
తిరుపతి, సాక్షి: సంచలనంగా మారిన జనసేన స్థానిక ఇన్‌ఛార్జి కిరణ్ రాయల్ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తన నుంచి డబ్బు తీసుకుని మోసం చేసినట్లు లక్ష్మి అనే బాధితురాలు(Victim Laxmi) వరుసబెట్టి ఆధారాలు వదులుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు మరో క్లిప్ బయటకు వచ్చింది. కూటమి అధికారంలోకి రాగానే.. ఎలాగైనా డబ్బులిచ్చేస్తానంటూ కిరణ్ బాధితురాలితో చెప్పిన మాటలు బయటకొచ్చాయి. అంతేకాదు..
అమ్మాయిల గురించి అసభ్యకరంగా కిరణ్ మాట్లాడిన మాటలు కూడా ఆడియో క్లిప్‌లో ఉన్నాయి. బాధితురాలు లక్ష్మి విడుదల చేసిన ఆడియోలో ఏమని ఉందంటే.. ‘‘నాకు అమ్మాయిలు వీక్ నెస్ ఉంది. నేను లైఫ్ లాంగ్ ఇలానే ఉంటా. నేను మారలేను. కానీ, నిన్ను మాత్రం బాగా చూసుకుంటా.
.. ఎన్నికల్లో తిరుపతి జనసేన నుంచి పోటీ చేయాలని చేయాలి అంటే రూ. 20 కోట్లు ఖర్చు చేయాలని అన్నారు. చివరకు నాకు సీటు లేదని చెప్పేశారు. అయినా ఏం ఫర్వాలేదు. ఏదో ఒక నామినేటెడ్ పదవి గ్యారెంటీగా వస్తుంది. కూటమి ప్రభుత్వం(Kutami Prabutvam) రాగానే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా’’ అని కిరణ్ రాయల్(Kiran Royal) తన మాటల గారడీని లక్ష్మిపై ప్రయోగించాడు.

నా కూతురి మీద ఒట్టు..
.. నా కూతూరు మీద ఒట్టు. నేను చాలా మంది అమ్మాయిలతో అక్రమ సంబంధం పెట్టుకున్నా. నీకు 10 ఏళ్ల వయసు ఉండొచ్చేమో.. అప్పుడు రోజుకో అమ్మాయితో తిరిగే వాడ్ని. నీకు తెలిసి నలుగురి గురించే తెలుసు. కానీ, నీకు తెలిసిన ఆరుగురితో నేను తిరిగాను. ఈ ఏడు నెలల్లోనే ఆరుగురితో తిరిగా. ఇప్పటికీ ఇద్దరు అమ్మాయిలతో వాళ్ల ఇంటికి వెళ్తాను. మొత్తంగా నాకు ఓ 400 మందితో సంబంధం ఉండొచ్చు..’’ అంటూ బాధితురాలు లక్ష్మి విడుదల చేసిన ఆ ఆడియోలో వాయిస్ ఉంది.