N. Chandrababu Naidu
-
సలార్ హిట్.. పవన్ కల్యాణ్‌ను ఆడుకుంటున్న నెటిజన్లు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం 'సలార్'. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు రివ్యూవర్స్‌తో పాటు నెటిజన్ల నుంచి కూడా పాజిటివ్ టాక్ వస్తుంది. ప్రభాస్ కటౌట్‌ను కరెక్ట్‌గా సలార్ చిత్రంలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఉపయోగించుకున్నాడని నెట్టింట వైరల్ అవుతుంది. యాక్షన్ సీన్స్‌లో ఊర మాస్ లుక్‌లో ఉన్న ప్రభాస్‌ను డైరెక్టర్ ఎలివేట్ చేసిన తీరుకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలో మొదట ప్రభాస్ ఫ్యాన్ ఒకరు మన డైనోసార్‌ను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చాలా ఉపయోగించుకున్నాడని కామెంట్ చేశారు. తర్వాత తమ అభిమాన హీరోల టాలెంట్‌ను ఏ డైరెక్టర్ ఇతరుల కంటే తెరపై బాగా ఉపయోగించుకున్నారో చెబుతూ రకరకాలుగా నెటిజన్లు కామెంట్లు చేస్తూ వచ్చారు. ఇదే విషయాన్ని టాలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ కూడా షేర్ చేశారు. అందులో అన్నీ సినిమాటిక్‌గా ఉన్నా పవన్ కల్యాణ్‌కు మాత్రం కొంచెం పొలిటికల్ టచ్ ఇచ్చారు. ► ప్రభాస్‌ను కరెక్ట్‌గా వాడుకుంది రాజమౌళి, ప్రశాంత్ నీల్ ► జూ ఎన్టీఆర్‌ను బాగా వెండితెరపై ఉపయోగించుకుంది వీవీ వినాయక్, రాజమౌళి ► అల్లు అర్జున్ను సూపర్‌గా వాడుకుంది సుకుమార్, త్రివిక్రమ్ ► ప్రిన్స్ మహేష్ బాబును బాగా వాడుకుంది పూరీ జగన్నాథ్ ► పవన్ కల్యాణ్‌ను ఒక రేంజ్లో వాడుకుంది మాజీ సీఎం చంద్రబాబు ఇలా తమ అభిమాన హీరోల గురించి చెబుతూ ఈ పోస్ట్‌ను నెట్టింట వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సలార్ రివ్యూలతో పాటు ఈ పోస్ట్ కూడా భారీగా వైరల్ అవుతుంది. పొలిటికల్ గేమ్‌లో పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు ఒక రేంజ్లో వాడుకుంటున్నాడని అర్థం వచ్చేలా వారు తెలుపుతున్నారు. పవన్‌ను ఉపయోగించుకోవడంలో చంద్రబాబుతో ఏ డైరెక్టర్ పోటీ పడలేడని వారు తెలుపుతున్నారు. ఈ విషయంలో టీడీపీ, జనసేన అభిమానులు కూడా కరెక్టే కదా..! అని చెప్పడం విశేషం. లోకేష్ వ్యాఖ్యలే నిదర్శనం చినబాబు నారా లోకేష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అక్కడ 2024లో జనసేన, టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే ఎవరు సీఎం అనే ప్రశ్న ఏదురైంది. ఒక క్షణం ఆలోచించకుండా చంద్రబాబు మాత్రమే సీఎం అని చెప్పారు. పదవి విషయంలో నో షేరింగ్ అని క్లారిటీ ఇచ్చేశాడు. ఇంత క్లారిటీగా చినబాబు ఉంటే పెదబాబు (పవన్ కల్యాణ్) మాత్రం ఏ క్లారిటీతో ఉన్నాడో ఇప్పటికీ చెప్పలేదు. సీఎం పదవి విషయంలో షేరింగ్ లేకుంటే దేనికోసం టీడీపీతో పవన్ కల్యాణ్ చేతులు కలిపాడు..? సభ ఏదైనా సరే పవన్ కనిపిస్తే చాలు సీఎం.. సీఎం.. అంటూ కేకలు పెడుతున్న ఆయన ఫ్యాన్స్ మానసిక పరిస్థితి ఎలా ఉందో..? ఇప్పటికైనా అర్థం అయిందా..? చంద్రబాబు వాడకం ఏ రేంజ్లో ఉంటుందో..? ఆయన వాడకం మొదలు పెడితే మాటలు ఉండవ్ అంటూ నెటిజన్లు డైలాగ్స్ పేలుస్తున్నారు. 🙏 https://t.co/9Mw5lDJ11C — Ram Gopal Varma (@RGVzoomin) December 22, 2023 -
లోకేశ్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది: మంత్రి కన్నబాబు
తూర్పు గోదావరి: నారా లోకేశ్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సూచించారు. ముఖ్యమంత్రి పట్ల నోటికి వచ్చిన అనుచిత వ్యాఖ్యలు చేస్తే బయట తిరగలేవని హెచ్చరించారు. చంద్రబాబు పోలవరంను ఏటీఎంలా వాడుకుంటున్నారని 2019 ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీయో ఆరోపించారని అన్నారు. కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తారుమారు చేశారని పేర్కొన్నారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడి ముందుగా కాపర్ డ్యామ్‌ను నిర్మించారు. పోలవరం ప్రాజెక్టు వద్ద భజనలకు.. బస్సులకు ఖర్చు చేసిన కోట్లాది రూపాయాలు నిర్వాసితులకు ఇవ్వొచ్చు కదా? అని ప్రశ్నించారు. చదవండి: కృష్ణా రివర్ బోర్డ్ సమావేశానికి హాజరు కానున్న ఏపీ అధికారులు పోలవరం నిర్వాసితుల పట్ల చిత్తశుద్ధి ఉన్న ముఖ్యమంత్రి సీఎం జగన్ అని ఆయన అన్నారు. పోలవరం నిర్వాసితుల్లో ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షలు ఇవ్వాలని ఇటీవల క్యాబినెట్లో తీర్మాణం చేసినట్లు తెలిపారు. 2024లో అధికారంలో వస్తామని తండ్రీ కొడుకులు కలలు కంటున్నారన్నారు. ముందు హైదరాబాద్ వదిలి ఆంధ్రప్రదేశ్‌కు రావాలంటూ మంత్రి కన్నబాబు ఎద్దేవా చేశారు. చదవండి: అరకు అందాలకు రాచబాట -
పాత లెక్కలు తేల్చుకోవడానికా? పరామర్శించడానికా?: పేర్ని నాని
తాడేపల్లి: చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్షించారు. చంద్రబాబు పరామర్శకు వచ్చి రాజకీయాలు మాట్లాడారని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. పాత లెక్కలు తేల్చుకోవడానికి వచ్చారా? పరామర్శించడానికి వచ్చారా? అంటూ ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. కరోనాను ఎదుర్కోవడంలో ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రప్రభుత్వమే ప్రశంసించిందని మంత్రి పేర్ని నాని గుర్తు చేశారు. 20 నెలల్లోనే 97శాతం హామీలను సీఎం జగన్ నెరవేర్చారని అన్నారు. మాట ఇచ్చి తప్పడం చంద్రబాబు నైజం! మాట ఇచ్చి తప్పడం చంద్రబాబు నైజమని మంత్రి పేర్ని నాని దుయ్యబట్టారు. చంద్రబాబు ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు నీళ్లిస్తే ప్రజలు ఎందుకు ఓడించారో? చెప్పాలన్నారు. చంద్రబాబు గిరిజనులకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. బెల్ట్ షాపులకు ప్రాణం పోసింది చంద్రబాబు కాదా? అని అడిగారు. దొంగలకు, వెన్నుపోటుదారులకు చంద్రబాబు ఆదర్శం అని దుయ్యబట్టారు. తెలంగాణ జల అక్రమాలపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు? అని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. -
జగన్ పాదయాత్ర ఓర్వలేకే ..
విజయవాడ : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేపట్టనుండటంతో ఓర్వలేకే టీడీపీ మంత్రులు అవాకులు చవాకులు పేలుతున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్ అన్నారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్రెడ్డి సీఎం చంద్రబాబుకు లేఖ రాస్తే... నీరు, రైతులు, పంటలు, సేద్యం గురించి తెలియదంటూ మంత్రులు పిచ్చిపిచ్చి వాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. పట్టిసీమ తానే తెచ్చానని చెబుతున్న మంత్రి దేవినేని ఉమా పెద్ద బ్రోకర్ అని దుయ్యబట్టారు. ఇరిగేషన్‌పై తెలంగాణలో ఒక మాదిరిగా, ఆంధ్రాలో మరోలా టీడీపీ మాట్లాడుతోందని విమర్శించారు. నేటి పట్టిసీమ ఆనాడు దివంగత మహానేత వైఎస్ తవ్వించిన కుడి కాలువ వల్లే సాధ్యమైందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. కాంట్రాక్టర్లకు, చంద్రబాబుకు, లోకేష్‌కు మధ్య మంత్రి దేవినేని ఉమా బ్రోకర్‌గా పని చేస్తున్నాడని ధ్వజమెత్తారు. పిల్లల్ని అడిగినా చంద్రబాబు 420 అని చెబుతారు.. ఆఖరికి అర్ధరాత్రి మంత్రి పదవి తెచ్చుకున్న బీర్ హెల్త్ డ్రింక్ అని చెప్పే మంత్రి జవహర్ కూడా జగన్ పాదయాత్ర పేరు 420 పెట్టి సినిమా తీయమని చెబుతుండడాన్ని ఆయన ఆక్షేపించారు. రాష్ట్రంలో 420 ఎవరో పిల్లల్ని అడిగినా ఖచ్చింగా చంద్రబాబు–420 అని చెబుతారని ఎద్దేవా చేశారు. రాంగోపాల్‌వర్మ తీసే సినిమాతో చంద్రబాబుకు, ఆయన మంత్రులకు భయం పట్టుకుందని తెలిపారు. ఎన్టీఆర్ చరిత్ర సినిమాలో విలన్‌గా 420 చంద్రబాబుని పెట్టి తీయాలని, అప్పుడే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని పేర్కొన్నారు. ఆత్మహత్యలపై చర్యలు తీసుకునే నాథులేరీ..? కార్పొరేట్ కళాశాలల్లో జరుగుతున్న ఆత్మహత్యలపై చర్యలు తీసుకునే నాథుడే లేడని ఆవేదన చెందారు. రాష్ట్రంలో 10 రోజుల్లో 8 మంది విద్యార్థులు చనిపోయారన్నారు. రాష్ట్రంలో విద్యార్థులు చనిపోవడానికి కారణమైన మంత్రి నారాయణను సీఎం చంద్రబాబు రైట్ హ్యాండ్‌గా పక్కనే కూర్చొబెట్టుకోవడంపై మండిపడ్డారు. -
సీఎం పర్యటన ఖరారు
ఏలూరు (మెట్రో) : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు పర్యటన ఖరారైంది. ఈనెల 23న ఆయన జిల్లా పర్యటనకు రానున్నారు. ఆ రోజు ఉదయం 11.50 గంటలకు హెలికాప్టర్ ద్వారా దేవరపల్లి జెడ్పీ హైస్కూల్‌కు చేరుకుంటారు. అనంతరం దేవరపల్లిలో పోలవరం ప్రాజెక్ట్ కుడి ప్రధాన కాలువ ప్యాకేజీ-2 పనులను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12.45 గంటలకు దేవరపల్లి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.10 గంటలకు పెదవేగి మండలం ముండూరు గ్రా మానికి చేరుకుంటారు. జిల్లాలో 500 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు నిర్మించినందుకు గుర్తుగా ముం డూరులో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం గుండేరు పనుల తీరును పరి శీలిస్తారు. అక్కడి నుంచి జానంపేట అక్విడెక్ట్ వరకూ కాలువ నిర్మాణ పనులను పరిశీలి స్తారు. మధ్యాహ్నం 2.50 గంటలకు జానంపేట నుంచి బయలుదేరి దొండపాడులోని వంగూరు బైపాస్ రోడ్డుకు చేరుకుంటారు. 3 గంటల నుంచి 4.50 గంటల వరకూ నీరు-చెట్టు పథకం పై ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో పాల్గొంటారు. 4.50 గంట లకు వంగూరు బైపాస్ రోడ్డు నుంచి బయలుదేరి 5 గంటలకు ఏలూరు ఇండోర్ స్టేడియంకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో విజయవాడ వెళతారు. -
నీళ్లన్నీ కృష్ణార్పణం!
సాక్షి ప్రతినిధి, ఏలూరు :‘‘పట్టిసీమతో కృష్ణాడెల్టాకు గోదావరి జలాల తరలింపు సెప్టెంబర్ మొదటి వారంలో మొదలవుతుంది.. తాడిపూడి ఎత్తిపోతల్లో మిగులు జలాలను పోలవరం కుడి కాల్వలో పడేస్తాం.. మొత్తంగా పోలవరం కుడి కాల్వ ద్వారా 70, 80 టీఎంసీల గోదావరి నీరు కృష్ణాడెల్టాకు తీసుకువెళ్తాం.. తమ్మిలేరు, వాగులేరు, బుడమేరు, ఎర్రకాలువల నీళ్లను కూడా కృష్ణా డెల్టాకు తరలిస్తాం...’’ పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు చేసిన ఈ ప్రకటనలపై జిల్లా రైతాంగం ఆగ్రహావేశాలతో రగిలిపోతోంది. ప్రభుత్వం మన జిల్లాలోని గోదావరి జలాల దారులన్నీ కృష్ణాకు అనుసంధానం చేయడం.. ఇక్కడి నీరంతా అక్కడి డెల్టాకు ఎత్తిపోయాలని లక్ష్యంగా పెట్టుకోవడంపై పశ్చిమ రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆర్నెల్ల కిందట పట్టిసీమ పథకంతో కేవలం గోదావరి మిగులు జలాలను మాత్రమే తీసుకువెళ్తామని సీఎం చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ పథకం పూర్తయ్యే నాటికి అన్ని ఎత్తిపోతల పథకాలు, కాలువలు, వాగులు, వంకలను కుడి కాల్వకి అనుసంధానం చేస్తామని చెప్పడం పశ్చిమ రైతాంగ ప్రయోజనాలను పణంగా పెట్టడమేనని రైతు సంఘాల నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ మధ్యలో ఉన్నా నీళ్లు లేక జిల్లాలో చాలాచోట్ల నాట్లు పడలేదు. చివరి భూములైతే బీడు వారాయి. ఈ పరిస్థితుల్లో గోదావరి జలాలన్నీ కృష్ణాడెల్టాకే ఎత్తిపోస్తే పచ్చని పశ్చిమ ఎడారిగా మారిపోయినా ఆశ్చర్యపోనక్కరలేదని రైతు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. చెంతనే గోదావరి ఉన్నా జిల్లాలో రోజురోజుకీ తీవ్రమవుతున్న సాగునీటి ఎద్దడిని పట్టించుకోకుండా పాలకులు కృష్ణాడెల్టా జపం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చివరి భూములకు చింతే.. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో డెల్టాలోని శివారు భూములకు సాగునీరు సకాలంలో అందక వరినాట్లు సైతం ఆలస్యమయ్యాయి. నేటికీ నరసాపురం, మొగల్తూరు మండలాల్లో రెండు వేల ఎకరాల్లో వరినాట్లు పడలేదు. భీమవరం, వీరవాసరం మండలాల పరిధిలో తగినంత వర్షాలు కురవకపోతే ఏడు వేల ఎకరాలకు సాగునీటి ఇబ్బంది తలెత్తే ప్రమాదముంది. ఆక్వా చెరువులకు డె ల్టా కాలువల నుంచి అనుకున్న స్థాయిలో నీరందని పరిస్థితి ఉంది. మెట్ట ప్రాంతాల్లో కటకట మెట్ట ప్రాంతంలో ఉన్న 18 మండలాల్లో ఎక్కడా 50 నుంచి 60 శాతానికి మించి వరినాట్లు పూర్తి కాలేదు. చెరువులు, జలశయాలకు నేటికీ అనుకున్న స్థాయిలో నీరు చేరలేదు. పోలవరం నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాల్లో 12,619 హెక్టార్లలో వరిసాగు చేయాల్సి ఉండగా, కేవలం 4,901హెక్టార్లలో మాత్రమే నాట్లు పూర్తయ్యాయి. గోపాలపురం, నల్లజర్ల, ద్వారకాతిరుమల, దేవరపల్లి మండలాల పరిధిలో 6వేల హెక్టార్లలో వరిసాగు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు వెయ్యి ఎకరాలలో మాత్రమే నాట్లు వేశారు. ఇక చాలాచోట్ల చెరువుల ఆయకట్టు కింద వరినాట్లు నేటికీ పూర్తికాలేదు. చింతలపూడి వ్యవసాయ సబ్‌డివిజన్ పరిధిలో ఈ ఏడాది 16,915 హెక్టార్లలో వరిసాగు లక్ష్యంగా పెట్టుకున్నారు. వర్షాభావం వల్ల సబ్ డివిజన్లో ఇంతవరకు 60 శాతం కూడా నాట్లు పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో జిల్లాలో నెలకొన్న సాగునీటి ఎద్దడిని అధిగమించేందుకు చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ చర్యలు, డెల్టా ఆధునికీకరణ పనులపై దృష్టి పెట్టకుండా గోదావరి నీళ్లన్నీ కుడికాల్వలో ఎత్తిపోయడమే పాలకులు లక్ష్యంగా పెట్టుకోవడంపై రైతులు ఆవేదన చెందుతున్నారు. మాటకు ముందు.. వెనుక పశ్చిమ రుణం తీర్చుకుంటానని చెప్పే బాబు... చివరికి ఇంతేనా జిల్లాకు ఒనగూర్చేది అని విమర్శిస్తున్నారు. ఇక్కడి రైతుల ప్రయోజనాలను పణంగా పెడితే ఊరుకోం కృష్ణా డెల్టాకు నీళ్లు ఇవ్వొద్దని మేం అనడం లేదు. కానీ గోదావరి జిల్లాల ైరైతుల ప్రయోజనాలను పణంగా పెడితే ఊరుకునేది లేదు. ఈ ఖరీఫ్ సీజన్లోనే నీళ్లందక జిల్లాలో చాలాచోట్ల నాట్లు పడలేదు. గోదావరి చెంతనే ఉన్నా సాగునీటి ఎద్దడితో రైతులు అల్లాడిపోతున్నారు. డెల్టా ఆధునికీకరణ చేపడితే లక్షలాది ఎకరాలు, చివరి భూములు సాగులోకి వస్తాయి. దానిని విస్మరించిన ప్రభుత్వం కృష్ణాడెల్టాకు నీళ్లు మళ్లించడం ఒక్కటే లక్ష్యంగా పెట్టుకుంది. - బి.బలరాం, రైతు సంఘం రాష్ర్ట అధ్యక్షుడు. మెట్ట రైతులకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం తాడిపూడి పథకం పనులు పూర్తి చేయడంపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. ఇక్కడి నీటిని పోలవరం కాలువ ద్వారా కృష్ణాకు మళ్లించడానికే ప్రాధ్యాన్యం ఇస్తోంది. ఏటా ఒకే పంటకు నీరందిస్తున్నప్పటికీ తాడిపూడి కాలువల్లో నీరు పారడం ద్వారా ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. తద్వారా మెట్ట ప్రాంతంలోని రైతులకు పరోక్షంగా రెండో పంటకు ఉపకరిస్తుంది. - తానేటి వనిత, వైఎస్సాఆర్ సీపీ రాష్ట్ర కార్యద ర్శి, కొవ్వూరు. -
హడావుడి పనులు.. నాణ్యతకు నీళ్లు!
పోలవరం : పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనులు హడావుడిగా సాగుతున్నాయి. ఈ నెల 15న ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు దీనిని ప్రారంభించనుండటంతో అధికార యంత్రాంగం పనులను వేగవంతం చేసింది. అయినా ఆగస్టు 15 నాటికి పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. కనీసం రెండు మోటార్లు, రెండు పంపులతో అయినా నీరు విడుదల చేయాలని నిర్ణయించారు. హడావుడిగా చేస్తున్న ఈ పనుల్లో నాణ్యత లోపిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 24 మోటార్లు, 24 పంపులతో 12 వరుసల పైప్‌లైన్ ద్వారా గోదావరి జలాలను పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు తరలించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఆగస్టు 15న మొదటి విడతగా 8 పంపుల నుంచి నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించటంతో రాత్రి, పగ లు అనే భేదం లేకుండా పనుల్ని వేగవంతం చేశారు. 8పంపుల నుంచి నీరు విడుదల చేయటం సాధ్యం కాదని తేలిపోవడంతో అధికారులలో గుబులు మొదలైంది. ఎత్తిపోతల పథకం పోలవరం కుడి కాలువలో కలిసేచోట పైప్‌లైన్ ఏర్పాటు పనులు దాదాపుగా పూర్తికావచ్చాయి. హెడ్‌వర్క్స్ పనులు మాత్రం కొలిక్కి రాలేదు. ఒక మోటార్, ఒక పంప్ ఫిట్టింగ్‌కు కాంక్రీట్ వేయాల్సి ఉంది. ఆదివారం ఉదయమే కాంక్రీట్ పనులు ప్రారంభించాలని ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు ఆదేశించారు. ప్రస్తుతం ఐరన్ ఫిట్టింగ్ పనులు జరుగుతున్నాయి. ఆగస్టు 15న నీరు విడుదల చేస్తారా? పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఆగస్టు 15న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీటిని విడుదల చేస్తారా లేక లాంఛనంగా ప్రారంభించి వెళ్లిపోతారా అనేది రైతులకు తేల్చి చెప్పాలని సాగునీటి వినియోగ సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కొవ్వూరి త్రినాథరెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటికే రైతులు అయోమయంలో ఉన్నారని, రైతులకు పూర్తి వివరణ ఇవ్వాల్సి ఉందన్నారు. హడావుడిగా పట్టిసీమ పనులను చేయటం వల్ల పనుల్లో నాణ్యత లోపించే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. -
సీఎం పర్యటన ఇలా
ఏలూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు పర్యటనకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారం ఉంగుటూరు మండలం కైకరంలో జరిగే రైతు సాధికార సదస్సులో ఆయన పాల్గొంటారు. మధ్యాహ్నం 12.55 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 1.45 గంటలకు గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయల్దేరి కైకరంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటారు. అక్కడ అధికారులు, ప్రజాప్రతినిధులను కలుసుకుంటారు. అనంతరం 2.15 గంటల నుంచి 5.30 గంటల వరకు రైతు సాధికార సదస్సులో పాల్గొని, రైతులను ఉద్దేశించి మాట్లాడతారు. రుణమాఫీకి అర్హులైన వారికి రుణ ఉపశమన పత్రాలను అందిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు కైకరం హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్లో బయల్దేరి 6.15 గంటలకు గన్నవరం చేరుకుంటారు. -
ఒట్టి హామీలే !
వినుకొండ/శావల్యాపురం/ సాక్షి,గుంటూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా పర్యటనలో ఆద్యంతం ఒట్టి హామీలతోనే సరిపుచ్చారు. బుధవారం జిల్లాలోని వినుకొండ, రేపల్లె నియోజకవర్గాల్లో పర్యటించిన ఆయన ఎక్కడా రైతుల ఊసెత్తలేదు. తొలుత వినుకొండ చేరుకున్న సీఎం అక్కడి ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. సుమారు అర్ధ గంటపాటు మాట్లాడిన విద్యార్థులు స్వచ్ఛ్ భారత్ ఆవశ్యకతను వివరించారు. పాఠ్యపుస్తకాల బరువుతో పడుతున్న అవస్థలను తెలియజేశారు. అన్నిచోట్లా అవినీతి పెచ్చుమీరిందని చెప్పారు. విద్యార్థుల ప్రసంగాలకు ఆశ్చర్యం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి మెరికల్లా, చిచ్చరపిడుగుల్లా ఉన్నారంటూ వారిని అభినందించారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ వినుకొండను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతానన్నారు. పట్టణంలో పశువైద్య కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దీర్ఘకాలంగా ఫ్లోరైడ్ బారిన పడుతున్న వినుకొండ, ఒట్టి హామీలే ! ఠమొదటిపేజీ తరువాయి మాచర్ల, గురజాల ప్రాంతాల ప్రజలకు సాగర్ జలాలు అందేవిధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. విద్యార్థులకు పుస్తకాల భారాన్ని తగ్గించేందుకు ట్యాబ్లాయిడ్లు అందుబాటులోకి తెస్తానని తెలిపారు. గురుకుల పాఠశాలలకు సమానంగా ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను ఏర్పాటు చేయాలన్న ఆలోచనల చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాకొక ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తానన్నారు. అనంతరం శివయ్యస్థూపం సెంటర్లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. మండల కేంద్రమైన శావల్యాపురం జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన ‘జన్మభూమి-మాఊరు’ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. గ్రామ సర్పంచ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సీఎం 121 డ్వాక్రా సంఘాల సభ్యులకు రూ.5 కోట్ల రుణాల చెక్కు అందజేశారు. ఎమ్మెల్యే జీవీ మాట్లాడుతూ నియోజకవర్గానికి తాగునీటి సౌకర్యం తీర్చాలని కోరటంతోపాటు సీఎం వెటర్నరీ కాలేజీ ఏర్పాటుకు హామీ ఇవ్వటంపై కృతజ్ఞతలు తెలిపారు. రాజధాని నిర్మాణానికి శివశక్తి పౌండేషన్ ఆధ్వర్యంలో రూ.10 లక్షల చెక్కును ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సీఎం చంద్రబాబు నాయుడుకు అందజేశారు. అనంతరం సీఎం చంద్రబాబును ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు దంపతులు ఘనంగా సత్కరించారు. కార్యకర్తలు గజమాలను బహూకరించారు. యువ నాయకులు నాగలిని బహూకరించారు. ఇటీవల ఆధార్ కార్డు, రేషన్ కార్డుల్లో తప్పులు ఉన్నాయని పింఛన్లు తొలగించిన వయ్యకల్లు, బొందిలిపాలెం, మతుకుమల్లి గ్రామాల నుంచి వచ్చిన వృద్ధులు, రుణమాఫీపై ప్రశ్నించేందుకు వచ్చిన రైతులను సీఎంను కలిసేందుకు అనుమతించలేదు.చివరకు వారంతా వెనుదిరిగి వెళ్లిపోయారు. సాగు నీటి సమస్యలతో రైతులు పీకల్లోతు ఇబ్బందుల్లో ఉన్నా సీఎం ఆ ఊసెత్తకపోవడంతో రైతులు నిరాశకు గుర య్యారు. నాగార్జునసాగర్‌లో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు జోన్ -2 పరిధిలోని పలు ప్రాంతాల్లోని రైతాంగం నాట్లు వేయని దుస్థితి ఉన్నా ప్రజాప్రతినిధులు సైతం సీఎం దృష్టికి తీసుకువెళ్లకపోవడంతో సభలకు హాజరైన రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపి రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, జెడ్పీ చైర్పర్సన్ జానీమూన్, ఎమ్మెల్సీ నన్నప నేని రాజకుమారి, పిన్నెల్లి లక్ష్మారెడ్డి, కుర్రి పున్నారెడ్డి, నలబోలు వెంకట్రామయ్య, మున్సిపల్ చైర్పర్సన్ జాన్‌బీ, జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, జిల్లా అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ల్యాండ్ పూలింగ్ విధానానికి సహకరించాలి జిల్లాలోని రైతులు ల్యాండ్ పూలింగ్ విధానానికి సహకరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కోరారు. రేపల్లె నియోజకవర్గం నగరంలో జరిగిన ‘జన్మభూమి-మాఊరు’ కార్యక్రమంలో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. భూసేకరణ విషయంలో జిల్లాలోని రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.అనంత రం ముత్తుపల్లిల్లో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో యానిమేటర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ డివిజన్ నాయకులు సీహెచ్. మణిలాల్ ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. కార్యక్రమంలో మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, నక్కా అనంద్‌బాబు, తెనాలి శ్రావణ్ కుమార్, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ముమ్మనేని వెంకటసుబ్బయ్య, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లిఖార్జునరావు, జియాఉద్దీన్, జేసీ సీహెచ్. శ్రీధర్, డీఆర్డీఏ పీడీ ప్రశాంతి, ఎంపీపీ వి.వీరయ్య పాల్గొన్నారు. -
'ప్రసారాలలో హింసాత్మక అంశాలు తగ్గించాలి'
విజయవాడ: టెలివిజన్ ప్రజా జీవితంలో పెనవేసుకుపోయిందని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం విజయవాడలో ఆయన విజయవాడ దూరదర్శన్ సప్తగిరి ఛానెల్‌ను వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అనంతరం వెంకయ్యనాయుడు ప్రసంగిస్తూ... పోటీ ప్రపంచంలో ఆలస్యానికి అర్థం లేదని అన్నారు. వార్తను వార్తగానే వ్యాఖ్యానాన్ని వ్యాఖ్యానంగానే చెప్పాలని ఆయన మీడియాకు హితవు పలికారు. సత్యానికి దగ్గరగా, సంచలనాలకు దూరంగా మీడియా పని తీరు ఉండాలని ఆకాంక్షించారు. టీవీ ఛానెళ్ల మధ్య పోటీతత్వం పెరిగిందన్నారు. విశ్వసనీయత తగ్గితే వెనకపడి పోవడం ఖాయమన్ని వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. టీవీలు, సినిమాలలో హింసాత్మక సంఘటనలు తగ్గించాలని సూచించారు. ఓ ఘటనను పదేపదే ప్రసారం చేస్తే మనుషుల మానసిక ప్రవర్తనపై ప్రభావం చూపుతుందని వెంకయ్యనాయుడు అన్నారు. దూరదర్శనకు 1417 ట్రాన్స్మీటర్లు, 32 ఛానెళ్లు ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపారు. దూరదర్శన్ కేంద్రానికి జాతీయ పతాక రూపశిల్పి, స్వాతంత్ర్య సమరయోధుడు పింగళి వెంకయ్య పేరు పెట్టడం పట్ల వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. -
కేసీఆర్, చంద్రబాబులపై క్రిమినల్ కేసులు
న్యూఢిల్లీ: నిన్న కాక మొన్న కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడులపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే మొత్తం 12 మంది కేంద్ర మంత్రులు, 44 సహాయ మంత్రులపై క్రిమినల్ కేసులు నమోదైయ్యాయి. అయితే ఏడుగురు కేంద్ర మంత్రులపై అత్యంత భయంకరమైన క్రిమినల్ కేసులు నమోదు అయినట్లు 'ది అసోసియేషన్ ఆఫ్ డెమెక్రాటిక్ రిఫార్మ్స్' అనే సంస్థ శుక్రవారం ఇక్కడ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. గత రెండేళ్ల కాలంలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసులు నమోదైన వారి జాబితాను ఈ సందర్బంగా ఏడీఆర్ విడుదల చేసింది. అందులోభాగంగా కేసీఆర్, చంద్రబాబులపై కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ తన నివేదికలో పేర్కొంది.తెలంగాణలో అత్యథికంగా 90 శాతం మంది మంత్రులపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయని పేర్కొంది. ఆ తర్వాత స్థానాలు వరుసగా 56 శాతంతో ఆంధ్రప్రదేశ్, 34 శాతంతో కర్ణాటక, 27 శాతంతో ఒడిశాలు ఉన్నాయని తెలిపింది. మిజోరాం, మేఘాలయా, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం రాష్ట్రాలకు చెందిన చెందిన ఒక్క మంత్రిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు కాకపోవడం గమనార్హం. -
అడ్మిషన్లు వెంటనే మొదలుపెట్టండి: చంద్రబాబు
కేసీఆర్‌కు చంద్రబాబు లేఖ సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత విద్యా సంవత్సరం (2014-15)లో ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖరరావుకు శుక్రవారం లేఖ రాశారు. అడ్మిషన్లు ఆలస్యం కావడం వల్ల ఇరు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఇతర రాష్ట్రాల కాలేజీల కు వెళ్లి చేరాల్సి వస్తోందని, దీనివల్ల వారి తల్లిదండ్రులకు ఆర్థికంగా భారం కావడంతో పాటు మానసికంగా ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. సరైన సమయంలో కౌన్సెలింగ్ పూర్తిచేసి అడ్మిషన్లు చేపడితే రెండు రాష్ట్రాల విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా ఉంటారని చెప్పారు. ఆగస్టు నుంచి తరగతులు ప్రారంభం కావాలని సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా జారీచేసిందని ఆ లేఖలో గుర్తుచేశారు. -
కిరణ్ది తుగ్లక్ పాలన: చంద్రబాబునాయుడు
తణుకు, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో భారీ వర్షాల బీభత్సంతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వ తీరు పిచ్చి తుగ్లక్ పాలన మాదిరిగా ఉందని టీడీపీ అధినేత ఎన్. చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. బుధవారం తణుకులోని ఆంధ్రా సుగర్స్ సమావేశ మందిరంలో జిల్లా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసమర్థ ప్రభుత్వం కావడంతోప్రజలకు సహాయం అందడం లేదన్నారు. ప్రజల కోసం సీఎం మెడలు వంచైనా సహాయం అందేలా చేస్తామన్నారు. వరి పచ్చగా కనిపిస్తున్నప్పటికీ దిగుబడి మాత్రం రాదని, రైతులకు నష్టపరిహారంగా ఎకరాకు రూ.10 వేలు అందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరితంగా వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని విభజించి మొద్దబ్బాయి రాహుల్‌గాంధీని ప్రధానిని చేయాలని చూస్తోందని ఎద్దేవా చేశారు. కార్యకర్తలు ఆరు నెలలపాటు వ్యాపారాలను పక్కనపెట్టి, పార్టీ కార్యక్రమాల్లో మునిగి తేలాలని హితవు పలికారు. అడుగడుగునా సమైక్య సెగ భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న వరిచేలను పరిశీలించేందుకు వచ్చిన చంద్రబాబుకు తణుకు, అత్తిలి మండలాల్లో అడుగడుగునా సమైక్యవాదుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. తొలుత నరేంద్ర సెంటర్లో ఎన్జీవో జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. అనంతరం పాలిటెక్నిక్ కళాశాల వద్ద పెద్దఎత్తున విద్యార్థులు ‘జై సమైక్యాంధ్ర’ అనాలని బాబును పట్టుబట్టారు. అందుకు ససేమిరా అన్న ఆయన.. వాస్తవాలను తెలుసుకోవాలంటూ.. ప్రసంగించడంతో విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. కాంగ్రెస్ పరిస్థితి బాగుండకపోవడంతో సోనియా తెలంగాణలో టీఆర్ఎస్, సీమాంధ్రలో వైఎస్సార్ సీపీతో పొత్తులు పెట్టుకుని పైకి రాష్ట్ర విభజన అంటూ నాటకాలు ఆడుతున్నారంటూ విమర్శలకు దిగారు. హైదరాబాద్, సైబరాబాద్‌లను సింగపూర్‌కు దీటుగా అభివృద్ధి చేశానని చెప్పడంతో మళ్లీ నిరసన ఎదురైంది. అనంతరం దువ్వ-వరిఘేడు ప్రాంతంలోని దానమ్మగుడి ప్రాంతంలో సమైక్యవాదులతో జత కలిసిన టీడీపీ కార్యకర్తలు సైతం ‘సమైక్యాంధ్ర కావాలి. సమన్యాయం కాదు. జై సమైక్యాంధ్ర అనండి’ అంటూ పట్టుబట్టారు. చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సమైక్యవాదులు రోడ్డుపై చంద్రబాబు కాన్వాయ్‌కు అడ్డంగా పడుకుని నిరసన తెలిపారు. వరిఘేడు, తిరుపతిపురం, రామచంద్రపురం సెంటర్లలో నిలదీసిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. -
చంద్రబాబు వైఖరేంటో తేలిపోతుంది: అశోక్ బాబు
భీమవరం, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన విషయంలో టీడీపీ అధినేత ఎన్. చంద్రబాబునాయుడి వైఖరి ఏమిటనే విష యం అసెంబ్లీలో తెలంగాణ అంశంపై తీర్మానం సందర్భంలో తేలిపోతుందని ఏపీఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు పి. అశోక్‌బాబు పేర్కొన్నారు. గురువారం భీమవరంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, విభజన అం శంపై అసెంబ్లీలో తీర్మానం చేసేప్పుడు చిత్తూరు జిల్లా కుప్పం ఎమ్మెల్యేగా చంద్రబాబు రాష్ర్ట విభజనకు ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉంటారా.. లేక సమైక్యాంధ్రకు అండగా నిలుస్తారా అనే విషయం ఆయన ఓటు ద్వారా తెలుస్తుందన్నారు. అసెంబ్లీలో విభజన తీర్మానం ఓడిపోతే పార్లమెంటులో కూడా బిల్లు ముందుకు వెళ్లే పరిస్థితి లేదన్నారు. ఒకవేళ పార్లమెంటులో ఆమోదం పొందితే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లేనన్నారు. పార్లమెంటులో విభజన తీర్మానాన్ని అడ్డుకోవాలని అన్ని జాతీయ పార్టీల నేతలను కలసి విన్నవిస్తామన్నారు. తొలుత చెన్నై వెళ్లి డీఎంకే నేతలను కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని అశోక్‌బాబు చెప్పారు. ఎమ్మెల్యేలకు బహిరంగ లేఖ అసెంబ్లీలో విభజన తీర్మానాన్ని అడ్డుకోవాలని కోరుతూ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలందరికీ బహిరంగ లేఖలు ఇవ్వనున్నట్టు అశోక్‌బాబు తెలిపారు. దసరా పండగ అనంతరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ప్రతి ఎమ్మెల్యే విభజన తీర్మానానికి వ్యతిరేకంగా ఓటువేసే విధంగా ప్రమాణ పత్రాలు ఇవ్వాల్సి ఉంటుందని ఆయనన్నారు. రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. ఓటుతోనే బుద్ధిచెప్పండి అనంతరం భీమవరం లూథరన్ హైస్కూల్ గ్రౌండ్స్‌లో హోరువానలో జరిగిన గోదావరి ప్రజాగర్జన సభలో అశోక్‌బాబు మాట్లాడుతూ రాష్ర్ట విభజనకు కారకులైన రాజకీయ పార్టీలకు ఓటుతోనే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. జీతాలు రాకపోరుునా ఉద్యోగులు, చదువులు దెబ్బతింటున్నా విద్యార్థులు, కష్టనష్టాలు ఎదుర్కొంటూ ప్రజలు ఉద్యమిస్తున్నారని, అయితే విభజనను అడ్డుకునే విషయంలో ఎంపీలు చేసిన ద్రోహాన్ని మాత్రం ఎవరూ తట్టుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర విభజనకు జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నప్పుడే ఎంపీలు పదవులకు రాజీనామా చేసివుంటే తెలంగాణ నోట్‌ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించేది కాదన్నారు. కనీసం ఎమ్మెల్యేలైనా అసెంబ్లీలో విభజన తీర్మానాన్ని ఓడించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు. 2014 ఎన్నికల వరకు రాష్ర్ట విభజన జరగదని అశోక్‌బాబు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో సరైన నాయకత్వాన్ని ఎన్నుకోకపోతే రాష్ర్ట విభజనాంశం సీమాంధ్రుల చేరుుదాటిపోతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మూడుకోట్ల మంది ఓటర్లు బుల్లెట్లుగా మారాలని పిలుపునిచ్చారు. సభకు ఉభయగోదావరి, కృష్ణాజిల్లాల నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, రైతులు, సమైక్యవాదులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్యక్రమంలో పలు సంఘాల నేతలు పాల్గొన్నారు. -
బాబుపై అంత ప్రేమ ఎందుకో?
రామచంద్రపురం, న్యూస్‌లైన్ : నిన్నమొన్నటి వరకు టీడీపీ అధినేత చంద్రబాబు పేరెత్తితే చాలు ఒంటికాలిపై లేచే వారు. అలాగే ఒకప్పటి ప్రజారాజ్యం అధినేత, ప్రస్తుత కేంద్రమంత్రి చిరంజీవిపై ఈగ కూడా వాలనిచ్చేవారు కాదు. అలాంటిది ఇప్పుడు ఆ ప్రేమ చంద్రబాబుపై కనబరుస్తున్నారు. ఆయన రెండుకళ్ల సిద్ధాంతాన్ని విమర్శించినా, కించపరిచినా కన్నెర్రజేస్తున్నారు. ఇదీ కాంగ్రెస్ తరఫున ఉప ఎన్నికలో గెలిచిన రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులులో వచ్చిన మార్పు. ఇంతకాలం బాబుపై నిప్పు లు కక్కి, ఇప్పుడు అకస్మాత్తుగా యూ టర్న్ తీసుకొని ప్రేమ ఒలకబోయడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. సమైక్యవాదినంటూ గొప్పలు చెప్పు కొనే తోట రాష్ర్ట విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన బాబును వెనకేసుకు రావడమే కాక సమైక్యాంధ్ర కోసం రెండుసార్లు ఆమరణ దీక్ష చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్రెడ్డిని చిన్నబుచ్చినట్టు మాట్లాడడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారు. చంద్రబాబుపై అంత ప్రేమ కనబరచడం వెనుక మర్మమేమిటని ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద జేఏసీ శిబిరం పక్కన కేంద్ర మంత్రులు, ఎంపీలతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు మహిళల దుస్తులతో ఉన్నట్టు రూపొందించిన ఫ్లెక్సీలను కొంతమంది సమైక్యవాదులు ఏర్పాటు చేశారు. ఏరియా ఆస్పత్రి గోడను ఆనుకుని ఉన్న ఈ ఫ్లెక్సీల్లో కేంద్ర మంత్రులు చిరంజీవి, జేడీ శీలం, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, పళ్లంరాజు, కావూరి సాంబశిరావు, పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ, ఎంపీ హర్షకుమార్‌లతో పాటు ‘రాష్ర్ట విభజనకు అనుకూలంగా లెటర్ ఇచ్చినందుకు’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఫ్లెక్సీని కూడా పెట్టారు. కాగా మధ్యాహ్నం జేఏసీ శిబిరానికి వచ్చిన ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు సంఘీభావం తెలిపి, ప్రసంగించిన అనంతరం తిరిగి వెళ్తూ ఈ ఫ్లెక్సీలను చూశారు. ‘వీటిని ఎవరు పెట్టా’రంటూ జేఏసీ చైర్మన్ ఎం. వెంకటేశ్వర్లును ప్రశ్నించారు. ‘వాటితో జేఏసీకి ఎలాంటి సంబంధం లేదని, స్థానికంగా సమైక్యవాదులెవరైనా పెట్టి ఉంటారని, వెంటనే తొలగిస్తామని వెంకటేశ్వర్లు చెప్పారు. ఎమ్మెల్యే ‘కేంద్ర కేబినెట్ మం త్రుల ఫోటోలను పెట్టడం వరకు సమంజసమేనని, చంద్రబాబు ఫ్లెక్సీని ఎందుకు ఏర్పాటు చేశారని నిల దీశారు. పెడితే అందరి నాయకుల ఫ్లెక్సీలను పెట్టాలన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫ్లెక్సీని కూడా పెట్టి అప్పుడు అన్నీ తొలగించాలని ఆదేశిం చారు. జగన్‌ను అవమానిస్తే తీవ్ర పరిణామాలు.. ఫ్లెక్సీలను తొలగించేందుకు జేఏసీ నాయకులు ప్రయత్నించగా జగన్ ఫ్లెక్సీ పెట్టకుండా తొలగించడానికి వీల్లేదంటూ తోట అనుచరులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులతో పాటు పలువురు ప్రజలు అక్కడకు చేరుకొని తోట అనుచరుల తీరును ఎండగట్టారు. దీంతో ఫ్లెక్సీలను తొలగించారు. ఎస్సై బి.యాదగిరి సిబ్బందితో అక్కడకు చేరుకుని పరిస్థితి చక్కదిద్దారు. తోట రేపు ఎటు అడుగులు వేయనున్నారనే దానికి ఇది సూచన అని పలువురు వ్యాఖ్యానించారు. -
ఏపీ భవన్ మరో జంతర్‌మంతర్
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రెండు రోజులుగా చేస్తున్న దీక్షతో ఏపీభవన్ పరిసరాలు మరో జంతర్‌మంతర్‌గా మారిపోయాయి. ఎన్నికల నియమావళి అమల్లో ఉందని, ఏపీభవన్‌లో దీక్ష చెయ్యొద్దంటూ ఏపీభవన్ రెసిడెంట్ కమిషనర్ నోటీసులు పంపించినప్పటికీ టీడీపీ నాయకులు పట్టించుకోవడం లేదు. ఇక రెండో రోజు కూడా జనం లేక దీక్ష స్థలం వెలవెల పోయింది. యథావిధిగా దీక్ష ప్రారంభించిన బాబుకు మద్దతు తెలిపేందుకు హైదరాబాద్ నుంచి వచ్చిన టీడీపీ నాయకగణం మినహా ఇతరుల మద్దతు లభించడం లేదు. నగరంలో దాదాపు పది లక్షల మంది వరకు తెలుగువారున్నారు. అందులోనూ సీమాంధ్రులే ఎక్కువగా ఉన్నా ఢిల్లీలోని తెలుగువారు ఏపీభవన్వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. తమ సొంత సమావేశాల్లో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచి వచ్చిన ఎల్ఐసీ ఉద్యోగులు ఏపీభవన్ ఆవరణలో తిరగడంతో మంగళవారం ఉదయం కాస్త జనం ఉన్నట్టు కనిపించినా మధ్యాహ్నానికి ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. ఉన్న కొద్దిమందికి సైతం టీడీపీ నాయకులు సకల మర్యాదలు చేశారు. గాలితుంపరలు వచ్చే విధంగా ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటుచేసి కూర్చున్న కొద్దిమందినీ అక్కడి నుంచి లేవకుండా చూసుకున్నారు. జెండాలు పట్టుకునేవారు లేక... రెండో రోజు ధర్నాకు స్థానిక తెలుగువారు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వస్తారేమోననే ఆశతో టీడీపీ నాయకులు పార్టీ జెండాలను పెద్ద సంఖ్యలో తెప్పించారు. అయితే పరిస్థితి మొదటి రోజుకంటే ఇంకా పలుచగా ఉండడంతో చివరికి వాటిని వాడనేలేదు. దీంతో అక్కడున్న చిన్నారులు వాటితో ఆడుకున్నారు. జెండాలు పట్టుకుని ఏపీభవన్ ఆవరణలో పరుగెత్తుతూ సరదా తీర్చుకున్నారు. అంతటా రు‘బాబే’... చంద్రబాబు దీక్షకు కూర్చున్నప్పటి నుంచి ఏపీభవన్‌లో ఆ పార్టీ నాయకులు అన్ని విషయాల్లోనూ మా యిష్టం అన్నట్టు వ్యవహరిస్తున్నారని కొందరు సిబ్బంది వాపోతున్నారు. భద్రతా కారణాల రీత్యా మామూలు సమయాల్లో సామాన్యులకు మెయిన్‌గేట్ నుంచి అనుమతి ఉండదు. నిత్యం అక్కడ విధులు నిర్వర్తించే మీడియా ప్రతినిధులను సైతం ఒక్కోసారి గుర్తింపు కార్డులను చూపితేనే లోనికి అనుమతిస్తారు. కానీ రెండు రోజులుగా ఈ విధానానికి భద్రతా సిబ్బంది సైతం స్వస్తి చెప్పక తప్పనిస్థితి. ఎవరెవరు లోపలికి వస్తున్నారో సైతం తెలియని పరిస్థితి. క్యాంటీన్ కిటకిట..నిబంధనలు పట్టవట ఏపీ భవన్‌లోని వీఐపీ క్యాంటీన్లోకి సామాన్యులకు అనుమతి ఉండదు. సాధారణ వ్యక్తులకు కింద ఉన్న క్యాంటీన్లోకి మాత్రమే అనుమతిస్తారు. కానీ మంగళవారం ఇందుకు భిన్నంగా అందరినీ అనుమతించారు. చంద్రబాబు దీక్షతో వీఐపీ క్యాంటీన్ తలుపు బార్లా తెరిచేశారు. దీంతో ఏపీభవన్‌లోని గదుల్లో ఉంటున్నవారికి సైతం భోజనం దొరకని పరిస్థితి ఏర్పడింది. ఏపీభవ న్ భద్రత, దీక్షకు అనుమతి ,క్యాంటీన్ ఇలా ప్రతి చోటా టీడీపీ నాయకులు తమ రు‘బాబు’ చూపుతూనే ఉన్నారని పలువురు ఆరోపిస్తున్నారు. -
సోనియాకు రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారు
పొందూరు, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్‌ను సీఎం కిరణకుమార్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడులు సోనియాగాంధీకి తాకట్టుపెట్టేశారని వైఎస్సార్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం విమర్శించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పొందూరులో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రజాగర్జన సభకు హాజరైన వారికి తమ్మినేని ముందుగా శిరస్సువంచి పాదాభివందనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల అభీష్టం మేరకు వైఎస్ తనయ షర్మిల సమ్య్యై శంఖారావం పూరిస్తే, తనయుడు జగన్మోహన్ రెడ్డి సమైక్యాంధ్ర కోసం ఆమరణ దీక్ష చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలకు వెన్నుంటి నిలిచి నిరాహార దీక్షకు పూనుకోవడం నిజంగా గర్వించదగ్గ విషయమని అభివర్ణించారు. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు నాయుడు మంటగలుపుతుంటే ఎన్టీఆర్ కుమారులు చూస్తూ ఉండటం విడ్డూరంగా ఉందన్నారు. తెలుగు రాష్ట్రం ఒక్కటిగా ఉండాలనే ఆశయం ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్రెడ్డిలదని చెప్పారు. తాత వారసత్వం తీసుకున్నానంటూ జూనియర్ ఎన్టీఆర్ ప్రగల్భాలు పలకడమే తప్ప ఎదిరించేదేమీ లేదన్నారు. తక్షణమే చంద్రబాబుకు వ్యతి రేకంగా ఉద్యమాల్లో భాగస్వాలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా నాయకుడు కణితి విశ్వనాథం, పాలవలస రాజశేఖరం, హనుమంతు కిరణ్, ఎచ్చెర్ల సూర్యనారాయణ, వరుదు కల్యాణి, బల్లాడ హేమమాలినీ రెడ్డి, జనార్దనరెడ్డి, కూన మం గమ్మ, పైడి కృష్ణప్రసాద్, టి.శివప్రసాదరావు, మార్పు ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీలో పలువురి చేరిక జగన్మోహన్రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా ప్రజాగర్జన సాక్షిగా కాంగ్రెస్, టీడీపీలకు చెందిన సర్పంచ్‌లు 8 మంది, మాజీ సర్పంచ్‌లు 16 మంది, ఎంపీటీసీ మాజీ సభ్యులు 8 మంది మూకుమ్మడిగా వైఎస్సార్ సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో సర్పంచ్‌లు మజ్జి గోపాలకృష్ణ(నందివాడ), సీపాన అనిత (గోకర్ణపల్లి), పప్పల సత్యవతి(తోలాపి), గురుగుబెల్లి సరోజనమ్మ(పిల్లలవలస), బడి మణి(దల్లిపేట), గురుగుబెల్లి ఉషామతి(కోటిపల్లి), చల్ల ముఖలింగం(ధర్మపురం), పెద్దింటి రవి(బాణాం), టీడీపీ మాజీ ఎంపీపీ, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బి.ఎల్.నాయుడు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు సింగూరు అమ్మడు, కూన అయ్యపునాయుడు, పైడి గోవిందరావు, పి. సింహాచలం, పొన్నాడ అప్పన్న, రామారావు, సింహాచలం, మెట్ట రమణభట్లు తదితరులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే, కాంగ్రెస్ చెందిన మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు సీపాన శ్రీరంగ నాయకులు, గురుగుబెల్లి మధుసూదనరావు, వాసుదేవరావు, మజ్జి నరేంద్రనాయుడు, పెయ్యల తవిటిరాజు, సీపాన చక్రధరనాయుడు, పెద్దింటి శ్రీను, బొడ్డేపల్లి ప్రసాదరావు, కొండమ్మ, వండాన తవిటినాయుడు, పోతురాజు సూర్యారావు, జ్యోతి, మెదలవలస పాపారావు, దుంపల సత్యవతి తదితరులతో సుమారు 5000 మంది వరకు పార్టీలో చేరారు. -
బాబు విధానాలపై ‘దేశం’నాయకుల్లో వ్యతిరేకత
సాక్షి ప్రతినిధి, గుంటూరు : తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడిపై ఆ పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయన కొంతకాలంగా అనుస రిస్తున్న విధానాలు పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయనే భావనలో నాయకులు ఉన్నారు. ఇదే వైఖరి కొనసాగితే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో డిపాజిట్లు దక్కవనే భయం వారిని వెన్నాడుతోంది. చెబితే వినడు...తెలుసుకోడని సీనియర్లు మధనపడుతున్నారు. ప్రధానంగా మూడు విషయాల్లో అధినేత అనుసరించిన విధానాలు పార్టీని కోలుకోలేని దెబ్బ తీశాయంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి బెయిల్ రాకుండా ఢిల్లీలో చేసిన ప్రయత్నాలు, బీజేపీతో పొత్తుకు య త్నిస్తున్నారనే భావన అందరిలో కలిగే విధంగా వ్యవహరించడం, విభజనపై రెండు కళ్ల విధానం అంటూ సీమాంధ్ర అంతా పర్యటిస్తానని చెప్పి రెండు జిల్లాలతో ఆత్మగౌరవ యాత్ర సరిపెట్టుకోవడంతో పార్టీపై విశ్వసనీయత లేకుండా పోతుందనే భావనకు వస్తున్నారు. సొంత పార్టీ పటిష్టత కంటే ఇతర పార్టీలపై బురద జల్లే ప్రయత్నాలు చేయడం వల్ల ‘బాబు’ నిజాలు చెప్పినా ప్రజలు నమ్మె స్థితిని దాటిపోయారని నేతలంటున్నారు. పరువు గంగపాలు... వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చే స్థితిలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరుతూ బాబు రాసిన లేఖలో ‘జగన్ కేసుల గురించి చెప్పేందుకని’ పేర్కొన్న అంశం బయటకు రావడంతో అధినేత పరువు గంగలో కలిసిందంటున్నారు. జగన్ బెయిల్ అంశం కోర్టు పరిధిలో ఉన్నప్పుడు దాన్ని ప్రభావితం చేసేలా రాష్ట్రపతిని కలవడం అనేక విమర్శలకు దారితీసింది. జగన్‌కు బెయిల్ రాకుండా గతంలో బాబు అనేక ప్రయత్నాలు చేశారనే ఆరోపణలు ఈ పర్యటన కారణంగా నిజమనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. రాష్ట్ర విభజన నిర్ణయం అనంతరం సీమాంధ్రలో పరిస్థితిని వివరించేందుకు ఢిల్లీ వెళ్లానని పేర్కొన్న బాబు అందుకు విరుద్ధంగా వ్యవహరించినట్టు వెల్లడైంది. గతంలో బీజేపీని మతతత్వ పార్టీగా విమర్శించిన బాబు, భవిష్యత్‌లో ఆ పార్టీతో పొత్తు ఉండదని కచ్చితంగా పేర్కొన్నారు. ఇప్పుడు ఆ దిశగా ఆలోచన చేస్తుండటంతో నాయకులు ఆందోళన చెందుతున్నారు. బీజేపీతో పొత్తు ఏర్పాటు చేసుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయనే అభిప్రాయ సేకరణలో కొందరు ముఖ్యనేతలున్నారు. ఇది తెలిసిన టీడీపీ నాయకులు బాబు వైఖరి అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. రెండు జిల్లాలతో ఆత్మగౌరవ యాత్ర సరి.. పులిని చూసి...నక్క వాతపెట్టుకున్నట్టు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల బస్‌యాత్ర ప్రారంభిస్తే, బాబు కూడా తెలుగు ఆత్మగౌరవ యాత్ర అంటూ సీమాంధ్రలో పర్యటిస్తానని ప్రకటించారు. రాష్ట్ర విభజన నిర్ణయంపై పూర్తి వ్యతి రేకతతో ఉన్న సీమాంధ్రులు బాబు చెప్పే కల్లబొల్లి మాటలు నమ్మకపోవడంతో గుంటూరు. కృష్ణా జిల్లాల్లో యాత్ర పేలవంగా సాగింది. దీంతో ఆత్మగౌరవ యాత్ర పేరును బాబు ప్రస్తావించడం లేదు. బాబు విధానాలతో తల బొప్పికట్టిన నేతలు ‘ఆయన అంతే ఇక మారరు’ అంటూ మధనపడుతున్నారు. -
ముగిసిన బాబు యాత్ర
సాక్షి, గుంటూరు : తెలుగు ప్రజల ఆత్మగౌరవం పేరిట టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబు చేపట్టిన బస్సు యాత్ర గుంటూరు జిల్లాలో పూర్తయింది. గురజాల నియోజకవర్గం పొందుగల వద్ద ఆదివారం ప్రారంభమైన యాత్ర ఆరు రోజులపాటు కొనసాగి శుక్రవారం రాత్రి కృష్ణాజిల్లాలోకి ప్రవేశించింది. బాబు యాత్రకు తొలి రోజు నుంచి చివరి రోజు వరకు జిల్లాలో జనస్పందన కరువైంది. సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న తరుణంలో జిల్లాలో ప్రవేశించిన చంద్రబాబును అడుగడుగునా సమైక్యవాదులు అడ్డుకున్నారు.తనదైన శైలిలో యాత్రను కొనసాగించిన బాబు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతనే మూటగట్టుకున్నారు. ఈ విషయమై ఆది నుంచి భావించినట్టుగానే పార్టీకి తీవ్ర నష్టం కలిగిందని తెలుగుదేశం వర్గాలు అంచనా వేస్తున్నాయి. చివరకు అథోగతి యాత్రగా మారిందనే విమర్శలూ వినిపించాయి. రాష్ట్ర విభజనపై తన నిర్ణయాన్ని వెల్లడిస్తారని ఎదురుచూసిన ప్రజలకు చివరి రోజు కూడా బాబు తనదారే సపరేటు అన్నట్టుగా వ్యవహరిస్తూ జిల్లాను దాటివెళ్లారు. సమైక్యాంధ్ర జేఏసీ నేతలు ఆచార్య శ్యామూల్, ఆచార్య పి.నరసింహారావు, డాక్టర్ వెంకటరమణ, కిషోర్‌తోపాటు విద్యుత్ జేఏసీ నేత రవిశేఖర్లు కంతేరు బస వద్ద చంద్రబాబును కలిసి మాట్లాడారు. సమైక్యాంధ్ర పరిరక్షణకు కృషిచేయాలని, ఉద్యమాలకు అండగా ఉండాలని కోరారు. అందుకు బాబు స్పందిస్తూ తాను రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల అభిప్రాయాలకు అనుగుణంగానే పనిచేస్తానని స్పష్టం చేశారు. అప్పుడు కూడా ఆయన సమైక్యాంధ్ర అనే పదం పలకకపోవడం గమనార్హం. ఆ తరువాత యాత్రలో ప్రసంగించిన చంద్రబాబు జిల్లాలోని కొండవీటి వాగు ఆధునికీకరణ, టెక్స్టైల్ పార్కుకు శంకుస్థాపన వంటి అభివృద్ధి పనులు తన హయాంలో జరిగినట్టుగానే గొప్పలు చెప్పుకున్నారు. దళితుల ఆగ్రహంతో ఉద్రిక్తత... కంతేరు గ్రామంలో చంద్రబాబు ప్రసంగిస్తూ వైఎస్సార్ సీపీ నేతలపై ఆరోపణలు చేయడంతో దళితవాడమిహ ళలు తీవ్రంగా స్పందించారు. బాబు మాట్లాడే తీరు అభ్యంతరకరంగా ఉందని ఆందోళన చేశారు. అదేవిధంగా నిడమర్రులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు చంద్రబాబు బసు దిగి రాకపోవడం ఉద్రిక్తతకు దారితీసింది. అనంతరం మంగళగిరి అంబేద్కర్ సెంటర్లో ఏపీఎన్జీవో జేఏసీ నేతలు సమైక్యాంధ్ర జిందాబాద్ అంటూ బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకుని బాబు కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ఈ సమయంలో బాబు వ్యక్తిగత భద్రతా సిబ్బంది పేరుతో పసుపు రంగు చొక్కాలు ధరించిన కొందరు కర్రలతో ఉద్యమకారుల్ని కట్టడి చేశారు. ఒకవైపు పోలీసు రోప్ పార్టీ, రాపిడ్యాక్షన్ బలగాలు, మరోవైపు బ్లాక్ క్యాట్స్‌తో పాటు పార్టీదళం కలిసి ఉద్యమకారుల్ని పక్కకు తోయడం, నెట్టడం విమర్శలకు దారితీసింది. తెలుగుప్రజల ఆత్మగౌరవయాత్ర పేరుతో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని అణచివేయడానికి చంద్రబాబు జిల్లాకు వచ్చినట్లు సమైక్య ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. కృష్ణా జిల్లాలోకి ప్రవేశం.. తాడికొండ నియోజకవర్గం కంతేరు గ్రామం బస శిబిరం నుంచి మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరిన బాబు యాత్ర నిడమర్రు, బాపూజీ నగర్, నీరుకొండ శిబిరం, మంగళగిరి పట్టణంలోని అంబటినగర్, డోలాస్‌నగర్, ప్రకాశ్‌నగర్, నులకపేట, ముగ్గురోడ్డు, ఉండవల్లి సెంటర్, సీతానగరం, ప్రకాశం బ్యారేజీ మీదుగా రాత్రికి కృష్ణా జిల్లా విజయవాడలోకి ప్రవేశించింది. -
బస్సుయాత్రలో చంద్రబాబు వైఖరి
సాక్షి, గుంటూరు : రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చిన టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు ఇక్కడకు వచ్చి జాతిని విచ్ఛిన్నం చేస్తే ఖబడ్దార్ అంటూ హూంకరించటాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. ఢిల్లీలో జీ హుజూర్ అని, ఇక్కడ హెచ్చరికలు ఏమిటనేది ప్రజలు ప్రశ్నిస్తున్నారు.తెలుగు ఆత్మగౌరవం అంటూ బాబు చేపట్టిన బస్సుయాత్ర లక్ష్యం ఏమిటో అర్థంకాక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. నాలుగు రోజులుగా జిల్లాలో పర్యటిస్తున్న బాబు విభజన నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఈ యాత్ర చేస్తున్నారా, లేఖ ఇచ్చిన తరువాత విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యం కోసం వచ్చారా అనేది తమకు అర్థం కావడం లేదని ప్రజలు అంటున్నారు. ఆయన ప్రసంగాల శైలి చూస్తే ఎన్నికలు రాకుండానే ఓట్ల కోసం వచ్చినట్టుందని ఎద్దేవా చేస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న బస్సుయాత్ర నాలుగో రోజు బుధవారం పెదకూరపాడు నియోజకవర్గంలో సాగింది. పెదకూరపాడు,అబ్బురాజుపాలెం, 75 త్యాళ్లూరు, లింగాపురం, ధరణికోట తదితర చోట్ల చంద్రబాబు మాట్లాడారు. గొప్పలు చెప్పుకున్న బాబు... ఈ రోడ్లు నేనే వేశా. తమ్ముళ్లూ మీకు ఉద్యోగాలు ఎవరిచ్చారు. రైతులూ ..నా పాలనలో ఏనాడైనా ఆందోళ న చేశారా. హైదరాబాద్ మహానగరాన్ని అందంగా తీర్చిదిద్దా. సైబరాబాద్ సృష్టికర్తను నేనే. అన్నింటి గురించి మాట్లాడే హక్కు నాకే ఉంది. నేనే గొప్ప, నా పాలనే గొప్ప...ఇలా సాగిన చంద్రబాబు ప్రసంగాలు తెలుగు తమ్ముళ్లకే కాదు, సామాన్యులకు సైతం విసుగుపుట్టించాయి. తన తొమ్మిదేళ్ల పాలనలో ఏర్పడిన కరువు కాటకాలు, కరెంటు ఉద్యమాలు, సాగునీటి అగచాట్లను పక్కన పెట్టి గొప్పలు పోతున్న బాబును చూసిన ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. ఉద్యమ ప్రస్తావనే లేదు.. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జిల్లాలో సమైక్యవాదులు చేస్తున్న ఉద్యమం గురించి చంద్రబాబు ఎక్కడా పట్టించుకోవడం లేదు. ప్రజలు సమస్య తన సమస్య కాదన్నట్టుగానే యాత్రలో సాగిపోతున్నారు. ఆయన వస్తున్న దారిలో సమైక్యాంధ్రను కాంక్షిస్తూ బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకుని వేచి చూస్తున్న ప్రజలు, విద్యార్థుల వైపు కనీసం కన్నెత్తికూడా చూడటం లేదు. 75 త్యాళ్లూరులో వివేకానంద విద్యాసంస్థల విద్యార్థులు జై సమైక్యాంధ్ర బ్యానర్, ప్లకార్డులు పట్టుకుని చంద్రబాబు కాన్వాయ్‌కు ఇరువైపులా నిల్చొని నిరసన తెలిపినా ఆయన కన్నెత్తి చూడలేదు. ఎక్కడా కూడా సమైక్యాంధ్ర అనే మాట వాడకుండా చంద్రబాబు తన ప్రసంగంలో జాగ్రత్తలు తీసుకోవడం గమనార్హం. తెలుగుజాతిని విచ్ఛినం చేస్తే ఖబడ్దార్ అంటు హెచ్చరిస్తున్నారు. దీంతో విభజనపై బాబు వైఖరి ఏమిటనేది స్పష్టం కావడం లేదని ప్రజలు అంటున్నారు. జనస్పందన కరువు... పెదకూరపాడు నియోజకవర్గంలో జరిగిన యాత్రకు జనస్పందన కరువైంది. మధ్యాహ్నం 12.10 నిముషాలకు యాత్ర ప్రారంభించిన బాబు రెండు మూడు గ్రామాల్ని దాటగానే భోజన విరామానికి ఆగారు. ఈ సమయంలో బస్సు లోపలకు జిల్లా నేతల్ని పిలిపించుకుని జన సమీకరణ ఏదంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇదిలావుంటే జిల్లాలో యాత్ర ప్రారంభ రోజు నుంచి పులిచింతల ప్రాజెక్ట్‌కు బదులు పులివెందుల అనటం వెంటనే క్షమించాలని కోరి పులిచింతలని చెప్పడం బాబుకు పరిపాటిగా మారింది. తన ప్రతి ప్రసంగంలో పదే పదే ‘ఖబడ్దార్, జాగ్రత్త..’ అని ఎందుకు అంటున్నారో ప్రజలకు అర్థంకావడం లేదు. -
బాబు ఆత్మరక్షణ యాత్ర
సాక్షి, గుంటూరు : రాష్ట్ర విభజనకు నిరసనగా సీమాంధ్రలో ఉవ్వెత్తున ఉద్యమం ఎగసిపడుతున్న తరుణంలో జిల్లాలో చంద్రబాబు చేపట్టిన ఆత్మగౌరవ యాత్ర కాస్తా ఆత్మరక్షణయాత్రగా మారింది. విభజనకు అనుకూలమంటూ ఏ పరిస్థితుల్లో తాను లేఖ ఇచ్చిందీ తెలియజేసేందుకు చేపట్టిన ఈ యాత్ర జిల్లా నాయకులకు సవాలక్ష తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఎక్కడ యాత్రకు అవరోధం కలుగుతుందోనన్న భయంతో బాబు ఆత్మరక్షణకోసమే ఎక్కువ తాపత్రయపడాల్సిన పరిస్థితులు దాపురించాయి. తొలిరోజు యాత్రలోనే జనం తనను సమర్థించే స్థితిలో లేరన్న వాస్తవం తేటతెల్లమయింది. ఆదినుంచీ యాత్ర వద్దని చెప్పిన జిల్లా నేతలు తమ నాయకునిపై మితిమీరిన విశ్వాసం పెంచుకున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం గల తమ అధినేత ప్రసంగాలు సీమాంధ్రులను కట్టిపడేస్తాయని పార్టీశ్రేణులు తలచారు. అదే ఊపుతో బస్సుయాత్ర అంగరంగ వైభవంగా జరిపించాలని ఏర్పాట్లు చేశారు. పల్నాడులోని పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో ప్రధాన రహదారుల్లో ఫ్లెక్సీలతో హడావుడి చేశారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన బస్సుయాత్ర కాస్తా మధ్యాహ్నం 2.00 గంటలు దాటిపోయింది. ఆశించిన స్థాయిలో జనసమీకరణ జరగకపోవడమే దీనికి ప్రధాన కారణం. పర్యటనకు సీనియర్ పార్టీ నేతలు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, డాక్టర్ కోడెల శివప్రసాద్, దూళిపాళ్ల నరేంద్ర, కొమ్మాలపాటి శ్రీధర్, ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనందబాబు తదితరులు హాజరైనా.. జనసమీకరణ మొత్తం సిట్టింగ్ ఎమ్మెల్యే యరపతినేని చూసుకుంటారనుకున్నారు. అయితే అనుకున్నదొకటి.. జరిగింది వేరొకటైంది. జనం లేకపోవడంపై అధినేత గెస్ట్‌హౌస్‌లోనే ఎక్కువసేపు ఉండిపోయారు. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వద్దువద్దని చెప్పినా వినకుండా బస్సుయాత్రకని వచ్చి .. తీరా జనాల్లేరని తమను నిందించడం ఎంతవరకు సబబని తమలో తామే బాధపడినట్టు సమాచారం. దాచేపల్లి, పిడుగురాళ్ల, చిలకలూరిపేట నుంచి బస్సులు, లారీల్లో జనం అక్కడకు వచ్చినా .. బాబు ప్రసంగాలతీరుపై అధికశాతం మంది విసుగుచెంది వెనుదిరిగారు. యాత్రకు ఎక్కడ అవరోధంగా నిలుస్తారోనన్న భయంతో అనుమానితుల్ని బలవంతంగా యాత్రనుంచి బయటకు నెట్టేయడంతో వచ్చిన కొంతమంది కూడా భయంతో బిక్కచచ్చిపోయారు. ఎవరైనా అడ్డుపడితే వారి అంతు తేలుస్తామంటూ జిల్లా నాయకులు ఒకరిద్దరు చేసిన హెచ్చరికలు వారి ఆత్మవిశ్వాసంపైనే అనుమానాలు రేకెత్తించేలా చేశాయి. హైదరాబాద్ అభివృద్ధి తనదేనంటూ బాబు గొప్పలు తొలిరోజు సభలన్నింట్లోనూ హైదరాబాద్ అభిృద్ధికి తానే కారకుడినంటూ తెగ గొప్పలు చెప్పారు బాబు. తీరా ఇప్పుడు విభజనవల్ల హైదరాబాద్ పరిస్థితి ఏమిటన్నదానిపై స్పష్టత ఇవ్వలేకపోయారు. ఎన్డీఏ హయాంలో విభజనను అడ్డుకున్నది తానేనని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు విభజనకు అనుకూలంగా లేఖ ఎందుకు ఇచ్చారన్నది తెలియజేయలేకపోయారు. తెలుగువారి ఆత్మగౌరవానికి తన మామ ఎన్టీరామారావు చేసినకృషి ఏకరువు పెట్టారేగానీ, ఇప్పుడు తాను చేసిందేమిటో చెప్పలేదు. మొత్తమ్మీద ఆయనచేసిన ప్రసంగాలు ఎవరినీ ఆకట్టుకోలేకపోవడంతో యాత్రపై జిల్లా నేతలు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. వేగంగా దూసుకెళ్తున్న బస్సు.. చంద్రబాబు బస్సుయాత్ర గురజాల నియోజకవర్గం నుంచి ప్రారంభం కాగా, తొలిరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రానికే పొందుగుల, శ్రీనగర్, నారాయణపురం, దాచేపల్లి మీదుగా పిడుగురాళ్ల చేరింది. రాత్రికి అక్కడే బసచేసిన బాబు సోమవారం రెండోరోజు యాత్రను సత్తెనపల్లి నియోజకవర్గంలో కొనసాగించనున్నారు. బస్సులో కూర్చొని జనాలు ఉన్నచోట పైకివచ్చి అభివాదాలు చేయడం, ఒకటిరెండు చోట్ల మాత్రమే ప్రసంగాలివ్వడం చేస్తున్నారు. దీన్నిబట్టి యాత్ర షెడ్యూల్ చాలా వేగంగా జరగనున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. -
నయవంచన రాజకీయాలకు 'చంద్రబాబు' కేరాఫ్ అడ్రస్
నయవంచన రాజకీయాలకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అని స్థానిక ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి గురువారం తిరుపతిలో ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్రానికి లేఖ ఇచ్చి తెలుగువారికి బాబు ద్రోహం చేశారని ఆయన పేర్కొన్నారు. అలాగే మరోసారి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేఖ రాసి ప్రజలను వంచించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ అవలంభించిన నిరంకుశ వైఖరికి నిరసనగా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ఆమరణదీక్షకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు బాసటగా నిలుస్తున్నారని కరుణాకర్‌రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. దీని ద్వారా రాష్ట్ర ప్రజలు సమన్యాయం కావాలని కోరుకుంటున్నారని అర్థమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
దేవినేని ఉమ కొత్త ఎత్తుగడ!
సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రెండు నాలుకల ధోరణి వల్ల సీమాంధ్రలో ఆ పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడింది. జిల్లాలో పార్టీని కాపాడుకునేందుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు కొత్త ఎత్తుగడ వేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొండా ఉమామహేశ్వరరావుతో కలిసి గురువారం ఉదయం 10 గంటలకు హోటల్ డీవీ మేనర్ సమీపంలో నిరవధిక నిరాహారదీక్షకు సిద్ధమవుతున్నారు. 2009 డిసెంబర్లో రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు కేంద్రమంత్రి చిదంబరం ప్రకటన చేయగానే తెలుగుదేశం పార్టీ తరుఫున ఈ ఇద్దరు నేతలు నగరంలో నిరవధిక దీక్ష చేశారు. ఇప్పుడు రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన 14 రోజులు తరువాత స్పందించడంపై ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాశంగా మారింది. చంద్రబాబుపై వత్తిడి పెంచి ఉంటే.... గుంటూరు జిల్లా పొన్నూరులో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, విజయవాడలో దేవినేని ఉమ నిరవధిక దీక్ష చేయడానికి ప్రాధాన్యం ఇచ్చే కంటే, చంద్రబాబుతో సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రకటన చేయించడానికి వత్తిడి పెంచే ప్రయత్నం చేసి ఉంటే బాగుండేదని పార్టీలో సీనియర్ నేతలు వ్యాఖానిస్తున్నారు. ఎపీఎన్జీవోల సంఘ నాయకులు వెళ్లి కోరినా, తెలంగాణకు అనుకూలంగా తాను ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకోనని చంద్రబాబునాయుడు తేల్చి చెప్పడాన్ని వారు తప్పు పడుతున్నారు. జిల్లా నేతలు నిరవధిక దీక్షకు సిద్ధమైనా చంద్రబాబును తెలంగాణావాదిగానే ప్రజలు చూస్తారే తప్ప సమైక్యవాదిగా గుర్తించరని అంటున్నారు. ఆయన అనుసరిస్తున్న రెండు కళ్ల సిద్ధాంతం వల్లనే జిల్లాలో పార్టీ దెబ్బతింటోందనేది వారి భావన. పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు దేవినేని ఉమ, ధూళిపాళ్ల నరేంద్ర వంటి వారు ఆమరణదీక్ష చేస్తుంటే కనీసం చంద్రబాబు వచ్చి వారిని పరామర్శించి, దీక్షకు తమ మద్దతు ప్రకటిస్తారా? లేదా? అన్న అంశం పార్టీలో చర్చనీ యాశంగా మారింది. చంద్రబాబు పట్టించుకోని ఈ దీక్షల వల్ల పార్టీకి ఎంత మేరకు ప్రయోజనం ఉంటుందనేది మరో ప్రశ్న. మహాధర్నాను పట్టించుకోని చంద్రబాబు గతంలో కృష్ణాడెల్టాకు సాగునీరు విడుదల చేయకూడదంటూ తెలంగాణకు చెందిన ఒక ఇంజినీర్ కోర్టులో కేసుదాఖలు చేశారు. దీంతో కృష్ణాడెల్టాకు సకాలంలో సాగునీరు అందక రైతులు విలవిలలాడారు. ఆ సమయంలో దేవి నేని ఉమ కృష్ణానది ఇసుక తిన్నెల్లో మహా ధర్నా నిర్వహించారు. ఈ దీక్షకు కోస్తాంధ్రా ప్రాంత తెలుగుదేశం పార్టీ నాయకులంతా వచ్చినా చంద్రబాబు మాత్రం హాజరుకాలేదు. తెలంగాణ ప్రాంత నేతల ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందనే భయంతోనే ఆయన అప్పట్లో మహాధర్నాకు దూరంగా ఉన్నారని ప్రచారం జరిగింది. ఆ తరువాత ఇంద్రకీల్రాది వద్ద ఫ్లైఓవర్ నిర్మించాలన్న స్థానిక సమస్యపై ఆందోళన చేస్తే మాత్రం చంద్రబాబు వచ్చి తీవ్రంగా స్పందించారు. ఇప్పుడు కూడా చంద్రబాబు తెలంగాణప్రాంత ప్రయోజనాలను కాపాడేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప సమైక్యాంధ్ర ప్రయోజనాలను పట్టించుకోవడంలేదని ప్రజలు నుంచి విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు సీమాంధ్రపై ప్రత్యేక శ్రద్ధ చూపనంత వరకు దేవినేని ఉమామహేశ్వరరావు వంటి వారు చేసే నిరసన కార్యక్రమాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు.