
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై సెటైరికల్‌గా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. హీరో పవన్ కల్యాణ్ అభిమానులు తెరకెక్కిస్తున్న చిత్రానికి ‘పరాన్నజీవి’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. తాజాగా ఈ చిత్రంపై నటి శ్రీరెడ్డి స్పందించారు. తనను ఈ సినిమాలో నటించాల్సిందిగా చాలా ఒత్తిడి వచ్చిందని.. కానీ అందుకు అంగీకరించలేదని శ్రీరెడ్డి స్పష్టం చేశారు. ఎందుకంటే తనకు రామ్‌గోపాల్ వర్మ అంటే ఇష్టమని చెప్పారు. తనకు కొన్ని విలువలు ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు ఆమె ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేశారు. (పవర్ స్టార్ నుంచి ‘గడ్డి తింటావా?’)
‘వివాదస్పద చిత్రం ‘పరాన్నజీవి’లో నటించాల్సిందిగా చాలా ఒత్తిడి వచ్చింది.. కానీ నేను దానికి నో చెప్పాను. ఎందుకంటే నాకు ఆర్జీవీ అంటే ఇష్టం. నాకు కేవలం డబ్బులే కావాలనుకుంటే.. అందుకు అనేక మార్గాలు ఉన్నాయి. కానీ నేను విలువలను కలిగిఉన్నాను. నా సొంతవాళ్ల గౌరవానికి ఎప్పుడూ ఇబ్బంది కలిగించను.. ఒకవేళ వాళ్లు నన్ను ఇష్టపడ్డ, లేకపోయినా.. దానిని నేను పట్టించుకోను. పవర్‌స్టార్ సాంగ్‌కు ఆర్జీవీకి కృతజ్ఞతలు. నాకు అది చాలా నచ్చింది’ అని శ్రీరెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment