అడ్మిషన్లు వెంటనే మొదలుపెట్టండి: చంద్రబాబు | Don't delay admissions in professional courses, Chandrababu Naidu writes letter to KCR | Sakshi
Sakshi News home page

అడ్మిషన్లు వెంటనే మొదలుపెట్టండి: చంద్రబాబు

Published Sat, Jul 12 2014 4:38 AM | Last Updated on Tue, Oct 2 2018 7:58 PM

అడ్మిషన్లు వెంటనే మొదలుపెట్టండి: చంద్రబాబు - Sakshi

అడ్మిషన్లు వెంటనే మొదలుపెట్టండి: చంద్రబాబు

కేసీఆర్‌కు చంద్రబాబు లేఖ
 సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత విద్యా సంవత్సరం (2014-15)లో ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖరరావుకు శుక్రవారం లేఖ రాశారు. అడ్మిషన్లు ఆలస్యం కావడం వల్ల ఇరు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఇతర రాష్ట్రాల కాలేజీల కు వెళ్లి చేరాల్సి వస్తోందని, దీనివల్ల వారి తల్లిదండ్రులకు ఆర్థికంగా భారం కావడంతో పాటు మానసికంగా ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. సరైన సమయంలో కౌన్సెలింగ్ పూర్తిచేసి అడ్మిషన్లు చేపడితే రెండు రాష్ట్రాల విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా ఉంటారని చెప్పారు. ఆగస్టు నుంచి తరగతులు ప్రారంభం కావాలని సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా జారీచేసిందని ఆ లేఖలో గుర్తుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement