పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం 'సలార్'. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు రివ్యూవర్స్‌తో పాటు నెటిజన్ల నుంచి కూడా పాజిటివ్ టాక్ వస్తుంది. ప్రభాస్ కటౌట్‌ను కరెక్ట్‌గా సలార్ చిత్రంలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఉపయోగించుకున్నాడని నెట్టింట వైరల్ అవుతుంది. యాక్షన్ సీన్స్‌లో ఊర మాస్ లుక్‌లో ఉన్న ప్రభాస్‌ను డైరెక్టర్ ఎలివేట్ చేసిన తీరుకు అభిమానులు ఫిదా అవుతున్నారు.
ఈ క్రమంలో మొదట ప్రభాస్ ఫ్యాన్ ఒకరు మన డైనోసార్‌ను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చాలా ఉపయోగించుకున్నాడని కామెంట్ చేశారు. తర్వాత తమ అభిమాన హీరోల టాలెంట్‌ను ఏ డైరెక్టర్ ఇతరుల కంటే తెరపై బాగా ఉపయోగించుకున్నారో చెబుతూ రకరకాలుగా నెటిజన్లు కామెంట్లు చేస్తూ వచ్చారు. ఇదే విషయాన్ని టాలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ కూడా షేర్ చేశారు. అందులో అన్నీ సినిమాటిక్‌గా ఉన్నా పవన్ కల్యాణ్‌కు మాత్రం కొంచెం పొలిటికల్ టచ్ ఇచ్చారు.
► ప్రభాస్‌ను కరెక్ట్‌గా వాడుకుంది రాజమౌళి, ప్రశాంత్ నీల్
► జూ ఎన్టీఆర్‌ను బాగా వెండితెరపై ఉపయోగించుకుంది వీవీ వినాయక్, రాజమౌళి
► అల్లు అర్జున్‌ను సూపర్‌గా వాడుకుంది సుకుమార్, త్రివిక్రమ్
► ప్రిన్స్ మహేష్ బాబును బాగా వాడుకుంది పూరీ జగన్నాథ్
► పవన్ కల్యాణ్‌ను ఒక రేంజ్‌లో వాడుకుంది మాజీ సీఎం చంద్రబాబు
ఇలా తమ అభిమాన హీరోల గురించి చెబుతూ ఈ పోస్ట్‌ను నెట్టింట వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సలార్ రివ్యూలతో పాటు ఈ పోస్ట్ కూడా భారీగా వైరల్ అవుతుంది. పొలిటికల్ గేమ్‌లో పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు ఒక రేంజ్‌లో వాడుకుంటున్నాడని అర్థం వచ్చేలా వారు తెలుపుతున్నారు. పవన్‌ను ఉపయోగించుకోవడంలో చంద్రబాబుతో ఏ డైరెక్టర్ పోటీ పడలేడని వారు తెలుపుతున్నారు. ఈ విషయంలో టీడీపీ, జనసేన అభిమానులు కూడా కరెక్టే కదా..! అని చెప్పడం విశేషం.
లోకేష్ వ్యాఖ్యలే నిదర్శనం
చినబాబు నారా లోకేష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అక్కడ 2024లో జనసేన, టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే ఎవరు సీఎం అనే ప్రశ్న ఏదురైంది. ఒక క్షణం ఆలోచించకుండా చంద్రబాబు మాత్రమే సీఎం అని చెప్పారు. పదవి విషయంలో నో షేరింగ్ అని క్లారిటీ ఇచ్చేశాడు. ఇంత క్లారిటీగా చినబాబు ఉంటే పెదబాబు (పవన్ కల్యాణ్) మాత్రం ఏ క్లారిటీతో ఉన్నాడో ఇప్పటికీ చెప్పలేదు.
సీఎం పదవి విషయంలో షేరింగ్ లేకుంటే దేనికోసం టీడీపీతో పవన్ కల్యాణ్ చేతులు కలిపాడు..? సభ ఏదైనా సరే పవన్ కనిపిస్తే చాలు సీఎం.. సీఎం.. అంటూ కేకలు పెడుతున్న ఆయన ఫ్యాన్స్ మానసిక పరిస్థితి ఎలా ఉందో..? ఇప్పటికైనా అర్థం అయిందా..? చంద్రబాబు వాడకం ఏ రేంజ్‌లో ఉంటుందో..? ఆయన వాడకం మొదలు పెడితే మాటలు ఉండవ్ అంటూ నెటిజన్లు డైలాగ్స్ పేలుస్తున్నారు.
— Ram Gopal Varma (@RGVzoomin) December 22, 2023
Comments
Please login to add a commentAdd a comment