Sri Reddy
-
కొనసాగుతున్న అరాచకపర్వం
సాక్షి నెట్వర్క్: వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై ప్రభుత్వ వేధింపులు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం రాత్రి, బుధవారం పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కొందరిని కోర్టుల్లో హాజరుపరిచి రిమాండ్ నిమిత్తం జైళ్లకు తరలించారు. ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారు.. ఎక్కడికి తీసుకెళుతున్నారు.. అనే విషయాలను కుటుంబసభ్యులకు కూడా చెప్పడంలేదు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులు, కుటుంబసభ్యులపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ ఫిర్యాదులు అందిందే తడవు పోలీసులు అత్యుత్సాహంగా కేసులు నమోదుచేసి అరెస్టు చేస్తున్నారు. మంగళవారం రాత్రి, బుధవారం తొమ్మిదిమందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని రిమాండ్ నిమిత్తం జైళ్లకు తరలించారు.ఒకరిని అరెస్టుచేసి, ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. దర్శకుడు రాంగోపాల్‌వర్మ సహా ముగ్గురికి నోటీసులు ఇచ్చారు. నటులు పోసాని, శ్రీరెడ్డిలపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. కాకినాడ జిల్లాలో జగ్గంపేటకు చెందిన కాపారపు వెంకటరమణను అరెస్టు చేసిన సీఐ శ్రీనివాస్‌రావు కాకినాడ కోర్టులో హాజరుపరిచి, అనంతరం రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన పెద్దిరెడ్డి సుధారాణి, ఆమె భర్త వెంకటరెడ్డిలను మంగళవారం ఆమదాలవలస కోర్టులో హాజరుపరిచిన పోలీసులు అనంతరం రిమాండ్ నిమిత్తం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం సబ్‌జైలుకు తరలించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన పఠాన్ అయూబ్‌ఖాన్, పల్నాడు జిల్లా మాచవరం మండలం మోర్జంపాడుకు చెందిన అన్నంగి నరసింహస్వామి, అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం ముదిగుబ్బకు చెందిన జనికుల రామాంజనేయులుపై కందుకూరులోను, అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన కురమయ్యగారి హనుమంతరెడ్డిపై నెల్లూరు జిల్లా సంగం పోలీస్‌స్టేషన్‌లోను కేసులు నమోదు చేశారు. రాయవరం ప్రాంతానికి చెందిన ఖండవిల్లి సునీల్‌కుమార్, కోరుకొండకు చెందిన లగవత్తుల శివసత్యకుమార్, కనిగిరికి చెందిన హరీశ్వర్‌రెడ్డి, కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన కాకరపర్తి శ్రీనివాస్‌పై విశాఖపట్నంలో కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం ఆయతపల్లికి చెందిన ప్రసాద్‌రెడ్డిని బుధవారం మఫ్టీలో వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరులో అరెస్టు చేసిన నకిరేకల్‌కు చెందిన పి.రాజశేఖర్‌రెడ్డిని నూజివీడు తరలించారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా పశ్చిమగోదావరి జిల్లా కో–కన్వినర్లు పాటూరి దొరబాబు, కమతం మహేష్‌లకు 41ఏ నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అనంతరం స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. శ్రీరెడ్డిపై కేసు నమోదుటీడీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి మజ్జి పద్మావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోషల్ మీడియా యాక్టివిస్ట్, సినీనటి మల్లిడి శ్రీరెడ్డిపై మంగళవారం రాత్రి రాజమహేంద్రవరంలోని బొమ్మూరు పొలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ కాశీవిశ్వనాథ్ కేసు నమోదు చేశారు. శ్రీరెడ్డిపై అనకాపల్లి పోలీసులకు టీడీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు రత్నకుమారి మరో ఫిర్యాదు చేశారు. రాంగోపాల్‌వర్మకు నోటీసులు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్‌స్టేషన్ ఎస్ఐ శివరామయ్య బుధవారం హైదరాబాద్‌లో సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మకు నోటీసు అందించారు. ఈనెల 19న మద్దిపాడు స్టేషన్‌కు రావాల్సిందిగా అందులో కోరారు. వ్యూహం చిత్రం నిర్మించే సమయంలో చంద్రబాబును, ఆయన కుమారుడు లోకేశ్, బ్రాహ్మణిని అవమానించేలా పోస్టింగ్‌లు పెట్టారంటూ రెండురోజుల కిందట మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ కేసు నమోదు చేశారు. పోసానిపై ఫిర్యాదులుసినీనటుడు పోసాని కృష్ణమురళీ టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడును అసభ్య పదజాలంతో దూషించారని టీడీపీ నేతలు బాపట్ల సీఐ అహ్మద్జానీకి ఫిర్యాదు చేశారు. సీఎం తదితరులపై అసభ్య పోస్టులు పెట్టిన పోసానిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ నేతలు గుంటూరు, నరసరావుపేటల్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
చిరంజీవి తల్లికి శ్రీరెడ్డి క్షమాపణలు.. 'బుద్ది గడ్డి తిని అలా తిట్టాను'
Sri Reddy Apologies To chiranjeevi Mother Anjanamma: టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్‌తో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చిన శ్రీరెడ్డి తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో చిరంజీవి తల్లిని దూషిస్తూ తాను చేసిన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. బుద్ది గడ్డి తిని తాను చేసిన తప్పును పెద్ద మనసు చేసుకొని క్షమించాలని కోరింది. ఈ మేరకు ట్విట్టర్లో వీడియో రిలీజ్ చేసింది. 'ఆడవాళ్ల కోసం నేను చేసిన ఉద్యమంలో న్యాయం కోసం ఓ పెద్ద మనిషి ఇచ్చిన సలహాతో చిరంజీవి గారి అమ్మ అంజనమ్మని తిట్టాల్సి వచ్చింది. ఈ ఇష్యూతో ఏమాత్రం సంబంధం లేని ఆవిడ్ని తిట్టడం ముమ్మాటికీ తప్పే. దానికి నేను శిక్ష కూడా అనుభవించాను.. సోషల్ మీడియాలో కూడా చాలా ట్రోల్స్ ఎదుర్కొన్నా. ఈ విషయంలో నేను ఇప్పటికీ బాధపడుతున్నా. అన్యాయంగా ఆమెను తిట్టడం తప్పే. ఒప్పుకుంటున్నా. నేను తప్పుచేశాను.. బుద్ది గడ్డి తిని అలా తిట్టాను. పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించండి' అంటూ శ్రీరెడ్డి పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. నన్ను క్షమించండి "అంజనమ్మ" 🙏🙏🙏😭😭 pic.twitter.com/fnBvee9qRt — Sri Reddy (@MsSriReddy) January 22, 2022 -
నీ వరకు వస్తే తప్పు కాదా?..షణ్ముఖ్-దీప్తిల బ్రేకప్‌పై శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్
యూట్యూబ్ స్టార్స్ షణ్ముఖ్-దీప్తి సునైనాల బ్రేకప్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. బిగ్‌బాస్ షో కారణంగానే వీళ్లు విడిపోయారా? షణ్ముఖ్ సిరితో క్లోజ్‌గా మూవ్ కావడం వల్లే దీప్తి బ్రేకప్ చెప్పిందా? ఐదేళ్లుగా కలిసి ఉన్న వీళ్లు ఒకరిని ఒకరు అపార్థం చేసుకోవడం ఏంటి? అనే నెటిజన్స్ చర్చించుకుటున్నారు. తాజాగా వీరి బ్రేకప్‌పై వివాదాస్పద నటి శ్రీరెడ్డి స్పందించింది. బిగ్‌బాస్ షోలో సిరితో షణ్ముఖ్ క్లోజ్‌గా ఉండడం వల్లే బ్రేకప్ చెబితే.. మరి అదే షోలో దీప్తి కూడా ఒక పర్సన్‌తో క్లోజ్‌గా ఉంది. నీ వరకు వచ్చేసరికి అది తప్పుకాదా? అని దీప్తిని ప్రశ్నించింది శ్రీరెడ్డి. ‘షణ్ముఖ్-దీప్తిలది చూడచక్కని జంట. అలాంటి వారు బ్రేకప్ చెప్పుకోడం అందిరితో పాటు నన్ను కూడా కలచివేసింది. మనం ఎన్ని చేసినా భారతీయులమనేది మరిచిపోవద్దు. జీన్స్ ఫ్యాంట్, టీ షర్ట్ వేసుకున్నా మన సంస్కృతి, సాంప్రదాయాలు మర్చిపోకూడదు. టెక్నాలజీ పరంగా మీరు డెవలప్ అవ్వండి. కానీ కొన్ని విషయాల్లో చాలా సెన్సిటీవ్ అయిపోతున్నారు.తట్టుకునే గుణం ఈ కాలం పిల్లలకు చాలా తక్కువగా ఉంది. మనుషులు అన్నాక తప్పులు చేయడం సహజం. దీప్తి.. షణ్ముఖ్‌తో ఐదేళ్లు రిలేషన్షిప్లో ఉన్నావు. ఎన్నో ఎత్తుపల్లాలు చూశామని నువ్వే చెప్పావు. బిగ్‌బాస్‌లో జరిగినదానికి షణ్ముఖ్‌కి బ్రేకప్ చెప్పావని క్లియర్‌గా అర్ధం అవుతుంది.. మరి నువ్వు బిగ్ బాస్‌కి వెళ్లినప్పుడు ఒక పర్సన్‌తో ఎంత క్లోజ్‌గా ఉన్నావో.. మీ రిలేషన్ షిప్ ఏంటో అందరం చూశాం.. ఇది లవ్ ఏమో అని జనాలకి అనుమానం వచ్చేట్టుగా ప్రవర్తించావు. నీ వరకూ వచ్చేసరికి అది తప్పుగా అనిపించలేదా? షణ్ముఖ్‌తో పెళ్లి కాలేదు కాబట్టి.. బ్రేకప్ చెప్పింది. అదే పెళ్లై ఉంటే షణ్ముఖ్‌ని వదిలేసేదా? మనిషి అన్నాక తప్పులు చేస్తుంటారు.. ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ ఉన్నప్పుడు ఒకరి తప్పుల్ని ఒకర్ని క్షమించుకోవాలి. ఓపికతో ఉంటే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి’అని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. అలాగే టాటూల గురించి మాట్లాడుతూ.. ‘పెళ్లికి ముందు టాటూలు వేయించుకున్న చాలా మంది విడిపోయారు. పెళ్లైన తరువాత వంద వేషాలు వేయండి.. దీప్తి సునయన కూడా టాటూలు వేయించుకుంది.. ఇప్పుడు అది రిమూవ్ చేయించుకోవాలని అనుకుంటుంది. మీపై మీకు నమ్మకం లేకపోతే టాటూలు వేయించుకోకండి’అని శ్రీరెడ్డి తనదైన స్టైల్లో చెప్పేసింది. -
శ్రీరామచంద్ర పాపాలు చేశాడు, షణ్నుకు ఓటేయండి: శ్రీరెడ్డి
Sri Reddy Comments On Sri Rama Chandra: వివాదాస్పద నటి శ్రీరెడ్డి బిగ్‌బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేసింది. శ్రీరామచంద్రకు సపోర్ట్ చేయొద్దంటూనే యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్‌కు ఓటేయమని అభ్యర్థించింది. 'శ్రీరామచంద్రకు ఓటేయకండి.. వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి గెలిస్తే సమాజానికి ఆదర్శంగా ఉంటుంది. కానీ ఇతడు గెలవడం వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదు. ఇండియన్ ఐడల్ గెలిచాడు కాబట్టి బిగ్‌బాస్ టైటిల్ కూడా ఇచ్చేయాలి అంటే కరెక్ట్ కాదు. అనవసరమైన వ్యక్తులను, రియాలిటీగా ఉండకుండా నటించేవాళ్లను, ఫేక్ పర్సన్లను అస్సలు నమ్మొద్దు. షణ్ముఖ్ కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలో అతడు చాలా టాలెంట్ అంటూ ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టా. అదిప్పటికీ గుర్తుంది. షణ్ముఖ్ డౌన్ టు ఎర్త్, ఫేక్‌గా ఉండడు, గేమ్ కూడా బాగా ఆడుతున్నాడని విన్నాను. ఏదో అప్పుడప్పుడు రెండు మూడు క్లిప్పింగులు చూస్తానంతే.. నిజానికి బిగ్‌బాస్ పెంట గురించి మాట్లాడటమే వేస్ట్. కానీ ఈ పెంటలో కూడా నష్టం జరగకూడదు కాబట్టి షణ్ముఖ్‌కు ఓటేయండి. శ్రీరామచంద్ర నాతో చాటింగ్ చేసినట్లు సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు లీకయ్యాయి. అదంతా నిజంగానే జరిగింది. ఇలా ఉన్నాడు కాబట్టే అంత పెద్ద ఇండియన్ ఐడల్ అవార్డు కొట్టినా కూడా అక్కడే ఉండిపోయాడు. చేసిన పాపాల వల్లే పైకి ఎదగలేదు. ఇండియన్ ఐడల్‌ను అడ్డం పెట్టుకుని అమ్మాయిలతో చాటింగ్‌లు చేయడం, ఇంకా ఏవేవో చేయాలనుకునే కుసంస్కారం అతడిది. ఇలాంటి వ్యక్తులకు ఓటేయకుండా షణ్ముఖ్లాంటి మంచి వ్యక్తులకు ఓటేసి గెలిపించండి. ఇది నా అంతట నేనుగా తీసుకున్న నిర్ణయమే తప్ప ఎవరి ప్రోద్బలంతోనూ ఇలా చెప్పడం లేదు. దయచేసి ఎవరు మంచివాళ్లు? ఎవరు చెడ్డవాళ్లు? అనేది తెలుసుకుని ఓటేస్తారనుకుంటున్నాను' అని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. -
శ్రీరామచంద్ర ఇమేజ్ను డామేజ్ చేస్తున్న వాట్సాప్ చాట్
Sri Reddy and Sreerama Chandra Whatsapp Chat: నటి శ్రీరెడ్డి టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పలువురు పెద్దమనుషుల భాగోతాలను బయటపెట్టి షాక్ ఇచ్చింది. ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్ర తనతో చేసిన వాట్సాప్ చాట్‌ను కూడా లీక్ చేసింది. 'చూడండి ఇండియన్ ఐడల్ చాట్.. షేమ్ ఆన్ యూ శ్రీరామ్' అంటూ అతడి గుట్టు రట్టు చేసింది. ఇద్దరూ సన్నిహితంగా దిగిన ఫోటోలను కూడా బయటపెట్టింది. నాలుగేళ్ల క్రితం జరిగిన ఈ వ్యవహారం తాజాగా మరోసారి తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం శ్రీరామచంద్ర బిగ్‌బాస్ సీజన్-5లో కంటెస్టెంటుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే శ్రీరామ్ అంటే గొట్టని వాళ్లు, ఇతర కంటెస్టెంట్ల ఫాలోవర్లు ప్రస్తుతం దీన్ని ఆయుధంగా చేసుకొని శ్రీరామ్‌ని సోషల్ మీడియాలో టార్గెట్ చేశారు. ఇది శ్రీరామచంద్రుడి భాగోతం..అతడికి సపోర్ట్ చేయకండి అంటూ సోషల్ మీడియాలో అతనిపై విషం చిమ్ముతున్నారు. కండబలంతోపాటు బుద్ధిబలాన్ని కూడా ప్రదర్శిస్తూ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా శ్రీరామచంద్ర తనను తాను నిరూపించుకుంటున్నాడు. ఇలాంటి తరుణంలో వాట్సాప్ చాట్ మరోసారి తెరమీదకి రావడం అతని ఇమేజ్ను డ్యామేజ్ చేస్తుందంటూ శ్రీరామ్ ఫాలోవర్స్ మండిపడుతున్నారు. మరోవైపు శ్రీరామచంద్రకు తమ మద్దతు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. -
బిగ్‌బాస్ ఐదో సీజన్: టాప్ కంటెస్టెంట్లు వీళ్లేనా!
గొడవలకు అడ్డా, కొట్లాటలకు కేరాఫ్, పోటీల హోరు, మాటల జోరు, ఎండ్లెస్ ఎమోషన్స్.. ఇవన్నీ పుష్కలంగా లభించేది ఒక్క బిగ్‌బాస్ షోలోనే. ఇవి మాత్రమేనా.. స్టార్ల అందచందాలు, వారి హంగామా, ఆటపాటలు, సీక్రెట్లు, రిలేషన్లు, అబ్బో.. ఇలా చాలానే ఉంటాయి. ఓ పక్క వివాదాల్లో నానుతూనే మరో పక్క వినోదం పంచే బిగ్‌బాస్ షోను బుల్లితెర ప్రేక్షకులు అమితంగా ఆరాధిస్తారు. ఈ బిగ్‌బాస్ షో తెలుగు, తమిళ భాషల్లో నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది. ఐదో సీజన్ కోసం కంటెస్టెంట్ల వేట ప్రారంభించారు నిర్వాహకులు. ఈ క్రమంలో కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న తమిళ బిగ్‌బాస్ ఐదో సీజన్ కోసం నిర్వాహకులు ఎవరెవరిని సంప్రదించారన్న లిస్టు ఒకటి బయటకు వచ్చింది. దీని ప్రకారం.. కూకూ విత్ కోమలి షో కంటెస్టెంట్లు దర్శ్ గుప్తా, పవిత్ర లక్ష్మి, శివానీ, అశ్విన్‌తో సంప్రదింపులు జరిపారట. ఇక నాల్గో సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇవ్వాల్సిన నటుడు అజీమ్ వ్యక్తిగత కారణాల వల్ల హౌస్‌లో అడుగు పెట్టలేదు. దీంతో ఈసారి అతడికి ఛాన్సిద్దాం అనుకుంటున్నారు. ఈసారి గ్లామర్ డోసు పెంచడం కోసం లక్ష్మీ రాయ్, పూనమ్ భజ్వా, కిరణ్‌ను హౌస్‌లోకి దించాలని చూస్తున్నారట. 'పాండియన్ స్టోరీస్' ఫేమ్ హేమను కూడా షోలో పాల్గొనమని కోరుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. సీనియర్ నటి రాధ, హీరో సిద్ధార్థ్‌ను కూడా ఐదో సీజన్‌కు పట్టుకురావాలని చూస్తున్నారట. కానీ వాళ్లు తప్పకుండా ఈ ఆఫర్‌ను తిరస్కరిస్తారని భావిస్తున్నారు అభిమానులు. టాలీవుడ్ సంచలనం శ్రీరెడ్డికి కూడా బిగ్‌బాస్ షోలో పాల్గొనమని ఆహ్వానం పంపారట. మరి ఈ ఆఫర్‌కు శ్రీరెడ్డి ఒప్పుకుంటుందా? తిరస్కరిస్తుందా? అన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. చదవండి: ఏకధాటిగా 21 గంటలు పని చేశా.. అయినా ఫ్రెష్‌గా ఉన్నా: మోనాల్ అండాలు దాచి ఉంచా, పిల్లల్ని కనాలని ఉంది: బిగ్‌బాస్ భామ -
నా నటన చూసి షాక్ అవుతారు
‘‘క్లైమాక్స్’ చిత్రంలో నా పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఇప్పటి వరకూ నేను ఎప్పుడూ చేయని పాత్రలో నటించాను. ఈ సినిమాలో నా నటన చూసి షాక్‌కు గురవుతారు’’ అని నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ‘డ్రీమ్’ ఫేమ్ భవానీ శంకర్. కె. దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్, సాషా సింగ్, శ్రీ రెడ్డి, పృధ్వీ, శివ శంకర్ మాస్టర్, రమేష్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘క్లైమాక్స్’. కైపాస్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై కరుణాకర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ను తెలంగాణ యఫ్.డి.సి.చైర్మన్ రామ్మోహన్ రావు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మన సినిమాను ఎన్ని థియేటర్లలో విడుదల చేశామనే దానికంటే, మన కంటెంట్ ఎంత మందికి రీచ్ అయింది అనేది ముఖ్యం. ‘క్లైమాక్స్’ సినిమా ప్రేక్షకులందరికీ రీచ్ అవ్వాలి.. అప్పుడే భవానీ శంకర్‌లాంటి క్రియేటివిటీ ఉన్న డైరెక్టర్లు వెలుగులోకి వస్తారు’’ అన్నారు. భవాని శంకర్ మాట్లాడుతూ– ‘‘ రాజేంద్ర ప్రసాద్‌గారు గొప్ప నటుడు. 40 సంవత్సరాల నుండి ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. ఎస్.వి.రంగారావు తర్వాత నాకు రాజేంద్ర ప్రసాద్‌గారే కనిపిస్తున్నారు’’ అన్నారు. హీరోయిన్ సాషా సింగ్ మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: రాజేష్, నిద్వాన, కెమెరా: రవి కుమార్ నీర్ల. -
సిల్క్ స్మిత బయోపిక్‌లో శ్రీరెడ్డి
వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. దివంగత నటి సిల్క్‌స్మిత జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్‌లో శ్రీరెడ్డి లీడ్ రోల్ పోషించనుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఫేస్బుక్ ఖాతా ద్వారా అధికారికంగా వెల్లడించింది. గత కొన్ని రోజులుగా గుడ్‌న్యూస్ చెబుతానంటూ ఊరిస్తున్న శ్రీరెడ్డి ఎట్టకేలకు సన్సెస్‌ను రివీల్ చేసింది. దిగ్గజ నటి సిల్క్ స్మిత బయోపిక్ చేస్తున్నానని, మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది. మధు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళం భాషల్లో విడుదల కానుంది. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని శ్రీరెడ్డి తెలిపింది. ఇక టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్‌తో తీవ్ర దుమారాన్ని రేపిన శ్రీరెడ్డి ఒక్కసారిగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా ఆమెకు పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో చెన్నైకి మకాం మార్చింది. (ప్రియాంక ఆత్మకథ: విస్తుపోయే విషయాలు వెల్లడి) సిల్క్ స్మితతో తనను తాను పోల్చకుంటూ ఓ ఫోటోను కూడా విడుదల చేసింది. అయితే ఈ బయోపిక్‌లో శ్రీరెడ్డి నటించడం పట్ల కొందరు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొదట సిల్క్ స్మిత బయోపిక్‌లో యంకర్ అనసూయ నటించనున్నట్లు రూమర్స్ వచ్చాయి. ఈ సినిమాతో ఆమె కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు గుప్పుమనడంతో ఈ పుకార్లకు అనసూయ చెక్ పెట్టారు. సిల్క్ స్మిత బయోపిక్‌లో నటించడం లేదని తేల్చి చెప్పింది. ఇప్పటికే సిల్క్ స్మిత జీవితకథ ఆధారంగా పలు భాషల్లో బయోపిక్‌లు విడుదలైన సంగతి తెలిసిందే. బాలీవుడ్లో 2011లో డర్టీ పిక్చర్ పేరుతో విడుదలైన సిల్క్ స్మిత బయోపిక్‌లో నటి విద్యాబాలన్ నటించింది. ఈ సినిమాలో ఆమె అభినయానికి గానూ జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. (కంగనా సవాల్.. నా కంటే గొప్ప నటిని చూపించగలరా?) -
‘ఆర్జీవీపై ఇష్టంతో.. ఆ సినిమాకు నో చెప్పాను’
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై సెటైరికల్‌గా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. హీరో పవన్ కల్యాణ్ అభిమానులు తెరకెక్కిస్తున్న చిత్రానికి ‘పరాన్నజీవి’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. తాజాగా ఈ చిత్రంపై నటి శ్రీరెడ్డి స్పందించారు. తనను ఈ సినిమాలో నటించాల్సిందిగా చాలా ఒత్తిడి వచ్చిందని.. కానీ అందుకు అంగీకరించలేదని శ్రీరెడ్డి స్పష్టం చేశారు. ఎందుకంటే తనకు రామ్‌గోపాల్ వర్మ అంటే ఇష్టమని చెప్పారు. తనకు కొన్ని విలువలు ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు ఆమె ఫేస్బుక్లో ఓ పోస్ట్ చేశారు. (పవర్ స్టార్ నుంచి ‘గడ్డి తింటావా?’) ‘వివాదస్పద చిత్రం ‘పరాన్నజీవి’లో నటించాల్సిందిగా చాలా ఒత్తిడి వచ్చింది.. కానీ నేను దానికి నో చెప్పాను. ఎందుకంటే నాకు ఆర్జీవీ అంటే ఇష్టం. నాకు కేవలం డబ్బులే కావాలనుకుంటే.. అందుకు అనేక మార్గాలు ఉన్నాయి. కానీ నేను విలువలను కలిగిఉన్నాను. నా సొంతవాళ్ల గౌరవానికి ఎప్పుడూ ఇబ్బంది కలిగించను.. ఒకవేళ వాళ్లు నన్ను ఇష్టపడ్డ, లేకపోయినా.. దానిని నేను పట్టించుకోను. పవర్‌స్టార్ సాంగ్‌కు ఆర్జీవీకి కృతజ్ఞతలు. నాకు అది చాలా నచ్చింది’ అని శ్రీరెడ్డి పేర్కొన్నారు. -
అమలాపాల్ రెండో పెళ్లిపై స్పందించిన శ్రీరెడ్డి
నటులపై, దర్శకులపై ఘాటు విమర్శలతో నిత్యం వార్తల్లో నిలిచే సంచలన నటి శ్రీరెడ్డి తాజాగా అమలాపాల్ రెండవ పెళ్లిపై స్పందించారు. నీ పంజాబీ భర్త మంచివాడే, భయపడొద్దు అమలాపాల్.. అంటూ సోషల్ మీడియా పోస్ట్ చేశారు. ఈ మేరకు ‘‘బాధపడకు అమలాపాల్.. నీ పంజాబీ భర్త బాగానే చూసుకుంటాడు. నాకు పంజాబీలపై నమ్మకం ఉంది.’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై అమలాపాల్ అభిమానులు మండిపడుతున్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారీ నేపథ్యంలో ప్రజలు భయాందోళన చెందుతున్న సమయంలో శ్రీరెడ్డి ఇలాంటి పోస్టులు చేయడం అవసరమా అంటూ విమర్శిస్తున్నారు. (శ్రీరెడ్డి కేసు.. డ్యాన్స్ మాస్టర్‌కు వింత చిక్కు..) కాగా ఇటీవల నటి అమలాపాల్.. ప్రియుడు, ముంబైకు చెందిన గాయకుడు భవ్నీందర్ సింగ్‌ను వివాహం చేసుకున్నట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ వార్తలు కాస్తా సోషల్ మీడియాలో వైరలవ్వడంతో దీనిపై స్పందించిన అమలాపాల్ తనకు వివాహం జరగలేదని, అవి కేవలం ఫోటోషూట్ కోసం దిగిన ఫోటోలని స్పష్టం చేశారు. ఇక అమలాపాల్ 2014లో దర్శకుడు ఏఎల్ విజయ్ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అనంతరం కొన్ని కారణాలతో విడాకులు తీసుకున్నారు. ఈ తర్వాత విజయ్ మరో వివాహం చేసుకున్నారు. (ప్రియుడిని పెళ్లి చేసుకున్న అమలాపాల్) (రెండో పెళ్లి చేసుకోలేదు.. అవి ఫోటో షూట్ అంతే) -
శ్రీరెడ్డి కేసు.. డ్యాన్స్ మాస్టర్‌కు వింత చిక్కు..
సాక్షి, సిటీబ్యూరో: తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా దుర్భాషలాడుతూ రూపొందించిన వీడియోను నటి శ్రీరెడ్డి ఆమె ఫేస్బుక్లో పోస్టు చేశారంటూ సినీ నటి కరాటే కళ్యాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఈ కేసులో నిందితురాలిగా పరిగణిస్తూ శ్రీరెడ్డికి నోటీసులు జారీ చేశారు. వీటిని తీసుకుని చెన్నై వెళ్లిన ప్రత్యేక బృందం శుక్రవారం ఆమెకు అందించింది. 2018లో ఓ ఛానల్లో జరిగిన చర్చ నేపథ్యంలో కరాటే కళ్యాణి, శ్రీరెడ్డి పరస్పరం గొడవ పడ్డారు. దీనికి సంబంధించి శ్రీరెడ్డి హుమాయూన్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇటీవల కళ్యాణికి నోటీసులు జారీ చేశారు. దీంతో మధ్య మరోసారి వివాదం రేగింది. ఈ నేపథ్యంలోనే శ్రీరెడ్డి, కళ్యాణిపై అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ, కించపరిచేలా 20 నిమిషాల నిడివితో రూపొందించిన వీడియోను తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేశారు. దీనిని చూసిన కళ్యాణి సదరు వీడియోతో పాటు దానికి సంబంధించిన యూఆర్ఎల్ను పొందుపరుస్తూ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా నేను పట్టించుకోను, నన్ను అరెస్ట్ చేసినా సరే అంటూ శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ వీడియోలో ఉన్నాయి. గత నెల్లో సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసిన కళ్యాణి తన ఫిర్యాదుతో పాటు, వీడియోతో కూడిన సీడీని అందించారు. ఆయన ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ ఎన్.మోహన్‌రావు కేసు దర్యాప్తు చేపట్టారు. శ్రీరెడ్డిని సంప్రదించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం, ఆమె చెన్నైలో ఉన్నట్లు తెలియడంతో గురువారం అక్కడికి వెళ్లిన బృందం శుక్రవారం ఆమెకు నోటీసులను అందించింది. మరోపక్క ఈ కేసులో సాక్షిగా ఉన్న ఓ డ్యాన్స్ మాస్టర్‌కు వింత చిక్కు వచ్చిపడింది. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన యాంకర్ ప్రశ్నకు బదులిస్తూ తన జీవితంలో చూసిన మేటి డ్యాన్సర్ అంటూ ఓ యువ హీరో పేరు చెప్పారు. దీన్ని యూట్యూబ్‌లో చూసిన మరో యువహీరో అభిమానులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. డ్యాన్సు యూనిట్ ఏర్పాటు కోసం ఆయన సోషల్‌మీడియాలో తన ఫోన్ నెంబర్ పోస్టు చేశారు. దీని ఆధారంగా సదరు డ్యాన్స్ మాస్టర్‌కు ఫోన్లు చేస్తున్న సదరు అభిమానులు తీవ్రంగా బెదిరిస్తున్నారు. దీనిపై ఇప్పటికే బంజారాహిల్స్ ఠాణాలో ఫిర్యాదు చేసిన ఆయన శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. -
శాల్తీని లేపేస్తానంటూ శ్రీరెడ్డి వార్నింగ్!
సాక్షి, బంజారాహిల్స్: సినీనటి శ్రీరెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ప్రముఖ కొరియోగ్రాఫర్, సినీ దర్శకుడు రామారావు అలియాస్ రాకేష్ మాస్టర్ శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి వివరాల ప్రకారం.. శ్రీకృష్ణానగర్‌లోని ఏ బ్లాక్‌లో నివసించే తాను తెలంగాణ కళామ్మతల్లి డ్యాన్స్ డైరెక్టర్ అండ్ డ్యాన్సర్స్ యూనియన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నానని, ఇప్పటివరకు 1500 సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశానని, ప్రస్తుతం ఒక సినిమాకు దర్శకత్వం వహిస్తున్నానని తెలిపారు. (హత్యా బెదిరింపులు.. శ్రీరెడ్డి ఫిర్యాదు) గత నెల 28వ తేదీన సాయంత్రం శ్రీరెడ్డి యూట్యూబ్, ఫేస్బుక్లో తనను చంపుతానని బెదిరించిందని, ఆమె అనుచరులతో ఫోన్ చేయిస్తూ బెదిరిస్తోందని వీడియో రికార్డులను పోలీసులకు అందజేశారు. తనపై శ్రీరెడ్డి చెన్నై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిందని, అక్కడి పోలీసులను హైదరాబాద్‌కు పంపించి చెన్నైకి ఈడ్చుకువచ్చి తనను అక్కడి పోలీసులతో కొట్టిస్తానని కూడా హెచ్చరిస్తోందని అన్నారు. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి తాను చెప్పిన మాటలను అపార్థం చేసుకున్న ఆయన అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ పేరుతో ప్రతీరోజు తనకు వందల సంఖ్యలో కాల్ చేస్తూ చంపుతామని బెదిరించడమే కాకుండా, అసభ్యంగా దూషిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి తన ఇంటికి వచ్చి తనను అంతం చేస్తామని కూడా బెదిరించారన్నారు. (శ్రీరెడ్డిపై మరో ఫిర్యాదు) ఒకవైపు శ్రీరెడ్డి, ఇంకోవైపు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు హెచ్చరిస్తుండటంతో వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల ఓ చానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో లైవ్‌లోనే శ్రీరెడ్డి తనను అసభ్యపదజాలంతో దూషించిందని, తన మనోభావాలు కూడా దెబ్బతిన్నాయంటూ ఆ వీడియో రికార్డులను కూడా ఆయన పోలీసులకు అందజేశారు. ఇటీవల తాను సీసీఎస్‌లో సైబర్‌క్రైమ్‌లో పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలంటూ శ్రీరెడ్డి ఒత్తిడి తీసుకు వస్తోందని, అందులో భాగంగానే శాల్తీని లేపేస్తానంటూ బెదరిస్తున్నారని వాపోయారు. పోలీసులు ఫిర్యాదును స్వీకరించి ఆధారాలు తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (‘శ్రీరెడ్డి దొరికిపోయింది’) -
హత్యా బెదిరింపులు.. శ్రీరెడ్డి ఫిర్యాదు
పెరంబూరు: సంచలన నటి శ్రీరెడ్డి మరోసారి వార్తల్లోకెక్కారు. ఇంతకు ముందు లైంగిక ఆరోపణలతో తెలుగు, తమిళ సినీపరిశ్రమల్లో కలకలం సృష్టించిన ఈ అమ్మడు తాజాగా తనపై హత్యాయత్నానికి పాల్పడుతున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం చెన్నై పోలీస్‌కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే... అసభ్యకర పోస్ట్‌లు పెట్టారంటూ శ్రీరెడ్డిపై నటి కరాటే కల్యాణి, నృత్యదర్శకుడు రాకేశ్ మాస్టర్ తెలంగాణా రాష్ట్ర క్రైమ్‌బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు. (కారు ధ్వంసం చేశారని శ్రీరెడ్డి ఫిర్యాదు) ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి... నటి కరాటే కల్యాణి, నృత్య దర్శకుడు రాకేశ్ మాస్టర్‌పై చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదులో వారిద్దరూ తనపై హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం శ్రీరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... తానిప్పుడు రెండు చిత్రాల్లో నటిస్తున్నానని, తనను తమిళ ప్రేక్షకులు ఆదరిస్తున్నట్లు తెలిపారు. అయితే కరాటే కల్యాణి, రాకేశ్ మాస్టర్ తన గురించి సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. తాను చెన్నైలో కారు, ఇల్లు కొనుక్కున్నానని, దీని గురించి వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అసభ్యంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నట్లు చెప్పారు. తనను పెట్రోల్ పోసి తగల పెడతామని హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నారని, అందుకే ఫిర్యాదు చేసినట్లు శ్రీరెడ్డి తెలిపారు. (‘శ్రీరెడ్డి దొరికిపోయింది’) -
శ్రీరెడ్డిపై మరో ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: హీరోయిన్ శ్రీరెడ్డిపై సినీ నటి కరాటే కల్యాణి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపై శ్రీరెడ్డి అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, న్యూస్ చానల్లో తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రెండేళ్ల క్రితం కరాటే కల్యాణిపై శ్రీరెడ్డి హుమయున్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనను బెదిరించిన కల్యాణిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో శ్రీరెడ్డి కోరారు. ‘కాస్టింగ్ కౌచ్’ ఆరోపణలతో తెలుగు సినిమా పరిశ్రమలో శ్రీరెడ్డి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తమిళ సినిమాల్లో అవకాశాలు రావడంతో ఆమె చెన్నైలో మకాం పెట్టారు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన వ్యాఖ్యలతో కలకలం రేపుతున్నారు. ప్రముఖ దర్శకులు ఏఆర్ మురుగదాస్, సుందర్.సి, నటులు రాఘవ లారెన్స్, శ్రీరామ్, హీరో విశాల్‌లపై కూడా ఆరోపణలు చేసిన సంగతి విదితమే. దీంతో శ్రీరెడ్డిపై చాలా మంది కేసులు పెట్టారు. (చదవండి: విలన్‌గా యాంకర్ అనసూయ..!) -
కారు ధ్వంసం చేశారని శ్రీరెడ్డి ఫిర్యాదు
పెరంబూరు : సంచలన నటి శ్రీరెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులపై మీటూ ఆరోపణలు చేసి కలకలం సృష్టించిన శ్రీరెడ్డి తెలుగులో అవకాశాలు లేకపోవడంతో చెన్నైకి మకాం మార్చారు. ప్రస్తుతం స్తానిక వలసరవాక్కం, అన్భునగర్‌లోని ఒక ప్లాట్‌లో నివసిస్తున్నారు. కాగా ఇటీవల తన ఫేస్బుక్ ఖాతాలో తాను ఉంటున్న ఇంటి సమీపంలో నటి తమన్న నటిస్తున్న వెబ్ సిరీస్ షూటింగ్‌ను నిర్వహిస్తున్నారనీ, ఆ యూనిట్ గోల పడలే కపోతున్నానని పేర్కొన్నారు. వారితో మాట్లాడి ఈ సమస్యకు పుల్‌స్టాప్ పెట్టాలనుకుంటున్నట్లు తెలిపారు. కాగా, గత రెండు రోజుల క్రితం నటి శ్రీరెడ్డి స్థానిక కోయంబేడు పోలీస్‌స్టేషన్‌లో ఒక ఫిర్యాదు చేశారు. అందులో తాను ఉంటున్న ఇంటి సమీపంలో విశ్రాంతి పోలీస్ అధికారి బంగ్లా ఉందని, అందులో గత కొన్ని రోజులుగా సినిమా షూటింగ్ జరుగుతోందని తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో పలు కార్లను నిలుపుతున్నారని చెప్పారు. తాను సోమవారం బయటకు వెళ్లి రాత్రి తిరిగి రాగా తన ఇంటి ముందు ఒక వాహనం నిలిపి ఉండటంతో దాన్ని బయట పెట్టానని పేర్కొన్నారు. ఆ తరువాత కొంచెం సేపటికి వచ్చి చూస్తే తన ఖరీదైన ఆడి కారుకు గీతలు గీసి ధ్వంసం చేసి ఉండటం చూశానని తెలిపారు. షూటింగ్ చేస్తున్న చిత్ర కార్యనిర్వాహకుడు మనోజ్‌పై అనుమానం ఉందని పేర్కొన్నారు. సంఘటనపై విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో కేసును నమోదు చేసుకున్న కోయంబేడు ఇన్స్పెక్టర్ మాదేశ్వరన్ విచారణ జరుపుతున్నారు. ఆ ప్రాంతంలో నిఘా కెమెరాలను పరిశీలిస్తున్నారు. -
వైరల్ అవుతున్న శ్రీరెడ్డి ఫోటో
వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనాలకు తెరలేపిన నటి శ్రీరెడ్డి. క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో టాలీవుడ్‌ను ఊపేసి.. ప్రస్తుతం చెన్నైకి మకాం మార్చేసింది. అడపాదడపా సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తూ.. వస్తోన్న ఆమె తాజాగా ఓ ఫోటోను పోస్ట్ చేసింది. ఓ వ్యక్తి కాలిపై తన కాలును పెట్టి ఉన్న పిక్‌ను పోస్ట్చేసింది. అయితే తాను చేసే ప్రతీ పోస్ట్‌కు ఏదో ఒక క్యాప్షన్ ఇచ్చే శ్రీరెడ్డి ఈ సారి మాత్రం ఫోటోను మాత్రమే షేర్ చేసింది. దీంతో ఆమె ఫాలోవర్స్‌కు అనుమానాలు పుట్టుకొచ్చాయి. అతనెవరు? అంటూ ప్రశ్నించసాగారు. అతను ప్రేమికుడా? అంటూ అడిగిన నెటిజన్లకు.. స్నేహితుడంటూ సమాధానమిచ్చింది. పవన్ కళ్యాణ్‌పై సైతం సంచలన వ్యాఖ్యలు చేసింది. జనసేనను ఏ పార్టీలోనూ కలపనని చేసిన వ్యాఖ్యలపై శ్రీరెడ్డి తన స్టైల్లో స్పందించింది. ‘పవన్ గారు మీ పార్టీని మరేతర పార్టీలోనూ కలపకండి. ఒక్క విషపు చుక్క కూడా విలువైన మొత్తం ద్రావణాన్ని పాడు చేస్తుంది. మీరు మాకు వద్దు’ అంటూ పోస్ట్ చేసింది. -
ఆ హీరోను టార్గెట్ చేసిన శ్రీరెడ్డి
పెరంబూరు: లైంగిక ఆరోపణలలో టాలీవుడ్, కోలీవుడ్‌లో కలకలం రేపిన నటి శ్రీరెడ్డి. అవకాశం ఆశతో తనను వాడుకున్నారంటూ హైదరాబాదులో ఆందోళనకు దిగి రచ్చ చేసిన ఈ నటి ఆ తరువాత చెన్నైకి మకాం మార్చి ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్, నటుడు లారెన్స్ వంటి ప్రముఖులపై లైంగిక ఆరోపణలు చేసి కలకలం సృష్టించింది. ఆ తరువాత కొంతకాలం సైలెంట్‌గా ఉన్న శ్రీరెడ్డి ఇటీవల వార్తల్లో నానుతోంది. లైంగిక వేధింపులంటూ విమర్శలు చేయడంతో పాటు తమకు అలాంటి సంఘటనలు ఎదురవ్వలేదంటూ స్టేట్మెంట్స్ ఇస్తున్న రకుల్‌ప్రీత్ సింగ్ లాంటి ఇతర హీరోయిన్లపై దండెత్తడం వంటి చర్యలతో వివాదాంశంగా మారింది. కాగా శనివారం సడన్‌గా నటుడు, నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్‌పై విమర్శలు దాడి చేయడం మొదలెట్టింది. తన ట్విట్టర్లో ఆయనను రకరకాలుగా విమర్శిస్తోంది. మరో వారంలో నడిగర్ సంఘం ఎన్నికలు జరగనున్న సమయంలో ఇటీవల నటి వరలక్ష్మి శరత్‌కుమార్, నటి రాధికా శరత్‌కుమార్ విశాల్‌పై మూకుమ్మడిగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కారణాలు చెప్పకుండా సంచలన నటి శ్రీరెడ్డి విశాల్‌పై విమర్శల దాడి చేయడం కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. -
వైసీపీ విజయ దుందుభి : నా పగ తీరింది
వివాదాస్పద నటి శ్రీరెడ్డి వైఎస్సార్సీపీ ఘనవిజయంపై స్పందించారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రీరెడ్డి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల సరళిపై అంతే వేగంగా స్పందించారు. వైసీపీ గెలుపుపై ఫేస్బుక్లో తన ఆనందాన్ని పంచుకున్నారు. తనను తాను దేవసేనతో పోల్చుకున్న ఆమె తన పగ తీరిందంటూ సంబరాల చేసుకుంటున్నారు. నా పగని, పంతాన్ని తీర్చిన అందరికి నా సాష్టాంగ నమస్కారం. నేను రియల్ దేవసేన.. రియల్ బాహుబలి వన్ అండ్ ఓన్లీ జగన్’ అంటూ ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. కాగా ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సర్కార్‌కు లైన్ క్లియర్ అయింది. టీడీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోనుంది. అటు ప్రశ్నిస్తాను అంటూ ఊగిపోయిన నటుడు, జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ పార్టీ సోదిలో కూడా లేకుండా తోక ముడిచింది. ఈ నేపథ్యంలోనే తన పగతీరిందంటూ శ్రీరెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. దీంతో పవన్ ఫ్యాన్స్ శ్రీరెడ్డి పోస్ట్‌పై విరుచుకు పడుతున్నారు. -
‘నా కల నిజమైంది.. ప్రపంచానికి నేనే హీరోయిన్’
తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ బాధితుల పోరాటానికి తెలంగాణా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఉద్యమానికి కీలకమైన నటి శ్రీరెడ్డి ఫేస్బుక్లో స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన కల సాకారమైందనీ, ఇందుకు ఒక హైదరాబాదీగా తనకు చాలా గర్వంగా ఉందంటూ ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ ప్రపంచానికి తనను హీరోయిన్ చేశారంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. నా పోటారానికి అద్భుతమైన ఫలితాలొచ్చాయంటూ ఉద్యమానికి గుండె లాంటి అపూర్వ(నటి)కు, ఇంకా ఈ ఉద్యమంలో సాయపడిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరున శ్రీరెడ్డి కృతజ్ఞతలు చెప్పారు. తెలుగు సినిమా రంగంలో మహిళా నటులు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై తొలిసారిగా గొంతెత్తిన నటి శ్రీరెడ్డి. అనంతరం మీటూ అంటూ చాలామంది బాధితులు బహిరంగంగా తన బాధల గాథలను ప్రపంచానికి చెబుతూ ఈ ఉద్యమంలో జత కలవడంతో ఇది దావానలంలా రాజుకుంది. అటు వివిధ ప్రజా, మహిళా సంఘాలు ఈ ఉద్యమానికి బాసటగా నిలిచాయి. ప్రతిఫలంగా తెలంగాణ ప్రభుత్వం టాలీవుడ్లో లైంగిక వేధింపులపై చర్యలు తీసుకునేలా ప్రత్యేక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు బుధవారం జీవో నంబర్ 984 ప్రకారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కొర్పొరేషన్ ఛైర్మన్ రాంమోహన్ రావు ఈ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఇందులో టాలీవుడ్ ప్రతినిధులు నటి సుప్రియ, యాంకర్ ఝాన్సీ, దర్శకురాలు నందిని రెడ్డిలతో పాటు నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వసంతి, గాంధీ మెడికల్ కళాశాల వైద్యురాలు రమాదేవి, సామాజిక కార్యకర్త విజయలక్ష్మి సభ్యులుగా ఉంటారు. ఇంకా సినిమా ప్రముఖులు రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ, నిర్మాత కె.ఎల్ నారాయణ, నటి ప్రీతి నిగమ్, నిర్మాత ఎన్.సుధాకర్ రెడ్డి, దర్శకులు శంకర్, తమ్మారెడ్డి భరద్వాజతోపాటు, మహిళా సంక్షేమ, తెలంగాణా అభివృద్ధి సంస్థ లాంటి వివిధ ప్రభుత్వ శాఖల అధ్యక్షులు, కమిషనర్లు, డైరెక్టర్లు కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. చదవండి : లైంగిక వేధింపులు; ప్యానెల్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం -
పవన్, నాగబాబుపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు
సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి చర్చకు తెరలేపి సంచలనం సృష్టించిన శ్రీరెడ్డి మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆయన సోదరుడు, జనసేన నరసాపురం ఎంపీ అభ్యర్థి నాగబాబుపై నిప్పులు చెరిగారు. ‘పవన్ మంచోడు కాదు అలా అని చెడ్డోడు కూడా కాదు. ఆయన ఓ నటుడు మాత్రమే. దయచేసి ఆయన మాటలను నమ్మి ఉన్మాదులుగా మారొద్దు’ అని హితవు పలికారు. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న శ్రీరెడ్డి ఎన్నికల నేపథ్యంలో ఫేస్బుక్ లైవ్‌లో మాట్లాడుతూ.. ఓటు ద్వారా ఆంధ్రప్రదేశ్ రుణం తీర్చుకుని, అభివృద్ధి చేసుకోవాలని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. నాగబాబుకు ఓటెయ్యద్దని చెప్పిన శివాజీరాజాను నోటికి వచ్చినట్టు తిట్టిన దిలీప్ సుంకరపై శ్రీరెడ్డి మండిపడ్డారు. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని దిలీప్ సుంకరను హెచ్చరించారు. ‘ఓ మహిళగా పవన్ తల్లి గురించి మాట్లాడిన మాటలకు సారీ చెబుతున్నా. జనసేనకు వ్యతిరేకంగా మాట్లాడితే చంపేస్తాం అంటూ కామెంట్లు చేస్తారు. రౌడీయిజం చేస్తారా. అసలేం తెలుసురా మీకు పవన్, నాగబాబు గురించి. నాగబాబుకు ఎంత పొగరు. సాటి ఆర్టిస్టులకు డబ్బులు లేనంత మాత్రాన నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా. నరసాపురం నియోజకవర్గంలో పదివేల రూపాయల గుప్తదానం చేశావా. కనీసం పది రూపాయలు ఎవరికైనా దానం చేశావా. వరుణ్‌తేజ్, నిహారికలను తీసుకొస్తే గెలుస్తావా. మీ తమ్ముడు వంశపారంపర్య రాజకీయాలు చేయము అన్న ఉత్తముడు, ఉదాత్తుడు కదా. మరి నిన్నెందుకు తీసుకొచ్చాడు. రాజకీయ నాయకులను వెధవలు, రా అంటున్నావు. ఏరా పోరా అంటున్న మిమ్మల్ని నేను కూడా అంటా. మీరే నాకు ఆ హక్కు ఇచ్చారు. ఏందిరా పవన్ కల్యాణ్ నీ యాక్టింగ్‌లు. బొచ్చెలో తినడం. పవన్ ఏం చేశావని నీ అన్నను ఎంపీగా గెలిపించాలి. నువ్వు చెప్పిన వాళ్లందరికీ ఓటు వేయాలా. కాపుల్లో ఉత్తములు ఉన్నారు. అధోగతి పాలైన వారు ఉన్నారు. కమ్మ, రెడ్డి, కాపు అయినా ప్రతీ కులంలో చెడ్డోడు ఉన్నాడు మంచోడు ఉన్నాడు. పవన్ మంచోడు కాదు అలా అని చెడ్డోడు కాదు. రాజకీయంగా కొన్ని లక్షణాలు ఉండాలి. చదువు రాని వాడివి ఏవిధంగా రా ఐఏఎస్‌ల ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటావు. టెన్త్ సర్టిఫికెట్లు దొంగతనంగా సృష్టించావు. సీఎం అయితే వందల కోట్ల ఫైల్స్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది. సినిమా ఇండస్ట్రీని దోచుకుని కోట్లు కోట్లు సంపాదించావు. కారు లేదంటావు. ఈఎంఐలు కట్టలేనంటావు. మరి నీకు హెలికాప్టర్లు ఎక్కడినుంచి వచ్చాయి. కానిస్టేబుల్ కొడుకునంటావు. ఐటీ కోట్లకు కోట్లు కట్టానంటావు. డబ్బుల్లేవంటావు. పైత్యం ఉన్న ఇలాంటి వ్యక్తిని కొంతమంది ఉన్మాదులు, కాపు వ్యక్తి సీఎం కావాలనే వ్యక్తులు నీ వెనుక తిరగొచ్చు. కనీసం అబద్ధాలైనా కరెక్టుగా గుర్తు పెట్టుకుని చెప్పు. ఆంధ్రప్రదేశ్ నిధులు ఏం కావాలి. కేంద్రంలో ఏ ప్రభుత్వం వస్తే రాష్ట్రానికి ఉపయోగం అన్న విషయాలు తెలుసా. పవన్ కల్యాణ్ అనే వెధవకు, దరిద్రుడైన నాగబాబుకి, కాపు సామాజిక వర్గానికి చెందిన కొంతమందికి ఓటు వేసే ముందు ఆలోచించండి. రాజకీయ నాయకులు మాకు సేవచేయడానికి మాత్రమే మీరున్నది. దయచేసి మీ ఓటు ఎవరికి వేయాలో ఆలోచించి వేయండి’ అని శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
హెచ్ఆర్సీకి నటి శ్రీరెడ్డి ఫిర్యాదు
పెరంబూరు: నటి శ్రీరెడ్డి, నిర్మాత రవిదేవన్‌తో కలిసి మంగళవారం చెన్నైలోని మానవ హక్కుల సంఘంలో ఒక ఫిర్యాదు చేసింది. తెలుగు నటి శ్రీరెడ్డి ఆ మధ్య టాలీవుడ్లో ప్రకంపనలు పుట్టించిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఇటీవల చెన్నైలో మకాం పెట్టింది. అంతే కాదు రెడ్డి డైరీ పేరుతో ఆమె బయోపిక్‌గా తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రంలో తనే ప్రధాన పాత్రను పోషిస్తోంది. కాగా కొన్ని రోజుల క్రితం ఈ చిత్ర ఫైనాన్సియర్ సుబ్రమణి, మరో వ్యక్తి తనపై హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నారని స్థానిక కోయంబేడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే ఆ తరువాత ఆ కేసును తను వెనక్కి తీసుకోవడంతో పలు విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తానా కేసును వెనక్కి తీసుకోవడానికి కారణాన్ని శ్రీరెడ్డి ఇటీవల మీడియా ముందుకు వచ్చి వివరించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సంచలన నటి మంగళవారం చెన్నైలోని మానవహక్కుల సంఘంలో తనకు జరిగిన మానవహక్కుల అతిక్రమణ గురించి ఫిర్యాదు చేసింది. అనంతరం శ్రీరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను రెడ్డి డైరీ చిత్ర షూటింగ్ కోసం చెన్నైకి వచ్చానని చెప్పింది. కొన్ని అనివార్య కారణాల వల్ల రెడ్డి డైరీ చిత్రాన్ని అనుకున్న టైమ్‌లో పూర్తి చేయలేని పరిస్థితి నెలకొందని చెప్పింది. దీంతో వారం రోజులుగా చిత్ర షూటింగ్ నిలిచిపోయ్యిందని తెలిపింది. దీంతో చిత్ర నిర్మాత, ఇతర యూనిట్ వర్గాలకు తీవ్ర నష్టం కలిగిందని చెప్పింది. అందువల్లే తాను ఈ సమస్యలను పరిష్కరించాల్సిందిగా మానవహక్కుల సంఘంలో ఫిర్యాదు చేసినట్లు శ్రీరెడ్డి పేర్కొంది. -
నటి శ్రీరెడ్డిపై దాడి
సాక్షి, చెన్నై: నటి శ్రీరెడ్డి, ఆమె మేనేజర్ మోహన్‌పై చెన్నైలో ఇద్దరు వ్యక్తులు దాడి చేసి, హత్యా బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వివరాలిలా ఉన్నాయి. చెన్నై వలసరవాక్కంలో నటి శ్రీరెడ్డి నివశిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఇద్దరు వ్యక్తులు ఆమె ఇంట్లోకి చొరబడి శ్రీరెడ్డి, ఆమె మేనేజర్ మోహన్‌పై దాడి చేశారు. దీనిపై ఆమె వెంటనే కంట్రోల్ రూంకు ఫోన్ చేయగా పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మద్యం మత్తులో గొడవ పడుతున్న ఫైనాన్షియర్, సినీ నిర్మాత సుబ్రమణి (40), అతని అక్క కుమారుడు గోపి (23)లను అరెస్ట్ చేశారు. దాడిలో స్వల్పంగా గాయపడిన శ్రీరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జయ్యారు. శ్రీరెడ్డి ఫిర్యాదు మేరకు చెన్నై కోయంబేడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సదరు నిర్మాత సుబ్రమణి మూడునెలల క్రితం హైదరాబాద్‌లో శ్రీరెడ్డిని లైంగిక వేధింపులకు గురిచేయగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ పోలీసులు సుబ్రమణిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చిన సుబ్రమణి తన అక్క కుమారుడు గోపీని వెంటబెట్టుకుని వచ్చి శ్రీరెడ్డిపై దాడికి దిగారు. ఈ సంఘటనపై పోలీసులు శ్రీరెడ్డిని విచారిస్తున్నారు. -
మిస్టర్ నకిలీ నిన్ను వదలా!
చెన్నై , పెరంబూరు: సంచలన నటి శ్రీరెడ్డి మరోసారి ఆరోపణలతో తెరపైకి వచ్చింది. ఈ అమ్మడు ఇంతకు ముందు కాస్టింగ్ కౌచ్ పేరుతో టాలీవుడ్లో కలకలం సృష్టించి ఆ తరువాత కోలీవుడ్‌లోనూ రచ్చ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం తన ఫేస్బుక్లో పేర్కొంటూ దక్షిణ భారత నటీనటుల సంఘంలోని ఒక సభ్యుడిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ నిన్ను వదిలి పెట్టేది లేదని హెచ్చరించింది. మంగళవారం ఒక టీవీలో మీ ప్రసంగాన్ని విన్నాను. అసలు రూపాన్ని మరచి నంగనాసి కబుర్లు బాగానే చెబుతున్నారు. నీ అసలు రంగు బయట పెడతాను. నా వద్ద ఆధారాలు ఉన్నాయి. పరిశ్రమలోని ప్రముఖ నటీమణుల నుంచి సహాయ నటీమణుల వరకూ ఎలా లైంగికవేధింపులకు గురిచేస్తున్నారన్న ఆధారాలు నా వద్ద ఉన్నాయి. నువ్వు దక్షిణ భారత నటీనటుల సంఘంలోనూ, నిర్మాత మండలిలోనూ పదవుల్లో ఉన్నానని ఎగిరి పడుతున్నావు. మిస్టర్ నీ నకిలీ ముఖాన్ని త్వరలోనే బయట పెడతాను అని నటి శ్రీరెడ్డి తన ఫేస్బుక్లో పేర్కొని మరోసారి కలకలానికి తెరలేపింది. -
‘ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్ను వేధించాడు’
చెన్నై : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న మీటూ ప్రకంపనలు తెలంగాణను తాకాయి. టీఆర్ఎస్కు చెందిన ఆర్మూర్ తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డిపైన నటి శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఓ ప్రముఖ తమిళ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీటూ ఉద్యమం గురించి ఆమె మాట్లాడుతూ..‘ జీవన్ రెడ్డి హైదరాబాద్‌లోని పార్క్‌హయత్ హోటల్లో నాపై వేధింపులకు పాల్పడ్డాడు. అతడికి అమ్మాయిలంటే పిచ్చి. అతడు పెద్ద మోసగాడు. అతనికి నిర్మాత బెల్లంకొండ సురేశ్ సహాయం చేశాడు. అతడు ప్రతి రోజు ఫోన్ చేసి వేధింపులకు పాల్పడేవాడు. తమ పార్టీ అధికారంలో ఉందని బెదిరింపులకు దిగేవాడ’ని పేర్కొన్నారు. గతంలో కూడా శ్రీరెడ్డి పలువురు ప్రముఖులపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. -
థ్యాంక్స్ మీరు వింటున్నారు
అవును. వింటున్నాం. ఇవాళ మనం వినగలుగుతున్నాం. ఏ? ఈ ఘోష ముందు లేదా?ఈ వేధింపులు మునుపు లేవా?ఉన్నాయి. కానైతే.. మహి ఇవాళ చెప్పుకోగలుగుతోంది. ఎందుకు చెప్పుకోగలుగుతోందంటే..వినడానికి మనం ఇన్నాళ్లకు సిద్ధమయ్యాం.ఈ కొత్త సమాజానికి థ్యాంక్స్.ఇవాళ్టి నుంచీ మాట పెరగాలి. ఇవాళ్టి నుంచీ ఘోష తగ్గాలి..! సైలెన్స్ బ్రేక్ అవుతోంది. శుభ పరిణామం! అమ్మాయిల బాధను వినేవాళ్లూ సిద్ధమవుతున్నారు. ఇది అన్నిటికన్నా గొప్ప పరిణామం. ముల్లొచ్చి అరిటాకు మీద పడ్డా.. అరిటాకు వచ్చి ముల్లు మీద పడ్డా అరిటాకుకే నష్టం... ఏ బాధనైనా మునిపంట బిగపట్టాలి.. ఏ కష్టాన్నయినా గుప్పిట్లో దాచిపెట్టాలి.. వంటి మాటలకు.. సలహాలకు కాలం చెల్లినట్టే. ఎందుకంటే ఆడవాళ్ల ఇబ్బందులను, శారీరక మానసిక హింసనూ విని అర్థం చేసుకునేందుకు సమాజం రెడీ అయింది. ఇన్నాళ్లూ మహిళలు మౌనంగా ఉంది.. తనను వేధించిన వ్యక్తి కుటుంబం నాశనమవుతుందోమోననో.. లేక జరిగిన దానికి లోకం తననే తప్పు పడుతుందేమోననో.. తనింటి పరువు, మర్యాదా బజారున పడతాయేమోననో భయం వల్ల! నిజానికి ఇలాంటి భయానికి కారణం మన వ్యవస్థే. అంటే మనమే. అణచివేసి అణచివేసి గొంతు లేకుండా చేద్దామనుకున్నాం. కాని స్ప్రింగ్‌లాగా పైకి లేస్తుందనే లాజిక్ మరిచిపోయాం. శతాబ్దాల నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టి ఆ లాజిక్‌ను గుర్తుచేస్తున్నారు. వాళ్లు మాట్లాడ్డం మొదలుపెడుతున్నారు కాబట్టి కారణమైన మగవాళ్లకు అసహనంగా ఉండిఉండొచ్చు. కాని దుర్బలుల సహనాన్నీ గ్రహించింది సమాజం.. అందుకే వినడం మొదలుపెట్టింది. లేకపోతే అత్యంత పురుష దురహంకారిగా ముద్ర వేసుకున్న అగ్రరాజ్య అగ్రజుడు ట్రంప్ కూడా మహిళ మాట్లాడితే విననైతే విన్నాడు! అమెరికా సుప్రీంకోర్ట్ జడ్జిగా ట్రంప్ నామినేట్ చేసిన బ్రెట్ కవానా తన మీద లైంగిక దాడికి ప్రయత్నించాడని ఆరోపించింది క్రిస్టీన్ బ్లేసీ అనే మహిళ. 1980ల్లో మేరీల్యాండ్ రాష్ట్రంలో ఈ సంఘటన జరిగింది. బ్లేసీ, కవానా ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుతున్నప్పుడు.. ఓరోజు తప్పతాగిన బ్రెట్.. బ్లేసీ దుస్తులు విప్పే ప్రయత్నం చేశాడు. ఈ విషయాన్ని బ్రెట్ సుప్రీంకోర్ట్ జడ్జీగా నామినేట్ అయిన సమయంలో బయటపెట్టింది బ్లేసీ. ఈ ఆరోపణ మీద అమెరికాలోనూ చాలా వాద వివాదాలు జరిగాయి. బ్లేసీ చెప్పింది నిజమే అయుండొచ్చని బ్లేసీని నమ్మిన వాళ్లు 45 శాతం ఉంటే, బ్రెట్‌ను సపోర్ట్ చేసినవాళ్లు 38 శాతం. 45 శాతం అనేది ఇక్కడ గుడ్సైన్. ఇది మీ టూ వల్ల వచ్చిన చైతన్యం కావచ్చు.. ఆ ఉద్యమం కలిగించిన అవగాహన అయ్యుండొచ్చు.. ఏదైనా మంచి పరిణామం. ఆ కదలిక మన దగ్గరా వస్తోంది.. నిజానికి ఇది 1988లోనే రాజుకుంది. పంజాబ్ కేడర్ ఐఏఎస్ రూపన్ డియోల్ బజాజ్ .. ఆ టైమ్‌లో ఫైనాన్స్ మినిస్ట్రీలో స్పెషల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అప్పుడు కేపీఎస్ గిల్ చండీగఢ్‌కు (అప్పుడు చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది) ఐజీ (ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) గా ఉన్నారు. ఒక పార్టీలో కేపీఎస్ గిల్ తన పిరుదల మీద తట్టాడు అని కేసు నమోదు చేసింది రూపన్. అప్పుడు అదొక సంచలనం. హై ప్రొఫైల్స్ కలకలం సృష్టించింది. 2006లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇలాంటి హైప్రొఫైల్.. సెన్సేషన్‌కు కేంద్రమైంది. కె. మంగపతిరావు అనే ఐఏఎస్ ఆఫీసర్ తన కింది అధికారిణిని వేధించినట్టు కేస్ నమోదైంది. ఇవన్నీ కూడా మన దగ్గర ‘మీ టూ’కి ఆరంభ సూచికలే. తర్వాత కొంతమంది తమకు జరిగిన వేధింపుల గురించి నోరు విప్పినా.. మీడియా అత్సుత్సాహం.. వేధించిన వాళ్లకు పైవాళ్ల అండదండలుండటం వంటి కారణాల వల్ల మళ్లీ సైలెన్స్ స్టేట్లోకి వెళ్లిపోయారు బాధిత మహిళలు. అలాంటి సమయంలో దేశాన్నే ఒక్క కుదుపు కుదిపిన సంఘటన.. తెహల్కా మ్యాగజైన్ ఎడిటర్–ఇన్–చీఫ్ తరుణ్ తేజ్పాల్దే. తెహల్కా తరపున తరుణŠ తేజ్‌పాల్ గోవాలో ‘థింక్‌ఫెస్ట్’ ఈవెంట్ నిర్వహించాడు. ఆ రోజు రాత్రి హోటల్ లిఫ్ట్‌లో.. తన దగ్గర ఇంటర్న్‌గా చేరిన ఓ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అందుకు ఆమె తీవ్రంగా హర్ట్ అయి ఫిర్యాదు చేసింది. అయితే ఈ అంశంలో తరుణ్ తేజ్‌పాల్ ఎంత అప్రతిష్ట పాలయ్యాడో ఆ అమ్మాయీ అంతే ప్రశ్నలను ఎదుర్కొంది. ధైర్యంగా.. చెప్పాలంటే తొలిసారిగా.. ‘‘మై బాడీ మై రైట్ (నా శరీరం మీద నాదే హక్కు)అని నినదించింది. అప్పుడు మొదలైంది ఆడవాళ్లతో సహా అందరూ ఆలోచించడం. నిజమే కదా.. ఆమె శరీరం మీద ఆమెదే సంపూర్ణ హక్కు. చలం ఏనాడో చెప్పిన మాట.. ఇన్నాళ్లూ పెడచెవిన వేసి.. ఇప్పుడిప్పుడు వినడం ప్రారంభించాం. అందుకే మీ టూ అంటూ సైలెన్స్ బ్రేక్ అవడం స్టార్ట్ అయింది. జర్నలిజం నుంచి సినిమా రంగానికి టర్న్ తీసుకుంది. తెలుగులో శ్రీ రెడ్డి.. బాలీవుడ్లో తనుశ్రీ దత్తా ఇండస్ట్రీని షేక్ చేశారు. ‘మీ టూ’లో వేధింపుల చిట్టా పెరుగుతూంటే వింటోన్న మనం విస్తుపోతున్నాం. ఆ ప్రకంపనలు మళ్లీ జర్నలిజం వైపూ పాకాయి. ఎమ్జే అక్బర్ లాంటి దిగ్గజాల నుంచి కేఆర్ శ్రీనివాస్, టీఎస్ సుధీర్ వంటి వాళ్ల పేర్లూ లిస్ట్‌లో కనబడుతున్నాయి. ఆ జాబితా కొనసాగుతూనే ఉంది. అయితే.. వింటున్నాం.. కాని జరిగినప్పుడే చెప్పక.. ఇప్పుడెందుకు చెప్తున్నారు అన్న సందేహాన్నీ వెలిబుచ్చుతున్నాం. ఇందాకే అనుకున్నాం.. చెప్పకుండా దాచుకోవడానికి సమాజం మన నెత్తి మీద పరువనే పెద్ద బరువునే పెట్టింది. దాన్ని ఉగ్గుపాలతో రంగరించి పోసింది. కాని దాని గడువు తీరింది. ఎక్స్పైరీ అయిపోయింది. స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ అన్నట్లు.. అన్వాంటెడ్ టచ్‌ను.. ఇష్టంలేని స్పర్శ కలిగించిన అవమానాన్ని స్త్రీ ఎప్పటికీ మరిచిపోలేదు. జీవితాంతం ఆ వేదనను అనుభవిస్తూనే ఉంటుంది. అందుకే ఆమె ఆ కోపాన్ని, బాధను ఎప్పుడైనా వెలిబుచ్చవచ్చు. కాబట్టే ఆమెను వినాలి. అవును.. వింటున్నాం.. విని ఊరుకోవద్దు.. పరిస్థితులను మార్చాలి.. మనల్ని మనం మార్చుకోవాలి. – సరస్వతి రమ నిందితులు: తరుణ్ తేజ్‌పాల్, ఎం.జె.అక్బర్ నాలుగేళ్ల నాటి లైంగిక వేధింపుల కేసులో తరుణ్ తేజ్‌పాల్ ఈ నెల 30న మరోసారి సుప్రీంకోర్టుకు హాజరవుతుండగా.. పూర్వపు జర్నలిస్టు, ప్రస్తుత కేంద్ర మంత్రి ఎం.జె.అక్బర్ తాజాగా ‘మీటూ’ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. -
‘మహానటి’నీ వదలని శ్రీరెడ్డి
తమిళసినిమా : దక్షిణాది సినిమాలో ఒక ఫైర్‌బాంబ్‌గా పేరు తెచ్చుకున్న నటి శ్రీరెడ్డి. ఇప్పుడీమె పేరు ఎత్తితేనే చిత్ర పరిశ్రమలోని కొందరు బెంబేలెత్తిపోతున్నారనే చెప్పాలి. కాస్టింగ్ కౌచ్ అంటూ ముందు టాలీవుడ్లో కలకలం పుట్టించిన శ్రీరెడ్డి తాజాగా కోలీవుడ్‌ను టార్గెట్ చేసింది. ఇక్కడ దర్శకుడు ఏఆర్.మురుగదాస్, నటుడు లారెన్స్ లాంటి ప్రముఖులపై కూడా ఘాటుగా విమర్శలు చేసి ఫైర్ బాంబ్‌గా మారింది. టాలీవుడ్లో రక్షణ లేదు అంటూ చెన్నైలో మకాం పెట్టిన శ్రీరెడ్డి తాజాగా తెరకెక్కుతున్న తన జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న రెడ్డి డైరీ చిత్రంలో నటిస్తోంది. ఇటీవల నటుడు విశాల్ తాను నటించిన సండైకోళి–2 చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై నటి శ్రీరెడ్డికి అవకాశం రావడం ఆహ్వానించదగ్గ విషయం అని పేర్కొన్నారు. అంతే కాదు ఇకపై ఆమెతో నటించేటప్పుడు అందరూ జాగ్రత్తగా ఉండాలని, ఆమె తన రక్షణ కోసం కెమెరా దగ్గరే ఉంచుకుంటారని అన్నారు. ఆ మాటలకు పక్కనే ఉన్న నటి కీర్తీసురేశ్ నవ్వేసింది. అదే శ్రీరెడ్డికి మండింది. విశాల్‌కు థ్యాంక్స్ చెబుతూ నటి శ్రీరెడ్డి ఇటీవల ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసింది. అందులో నటి కీర్తీసురేశ్ నవ్వడం గురించి పేర్కొంటూ మీ నవ్వు చాలా అసహ్యంగా ఉంది. ఏం చింతించకండి మేడమ్ మీరు ఎప్పుడూ అగ్రస్థానంలో ఉండలేరు. పోరాడేవారి బాధేంటో మీకూ ఒక రోజు తెలుస్తుంది. గుర్తుంచుకోండి. నేనూ మీ నవ్వును మరచిపోను. మీరిప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నట్టున్నారు అని పేర్కొంది. శ్రీరెడ్డి ట్వీట్‌పై కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. అయినా విశాల్ శ్రీరెడ్డి గురించి మాట్లాడినప్పుడు ఆ వేదికపై ఉన్న వారందరూ నవ్వారు. అందులో నటి కీర్తీసురేశ్‌నే శ్రీరెడ్డి టార్గెట్ చేయడం ఏమిటన్న వాదన వినిపిస్తోంది. మరి ఈ అమ్మడి ఫైర్‌పై నటి కీర్తీసురేశ్ ఎలా స్పందిస్తుందో చేడాలి. మొత్తం మీద కోలీవుడ్‌లో మరోసారి శ్రీరెడ్డి రచ్చ మొదలైంది. -
నాకలాంటి ఘటన ఎదురుకాలేదు!
ఇక్కడ ఎవరు మాత్రం అత్యాచార వేధింపులకు గురికావడం లేదూ? అంటూ ప్రశ్నించింది నటి అనుపమా పరమేశ్వరన్. మలయాళ చిత్రం ప్రేమమ్ చిత్రంతో పరిచయమైన ముగ్గురు ముద్దుగుమ్మల్లో ఒకరైన ఈ బ్యూటీ ఆ చిత్రం తెచ్చి పెట్టిన పేరుతో ఇప్పుడు దక్షిణాది భాషల్ని చుట్టేస్తోంది. ముఖ్యంగా తెలుగు, మలయాళంలో బాగానే పాపులర్ అయ్యింది. ఇక కోలీవుడ్‌లో ధనుష్‌కు జంటగా కొడి చిత్రంలో మెరిసింది. అప్పుడెప్పుడో గాయని సుచిత్ర చిత్ర పరిశ్రమలో సెక్స్ రాకెట్‌ను బయట పెట్టి కలకలం సృష్టించింది. అయితే కాస్టింగ్ కౌచ్ వ్యవహారం మాత్రం ముందు బాలీవుడ్లో బయటపడింది. ఆ తరువాత దక్షిణాదిలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ మధ్య నటి శ్రీరెడ్డి అవకాశాల పేరుతో లైంగికంగా వాడుకున్నారంటూ రోడ్డెక్కి కలకలం సృష్టించింది. అయితే అంతకు ముందే నటి రాధికా ఆప్తే, వరలక్ష్మీ శరత్‌కుమార్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి కొందరు సినీరంగంలో కాస్టింగ్ కౌచ్‌పై స్పందించారు. తాజాగా నటి అనుపమ పరమేశ్వరన్ లైంగిక వేధింపులు నిజమేనని పేర్కొంది. దీని గురించి ఈ అమ్మడు మాట్లాడుతూ సినీరంగంలో హీరోయిన్లకు లైంగిక వేధింపులు ఎదురవుతున్న మాట వాస్తవమేన న్నది తాను ఖండించలేనంది. ఇక్కడ ఎవరు మాత్రం లైంగిక వేధింపులకు గురి కావడం లేదు? అంటూ ప్రశ్నించింది. అయితే అలాంటి సంఘటన ఇంత వరకూ తనకు ఎదురవలేదని పేర్కొంది. ఈ రంగంలో ఏదో సాధించాలన్న ఆశతో కొత్తగా వచ్చే తారలు ఎక్కువగా అత్యాచార వేధింపులకు గురవుతున్నారని అంది. అయితే అలాంటి వేధింపులను ఎదిరించనంత వరకూ యథేచ్ఛగా జరుగుతూనే ఉంటాయన్నది తన భావన అని అంది. తన చుట్టూ మంచి వారే ఉన్నవారని చెప్పింది. అలాంటి వారు ఉన్నంత వరకూ తనకెలాంటి సమస్య రాదనే ధీమాను వ్యక్తం చేసింది. మరో విషయం ఏమిటంటే అందం అనేది మోడ్రన్‌గా ఉండడంలోనో, లంగా ఓణి ధరించడంలోనో ఉండదని, ప్రతిభావంతమైన నటనను ప్రదర్శంచడంలోనే ఉంటుందని ఆ అమ్మడు చెప్పింది. -
స్త్రీలోక సంచారం
►తమిళనాడులోని తిరుచ్చిలో 17 మహిళా స్వయం సహాయక బృందాలలోని సభ్యులు కలిసి ఏర్పాటు చేసుకున్న ‘కాలేజ్ బజార్ గ్రూపు’.. తిరుచ్చిలో తొలి విడతగా ఎంపిక చేసుకున్న 15 కళాశాలల్లోని ప్రాంగణాలలో కాలేజీ యాజమాన్యాల అనుమతితో విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న స్టాల్స్ అత్యంత ఆదరణ పొందడమే కాక.. గ్రూపు సభ్యుల స్వయం సమృద్ధికి, ఆర్థిక స్వేచ్ఛకు తోడ్పడుతున్నాయి. తిరుచ్చి జిల్లా మొత్తంలో సుమారు 10 వేలకు పైగా మహిళా స్వయం సహాయక బృందాలు ఉండగా, ఒక్క తిరుచ్చి పట్టణంలోనే వెయ్యి వరకు చురుగ్గా పనిచేస్తున్నాయని, ఆ వెయ్యి బృందాలలోని పదిహేడు బృందాలు.. కాస్ట్యూమ్ జ్యుయలరీ, క్లాత్ బ్యాగులు, దుస్తులు, డెకరేటివ్ ఐటమ్స్, ఇంకా విద్యార్థినీ విద్యార్థులకు అవసరమైన ఉత్పత్తులను స్వయంగా తయారు చేసుకుని వచ్చి, చవక ధరల్లో విక్రయిస్తూ ఆదరణ పొందుతున్నందున.. కొత్తగా ప్రారంభం అయిన ‘కాలేజీ బజార్ గ్రూపు’ను ఒక సంస్థగా రిజిస్టర్ చేయించిన అనంతరం, ఇలాంటివే మరికొన్ని గ్రూపుల ఏర్పాటుకు సహకారం అందించనున్నామని ‘తమిళనాడు కార్పొరేషన్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్’ ప్రతినిధి ఒకరు తెలిపారు. ► తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న లైంగిక అకృత్యాలపై బాధితుల ఫిర్యాదును స్వీకరించి, వారికి న్యాయం జరిపించేందుకు వీలుగా ఒక అత్యున్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలన్న తమ అభ్యర్థనపై తెలంగాణ ప్రభుత్వం ఉదాసీనంగా ప్రవర్తిస్తోందంటూ.. ఏడుగురు సామాజిక కార్యకర్తలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టాలీవుడ్‌లోని పెద్ద పెద్ద దర్శకులు, నటులు అవకాశాల పేరుతో తనను వాడుకుని దగా చేశారనీ, తనకు న్యాయం జరిపించాలని డిమాండ్ చేస్తూ శ్రీరెడ్డి అనే యువతి ఈ ఏడాది ఏప్రిల్ 7న ఫిల్మ్ చాంబర్ ఎదుట.. సంచలనాత్మకంగా అర్ధనగ్న నిరసన చేపట్టిన అనంతరం.. తామంతా కలిసి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను అనేకమార్లు కలిసి.. ‘క్యాస్టింగ్ కౌచ్’ ఫిర్యాదులను స్వీకరించి, విచారించి, బాధితులకు న్యాయం జరిపించేందుకు ఒక అత్యున్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని అడుగుతున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో కోర్టుకు వెళ్లక తప్పలేదని ఈ ఏడుగురు పిటిషనర్లు తెలిపారు. ►బాలీవుడ్ తారలు ప్రియాంక చోప్రా, దీపికా పడుకోన్‌ల మధ్య ప్రారంభం నుంచీ కెరీర్లో ఉన్న ‘శత్రుత్వం’.. దీపికను ప్రతిదానికీ ప్రియాంకతో పోల్చుకునేలా ప్రేరేపిస్తోందని వదంతులు వినిపిస్తున్న క్రమంలో.. ఇటీవలి నిశ్చితార్థం తర్వాత బాయ్‌ఫ్రెండ్ నిక్ జోనస్‌ని ఈ నవంబర్‌లో గానీ డిసెంబర్లో గానీ ప్రియాంక చేసుకోబోతున్న వివాహానికంటే ఘనంగా, అదే సమయానికి తన బాయ్‌ఫ్రెండ్ రణ్వీర్ సింగ్‌ను పెళ్లి చేసుకునేందుకు దీపిక ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్ పత్రికలు రాస్తున్నాయి. హాలీవుడ్ చిత్రాల్లో నటించడంలో ప్రియాంక పైచేయిగా ఉండగా, బాలీవుడ్లో దీపికే వెలిగిపోవడం దీపికకు ఉన్న ఒక ప్లస్ పాయింట్ అయితే.. ప్రియాంకలా దీపికకు విదేశీ బాయ్‌ఫ్రెండ్ లేకపోవడం ఒక మైనస్ పాయింట్ అని కూడా ఏవేవో విశ్లేషణలు జరుగుతున్నాయి. ►డాలర్ ముందు రూపాయి విలువ పడిపోకుండా ఉండటం కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారం పైన సుంకం విధించాలని ప్రభుత్వం యోచిస్తుండటంతో బంగారు ఆభరణాల ధరలు స్వల్పంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రూపాయి విలువను కాపాడుకునేందుకు కనీసం 2 శాతంగానైనా బంగారంపై దిగుమతి సుంకాన్ని విధించడం ఒక్కటే ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న ఉత్తమమైన మార్గమని ఇండియన్ బులియన్ అండ్ జ్యుయలరీస్ అసోసియేషన్ (ఐ.బి.జె.ఎ.) జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా అంటున్నారు. ►భారతదేశంలో మహిళల ఆత్మహత్యల సంఖ్య అధికంగా ఉండడానికి కారణం.. చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసెయ్యడమేనని, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మహిళల ఆత్మహత్యల్లో 37 శాతం భారతదేశంలో జరుగుతున్నవేనని ప్రఖ్యాత ‘లాన్సెట్’ మెడికల్ జర్నల్‌లో వచ్చిన తాజా సర్వే నివేదిక వెల్లడించింది. చిన్న వయసులోనే తల్లి అవడం, ఆర్థికంగా ఆధారపడి ఉండటం, గృహహింస వంటివి.. మహిళల్లో మానసికంగా ఒత్తిడిని కలిగించి, వారిని ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయని నివేదిక తెలిపింది. ► 44 ఏళ్ల కేరళ నన్‌పై పలుమార్లు అత్యాచారం జరిపిన జలంధర్ బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 9 నుండీ కొట్టాయంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న 85 ఏళ్ల జోన్ జోసెఫ్ అనే జాయింట్ క్రిస్టియన్ కౌన్సిల్ సభ్యుడు, జోసెఫ్ స్టీఫెన్ అనే ఓ రైతుతో పాటు సోమవారం నుంచి బాధితురాలి చెల్లెలు కూడా దీక్షకు కూర్చున్నారు. ఇదిలా ఉండగా, అరెస్టు కాకుండా ఉండేందుకు ముందస్తు బెయిలు కోసం బిషప్ ములక్కల్ దాఖలు చేసుకున్న పిటిషన్ విచారణను కేరళ హైకోర్టు సెప్టెంబర్ 24వ తేదీకి వాయిదా వేసింది. ►తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందర్‌రాజన్.. చెన్నైలోని ఒక ఆటో డ్రైవర్ ఇంటిని అకస్మాత్తుగా సందర్శించి, ఆ కుటుంబం క్షేమ సమాచారాలు కనుక్కొని, ఒక స్వీట్ బాక్సును ఇచ్చి.. ప్రభుత్వం నీకు అండగా ఉంటుందని చెప్పివెళ్లిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా చెన్నైలో సోమవారం తమిళసై ఏర్పాటు చేసిన సభలో ఆ ఆటో డ్రైవర్.. పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉండటంపై అసహనంతో ఆమెను ప్రశ్నిస్తూ ఉండగానే.. పార్టీ కార్యకర్తలో కొందరు అతడిని తోసుకుంటూ అక్కడి నుంచి తీసుకెళుతున్న వీడియో వైరల్ కావడంతో.. నష్ట నివారణ చర్యలో భాగంగా తమిళసై అతడి ఇంటికి వెళ్లి పరామర్శించి వచ్చారు. ► బ్రిటన్ రాజప్రాసాదంలోకి అడుగుపెట్టాక ప్రిన్స్ హ్యారీ సతీమణి మేఘన్ మార్కెల్ తొలిసారి ఒక కొత్త ప్రాజెక్టులో పాలుపంచుకున్నారు. గత ఏడాది లండన్‌లోని ‘గ్రెన్‌ఫెల్ టవర్’ ఫైర్‌లో 70 మంది ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటనలో బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు విరాళాలను సేకరించడం కోసం ఆయా కుటుంబాలు సంప్రదాయికంగా వండే 50 రకాల వంటకాలను చేయించి, వాటిల్లో కొన్ని స్వయంగా తను చేసి, వాటన్నిటితో ‘టుగెదర్ : అవర్ కమ్యూనిటీ కుక్ బుక్’ అనే ఓ చక్కటి వంటల పుస్తకాన్ని వేయించి, దానికి ముందుమాట కూడా తనే రాసి, పుస్తకావిష్కరణ జరిపించారు మేఘన్ మార్కెల్. -
శ్రీరెడ్డి విషయంలో వాళ్ల నిర్ణయం నచ్చలేదు
సాక్షి, హైదరాబాద్ : ఎవరో ఒకరి తప్పుడు నిర్ణయాల వల్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) నిందలు మోయాల్సి వస్తోందని.. ‘మా’ జనరల్ సెక్రటరీ నరేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా’ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై స్పందించిన నరేశ్.. మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజాపై నమ్మకంతో పలు ఒప్పందాలపై సంతకం చేశానని పేర్కొన్నారు. కానీ శివాజీరాజా నిర్ణయాలు మాత్రం తనకు ఆశ్చర్యం కలిగించాయన్నారు. నటి శ్రీరెడ్డి విషయంలో ‘మా’ తీసుకున్న నిర్ణయం కూడా తనకు నచ్చలేదన్నారు. ఇటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల ‘మా’ కు చేటు జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహేష్ ఈవెంట్‌కు అడ్డుపడను.. ‘మా’ జనరల్ సెక్రటరీగా తనకు తగిన విలువ ఇవ్వకపోయినా మహేష్ బాబు ఈవెంట్‌కు అడ్డుపడని నరేశ్ స్పష్టం చేశారు. కళాకారుల సంక్షేమమే తనకు ముఖ్యమన్నారు. చిరంజీవి రెండు కోట్ల రూపాయలు ఇస్తానన్నా.. కోటి రూపాయలకే ఒప్పుకోవడం తనను ఆశ్చర్యపరిచిందని నరేశ్ అన్నారు. అయినా చిరంజీవి, మహేష్, ప్రభాస్ ఈవెంట్లు లోకల్లో జరిగినా 5 కోట్ల రూపాయలు వస్తాయని.. మరి వారి ఈవెంట్లు అమెరికాలో ఎందుకు పెట్టారో అర్థం కావడంలేదని సందేహం వ్యక్తం చేశారు. -
అత్యాచార వేధింపులు నిజమే : నటి
తమిళసినిమా: కోలీవుడ్‌లో హీరోయిన్లకు రక్షణ లేదన్నది ఇటీవల ఎక్కవగా వినిపిస్తున్న మాట. అయితే నటి శ్రుతిహాసన్ లాంటి కొందరు మాత్రం ఇక్కడ హీరోయిన్లకు భద్రత ఉందని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అయితే ఆ మధ్య సుశీలీక్స్ పేరుతో గాయని సుచిత్ర కోలీవుడ్‌లోని పలువురికి దడ పుట్టించిన పరిస్థితులను మరచి పోకముందే నటి శ్రీరెడ్డి టాలీవుడ్‌తో, కోలీవుడ్‌లోని కొందరు దర్శకులు, నటులను ఠారెత్తిస్తోంది. నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌తో సహా పలువురు హీరోయిన్లకు అత్యాచార వేధింపులు ఎదురవుతున్న మాట నిజమేనని కుండబద్ధలు కొట్టినట్లు బహిరంగంగానే చెబుతున్నారు. తాజా వర్ధమాన నటి ప్రియా భవానీ శంకర్ కూడా అత్యాచార వేధింపులు వాస్తవమేనంటోంది. మెయ్యాద మానే చిత్రంతో కథానాయకిగా రంగప్రవేశం చేసిన ఈ బుల్లితెర నటి ఇప్పుడు వెండి తెరపై హీరోయిన్గా బిజీ అవుతోంది. ఇటీవల కార్తీకి జంటగా కడైకుట్టి సింగం చిత్రంలోనూ నటించింది. కాగా శుక్రవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఈ భామ నటి శ్రీరెడ్డి వ్యవహారంపై స్పందిస్తూ సినిమా రంగంలో హీరోయిన్లకు అత్యాచారం వేధింపులు అన్నది కొట్టిపారవేయలేమని అంది. అయితే ఇలాంటి వేధింపులు ఇతర రంగాల్లోనూ జరుగుతున్నాయని పేర్కొంది. మహిళలు సెక్స్ వేధింపులకు గురవుతున్నారని, అయితే అలాంటి వాటిని అంగీకరించడం, నిరాకరించడం అనేది మన చేతుల్లోనే ఉందని అంది. అయితే నటి శ్రీరెడ్డి అత్యాచార వేధింపులను ఎదుర్కొన్నానని బహిరంగంగా చెప్పడం సరి కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తప్పు చేసి దాన్ని బయటకు చెప్పుకోవడం ఎంత వరకు సబబు అని ప్రియా భవానీశంకర్ అంటోంది. సెక్స్ వేధింపుల భారిన పడకూడదనుకుంటే నటన నుంచి తప్పుకోవచ్చు కదా అని అంది. తాను మాత్రం కుటుంబ కథా చిత్రాల్లోనే నటించడానికి ఆసక్తి చూపుతున్నానని ఈ అమ్మడు చెప్పింది. -
శ్రీరెడ్డి బయోపిక్‌లో ఒరిజినల్ వీడియోలు
టాలీవుడ్, కోలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి పలువురిపై సంచలన ఆరోపణలు చేసిన నటి శ్రీరెడ్డి బయోపిక్కు రంగం సిద్దమైంది. సినీ పరిశ్రమలో తనకు ఎదురైన పరిస్థితులను తెరపై ఆవిష్కరిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. సోమవారం చెన్నైలో మీడియా సమావేశం నిర్వహించిన ఆమె చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను తెలియజేశారు. ‘రెడ్డి డైరీ’ సినిమాకు సహకరిస్తామని నడిగర్ సంగం హామీ ఇచ్చినందుకు శ్రీరెడ్డి ధన్యవాదాలు చెప్పారు. ఈ చిత్రంలో ‘కాస్టింగ్ కౌచ్’ ఒరిజినల్ వీడియోలు చూపించబోతున్నామని సంచలన ప్రకటన చేశారు. తన ఫేస్బుక్లో సైతం ’అమ్మ జయలలిత గారి ఆశీస్సులతో తమిళంలో నా తొలి చిత్రాన్ని లాంఛ్ చేస్తున్నాను. ఈ చిత్రానికి ‘రెడ్డి డైరీ’ పేరును ఖరారు చేశాము. చిత్రై సెల్వన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. రవి దేవన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు’ అంటూ మీడియా సమావేశానికి సంబంధించిన ఫొటోను షేర్ చేశారు. -
శ్రీరెడ్డి వ్యవహారం గురించి అడుగుతున్నారు..
తమిళసినిమా: మహిళలకు ధైర్యం అవసరం అంటోంది నటి ఆండ్రియా. తనకు నచ్చిన విధంగా జీవించే అతి కొద్ది మంది నటీమణుల్లో ఈ జాణ ఒకరని చెప్పకతప్పదు. విమర్శలను, వివాదాలను అసలు పట్టించుకోని నటి ఆండ్రియా. తొలుత గాయనిగా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తరువాత నటిగా తెరపైకి వచ్చింది. అలా పచ్చైక్కిళి ముత్తుచ్చారం, ఆయిరత్తిల్ ఒరువన్, విశ్వరూపం, తరమణి చిత్రాల్లో వైవిధ్యభరిత పాత్రలు పోషించి తనకంటూ సొంత ఇమేజ్ను సంపాదించుకున్న ఆండ్రియా తాజాగా కమలహాసన్‌తో నటించిన విశ్వరూపం–2 చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా ఈ ముద్దుగుమ్మ ముచ్చట్లు చూద్దాం. విశ్వరూపం చిత్రానికి కొనసాగింపుగానే విశ్వరూపం–2 ఉంటుంది. ఇందులో అశ్విత పాత్రలో నటించాను. తొలి భాగంలో కంటే రెండో భాగంలోనే అశ్విత ఎవరన్నది ప్రేక్షకులకు అర్థం అవుతుంది. చిత్రంలో ఫైట్స్ కూడా చేశాను. ఇంతకు ముందు కాలక్షేపం కోసమే చిత్రాల్లో నటించాను. అయితే విశ్వరూపం చిత్రంలో నటించిన తరువాత సామాజిక బాధ్యత ఎక్కువైంది. దేశ ప్రగతికి ప్రతి ఒక్కరికి బాధ్యత అవసరం. ఎవరి పని వారు చేయడం కాదు. అదే విధంగా పాఠ్యాంశాల్లో విద్యను అభ్యసించడంతదో సరిపోదు. దేశపోకడలను తెలుసుకోవాలి. నటన విషయంలో నిబంధనలు విధిస్తున్నారా అని అడుగుతున్నారు. చిత్రాల్లో నటించడానికి ఎలాంటి నిబంధనలు విధించను. అయితే కథ నాకు నచ్చాలి. అదే ముఖ్యం. విశ్వరూపం–2 చిత్రం తరువాత వడచెన్నై చిత్రంలో నటించాను. ఆ తరువాత ఏ చిత్రంలోనూ నటించలేదు. ఆరు నెలలు ఖాళీగానే ఉన్నాను. ప్రస్తుతం వడచెన్నై డబ్బింగ్ జరుగుతోంది. ఇద్దరు ముగ్గురు హీరోయిన్ల కథా చిత్రాల్లో నటిస్తున్నారే అని అడుగుతున్నారు. అలా నటించడం వల్ల నా స్థాయి తగ్గుతుందని భావించడం లేదు. నా కథా పాత్ర ఏమిటి? దర్శకుడు ఎవరు? అన్న అంశాలపైనే దృష్టి పెడతాను. నేను నటనతో పాటు గాయనీగానూ కొనసాగుతున్నాను. నా దృష్టిలో ఈ రెండూ ఒకటే. ఎందులో అవకాశం వస్తే అది చేస్తాను. ఇటీవల సంచలనంగా మారిన నటి శ్రీరెడ్డి వ్యవహారం గురించి అడుగుతున్నారు. ఆమె చెప్పేది నిజం అయితే వాటిని బహిరంగ పరచానికి చాలా ధైర్యం కావాలి. నాకైతే అలాంటి సంఘటనలు ఎదురు కాలేదు. అలా ఎవరికైనా జరిగితే ధైర్యంగా బయట పెట్టడం కరెక్ట్. అందుకు కారణం అయిన వారిని కఠినంగా శిక్షించాలి. ఇకపోతే ప్యూచర్ ప్లాన్ ఏమిటీ అని అడుగుతున్నారు. నేను మధ్యాహ్నం భోజనం ఎక్కడ చేస్తానో తెలియదు. అలాంటిది ఫ్యూచర్ ప్లాన్ గురించి అడుతున్నారు. -
నేడు విచారణకు శ్రీరెడ్డి పిటిషన్
సాక్షి, హైదరాబాద్ : గత కొంతకాలం నుంచి టాలీవుడ్లో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్‌పై పోరాడుతున్న నటి శ్రీరెడ్డి. వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చిన అనంతరం దర్శకులు, నిర్మాతలు, అగ్రహీరోలు అని ఏ భేదం లేకుండా ఇండస్ట్రీలో పలువురిపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌పై హైకోర్టులో శ్రీరెడ్డి ఇటీవల ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఇటీవల సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలపై సీబీఐతో ఎంక్వైరీ చేయించాలని శ్రీరెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఆ పిటిషన్ విచారణకు రానుంది. పిటిషనర్ శ్రీరెడ్డి తరఫున సీనియర్ అడ్వకేట్ కళానిధి వాదనలు వినిపించనున్నారు. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్ (తమిళ సినీ పరిశ్రమ)కు చెందిన మురగదాస్, లారెన్స్, విశాల్‌లపై కూడా ఆరోపణలు చేశారు. వ్యభిచారం లాంటి వాటిలో అనుకోకుండా తానే పాల్గొన్నట్లు పరోక్షంగా శ్రీరెడ్డే వ్యాఖ్యానించారని, అందుకే కేసులు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేయాలని నడిగర్ సంఘం పోలీసులను కోరింది. కాగా, హైకోర్టు శ్రీరెడ్డి పిటిషన్‌పై ఎలా స్పందిస్తుందోనని ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
శ్రీ రెడ్డిని చూస్తే జాలేస్తోంది
నటి శ్రీ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై కొరియోగ్రాఫర్ కమ్ హీరో రాఘవ లారెన్స్ స్పందించారు. గత కొంత కాలంగా తమిళ సినీ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని శ్రీ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో లారెన్స్పైనా ఆరోపణలు చేయగా.. ఆయన ఖండించారు. తాజాగా ట్విటర్లో ఆయన మరోసారి స్పందించారు. ‘శ్రీరెడ్డి ఆరోపణల తర్వాత నాకు చాలా మంది నుంచి ఫోన్‌కాల్స్ వచ్చాయి. ఆమెతో వివాదం గురించి అడుగుతున్నారు. దాంతో ఆమెతో ఉన్న వివాదానికి ముగింపు పలకాలని అనుకొంటున్నాను’ అని రాఘవ ట్వీట్లో పేర్కొన్నారు. ట్వీట్లో ఏముందంటే.. ‘తెలుగులో రెబెల్ సినిమా షూటింగ్ సమయంలో శ్రీ రెడ్డి నన్ను కలిసింది. ఆ మూవీ పూర్తై ఇప్పటికీ 7 ఏళ్లు గడిచిపోయింది. అప్పటి నుంచి నాపై ఈ ఆరోపణలను ఆమె ఎందుకు చేయలేదు?.. హోటల్ రూమ్‌లో కలిసి తనతో అసభ్యంగా ప్రవర్తించానని అంది. అలాగే నా హోటల్ రూంలో రుద్రక్షమాల, దేవుడి ఫొటోలు చూశానని చెప్పింది. హోటల్లో రుద్రాక్ష మాలా ఉంచుకోవడం, పూజాలు చేయడానికి నేనేమైనా పిచ్చివాడినా? అని ఆయన పేర్కొన్నారు. శ్రీ రెడ్డిని చూస్తే జాలేస్తోంది: ... ‘శ్రీ రెడ్డి పరిస్థితి చూస్తే జాలేస్తోంది. ఇప్పటికీ నా సినిమాలో అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. అందుకు ఓ ప్రెస్‌మీట్ పెడతాను. మీడియా ముందు ఓ కార్యెక్టర్, సీన్ పేపర్ ఇస్తాను. యాక్టింగ్‌తోపాటు కొన్ని స్టెప్పులు నాతోపాటు వేసి చూపించు. అలాగని నేను నీకు కష్టమైన స్టెప్పులు ఇవ్వను. సింపుల్ స్టెప్స్ మాత్రమే ఇస్తాను. నీలో నటనలో బేసిక్స్, టాలెంట్ ఉందని భావిస్తే వెంటనే నా నెక్స్ట్ మూవీలో ఛాన్స్ ఇస్తా. అడ్వాన్స్ కూడా వెంటనే ఇచ్చేస్తా. నా సినిమాలో నటిస్తే తర్వాత నీకు మరిన్ని ఆఫర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రెస్మీట్లో నీకు అందరి ముందు నటించడానికి ఇష్టం లేకపోతే నా మేనేజర్‌ను క్లవండి. మీతోపాటు లాయర్‌ను లేదా మీ సన్నిహితులు ఎవరినైనా తెచ్చుకొండి. మీ టాలెంట్‌ను నిరూపించుకోండి. నేను మీకు ఎలాంటి సహాయమైనా చేయడానికి సిద్ధం’ అని శ్రీ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. శ్రీ రెడ్డి చేసిన ఆరోపణలకు భయపడి తాను ఈ సమాధానం ఇవ్వడం లేదని.. మహిళలను గౌరవిస్తాను కాబట్టే ఆ మచ్చను తొలగించుకునేందుకే ఈ వివరణ ఇస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. తల్లి కోసం గుడి కట్టిన నేను మహిళల పట్ల ఎప్పుడూ గౌరవంగా మెదులుతానని.. మంచి చేయటం. మాట్లాడటం మాత్రమే తనకు తెలుసని ఆయన అన్నారు. శ్రీ రెడ్డి జీవితం బాగుండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అని లారెన్స్ చెప్పుకొచ్చారు. కాగా, టాలీవుడ్ తర్వాత కోలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై ఉద్యమిస్తున్నట్టు చెప్పుకొంటున్న శ్రీరెడ్డి ఇటీవల కాలంలో ప్రముఖులపై ఘాటైన వ్యాఖ్యలతో పోస్టులు పెడుతున్నారు. -
దర్శక నిర్మాతపై శ్రీ రెడ్డి ఫిర్యాదు
కాస్టింగ్ కౌచ్‌పై పోరాటంతో వార్తల్లో నిలిచిన శ్రీ రెడ్డి అన్నంత పని చేసేశారు. తనపై తీవ్ర ఆరోపణలు చేసిన కోలీవుడ్ నటుడు, ప్రముఖ దర్శక నిర్మాత వారాహిపై ఆమె ఫిర్యాదు చేశారు. ఫోన్ చేసిన తనను బెదిరించారంటూ చెన్నై పోలీసు కమిషనర్‌లో శుక్రవారం ఓ ఫిర్యాదు లేఖను ఆమె అందజేశారు. ‘సినిమాల్లో అవకాశాలు ఇస్తానని నమ్మించి లైంగిక కోర్కెలు తీర్చుకుంటున్న వారి బండారాన్ని నేను బయటపెడుతున్నాను. అయితే గత 24వ తేదీన నటుడు, దర్శక, నిర్మాత వారాహి.. మీడియాలో సమావేశంలో వ్యభిచారిగా చిత్రీకరిస్తూ నా గురించి తప్పుగా మాట్లాడారు. నాకు ఫోన్ చేసి బెదిరించారు. ఇది నన్ను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. వారాహిపై లైంగిక వేధింపుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను’’ అని ఫిర్యాదులో శ్రీ రెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మురగదాస్, లారెన్స్‌లపై ఆమె ఆరోపణలు చేయగా.. వారాహి మీడియా సమావేశం నిర్వహించి మరీ శ్రీ రెడ్డిపై వేశ్య కామెంట్లు చేశారు. దీనిపై సోషల్ మీడియా వేదికపై ఆమె హెచ్చరించారు కూడా. ఇక నటీమణులపై లైంగిక వేధింపుల గురించి నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్, ప్రధాన కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తీలకు ఫిర్యాదు చేయాలని ప్రయత్నించినా, వాళ్లు తనను పట్టించుకోలేదని శ్రీ రెడ్డి ఆరోపిస్తున్నారు. త్వరలో పూర్తిగా చెన్నైలో స్థిరపడే ఆలోచనలో ఉన్నట్లు ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. -
శ్రీరెడ్డిపై ప్రముఖ దర్శకుడు ఫైర్
పెరంబూరు: టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ అంటూ పలువురు సినీ ప్రముఖులపై ఆరోపణలు చేసి కలకలం సృష్టించిన నటి శ్రీరెడ్డి తాజాగా కోలీవుడ్‌పై పడ్డారు. ఇక్కడ ప్రముఖ దర్శకుడు ఎఆర్.మురుగదాస్, సుందర్.సి, నటుడు శ్రీకాంత్ (తెలుగులో శ్రీరామ్) వంటి వారు అవకాశాల కోసం ఆశ చూపి తనను వాడుకున్నారంటూ ఆరోపణలు చేసి సంచలనం సృష్టించారు. కాగా శ్రీరెడ్డి చర్యలకు కోలీవుడ్‌లో పలువురు ధ్వజమెత్తుతున్నారు. నటుడు వారాహి ఆమెపై చెన్నై కమిషనర్ కార్యలయంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో మరో సీనియర్ దర్శకుడు భారతీరాజా ఈ కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై స్పందిస్తూ.. శ్రీరెడ్డి సమ్మతంతోనే అన్నీ జరిగాయని పేర్కొన్నారు. అలాంటిది ఆమె వాటితో ప్రచారం పొందాలనుకోవడం సరైన పద్ధతి కాదని ధ్వజమెత్తారు. శ్రీరెడ్డి సినిమా వారినందరినీ తప్పుపట్టడం సరికాదని భారతీరాజా సూచించారు. -
ఆ కేసులో శ్రీరెడ్డిని అరెస్ట్ చేయాలి : నటుడు
పెరంబూరు (తమిళనాడు): నటి శ్రీరెడ్డి ఇంతకు ముందు టాలీ వుడ్లో ప్రకంపనలు పుట్టించింది. ఈమె తాజాగా కోలీవుడ్‌ను టార్గెట్ చేసింది. కాస్టింగ్ కౌచ్ అంటూ ప్రముఖ దర్శకుడు ఏఆర్.మురుగదాస్, సుందర్.సీ నుంచి నటుడు రాఘవ లారెన్స్, శ్రీకాంత్ (తెలుగులో శ్రీరామ్) వరకూ ఆరోపణలు చేసి సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తీ తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించినా శ్రీరెడ్డి వాటిని కేర్ చేయకుండా చెన్నైలో మకాం పెట్టి కలకలం సృష్టిస్తోంది. దీంతో నటుడు వారాహి సోమవారం చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శ్రీరెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఇందులో నటి శ్రీరెడ్డి టాలీవుడ్‌లోని ప్రముఖులపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు, బెదిరింపులతో డబ్బు వసూలుచేసిందన్నారు. ఇప్పుడు కోలీవుడ్‌లో బెదిరింపులకు పాల్పడుతోందని పేర్కొన్నారు. శ్రీరెడ్డి ఇటీవల ఒక భేటీలోఅత్యాచార వేధింపులకు ఆధారాలున్నాయా? అన్న ప్రశ్నకు మహిళలను కించపరచేలా బదులిచ్చిందన్నారు. ఆమె వ్యభిచారాన్ని అంగీకరించినట్లు పేర్కొందన్నారు. శ్రీరెడ్డిని వ్యభిచార కేసులో అరెస్ట్ చేయాలని ఫిర్యాదులో కోరారు. శ్రీరెడ్డిపై ఆగ్రహం.. శ్రీరెడ్డి చర్యలపై కోలీవుడ్‌లో తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తుతోంది. సీనియర్ నటీమణుల నుంచి వర్థమాన నటీమణుల వరకూ శ్రీరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నటి ఈ వ్యవహారంపై స్పందిస్తూ నటీమణుల అత్యాచారాలను బహిరంగపరడం తగదన్నారు. మంచి చెడు అన్నవి అన్ని రంగాల్లోనూ ఉంటాయన్నారు. అలాంటిది సినిమా రంగం గురించే మాట్లాడడం ప్రచారం కోసమేనన్నారు. నటి త్రిష మాట్లాడుతూ ఇలాంటి విషయాలకు బదులివ్వాల్సిన అవసరం లేదన్నారు. అసలు శ్రీరెడ్డి ఎవరో తనకు తెలియదన్నారు. ఆమెను ఇలాంటి ప్రచారంతో మరింత పెద్దదాన్ని చేయకండి అని పేర్కొన్నారు. యువ నటీమణులు ఐశ్వర్యమీనన్, అర్తన వంటి వారు కూడా తప్పుడు ఆలోచనలతో పిలిచేవారికి దూరంగా ఉండడం నేర్చుకోవాలన్నారు. రైట్ పర్సన్‌తోనే కలిసి పని చేయాలన్నారు. ఇలా కాస్టింగ్ కౌచ్ పేరుతో రచ్చ చేయడం తగదని శ్రీరెడ్డిపై ధ్వజమెత్తారు. -
తెలుగు ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయాలని
-
మీ ప్రైవేట్ పార్టీలకు హాజరయ్యా! : శ్రీరెడ్డి
హైదరాబాద్ : టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి పలువురిపై ట్వీట్స్, పోస్ట్‌లతో నటి శ్రీరెడ్డి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన తీరును తప్పుపట్టిన టాలీవుడ్‌కు చెందిన ఓ మహిళపై శ్రీరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. టాలీవుడ్లో కొన్ని నెలల కిందట కలకలం రేపిన డ్రగ్స్ కేసుతో పాటు వ్యభిచారం లాంటి విషయాల గురించి ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘మేడం. ఓ మహిళగా మిమ్మల్ని గౌరవిస్తాను. ఆ గౌరవాన్ని కాపాడుకోండి. నిర్మాతగా మూవీలు చేశారు. మీకు మా సమస్యలు తెలియవు. మాటలు మర్యాదగా రాకపోతే నేను తట్టుకోలేను. మీ ఇష్టానికి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పడేవారు లేరు. కో ఆర్డినేటర్స్ ఎంత దారుణంగా వ్యవహరిస్తారో తెలుసా. మహిళలను అలాంటి వాటిలోకి ఎలా దింపుతారో తెలుసు. సినీ ఇండస్ట్రీకి నార్త్ ఇండియన్ అమ్మాయిలను పరిచయం పరిచయం చేసి, ఇంట్లో ఉంచుకున్న ఆ కల్చర్ తెచ్చింది మీరే. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లో మంచి హోదాలో ఉన్నా.. ఇలా ప్రవర్తించడం బాగోలేదు. తెలుగు ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయాలని’ కోరుతూ నటి శ్రీరెడ్డి ఓ వీడియో పోస్ట్ చేశారు. -
నిజమైన హీరో పరిటాల రవి: శ్రీరెడ్డి
టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి, అంతకు మించి తన మాటలు, ట్వీట్స్, పోస్ట్‌లతో పలువురిపై నటి శ్రీరెడ్డి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో పలువురు సినీ సెలబ్రిటీల గుట్టు విప్పిన శ్రీరెడ్డి తాజాగా కోలీవుడ్ మీద కూడా పడ్డారు. అయితే తాజాగా శ్రీరెడ్డి పరిటాల రవి పేరు చెప్పుకుంటూ.. సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ కలకలం రేపుతోంది. శ్రీరెడ్డి తన ఫేస్బుక్లో ‘బొమ్మ హీరో కాదురా గొర్రెల్లారా, నిజమైన హీరో రా పరిటాల రవి. ఆయనే ఉండుంటే.. గడ్డానికి, జుట్టుకి పెయింటింగ్‌లు వేసుకునేవాళ్లు. గడ్డం పెంచుకుంటే, ప్రసంగాల్లో అరుస్తూ డైలాగులు చెబితే చెగువేరా అవుతారా.. నిద్ర లేవండి గొర్రెల్లారా.. అసలే వర్షాకాలం రా నాయన వానలోకి వెళ్లొద్దని చెప్పండి రంగు పోద్ది.. మీ పులి వేషం వేసుకున్న నక్కకి' అని పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ పోస్ట్‌పై జనసేన అభిమానులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
సారీ విశాల్ !
తమిళసినిమా: విశాల్ సారీ.. ఈ మాట అన్నదెవరో తెలుసా? సంచలన టాలీవుడ్ నటి శ్రీరెడ్డి. టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో పలువురు సినీ సెలబ్రిటీల గుట్టు విప్పి వారి పరువును బజారు పాలు చేసి, మరి కొందరి చీకటి భాగోతాల చిట్టా విప్పుతానని వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఈ సంచలన నటి తాజాగా కోలీవుడ్ మీద పడింది. ఇక్కడ ప్రముఖ దర్శకుడు ఏఆర్.మురుగదాస్, సుందర్.సీ, రాఘవ లారెన్స్, శ్రీకాంత్ వంటి వారిపై ఆరోపణలు గుప్పించి కలకలం సృష్టించింది. దీంతో శ్రీరెడ్డి తీరుపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కోలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌కు పాల్పడిన మరి కొందరి పేర్లను బయట పెడతానంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. దీంతో నటుడు, దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శి విశాల్ శ్రీరెడ్డిపై తీవ్రగా స్పందించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాఉండగా ఆయన తనను బెదిరిస్తున్నారంటూ శ్రీరెడ్డి ట్విట్టర్లో ఆరోపించింది. ఇది తీవ్ర కలకలానికి దారితీసింది. ఇలాంటి పరిణామాలనంతరం తాజాగా శ్రీరెడ్డి ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన భేటీలో విశాల్‌ను క్షమాపణ కోరుకుంటున్నానని పేర్కొంది. నన్ను క్షమించండి విశాల్. నటీమణులకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించే స్థానంలో మీరు ఉన్నారు. మీ వల్లే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది అని శ్రీరెడ్డి అంది. సడన్‌గా ఈ అమ్మడు ఇలా ప్లేట్ ఫిరాయించి మెతక వైఖరిని అవలంభించడానికి కారణం ఏమై ఉంటుందబ్బా అని కోలీవుడ్ వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. -
శ్రీరెడ్డి ఆరోపణలకు బదులివ్వండి: ప్రముఖ దర్శకుడు
సాక్షి, చెన్నై: టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి, అంతకు మించి తన మాటలు, ట్వీట్స్, పోస్ట్‌లతో సోషల్ మీడియాలో పలువురిపై నటి శ్రీరెడ్డి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్, నానితో సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులపై శ్రీరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసి దుమారం రేపారు. అయితే తాజాగా శ్రీరెడ్డి కోలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖులపై చేసిన ఆరోపణలు వివాదస్పదంగా మారాయి. ఇప్పటికే కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్, రాఘవ లారెన్స్, శ్రీరామ్‌లపై శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా.. శ్రీరెడ్డి ఆరోపణలపై బాధ్యులు బదులివ్వాలని ప్రముఖ దర్శకుడు, నటుడు, రాజకీయ నేత టీ రాజేందర్ వ్యాఖ్యానించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీరెడ్డి విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు సమాధానం చెప్పి సమస్యను ఇంతటితో ముగింపు పలికితే మంచిదన్నారు. సినిమా ఇండస్ట్రీలో మంచి, చెడు రెండూ ఉంటాయని, అయితే వాటిని సమస్యాత్మకంగా వదిలేయకూడదని పేర్కొన్నారు. క్యాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీలో సహజమే, కానీ మా కాలంలో నా వ్యక్తిగతంగా నేను నటించిన, దర్శకత్వం వహించిన సినిమాల్లో ఏ కథానాయికను కనీసం టచ్ కూడా చేయలేదని గుర్తుచేశారు. ప్రస్తుతం సినిమా అలా కాదని రాజేందర్ వాపోయారు. సినీ పరిశ్రమలో ఇటువంటి బహిరంగ ఆరోపణలు ఆరోగ్యకరమైనవి కాదని అన్నారు. -
లారెన్స్‌పై సంచలన ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి!
సాక్షి, హైదరాబాద్: నటి శ్రీరెడ్డి టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాటం చేస్తూ సంచలనం సృష్టించింది. అనంతరం శ్రీరెడ్డి సినీ ప్రముఖులపై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్, నాని సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులపై శ్రీరెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా శ్రీరెడ్డి కోలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖులపై ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌పై ఆరోపణలు చేయగా, తాజాగా తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ప్రముఖ దర్శకుడు, నృత్య దర్శకుడు, హీరో రాఘవ లారెన్స్ పై సంచలన ఆరోపణలు చేశారు. ‘ఓ రోజు నేను నా స్నేహితుల ద్వారా లారెన్స్ మాస్టర్ని హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్ గోల్కొండ హోటలో కలుసుకున్నాను. ఆ సమయంలో లారెన్స్ తనని తన రూమ్‌కి పిలిపించారు. అక్కడికి వెళ్లాకా రాఘవేంద్ర స్వామి ఫోటో, రుద్రాక్షలు చూసి నాకు చాలా అద్భుతం అనిపించింది. అనంతరం నెమ్మదిగా లారెన్స్ నాతో మాట్లాడడం మొదలు పెట్టారు. నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చి.. కొత్తగా ఇక్కడికి వచ్చే చాలా మందికి, పేద పిల్లలకి సహాయం అందిస్తున్నానన్నారు. నాకు అది చాలా మంచిగా అనిపించింది. అ తరువాత లారెన్స్ తన నిజస్వరూపం చూపించారు. నా నడుముతో పాటు ఇతర శరీర భాగాలు చూపించమన్నాడు. నాతో అసభ్యంగా డ్యాన్స్ మూమెంట్స్ కూడా చేశాడు. అనంతరం లారెన్స్ తనకు అవకాశం ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. దీంతో లారెన్స్‌తో కొంత కాలం పాటు స్నేహంగా ఉన్నాను. ఇందులో బెల్లంకొండ సురేష్ చివరికి విలన్ అయ్యారన్నారని’ శ్రీరెడ్డి పేర్కొన్నారు. -
మళ్లీ పవన్‌ను టార్గెట్ చేసిన శ్రీరెడ్డి
సాక్షి, హైదరాబాద్ : పవన్ కళ్యాణ్‌పై వివాదాస్పద నటి శ్రీరెడ్డి నిప్పులు చెరిగారు. పదహారేళ్లు పెంచుకున్న పాపని కాంగ్రెస్ నాయకులు మోసపూరితంగా ఢిల్లీలో జాతీయ చానెళ్ల ఎదుట కూర్చోబెడితే మా కడుపు ఉడికిపోయిందన్న పవన్ కళ్యాణ్..మరి మీ అన్న ఇంకా కాంగ్రెస్‌లోనే ఎందుకు కొనసాగుతున్నారు. ఓట్ల కోసం ఆయన అభిమానుల ద్వారా మీకు ఎలా సాయపడుతున్నారని నిలదీశారు. దీనిపై మీ అన్న సిగ్గుపడటం లేదా..? అన్నం పెట్టేవాడికి సున్నం వేస్తారా..? అంటూ శ్రీరెడ్డి మెగా బ్రదర్స్‌ను టార్గెట్ చేశారు. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ ప్రేమ వివాహం సందర్భంగా కాంగ్రెస్ నేతలు తమ బిడ్డను బజారుకీడ్చారంటూ పవన్ కళ్యాణ్ ఇటీవల ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాగా, కాస్టింగ్ కౌచ్‌పై శ్రీరెడ్డి వరుస ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. -
మురుగదాస్‌పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్‌పై గళమెత్తి పలువురు హీరోలు, దర్శక నిర్మాతలపై సంచలన ఆరోపణలు చేస్తున్న శ్రీరెడ్డి తాజాగా ప్రముఖ దర్శకుడు స్టార్ హీరోలతో భారీ సినిమాలను తెరకెక్కించిన ఏఆర్ మురుగదాస్‌పై ఆరోపణలు చేశారు. హాయ్ మురుగదాస్ అంటూ మొదలెట్టిన శ్రీరెడ్డి గ్రీన్ పార్క్ హోటల్ విషయం మీకు గుర్తుందా అంటూ బాంబు పేల్చారు. రచయిత వెలిగొండ శ్రీనివాస్ ద్వారా మనం కలిశామని, తనకు సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పారని మురుగదాస్‌కు గుర్తుచేశారు. ఆ రోజు హోటల్లో మనం చాలా...అయినా ఇప్పటి వరకూ మీరు ఎలాంటి ఆఫర్ ఇవ్వలేదు..మీరు చాలా గొప్ప వ్యక్తి సార్ అంటూ ముగించారు.మరి తనపై చేసిన సంచలన ఆరోపణలకు మురుగదాస్ ఎలా స్పందిస్తారో వేచిచూడాలి. పవన్ కళ్యాణ్, నాని సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులపై శ్రీరెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. -
షకలక శంకర్‌పై శ్రీరెడ్డి ఫైర్..
సాక్షి, సినిమా: ఇటీవల టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి, అంతకు మించి తన మాటలు, ట్వీట్స్, పోస్ట్‌లతో పలువురిపై నటి శ్రీరెడ్డి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె కమెడియన్ షకలక శంకర్‌ను ఉద్దేశించి తన ఫేస్బుక్లో ఓ పోస్టు చేశారు. అయితే హాస్య నటుడు షకలక శంకర్ హీరోగా, కారుణ్య కథానాయికగా, శ్రీధర్ దర్శకుడిగా పరిచయం చేస్తూ వై.రమణారెడ్డి, సురేష్ కొండేటి నిర్మించిన ‘శంభో శంకర’. సినిమా ఈ నెల 29న విడుదలైన విషయం తెలిసిందే.. ఈ సినిమా ప్రమోషన్ కోసం శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై శ్రీ రెడ్డి స్పందిస్తూ.. మీ సినిమా పబ్లిసిటీ కోసం నా పేరు మద్యలో తీసుకొచ్చారంటే పళ్లు రాలగొడతానని తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘నేను ఎవరిని పొగుడుతూ.. వారిని ఓరేంజ్‌కి ఎత్తేసి వాళ్ల పేరు అడ్డు పెట్టుకొని ఇక్కడికి రాలేదు. అయితే ఇటీవల కొంత మంది భక్తులు.. ఓ హీరో భక్తులు.. ఆ హీరోకి తెలియంది ఏంటంటే అతని పేరు చెప్పుకొని అతన్ని దేవుడు.. మా కోసం ఎంతో చేస్తున్నాడు అంటూ.. మొత్తం మీద బతికేస్తున్నారు.. బతకండీ.. ఆ హీరో ఫ్యాన్స్‌ని వాడుకోండి. మీ సినిమా ఓపెనింగ్స్‌కి కావాలి కదా.. వాడుకోండి.. ఓపెనింగ్స్ కోసం ఆ హీరోని పొగడటం.. మీ ఊరు వచ్చినపుడు ఆయన్ని నెత్తిన పెట్టుకొవడం.. మీరు కూడా రాజకీయాల్లోకి రావడానికి ప్రయత్నించడం తప్పులేదు.. కానీ నా పేరు అనవసరంగా మద్యలో తీశారంటే మాత్రం పళ్లు రాలగొట్టి చేతిలో పెడతా... ఓ కమెడియన్‌వి హీరోగా ఇంట్రడ్యూజ్ అయ్యావు.. నీ పని ఏదో నువ్వు చూసుకో.. అందరిలాగా అవకాశాల కోసం రోడ్డున పడలేం కదా అంటూ ఓ పత్రికలో వార్త వచ్చింది. అందరికీ ఒకటే చెబుతున్నాను.. మీ ప్రొడ్యూసర్ ఏం గొప్పోడు కాదు..నువ్వేం పెద్ద గొప్పోడివి కాదు.. కథలు తీస్తే అందరి కథలు ఉన్నాయి మా దగ్గర.. సమయం వచ్చినపుడు అందరి కథలు బయటికొస్తాయి. నీ సినిమా ఓపెనింగ్స్ కోసం పెద్ద హీరోల పేర్లు తీసుకొని వ్యాపారం చేసుకోవడం మంచింది కాదు.. దాని కోసం నన్ను మద్యలో లాగటం కరెక్ట్ కాదు. నీ లాంటి పిచ్చ సినిమాలు నేను చూడను అని’ శ్రీరెడ్డి పేర్కొన్నారు. -
కత్తికి శ్రీరెడ్డి చురకలు
ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. శ్రీరాముడిని దూషించాడని మహేష్‌పై కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి ఈ వ్యవహారంపై స్పందించారు. ‘జై శ్రీరామ్.. దేవుడ్ని దూషించటం మంచిది కాదు. మా హిందూ ధర్మాన్ని హేళన చేయకండి’ అంటూ ఫేస్బుక్లో పరోక్షంగా కత్తిని ఉద్దేశించి ఆమె ఓ కామెంట్ చేశారు. ఇదిలా ఉంటే సినీ విమర్శకుడు కత్తి మహేశ్ ఓ ఛానెల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో భాగంగా ఫోన్ ఇన్‌లో మాట్లాడుతూ..‘ రామాయణం అనేది నాకొక కథ. రాముడనే వాడు దగుల్బాజీ అని నేను నమ్ముతా.. ఆ కథలో సీత బహుశా రావుణుడితోనే ఉంటే బాగుండేదేమో, ఆవిడకి న్యాయం జరిగి ఉండేదేమో అని నేననుకుంటా’ అంటూ రాముడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హిందూ జనశక్తి నేతలు ఆయనపై నగరంలోని కేబీహెచ్‌బీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పలు హిందూ సంఘాలు వేర్వేరు చోట్ల కేసులు నమోదు చేశాయి కూడా. -
పవన్ అభిమానులపై శ్రీరెడ్డి ఫైర్
సాక్షి, హైదరాబాద్ : నిశ్చితార్ధంతో కొత్త జీవితానికి శ్రీకారం చుడుతున్నట్టు ప్రకటించిన పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌ను వేధిస్తూ ట్రోలింగ్ చేసిన పవన్ అభిమానులపై శ్రీరెడ్డి విరుచుకుపడ్డారు. రేణూకు బాసటగా నిలుస్తూ పవన్ అభిమానులపై ధ్వజమెత్తారు. ‘ఆమె (రేణూ దేశాయ్) చాలా చిన్న వయసులో విడాకులు తీసుకున్నారు.. దానికి కారణాలేంటనే దానిపై మనం మాట్లాడాల్సిన అవసరం లేదు..ఆమె వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే హక్కు మనకు లేద’న్నారు. కొందరు ట్విటర్లో కనీసం తమ పేరు, ఫోటో లేకుండా నకిలీ అకౌంట్లతో ఆమెను వేధిస్తున్నారని మండిపడ్డారు. ఆమెను వేధింపులకు గురిచేసేందుకు మీరెవరని ప్రశ్నించారు. పూణేలో ఆమె ఒంటరిగా పిల్లల్ని పెంచుతున్నారని, ఆమె ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో ఎవరికైనా తెలుసా అని నిలదీశారు. ఆమె బాధల్లో ఉన్నప్పుడు ఎవరైనా మద్దతుగా నిలిచారా అని ప్రశ్నించారు. ఆమెకు సాయం చేయనప్పుడు ఆమె వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడానికి మీరెవరని మండిపడ్డారు. పవన్ అభిమానులు వారి స్టార్‌ను అభిమానించుకోవచ్చని, అయితే వ్యక్తిగత విషయాల్లో ఇతరులను ఇబ్బంది పెట్టడం తగదని సూచించారు. కాగా సినీ పరిశ్రమలో తాను ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై పోలీస్ స్టేషన్, న్యాయస్ధానాలను ఆశ్రయించాలని పవన్ కళ్యాణ్ గతంలో శ్రీరెడ్డికి సూచించిన క్రమంలో ఆమె పవర్‌స్టార్‌పై విరుచుకుపడిన విషయం తెలిసిందే. -
ఎన్టీఆర్‌పై శ్రీరెడ్డి కామెంట్స్..
టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాటం చేస్తూ సంచలనం సృష్టించింది నటి శ్రీరెడ్డి. ఆమె ఇటీవల సినీ ప్రముఖులపై విమర్శలు చేసి వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి ఫేస్బుక్లో ఓ పోస్టు చేశారు. ‘ టు దిస్ జనరేషన్ జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ కింగ్ ఆఫ్ ఎ టాలీవుడ్. బిగ్‌బాస్‌కు ఎన్టీఆర్ సింహం’ అని పోస్టులో పేర్కొన్నారు. ఎన్టీఆర్‌పై శ్రీరెడ్డి గతంలో కూడా ప్రశంసలు కురిపించారు. ‘జూనియర్ ఎన్టీఆర్‌ను బిగ్‌బాస్ షోలో అందరూ మిస్ అవుతున్నారు. ఎన్టీఆర్ స్థానాన్ని ఎవరూ రిప్లేస్ చేయలేరు. అతని రాకతో ప్రజలు నిరాశలో ఉన్నారు. సాహో యంగ్ టైగర్’ అని తన ఫేస్బుక్లో పోస్టు పెట్టారు. ఇటీవల హీరో నానిని కూడా శ్రీరెడ్డి విమర్శించిన విషయం విదితమే. అంతేకాక నాని తనను బిగ్‌బాస్‌లో పాల్గొనకుండా చేశారని ఆరోపించారు. దీనిపై నాని శ్రీరెడ్డికి లీగల్ నోటిసులు పంపారు. అయితే ఈ విషయంపై న్యాయస్థానంలోనే తేల్చుకుందామని శ్రీరెడ్డి సవాలు విసిరారు. ప్రస్తుతం నాని బిగ్‌బాస్ సీజన్2 కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. -
షికాగో సెక్స్‌రాకెట్: గుట్టువిప్పిన సినీతారలు
షికాగో : వరుస వివాదాస్పద ఘటనలు టాలీవుడ్‌ను కుదుపేస్తున్నాయి. క్యాస్టింగ్ కౌచ్‌పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు మరువకముందే షికాగో సెక్స్ రాకెట్ ఉదంతం తెలుగు సినిమా పరిశ్రమలో మరోసారి కలకలం రేపింది. డబ్బు ఎరగా చూపి సినీతారలతో వ్యభిచారం చేయిస్తున్న కిషన్ మోదుగుమూడి, చంద్రకళ అనే భారతీయ దంపతులను అక్కడి షికాగో ఫెడరల్ పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సెక్స్ రాకెట్ వ్యవహారంలో ఇప్పటివరకూ ఆరుగురు నటీమణుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. నిందితుల మొబైల్ ఫోన్ సంభాషణల విశ్లేషణ కొనసాగుతున్న నేపథ్యంలో మరింత మంది బాధితుల పేర్లు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా, పోలీసుల విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సినీతారలతో వ్యభిచారం ఎలా చేయించేవారో నటీమణులు విచారణలో తెలిపారు. భారతీయ అసోసియేషన్ల కార్యాక్రమాల్లో పాల్గొనడానికంటూ సినీ తారలను అమెరికాకు రప్పిస్తారు. డబ్బులు ఎరవేసి వ్యభిచారంలోకి దింపుతారు. తర్వాత తమ గురించి బయటపెడితే చంపుతామని బెదిరిస్తారని వివరించారు. గత ఏడాది నవంబర్ 20న ఓ హీరోయిన్ ఢిల్లీ నుంచి అమెరికాలోని షికాగోకి వెళ్లింది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియా నవంబర్18న ఏర్పాటు చేసిన ఈవెంట్లో ఆమె పాల్గొనాలి. కానీ ఆమె రెండు రోజులు ఆసల్యంగా వచ్చి కాలిఫోర్నియా బదులు షికాగోకు వెళ్లింది. దీంతో అనుమానంతో వచ్చి అధికారులు విచారించారు. తను మరో కార్యక్రమానికి హాజరయ్యానని ఆమె బదులిచ్చారు. ఏ ఈవెంట్లో పాల్గొన్నారని ప్రశ్నించగా నార్త్ అమెరికా తెలుగు సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైనట్లు చెప్పుకొచ్చింది. కానీ పోలీసుల విచారణలో ఆమె సంబంధిత ఈవెంట్లో పాల్గొనలేదని తేలింది. దాంతో ఆ నటిని అమెరికాకు రప్పించిన వ్యక్తి గురించి ఆరా తీశారు. ఆ వ్యక్తి పేరు రాజు అని ఉంది. అతని గురించి విచారించగా కిషన్ అనే వ్యక్తే రాజు అనే మారుపేరుతో ఆమెను రప్పించాడని తేలింది. దీంతో ఆ నటి వీసాను రద్దు చేశారు. అలాగే మరో నలుగురి నటీమణులను కూడా విచారించారు. కాగా కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు టాప్ హీరోయిన్లకు ఈ వ్యభిచార రాకెట్‌తో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. అరెస్టయిన కిషన్, ఆయన భార్య చంద్రకళ వద్ద ఈ హీరోయిన్లతో సంభాషణలు జరిపినట్లు ఆధారాలున్నాయని చెపుతున్నారు. మరి ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరన్నది తేలాల్సి వుంది. ఈ కేసులో అరెస్టయిన వారిని వచ్చే గురువారం న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నారు. నెల రోజుల్లోపే ఈ కేసు కొలిక్కి వస్తుందని, శిక్ష పడితే అది పూర్తయిన తర్వాత ఇద్దర్నీ దేశం నుంచి పంపేస్తారని ఓ అధికారి తెలిపారు. -
నాని భార్యకు శ్రీరెడ్డి కౌంటర్!
ఇటీవల టాలీవుడ్లో దుమారం రేపిన అంశం కాస్టింగ్ కౌచ్. ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి, అంతకు మించి తన మాటలు, ట్వీట్స్, పోస్ట్‌లతో పలువురిపై నటి శ్రీరెడ్డి ఆరోపణలు చేశారు. ప్రస్తుతం హీరో నానిపై చేస్తున్న ఆరోపణలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనపై చేస్తున్న ఆరోపణలకు ప్రతిస్పందనగా నాని ఇటీవల శ్రీరెడ్డికి లీగల్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. దీనిపై శ్రీరెడ్డి కూడా స్పందిస్తూ.. తన ఫేస్బుక్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేస్తూ.. కోర్టులోనే తేల్చుకుందాం అని నానికి సవాల్ విసిరారు. ఈ క్రమంలో శ్రీరెడ్డిపై నాని భార్య అంజనా కూడా ఫైర్ అయ్యారు. అయితే తాజాగా నానికి సపోర్ట్‌గా అంజనా చేసిన ట్వీట్‌కు కౌంటర్‌గా శ్రీరెడ్డి మరో పోస్ట్ చేశారు. ‘హాయ్ మిసెస్. నేనిప్పుడే నువ్వు చేసిన పోస్ట్‌ను చూశాను. నేను నీ భర్తతో ఉన్నప్పుడు నువ్వు చూడలేదు. నేను పేరు కోసం తాపత్రయపడటం లేదు. నీ భర్తే పేరు కోసం తాపత్రయ పడతాడు. నాకు ఉన్న పేరు చాలు. ఒకవేళ నా భర్తకే పేరు, డబ్బు ఉండి ఇలాంటి పనులు చేస్తే, నేను నా భర్తకు మాత్రం సపోర్ట్ చేయను. అవసరమైతే అలాంటి వాడ్ని వదిలేసి వెళ్లిపోతానేమో అంతే కానీ బాధిత మహిళను మాత్రం అవమాన పరచను. ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. మొత్తం విషయం తెలిసేవరకు సైలెన్స్‌గా ఉండండి. నా వైపు సత్యం ఉంది. కర్మ ఉంది. నీ భర్త తప్పకుండా శిక్షను అనుభవించాల్సిందే’నని తన ఫేస్బుక్ ఖాతాలో శ్రీరెడ్డి పోస్ట్ చేశారు. -
చికాగో సెక్స్ రాకెట్: స్పందించిన అనసూయ, శ్రీరెడ్డి
హైదరాబాద్ : టాలీవుడ్లో సంచలనం రేకిత్తించిన చికాగో సెక్స్ రాకెట్ బాధితుల్లో ఇద్దరు టాప్ హీరోయిన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు బయటకు రాకపోయినప్పటికీ సౌత్ స్టార్సేనని ప్రచారం జరుగుతోంది. అమెరికాలో టాలీవుడ్ నటీమణులతో వ్యభిచారం నిర్వహిస్తున్న తెలుగు దంపతులను ఫెడరల్ ఏజెన్సీలు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కొన్ని సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించిన కిషన్ మోదుగుముడి అలియాస్ రాజు అలియాస్ శ్రీరాజు, అతని భార్య చంద్రలు టాలీవుడ్‌కు చెందిన నటీమణులను తాత్కాలిక వీసా మీద అమెరికాకు తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారని పోలీసులు అభియోగాలు నమోదుచేశారు. అయితే ఈ వ్యవహారంతో ఉలిక్కిపడ్డ మా అసోసియేషన్ జూన్ 24 సమావేశం కానున్నట్లు ప్రకటించింది. ఈ అమెరికా దంపతులు గతంలో తమను కూడా సంప్రదించారని నటి శ్రీరెడ్డి, యాంకర్ కమ్ నటి అనసూయలు ఓ ఆంగ్ల పత్రికకు తెలిపారు. మాట్లాడే తీరు నచ్చక తిరస్కరించాను: అనసూయ ఈ ఉదంతంపై యాంకర్ అనసూయ భరద్వాజ్ స్పందిస్తూ.. ‘ చాలా రోజులుగా నేను అమెరికా వెళ్లలేదు. 2014లో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్‌లో ఓ ఈవెంట్‌కు హాజరయ్యాను. 2016లో అమెరికా నెంబర్‌తో శ్రీరాజ్ అనే వ్యక్తి నన్ను సంప్రదించాడు. తెలుగు అసోసియేషన్ నిర్వహించే ఓ కార్యక్రమానికి హాజరుకావాలని కోరాడు. అతను మాట్లాడే విధానం నచ్చక నేను తిరస్కరించాను. నేను తిరస్కరించినా కూడా పోస్టర్లో నాఫొటోను ప్రచురించారు. ఆ ఈవెంట్లో పాల్గొనడం లేదని అప్పట్లో నేను ట్విటర్ ద్వారా స్పష్టం చేశాను’ అని అనసూయ తెలిపారు. పాపులారిటీని బట్టి ధర: శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్‌పై ఉద్యమిస్తూ వార్తాల్లో నిలిచిన నటి శ్రీరైడ్డి సైతం.. ఆ అమెరికా దంపతులు తనను కూడా సంప్రందించారని తెలిపారు. ‘అవకాశాల్లేని హీరోయిన్లను ఈవెంట్స్ కోసం అమెరికాకు రప్పించి.. అక్కడ వారిని మభ్యపెట్టి వ్యభిచారాంలోకి దింపుతున్నారు. అలా వెళ్లిన ఆర్టిస్టులకు సుమారు 1000 అమెరికా డాలర్లు ఆఫర్ చేస్తున్నారు. ఈ ఆఫర్ వారి పాపులారిటీని బట్టి ఉంటుంది.’ అని ఆమె చెప్పుకొచ్చారు. జూన్24 న సమావేశం : శివాజీ ఈ విషయంలో ఇప్పటికే పలుమార్లు ఆర్టిస్టులను హెచ్చరించినట్లు మూవీఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా తెలిపారు. ఆయన ఈ ఘటనపై స్పందిస్తూ.. ‘ కిషన్ మోదుగుముడి నిర్వహించే వ్యవహారలపై మాకు అవగాహన ఉంది. అతను ఓ రెండు సినిమాలకు కో ప్రోడ్యూసర్, ప్రొడక్షన్ మెనేజర్‌గా చేసినట్లున్నాడు. ఈవెంట్స్ ప్రదర్శనల కోసం విదేశాలకు వెళ్లే ఆర్టిస్టులను జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించాం. కొన్నేళ్ల కిత్రం నేను ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇలాంటి వ్యవహారాలను కొన్ని గుర్తించాం. అమెరికా, సింగపూర్, దుబాయ్, ఆస్ట్రేలియాలోని కార్యక్రమాలకు వెళ్లే ఆర్టిస్టులకు వీసా సమస్యల గురించి అవగాహన లేదు. ఈ ఉందంతంపై మా అసోసియేషన్ జూన్ 24న సమావేశం అవుతోంది. విదేశాలకు వెళ్లే ఆర్టిస్టులు అక్కడి కార్యక్రమాల వివరాలను మాకు అందజేయాలి. అప్పుడు ఆర్గనైజర్స్‌తో మాట్లాడి కార్యక్రమాల విషయాన్ని ధృవీకరిస్తామని’ ఆయన తెలిపారు. -
‘శ్రీరెడ్డి నన్ను కూడా టార్గెట్ చేస్తుందేమో..’
టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్‌పై పోరాటాన్ని కొనసాగిస్తూ సంచలనం సృష్టిస్తున్న నటి శ్రీరెడ్డికి, నేచురల్ స్టార్ నానికి మధ్య జరుగుతున్న వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత కొద్దిరోజులుగా నానిపై శ్రీరెడ్డి పలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై నాని సైతం స్పందిస్తూ.. సహనానికి కూడా ఓ హద్దు ఉంటుందని ఆమెకు లీగల్ నోటీసులు పంపించారు. అయితే తాజాగా ఈ వివాదంపై హీరో విశాల్ స్పందించాడు. ‘నాని నాకు చాలా కాలంగా తెలుసు. అతను నాకు మంచి స్నేహితుడు. అంత మాత్రాన నేను అతడిని సమర్థించను. తాజాగా నానిపై శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు వివాదాస్పదంగా ఉన్నాయి. నాని గురించి తెలిసిన వాళ్లందరికీ అతని ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసు. ఏదో పబ్లిసిటీ కోసం ఆరోపణలు చేయడం కాకుండా, ఆమె వద్ద ఏమైనా ఆధారాలు ఉంటే బయటపెట్టాలి. ఇదంతా చూస్తుంటే ఒకరి తర్వాత ఒకరిపై ఆమె వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. పోనుపోనూ ఆమె నన్ను కూడా టార్గెట్ చేస్తుందేమో. కాబట్టి ఇలాంటి ఆరోపణలు చేసినప్పుడు అందుకు తగిన ఆధారాలు కూడా చూపించాలి. సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనేది వాస్తవం. కానీ దానిని సాకుగా చూపి ప్రముఖులపై ఆరోపణలు చేయడం సరైన పద్దతి కాదు’ అని అన్నారు. ‘అభిమన్యుడు’ విజయోత్సవ యాత్రలో భాగంగా విశాల్ ఈ వ్యాఖ్యలు చేశాడు . విశాల్, సమంత జంటగా నటించిన అభిమన్యుడు సినిమా భారీ విజయాన్ని అందుకుని మంచి కలెక్షన్లతో దూసుకెళ్తోంది. -
శ్రీరెడ్డి విమర్శలపై స్పందించిన నాని భార్య
హైదరాబాద్ : నేచురల్ స్టార్ నానిపై గత కొద్దిరోజులుగా నటి శ్రీరెడ్డి వివాదస్పద ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై నాని సైతం స్పందిస్తూ.. సహనానికి కూడా ఓ హద్దు ఉంటుందని ఆమెకు లీగల్ నోటీసులు పంపించారు. అయితే తాజాగా ఈ వివాదంపై నాని భార్య అంజనా సైతం స్పందించారు. ‘‘సినీ పరిశ్రమ చాలా దయాగుణంతో ఉంటుంది. కానీ, పబ్లిసిటీ కోసం ఇతరుల జీవితాలతో ఆడుకుంటున్న వారు కూడా అప్పుడప్పుడు అందులోకి వస్తుండటం నన్ను ఇబ్బందికి గురిచేస్తోంది. అయితే వారు చేస్తున్న చెత్త వ్యాఖ్యలను ఎవరూ నమ్మరనుకోండి. కానీ, వారి వ్యక్తిగత జీవితాన్ని అంత దిగువ స్థాయికి దిగజార్చుకోవడానికి ఎలా సిద్దపడతారో’’ అని అంజనా ట్వీట్ చేశారు. ఇక నాని పంపిన నోటీసులకు తాము సిద్దమని శ్రీరెడ్డి స్పష్టం చేసింది. తనకు కావాల్సింది కూడా ఇదేనని.. నీ రంకు బాగోతం బయటపెట్టడానికి ఓ మంచి అవకాశం తనకు వచ్చిందన్నారు. బిగ్ బాస్-2 తాను లేకపోవడానికి నానినే కారణమని, నాని రాసలీలలు అన్నీ బయటపెడతా. నాని కాపురంలో ఇక నిప్పులే.. అని శ్రీరెడ్డి ఇటీవల పోస్ట్ చేయడం టాలీవుడ్లో దూమారం రేపిన విషయం తెలిసిందే. This industry has been kind but it troubles me to see that once in a while there comes along someone who puts their publicity ahead of other people's lives. No1 believes those ridiculous statements anyway. It is abt how little they think before degrading themselves to such levels https://t.co/40tv0zudaf — Anju Yelavarthy (@anjuyelavarthy) June 11, 2018 -
మసాలా గ్యారంటీ
పోలికల్లేవు... పోలికలు అవసరం లేదనుకున్నాడు... ఎవరి బాస్ వాళ్లేజూనియర్ బిగ్ బాసయితే నానీ మాస్ బాస్... కుదిరితే మిడిల్ క్లాస్ బాస్ఇంకొంచెం కుదిరితే వెటకారం టకారం టకారం బాస్నానీ సూటేశాడు... నేనే నీ నా..నీ.. అన్నాడు... కనబళ్లా సూటూ సెట్టూఏమీ కనబళ్లా... అంతా నీ.. నా... లాంటి నానీ వాళ్లే... బాబాయ్‌ని మసాలా ఎక్స్ట్రా అడిగాడు దిట్టంగా మసాలా దట్టించాడు... మసాలా గ్యారంటీ ‘నా.. నీ... టీవీలో ఏం జరుగుతుందో చూసేద్దామా?’ అంటూ నాని బిగ్‌బాస్ తెలుగు సీజన్ టూలో రంగప్రవేశం చేశాడు. బ్లూ కలర్ జీన్స్ మీద స్ట్రైప్స్ ఉన్న తెల్ల జాకెట్‌తో తెల్ల షూస్‌తో నాని స్టేజ్ మీద తన స్టయిల్‌ను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడు. గతంలో ఎన్.టి.ఆర్ వేసిన ముద్రకు సరితూగేలా తన ముద్రను వేసేందుకు ఎపిసోడ్ అంతటా ఉత్సాహంగా కదిలాడు. ఇలాంటి షోస్‌లో హోస్ట్ ఫార్మల్ సూట్ తొడుక్కుంటే హుందాగా ఉండటం ఆనవాయితీ. అయితే నాని ఆ సంప్రదాయాన్ని వదిలి ఇన్ఫార్మల్ అటైర్‌ను స్వీకరించడంతో కొత్త తరహా హోస్ట్‌ను చూసిన భావన ప్రేక్షకులకు కలిగింది.ఏమైనా అట్టహాసంగా కోలాహాలంగా బిగ్‌బాస్ తెలుగు సీజన్ టూ మొదలైందని చెప్పాలి. ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తం 16 మంది కంటెస్టెంట్స్‌తో హౌస్ ప్రస్తుతానికి కిటకిటలాడుతుంది. వారం రెండు వారాల్లో ఈ సంఖ్య అతి సులువుగా పన్నెండుకు తగ్గుతుంది. ఎందుకంటే ఒకోవారం ఇద్దర్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు కాబట్టి. ఇంతకీ కంటెస్టెంట్లు ఎవరు? సీజన్ వన్‌తో పోల్చితే బిగ్‌బాస్ సీజన్ టూలో లైమ్‌లైట్‌లో ఉన్న తారలు తక్కువే అని చెప్పాలి. గత సీజన్లో ముమైత్ ఖాన్, అర్చన, శివ బాలాజీ, ధన్‌రాజ్, సమీర్, కల్పన, ఆదర్శ్, సంపూర్ణేశ్‌బాబు వంటి నోన్ పర్సనాల్టీస్ ఉన్నాయి. ఈసారి లిస్ట్ భిన్నంగా ఉంది. షోను బాగా గొడవలతో వాదనలతో నింపడానికి వీలుగా కంటెస్టెంట్ల టెంపర్‌ను అంచనా కట్టి లిస్ట్ ఫైనలైజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సీజన్ లిస్ట్‌లో ఉన్న పదహారు మందిలో సింగర్ గీతా మాధురి, హీరో తనిష్, విలన్ అమిత్ తివారీల లాగా మిగిలినవారు అందరికీ తెలిసే అవకాశం తక్కువ. కానీ పెర్ఫార్మెన్స్ వల్ల సీజన్ కంప్లీట్ అయ్యే సరికి ఎవరెంత పాపులర్ అవుతారో ఎవరు చెప్పగలం. టీవీ 9 యాంకర్ దీప్తి, ‘ఐస్‌క్రీమ్’ సినిమా ఫేమ్ తేజస్వి, యూ ట్యూబ్ స్టార్ దీప్తి సునైనా, నటుడు సామ్రాట్ రెడ్డి, నటుడు కిరీటి దామరాజు, యాంకర్ శ్యామలా, ర్యాప్ సింగర్ రోల్ రిడా, బుల్లితెర నటుడు కౌశల్, నటి భాను ఈసారి కంటెస్టెంట్స్‌గా ఉన్నారు. కామెడీ రంగం నుంచి ఒక్కరు కూడా పోటీలో లేకపోవడం కొంచెం నిరుత్సాహ పరిచే సంగతే. కమెడియన్ వేణు పేరు వినిపించింది కాని ఎపిసోడ్లో కనిపించలేదు. సామాన్యులు ముగ్గురు బిగ్‌బాస్ హౌస్‌లో ముగ్గురు సామాన్యులకు చోటు దక్కింది. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన గణేశ్, మోడలింగ్ నుంచి సంజనా, సామాజిక సేవ నుంచి నూతన్ నాయుడు ఈ చిట్టాలో ఉన్నారు. సెలబ్రిటీల మధ్య సామాన్యుల మనుగడ ఒక సవాలుగా ఉంటుంది సాధారణంగా. జట్టు కట్టడం మనిషి స్వభావం కనుక సెలబ్రిటీలు ఒక జట్టుగా మారి ఈ ముగ్గురు సామాన్యులను వేరు పెడితే ఆట ఎలా ఉంటుందనేది చూడాలి. ఆశ్చర్యం ఏమిటంటే తొలి రోజు షోలోనే బిగ్ బాస్ ఆదేశం ప్రకారం హౌస్‌కు పనికి రాని ఇద్దర్ని హౌస్మేట్స్ అందరూ కూడబలుక్కుని ఎంచమంటే ఈ సామాన్యుల్లోని ఇద్దరు– సంజనా, నూతన్ నాయుడు పేర్లు పైకి వచ్చాయి. ప్రస్తుతం వీరిద్దరిని హౌస్‌లోని జైల్లో వేశారు. సామాన్యులకు చేయాల్సిన మర్యాద ఇదేనా అని గొడవ మొదలవడానికి రంగం సిద్ధమైందన్న మాట. సైకలాజికల్ గేమ్‌కు వీలుందా? బిగ్‌బాస్ సీజన్1 పూణెలోని సెట్లో జరిగింది. హైదరాబాద్ నుంచి దూరంగా తీసుకెళ్లి పూనాలో నిర్మానుష్యమైన చోట సెట్లో ఉంచడం వల్ల కంటెస్టెంట్ మానసిక స్థితి మీద ప్రభావం ఏర్పడి సంపూర్ణేశ్ బాబు, మధుప్రియ వంటి వారు హోమ్సిక్నెస్ను, క్లాస్ట్రోఫోబియాను ఫీల్ కావడం హౌస్ నుంచి త్వరగా బయటపడటం చూశాం. ఈసారి సెట్ హైదరాబాద్ నడిబొడ్డున ఉండటం వల్ల మానసికంగా ఒక ధైర్యం కలిగి ఇలాంటి ఎపిసోడ్స్ చోటు చేసుకునే అవకాశం తగ్గొచ్చు. అయితే రకరకాల నేప«థ్యాల నుంచి ఒక సమూహాన్ని తెచ్చి ఒకచోట పడేయడం వల్ల వచ్చే చికాకులు, గొడవల డ్రామా చాలానే ఉండొచ్చు. ఈ సీజన్ ట్యాగ్‌లైన్‌కు తగినట్టుగా ‘మసాలా’ చాలానే ఉండే అవకాశం ఉంది. ఎవరు మిగులుతారు? బిగ్‌బాస్ హౌస్‌లో ఫేక్ బిహేవియర్‌కు చోటు లేదు. ఎవరు ఎలా ఉన్నారో ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తించే వారికే బిగ్‌బాస్ హౌస్‌లో కొనసాగింపు ఉంటుంది. ట్యాప్‌లో ఎర్రనీళ్లు వస్తున్నాయని బిగ్‌బాస్‌ను బూతులు తిట్టినంత పని చేశాడు శివ బాలాజీ ఒక ఎపిసోడ్లో. అదంతా టీవీలో చూపించారు. కాని అతణ్ని షో నుంచి తీసేయలేదు. పైగా విజేతను చేశారు. ఎందుకంటే నీళ్లు ఎర్రగా రావడం నిజం. దానికి కోప్పడటం సహజం. ఇలాంటి సహజ ప్రవర్తనతో పాటు సంయమనం పాటించే ప్రవర్తన ఉన్నవాళ్లు చివరి వరకూ నిలబడతారు. ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్‌లో బుల్లితెర నటుడు కౌశల్, వెండి తెర నటుడు సామ్రాట్ రెడ్డి, నటుడు కిరీటి దామరాజు కొంత సంయమనంతో ఎక్కువ ఎపిసోడ్లు ఉంటారనిపించింది. బాబు గోగినేనిని ఈ కుర్రవయసు కంటెస్టెంట్లు హెడ్మాస్టర్గా భావించి తొందరలోనే పంపించే ప్రయత్నం చేయవచ్చు. స్త్రీలలో నటి తేజస్వి, యాంకర్ దీప్తికి ఎక్కువ ఎపిసోడ్లు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉన్నతం నుంచి వికృతం వరకు: బిగ్‌బాస్ అంటే కేవలం ఒక గేమ్ షో కాదు. అది మనిషి ప్రవర్తనలోని ఉన్నతత్వాన్ని వికృతత్వాన్ని కూడా బయటపడేసే ఒక రంగస్థలం. అనుకూలమైన పరిస్థితుల్లో ఎవరైనా మంచిగానే వ్యవహరిస్తారు. ప్రతికూల పరిస్థితుల్లో ముఖ్యంగా ఒకరిని నిర్మూలించడం వల్లే మనం మనుగడ సాగించగలం అని అనిపించినప్పుడు మనిషి ప్రవర్తన ఎలా ఉంటుందో తెలిపే షో ఇది. కంటెస్టెంట్లు 16 మందే అయినా ప్రేక్షకులందరూ కంటెస్టెంట్లే. మనల్ని మనం చూసుకునే షో ఇది.రాబోయే వందరోజులు తెలుగు నాట మంచి కాలక్షేపం ఉంటుందనే ఆశిద్దాం. శ్రీరెడ్డి ఏమైంది? బిగ్‌బాస్ సీజన్2లో అందరూ ఎదురు చూసిన పేరు శ్రీరెడ్డి. గత ఆరు నెలలుగా ఆమె ఏస్థాయిలో వార్తల్లో నిలిచారో అందరికీ తెలిసిందే. బిగ్‌బాస్ హౌస్ సాధారణంగా ఇలాంటి న్యూస్మేకర్స్ను హౌస్‌మేట్స్‌గా తీసుకుంటూ ఉంటుంది. అయితే శ్రీరెడ్డి చివరి వరకూ లిస్ట్‌లో ఉన్నా ‘కొన్ని సాంకేతిక కారణాల’ వల్ల ఆమె హౌస్‌కు రాలేదని వార్తలు వినపడుతున్నాయి. ప్రతిదానికీ ఓ లిమిట్ ఉంటుంది – నాని ‘‘బిగ్‌బాస్ 2’లో నేను కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చేస్తే షో నుంచి తప్పుకుంటానని బిగ్‌బాస్ టీమ్‌ని నాని బెదిరించారు’’ అని శ్రీరెడ్డి ఆరోపించారు. అంతే కాకుండా ‘నాని నాకు అవకాశాలు ఇప్పిస్తానంటూ మోసం చేశాడు’ అని కూడా ఫేస్బుక్లో రాసుకొచ్చారు శ్రీరెడ్డి. ఈ ఆరోపణలకు హీరో నాని లీగల్‌గా సమాధానం చెప్పదలిచారు. ‘‘ఈ విషయాలపై స్పందించి ఆ రొంపిలోకి నేను వెళ్లను. ఎవరిని పడితే వాళ్లను సాఫ్ట్ టార్గెట్ చేస్తూ నిజం లేని నాన్సెన్స్ అంతా స్ప్రెడ్ చేయడం నన్ను డిస్ట్రబ్ చేసింది. లైక్స్ కోసం షేర్స్ కోసం ప్రతీ విషయాన్ని రాసేవాళ్లకు కుటుంబాలున్నాయి. సిగ్గు తెచ్చుకోండి. ఇంకోసారి ఈ విషయం మీద స్పందించదలచుకోలేదు. ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది’’ అని ట్వీట్టర్లో రియాక్ట్ అయ్యారు నాని. -
నానికి సవాల్ విసిరిన శ్రీరెడ్డి
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్‌పై పోరాటాన్ని కొనసాగిస్తూ సంచలనం సృష్టిస్తున్న శ్రీరెడ్డికి నాచురల్ స్టార్ నాని లీగల్ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. దీనికి శ్రీరెడ్డి స్పందించింది. తన పుట్టిన రోజు సందర్భంగా వేరే ప్రాంతానికి వెళ్తుంటే ఈ విషయం తెలిసిందన్నారు. తనకు కావాల్సింది కూడా ఇదేనని.. నీ రంకు బాగోతం బయటపెట్టడానికి ఓ మంచి అవకాశం తనకు వచ్చిందని నానిని ఉద్దేశించి అన్నారు. తప్పనిసరిగా ఫైట్ చేద్దాం.. గురువారం మళ్లీ హైదరాబాద్‌కు తిరిగి వస్తాను.. అప్పుడు నాని సంగతి చూస్తానని తెలిపారు. ఇక నానిపై చేసే పోరాటం చూసి మిగతా వారందరూ వణికిపోయేలా చేస్తానని ఛాలెంజ్ విసిరారు. అలాగే బాధిత మహిళలు ఎలా ఫైట్ చేయాలో నేను చేసి చూపిస్తాను. నీవ్వు నిజంగా తప్పు చేస్తే, కచ్చితంగా నీ మనఃసాక్షికి తెలుసు.. నీ భార్యకు అన్నీ చెబుతానని చెప్పావు. మన సంగతి చెప్పావో లేదో నాకు తెలియదన్నారు. నువ్వు జనాల్లో పరువు పోతుందని లీగల్ నోటీసులు పంపావు కానీ ఏమి జరిగిందో నీకు తెలుసన్నారు. నువ్వు నిజంగా తప్పు చేసి ఉంటే.. ధర్మానికి నిజంగా బలం ఉంటే.. నువ్వు కచ్చితంగా దోరుకుతావని, దేవుడు నిన్ను శిక్షిస్తాడన్నాడని సవాల్ విసిరారు. -
శ్రీరెడ్డికి షాకిచ్చిన నాని!
హైదరాబాద్ : సహనానికి కూడా ఓ హద్దు ఉంటుందని నేచురల్ స్టార్, హీరో నాని అన్నారు. కూల్‌గా కనిపించే నాని ఇటీవల నటి శ్రీరెడ్డి తనపై చేసిన ఆరోపణలపై విమర్శలపై ఘాటుగా స్పందించారు. తనపై విమర్శలు, అసభ్యకర వ్యాఖ్యలు చేసిన నటి శ్రీరెడ్డికి నాని లీగల్ నోటీసులు పంపించారు. సామాజిక మాధ్యమాల్లో తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ తన పరువుకు భంగం కలిగిస్తుందంటూ శ్రీరెడ్డికి నాని నోటీసులు పంపారు. పరువు నష్టం కింద శ్రీరెడ్డికి నోటీసులు ఇచ్చామని, ఏడు రోజుల్లోగా సిటీ సివిల్ కోర్టుకు హాజరై ఆమె చేసిన ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని నాని తరఫు న్యాయవాదులు సూచించారు. తనపై వస్తున్న ఆరోపణలపై సోషల్ మీడియాలో స్పందిస్తూ నాని ట్వీట్ చేశారు. ‘ప్రతి చిన్న విషయానికి స్పందించాల్సిన అవసరం లేదు. ఆరోపణలు చేసిన వాళ్లు అడిగే ప్రతి అంశంపై బదులివ్వడం నాకిష్టం లేదు. లీగల్ ప్రొసీజర్ మొదలుపెట్టాం. పరువునష్టం కింద నోటీసులు పంపించా. నిరాధారమైన ఆరోపణలు చేస్తూ నా సమయాన్ని వృథా చేయవద్దు. నా విషయంలో నేను ఆందోళన చెందడం లేదు. అందరికీ కుటుంబాలుంటాయి. ఇలాంటి తప్పుడు ఆరోపణలను, వార్తలను వ్యాప్తి చేయకపోవడం మంచిది. నేను దీనిపై మరోసారి కామెంట్ చేయదలుచుకోలేదంటూ’ నాని చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. నానికి మద్దతుగా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ‘‘నానితో నేను కలిస్తే ఇక డర్టీ పిక్చరే! కానీ ఎప్పుడు? అతి త్వరలోనే.. మీ ముందుకు రాబోతున్నది. నాని రాసలీలలు అన్నీ బయటపెడతా. నాని కాపురంలో ఇక నిప్పులే..’’ అని శ్రీరెడ్డి ఇటీవల పోస్ట్ చేయడం టాలీవుడ్లో దూమారం రేపిన విషయం తెలిసిందే. ట్విటర్లో నాని పోస్ట్ చేసిన లేఖ.. Patience has a limit. pic.twitter.com/9lJdr9kq2V — Nani (@NameisNani) 11 June 2018 -
నాని కాపురంలో నిప్పులే!
హైదరాబాద్: గతంలో గతితప్పిన వ్యాఖ్యలు చేసి క్షమాపణలు కూడా చెప్పిన నటి శ్రీరెడ్డి మరోమారు అదే తీరును ప్రదర్శించారు. నటుడు, బిగ్‌బాస్-2 హోస్ట్ నానిని ఉద్దేశించి తీవ్రవ్యాఖ్యలు చేశారు. సదరు రియాలిటీ షోలో తన ఎంట్రీపై స్పష్టత ఇవ్వకుండా ఈ రకమైన కామెంట్లు చేయడం పబ్లిసిటీలో భాగమేననే అభిప్రాయం వెల్లడవుతున్నది. మేమిద్దరం కలిస్తే డర్టీ పిక్చరే: ‘‘నానితో నేను కలిస్తే ఇక డర్టీ పిక్చరే! కానీ ఎప్పుడు? అతిత్వరలోనే.. మీ ముందుకు రాబోతున్నది. నాని రాసలీలలు అన్నీ బయటపెడతా. నాని కాపురంలో ఇక నిప్పులే..’’ అని శ్రీరెడ్డి రాసుకొచ్చారు. ఎందుకిలా?: మరో రెండు రోజుల్లో బిగ్‌బాస్ సీజన్ 2 షో ప్రారంభం కానున్న నేపథ్యంలో శ్రీరెడ్డి వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. కొద్ది రోజులుగా బిగ్ బాస్ 2లో శ్రీ రెడ్డి పాల్గొంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వార్తలను బిగ్ బాస్ నిర్వాహకులు గానీ శ్రీరెడ్డి గానీ ధృవీకరించలేదు. కొంతకాలంగా నానిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్న శ్రీరెడ్డి, బిగ్‌బాస్ ప్రసార సమయంలోనే బాంబ్ పేల్చే అవకాశముందని భావిస్తున్నారు ప్రేక్షకులు. -
నారా లోకేశ్‌పై శ్రీరెడ్డి కామెంట్స్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తనయుడు, కేబినెట్ మంత్రి నారా లోకేశ్‌ను ఉద్దేశించి సంచలన నటి శ్రీరెడ్డి అదోరకం వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్‌పై పోరాటాన్ని కొనసాగిస్తానంటోన్న ఆమె.. సీఎం తనయుడితోపాటు మెగా ఫ్యామిలీపైనా కామెంట్లు గుప్పించారు. ఎవరికి తెలియదు?: ‘‘నారా లోకేశ్ గారిని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేవాళ్లు ఎవరూ లేరు. కొత్త పార్టీ ఏం చేస్తుందో అది చెప్పుకోండి. అంతేగానీ లోకేశ్‌ను విమర్శిస్తే ఒప్పుకునేది లేదు. నా నోటికి పని చెప్పొద్దు..’’ అని శ్రీరెడ్డి పేర్కొన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేరును ప్రస్తావించకుండా.. ‘‘మీ అన్న తిరుపతి నుంచి ఎన్నికై, అక్కడ పైసా అభివృద్ధి చేయలేదని ప్రజలందరికీ తెలుసు. ఓర్పుగా ఉండటం సినిమా డైలాగ్స్ కొట్టి నీళ్లు తాగినంత సులువు కాదు. మీ అన్న రాజకీయాలు, సినిమాల్లో ఎంతమందిని తొక్కాడో ఎవరికి తెలియదు?’’ అని శ్రీరెడ్డి రాసుకొచ్చారు. బిగ్‌బాస్‌లో శ్రీరెడ్డి?: అతి త్వరలో ప్రారంభం కానున్న బిగ్‌బాస్-2 రియాలిటీ షోలో శ్రీరెడ్డి కూడా ఉంటారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు అధికారిక సమాచారం లేనప్పటకీ సదరు షోపై నటి పలు కామెంట్లు చేశారు. బిగ్‌బాస్‌పైన కూడా మెగా ఫ్యామిలీ ప్రభావం ఉందని, హోస్ట్ నానికి తనకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత స్థాయిలో విబేధాలున్నాయని శ్రీరెడ్డి తెలిపారు. -
మెగా ఫ్యామిలీలో ఒకరు నాకు బాగా క్లోజ్: శ్రీరెడ్డి
సాక్షి, హైదరాబాద్: క్యాస్టింగ్ కౌచ్ పేరిట తెలుగు చిత్రసీమలో మహిళలను లైంగికంగా దోపిడి చేస్తున్నారంటూ గళమెత్తి నటి శ్రీరెడ్డి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే శ్రీరెడ్డి మరో సంచలనానికి తెరలేపింది. మెగా ఫ్యామిలీలో ఒకతను నాకు బాగా క్లోజని, తనకు ప్రజారాజ్యం పార్టీ అవకతవకలన్నీ తెలుసన్నట్లు తన ఫేస్బుక్లో ఓ పోస్టు పెట్టింది. ‘మెగా ఫ్యామిలీలో ఒకతను నాకు బాగా క్లోజ్.. అతను చెప్పాడు ప్రజారాజ్యం అప్పుడు అవకతవకలు బాబోయ్.. ఆ సంగతి తెలిస్తే ప్రతి ఒక్కరు వామ్మో అంటారు.. టైం వచ్చినపుడు రివీల్ చేస్తా..’ అని శ్రీరెడ్డి అందులో పెర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి మెగా అభిమానులు స్పందిస్తున్నారు. ఓ అభిమాని ‘నువు చేసే పోరాటం వేరు.. రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు. నువ్వు ఏమైన రాజకీయాల్లోకి రావాలి అనుకుంటున్నావా.. కేవలం నీ పోరాటం గురించి.. నీకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడు ఒకే కానీ.. ప్రతిదానిలో వేలు పెడితే నీ పోరాటం చులకన అయిపోతుంది.. ఎవరో చెప్పేది విని అనవసరంగా రాంగ్ స్టెప్ వేయకు..’ అని బదులిచ్చారు. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై శ్రీ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన విషయం విదితమే. -
బిగ్‌బాస్ 2 లో శ్రీరెడ్డి!?
బుల్లితెరపై మళ్లీ బిగ్‌బాస్ షో సందడి మొదలు కానుంది. ఎన్టీఆర్ హోస్ట్‌గా బిగ్‌బాస్ సీజన్ 1 సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. దీంతో సీజన్ 2 పై టాలీవుడ్ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా ప్రారంభం కానున్న బిగ్‌బాస్ 2కు ముహూర్తం ఫిక్స్ చేశారు నిర్వాహకులు. జూన్ 10 నుంచి షో ప్రారంభం కానుంది. వంద రోజులు జరిగే ఈ సీజన్లో 16 మంది పార్టిసిపెంట్స్ అలరించబోతున్నారు. ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు, ప్రతి సోమ నుంచి శుక్రవారాల్లో రాత్రి 9.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే సెలబ్రిటీలకు సంబంధించిన జాబితా ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైరల్ అవుతున్న లిస్ట్ ఇదే! హీరో రాజ్ తరుణ్ , సింగర్ గీతా మాధురి, యాంకర్ శ్యామల, యాంకర్ లాస్య, హీరోయిన్ రాశి, హీరోయిన్ చార్మి, ధన్య బాలకృష్ణ, జూనియర్ శ్రీదేవి, హీరోయిన్ గజాలా, చాందిని చౌదరి, శ్రీరెడ్డి, వరుణ్ సందేశ్, తనీష్, వైవా హర్ష, కమెడియన్ వేణు, ఆర్యన్ రాజేష్ ఈ 16 మంది కంటెస్టెంట్స్ బిగ్‌బాస్ హౌస్ మేట్స్ అని ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడలేదు. ఈ మధ్య తెలుగు చిత్రసీమలో వేధింపులు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి సీజన్ 2లో పాల్గొనబోతుందనే వార్త షాకింగ్‌గా మారింది. శ్రీరెడ్డి నేచురల్ స్టార్ నాని, వైవా హర్షలపై కూడా పలు కామెంట్స్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న16 సెలబ్రిటీలలో ఎంతమంది నిజంగా షోలో ఉన్నారో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది. -
హైపర్ ఆది.. తాట తీస్తా
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ కమెడియన్ హైపర్ ఆదిపై నటి శ్రీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ప్రముఖ కామెడీ షో స్కిట్లో ఆది వేసిన సెటైర్లపై ఫేస్బుక్ లైవ్‌లో ఆమె స్పందించారు. ముందుగా ఆదిపై ప్రశంసలు గుప్పించినట్లే గుప్పించిన ఆమె.. తర్వాత తీవ్ర వ్యాఖ్యలకు దిగారు. తరిమి తరిమి కొడతానంటూ, తాట తీస్తానంటూ హెచ్చరించారు. సహించబోను... ‘ఆది గారూ.. మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. మీరు మంచి రచయిత. మీ పొట్టకూటిని చూసుకుంటూనే మరికొందరికి లైఫ్ కూడా ఇస్తున్నారు. ఆ విషయంలో నేను అభినందిస్తున్నా. కానీ, మీ పద్ధతి బాగోలేదు. గతంలో మీరు చేస్తున్న అదే షోలో కొన్ని కులాల గురించి, కొందరి గురించి కించపరిచేలా మాట్లాడారంటూ కొందరిని వెంటపడి మరీ కొట్టిన ఘటనలు మీకు గుర్తుండే ఉంటాయనుకుంటా. అలాగని ఎవరో వచ్చే దాకా ఎదురు చూసే రకాన్ని నేను కాదు. వెంటపడి తరిమి తరిమి కొడతా. హైపర్ ఆది నీ తాట తీస్తా. మహిళలపై సమాజంలో ఇప్పుడిప్పుడే కాస్త గౌరవం పెరుగుతోంది. ఇలాంటి సమయంలో నువ్వు కించపరిచే కామెంట్లు చేస్తే ఊరుకోను’ అని ఆమె హెచ్చరించారు. ఘాటు వ్యాఖ్యలు... తాను చేసిన నిరసన దీక్షను ఆది తక్కువ చేసి మాట్లాడాడని, ‘షర్ట్ విప్పరా.. ఇంటర్నేషనల్ మీడియా కవర్ చేస్తుంది’ ఓ డైలాగ్ చెప్పాడని ఆమె తెలిపారు . ‘నేను తెలిపింది నిరసన.. అది సెక్సీ నెస్ కాదు. ఆది.. నీ పుట్టుకకు అవమానం తీసుకురాకు... అంటూ ఘాటు పదజాలమే వాడారామే. తల్లిగా, చెల్లిగా, భార్యగా మగాడి జీవితంలో పాత్రలు పోషించే మహిళలపై టీవీషో అడ్డుపెట్టుకుని జోకులేయొద్దని, అలా కాదు అని ఇదే కొనసాగితే వంద చెప్పులు నీ మీద వచ్చి పడతాయి’ అని ఆదిని ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. గతంలో ఓ ప్రముఖ హీరో గురించి మాట్లాడిన కత్తి మహేష్ పైకూడా ఆది ఇదే షోలో సెటైర్లు వేసిన విషయాన్ని ఆమె ప్రస్తావనకు తీసుకొచ్చారు. ఇక ఆది పేల్చే పిచ్చి జోకుల వెనుక ఆ షో న్యాయనిర్ణేత నాగబాబు ప్రమేయం గనుక ఉంటే మాత్రం.. రాజకీయంగా ప్రభావం చూపుతుందని ఆమె హెచ్చరించారు. మహిళలను కించపరిచే డైలాగులపై ఎందుకు ఉపేక్షిస్తున్నారంటూ షో నిర్వాహకులను కూడా ఆమె నిలదీశారు. -
మీడియా ఎంతో సపోర్ట్ చేసింది : శ్రీరెడ్డి
హిమాయత్‌నగర్ : క్యాస్టింగ్‌కౌచ్ విధానంపై పోరాడిన తనకు మీడియా ఎంతో సపోర్ట్ చేసిందని నటి శ్రీరెడ్డి అన్నారు. నటి శ్రీరెడ్డి ఆధ్వర్యంలో ‘సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్‌కౌచ్ మరియు కోఆర్డినేటర్ విధానాన్ని నిర్మూలించాలి. 90శాతం తెలుగు బిడ్డలకి అవకాశాలు కల్పించాలి’ అనే డిమాండ్‌తో ‘మూవీ ఆర్టిస్ట్ న్యూ అసోసియేషన్’ సభను ఏర్పాటు చేసింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. సినీరంగం సమాజానికి మంచి మెసేజ్‌తో ప్రజల్ని ప్రభావితం చేసేలా ఉండాలే తప్ప.. కోట్లాది రూపాయిల వ్యాపారం చేసుకుంటూ, చెడు వ్యాప్తి చెందేలా, నాగరికతను కించేపరిచేలా ఉండకూడదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ప్రతిభ దాగి ఉన్న వారిని కాస్టింగ్‌కౌచ్ పేరుతో వేధించడం సరైన పరిణామం కాదన్నారు. సినిపరిశ్రమలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందించి, కో–ఆర్డినేటర్ విధానాన్ని నిర్మూలించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేయకతప్పదని ఆయన హెచ్చరించారు. ఇండస్ట్రీలో జరుగుతున్న దోపిడీ, అత్యాచారాలు, అవమానాలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందన్నారు. సినీ రంగాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. క్యాస్టింగ్ కౌచ్ విధానాన్ని అరికట్టి నటీనటులకు ఓ భరోసా ఇవ్వాల్సిన బాధ్యత సినీపరిశ్రమ పెద్దలపై ఉందని ఉమెన్ యాక్టివిస్ట్ తేజస్విని అన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, నటి అపూర్వ, సుజాత పాల్గొన్నారు. -
మళ్లీ రోడ్డు పైకి శ్రీరెడ్డి
సాక్షి, ఎర్రగొండపాలెం : టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్‌పై పోరాడుతూ సంచలనంగా వెలుగులోకి వచ్చిన నటి శ్రీరెడ్డి. సినీ ప్రముఖులపై విమర్శలు చేస్తూ వారికి కంటి మీద కునుకు లేకుండా చేశారు. గతంలో టాలీవుడ్లో మహిళలపై జరుగుతున్న దారుణాలను ఆమె తీవ్రంగా ఖండించారు. సినీ పరిశ్రమలో మహిళలకు అండగా ఉంటానంటూ ఇటీవల ఆమె ప్రకటించారు. తాజాగా ఆమె మరోసారి రోడ్డుపై నిరనస వ్యక్తం చేశారు. అయితే ఈసారి సినీ పరిశ్రమ గురించి కాకుండా ఉపాధి కూలీలు చేస్తున్న నిరసనకు ఆమె మద్దతు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. మల్లికార్జున స్వామి దర్శనానికి శ్రీరెడ్డి శ్రీశైలం వెళ్తున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం, గురిజేపల్లి సమీపంలో కొందరు తమకు ఉపాధి పనులు కల్పించడం లేదంటూ రోడ్డుపై బైఠాయించారు. అటుగా వెళ్తున్న శ్రీరెడ్డి కారు దిగి, తలకు తలపాగా చుట్టుకొని స్థానికులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అయితే ఆమెను చూసిన స్థానికులు అవాక్కయ్యారు. శ్రీరెడ్డి ఏంటీ.. ఇలా తమకు మద్దతు ఇవ్వడం ఏంటని విస్తుపోయారు. కాసేపు అక్కడ హడావుడి చేసిన ఆమె, స్థానికులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం తన కారులో అక్కడ నుండి వెళ్లిపోయారు. -
సోషల్ మీడియాలో దూషిస్తున్నారు: శ్రీరెడ్డి
సాక్షి, హైదరాబాద్: సినీ రంగానికి చెందిన ఆర్టిస్టులు, మా అసోసియేషన్ సభ్యులు తనను అసభ్యంగా తిడుతున్నారని నటి శ్రీరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాస్టింగ్ కౌచ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు తనను వాట్సాఫ్, ఫేస్‌బుక్‌లలో వేధిస్తున్నరని, అసభ్యపదజాలంతో దూషిస్తున్నారని ఆదివారం ఆమె హుమయూన్‌నగర్ పోలీస్ స్టేషన్లోపోలీసులకు ఫిర్యాదు చేసింది. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్బంగా ఆమె ఏసీపీని కోరారు. ఫిర్యాదులోని అంశాలను సైబర్ క్రైం సహకారంతో వివరాలు సేకరించి విచారణ చేస్తామని తెలిపారు. ఆమె ఫిర్యాదులో పేర్కొన్న వారిలో నటి జీవిత, హేతువాది బాబు గోగినేనిలు కూడా ఉన్నారు. -
మహిళా కమిషన్‌లో శ్రీరెడ్డి ఫిర్యాదు
హైదరాబాద్ : సినీ రంగంలో మహళలపై లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయని, నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని నటి శ్రీరెడ్డి వివిధ మహిళా సంఘాల ప్రతినిధులతో కలిసి మహిళా కమిషన్‌లో ఫిర్యాదు చేశా రు. ఈ మేరకు మహిళా కమిషన్ చైర్పర్సన్ త్రిపురాన వెంకటరత్నంకు శుక్రవారం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీరెడ్డి మాట్లాడుతూ... తెలుగు సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, వారికి జరుగుతున్న అన్యాయంపై ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్లోనూ ఫిర్యాదు చేస్తానన్నారు. మహిళా ఆర్టిస్ట్‌లకు ఉపాధి, భద్రత కల్పించాలని.. దళారీ వ్యవస్థను నివారించాలని కోరారు. తెలుగు సినిమా పరిశ్రమ కొన్ని కుటుంబాల ఆధిపత్యంలోనే కొనసాగుతోందని, దీంతో చాలా సమస్యలకు పరిష్కారం లభించడం లేదని మహిళా సంఘం నాయకురాలు సంధ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, సినీరంగ పెద్దలతో ప్రత్యేక సమావేశం ఏర్పా టు చేసి, సమస్యల పరిష్కారానికి కృషి చేసా ్తనని మహిళా కమిషన్ చైర్పర్సన్ త్రిపురాన వెంకటరత్నం హామీ ఇచ్చారని తెలిపారు. -
చెప్పుదెబ్బలు తప్పవు: శ్రీరెడ్డి
హైదరాబాద్: టాలీవుడ్‌ను గుప్పిట్లో పెట్టుకుని అంతులేని అక్రమాలకు పాల్పడుతున్న సినీ పెద్దలకు చెప్పుదెబ్బలు తప్పవని నటి శ్రీరెడ్డి హెచ్చరించారు. 24 క్రాఫ్ట్స్‌లో చోటుచేసుకుంటున్న అక్రమాలకు వ్యతిరేకంగా తాను పోరాడుతూనే ఉంటానని, ఈ క్రమంలో ఎన్ని బెదిరింపులు వచ్చినా వెనక్కితగ్గబోనని స్పష్టం చేశారు. గడిచిన 24 గంటలుగా ఈ మేరకు వరుస పోస్టులు పెట్టారామె. ‘‘స్డుడియోల మీద ఎంతెంత సంపాదిస్తున్నారో, డిస్ట్రిబ్యూషన్‌లపై పెత్తనాలు, బడా నిర్మాతల కొడుకుల అకృత్యాలు.. అన్నిటికి అన్ని వ్యవహారాలపై న్యాయపోరాటం చేస్తాం. యూఎఫ్ఓ క్యూబ్ పేరుతో చిన్న నిర్మాతలు, నటులు, దర్శకుల రక్తాన్ని జలగల్లా పీల్చుతున్న వైనాన్ని బట్టబయలుచేస్తాం. బయటి రాష్ట్రాల వాళ్లకు పరమాన్నం పెడుతూ, స్థానికులను అన్యాయానికి గురిచేస్తున్నారు. మీడియా నోరు నొక్కాలని ప్రయత్నిస్తున్న తీరును ప్రపంచానికి చాటుతాం. ఇండస్ట్రీ పెద్దలు మారాలి. లేకుంటే వీలైనంత తొందర్లోనే నా చెప్పుదెబ్బలకు రెడీ అవ్వండి. మీలాంటి కుక్కలను కోర్టు బోనులో నిలబెడతాం. ఎన్ని బెదిరింపులు, సెటిల్మెంట్ ఆఫర్లు ఇచ్చినా నేను లొంగను. 85 ఏళ్ల ఈ తెలుగు సినిమా పరిశ్రమకు స్వాతంత్ర్యం కల్పించడంలో అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధంగా ఉన్నాం..’’ అని శ్రీరెడ్డి రాసుకొచ్చారు. -
నటుడు బాలాజిపై పోలీసులకు ఫిర్యాదు
-
సినీ నటుడు బాలాజీపై ఫిర్యాదు
సాక్షి, బంజారాహిల్స్ : సినీ నటుడు బాలాజీ తనను మోసం చేశాడని ఆరోపిస్తూ నటి లక్ష్మి మంగళవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీరెడ్డితో కలిసి జూబ్లీహిల్స్ పీఎస్‌కు వచ్చిన ఆమె అనంతరం విలేకరులతో మాట్లాడారు.. యూసూఫ్‌గూడలో ఉంటున్న తాను తన భర్త చనిపోయిన తర్వాత కుటుంబ భారాన్ని మోస్తున్నానని తెలిపింది. తన కుమార్తె అనారోగ్యం కారణంగా అప్పులపాలైన తాను నటుడు బాలాజీ భార్యకు కిడ్నీ ఇస్తే రూ.20 లక్షలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడన్నారు. 2016లో విజయవాడలోని ఓ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి జరిగిందని, అయితే రూ. 3 లక్షలు మాత్రమే ఇచ్చి తెల్లకాగితాలపై ఆస్పత్రిలో సంతకాలు చేయించుకుని డబ్బులు ముట్టినట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించారని ఆరోపించారు. ఇబ్బందుల్లో ఉన్న తాను న్యాయం కోసం జూబ్లీహిల్స్ పోలీసులు, మానవహక్కుల కమిషన్, ‘మా’ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. శ్రీ రెడ్డి మాట్లాడుతూ లక్ష్మి సోదరుడికి ఉద్యోగం ఇప్పిస్తానని, ఆమెకు సినిమా క్యారెక్టర్లు ఇప్పిస్తానని, తన ఇంటి పై పోర్షన్ రాసిస్తానని, జీవనోపాధి కల్పిస్తానని మాయమాటలు చెప్పి మోసం చేశాడని ఆరోపించింది. ఆమెకు న్యాయం జరిగేవరకు తాను అండగా ఉంటానన్నారు. బాధల్లో ఉన్న ఆమెను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆమెకు డబ్బులు ముట్టినట్లు బాలాజీ చూపిస్తున్న పత్రాలు నమ్మదగ్గవిగా లేవన్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీరెడ్డికి ‘మా’ సభ్యత్వం ఇస్తారా..?
సాక్షి, హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్‌పై పోరాడుతున్న సినీ నటి శ్రీరెడ్డి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)లో శుక్రవారం సభ్యత్వ రుసుము చెల్లించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో తాను సభ్యత్వ రుసుము ఇవ్వలేదన్న ప్రచారం సరికాదని పేర్కొన్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ పాలక వర్గం సభ్యత్వం ఇచ్చినా, ఇవ్వకపోయినా సినీ పరిశ్రమలోని సమస్యలపై పోరాటం కొనసాగుతుందని రెండు రోజుల క్రితం ఫిలించాంబర్‌లో మీడియాకు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెకు ‘మా’ సభ్యత్వం ఇస్తారా..? లేదా అన్నదానిపై ఆసక్తి నెలకొంది. ఈ విషయంపై ఇంత వరకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా, ఈనెల 2న ‘మా’ కార్యాలయానికి వెళ్లి తన సభ్యత్వం విషయమై అకౌంటెంట్ ప్రసాద్‌ను ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ‘మా’ సభ్యత్వం ఇస్తే ఒకలాగ, ఇవ్వకపోతే ఇంకోలాగా తన ఉద్యమం ఉంటుందని ఈ సందర్భంగా శ్రీరెడ్డి ప్రకటించారు. తెలుగు హీరోయిన్లకు 70 శాతం అవకాశాలు ఇప్పించేలా సినీ పెద్దలను ఒప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. చిత్ర పరిశ్రమలో మహిళలపట్ల జరుగుతున్న లైంగిక వేధింపుల (కాస్టింగ్ కౌచ్) నిరోధానికి ఏర్పాటు చేయనున్న ప్రత్యేక కమిటీలో మహిళా సంఘాలకు అవకాశం కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. -
భరత్ అనే నేను: శ్రీరెడ్డి వివాదాస్పద ట్వీట్లు..
సాక్షి, హైదరాబాద్ : గత కొన్నాళ్లుగా ఒకింత మౌనంగా ఉన్న నటి శ్రీరెడ్డి తాజాగా మహేశ్‌బాబు సినిమా ‘భరత్ అనే నేను’ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘భరత్ అనే నేను’ బ్లాక్‌బస్టర్ హిట్ కాదని, బిలో యావరేజ్ మూవీ అని ఆమె ట్విటర్లో కామెంట్ చేశారు. ‘ఇప్పుడే భరత్ అనే నేను మూవీ చూసాను. అసలు ఇది బ్లాక్ బస్టర్ మూవీ ఎంటిరా.. బిలో యావరేజ్ మూవీ. మహేష్ బాబు క్రేజ్ వల్ల హిట్ టాక్ వచ్చింది. లేకపోతే పక్కా ఫ్లాప్. వరెస్ట్ డైరెక్షన్, కంటెంట్ లేని కథ, ఫేస్‌లో ఎక్స్ప్రెషన్ లేని యాక్టర్‌గా మహేష్ బాబుని తయారుచేస్తున్నారు’ అని ఆమె రివ్యూ ఇచ్చారు. దీంతో మహేశ్‌బాబు అభిమానులు ఆమెపై విరుచుకుపడ్డారు. వారి నుంచి విమర్శలు రావడంతో శ్రీరెడ్డి ఆ ట్వీట్లను తొలగించారు. గతంలో క్యాస్టింగ్ కౌచ్ వివాదంలో దర్శకుడు కొరటాల శివ కూడా ఉన్నారని ఆమె ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆమె ఆరోపణలను కొరటాల శివ తీవ్రంగా ఖండించాడు. ఈ నేపథ్యంలో ‘భరత్’ సినిమాపై ఆమె నెగిటివ్ ట్వీట్లు చేసి.. తొలగించారు. తాజాగా తన ఫేస్బుక్ ఖాతాలో మాత్రం ‘భరత్ అనే నేను’ సినిమా సక్సెస్ అయినందుకు మహేశ్‌బాబుకు అభినందనలు తెలిపారు. ప్రత్యేక హోదా గురించి మహేశ్ బాబు మాట్లాడాలని ఆమె కోరారు. టాలీవుడ్లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై గళమెత్తిన శ్రీరెడ్డి.. ఆ తర్వాత ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేస్తూ.. వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ తర్వాత కొన్నిరోజులు మౌనంగా ఉన్న శ్రీరెడ్డి.. బుధవారం ప్రెస్‌మీట్ పెట్టి.. టాలీవుడ్లో మహిళల సమస్యలు, తనపై సోషల్ మీడియాలో దుర్భాషలాడుతున్న వారిపై న్యాయపోరాటం చేస్తానని ప్రకటించారు. -
‘మా’ సభ్యత్వం ఇవ్వకపోతే ఉద్యమం ఉధృతం
బంజారాహిల్స్ : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష న్(మా) సభ్యత్వం ఇవ్వకపోతే పోరాటం ఉధృతం చేస్తానని సినీ నటి శ్రీరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆమె ‘మా’ కార్యాలయానికి వెళ్లి తన సభ్యత్వం విషయమై అకౌంటెంట్ ప్రసాద్‌ను ప్రశ్నించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మా సభ్యత్వం ఇస్తే ఒకలాగ, ఇవ్వకపోతే ఇంకోలాగా తన ఉద్యమం ఉంటుందన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సినీ పెద్దలను పిలిపించి తెలుగు హీరోయిన్లకు 70 శాతం అవకాశాలు ఇప్పించేలా ఒప్పించాలని, కమిటీలో మహిళా సంఘాలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు... తన స్నేహితురాలు సోనుకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని శ్రీరెడ్డి బుధవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
అసభ్య వీడియోలు.. శ్రీరెడ్డి ఘాటు హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై గళమెత్తిన నటి శ్రీరెడ్డి.. తాజాగా తనను కించపరుస్తూ కామెంట్లు చేస్తున్న నెటిజన్లపై చర్యలకు సిద్ధమవుతున్నారు. సోషల్ మీడియాలో తనపై అసభ్యంగా కామెంట్లు చేసినవారిని కోర్టుకు లాగుతానని ఆమె హెచ్చరించారు. హైదరాబాద్‌లో బుధవారం ఆమె తన లాయర్ గోపాలకృష్ణ కళానిధితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహిళ అని చూడకుండా శ్రీరెడ్డిపై అసభ్య వీడియోలను కొందరు సోషల్ మీడియాలో పెట్టారని, అంతేకాకుండా ఆ వీడియోలపై అసభ్యంగా కామెంట్లు చేశారని, వారందరినీ కోర్టుకు లాగుతామని ఆమె లాయర్ తెలిపారు. సోషల్ మీడియాలో ఆమెను దూషిస్తూ.. బెదిరిస్తూ కామెంట్లు పెట్టిన వారిపై కేసులు పెట్టబోతున్నామని తెలిపారు. ఈ విషయమై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తామని తెలిపారు. ఈ కేసులో మా అసోసియేషన్, జూనియర్ ఆర్టిస్టులు, పవన్ కళ్యాణ్ అభిమానులు.. ఇలా ఎవరు ఆమెపై కామెంట్ చేసినా వారిపై కేసులు పెడతామని, వారిపై క్రిమినల్, సైబర్ యాక్ట్ కింద అభియోగాలు నమోదుచేస్తామని వెల్లడించారు. -
హోదాపై మాట్లాడలేదని అలిగారంట: శ్రీరెడ్డి
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాటం చేస్తున్న శ్రీరెడ్డి.. ఇప్పుడు ఏపీ ప్రత్యేక హోదా అంశంపై స్పందించారు. టాలీవుడ్ హోదాపై ఎందుకు స్పందించటం లేదని పరోక్షంగా ఆమె ప్రశ్నించారు. ఈ మేరకు తన ఫేస్బుక్లో ఆమె ఓ ట్వీట్ చేశారు. ‘అమెరికాలో మా అసోషియేషన్ నిర్వహించిన ప్రొగ్రాం. అదేనండీ బిల్డింగ్ కోసం డబ్బులు అడగటం కోసం చేసిన ప్రోగ్రాంకి జనాలు రాకుండా నిరసన వ్యక్తం చేశారు. హీరోలెవరూ ప్రత్యేక హోదా కోసం మాట్లాడలేదని అలిగారంట’ అంటూ ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు అక్కడ ఖాళీగా ఉన్న కుర్చీల ఫోటోలను ఆమె పోస్ట్ చేశారు. చిరుకు చేదు అనుభవం.. మా సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొనేందుకు డల్లాస్ వెళ్లిన మెగాస్టార్ చిరంజీవికి చేదు అనుభవం ఎదురైంది. ప్రత్యేక హోదా కోసం ఎందుకు ఉద్యమించటం లేదంటూ ప్రవాస భారతీయులు ఆయన్ని నిలదీశారు. చిరు చీఫ్ గెస్ట్‌గా హాజరైన కార్యక్రమానికి వారంతా నల్ల దుస్తులతో వచ్చి నినాదాలు చేశారు. ఊహించని పరిణామం ఎదురు కావటంతో ఖంగుతినటం చిరంజీవి వంతైంది. ఇక ఏప్రిల్ 28, 29 తేదీల్లో నిర్వహించిన కార్యక్రమాల సందర్భంగా కొందరు ఎన్నారైలు ఫ్లకార్డ్లతో ఆడిటోరియం బయట నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అది పాత వీడియో... ఎన్నారై అభిమానుల ఆప్యాయతకు చిరు కంటతడి పెట్టుకున్నట్లు కొన్ని వీడియోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. క్లీన్ షేవ్‌తో ఉన్న చిరు మాట్లాడిన ప్రసంగం అది. సోషల్ మీడియాతోపాటు కొన్ని ఛానెళ్లలోనూ అవి వైరల్ కావటం విశేషం. దీనిపై ప్రవాసాంధ్రులు స్పష్టత ఇచ్చారు. అవి పాత వీడియోలని వారు పేర్కొన్నారు. -
కేటీఆర్ సార్.. స్పందించండి: శ్రీరెడ్డి
సాక్షి, హైదరాబాద్: సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వివాదంపై మూడు, నాలుగుసార్లు తెలంగాణ మంత్రి కేటీఆర్‌గారికి తాను ట్వీట్ చేశానని అయినా ఆయన ఏమాత్రం స్పందించడం లేదని, మూవీలకు మాత్రం దగ్గరుండి ప్రచారం కల్పిస్తున్నారని నటి శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా తమ సమస్యలను బయటపెడుతున్నా సినీ పెద్దలు పట్టించుకోవడం లేదని, అందుకే ఇండస్ట్రీలో తమపై వేధింపులపై నేరుగా కలుసుకుని చర్చించాలని భావిస్తున్నట్లు శ్రీరెడ్డి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ట్వీట్లను స్క్రీన్ షాట్లు చేసి శ్రీరెడ్డి తాజాగా చేసి ఎఫ్బీ పోస్ట్ వైరల్‌గా మారింది. 'కొన్ని నెలలుగా క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాడుతున్నాం. మాకు న్యాయం కావాలి. మూవీకి సంబంధించిన పెద్ద కుటుంబాలు మా సమస్యలపై సరైన రీతిలో స్పందించడం లేదు. వారి నిర్ణయాలపై మేం సంతృప్తి చెండడం లేదు. తెలుగు మహిళలు, యువతులకు సినిమాలో ఆఫర్లు రావడం లేదు. మేం మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం.' 'సార్, ఇటీవల విడుదలైన మహేష్ బాబు మూవీ 'భరత్ అనే నేను'కు మీరు ప్రమోషన్లు ఇచ్చారు. కానీ ఇండస్ట్రీలో మహిళల సమస్యలపై స్పందించేందుకు మాత్రం సమయంలో ఎందుకు కేటాయించడం లేదు. మీ పీఏ మొబైల్‌కి పలుమార్లు మెస్సేజ్‌లు చేశాను. కానీ స్పందన కరువైంది. మా సమస్యలకు పరిష్కారం చూపిస్తామని చెప్పండి సార్' అంటూ శ్రీరెడ్డి పోస్ట్ చేశారు. (సంబంధిత కథనం: ‘సీఎం భరత్’కు కేటీఆర్ ఫిదా) -
‘క్యాస్టింగ్ కౌచ్‌కి అనుకూలంగా మాట్లాడలేదు’
ముంబై : శ్రీరెడ్డి అర్దనగ్న నిరసన తర్వాత కాస్టింగ్ కౌచ్ అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ అంశంపై సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్‌కు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అయితే బాలీవుడ్ సీనియర్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ మాత్రం ఈ ఉదంతంపై భిన్నంగా స్పందించారు. క్యాస్టింగ్ కౌచ్‌ని సమర్ధించేలా సరోజ్ ఖాన్ మాట్లాడరనే విమర్శలు వస్తున్నాయి. అయితే కొంతమంది మాత్రం ఆమె చెప్పిన దాంట్లో తప్పేముందని సమర్ధిస్తున్నారు. తాజాగా ఈ అంశంపై బాలీవుడ్ నటి రిచా చద్దా స్పందించారు. సరోజ్ ఖాన్ వ్యాఖ్యాలను ఆమె సమర్ధించారు. ఈ విషయాన్ని అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. బాలీవుడ్లో కూడా దుష్ప్రవర్తనకు పాల్పడేవారున్నారు. ఇది అన్ని రంగాల్లోను ఉందని, బాలీవుడ్‌ని మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటారని ఆమె ప్రశ్నించారు. ఇదే అంశంపై ట్విటర్లో కూడా ఆమె స్పందించారు. ‘నేను కూడా సరోజ్ ఖాన్ ఇంటర్వ్యూ చూశాను. ఆమె క్యాస్టింగ్ కౌచ్‌కి మద్దతుగా మాట్లాడారని అనుకోవడం లేదు. ఫిల్మ్ ఇండస్ట్రీని మాత్రమే ఎందుకు అలా చూస్తారని ఆమె ప్రశ్నించారు. సరోజ్ ఖాన్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు. రేప్ అనే పదం వాడటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. క్యాస్టింగ్ కౌచ్ అనేది అసహ్యకరమైన చర్య, దీని నివారణకు చర్యలు తీసుకోవాల’ని రిచా చద్దా అన్నారు. -
‘కాస్టింగ్ కౌచ్’పై సరోజ్ ఖాన్ భిన్నస్పందన
-
సమాజంలోనే క్యాస్టింగ్ కౌచ్ ఉంది
-
నిర్మాతలకు బానిసలుగా ఉండాలా?: శ్రీరెడ్డి
సాక్షి, హైదరాబాద్ : సినీ పరిశ్రమలో నెలకొన్న క్యాస్టింగ్ కౌచ్ సంస్కృతిని సమర్థిస్తూ ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. క్యాస్టింగ్ కౌచ్ సమర్థనీయమని, ఇది వర్థమాన నటీమణులకు జీవనోపాధి కల్పిస్తుందని, పరస్పర సమ్మతితోనే మహిళలు శృంగారంలో పాల్గొంటారని, ఇందులో లైంగిక వేధింపులు, మహిళలను మోసం చేయడం వంటిది ఉండదని ఆమె పేర్కొనడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆమె వ్యాఖ్యలను సినీ పరిశ్రమలోని పలువురు తీవ్రంగా తప్పుబడుతున్నారు. క్యాస్టింగ్ కౌచ్ పేరిట సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై గళమెత్తుతున్న నటి శ్రీరెడ్డి సరోజ్ ఖాన్ వ్యాఖ్యలపై స్పందించారు. ‘ ఈ వ్యాఖ్యలతో సరోజ్ ఖాన్‌పై గౌరవం పోయింది. సినీ పెద్ద అయిన ఆమె వర్థమాన నటీమణులకు మంచి దారిని చూపాలి. కానీ, నిర్మాతలకు బానిసలుగా ఉండాలంటూ తప్పుడు సంకేతాలు ఇచ్చే వ్యాఖ్యలు చేశారు’ అని శ్రీరెడ్డి ఏఎన్ఐ వార్తాసంస్థతో పేర్కొన్నారు. నటి, మోడల్ సోఫీ చౌదరి కూడా సరోజ్ ఖాన్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. కొరియోగ్రాఫర్‌గా సరోజ్ఖాన్పై చాలా గౌరవం ఉంది. కానీ ఆమె తన హోదాతో ఇలాగేనా అమ్మాయిలను కాపాడేది? నేను ఆర్థికంగా స్థిరపడిన కుటుంబం నుంచి రాకుంటే.. ముంబైకి వచ్చిన నెలరోజులకే లండన్ తిరగి వెళ్లిపోయేదాన్ని. ఇండస్ట్రీలో పరిస్థితులు అలా ఉన్నాయి’ అనిఆమె పేర్కొన్నారు. ‘తమ కలలను నిజం చేసుకోవడానికి అమ్మాయిలు ఎన్ని కష్టాలు పడుతున్నారో ఆలోచిస్తే.. ఎంతో కష్టంగా తోస్తుంది. పని కోసం ముక్కు మొఖం తెలియనివారితో శారీకరంగా గడపాలని ఎవరూ కోరుకోరు. కానీ, ఇది ఒక్కటే మార్గం, అలా చేయకుంటే ముందుకు వెళ్లడం చాలా కష్టమనే భావనను కల్పిస్తున్నారు. దీనికి ఫుల్స్టాప్ పెట్టాల్సిన సమయం వచ్చింది’ అంటూ సోఫీ ట్వీట్ చేశారు. Can’t begin to think what thousands of girls go through in the hope that their “dreams” will come true! Nobody wants to sleep with someone for work. But they are made to feel it’s the only way & “acceptable”. And for those who don’t, it’s a tough road! This has to stop! #TimesUp — Sophie Choudry (@Sophie_Choudry) April 24, 2018 -
పార్లమెంట్‌లోనూ కాస్టింగ్ కౌచ్!
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు చిత్ర పరిశ్రమను కుదిపేసిన లైంగిక దోపిడీ(కాస్టింగ్ కౌచ్) ఏదో ఒక రంగానికి పరిమితం కాలేదని, పార్లమెంటూ దానికి మినహాయింపు కాదని కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. హాలీవుడ్ మాదిరిగా ‘మీ టూ’ అని ఇండియా కూడా నినదించాల్సిన సమయం వచ్చిందన్నారు. బాలీవుడ్ నృత్య దర్శకురాలు సరోజ్‌ఖాన్ కాస్టింగ్ కౌచ్‌కు మద్దతుగా నిలవడంపై రేణుక మంగళవారం ఉదయం పై విధంగా స్పందించారు. అయితే తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో సాయంత్రం వివరణ ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తనని అవమానించడం కూడా కాస్టింగ్ కౌచ్ కిందికే వస్తుందని పేర్కొన్నారు. ‘కాస్టింగ్ కౌచ్ కేవలం సినీ పరిశ్రమకు పరిమితం కాలేదనేది ఒక చేదు నిజం. అన్ని పని ప్రదేశాల్లోనూ ఇది సాధారణమే. పార్లమెంటు కూడా కాస్టింగ్ కౌచ్‌కు మినహాయింపు అని భావించొద్దు. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన నటీమణులు కాస్టింగ్ కౌచ్‌పై ‘మీ టూ’ అంటూ తమపై జరిగిన అఘాయిత్యాలను బహిర్గతం చేస్తున్నారు. భారత్‌లో కూడా బాధితులు అలాగే గొంతెత్తాలి’ అని అన్నారు. పార్లమెంటులో కాస్టింగ్ కౌచ్ ఉందనడం ఉదయం నుంచి ప్రసార మాధ్యమాల్లో మార్మోగింది. తన వ్యాఖ్యలపై వివాదం రేగడంతో రేణుక తిరిగి సాయంత్రం వివరణ ఇచ్చారు. ‘గత పార్లమెంటు సమావేశాల్లో రాజ్యసభ సభ్యురాలైన నన్ను ప్రధాని నరేంద్ర మోదీ శూర్పణఖతో పోల్చారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజుజు నా గౌరవానికి భంగం కలిగేలా సామాజిక మాధ్యమాల్లో కొన్ని పోస్టులు పెట్టారు. ఒక మహిళగా నా హక్కులు, గౌరవానికి భంగం కలిగించారు కాబట్టి ఇది కూడా కాస్టింగ్ కౌచ్ కిందికే వస్తుంది’ అని రేణుక వివరణ ఇచ్చారు. వారికి ఉపాధి దొరుకుతోంది: సరోజ్‌ఖాన్ కాస్టింగ్ కౌచ్‌ను సరోజ్‌ఖాన్ వెనకేసుకొచ్చారు. మహిళలతో లైంగిక కోరికలు తీర్చుకున్న తరువాత వారిని సినీ పరిశ్రమ గాలికొదిలేయకుండా కనీసం జీవనోపాధి కల్పిస్తోందన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో లైంగిక దోపిడీకి వ్యతిరేకంగా నటి శ్రీరెడ్డి అర్ధ నగ్నంగా నిరసనకు దిగడంపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సరోజ్ అలా స్పందించారు. ‘కాస్టింగ్ కౌచ్ చాలా ఏళ్లుగా ఉంది. మహిళతో పడక పంచుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ప్రభుత్వంలో ఉన్న వారూ అందుకు మినహాయింపు కాదు. కేవలం సినీ పరిశ్రమనే ఎందుకు నిందిస్తారు? అది కనీసం ఉపాధి అయినా కల్పిస్తోంది కదా. మహిళలను వాడుకొని అలా వదిలేయట్లేదు కదా’ అని అన్నారు. ఆ తరువాత సరోజ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించి క్షమాపణ చెప్పారు.