
తిరుపతి, సాక్షి: కూటమి నేతలకు పోలీసులు తలొగ్గుతున్నారని, జనసేన పార్టీ తిరుపతి ఇన్చార్జి కిరణ్ రాయల్‌పై ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఐద్వా మహిళలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో.. తిరుపతి ఎస్పీని కలిసి స్పందన ద్వారా మరోసారి ఫిర్యాదు చేశారు.
ఒక మహిళ తనకు జరిగిన అన్యాయంపై ప్రత్యక్షంగా.. ఆధారాలతో సహా మీడియా ముందుకు వచ్చింది. అయినా పోలీసులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిందితుడికే అండగా ఎందుకు నిలబడుతున్నారు?. కూటమి నేతలు ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారా? ఇదెక్కడి న్యాయం? అని ఐద్వా మహిళలు ఏపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. తక్షణమే కిరణ్ రాయల్‌పై చర్యలు తీసుకోవాలని, అతన్ని అరెస్ట్ చేయాలని ఐద్వా నాయకురాలు
సాయిలక్ష్మి డిమాండ్ చేస్తున్నారు.
పవన్‌కు అత్యంత సన్నిహితుడు, తిరుపతి జనసేన ఇంఛార్జి అయిన కిరణ్‌రాయల్.. తన నుంచి రూ.1.20 కోట్ల నగదు, 25 సవర్ల బంగారం తీసుకుని ఇవ్వకపోగా, పైగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లక్ష్మి అనే మహిళా ఓ సెల్ఫీ వీడియో విడుదల చేయడం కలకలం రేపింది.
అయితే ఆస్పత్రి నుంచి నివాసానికి చేరుకున్న వెంటనే కిరణ్‌రాయల్ జనసేన శ్రేణుల ద్వారా బెదిరింపులకు దిగడంతో లక్ష్మి సోమవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ప్రెస్‌మీట్ ముగిసిన వెంటనే.. నాటకీయ పరిణామాల నడుమ జైపూర్ పోలీసులు ఆమెను అరెస్టు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో కిరణ్‌రాయల్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
ఇదీ చదవండి: కిరణ్ రాయల్‌కు ముందే ఎలా తెలుసు?
Comments
Please login to add a commentAdd a comment