Kiran Royal
-
Kiran Royal: ‘మరీ ఇంత అన్యాయమా?’
తిరుపతి, సాక్షి: కూటమి నేతలకు పోలీసులు తలొగ్గుతున్నారని, జనసేన పార్టీ తిరుపతి ఇన్చార్జి కిరణ్ రాయల్‌పై ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఐద్వా మహిళలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో.. తిరుపతి ఎస్పీని కలిసి స్పందన ద్వారా మరోసారి ఫిర్యాదు చేశారు.ఒక మహిళ తనకు జరిగిన అన్యాయంపై ప్రత్యక్షంగా.. ఆధారాలతో సహా మీడియా ముందుకు వచ్చింది. అయినా పోలీసులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిందితుడికే అండగా ఎందుకు నిలబడుతున్నారు?. కూటమి నేతలు ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారా? ఇదెక్కడి న్యాయం? అని ఐద్వా మహిళలు ఏపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. తక్షణమే కిరణ్ రాయల్‌పై చర్యలు తీసుకోవాలని, అతన్ని అరెస్ట్ చేయాలని ఐద్వా నాయకురాలుసాయిలక్ష్మి డిమాండ్ చేస్తున్నారు.పవన్‌కు అత్యంత సన్నిహితుడు, తిరుపతి జనసేన ఇంఛార్జి అయిన కిరణ్‌రాయల్.. తన నుంచి రూ.1.20 కోట్ల నగదు, 25 సవర్ల బంగారం తీసుకుని ఇవ్వకపోగా, పైగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లక్ష్మి అనే మహిళా ఓ సెల్ఫీ వీడియో విడుదల చేయడం కలకలం రేపింది. అయితే ఆస్పత్రి నుంచి నివాసానికి చేరుకున్న వెంటనే కిరణ్‌రాయల్ జనసేన శ్రేణుల ద్వారా బెదిరింపులకు దిగడంతో లక్ష్మి సోమవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ప్రెస్‌మీట్ ముగిసిన వెంటనే.. నాటకీయ పరిణామాల నడుమ జైపూర్ పోలీసులు ఆమెను అరెస్టు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో కిరణ్‌రాయల్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.ఇదీ చదవండి: కిరణ్ రాయల్‌కు ముందే ఎలా తెలుసు? -
లక్ష్మిని అరెస్టు చేసిన పోలీసులు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: జనసేన తిరుపతి ఇన్చార్జ్ కిరణ్‌రాయల్(Kiran Royal) బాధితురాలు లక్ష్మి(Laxmi)ని సోమవారం తిరుపతిలో జైపూర్ పోలీసులు అరెస్ట్(Jaipur Police Arrest) చేశారు. కిరణ్‌రాయల్ రూ.1.20 కోట్ల నగదు, 25 సవర్ల బంగారం తీసుకుని ఇవ్వకపోగా.. తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియో విడుదల చేసి ఆమె ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే.ఆస్పత్రి నుంచి నివాసానికి చేరుకున్న వెంటనే కిరణ్‌రాయల్ జనసేన శ్రేణుల ద్వారా బెదిరింపులకు దిగడంతో లక్ష్మి సోమవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ప్రెస్‌మీట్ ముగిసిన వెంటనే.. జైపూర్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. లక్ష్మి తనపై సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడాన్ని జీర్ణించుకోలేని కిరణ్‌రాయల్ ఇంతకుముందే మీడియా సమావేశంలో లక్ష్మిపై ఆరోపణలు చేస్తూ.. రెండురోజుల్లో జైపూర్ పోలీసులు ఆమెను అరెస్టు చేయబోతున్నారని చెప్పారు.ఇప్పుడు అదే జరగడంతో.. ఆ విషయాన్ని ఆయన ముందే ఎలా చెప్పగలిగారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనను బిట్‌కాయిన్ కేసులో ఇరికించేందుకు కుట్రలు చేస్తున్నారని లక్ష్మి ఆరోపించారు. ఒంటరి మహిళను అన్యాయంగా వేధిస్తున్నారు. ఇది న్యాయమేనా? అని కన్నీరు పెట్టుకున్నారు. బలవంతంగా వాహనంలోకి ఎక్కించుకెళ్లిన పోలీసులుజైపూర్ పోలీసులు లక్ష్మిని అరెస్టుచేశాక రుయాలో పరీక్షలు నిర్వహించిన అనంతరం తిరుపతి కోర్టుకు తరలించారు. కోర్టు ఆవరణలో లక్ష్మి సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆమెను తిరిగి ఆస్పత్రికి తీసుకెళ్లారు. మళ్లీ రాత్రి 10 గంటల సమయంలో ఆస్పత్రి నుంచి తీసుకొచ్చి కోర్టులో హాజరుప రిచారు. ఆరోగ్యం ఎలా ఉందమ్మా అని మీడియా వారు లక్ష్మిని ప్రశ్నిస్తుంటే.. ఆరోగ్యంగా ఉందని పోలీసులు సమాధానం ఇస్తూ బలవంతంగా వాహనంలోకి ఎక్కించి తీసుకెళ్లారు.41ఏ నోటీసు ఇస్తే సరిపోతుందిలక్ష్మిపై 2021లో జైపూర్‌లో కేసు నమోదైందని, అందులో ఆమె ఏ6గా ఉన్నారని, ఈ కేసుకు 41ఏ నోటీసు ఇస్తే సరిపోతుందని తిరుపతికి చెందిన న్యాయవాది విజయకుమార్ తెలిపారు. లక్ష్మిని అరెస్ట్ చేసిన పోలీసులు సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ఫాలో కాలేదని చెప్పారు. పవన్ అభిమానినని కాలర్ ఎగరేసుకు తిరుగుతా రెండేళ్లు అజ్ఞాతంలో ఉన్న ఆమెను బయటకు తీసుకొచ్చి జైపూర్ పోలీసులతో అరెస్టు చేయించింది వైఎస్సార్సీపీనే అని జనసేన నేత కిరణ్‌రాయల్ సోమవారం మీడియా సమావేశంలో చెప్పారు. వైఎస్ జగన్‌పై తాను పది రూపాయల పోస్టర్ తయారు చేస్తే తనకు రూ.10 కోట్ల పబ్లిసిటీ ఇచ్చారన్నారు. రూ.25 లక్షలు లక్ష్మికి ఇచ్చి తనపై ప్రయోగించారని ఆరోపించారు. తాను పవన్ అభిమానినని, కాలర్ ఎగరేసుకు తిరుగుతానని చెప్పారు. -
తన వెనుక పవన్ ఉన్నాడని కిరణ్ రాయల్ బెదిరించేవాడు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘నా వెనుక పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఉన్నారని కిరణ్ రాయల్ నన్ను బెదిరించేవాడు. మహిళలను మోసం చేయాలని ఆయనకు పవన్ కళ్యాణ్ చెప్పారా?’ అని జనసేన తిరుపతి ఇన్చార్జ్ కిరణ్ రాయల్(Kiran Royal) బాధితురాలు లక్ష్మి(Laxmi) ప్రశ్నించారు. కిరణ్ రాయల్‌పై తాను సెల్ఫీ వీడియో రిలీజ్ తర్వాత జనసేన పార్టీ నాయకులతో ఫోన్లు చేయించి బెదిరిస్తున్నాడని చెప్పారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఆమె మీడియాతో మాట్లా డారు.‘నా బాస్ వస్తున్నారు... డబ్బులు కావాలని కిరణ్‌రాయల్ అడిగేవాడు. అందుకే నాకు అత్తగారి నుంచి వచ్చిన ఆస్తులు విక్రయించి కిరణ్‌రాయల్‌కు ఇచ్చాను. కిరణ్ రాయల్ అనుభవిస్తున్న ప్రతి పైసా నాదే. నాకు ఇవ్వాల్సిన రూ.1.20 కోట్లు, 25 సవర్ల బంగారం ఇప్పించాలని పవన్‌కళ్యాణ్‌ను కోరుతు న్నా. అప్పుల వాళ్ల ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నా. నేను చెప్పేవి అబద్ధాలైతే కాణిపాకం వచ్చి కిరణ్‌రాయల్ ప్రమాణం చేస్తే అన్నీ వదులుకుంటా’ అని లక్ష్మి చెప్పారు. నేను ఒక్కదాన్ని మాత్రమే కాదు...‘కిరణ్ రాయల్ చేతిలో మోసపోయింది నేను ఒక్కదాన్నే కాదు... మరో అమ్మాయి కూడా ఉంది. అతని కోసం ఆమె సొంత బిడ్డను కూడా వదిలేసింది. ఆమె తర్వాత నన్ను నాశనం చేశాడు. ఆ అమ్మాయి విషయం బయటపెట్టకూడదని ఇన్నాళ్లు మౌనంగా ఉన్నా. కిరణ్ రాయల్ నా వద్ద డబ్బులు ఉన్నంతవరకు వాడుకున్నాడు. ఇప్పుడు నా పిల్లల కోసమే నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నా. నాకు ఏ పార్టీ మద్దతు లేదు. నా బిడ్డకు సర్జరీ కోసం డబ్బులు అడిగితే నానా దుర్భాషలాడి ఖాళీ చెక్ తీసుకుని లక్ష రూపాయలు ఇచ్చాడు. అందుకు సంబంధించిన వివరాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.ఆడబిడ్డకు కష్టం వస్తే ముందు ఉంటానని పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా చెప్పారే.. మరి కిరణ్ రాయల్‌ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నోట్ విడుదల చేస్తే సరిపోతుందా?’ అని లక్ష్మి ఆవేదన వ్యక్తంచేశారు. అదేవిధంగా ఎన్నికలు అయిపోగానే తన నుంచి తీసుకున్న నగదుకు రెండు రెట్లు అధికంగా తిరిగిస్తానని కిరణ్‌రాయల్ చెప్పాడని, అతని మాటలు నమ్మి మోసపోయానని తెలిపారు.అధికార బలగాన్ని ఉపయోగించి తన ప్రాణం తీసినా.. తన ఇద్దరు బిడ్డలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నానని ఆమె కన్నీటిపర్యంతమవుతూ పలు ఆడియోలు, వీడియోలు, చెక్కులు, బాండ్ పేపర్లను మీడియా ఎదుట బహిర్గతం చేశారు. అంతుకుమందు ఆమె తిరుపతి ఎస్పీని గ్రీవెన్స్‌లో కలిసి కిరణ్ రాయల్‌పై ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని, న్యాయం చేయాలని కోరారు. కిరణ్ రాయల్ చేసిన అన్యాయాలకు సంబంధించిన ఆధారాలను అందించారు. -
కిరణ్ రాయల్‌కు ముందే ఎలా తెలుసు?
తిరుపతి: కూటమి ప్రభుత్వంలోని నేతల అన్యాయాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే.. అరెస్టులు, దాడులు తప్పితే న్యాయం జరగదు. ఇది కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర్నుంచి చూస్తూనే ఉన్నాం. మరీ ఎక్కువగా కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తే ‘రెడ్‌బుక్’ పాలన షురూ చేస్తారు.ఆంధ్రా బిడ్డకు ఈ అన్యాయమేంటో?.నాకు అన్యాయం జరిగింది మహాప్రభో.. న్యాయం చేయండి.. నేను ఒక జనసేన నాయకుడి చేతిలో మోసపోయాను’ అని అరిచి గీపెట్టుకుంటే ఆమెను అరెస్ట్ చేసిన వైనం ఏమిటో అర్థం కాదు. అది కూడా జైపూర్ పోలీసులు వచ్చి ఆమెను అరెస్ట్ చేస్తారు. ఎక్కడో ముంబై లో ఉండే సినీనటి కాదంబరి జెత్వానిని తీసుకొచ్చి ఆడబిడ్డకు న్యాయం చేస్తాం అంటూ బీరాలు పలికిన కూటమి ప్రభుత్వం.. నేడు ఆంధ్ర ఆడబిడ్డకు జనసేన నేత అన్యాయం చేశాడు అని కేస్ పెడితే రివర్స్ లో పాత కేస్ ఏదో ఉందని ఇప్పుడు ఆ మహిళను అరెస్ట్ చేయించారు.కూటమి ప్రభుత్వంలో ఒక్కో మహిళకు ఒక్కో న్యాయం అనుకుంటా...?అరెస్ట్ అంటూ ముందుగానే జోస్యం?రెండు రోజుల్లో ఆమెను అరెస్ట్ చేస్తారంటూ మీడియా ముఖంగా చెప్పాడు కిరణ్ రాయల్. తిరుపతి జనసేన ఇంచార్జిగా ఉన్న కిరణ్ రాయల్ చేతికి కోటి ఇరవై లక్షలతో పాటు బంగారం కూడా కొంత ఇచ్చి మోసం పోయింది లక్ష్మీ అనే మహిళ. అయితే ఇదే విషయాన్ని బహిర్గతం చేస్తే.. ఆమెపై తిరిగి ఆరోపణలు చేశాడు కిరణ్ రాయల్. ‘ చూడండి.. ఆమె రెండు రోజుల్లో అరెస్ట్ అవ్వుది.. జైపూర్ నుంచి పోలీసులు వస్తారు’ అని చెప్పాడు.ఆమెను అరెస్ట్ చేయడానికి జైపూర్ పోలీసులు వస్తారని కిరణ్ కు ఎలా తెలుసు. ఆమెను ఇరికించాలనే ప్రయత్నంలో భాగంగా పాత కేసును తిరగతోడి రాజస్థాన్ పోలీసుల్ని రప్పించారా? ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తే కూటమి ప్రభుత్వానికి తలనొప్పులు వస్తాయని, ఏకంగా జైపూర్‌కు వెళ్లారా? దీని వెనుక ఉన్నది ఎవరు? అసలు జైపూర్ నుంచి పోలీసుల్ని ఇక్కడకు రప్పించి ఆమెను అరెస్ట్ ేచేయిండంలో చక్రం తిప్పింది ఎవరు? అనే వాదన తెరపైకి వచ్చింది. అదే సమయంలో #saveAPFromRedbookRuling అనేది ‘ఎక్స్’లో ట్రెండ్ అవుతోంది.