నటుడు బాలాజిపై పోలీసులకు ఫిర్యాదు | Laxmi Police Complaint Against Actor Balaji | Sakshi
Sakshi News home page

నటుడు బాలాజిపై పోలీసులకు ఫిర్యాదు

Published Wed, May 9 2018 10:46 AM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

సినీ నటుడు బాలాజీ తనను మోసం చేశాడని ఆరోపిస్తూ నటి లక్ష్మి మంగళవారం జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీరెడ్డితో కలిసి జూబ్లీహిల్స్‌ పీఎస్‌కు వచ్చిన ఆమె అనంతరం విలేకరులతో మాట్లాడారు..  యూసూఫ్‌గూడలో ఉంటున్న తాను తన భర్త చనిపోయిన తర్వాత కుటుంబ భారాన్ని మోస్తున్నానని తెలిపింది. తన కుమార్తె అనారోగ్యం కారణంగా అప్పులపాలైన తాను నటుడు బాలాజీ భార్యకు కిడ్నీ ఇస్తే రూ.20 లక్షలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడన్నారు. 2016లో విజయవాడలోని ఓ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి జరిగిందని, అయితే రూ. 3 లక్షలు మాత్రమే ఇచ్చి తెల్లకాగితాలపై ఆస్పత్రిలో సంతకాలు చేయించుకుని డబ్బులు ముట్టినట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించారని ఆరోపించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement