![Janasena Tirupati Incharge Kiran Royal Victim Laxmi Sensational Comments](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/lakshmi222.jpg.webp?itok=nu7boD-H)
తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘నా వెనుక పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఉన్నారని కిరణ్ రాయల్ నన్ను బెదిరించేవాడు. మహిళలను మోసం చేయాలని ఆయనకు పవన్ కళ్యాణ్ చెప్పారా?’ అని జనసేన తిరుపతి ఇన్‌చార్జ్ కిరణ్ రాయల్(Kiran Royal) బాధితురాలు లక్ష్మి(Laxmi) ప్రశ్నించారు. కిరణ్ రాయల్‌పై తాను సెల్ఫీ వీడియో రిలీజ్ తర్వాత జనసేన పార్టీ నాయకులతో ఫోన్లు చేయించి బెదిరిస్తున్నాడని చెప్పారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఆమె మీడియాతో మాట్లా డారు.
‘నా బాస్ వస్తున్నారు... డబ్బులు కావాలని కిరణ్‌రాయల్ అడిగేవాడు. అందుకే నాకు అత్తగారి నుంచి వచ్చిన ఆస్తులు విక్రయించి కిరణ్‌రాయల్‌కు ఇచ్చాను. కిరణ్ రాయల్ అనుభవిస్తున్న ప్రతి పైసా నాదే. నాకు ఇవ్వాల్సిన రూ.1.20 కోట్లు, 25 సవర్ల బంగారం ఇప్పించాలని పవన్‌కళ్యాణ్‌ను కోరుతు న్నా. అప్పుల వాళ్ల ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నా. నేను చెప్పేవి అబద్ధాలైతే కాణిపాకం వచ్చి కిరణ్‌రాయల్ ప్రమాణం చేస్తే అన్నీ వదులుకుంటా’ అని లక్ష్మి చెప్పారు.
నేను ఒక్కదాన్ని మాత్రమే కాదు...
‘కిరణ్ రాయల్ చేతిలో మోసపోయింది నేను ఒక్కదాన్నే కాదు... మరో అమ్మాయి కూడా ఉంది. అతని కోసం ఆమె సొంత బిడ్డను కూడా వదిలేసింది. ఆమె తర్వాత నన్ను నాశనం చేశాడు. ఆ అమ్మాయి విషయం బయటపెట్టకూడదని ఇన్నాళ్లు మౌనంగా ఉన్నా. కిరణ్ రాయల్ నా వద్ద డబ్బులు ఉన్నంతవరకు వాడుకున్నాడు. ఇప్పుడు నా పిల్లల కోసమే నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నా. నాకు ఏ పార్టీ మద్దతు లేదు. నా బిడ్డకు సర్జరీ కోసం డబ్బులు అడిగితే నానా దుర్భాషలాడి ఖాళీ చెక్ తీసుకుని లక్ష రూపాయలు ఇచ్చాడు. అందుకు సంబంధించిన వివరాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
ఆడబిడ్డకు కష్టం వస్తే ముందు ఉంటానని పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా చెప్పారే.. మరి కిరణ్ రాయల్‌ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నోట్ విడుదల చేస్తే సరిపోతుందా?’ అని లక్ష్మి ఆవేదన వ్యక్తంచేశారు. అదేవిధంగా ఎన్నికలు అయిపోగానే తన నుంచి తీసుకున్న నగదుకు రెండు రెట్లు అధికంగా తిరిగిస్తానని కిరణ్‌రాయల్ చెప్పాడని, అతని మాటలు నమ్మి మోసపోయానని తెలిపారు.
అధికార బలగాన్ని ఉపయోగించి తన ప్రాణం తీసినా.. తన ఇద్దరు బిడ్డలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నానని ఆమె కన్నీటిపర్యంతమవుతూ పలు ఆడియోలు, వీడియోలు, చెక్కులు, బాండ్ పేపర్లను మీడియా ఎదుట బహిర్గతం చేశారు. అంతుకుమందు ఆమె తిరుపతి ఎస్పీని గ్రీవెన్స్‌లో కలిసి కిరణ్ రాయల్‌పై ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని, న్యాయం చేయాలని కోరారు. కిరణ్ రాయల్ చేసిన అన్యాయాలకు సంబంధించిన ఆధారాలను అందించారు.
Comments
Please login to add a commentAdd a comment