naralokesh
-
మేము గుడ్‌బుక్ కూడా రాసుకోవడం మొదలుపెట్టాం: వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి : రెడ్‌బుక్ అనేది ఏమైనా పెద్దపనా? ఇప్పుడు నేను చేయొద్దని చెప్పినా మా వాళ్లుకూడా బుక్స్ మెయింటెన్ చేయడం మొదలుపెడుతున్నారు. అన్యాయం చేసేవారి పేర్లను, అలాంటి అధికారుల పేర్లను రాసుకుంటున్నారు’ అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే మేము గుడ్‌బుక్ రాసుకోవడం కూడా మొదలు పెట్టామని, పార్టీ కోసం కష్టపడే వారి పేర్లను కూడా రాసుకుంటున్నామన్నారు. వారికి తప్పకుండా అవకాశాలు ఉంటాయని వైఎస్ జగన్ తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళగిరి నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలకు పూర్తి భరోసా ఇవ్వాలని భావించాం. అధికార దుర్వినియోగంతో కార్యకర్తలకు నష్టంచేస్తున్నప్పుడు కచ్చితంగా భరోసా ఇవ్వాలి. పార్టీ తోడుగా ఉంటుందనే విశ్వాసం కల్పించాలి. ఆ ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేశాం, పార్టీ పరంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నాం. అన్నిటికీ తట్టుకుని పార్టీ కార్యకర్తలకు అండగా ఉండే వ్యక్తి ఉండాలని భావించి వేమారెడ్డిని ఇన్ఛార్జిగా నియమించాం.రాష్ట్రంలో పరిస్థితులు అత్యంత దారుణం రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. ఐదేళ్లపాలనలో ప్రతి ఇంటికీ మనం మంచిచేశాం. ప్రతి ఇంటికీ గర్వంగా తలెత్తుకుని వెళ్లగలం. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చాం. మేనిఫెస్టోలో చెప్పిన హామీలను నిలబెట్టే పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. బడ్జెట్‌తోపాటు సంక్షేమ క్యాలండర్‌కూడా విడుదలచేసేవాళ్లం. ప్రతినెలలో క్రమం తప్పకుండా బటన్ నొక్కి పథకాలు అమలు చేశాం. ఇది కేవలం ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలోనే జరిగిందిసంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు అందించాంఅనేక సంక్షోభాలను ఎదుర్కొన్నాం. కోవిడ్ లాంటి మహా సంక్షోభాన్ని ఎదుర్కొన్నాం. రెండేళ్లపాటు కోవిడ్‌తో యుద్ధం చేశాం.రాబడులు తగ్గిపోయాయి, ఖర్చులు విపరీతంగా పెరిగాయి.అయినా ఏరోజుకూడా సాకులు చూపకుండా పథకాలు అమలు చేశాం.గడప గడపకు పెన్షన్స్కూళ్లు, ఆస్పత్రులను మార్చాం.మంచి వైద్యాన్ని గ్రామాలకే తీసుకు వచ్చాం.విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో గొప్ప మార్పులు తీసుకు వచ్చాం.ఎప్పుడూ లేని విధంగా ఉచిత పంటలబీమాను అమలు చేశాం. వివక్ష లేకుండా, రాజకీయాలు చూడకుండా పథకాలు ఇచ్చాం. మనకు ఓటు వేయని వారికి కూడా అర్హత ఆధారంగా పథకాలు ఇచ్చాం.ప్రతి ఇంటి గడపవద్దకే పెన్షన్, రేషన్లే కాకుండా పథకాలూ అందించాందిశయాప్ ద్వారా దిశయాప్ ద్వారా అక్కచెల్లెమ్మలకు భద్రత కల్పించాం. 10 నిమిషాల్లోపే పోలీసులు వచ్చి భద్ర కల్పించేలా చేశాం. ఇప్పుడు పరిస్థితులు ఏంటో మీరు చూడండి. ప్రతి అంశంలోనూ తిరోగమనం కనిపిస్తుంది. వివక్ష, పక్షపాతం కనిపిస్తున్నాయి. ప్రతి ఇంట్లోనూ దీనిపై ఇప్పుడు చర్చ జరుగుతోందిప్రభుత్వం ఎందుకు ఉందో అర్థం కావడంలేదుజగన్ పలావు పెట్టాడు.. చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు. ఇప్పుడు పలావూ.. పోయింది.. బిర్యానీ పోయిందనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేస్తున్నారు.ఆరోగ్యశ్రీ అటకెక్కింది.. బిల్లులు చెల్లించడంలేదు.