laxmi
-
ఒకపుడు జర్నలిస్టు, అంబానీని మించిన ఇంద్రభవనంలో : అత్యంత అందమైన రాణి
విలాసవంతమైన భవనం అనగానే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ నివాసం ఆంటిలియా గుర్తొస్తుంది కదా. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ నివాసంగా గుర్తింపు పొందిన మరోకటి ఉంది తెలుసా. అది ఎక్కడ ఉంది? అందులో ఎవరుంటారు.. ఈ వివరాలు తెలుసుకుందాం రండి..!దాదాపు 600 ఎకరాల్లో ఉండే ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన ప్యాలెస్ మన దేశంలోనే ఉంది. బరోడాలోని గైక్వాడ్ కుటుంబానికి చెందిన గుజరాత్‌లోని వడోదరలో ఉన్న ఈ రాజభవనాన్ని వీక్షించాలంటే రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. ఇది బకింగ్‌హామ్ ప్యాలెస్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ. దాని పేరు లక్ష్మీ విలాస్ ప్యాలెస్.1890లో మరాఠా గైక్వాడ్ వంశస్థులు దీన్ని నిర్మించారు. శిల్పి మేజర్ చార్లెస్ మాంట్ ఇండో-సారసెనిక్ శైలిలో దీన్ని నిర్మించారు. 176 లగ్జరీ గదులు, కళ్లు చెదిరిపోయేలా హాళ్లు, తోటలు, ఫౌంటెన్ ఇలా సర్వ హంగులూ దీని సొంతం.ప్యాలెస్‌లో గోల్ఫ్ కోర్స్ కూడా ఉంది. బరోడా పాలకులుగా ఉన్న సమయంలో 1890లో మహారాజా శాయాజీరావ్ గైక్వాడ్ - III దీన్ని నిర్మించారు. ఈ రాజప్రాసాదాన్ని నిర్మించడానికే సుమారు పన్నెండేళ్లు పట్టిందట. ఇంతకీ ఈ అందమైన రాజభవనం విలువ ఎంతో తెలుసా? రూ.24,000 కోట్లకు పైమాటే. విశేషాలు3,04,92,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది లక్ష్మీ విలాస్ ప్యాలెస్. బకింగ్‌హామ్ ప్యాలెస్ విస్తీర్ణం 8,28,821 చదరపు అడుగులుమాత్రమే. మహారాజా ఫతే సింగ్ మ్యూజియంలో రాజా రవివర్మకు సంబంధించిన అనేక అరుదైన పెయింటింగ్స్ ఉన్నాయి. అంతేకాదు రాజభవనంలో ప్రపంచంలోని ఇతర ప్యాలెస్‌ల కంటే ఎక్కువ గాజు కిటికీలు ప్రత్యేక ఆకర్ణణ అని చెబుతారు. వీటిలో ఎక్కువ గాజు కిటికీలను బెల్జియం నుంచి తీసుకొచ్చారు.అందమైన రాణి రాధిక రాజే గైక్వాడ్ప్రస్తుతం గైక్వాడ్ వంశ కుటుంబానికి సారధి సమర్జిత్సిన్హ్ గైక్వాడ్ భార్య, మహారాణి మహారాణి రాధికరాజే గైక్వాడ్ దేశంలోని అత్యంత అందమైన , ఆధునిక రాణులలో ఒకటి గుర్తింపు తెచ్చుకున్నారు. గుజరాత్‌లోని వాంకనేర్‌కు చెందిన రాధిక రాజే 1978, జూలై 19న జన్మించారు. తండ్రి డా. MK రంజిత్‌సిన్హ్ ఝాలా.ఈయన ఐఏఎస్ అధికారికావడానికి రాజ్షాహి బిరుదును వదులు కున్నారట.రాధికారాజే గైక్వాడ్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని లేడీ శ్రీరామ్ కళాశాల నుండి భారతీయ చరిత్రలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. 2002లో మహారాజా సమర్జిత్సింగ్ గైక్వాడ్‌తో వివాహానికి ముందు, ఆమె జర్నలిస్టుగా పనిచేశారు. 2012లో లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌లో జరిగిన సంప్రదాయ వేడుకలో సమర్జిత్సిన్హ్ గైక్వాడ్ బరోడా కిరీటాన్ని స్వీకరించారు. ఈ దంపతులకు నారాయణి ,పద్మజ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చేతివృత్తుల కళాకారులు,మహిళల కోసం అనేక ప్రాజెక్టులను చేపడుతూ, వారికి ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు రాధికా రాజే -
భువనగిరి ఎంపీగా రాజగోపాల్‌రెడ్డి సతీమణి లక్ష్మి..?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: పార్లమెంట్ ఎన్నికల్లో పోటీలో నిలబడడానికి పలువురు నేతల వారసులు ఆసక్తి చూపుతున్నారు. నల్లగొండ ఎంపీ సీటు కోసం మాజీ మంత్రి జానారెడ్డి తనయుడు రఘువీరారెడ్డి ప్రయత్నాలు ప్రారంభించగా.. బీఆర్ఎస్ నుంచి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు గుత్తా అమిత్ ప్రయత్నాలు ప్రారంభించారు. భువనగిరి ఎంపీ స్థానంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన సతీమణి లక్ష్మిని బరిలో నిలపాలనే ఆలోచన చేస్తున్నారు. మరో వైపు కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి తనయుడు సూర్యపవన్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మోహన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిని కలువడం చర్చనీయాంశమైంది. వివిధ వేడుకలతో జనాల్లోకి.. అగ్రనేతల తనయులు వారి పుట్టిన రోజు, నూతన సంవత్సరం, సంక్రాంతి తదితర సందర్భాలను పురస్కరించుకొని ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ పార్టీ తరపున నల్లగొండ ఎంపీ టికెట్ కోసం మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రఘువీర్ తమ్ముడు జయవీర్‌రెడ్డి సాగర్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడ టికెట్‌ను రఘువీర్‌రెడ్డికి ఇప్పించేందుకు జానారెడ్డి ప్రయత్నాలు చేసినా కుదరలేదు. ప్రస్తుతం పార్లమెంట్ కోసం పోటీ చేయించాలానే ఆలోచనలో భాగంగా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళవారం రఘువీర్ రెడ్డి తన పుట్టిన రోజు సందర్బంగా హైదరాబాద్‌తో పాటు హాలియాలోనూ పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు నిర్వహించారు. బీఆర్ఎస్ నుంచి గుత్తా తనయుడు.. బీఆర్ఎస్ పార్టీ నుంచి నల్లగొండ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు గుత్తా అమిత్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. డిసెంబర్ 31న ఆయన జన్మదినం సందర్భంగా గుత్తా వెంకట్‌రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్బంలో ఆయన మునుగోడు టికెట్ ఆశించినా అది సాధ్యం కాలేదు. ప్రస్తుతం పార్లమెంట్ టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాడు రెండు పార్లమెంట్ నియోజక వర్గాలైన నల్లగొండ, భువనగిరి ఏ నియోజకవర్గాల నుంచి అవకాశం ఇచ్చినా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇటీవల నిర్వహించిన చిట్‌చాట్‌లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి వెల్లడించారు. ఎవరి ప్రయత్నాల్లో వారే.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో సూర్యాపేట టికెట్‌ను రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి ఇవ్వగా.. పటేల్ రమేష్‌రెడ్డి వర్గీయులు ఆందోళనకు దిగడంతో పాటుఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడ్డారు. దీంతో ఆయనకు అప్పటి కాంగ్రెస్ నేతలు ఎంపీగా అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. దీంతో ఎంపీ టికెట్ తనకే వస్తుందనే ఆలోచనల్లో రమేష్‌రెడ్డి ఉన్నారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో దామోదర్ రెడ్డి కూడా ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు తెలిసింది. ఇక బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కూడా ఆశిస్తున్నట్లు తెలిసింది. బీజేపీ నుంచి గార్లపాటి జితేందర్, సంకినేని వెంకటేశ్వర్రావు, మన్నెం రంజిత్ యాదవ్, బండారు ప్రసాద్, గోలి మదుసూదన్‌రెడ్డి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. భువనగిరి ఎంపీ టికెట్ కోసం టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, తీన్మార్ మల్లన్న, జెడ్పి మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి భువనగిరి మాజీ ఎమ్మల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, బూడిద బిక్షమయ్యగౌడ్ ప్రయత్నిస్తుండగా, బీజేపీ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌రావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఆశిస్తున్నట్లు తెలిసింది. రంగంలోకి ‘కోమటిరెడ్డి’ కుటుంబం భువనగిరి పార్లమెంట్ సీటు కోసం ‘కోమటిరెడ్డి’ కుటుంబం రంగంలోకి దిగింది. ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన సతీమణి లక్ష్మిని భువనగిరి ఎంపీగా పోటీ చేయించాలన్న ఆలోచనల్లో ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి తనయుడు సూర్యపవన్‌రెడ్డి భువనగిరి ఎంపీగా పోటీ చేస్తారనే చర్చ జోరందుకుంది. అందులో భాగంగా నూతన సంవత్సరం పురస్కరించుకుని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డిని కలువడం చర్చనీయాంశంగా మారింది. నూతన సంవత్సరం, సంక్రాంతిని పురస్కరించుకొని ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు భువనగిరి ఎంపీ టికెట్‌ను కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి కూతురు కీర్తిరెడ్డి కూడా ఆశిస్తున్నట్లు తెలిసింది. -
దీపావళి వేళ... అమ్మవారికి రోబోటిక్ హారతులు!
దేశవ్యాప్తంగా ఆదివారం దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పిల్లాపెద్దా అంతా ఉత్సాహంగా వేడుకల్లో మునిగితేలారు. పటాకుల మోతతో దేశంలోని వీధులన్నీ దద్దరిల్లిపోయాయి. ఆకాశం అద్భుత కాంతులతో వెలిగిపోయింది. ఇదిలావుండగా దీపావళి రోజున లక్ష్మీపూజ చేయడం పలు ప్రాంతాల్లో ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా ఉత్తరాదిన దీపావళినాడు ప్రతి ఇంటా తప్పనిసరిగా లక్ష్మీ పూజలు చేస్తుంటారు. ఈ నేపధ్యంలో ఢిల్లీకి చెందిన ఒక రొబోటిక్ కంపెనీ విచిత్ర రీతిలో దీపావళి వేడుకలు నిర్వహించింది. శ్రీమహాలక్ష్మి అమ్మవారికి రోబో చేతులు మీదుగా హారతులిప్పించింది. దీనికి సంబంధించిన వీడియోను ‘ఇండియన్ టెక్ అండ్ ఇన్ఫ్రా’ సోషల్‌మీడియా ప్లాట్ ఫారం ‘ఎక్స్’లో షేర్ చేసింది. ఈ వీడియోను నెటిజన్లు అమితంగా ఇష్టపడుతున్నారు. ఇది కూడా చదవండి: యూపీలో పేలిన బాంబు.. ఒకరి మృతి! Delhi based robotics company Orangewood's unique Diwali celebration. pic.twitter.com/eW6vafKOqH — Indian Tech & Infra (@IndianTechGuide) November 12, 2023 -
ఏంటి..? నిజాయితీగా పని చేస్తే ఇలా చేస్తారా..!?
కుమరం భీం: నిజాయతీగా పని చేసిన అధికారులకు వేధింపులు తప్పడం లేదు. కుమురంభీం జిల్లా రవాణా శాఖ అధికారిపై అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది. జిల్లాలో ఇసుక, కంకర తదితర రవాణా చేసే టిప్పర్లు నిబంధనలకు విరుద్ధంగా భారీ లోడ్‌తో వెళ్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, కౌటాల తదితర ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. దీనిపై ‘సాక్షి’ గత నెల 24న ‘కిల్లింగ్.. ఓవర్ లోడ్’ శీర్షికన ఓ కథనం ప్రచురించింది. స్పందించిన జిల్లా రవాణా శాఖ అధికారి జి.లక్ష్మీ తమ సిబ్బందిని అప్రమత్తం చేశారు. అదే రోజున ఐదు టిప్పర్లు అధిక లోడ్‌తో వెళ్తున్న వాటిని గుర్తించి సీజ్ చేశారు. వాటిని విడిచిపెట్టాలంటూ ఓ ప్రజాప్రతినిధి ఫోన్ చేసి అడిగారు. అందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో తాము చెప్పినా వినిపించుకోకుండా, ఫైన్ వేస్తారా? అనే కోపంతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, రవాణాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. ఆ ఫిర్యాదు ప్రభుత్వ పరి శీలనలో ఉంది. దీంతో ఆమెను ఇక్కడి నుంచి బదిలీ వేటు వేస్తారా? అని అధికారుల్లో చర్చ నడుస్తోంది. అయితే తన విధులు తాను నిర్వర్తించానని, ఇందులో రాజకీయం జోక్యం చేసుకున్నా తనకేం ఇబ్బంది లేదని, ఎక్కడైనా పని చేస్తామనే ధీమాతో ఉన్నట్లు తెలిసింది. -
కుక్కలు దాడులు చేయడానికి కారణాలు ఇవే..
-
వైజాగ్ సృజన ఉదంతం మరవకముందే మహబూబ్‌నగర్‌లో లక్ష్మి!
సాక్షి, మహబూబ్‌నగర్: వైజాగ్ మదురవాడ నవవధువు సృజన ఘటన మరువకముందే మరో విషాద ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. తనకు ఇష్టంలేని పెళ్లి చేశారని మనస్తాపంతో ఓ నవ వధువు వివాహం జరిగిన కాసేపటికే ఆత్మహత్య చేసుకుంది. వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని పాతతోట ప్రాంతానికి చెందిన లక్ష్మికి అనంతపూర్ జిల్లాకు చెందిన మల్లికార్జున్‌తో గురువారం వివాహం జరిగింది. పెళ్లి సందర్భంగా ఎంతో హుషారుగా కనిపించిన నవవధువు లక్ష్మి.. ఒక్కసారిగా పెళ్లింట విషాదాన్ని నింపింది. వివాహమైన కాసేపటికే నవ వధువు.. బాత్రూమ్లోకి వెళ్లి పేను విరుగుడుకు వేసే మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అనంతరం ఆమె ఎంతకీ బాత్ రూమ్ నుంచి బయటకు రాకపోవడంతో లక్ష్మి కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా ఆమె స్పృహలేకుండా కిందపడిపోయి కనిపించింది. వెంటనే ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించగా.. లక్ష్మి అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఇరు కుటుంబాల సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, లక్ష్మి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలియాల్సి ఉంది. ఇది కూడా చదవండి: నిజామాబాద్‌లో వైద్యురాలు అనుమానాస్పద మృతి -
పిడుగుపాటుకు ముగ్గురు బలి
భూపాలపల్లి రూరల్/ఏటూరునాగారం: ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో సోమవారం పిడుగుపాటుకు ముగ్గురు మహిళలు మృతిచెందారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపా లపల్లి మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో ఇద్దరు, ము లుగు జిల్లా ఏటూరునాగారం మండలం శంకరాజుపల్లిలో ఒక మహిళ మృతిచెందారు. ఈ రెండు ఘటనలు వరి పొలంలో కలుపుతీస్తుండగా జరిగాయి. భూపాలపల్లి జిల్లా పెద్దాపూర్ గ్రామానికి చెందిన గట్టు మల్లేశ్ భార్య గట్టు లక్ష్మి (40) తన వ్యవసాయ పొలంలో కలుపు తీసేందుకు అదే గ్రామానికి చెందిన పసరగొండ మంజుల (38)ని కూలికి తీసుకెళ్లింది. సోమవారం సాయంత్రం సమయంలో వర్షం రావడంతో ఇద్దరు కవరు కప్పుకొని పొలం గట్టుపై కూర్చు న్నారు. అదే సమయంలో ఒక్కసారిగా పిడుగు పడడంతో వారు అక్కడికక్కడే మరణించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మృతుల కుటుంబ సభ్యులను ప రామర్శించారు. మరోఘటనలో ములుగు జిల్లా ఏటూరునా గారం మండలం శంకరాజుపల్లికి చెందిన ఆతుకూరి లాలమ్మ తన కుమార్తె రమ్య (20)తో కలిసి సోమవారం పంట పొలాల్లోకి కూలి పనికి వెళ్లింది. వీరికి సమీపంలో పిడుగు పడింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా రమ్య మృతి చెందింది. లాలమ్మ కోలుకుంటుందని వైద్యులు తెలిపారు. -
కలెక్షన్లు కురిపిస్తూ రికార్డు సృష్టిస్తోన్న 'లక్ష్మీ'
ఒకప్పుడు హిందీ సినిమాలను తెలుగులో రీమేక్ చేసే ట్రెండ్ నడిచేది. కానీ ఇప్పుడు తెలుగు సినిమాలు బాలీవుడ్లో వరుసగా పట్టాలెక్కుతున్నాయి. ఒక్క తెలుగు మాత్రమే కాదు, మొత్తం సౌత్ ఇండస్ట్రీ మీదనే బాలీవుడ్ దర్శకనిర్మాతల కన్ను పడింది. ఇక్కడి సినిమాలను తిరిగి రూపొందిస్తూ ఒరిజినల్ కన్నా పెద్ద హిట్టు అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలుగు, తమిళంలో సూపర్ డూపర్ హిట్ సాధించిన 'కాంచన' చిత్రం హిందీలో 'లక్ష్మీ'గా తెరకెక్కింది. దీనికి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు. కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్, షబీనా ఖాన్, తుషార్ కపూర్ కలిసి నిర్మించారు. (చదవండి: నటిపై ట్రోలింగ్: దేవుళ్ల మీదే ఎగతాళా?) స్టార్ హీరో అక్షయ్ కుమార్, హీరోయిన్ కియారా అద్వానీ జంటగా నటించిన ఈ చిత్రం థియేటర్ల ఓపెనింగ్ కోసం వేచి చూడకుండా నవంబర్ 9న ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ హాట్‌స్టార్‌లో రిలీజైంది. అదే రోజు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజి, పపువా న్యూగినియా, యూఏఈలో థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రం విడుదలైన మొదటి వారంలోనే ఒకటిన్నర కోట్లు రాబట్టింది. ఫిజిలో 17, ఆస్ట్రేలియాలో 70, న్యూజిలాండ్‌లో 42 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. ఇక హాట్‌స్టార్ వీఐపీ చరిత్రలోనే అత్యధిక ఓపెనింగ్స్ వచ్చిన చిత్రంగా రికార్డు సృష్టించింది. కరోనా కాలంలో ఇలాంటి వసూళ్లు రావడం గొప్ప విషయమని విశ్లేషకులు అంటున్నారు కాగా మొదట్లో ఈ చిత్రానికి 'లక్ష్మీ బాంబ్' అని టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే లక్ష్మీ అంటే పవిత్రమైన పేరు అని, టైటిల్ దాన్ని కించపరిచేలా ఉందని శ్రీ రాజ్‌పుత్ కర్ణిసేన సినిమా యూనిట్‌కు నోటీసులు పంపింది. దీంతో చిత్ర యూనిట్ టైటిల్‌ను లక్ష్మీ అని మార్చక తప్పలేదు. (చదవండి: టైటిల్లో మార్పులు.. కొత్త పోస్టర్ విడుదల) -
వరకట్న వేధింపులకు నిండు గర్భిణి బలి
మైసూరు : ప్రపంచ మహిళ దినోత్సవం రోజునే నిండు గర్భిణి వరకట్న వేధింపులకు బలైన ఘటన జిల్లాలోని హుణసూరు పట్టణం సమీపంలోని కల్కుణి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు... మైసూరు జిల్లాలోని నంజనగూడు తాలుకాలోని మంచళ్లి గ్రామానికి చెందిన లక్ష్మి (24)ని 10 నెలల క్రితం హుణసూరుకు చెందిన యోగేష్ ఇచ్చి వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో కట్న కానుకలు సమర్పించారు. అనంతరం కూడా ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇల్లు ఇచ్చే విషయం ఆలస్యం కావడంతో కుటుంబ సభ్యులు మరింత కట్నం తీసుకురావాలని వేధించడం మొదలుపెట్టారు. దీంతో భర్త, అత్తింటి వేధింపులు తాళలేక లక్ష్మీ ఆదివారం ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. -
అడ్డుకుంటేనే ఆగుతారు
విద్యార్ధినులు, యువతులు, మహిళా ఉద్యోగినులు, అంగన్వాడీ, ఆశా మహిళలకు ఆత్మరక్షణ కోసం శిక్షణ ఇస్తున్నారు లక్ష్మి. శాంతి భద్రతలను కాపాడడంతోపాటు, సమాజానికి రక్షణ కల్పించే పనిలో ఉన్న మహిళ కానిస్టేబుళ్లు, హోంగార్డులు, షీ టీం సభ్యులకు సైతం పోరాట కళలో మెళుకువలు నేర్పిస్తున్నారు. నిత్యం జరుగుతున్న ఆగడాల భయంతో ఆడపిల్లలు ఇంట్లోనే ఉండిపోతే తమ కలల్ని నిజం చేసుకోలేరని లక్ష్మి అంటున్నారు. ఈ కథ లక్ష్మిదే అయినా, రవి దగ్గర్నుంచి మొదలుపెట్టాలి. రవిది వరంగల్ జిల్లా కొత్తవాడ. కరాటే అంటే ఆసక్తి. చిన్నతనంలోనే ఏడాదిన్నర వ్యవధిలో బ్లాక్ బెల్ట్ సాధించే దశకు చేరుకున్నాడు! ప్రస్తుతం బ్లాక్ బెల్ట్‌లో సెవన్త్ డాన్. కరాటేనే వృత్తిగా ఎంచుకొని పాఠశాల పిల్లలకు నేర్పిచడానికి రాష్ట్రమంతటా తిరుగుతున్నప్పుడు అతడికి లక్ష్మితో పరిచయం అయింది. లక్ష్మిది నిజామాబాద్ జిల్లా మాకులూరు మండలం శాంతినగర్ గ్రామం. అప్పటికే ఆమెకు కరాటేలో ప్రవేశం ఉంది. ఇద్దరూ 1997లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత కూడా లక్ష్మి మార్షల్ ఆర్ట్స్‌ను కొనసాగించారు. ప్రస్తుతం ఆమె బ్లాక్‌బెల్ట్‌లో సిక్త్స్ డాన్. షీ టీమ్‌లకు కోచింగ్! తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రత కోసం షీ టీమ్‌లను ఏర్పాటు చేయడంతో లక్ష్మి ప్రాధాన్యం మరింత పెరిగింది. మహిళా ఐపీఎస్‌ల నేతృత్వంలో విధులు నిర్వర్తించే షీ టీమ్‌లకు శిక్షణ ఇవ్వడానికి లక్ష్మికి అవకాశం వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు మార్షల్ ఆర్ట్స్‌ను నేర్పించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా లక్ష్మికి ప్రాధాన్యం లభించింది. ఆమె చేత పాఠశాలల్లో పని చేస్తున్న పీఈటీలకు శిక్షణ ఇప్పించారు. మూడేళ్ల క్రితం జనగామ జిల్లా కేంద్రంలో జరిగిన ‘సంఘటిత సబల’ కార్యక్రమం గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించడం వెనుక లక్ష్మి కృషి, పట్టుదల ఉన్నాయి. ఆమె భర్త సహకారం ఉంది. – ఇల్లందుల వెంకటేశ్వర్లు, సాక్షి, జనగామ, ఫోటోలు: గోవర్ధనం వేణుగోపాల్ పోకిరీల భయంతో చదువు ఆగకూడదు చిన్నప్పటి నుంచే పోలీసు ఆఫీసర్ కావాలనే కోరిక బలంగా ఉండేది. సుమన్, విజయశాంతి, సినిమాలను చూసి అప్పుడే కరాటే నేర్చుకోవడం ప్రారంభించాను. పదో తరగతి చదువుతున్న సమయంలోనే నా స్నేహితురాలిని కొందరు పోకిరీలు వేధించడంతో భయంతో చదువును ఆపేసి ఇంటి వద్దనే ఉండిపోయింది. ఆ సంఘటన తరువాత ప్రతి విద్యార్థినీ ధైర్యంగా చదువుకోవడానికి స్వేచ్ఛగా వెళ్లాల్సిన ఆత్మ విశ్వాసాన్ని నెలకొల్పాలని భావించాను. ఆ విధిని నా భర్తతో కలసి నెరవేరుస్తున్నాను. – లక్ష్మి -
పిల్లలు కావాలనుకుంటే ప్రాణం పోయింది!
పరిగి: సంతానం కోసం ఆమె ఆర్ఎంపీ ఇచ్చిన మందులు వినియోగించింది. అనంతరం పలు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంది. పరిస్థితి విషమించడంతో ప్రాణమే పోయింది. ఈ ఘటన పరిగి మండల పరిధిలోని రూప్‌ఖాన్‌పేట్‌లో సోమవారం వెలుగుచూసింది. పోలీసులు, మృతురాలి కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నర్సమ్మ కూతురు లక్ష్మి(24)ను అదే గ్రామానికి చెందిన రాంచంద్రయ్యకు ఇచ్చి ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేశారు. దంపతులకు సంతానం కలగలేదు. దీంతో 15 రోజుల క్రితం వీరు పరిగిలోని ఓ ఆర్ఎంపీని ఆశ్రయించారు. ఆయన ఇచ్చిన మందులు వాడారు. మందులు వికటించడంతో లక్ష్మికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. వారం రోజుల క్రితం ఆమెను కుటుంబీకులు పరిగిలోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అనంతరం వికారాబాద్‌లోని మిషన్ ఆస్పత్రిలో చూపించారు. పరిస్థితి విషమించడంతో మూడు రోజులు క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆదివారం గాంధీ ఆస్పత్రికి తీసుకువెళ్లగా పరిస్థితి విషమించి సోమవారం తెల్లవారుజామున లక్ష్మి మృతి చెందింది. రాంచంద్రయ్య సంతానం కోసం ఏవేవో మందులు వినియోగించడంతోనే తన కూతురు మృతిచెందిందని మృతురాలి తల్లి నర్సమ్మ ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరిగికి చెందిన ఆర్ఎంపీ ఇచ్చిన మందులు వినియోగించిన తర్వాత పరిస్థితి విషమించి తన భార్య చనిపోయిందని రాంచంద్రయ్య తెలిపాడు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. -
ప్రమాదమా.. అకృత్యమా?
కర్ణాటక, కోలారు: కోలారు తాలూకాలోని గద్దె కణ్ణూరుగ్రామంలో ఓ అమ్మాయి గత శనివారం నీటి సంప్‌లో పడి మరణించిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. గ్రామానికి చెందిన దేవరాజ్ కుమార్తె లక్ష్మి(17) అనుమానాస్పదంగా మరణించిన యువతి. యువతి మరణంపై తల్లిదండ్రులు అత్యాచారం, హత్య అని అనుమానం వ్యక్తం చేస్తూ కోలారు రూరల్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం తహశీల్దార్ సమక్షంలో శవాన్ని సంప్ నుంచి బయటకు తీసి మరణోత్తర పరీక్షను నిర్వహించారు. ఏం జరిగిందంటే గ్రామానికి చెందిన దేవరాజ్ కుమార్తె లక్ష్మి తాలూకాలోని కెంబోడి జనతా కళాశాలలో ఇంటర్ చదువుతోంది. శనివారం ఎప్పటిలాగానే కళాశాలకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చింది. ఇంట్లో పనులు ముగించుకుని తోటకు రావాల్సిందిగా తండ్రి దేవరాజ్ తెలుపగా తాను ఇంట్లోనే ఉంటానని లక్ష్మి తెలిపింది. అనంతరం దేవరాజ్ తోటకు వెళ్లి పోయాడు. అనంతరం మళ్లీ ఇంటికి వచ్చిన సమయంలో కూతురు ఇంట్లో కనిపించలేదు. మునిసిపల్ కొళాయి నుంచి నీరు వదలడంతో దేవరాజ్ నీటిని వదలడానికి సంప్ తెరిచాడు. అందులో కూతురు శవం కనిపించడంతో నిర్ఘాంతపోయాడు. బంధుమిత్రులతో కలిసి ఇంటి సమీపంలోనే ఉన్న తోటలో అంత్య సంస్కారం చేశారు. పోలీసులకు ఫిర్యాదు అయితే సోమవారం కోలారు స్లం నివాసి అభి పేరుతో యువతి తండ్రికి ఫోన్ కాల్ వచ్చింది. తాను మీ కూతురిని నేను ప్రేమిస్తున్నానని, ఆమె ఎలా చనిపోయింది? అని ప్రశ్నించాడు. దీంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు.. శనివారం తాము ఇంట్లో లేని సమయంలో కూతురిపై అత్యాచారం చేసి సంప్‌లో పడేసి హత్య చేసి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో మంగళవారం ఉదయం తహశీల్దార్, పోలీసులు స్థలానికి వచ్చి పరిశీలన జరిపారు. యువతి శవాన్ని తహశీల్దార్ సమక్షంలో బయటకు తీసి పోస్టుమార్టం జరిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అందుకు ‘ఓ బేబీ’కి ఓకే చెప్పేశా : నాగశౌర్య
‘‘ఓ బేబీ’ చిత్రంలో నాది అతిథి పాత్ర అని చెప్పినా నందినీ రెడ్డిగారికి ఓకే చెప్పేశా. ఎందుకంటే ఈ సినిమాలో నాకు చాలా ఇష్టమైన లక్ష్మీగారు ఉన్నారు. ‘మురారి’ సినిమా చూసినప్పటి నుంచి ఆమెతో పని చేయాలనుకుంటున్నా. ఇంతకు ముందు ఒకసారి అనుకున్నా కుదరలేదు. ‘ఓ బేబీ’ తో కుదిరింది’’ అని హీరో నాగశౌర్య అన్నారు. సమంత, లక్ష్మీ, రాజేంద్రప్రసాద్, నాగశౌర్య, రావు రమేష్ ముఖ్య పాత్రల్లో బి.వి. నందినీరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓ బేబీ’. సురేశ్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్రసాద్, హ్యున్ హు, థామస్ కిమ్ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా నాగశౌర్య చెప్పిన విశేషాలు. ♦ హీరోగా చేస్తూ అతిథి పాత్రలు చేయడం ఇబ్బందిగా లేదు. నాకు నచ్చిన వారితో సినిమా చేయడం చాలా ఇష్టం. నందినీరెడ్డిగారు నాకు అక్కలాంటివారు. ఈ సినిమా గురించి ఆమె నాకు చెప్పడానికి సందేహిస్తుంటే మా అమ్మ ఒత్తిడి చేసి నాకు చెప్పించింది. కథ వినగానే తప్పకుండా హిట్ అయ్యే సినిమా అనిపించి, ఇందులో నేనూ భాగం కావాలనుకున్నా. ♦ తొలుత నాది అతిథి పాత్రే అనుకున్నా. సెట్లోకి వెళ్లాక ఫుల్ లెంగ్త్ అయింది. లక్ష్మీగారు సెట్లో ఉన్నప్పుడు ఒక రోజు మొత్తం నేను, సమంతగారు అక్కడే ఉన్నాం. నేను ఒక్కసారి ఆమెను పలకరించాను. ఆ తర్వాత దూరం నుంచి చూస్తూ నిలబడ్డాను. ఎందుకంటే నాకు సిగ్గెక్కువ. అందరూ దాన్ని పొగరు అనుకుంటారు. నా సిగ్గు వల్ల రొమాంటిక్ సీన్స్‌కి దూరంగా ఉంటున్నా. కానీ, తప్పదంటే మాత్రం చేస్తా. ♦ ఈ సినిమాలో నా లుక్ బాగుందని అంటున్నారు. అంటే ఇన్నాళ్లు నేను బాగా లేనా? అనిపించింది (నవ్వుతూ). సమంత గారితో పని చేస్తున్నప్పుడు నేను పెద్ద హీరోయిన్‌తో పని చేస్తున్నానని ఏ రోజూ అనిపించలేదు. ఈ సినిమాలో ఆమె ముఖం మీద ఉమ్మివేసే సీన్ ఉంటుంది. నేను ఆ పని చేస్తే బయట అందరూ నా మీద ఉమ్మేస్తారనుకున్నా. కానీ ఆమె డెడికేటెడ్ వ్యక్తి. సినిమా కోసమే కదా అని సహకరించడంతో ఆ సీన్ చేశా. ♦ ప్రస్తుతం మా ఐరా క్రియేషన్స్‌లో ‘అశ్వత్థామ’ సినిమా చేస్తున్నాం. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ‘ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి’ చేస్తున్నా. అదే విధంగా ‘పార్థు’ అని మరో సినిమా జరుగుతోంది. రిస్క్ చేయడం వల్ల ఇటీవల గాయపడ్డానని అంటున్నారు. అంత రిస్క్ అవసరమే. అది 14 నిమిషాల సీను. డూప్‌ని పెడితే ప్రేక్షకులకు అర్థమైపోతుంది. హీరో పడే టెన్షన్ వాళ్లూ పడాలంటే నేనే కష్టపడాలని అర్థమైంది.. అందుకే రిస్క్ చేసి నేనే చేస్తున్నా. -
అత్త చెవి కొరికిన అల్లుడు
కొరుక్కుపేట: అత్త చెవి కొరికిన ఓ అల్లుడు కటకటాలపాలయ్యాడు. మదురై జిల్లాలో జరిగిన ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వివరాలు ... మదురై జిల్లా సమయనల్లూరుకు చెందిన ముత్తుకుమార్ ,కవిత అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఐదేళ్లయినా సంతానం కలగలేదు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడాకుల కోసం కోర్టులో దాఖలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కవిత పుట్టింటికి వెళ్లిన ముత్తుకుమార్ ఆమెతో ఘర్షణకు దిగాడు. సర్ది చెప్పేందుకు వచ్చిన అత్త లక్ష్మి చెవిని అల్లుడు ముత్తుకుమార్ కోపంలో కొరికేశాడు. నోప్పితో విలవిలలాడిన లక్ష్మిని ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులు ముత్తుకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
నల్లగొండ బరిలో పోరుబిడ్డ
తెలంగాణ సాయుధ పోరాట యోధుల కుటుంబం నుంచి వచ్చిన మల్లు లక్ష్మి.. నల్లగొండ లోక్‌సభ ఎన్నికల బరిలో సీపీఎం అభ్యర్థిగా నిలిచారు. మహిళా రిజర్వేషన్లపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అంటోన్న ఆమె.. కాంగ్రెస్, బీజేపీ అవినీతిలో అన్నదమ్ములేనని అంటున్నారు. నిత్యం ప్రజల పక్షాన ఉండే వామపక్ష పార్టీలే కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యామ్నాయ పార్టీలని నినదిస్తున్న ఆమె.. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా. ‘సాక్షి’తో ఆమె మనోగతం.. చెప్పింది చేస్తా.. నల్లగొండ నియోజకవర్గానికి సంబంధిం చి.. ప్రధానంగా మాచర్ల–నల్లగొండ, బీబీనగర్–ఖాజీపేట రైల్వే డబుల్ లైన్ల ఏర్పాటు, సూర్యాపేట–విజయవాడ ప్రత్యేక లైను ఏర్పాటుకు కృషి చేస్తా. సీఎం కేసీఆర్ మహిళల కోసం పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేస్తానని చెప్పినా.. చేయలేదు. దీనిపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా. రైతులకు గిట్టుబాటు ధర, శ్రీశైలం సొరంగ మార్గం పూర్తికి కృషి చేసి ఫ్లోరిన్ శాశ్వత పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా. మల్లు లక్ష్మి స్వగ్రామం: మొల్కపట్నం, వేములపల్లి మండలం భర్త: మల్లు నాగార్జున్ రెడ్డి సంతానం: ఇద్దరు తనయులు తల్లిదండ్రులు: నామిరెడ్డి రాములమ్మ, జనార్దన్‌రెడ్డి అత్తామామలు: మల్లు స్వరాజ్యం, వెంకటనర్సింహారెడ్డి విద్యార్హతలు: బీఏ, ఎల్ఎల్బీ రాజకీయానుభవం: ఐద్వా నాయకురాలు, రాయినిగూడెం ఏకగ్రీవ సర్పంచ్ రాజకీయాలకు రాకముందు: గృహిణి, విద్యాభ్యాసం. ఉద్యోగ కల్పనే ఎజెండా.. రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. కార్మికులు పనుల్లేక వలస పోతున్నారు. ఉపాధి హామీ పనిదినాలు పెంచాలి. మఠంపల్లి, మేళ్లచెర్వు ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీల్లో స్థానికులకు అవకాశమిచ్చేలా ఒత్తిడి తెస్తాం. నాగార్జునసాగర్‌లో జాతీయ పర్యాటక కేంద్రం కోసం కృషి చేస్తా. సాగునీటి వైఫల్యాలపై ప్రభుత్వాలనుపార్లమెంట్లో నిలదీస్తా. ప్రతి ఒక్కరికీనాణ్యమైన సమాన విద్య అందిస్తా. అవగాహన ఉంది.. మా అత్తామామలు తెలంగాణ రైతాంగ పోరాట యోధులు. వారి ప్రోత్సాహంతోనే రాజకీయాల్లోకి వచ్చాను. ఐద్వా నాయకత్వంలో పనిచేశా. నల్లగొండలో డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల రుణాలు, గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేశాను. పోలీసులు లాఠీచార్జి చేశారు. రెండు రోజులు జైలు జీవితం కూడా గడిపా. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలపై పోరాడా. ఏడు కిలోమీటర్లు పాదయాత్ర చేశా. 2006లో నా అత్తగారి ఊరైన రాయినిగూడెం గ్రామానికి ఏకగ్రీవ సర్పంచ్‌నయ్యా. ఇలా నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సమస్యలపై పోరాడిన అనుభవం ఉంది. సమస్యలన్నీ తెలుసు. మహిళా రిజర్వేషన్.. మహిళా రిజర్వేషన్ సాధించాలి. అప్పుడే మహిళలకు రాజకీయంగా ప్రాధాన్యం లభిస్తుంది. అదే ప్రధాన ఎజెండాగా ముందుకెళ్తా. మహిళాభ్యున్నతికి పారిశ్రామిక కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తా. అవే నా ప్రధాన ప్రచారాస్త్రాలు.. నిత్యం ప్రజల్లో ఉన్నా.. మహిళా, కార్మిక సమస్యలపై పోరాడా, ఏకగ్రీవ సర్పంచ్‌గా ఉండి ఉద్యమించి అప్పటి వైఎస్ ప్రభుత్వ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏకగ్రీవ పంచాయతీలకు నిధులు సాధించా. డ్వాక్రా మహిళా సమస్యలపై పోరాడా, కార్మికులు, కర్షకులు, రైతాంగ సమస్యలపై నినదించాం. ఇవన్నీ ఎన్నికల్లో విజయానికి దోహదపడతాయి.–ఎన్.క్రాంతీపద్మ, సాక్షి– నల్లగొండ ప్రతినిధి -
భార్యను సజీవదహనం చేసిన భర్త
బీర్కూర్(బాన్సువాడ) : కట్టుకున్న భార్యను కిరోసిన్ పోసి నిప్పటించి సజీవదహనం చేసిన ఘటన బీర్కూ ర్ మండల కేంద్రంలో ఆదివారం రాత్రి సంభవించింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బీర్కూర్ మండల కేంద్రంలోని ఇందిరా కాలనీకి చెందిన మెరిగె అశోక్‌కు మెరిగె లక్ష్మి(35)తో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. కొద్ది సంవత్సరాలుగా వారిమధ్య మనస్పర్థలు ఎక్కువయ్యాయి. భర్త అశోక్ రోజూ తాగివచ్చి భార్యను హింసించేవాడని చుట్టుపక్కల వారు వివరించారు. కాగా రోజు మాదిరిగానే ఆదివారం తాగి వచ్చిన భర్తతో లక్ష్మి గొడవ పడింది. అనంతరం అశోక్ తన ఇద్దరు పిల్లలను పక్కింట్లో పడుకోబెట్టాడు. అదే సమయంలో తల్లిదండ్రుల ఘర్షణను అడ్డుకోవడానికి ప్రయత్నించిన కుమారుడిని బయటకు పంపించి వేసి అశోక్ తన భార్య లక్ష్మిపై కిరోసిన్ పోసి నిప్పటించాడు. దీంతో సజీవదహనమైన లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చే రుకుని మృతదేహాన్ని బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టామని ఎస్సై పూర్ణేశ్వర్ వివరించారు. -
అది వేరే లెవల్
తమిళసినిమా: ఆ చిత్రం వేరే లెవల్. దానితో పోల్చకండి అని అన్నారు నటుడు ప్రభుదేవా. ఈయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ప్రభుదేవా కథానాయకుడిగా నటించిన చిత్రం లక్ష్మీ. దేవి చిత్రంతో హిట్ కొట్టిన ఈయన ఇప్పుడు లక్ష్మీ అంటున్నారు. ఇది డాన్స్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం. ప్రమోద్ ఫిలింస్, ట్రైడెంట్ ఆర్ట్స్ సంస్థలు నిర్మించిన ఈ చిత్రానికి విజయ్ దర్శకుడు. ప్రభుదేవాకు జంటగా నటి ఐశ్వర్యరాజేశ్ నటించిన ఇందులో బేబీ దిత్య ప్రధాన పాత్రలో నటించింది. శ్యామ్.సీఎస్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శనివారం సాయంత్రం చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. కార్యక్రమంలో నటి ఐశ్వర్యరాజేశ్ మాట్లాడుతూ..ఈ చిత్రంలో తన పాత్ర చిన్నదే అయినా కథ అంతగా తనను ఆకట్టుకుందని ఐశ్వర్యరాజేశ్ అన్నారు. ప్రభుదేవాతో కలిసి నటించడం చాలా మంచి అనుభవం అని పేర్కొన్నారు. ప్రభుదేవా మాట్లాడుతూ లక్ష్మీ చిత్రాన్ని చూసి రవీంద్రన్ విడుదల హక్కులను పొందారన్నారు. దర్శకుడు విజయ్ కలిసి డాన్స్ ఇతి వృత్తంతో చిత్రం చేద్దాం అని చెప్పగానే సాధా సీదా చిత్రంలా కాకుండా ఇండియా స్థాయిలో ఆ చిత్రం ఉండాలని చెప్పానన్నారు. పలువురు చిన్నారులతో విజయ్ అదే స్థాయిలో లక్ష్మీ చిత్రాన్ని తీశారని చెప్పారు. ఆయన దర్శకత్వంలో దేవీ, లక్ష్మీ చిత్రాల్లో నటించానని, అదే విధంగా దేవి– 2 చిత్రంలోనూ నటించాలని నిర్ణయించుకున్నానన్నారు. తాను ఈ చిత్రంలో 4,5 టేక్‌లు తీసుకున్నా, పిల్లలు ముఖ్యంగా దిత్యా సింగిల్ టేక్‌లో ఫుల్ మూమెంట్‌ను ఆడేసేదన్నారు. ఇంతకు ముందు డాన్స్ నేపథ్యంలో సలంగై ఒళి వచ్చిన విషయం తెలిసిందేనన్నారు. అది వేరే లెవల్ అని, ఆ చిత్రంతో లక్ష్మీ చిత్రాన్ని పోల్చవద్దు అని అన్నారు. అయితే ఈ చిత్రం అందరినీ అలరిస్తుందని ప్రభుదేవా అన్నారు. దర్శకుడు విజయ్ మాట్లాడుతూ ఈ చిత్రం కోసం ప్రభుదేవా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నటించారని అన్నారు. ఆయన తమ టీమ్‌కు అతి పెద్ద పిల్లర్ అని పేర్కొన్నారు. -
న్యాయం కోసం సెల్‌టవర్ ఎక్కిన మహిళ
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): తన భర్త మరణించిన తరువాత తల్లిదండ్రులు, అత్తవారిచ్చిన స్థలాన్ని కొంతమంది కబ్జా చేసినా తననెవరూ ఆదుకోలేదని.. తనకు న్యాయం చేయకపోతే కిందకు దూకి మరణిస్తానని ఓ మహిళ సెల్ టవర్ ఎక్కిన ఘటన విశాఖలో కలెక్టరేట్ వద్ద సోమవారం చోటు చేసుకుంది. మల్కాపురం అంబేడ్కర్ కాలనీకి చెందిన బాధితురాలు ఉల్లసి లక్ష్మికథనం ప్రకారం.. ఆమె భర్త అనారోగ్యంతో మూడేళ్ల కిందట మరణించాడు. ఇద్దరు ఆడపిల్లలతో కూలి పని చేసుకుంటూ జీవిస్తోంది. అంబేడ్కర్ కాలనీలో ఓ స్థలాన్ని తన తల్లిదండ్రులు పెళ్లి సమయంలో కట్నంగా ఇచ్చారని, ఆ స్థలాన్ని భూషణ్ అనే రిటైర్డ్ పోలీసు అధికారి కబ్జా చేశాడని, తనపై భౌతిక దాడి చేసి హింసించాడని తెలిపింది. అంతేకాకుండా తన అత్త వారి ఊరైన నక్కపల్లి మండలం ఉప్మాక గ్రామంలో తన భర్త ఆస్తి 50 సెంట్ల భూమిని గోర్స సత్యారావు అనే వ్యక్తి కబ్జా చేçసి, తన పేర రాయించుకున్నాడని, ఈ విషయాన్ని మండల అధికారులకు, జిల్లా ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు పేర్కొంది. కాగా విషయం తెలుసుకున్న కలెక్టరేట్ సూపరింటెండెంట్ సూర్యప్రకాష్ ఘటనాస్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. విశాఖ ఆర్డీవో తేజ్‌భరత్ ఆమెతో మాట్లాడుతూ అన్యాయం గురించి తెలుసుకుంటున్న సమయంలో పోలీసులు వెనక నుంచి ఎక్కి చాకచక్యంగా ఆమెను పట్టుకుని కిందకు దించారు. అనంతరం కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ దగ్గరకి తీసుకుని వెళ్లారు. ఆయన విచారణ జరిపించి న్యాయం చేస్తామని బాధితురాలు ఉల్లసి లక్ష్మికి హామీ ఇచ్చారు. ఇదీ ఆమె వేదన.. ఇరవై ఏళ్ల కిందట తన తల్లిదండ్రులు అంబేడ్కర్ కాలనీలో రూ.6 లక్షల విలువైన ఇంటి స్థలాన్ని కట్నంగా ఇచ్చారని, ఇప్పుడు ఆ స్థలాన్ని రిటైర్డ్ పోలీసు భూషణ్ అనే వ్యక్తి కబ్జా చేసి వేరే వాళ్లకు అమ్మేందుకు చూస్తున్నారని లక్ష్మి తెలిపింది. ఇదే విషయమై మాల్కపురం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేస్తే భూషణ్ వచ్చి తనను భౌతికంగా కొట్టాడని వాపోయింది. అక్కడ పోలీసులు గానీ, అధికారులు గానీ ఎవరూ తన బాధను పట్టించుకోకుండా భూషణ్ దగ్గర డబ్బులు తీసుకుని తనకు అన్యాయం చేయాలని చూస్తున్నారని వాపోయింది. అలాగే తన భర్త ఊరిలో తన అత్త పేరుతో సర్వే నంబర్253/1లో 70 సెంట్ల స్థలం ఉందని, దీని విలువ ప్రస్తుతం రూ.30 లక్షలుంటుందని తెలిపింది. దానిని గోర్స సత్యారావు అనే అతను అక్రమించి తన భూమిని ఆయన పేరుతో పట్టాలో ఎక్కించుకున్నాడని చెప్పింది. ఇదే విషయమై లెక్కలేనన్ని సార్లు నక్కపల్లి మండల అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందించలేదని వాపోయింది. అలాగే నక్కపల్లిలో ఉన్న హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కి వెళ్లే దారిలో తనకు, తన బావకు సర్వే నంబరు 253/2లో సుమారు కోటి రూపాయల విలువైన 2.16 ఎకరాల భూమి ఉందని..దీన్ని నూకరాజు అనే వ్యక్తికి కౌలుకు ఇచ్చామని తెలిపింది. ఒప్పందం ప్రకారం జూన్ 10, 2018 నాటికి కౌలుకాలం ముగిసినా..తమకు భూమి స్వాధీనం చేయకుండా..దిక్కున్న చోట చెప్పుకోండంటున్నాడని వాపోయింది. టీడీపీ మహిళా నేత మోసం! మల్కాపురంలోని అంబేడ్కర్‌నగర్‌లో ఉన్న ఇంటి స్థలానికి ప్రభుత్వ పట్టా ఇప్పిస్తానని నమ్మబలికి తెలుగుదేశం పార్టీకి చెందిన రాజీమణి అనే నాయకురాలు తన వద్ద నుంచి రూ. 3 వేల లంచం తీసుకుని మోసం చేసిందని లక్ష్మి ఆరోపించింది. భూషణ్, రాజీమణి బంధువులు కావడంతో తనకు ఇంటి పట్టా రాకుండా అడ్డుకుంటున్నారని, ఏడాదిగా ఎనిమిదిసార్లు కలెక్టరేట్‌కు వచ్చి ఫిర్యాదు చేసినా.. తనకు న్యాయం జరగలేదని చెప్పింది. ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయాలని.. తన అసక్తతకు ఆవేదన చెంది..ఆత్మహత్యాయత్నానికి పూనుకున్నానని కన్నీళ్లతో చెప్పింది. -
నా భర్త నాకు కావాలి
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త తనకు కావాలని బాధితురాలు భూష లక్ష్మి వాపోయింది. పెళ్లి చేసుకున్న తర్వాత మూడేళ్లపాటు కాపురం సజావుగానే సాగిందని... భర్త తల్లిదండ్రులు(భూష లక్ష్మి అత్తామామ)మా కాపురంలోకి చొరబడి మా ఇద్దరినీ విడదీయడంతోపాటు మరో అమ్మాయితో తన భర్తకు పెళ్లి చేశారని లబోదిబోమంది. మూడు నెలల చంటిబిడ్డతో తన కాపురం ఎలా సాగుతుందని అత్తా మామను నిలదీస్తే దాడికి దిగుతున్నారని, ఈ విషయమై మూడో పట్టణ పోలీసులను ఆశ్రయించినట్టు బాధితురాలు భూష లక్ష్మి సోమవారం వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో వెల్లడించింది. విశాఖ జిల్లా వడ్డాది రావికమతం గ్రామానికి చెందిన బి.రమేష్‌తో 2014 అక్టోబర్ 30న రాజాం, కంచరగ్రామం శివాలయంలో ప్రేమ వివాహం చేసుకున్నట్టు తెలిపింది. భర్త రమేష్ తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా గ్రామ పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నామని, పెళ్లయిన మూడేళ్లపాటు చెన్నైలోనే కాపురం చేశామని, భార్య భర్తలిద్దరం కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారిమని తెలిపింది. గత అక్టోబర్ నెలలో అత్తా మామ మా ఇంటికి(చెన్నై) వచ్చి తన కూతురు వివాహం ఉందని చెప్పి, భర్తను నా నుంచి దూరం చేసేందుకు విశాఖపట్నం తీసుకొచ్చేశారని, అప్పటి నుంచి భర్త రమేష్ తనను పట్టించుకోకుండా వదిలేశాడని చెప్పింది. ఈ ఏడాది మే నెలలో అనకాపల్లికి చెందిన సత్యతో రెండో వివాహం చేసుకున్నట్టు తనకు తెలియడంతో, ఆ విషయాన్ని నా భర్త రమేష్, అత్తా మామ, పిన్నిని నిలదీయడంతో నాపై దాడికి దిగారని ఆరోపించింది. ఈ విషయంపై మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని తెలిపింది. ప్రస్తుతం మూడు నెలల చంటి బిడ్డతో తల్లి వద్ద తలదాచుకుంటున్నానని, పోలీసు ఉన్నతాధికారులు తనకు న్యాయం చేయాలని లక్ష్మి వేడుకుంది. -
నటుడు బాలాజిపై పోలీసులకు ఫిర్యాదు
-
పోకిరీలకు ఆమె అంటే హడల్
రామవరప్పాడు (గన్నవరం) : ఖాకీ చొక్కాతో భుజాన క్యాష్ బ్యాగ్ తగిలించుకుని టికెట్.. టికెట్ అంటూ విధులు నిర్వహించే ఆర్టీసీ కండక్టర్ ఓ మేజర్ పంచాయతీకి సర్పంచ్ అయ్యింది. తాను ఒక మహిళనంటూ ఏనాడు ఆధైర్య పడకుండా 20 వేలకుపైగా జనాభా కలిగిన గ్రామాన్ని సమర్థంగా పాలిస్తోంది. తన పాలన దక్షతతో అటు గ్రామ ప్రజలను.. ఇటు సీనియర్ నాయకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆమే నగర శివారులోని విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ పీకా లక్ష్మీకుమారి. పేద దళిత కుటుంబం నుంచి వచ్చిన లక్ష్మీకుమారికి చిన్నతనం నుంచి స్వతంత్ర భావాలు ఎక్కువ. వీరిది పెద్ద కుటుంబమైనా ఆమె తల్లిదండ్రులు కష్టపడి లక్ష్మీకుమారిని చదివించారు. చదువులో ముందుండే ఆమె పాలిటెక్నిక్ కోర్సును పూర్తిచేసుకుంది. మెరిట్‌పై 1998లో విజయవాడలో సిటీ సర్వీసులకు ఆర్టీసీ కండక్టర్‌గా బాధ్యతలు చేపట్టింది. సుమారు 15 ఏళ్లు విధులు నిర్వహించిన లక్ష్మీకుమారిని వెతుక్కుంటూ 2013లో గ్రామ సర్పంచ్‌గా పోటీ చేసే అవకాశం వచ్చింది. అంతే వెనుతిరిగి చూసుకోకుండా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందింది. పోకిరీలకు ఆమె అంటే హడల్ లక్ష్మీకుమారి సర్పంచ్ కాకముందు కూడా తన కళ్లముందు తప్పు జరిగితే మిన్నకుండేది కాదు. ఆమె కండక్టర్‌గా పనిచేసే రోజుల్లో బస్సులో పోకిరీలు మహిళలను వేధించడం, విద్యార్థినుల పట్ల ఈవ్‌టీజింగ్‌లకు పాల్ప డడం గమనిస్తే అందరి ముందు తగిన బుద్ధి చెప్పిన ఘటనలు అనేకం ఉన్నాయి. భర్త చనిపోయినా అధైర్యపడకుండా.. 2013లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా గెలుపొందిన లక్ష్మీకుమారి సర్పంచ్ హోదాలో ప్రజాసేవకు అంకితమయ్యారు. తన అభిమాన నాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని గ్రామాభివృద్ధికి తనవంతుగా పాటుపడుతున్నారు. 2016లో ఆమె భర్త నాగమల్లి కోటేశ్వరరావు ఆటోనగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సన్నిహితులు, బంధువులు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు మనోధైర్యం ఇవ్వడంతో తిరిగి గ్రామాభివృద్ధిపై దృష్టిసారించారు. ప్రధాన గ్రామంతో పాటు కాల్వ గట్టు ప్రాంతాల్లో పాలకవర్గ సభ్యుల సహకారంతో రూ.లక్షల వ్యయంతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అంతర్గత రహదారులు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలను సాధ్యమైనంత వరకు పరిష్కరించారు. ఎన్నో ఏళ్ల నుంచి గ్రామస్తులు ఎదురుచూస్తున్న రైవస్ కాలువపై డబుల్ లైన్ వంతెన ఏర్పాటుకు శంకుస్థాపన కూడా అతితర్వలో ఈమె హయాంలో జరగనుండటం విశేషం. -
ప్రభుదేవాతో పోటీపడి మరీ డ్యాన్సులు
-
నల్లగొండ నుంచి శ్రీనివాస్ సతీమణి?
సాక్షి, హైదరాబాద్: ఇటీవల హత్యకు గురైన కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ సతీమణి, నల్లగొండ మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మిని నల్లగొండ అసెంబ్లీ స్థానంలో పోటీకి దింపాలని టీపీసీసీ యోచిస్తోంది. దీనిపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో ప్రకటన చేయించాలని భావిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి రంగంలోకి దింపాలని యోచిస్తోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ ప్రతిపాదనకు సుముఖంగానే ఉన్నట్టు టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి. అధికార పార్టీని ఎండగట్టేందుకు.. కాంగ్రెస్ పార్టీకి చెందిన బొడ్డుపల్లి శ్రీనివాస్‌ను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హత్య చేయించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ హత్య కేసులో నిందితులు ఆ ఘటనకు ముందు, తరువాత కూడా ఎమ్మెల్యే వేముల వీరేశం బంధువులతో ఫోన్లో మాట్లాడినట్టు కాల్‌డేటా బయటపడింది. దీంతో టీఆర్ఎస్ నేతలే శ్రీనివాస్ హత్యకు బాధ్యులంటూ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించింది. ఇదే ఊపులో టీఆర్ఎస్ను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడానికి ఈ అంశాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. బొడ్డుపల్లి శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించడానికి ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీని పిలవాలని.. అదే సందర్భంగా లక్ష్మిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటన చేయించాలని టీపీసీసీ భావిస్తోంది. ఒకవేళ రాహుల్ పర్యటన సాధ్యం కాకుంటే.. ఏఐసీసీ ముఖ్యులతో ప్రకటన చేయించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. బీసీ సామాజికవర్గానికి చెందిన బొడ్డుపల్లి లక్ష్మికి అవకాశమివ్వడం కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ప్రయోజనం చేకూరుస్తుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక కోమటిరెడ్డి కూడా లోక్‌సభకు పోటీచేయాలన్న ఆసక్తితో ఉన్నట్టు పలుమార్లు బహిరంగంగానే వెల్లడించారు. -
ఆ దారుణ హత్యకు కారణం మిర్చి బండి గొడవే!
నల్గొండ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన అనుచరుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యలో ఎలాంటి రాజకీయ కోణం లేదని ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు తెలిపారు. మిర్చి బండి దగ్గర జరిగిన చిన్న గొడవే శ్రీనివాస్ హత్యకు దారితీసిందన్నారు. శ్రీనివాస్‌ది కేవలం యాదృచ్చికంగా జరిగిన హత్యేనని ఎస్పీ పేర్కొన్నారు. ఈ హత్య కేసులో ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశ పెట్టారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. రాంబాబు, మల్లేష్, శరత్‌లను ప్రధాన నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. రాజకీయ హత్యే : లక్ష్మి ఇంట్లో నుంచి పిలిపించి మరీ తన భర్తను హత్య చేశారని శ్రీనివాస్ భార్య, నల్లగొండ మున్సిపల్ ఛైర్ పర్సన్ లక్ష్మి అన్నారు. చిల్లర గొడవను సాకుగా చూపుతూ ఈ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తన భర్తది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని తెలిపారు. ఈ హత్య వెనుక రాజకీయ ప్రమేయం ఉందన్నారు. మంచి స్థానంలో ఉన్న ఓ వ్యక్తి మిర్చి బండి దగ్గర చిల్లర గొడవ ఎందుకు చేస్తారని లక్ష్మి అన్నారు. -
నేటి ఇందిరాగాంధీ!
ఈమె అసలు పేరు లక్ష్మి. తన చిన్నతనంలో ఇందిరాగాంధీ ప్రసంగాన్ని రేడియోలో విన్నాక తన పేరును ఇందిరాగాంధీగా మార్చుకున్నారు. ఈమె నేడు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుగాలీల జీవితాల్లో వెలుగుకోసం పోరాడుతున్నారు. ఇప్పటి వరకు 12,632 మందిని పాఠశాలల్లో చేర్పించారు. వారిలో 86 మంది కళాశాల విద్య పూర్తిచేసి వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అమ్మా నేనూ బడికి వెళ్తానంటూ మారాం చేసింది ఆ చిన్నారి.. రెండు పూసలల్లితే నాలుగు కాసులు వస్తాయ్.. బడి వద్దు మనకు అంత స్థోమత లేదంటూ బడి వైపు వెళ్లొద్దని షరతు పెట్టింది ఆమె తల్లి. అయితే తన కూతురే తమిళనాడులోని పది లక్షల మంది సుగాలీలకు ఓ ఇందిరాగాంధీలా మారుతుందని ఆ అమ్మకు తెలియదు. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగం.. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుగాలీల జీవితాల్లోవెలుగు కోసం పోరాడుతున్న ఇందిరాగాంధీ ఈ వారం మహిళామణి శీర్షికకు చెప్పిన వివరాలు ఆమె మాటల్లోనే. తిరువళ్లూరు: తమిళనాడు రాష్ట్రం, తిరువళ్లూరు జిల్లా రెడ్‌హిల్స్‌లోని గువ్వళోళ్ల కాలనీ. ఉదయం ఏడు గంటల సమయం. 20 మంది చిన్నారులకు తలదువ్వడం, జడలు అల్లడం చేస్తోంది పోలీసు డ్రస్‌లో ఉన్న 53 ఏళ్ల మహిళ. ఎవరామె అని ఆరా తీయడానికి యత్నించేలోపే.. ఆమె స్పందిస్తూ ఈ కాలంలో చదువుకుంటేనే బతకగలం.. అందుకే గువ్వళోళ్ల కాలనీలోని పిల్లలందరిని బడికి పంపిస్తున్నా. ఓ పది నిమిషాలు ఆగండి అంటూ ఆ పిల్లలను తన పిల్లల్లా బడికి పంపించే పనిలో లీనమయ్యింది. అనంతరం తన స్వీయ చరిత్రను చెప్పడం ప్రారంభించారు ఇందిరాగాంధీ. సుగాలీల పిల్లలను బడికి తీసుకెళ్తున్న ఇందిరాగాంధీ నేను పుట్టింది.. తమిళనాడు రాష్ట్రం, ఓరక్కాడు గ్రామంలో నేను పుట్టా. అక్కడే ఉన్న బస్టాండే నా శాశ్వత నివాసం. మూడేళ్ల వయస్సు రాగానే తల్లిదండ్రులు మమ్మల్ని ఇంటివద్దే వది లిపెట్టి పూసలు అమ్మడానికి బయ ట ప్రాంతాలకు వెళ్లేవారు. వారు వచ్చే వరకు బస్టాండులో బిచ్చమెత్తుకోవడం నా దినచర్య. ఒక రోజు బస్టాండులో బిచ్చమెత్తుకుంటుండగా కానిస్టేబుల్ పిలిచి బడిలో చేర్పిస్తా చదువుకుంటావా అన్నా రు. నేను పట్టించుకోలేదు. మరుసటి రోజు పాఠశాల ఆవరణలో నిలబడిన సమయంలో తమిళ ఉపాధ్యాయుడు(కర్కై నండ్రే కర్కై నండ్రే పిచ్చై పుగినుం కర్కై నండ్రే) అంటూ బోధిస్తున్నాడు. చదువుకుంటున్న వారిని ఎందుకు అడుక్కోవాలని బోధిస్తున్నాడో అనుకుని టీచర్నే అడిగేసా. ఆయన బిచ్చమెత్తయినా చదువు కోవాల ని చెప్పారు. ఆ మాటలతో నాలో చదువుకోవాలన్న ఆసక్తి పెరిగింది. అమ్మానాన్నలకు చెప్పా. బడి వద్దూ పూసలు అమ్ముకోమన్నారు. అయినా ఆసక్తితో ఉపాధ్యాయుడిని కలవడంతో ఆయన మా అమ్మానాన్నతో మాట్లాడి పాఠశాలలో చేర్పించారని వివరించారు. పదేళ్లకే పెళ్లి నిర్ణయం.. ఆమ్మనాన్న నాకు పదేళ్లకే పెళ్లి చేయాలనుకున్నారు. నెల్లూరు నుంచి నాకన్నా 15 ఏళ్ల పెద్దవాడైన వ్యక్తితో వివాహం చేయాలని నిర్ణయిం చారు. పెళ్లికొడుకు చూడడానికి వచ్చాడని బం ధువులు ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలోనే అక్కడ జరుగుతున్న శవయాత్రలో పాల్గొని తప్పించుకున్నా. మా ఉపాధ్యాయుడికి చదువుకోవాలన్న నా కోరికను తెలిపా. టీచర్ గ్రామపెద్దను ఆశ్రయించమన్నారు. పంచాయతీ పెద్ద ఒరక్కాడు నాయుడును కలిసి నా బాధను చెప్పా. ఆయన సైకిల్‌పై ఎక్కించుకుని పొలం వద్దకు తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు. ఎలాగో అతని నుంచి తప్పించుని సాయం చేస్తానన్న పోలీసును ఆశ్రయించా. ఆయన అ మ్మానాన్నలకు హెచ్చరించడంతో వారు నన్ను ఎనిమిదో తరగతి వరకు చదువుకోమన్నారు. ఆసలు పేరు లక్ష్మి.. నా అసలు పేరు లక్ష్మి. ఒక రోజు టీచర్ ఇంటికి వెళ్లా. అప్పడు బంగ్లాదేశ్‌పై జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించిందని, ఇందిరాగాంధీ ప్రసంగాన్ని రేడియోలో వింటూనే ఆమె పాలనాదక్షతనూ వివరించారు. ఆ మాటలు విన్నాక నా పేరును ఇందిరాగాంధీగా మార్చుకున్నా. అప్పుడే సుగాలీలకు ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నా. ఎంఏ వరకు చదివి అటవీశాఖలో గార్డు ఉద్యోగాన్ని సంపాదించి ప్రేమ వివాహం చేసుకున్నా. ఒక కొడుకు, ఇద్దరు కుమార్తెలు. నేను తక్కువ కులం అమ్మాయినని హేళన చేయడంతో ఆయన విడాకులు తీసుకున్నాడని(కంటతడి పెడుతూ) వివరించారామె. వారికి చదువుచెప్పించాలని.. సుగాలీల పిల్లలకు చదువుచెప్పించాలని 25 ఏళ్ల క్రితం నిర్ణయించా. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు వెళ్లి సుగాలీల పిల్లలను బడికి పంపించడం, వారి తల్లిదండ్రులకు విద్యపై అవగాహన కల్పించా. పిల్లల తల్లిదండ్రుల నుంచి మద్దతు లభించేది కాదు. అయినా నా ప్రయత్నంలో వెనుకడుగు వేయలేదు. అప్పటికే దాదాపు 16 వేల మంది సుగాలీల పిల్లలు విద్యకు దూరంగా ఉన్నారని గుర్తించా. కనీసం ఐదు వేల మందిని బడికి పంపాలని నిర్ణయించి మొదటి ఏడాది 25 మందిని పాఠశాలలో చేర్పించా. ఇప్పటి వరకు 12,632 మందిని పాఠశాలల్లో చేర్పించగా, వారిలో 86 మంది కళాశాల విద్య పూర్తి చేసి వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రతి జిల్లాకు వారంలో ఒక రోజు వెళ్లి విద్య ఆవశ్యకతను వివరిస్తున్నానన్నారు. ప్రభుత్వం ఒరక్కాడు ప్రాంతంలో 50 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అయితే మాకు సాయం చేస్తానని రఘుపతి అనే వ్యక్తి మా భూములను ఆక్రమించుకున్నాడు. దీనిపై పది ఏళ్లుగా పోరాటం చేస్తున్నా. భూములను వదలిపెట్టి వెళ్లాలని కొందరు బెదిరించారు. చివరికి నా ఒక్కగానొక్క కొడుకును(కన్నీటిని తుడుచుకుంటూ) చంపేసారని బోరున విలపించారు. రాష్ట్ర వ్యాప్తంగా దేశదిమ్మరులుగా తిరుగుతున్న సుగాలీల జీవితాల్లో వెలుగును నింపాలి. వారిని ఆర్థికంగా బలో పేతం చేయాలి. సమాజంలో మాకు ఒక గుర్తింపు ఉండాలన్నదే తన అంతియ లక్ష్యమని వివరించారు.