అన్యాయంగా డిప్యూటీ మేయర్ పదవిని లాక్కున్న కూటమి
దాడులు, దౌర్జన్యాలతో పదవి లాక్కున్న కూటమి సర్కార్
వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల కిడ్నాప్‌తో కూటమి విధ్వంసం
సాక్షి, తిరుపతి: కూటమి సర్కార్.. తిరుపతిలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. అన్యాయంగా డిప్యూటీ మేయర్ పదవిని లాక్కుంది. దాడులు, దౌర్జన్యాలతో పదవి లాక్కున్న కూటమి ప్రభుత్వం బరి తెగించి.. కుతంత్రాలకు తెరతీసింది వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల కిడ్నాప్‌తో కూటమి విధ్వంసం సృష్టించింది. టీడీపీకి ఓటు వేయకుంటే ఇళ్లు కూలుస్తామంటూ బెదిరింపులకు దిగింది. మహిళా కార్పొరేటర్లపై కూడా దాడులు చేసిన కూటమి గూండాలు.. బెదిరింపులకు పాల్పడ్డారు.
వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను కిడ్నాప్‌చేసి కూటమి గెలిచింది. దాడులు, దౌర్జన్యాలతో మునికృష్ణను కూటమి గెలిపించుకుంది. నిబంధనలకు వ్యతిరేకంగా ఎన్నిక జరిగిదని.. ఈ గెలుపు ప్రజాస్వామ్య విరుద్ధం అని వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు మండిపడుతున్నారు.
కాగా, మూడేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుపతి కార్పొరేషన్‌లో మొత్తం 49 డివిజన్లకు గానూ 48 చోట్ల వైఎస్సార్‌సీపీ గెలుపొందింది. భూమన అభినయరెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడంతో తిరుపతి డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ పదవులకు రాజీనామా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడింది. కూటమికి ఒక్క కార్పొరేటరే ఉన్నా అధికార బలంతో దాన్ని దక్కించుకునేందుకు కుట్రలకు తెర తీశారు.
గత ఐదు రోజులుగా వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల ఆస్తులను ధ్వంసం చేయడంతోపాటు రాత్రిపూట పోలీసులను వారి ఇళ్లకు పంపి కేసులు బనాయిస్తామంటూ బెదిరించారు. ఎస్వీ యూనివర్సిటీ సెనెట్ హాలులో సోమవారం డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలనే కుయుక్తులతో కూటమి నేతలు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసేందుకు సిద్ధమయ్యారు.
వారంతా చిత్తూరులో ఉన్నారని తెలుసుకుని ఆదివారం అర్ధరాత్రి రిసార్ట్స్‌లో చొరబడ్డారు. మహిళా కార్పొరేటర్లు అని కూడా చూడకుండా తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కుమారుడు మదన్, పులిగోరు మురళి, జేబీ శ్రీనివాసులు, అనుచరులు గదుల తలుపులు బాదుతూ వీరంగం సృష్టించారు.
Comments
Please login to add a commentAdd a comment