
రికార్డింగ్ డ్యాన్స్‌లో డిప్యూటీ మేయర్ చిందులు
సాక్షి, ఏలూరు: ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువకుడిని అక్రమంగా నిర్బంధించి దాడికి పాల్పడ్డారన్న కేసులో పదిహేను నెలల క్రితం అరెస్టయిన ఏలూరు డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఇటీవల ఏలూరులో మేయర్ షేక్ నూర్జహాన్ ఇంటి ఎదుట జరిగిన ఓ పార్టీలో డిప్యూటీ మేయర్‌తోపాటు పలువురు కార్పొరేటర్లు పాల్గొని హల్‌చల్ చేయడం వివాదాస్పదమవుతోంది.
రికార్డింగ్ డ్యాన్స్ మాదిరి జరిగిన సినీ విభావరిలో వెంకటరత్నం ఓ యువతితో కలిసి చిందులు వేయడం చర్చనీయాంశమైంది. ఇటీవల చోటుచేసుకున్న ఆ డ్యాన్సుల తాలూకు వీడియోలను పలువురు ఫేస్‌బుక్, వాట్సాప్‌లో షేర్ చేసుకున్నారు.