ఆరోగ్య ఆసరాను పూర్తిగా ఎగరగొట్టారు. కొత్త మెడికల్ కాలేజీలన్నీ వెనకడుగు. ప్రభుత్వం ఎందుకు ఉందో అర్థం కావడంలేదుకష్టాలు ఎక్కువ కాలం ఉండవుపార్టీని మరింత బలోపేతం చేయాలి. సంస్థాగతంగా అత్యంత బలంగా ఉండాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు ఉంటాయి. కష్టాలనుంచే నాయకులు పుడతారు. నన్ను16 నెలలు జైల్లో పెట్టి తీవ్రంగా వేధించారు. అయినా ప్రజల ఆశీస్సులతో మనం ముందడుగు వేశాం. కష్టాలు ఎక్కువ కాలం ఉండవు.రెడ్‌బుక్ అనేది ఏమైనా పెద్దపనా?రెడ్‌బుక్ అనేది ఏమైనా పెద్దపనా?. ఎప్పుడూ లేని దుష్టసంప్రదాయాన్ని చంద్రబాబు ప్రభుత్వం తీసుకు వచ్చింది. ఇప్పుడు నేను చేయొద్దని చెప్పినా మా వాళ్లుకూడా బుక్స్ మెయింటెన్ చేయడం మొదలుపెడుతున్నారు. అన్యాయం చేసేవారి పేర్లను, అలాంటి అధికారుల పేర్లను రాసుకుంటున్నారు. అదే సమయంలో మేం గుడ్‌బుక్ కూడా రాసుకోవడం మొదలుపెట్టాం. పార్టీకి మంచి చేసినవారిని, కష్టపడే వారి పేర్లను కూడా రాసుకుంటున్నాం. వారికి తప్పకుండా అవకాశాలు, ప్రమోషన్లు ఉంటాయి. -
సలార్ హిట్.. పవన్ కల్యాణ్‌ను ఆడుకుంటున్న నెటిజన్లు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం 'సలార్'. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు రివ్యూవర్స్‌తో పాటు నెటిజన్ల నుంచి కూడా పాజిటివ్ టాక్ వస్తుంది. ప్రభాస్ కటౌట్‌ను కరెక్ట్‌గా సలార్ చిత్రంలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఉపయోగించుకున్నాడని నెట్టింట వైరల్ అవుతుంది. యాక్షన్ సీన్స్‌లో ఊర మాస్ లుక్‌లో ఉన్న ప్రభాస్‌ను డైరెక్టర్ ఎలివేట్ చేసిన తీరుకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలో మొదట ప్రభాస్ ఫ్యాన్ ఒకరు మన డైనోసార్‌ను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చాలా ఉపయోగించుకున్నాడని కామెంట్ చేశారు. తర్వాత తమ అభిమాన హీరోల టాలెంట్‌ను ఏ డైరెక్టర్ ఇతరుల కంటే తెరపై బాగా ఉపయోగించుకున్నారో చెబుతూ రకరకాలుగా నెటిజన్లు కామెంట్లు చేస్తూ వచ్చారు. ఇదే విషయాన్ని టాలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ కూడా షేర్ చేశారు. అందులో అన్నీ సినిమాటిక్‌గా ఉన్నా పవన్ కల్యాణ్‌కు మాత్రం కొంచెం పొలిటికల్ టచ్ ఇచ్చారు. ► ప్రభాస్‌ను కరెక్ట్‌గా వాడుకుంది రాజమౌళి, ప్రశాంత్ నీల్ ► జూ ఎన్టీఆర్‌ను బాగా వెండితెరపై ఉపయోగించుకుంది వీవీ వినాయక్, రాజమౌళి ► అల్లు అర్జున్ను సూపర్‌గా వాడుకుంది సుకుమార్, త్రివిక్రమ్ ► ప్రిన్స్ మహేష్ బాబును బాగా వాడుకుంది పూరీ జగన్నాథ్ ► పవన్ కల్యాణ్‌ను ఒక రేంజ్లో వాడుకుంది మాజీ సీఎం చంద్రబాబు ఇలా తమ అభిమాన హీరోల గురించి చెబుతూ ఈ పోస్ట్‌ను నెట్టింట వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సలార్ రివ్యూలతో పాటు ఈ పోస్ట్ కూడా భారీగా వైరల్ అవుతుంది. పొలిటికల్ గేమ్‌లో పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు ఒక రేంజ్లో వాడుకుంటున్నాడని అర్థం వచ్చేలా వారు తెలుపుతున్నారు. పవన్‌ను ఉపయోగించుకోవడంలో చంద్రబాబుతో ఏ డైరెక్టర్ పోటీ పడలేడని వారు తెలుపుతున్నారు. ఈ విషయంలో టీడీపీ, జనసేన అభిమానులు కూడా కరెక్టే కదా..! అని చెప్పడం విశేషం. లోకేష్ వ్యాఖ్యలే నిదర్శనం చినబాబు నారా లోకేష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అక్కడ 2024లో జనసేన, టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే ఎవరు సీఎం అనే ప్రశ్న ఏదురైంది. ఒక క్షణం ఆలోచించకుండా చంద్రబాబు మాత్రమే సీఎం అని చెప్పారు. పదవి విషయంలో నో షేరింగ్ అని క్లారిటీ ఇచ్చేశాడు. ఇంత క్లారిటీగా చినబాబు ఉంటే పెదబాబు (పవన్ కల్యాణ్) మాత్రం ఏ క్లారిటీతో ఉన్నాడో ఇప్పటికీ చెప్పలేదు. సీఎం పదవి విషయంలో షేరింగ్ లేకుంటే దేనికోసం టీడీపీతో పవన్ కల్యాణ్ చేతులు కలిపాడు..? సభ ఏదైనా సరే పవన్ కనిపిస్తే చాలు సీఎం.. సీఎం.. అంటూ కేకలు పెడుతున్న ఆయన ఫ్యాన్స్ మానసిక పరిస్థితి ఎలా ఉందో..? ఇప్పటికైనా అర్థం అయిందా..? చంద్రబాబు వాడకం ఏ రేంజ్లో ఉంటుందో..? ఆయన వాడకం మొదలు పెడితే మాటలు ఉండవ్ అంటూ నెటిజన్లు డైలాగ్స్ పేలుస్తున్నారు. 🙏 https://t.co/9Mw5lDJ11C — Ram Gopal Varma (@RGVzoomin) December 22, 2023 -
ఇదే నా హృదయపూర్వక ఆహ్వానం.. ఆర్జీవీ ట్వీట్ వైరల్!
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం 'వ్యూహం'. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జీవితంలో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారో ఈ చిత్రంలో చూపించనున్నట్లు ఆర్జీవీ తెలిపారు. ఈ సినిమాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో తమిళ నటుడు అజ్మల్ అమీర్ పోషిస్తుండగా.. జగన్ సతీమణి వైఎస్ భారతి పాత్రలో మానస రామకృష్ణ కనిపించనుంది. రామదూత బ్యానర్‌పై దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్స్ రిలీజ్ కాగా.. ఈ నెల 29న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు డైరెక్టర్ ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఈనెల 23న విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు ఈవెంట్ ప్రారంభమవుతుందని పోస్ట్ చేశారు. ఈ ఈవెంట్‌కు తెదేపా అధినేత చంద్రబాబుతో పాటు నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఆహ్వానిస్తున్నట్లు ట్వీట్లో ప్రస్తావించారు. ఇదే హృదయపూర్వక ఆహ్వానం అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు. VYOOHAM pre release event is tmrw the 23rd at 5 pm in Vijaywada at Indira Gandhi muncipal stadium My heartfelt invitation to sri @ncbn , @naralokesh and @PawanKalyan to grace the occasion 🙏🙏🙏 pic.twitter.com/jabNUkU4HE — Ram Gopal Varma (@RGVzoomin) December 22, 2023 -
‘చంద్రబాబు, లోకేశ్‌ను తరిమికొడతాం’
తాడికొండ: దళితులంటే చిన్నచూపుతో మాట్లాడుతున్న చంద్రబాబు, లోకేశ్‌ను రాష్టం నుంచి తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బహుజన పరిరక్షణ సమితి నాయకులు హెచ్చరించారు. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు ఆదివారం 931వ రోజుకు చేరాయి. పలువురు నాయకులు మాట్లాడుతూ.. పాదయాత్ర చేస్తున్న లోకేశ్ ప్రజా సమస్యలపై మాట్లాడకుండా దళితులను కించపరిచేలా మాట్లాడడం సిగ్గుచేటని, దళిత బహుజనులు తమకు ఓట్లేయడం లేదనే అక్కసుతో చంద్రబాబు, లోకేశ్ అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో చంద్రబాబు దళితుడిగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా... అంటే, ఇప్పుడు లోకేశ్ దళితుల గురించి అసభ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాదయాత్రలో లోకేశ్‌కు ప్రతి గ్రామంలో ముందు ఎదురయ్యేది జగనన్న కాలనీలేనని, వాటిని చూసిన ప్రతిసారి వెన్నులో వణుకు మొదలై దళితులు, బహుజనులు తమను ఎక్కడ విస్మరిస్తారో అనే భయం పట్టుకుని అసహనంతో మాట్లాడుతున్నాడన్నారు. నాయకులు మాదిగాని గురునాథం, నూతక్కి జోషి, పులి దాసు, న్యాయవాది పెరికే వరప్రసాద్, ఈపూరి ఆదాం పాల్గొన్నారు. -
మందు తాగండి.. వెంట నడవండి..!
శ్రీ సత్యసాయి: యువగళం పాదయాత్రకు వచ్చిన తెలుగు తమ్ముళ్లు మద్యంమత్తులో జోగారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో మండలకేంద్రంలో మద్యం దుకాణాలు ఆదివారం కళకళలాడాయి. బత్తలపల్లిలో రెండు మద్యం దుకాణాలు ఉండగా ఒక్కరోజే దాదాపు రూ.11లక్షల వరకు వ్యాపారం జరిగింది. మొదటి దుకాణంలో మామూలుగా ఆదివారం రోజుల్లో రూ.2.50 లక్షలయ్యేది. లోకేష్ రాకతో అది రూ.6 లక్షలకు చేరుకుంది. రెందో దుకాణంలో మామూలు రోజుల్లో రూ.3 లక్షలు వ్యాపారం జరుగుతుండగా, తమ్ముళ్ల మద్యం దాహానికి రూ.5 లక్షలకు చేరుకుంది. -
గన్ షాట్ : మంగళగిరిలో లోకేష్ పరిస్థితి దారుణంగా ఉందా..?
-
పెగాసస్ గుట్టు తేల్చనున్న ఏపీ ప్రభుత్వం
-
టీడీపీకి వణుకు పెగాసస్ పై హౌస్ కమిటీ విచారణ ప్రారంభం
-
‘టీడీపీ, బీజేపీ మధ్య చీకటి తెరలు తొలగిపోయాయి’
సాక్షి, విజయవాడ: ప్రత్యేక హోదా అంశానికి తీవ్ర ద్రోహం చేసింది చంద్రబాబేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఉందా అంటూ ప్రశ్నించారు. చదవండి: AP: వైద్య, ఆరోగ్య శాఖలో మరో 2,588 పోస్టులు ‘‘నాడు ప్యాకేజీకి ఒప్పుకుని పండగ చేసుకుంది చంద్రబాబు కాదా?. హోదా కోసం వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామా చేస్తే టీడీపీ ఎందుకు చేయలేదు?. ఇప్పుడు హోదా గురించి మాట్లాడేందుకు చంద్రబాబుకు సిగ్గుందా?. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబే. లోకేష్ ఏ బ్రాండ్ తాగుతున్నాడో అర్థం కావడం లేదు. ట్విట్టర్ ఉంది కదా అని ఏదంటే అది మాట్లాడుతున్నాడు. హోదా అంశాన్ని జీవీఎల్ తొలగించేలా చేయడం అశ్చర్యానికి గురి చేసింది. చంద్రబాబు కలిసి జీవీఎల్ చేశారా?. హోదా అంశం తొలగింపుతో టీడీపీ, బీజేపీ మధ్య ఉన్న చీకటి తెరలు తొలగిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల జీవీఎల్‌కు ఉన్న బాధ్యత ఏంటని’’ మంత్రి కన్నబాబు ప్రశ్నించారు. -
లోకేశ్ ప్రచారం.. డబ్బు పంపిణీ..
సాక్షి, తిరుపతి: కుప్పం మునిసిపల్ ఎన్నికల్లో ఓటమి భయం వెన్నాడుతుండటంతో తెలుగుదేశం నేతలు అన్ని అడ్డదారులు తొక్కుతున్నారు. ఎలాగైనా కుప్పంలో గెలవాలని చంద్రబాబు, లోకేశ్.. తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పోలింగ్ సమయం సమీపిస్తుండడంతో ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికలప్పుడే కుప్పంలో ప్రచారానికి రాకుండా గెలిచిన చంద్రబాబు.. ఇప్పుడు మునిసిపల్ ఎన్నికల్లో ప్రచారం చేశారు. శుక్రవారం లోకేశ్ ప్రచారం చేస్తున్నారు. లోకేశ్ గురువారం రాత్రి డబ్బు సంచులతో కుప్పం చేరుకున్నారనే ప్రచారం సాగుతోంది. లోకేశ్ వచ్చిన గంట తరువాత డబ్బుల పంపిణీ మొదలుపెట్టారు. ఓటర్ల బంధువులు, మహిళల ద్వారా డబ్బు పంపిణీ చేస్తున్నారు. డబ్బులు ఇచ్చే సమయంలో ఒకరు ఇంట్లోకి వెళ్లి మరొకరు బయట కాపలా ఉంటున్నారు. లోనికి వెళ్లిన వ్యక్తి.. మహిళల చేతిలో డబ్బులు పెట్టి ప్రమాణం చేయించుకుని వస్తున్నారు. శుక్రవారం లోకేశ్ ప్రచారం ఒక వైపు సాగుతుండగా మరోవైపు నగదు పంపిణీ చేపట్టారు. పోలీసులు లోకేశ్ ప్రచారం వైపే ఉంటారు కాబట్టి మరోవైపు ఇళ్లకు వెళ్లి డబ్బు అందజేస్తున్నారు. ఓటరు టీడీపీ సానుభూతిపరులైతే రూ.2 వేలు, మిగతావారైతే రూ.5 వేలు చొప్పున పంపిణీ చేస్తున్నారు. ఉమ్మడి కుటుంబం ఉంటే ఒకేసారి పెద్ద మొత్తంలో ఇచ్చేస్తున్నారు. కొందరికి ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా బదిలీ చేస్తున్నారు. విచ్చలవిడిగా మద్యం పంపిణీ కుప్పంలో కర్ణాటక మద్యం పంపిణీ చేయాలని టీడీపీ నాయకులకు చంద్రబాబు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే కర్ణాటక, తమిళనాడు నుంచి భారీగా మద్యం తెప్పించి పంపిణీ చేశారు. గురువారం రాత్రి రాష్ట్ర సరిహద్దుల్లో కర్ణాటక పరిధిలో ఉన్న దుకాణాల ద్వారా భారీగా కొనుగోలు చేసినట్లు టీడీపీ నాయకులే చెబుతున్నారు. బెంగళూరులో స్థిరపడిన టీడీపీ ముఖ్యనేతలు కర్ణాటక సరిహద్దులో ఉండే మద్యం దుకాణాలను బినామీ పేర్లతో దక్కించుకున్నారు. కుప్పం నియోజకవర్గంలో ఆరు మద్యం దుకాణాలుంటే, సరిహద్దులో కర్ణాటక పరిధిలో తొమ్మిది దుకాణాలున్నాయి. ఆ మద్యం దుకాణాల పరిసరాల్లో ఒక్క గ్రామం కూడా లేకపోవడం గమనార్హం. -
‘జూమ్‌లో చంద్రబాబు.. ట్విట్టర్లో లోకేష్’
సాక్షి, కృష్ణా జిల్లా: అన్నివర్గాల వారికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌దేనని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులు,పేదలు, మహిళలు, సామాజిక తరగతుల సంక్షేమమే లక్ష్యంగా సుపరిపాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. ‘‘వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నేడు సీఎం ఇన్‌ఫుట్ సబ్సిడీ అందించారు. ఇప్పటి వరకు దేశంలో ఏ ప్రభుత్వం ఇంత త్వరగా పరిహారం ఇవ్వలేదు. హైదరాబాద్‌లో కూర్చొని జూమ్ యాప్‌లో చంద్రబాబు.. ట్విట్టర్లో ఆయన కుమారుడు లోకేష్ రైతులపై కపట ప్రేమ చూపిస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా, రూ.3,600 కోట్లతో ధరల స్థిరీకరణ ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్‌కు దక్కుతుంది. (చదవండి: వైఎస్సార్ పంటల బీమాను ప్రారంభించిన సీఎం జగన్) చంద్రబాబు.. ఆయన తోక పార్టీలకు రాష్ట్రం సర్వనాశనం అయిన పర్వాలేదు. 29 గ్రామాలతో కూడిన అమరావతి ఉంటే చాలు. మిగిలిన ప్రాంతాలను పట్టించుకోకుండా తమ సామాజికవర్గానికి మేలు జరిగితే చాలనే రీతిలో నీచ రాజకీయం చేస్తున్నారు. డిసెంబర్ 25న రాష్ట్రంలోని 30 లక్షల ఇళ్ల స్థలాలను పేదలకు పంపిణీ చేస్తాం. ఈ ఏడాది మార్చి 30 నే ఇవ్వాలని నిర్ణయించినప్పటికి 25కోట్లు ఖర్చు పెట్టి కోర్టుల ద్వారా స్టే తెచ్చిన దుర్మార్గుడు చంద్రబాబు’’ అంటూ ఆయన దుయ్యబట్టారు. సంక్రాంతి పండుగ రోజున ఎస్టీ,ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఓబీసీ యువకులకు ఆయా కార్పొరేషన్ల ద్వారా 9,260 సబ్సిడీ వాహనాలను అందచేస్తామని’’ కొడాలి నాని తెలిపారు (చదవండి: అగ్రి గోల్డ్ బాధితులకు తీపి కబురు) -
అంతా హడావుడే!
కర్నూలు(అర్బన్): పనులు పూర్తి కాకుండానే నూతన భవనం నుంచి జిల్లా పరిషత్ పాలన ప్రారంభమైంది. చైర్మన్ మెప్పు పొందేందుకు ఓ అధికారి చేసిన హడావుడి కారణంగా అధికారులు, సిబ్బంది అవస్థ పడాల్సి వచ్చింది. రూ.3.67 కోట్లతో జెడ్పీ నూతన భవనం నిర్మించారు. దీన్ని గత నెల తొమ్మిదిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. అయితే.. ఈ భవనంలో అధికారులు, ఉద్యోగులు కూర్చునేందుకు అవసరమైన ఫర్నీచర్, పాలన నిర్వహణకు తగినన్ని కంప్యూటర్లు ఏర్పాటు చేయలేదు. కంప్యూటర్ల నిర్వహణకు సంబంధించి బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు కూడా ఇంకా తీసుకోలేదు. జెడ్పీ చైర్మన్, సీఈఓ, డిప్యూటీ సీఈఓ, ఏఓ చాంబర్లతో పాటు సందర్శకుల గదిలో ఫ్యాన్లు, ఏసీలు బిగించలేదు. సందర్శకులు కూర్చుకునేందుకు అవసరమైన కుర్చీలు లేవు. ఈ భవనంలోనే మినీ మీటింగ్ హాలు ఏర్పాటు చేశారు. అందులో ఒక్క కుర్చీ కూడా లేదు. భవనం చుట్టూ ప్రహరీ నిర్మాణం పెండింగ్‌లో ఉంది. మొత్తమ్మీద దాదాపు 40 శాతం పనులు పెండింగ్‌లో ఉండగానే సోమవారం నుంచి ఇక్కడ కార్యకలాపాలు మొదలుపెట్టారు. ఈ నెల 13 (సోమవారం) జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ పుట్టినరోజు కావడంతో ఓ అధికారి ఆయన మెప్పు పొందేందుకు ఇదే రోజు నూతన భవనంలోకి మారాలని పట్టుబట్టి సిబ్బందిని ఉరుకులు, పరుగులు పెట్టించినట్లు విమర్శలొస్తున్నాయి. సొంత ఖర్చుతో సరంజామా తరలింపు పాత భవనంలోని కంప్యూటర్లు, బీరువాలు, ఫైళ్లు, ఫర్నీచర్‌ను నూతన భవనంలోకి తరలించేందుకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాల్సి ఉంది. అయితే.. ఎలాంటి బడ్జెట్ కేటాయించకపోగా, కచ్చితంగా 13వ తేదీన నూతన భవనంలోకి షిఫ్ట్ కావాలని ఆదేశాలు జారీ చేయడంతో సంబంధిత సెక్షన్లకు చెందిన ఉద్యోగులు రెండవ శనివారం, ఆదివారం సెలవు దినాల్లో కూడా పనిచేశారు. తమ సొంత ఖర్చులతో ఫర్నీచర్, బీరువాలు, ఫైళ్లను నూతన భవనంలోకి మార్చుకున్నట్లు తెలుస్తోంది. పాలనకు వారం రోజుల విరామం! నూతన భవనంలో ఇంకా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు తీసుకోకపోవడం, కంప్యూటర్లు అమర్చకపోవడం వల్ల మరో వారం రోజుల వరకు జెడ్పీ పాలనకు అనధికార విరామం ప్రకటించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పీఎఫ్, ఎస్టాబ్లిష్మెంట్, అకౌంట్స్ తదితర విభాగాల్లో విద్యుత్, ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వ పాలన అంతా ప్రస్తుతం ఆన్లైన్లోనే సాగుతున్న నేపథ్యంలో నూతన భవనం నుంచి జెడ్పీ పాలన సజావుగా సాగేందుకు మరో వారం రోజులు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. జెడ్పీలో అన్ని సెక్షన్లలో 72 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి అవసరమైన ఫర్నీచర్, కంప్యూటర్లు లేకపోవడంతో పనుల్లో తీవ్ర జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షలు వెచ్చిస్తే తప్ప పూర్తి స్థాయిలో వసతులు కల్పించలేమనే భావన అధికారుల్లో వ్యక్తమవుతోంది. ఫర్నీచర్ వచ్చేస్తోంది ఫర్నీచర్ రెండు రోజుల్లో వచ్చేస్తుంది. ప్రస్తుతం పలు విభాగాల్లో విద్యుత్, బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు ఇస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో అన్ని పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అవసరమైన కంప్యూటర్ల కొనుగోలకు చర్యలు చేపట్టాం. – ఎం.విశ్వేశ్వరనాయుడు, జిల్లా పరిషత్ సీఈఓ -
ఆది అనుచరులకు భోజ్యం!
సాక్షి ప్రతినిధి కడప: ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే బహిరంగ మార్కెట్లో తక్కువ రేటుకు కందులు లభిస్తున్నాయి. కాగా కందుల కొనుగోలు గడువు ముగిసింది. నిల్వ ఉన్నవి ప్రభుత్వం కొనుగోలు చేస్తే అధిక ఆదాయం గడించవచ్చు. అదే ఆలోచన మంత్రి ఆదినారాయణరెడ్డి అనుచరులకు తట్టింది. మార్క్‌ఫెడ్ ద్వారా కందులు కొనుగోలు చేయాలని ఒత్తిడి పెంచారు.అమరావతి స్థాయిలో చినబాబు నుంచి పైరవీలు చేయించారు. మే 19కే గడువు ముగిసినా జమ్మలమడుగు నియోజకవర్గంలో మాత్రమే 1500 క్వింటాళ్లు కొనుగోలు చేసేందుకు అనుమతులిచ్చారు. వెరసి దాదాపు రూ.30లక్షలు ప్రజాధనం దోపిడీ చేసిన వైనమిది. జిల్లాలో 22,120 ఎకరాలల్లో కందిపంట సాగుచేశారు. జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 77,420 క్వింటాళ్ల దిగుబడి ఉన్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కందులు క్వింటా రూ.5,450లతో తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి19 నుంచి మే19వరకు మూడునెలలు పాటు సేకరించింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 60,131 క్వింటాళ్లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. తక్కినవి రైతుల అవసరాల రీత్యా కొన్ని, నిల్వ రూపంలో మరికొన్ని ఉండిపోయాయి. కాగా ప్రస్తుతం కందులు క్వింటా ధర రూ.3600 మాత్రమే బహిరంగ మార్కెట్లో పలుకుతోంది. ప్రభుత్వం రూ.5,450తో కొనుగోలు చేసిన నేపథ్యంలో రూ.1850 క్వింటాపై తేడా ఉంది. ఈనేపథ్యంలో మంత్రి ఆదినారాయణరెడ్డి అనుచరులు దళారుల అవతారమెత్తారు. గడువు ముగిసినా తాము ప్రభుత్వంతో కొనుగోలు చేయించే చర్యలు చేపడతాం, క్వింటాకు రూ.1000కి మేము తీసుకుంటాం, తక్కిన మొత్తం మీకు అప్పగిస్తాం, మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామనే తెరవెనుక ఒప్పందానికి వచ్చారు. ముందుగా 6వేల క్వింటాళ్లు సమీకరించినట్లు సమాచారం. వీటిని మునపటి తేదీలతో కొనుగోలు చేసినట్లు రికార్డులు సవరించాలనే స్థానిక అధికార యంత్రాంగంపై ఒత్తిడి తీసుకవచ్చారు. ఇప్పట్లో తాము ఇలాంటి సాహసం చేయలేమని ఉన్నతస్థాయిలో ఏమైనా చేసుకోండి, మావల్ల కాదంటూ అధికారులు చేతులెత్తేశారు. చినబాబు డైరెక్షన్..కొనుగోలుకు శ్రీకారం.. గడువు ముగిసిన తర్వాత కందులు కొనుగోలు చేయడం సాధ్యపడదని మార్క్‌ఫెడ్ జిల్లాస్థాయి అధికారులు వెల్లండిచిన తర్వాత వ్యవహారం రాజధానికి చేరింది. కమిషనర్ స్థాయిలో నిబంధనలు అడ్డువస్తాయని వివరించడంతో ముఖ్యమంత్రి తనయుడు మంత్రి నారాలోకేష్ జోక్యం అనివార్యమైనట్లు సమాచారం. కమిషనర్‌పై మంత్రి లోకేష్ ఒత్తిడి పెంచి ఒప్పించినట్లు తెలుస్తోంది. మంత్రి ఆది సూచించిన రైతులు (మంత్రి అనుచరులు) కందులు కొనుగోలు చేయాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. సీఎం తర్వాత స్థానంలో ఉన్న లోకేష్ ఆదేశాలతో మార్క్‌ఫెడ్ అధికారులు నిబంధనలు విరుద్ధమైనప్పటికీ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. జమ్మలమడుగు, పెద్దముడియం మండలాలకు చెందిన రైతుల పేరిట కొనుగోలు చేపట్టారు. ప్రస్తుతం 1500 క్వింటాళ్లు కొనుగోలుకు అనుమతులు ఇచ్చారు. ఆమేరకు జమ్మలమడుగు మార్కెట్ యార్డులో సోమవారం అధికార యంత్రాంగం కందులు సేకరించింది. మంత్రి ఆది అనుచరులను సంతృప్తి పర్చేందుకు ప్రజాధనానికి కన్నం వేశారని పలువురు ఆరోపిస్తున్నారు. దాదాపు రూ.30లక్షలు అనుచరులకు దోచిపెట్టే చర్యలకు పాల్పడ్డారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ఎండీ నుంచి అనుమతులు తీసుకున్నాం మార్క్ఫెడ్శాఖ రాష్ట్ర మేనేజింగ్ డైరక్టర్ మ«ధుసూదన్రెడ్డి నుంచి అనుమతులు తీసుకున్నాం. జమ్మలమడుగు ఏరియాలో ఈ ఏడాది మార్చి నెలలో రైతులు కందులు విక్రయించుకోలేకపోయారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రం నిలిపి వేసే సమయంలో వారు మార్క్‌ఫెడ్ సంస్థకు అమ్ముకోలేకపోయారు. అందువల్ల అనుమతులు తీసుకుని తూకాలు వేస్తున్నాం. –రమేష్, జిల్లా మేనేజర్, మార్క్పెఢ్ సంస్థ, కడప -
స్థానికులకు ఉద్యోగాలంటే ఐటీ కంపెనీలే రావు
-
నారా లోకేష్ ఇష్టా రాజ్యం!
-
చంద్రబాబుకు బదులు లోకేష్ పాలన..
ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దేవినేని నెహ్రు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ... ప్రభుత్వం అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతునొక్కే ప్రయత్నం చేస్తోందన్నారు. చంద్రబాబు నాయుడు, టీడీపీ ఎమ్మెల్యేలంతా వీధి రౌడిల్లా ప్రవర్తిస్తున్నారని దేవినేని నెహ్రు వ్యాఖ్యానించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అవినీతిపరుడంటూ అసెంబ్లీలో పదేపదే మాట్లాడటం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమని దేవినేని నెహ్రు అన్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబుకు బదులుగా ఆయన కొడుకు లోకేష్ పాలిస్తున్నాడని ఆయన విమర్శించారు.