పవన్ కల్యాణ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంతో శ్రీరెడ్డి వివాదం మరో మలుపు తిరిగింది. రామ్ గోపాల్ వర్మ స్వయంగా తానే ఈ కామెంట్ చేయించానని చెప్పటంతో వివాదం మరింత ముదిరింది. మెగా ఫ్యామిలీతో అంతా ఒక్కతాటిపైకి రావటంతో అభిమానుల నుంచి కూడా మద్ధుతు పెరుగుతుంది.
తాజాగా ఈ వివాదం వర్మ శిష్యుడు, దర్శకుడు పూరి జగన్నాథ్ స్పందించారు. ‘నాకు జీవితాన్ని ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బాధపడటం నాకు చాలా బాధ కలిగించింది . అతనిని ఎప్పుడూ ఇలా చూడలేదు . ఆర్జీవీ చేసిన పని నాకు నచ్చలేదు ప్రాణం ఉన్నంత వరకూ ఐ సపోర్ట్ పవన్ కల్యాణ్’ అంటూ ట్వీట్ చేశారు పూరి.
నాకు జీవితాన్ని ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బాధపడటం నాకు చాలా బాధ కలిగించింది . అతనిని ఎప్పుడూ ఇలా చూడలేదు . Rgv చేసిన పని నాకు నచ్చలేదు . ప్రాణం ఉన్నంత వరకూ I support Pawan kalyan .
— PURI JAGAN (@purijagan) 20 April 2018
పూరి వ్యాఖ్యలపై స్పందించిన రామ్ గోపాల్ వర్మ ‘మీ ఆవేదన నాకు అర్ధమైంది. నేను పోరపాటు చేశాను. ఇప్పటికే క్షమాపణ కూడా కోరాను’ అంటూ ట్వీట్ చేశారు.
I understand ur feelings ..it’s a mistake I made and I already said Sorry sir https://t.co/TCjRqNGNj3
— Ram Gopal Varma (@RGVzoomin) 20 April 2018
Comments
Please login to add a commentAdd a comment