
న్యూఢిల్లీ: రెండుసార్లు సమావేశమైనా మేయర్‌ను ఎన్నుకోకుండానే అర్ధాంతరంగా వాయిదాపడిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) భేటీని ఈసారి 6వ తేదీన నిర్వహించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్‌జీ) వీకే సక్సేనా అనుమతి ఇచ్చారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ఎల్‌జీ∙ఆమోదం తెలిపారని ఉన్నతాధికారులు బుధవారం చెప్పారు.
ఇటీవలి ఎంసీడీ ఎన్నికల్లో 250 స్థానాలకుగాను ఆప్ 134 చోట్ల, బీజేపీ 104 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెల్సిందే. అయితే, మేయర్, డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకునేందుకు ఎంసీడీ జనవరి 6, 24వ తేదీల్లో సమావేశమైన సందర్భంగా కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదంచోటుచేసుకున్న విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment