Deputy Mayor
-
గుంటూరులో టీడీపీ నేత దాష్టీకం
లక్ష్మీపురం: టీడీపీ దౌర్జన్యాలు మితిమీరుతున్నాయి. గుంటూరు డిప్యూటీ మేయర్, తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి వనమాల వజ్రబాబు (డైమండ్ బాబు) సోదరి నివాసం ఉంటున్న ఇంటిని ఆక్రమించేందుకు యత్నించిన ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయిబాబారోడ్డు శాంతినగర్ 2వ లైన్లో డైమండ్ బాబు సోదరి పతకమూరి వజ్రకుమారి 2008 నుంచి నివాసం ఉంటున్నారు. ఆమె భర్త సీతారామయ్య 2012లో అనారోగ్యంతో మృతి చెందారు. వజ్రకుమారి పక్షవాతం బారినపడి చికిత్స పొందుతోంది. ఆమె ఉంటున్న ఇంటి స్థలానికి సంబంధించి పాములూరి రామయ్య, పత్రి ఆనంద్‌మోహన్ అనే వారిమధ్య కోర్టులో వివాదం నడుస్తోంది. కాగా.. యనమల విజయ్‌కిరణ్ అనే వ్యక్తి అధికార పార్టీ అండదండలతో పేరం వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వద్ద ఆ స్థలాన్ని కొనుగోలు చేశానంటూ నకిలీ దస్తావేజులను సృష్టించి ఆదివారం మధ్యాహ్నం వజ్రకుమారి, కొడుకు కిరణ్‌కుమార్, కుమార్తె రాణి, కోడలు రమ్య భోజనం చేస్తున్న సమయంలో మాస్క్‌లు ధరించిన మహిళలు నాలుగు ఆటోల్లో వచ్చి ఆ ఇంట్లోకి చొరబడ్డారు. వజ్రకుమారి కుటుంబ సభ్యుల నుంచి తినే కంచాలను లాగేసుకుని అందరినీ ఇంటినుంచి లాక్కొచ్చి బయటకు గెంటేశారు. గృహోపకరణాలు సైతం బయట పడేసి దాడిచేసి గాయపరిచారు. దీంతో బాధితురాలు వజ్రమ్మ, కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం టీడీపీ నేత విజయ్‌కిరణ్ అనుచరులైన ఇద్దరు మహిళలు, ముగ్గురు యువకులు ఆ ఇంట్లోకి చొరబడి తలుపులు వేసుకున్నారు. ఈవిషయం తెలుసుకున్న నగర డిప్యూటీ మేయర్ డైమండ్‌బాబు పట్టాభిపురం సీఐ, వెస్ట్ డీఎస్పీ, జిల్లా ఎస్పీలకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి బాధితురాలు కుటుంబ సభ్యులు రోడ్డుపై కన్నీటి పర్యంతమై జరిగిన విషయాన్ని చెప్పారు. దీంతో పోలీసులు విజయ్‌కిరణ్ అనుచరులను అక్కడినుంచి పంపించేశారు. అనంతరం అక్కడకు చేరుకున్న డిప్యూటీ మేయర్ డైమండ్‌బాబును సీఐ వీరేంద్ర వెళ్లిపోవాలని బలవంతం చేశారు. దీంతో డైమండ్‌బాబు తన సోదరి ఇంటిని కబ్జా చేసిన వారికి పోలీసులు బందోబస్తు కల్పించడం సరికాదని, వారందరినీ బయటకు పంపించాలని సీఐ వీరేంద్రను కోరా>రు. తామే ఆ ఇంటిని ఖాళీ చేయించామని, మీరు ఇక్కడ ఉండటం కుదరదన్నారు. తన సోదరి కుటుంబాన్ని రోడ్డుపై కూర్చోబెట్టడం సరికాదని డైమండ్‌బాబు అనటంతో సీఐ వీరేంద్ర ఆయనను బలవంతంగా జీప్ ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. సమాచారం తెలుసుకున్న మేయర్ కావటి మనోహర్‌నాయుడు, ఈస్ట్ ఇన్చార్జి నూరిఫాతిమా, పొన్నూరు నియోజకవర్గ ఇన్చార్జి అంబటి మురళీకృష్ణ, పలువురు కార్పొరేటర్లు పట్టాభిపురం స్టేషన్‌కు చేరుకున్నారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ జోక్యంతో డైమండ్‌బాబును విడిచి పెట్టారు. కబ్జాదారుడికి పోలీసులు వత్తాసు పలకడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
సీనియర్ , డిప్యూటీ మేయర్ బీజేపీ కైవసం
చండీగఢ్: సర్వోన్నత న్యాయస్థానం జోక్యంతో చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో భంగపాటుకు గురైన బీజేపీ చివరకు సీనియర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో విజయబావుటా ఎగరేసింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆప్ అభ్యరి్ధకి పడిన 8 ఓట్లను చెల్లనివిగా ప్రకటించి బీజేపీ నేత మేయర్ అయ్యేలా చేసిన రిటరి్నంగ్ అధికారిపై సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన దరిమిలా చండీగఢ్ సీనియర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు సైతం అందరి దృష్టినీ ఆకర్షించాయి. సోమవారం జరిగిన ఎన్నికల్లో బీజేపీ రెండు విజయాలను నమోదుచేసుకుంది. ఫిబ్రవరి 19వ తేదీన ముగ్గురు ఆప్ కౌన్సిలర్లు బీజేపీలో చేరడంతో 35 సభ్యులుండే మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ బలం మరింత పెరిగింది. దీంతో సీనియర్ మేయర్ ఎన్నికల్లో ఆప్ మద్దతు పలికిన కాంగ్రెస్ అభ్యర్థి గుర్ప్రీత్ గబీపై బీజేపీ అభ్యర్థి కుల్జీత్ సంధూ విజయం సాధించారు. డెప్యూటీ మేయర్ ఎన్నికల్లోనూ ఆప్ మద్దతు పలికిన కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలా దేవిపై బీజేపీ అభ్యర్ధి రాజీందర్ శర్మ గెలిచారు. -
ప్రజల మధ్యనే ఉంటూ.. తిరుపతి అభివృద్ధికి శ్రమిస్తూ..
తిరుపతి: టెంపుల్ సిటీగా తిరుపతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేశ విదేశాల్లోనూ తిరుపతి వైపు అందరి చూపు ఉంటుంది. అలాంటి తిరుపతిలో డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ చేస్తున్న అభివృద్ధి అంతా ఇంతా కాదు. ప్రతిపక్షాలే ముక్కున వేలేసుకునే స్థాయిలో అభివృద్ధి జరుగుతోంది. ఇదంతా ఎవరో కాదు చెప్పేది, తిరుపతి స్థానికులే చెబుతున్నారు. బుధవారం అభినయ్ పుట్టినరోజు సందర్భంగా తిరుపతి నగరమంతా పలు వేడుకలు, అన్న దాన, రక్త దాన, సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్బంగా స్థానిక ప్రజలు మాట్లాడుతూ.. అభినయ్ ని మరెన్నో ఉన్నత పదవుల్లో చూడాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ, గడప గడపకు తిరుగుతూ వారి సమస్యలు పరిష్కరిస్తూ నిరంతర శ్రామికుడిగా పేరు తెచ్చుకుంటున్నారు అని భూమన అభినయ్ ని కొనియాడారు. 'మీ అందరి ఆశీర్వాదమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. మీ ఇంటి బిడ్డగా కష్టాల్లో, సుఖాల్లో ఎప్పటికీ నేను తోడుంటా. ప్రాణం ఉన్నంత వరకు ఎక్కడా చెడ్డ పేరు రాకుండా మన తిరుపతి గౌరవాన్ని పెంచేలా పనిచేస్తానని హామీ ఇస్తున్నా. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే ముంఖ్యమంత్రి జగన్ గారి నాయకత్వంలోనే సాధ్యం. ఆయన అడుగు జాడల్లో నడుస్తాను, తిరుపతి ప్రజలారా.. మీకు అండగా ఉంటా.. తిరుపతి ఖ్యాతిని పెంచుదాం' అంటూ అభినయ్ పిలుపునిచ్చారు. ఇదీ చదవండి: జైపూర్ ఎక్స్‌ప్రెస్ ఘటన: చేతన్ షార్ట్ టెంపర్.. అందుకే ఈ ఘోరం! -
డిప్యూటీ మేయర్‌గా ముచ్చు లయయాదవ్
విజయనగరం: విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్–1గా వైఎస్సార్ సీపీకి చెందిన 1వ డివిజన్ కార్పొరేటర్ ముచ్చు లయయాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం ఉదయం 11 గంటలకు నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సభ్యులంతా ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జేసీ మయూర్ అశోక్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్ పీవీడీ ప్రసాదరావు ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటి వరకు డిప్యూటీ మేయర్‌గా వ్యవహరించిన ఇసరపు రేవతీదేవి రాజీనామా చేయడంతో ఎన్నిక ప్రక్రియ నిర్వహించినట్టు తెలిపారు. ముచ్చు లయయాదవ్ పేరును 13వ డివిజన్ కార్పొరేటర్ ఇసరపు రేవతీదేవి ప్రతిపాదించగా 40వ డివిజన్‌కు చెందిన బోనెల ధనలక్ష్మి బలపరిచారు. ఒక్కరి పేరునే ప్రతిపాదించడంతో ఏకగ్రీవంగా ఎన్నికై నట్టు జేసీ ప్రకటించారు. ఎన్నిక పత్రాన్ని అందజేశారు. మొత్తం ఎన్నిక ప్రక్రియ 16 నిమిషాల్లోనే ముగిసింది. ఎన్నిక ప్రక్రియలో 50 మంది కార్పొరేటర్లకు 44 మంది హాజరయ్యారు. అభినందనల వెల్లువ డిప్యూటీ మేయర్–1గా ఎన్నికై న లయయాదవ్కు అభినందనలు వెల్లువెత్తాయి. నగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, ఫ్లోర్ లీడర్ ఎస్వీవీ రాజు, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు ఆశపు వేణుతో పాటు తోటి కార్పొరేటర్లు ఆమెకు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ విజయనగరం కార్పొరేషన్‌గా రూపాంతరం చెందిన తరువాత జరిగిన మొదటి ఎన్నికలో డిప్యూటీ మేయర్–1గా ముచ్చు నాగలక్ష్మి ఎన్నికయ్యారని, ఆమె మరణంతో అదే సామాజిక వర్గానికి చెందిన 13వ డివిజన్ కార్పొరేటర్ ఇసరపు రేవతీదేవి ఎన్నికయ్యారన్నారు. ఆమె వ్యక్తిగత కారణాలవల్ల పదవికి రాజీనామా చేయడంతో లయ యాదవ్‌ను ఎన్నుకున్నామన్నారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి ఆశీస్సులతో నూతన బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని లయ యాదవ్ పేర్కొన్నారు. నగర అభివృద్ధికి తన వంతు సహకరిస్తానన్నారు. -
తిరుపతిలో చారిత్రాత్మక, పురాతన కట్టడాల పరిరక్షణకు ముందడుగు
సాక్షి,తిరుపతి: తిరుపతి నగరంలోని చారిత్రాత్మకమైన, పురాతన కట్టడాలను పరిరక్షించుకోవడం కోసం, భవిష్యత్ తరాలకు వారసత్వ సంపదగా అందించడం కోసం యువనేత భూమన అభినయ్ రెడ్డి ముందడుగు వేశారు. తిరుపతి 39వ డివిజన్, చెన్నారెడ్డి కాలనీలో ఓ పురాతనమైన కొలను ఉంది. సుమారు 400 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ దేవరాయలు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులు సేద తీరడం కోసం, స్నానాలు చేయడం కోసం ఈ కొలను నిర్మించారు. ఈ కొలనుకు కృష్ణంనాయుడి గుంటగా వాడుకలోకి వచ్చింది. అయితే కాలక్రమేణా ఈ కొలను అన్యాక్రాంతం అవుతూ వచ్చింది. 2018 టీడీపీ హయాంలో వైఎస్సార్ కుటుంబం కార్యక్రమంలో భూమన కరుణాకర్ రెడ్డి చెన్నారెడ్డి కాలనీలో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా కృష్ణంనాయుడి గుంట కబ్జా కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి చేస్తామని చెప్పిన విధంగా ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి, డిప్యూటీ మేయర్ అభినయ్‌రెడ్డి ఆ గుంటను అభివృద్ధి పరచడానికి కౌన్సిల్లో చర్చించారు. నిధులు మంజూరు చేసి మరమ్మతులు ప్రారంభించారు. తాజాగా మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణంతో పాటు పురాతన కట్టడాలను పరిరక్షించడం కోసం అడుగులు వేశామని భూమన అభినయ్ తెలిపారు. శ్రీకృష్ణంనాయుడి గుంట పరిరక్షణకు మొదటి విడతగా 57 లక్షలు మంజూరు చేసిన కౌన్సిల్, మలి విడతగా మరో 50 లక్షలను ఇవ్వడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారని పేర్కొన్నారు. కొలనులో పూడికతీతతో పాటు ప్రహరీగోడ, పచ్చదనం పెంపొందించేలా మొక్కలు నాటి, సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు ఆయన చెప్పారు. -
ఎంసీడీ భేటీకి ఎల్జీ ఓకే
న్యూఢిల్లీ: రెండుసార్లు సమావేశమైనా మేయర్‌ను ఎన్నుకోకుండానే అర్ధాంతరంగా వాయిదాపడిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) భేటీని ఈసారి 6వ తేదీన నిర్వహించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనా అనుమతి ఇచ్చారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ఎల్జీ∙ఆమోదం తెలిపారని ఉన్నతాధికారులు బుధవారం చెప్పారు. ఇటీవలి ఎంసీడీ ఎన్నికల్లో 250 స్థానాలకుగాను ఆప్ 134 చోట్ల, బీజేపీ 104 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెల్సిందే. అయితే, మేయర్, డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకునేందుకు ఎంసీడీ జనవరి 6, 24వ తేదీల్లో సమావేశమైన సందర్భంగా కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదంచోటుచేసుకున్న విషయం విదితమే. -
గయ డిప్యూటీ మేయర్‌గా పారిశుద్ధ్య కార్మికురాలు
పట్నా: పారిశుద్ధ్య కార్మికురాలిని డిప్యూటీ మేయర్ పదవికి ఎన్నుకోవడం ద్వారా బిహార్‌లోని గయ మున్సిపాలిటీ ప్రజలు చరిత్ర సృష్టించారు. చింతాదేవి గత 40 ఏళ్లుగా మున్సిపాలిటీలో స్కావెంజర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈమె 16వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. 1996లో కూడా గయ ప్రజలు ముసాహిర్ వర్గానికి చెందిన రాళ్లు కొట్టుకునే భగవతీదేవి అనే సాధారణ మహిళను లోక్‌సభకు పంపారు. -
చరిత్ర సృష్టించిన చింతాదేవి.. డిప్యూటీ మేయర్‌గా..
ఒక సామాన్యురాలు అసామాన్య విజయం సాధిస్తే.. అది చరిత్ర సృష్టించినట్లే కదా!. పారిశుద్ధ్య కార్మికురాలు చింతాదేవి Chinta Devi ఆ జాబితాలోకి చేరిపోయారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఘన విజయం సాధించిన ఆమె.. ఇప్పుడు డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. బీహార్ గయలో తాజాగా ఈ పరిణామం చోటు చేసుకుంది. నలభై ఏళ్ల చరిత్ర ఉన్న గయ మున్సిపాలిటీలో చింతాదేవి విజయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పబ్లిక్ టాయిలెట్లు తక్కువగా ఉండే ఆ ప్రాంతంలో ఒకప్పుడు బహిరంగ మలవిసర్జన అధికంగా ఉండేది. చింతాదేవి అదంతా ఊడ్చి శుభ్రం చేసి, ఎత్తి దూరంగా తీసుకెళ్లి పారబోసే పనిని చేశారు. ఆ తర్వాత రోడ్లు ఊడవడం, డ్రైనేజీలు, మ్యాన్‌హోల్స్‌కు శుభ్రం చేస్తూ వస్తున్నారు. అలాంటి చింతాదేవి ఎన్నికల్లో పోటీ చేసి.. ఘన విజయం సాధించారు. ప్రజలకు నిత్యం చేరువగా ఉండడంతోనే తనకు ఈ విజయం దక్కి ఉంటుందని ఆమె భావిస్తున్నారు. బహుశా ప్రపంచంలో ఇలాంటి విజయం ఎవరూ సాధించి ఉండబోరని, ఇది చారిత్రక ఘట్టమని గయ నూతన మేయర్ గణేష్ పాశ్వాన్ ఆమెను ఆశీర్వదించారు. అంతేకాదు.. మాజీ డిప్యూటీ మేయర్ మోహన్ శ్రీవాస్తవ సైతం ఆమె అభ్యర్థిత్వాన్ని బలపర్చడం గమనార్హం. పారిశుద్ధ్య కార్మికురాలిగానే కాదు.. మిగతా టైంలో ఆమె కూరగాయలు అమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నారు. బుద్ధుడి జ్క్షానోదయ ప్రాంతంగా పేరున్న గయలో.. ఇలాంటి గెలుపు కొత్తేం కాదు. 1996 సార్వత్రిక ఎన్నికల్లో రాళ్లు కొట్టి జీవనం కొనసాగించే భగవతి దేవి ఏకంగా పార్లమెంట్‌కు ఎన్నికై చరిత్ర నెలకొల్పారు. అంటరాని కులంగా పేరున్న ముసహార్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. జేడీయూ పార్టీ తరపున పోటీ చేసి ఆమె నెగ్గారు. -
మౌలిక వసతులు, పారిశుధ్యానికి పెద్దపీట వేస్తున్నాం: మేయర్
-
తమిళనాడు: మేయర్లు, డిప్యూటీ మేయర్ల జాబితా
చెన్నై: తమిళనాడు కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార డీఎంకే పార్టీ సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. రాష్ట్రంలోని 21 కార్పొరేషన్లను డీఎంకే కైవసం చేసుకుంది. అయితే కుంభకోణం నగర మేయర్ పదవిని కాంగ్రెస్‌కు కట్టబెట్టింది. దీంతో 20 నగరాల్లో డీఎంకే అభ్యర్థులు మేయర్లుగా ఎన్నికయ్యారు. ఆరు డిప్యూటీ మేయర్ల స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించింది. మేయర్లు, డిప్యూటీ మేయర్ల పూర్తి జాబితా మీ కోసం... నగరం మేయర్ డిప్యూటీ మేయర్ చెన్నై ప్రియా రాజన్ (డీఎంకే) మహేశ్ కుమార్ (డీఎంకే) కోయంబత్తూర్ కల్పన (డీఎంకే) వెట్రిసెల్వన్ (డీఎంకే) మదురై ఇంద్రాణి (డీఎంకే) నాగరాజన్ (సీపీఎం) తిరుచ్చి అన్బళగన్ (డీఎంకే) రాజు (డీఎంకే) సేలం రామచంద్రన్ (డీఎంకే) శారదా దేవి తిరుపూర్ దినేశ్ కుమార్ (డీఎంకే) బాలసుబ్రమణ్యం(సీపీఐ) ఈరోడ్ నాగరత్నం (డీఎంకే) సెల్వరాజ్(డీఎంకే) తూత్తుకుడి జగన్ (డీఎంకే) జెనిట్టా సెల్వరాజ్(డీఎంకే) ఆవడి ఉదయ్‌కుమార్(డీఎంకే) - తాంబరం వసంతకుమారి(డీఎంకే) కామరాజ్(డీఎంకే) కాంచీపురం మహాలక్ష్మి (డీఎంకే) కుమారగురునాథన్(కాంగ్రెస్) కడళూర్ సుందరి (డీఎంకే) తామరైసెల్వన్ (వీసీకే) తంజావూర్ రామనాథన్ (డీఎంకే) అంజుగమ్ (డీఎంకే) కరూర్ కవితా గణేశన్ (డీఎంకే) తరణి శరవణన్ (డీఎంకే) హోసూర్ ఎస్ఏ సత్య (డీఎంకే) ఆనందయ్య (డీఎంకే) దిందిగల్ ఐలమతి (డీఎంకే) రాజప్ప (డీఎంకే) శివకాశి సంగీత (డీఎంకే) విఘ్నేష్ ప్రియ (డీఎంకే) నాగర్ కోయిల్ మహేశ్ (డీఎంకే) మేరీ ప్రిన్సీ లత (డీఎంకే) వేలూరు సుజాత (డీఎంకే) సునీల్ కుమార్ (డీఎంకే) తిరునల్వేలి పీఎం శరవణన్(డీఎంకే) కె. రాజు (డీఎంకే) కుంభకోణం శరవణన్ (కాంగ్రెస్) తమిళగన్(డీఎంకే) -
సైకిల్ పైనే ఆఫీసుకు అనంతపురం డిప్యూటీ మేయర్
-
కాకినాడలో విజయం ‘కేక’.. భంగపడ్డ టీడీపీ
కాకినాడ: కాకినాడ నగరపాలక సంస్థ రెండో డిప్యూటీ మేయర్‌గా వైఎస్సార్సీపీ బలపరిచిన 17వ వార్డు కార్పొరేటర్ చోడిపల్లి సత్యప్రసాద్ (ప్రసాద్ మాస్టార్) అత్యధిక మెజారీ్టతో విజయకేతనం ఎగురవేశారు. నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో బుధవారం ఉదయం 11 గంటలకు ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ జరిగింది. కౌన్సిల్ ఎక్స్ అఫిషియో సభ్యులు మంత్రి కురసాల కన్నబాబు, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డితోపాటు 35 మంది కార్పొరేటర్లు సమావేశానికి హాజరయ్యారు. చేతులెత్తే పద్ధతిలో ఓటింగ్ నిర్వహించగా వైఎస్సార్ సీపీ బలపరిచిన చోడిపల్లి సత్యప్రసాద్‌కు 25 మంది కార్పొరేటర్లు అనుకూలంగా ఓటు వేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని వాసిరెడ్డి రామచంద్రరావు ప్రతిపాదించగా ఎంజీకే కిషోర్ బలపరిచారు. టీడీపీ తరఫున పలివెల రవి అనంతకుమార్‌ను ఆ పార్టీ కార్పొరేటర్ ఒమ్మి బాలాజీ ప్రతిపాదించగా మేయర్ సుంకరపావని బలపరిచారు. పలివెల రవికి మద్దతుగా 10 మంది చేతులెత్తి ఓటింగ్‌లో పాల్గొన్నారు. దీంతో 25 ఓట్లు దక్కించుకున్న చోడిపల్లి ప్రసాద్ నగరపాలక సంస్థ రెండో డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైనట్టు జేసీ లక్ష్మీశ ప్రకటించారు. ఫారమ్ ఏ, బీలలోనూ టీడీపీ వైఫల్యం టీడీపీలో అవగాహన రాహిత్యం మరోసారి బయటపడింది. 24 గంటల ముందు విప్‌జారీ చేయాల్సి ఉండగా చివరి నిమిషంలో లేఖను ఎన్నికల అధికారికి అందజేశారు. దీనిపై ఎన్నికల అధికారి స్పందిస్తూ నిబంధనల ప్రకారం 24 గంటల ముందుగా లేఖ ఇవ్వనందున విప్ చెల్లదని స్పష్టం చేశారు. పార్టీ అభ్యరి్థకి సంబంధించిన ఇతర వివరాలతో కూడిన లేఖ ఒరిజనల్ ఇవ్వకుండా నకలు ఇచ్చినందున తిరస్కరిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఉదయాన్నే పోటీలో నిలవడం, పత్రాలన్నీ గందరగోళంగా ఉండడం, పార్టీ తీరుతో వ్యతిరేకించి మరో అభ్యరి్థకి మద్దతుగా నిలవడం వంటి సంఘటనలు టీడీపీ అనైక్యతను బయటపెట్టాయి. మేయర్ అవగాహనా రాహిత్యం డిప్యూటీమేయర్ ఎన్నికలో మేయర్ సుంకరపావని ఆవగాహన రాహిత్యం బయటపడింది. నాలుగేళ్లపాటు మేయర్‌గా ఉన్నా కౌన్సిల్ నిబంధనలు, ఎన్నికల ప్రక్రియపై ఆమెకు అవగాహన కొరవడిన తీరుచూసి కార్పొరేటర్లు ముక్కున వేలేసుకున్నారు. ఎన్నిక సందర్భంలో మేయర్‌గా తనకు ప్రత్యేక స్థానం కేటాయించాలని ఎన్నిక అధికారిని పట్టుబట్టారు. నిబంధనల ప్రకారం ఎన్నికల అధికారి అధ్యక్షత వహిస్తారని, మిగిలినవారంతా కింద వరుస క్రమంలో కూర్చోవాలని ఆయన నిబంధనలను వివరించాల్సి వచ్చింది. అలాగైతే తాను నిలబడే ఉంటానంటూ చేసిన వ్యాఖ్యానం కార్పొరేటర్లను, అధికారులను విస్మయపరిచింది. సమర్థతకు దక్కిన ‘డిప్యూటీ’ పీఠం కాకినాడ: ప్రజా సమస్యలపై, కార్పొరేషన్ చట్టాలపైన సంపూర్ణ అవగాహన కలిగిన సమర్థుడైన వ్యక్తికి ఉప మేయర్ పదవి దక్కడం జిల్లా ప్రగతికి శుభపరిణామమని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడలో డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తయిన అనంతరం ఎమ్మెల్యే ద్వారంపూడితో కలిసి బుధవారం విలేకర్లతో మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా కార్పొరేటర్లంతా ఐక్యతతో ఉండి అభివృద్ధి కోసం ఒక అవగాహన కలిగిన ప్రసాద్మాస్టార్ వంటి వ్యక్తిని ఎన్నుకున్న తీరు భవిష్యత్‌కు శుభసూచికమని పేర్కొన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ బీసీ వాడబలిజ వర్గానికి చెందిన వ్యక్తికి రాజకీయంగా మంచి ప్రాధాన్యత లభించిందని, ఇందుకు సహకరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు చెప్పారు. 35 మంది కార్పొరేటర్లతో గతంలో అధికారంలో ఉన్న పార్టీ చోడిపల్లిని గుర్తించకపోయినా సీఎం గుర్తించి డిప్యూటీమేయర్గా చేశారన్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మేయర్ సుంకర పావని తీరును వ్యతిరేకిస్తూ అంతా ఒక్కటై ఐక్యత కనబరిచారని ద్వారంపూడి పేర్కొన్నారు. ఉప మేయర్‌గా ఎన్నికైన చోడిపల్లి ప్రసాద్ మాట్లాడారు. ఉప మేయర్ జీవిత వివరాలు పేరు : చోడిపల్లి సత్యప్రసాద్ (ప్రసాద్ మాస్టారు) వయసు : 56 చదువు : బీఏ, బీఈడీ నేపథ్యం : 1995 నుంచి రెండుసార్లు కౌన్సిలర్‌గా, రెండుసార్లు కార్పొరేటర్‌గా నాలుగుసార్లు వరుస విజయాలు. తండ్రి చోడిపల్లి రామం 1982లో కౌన్సిలర్‌గా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓటమి. చిన్నాన్న హనుమంతరావు స్వాతంత్య్ర సమరయోధులు. నాలుగుసార్లు గెలిచినా వనమాడి అవకాశం దక్కనీయలేదు. వాడబలిజలకు దక్కిన అవకాశం డిప్యూటీ మేయర్ ఎన్నికలో వాడబలిజలకు సముచిత గౌరవం దక్కింది. కాకినాడ చరిత్రలో ఇదొక మంచి పరిణామమంటూ రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. దాదాపు 40వేల మంది మత్స్యకారులు ఉన్న కాకినాడలో 50శాతం వాడబలిజలు ఉన్నారు. ఇన్నాళ్ల రాజకీయ చరిత్రలో గతంలో ఎప్పుడూ ఈ వర్గానికి గుర్తింపు దక్కిన దాఖలా లేదు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కొద్దినెలల క్రితమే అగి్నకుల క్షత్రియ వర్గానికి చెందిన బంధన హరికి రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. ఇప్పుడు వాడబలిజలకు డిప్యూటీమేయర్ దక్కింది. మత్స్యకార వర్గం నుంచి ప్రాతినిథ్యం వహించిన టీడీపీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తన హయాంలో ఈ వర్గాలు రాజకీయంగా ఎదగకుండా అణగదొక్కే ప్రయతి్నంచారనే విమర్శలున్నాయి. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి చొరవతో వాడబలిజకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి డిప్యూటీమేయర్ కట్టబెట్టేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం ద్వారా ఆ వర్గానికి వైఎస్సార్ సీపీ ఎలాంటి ప్రాధాన్యతనిస్తోందో చెప్పకనే చెప్పింది. బెడిసికొట్టిన చివరి క్షణ నిర్ణయం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికకు దూరంగా ఉంటామని తొలుత ప్రకటించిన టీడీపీ చివరి నిముషంలో తన వైఖరిని మార్చుకుని పోటీలో నిలబడింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు పార్టీ అధినేత నుంచి గట్టిగా మందలింపురావడతో పోటీ చేయాలని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారు. వనమాడి వ్యవహారశైలి, నియంతృత్వ పోకడలపై అసంతృప్తిగా ఉన్న అనేక మంది టీడీపీ కార్పొరేటర్లు వ్యతిరేకంగా ఓటు చేయడంతోపాటు మరికొంత మంది సమావేశానికి హాజరుకాలేదు. -
ఓటమి భయంతో కాకినాడలో తోక ముడిచిన టీడీపీ
కాకినాడ: నగరపాలక సంస్థ రెండో డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఓటమి భయంతో టీడీపీ ముందే తోక ముడిచింది. ఈ ఎన్నికలో తమ పార్టీ పాల్గొనడం లేదంటూ ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మంగళవారం ప్రకటించారు. రెండో డిప్యుటీ మేయర్ ఎన్నికకు ప్రభుత్వం జీఓ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాకినాడ కార్పొరేషన్లో రాజకీయం రసకందాయంలో పడింది. నాటి ఎన్నికల్లో టీడీపీకి 32 మంది కార్పొరేటర్లతో మేయర్ స్థానాన్ని దక్కించుకుంది. మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఒంటెద్దు పోకడలు, పార్టీ పట్ల అంకిత భావంతో పని చేసే వారిపై వ్యవహరిస్తున్న నిరంకుశ వైఖరితో చాలాకాలంగా టీడీపీ కార్పొరేటర్లు అసమ్మతితో రగిలిపోతున్నారు. ఆయన విధానాలు నచ్చక టీడీపీ మాజీ నగర అధ్యక్షుడు నున్న దొరబాబు ఇప్పటికే పార్టీకి దూరమయ్యారు. తాజాగా మెజార్టీ కార్పొరేటర్లు కూడా బయటకొచ్చేశారు. ప్రస్తుతం మేయర్‌తో కలిపి పది మందికి మించి కార్పొరేటర్లు కూడా ఆ పారీ్టలో లేరు. రాజకీయాలతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై తామంతా ఏకతాటిపై పని చేస్తామంటూ వైఎస్సార్ సీపీ, బీజేపీ, టీడీపీ కార్పొరేటర్లు ఏకాభిప్రాయానికి వచ్చారు. వారు తమ నిర్ణయాన్ని మీడియా ముందు ప్రకటించడంతో టీడీపీ కుడితిలో పడ్డ ఎలుక మాదిరిగా తయారైంది. దీంతో ఎన్నికలకు ముఖం చాటేయాలనే నిర్ణయానికి వచ్చింది. సంక్షేమానికి జై .. కాకినాడలోని 45 మంది కార్పొరేటర్లలో 35 మంది ఒక్కటిగా కలిసి ఉంటామంటూ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సమక్షంలో మంగళవారం మీడియా ముందు ప్రకటించారు. 2017 ఎన్నికల్లో 48 డివిజన్లకు ఎన్నికలు జరగగా టీడీపీ 32, వైఎస్సార్ సీపీ 10, బీజేపీ 3, ఇండిపెండెంట్లు ముగ్గురు గెలిచారు. ముగ్గురు మృతి చెందగా ప్రస్తుతం 45 మంది ఉన్నారు. వీరిలో 35 మంది పార్టీ రహితంగా జగన్‌కు జై కొట్టారు. మేయర్ సుంకర పావని సహా 10 మంది మాత్రమే టీడీపీ పక్షాన నిలిచారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు నియంతృత్వ పోకడలతో విసుగెత్తిపోయమని.. సీఎం సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తామంతా మద్దతుగా నిలిచామని ప్రకటించారు. వైఎస్సార్ సీపీకి జై కొట్టిన వీరందరూ బుధవారం రెండో డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఏకతాటిపై ఉండాలని నిర్ణయించుకున్నారు. తామంతా ముఖ్యమంత్రి నాయకత్వంలో ద్వారంపూడికి మద్దతుగా పని చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. రెండో డిప్యూటీ మేయర్ ఎన్నిక బుధవారం ఉదయం 11 గంటలకు జరగనుంది. ఎన్నికల అధికారిగా జాయింట్ కలెక్టర్ వ్యవహరించనున్నారు. -
YSRCongress Party: చేతల్లో సామాజిక న్యాయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ సామాజిక న్యాయాన్ని మరోమారు చేతల్లో చూపించింది. సంక్షేమ పథకాలే కాదు.. పదవుల పంపకాల్లోనూ బడుగు, బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యమిస్తామని రుజువు చేసింది. నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ పనుల్లోనూ వారికే ప్రాధాన్యమిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలోని నగరపాలక, పురపాలక సంస్థల పాలక వర్గాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సముచిత స్థానం లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా గత మార్చిలో ఎన్నికలు నిర్వహించిన 12 మునిసిపల్ కార్పొరేషన్లు, 74 మునిసిపాలిటీల్లో శుక్రవారం రెండో డిప్యూటీ మేయర్, రెండో వైస్ చైర్పర్సన్ ఎన్నిక నిర్వహించారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరులో కోరం లేక రెండో మునిసిపల్ వైస్ చైర్పర్సన్ ఎన్నికను శనివారానికి వాయిదా వేశారు. నగరపాలక సంస్థల్లో రెండో డిప్యూటీ మేయర్, పురపాలక సంఘాల్లో రెండో వైస్ చైర్పర్సన్ పదవులకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నగర, పట్టణ ప్రజలకు మరింతగా మెరుగైన సేవలందించేందుకు ఈ పదవులను సృష్టిస్తూ మునిసిపల్ చట్టాన్ని కూడా సవరించింది. ఆ మేరకు రెండో డిప్యూటీ మేయర్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక నిర్వహించేందుకు మునిసిపల్ పాలక మండళ్లు ప్రత్యేకంగా సమావేశమయ్యాయి. రాష్ట్రంలో 85 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు పదవులను దక్కించుకున్నారు. వీరిలో బీసీ, మైనార్టీలు 24 మంది, ఎస్సీలు 22 మంది, ఎస్టీలు ఇద్దరు ఉన్నారు. ఈ లెక్కన 56 శాతం మేర బడుగు, బలహీన వర్గాలకు చెందిన మొత్తం 48 మంది రెండో డిప్యూటీ మేయర్/వైస్ చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేయగా, 37 మంది ఓసీ కేటగిరి నుంచి ఆ స్థానాలు పొందారు. కాగా, అనంతపురం జిల్లా తాడిపత్రి మునిసిపాలిటీలో టీడీపీ మద్దతుదారుడు రెండో వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. కేటాయింపునకు మించి.. వైఎస్సార్సీపీ గెలుపొందిన 12 మేయర్, 74 మునిసిపల్ చైర్పర్సన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 67 పదవులను కేటాయించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుంది. నిజానికి చట్టప్రకారం 45 పదవులు కేటాయిస్తే సరిపోతుంది. కానీ జనరల్ కేటగిరిలోనూ బలహీన వర్గాలకు సీట్లు ఇచ్చి ప్రాధాన్యం కల్పించారు. 2019 ఎన్నికల్లో 60 శాతం సీట్లు ఇవ్వడమే కాకుండా మంత్రి వర్గంలోనూ 56 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించారు. అంతేకాకుండా 137 నామినేటెడ్ పదవుల్లో 58 శాతం మేర 79 పదవులు ఇచ్చారు. నామినేషన్ పనుల్లో 50 శాతం వారికి కేటాయించడంతో పాటు, వాటిలోనూ సగం మహిళలకే ఇవ్వాలని చట్టం చేసి సామాజిక న్యాయ సాధన దిశగా కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల్లో ఒక మహిళ సహా నలుగురు ఈ వర్గాలకు చెందిన వారే ఉన్నారు. 15 ఎమ్మెల్సీ పదవుల్లో బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకే 11 కేటాయించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ 60 శాతం టికెట్లు, మున్సిపల్ మేయర్, చైర్ పర్సన్ పదవుల్లో 78 శాతం, వీటిలో 60.46 శాతం మహిళలకు ఇచ్చి రికార్డు సృష్టించారు. బీసీల కోసం ఇదివరకెన్నడూ లేని విధంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్లు తీసుకువచ్చి సామాజిక న్యాయానికి అసలైన నిర్వచనాన్ని చేతల్లో చూపించారు. ఏలూరు మేయర్ ఎన్నిక ఏకగ్రీవం ఏలూరు టౌన్: ఏలూరు కార్పొరేషన్ నూతన మేయర్‌గా బీసీ మహిళ షేక్ నూర్జహాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం నిర్వహించిన ఎన్నిక కార్యక్రమంలో మొదటి డిప్యూటీ మేయర్‌గా గుడిదేశి శ్రీనివాసరావు, రెండో డిప్యూటీ మేయర్‌గా నూకపెయ్యి సుధీర్‌బాబు, విప్‌గా పైడి భీమేశ్వరరావులను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏలూరు కార్పొరేషన్ ప్రత్యేకాధికారి, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా కొత్తగా కొలువుదీరిన పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా, నూర్జహాన్ మేయర్‌గా ఎన్నిక కావడం ఇది రెండోసారి. కోర్టు తీర్పు కారణంగా ఇక్కడ ఇటీవలే ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించిన విషయం తెలిసిందే. -
నేడు రెండో డిప్యూటీ మేయర్/వైస్ చైర్పర్సన్ ఎన్నిక
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో మార్చిలో ఎన్నికలు నిర్వహించిన 12 మునిసిపల్ కార్పొరేషన్లు, 75 మునిసిపాలిటీల్లో నేడు (శుక్రవారం) రెండో డిప్యూటీ మేయర్/వైస్ చైర్పర్సన్ ఎన్నికను నిర్వహించనున్నారు. నగరపాలక సంస్థల్లో రెండో డిప్యూటీ మేయర్, పురపాలక సంఘాల్లో రెండో వైస్ చైర్పర్సన్ పదవులకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం కొన్ని నెలల కిందట నిర్ణయం తీసుకుంది. పట్టణ ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు ఈ పదవులను సృష్టిస్తూ మునిసిపల్ చట్టాన్ని సవరించింది. ఆ మేరకు రెండో డిప్యూటీ మేయర్/వైస్ చైర్పర్సన్ ఎన్నిక నిర్వహించేందుకు శుక్రవారం మునిసిపల్ పాలకమండళ్లను ప్రత్యేకంగా సమావేశపరుస్తున్నారు. -
ఏపీలో శుక్రవారం కొలువుదీరనున్న రెండో డిప్యూటీ మేయర్లు. వైస్ చైర్మన్లు
-
ఈ నెల 30న ఏలూరు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక
సాక్షి, అమరావతి: ఈ నెల 30న ఏలూరు మేయర్, ఇద్దరు డిప్యూటీ మేయర్ల ఎన్నికలకి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అదే రోజు రాష్ట్రంలోని 11 కార్పోరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో రెండవ డిప్యూటీ మేయర్, రెండవ వైస్ చైర్మన్ ఎంపికకి ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. పరోక్ష పద్దతిలో రెండవ డిప్యూటీ మేయర్, రెండవ వైస్ చైర్మన్ ఎంపిక ఉంటుందని ఎస్ఈసీ పేర్కొంది. 30వ తేదీ ప్రత్యేక సమావేశాలకి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, కార్పోరేషన్ అధికారులను ఎస్ఈసీ ఆదేశించింది. ఎంపికైన కార్పోరేటర్లు, కౌన్సిలర్లు, ఎక్స్ అఫిషియో మెంబర్లకి ఈ నెల 26 లోపు సమాచారమివ్వాలని ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్పోరేషన్లు, మున్సిపాలిటీలలో ఇద్దరు డిప్యూటీ మేయర్లు, ఇద్దరు వైస్ చైర్మన్లను నియమించుకునేలా ఇప్పటికే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. రెండవ డిప్యూటీ మేయర్, రెండవ వైస్ చైర్మన్ల ఎంపిక చేపట్టాలని ఎస్ఈసీని ప్రభుత్వం కోరడంతో ప్రత్యేక సమావేశం నిర్వహణకి నోటిఫికేషన్ జారీ చేసింది. -
వరంగల్ మేయర్‌గా గుండు సుధారాణి ఎన్నిక
-
వరంగల్, ఖమ్మం మేయర్లు వీరే..
సాక్షి, ఖమ్మం: గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తయ్యింది. అనుకున్నట్లుగానే కమ్మ సామాజిక వర్గానికే ఖమ్మం మేయర్ పదవి దక్కింది. 26వ డివిజన్ నుంచి గెలిచిన పునుకొల్లు నీరజ ఖమ్మం మేయర్‌గా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ పదవి మైనార్టీ వర్గానికి దక్కగా.. ఖమ్మం 38వ డివిజన్ కార్పొరేటర్‌గా గెలిచిన ఫాతిమా పేరును అధిష్టానం ఖరారు చేసింది. వరంగల్ మహా నగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక వరంగల్ మేయర్ పీఠానికి 29 వ డివిజన్ కార్పొరేటర్ గుండు సుధారాణి పేరును అధిష్టానం ఖరారు చేసింది. సుధారాణికి మేయర్ పీఠం ఖాయమన్న ప్రచారం ముందు నుంచి జరిగింది.. అధిష్టానం కూడా ఆమె పేరే ప్రకటించింది. డిప్యూటీ మేయర్ పదవికి రిజ్వాన షమీకి దక్కింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నేతలతో చర్చించి అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేసింది. పార్టీ పట్ల విధేయత, అనుభవం, సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ మేయర్ ఎంపిక ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా తెరాస ఎన్నికల పరిశీలకులు బాధ్యతలు నిర్వర్తించారు. మధ్యాహ్నం 3 గంటలకు కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మేయర్, చైర్పర్సన్ల కోసం పరోక్ష ఎన్నిక నిర్వహించారు. మేయర్ అభ్యర్థుల పేర్లతో కూడిన సీల్డ్ కవర్లను టీఆర్ఎస్ అధిష్ఠానం, పార్టీ పరిశీలకులకు అందించింది. వరంగల్‌కు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, పరిశీలకులుగా వ్యవహరించారు. కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో 8 మంది కార్పొరేటర్లు గైర్హాజరు అయ్యారు. వీరితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తద్వారా ఓటింగ్ ప్రక్రియ పూర్తిచేయడం జరిగింది. చదవండి: Municipal Polls: ఆ ఊపు లేదు.. హవా లేదు! -
విజయనగరం డిప్యూటీ మేయర్ కన్నుమూత
సాక్షి, విజయనగరం: విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ముచ్చు నాగలక్ష్మి(47) మంగళవారం రాత్రి కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె విజయనగరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒకటో డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గెలు పొందిన ఆమె మార్చి 18న డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. నాగలక్ష్మికి భర్త శ్రీనివాసరావు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా ఆమె మృతిపై కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్ ప్రసాదరావు, ఇతర విభాగాల అధికారులు సంతాపం తెలుపుతూ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పదవి చేపట్టిన అనతికాలంలోనే మరణించడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అసిస్టెంట్ సిటీ ప్లానర్ వెంకటేశ్వరరావు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ సత్యనారాయణ, ఈఈ డాక్టర్ దిలీప్, కార్పొరేషన్ పాలకవర్గ సభ్యులు తమ సంతాపం తెలియజేశారు. చదవండి: మరి ఇలాగైతే కరోనా రాదా అండీ....? -
సీఎం వై ఎస్ జగన్ స్ఫూర్త్రితో ప్రజా సేవ చేస్తాం
-
మహిళా కార్పొరేటర్లతో జీవీఎంసీ కళకళ
-
డిప్యూటీ మేయర్లపై సీఎం జగన్ కీలక నిర్ణయం
తాడేపల్లి: డిప్యూటీ మేయర్లపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఇద్దరు డిప్యూటీ మేయర్లు, ఇద్దరు వైస్ ఛైర్మన్ల నియామకాన్ని చేపట్టనున్నారు. ఇందుకోసం మున్సిపల్ చట్టాన్ని సవరించనుంది. ఆర్డినెన్స్ తెచ్చిన తర్వాత ఈ నెల 18న యథాతథంగా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరగనున్నాయి. ఇక పురపాలక ఎన్నికల్లో ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో వైఎస్సార్సీపీ మొత్తం కార్పొరేషన్లను క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. 75 పురపాలక సంఘాలు, 11 కార్పోరేషన్లను గెలుచుకొని అఖండ విజయం సాధించింది.ఏపీ చరిత్రలో ఇంతవరకు ఒకే పార్టీకి ప్రజలు పట్టం కట్టడం ఇదే తొలిసారి. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ప్రజలు జై కొట్టడంతో.. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ.. ఇలా మూడు ప్రాంతాల్లోనూ వైఎస్సార్ సీపీ ఆధిక్యం కొనసాగడం విశేషం. దీంతో మూడు రాజధానులకు ప్రజలు మద్దతిచ్చినట్లు స్పష్టమవుతోంది. ఇక నగర పాలక సంస్థల్లో తుడిచి పెట్టుకుపోయిన టీడీపీ.. మున్సిపాలిటీలల్లోనూ బోర్లా పడింది. కనీసం ఒక్కటి కూడా గెలుచుకోలేకపోయింది. ఇక జనసేన, బీజేపీ, వామపక్ష పార్టీలు అసలు పత్తా లేకుండా పోయాయి. చదవండి : (మున్సిపల్ ఎన్నికల చరిత్రలో 'ఫ్యాన్' తుపాన్) (AP Municipal Elections Results: వైఎస్సార్ సీపీ సరికొత్త రికార్డు) -
మేయర్ పదవి ఆశించింది వాస్తవమే: మోతె శ్రీలతారెడ్డి
సాక్షి, బంజారాహిల్స్: గ్రేటర్ హైదరాబాద్‌లో త్వరలోనే బస్తీ యాత్ర చేపట్టి స్థానిక సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. గురువారం ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచిత వైద్యం అందుబాటులో ఉండే విధంగా నగరంలోని ప్రతి బస్తీలో బస్తీ దవాఖానాలు, కమ్యూనిటీ హాళ్లు ఉండాలన్నదే తన లక్ష్యమని, ఇప్పుడున్న బస్తీ దవాఖానాలు మరింత పెంచేందుకు కృషి చేస్తానని చెప్పారు. డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానంగా ఉందని మెరుగు పరిచేందుకు తగిన ప్రణాళికలు రూపొందిస్తామని తన తొలి ప్రాధాన్యత కూడా ఇదేనన్నారు. రోడ్లు చాలా చోట్ల దెబ్బతిన్న విషయాన్ని గుర్తించామని, వాటిని కూడా బాగు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అవినీతి రహిత జీహెచ్ఎంసీని రూపొందించడమే తన లక్ష్యమని వెల్లడించారు. కరప్షన్ ఫ్రీ అనేది తన లక్ష్యంగా పెట్టుకున్నానన్నారు. అవినీతిపై ఎందాకైనా వెళ్లి పోరాడతానని స్పష్టం చేశారు. నగర అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా అందరి సలహాలు తీసుకుంటానని వెల్లడించారు. మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తానని మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు మహిళలకు ఇవ్వడంపై సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లకు గ్రేటర్ మహిళల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు. గతంలో మహిళా మేయర్లు ఉన్నా ఒకే సమయంలో మేయర్, డిప్యూటీ మేయర్ మహిళలకే ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. హైదరాబాద్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు పాటుపడతానని, ఐటీ హబ్‌గా ఉన్న నగరాన్ని హెల్త్ హబ్‌గా, పరిశుభ్రమైన నగరంగా మార్చడమే తన లక్ష్యమన్నారు. హైదరాబాద్‌ను ఎంతో అభివృద్ధి చేశారు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కొంత మందే మహిళలు ఉండేవారని, కార్పొరేటర్‌గా గెలిచిన తర్వాత ఒక్కొక్కరిగా వందల సంఖ్యలో మహిళలు రావడం తనకెంతో తృప్తి కలిగించిన అంశమన్నారు. ఈ ప్రభుత్వంలోనే మహిళలకు ఎన్నో అవకాశాలు దక్కాయని, ప్రతి రంగంలోనూ మహిళలు దూసుకుపోతున్నారని వెల్లడించారు. మహిళగా గర్వపడుతున్నానన్నారు. మహిళలే ముందుండి తనను నడిపించారని ప్రతి గెలుపులోనూ బంజారాహిల్స్ డివిజన్ మహిళల పాత్ర ఎంతో కీలకమన్నారు. తన వెన్నంటి నిలిచి ఉన్నతిని కోరుకున్నారని వారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వంలో పని చేస్తున్నందుకు ప్రతిఒక్కరూ గర్విస్తున్నారని వెల్లడించారు. కేసీఆర్, కేటీఆర్ హైదరాబాద్‌ను ఎంతో అభివృద్ధి చేశారు. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. నగర అభివృద్ధి విషయంలో అలుపెరుగని కృషి చేస్తా. జీహెచ్ఎంసీలో లోటు బడ్జెట్ ఉందన్న విషయాన్ని బాధ్యతలు స్వీకరించిన తర్వాత సమీక్షిస్తా. అందరితో కలిసి ప్రజలకు మెరుగైన సేవలందించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తాం. విశ్వనగరం సాధిస్తాం. చదవండి: ‘మంచిగ ఉంటేనే బట్టకాల్చి మీదేసే రోజులివి’ ప్రమాణ స్వీకారంలో పదనిసలు నాన్న ఆశీర్వాదం.. బంజారాహిల్స్: జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం గురువారం నిర్వహించారు. ఉదయం టీఆర్ఎస్ కార్పొరేటర్లు తెలంగాణ భవన్‌కు వచ్చారు. బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి పేరును మేయర్‌గా సీల్డ్ కవర్లో తీసుకెళ్లారు. సమావేశానికి హాజరయ్యే ముందు గద్వాల విజయలక్ష్మి తన నివాసంలో తండ్రి కేకే ఆశీస్సులు తీసుకున్నారు. పూజలు చేసి.. బంజారాహిల్స్: ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లేముందు జీహెచ్ఎంసీ మేయర్‌గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మి ఎన్బీటీనగర్లోని శివాలయంలో, అయ్యప్ప స్వామికి, సాయిబాబాకు పూజలు నిర్వహించారు. దైవభక్తి అధికంగా ఉన్న ఆమె ప్రతిరోజూ ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తుంటారు. ఇక్కడ సాయిబాబా ఆలయాన్ని ఆమె సొంత నిధులతో కట్టించారు. బయోడేటా పేరు : గద్వాల విజయలక్ష్మి భర్త : బాబిరెడ్డి తల్లిదండ్రులు: కే.కేశవరావు, వసంత కుమారి పుట్టిన తేదీ: 28–01–1964 వయసు : 56 విద్యార్హత : బీఏ, ఎల్ఎల్బీ, జర్నలిజం నివాసం : బంజారాహిల్స్, ఎన్బీటీ నగర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తా: డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి సికింద్రాబాద్: తనకు లభించిన జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ పదవిని తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా లభించిన గౌరవంగా భావిస్తున్నానని మోతె శ్రీలతారెడ్డి చెప్పారు. సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నాక డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గెలిచిన మోతె శ్రీలతారెడ్డి గురువారం జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. \ మొదటిసారి కార్పొరేటర్‌గా గెలిచి, డిప్యూటీ మేయర్‌గా ఎన్నిక కావడంతో ఎలా ఫీలవుతున్నారు? నన్ను డిప్యూటీ మేయర్ చేయడంతో ఉద్యమకారులకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందన్న భావనను మరోమారు బలపరిచింది. తెలంగాణ ఉద్యమం తొలిరోజు నుంచి నా భర్త శోభన్‌రెడ్డి ఉన్నారు. ఆయన ఉద్యమ పటిమకు ప్రతిఫలం అనుకుంటున్నాను. డిప్యూటీతో అసంతృప్తికి గురయ్యారా? ఉద్యమ సమయంలోనూ, రాష్ట్రం ఏర్పాటయ్యాక మొత్తంగా 21 సంవత్సరాలు టీఆర్ఎస్తోనే ప్రయాణించాం. మేయర్ పదవి ఆశించింది వాస్తవమే. డిప్యూటీతో అయినా గుర్తింపు లభించినందుకు సంతృప్తి లభించింది. నగర అభివృద్ధిలో మీ భాగస్వామ్యం ఎలా ఉంటుంది? మేయర్ గద్వాల విజయలక్ష్మికి నగర అభివృద్ధిలో సంపూర్ణ సహకారం అందిస్తా. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నాటి నుంచి నగరం శరవేగంగా అభి వృద్ధి చెందుతోంది. సీఎం కేసీఆర్, మున్సిపల్ మంత్రి కేటీఆర్ చూపిన మార్గంలో అభివృద్ధి పనులు చేపడతాం. ఈ ప్రాంతం నుంచి గెలిచిన మీరు సికింద్రాబాద్ ప్రాంతానికి ఏం చేస్తారు? దశాబ్దాలుగా సికింద్రాబాద్ ప్రాంత సమస్యలు తెలుసు. ఇక్కడి నుంచి డిప్యూటీ స్పీకర్ టీ.పద్మారావుగౌడ్, పశుసంవర్ధక శాఖ మంత్రిగా తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం నుంచి డిప్యూటీ మేయర్ కావడం గర్వంగా ఉంది. వారిద్దరి సహకారంతో సికింద్రాబాద్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నిస్తాను. బయోడేటా పేరు: మోతె శ్రీలతారెడ్డి భర్త: శోభన్‌రెడ్డి, తెలంగాణ ఉద్యమకారుడు. తల్లిదండ్రలు: బేతి యశోధ, రంగారెడ్డి. పుట్టిన తేదీ: 01–03–1971. వయసు: 49 సంవత్సరాలు. విద్యార్హత: బీఏ సంతానం: ఇద్దరు అమ్మాయిలు. రాజీవి, శ్రీతేజస్విని (అమెరికాలో ఉంటున్నారు). నివాసం: తార్నాక, సికింద్రాబాద్. -
ఆశావహులు నిరుత్సాహపడొద్దు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్, డిప్యూటీ మేయర్‌గా అవకాశం దక్కని కార్పొరేటర్లు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి భవిష్యత్తులో అవకాశాలు వస్తాయని, పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ ఎన్నిక సజావుగా జరిగేందుకు సహకరించాలని ఆయన కోరారు. జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ తరఫున గెలిచిన కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు గురువారం ఉదయం 8.30 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎక్స్ అఫీషియో సభ్యులు, కార్పొరేటర్లతో మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు సమావేశమయ్యారు. మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల పేర్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడిస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. గ్రేటర్లో నెలకొన్న రాజకీయ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని విప్ జారీ చేసినట్లు వెల్లడించారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా అనుసరించాల్సిన పద్ధతిని మంత్రి వివరించారు. అనంతరం టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలసి బస్సుల్లో తెలంగాణ భవన్ నుంచి జీహెచ్ఎంసీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. బస్సులో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న తన ఆటా పాటలతో కార్పొరేటర్లను ఉత్సాహ పరిచారు. ఎన్నిక ప్రక్రియ ముగిసిన తర్వాత మంత్రులు మహమూద్ అలీ, తలసాని, విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ కవిత తదితరులతో కలసి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నూతన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు అసెంబ్లీ ఎదురుగా ఉన్న తెలంగాణ అమర వీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు.