Delhi municipal corporation elections
-
ఇక ట్రిపుల్ ఇంజన్!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం సొంతం చేసుకుంది. 27 ఏళ్ల తర్వాత అధికార పీఠం దక్కించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు, బీజేపీ పెద్దలు చెప్పినట్లుగానే డబుల్ ఇంజన్ ప్రభుత్వం కొలువుదీరబోతోంది. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటే అభివృద్ధి వేగవంతమవుతుందంటూ వారు చేసిన ప్రచారం ప్రజలపై బాగానే ప్రభావం చూపింది. దాంతో ఇప్పుడిక ఢిల్లీలో ఏకంగా ట్రిపుల్ ఇంజన్‌పై బీజేపీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అత్యంత కీలకమైన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) మేయర్ ఎన్నిక రెండు నెలల్లో జరగనుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ నెగ్గితే దేశ రాజధానిలో ట్రిపుల్ ఇంజన్ ప్రభుత్వం కొలువుదీరినట్లే. కేంద్రంలో, రాష్ట్రంలో, కార్పొరేషన్లో బీజేపీ ఆధిపత్యం సుస్థిరమవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ నాయకత్వం ఇక ఎంసీడీ మేయర్ ఎన్నికలే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తోంది.పుంజుకున్న కమలం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో 250 కౌన్సిలర్ స్థానాలున్నాయి. వీరిని ప్రజలు నేరుగా ఓట్లేసి ఎన్నుకుంటారు. ఢిల్లీలోని ఏడుగురు లోక్‌సభ ఎంపీలు, ముగ్గురు రాజ్యసభ ఎంపీలు, ఎంసీడీ పరిధిలోని 14 మంది ఎమ్మెల్యేలకు కూడా మేయర్ ఎన్నికల్లో ఓటు హక్కుంది. ఎంసీడీలో బీజేపీకి ప్రస్తుతం 120 మంది, ఆప్‌కు 122 మంది కౌన్సిలర్లున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది బీజేపీ కౌన్సిలర్లు, ముగ్గురు ఆప్ కౌన్సిలర్లు ఎమ్మెల్యేలుగా నెగ్గారు. బీజేపీ కౌన్సిలర్ కమల్జీత్ షెరావత్ గతేడాది లోక్‌సభ ఎన్నికల్లో వెస్ట్ ఢిల్లీ నుంచి ఎంపీగా గెలిచారు. అలా ఎంసీడీలో 12 కౌన్సిలర్ స్థానాలు ఖాళీ అయ్యాయి. వాటికి ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎంసీడీలో తాజాగా బీజేపీ బలం 112, ఆప్ బలం 119గా ఉన్నాయి. 2024 నవంబర్‌లో మేయర్ ఎన్నిక జరిగింది. ఆప్ అభ్యర్థి మహేశ్ కిచీ మేయర్‌గా ఎన్నికయ్యారు. పోలైన 263 ఓట్లలో కిచీకి 133, బీజేపీ అభ్యర్థి కిషన్ లాల్‌కు 130 ఓట్లు లభించాయి. అయితే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎంసీడీలో బీజేపీ బలం పెరిగింది. మేయర్ ఎన్నికల్లో ఓటు హక్కున్న 14 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలు బీజేపీకి చెందినవారే. మేయర్ పదవిని సులభంగా దక్కించుకోగలదు. కనుక రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరగానే మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టి గద్దె దించాలని పార్టీ అధిష్టానం నిర్ణయానికి వచి్చనట్లు సమాచారం. తర్వాత మేయర్ పదవిని సొంతం చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎంసీడీ భేటీకి ఎల్జీ ఓకే
న్యూఢిల్లీ: రెండుసార్లు సమావేశమైనా మేయర్‌ను ఎన్నుకోకుండానే అర్ధాంతరంగా వాయిదాపడిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) భేటీని ఈసారి 6వ తేదీన నిర్వహించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనా అనుమతి ఇచ్చారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ఎల్జీ∙ఆమోదం తెలిపారని ఉన్నతాధికారులు బుధవారం చెప్పారు. ఇటీవలి ఎంసీడీ ఎన్నికల్లో 250 స్థానాలకుగాను ఆప్ 134 చోట్ల, బీజేపీ 104 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెల్సిందే. అయితే, మేయర్, డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకునేందుకు ఎంసీడీ జనవరి 6, 24వ తేదీల్లో సమావేశమైన సందర్భంగా కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదంచోటుచేసుకున్న విషయం విదితమే. -
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో పాగా వేసిన ఆప్
-
హస్తినలో ‘ఆప్’ హవా.. ఢిల్లీ మేయర్‌గా మహిళ!
న్యూఢిల్లీ: హస్తినలో మరోసారి ‘ఆప్’సత్తా చాటింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయ దుందుభి మోగించింది. దశాబద్దన్నరగా ఎంసీడీలో పాగా వేసిన కమలనాథులకు షాక్ ఇచ్చింది. ఆప్ 134 స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీ 104 స్థానాలు గెలిచింది. కాంగ్రెస్ పార్టీ 9 స్థానాలకే పరిమితమైంది. మూడు చోట్ల ఇతరులు పాగా వేశారు. మహిళా మేయర్! ఢిల్లీ మహా నగర మేయర్ పీఠాన్ని ఈసారి మహిళకు కట్టబెట్టనున్నారు. మహిళను మేయర్ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ వెల్లడించారు. ఆప్ తరపున పలువురు మహిళలు ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. వీరిలో మేయర్ పదవి ఎవరికి దక్కుతుందో చూడాలి. ‘ఆప్’లో ఆనందం ఎంసీడీ ఎన్నికల్లో విజయంతో ‘ఆప్’ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. తమపై విశ్వాసం ఉంచి గెలిపించినందుకు ఢిల్లీ ప్రజలకు ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ధన్యవాదాలు తెలిపారు. ‘ప్రపంచంలోని అతిపెద్ద మరియు అత్యంత ప్రతికూల పార్టీని ఓడించడం ద్వారా ఢిల్లీ ప్రజలు నిజాయితీగా పనిచేసే అరవింద్ కేజ్రీవాల్‌ను గెలిపించారు. మాకు ఇది విజయం మాత్రమే కాదు, పెద్ద బాధ్యత’ని సిసోడియా ట్వీట్ చేశారు. (క్లిక్ చేయండి: ఢిల్లీలో బీజేపీకి బ్రేక్.. ఫలించిన కేజ్రీవాల్ ప్లాన్స్) బీజేపీకి తగిన గుణపాఠం ఢిల్లీ ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ చద్దా వ్యాఖ్యానించారు. అభివృద్ధి కోసం పనిచేసే వారికే ప్రజలు పట్టం కట్టారన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌ను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీకి హస్తిన ఓటర్లు తగిన సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. ఢిల్లీని ప్రపంచంలోనే అత్యంత అందమైన నగరంగా మారుస్తామని హామీయిచ్చారు. -
బీజేపీకి ఫేవర్‌గా ఎగ్జిట్ పోల్స్.. ఊహించిందే: ఆప్
అహ్మదాబాద్: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పలు ఉప ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్‌పై రాజకీయ చర్చ నడుస్తోంది. ప్రధానంగా గుజరాత్ ఎన్నికలే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌లో తమకు ప్రతికూలంగా ఫలితాలు రావడంపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చద్దా స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎప్పుడూ బీజేపీకి అనుకూలంగానే ఉంటాయని పేర్కొన్నారాయన. ఓ జాతీయ మీడియా ఛానెల్‌తో ఆయన మాట్లాడుతూ.. ఆప్ ఓటర్లు మౌనంగా, చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటారు. వాళ్లు ఎగ్జిట్ పోల్ అంచనాకి చిక్కరు అంటూ కామెంట్ చేశారు. మరి.. ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆప్‌కి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి కదా అని మీడియా ప్రశ్నించగా.. ‘‘ఢిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ కంటే ఉత్తమ ప్రదర్శనే ఆప్ చూపించబోతోంద’’ని చద్దా తెలిపారు. గుజరాత్లో ఆప్ కో-ఇన్ఛార్జిగా ఒక మాట చెప్పదల్చుకున్నా.. ఒక పార్టీ కొత్తగా ఒక రాష్ట్రంలో పోటీ చేస్తున్నప్పుడు ఇలా తక్కువ అంచనా వేయడం సహజమే. ఇలాగే ఢిల్లీలో 2013లో ఆప్ పోటీ చేసినప్పుడు.. మూడు, నాలుగు కంటే ఎక్కువ సీట్లు గెల్చుకోకపోవచ్చనే అంచనా వేశారు. కానీ, 28 సీట్లు గెల్చుకుంది కదా!. అలాగే.. ఆమ్ ఆద్మీ పార్టీ గణనీయమైన ఓట్లను సాధించి గుజరాత్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు రాఘవ్ చద్దా. ఇదిలా ఉంటే.. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్లో ఆప్ 90 సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమంటూ ప్రకటించారు. ఇదీ చదవండి: మంచు కొండల్లో పోటాపోటీ! -
Delhi MCD Election: పది కీలక హామీలు ప్రకటించిన కేజ్రీవాల్
న్యూఢి: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ రాష్ట్ర ప్రజలకు పలు కీలక హామీలు ప్రకటించారు. పౌర సంస్థలో అవినీతిని నిరోధించడం, చెత్త డంపింగ్ యార్డ్ల తరలింపు, విద్య, వైద్య సదుపాయాల మెరుగుదలతో సహా పది హామీలు అందించారు. తమ పార్టీ ఏం చెబుతుందో.. అదే చేస్తుందని మరోసారి స్పష్టం చేశారు. రాజధాని వాసులు ఆప్‌కు ఓటు వేస్తే ఢిల్లీలో పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఢిల్లీ సీఎం తెలిపారు. రోడ్లను బాగుచేస్తామని, ఎంసీడీ పాఠశాలలు, ఆసుపత్రులు మెరుగుపరుస్తామని వాగ్దానం చేశారు. అలాగే పౌర సంస్థలోని ఉద్యోగులకు సకాలంలో జీతం చెల్లిస్తామని పేర్కొన్నారు. ఇన్స్పెక్టర్ రాజ్‌ను తొలగించి సీల్ చేసిన దుకాణాలను తిరిగి తెరిపిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. చదవండి: ‘పాత పింఛను’ హామీ ఎన్నికల స్టంట్ కాదు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీజేపీ ప్రకటించిన వచన్ పత్రపై ఢిల్లీ సీఎం ఫైర్ అయ్యారు. దీనినే వచ్చే ఎన్నికల్లో వారు సంకల్ప్ పత్రా అని పిలుస్తారని..ఎన్నికల తరువాత తమ వాగ్దానాలు, మ్యానిఫెస్టోలను పట్టించుకోరని, చెత్తబుట్టలో పారేస్తారని విమర్శించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు నిధులు కేటాయించడం లేదని బీజేపీ ఆరోపిస్తోందని.. నిధులు కేటాయించడం లేదని కేంద్రం ఓ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం చరిత్రలోనే ఇది తొలిసారని మోదీ సర్కార్‌పై మంపడిపడ్డారు. చెత్త రహిత నగరంగా ఢిల్లీని మార్చేందుకు కేంద్రం నుంచి నిధులు అందిస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని.. కానీ తన మాట నిలబెట్టుకోలేదని దుయ్యబట్టారు.. ఎంసీడీ ఎన్నికల్లో బీజేపీకి 20 సీట్ల కంటే ఎక్కువ స్థానాలు రావని ఢిల్లీ సీఎం జోస్యం చెప్పారు. కాగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో 250 వార్డులు ఉన్నాయి. వీటికి డిసెంబర్ 4న ఎన్నికలు జరగనున్నాయి. అదే నెల 7వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ముఖ్యంగా బీజేపీ, ఆప్ మధ్యే తీవ్ర పోటీ నెలకొంది. -
ఢిల్లీవాసుల తీర్పును ఊహించలేం...
న్యూఢిల్లీ: రానున్న మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలలో విజయం తమదే అని ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ రాజకీయ విశ్లేషకులు మాత్రం ఢిల్లీవాసుల తీర్పు ఎవరి పక్షాన ఉంటుందనేది అంచనా వేయడానికి తర్జనభర్జనలు పడుతున్నారు. ఢిల్లీవాసుల ఓటు ఎవరికి పడుతుందో ఊహించడం కష్టమని, ఢిల్లీ ఎన్నికల ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయనే విషయాన్ని 1993,2013, 2015 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరూపించాయని వారు అంటున్నారు. ఈ మూడు ఎన్నికలలోనూ ఢిల్లీవాసులు ట్రెండ్‌కు భిన్నంగా ఓటేసినట్లు వారు చెబుతున్నారు. 16 నెలలకోసారి ఓటు... 1993లో ఢిల్లీ అసెంబ్లీ ఏర్పాటైనప్పటి నుంచి ఢిల్లీలో ఇప్పటివరకూ 16 సార్లు ఎన్నికలు జరిగాయి. 1993 నుంచి ఢిల్లీ అసెంబ్లీకి ఆరు ఎన్నికలు, ఆరు లోక్షబ ఎన్నికలు, నాలుగు మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ప్రతి 16 నెలలకోసారి నగరవాసులు ఓటేశారు. బాబీ మసీదు కూల్చివేత అనంతరం జరిగిన ఈ ఎన్నికలలో ఢిల్లీవాసులు బీజేపీకి పట్టం కట్టారు. మదన్‌లాల్ ఖురానా నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. కానీ ఆ తర్వాత ఐదేళ్లకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆకాశాన్నింటిన ఉల్లిధరల నేపథ్యంలో కాంగ్రెస్‌కు అనూహ్య విజయం లభించింది. 2003, 2008 ఎన్నికల్లో రెండుసార్లు షీలా దీక్షిత్‌కి పట్టం కట్టారు.అలాగే 2013 అసెంబ్లీ ఎన్నికలకలో ఏడాది కింద ఏర్పాటు అయిన ఆప్ పార్టీకి 70 అసెంబ్లీ స్థానాల్లో 28 సీట్లు ఇచ్చారు. వరుసగా మూడసార్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు కేవలం 8 సీట్లు మాత్రమే లభించాయి. 2015 ఎన్నికలలో ఢిల్లీవాసులు కాంగ్రెస్ కు మొండిచేయి చూపించారు. బీజేపీకి మూడు సీట్లు మాత్రమే కట్టబెట్టారు. ఆప్ కు 70 అసెంబ్లీ సీట్లలో 67 సీట్లు అప్పగించారు. 1996, 1998,1999 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి ఓటేసిన స్థానికులు ఆ తర్వాత రెండు లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. 2004 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌కు ఏడింటిలో ఆరు ఎంపీ సీట్లు దక్కగా, 2009 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం ఏడు సీట్లు కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పూర్తి విరుద్ధమైన తీర్పు ఇస్తూ ఏడు సీట్లు బీజేపీకి కట్టబెట్టారు. కాంగ్రెస 1... బీజేపీ...3... 1997 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్‌కు అధికారాన్ని కట్టబెట్టిన ఢిల్లీవాసులు అనంతరం మూడు ఎమ్సీడీ ఎన్నికలలో బీజేపీకి ఓటు వేశారు. 2012లో ఢిల్లీలోనూ, కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ ఢిల్లీవాసులు ముచ్చటగా మూడోసారి కూడా బీజేపీకే అధికారం ఇచ్చారు.