమాణం చేయించారు. అన్ని చోట్లా స్పష్టమైన మెజార్టీ ఉండటంలో మొత్తం 11 కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. మున్సిపాలిటీలలో చైర్పర్సన్లు, వైస్ చైర్ పర్సన్ పదవులు కూడా అధికార పార్టీకే దక్కాయి. వైఎస్సార్సీపీకి పూర్తి మెజార్టీ ఉండటంతో నల్లేరుపై నడకలా విజయం సాధించింది. కాస్త ఆసక్తి రేపిన మైదుకూరు మున్సిపాలిటీని కూడా వైఎస్సార్సీపీయే గెలుచుకుంది. మైదుకూరులో వైఎస్సార్సీపీ 11 వార్డుల్లో, టీడీపీ 12 వార్డుల్లో గెలవగా జనసేన ఒక వార్డు దక్కించుకుంది. కాగా జనసేన నుంచి గెలిచిన ఏకైక కౌన్సిలర్‌తోపాటు టీడీపీ కౌన్సిలర్ ఒకరు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలో పాల్గొనలేదు. ఎక్స్ అఫిషియో సభ్యులైన ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లు ఉండటంతో వైఎస్సార్సీపీ స్పష్టమైన మెజార్టీ సాధించి మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ పదవులను గెలుచుకుంది. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీని మాత్రం టీడీపీ దక్కించుకుంది. ఇక్కడ వైఎస్సార్సీపీ 16 వార్డులను గెలవగా టీడీపీ 18 వార్డుల్లో గెలిచింది. సీపీఐ ఒక వార్డులోనూ, స్వతంత్ర సభ్యుడు ఒక వార్డులోనూ విజయం సాధించారు. ఎక్స్ అఫిషియో సభ్యులైన ఎంపీ, ఎమ్మెల్యే ఓట్లతో వైఎస్సార్సీపీ బలం 18కి చేరింది. టీడీపీకి సీపీఐ కౌన్సిలర్‌తో పాటు ఇండిపెండెంట్ కౌన్సిలర్ కూడా మద్దతు ప్రకటించడంతో తాడిపత్రి మున్సిపాలిటీని ఆ పార్టీ గెలుచుకుంది. సూళ్లూరుపేట, బొబ్బిలి, ఉయ్యూరులో నేడు.. సూళ్లూరుపేట మునిసిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నికను గురువారం నిర్వహించలేదు. విజయనగరం జిల్లా బొబ్బిలి, కృష్ణా జిల్లా ఉయ్యూరు మునిసిపల్ వైస్ చైర్మన్ల ఎన్నికలు కోరం లేకపోవడంతో జరగలేదు. ఆ పదవులకు శుక్రవారం ఎన్నికలు నిర్వహిస్తారు. మేయర్లు, డిప్యూటీ మేయర్లు.. ►ఒంగోలు మేయర్‌గా గంగాడి సుజాత ►ఒంగోలు డిప్యూటీ మేయర్‌గా వేమూరి సూర్యనారాయణ ►కడప మేయర్‌గా సురేష్‌బాబు ►కడప డిప్యూటీ మేయర్‌గా షేక్ ముంతాజ్ బేగం ►అనంతపురం మేయర్‌గా వసీమ్ సలీమ్ ►అనంతపురం డిప్యూటీ మేయర్‌గా వాసంతి సాహిత్య ►విజయనగరం మేయర్‌గా విజయలక్ష్మి ►విజయనగరం డిప్యూటీ మేయర్‌గా ముచ్చు నాగలక్ష్మి ►మచిలీపట్నం మేయర్‌గా మోకా వెంకటేశ్వరమ్మ ►తిరుపతి మేయర్‌గా డా.శిరీషా ఏకగ్రీవ ఎన్నిక ►విశాఖ మేయర్‌గా గొలగాని హరి వెంకటకుమారి ►విశాఖ డిప్యూటీ మేయర్‌గా జియ్యాని శ్రీధర్ ►చిత్తూరు మేయర్‌గా అముద ►చిత్తూరు డిప్యూటీ మేయర్‌గా చంద్రశేఖర్ ►గుంటూరు మేయర్‌గా కావటి మనోహర్‌నాయుడు ►గుంటూరు డిప్యూటీ మేయర్‌గా వనమా బాలవజ్ర బాబు ►విజయవాడ మేయర్‌గా భాగ్యలక్ష్మీ ►విజయవాడ డిప్యూటీ మేయర్‌గా బెల్లం దుర్గ ►కర్నూలు మేయర్‌గా బీవై రామయ్య మున్సిపల్ ఛైర్పర్సన్లు... అనంతపురం: ధర్మవరం ఛైర్‌పర్సన్‌గా నిర్మల గుత్తి ఛైర్‌పర్సన్‌గా వన్నూరుబీ గుంతకల్లు ఛైర్‌పర్సన్‌గా ఎన్.భవానీ హిందూపురం ఛైర్‌పర్సన్‌గా ఇంద్రజ కదిరి ఛైర్‌పర్సన్‌గా నజి మున్నీసా కల్యాణదుర్గం ఛైర్మన్‌గా రాజకుమార్ మడకశిర ఛైర్‌పర్సన్‌గా లక్షీనరసమ్మ పుట్టపర్తి ఛైర్మన్‌గా ఓబులపతి రాయదుర్గం ఛైర్‌పర్సన్‌గా శిల్ప తాడిపత్రి ఛైర్మన్‌గా జేసీ ప్రభాకర్‌రెడ్డి కర్నూలు: ఆదోని ఛైర్‌పర్సన్‌గా శాంత ♦ఆళ్లగడ్డ ఛైర్మన్‌గా రామలింగారెడ్డి ♦ఆత్మకూరు ఛైర్మన్‌గా ఆసియా ♦డోన్ ఛైర్మన్‌గా గంటా రాజేష్ ♦గూడూరు ఛైర్మన్‌గా వెంకటేశ్వర్లు ♦నందికొట్కూరు ఛైర్మన్‌గా సుధాకర్‌రెడ్డి ♦నంద్యాల ఛైర్‌పర్సన్‌గా షేక్ మబున్ని ♦ఎమ్మిగనూరు ఛైర్మన్‌గా శివన్న రఘు వైఎస్సార్ జిల్లా: బద్వేల్ ఛైర్మన్‌గా రాజగోపాల్‌రెడ్డి ♦జమ్మలమడుగు ఛైర్‌పర్సన్‌గా శివమ్మ ♦మైదుకూరు ఛైర్మన్‌గా చంద్ర ♦ప్రొద్దుటూరు ఛైర్‌పర్సన్‌గా లక్ష్మీదేవి ♦పులివెందుల ఛైర్మన్‌గా వరప్రసాద్ ♦రాయచోటి ఛైర్మన్‌గా షేక్ బాషా ♦ఎర్రగుంట్లపాలెం ఛైర్మన్‌గా హర్షవర్ధన్‌రెడ్డి ప్రకాశం జిల్లా: ఒంగోలు డిప్యూటీ మేయర్‌గా వేమూరి సూర్యనారాయణ ♦అద్దంకి ఛైర్‌పర్సన్‌గా ఎస్తేరమ్మ ♦చీమకుర్తి ఛైర్‌పర్సన్‌గా చల్లా అంకులు ♦చీరాల ఛైర్మన్‌గా జి.శ్రీనివాసరావు ♦గిద్దలూరు ఛైర్మన్‌గా వెంకటసుబ్బయ్య ♦కనిగిరి ఛైర్మన్‌గా అబ్దుల్ గఫార్ ♦మార్కాపురం ఛైర్మన్‌గా మురళీకృష్ణారావు నెల్లూరు: ఆత్మకూరు ఛైర్‌పర్సన్‌గా వెంకట రమణమ్మ ♦నాయుడుపేట ఛైర్‌పర్సన్‌గా దీపిక ♦సూళ్లూరుపేట ఛైర్మన్‌గా శ్రీమంత్‌రెడ్డి ♦వెంకటగిరి ఛైర్‌పర్సన్‌గా నక్కా భానుప్రియ చిత్తూరు: మదనపల్లె ఛైర్‌పర్సన్‌గా మనుజ ♦నగరి ఛైర్‌పర్సన్‌గా నీలమంగళం ♦పలమనేరు ఛైర్‌పర్సన్‌గా పవిత్ర ♦పుంగనూరు ఛైర్మన్‌గా ఆలీమ్ బాషా ♦పుత్తూరు ఛైర్మన్‌గా హరి కృష్ణా జిల్లా: నూజివీడు ఛైర్‌పర్సన్‌గా త్రివేణి దుర్గా ♦పెడన ఛైర్‌పర్సన్‌గా బి.జ్ఞానలింగజ్యోతి ♦ఉయ్యూరు ఛైర్మన్‌గా వల్లభనేని సత్యనారాయణ ♦నందిగామ ఛైర్‌పర్సన్‌గా మండవ వరలక్ష్మి ♦తిరువూరు ఛైర్‌పర్సన్‌గా కస్తూరిభాయి గుంటూరు జిల్లా: తెనాలి ఛైర్‌పర్సన్‌గా ఖలీదా ♦చిలకలూరిపేట ఛైర్‌పర్సన్‌గా షేక్ రఫాని ♦రేపల్లె ఛైర్‌పర్సన్‌గా కట్టా మంగమ్మ ♦సత్తెనపల్లి ఛైర్‌పర్సన్‌గా లక్ష్మీతులసి ♦వినుకొండ ఛైర్మన్‌గా దస్తగిరి ♦మాచర్ల ఛైర్మన్‌గా తురక కిశోర్ ♦పిడుగురాళ్ల ఛైర్మన్‌గా చిన్న సుబ్బారావు తూర్పుగోదావరి: అమలాపురం మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా సత్యనాగేంద్రమణి ♦గొల్లప్రోలు నగర పంచాయతీ ఛైర్‌పర్సన్‌గా మంగతాయారు ♦మండపేట మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా దుర్గారాణి ♦ముమ్మిడివరం నగర పంచాయతీ ఛైర్మన్‌గా ప్రవీణ్‌కుమార్ ♦పెద్దాపురం మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా బొడ్డు తులసి ♦పిఠాపురం మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా గండేపల్లి సుర్యావతి ♦రామచంద్రపురం మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా శ్రీదేవి ♦సామర్లకోట మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా గంగిరెడ్డి దేవి ♦తుని మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ఏలూరి సుధారాణి ♦ఏలేశ్వరం నగర పంచాయతీ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా అలమంద సత్యవతి పశ్చిమగోదావరి: కొవ్వూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా రత్నకుమారి ♦జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా బత్తిన లక్ష్మీ ♦నరసాపురం మున్సిపల్ ఛైర్మన్‌గా బర్రె శ్రీవెంకటరమణ ♦నరసాపురం మున్సిపల్ వైస్‌ఛైర్మన్‌గా కొత్తపల్లి భుజంగరావు ♦నిడదవోలు మున్సిపల్ ఛైర్మన్‌గా ఆదినారాయణ ♦కొవ్వూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా రత్నకుమారి ♦కొవ్వూరు మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్‌గా మన్నె పద్మ ♦జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా బత్తిన లక్ష్మీ ♦జంగారెడ్డిగూడెం మున్సిపల్ వైస్‌ఛైర్‌పర్సన్‌గా కంచర్ల వాసవీ ►విజయనగరం: బొబ్బిలి మున్సిపల్ ఛైర్మన్‌గా వెంకట మురళీకృష్ణారావు ►విజయనగరం: పార్వతీపురం మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా బోను గౌరీశ్వరి ►విజయనగరం: సాలూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ఈశ్వరమ్మ ►విశాఖ: నర్సీపట్నం మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ఆదిలక్ష్మి ►విశాఖ: యలమంచిలి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా పీలా రామాకుమారి ►శ్రీకాకుళం: ఇచ్ఛాపురం మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా పిలక రాజ్యలక్ష్మి ►శ్రీకాకుళం: పాలకొండ నగర పంచాయతీ ఛైర్‌పర్సన్‌గా రాధాకుమారి ►శ్రీకాకుళం: పలాస మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా గిరిబాబు ►పార్వతీపురం మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా బోను గౌరీశ్వరి ►పార్వతీపురం మున్సిపల్ వైస్‌చైర్‌పర్సన్‌గా కొండపల్లి రుక్మిణి ►సాలూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ఈశ్వరమ్మ ►సాలూరు మున్సిపల్ వైస్‌ఛైర్మన్‌గా జరజాపు దీప్తి ►విజయనగరం: నెల్లిమర్ల నగర పంచాయతీ ఛైర్‌పర్సన్‌గా సరోజిని ►విజయనగరం: నెల్లిమర్ల నగర పంచాయతీ వైస్ ఛైర్మన్‌గా సముద్రపు రామారావు ►గుంటూరు: సత్తెనపల్లి మున్సిపల్ ఛైర్మన్‌గా లక్ష్మీతులసి ►సత్తెనపల్లి మున్సిపల్ వైస్‌ఛైర్‌పర్సన్‌గా షేక్ నాగుల్‌మీరాన్ ►విశాఖ: యలమంచిలి మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా పిల్లా రామకుమారి ►యలమంచిలి మున్సిపాలిటీ వైస్‌ఛైర్మన్‌గా వెంకట గోవిందరాజు ►అనంతపురం: హిందూపురం మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా ఇంద్రజ ►హిందూపురం మున్సిపాలిటీ వైస్‌ఛైర్మన్‌గా పీఎన్ జాబివుల్లా ►విజయనగరం: పార్వతీపురం మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా గోను గౌరీశ్వరి ►పార్వతీపురం మున్సిపాలిటీ వైస్ ఛైర్‌పర్సన్‌గా కొండపల్లి రుక్మిణి ►తూ.గో: ఏలేశ్వరం మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా అలమండ సత్యవతి ►ఏలేశ్వరం మున్సిపాలిటీ వైస్‌ఛైర్‌పర్సన్‌గా శిడగం త్రివేణి ►చిత్తూరు: పలమనేరు మున్సిపల్ ఛైర్మన్‌గా మురళీకృష్ణ ►పలమనేరు మున్సిపల్ వైస్‌ఛైర్మన్‌గా చన్మ ►వైఎస్ఆర్ జిల్లా: మైదుకూరు మున్సిపల్ ఛైర్మన్‌గా మచ్చునూరి చంద్ర ►మైదుకూరు మున్సిపల్ వైస్‌ఛైర్మన్‌గా షేక్ మహబూబ్ షరీఫ్ -
18న మేయర్ల ఎన్నిక
సాక్షి, అమరావతి: నగర పాలక సంస్థల్లో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులతో పాటు మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులకు ఈనెల 18న ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఆ రోజు ఉ.11గంటలకు ఎక్కడికక్కడ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ నిర్ణయించారు. ఏలూరు మినహా 11 నగర పాలక సంస్థలు, 75 మున్సిపాలిటీల్లో పరోక్ష పద్ధతిలో ఈ ఎన్నికలు జరుగుతాయి. 14న జరిగే మున్సి‘పోల్స్’ ఓట్ల లెక్కింపు సందర్భంగా నగర పాలక సంస్థల్లో కార్పొరేటర్లుగా ఎన్నికైన వారు మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటారు. అలాగే, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డు సభ్యులుగా ఎన్నికైన వారు చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లను ఎన్నుకుంటారు. ఈ ఎన్నికలను పురస్కరించుకుని ఎన్నికల కమిషన్ ప్రిసైడింగ్ అధికారులను నియమించింది. వీరు ముందుగా విజేతలతో ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నికలను చేపడతారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఓటు హక్కు ఈ ఎన్నికల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఎక్స్ అఫిషియో హోదాలో ఓటు హక్కు ఉంటుంది. వీరు ముందుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలి. ► లోక్‌సభ సభ్యుడు లేదా ఎమ్మెల్యే తాము గెలిచిన నియోజకవర్గ పరిధిలో ఒకటి కంటే ఎక్కువ పట్టణాలు ఉంటే ఏదో ఒకచోట మాత్రమే ఎక్స్ అఫిషియో సభ్యునిగా తమ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వారి నియోజకవర్గ పరిధిలో ఒకటే పట్టణం ఉంటే అందులోనే అతను ఎక్స్ అఫిషియో సభ్యునిగా పరిగణిస్తారు. ► రాజ్యసభ సభ్యునికి మున్సిపాలిటీ ప్రాంతాల్లో ఎక్కడ ఓటు హక్కు కలిగి ఉంటుందో ఆ నగర పాలక సంస్థ లేదంటే మున్సిపాలిటీలో అతనిని ఎక్స్ అఫిషియో సభ్యునిగా గుర్తిస్తారు. ఇక ఎమ్మెల్సీలు కూడా తాము ఎన్నికయ్యే సమయంలో ఏ మున్సిపాలిటీ లేదా నగర పాలక సంస్థలో ఓటు హక్కు కలిగి ఉంటారో అక్కడే అతనిని ఎక్స్ అఫిషియో సభ్యునిగా గుర్తిస్తారు. కోరం ఉంటేనే ఎన్నిక నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలోని ఓటు హక్కు ఉన్న మొత్తం సభ్యులలో కనీసం సగం మంది 18న జరిగే ప్రత్యేక సమావేశానికి హాజరైతేనే ఆయాచోట్ల మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నికను నిర్వహిస్తారు. గంట వ్యవధిలో కనీసం సగం మంది సభ్యులు హాజరుకాని పక్షంలో కోరం లేని కారణంగా ఎన్నికను ప్రిసైడింగ్ అధికారి వాయిదా వేస్తారని ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించారు. విప్ జారీచేసే అధికారం లేని జనసేన ఇదిలా ఉంటే.. ఈ ఎన్నికల్లో గెలుపొందిన తమ అభ్యర్థులకు విప్ జారీచేసే అధికారం ఆయా పార్టీలు కలిగి ఉంటాయి. అధికార వైఎస్సార్సీపీ, తెలుగుదేశంతో సహా జాతీయ స్థాయిలో, వివిధ రాష్ట్రాలలో గుర్తింపు పొందిన మొత్తం 18 రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలో విప్ జారీ చెయ్యొచ్చు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆయా రాజకీయ పక్షాలకు లేఖలు రాసింది. కానీ, విప్ జారీచేసే అధికారం ఉన్న పార్టీల జాబితాలో జనసేన లేదు. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీగా నమోదై ఉండి.. ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద కూడా నమోదు చేసుకుని ఉంటే అలాంటి పార్టీలకు మాత్రమే ఈ ఎన్నికల్లో విప్ జారీచేసే అధికారం ఉంటుందని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. కానీ, రాష్ట్రంలో జనసేన గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీ కాదని.. కేవలం రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద ప్రత్యేక గుర్తు రిజర్వుడు చేయబడిన రిజిస్టర్డ్ పార్టీ మాత్రమే అయినందున ఆ పార్టీని విప్ జారీచేసే అధికారం ఉన్న పార్టీల జాబితాలో చేర్చలేదని ఆ వర్గాలు వివరించాయి. -
ప్రమాణ స్వీకారం చేస్తేనే ఎన్నికకు అర్హత
సాక్షి, హైదరాబాద్ : కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ప్రమాణం చేశాకే మేయర్, డిప్యూటీ మేయర్లుగా పోటీ చేయడానికి కానీ, వారిని ఎన్నుకునేందుకు ఓటు వేసేందుకు కానీ అవకాశం ఉంటుంది. ఈ నెల 11వ తేదీన ఒంటిగంట కల్లా అందరూ జీహెచ్ఎంసీ కౌన్సిల్ హాల్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయ్యాక, ఎన్నిక కార్యక్రమం ప్రారంభమయ్యాక ప్రమాణ స్వీకారానికి అవకాశం ఉండదు. మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికల విధివిధానాలు, అనుసరించాల్సిన పద్ధతులు తదితరమైన వాటి గురించి ఎన్నికల సంఘం కమిషనర్ సి.పార్థసారథి తమ కార్యాలయంలో జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి శ్వేతామహంతి, అడిషనల్ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్, జీహెచ్ఎంసీ, పోలీసు విభాగాల అధికారులు పాల్గొన్నారు. సమావేశంలోని ముఖ్యాంశాలు.. కొత్త కార్పొరేటర్లు 11వ తేదీ ఉ. 11 గంటలకు హాజరై ప్రమాణ స్వీకారం చేయాలి. ప్రమాణం చేస్తేనే 12.30 గంటలకు మేయర్ ఎన్నికకు సంబంధించిన ప్రత్యేక సమావేశానికి హాజరయ్యేందుకు అనుమతి. కార్పొరేటర్‌తోపాటు ఎక్స్అఫీషియో సభ్యులకూ ఒక్కొక్కరు ఒక్క ఓటు మాత్రమే వేయాలి. చేతులెత్తడం ద్వారా ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్ నిర్వహించేందుకు కనీసం సగం మంది ఉంటేనే కోరంగా పరిగణించి ఎన్నిక నిర్వహిస్తారు. కోరం లేకపోతే గంటపాటు నిరీక్షిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటల వరకు కూడా కోరం లేకున్నా, ఏదైనా అనివార్యకారణాల వల్ల ఎన్నిక జరగకపోయినా,ప్రిసైడింగ్ అధికారి మర్నాటికి వాయిదా వేస్తారు. విప్ వర్తిస్తుంది.. గుర్తింపుపొందిన రాజకీయపార్టీలు విప్ కోసం నిర్దేశించిన అనుబంధం–1లో తమ పార్టీ తరపున విప్‌ను నియమించే అధికారాన్ని ఏ వ్యక్తికైనా ఇవ్వవచ్చు. లేదా పార్టీ అధ్యక్షుడు అనుబంధం–2 ద్వారా నేరుగా పార్టీ తరపున విప్‌ను నియమించవచ్చు. -
వరంగల్ మేయర్‌పై కసరత్తు
సాక్షి, హైదరాబాద్: వరంగల్ మేయర్ ఎన్నికపై టీఆర్ఎస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఈ నెల 27న మేయర్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో సరైన వ్యక్తిని ఎంపిక చేసే ప్రక్రియ మొదలుపెట్టింది. గ్రేటర్ వరంగల్ మేయర్ ఎంపిక అంశంపై పార్టీ తరఫున ఇన్చార్జిగా టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లుకు బాధ్యతలు అప్పగించింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. వరంగల్‌కు వెళ్లి అక్కడి పార్టీ నాయకులు, కార్పొరేటర్ల అభిప్రాయాలను సేకరించాలని బాలమల్లును ఆదేశించారు. మంగళవారం బాలమల్లు కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా వరంగల్ మేయర్ ఎన్నికపై చర్చ జరిగింది. అందరి అభిప్రాయాలను సేకరిస్తామని, ఏకాభిప్రాయ సాధనకు కృషి చేస్తామని బాలమల్లు హామీ ఇచ్చారు. వరంగల్ నగరానికి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర సీనియర్ నాయకులు అందరినీ కలుపుకుపోతామని పేర్కొన్నారు. బాలమల్లు వరంగల్‌కు వెళ్లి సేకరించిన అభిప్రాయాలతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నివేదిక సమర్పిస్తారని కేటీఆర్ తెలిపారు. వరంగల్ మేయర్‌గా ఉండే నన్నపనేని నరేందర్ అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు స్థానంలో ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం మేయర్ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న వరంగల్ మేయర్ పదవికి 27న ఎన్నిక జరగనుంది. టీఆర్ఎస్లో మేయర్ పదవి కోసం పోటీ ఎక్కువగానే ఉంది. కార్పొరేటర్లు గుండా ప్రకాశ్‌రావు, నాగమల్ల ఝాన్సీ, బోయినపల్లి రంజిత్‌రావు, గుండు అశ్రితారెడ్డి ఈ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని ఎమ్మెల్యేల అభిప్రాయం సేకరించిన అనంతరం టీఆర్ఎస్ అధిష్టానం ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
హర్యానా కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ముందంజ
చండీగఢ్ : హర్యానాలో అయిదు మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులు ముందంజలో ఉన్నారు. మూడు కార్పొరేషన్లలో బీజేపీ మేయర్ అభ్యర్ధులు సమీప ప్రత్యర్ధులపై భారీ ఆధిక్యంలో దూసుకుపోతుండగా, మరో రెండు చోట్లు స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. హిసార్‌లో బీజేపీ మేయర్ అభ్యర్థి గౌతమ్ సర్ధానా ఆధిక్యంలో ఉండగా..కర్నాల్, పానిపట్, రోహ్తక్, యమునానగర్లలోనూ బీజేపీ మేయర్ అభ్యర్ధులు వరుసగా రేణు బాల, అవనీత్, మన్మోహన్, మదన్‌సింగ్‌లు విపక్ష మేయర్ అభ్యర్ధుల కంటే ముందంజలో ఉన్నారు. పలు రౌండ్ల లెక్కింపు మిగిలిఉండటంతో ఏ పార్టీ విజయం సాధిస్తుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. కాగా వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మేయర్ ఎన్నికలను పాలక బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో పార్టీ గుర్తుపై పోటీ చేయకపోయినా కొందరు ఇండిపెండెంట్లకు మద్దతు ఇస్తోంది. విపక్ష ఐఎన్ఎల్డీ-బీఎస్పీ కూటమి కార్పొరేషన్ ఎన్నికల బరిలో నిలిచింది. -
జార్ఖండ్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్‌స్వీప్
సాక్షి, రాంచీ : జార్ఖండ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. శుక్రవారం జరిగిన ఓట్ల లెక్కింపులో ఐదు మేయర్ స్ధానాలనూ గెలుచుకుంది. హజారిబాగ్, గిరిధ్, ఆదిత్యాపూర్, రాంచీ, మేదినీనగర్ కార్పొరేషన్లలో మేయర్ పదవులను బీజేపీ దక్కించుకుంది. ఈనెల 16న ఐదు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, జేఎంఎంలు హోరాహోరీగా తలపడ్డాయి. గెలుపుపై మూడు పార్టీలూ ధీమా వ్యక్తం చేశాయి. పలు కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్ పదవులనూ బీజేపీ గెలుచుకుంది. ఐదు కార్పొరేషన్లలోనూ పార్టీ ఘనవిజయం పట్ల బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలాయి. మేయర్ ఎన్నికల్లో త్రిముఖ పోరు బీజేపీకి లాభించిందని పరిశీలకులు విశ్లేషించారు. -
మేయర్ ఎవరో!
జయనగర: బృహత్ బెంగళూరు మహానగర పాలికె మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక గురువారం జరగనుంది. ప్రాదేశిక కమిషనర్ జయంతి, నగరజిల్లా కలెక్టర్ శంకర్ తదితరులు పాలికె కార్యాలయంలో ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. ఎన్నికల సందర్భంగా పాలికె కేంద్రకార్యాలయం చుట్టుపక్కల భారీ భద్రత కల్పించారు. గురువారం ఎన్నికయ్యే మేయర్ 51వ మేయర్‌గా పగ్గాలు చేపడతారు. మేయర్ పద్మావతి (కాంగ్రెస్), ఉపమేయర్ ఆనంద్ (జేడీఎస్) ఇక మాజీలవుతారు. ఈ దఫాకూడా కాంగ్రెస్, జేడీఎస్‌లు కలిసి పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ సమీక్ష మేయర్ ఎన్నికపై బుధవారం కేసీసీసీ కార్యాలయంలో కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ పరమేశ్వర్ నేతృత్వంలో ప్రత్యేక భేటీ నిర్వహించారు. కార్పొరేటర్లు, నగర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతరం పరమేశ్వర్ విలేకరులతో మాట్లాడుతూ... మేయర్, ఉప మేయర్ ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లకు విప్ జారీ చేశామన్నారు. పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థికే ఓటు వేయాలని ఆదేశించామన్నారు. తమ మద్దతుదారులకు అవకాశం ఇవ్వకపోతే మేయర్ ఎన్నికను బహిష్కరిస్తామని కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్పిన విషయం తనకు తెలియదన్నారు. ఈ భేటీలో హోంమంత్రి రామలింగారెడ్డి. కార్యాధ్యక్షుడు దినేశ్‌గుండూరావ్, మంత్రులు ఎంఆర్.సీతారాం, కేజే.జార్జ్ తదితరులు పాల్గొని ఎమ్మెల్యేలు, పాలికె సభ్యులు అభిప్రాయాలు సేకరించారు. అంతిమంగా మేయర్ అభ్యర్థి ఎవరనే దానిపై పార్టీ పెద్దలు నిర్ణయించనున్నారు. నామినేషన్‌కు అరగంట ముందు సీల్డ్ కవర్లో మేయర్ అభ్యర్థి పేరును పంపుతారు. మేయర్ రేసులో సంపత్‌రాజ్, గోవిందరాజ్ ఉన్నారు. మేయర్– ఎస్సీ రిజర్వుడ్ ⇒ఈ దఫా మేయర్ పీఠం ఎస్సీ వర్గానికి కేటాయించారు. ⇒ఉపమేయర్ స్థానం జనరల్–మహిళలకు ⇒మొత్తం స్థానాలు 198, ఇందులో బీజేపీ 101, కాంగ్రెస్– 76, జేడీఎస్– 14, ఇతరులు– 07 మంది ⇒ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి మొత్తం ఓటర్లు– 266 మంది. ఈ బలం వల్ల కాంగ్రెస్, జేడీఎస్ గట్టెక్కుతాయి. రేసులో ఎవరెవరు? ⇒మేయర్ పీఠం అధికార కాంగ్రెస్ తీసుకుంటుంది. ఉపమేయర్ స్థానం జేడీఎస్‌కు కేటాయిస్తుంది. ⇒మేయర్ రేసులో సంపత్‌రాజ్, గోవిందరాజ్ తదితరులు ఉన్నారు ⇒ఉపమేయర్ కోసం ప్రమీళా ఉమాశంకర్, నేత్ర నారాయణ, పద్మావతి నరసింహమూర్తి, మంజుల పోటీ పడుతున్నారు. ఎన్నిక ఇలా మొదలవుతుంది ⇒మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు గురువారం ఉద యం 8 గంటల నుంచి 9.30లోగా నామినేషన్లు దాఖలు చేయాలి. ⇒11.30 గంటలకు మేయర్ ఎన్నిక ఓటింగ్ మొదలవుతుంది. 11.30 లోగా ఓటర్లు కౌన్సిల్ హాల్లోకి చేరుకోవాలి. ఆ తరువాత అనుమతించరు. ⇒నామినేషన్ల ఉపసంహరణకు ఐదు నిమిషాలు కేటాయిస్తారు. ⇒అనంతరం ఓటింగ్ జరుగుతుంది. మొదట మేయర్ స్థానానికి ఎన్నిక నిర్వహిస్తారు. ఓట్లు లెక్కించి అత్యధిక ఓట్లను పొందినవా రిని మేయర్‌గా ప్రాదేశిక కమిషనర్ జయంతి మేయర్ ప్రకటిస్తారు. ⇒అనంతరం ఉప మేయర్ ఎన్నిక జరుగుతుంది. -
ప్రభుత్వానికి అధికారం ఉందో లేదో తేలుస్తాం
* అధికార ఉత్తర్వు ద్వారా చట్ట సవరణపై హైకోర్టు * సుప్రీంకోర్టు తీర్పులను మా ముందుంచండి * అధికార ఉత్తర్వు ద్వారా చట్ట సవరణ సరికాదు * ప్రస్తుతానికిదే మా ప్రాథమిక అభిప్రాయం.. తేల్చి చెప్పిన ధర్మాసనం * తదుపరి విచారణ 8కి వాయిదా... * జీవోపై స్టేకి నిరాకరణ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఏదైనా ఒక చట్టాన్ని తెలంగాణ రాష్ట్రానికి వర్తింప చేసుకుంటే (అడాప్ట్) ఆ చట్టాన్ని అధికార ఉత్తర్వు ద్వారా సవరించే అధికారం ప్రభుత్వానికి ఉందో లేదో తేలుస్తామని ఉమ్మడి హైకోర్టు తేల్చి చెప్పింది. ఈవిధంగా అధికార ఉత్తర్వు ద్వారా సవరణలు చేస్తూ పోతే భవిష్యత్తులో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నందున.. అంతిమంగా దీనికి ఓ సమాధానం చెబుతామని స్పష్టం చేసింది. ఒకసారి అడాప్ట్ చేసుకున్న చట్టానికి తరువాత అధికార ఉత్తర్వు ద్వారా చట్ట సవరణ చేసే విషయంలో సుప్రీంకోర్టు తీర్పులు ఏవైనా ఉంటే వాటిని తమ ముందుంచాలని అటు పిటిషనర్ల తరఫు న్యాయవాదులను, ఇటు రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ)ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. ఈ నెల 11న మేయర్ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేసిన నేపథ్యంలో, అధికార ఉత్తర్వుల (జీవో 207)పై స్టే ఇవ్వాలన్న పిటిషనర్ల అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. 8న పూర్తిస్థాయి విచారణ చేపడుతున్నందున స్టే అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎ.వి.శేషసాయిలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. శాసనమండలి సభ్యులుగా ఎన్నికైన తరువాత కూడా తమ ఓటును గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోకి మార్చుకున్న ఎమ్మెల్సీలందరికీ ఎక్స్ అఫీషియో సభ్యుల హోదాలో మేయర్ ఎన్నికల్లో ఓటేసేందుకు వీలు కల్పిస్తూ జీహెచ్ఎంసీ చట్టానికి అధికార ఉత్తర్వు (ఎగ్జిక్యూటివ్ ఆర్డర్) ద్వారా సవరణ చేస్తూ జారీ చేసిన జీవో 207ను సవాల్‌చేస్తూ కాంగ్రెస్ ముఖ్యఅధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కూడా పిటిషన్ దాఖలు చేసింది. ఈ రెండు వ్యాజ్యాలపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. చట్టాన్ని అడాప్ట్ చేసుకునే సమయంలోనే మార్పులు, చేర్పులు, సవరణలు చేయాలని, ఒకసారి అడాప్ట్ చేసుకున్న తరువాత సవరణలు చేయాలంటే అది శాసనవ్యవస్థ ద్వారానే జరగాలన్నది తమ ప్రాథమిక అభిప్రాయమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనిపై అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ, పునర్విభజన చట్టంలోని సెక్షన్ 101 ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఓ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రానికి అడాప్ట్ చేసుకుంటే, అపాయింటెడ్ డే నుంచి రెండేళ్లలోపు ఆ చట్టానికి సవరణలు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. ఇదే విషయాన్ని బిహార్ పునర్విభజన చట్టం కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందంటూ ఆ తీర్పును చదివి వినిపించారు. సెక్షన్ 101 కింద తమకున్న అధికారంతో ఈ ఉత్తర్వులు జారీ చేశామని ఆయన చెప్పగా, దీంతో ధర్మాసనం ఏకీభవించలేదు. తరువాత శ్రవణ్‌కుమార్ తరఫు సీనియర్ న్యాయవాది ఆర్.రఘునందన్‌రావు వాదనలు వినిపిస్తూ, సుప్రీం తీర్పు ప్రకారం ఉమ్మడి రాష్ట్ర చట్టాలు కొత్త రాష్ట్రానికి వర్తిస్తాయని, రెండేళ్ల వరకు వాటిని అడాప్ట్ చేసుకోవడం, వాటికి మార్పులు చేర్పులు చేయడం, సవరణలు చేపట్టడం లాంటివి చేయొచ్చని, అయితే ఇదంతా కూడా అడాప్ట్ చేసుకున్న సమయంలోనే జరగాలని చెప్పారు. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తరఫు న్యాయవాది శివరాజు శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, శాసనవ్యవస్థ ద్వారా చేయాల్సిన పనిని ప్రభుత్వం అధికార ఉత్తర్వు ద్వారా చేసిందని, ఇది చెల్లుబాటు కాదని పేర్కొన్నారు. దీనికి ఏజీ స్పందిస్తూ, అయితే విచారణను సోమవారానికి వాయిదా వేయాలని, సుప్రీం తీర్పులను కోర్టు ముందుంచుతానని ప్రతిపాదించారు.