పవన్‌ ఆఫీస్‌ నుంచి ఫోన్లు వస్తున్నాయ్‌: లక్ష్మి | Pawan Kalyan PA Calls to Kiran Royal Victim Lakshmi | Sakshi
Sakshi News home page

విజయవాడ ఎప్పుడొస్తావ్‌?.. పవన్‌ ఆఫీస్‌ నుంచి లక్ష్మికి ఫోన్లు

Published Tue, Mar 4 2025 1:39 PM | Last Updated on Tue, Mar 4 2025 4:28 PM

Pawan Kalyan PA Calls to Kiran Royal Victim Lakshmi

తిరుపతి, సాక్షి: జనసేన నేత కిరణ్‌ రాయల్‌(Kiran Royal) తనకు ఇవ్వాల్సిన నగదు మొత్తం ఇచ్చేదాకా పోరాడుతూనే ఉంటానని బాధితురాలు లక్ష్మి(Laxmi) అంటున్నారు. తనకు ఎలాంటి రాజకీయ పార్టీ మద్దతు లేదని స్పష్టం చేసిన ఆమె.. కాంప్రమైజ్‌కు రావాలని డిప్యూటీ సీఎం పవన్‌ క​ల్యాణ్‌ ఆఫీస్‌ నుంచి ఫోన్లు వస్తున్నాయని చెబుతున్నారామె. 

కిరణ్ రాయల్‌తో జరిగిన ఆర్థిక లావాదేవీలు అన్నింటికీ ఆధారాలు ఉన్నాయి. స్థానిక సీఐ నాకు సెటిల్‌మెంట్‌ చేయిస్తానని హామీ ఇచ్చారు. మొదటి నుంచి చెబుతున్నట్లు నాకు ఈ పోరాటంలో ఏ పార్టీ మద్దతు లేదు. నా ఆరోగ్యం బాగోలేకున్నా.. నా పిల్లలు వద్దని చెప్పినా.న్యాయ పోరాటం చేస్తున్నా. నన్ను రకాలుగా ట్రోల్‌ చేస్తున్నారు. అయినా నా పోరాటం ఆపను. 

నేను విడుదల చేసిన వీడియోలు,ఫోటోలు అన్ని వాస్తవాలు. వాటన్నింటిని ఏడాది క్రితమే జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తీసుకున్నారు. ఇంతకాలం సైలెంట్‌గా ఉండి ఇప్పుడేమో.. కాంప్రమైజ్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. విజయవాడ వచ్చి కలవాలని పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) పీఏ దగ్గరి నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి. కానీ, నా పిల్లల భవిష్యత్‌ కోసం నేను వెళ్లవద్దని అనుకుంటున్న అని లక్ష్మి చెబుతున్నారు.

Lakshmi: కిరణ్ రాయల్ నగదు చెల్లించే వరకు పోరాడతా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement