ఇదే నా హృదయపూర్వక ఆ‍హ్వానం.. ఆర్జీవీ ట్వీట్ వైరల్! | Ram Gopal Varma Tweet On Vyooham Movie Pre Release Event | Sakshi
Sakshi News home page

Ram Gopal Varma: వ్యూహం ఈవెంట్‌కు ఆ ముగ్గురికి ఆ‍హ్వానం.. ఆర్జీవీ ట్వీట్ వైరల్!

Published Fri, Dec 22 2023 4:31 PM | Last Updated on Fri, Dec 22 2023 4:39 PM

Ram Gopal Varma Tweet On Vyooham Movie Pre Release Event - Sakshi

టాలీవుడ్‌ సంచలన డైరెక్టర్‌ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం 'వ్యూహం'. దివంగత నేత  వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జీవితంలో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారో ఈ చిత్రంలో చూపించనున్నట్లు ఆర్జీవీ తెలిపారు. ఈ సినిమాలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాత్రలో తమిళ నటుడు అజ్మల్ అమీర్ పోషిస్తుండగా.. జగన్ సతీమణి వైఎస్ భారతి పాత్రలో మానస రామకృష్ణ కనిపించనుంది. రామదూత బ్యానర్‌పై దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్స్ రిలీజ్ కాగా.. ఈ నెల 29న థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఈ సందర్భంగా వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించనున్నట్లు డైరెక్టర్ ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఈనెల 23న విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు ఈవెంట్ ప్రారంభమవుతుందని పోస్ట్ చేశారు. ఈ ఈవెంట్‌కు తెదేపా అధినేత చంద్రబాబుతో పాటు నారా లోకేశ్, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను ఆహ్వానిస్తున్నట్లు ట్వీట్‌లో ప్రస్తావించారు. ఇదే హృదయపూర్వక ఆహ్వానం అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement