Telangana Chief Minister
-
వీధుల్లో కాదు విధుల్లోకి...
కొన్ని సంవత్సరాల క్రితం...‘పోలిస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయాలని ఉంది’ అన్నది శ్రీకళ. అక్కడ ఉన్న వాళ్లు పెద్దగా నవ్వారు. ‘నేను జోక్ చేయడం లేదు. నిజమే చెబుతున్నాను’ అన్నది ఆమె. మరోసారి బిగ్గరగా నవ్వారు వాళ్లు. ఆ నవ్వులలో వెటకారాల వేటకొడవళ్లు దాగి ఉన్నాయి. ఆ పదునుకు గాయపడ్డ హృదయంతో శ్రీకళ కళ్లలో నీళ్లు. ‘ఇక నా బతుకు ఇంతేనా’ అనే బాధతో తల్లడిల్లి పోయింది.ట్రాఫిక్ అసిస్టెంట్లుగా శిక్షణలో భాగంగా ట్రాన్స్జెండర్లు కట్ చేస్తే...ట్రాన్స్జెండర్లకు ఆర్థిక భరోసా ఇవ్వడానికి, సమాజంలో గౌరవం కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆదేశాలతో హైదరాబాద్ పోలీసు విభాగం ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ఎంపిక చేసుకుంది. తుదిదశ శిక్షణలో ఉన్న 39 మంది విధుల్లోకి రానున్నారు. బహుశా ఈ వార్త ట్రాన్స్‌జెండర్ శ్రీకళకు చేరి ఉంటుంది. ఆమెలాంటి ఎంతోమంది ట్రాన్స్జెండర్లకు ఆత్మవిశ్వాసాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చి ఉంటుంది.‘నా బిడ్డ భవిష్యత్తు గురించి భయంగా ఉంది’ అని తెలిసిన వాళ్ల దగ్గర కళ్ల నీళ్లు పెట్టుకునే శ్రీవల్లి తల్లి బాలమణి ఇప్పుడు ‘దేవుడు నా బిడ్డను సల్లగా సూసిండు. ఇంక నా బిడ్డకు ఢోకాలేదు’ అని సంబరపడిపోతోంది. భానుప్రియను చూసి చుట్టాలు, పక్కాలు పక్కకు తప్పుకునేవాళ్లు.‘నేను చేసిన తప్పేమిటీ!’ అంటూ తనలో తాను కుమిలిపోయేది భానుప్రియ. ‘నువ్వేమీ తప్పు చేయలేదమ్మా... ధైర్యంగా ఉండు... తలెత్తుకు తిరుగు’ అంటూ పోలీస్ ఉద్యోగం ఆమెను వెదుక్కుంటూ వచ్చింది. ఎం.ఏ. చదువుతున్నప్పటికీ భిక్షాటన చేయక తప్పని పరిస్థితుల్లో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడింది లచ్చిగూడెం బిడ్డ జెస్సీ. ‘మేమున్నాం’ అంటూ ఎవరూ ముందుకు రాలేదు. ‘నాకు నేనే ఒక సైన్యం’ అని ధైర్యం చెప్పుకున్న జెస్సీ ట్రాఫిక్ అసిస్టెంట్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించనుంది.‘పోలీసు ఉద్యోగం చేయాలి’ అనేది కారం సన చిన్నప్పటి కల. ఆ తరువాతగానీ తనకు తెలియదు... అదెంత కష్టమో! తన కల గురించి ఇతరులతో చెప్పుకోవడానికి కూడా భయపడే సన ఇప్పుడు... ‘నా కలను నిజం చేసుకున్నాను’ అంటుంది గర్వంగా.కందుల భానుప్రియ నుంచి కారం సన వరకు ఎంతోమంది ట్రాన్స్జెండర్లు పడని మాట లేదు. పడని కష్టం లేదు. ఆ కష్టాలకు ముగింపు వాక్యంలా వారికి ఉద్యోగాలు వచ్చాయి. అయితే అవి కేవలం ఉద్యోగాలు మాత్రమే కాదు... వారి ఆత్మస్థైర్యాన్ని మరోస్థాయికి తీసుకువెళ్లిన ఆత్మగౌరవ సంకేతాలు.అపూర్వ అవకాశంతెలంగాణ పోలీసు విభాగంతో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా ఈ ట్రాఫిక్ అసిస్టెంట్ల ఎంపిక విధివిధానాలను ఖరారు చేసింది. మహిళా శిశుసంక్షేమ శాఖ సెక్రటరీ అనిత రాంచంద్రన్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్త, హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నిబంధనలు ఖరారు చేశారు. సాంఘిక సంక్షేమశాఖ నుంచి అర్హులైన ట్రాన్స్జెండర్ల జాబితాను సేకరించారు. దీని ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపట్టారు. దీనికి 58 మంది ట్రాన్స్జెండర్లు హాజరు కాగా. 44 మంది ఎంపికయ్యారు. అనివార్య కారణాలతో ఐదుగురు శిక్షణ మధ్యలోనే వెళ్లిపోగా, మిగిలిన 39 మంది దాదాపు 20 రోజులపాటు వివిధ అంశాల్లో శిక్షణ తీసుకున్నారు. వీరికి ఇటీవల ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందించారు. ఒకటి రెండు రోజుల్లో వీరు యూనిఫాంతో విధుల్లోకి రానున్నారు. వీరికి హోంగార్డుల మాదిరిగా రోజుకు రూ.921 చొప్పున వేతనం ఇవ్వనున్నారు.ఎవరూ పని ఇవ్వలేదుఖమ్మంలోని పందిళ్లపల్లి కాలనీ నా స్వస్థలం. పదో తరగతి పూర్తి చేసినా ఇప్పటివరకు ఎవరూ పని చేయడానికి అవకాశం ఇవ్వలేదు. దీంతో రోడ్లపై భిక్షాటన చేసుకుంటూ బతికా. నా తల్లి బాలమణి, కుటుంబ సభ్యులు అంతా నా భవిష్యత్తుపై ఆందోళనతో ఉండేవాళ్లు. హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన ఈ అవకాశం నన్ను నేను నిరూపించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ 20 రోజుల శిక్షణ కాలం ఎన్నో విషయాలు నేర్పింది. జీవితానికి ఉన్న విలువని తెలిపింది.– కె.శ్రీవల్లిబాబాయి పెళ్లికి రావద్దన్నారు! సూర్యాపేట జిల్లా కందిబండలో పుట్టా. ఇంటర్ వరకు చదివా. కుటుంబీకులు కూడా దూరం పెట్టారు. సొంత బాబాయి పెళ్లికి కూడా నన్ను రావద్దని, వస్తే తమ పరువు పోతుందని చె΄్పారు. ఇప్పుడు పోలీసు విభాగంలో ఉద్యోగం వచ్చిందని తెలిసి అంతా ఫోన్లు చేస్తున్నారు. నా భర్త, అత్తమామలు కూడా సంతోషించారు. కేవలం పోలీసు విభాగమే కాదు అన్నింటిలోనూ మాకు సమాన అవకాశాలు ఇవ్వాలి. టాన్స్జెండర్లకు వివిధ రంగాల్లో ఆసక్తి ఉన్నా అవకాశం దొరకట్లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వీధుల్లో భిక్షాటన చేసుకుని బతుకుతున్నారు.– కందుల భానుప్రియచిన్నప్పటి కల నెరవేరిందిభద్రాచలం సమీపంలోని రామచంద్రునిపేట నా స్వస్థలం. బీఏ కంప్యూటర్స్ పూర్తి చేసిన తర్వాత సొంతంగా వ్యాపారం పెట్టాలనుకున్నాను. బ్యాంకు రుణాలు రావని కొందరు చెప్పడంతో మిన్నకుండిపోయా. ఏ ఉద్యోగాలూ దొరకలేదు. చిన్నప్పటి నుంచి పోలీసు అవాలనే కోరిక ఉంది. అయితే సర్టిఫికెట్ల ప్రకారం పురుషుడిగా, రూపం, హావభావాలు స్త్రీ మాదిరిగా ఉండటంతో అది సాధ్యం కాలేదు. ఇప్పుడు ట్రాఫిక్ అసిస్టెంట్ ఉద్యోగం ద్వారా పోలీసు డిపార్ట్మెంట్లోకి అడుగుపెడుతున్నా. ఈ శిక్షణలో నేర్పిన అనేక అంశాలను సద్వినియోగం చేసుకుంటూ సమాజంలో నన్ను నేను నిరూపించుకోవాలనుకుంటున్నాను.– కారం సనఎక్కువ జీతం కాదనుకొని...భద్రాచలం సమీపంలోని గిరిజన ప్రాంతమైన లచ్చిగూడెం నా స్వస్థలం. నర్సింగ్ పూర్తి చేసి ప్రస్తుతం ఎం.ఏ. సోషియాలజీ చేస్తున్నాను. గతంలో ఎనిమిదేళ్లపాటు భద్రాచలంలోని ఓ ఎన్జీవోలో పని చేశా. మూడేళ్లక్రితం హైదరాబాద్‌కు వచ్చి ఓ ఎన్జీవోలో కౌన్సిలర్‌గా చేరా. రెండేళ్లకు వారి ఒప్పందం పూర్తికావడంతో అప్పటి నుంచి భిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నా. ఈమధ్య మరో ఎన్జీవోలో ఎక్కువ జీతానికి ఆఫర్ వచ్చింది. అది వదులుకుని దానికంటే తక్కువ జీతం వస్తుందని తెలిసినా ట్రాఫిక్ అసిస్టెంట్‌గా చేరుతున్నా. ఎందుకంటే ఎన్జీవోలో పని చేస్తే నేను ఏం చేస్తున్నాననేది నా వాళ్లకు తెలియదు. భిక్షాటన చేస్తూనో, మరోరకంగానో బతుకుతున్నా అనుకుంటారు. ఈ ఉద్యోగం చేస్తుంటే యూనిఫాంతో నా పని అందరికీ తెలుస్తుంది. మాపై ఉన్న దురభిప్రాయం పోతుంది. – జెస్సీ– శ్రీరంగం కామేష్, సాక్షి, హైదరాబాద్ -
వెన్నుపోటుదారులకు బుద్ధి చెప్పండి
ముంబై: దివంగత శివసేన అధినేత బాల్ ఠాక్రేకు ఏక్నాథ్ శిందే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు అజిత్ పవార్, కాంగ్రెస్ నేత రాహుల్ గాందీకి మిలింద్ దేవ్రా వెన్నుపోటు పొడిచారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ ముగ్గురు మోసగాళ్లకు మహారాష్ట్ర ప్రజలు ముఖ్యంగా అక్కడి తెలుగు ప్రజలు తమ ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ)ల మహావికాస్ ఆఘాడీ (ఎంవీఏ)కూటమిని గెలిపించాలని కోరారు. రేవంత్ బుధవారం సాయంత్రం ముంబైలో తెలుగు ప్రజలు నివసించే వర్లీ, ధారావి, సైన్ కోలివాడల్లో ఎంవీఏ అభ్యర్థులకు మద్దతుగా బహిరంగ సభలు, రోడ్‌షోల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార మహాయుతి కూటమిపై విమర్శలు గుప్పించారు. ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేను వర్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, నిజామాబాద్ కోడలైన వర్షా గైక్వాడ్‌ను ధారావి నుంచి భారీ మెజారీ్టతో గెలిపించాలని కోరారు. ఇక్కడి తెలుగు ప్రజల సమస్యలన్నింటినీ ఎంవీఏ ప్రభుత్వం పరిష్కరించేలా తాను హామీగా ఉంటానని తెలిపారు. కాగా వర్లీ బీడీడీ చాల్స్‌లో నివసించే స్థానిక తెలంగాణ ప్రజలు రేవంత్‌రెడ్డి రోడ్డు షోకు బ్రహ్మరథం పట్టారు. దీంతో రేవంత్‌రెడ్డి కూడా తాను ముంబైలో కాకుండా నిజామాబాద్, కరీంనగర్లో ఉన్నట్టుగా అనిపిస్తోందని అన్నారు. రోడ్డు షోకు ముందు రేవంత్‌రెడ్డి వర్లీ బీడీడీ చాల్స్‌లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు తెలంగాణ ప్రజలు వారి సమస్యలు తెలుపుతూ వినతిపత్రాలు సమరి్పంచారు. -
స్ఫూర్తిమంతమైన విజయపథంలో... సీఎం రేవంత్ రెడ్డి
ప్రత్యర్థులు ఎన్ని అవరోధాలు కల్పించినా అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో విజయం సాధించారు అనుమల రేవంత్ రెడ్డి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కొంత స్తబ్ధంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు చేర్చడంలో రేవంత్ పాత్ర అంతా ఇంతా కాదు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ పగ్గాలు చేపట్టాక దూకుడుగా ఉంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరు సాగించారు. ఈ సమయంలో పార్టీలో సీనియర్లు, జూనియర్లనే భేదం లేకుండా అందరినీ కలుపుకు పోయారు. కేసీఆర్‌ను గద్దెదించుతానని శపథం చేసి నిజంగానే ఆయన్నిఇంటికి పంపారు. 2023, డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ పదవీ ప్రమాణం స్వీకారం చేసి ప్రజా పాలనను ప్రారంభించారు.రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా (ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లా) వంగూర్ మండలం కొండారెడ్డి పల్లెలో జన్మించారు. చిన్ననాటి నుంచి నాయకత్వ లక్షణాలున్న రేవంత్ పాఠశాలలో చదివే రోజుల్లోనే స్టూడెంట్ లీడర్ అయ్యారు. 2006లో మహబూబ్‌నగర్ జిల్లాలోని మిడ్జెల్ జడ్పీటీసీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్సీగా విజయం సాధించారు. అనంతరం టీడీపీలో చేరారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి శాసనసభకు టీడీపీ అభ్యర్థిగా గెలిచారు.మళ్లీ 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభ జన తర్వాత... అదే నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా రెండోసారి గెలిచారు. 2017లో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018లో రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఓటమి పాలైనా, మరుసటి ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలుపొందారు. ఎంపీగా అత్యుత్తమ పని తీరును కనబరిచారు. దీంతో కాంగ్రెస్ అగ్ర నాయకత్వం దృష్టిలో పడ్డారు. ఈ నేపథ్యంలో 2021లో రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అధిష్ఠానం నియమించింది.అన్నీతానై 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోని లోపాలను ఎత్తిచూపారు. వారి అవినీతిని బయట పెట్టారు. కాంగ్రెస్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ప్రజలను నమ్మించి కాంగ్రెస్‌ను విజయ తీరాలకు చేర్చారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని రోల్ మోడల్‌గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి అహర్నిశలు శ్రమిస్తున్నారు. ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’ కింద వైద్య చికిత్సకు పది లక్షల వరకు సాయం పెంచారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు. గత 11 నెలల్లో తెలంగాణలో మహిళలు 101 కోట్ల ఉచిత బస్సు ప్రయాణ ట్రిప్స్ ఉపయోగించు కున్నారు. దీని వల్ల మహిళలకు 3,433 కోట్ల రూపా యలు ఆదా అయ్యాయి. రుణమాఫీని బీఆర్ఎస్ పదేళ్లలో సక్రమంగా అమలు చేయకుండా చేతులెత్తేసింది. ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీని కేవలం 8 నెలల్లోనే అమలు చేసింది కాంగ్రెస్. 22 లక్షల 22 వేల మంది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసింది. పేద లకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ను అందిస్తున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ ఇవ్వని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 500లకే గ్యాస్ సిలిండర్‌ను ఇస్తోంది.చదవండి: పింఛన్లు పెంచరా? మాటకు కట్టుబడరా?కేవలం 11 నెలల్లోనే సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో వేల కొలది ఉద్యోగాలను భర్తీ చేశారు. మూసీ నది పునరుజ్జీవానికి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూని వర్సిటీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నారు. 11 నెలల కాలంలోనే బీఆర్ఎస్ పాలనలోని చీకట్లను రేవంత్ రెడ్డి పారదోలి తెలంగాణను అన్ని రంగాల్లో గణనీయంగా అభివృద్ధి చేస్తున్నారు. అటువంటి ప్రియ ముఖ్యమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు!- వెలిచాల రాజేందర్రావు (Velichala Rajender Rao)కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి(నవంబర్ 8న సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం) -
సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు
మంచిర్యాల, సాక్షి: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కేసు నమోదు అయ్యింది. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు మంచిర్యాల పోలీసులు . సోమవారం మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బాల్క సుమన్, సీఎం రేవంత్‌రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను ఉద్దేశించి సీఎం హోదాలో రేవంత్ అనుచితంగా మాట్లాడారని అంటూనే.. ఈ క్రమంలో సీఎం రేవంత్‌పై బూతు పదజాలం వాడారు బాల్క సుమన్. ఆ సమయంలో కార్యకర్తలు విజిల్స్ వేయడంతో.. సుమన్ ఊగిపోయారు. అంతేకాదు.. రేవంత్‌ను చెప్పుతో కొడతానంటూ ఆగ్రహంతో వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వెంటనే సంస్కారం అడ్డువస్తోందంటూ సర్దిచెప్పుకునే యత్నం చేశారాయన. ఆ ప్రసంగం వీడియో వైరల్ కావడంతో.. కాంగ్రెస్ నేతలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో బాల్క సుమన్‌పై సెక్షన్లు 294బీ, 504, 506 సెక్షన్లపై కేసు నమోదైనట్లు సమాచారం. 👉: బాల్క్ సుమన్‌పై ఎఫ్ఐఆర్ -
కాంగ్రెస్ సర్కార్‌ను కూల్చే దమ్ముందా?: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, ఆదిలాబాద్: తన పాలనలో కేసీఆర్ ఏనాడూ ఆదివాసీ బిడ్డల గురించి ఆలోచించలేదని.. ఆలోచించి ఉంటే ఇవాళ నాగోబా ఆలయ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చేదని నిలదీశారు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి. శుక్రవారం సాయంత్రం ఇంద్రవెల్లిలో పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించిన ఆయన.. వేదిక నుంచి బీఆర్ఎస్పై, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘ఈ వేదిక సాక్షిగా చెబుతున్నా.. ఆదిలాబాద్‌ను దత్తత తీసుకుంటాం. ఈ అడవి బిడ్డల ఆదివాసీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి తీరుతాం. తప్పకుండా ఆదివాసీ కుటుంబాలను గుండెల్లో పెట్టుకుంటాం. ఇందిరమ్మ సోనియా రాజ్యం తెచ్చుకుంటాం. కేసీఆర్‌నును నేరుగా అడుగుతున్నా. ఎప్పుడైనా ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ బిడ్డల గురించి ఆలోచించారా?. నిజంగా అభివృద్ధి చేస్తే ఎందుకు నీళ్ళ కోసం నాగోబా గుడి కోసం రోడ్ల కోసం నిధులు మేము ఇచ్చే పరిస్తితి ఎందుకు వచ్చింది. చెరుకు పంటలో అడవి పందులు ఏ విధంగా దాడి చేస్తాయో అదే విధంగా తెలంగాణ పై కేసీఆర్ కుటుంబం దాడి చేసి విధ్వంసం చేశారు. .. ఎంత సేపు నీ బిడ్డలు నీ ఫామ్ హౌజ్ లు తప్ప.. రాష్ట్రంలోని బిడ్డల కోసం ఆలోచించావా?. కవిత ఓడిపోతే వెంటనే ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చావు. మరి స్టాఫ్ నర్సులు కానిస్టేబుల్స్ ఉద్యోగాలు ఇచ్చావా? అంటూ కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. బిల్లా రంగాలు(కేటీఆర్, హరీష్‌రావులను ఉద్దేశిస్తూ..) ఎంత శాప నార్ధాలు పెట్టినా 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత మాదే అంటూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఎవడ్రా కూల్చేది? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా కాలేదు. అప్పుడే శాప నార్డాలు పెడుతున్నారు. మరి 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏం చేశారు మీరు?. ప్రభుత్వం కూలి పోతుంది అని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ముందా?. ఎవడ్రా కూల్చేది?. ప్రజల్లారా.. మీరు ఊరుకుంటారా?. చెట్లకు కట్టేసి భరతం పట్టండి. కేసీఆర్ పాపాల భైరవుడు. మళ్లీ జీవితంలో సీఎం కారు. మూడు నెలలకో, ఆరు నెలలో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతాడని ఎవరైనా అంటే పళ్లు రాలగొడతాం. .. ఆరేడు ఎంపీ సీట్లు వస్తాయని కేసీఆర్ అంటున్నారు. వస్తే మోదీకి అమ్ముకుందాం అనా?. దేశంలో ఉన్నవి రెండే కూటములు. ఒకటి మోదీ కూటమి.. రెండోది ఇండియా కూటమి. కేసీఆర్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఇండియా కూటమిలోకి రానివ్వం. ఆ ఇంటి పిట్టను ఈ ఇంటి మీద వాలితే కాల్చి పారేస్తాం. మోదీ కేడీ(కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ..) ఇద్దరూ కలిసి కాంగ్రెస్ ను అడ్డుకోవాలని చూస్తున్నారు. మళ్లీ మతం పేరుతో వాళ్లు ఎన్నికలకు వస్తున్నారు. మోదీ ఎవరి ఖాతాలో అయినా రూ.15 లక్షలు జమ చేశారా? సోయంబాపురావుకు కనీసం కేంద్ర మంత్రి కూడా ఇవ్వలేకపోయారు. అలాంటప్పుడు ఓటేందుకు వేయాలి?. రాహుల్ ప్రధాని కావాలంటే ఆదిలాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగురాలి. త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ ఎవరి చేతుల్లో భద్రంగా ఉంటుందో ఆలోచించాలి’’ అని ప్రజల్ని కోరారాయన. కడెం మరమ్మత్తుల బాధ్యత మాది కోటి ఎకరాలకు నీళ్లు అన్నావ్? వస్తావా కేసీఆర్ ఆదిలాబాద్‌ను చూపిస్తాం. హెలికాఫ్టర్ పెడతాం.. ఎక్కడ నీళ్లు ఇచ్చావో చూపించు అని కేసీఆర్‌పై రేవంత్ ధ్వజమెత్తారు. ఇక.. తెలంగాణలో మహిళలకు రూ. 500 కు సిలిండర్ గ్యాస్ అందించే పథకం త్వరలోనే అమలు చేస్తామని.. 200 యూనిట్ల ఉచిత కరెంట్ త్వరలోనే అమలు చేస్తామని రేవంత్ అన్నారు. ‘‘తుమ్మిడి హిట్టి వద్ద ప్రాజెక్టు పూర్తి చేస్తాం. కడెం ప్రాజెక్టు మరమ్మతులు చేసే బాధ్యత మాది’’ అని రేవంత్ ప్రకటించారు. త్వరలోనే ఆ రెండు హామీలు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు హామీల అమలులో భాగంగా.. త్వరలో రెండింటిని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. శుక్రవారం కేస్లాపూర్ నాగోబా ఆలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన అక్కడ ఏర్పాటు చేసిన దర్బార్ కార్యక్రమంలో మాట్లాడరు. ఈ సందర్భంగా.. అతిత్వరలోనే రూ.500కి గ్యాస్ సిలిండర్ అందిస్తామని, అలాగే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ స్కీమ్ అమలు చేస్తామని ప్రకటించారు. మరికాసేపట్లో ఇంద్రవెల్లి అమరుల స్థూపానికి గౌరవ వందనం సమర్పించి.. అక్కడి సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ నుంచి ఆయన ప్రసంగిస్తారు. ప్రత్యేక పూజలు ఇక.. తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఎనుముల రేవంత్‌రెడ్డి నాగోబాను దర్శించుకున్నారు. ఈ పూజల్లో డిప్యూటీ సీఎం విక్రమార్కతోపాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
Gaddar Awards: నంది అవార్డు ఇక గద్దర్ అవార్డు
హైదరాబాద్, సాక్షి: కళాకారులకు ఇచ్చే నంది అవార్డుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా పేరు మారుస్తూ ప్రదానం చేయనున్నట్లు ప్రకటించనుంది. ఇక నుంచి కవులు కళాకారులకు నంది అవార్డులు కాదు గద్దర్ అవార్డులు ఇస్తాం అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి స్వయంగా తెలియజేశారు. బుధవారం(జనవరి 31) గద్దర్ జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఈ ప్రకటన చేశారు. ఇకపై గద్దరన్న పేరిట అవార్డులు ఇస్తాం. అర్హులైన కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు ఈ అవార్డులు ఇస్తాం. వచ్చే ఏడాది గద్దరన్న జయంతి నుంచి ఈ అవార్డుల ప్రదానం ఉంటుంది. త్వరలోనే జీవో రిలీజ్ చేస్తాం అని ప్రకటించారాయన. ‘‘నంది అవార్డులు పునరుద్ధరించాలని సినిమా వాళ్లు అడిగారు. నంది అవార్డులు కాదు.. మా ప్రభుత్వం కచ్చితంగా అవార్డులు ఇస్తుంది. గద్దర్ అవార్డుల పేరుతో పురస్కారాలు ఇస్తాం. కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు ఇచ్చే అధికారిక అవార్డులకు గద్దర్ అవార్డు ఇస్తాం. ఇదే శాసనం.. నా మాటే జీవో’’ అని సీఎం రేవంత్ అన్నారు. ప్రజాగాయకుడు గద్దర్ (Gaddar) జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేదిక నుంచి ట్యాంక్‌బండ్‌పై గద్దర్ విగ్రహ ఏర్పాటునకు కృషి చేస్తామని రేవంత్ ప్రకటించారు. మరోవైపు తెల్లపూర్(సంగారెడ్డి) మున్సిపాలిటీలో గద్దర్ విగ్రహ(తొలి!) ఏర్పాటుకు ఇప్పటికే ప్రభుత్వం స్థలం కూడా కేటాయించింది. -
సీఎం రేవంత్ సెక్యూరిటీలో లీక్ రాయుళ్లు!
హైదరాబాద్, సాక్షి: సీఎం రేవంత్ రెడ్డి భద్ర తలో ఉన్నతాధికారులు మార్పులు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ వద్ద పనిచేసి, ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి వద్ద కూడా కొనసాగుతున్న భద్రతా సిబ్బందిని పూర్తిగా మార్చేశారు. ముఖ్యమంత్రి కార్యకలాపాలకు సంబంధించిన ప్రతీ సమాచారం బయటకు పొక్కుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గత సీఎం వద్ద పనిచేసిన వారిలో ఇదివరకు కొద్ది మందిని మాత్రమే మార్చగా, ఇంకా చాలా మంది అదే సెక్యూరిటీ విధుల్లో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎంకు సంబంధించిన కీలక సమావేశ వివరాలు బయటకు వెళ్లడం, ఆయన భద్రతకు, పరిపాలన, ప్రభుత్వానికి మంచిది కాదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నిఘా విభాగం అధిపతి శివధర్‌రెడ్డి ఈ అంశాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెవెళ్లిన అనంతరం భద్రతా సిబ్బందిని మార్చాలని నిర్ణయించారు. ఈ క్రమంలో సీఎం భద్రతను చూసేందుకు ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌ను ఏర్పాటు చేశారు. ల్యాండ్ క్రూయిజర్లతో కొత్త కాన్వాయ్.. భద్రతాధికారులు సీఎంకు కొత్త కాన్వాయ్‌ని కూడా సమకూర్చారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి నల్లరంగు కారులో వెళ్తే, ఆయన భద్రతా సిబ్బంది వాహనాలు వేరే రంగులో ఉండేవి. ఇలా సీఎం ప్రయా ణించే వాహనాన్ని సులభంగా గుర్తించడానికి వీలవడంతో.. ముప్పు ఉంటుందని నిఘావర్గాలు హెచ్చరించాయి. దీంతో ఆయన కాన్వాయ్‌లోని వాహన శ్రేణిని మొత్తం నల్లరంగులోకి మార్చేశారు. మాజీ సీఎం కేసీఆర్ తెల్లరంగున్న వాహన శ్రేణని వినియోగించేవారు. గత ప్రభుత్వ హయాంలోనే సీఎం కోసం తెల్లరంగు ల్యాండ్ క్రూయిజర్ వాహనాలను కొనుగోలు చేశారు. వాటికి విజయవాడలో బుల్లెట్‌ప్రూఫ్ చేయించారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నల్లరంగు వాహనాలంటే ఇష్టం కావడంతో, వాటి కలర్‌ను అధికారులు మార్చేశారని తెలిసింది. -
WEF: దావోస్ బయల్దేరిన సీఎం రేవంత్‌రెడ్డి
ఢిల్లీ, సాక్షి: తెలంగాణకు భారీ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్(స్విట్జర్లాండ్) పర్యటనకు బయల్దేరారు. సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా ఆయన దావోస్‌కు వెళ్తున్నారు. నేటి నుంచి 19వ తేదీ వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 54వ సమావేశంలో సీఎం రేవంత్ నేతృత్వంలోని అధికారిక బృందం పాల్గొననుంది. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, బలాబలాలు, ప్రాధాన్యతలను ఈ వేదిక ద్వారా చాటి చెప్పాలని రాష్ట్ర బృందం నిర్ణయించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశానికి వెళ్తున్న రాష్ట్ర అధికారిక బృందానికి ముఖ్యమంత్రి నేతృత్వం వహించడం ఇది తొలిసారి. ఈ బృందంలో ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతోపాటు ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ కూడా ఉన్నారు. రాష్ట్ర బృందం ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో భాగంగా దేశ, విదేశ పారిశ్రామికవేత్తలను కలసి కొత్త ప్రభుత్వ విజన్, ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించనుంది. ఐటీ రంగంలో అగ్రగామిగా, లైఫ్ సైన్సెస్ రంగానికి హబ్‌గా ఉన్న తెలంగాణ బలాలను ప్రపంచానికి చాటి చెప్పి పెట్టుబడులను ఆకర్షించాలని భావిస్తోంది. మూడు రోజుల దావోస్ పర్యటనలో 70మందికిపైగా పారిశ్రామికవేత్తలతో రాష్ట్ర బృందం భేటీ కానుంది. -
TS: కొత్త పాలసీ? ఉచిత విద్యుత్‌పై కీలక ఆదేశాలు
హైదరాబాద్, సాక్షి: విద్యుత్ శాఖపై సుదీర్ఘ సమీక్ష సందర్భంగా బుధవారం ముఖ్యమంత్రి ఎనుములు రేవంత్‌రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 24 గంటలపాటు నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండాల్సిందేనని అధికారులకు తేల్చి చెప్పారాయన. అలాగే.. ఎన్నికల హామీ అయిన గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్ అమలుకు సిద్ధంగా కావాలని అధికారుల్ని ఆయన కోరినట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా త్వరలో కొత్త విద్యుత్ పాలసీ అమలు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయిచింది. అయితే ఆ పాలసీ ఎలా ఉండాలనే దానిపై ఇప్పటికప్పుడు అధికారులు స్పష్టత ఇవ్వలేకపోయారు. దీంతో.. ఇతర రాష్ట్రాల్లో అమలు అవుతున్న విద్యుత్ విధానంపైనా అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక నుంచి విద్యుత్ విధానంపై విస్తృతంగా చర్చిస్తామని అధికారులతో చెప్పిన సీఎం రేవంత్.. బహిరంగ మార్కెట్‌తో తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు జరపాలని అధికారుల్ని ఆదేశించారు. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక వివిధ రాష్ట్రాలతో విద్యుత్ కొనుగోలు పేరిట ఒప్పందాలు(పీపీఏ).. ఈఆర్సీ ఇచ్చిన అనుమతుల వివరాలు అందజేయాలని అధికారులను ఆదేశించారారయన. -
TS: బండ్ల గణేష్‌కు కీలక బాధ్యతలు!
హైదరాబాద్, సాక్షి: ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్ సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన సచివాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఓ పూలమొక్కను బహుమతిగా అందించారు. ఈ ఫొటోలు ఎక్స్‌లో వైరల్ అవుతుండగా.. ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. బండ్ల గణేష్ మొదటి నుంచి కాంగ్రెస్ హార్డ్‌కోర్ అభిమాని. ఎన్నికల్లో ప్రత్యక్షంగా మద్ధతు ఇస్తూ వస్తున్నారు కూడా. ఈ క్రమంలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ గెలుస్తుందని జోస్యం చెప్పి మరీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌కు గురయ్యారు. ఈసారి ఎన్నికలకు ముందు.. రెండు రోజుల ముందే ఎల్బీ స్టేడియంకు వెళ్లి పడుకుంటానంటూ ప్రకటించడంతో.. మరోసారి ట్రోలింగ్ మెటీరియల్ అవుతారేమోనని కొందరు భావించారు. కానీ, ఈసారి బండ్ల గణేష్ జోస్యం తప్పలేదు. తెలంగాణలో బీఆర్ఎస్కు చెక్ పెట్టి.. కాంగ్రెస్ అధికారం కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌తో పదవులేం ఆశించకుండా చిత్తశుద్ధితో ఒక కార్యకర్తగా పని చేస్తానని బండ్ల గణేష్ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన విధేయతకు మెచ్చి త్వరలో కీలక బాధ్యతలు అప్పజెప్తారనే ప్రచారం ఊపందుకుంది. అదేంటంటే.. సంక్రాంతిలోపు తెలంగాణలో ఖాళీలుగా ఉన్న కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాజాగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. బండ్ల గణేష్‌కు ఏదైనా కార్పొరేషన్ అప్పజెప్పొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కార్పొరేషన్లలో వీలు కాకుంటే.. సినీ రంగానికి-తెలంగాణ ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా బండ్ల గణేష్‌కు సరికొత్త బాధ్యతలు అప్పగించవచ్చనే చర్చా నడుస్తోంది. ఇవేవీ కాకుంటే.. పార్టీ తరఫున అయినా ఆయనకు కీలక పదవి కచ్చితంగా దక్కవచ్చని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే బండ్ల గణేష్ మాత్రం పదవులక్కర్లేదనని.. పార్టీ కోసం పని చేస్తానంటున్నారు. మరి బండ్ల గణేష్‌కు పార్టీ కీలక బాధ్యతలు అప్పగిస్తుందా?.. లేదా.. స్పష్టత రావాలంటే.. ఇంకా కొన్నిరోజులు ఆగాల్సిందే. -
తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా
First Session of Third Telangana Legislative Assembly Day 6 Live Updates తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా బీజేపీ వస్తే ఊరుకోం: ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మొన్నటివరకు బీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారం పోయింది కాబట్టి ఎంఐఎం కాంగ్రెస్ అంటుంది. బీజేపీకి ఎంఐఎంకి ఎలాంటి సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు వాస్తవం లేదు. మీరు ఏమైనా చేసుకోండి బీజేపీ జోలికి వస్తే మర్యాదగా ఉండదు. విషయం తెలుసుకుని మాట్లాడాలి: హరీష్ రావు సిద్దిపేట, గజ్వేల్‌లో విద్యుత్ బకాయిలు ప్రజలు కట్టకుండా ఉన్నవి కావు. అక్కడ ఉన్న ప్రభుత్వ ప్రాజెక్టుల బకాయిలు ఉన్నవి అన్నది సీఎం తెలుసుకోవాలి. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ మోసం చేస్తేనే టీడీపీతో ఆనాడు పొత్తు పెట్టుకున్నాం. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న టీడీపీతో పొత్తు పెట్టుకున్నా తెలంగాణ కోసమే. సీఎం రేవంత్ రెడ్డి పదవుల కోసం పార్టీలు మారాడు. జూబ్లీహిల్స్ ప్రజలను అవమానపరిచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వల్లే తెలంగాణ వచ్చింది: పొన్నం తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సోనియాగాంధీనే. తెలంగాణ కోసం ఆనాడు పార్లమెంట్లో ఎంపీలుగా మేము కొట్లాడం, కేసీఆర్ లేడు. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చినటువంటి నేత. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి స్వరాష్ట్ర కల నెరవేరింది. తెలంగాణ కోసం పోరాడితే బతికుండగానే నాకు పిండ ప్రధానం చేసిన నాయకులు వాళ్లు. కేంద్రం నుంచి అన్ని అనుమతులు వచ్చినా గత పదిహేళ్లుగా అధికారంలో ఉండి ప్రాజెక్టు కంప్లీట్ చేయలేదు. ఎంపీగా కేసీఆర్‌ను గెలిపిస్తే కరీంనగర్ ప్రజలకు ప్రాజెక్టు ఎందుకు కంప్లీట్ చేయలేదు? తెలంగాణ కోసం చర్మం ఒలిచి చెప్పులు కుట్టిస్తా అన్న కేసీఆర్ కరీంనగర్లో ప్రాజెక్టు ఎందుకు కంప్లీట్ చేయలేదు? శ్వేత పత్రంపై స్పందించిన కేటీఆర్. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే 24 గంటల కరెంటు ఇవ్వలేమంటూ శ్వేత పత్రం విడుదల చేసిన అసమర్ధ పార్టీ. విద్యుత్ శాఖను 22వేల కోట్ల నష్టాల్లో అప్పజెప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? నేదునూరు శంకర్‌పల్లిలో ధర్నా చేసింది మేమే. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పిండం పెడతా అన్నాడు. దేశంలో గ్యాస్ ఆధారిత ప్రాజెక్టులు ఎక్కడా సక్సెస్ కాలేదు. కేంద్రం అనుమతి ఇవ్వలేదు కాబట్టే నేదునూరులో ప్రాజెక్టు టేకప్ చేయలేదు. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీనే ఉంది నేదునూరులో ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ టేకప్ చేయాలి. నేదునూరు ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ప్రకటన సభలో చేయాలి. మేం ఎవరికీ భయపడం: అక్బరుద్దీన్ విద్యుత్ అప్పులపై అసెంబ్లీలో చర్చ. స్పీకర్ వెల్‌లోకి ఎంఐఎం సభ్యులు కిరణ్ కుమార్‌రెడ్డి జైల్లో పెట్టినా భయపడలేదు: అక్బరుద్దీన్ కాంగ్రెస్ మమ్మల్ని అణచివేసే ప్రయత్నం చేస్తుంది. అక్బరుద్దీన్ ఎంత సేపు మాట్లాడినా మాకు ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి అక్బరుద్దీన్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన అనుభవాన్ని పరిగణలోకి తీసుకొన ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేశాం. బీఆర్ఎస్, మజ్లిస్ మిత్రులమని కేసీఆర్ చెప్పారు. ఓల్డ్ సిటీ, న్యూసిటీ అనే తేడా మాకు లేదు. అక్బరుద్దీన్ మజ్లిస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మాత్రమే. ముస్లిం అందరికీ నాయకుడు కాదు. జూబ్లీహిల్స్‌లో అజారుద్దీన్‌కు టికెట్ ఇస్తే మజస్లిస్ ఓడించే ప్రయత్నం చేసింది. కామారెడ్డిలో షబ్బీర్ అలీని ఓడించడానికి కేసీఆర్, అక్బరుద్దీన్ కలిసి పని చేశారు. విద్యుత్ రంగంపై చర్చ విద్యుత్‌ను బీఆర్ఎస్ నేతలే కనుగొన్నట్లు మాట్లాడుతున్నారు: పాయల్ శంకర్. 2014కు ముందు రాష్ట్రంలో అసలు విద్యుత్ లేనట్లుగా.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే కరెంట్ వచ్చినట్లు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతున్నారు. విద్యుత్ సంస్థల నష్టాలు చూస్తే ప్రజలు భయపడుతున్నారు. విద్యుత్ వ్యవస్థ మెరుగ్గా ఉండాల్సిందే. 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఎప్పటి నుంచి ఇస్తారో ప్రభుత్వం చెప్పాలి. తెలంగాణ శాసనసభలో పవర్ పంచాయితీ తెలంగాణ ప్రస్తుత విద్యుత్ రంగ పరిస్థితిపై కాంగ్రెస్ సర్కార్ శ్వేత పత్రం విడుదల రూ.81 వేల కోట్ల బకాయిలున్నాయన్న డిప్యూటీ సీఎం భట్టి గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన వల్లే ఈ పరిస్థితంటూ ఆక్షేపణ అప్పులతో ఆస్తులు పెంచామన్న మంత్రి జగదీష్‌రెడ్డి పక్కదారి పట్టిన విద్యుత్ రంగంపై స్వల్పకాలిక చర్చ బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ రంగం అవినీతి చేసిందని కోమటిరెడ్డి విమర్శలు జగదీష్రెడ్డిపైనా అవినీతి ఆరోపణలు సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమంటూ జగదీష్‌రెడ్డి సవాల్ సవాల్ స్వీకరించిన సీఎం రేవంత్‌రెడ్డి మూడు అంశాలపై విచారణకు ఆదేశం విచారణకు రెడీ అంటూ ధీటుగా స్పందించిన జగదీష్‌రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ ఆరోపణలకు కౌంటర్ ఈ క్రమంలో కోమటిరెడ్డి బ్రదర్స్‌పై వ్యక్తిగత విమర్శలు చేసిన జగదీష్‌రెడ్డి తీవ్రంగా స్పందించిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సభా గౌరవం కాపాడలంటూ కోరిన మాజీ స్పీకర్ పోచారం, ప్రస్తుత స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇంకా బీజేపీపై తప్పుడు ప్రచారమేనా? విద్యుత్ రంగంపై చర్చ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విద్యుత్ సంస్థలను బీఆర్ఎస్ ప్రభుత్వం పీకల్లోతు నష్టాల్లోకి నెట్టాయి ధర్నాలు లేవని మాజీ మంత్రి చెప్తున్నారు.. అసలు ధర్నా చేసే ఆలోచన చేస్తేనే అరెస్ట్ చేశారు కదా! రెండు వందల యూనిట్ల కరెంటు ఎప్పటి నుంచి ఫ్రీ గా ఇస్తారో ప్రభుత్వం చెప్పాలి డిస్కం లకు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా నిధులు సకాలంలో చెల్లించాలి కేంద్ర ప్రభుత్వం సహాయం చేసిందని స్వయంగా కేసీఆర్ ఒప్పుకున్నారు అయినా బీఆర్ఎస్, బీజేపీపై గ్లోబెల్ ప్రచారం చేస్తోంది ఎవరు ఎంత కరెంటు వాడుతున్నారో లెక్కలు తేల్చేందుకే మీటర్లు కానీ బిల్లు వసూలు కోసమే అని బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారం చేశారు అప్పులు చేయకుండా కాంగ్రెస్ హామీలు అమలు చేయడం సాధ్యమా? సౌత్, నార్త్ గ్రిడ్ లను కలిపింది కేంద్ర ప్రభుత్వమే.. అయినా ఈ విషయాన్ని గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం చెప్పడం లేదు తెలంగాణ శాసనసభకు స్వల్ప విరామం సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దు? సీడబ్ల్యూసీ సమావేశం కోసం ఢిల్లీ వెళ్లాల్సిన టీపీసీసీ చీఫ్, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇంకా అసెంబ్లీలోనే సీఎం రేవంత్ మధ్యాహ్నాం ఫ్లైట్ మిస్ కావడంతో మరో విమానం కోసం ప్రయత్నించిన సీఎంవో! విద్యుత్ రంగంపై శ్వేతపత్రం.. స్వల్పకాలిక చర్చతో వేడెక్కిన శాసనసభ ప్రస్తుత పరిణామాలతో ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి సభలోనే ఉండాలని నిర్ణయించుకున్న ముఖ్యమంత్రి? ఆనాడు ఏమైపోయారు మీరంతా?: రాజగోపాల్‌రెడ్డి తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గతంలో సభలో మంత్రిగా ఉండి ఎర్రబెల్లి దయాకర్ రావు నన్ను ఉరికించి కొడతానన్నారు ఆరోజు నన్ను ఒక మంత్రి అలా అన్నప్పుడు ఎక్కడికి పోయారు మీరంతా? సభ్యుల తీరుపై స్పీకర్ అభ్యంతరం శాసనసభలో నేటి పరిణామాలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ అభ్యంతరం వ్యక్తిగత దూషణలకు సభలో అవకాశం లేదు సభలో ఉన్న ప్రతీ సభ్యుడు సభా మర్యాదను కాపాడాలి వ్యక్తిగత దూషణలు చేసిన అంశాలపై పరిశీలన చేస్తాం ‘ఖబడ్దార్’పై జగదీష్ రెడ్డి అభ్యంతరం బీఆర్ఎస్ సభ్యుల్ని ఉద్దేశిస్తూ.. తన జోలికి రావొద్దని, ఖబడ్దార్ అని హెచ్చరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజగోపాల్ వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబట్టిన మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి సభలో ఖబర్దార్ లాంటి పదాలు వాడొచ్చా? అని స్పీకర్‌కు జగదీష్‌రెడ్డి ప్రశ్న ఖబర్దార్ అని స్పీకర్ చైర్ ను అన్నారా? మమ్మల్ని అన్నారా? అని నిలదీత నేను వ్యక్తిగత విషయాలు మాట్లాడలేదు విమర్శలు చేయలేదు నాపై వ్యక్తిగత విమర్శలు చేసిన వ్యాఖ్యలను తొలగించాలి ఖబడ్దార్ అన్నందుకు ఆ సభ్యుడిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు స్పీకర్ చెప్పాలి శాసనసభలో రగడ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నిరసన స్పీకర్ పోడియం ముందుకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలో బెదిరిస్తున్నారని రాజగోపాల్ రెడ్డిపై బీఆర్ఎస్ మండిపాటు ఖబడ్దార్..: రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే నేను పార్టీలు మారిన టైంలో పదవికి రాజీనామా చేశా దొంగల లెక్క పదవుల కోసం పార్టీలు నేను మారలేదు నా జోలికి వస్తే ఊరుకునేది లేదు ఖబర్దార్ ఏమనుకుంటున్నారో? సభామర్యాదను కాపాడండి: పోచారం రిక్వెస్ట్ సభా మర్యాదను కాపాడుకుందాం ఒకరి పైన ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకోవద్దు సభలోకి కొత్త సభ్యులు చాలామంది వచ్చారు మాజీ స్పీకర్‌గా.. సభ ఉందాగా నడపాలని కోరుకుంటున్నా వ్యక్తిగత విమర్శలు ఏమైనా ఉంటే బయట విమర్శలు చేసుకోవాలి సభకు సహకరించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం జగదీష్‌రెడ్డికి రాజగోపాల్ చురకలు అధికారంలో పర్మినెంట్‌గా ఉంటాం అనుకున్న బీఆర్ఎస్కు ప్రజలిచ్చిన షాక్‌తో మతిభ్రమించింది అధికారం కోల్పోయినా బీఆర్ఎస్ నేతల తీరు మారడం లేదు పార్టీలు మారామని మా బ్రదర్స్ ని విమర్శిస్తున్న వాళ్లకు.. వాళ్ల అధినేత కేసిఆర్ ఎన్ని పార్టీలు మారారో తెలియదా? నాలుగు రూపాయలకు దొరికే పవర్ ని.. ఆరు రూపాయలకు పెంచి గత ప్రభుత్వం తప్పు చేసింది రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి ఆలోచన చేస్తే జాలేస్తోంది కిరసనాయిలు దీపం, కిరాయి ఇంట్లో ఉన్న మాజీ మంత్రి రూ. 1000 కోట్ల హైదరాబాద్ బంగ్లా ఎలా సంపాదించారు ? నేను పార్టీలు మారింది ప్రజల కోసమే.. పదవుల కోసమో, పైసల కోసమో కాదు మాజీ ముఖ్యమంత్రి ముందు ఆ పార్టీ నాయకులు మాట్లాడి ధైర్యం ఉందా? మాజీ ముఖ్యమంత్రి ముందు ధైర్యంగా మాట్లాడలేదు కాబట్టే రాష్ట్రం అప్పుల పాలు అయింది ఇలాగే ఉంటా.. మీలాగా కాదు: మాజీమంత్రి జగదీష్ రెడ్డి నన్ను ఎంత రెచ్చగొట్టినా వ్యక్తిగత విషయాలు నేను మాట్లాడను సభలోనే కాదు బయట కూడా వ్యక్తిగత ఆరోపణలు నేను చేయను అలవాటు నాకు లేదు అవసరాల కోసం.. పదవుల కోసం నేను విమర్శలు ఆరోపణలు చేయను పార్టీలు మారే క్యారెక్టర్ నాది కాదు కాంట్రాక్టుల కోసం పార్టీలు మారిన చరిత్ర ఆ సోదరులదిది(కోమటిరెడ్డి బ్రదర్స్‌ను ఉద్దేశించి..) విద్యుత్ పై విడుదల చేసిన శ్వేత పత్రం తప్పులు తడకగా ఉంది కేసీఆర్ ఇచ్చినట్లే 24 గంటల కరెంటు ఇస్తారా లేదా సభ సాక్షిగా క్లారిటీ ఇవ్వాలి మీటర్లు పెట్టకుండా కరెంటు ఇస్తారా? లేదా? అనేది స్పష్టం చేయాలి మేనిఫెస్టోలో చెప్పినట్లు ఉచిత విద్యుత్ ఇస్తారా లేదా? అనే దానిపై సభాముఖంగా ప్రకటన చేయాలి భవిష్యత్తులో అప్పులు చేయకుండా విద్యుత్ ఇస్తారా లేదా అని కూడా చెప్పాలి రాజగోపాల్ మైక్ అందుకోవడంతో రగడ తెలంగాణ శాసనసభలో విద్యుత్ రంగంపై స్వల్ఫకాలిక చర్చ మంత్రులు మాట్లాడుతుండగా.. మైక్ అందుకున్న ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో కనుమరుగవడం ఖాయం: రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులను బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేరు: రాజగోపాల్ రెడ్డి విద్యుత్ శాఖలో అవినీతిపై జ్యుడిషియల్ ఎంక్వయిరీ వేసినందుకు సీఎంకు ధన్యవాదాలు: రాజగోపాల్ రెడ్డి విచారణలో అన్ని బయటకు వస్తాయి: రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతుండగా పోడియం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డికి ఎలా అవకాశం ఇస్తారంటూ స్పీకర్‌ను ప్రశ్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ రంగంలో భారీ అవినీతి జరిగింది విద్యుత్ శాఖలో అవినీతిపై జ్యుడీషియల్ ఎంక్వయిరీకి ఆదేశించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు జగదీష్ రెడ్డి గతంలో పవర్ లేని పవర్ శాఖ మంత్రిగా పనిచేశారు ఆయన విద్యుత్ మంత్రి కాదు యాదాద్రి పవర్ ప్లాంట్ లో సబ్ కాంట్రాక్టర్ విచారణలో అన్నీ వెలుగు చూస్తాయి ఇదంతా ఆన్ రికార్డు చెబుతున్నా మాజీ అధికారి ప్రభాకర్‌రావు, మాజీ మంత్రి జైలుకు పోవడం ఖాయం నేనూ సిద్ధం: మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగంపై మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి అభ్యంతరం రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తే.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం భరించలేకపోతోంది కాంగ్రెస్ హయాంలో కరెంట్ కోతలపై ధర్నాలు జరిగాయి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నాలుగు గంటలు కూడా కరెంట్ ఇవ్వలేదు రైతుల గురించి కాంగ్రెస్ ఏనాడూ ఆలోచించలేదు.. వాళ్ల వైపు లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్లు పెట్టుబడి దారుల వైపు ఉన్నారు కేసీఆర్ రైతుల పక్షపాతి విద్యుత్ రంగంపై ఎలాంటి విచారణ అయినా జరిపించుకోండి.. అందుకు నేను సిద్ధం ఈఆర్సీ రూల్స్ ప్రకారమే Electricity Regulatory Commission విద్యుత్‌ను కొనుగోలు చేశాం విద్యుత్ కొనుగోళ్లపై కాగ్ నివేదికలు కూడా ఉన్నాయి విద్యుత్‌పై జ్యూడీషియల్ విచారణకు సిద్ధం: సీఎం రేవంత్‌రెడ్డి ఆనాటి ప్రభుత్వం ఏనాడూ సభ ముందు వాస్తవాలు బయటపెట్టలేదు విద్యుత్ శాఖను పూర్తిస్థాయిలో స్కానింగ్ చేసి.. వాస్తవాలను ప్రజల ముందు పెట్టాం జగదీష్‌రెడ్డి చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నాం విద్యుత్‌పై జ్యూడీషియల్ విచారణకు సిద్ధంగా ఉన్నాం కరెంట్ అనే సెంటిమెంట్‌ను గత ప్రభుత్వం ఆర్థిక అవసరాలకు వాడుకుంది ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లపై ప్రశ్నించిన మమ్మల్ని నాడు మార్షల్స్ చేత బయటకు గెంటించారు ఉద్యమంలో పని చేసిన తెలంగాణ విద్యుత్ నిపుణులను మారుమూల ప్రాంతాలకు బదిలీ చేశారు రెండేళ్లలో భద్రాద్రి పవర్ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. కానీ, ఏడేళ్లు పట్టింది భద్రాద్రి ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగింది ప్రాజెక్టు కోసం గ్లోబల్ టెండర్లు పిలవలేదు బ్యాక్ డోర్ నుంచి టెండర్లు అంటగట్టారు మూడు అంశాలపై విచారణకు ఆదేశిస్తాం ఛత్తీస్‌గఢ్‌తో చేసుకున్న ఒప్పందాలపై విచారణకు ఆదేశిస్తున్నాం రెండో అంశంగా భద్రాద్రి పవర్ ప్లాంట్ పై విచారణ చేర్చాం మూడో అంశంగా యాద్రాద్రి పవర్‌ప్లాంట్ పైనా విచారణ జరిపిస్తాం మొత్తం వాస్తవాలకు బయటకు తీయాల్సిన అవసరం ఉంది బీఆర్ఎస్ సవాల్ మేరకు జ్యుడీషియల్ విచారణకు ఆదేశం అప్పుడు మంత్రులుగా ఉన్నవాళ్లను కూడా చేరుస్తాం మీ ఉద్దేశాలు ఏంటో విచారణలో తేలుతాయి ప్రభుత్వం రంగంలో విద్యుత్ విషయంలో బీఆర్ఎస్ సాధించింది గుండు సున్నా ఇప్పటివరకు ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టలేదు ఒక్క మెగావాట్ విద్యుత్ కూడా ఉత్పత్తి చేయలేదు 24 గంటల ఉచిత విద్యుత్ అంటూ అబద్ధాలు చెప్తున్నారు సభలో దబాయిస్తూ ఇంకా ఎంత కాలం గడుపుతారు? కోమటిరెడ్డి లాక్‌బుక్ చూపిస్తే.. బుక్‌లు మాయం చేశారు ఇంకా ఎన్నాళ్లూ మోసం చేస్తారు? విద్యుత్ రంగంపై అవాస్తవ శ్వేతపత్రం విడుదల చేశారు: జగదీష్‌రెడ్డి బీఆర్ఎస్ పాలనలో విద్యుత్‌రంగంలో ఆస్తులు పెరిగాయి: జగదీష్‌రెడ్డి కోమటిరెడ్డి ఆరోపణలపై విచారణ జరిపించాలి :జగదీష్‌రెడ్డి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే వాస్తవాలు తెలుస్తాయి :జగదీష్‌రెడ్డి జగదీష్‌కు భట్టి కౌంటర్ విద్యుత్ రంగంపై స్వల్ఫకాలిక చర్చలో విమర్శల పర్వం తెలంగాణ విద్యుత్ రంగం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది డిస్కంలకు బకాయిలకు భారంగా ఉన్నాయి మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి సభను తప్పుదోవ పట్టిస్తున్నారు గత ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇవ్వలేదు గొంతు తెరిస్తే అబద్ధాలు నిజాలు అయిపోవు ఆరోపణలపై మాజీ మంత్రి స్పందన.. నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధం సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి వాస్తవాలు బయటపెట్టాలి విచారణ జరిపించాలని సీఎంను కోరుతున్నా జగదీష్‌రెడ్డికి కోమటిరెడ్డి కౌంటర్ బీఆర్ఎస్ 24 గంటలు కరెంట్ ఇచ్చిందన్నది 9 గంల కరెంట్ కూడా ఇవ్వలేదు విద్యుత్ రంగంలో భారీ కుంభకోణం జరిగింది టెండర్ లేకుండా పవర్‌ప్లాంట్ పెట్టారు యాదాద్రి పవర్‌ప్లాంట్‌లో రూ.20 వేల కోట్ల స్కామ్ జరిగింది ఇందులో జగదీష్‌రెడ్డి రూ.10వేల కోట్లు తిన్నాడు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యేకు కూడా వాటా ఉంది ఫ్రీ కరెంట్ పేటెంట్ కాంగ్రెస్‌దే దొంగలు, అవినీతి పరులు అనే వరకు భుజాలు తడుముకుంటున్నారు బీఆర్ఎస్ నేతలకు టీఎస్ ట్రాన్స్‌కో, జెన్కో అప్పటి సీఎండీ ప్రభాకర్‌రావు దోచిపెట్టారు ఎవరు ఎంత తిన్నారో కక్కిస్తాం.. అలా వదిలేస్తామా? విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఆరోజుల్లో పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేశారు నాడు ఊళ్లలోకి వెళ్తే విద్యుత్ అధికారుల్ని నిర్బంధించే పరిస్థితులు ఉండేవి మన రాష్ట్రంలోనే అప్పులు చేసినట్లు మాట్లాడుతున్నారు పరిశ్రమలకు విద్యుత్ హాలిడే - జనరేటర్ లేని దుకాణాలు ఆనాడు లేవు విద్యుత్ బిల్లు వసూలుకు వెళ్లిన అధికారులను పంచాయితీ ఆఫీసు లో బంధించే వాళ్ళు ఆనాడు విద్యుత్ కష్టాలకు ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళే బాధ్యులు అన్ని రంగాలకు 24 గంటలు కరెంట్ ఇచ్చాం మేము 50వేల కోట్ల అప్పులు తీర్చాం అప్పు కోసం ఆలోచిస్తే.. ఇప్పుడు 24 గంటల విద్యుత్ ఉండేది కాదు తెలంగాణలో విద్యుత్ లేకుండా వ్యవసాయం చెయ్యలేం లిఫ్ట్ ఇరిగేషన్ మాత్రమే మనకు బతుకు తెలంగాణ వచ్చేనాటి పరిస్థితి ఏంటో చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు 2014లో ఏపీ ముఖ్యమంత్రి తెలంగాణకు సహకారం ఇవ్వలేదు సాగర్, శ్రీశైలంలో తెలంగాణకు రావాల్సిన వాట ఇవ్వడానికి అడ్డుకున్నారు ఆనాడు కేంద్రం పలుకుబడి ఉపయోగించి ఆనాటి సీఎం ఇబ్బంది పెట్టారు తెలంగాణకు ఎవరైనా విద్యుత్ అమ్మడానికి వచ్చే ప్రైవేట్ వ్యక్తులను సైతం బెదిరించారు విద్యుత్ రంగంలో చేయాల్సిన అభివృద్ధి ఎక్కడా ఆగకుండా జరిగింది బీఆర్ఎస్ ఇళ్ల నేతలకు కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్: మంత్రి శ్రీధర్‌బాబు 2014కి ముందు కరెంటే లేనట్లు బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు: మంత్రి శ్రీధర్‌బాబు కరెంట్‌ను బీఆర్ఎస్ కనిపెట్టినట్లు మాట్లాడుతున్నారు: మంత్రి శ్రీధర్‌బాబు నిన్న నీళ్ల గురించి కూడా అంతే గొప్పగా చెప్పుకున్నారు: మంత్రి శ్రీధర్‌బాబు బీఆర్ఎస్ ఇళ్ల నేతలకు కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ భట్టి ప్రసంగంపై మాజీ మంత్రి స్పందన తెలంగాణ విద్యుత్ రంగం పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం వైట్ పేపర్‌పై స్పందించిన మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి దేశంలో 24 గంటల కరెంట్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ: జగదీష్‌రెడ్డి తెచ్చిన అప్పులతో ఆస్తులు క్రియేట్ చేశాం 👉: విద్యుత్‌రంగంపై శ్వేతపత్రం.. పూర్తి కాపీ ప్రభుత్వానికి భారంగా విద్యుత్ బకాయిలు: డిప్యూటీ సీఎం భట్టి ఏ రంగానికైనా నాణ్యమైన విద్యుత్ సరఫరా అవసరం - డిప్యూటీ సీఎం రాష్ట్రం ఏర్పాటు నాటికి 24వందల మెగావాట్ల ఉత్పత్తి ఉండే. రాష్ట్రం ఏర్పడే నాటికే ఆనాటి పాలకుల ముందు చూపుతో మరో 2500 ఉత్పత్తికి ఏర్పాట్లు చేశారు ప్రస్తుతం విద్యుత్ శాఖ ఆందోళన కరంగా ఉంది రూ.81.516 కోట్లు ప్రస్తుతం అప్పులు ఉన్నాయి రూ.36వేల కోట్లు బకాయిలు ఉన్నాయి.. మరో 28వేల కోట్లు చెల్లించాల్సి ఉంది డిస్కమ్ లకు చెల్లించాల్సిన 14వేల కోట్ల రూపాయలు చెల్లించకపోవడం వల్ల మరింత భారం పడింది విద్యుత్ సంస్థలకు సకాలంలో నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి విద్యుత్ సంస్థల ప్రస్తుత స్థితిని ప్రజలకు చెప్పాల్సిన భాధ్యత మా పై ఉంది ఆర్థిక ఇబ్బందులు శ్వేత పత్రం ద్వారా ప్రజలకు వివరిస్తున్నాము విద్యుత్ బకాయిలు ప్రభుత్వానికి భారంగా ఉన్నాయి బీఆర్ఎస్ వచ్చిన తరువాతే రాష్ట్రంలో బల్బ్ వెలిగింది అన్నట్లు గత పాలకులు మాట్లాడారు బీఆర్ఎస్ వచ్చిన తరువాతే ఉచిత కరెంట్ ఇస్తున్నట్లు ప్రకటనలు చేశారు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడే దేశ వ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను కాంగ్రెస్ ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ పాలనలో కొనసాగించాల్సిన ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లలేదు 2014 వరకు జెన్కోలకు 10వేల లోపు అప్పులు ఉంటే.. BRS పదేళ్లలో 81వేలకు తీసుకెళ్లారు సరైన దూరదృష్టి లేకపోవడం వల్ల డిస్కంలు ఇబ్బందుల్లో పడ్డాయి రోజూవారీ మనుగడ కోసం డిస్కంలు అవికాని అప్పులు చేయాల్సి వస్తోంది తెలంగాణ కరెంట్ లెక్కలు తెలంగాణ శాసనసభలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం ప్రవేశపెట్టిన కాంగ్రెస్ సర్కార్ రాష్ట్ర విద్యుత్ రంగం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది: డిప్యూటీ సీఎం భట్టి విద్యుత్ రంగంపై పరిస్థితిని ప్రజలకు తెలియజేయాలి: డిప్యూటీ సీఎం భట్టి గత ప్రభుత్వం 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టును మాత్రమే పూర్తి చేసింది: డిప్యూటీ సీఎం భట్టి ఇప్పటివరకు విద్యుత్ రంగంలో రూ. 81వేల కోట్ల అప్పు ఉంది: డిప్యూటీ సీఎం భట్టి డిస్కంలకు ప్రభుత్వ శాఖల బకాయిలు రూ.28,842 కోట్లు డిస్కంలకు చెల్లిస్తామన్న బకాయిల్ని గత ప్రభుత్వం చెల్లించలేదు సాగునీటి శాఖ చెల్లించాల్సిన బకాయిలే రూ. 14 వేల కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే ఉచిత విద్యుత్ ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంది గత కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ రంగంలో ఎన్నో సంస్కరణలు చేపట్టింది గత ప్రభుత్వం చేసిన అప్పులు మరింత ఆందోళన పరిస్థితికి దిగజార్చాయి విద్యుత్ రంగంపై శాసన సభలో స్వల్పకాలిక చర్చ ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్ రంగంపై పరిస్థితిని ప్రజలకు తెలియజేయాలి: భట్టి తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం ప్రారంభమైన తెలంగాణ శాసనసభ విద్యుత్ రంగంపై శ్వేతపత్రం ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం భట్టి కాసేపట్లో ప్రారంభం కానున్న శాసనసభ తెలంగాణ విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేయనున్న ప్రభుత్వం సీడబ్ల్యూసీ సమావేశం కోసం ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్ సీఎం లేకుండానే కొనసాగనున్న సభ? రేపు కూడా సభ నిర్వహణ? శాసనసభ సమావేశాల పొడిగింపు? రేపు.. డిసెంబర్ 22వ తేదీన కూడా సభ నిర్వహించే యోచనలో ప్రభుత్వం నీటి పారుదల రంగంపై శ్వేతపత్రం విడుదల చేసే యోచనలో రేవంత్‌రెడ్డి సర్కార్ సీఎం రేవంత్ ఇంట్లో మంత్రి ఉత్తమ్ భేటీ.. హాజరైన సీఎస్ తప్పుల తడకగా ఆర్థిక శ్వేతపత్రం: మాజీ మంత్రి హరీష్‌రావు ఇందులో అప్పులు రూ.6,71,757 కోట్లు అని చూపించారు... అది రూ.5 లక్షల కోట్లే గత ప్రభుత్వాన్ని బద్నాం చేసే ధోరణి ఇది తెలంగాణను దివాలా రాష్ట్రంగా దుష్ప్రచారం చేస్తే ప్రమాదకరంగా పర్యవసానాలు విశ్వసనీయత దెబ్బతింటుంది, పెట్టుబడులు రావు కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమంటూ సవాల్ రాష్ట్రం ఆర్థికంగా బలపడటానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పునాదులు వేసిందని స్పష్టీకరణ వాడీ వేఢీగా తెలంగాణ శాసన సభ సమావేశాలు రాష్ట్ర ఆర్థిక స్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన కాంగ్రెస్ సర్కార్ తీవ్రంగా ఖండించిన ప్రతిపక్ష బీఆర్ఎస్ ఇరు పార్టీల నేతల విమర్శలు-ప్రతివిమర్శలతో దద్దరిల్లిన సభ అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రంలో సర్కారు వెల్లడి గత పదేళ్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై.. 13 అంశాలతో 42 పేజీల నివేదిక సభ ముందుకు.. రిజర్వు బ్యాంకు, కాగ్ నివేదికలు, కేంద్ర ప్రభుత్వ లెక్కలతో రూపకల్పన 1956 నుంచి 2023 వరకు అంశాల వారీగా 22 టేబుళ్లతో వివరణ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని వివరించడమే ప్రధాన ఉద్దేశమన్న సర్కారు నేడు ఆరవరోజు కొనసాగనున్న సభ హాట్‌హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ శాసనసభ సమావేశాలు ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదలతో వేడెక్కిన సభ అధికార-ప్రతిపక్షాల నడుమ తీవ్ర వాగ్వాదం నేడు ఆరో రోజు కొనసాగనున్న సభ శ్వేత పత్రం విడుదల చేయనున్న ప్రభుత్వం ఆపై లఘు చర్చ -
నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కోసం, తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్‌ను ఆపొద్దని, వాహనదారులకు ఇబ్బంది కలిగించొద్దని పోలీసులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. అలాగే సాధారణ ట్రాఫిక్‌లోనే తన కాన్వాయ్నూ అనుమతించాలని ఆదేశించారు. ప్రజలతో పాటే తన కాన్వాయ్ ఉండేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండానే తన కాన్వాయ్‌ను తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని ఈ సందర్భంగా అధికారులు ఆయనతో చెప్పినట్లు తెలుస్తోంది. సీఎంతో పాటు మంత్రులు, ఇతర రాజకీయ ప్రముఖుల పర్యటన సమయంలో ట్రాఫిక్ నిలిపివేత గురించి తెలిసిందే. ప్రత్యేకించి హైదరాబాద్‌లో అది మరీ నరకంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న తాజా నిర్ణయంపై ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యే అవకాశం కనిపిస్తోంది. కొత్త కాన్వాయ్ వద్దు! కాన్వాయ్ విషయంలోనూ ఆయన మరో నిర్ణయం తీసుకున్నారు. కొత్త కార్లు కొనుగోలు చేయకుండా.. తన కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను 15 నుంచి 9కి కుదించాలని ఆదేశించారు. అలాగే కాన్వాయ్‌లోనే ఉన్న అన్ని తెల్ల రంగు కార్లకు నల్ల రంగు వేయాలని అధికారుల్ని ఆదేశించారు. ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉన్న నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. -
TS Govt: మాజీలకు గన్మెన్ల తొలగింపు
సాక్షి, హైదరాబాద్: ప్రమాణ స్వీకారం జరిపిన మరుక్షణం నుంచే వివిధ శాఖలు, విభాగాలకు సంబంధించి వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. ఈ క్రమంలో పలు విభాగాలకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు. తాజాగా తెలంగాణ మరో నిర్ణయం ప్రకటించింది. రాష్ట్రంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు భద్రత తొలగించింది. వాళ్లకు గన్మెన్లకు తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
తెలంగాణకు కొత్త హైకోర్టు.. జనవరిలో శంకుస్థాపన!
హైదరాబాద్: తెలంగాణకు కొత్త హైకోర్టు భవనం ఏర్పాటు కానుందా?.. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, అధికారుల్ని ఆదేశించారు. రాజేంద్రనగర్‌లో వంద ఎకరాల్లో ఈ హైకోర్టును నిర్మాణం కాబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నూతన హైకోర్టు భవనం కోసం జనవరిలో శంకుస్థాపన జరపాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. గురువారం ఎంసీహెచ్ఆర్డీలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే, సీఎస్‌లు రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ప్రస్తుతం ఉన్న భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో.. కొత్తది నిర్మించాల్సిన అవసరం ఉందని సీజే అలోక్‌రాధే.. సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో కొత్త హైకోర్టు నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ లభించినట్లు సమాచారం. అయితే ఇప్పుడు హైకోర్టు భవనం హెరిటేజ్ భవనంగా పరిరక్షించాలని సీఎం రేవంత్ ఈ భేటీలో అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న భవనాన్ని సిటీ కోర్టుకు లేదంటే మరేదైనా కోర్టు భవనానికి వాడుకోవాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. అలాగే జిల్లా కోర్టుల నిర్మాణం వేగవంతం చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. -
ఎట్టకేలకు TSPSC ప్రక్షాళన షురూ?
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలోనూ.. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడ్డాక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏనాడూ విమర్శలు ఎదుర్కొలేదు. కానీ, ఏడాది కాలంగా మాయని మచ్చ మీదేసుకుంది. ఇంటి దొంగల చేతివాటంతో మొదలైన పేపర్ లీకేజీ వ్యవహారం.. రాజకీయ పరిణామాలు, నిరుద్యోగుల్లో పెల్లుబిక్కిన అసంతృప్తి.. చివరకు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రభావం చూపించాయి. అయితే నాడు ప్రతిపక్షం హోదాలో టీఎస్పీఎస్సీ బోర్డు ప్రక్షాళన కోరిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు అధికారం చేపట్టాక ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ జనార్ధన్‌రెడ్డి తన రాజీనామాను సోమవారం గవర్నర్‌కు సమర్పించారు. సమీక్షకు రావాలంటూ సీఎంవో నుంచి పిలుపు అందుకున్న ఆయన.. గంటల వ్యవధిలోనే సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి ఆపై రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కానీ, రాజీనామాను ఆమోదించకుండా గవర్నర్ తమిళిసై ట్విస్ట్ ఇవ్వడంతో.. ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు తాజాగా TSPSC బోర్డు సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ రాజీనామా చేశారు. తప్పు చేయకున్నా.. బోర్డు సభ్యుడిగా మానసిక క్షోభను అనుభవించామని, బోర్డు సభ్యులపై ముప్పేట విమర్శ దాడి జరుగుతోందని.. గుంపగుత్తగా దోషులిగా చిత్రీకరించే యత్నం జరుగుతోందంటూ ఆవేదనపూరితమైన ప్రకటనతో తన రాజీనామా ప్రకటించారాయన. మేమేం చేశాం? సాధారణంగా బోర్డు సభ్యుల ఎంపిక రాజ్యాంగబద్ధంగా జరుగుతుంది. అలాగే తొలగింపు కోసం కూడా ఒక పద్ధతి ఉంటుంది. అయితే ఇప్పుడున్న తమలో వ్యక్తిగతంగా ఎవరిపైనా ఆరోపణలు రాలేదన్నది సభ్యుల వాదన. కనీసం విచారణ కూడా జరపకుండా బోర్డు నుంచి తొలగించాలని.. ప్రక్షాళన చేయాలని పౌర సమాజంతో పాటు మేధోవర్గం నుంచి కూడా వస్తున్న డిమాండ్లను వాళ్లు భరించలేకపోతున్నారట. ఏకపక్షంగా జరుగుతున్న విమర్శల దాడి.. బోర్డు సభ్యుల తొలగింపు ఉండబోతుందన్న సంకేతాల నేపథ్యంలోనే తాము మనోవేదనకు గురవుతున్నట్లు చెబుతున్నారు వాళ్లు. మూకుమ్మడి రాజీనామాలు..? ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు, రాతపరీక్షలు, ప్రశ్నపత్రాల లీకేజీ, తదుపరి నియామక ప్రక్రియను సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయంలో సమీక్షించారు. అయితే.. బోర్డు సభ్యులు ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. కమిషన్ సభ్యులుగా రాజీనామాలపైనే ఆయనతో వాళ్లు చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు రాజ్‌భవన్ అపాయింట్మెంట్ కోరడంతో.. సభ్యులు మూకుమ్మడిగా తమ రాజీనామాల్ని గవర్నర్‌కు అందజేస్తారనే ప్రచారం ఊపందుకుంది. -
కొండారెడ్డిపల్లి కాదు.. ఇక మాది సీఎం ఊరు
సాక్షి, నాగర్‌కర్నూల్: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన తర్వాత.. కాంగ్రెస్ శ్రేణుల్లోని ఆయన అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లోని రేవంత్ ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో తెలంగాణ కొత్త సీఎం ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. అదే సమయంలో రేవంత్ స్వస్థలంలో పండుగ వాతావరణం నెలకొంది. రేవంత్‌రెడ్డి పుట్టింది ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో. ఇవాళ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పేరును ప్రకటించాక ఆ ఊరి ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారు. పటేలా.. అంటూ రేవంత్‌ను ఆప్యాయంగా పిలిచే కొందరు మీడియాతో తమ సంతోషం పంచుకున్నారు. ‘‘మా రేవంత్ పటేల్ సీఎం అయ్యాడు. ఢిల్లీకి రాజు అయినా.. తల్లికి కొడుకే. రేవంత్ అప్పటికీ.. ఇప్పటికీ మా మంచి పటేల్. ఎప్పుడు ఊరికి వచ్చినా ఆప్యాయంగా పలకరిస్తారు. ఇకపై మా ఊరు కొండారెడ్డిపల్లి కాదు.. సీఎం ఊరు’’ అని గ్రామస్తులు స్వీట్లు పంచుకుంటూ, రంగులు చల్లుకుంటూ కనిపించారు. పాలమూరు నుంచి రెండో సీఎం! గతంలో హైదరాబాద్ స్టేట్‌కు కల్వకుర్తి నుంచి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా పని చేశారు. దశాబ్దాల తర్వాత ఇప్పుడు పాలమూరు ప్రాంతంలో పుట్టిన రేవంత్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. -
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి.. ఎల్లుండే ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్‌రెడ్డి(54) ప్రమాణం చేయబోతున్నారు. సీఎల్పీ నేతగా రేవంత్ పేరును అధికారికంగా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. మంగళవారం సాయంత్రం ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ నిర్ణయం వెల్లడించారు. ఒకవైపు ప్రకటన జరుగుతున్న సమయంలోనే.. రేవంత్‌రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరారు. మరోవైపు జూబ్లీహిల్స్‌లోని రేవంత్ ఇంటి వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎల్లుండి ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణం చేయనున్నారు. చివరికి రేవంత్ పేరే.. తెలంగాణ రాజ్‌భవన్ వద్ద నిన్నంతా హైడ్రామా నడిచింది. తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే.. నిన్న ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ, ఇవాళ ఢిల్లీలో తెలంగాణ సీనియర్ల చర్చల పరిణామాల తర్వాత మంగళవారం సాయంత్రం ఈ నిర్ణయం వెల్లడించింది హైకమాండ్. పలువురు సీనియర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయినప్పటికీ.. మెజార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం పరిగణనలోకి తీసుకున్న పార్టీ అధిష్టానం, చివరకు రేవంత్ పేరునే ఖరారు చేసింది. ‘‘కొత్త సీఎల్పీ నేత ఎంపికపై నిన్న భేటీ జరిగింది. అందులో మూడు తీర్మానాలు చేశారు. కాంగ్రెస్ విజయం అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ఒక తీర్మానం. ప్రచారంలో పాల్గొన్న సీనియర్ నేతల కోసం మరో తీర్మానం. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పేరును ఖరారు చేస్తూ మరో తీర్మానం. అన్ని అంశాల్ని పరిగణనలోకి తీసుకున్నాకే ఈ ఎంపిక జరిగింది. పార్టీలో సీనియర్లందరికీ న్యాయం జరుగుతుంది. అంతా టీంగా పని చేస్తారు’’ అని మంగళవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. స్వతంత్రుడిగా అసెంబ్లీలోకి.. రాజకీయ అటుపోట్లు, ఒడిదుడుకులను ఎదుర్కొని సీఎం పదవి స్థాయికి ఎదిగిన రేవంత్ ప్రస్థానం ఆసక్తికరమే. విద్యార్థి దశలో ఏబీవీపీలో పని చేశారాయన. ఆ తర్వాత 2002లో బీఆర్ఎస్(అప్పుడు టీఆర్ఎస్)లో చేరి కొంతకాలం కొననసాగారు. ఆ తర్వాత 2006లో జడ్పీటీసీ మెంబర్‌గా స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు రేవంత్. సొంతూరైన కొండారెడ్డిపల్లి అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నా.. కల్వకుర్తి నియోజకవర్గంలోని మిడ్జిల్ మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగట్టి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి.. జడ్పీటీసీ సభ్యునిగా గెలుపొందడం విశేషం. అనంతరం 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నెగ్గి శాసన మండలి సభ్యుడిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. మహబూబ్‌నగర్‌లో దాదాపు 100 ఓట్ల ఆధిక్యమున్న అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని రేవంత్ ఓడించడం గమనార్హం. ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి దగ్గరై.. 2009లో కొడంగల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా 6వేలకు పైగా మెజార్టీతో నెగ్గి శాసనసభకి చేరారు . తిరిగి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొడంగల్ నుంచే పోటీ చేసి.. 14 వేల మెజార్టీతో మళ్లీ నెగ్గారు. ఆపై అసెంబ్లీలో ఆయన్ని ఫ్లోర్ లీడర్‌గా నియమించింది టీడీపీ. అయితే 2017 అక్టోబర్‌లో కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం నడుమ.. ఆయన్ని ఆ పదవి నుంచి తప్పించగా, చివరకు 2017 అక్టోబర్ 31వ తేదీన ఆయన కాంగ్రెస్‌లో చేరారు. 2018 ఎన్నికల్లో కొడంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పట్నం నరేందర్‌రెడ్డి చేతిలో తొలి ఓటమి చవిచూశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజ్గిరి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 10వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారాయన. దూకుడు స్వభావం ఉండడం, కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీసే తత్వం ఆయనకు డైనమిక్ లీడర్ అనే గుర్తింపును జనాల్లో తెచ్చిపెట్టాయి. రేవంత్‌కు 2018 సెప్టెంబర్‌లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్‌కమిటీలో(ముగ్గురు సభ్యులుండే..) వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల్ని, 2021 జులైలో ఏకంగా టీపీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పజెప్పింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కొడంగల్ నుంచి, కామారెడ్డి నుంచి పోటీ చేసి.. కొడంగల్‌లో మంచి మెజారిటీతో(32 వేల ఓట్ల) గెలుపొందగా, కామారెడ్డిలో మాత్రం ఓటమి పాలయ్యారు. వివాదాలున్నా.. కాంగ్రెస్ విజయ సారథిగా ఈ ఎన్నికలతో గుర్తింపు దక్కించుకున్న రేవంత్‌రెడ్డి పేరు సీఎం రేసులో ముందు నుంచే వినిపిస్తూ వచ్చింది. అయితే ఓటుకు నోటు లాంటి కేసు, పార్టీలో పలువురితో పొసగడకపోవడంతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పెద్ద మెజార్టీతో గెలుపొందలేదనే కారణాలను చెప్పి కాంగ్రెస్ సీనియర్లు రేవంత్ ఎంపికకు అడ్డుపడ్డారు. అయినప్పటికీ రేవంత్‌రెడ్డి పేరునే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు సమర్థించగా.. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలుపు బాట పట్టించారని భావించిన అధిష్టానం సైతం ఆయన వైపే మొగ్గు చూపించింది. వ్యక్తిగత జీవితం.. రేవంత్‌రెడ్డి 1969, నవంబర్ 8వ తేదీన మహబూబ్‌నగర్ కొండారెడ్డి పల్లిలో జన్మించారు. తల్లిదండ్రులు నర్సింహారెడ్డి, రాంచంద్రమ్మ. వనపర్తిలో పాలిటెక్నిక్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఏవీ కాలేజ్ నుంచి బీఏ చేశారాయన. జర్నలిస్ట్‌గానూ ఆయన ఓ వార్త పత్రికలో పని చేసినట్లు తెలుస్తోంది. అలాగే కొన్నాళ్లపాటు ప్రింటింగ్ ప్రెస్ కూడా నడిపారాయన. కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి దగ్గరి బంధువైన గీతాను 1992లో రేవంత్‌రెడ్డి వివాహం చేసుకున్నారు. రేవంత్‌రెడ్డి-గీత దంపతులకు ఒక బిడ్డ నైమిషా రెడ్డి. ఈమె వివాహం 2015లో ఏపీకి చెందిన వ్యాపారవేత్త వెంకట్‌రెడ్డి తనయుడు సత్యనారాయణతో జరిగింది. ఈ జంటకు ఓ బాబు. మనవడు పుట్టిన సమయంలో తాత అయ్యాననే ఆనందంలో ఓ ఫొటో, అలాగే ఈ పంద్రాగష్టు రోజున మనవడితో దిగిన మరో ఫొటోను రేవంత్‌రెడ్డి తన సోషల్‌మీడియా ప్లాట్ఫామ్లో సంబురంగా షేర్ చేసుకున్నారు కూడా. I am happy to share with you all that we are blessed with the arrival of our grandson. My little girl Nymisha delivered a baby boy last week. I wish all your blessings for the baby and the mother. pic.twitter.com/DZOm1DHVtj — Revanth Reddy (@revanth_anumula) April 9, 2023 -
ఢిల్లీకి రేవంత్‌రెడ్డి.. కాసేపట్లో సీఎం పేరుపై అధికారిక ప్రకటన?
సాక్షి, హైదరాబాద్/ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో జరుగుతున్న హస్తిన చర్చలు మరింత హీటెక్కిస్తున్నాయి. అధిష్టానం పిలుపుతో మంగళవారం సాయంత్రం హుటాహుటిన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఢిల్లీ బయల్దేరారు. కాసేపట్లో ఏఐసీసీ కార్యాలయంలో కేసీ వేణుగోపాల్ మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. సోమవారం హైదరాబాద్‌లో సీఎల్పీ జరిగిన సీఎల్పీ భేటీలో సీఎల్పీ నేత ఎవరనే దానిపై కసరత్తులు జరగ్గా.. మంగళవారం ఢిల్లీ వేదికగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏఐసీసీ పెద్దలతో తెలంగాణ ఎన్నికల పరిశీలకుడు డీకే శివకుమార్ ఇవాళంతా చర్చలు జరిపారు. ఆపై సాయంత్రం ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ ఇంట్లో కీలక భేటీ జరిగింది. డీకేఎస్, తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రేలతో పాటు తెలంగాణ సీనియర్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఆ వెంటనే హైదరాబాద్‌లో ఎమ్మెల్యేలు ఉన్న ఎల్లా హోటల్ నుంచి రేవంత్ ఢిల్లీకి బయల్దేరడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. . -
నాటు నాటు గీతం తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టింది: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. విశ్వ యవనికపై తెలుగు సినిమా సత్తాచాటిందని కొనియాడారు. 'ప్రతిష్టాత్మక ఆస్కార్ గెలుచుకోవడం తెలుగువారికి గర్వకారణం. నాటు నాటు గీతం తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టింది. తెలుగులోని మట్టివాసనలను చంద్రబోస్ వెలుగులోకి తెచ్చారు. ఆర్ఆర్ఆర్ టీమ్‌కు అభినందనలు.' అని కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. 95వ ఆస్కార్ వేడుకల్లో నాటు నాటు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డు కొల్లగొట్టింది. ఈ ఘనత సాధించిన తొలి దక్షిణాది చిత్రంగా చరిత్రపుటలకెక్కింది. దీంతో దేశంలోని ప్రముఖులు, సెలబ్రిటీలు ఆర్ఆర్ఆర్ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దేశం గర్వించదగ్గ సినిమా ఇది అని కొనియాడుతున్నారు. చదవండి: ‘నాటు నాటు’కు ఆస్కార్… ఆనందంతో ఎగిరి గంతేసిన రాజమౌళి -
సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత.. ఏఐజీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ ఉదయం నుంచి గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్న ఆయనను.. కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఏఐజీ వైద్యులు పలు రకాల పరీక్షలు నిర్వహించారు. కడుపునొప్పితో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నట్లు సమాచారం. అయితే ముందు రెగ్యులర్ చెకప్ లో భాగంగానే వైద్య పరీక్షలకోసం ఆస్పత్రికి వచ్చినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నా.. గ్యాస్ట్రిక్ సమస్యతోనే ఆస్పత్రికి వచ్చినట్లు సమాచారం. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, ఇతర కుటుంబ సభ్యులు, ఎంపీ సంతోష్ కుమార్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్ పల్లి వినోద్ రావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఇతర బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. చదవండి: కేంద్ర మంత్రి అమిత్ షా విమానంలో సాంకేతిక సమస్య.. -
కక్షతోనే ఆంక్షలు.. కేంద్రం తీరుతో రాష్ట్రానికి రూ. 40,000 కోట్ల గండి
సాక్షి, హైదరాబాద్: అభ్యుదయ పథంలో నడుస్తున్న తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధిస్తున్న అనవసర ఆంక్షలతో తీవ్ర నష్టం కలుగుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి సమకూరాల్సిన ఆదాయంలో రూ.40 వేల కోట్లకుపైగా గండిపడిందని, ఈ రాజకీయ ప్రేరేపిత, కక్షపూరిత విధానాలు సరికాదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు సవివరంగా తెలియజేసేందుకు డిసెంబర్ నెలలో వారం రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్‌రెడ్డిలను ఆదేశించారు. ఈ మేరకు వివరాలతో సీఎం కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రకటనలోని అంశాలివీ.. అకస్మాత్తుగా పరిమితులు మార్చి.. ‘‘ప్రతి ఆర్థిక సంవత్సరానికి ముందు కేంద్రం విడుదల చేసే బడ్జెట్ గణాంకాలను అనుసరించి రాష్ట్రాలు తమ బడ్జెట్ అంచనాలను రూపొందించుకుంటాయి. ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు ప్రతి రాష్ట్రానికి ఆనవాయితీగా ఎఫ్ఆర్బీఎం పరిమితులను ముందస్తుగా కేంద్రం విధిస్తోంది. 2022–23 ప్రారంభంలోనే తెలంగాణ ఎఫ్ఆర్బీఎం రుణాల పరిమితిని రూ.54 వేల కోట్లుగా కేంద్రం ప్రకటించింది. దానికి అనుగుణంగా రాష్ట్రం బడ్జెట్ అంచనాలను రూపొందించుకుంది. కానీ కేంద్రం అకస్మాత్తుగా తెలంగాణ ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితిని రూ.39 వేల కోట్లకు కుదించడంతో రాష్ట్రానికి అందాల్సిన రూ.15వేల కోట్లు తగ్గాయి. ఆర్థికంగా పటిష్టంగా ఉన్న రాష్ట్రాలు ఎఫ్ఆర్బీఎం పరిమితికి అదనంగా 0.5 శాతం రుణాలు సేకరించుకునేందుకు నిబంధనలు అనుమతిస్తాయి. ఆర్థికంగా అత్యంత పటిష్టంగా ఉన్న తెలంగాణకు మాత్రం ఈ అవకాశాన్ని ఇవ్వలేదు. వ్యవసాయ, రైతాంగ వ్యతిరేక విద్యుత్ సంస్కరణలను రాష్ట్రంలో అమలు చేస్తామంటేనే 0.5 శాతం అదనపు రుణ పరిమితికి అనుమతిస్తామని కేంద్రం ఆంక్షలు పెట్టింది. దీనితో మరో రూ.6 వేల కోట్ల రుణాలను సమీకరించుకునే అవకాశాన్ని రాష్ట్రం కోల్పోయింది. ఎన్ని కష్టాలనైనా భరిస్తామని.. కానీ తెలంగాణ రైతులకు, వ్యవసాయానికి నష్టం చేసే కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్కరణలకు ఒప్పుకోబోమని సీఎం కేసీఆర్ కేంద్రానికి ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన రూ.21 వేల కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వ సంకుచిత విధానాల వల్ల నిలిచిపోయి రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయింది. అక్కడితో ఆగకుండా రాష్ట్రానికి రావాల్సిన రూ.20 వేల కోట్ల బడ్జెటేతర రుణాలను కూడా కేంద్రం నిలిపివేయించింది. ఈ అనాలోచిత విధానాలు, పూర్తి ఆర్థిక అజ్ఞానంతో కూడిన నిర్ణయాలతో రాష్ట్రానికి రావాల్సిన రూ.40వేల కోట్లకుపైగా నిధులకు గండిపడింది. ఒప్పంద రుణాలూ నిలిపివేసి.. ప్రజల అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాల కోసం రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే పలు ఆర్థిక సంస్థలతో చేసుకున్న ఒప్పందాల ప్రకారం నిధులు (రుణాలు) సమీకరిస్తోంది. కానీ కేంద్రం ఆ నిధులను కూడా కక్షసాధింపు నిబంధనలతో రాకుండా నిలిపివేయించింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో అధికారులు ఆయా సంస్థలతో నిరంతర సంప్రదింపులు జరిపారు. రాష్ట్ర ప్రగతి కోసం వారిచ్చే రుణాలను తిరిగి చెల్లించే ఆర్థిక పరిపుష్టి కలిగి ఉన్నామని స్పష్టంగా వివరించారు. దీనిని అర్థం చేసుకున్న ఆర్థిక సంస్థలు రాష్ట్రం మీద భరోసాతో గత ఒప్పందాల మేరకు నిధులను విడుదల చేస్తున్నాయి. దేశ అభివృద్ధికి గొడ్డలిపెట్టు కేంద్రం అడుగడుగునా రాష్ట్రాన్ని ఆర్థిక దిగ్భంధం చేసి ప్రగతికి అడ్డుపుల్లలు వేస్తోంది. కేంద్ర అసమర్థ, అనుచిత నిర్ణయాలతో సకాలంలో నిధులు అందక అభివృద్ధి ఆగిపోయి రాష్ట్రాల ప్రగతి కుంటుపడే పరిస్థితులు దాపురిస్తున్నాయి. కేంద్ర తప్పుడు విధానాలు దేశాభివృద్ధికే గొడ్డలిపెట్టుగా మారే ప్రమాదం పొంచి ఉంది. పూర్తి ఆర్థిక అజ్ఞానంతో కూడిన, అనాలోచిత, అసంబద్ధ నిర్ణయాలతో ఒక్క తెలంగాణ ప్రగతిని మాత్రమే కాదు దేశ ఆర్థిక పరిస్థితిని కూడా కేంద్రం దిగజారుస్తోంది. రాజకీయ ప్రేరేపితమైన కక్షపూరిత దిగజారుడు విధానాలతో దేశంలోని అన్ని రాష్ట్రాల గొంతు కోస్తూ, నష్టపరుస్తూ, కేంద్రం సమాఖ్య స్పూర్తికి తూట్లు పొడుస్తోంది..’’ అని సీఎంఓ ప్రకటనలో పేర్కొంది. కక్షసాధింపు చర్యలపైనా నిలదీసేలా.. కేంద్ర ఆంక్షలతో నిధులు అందకపోవడాన్ని ప్రజలకు వివరించడం కోసం అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుకు కేసీఆర్ నిర్ణయించినా.. ఇతర కీలక అంశాలు కూడా ఎజెండాలో ఉండనున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలో ‘ఎమ్మెల్యేలకు ఎర’ అంశం తెరమీదికి రాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. మరోవైపు మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని కొన్నిరోజులుగా ఆదాయపన్ను శాఖ దాడులు జరుగుతున్నాయి. దీనితో కేంద్రం సీబీఐ, ఐటీ, ఈడీ సంస్థలను అడ్డుపెట్టుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని టీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చి వేసేందుకే ఎమ్మెల్యేల కొనుగోళ్లతోపాటు ఐటీ, ఈడీ సంస్థల ద్వారా దాడులకు పాల్పడుతోందనే అంశాన్ని అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ వివరించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు జరిగిన ప్రయత్నాలు, తాము అడ్డుకున్న తీరును కూడా ప్రజలకు వివరించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో అసెంబ్లీ తేదీలు ఖరారు సీఎం కేసీఆర్ చెప్పిన మేరకు అసెంబ్లీ సమావేశాల తేదీలు ఒకట్రెండు రోజుల్లో ఖరారు చేసే అవకాశం ఉందని టీఆర్ఎస్ శాసనసభాపక్ష వర్గాలు వెల్లడించాయి. టీఆర్ఎస్ 2018లో రెండోసారి అధికారంలోకి వచి్చన తర్వాత ఇప్పటివరకు 11 సార్లు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించగా.. తొలిసారిగా శీతాకాలంలో సమావేశాలను నిర్వహిస్తోంది. -
‘మునుగోడు’ హామీలను వెంటనే అమలు చేయండి.. కేసీఆర్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ప్రజ లకు ఇచ్చిన హామీలను వెంటనే ఆచరణలో పెట్టాలని మంత్రు లు, ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ నేతలను సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. సంబంధిత శాఖల మంత్రులు, అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రణాళికలు అమల య్యేలా చూడాలని సూచించారు. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలు సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సోమవారం మధ్యా హ్నం సుమారు మూడు గంటల పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో సీఎం కేసీఆర్ సమావేశ మయ్యారు. మునుగోడు అభివృద్ధికి సంబంధించిన పలు అంశా లపై దిశానిర్దేశం చేశారు. ‘‘ఎన్నికల సమయంలో నేతలు కేవలం హామీలు ఇస్తారనే అపోహను తొలగించాల్సిన అవసరం ప్రజా ప్రతినిధులపై ఉంది. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం సందర్భ ంగా నియోజకవర్గంలో రీజనల్ హాస్పిటల్, రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, రోడ్ల నిర్మాణం వంటి అనేక అంశాలపై ప్రజల నుంచి విజ్ఞప్తులు అందాయి. త్వరలో మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో ఒక తేదీని నిర్ణయించుకుని పంచాయతీరాజ్, రోడ్లు– భవనాలు, నీటి పారుదల, గిరిజన సంక్షేమం తదితర శాఖలకు చెందిన మంత్రులు మునుగోడుకు వెళ్లండి. జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులతో నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష నిర్వ హించి, అవసరమైన పనులకు ప్రణాళికలు సిద్ధం చేయండి. చర్ల గూడెం, శివన్నగూడెం రిజర్వాయర్ల పనుల పురోగతిని సమీ క్షించండి..’’ అని సీఎం కేసీఆర్ సూచించినట్టు తెలిసింది. ఇప్ప టికే నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ప్రభావం కనిపిస్తోందని పేర్కొన్నట్టు సమాచారం. కూసుకుంట్లకు అభినందన మునుగోడు ఉప ఎన్నికలో తనకు టీఆర్ఎస్ అభ్యర్థిగా అవకాశమిచ్చిన సీఎం కేసీఆర్‌కు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కూసుకుంట్లకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ శాలువాతో సత్కరించారు. ఆయనతోపాటు మునుగోడులో విజయం కోసం కృషి చేసిన పార్టీ నేతలను అభినందించారు. సీఎంను కలిసినవారిలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గొంగిడి సునీత, బొల్లం మల్లయ్యయాదవ్, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, సైదిరెడ్డి, రవీంద్రకుమార్ నాయక్, భాస్కర్‌రావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎగ్గె మల్లేశం, ఎంసీ కోటిరెడ్డి, పార్టీ నేత సోమభరత్ కుమార్, ఉమా మాధవరెడ్డి తదితరులు ఉన్నారు. చదవండి: ఫోన్ ట్యాపింగ్‌పై భారీగా ఫిర్యాదులు? -
20 లక్షల ఉద్యోగాలు ఊడతాయ్!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పేరుతో తీసుకొస్తున్న బిల్లును ఉపసంహరించుకోవాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మరోసారి శాసనసభ తీర్మానం చేసి పంపించాలని నిర్ణయించినట్లు చెప్పారు. సోమవారం అసెంబ్లీలో ‘కేంద్ర విద్యుత్ బిల్లు’పై మాట్లాడిన కేసీఆర్.. గతంలో భూ, రైతు చట్టాలను ఉపసంహరించుకున్న విధంగానే విద్యుత్ సంస్కరణల పేరుతో తీసుకొచ్చిన చట్టాలను కూడా ఉపసంహరించుకోవాలని సూచించారు. దేశంలో ఇప్పటికే ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్ సంస్థలను ప్రైవేటు పరం చేశారని, ఇప్పుడు దేశంలోని విద్యుత్ సంస్థలను కూడా ప్రైవేటు పరం చేయాలని కేంద్రం యోచిస్తోందని చెప్పారు. ఇదే జరిగితే దేశంలోని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న 20 లక్షల మంది ఉద్యోగాలు పోతాయని అన్నారు. ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తాను చెబుతున్న లెక్కలు తప్పయితే ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా రాజీనామా చేస్తానని ప్రకటించారు. దగాపై దేశం మేల్కొని పోరాడాలి.. ‘జవహర్లాల్ నెహ్రూ కాలం నాటి నుంచి దశాబ్దాలుగా విద్యుత్ సంస్థలు, డిస్కంలు, ట్రాన్స్‌కో,జెన్కోల ద్వారా సముపార్జించిన లక్షల కోట్ల ఆస్తులను ప్రైవేటు షావుకార్లకు కట్టబెట్టే కుట్ర జరుగుతోంది. సంస్కరణల పేరిట దేశానికి చేస్తున్న దగా ఇది. దీనిపై దేశం మేల్కొని పోరాడాలి. ఇవి ప్రజల ఆస్తులు... ఎక్కడిదాకైనా కొట్లాడతం..’అని ముఖ్యమంత్రి అన్నారు. ‘రైతుబంధు’నిజమైన ఉద్దీపన ‘ఉమ్మడి రాష్ట్రంలో 20 ఎకరాలున్న రైతులు కూడా నగరానికి వచ్చి కూలీ పనులు చేశారు. ఆటోలు నడిపారు. జగద్గిరిగుట్టకు వలస వచ్చారు. నిన్నా ఇవాళ రైతుల మొఖం తెల్లబడుతోంది. 66 లక్షల మందికి ఇచ్చే రైతుబంధు నిజమైన ఉద్దీపన. అందుకే ఏం చేసైనా సరే తెలంగాణలో ఉచిత విద్యుత్ బంద్ చేయాలని చూస్తున్నారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ఈఆర్సీ రుణాలు రాకుండా అడ్డుపడుతున్నారు. కేంద్రం ఒత్తిడి మేరకు ‘ఉదయ్’పథకంలో చేరితే ఇబ్బందులు పెడుతున్నారు. ఎఫ్ఆర్ఎంబీలో కోతలు పెడతామని అంటున్నారు. విశ్వగురు విశ్వరూపం భయంకరం. శ్రీలంకలో భారత ప్రధానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు..’అని తెలిపారు. విద్యుత్ ఉద్యోగులు జూలు విదిలించాలి ‘కేంద్రం తీసుకొచ్చే విద్యుత్ బిల్లుల వల్ల రైతులు, పేద ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. అందువల్ల విద్యుత్ బిల్లులను వెనక్కు తీసుకోవాలి. ఇది పోరాటాల గడ్డ.. పౌరుషాల గడ్డ.. ఇక్కడ మీ పిట్ట బెదిరింపులు పనిచేయవు. 20 లక్షల మంది విద్యుత్ ఉద్యోగులు జూలు విదిలించాలి. లక్షల కోట్ల విద్యుత్ ఆస్తులను కాపాడేందుకు ఉద్యమం చేయాలి. విద్యుత్ బిల్లు వెనక్కు తీసుకోకపోతే , బాయిల కాడ మీటర్లు పెడితే బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపుతాం..’అని సీఎం స్పష్టం చేశారు. తట్టుకోలేక కొత్త కుట్రలు.. ‘తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ నుంచి రావలసిన రూ.17,828 కోట్లు కేంద్రం ఇప్పించకుండా, తెలంగాణ బకాయి ఉన్న రూ.3 వేల కోట్లకు ఎక్కడా లేని విధంగా 18 శాతం వడ్డీ చొప్పున మరో రూ.3 వేల కోట్లు కలిపి నెలరోజుల్లో రూ.6 వేల కోట్లు చెల్లించాలని హుకుం జారీ చేసింది. నెలలో కట్టకపోతే చర్యలు తీసుకుంటారట. కేంద్రాన్ని రూపాయి అడగకుండా రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నది తెలంగాణ ఒక్కటే. దానిని కేంద్రం జీర్ణించుకోలేకపోతోంది. ఈ వానాకాలం సీజన్లోనే 65 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. మొత్తం 1.30 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యే పరిస్థితి. దీన్ని తట్టుకోలేక కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. ఆనాడు సీలేరు ప్రాజెక్టును గుంజుకున్నారు. ఇప్పుడు కొత్త కుట్రలు చేస్తున్నారు..’అని కేసీఆర్ మండిపడ్డారు. ఇదీ చదవండి: ఇంకా 18 నెలలే.. మోదీ సర్కారును దేవుడు కూడా కాపాడలేడు! -
ఇంకా 18 నెలలే.. మోదీ సర్కారును దేవుడు కూడా కాపాడలేడు!
సాక్షి, హైదరాబాద్: ‘కేవలం 36 శాతం ఓట్లు తెచ్చు కునే.. కేంద్రంలో రాజ్యమేలుతున్న బీజేపీ ప్రభుత్వం విపరీతంగా విర్రవీగుతోంది. బీజేపీ ప్రభుత్వ తీరుతో భారత మాత గుండెమీద గాయం అవుతోంది. అధికారం నెత్తికెక్కితే కాలమే కఠినంగా శిక్షిస్తది. అధికారం శాశ్వతం కాదు, మోదీ ప్రభుత్వానికి ఇంకా 18 నెలల సమయమే మిగిలింది. దేవుడు కూడా దాన్ని కాపాడలేడు. బుద్ధుడు నడయాడిన, ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఇచ్చిన మహాత్మాగాంధీ పుట్టిన దేశంలో ఇప్పుడేం జరుగుతోంది?’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కేంద్ర ప్రభుత్వ విద్యుత్తు బిల్లు–పర్యవసానాలు’ అంశంపై సోమవారం ఉదయం శాసనసభలో జరిగిన లఘు చర్చకు ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మోదీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఒక్క మంచి పనికూడా చేయలేని అసమర్థ ప్రభుత్వంగా అభివర్ణించారు. సంస్కరణలకు అందమైన ముసుగు ‘నాణ్యమైన కరెంటు ఇచ్చే అవకాశం ఉండి కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం, సంస్కరణలు అనే అందమైన ముసుగు వేసి షావుకార్లకు అడ్డంగా దోచిపెట్టే దోపిడీకి తెరదీసింది. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి అమ్మేసుకుంటూ, ఆర్టీసీ లాంటి సంస్థలను తీసేస్తే రూ.వేయి కోట్లు చొప్పున బహుమతి ఇస్తానని చెప్తున్న కేంద్రం.. వ్యవసాయ, విద్యుత్ రంగాలను కూడా షావుకార్ల చేతుల్లో పెట్టేవరకు నిద్రపోను అన్నట్టుగా వ్యవహరిస్తోంది. పంట ఉత్పత్తులను ధర ఎక్కువగా ఉండే ఏ ప్రాంతంలోనైనా అమ్ముకోవచ్చంటూ వ్యవసాయ చట్టాలను తెచ్చేందుకు ప్రయత్నించడంలోని లోగుట్టును గుర్తించలేమా? బాన్సువాడ రైతు పంటను పంజాబ్‌కు తీసుకెళ్లి అమ్ముకోగలడా? ఈ మహానుభావుల పుణ్యాన పెరిగిన డీజిల్ ధరలతో అది సాధ్యమా? ఎరువుల ధరలు, దున్నే ఖర్చులు, కోసే ఖర్చులు పెరిగి భరించలేక తట్టాపార కిందపెట్టాలి. అప్పుడు సూట్‌కేసులు పట్టుకుని షావుకార్లు దిగుతరు. మీ పొలాలను మాకు అప్పగించండి, మీరు మా దగ్గర కూలీలుగా పనిచేయండి అంటరు. ఇదే మోదీ ప్రభుత్వం అసలు లోగుట్టు. ఇలా షావుకార్లకు అప్పగించేందుకే ఈ సంస్కరణల భాగోతం’ అంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్కరణలు అమల్లోకొస్తే ప్రీపెయిడ్ మీటర్లే.. ‘సమైక్య రాష్ట్రంలో సరైన కరెంటు దొరక్క అన్ని వర్గాలు ప్రజలు ఎన్ని అవస్థలు పడ్డారో అందరికీ తెలిసిందే. సొంత రాష్ట్రం వచ్చాక పరిస్థితిని చక్కదిద్దుకుందామంటే ఆది నుంచి కేంద్రం కుట్రలు చేస్తూనే ఉంది. మోదీ తొలి కేబినెట్ సమావేశంలోనే ఏడు మండలాలను, సీలేరు పవర్ ప్రాజెక్టును ఏపీకి అప్పగించారు. తాజాగా ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యుత్ రంగం విషయంలో, రాష్ట్రాల ప్రమేయం లేకుండా కేంద్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. చట్ట సవరణ బిల్లులో కూడా అదే జరిగింది. మోటార్లకు మీటర్లు పెట్టకుండా కరెంటు కనెక్షనే ఉండదన్న విషయాన్ని రాష్ట్రాల అభిప్రాయంతో ప్రమేయం లేకుండా పొందుపరిచింది. కేంద్ర విద్యుత్ సంస్కరణలు అమల్లోకి వస్తే ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు లేకుండా ఎలాంటి కరెంటు కనెక్షన్ అయినా ఇవ్వడానికి వీలు ఉండదు..‘ అని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇదీ మోదీ ఘనత.. ‘తెలంగాణ ఆవిర్భవించిన 2014 నాటికి తెలంగాణ తలసరి విద్యుత్తు వినియోగం 970 యూనిట్లు కాగా, జాతీయ తలసరి వినియోగం 957 యూనిట్లు. ఎనిమిదేళ్ల తర్వాత తెలంగాణ తలసరి వినియోగం 2,126 యూనిట్లకు చేరితే, జాతీయ వినియోగం కేవలం 1,255 యూనిట్లకు మాత్రమే చేరింది. ఇవి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ లెక్కలు. ఇక ఇంటర్నేషనల్ అథారిటీ లెక్కలు పరిశీలిస్తే, ఐస్‌ల్యాండ్ తలసరి వినియోగం 51,696 యూనిట్లు, యూఎస్ 12,154, జపాన్ 7,150, చైనా 6,312, భూటాన్ వినియోగం 3,126 యూనిట్లుగా ఉంది. 140 దేశాల జాబితాలో మన దేశం ర్యాంకు 104. ఇది విశ్వగురువు ఘనత..’ అని ఎద్దేవా చేశారు. చేష్టలుడిగిన సర్కార్.. ‘ఒక చిన్న సర్దుబాటుతో బిహార్ దుఖదాయినులుగా ముద్రపడ్డ కోసి, గండకి నదులపై విద్యుదుత్పత్తి ప్రారంభిస్తే ఇటు కరెంటు అందుబాటులోకి వస్తుంది. అటు వరదల బాధా తప్పుతుంది. అలాంటి సలహా ఇచ్చినా చేయలేని అసమర్ధ ప్రభుత్వం మోదీది. దేశంలో 24 గంటలు కరెంటు సరఫరా చేయగలిగే 2,42,890 మెగావాట్ల కరెంటు అందుబాటులో ఉన్నా సరిగా వినియోగించలేని దుస్థితి నెలకొంది. ఇది కాకుండా వనరుల ఆధారంగా ఉత్పత్తి అయ్యే వేరియబుల్ పవర్ మరో 1.60 లక్షల మెగావాట్ల మేర ఉంది. చివరకు చెత్తనుంచి కూడా విరివిగా కరెంటును ఉత్పత్తి చేయగలిగే అవకాశం ఉన్నా మోదీ ప్రభుత్వం చేష్టలుడిగిపోయింది’ అని కేసీఆర్ విమర్శించారు. ఇదీ చదవండి: సికింద్రాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురు సజీవదహనం -
2024: ఢిల్లీ ‘పవర్’ మనదే.. దేశమంతా ఫ్రీ పవరే!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: బీజేపీ ముక్త్ భారత్ లక్ష్యంతో ముందుకెళ్లాలని, కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతున్న రైతు వ్యతిరేక బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపితేనే దేశం బాగుపడుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. 2024లో ఢిల్లీ గడ్డపై మన ప్రభుత్వమే రాబోతోందని చెప్పారు. నాన్ బీజేపీ ప్రభుత్వం వస్తుందని, మన ప్రభుత్వం వచ్చాక దేశం మొత్తం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. మన ప్రభుత్వం వచ్చేలా తెలంగాణ నుంచే దేశం కోసం రాజకీయ పోరాటం ప్రారంభిద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో దేశ రాజకీయాలకు వెళదామని.. ఎంతకైనా తెగిద్దామని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో దన్నుగా నిలిచిన నిజామాబాద్ జిల్లా నుంచే జాతీయ రాజకీయాల ప్రకటన చేస్తున్నానని చెప్పారు. సోమవారం నిజామాబాద్‌లో నూతన సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభించిన తర్వాత స్థానిక గిరిరాజ్ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలంట.. గతంలో శ్రీరాంసాగర్ వరద కాలువకు మోటార్లు పెట్టని చ్చారా? ఇప్పుడు మోటార్లు పెట్టుకుంటే ఎవరైనా అడుగు తున్నారా?కానీ అడగాలని కేంద్రం అంటోంది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని మోదీ ప్రభుత్వం అడగడం వెనుక మతలబేంది? దేశంలో రైతులు వాడుకునే విద్యుత్ కేవలం 20.8 శాతమే. దీని విలువ రూ.1.48 లక్షల కోట్లు మాత్రమే. అయినప్పటికీ రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని మోదీ ప్రభుత్వం చెబుతోంది. కార్పొరేట్ కంపెనీల్లో కూలీల్లా పనిచేయాలంట.. మరోవైపు నిరర్ధక ఆస్తుల (ఎన్పీఏలు) కింద కార్పొరేట్లకు మోదీ ప్రభుత్వం రూ.12 లక్షల కోట్లు మాఫీ చేసింది. కార్పొరేట్లకు దోచిపెడుతున్న బీజేపీ ప్రభుత్వానికి రైతులకు మేలు చేసేందుకు మాత్రం చేతులు రావడం లేదు. విమానాలు, రైళ్లు, ఓడరేవులు, ఫ్యాక్టరీలు, బ్యాంకులను అమ్మిన కేంద్రం.. ఇక మిగిలిన రైతుల వ్యవసాయ భూములను కార్పొరేట్ కంపెనీలకు అమ్మేసి రైతులను అందులో కూలిపని చేయాలంటోంది. ఎరువుల ధరలు పెంచుతారు. ధాన్యం కొనరు. వ్యవసాయం, పంటలు, రైతుల విషయంలోనూ అన్నీ కుట్రలే. అన్నిరంగాల్లో విఫలమైన కేంద్ర ప్రభుత్వాన్ని సాగనంపేందుకు దేశ రాజకీయ ప్రస్థానాన్ని బ్రహ్మాండంగా కొనసాగిద్దాం. దేశ రాజకీయాలకు వెళదామా? ఎంతకైనా తెగిద్దామా? (అని ముఖ్యమంత్రి అనగానే ప్రజలు ‘దేశ్ కీ నేతా కేసీఆర్’ అంటూ నినాదాలు చేశారు). మీటర్లు పెడతా అన్నోడికే మీటర్ పెట్టాలి.. తెలంగాణ నుంచే దేశం కోసం పోరాటం చేయాలి. మన బావి వద్ద మీటర్లు పెడతా అన్నోడికే మీటర్ పెట్టాలి. అట్లయితేనే బాగుపడతాం. అమెరికాకు సైతం లేని గొప్ప వరం భారత్‌కు ఉంది. దేశంలోని 83 కోట్ల ఎకరాల్లో 41 కోట్ల ఎకరాలు వ్యవసాయానికి అనుకూల భూములు. గంగా, కావేరి, గోదావరి, కృష్ణా లాంటి నదులున్నాయి. మోదీ ప్రభుత్వం ఒక కొత్త ప్రాజెక్టు, కొత్త ఫ్యాక్టరీ కట్టిందా? అన్నీ ఖతం చేసి మనల్ని శంకరగిరి మాన్యాలు పట్టించి కూలి పని చేసేలా చేస్తోంది. ఇలాంటి రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని తిప్పికొట్టాలి. దళిత, గిరిజన, మహిళ, బలహీన వర్గాల ఆలోచన లేని మోదీ దేశం పరువు తీస్తున్నారు. అహంకారం, బలుపుతో రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టే పని పెట్టుకున్నారు. దేశం ఆరోగ్యకర రాజకీయాలతోనే బాగుపడుతుంది. ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనకుండా లౌకిక, ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలి. అందరం కలిసి తెలంగాణ తెచ్చుకున్నాం. ఇటీవల అన్ని రాష్ట్రాల రైతులు తెలంగాణకు వచ్చారు. ఇండియా కోసం పిడికిలి బిగించాలని కోరుతున్నారు. దేశ రాజకీయ ప్రస్థానాన్ని బ్రహ్మాండంగా కొనసాగిద్దాం. పచ్చని పంటలు కావాలా? రక్తపాతం కావాలా? నిజాంసాగర్, సింగూరు కాలువల్లో నీరు పారాలా? మతపిచ్చితో రక్తం పారాలా? .. పచ్చని పంటలు కావాలా? రక్తపాతం కావాలా? కూలగొట్టడం సులభం. ఒక్కసారి దేశం దెబ్బతింటే వందేళ్లయినా కోలుకోం. ప్రతిఒక్కరూ సమాజంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలి. లేకుంటే దెబ్బతింటాం. గత నాయకత్వం తెలంగాణను బలవంతంగా ఏపీలో కలిపితే 60 సంవత్సరాలు కొట్లాడాం. అనేకమంది అమరవీరులు చనిపోయారు. నేను చావు అంచులకు వెళ్లి వచ్చా. రాష్ట్రం సాధించాక బాగుచేసుకోవడంతో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. పేదలను అదుకుంటున్నాం. ఎనిమిదేళ్ల క్రితం ఎలా ఉండేది. ఇప్పుడు 24 గంటలు అత్యుత్తమ విద్యుత్ ఇచ్చే రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే. రాష్ట్రంలో 3,600 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాం. గిరిజన బిడ్డలు మా తండాలో మా రాజ్యం అంటూ బాగా పనిచేస్తున్నారు. రాష్ట్రంలో జీడీపీ పెరిగింది. తలసరి ఆదాయం పెరిగింది. కొద్ది రోజుల్లో సింగూరు కాలువలకు కాళేశ్వరం నుంచి నీరు రానుంది. నిజామాబాద్ జిల్లాకు సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్రలో ఏం జరుగుతోందో, ఇక్కడ ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఇదీ చదవండి: ప్రధాని మోదీ తర్వాతి టార్గెట్ రైతుల భూములే: సీఎం కేసీఆర్ ఫైర్ -
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ: కుంభకోణంలో కేసీఆర్ కుటుంబీకుల పాత్ర: బీజేపీ
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల పాత్ర ఉందని బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ ఆరోపించారు. ‘‘పాలసీ రూపకల్పన కోసం ఢిల్లీలోని ఒబెరాయ్, చండీగఢ్‌లోని హయత్ హోటళ్లలో జరిగిన భేటీల్లో కేసీఆర్ కుటుంబ సభ్యులు, సిసోడియా, ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్, ఆ శాఖ అధికారులు, లిక్కర్ మాఫియా∙వ్యక్తులు పాల్గొన్నారు. ఒబెరాయ్ హోటల్లో సూట్‌ను తెలంగాణ మద్యం మాఫియాకు చెందిన వ్యక్తి ఆర్నెల్ల కోసం బుక్ చేశాడు. డీల్ జరిగినన్ని రోజులు కేసీఆర్ కుటుంబ సభ్యులు తెలంగాణ మద్యం మాఫియా ఏర్పాటు చేసిన ప్రైవేట్ విమానంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీ వచ్చేవారు. లిక్కర్ మాఫియా కమిషన్‌ను 10 శాతానికి పెంచేందుకు ఒప్పందం కుదిరింది. అందుకు ప్రతిగా తొలి విడతగా రూ.150 కోట్లు సిసోడియాకు లంచంగా ముట్టింది. దీన్ని తెలంగాణ లిక్కర్ మాఫియానే ఇచ్చింది. గోవా, పంజాబ్ ఎన్నికల ఖర్చుల నిమిత్తం ఆప్‌కు లిక్కర్ మాఫియా అడ్వాన్స్ చెల్లింపులు జరిపింది. ఆ తర్వాతే పంజాబ్‌లోనూ, ఢిల్లీలోనూ కొత్త మద్యం విధానాల అమలు మొదలైంది. పంజాబ్‌లో ఆప్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ తరహా ఎక్సైజ్ విధానాన్నే అక్కడ కేసీఆర్ కుటుంబీకులు అమలు చేయించారు’’ అని ఆరోపించారు. లిక్కర్ పాలసీపై కేసీఆర్ కుటుంబీకులతో భేటీ అయ్యారో లేదో సిసోడియా చెప్పాలని డిమాండ్ చేశారు. -
ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు సీఎం కేసీఆర్
హైదరాబాద్: ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఐదురోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌తో పాటు పలువురు ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. గత శుక్రవారం ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్‌తో సమావేశమయ్యారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా.. దేశంలో ప్రాంతీయ పార్టీలను, ఆ ప్రభుత్వాల మనుగడనే ప్రశ్నార్థకం చేసే ధోరణితో కేంద్రంలోనీ బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, దీన్ని సమష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నట్టు సమాచారం. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆర్థిక ఆంక్షలు విధించి, వారిని కట్టడి చేసేందుకు ప్రయత్నించడాన్ని, ప్రభుత్వంలో చిచ్చుపెట్టి చీలికలు తేవడం ద్వారా ప్రాంతీయ పార్టీల ఉనికిని గందరగోళంలో పడేసే విధానాలను.. పార్లమెంట్ లోపలా, బయటా ఎండగట్టాల్సిందేనని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇదీ చదవండి: CM KCR: ఏకమై ఎండగడదాం! -
వేధించే ఎత్తుగడే.. ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత సర్వీసుల(ఏఐఎస్) కేడర్ రూల్స్–1954కు కేంద్రం ప్రతిపాదించిన సవర ణలు రాజ్యాంగానికి, సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ధ్వజ మెత్తారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల పనితీరును, వారి ఉద్యోగ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసేలా ఆ సవరణలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాల్లో అఖిల భారత సర్వీసుల అధికారులు నిర్వర్తించే క్లిష్టమైన బాధ్యతల నేపథ్యంలోనే.. వారిని డిప్యుటేషన్‌పై పంపడానికి రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి అవసరమయ్యేలా నిబంధ నలు ఉన్నాయని స్పష్టం చేశారు. కానీ ఈ విధా నాన్ని ఏకపక్షంగా మార్చేసి.. రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతి లేకుండానే అధికారులను తీసుకోవడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సవరణలు అమల్లోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత కోల్పోయి నామమాత్రపు సంస్థలుగా మిగులుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రతిపాదిత సవరణలను వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆ లేఖలోని ప్రధాన అంశాలివీ.. ఇది రాజ్యాంగాన్ని మార్చడమే.. ‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 312లో ఉన్న నిబంధ నల ప్రకారం పార్లమెంటు ఆలిండియా సర్వీసెస్– 1951 చట్టాన్ని చేసింది. దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం పలు నిబంధనలను రూపొందించింది. కానీ రాష్ట్రాల ఆకాంక్షలను కాలరాసే విధంగా, దేశ సమాఖ్య రాజనీతిని పలుచన చేసే దిశగా అఖిల భారత సర్వీసుల (కేడర్) రూల్స్–1954కు రంగు లద్దుతూ ఉద్దేశపూర్వకంగా చేసిన సవరణను మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ ప్రతిపాదిత సవరణ అంటే.. కేంద్ర–రాష్ట్ర సంబంధాలకు సం బంధించి భారత రాజ్యాంగాన్ని సవరించడం తప్ప మరొకటి కాదు. ఈ సవరణలను ఇలా దొడ్డిదారిన కాకుండా.. ధైర్యముంటే పార్లమెంటు ప్రక్రియ ద్వారా సవరించాలి. రాష్ట్రాల ఆకాంక్షలకు విఘాతం కలగకుండా ఉండాలంటే.. రాష్ట్రాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకొన్నాకే రాజ్యాంగ సవరణలు చేపట్టాలి. రాజ్యాంగ నిర్మాతలు ఎంతో దూరదృష్టితో ఈ నిబంధనను ఆర్టికల్ 368 (2)లో పొందుపరిచారని కేంద్ర ప్రభుత్వం గుర్తు తెచ్చుకోవాలి. సవరణలను విరమించుకోండి రాష్ట్రాల పాలనా అవసరాలను చిన్నచూపు చూసేలా కేంద్ర ప్రతిపాదనలున్నాయి. అఖిల భారత సేవల అధికారుల విషయంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉండే పరస్పర సర్దుబాటుకు గొడ్డలిపెట్టుగా ఈ సవరణలున్నాయి. వీటితో కేంద్రం, రాష్ట్రాల మధ్య సంబంధాలు మరింతగా దెబ్బతింటాయి. అధికారుల సేవలను సామరస్యంగా, సమతుల్యంగా వినియోగించుకోవడానికి ప్రస్తుత ఏఐఎస్ (కేడర్) నిబంధనలు సరిపోతాయి. పారదర్శకత, రాజ్యాంగ సమాఖ్య వ్యవస్థ పరిరక్షణ కోసం కేంద్రం ప్రతిపాదిత సవరణలను విరమించుకోవాలి.’’ అని ప్రధానికి లేఖలో సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పరోక్ష నియంత్రణ కోసమే.. అఖిల భారత సర్వీసుల (కేడర్) రూల్స్‌ను సవ రించి.. రాష్ట్రాల సమ్మతి లేకుండానే అధికారులను తీసుకోవాలనుకోవడం ప్రమాదకరం. ఇది రాజ్యాంగ చట్రం, సహకార సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తికి విరుద్ధం. ఇది రాష్ట్ర ప్రభుత్వాల పాలనా వ్యవహారాల్లో కేంద్రం తలదూర్చడమే. రాష్ట్రాల్లో పనిచేసే అధికారులను లక్ష్యంగా చేసుకుని వేధించడానికి, పరోక్షంగా నియంత్రించడానికి, వారిని చెప్పుచేతుల్లో ఉంచు కోవడానికి కేంద్రం ఈ ఎత్తుగడ వేసింది. అధికారుల ముందు రాష్ట్ర ప్రభుత్వాలను నిస్సహాయులుగా చేసే ఆలోచన ఇది. రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారులు జవాబుదారీతనంగా ఉండటంపైనా ఇది ప్రభావం చూపుతుంది. – కేసీఆర్ -
సీఎం కేసీఆర్ తో కేరళ సీఎం విజయన్ భేటీ
-
సీఎం కేసీఆర్ క్రైస్తవ సోదరుల కోసం ప్రత్యేక విందు
-
ముఖ్యమంత్రి పాత్రలో...
ప్రముఖ క్యారెక్టర్ నటుడు కోట శ్రీనివాసరావు పుట్టినరోజు జూలై 10న. ఆయన నటిస్తోన్న నూతన చిత్రం ‘రొరి’లోని లుక్‌ను ఈ సందర్భంగా విడుదల చేసింది చిత్రబృందం. సీటీఎస్ స్టూడియోస్, ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా చరణ్ రొరి నిర్మాణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. గతంలో కోట అనేకసార్లు ముఖ్యమంత్రిగా, అపోజిషన్ లీడర్ పాత్రల్లో నటించారు. కానీ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన నటించలేదు. ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్. రామన్నచౌదరి పాత్ర చేస్తున్నారు. -
జూన్ నుంచి సినిమా షూటింగ్‌లకు అనుమతి
-
సినిమా పరిశ్రమ బతకాలి
లాక్డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగ్‌లు, పోస్ట్ ప్రొడక్షన్ పనులను దశలవారీగా పునరుద్ధరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. లాక్డౌన్ నిబంధనలు, కోవిడ్ వ్యాప్తి నివారణ మార్గదర్శకాలను పాటిస్తూ షూటింగ్‌లు నిర్వహించేలా ఎవరికి వారు నియంత్రణ చర్యలను పాటించాల్సి ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు. సినిమా షూటింగ్‌లు ఎలా నిర్వహించాలనే విషయంలో విధి విధానాలను రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో శుక్రవారం సినిమా రంగ ప్రముఖులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. సినిమా షూటింగ్‌లు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, సినిమా థియేటర్ల పునఃప్రారంభం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. సినిమా షూటింగ్‌లు, థియేటర్లను రీ ఓపెన్ చేసేందుకు అనుమతులు ఇవ్వాలన్న సినీ ప్రముఖుల విజ్ఞప్తికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. సినిమా పరిశ్రమపై ఆధారపడి లక్షలమంది జీవిస్తున్నందున పోస్ట్ ప్రొడక్షన్, షూటింగ్ నిర్వహణ, థియేటర్స్‌లో సినిమా ప్రదర్శనలను దశలవారీగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఇండోర్‌లో తక్కువమందితో పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదట ప్రారంభించుకోవాలని సీఎం చెప్పారు. తర్వాతి దశలో జూన్ నెలలో సినిమా షూటింగ్‌లు ప్రారంభించాలని చెప్పారు. సినిమా షూటింగ్‌లను వీలైనంత తక్కువమందితో చేయాలని చెప్పారు. షూటింగ్స్‌లో ఎంతమంది పాల్గొనాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమై చర్చించాలని సినీ రంగప్రముఖులను సీఎం కోరారు. ఆ తర్వాత కచ్చితమైన మార్గదర్శకాలను రూపొందించి ప్రభుత్వం షూటింగ్‌లకు అనుమతులు ఇస్తుందని సీఎం వెల్లడించారు. కొద్ది రోజులు షూటింగ్‌లు జరిపాక పరిస్థితిపై కొంత అంచనా వస్తుంది కాబట్టి సినిమా థియేటర్లను రీ ఓపెన్ చేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌లతో పాటు నటులు చిరంజీవి, నాగార్జున, నిర్మాతలు డి. సురేష్‌బాబు, సి. కల్యాణ్, అల్లు అరవింద్, ‘దిల్’రాజు, దామోదర ప్రసాద్, కిరణ్, దర్శకులు రాజమౌళి, ఎన్. శంకర్, మెహర్ రమేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్, రాధాకృష్ణ, కొరటాల శివ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు (శుక్రవారం) సినిమా, టీవీ, డిజిటల్ మీడియాకి సంబంధించిన సమస్యలను విని, వేలాదిమంది దినసరి వేతన కార్మికులకు ఊరట కలిగేలా త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్‌గారు అన్నారు. వినోద పరిశ్రమ పునఃప్రారంభించే విధి విధానాలను ప్రభుత్వం త్వరలోనే రూపొందించి, అందరికీ మేలు కలిగేలా చూస్తుందని హామీ ఇచ్చారు. సమస్యలను విని, భరోసా ఇచ్చిన సీఎంగారికి పరిశ్రమలోని యావన్మంది తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. – చిరంజీవి -
సింధు సన్నాహాలకు సహకారం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ గెలవడం ద్వారా పీవీ సింధు దేశానికి గర్వకారణంగా నిలిచిందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. భవిష్యత్తులో జరిగే టోర్నమెంట్లలో పాల్గొనేందుకు, సిద్ధమయ్యేందుకు కావాల్సిన ఏర్పాట్లను ప్రభుత్వపరంగా చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. పీవీ సింధు, ఆమె తల్లిదండ్రులు, కోచ్ గోపీచంద్, తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ బుధవారం ప్రగతి భవన్లో కేసీఆర్‌ను కలిశారు. తనకు వచ్చిన గోల్డ్ మెడల్‌ను కేసీఆర్‌కు సింధు చూపించింది. రెండు రాకెట్లను కూడా సీఎంకు బహూకరించింది. ఈ సందర్భంగా సింధుకు సీఎం పుష్పగుచ్ఛం అందించి శాలువా కప్పి సన్మానించారు. ‘పీవీ సింధు దేశ గౌరవాన్ని నిలబెట్టింది. ప్రపంచ చాంపియన్‌షిప్ గెలవడం ద్వారా 130 కోట్ల మంది భారతీయులు గర్వపడేలా చేసింది. ఇలాంటి ఘనతలు సాధించడం ఆషామాషీ విషయం కాదు. కఠోర సాధన, శ్రమ, శ్రద్ధ అవసరం. ఎంతో కష్టపడితే తప్ప ఈ స్థితికి చేరుకోవడం సాధ్యంకాదు’ అని వ్యాఖ్యానించారు. ఒలింపిక్స్ సహా సింధు భవిష్యత్తులో పాల్గొనే టోర్నమెంట్లకు సమాయత్తం కావడానికి, ఇతరత్రా ఏర్పాట్లకు సహకారం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా కేసీఆర్ హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీస్ కమిషనర్లు అంజనీ కుమార్, వీసీ సజ్జనార్, మహేశ్ భగవత్, ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్‌చంద్ తదితరులు పాల్గొన్నారు. టోక్యోలో స్వర్ణం ఖాయం: గవర్నర్ నరసింహన్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని సాధించిన తెలుగుతేజం పీవీ సింధుపై తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రశంసలు కురిపించారు. వచ్చే 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ఆమె బంగారు పతకం సాధించడం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన సింధు నేటి తరానికి ఆదర్శమని గవర్నర్ నరసింహన్ కొనియాడారు. ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన సింధుతో పాటు, పారా బ్యాడ్మింటన్‌లో బంగారు పతకం సాధించిన మానసి జోషిలను బుధవారం గవర్నర్ దంపతులు సన్మానించారు. ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడుతూ ‘పట్టుదల, దృఢ సంకల్పం ఉంటే ఎలాంటి విజయాన్నైనా సాధించవచ్చని సింధు, మానసి నిరూపించారు. వీరు సాధించిన విజయాలు దేశానికి గర్వకారణం. వచ్చే ఏడాది ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచి మళ్లీ రాజ్‌భవన్‌కు రావాలని కోరుకుంటున్నా’ అని గవర్నర్ ఆకాంక్షించారు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తాము నెగ్గిన స్వర్ణ పతకాలను గవర్నర్‌కు చూపిస్తున్న మానసి, సింధు -
17న తెలంగాణ, ఏపీ సీఎంల చర్చలు!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా మిగిలిపోయిన విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మరో దఫా చర్చలకు సమయం ఆసన్నమైంది. ఈ నెల 21న నిర్వహించనున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డిని ఆహ్వానించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 17న విజయవాడకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఇరువురు ముఖ్యమంత్రులు రాష్ట్ర విభజన వివాదాలపై మరోసారి చర్చలు జరపనున్నారు. ఈ సమావేశం దృష్ట్యా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశం మేరకు శాఖలవారీగా విభజన వివాదాల స్థితిగతులపై నివేదికలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు పూర్తయినా ఇరు రాష్ట్రాల మధ్య కీలక విషయాల్లో వివాదాలు అపరిష్కృతంగా మిగిలిపోయాయి. గత ఐదేళ్లలో కొన్ని విషయాల్లో తీవ్ర వైరం కొనసాగింది. ఏపీ సీఎంగా వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ఇటీవల బాధ్యతలు చేపట్టాక ఉభయ రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగయ్యాయి. ఏపీ, తెలంగాణల మధ్య సత్సంబంధాలు నెలకొల్పే దిశగా ఇప్పటికే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెండు పర్యాయాలు చర్చలు జరిపారు. ఇచ్చిపుచ్చుకొనే పద్ధతిలో సమస్యలను పరిష్కరించుకోవాలనే ధోరణితో ఇరువురు సీఎంలు ఉండటంతో అత్యంత సుహృద్భావ వాతావరణంలో ఈ చర్చలు సాగాయి. హైదరాబాద్‌లో ఏపీ కార్యాలయాల నిర్వహణ కోసం కేటాయించిన భవనాలు గత నాలుగేళ్లుగా నిరుపయోగంగా ఉండటంతో వాటిని తెలంగాణకు అప్పగిస్తూ ఇరు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల సీఎంల మధ్య ఇప్పటివరకు జరిగిన చర్చల ఫలితంగానే ఈ మేరకు ముందడుగు పడింది. ప్రధానంగా షెడ్యూల్ 9, 10లోని ప్రభుత్వరంగ సంస్థల విభజన, విద్యుత్ ఉద్యోగుల పంపకాలు, విద్యుత్ బిల్లుల బకాయిలు తదితర సమస్యలను రెండు రాష్ట్రాలు పరిష్కరించుకోవాల్సింది. ఈ నెల 17న మళ్లీ రెండు రాష్ట్రాల సీఎంలు సమావేశం కానుండటంతో మరికొన్ని సమస్యలకు పరిష్కారం లభించే అవకాశాలున్నాయి. 17న నూతన ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రారంభోత్సవం హైదరాబాద్‌లోని హైదర్‌గూడలో కొత్తగా నిర్మించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస గృహాల సముదాయాన్ని సీఎం కేసీఆర్ ఈ నెల 17న ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకొని ప్రారంభించనున్నారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో కలసి ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ నివాస గృహాల సముదాయాన్ని ప్రారంభిస్తారు. అంతకుముందు ఉదయం 6 గంటల నుంచి ఆర్ అండ్ బీ శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో గృహవాస్తు పూజలు నిర్వహిస్తారు. హైదర్‌గూడలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్‌ను ప్రారంభించిన అనంతరం కేసీఆర్ నేరుగా విజయవాడకు బయలుదేరి ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలవనున్నారు. -
కేసీఆర్‌తో స్టాలిన్ భేటీ రద్దు!
చెన్నై: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుతో తమ పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ భేటీ కాకపోవచ్చని డీఎంకే వర్గాలు వెల్లడించాయి. తమిళనాడులో ఈనెల 19న జరగనున్న నాలుగు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ప్రచారంలో స్టాలిన్ బిజీగా ఉన్నందున కేసీఆర్‌తో సమావేశం కుదరకపోవచ్చని తెలిపాయి. పూర్తి వివరాలు వెల్లడించేందుకు డీఎంకే వర్గాలు నిరాకరించాయి. చెన్నైలో ఈ నెల 13న స్టాలిన్‌తో కేసీఆర్ భేటీ అవుతారని తెలంగాణ సీఎంఓ ఇంతకుముందు తెలిపింది. దేశ రాజకీయాలు, లోక్‌సభ ఎన్నికల అనంతరం పరిణామాలు, కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు తదితర అంశాలపై స్టాలిన్‌తో కేసీఆర్ చర్చిస్తారని పేర్కొంది. తాజాగా డీఎంకే పార్టీ వర్గాల ప్రకటనతో భేటీపై సందిగ్ధం నెలకొంది. ఫెడరల్ ఫ్రంట్‌లో చేరడం ఇష్టం లేకే కేసీఆర్‌తో భేటీకి స్టాలిన్ విముఖత చూపారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఏప్రిల్ 18న తమిళనాడులో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో డీఎంకే జట్టు కట్టింది. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కాంగ్రెస్‌తోనే ముందుకు సాగాలన్న భావనతో డీఎంకే ఉన్నట్టు కనబడుతోంది. కాంగ్రెస్, బీజేపీ రహిత ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనతో ముందుకు వచ్చిన కేసీఆర్‌తో చర్చలు జరిపితే తప్పుడు సంకేతాలు వెళతాయన్న ఉద్దేశంతోనే తెలంగాణ సీఎంతో భేటీకి దూరంగా ఉండాలని స్టాలిన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కాగా, కేసీఆర్ సోమవారం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో భేటీ అయ్యారు. జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలు ఏకమైతేనే గుణాత్మక మార్పు సాధ్యమని ఈ సందర్భంగా కేసీఆర్ అన్నారు. మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సోమవారం ఉదయం కేసీఆర్‌తో ఫోన్లో మాట్లాడారు. -
కేసీఆర్‌కు సాలిడ్ పంచ్
సాక్షి, హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వాల తీరు, ప్రత్యామ్నాయ కూటమి(ఫ్రంట్) ఏర్పాటు గురించి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు చేసిన సంచలన వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న బీజేపీని చూసి కేసీఆర్‌కు భయం పట్టుకుందని తెలంగాణ బీజేపీ చీఫ్ డాక్టర్ కె. లక్ష్మణ్ మండిపడ్డారు. ‘‘గుణాత్మక మార్పు అంటే ఏంటి? ‘కేసీఆర్ పదేపదే గుణాత్మక మార్పు మాట చెప్పారు. దళితుణ్ని ముఖ్యమంత్రిని చేయకుంటే తల నరుక్కుంటానని, ఆ తర్వాత తానే పీఠమెక్కడం, సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలను కొనడం, అన్నంపెట్టే రైతులకు బేడీలు వేయడం, ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలను నిర్బంధించడం, ప్రశ్నించే గొంతుకలను అణిచివేయడం.. ఇదేనా గుణాత్మక మార్పు? ఇంతకుముందు చెప్పిన ఒక్కమాటకైనా కేసీఆర్ కట్టుబడి ఉన్నారా? కేంద్రం నిధులపై చర్చకు సిద్ధమేనా? ఫ్రంట్‌కు టెంట్ కూడా దొరకదు : 70 ఏళ్లుగా సాధ్యంకాని అభివృద్ధిని మోదీ ఈ 4 ఏళ్లలో చేసి చూపారు. అందుకే ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారు. కేసీఆర్.. ఓటమి అంచుల్లో కొట్టుమిట్టాడుతున్న పార్టీలను పోగేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా దేశప్రజలు ఎన్నో ఫ్రంట్లను(కూటములను) చూశారు. సుస్థిరమైన నాయకత్వం కోసమే బీజేపీకి ఓటేసి నరేంద్ర మోదీని ప్రధానిని చేశారు. కేసీఆర్‌లాంటి వాళ్లు పెట్టే ఫ్రంట్లకు టెంట్లు కూడా దొరకవు. మోదీని తిట్టి, తిట్టలేదంటారా? : వాపును చూసి బలుపుగా భ్రమిస్తున్న కేసీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రధాని అనే గౌరవంలేకుండా మోదీని తిట్టారు. కేసీఆర్ పొరపాటున నోరుజారాడని వారి సంతానం కేటీఆర్, కవితలే అంగీకరించారు. ఇప్పటికైనా ఆయన తప్పును ఒప్పుకుంటే హుందాగా ఉంటుంది. గత అసెంబ్లీలో కనీసం ఒక్క స్థానం కూడా లేని బీజేపీ త్రిపురలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతోంది. రేపు కర్ణాటక, ఆ తర్వాత తెలంగాణలోనూ మాదే విజయం ’’ అని లక్ష్మణ్ అన్నారు. బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న లక్ష్మణ్, ఇతర నాయకులు -
అమిత్ షాకు కేసీఆర్ సవాల్
-
అమిత్ షాకు కేసీఆర్ సవాల్
కేంద్ర ప్రభుత్వం గత మూడేళ్లలో తెలంగాణకు లక్ష కోట్లు ఇచ్చిందంటూ బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా చెప్పడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ విషయాన్ని వివరించేందుకు ఆయన బుధవారం సాయంత్రం ప్రగతి భవన్లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణకు 20 వేల కోట్ల అదనపు నిధులు ప్రతియేటా ఇస్తున్నామని అమిత్ షా చెప్పారని, కనీసం 200 కోట్లయినా ఇచ్చారేమో చూపించాలని సవాలు చేశారు. 2016-17 సంవత్సరంలో తెలంగాణ నుంచి కేంద్రానికి రూ. 50,013 కోట్లు వెళ్తే, కేంద్రం అన్ని విధాలుగా కలిపి తెలంగాణకు ఇచ్చినది కేవలం రూ. 24,561 కోట్లు మాత్రమేనన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. అమిత్ షా గతంలోనూ రాష్ట్రం గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు గతంలో వచ్చినపుడు రాష్ట్రానికి 90వేల కోట్లు ఇచ్చామన్నారు ఆ తర్వాత స్థానికంగా ఉండే నాయకులు అమిత్ షా చెప్పింది నూరుశాతం కరెక్ట్, చర్చకు సిద్ధమన్నారు అది వాళ్ల అజ్ఞానమని, ఎందుకులే వదిలేద్దామని పట్టించుకోలేదు ఈసారి ఆయన ప్రత్యేకంగా రాష్ట్రంలో మూడు రోజుల పర్యటన పెట్టుకుని ప్రభుత్వంపై వరుస దాడి చేశారు తెలంగాణ దేశంలోనే బాగా ధనిక రాష్ట్రాలలో ఒకటి. ఇది అనేక రాష్ట్రాలతోనే కాక, ప్రపంచంలోని కొన్ని దేశాలతో కూడా పోటీ పడుతోంది మా పోరాటం పొరుగు రాష్ట్రాలతో కాదు, ఇతర దేశాలతోనే ఉందని గర్వంగా చెప్పుకోగలను నన్ను చాలామంది ఇతర దేశాల రాయబారులు పొగిడారు కేసీఆర్‌గా నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తే ఏమీ మాట్లాడను తెలంగాణ రాష్ట్రాన్ని కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే మాత్రం నా ప్రాణం పోయినా రాజీపడను ప్రపంచం ముందు నిలిచి గెలిచే రీతిలో కడుపు, నోరు కట్టుకుని అవినీతిరహితంగా పనిచేస్తున్నాం ప్రధాని సహా అనేకమంది కేంద్ర మంత్రులు కూడా ఈ రాష్ట్రాన్ని పొగిడి వెళ్లారు మిషన్ కాకతీయ, భగీరథ, టీఎస్ ఐపాస్లను అన్ని రాష్ట్రాల వాళ్లు ప్రశంసించారు కేంద్రమంత్రి ఉమా భారతి తెలంగాణ మోడల్‌ను కాపీకొట్టమని 28 రాష్ట్రాలకు చెప్పారు ఇంతమంది ప్రశంసిస్తుంటే అమిత్ షా మాత్రం అద్భుతమైన అబద్ధాలు చెప్పారు వేరే మనిషైతే నేను కూడా లైట్ తీసుకునేవాడిని. కానీ దేశాన్ని పాలించే పార్టీకి జాతీయాధ్యక్షుడు ఇప్పుడు కూడా నేను మౌనంగా ఉంటే అంగీకరించినట్లు అవుతుంది ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు, అప్పుడప్పుడు నాకు కూడా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తా అనిపిస్తుంది వాళ్ల పార్టీ విస్తరించుకోడానికి వాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఉంది ఎన్నికల్లో ఎల్లయ్య తోనో, మల్లయ్యతోనో, పుల్లయ్యతోనో పోటీచేసి గెలవాల్సిందే తప్ప ఏకగ్రీవంగా ఎవరూ ఎన్నిక కారు అమిత్ షా స్థాయి వ్యక్తి అంత పచ్చి అబద్ధాలు చెప్పకూడదు దేశాన్ని సాకే రాష్ట్రాలు ఐదారే ఉంటాయి. మిగిలినవన్నీ లోటు రాష్ట్రాలే పెంచి పోషించేవి గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక లాంటివి ఉంటాయి వాటిలో తెలంగాణ కూడా ఒకటి దేశానికి తెలంగాణ ఇచ్చే డబ్బు ఎంతో అమిత్ షా తెలుసుకోవాలి తెలంగాణ నుంచి కేంద్రానికి 2016-17లో ఆదాయపన్ను 32186 కోట్లు, సర్వీస్ టాక్స్ 7671 కోట్లు, కస్టమ్స్ డ్యూటీ 3328 కోట్లు, సెంట్రల్ ఎక్సైజ్ 6828 కోట్లు. మొత్తం కలిపితే 50,013 కోట్ల రూపాయలు పంపింది. ఇదే సంవత్సరంలో కేంద్రం నుంచి వచ్చే అన్ని రకాల నిధులు కలిపి రూ. 24,561 కోట్లు మాత్రమే. వెటర్నరీ యూనివర్సిటీ లాంటివి ఇవ్వాలని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోనే ఉంది. గిరిజన యూనివర్సిటీ ఇంకా రాలేదు. అది కూడా ఇచ్చేశామని ఆయన చెప్పారు. మూడు యూనివర్సిటీలకు రూ. 40,800 కోట్లు ఇచ్చినట్లు ఆయన చెబుతున్నారు, అసలు అన్ని నిధులు వాటికి అవసరం అవుతాయా, ఎందుకింత పచ్చి అబద్ధాలు చెప్పారు? మూడేళ్లలో లక్ష కోట్లు ఇచ్చామని అమిత్ షా చెప్పారు.. కానీ రాష్ట్రానికి హక్కు ప్రకారం రావల్సిన ప్రతి రూపాయి కలిపితే మే 24వ తేదీ వరకు వచ్చినది రూ. 67,390 కోట్లు మాత్రమే. అమిత్ షాతో నాకు పంచాయతీ ఎందుకు.. జీవితంలో నేను ఆయన్ని కలిసింది ఒక్కసారే -
ఖమ్మంలో 15న సీఎం కేసీఆర్ పర్యటన
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 15న ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన రెండు రోజులపాటు సాగుతుంది. 15వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్ ద్వారా ఖమ్మం చేరుకుంటారు. అనంతరం ఖమ్మం పట్టణంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి ఖమ్మంలోని ఎన్ఎస్పీ గెస్ట్‌హౌజ్‌లో బసచేస్తారు. మరుసటి రోజు ముదిగొండ మండలం ముత్తారం గ్రామంలోని రామాలయంను సందర్శిస్తారు. అనంతరం తిరుమలాయపాలెంలో ఓ పబ్లిక్ మీటింగ్‌కి హాజరవుతారు. తిరుమలాయపాలెం నుంచి టేకులపల్లి మండలం రోళ్లపాడు గ్రామానికి హెలికాప్టర్లో చేరుకుని రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. -
కేసీఆర్ సర్కారుపై పోరాడండి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రతీ అంశాన్ని వివాదాస్పదం చేయాలని చూస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ టీడీపీ నేతలతో అన్నారు. బుధవారం టీటీడీపీ నాయకులతో చంద్రబాబుతో సమావేశమయ్యారు. తెలంగాణలో నెలకొన్న కరువు పరిస్థితులు, రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వంపై పోరాడాలని వీరికి సూచించారు. పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ సమావేశంలో తెలంగాణలో పార్టీ పరిస్థితి, ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తలపెట్టిన ఆందోళనల మీద విస్తృతంగా చర్చ జరిగింది. వచ్చే నెల 12న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పార్టీ విస్తృత సమావేశం నిర్వహించాలని, అన్ని స్థాయిల్లో కమిటీల నియామకాలు పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా కేంద్రానికి లేఖ రాసి, ఆ ప్రాజెక్టు పూర్తి కాకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నాడని సీఎం కేసీఆర్, మంత్రులు చేస్తున్న ఆరోపణలను టీటీడీపీ నేతలు బాబు దృష్టికి తీసుకుపోయారు. దీంతో ఆయన, కేసీఆర్ ప్రతీ అంశాన్ని వివాదాస్పదం చేస్తున్నారని, ఎన్టీఆర్ హైదరాబాద్‌కు ఉదయం నిద్రలేవడం నేర్పారని చేసిన వ్యాఖ్యలనూ ఇదే రీతిలో వివాదం చేశారని, తాను మాట్లాడిన మాటల్లో తప్పేముందని పేర్కొన్నట్లు సమాచారం. హైదరాబాద్ అభివృద్ధిలో అసలు కేసీఆర్ పాత్ర ఏముందని కూడా బాబు ప్రశ్నించినట్లు తెలిసింది. తెలుగుదేశం పాలనలోనే తెలంగాణలో వివిధ దశల్లో మార్పులు చోటు చేసుకున్నాయని, హైదరాబాద్‌లో అర్ధరాత్రి రోడ్లు ఊడ్పించడం తన హయాంలోనే మొదలైందని అన్నట్లు సమాచారం. కాగా, త్వరలో జరిగే గ్రేటర్ ఎన్నికలతో పాటు, వరంగల్ లోక్‌సభా స్థానానికి జరిగే ఉప ఎన్నికకు సిద్ధంగా ఉండాలని బాబు సూచించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత విషయం తేలిపోతుందని, ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కూడా ఉందని కూడా బాబు అభిప్రాయ పడినట్లు తెలిసింది. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, ఎర్రబెల్లి తదితరులు భేటీలో పాల్గొన్నారు. -
కేసీఆర్‌కు భయపడి విదేశాలకు వెళ్లిపోయిన ఆంధ్రా మంత్రులు
అందుకే పుష్కరాలపై శ్రద్ధ కొరవడింది పర్యవసానమే పెను ప్రమాదం ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మలికిపురం : ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భయపడి ఆంధ్రా సీఎం, ఇతర మంత్రులు విదేశాలకు వెళ్లిపోయారని, అందుకే పుష్కరాలపై ప్రభుత్వానికి శ్రద్ధ కొరవడిందని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మలికిపురంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ప్రభుత్వం నోటీసులు ఇస్తుందన్న భయంతోనే వారు విదేశాలకు వెళ్లిపోయారని విమర్శించారు. పుష్కర ఏర్పాట్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రాజమండ్రి పుష్కర ఘాట్‌లో ప్రమాదం జరగడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, పోలీసులతోపాటు ఇతర శాఖల వైఫల్యం చాలా ఉందన్నారు. సాధారణ భక్తులు స్నానాలు చేసేచోట ముఖ్యమంత్రి స్నానాలు చేయడంవల్లనే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఈ దుర్ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రూ.1400 కోట్లు వెచ్చించి ఆరు నెలలుగా పనులు చేస్తుంటే ఏర్పాట్లు చేసేది ఇలాగేనా అని ప్రశ్నించారు. రాజమండ్రిలో పుష్కర యాత్రికులు సుమారు ఆరు కిలోమీటర్లు నడిచి ఘాట్‌కు వెళ్లేలా ఏర్పాట్లు చేయడం దారుణమన్నారు. బస్సులను నేరుగా ఘాట్ల వద్దకు వచ్చేలా చేసి వెంటనే స్నానాలు ముగించుకుని వెళ్లేలా చర్యలు తీసుకుంటే భక్తులకు ఇబ్బందులు ఉండేవి కావన్నారు. -
ముస్లింలకు సీఎం రంజాన్ కానుకలు, వరాలు
రంజాన్ సందర్భంగా ఈనెల 8వ తేదీన హైదరాబాద్‌లోని నిజాం కాలేజిలో భారీ ఎత్తున ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటుచేసినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మసీదులలో పనిచేసే ఇమాంలకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున భృతి అందించనున్నట్లు ఆయన తెలిపారు. వారితో పాటు నమాజులకు పిలుపునిచ్చే మౌజమ్‌లకు కూడా ఈ భృతి ఇస్తామన్నారు. గురువారం పలువురు సీనియర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించిన అనంతరం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమావేశమైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ఈనెల 8న నిజాం కాలేజి వేదికగా ఇఫ్తార్ విందు నిర్వహిస్తాం నాతోపాటు అందరు మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం నిర్వహిసత్ఆం హైదరాబాద్‌లో సీఎస్ ఆధ్వర్యంలో జీఏడీ నిర్వహిస్తుంది జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో జరుగుతుంది హైదరాబాద్ నగరంలో వంద మసీదులలో ఈసారి ప్రభుత్వం పక్షాన దావతె ఇఫ్తార్ ఏర్పాటుచేస్తున్నాం జిల్లాల్లో కూడా ప్రతి నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో ఒక మసీదులో ప్రభుత్వ పక్షాన ఇఫ్తార్ విందులు ఇస్తాం ప్రతి మసీదు వద్ద వెయ్యిమందికి భోజన ఏర్పాట్లు చేస్తాం రంజాన్ సందర్భంగా 1.95 లక్షల మంది ముస్లిం నిరుపేద కుటుంబాలకు రూ. 500 విలువైన దుస్తులు పంచిపెడతాం మసీదుల ఇమాంలు, కమిటీ ఆధ్వర్యంలో వీటిని పంచుతారు 1.95 లక్షల మందికి అదే రోజు భోజనాలు కూడా ఏర్పాటుచేస్తాం గతంలో తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన విధంగా ఈ రంజన్ నుంచి మొదలుపెట్టి తెలంగాణలోని 5వేల మసీదుల ఇమాంలకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున భృతి ఇస్తాం మసీదు కమిటీలు సమకూర్చేదానికి ఇది అదనం రంజాన్‌కు మొత్తం రూ. 26 కోట్ల ఖర్చు అవుతోంది ఈ కార్యక్రమాల నిర్వహణకు ఏకే ఖాన్ ఆధ్వర్యంలో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు సభ్యులుగా ఒక కమిటీని ఏర్పాటుచేస్తున్నాం ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ సలీం, ప్రధాన కార్యదర్శి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు ఈ కార్యక్రమంలో ఎక్కడా పొరపాట్లు జరగకుండా చూడాలని కలెక్టర్లకు విజ్ఞప్తి ఇప్పుడు 1.95 లక్షల మందితో ప్రారంభిస్తున్నాం. ఈ ఏడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఏడాది నుంచి అవసరమైతే పెంచుతాం రూ. 25 లక్షలతో మొత్తం రాష్ట్రంలోని అనాథ శరణాలయాల పిల్లలకు 8వ తేదీన భోజనాలు ఏర్పాటుచేస్తున్నాం ఆయా జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటుచేసుకుని కార్యక్రమం సాఫీగా సాగేలా చూడాలి. -
సీఎం కోసం.. అత్యాధునిక వాహనం రెడీ!
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కోసం ఓ అత్యాధునికమైన బస్సు తయారైంది. చండీగఢ్‌లో తయారుచేసిన ఈ బస్సును.. హైదరాబాద్ నగరానికి గురువారం తీసుకొచ్చారు. ఈ బస్సు తయారీకి మొత్తం రూ. 5 కోట్ల వరకు ఖర్చయింది. రాత్రిపూట బస చేసేందుకు కూడా వీలుగా హైసెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు. ఈ బస్సులో అత్యాధునిక హంగులు కూడా ఉన్నాయి. వీడియో కాన్ఫరెన్సు నిర్వహించేందుకు కూడా ఇందులో ఏర్పాట్లు చేశారు. ఇందులో వై-ఫైతో పాటు అత్యాధునిక కమ్యూనికేషన్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది. ఈ వాహనం హైదరాబాద్ నగరానికి రావడంతో.. ముఖ్యమంత్రికి ఇది పూర్తిగా అందుబాటులోకి వచ్చినట్లయింది. ఇక్కడ కావల్సిన ఏర్పాట్లు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత.. దీన్ని కేసీఆర్‌కు అందుబాటులోకి తీసుకెళ్తారని అంటున్నారు. -
నేడు నీతి ఆయోగ్ భేటీ
* హాజరయ్యేందుకు సీఎం కేసీఆర్ విముఖత * ఢిల్లీ వెళ్లనున్న సీఎస్, ప్రణాళికశాఖ పీఎస్ సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలో శనివారం జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉంటున్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల ఉప కమిటీ ఆఖరి సమావేశం కావటంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఉంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ రెండో వారంలోనే జరగాల్సిన ఈ సమావేశం వాయిదా పడింది. అప్పుడు ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధపడ్డ సీఎం కేసీఆర్ ఈసారి గైర్హాజరుకానున్నారు. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మ, ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి బి.పి.ఆచార్య తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఇప్పటికే ఢిల్లీలో రెండుసార్లు, భోపాల్‌లో ఒకసారి ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. వీటిలో భోపాల్ సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ పథకాలకు నిధుల కేటాయింపు, వాటి అమలుపై కేంద్రప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి రావటం, అందుకు అనుగుణంగా ఒక నివేదిక తయారు చేసిన నేపథ్యంలో శనివారం నాటి భేటీలో చర్చలకు తావు లేదని సీఎం భావిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రాల అభిప్రాయాలను తూతూమంత్రంగా విని, ఆ తర్వాత తన అభిప్రాయాన్నే కేంద్రం బలవంతంగా రుద్దుతోందని ఆయన ఉన్నతాధికారులతో అన్నట్లు తెలిసింది. జూలై 2న నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడి రాష్ట్ర పర్యటన నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ అరవింద్ పనగారియా జూలై 2న తెలంగాణలో పర్యటించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో నీతిఆయోగ్‌ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ కార్యక్రమ పనితీరును పరిశీలించేందుకు ఆయన హైదరాబాద్‌కు రానున్నారు. తన పర్యటనలో భాగంగా 2న ఉదయం ఆయన జిల్లాల్లో పర్యటిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను, 3 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబును కలసి నీతి ఆయోగ్‌పై చర్చించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
ఇద్దరూ తోడు దొంగలే
- బాబు, కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు - టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం: ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, అడ్డదారిలో అందలం ఎక్కాలని చూడటంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలేనని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. గురువారం ఖమ్మం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం ఎమ్మెల్సీకి కోట్ల రూపాయలు ఎర చూపడం, మరొకరు బలం లేకపోయినా ఐదుగురిని బరిలో దింపడం, ఒక్క జడ్పీటీసీ స్థానాన్ని గెలువకపోయినా జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు దక్కించుకోవడం.. చూస్తే ఇద్దరు అడ్డదారిలోనే వెళ్తున్నారనే విషయం స్పష్టమవుతోందన్నారు. ఒక వైపు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలు జరుగుతుంటే మరోవైపు బాబు, కేసీఆర్ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని అన్నారు. రేవంత్‌రెడ్డి రెడ్డిపై పెట్టిన కేసులనే చంద్రబాబు, కేసీఆర్‌లపై కూడా పెట్టాలని డిమాండ్ చేశారు. పాలేరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్, చంద్రబాబు విధానాలు చూసి ఇరు రాష్ట్రాల ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు కాంగ్రెస్ పార్టీ సముద్రం వంటిదని, పార్టీ నుంచి ఒక్కరు పోతే.. వందమంది నాయకులు తయారవుతారని అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చూపిస్తామని చెప్పారు. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, టీఆర్ఎస్ నాయకులు భయపడి పోతున్నారని అన్నారు. జిల్లాపై రాష్ట్ర ముఖ్యమంత్రి సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారని అన్నారు. మంజూరైన స్మార్ట్ సిటీని కూడా జిల్లాకు రాకుండా చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని అన్నారు. 2019లో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు. సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఐతం సత్యం, నాయకులు పొన్నం వెంకటేశ్వర్లు, కొత్తా సీతారాములు, నున్నా మాధవరావు, కూల్‌హోం ప్రసాద్, జావీద్, యర్రం బాలగంగాదర్ తిలక్, నాగండ్ల దీపక్‌చౌదరి పాల్గొన్నారు. కాంగ్రెస్ నుంచి పలువురి సస్పెన్షన్ పార్టీ వ్యతిరేక కార్యలకలాపాలకు పాల్పడుతున్న ఖమ్మం నగరంలోని పలువురు కాంగ్రెస్ నాయకులను పార్టీ నుంచి బహిష్కరించినట్లు పార్టీ జిల్లా అధ్యక్షులు ఐతం సత్యం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వీరిలో శీలంశెట్టి వీరభద్రం, బెడదం సత్యనారాయణ, దాదె బాస్కర్‌రావు, గుంటి మల్లయ్య, గుంటి అరుణ, కుమ్మరి గురుమూర్తి, తేజావత్ శ్రీనివాస్, పిన్ని కోటేశ్వరరావు, గుత్తా నరేష్ (రామన్నపేట)లను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించినట్లు ఐతం సత్యం పేర్కొన్నారు. -
ప్రారంభం.. ప్రేమ.. పౌరుషం
జిల్లాలో మరోమారు సీఎం పర్యటన పూర్తి ఆవిష్కరణలు, శంకుస్థాపనల తో ప్రారంభం బహిరంగసభలో జిల్లా ప్రజలపై ఉన్న ప్రేమను చెప్పిన కేసీఆర్ నల్లగొండ బాధ... నా గుండె లోతుల్లో ఉందని వ్యాఖ్య అదే సభలో చంద్రబాబుపై పౌరుషాన్ని చూపిన సీఎం దామరచర్లలో 4వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చౌటుప్పల్‌లో వాటర్‌గ్రిడ్ పైలాన్ ఆవిష్కరణ ఎన్జీ కళాశాల మైదానంలో భారీ బహిరంగసభలో ప్రసంగం సాక్షి ప్రతినిధి, నల్లగొండ : అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ఆవిష్కరణలతో సోమవారం ప్రారంభమైన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పర్యటన ప్రేమతో సాగి పౌరుషంతో ముగిసింది. చౌటుప్పల్‌లో వాటర్‌గ్రిడ్ పైలాన్ ఆవిష్కరణతోపాటు దామరచర్లలో నాలుగువేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ప్రాజెక్టుకు సీఎం సోమవారం శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత నల్లగొండ ఎన్జీ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగసభలో జిల్లాపై, ఇక్కడి ప్రజలపై తన వాత్సల్యాన్ని కనబరిచారు. నల్లగొండ బాధ.. తన గుండె లోతుల్లో ఉందని చెప్పిన సీఎం.. జిల్లా ప్రజలకు కృష్ణా, గోదావరి నదీ జలాలను అందించి తీరుతానని శపథం చేశారు. నల్లగొండకు నీళ్లు తెచ్చి చూపిస్తా అని భరోసా ఇచ్చారు. ఆ తర్వాత అదే సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ఆయన నిప్పులు చెరిగారు. ఓటుకు నోటు వ్యవహారం నుంచి చంద్రబాబును ఆ బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని, ఒళ్లు దగ్గర పెట్టుకోకపోతే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. తొలుత హెలికాప్టర్లో చౌటుప్పల్ వచ్చిన ఆయన అక్కడ పైలాన్‌ను ఆవిష్కరించి నేరుగా దామరచర్ల మండలం వీర్లపాలెం వెళ్లా రు. అక్కడ పవర్‌ప్లాంటుకు శంకుస్థాపన చేసి హెలికాప్టర్లోనే నల్లగొండకు వచ్చారు. పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిశోర్‌కుమార్ నివాసంలో విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆయన ఎన్జీ కళాశాల బహిరంగ సభలో ప్రసంగించి రోడ్డు మార్గంలో హైదరాబాద్ వెళ్లిపోయారు. వరాల జల్లు.. తన పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ జిల్లాకు వరాల జల్లు కురిపించారు. జిల్లా నలుమూలలా రైతాంగానికి సాగునీరు అందించేందుకు కృషి చేస్తానని చెప్పి, ఇందుకోసం రూపొందిస్తున్న ప్రాజెక్టుల గురించి వివరించారు. ఫ్లోరైడ్‌పీడిత ప్రాంతమైన మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు 6వేల కోట్ల రూపాయల వ్యయంతో శ్రీశైలం నుంచి నీటిని తెచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని, ఈ ప్రాజెక్టుకు ఈనెల 12న శంకుస్థాపన చేస్తానని ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించి రేపో, యెల్లుండో ఉత్తర్వులు జారీ చేస్తానన్నారు. అదే విధంగా ఆలేరు, భువనగిరి ప్రాంతాలకు మెదక్ జిల్లాలో నిర్మించే కాళేశ్వరం (కొమరెల్లి మల్లన్న) ప్రాజెక్టు ద్వారా సాగు, తాగు నీరు అందిస్తామని, ఎస్సెల్బీసీ టన్నెల్‌ను పూర్తి చేయడం ద్వారా తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలకు నీళ్లిస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో కృష్ణా, గోదావరి నీళ్లను తీసుకువచ్చి నల్లగొండ జిల్లా ప్రజల పాదాలు కడుగుతామని కేసీఆర్ వ్యాఖ్యానించారు. దొడ్డుదొడ్డోళ్లు నీళ్లు తేలే జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలకు కూడా సీఎం కేసీఆర్ చురకలంటించారు.‘ ఈ జిల్లాలో నాకన్న నాలుగింతలు దొడ్డోళ్లు, పొడుగోళ్లున్నరు. ఈ దొడ్డుగున్నోళ్లకు పదవిలో ఉన్నన్ని రోజులు దోచుకోవడమే సరిపోయింది. వారు తినేందుకే సరిపోలేదు. మా జగదీశ్ పొట్టిగ, సన్నగ ఉం టడు. దొడ్డోళ్లు రెండో పంటకు సాగర్‌నీళ్లు తెచ్చిండ్రా... మా జగదీశ్ తెచ్చిండు. మా ఎమ్మెల్యేలు సన్నగుంటరు కాబట్టే హాస్టళ్లలో సన్నబియ్యం పథకం తెచ్చినం.’ అని చమత్కరిం చారు. సాయి సంసారి... లచ్చి దొంగ అన్నట్టు అధికారంలో ఉన్నన్నాళ్లు ఎలాంటి ఆలోచన చేయకుండా, ప్రజలను ఎలా దోచుకుందామా అని ఆలోచించిన నేతలు ఇప్పుడు మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఆ70 ఫీట్ల స్థూపం.. నల్లగొండ కీర్తిపతాకం తెలంగాణ ప్రాంతమంతటికీ నల్లా నీళ్లు అం దించే వాటర్‌గ్రిడ్ పైలాన్‌ను జిల్లాలోని మునుగోడు నియోజకవర్గంలో నిర్మించాలని పట్టుబట్టి చేశామని కేసీఆర్ చెప్పారు. ‘ ఆ 70 ఫీట్ల స్థూపం... నల్లగొండ కీర్తిపతాకను రెపరెపలాడించాలి.’ అని సీఎం అన్నారు. జగదీశ్ తన కుడిభుజమని చెప్పిన కేసీఆర్ ఆయనకు ఉద్యమ సోయి ఉంది కాబట్టే అహోరాత్రులు శ్రమించి తెలంగాణ ప్రజలకు 24 గంటల కరెంటు ఇస్తున్నాడని అభినందించారు. నల్లగొండ బాధ తాను గుండెల్లో పెట్టుకుని ఉద్యమ సందర్భంగా తెలంగాణ మూలమూలన చెప్పుకొచ్చానని, ఆ బాధ తనకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదని కేసీఆర్ అన్నారు. ఇక నుంచి తెలంగాణలో కరెంటు కోతలుండవని ఆంధ్రోళ్లు, కాంగ్రెసోళ్ల పవర్‌కట్ అయినంక, తెలంగాణ ప్రజలకు పవర్‌ఫుల్లుగా వస్తోందని అన్నారు. ‘ ఇక బేఫికర్, కరెంటు కోతలుండవు. తెలంగాణకు పట్టిన అరిష్టాలన్నీ తొలగిపోయాయి.’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. వారు స్వయంప్రకటిత నాయకులు బహిరంగసభలో జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి కూడా కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేసి మాట్లాడారు. 30 ఏళ్లు అధికారంలో ఉన్నోళ్లు, ముఖ్యమంత్రులు అవుతామని చెప్పుకున్న స్వయం ప్రకటిత నాయకులు జిల్లాకు ఏం ఒరగబెట్టారని ఆయన ప్రశ్నించారు. ఎవరూ కలకనని, ఊహించని పథకాలను టీఆర్ఎస ప్రభుత్వం అమలుచేస్తోందని, దామరచర్లలో పవర్‌ప్లాంటు పెట్టాలని కాంగ్రెసోళ్లు పొరపాటున వెయ్యేళ్లు బతికినా ఆలోచన చేయలేరని అన్నారు. బహిరంగసభకు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి అధ్యక్షత వహించగా, రాష్ట్ర మంత్రులు కె.తారకరామారావు, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, పార్లమెంటు సభ్యులు బూర నర్సయ్య గౌడ్, బాల్కసుమన్, పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిశోర్‌కుమార్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు నేతి విద్యాసాగర్, పూల రవీందర్, కర్నె ప్రభాకర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బాలూ నాయక్, మదర్‌డెయిరీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి, జిల్లా టీఆర్ఎస్ నేతలు దుబ్బాక నర్సింహారెడ్డి, నోముల నర్సింహయ్య, తేరా చిన్నపురెడ్డి, కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి, వి. చందర్రావు, అమరేందర్‌రెడ్డి, కాసోజు శంకరమ్మ, లాలూ నాయక్, బడుగుల లింగయ్యయాదవ్, చాడా కిషన్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, బుర్రి శ్రీనివాసరెడ్డి, మెరుగు గోపి, మాలె శరణ్యారెడ్డి లతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం జిల్లా పర్యటన సమయ సూచిక ప్రదేశం సీఎం వచ్చిన సమయం వెళ్లిన సమయం చౌటుప్పుల్ 4 :45 గంటలు 5 :5గంటలు దామరచర్ల 5:45 గంటలు 6 :10 గంటలు నల్లగొండ 7 :40 గంటలు 8 :40గంటలు నల్లగొండలో బహిరంగ సభ జరిగే ప్రదేశానికి సీఎం7.36 గంటలకు చేరుకోగా..వేదిక మీదకు 7.38 గంటలకు చేరుకున్నారు. -
అన్నదాతను ఆదుకోరా?
త్రికాలమ్ గత సార్వత్రిక ఎన్నికలలో అద్భుతమైన వాగ్ధాటితో ప్రజలను మైమరిపించి వైరిపక్షాలను చిత్తు చేసి అధికారం కైవసం చేసుకున్న నాయకులు ఇద్దరు. ఒకరు ప్రధాని నరేంద్రభాయ్ మోదీ, మరొకరు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. తక్కిన విజేతలకు పరిస్థితులు అనుకూలించి ఉండవచ్చు. ప్రత్యర్థులు తప్పులు చేసి ఉండవచ్చు. పార్టీ కార్యకర్తలు అహర్నిశలూ కృషి చేసి అభ్యర్థులను గెలిపించి ఉండవచ్చు. పార్టీ యంత్రాంగం లేనిచోట సైతం ప్రభావవంతమైన ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకొని ఓట్లు రాబట్టుకున్న నాయకులు మాత్రం వీరిద్దరే. ఇద్దరూ ఎవ్వరూ ఊహించనంత ఘనవిజయాలు సాధించారు. అధికారంలోకి వచ్చారు. ఎన్నికలు గెలుచుకోవడం వేరు పరిపాలన సమర్థంగా చేయడం వేరు. వాగ్దేవి కటాక్షం అన్ని వేళలా రక్షించదు. ప్రజల అనుభవానికి భిన్నమైన అంశాలను ఎంత ఘాటుగా చెప్పినప్పటికీ అవి మనస్సుకు హత్తుకోవు. చెప్పే విషయాలు అసత్యాలో, అర్ధసత్యాలో అయినప్పుడూ చెప్పేవారి విశ్వనీయత తగ్గిపోతుంది. ఆశించిన ప్రయోజనం సిద్ధించదు. ఇది అనేక సందర్భాలలో నిగ్గుతేలిన నిజమే అయనప్పటికీ రాజకీయ నాయకులు గుణపాఠాలు నేర్చు కోరు. తాము ఇతరులకంటే తెలివిగలవారమనీ, ఇతరులు చేయలేని పని తాము చేయగలనమనీ భ్రమిస్తారు. ఫలితం అనివార్యంగా అనుభవిస్తారు. జాతి యావత్తూ సిగ్గుతో తలదించుకోవలసిన అంశాన్ని ప్రధానులూ, ముఖ్యమంత్రులూ ప్రస్తావించనంత మాత్రాన సంక్షోభం సమసిపోదు. శుక్ర వారం నాడు తెలంగాణ రాష్ట్ర సమితి డెలిగేట్ల సమావేశంలో కేసీఆర్ ఎప్పటి లాగే ధాటిగా మాట్లాడారు. ఆత్మస్తుతి కొంత పెరిగినా పరనింద కొంచెం తగ్గింది. తన సుదీర్ఘ ప్రసంగంలో అన్ని విషయాలూ ప్రస్తావించారు కానీ రైతుల ఆత్మహత్య గురించి మాట్లాడలేదు. అప్పుల ఊబిలో కూరుకొని పోయి అవమానభారంతో రైతులు బలవన్మరణం చెందుతున్నారనే కఠోరవాస్తవాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించనంత మాత్రాన సమస్య అదృశ్యమైపోదు. రాహుల్ గాంధీ కిసాన్ యాత్రను తెలంగాణలో, అందులోనూ ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన మెదక్‌లోనే, త్వరలో ప్రారంభించాలని నిర్ణయించుకున్నార ని సమాచారం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మెదక్ జిల్లాలో ఇంతవరకూ 67 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఎకనామిక్ టైమ్స్ వెల్లడించింది. సంఖ్య ఎక్కువో తక్కువో కావచ్చు కానీ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న మాట మాత్రం ఎవ్వరూ కాదనలేని చేదు నిజం. సోమవారం జరిగే టీఆర్ఎస్ బహిరంగ సభలోనైనా ముఖ్యమంత్రి ఈ సంక్షోభం పరిష్కరించేందుకు సత్వర చర్యలు తీసుకుంటామని ప్రకటిస్తే నిజాయితీగా ఉంటుంది. వ్యవసాయ రంగంలో సంక్షోభం టీఆర్ఎస్ ప్రభుత్వం సృష్టించింది కాదు. 1996 నుంచీ అనంతంగా కొనసాగుతున్న విషాదమే. ఏ ప్రభుత్వాన్నో, ఏ ముఖ్యమంత్రినో తప్పుపట్టడం కాకుండా సంక్షోభం పరిష్కారంకోసం రాజకీయాలకు అతీతంగా సమాజం యావత్తూ నడుంబిగించవలసిన సందర్భం ఇది. ఈ విషయంలో చొరవ తీసుకుంటే కేసీఆర్‌కే మరింత ఖ్యాతి దక్కుతుంది. ఇప్పటికే ఆయన అనితర సాధ్యమైన రీతిలో సుదీర్ఘకాలం ఉద్యమం నిర్వహించి తెలంగాణ రాష్ట్రం సాధించిన నేతగా చరిత్ర పుటలలోకి ఎక్కారు. మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ పథకాలూ, ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం జయప్రదంగా అమలు జరిగితే కేసీఆర్‌కి జనరంజకుడైన పాలకుడిగా, సమాజంలో అసమానతలకు తగ్గించడానికి అంకితభావంతో కృషి చేసిన రాజనీతిజ్ఞుడుగా గొప్ప పేరు వస్తుం ది. అంతే కాని, అన్నతాతలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే అది బంగారు తెలంగాణ ఎట్లా అవుతుంది? అందుకే వాస్తవాలు గుర్తించి సమస్య పరిష్కా రానికి మార్గం అన్వేషించాలి. ప్రధానితో, ఇతర ముఖ్యమంత్రులతో కలసి సమాలోచనలు చేయాలి. రైతు ప్రాణంతో రాజకీయం రాజస్థాన్ రైతు గజేంద్రసింగ్ జంతర్‌మంతర్‌లో చెట్టు ఎక్కి ఉరివేసుకొని ఆత్మ హత్య చేసుకోవడంతో దేశమంతటా అది చర్చనీయాంశం అయింది. ప్రధాని సంతాపం తెలిపారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా గజేంద్రసింగ్ కుటుంబ సభ్యులను కలుసుకొని సానుభూతి వెలిబుచ్చారు. విదర్భలో, తెలంగాణలో, బుందేల్‌ఖండ్ (యూపీ)లో రైతులు వందల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుం టున్నారు. వారి కుటుంబాలకు ప్రధాని సంతాపం ప్రకటించలేదు. వారిని అమిత్ షా వెళ్ళి కలవలేదు. ‘జైజవాన్, జైకిసాన్’ అంటూ నాటి ప్రధాని లాల్ బహద్దూర్ శాస్త్రి నినదిస్తే ‘మర్జవాన్,మర్కిసాన్’ అని నేటి యూపీఏ సర్కార్ అంటున్నదంటూ ఎన్నికల ప్రచారంలో నిశితంగా, నిర్దయగా విమర్శించిన నరేంద్రమోదీ ఏమి చేశారు? అధికారంలోకి వచ్చిన తర్వాత కిసాన్‌ను కాపాడేందుకు చొరవ తీసుకుంటారనీ, తక్షణ సహాయం ప్రకటించి దీర్ఘకాలిక పరిష్కారంకోసం ప్రయత్నిస్తారనీ భావించినవారికి ఆశాభంగం కలిగించారు. పైగా భూసేకరణ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ రెండు సార్లు జారీ చేయించారు. గిట్టుబాటుకాని వ్యవసాయం నుంచి ప్రజలను పరిశ్రమలకూ, సేవారంగానికి మళ్ళించేందుకే భూసేకరణ ఆర్డినెన్స్ జారీ చేశామంటూ ఎన్డిఏ సర్కార్ చేస్తున్న వాదన రైతులోకానికి సమంజసంగా కనిపించడం లేదు. ముందు రైతులను ఆదుకోవడానికి సమగ్ర పంట బీమా పథకం ప్రకటించి, తర్వాత భూసేకరణ ఆర్డినెన్స్ తెచ్చినా అర్థవంతంగా ఉండేది. రైతుల ఆమోదం లేకుండా భూములు తీసుకుంటామని ఒకవైపు చెబుతూ ఇదంతా రైతుల మేలుకోసమే అనడం అతకడం లేదు. చైనా ఆదర్శం అనుసరణీయం వాస్తవానికి 2013లో భూసేకరణ చట్టం తెచ్చిన యూపీఏ ప్రభుత్వం కూడా రైతుల ఆత్మహత్యల నివారణకు చేసింది ఏమీలేదు. ఆ సర్కార్ హయాంలోనే దాదాపు రెండు లక్షల మందికిపైగా అన్నదాతలు ప్రాణాలు తీసుకున్నారు. కానీ 2013 భూసేకరణ చట్టం ద్వారా రైతుల అనుమతి లేకుండా భూములు లాక్కొని పరిశ్రమలకో, వ్యాపారానికో ఇవ్వబోమన్న నమ్మకం కలిగించింది. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఆ నమ్మకాన్ని భూసేకరణ చట్టం సవరణ బిల్లు ద్వారా వమ్ము చేస్తున్నది. పరిశ్రమలు విస్తరించాలంటే, సంపద పెరగాలంటే భూములు సేకరించక తప్పదంటూ వాదిస్తున్నది. చివరికి ఇది మోదీకి ప్రతి ష్ఠాత్మకమైన అంశంగా పరిణమించింది. సవరణ బిల్లును మధ్యలో వదిలేస్తే తనది బలహీనమైన ప్రభుత్వం అంటూ ముద్రవేస్తారనే భయం మోదీని పీడిస్తూ ఉండవచ్చు.. ఈ సమస్య ఎంతటి తీవ్రమైనదంటే అన్నదాతల ఆత్మ హత్యల నివారణకు అనుసరించవలసిన వ్యూహం రూపొందించేందుకు ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలు నిర్వహించినా తప్పులేదు. ఇంతకాలం దారుణంగా నిర్లక్ష్యం చేసినందుకు రైతులోకానికి క్షమాపణ చెబుతూ పార్ల మెంటు తీర్మానం చేయాలి. మనిషి ప్రాణానికి మించింది ఏమీ లేదంటూ గజేంద్రసింగ్ మరణం సందర్భంగా వ్యాఖ్యానించిన ప్రధాని ఎన్డీఏ అధికారం లోకి వచ్చిన తర్వాత కూడా వేలమంది రైతులు బలవన్మరణం చెందుతుంటే స్పందించకుండా ఎట్లా ఉండగలుగుతున్నారు? గజేంద్రసింగ్ మరణంపైన దేశీయాంగమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పార్లమెం టులో మాట్లాడుతూ దేశ జనాభాలో 60 శాతం మంది వ్యవసాయంపైన ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. స్థూల జాతీయ ఉత్పత్తిలో వ్యవసాయ రంగం భాగం 14 శాతం. అంటే 14వ శాతం జాతీయ ఆదాయాన్ని 60శాతం జనాభా పంచుకుంటున్నారు. మన దేశంలో 15 శాతం వ్యవసాయ భూములకే బీమా భద్రత ఉన్నదని నీతిఆయోగ్ సభ్యుడు అశోక్ గులాటీ వెల్లడించారు. చైనాలో 80 శాతం భూములకు బీమా సౌకర్యం ఉంది. గ్రామాలలో ప్రజలు వ్యవసాయాధార పరిశ్రమలు పెట్టుకొని ఆదాయం పెంచుకుంటున్నారు. టౌన్షిప్ అండ్ విలేజ్ ఎంటర్ప్రైజ్ (టీవీఇ) పథకాన్ని 1978లోనే చైనాలో ఆర్థిక సంస్కరణలతో పాటే డెంగ్ ప్రవేశపెట్టాడు. చైనా స్థూల ఉత్పత్తిలో 30 శాతం ఈ పరిశ్రమద్వారా వస్తున్నదే. చైనాలో నాలుగు రోజులు ఉండి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్కడి వ్యవసాయాధార పారిశ్రామిక వ్యవస్థను కూడా పరిశీలించి ఉంటే బాగుండేది. భారత్‌కూ, చైనాకూ జనాభాలో, వాతావరణంలో, ఇతర అనేక అంశాలలో సామ్యం ఉన్నది కనుక అక్కడి పథకాలు ఇక్కడ కూడా సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ప్రయత్నించడంలో తప్పులేదు. ప్రజలను వ్యవసాయం నుంచి ఇతర రంగాలకు మళ్లించవలసిందే. ఆదాయంలేని రంగం మీద అధికశాతం జనాభా ఆధారపడటం అనవసరం. చదువు అంతంత మాత్రంగా ఉండి, వ్యవసాయం మినహా తక్కిన పనులు చేయలేనివారిని అకస్మాత్తుగా వేరే రంగాలకు మళ్ళించడం సాధ్యంకాదు. ఇది క్రమంగా, అవగాహనతో, అంగీకారంతో జరగవలసిన పరిణామం. అంత వరకూ తాత్కాలికంగా రైతులను ఆదుకునే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేయాలి. తెలంగాణ, మహారాష్ట్ర, యూపీ వంటి రాష్ట్రాలతో సమాలోచనలు జరిపి పరి ష్కార మార్గాలు అన్వేషించాలి. అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు తగ్గిన కారణంగా ఆదా అయిన విదేశీమారక ద్రవ్యాన్ని రైతుల సంక్షేమం కోసం వినియోగించాలి. స్వచ్ఛ భారత్ అభియాన్ కంటే, ఇంతవరకూ మోదీ ప్రభు త్వం చేపట్టిన ఇతర ఉద్యమాలకంటే కూడా ఇది చాలా ముఖ్యమైన కర్తవ్యం. అన్నదాతను ఆదుకోని అధికారం ఎందుకు? అన్నదాతల ఆత్మహత్యల నివారణకు అనుసరించవలసిన వ్యూహం రూపొందించేందుకు ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలు నిర్వహించినా తప్పులేదు. ఇంతకాలం దారుణంగా నిర్లక్ష్యం చేసినందుకు రైతులోకానికి క్షమాపణ చెబుతూ పార్ల మెంటు తీర్మానం చేయాలి. కె.రామచంద్రమూర్తి -
భూముల బదలాయింపులపై అసెంబ్లీలో చర్చ
-
బడ్జెట్‌పై అసెంబ్లీలో కెసిఆర్ ప్రసంగం
-
దిగుమతులు ఆగితేనే ‘గిట్టుబాటు’: కేసీఆర్
* రైతులు ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడులు సాధించాలి * తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం * ఛత్తీస్‌గఢ్‌లో వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన ముఖ్యమంత్రి అక్కడి రైతులతో ముఖాముఖి సాక్షి, హైదరాబాద్: రైతులకు గిట్టుబాటు ధర లభించాలంటే విదేశాల నుంచి దిగుమతులు ఆగిపోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. దేశంలో ఆహారధాన్యాల కొరత ఉన్నప్పటికీ రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదన్నారు. ఆధునిక వ్యవసాయ విధానాలు అవలంభించడం ద్వారా అధిక దిగుబడులు సాధించాల్సిన అవసరముం దని ఆయన పేర్కొన్నారు. రెండు రోజుల ఛత్తీస్‌గఢ్ పర్యటనకు వెళ్లిన సీఎం ఆదివారం అక్కడి దుర్గ్, బెమెత్రా జిల్లాల్లోని వ్యవసాయ క్షేత్రాలు, విత్తనాభివృద్ధి కేంద్రాలు, గ్రీన్హౌస్ ఫామ్‌లను సందర్శించి, రైతులతో ముఖాముఖి మాట్లాడారు. తెలంగాణకు విద్యుత్ ఇచ్చి ఆదుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ను కోరడానికి వచ్చానని తెలిపారు. ఎంతో కష్టపడి పంట లు పండిస్తున్నా గిట్టుబాటు ధరలు లభించకపోవడం దారుణవన్నారు. విదేశాల నుంచి దిగుమతులు తగ్గిపోవాలని దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఆధునిక విధానాలతో అత్యధిక దిగుబడి సాధిస్తున్న ఛత్తీస్‌గఢ్ రైతుల ను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా వీఎస్ఆర్ సీడ్స్ సంస్థ గురించి విని సంస్థ ఎండీ విమల్ చౌదాను స్వయంగా తన వ్యవసాయ క్షేత్రానికి ఆహ్వానించినట్లు సీఎం వివరించారు. లాభసాటిగా మారుస్తాం.. తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నదే తన సంకల్పమని ముఖ్యమంత్రి చెప్పారు. లాభసాటి వ్యవసాయం చేసేలా రైతులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత తనపై ఉందని, తెలంగాణ నేలల్లో బంగారు పంటలు పండాలని ఆకాంక్షించారు. అయితే ఛత్తీస్‌గఢ్‌లో ఒక ఎకరానికి 80 టన్నుల కాప్సికం, మరో రైతు ఎకరానికి 420 క్వింటాళ్ల మిర్చి పండించినట్లు తెలిసి ఆశ్చర్యపోయినట్లు పేర్కొన్నారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా అంకాపూర్ రైతులు కూడా అద్భుతాలు సృష్టిస్తున్నారన్నారు. ‘‘రైతులు ఎక్కడికక్కడ సంఘటితం కావాలి. ఐక్యంగా వ్యవసాయం చేయాలి. రైతులకు సంఘాలు లేవు. వారు పండించే పంటకు సరైన ధర వచ్చే అవకాశమే లేదు. ఈ పరిస్థితి పోవాలంటే ప్రభుత్వాలు వారికి సహకరించాల్సిన అవసరం ఉంది..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. కరెంటు అందుబాటులో ఉంటే తెలంగాణలో కూడా అద్భుతాలు సృష్టిస్తామని చెప్పారు. తొలిరోజు వ్యవసాయ క్షేత్రాల్లో... ఛత్తీస్‌గఢ్ పర్యటన తొలిరోజు సీఎం కేసీఆర్.. అక్కడి వ్యవసాయ క్షేత్రాలు, విత్తనాభివృద్ధి కేంద్రాల్లో పర్యటించారు. దుర్గ్ జిల్లాలోని మాల్పురి గ్రామంలో వంద ఎకరాల్లో సాగవుతున్న కూరగాయలు, పండ్ల తోటలను పరిశీలించారు. జామ, టమాటా, అరటి, దోస, వంకాయ, అల్లం, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, దానిమ్మ, ఖర్జూర పంటలను... తక్కువ నీటి వినియోగంతో పంటలు పండించడాన్ని పరిశీలించారు. ఒక చోట 50, 60 ఎకరాల్లో ఒకే రకమైన పంట వేయడాన్ని.. బెమెత్రా జిల్లాలోని కోహడియా గ్రామంలో గ్రీన్హౌస్లను సందర్శించారు. కేసీఆర్‌కు ఘన స్వాగతం.. సీఎం కేసీఆర్‌కు ఛత్తీస్‌గఢ్‌లో రాష్ట్ర గౌరవ అతిథి హోదాలో ఘన స్వాగతం లభించింది. ఆ రాష్ట్ర మంత్రి రాజేశ్ ముసత్ ఆధ్వర్యంలో అధికారులు రాయ్‌పూర్‌లోని స్వామి వివేకానంద విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికారు. రాష్ట్రావతరణ దినోత్సవాన్ని జరుపుకొంటున్న తరుణంలో కేసీఆర్ అక్కడికి రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. గ్రామాల్లో పర్యటనకు వెళ్లినప్పుడు ఆయా ప్రాంత ఎమ్మెల్యేలు కేసీఆర్ వెంట ఉన్నారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి ఈటెల రాజేందర్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులు ఉన్నారు. -
దూసుకెళ్లుడే..!
ఇక శరవేగంగా అభివృద్ధి * ప్రాధాన్యత ప్రకారం పనుల వివరాలివ్వండి * పనిచేయని అధికారులను మార్చండి * జిల్లా ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దూకుడు పెంచారు. దాదాపు 5 నెలల పాటు సమగ్ర సర్వేలు, క్షేత్రస్థాయి పరిశీనలతో ప్రజా సమస్యల మూలాల్ని గుర్తించిన ఆయన ఇక వాటిని పెకిలించేందుకు రంగం సిద్ధం చేశారు. దీపావళి తర్వాత అభివృద్ధి పనులు దూసుకపోతాయని చెప్పిన సీఎం అదే మాట మీద నిలబడ్డారు. ఈమేరకు శుక్రవారం కేసీఆర్, జిల్లా మంత్రి హరీష్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాబూమోహన్, సోలిపేట రామలింగారెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, చింతా ప్రభాకర్, మదన్రెడి ్డ, ఎంపీలు బీబీపాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు వీ భూపాల్‌రెడ్డి, రాములు నాయక్, సుధాకర్‌రెడ్డిలతో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లోప్రత్యేకంగా సమావేశమయ్యారు. వాటర్ గ్రిడ్ విద్యుత్తు, గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు, ఆహార భద్రత కార్డులపై ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. ప్రతి ఎమ్మెల్యే వద్ద నుంచి ఆయన వారి వారి నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల సమగ్ర వివరాలను తీసుకున్నట్లు సమాచారం. ప్రతి ఎమ్మెల్యే,ఎంపీతో ఆయన వ్యక్తిగతంగా మాట్లాడి వారి సాదకబాధకాలు తెలుసుకున్నట్లు తెలిసింది. మంచిగా లేకుంటే మార్చుకోండి.. ఆయా నియోజకవర్గాల్లోని అధికారుల వైఖరిని కేసీఆర్ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ‘అధికారులు సరిగా పని చేయకపోతే, మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి పనులు చేపట్టినా ఫలితం ఉండదు, ప్రభుత్వానికి మంచి పేరు రాదు’ కనుక అనుకూలంగా లేని అధికారులను మార్చుకోవచ్చని కేసీఆర్ ప్రజా ప్రతినిధులకు చెప్పినట్లు సమాచారం. అలాంటి అధికారులు ఏ శాఖలో ఉన్నా సరే వారి వివరాలు తనకు ఇవ్వాలని సీఎం సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో పాటు ప్రజలతో మమేకమై పని చేసే అధికారులు మీ దృష్టిలో ఎవరైనా ఉంటే, వారి పేర్లను సూచించమని కూడా అడిగినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు కోరిన చోట వారివారి నియోజకవర్గాల్లో అధికారులకు పోస్టింగు ఇచ్చేందుకు కూడా ఆయన అంగీకరించినట్లు తెలిసింది. భూపాల్‌రెడ్డి ఇంట్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు భేటీ సీఎంతో సమావేశం ముగిసిన అనంతరం రాత్రి పొద్దుపోయాక టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు పటాన్‌చెరులోని ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి ఇంట్లో భేటీ అయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. భవిష్యత్తు కార్యాచరణపై వారు చర్చించినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కోవాలో చర్చించినట్లు తెలిసింది. -
కెసిఆర్‌తో భేటీ అయిన RBI గవర్నర్
-
'కేసీఆర్ కు నారా లోకేష్ సవాల్'
-
కేసీఆర్‌తో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ళ భేటీ
-
పివికి భారతరత్నకై సిఫారసు
-
సాక్షి కథనంపై సీఎం కేసీఆర్ స్పందన
-
కెసిఆర్‌పై మండిపడ్డ వి.హనుమంతరావు
-
కేసీఆర్, చంద్రబాబులపై క్రిమినల్ కేసులు
న్యూఢిల్లీ: నిన్న కాక మొన్న కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడులపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే మొత్తం 12 మంది కేంద్ర మంత్రులు, 44 సహాయ మంత్రులపై క్రిమినల్ కేసులు నమోదైయ్యాయి. అయితే ఏడుగురు కేంద్ర మంత్రులపై అత్యంత భయంకరమైన క్రిమినల్ కేసులు నమోదు అయినట్లు 'ది అసోసియేషన్ ఆఫ్ డెమెక్రాటిక్ రిఫార్మ్స్' అనే సంస్థ శుక్రవారం ఇక్కడ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. గత రెండేళ్ల కాలంలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసులు నమోదైన వారి జాబితాను ఈ సందర్బంగా ఏడీఆర్ విడుదల చేసింది. అందులోభాగంగా కేసీఆర్, చంద్రబాబులపై కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ తన నివేదికలో పేర్కొంది.తెలంగాణలో అత్యథికంగా 90 శాతం మంది మంత్రులపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయని పేర్కొంది. ఆ తర్వాత స్థానాలు వరుసగా 56 శాతంతో ఆంధ్రప్రదేశ్, 34 శాతంతో కర్ణాటక, 27 శాతంతో ఒడిశాలు ఉన్నాయని తెలిపింది. మిజోరాం, మేఘాలయా, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం రాష్ట్రాలకు చెందిన చెందిన ఒక్క మంత్రిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు కాకపోవడం గమనార్హం. -
తొలిసారి దేశం దాటుతున్న కేసీఆర్!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. తొలిసారి దేశం దాటుతున్నారు. మంగళవారం రాత్రి 11 గంటలకు బయల్దేరి ఆయన సింగపూర్ పర్యటనకు వెళ్తున్నారు. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసినా కూడా కేసీఆర్ ఇంతవరకు ఒక్కసారి కూడా దేశం దాటలేదు. వాస్తవానికి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే పాస్‌పోర్టుకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. అది వారం రోజుల క్రితమే వచ్చింది. కేసీఆర్ ఇంతకుముందు కేంద్రంలో కార్మిక శాఖ మంత్రిగా, రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగాను, డిప్యూటీ స్పీకర్‌గా కూడా పనిచేశారు. ఆయన కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత ఇద్దరూ తెలంగాణ ఉద్యమంలోకి, రాజకీయాల్లోకి వచ్చేముందు వరకు అమెరికాలో ఉండేవారు. అయినా వాళ్ల తండ్రిగా కూడా కేసీఆర్ ఎప్పుడూ అమెరికా గానీ, మరే ఇతర దేశానికి గానీ వెళ్లలేదు. ఐఐఎం పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనేందుకు కేసీఆర్ మంగళవారం రాత్రి బయల్దేరి సింగపూర్ వెళ్తున్నారు. ఆయనతో పాటు ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్, సీనియర్ అధికారులు కూడా పర్యటనలో ఉండబోతున్నారు. ఈ బృందం ఈనెల 24వ తేదీన తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటుంది. 22, 23 తేదీలలో జరగబోయే సదస్సులో పాల్గొనాల్సిందిగా ఐఐఎం పూర్వ విద్యార్థుల సంఘం కేసీఆర్‌ను ఆహ్వానించింది. ఇంతవరకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికీ ఇలాంటి ఆహ్వానం అందలేదని అంటున్నారు. తెలంగాణను అంతర్జాతీయంగా ప్రమోట్ చేసేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటానని కేసీఆర్ చెబుతున్నారు. సింగపూర్ పారిశ్రామిక విధానాన్ని కేసీఆర్ పరిశీలిస్తారని అధికారులు అన్నారు. అక్కడ పర్యటన ముగిసిన అనంతరం ఆయన మలేసియాకు వెళ్తారు. -
సామరస్యంగా సమస్యల పరిష్కారం:కెసిఆర్
-
శరత్‌ను పరామర్శించిన కేసీఆర్
-
'బంగారు తెలంగాణ ఇది కాదు'
-
శరత్‌ను పరామర్శించిన కేసీఆర్
హైదరాబాద్: సెప్టల్ డిఫెక్ట్ అనే గుండె జబ్సుతో బాధపడుతూ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శరత్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం పరామర్శించారు. శరత్ ఆరోగ్య పరిస్థితి గురించి కేసీఆర్ అపోలో వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం శరత్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని... మరో రెండు మూడు సార్లు శస్త్ర చికిత్స చేయాల్సి ఉందని వైద్యులు కేసీఆర్‌కు వివరించారు. శరత్ కుటుంబానికి పక్కా ఇల్లు మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. వరంగల్ జిల్లా నర్మెట్టకు చెందిన కొండా శరత్ (11)కు పుట్టుకతో గుండె కవాటానికి సంబంధించిన వ్యాధి ఉంది. దాంతో అతని తల్లిదండ్రులు శరత్‌కు అపోలో ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. వివిధ రకాల జబ్బులతో బాధపడుతున్న పిల్లలను పరామర్శించడానికి ఏర్పాటైన ‘మేక్ ఏ విష్’ అనే అంతర్జాతీయ సంస్థ ప్రతినిధులు గుండె జబ్బుతో బాధపడుతున్న శరత్‌ను కలిసి... నీకు ఏమైనా ఆశలు ఉన్నాయా అని ప్రశ్నించారు. దాంతో తాను తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మాట్లాడాలని తాను ఆశపడుతున్నట్లు శరత్ వెల్లడించారు. ఆ విషయాన్ని 'మేక్ ఏ విష్' ప్రతినిధులు సీఎం కేసీఆర్ కలసి వివరించారు. దాంతో ఈ రోజు మధ్యాహ్నం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శరత్‌ను కేసీఆర్ పరామర్శించారు. దాంతో శరత్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. -
'బంగారు తెలంగాణ కాదు... ఆత్మహత్యల తెలంగాణ'
హైదరాబాద్: తెలంగాణ సర్కార్ జారీ చేసిన జీవోలో రుణమాపీ చెల్లింపు ఊసే లేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఆరోపించారు. రుణమాఫీకి అర్హులెవరో తెల్చండంటూ నిబంధనలు జారీ చేశారని ఆయన గుర్తు చేశారు. గురువారం హైదరాబాద్‌లో షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ... రుణాలు చెల్లించాలని బ్యాంకులు రైతులకు నోటీసులు ఇస్తున్నాయని అయన చెప్పారు. రుణమాఫీ అవుతుందో లేదో అనే అందోళనతో రాష్ట్రంలోని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ నిర్మిస్తారనుకుంటే... ఆత్మహత్యల తెలంగాణగా మారుస్తున్నారని షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రైతులను మోసగించడం మానుకోవాలని ఈ సందర్బంగా షబ్బీర్ అలీ... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హితవు పలికారు. తెలంగాణ విద్యార్థులకు ప్రత్యేక ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్ని మీడియాలో ఉదరగొట్టిన విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఇప్పుడు ఆచూకీ లేకాండా పోయాడని అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని షబ్బీర్ అలీ ఆరోపించారు. -
15న సీఎం కేసీఆర్ రాక
రాంనగర్ :రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తొలిసారిగా జిల్లాలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభించడానికి నిర్ణయం తీసుకున్నారు. ముందుగానే ఆగస్టు 15న దళితులకు భూ పంపిణీ చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమానికి జిల్లా నుంచే స్వీకారం చుట్టనున్నారు. ఈ నెల 15న నల్లగొండలోగానీ లేదా నార్కట్‌పల్లి మండలం పల్లెపహాడ్ గ్రామంలో గానీ భూ పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎంఓ కార్యాలయం నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో అధికార యంత్రాంగమంతా అప్రమత్తమైంది. సీఎం పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లాలో ఎక్కువమంది లబ్ధిదారులను, ఎక్కువ ఎకరాలను ఎంపిక చేసినందున సీఎం ఇక్కడినుంచే భూ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. సర్వం సిద్ధం కావాలని కలెక్టర్ అధికారులకు ఆదేశం.. ముఖ్యమంత్రి పర్యటన ఖరారైన నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ టి.చిరంజీవులు జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. ముఖ్యమంత్రి జిల్లాఅధికారులతో సమీక్షించనున్నందున పూర్తి నివేదికలతో సిద్ధం కావాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఈ నెల 15న ఉదయం 11.30 గంటల ప్రాంతంలో జిల్లాలో పర్యటించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితుల భూ పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలి పారు. సీఎం పర్యటనకు హెలిపాడ్‌తోపాటు స్టేజీ కూడా ఏర్పాటు చేయాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ అధికారులు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సూచించారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రజలకు తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరారు. సీఎం పర్యటనకు ఎలాంటి విద్యుత్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవడంతోపాటు జనరేటర్ సౌకర్యం ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భూ పంపిణీ కార్యక్రమం వద్ద అంబులెన్స్‌లతో డాక్టర్ల బృందాన్ని అందుబాటులో ఉంచాలని వైద్యాధికారిని ఆదేశించారు. సీఎం పర్యటనకు పల్లెపహాడ్ గ్రామం ఎంపికైతే ప్రధాన రోడ్డు మార్గం నుంచి రెండు కిలోమీటర్ల వరకు గ్రామానికి యుద్ధప్రాతిపదికపై రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. భూ పంపిణీ లబ్ధిదారుల విషయంలో ఎంపిక చేసిన భూమి వ్యవసాయశాఖ అధికారులు సాగుకు అనువైనదిగా ఉండి.పంటలు పండే వివరాలతో ధ్రువీకరించాలని సూచించారు. అదే విధంగా సీఎం పర్యటన చింతపల్లి మండలం గడియగౌరారం కూడా ఉండే అవకాశముందని వివరించారు. జిల్లా ఎస్పీ ప్రభాకర్‌రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని బందోబస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జెడ్‌ప్లస్ కేటగిరి భద్రత ఉన్న కారణంగా అధికారులు గుర్తింపుకార్డులతో ఎవరికి కేటాయించిన విధులు వారే నిర్వహించాలని కోరారు. లబ్ధిదారులకు, వారిని తీసుకువచ్చే అధికారులకు కూడా గుర్తింపుకార్డులు జారీ చేయాలని సూచించారు. అదే విధంగా కలెక్టర్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలపై సమీక్షించారు. సమావేశంలో జేసీ ప్రీతిమీనా, ఏజేసీ వెంకట్రావు, జెడ్పీ సీఈఓ దామోదర్‌రెడ్డి, డ్వామా పీడీ సునంద, డీఆర్డీఏ పీడీ సుధాకర్ పాల్గొన్నారు. -
‘కేసీఆర్ సినిమా సిటీ’ అని పేరు పెట్టాలి: కృష్ణ
సాక్షి, హైదరాబాద్: రెండు వేల ఎకరాల్లో సినిమా సిటీని నిర్మిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రకటించడం చాలా ఆనందంగా ఉందని ప్రముఖ నటుడు సూపర్‌స్టార్ కృష్ణ వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ సినీ కేంద్రంగా హైదరాబాద్ మారబోతుందనడానికి ఇదొక శుభసూచకమని అభిప్రాయపడ్డారు. హాలీవుడ్ స్థాయిలో సినీ స్టూడియోలను నిర్మించే సత్తా కేసీఆర్‌కి ఉందనీ, అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఇతర దేశాల నుంచి కూడా సినిమా షూటింగులు చేసుకోవడానికి ఇక్కడకు వస్తారని పేర్కొన్నారు. కేసీఆర్ నిర్మించనున్న సినిమా సిటీకి ‘కేసీఆర్ సినిమా సిటీ’ అని నామకరణం చేస్తే బావుంటుందని కృష్ణ సూచించారు. -
'మనమంతా టీమ్ ఇండియాలా పని చేద్దాం'
హైదరాబాద్: ఓ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అత్యంత అవసరమని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. అలా సాగితేనే రాష్ట్రాల అభివృద్ది వేగవంతమవుతుందని ఆయన అన్నారు. శనివారం హైదరాబాద్‌లో ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రులతో వేర్వేరుగా వెంకయ్యనాయుడు భేటీ అయ్యారు. అనంతరం ఇరు రాష్ట్రాల సీఎంలతో చర్చించిన విషయాలను వెంకయ్య విలేకర్లకు వివరించారు. విభజన చట్టంలోని అంశాలను ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవించాలని సూచించినట్లు చెప్పారు. ఏమైనా సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోరినట్లు తెలిపారు. కేంద్ర నిధులతో ఇరు రాష్ట్రాలలో అమలవుతున్న కార్యక్రమాల తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణకు మధ్య ఎటువంటి గ్యాప్ లేదని విలేకరి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాజకీయ వివక్ష లేకుండా అందరికి సహకరిస్తామని అన్నారు. ఆంధ్ర, తెలంగాణ విడిపోయినా మనమంతా భారతీయులం అన్న సంగతి గుర్తుంచుకోవాలని వెంకయ్య అన్నారు. రాజకీయాలతో నిమిత్తం లేకుండా అభివృద్ధి కోసం మనమంతా టీమ్ ఇండియాలాగా కలసి పని చేద్దామని వారికి సూచించినట్లు వెంకయ్య నాయుడు చెప్పారు. -
కేసీఆర్‌పై కేసు నమోదు
-
'కేసీఆర్ రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తున్నారు'
హైదరాబాద్: తమ రాష్ట్రంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న వ్యవహర శైలిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కె. అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. బుధవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వాహనాలపై రవాణా పన్ను విధించాలనుకోవడం దారుణమని ఆరోపించారు. 2015 వరకు రవాణ పన్ను విధించకూడదని పునర్విభజన చట్టంలో ఉందని అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాంటిది ఇప్పుడు రవాణా పన్ను విధించడం ఏంత వరకు సబబు అని ఆయన కేసీఆర్ ను ప్రశ్నించారు. కేసీఆర్ బాధ్యతగల ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారని అన్నారు. అలాంటి ఆయన ఇలా వ్యవహరించడం తగదిని అచ్చెన్నాయుడి ఈ సందర్భంగా కేసీఆర్‌కు హితవు పలికారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం చేసినా కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని అచ్చెన్నాయుడు విమర్శించారు. -
'ఇంచు భూమి కోల్పోయిన కేసీఆరే బాధ్యుడు'
కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఇంచు భూమి కోల్పోయిన అందుకు బాధ్యత సీఎం కేసీఆర్‌దే అని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో టి.జీవన్ రెడ్డి మాట్లాడుతూ... పోలవరం ముంపు మండలాలను కాపాడటంలో కేసీఆర్ విఫలమైయ్యారని ఆరోపించారు. గిరిజన చట్టాలను ఉల్లంఘించి పోలవరం ప్రాజెక్టు నిర్మించడం సాధ్యం కాదని జీవన్ రెడ్డి వెల్లడించారు. పోలవరం ఆర్డినెన్స్ బిల్లు పార్లమెంట్‌లోని ఇరు సభలు ఆమోదించాయి. దాంతో ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలిశాయి. ఈ నేపథ్యంలో ఆ ఆర్డినెన్స్ బిల్లును అడ్డుకోవడంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఏ మాత్రం అసక్తి కనబరచలేదని జీవన్ రెడ్డి విమర్శించారు. -
అడ్మిషన్లు వెంటనే మొదలుపెట్టండి: చంద్రబాబు
కేసీఆర్‌కు చంద్రబాబు లేఖ సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత విద్యా సంవత్సరం (2014-15)లో ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖరరావుకు శుక్రవారం లేఖ రాశారు. అడ్మిషన్లు ఆలస్యం కావడం వల్ల ఇరు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఇతర రాష్ట్రాల కాలేజీల కు వెళ్లి చేరాల్సి వస్తోందని, దీనివల్ల వారి తల్లిదండ్రులకు ఆర్థికంగా భారం కావడంతో పాటు మానసికంగా ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. సరైన సమయంలో కౌన్సెలింగ్ పూర్తిచేసి అడ్మిషన్లు చేపడితే రెండు రాష్ట్రాల విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా ఉంటారని చెప్పారు. ఆగస్టు నుంచి తరగతులు ప్రారంభం కావాలని సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా జారీచేసిందని ఆ లేఖలో గుర్తుచేశారు. -
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచండి
* పోలీస్ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ * నగరం నుంచే సంస్కరణలు మొదలుపెట్టాలని సూచన * క్లబ్బులు, పేకాట కేంద్రాలపై కఠిన చర్యలకు ఆదేశం సాక్షి, హైదరాబాద్ : అమెరికా, బ్రిటన్ వంటి అగ్ర దేశాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను అనుసరించి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ ఉన్నతాధికారులకు సూచించారు. పోలీస్ శాఖలో ప్రతిపాదిస్తున్న సంస్కరణలను మొదట నగరంలో అమలు చేయాలని, తర్వాత ఇతర ప్రాంతాలకు విస్తరించాలని పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో రాష్ర్ట హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, పోలీస్ ఉన్నతాధికారులతో ఆయన భేటీ అయ్యారు. పోలీస్ శాఖలో సంస్కరణలపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. పోలీస్ వ్యవస్థలో సమూల మార్పులు, వాహనాల ఆధునీకరణ, అందుకు సంబంధించిన డిజైన్లతో కూడిన ప్రతిపాదనలను అధికారులు ముఖ్యమంత్రి ముందుంచి ఆయన సలహాలు, సూచనలు తీసుకున్నారు. హైదరాబాద్- సైబరాబాద్‌లను కలిపి ఒకే కేంద్ర కమాండెంట్ కిందకు తీసుకురావాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. పోలీసుల వ్యవహార శైలిలో మార్పు తీసుకువచ్చేలా మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో కానీ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీలో కానీ శిక్షణ ఇప్పించాలని సూచించారు. పోలీసుల పనితీరు వారి చలనశీలత(మొబిలిటీ)పైనా ఆధారపడి ఉంటుందని, సరైన సమయంలో వేగంగా స్పందించడం ద్వారా శాంతి భద్రతలను కాపాడేందుకు, ప్రజల్లో ఆత్మస్థైర్యం పెంచేందుకు దోహదపడుతుందని ఈ సందర్భంగా డీజీపీ అనురాగ్ శర్మ వివరించారు. ప్రస్తుతమున్న వాహనాల కొరతను తీర్చేందుకు యూనిట్లవారీగా లెక్కగట్టి తగిన సంఖ్యలో కొత్త వాటిని కొనుగోలు చేస్తే అనేక ఇబ్బందులను అధిగమించవచ్చని సూచించారు. ఇక యువతను పెడదోవ పట్టిస్తున్న గ్యాంబ్లింగ్, పేకాట, మట్కా కేంద్రాలతో పాటు వాటిని నిర్వహిస్తున్న క్లబ్బులపై ఉక్కుపాదం మోపాలని ఈ సందర్భంగా కేసీఆర్ ఆదేశించారు. జిల్లాల్లో రిక్రియేషన్ క్లబ్బుల ముసుగులో గ్యాంబ్లింగ్ కార్యక్రమాలు నిర్వహించే కేంద్రాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఎంతటి వారి నుంచి ఒత్తిళ్లు వచ్చినా ఖాతరు చేయొద్దని స్పష్టం చేశారు. యువత భవిష్యత్తును హరించి వారిని వ్యసనాల బాట పట్టిస్తున్న ఇటువంటి కేంద్రాలు ఇకపై రాష్ట్రంలో నడవడానికి వీల్లేదని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఈ సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నాకేమీ కొమ్ములు రాలేదు: కేసీఆర్
చిన్ననాటి నుంచి తెలంగాణ కోసం పోరాటం చేసిన మహామనిషి ప్రొ.జయశంకర్ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అలాంటి మహానీయుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన సమయంలో లేకపోవడం మన దురదృష్టం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ప్రొ.జయశంకర్ మూడో వర్థంతి. ఈ సందర్బంగా తెలంగాణ భవన్‌లోని ప్రొ.జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేసీఆర్ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ... నమ్మిన సిద్దాంతం కోసం తుది వరకు పోరాటం చేసే వ్యక్తి జయశంకర్ అని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు స్వతంత్రంగా బతకాలని ఆయన ఎన్నో కలలు కన్నారని కేసీఆర్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. 2001 నాటికి ముందు నుంచే తెలంగాణ ఉద్యమం కోసం కసరత్తు చేసినట్లు కేసీఆర్ వివరించారు. ప్రొ.జయశంకర్ స్పూర్తితోనే ఉద్యమాన్ని నడిపినట్లు ఆయన ఈ సందర్భంగా విశదీకరించారు. ప్రొ. జయశంకర్ పేరిట హైదరాబాద్ నగరంలో మెమోరియల్తోపాటు ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాకు జయశంకర్ పేరు పెడతామని వెల్లడించారు. నాకు మంత్రి పదవి రాకనే టీఆర్ఎస్ పార్టీ పెట్టారని పలువురు ఆరోపిస్తున్నారని... ఆ ఆరోపణలు కాలం చెల్లిన మెడిసిన్ లాంటిదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తాను ముఖ్యమంత్రి అయినా పాత కేసీఆర్‌నే అని తనకు ఏ కొమ్ములు రాలేదన్నారు. సచివాలయంలో కొత్తవారు... పార్టీ ఆపీస్లో పాతవారు కనిపిస్తున్నారని చెప్పారు. పార్టీ కోసం పని చేసిన వారందరికీ పదవులు ఇస్తామని చెప్పారు. త్వరలో పార్టీ కార్యక్రమాలను భారీ ఎత్తున్న నిర్వహిస్తామని అందుకోసం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు వచ్చింది ఇడ్లీ సాంబార్, రికార్డింగ్ డాన్సులే అంటు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రొ.జయశంకర్ వర్ధంతి సభలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలతో పాటు భారీగా ఆ పార్టీ కార్యకర్తులు పాల్గొన్నారు. -
సీఎం కార్యాలయానికి సత్యవతి
కరీంనగర్ సిటీ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ ఈడీగా సత్యవతి పోస్టింగ్ పొందారు. ప్రస్తుతం బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా, ఇన్చార్జీ డెప్యూటీ సీఈవోగా ఉన్న సత్యవతి బుధవారం విధుల నుంచి రిలీవ్ అయ్యారు. సీఎం స్పెషల్ సెక్రటరీగా ఉన్న స్మితా సబర్వాల్ ఓఎస్డీగా సత్యవతిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో సమర్థవంతంగా విధులు నిర్వహించిన సత్యవతికి సీఎం కార్యాలయంలో పోస్టింగ్ రావడం పట్ల అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడ కలెక్టర్‌గా పనిచేసి వెళ్లిన స్మితా సబర్వాల్ ఇప్పటికే సీఎం పేషీలో స్పెషల్ సెక్రటరీగా పనిచేస్తుండగా తాజాగా బీసీ కార్పొరేషన్ ఈడీ సత్యవతీ సీఎం కార్యాలయంలో చోటు సంపాదించారు. ఎంఐపీ పీడీ సంగీతలక్ష్మికి బీసీ కార్పొరేషన్ ఈడీగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. జెడ్పీ డెప్యూటీ సీఈవో బాధ్యతలను కూడా సీఈవోకు అప్పగించారు. ఉత్తమ సేవలతోనే ఉద్యోగంలో రాణిస్తారు - జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఉత్తమ సేవలతో ఉద్యోగంలో రాణిస్తారని, అధికారుల మన్ననలు పొందుతారని జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. బుధవారం రాత్రి కలెక్టరేటులోని డ్వామా సమావేశ మందిరంలో బీసీ కార్పొరేషన్ ఈడీ, జిల్లా పరిషత్ డెప్యూటీ సీఈవో ముఖ్యమంత్రి కార్యాలయూనికి వెళ్తున్న సందర్భంగా జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సత్యవతి ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించిన అధికారి అని అన్నారు. అనంతరం ఆమెకు జాయింట్ కలెక్టర్ మెమోంటో అందజేసి చేసి సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి హౌసింగ్ పీడీ నర్సింహరావు, విద్యాధికారి కె.లింగయ్య, మీరాప్రసాద్, పీడీ డ్వామా గణేశ్, ఆర్డీవో చంద్రశేఖర్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారిణి సత్యవాణి, పీడీ సంగీతలక్ష్మి, ఫారెస్టు సెటిల్మెంట్ ఆఫీసర్ శోభ, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
కేసీఆర్ వ్యక్తిగత కార్యదర్శి మృతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వ్యక్తిగత కార్యదర్శి డాక్టర్ పెండ్యాల సంతోష్‌కుమార్(57) మంగళవారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఆర్కేపురంలోని అల్కాపురి ప్రాంతంలో ఉన్న స్వగృహంలోనే సంతోష్ తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న కేసీఆర్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్వర్‌రెడ్డి బుధవారం ఆయన ఇంటికి వెళ్లి నివాళులర్పించారు. సంతోష్ కుటుంబానికి అండగా ఉంటామని కేసీఆర్ హామీ ఇచ్చారు. సంతోష అంత్యక్రియలను ఆయన స్వస్థలమైన కరీం నగర్లో నిర్వహించారు. కాకతీయ వర్సిటీలో ఎంఏ, పీహెచ్డీ చేసిన సంతోష్.. 1985లో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థలో ఉపాధ్యాయుడిగా చేరారు. క్రమంగా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ కార్యదర్శిగా ఎదిగారు. కేసీఆర్ సీఎం అయ్యాక వారం క్రితమే సంతోష్‌ను కార్యదర్శిగా నియమించుకున్నారు. సంతోష్ భార్య మంగళాదేవి రచయిత, పెద్ద కుమారుడు అరుణ్‌కుమార్ కోల్‌కతాలోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయుడు, చిన్న కుమారుడు నల్సార్ లా వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్. సంతోష్ తండ్రి దివంగత శంకర్రావు స్వాతంత్య్ర సమరయోధుడు, తల్లి సుగుణాదేవి రిటైర్డ్ హిందీ పండిట్. -
తెలంగాణ ఇంక్రిమెంట్‌కు రూ. 200 కోట్లు
- బడ్జెట్ తయారీకి కసరత్తు - ఈ నెలాఖరులోపు వివరాలు పంపండి - అన్నిశాఖలకు ఆర్థికశాఖ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: ఎన్నికలవేళ కాకుండా ఉద్యమం సందర్భంగా పలుసార్లు తెలంగాణ ఉద్యోగులకు ఇచ్చిన ఇంక్రిమెంట్ హామీని నిలబట్టుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కసరత్తు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర సాధన సందర్భంగా తెలంగాణ ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్ మంజూరుచేస్తామని కేసీఆర్ మాట ఇచ్చిన విషయం తెలిసిందే. ఆర్థికశాఖ ఇప్పటికే ఈ ఇంక్రిమెంట్‌పై కసరత్తు పూర్తి చేసింది. తెలంగాణ ఉద్యోగులకు ఇంక్రిమెంట్ ఇవ్వడానికి రూ.200 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. దీనిపై త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ తుదినిర్ణయం తీసుకుంటారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీని వల్ల తెలంగాణకు చెందిన నాలుగు లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. తొలిబడ్జెట్ తయారీ... తెలంగాణ తొలిబడ్జెట్ తయారీకి ఆర్థికశాఖ కసరత్తు ప్రారంభించింది. తెలంగాణకు చెందిన అన్ని శాఖలు తమ బడ్జెట్‌కు అవసరమైన వివరాలను ఈ నెలాఖరుకల్లా పంపించాలని బుధవారం ఆదేశాలు జారీ చేసింది. బడ్జెట్ ప్రతిపాదనల్లో ప్రధానంగా ఎన్నికలప్రణాళికలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా వ్యవహరించాలని, మేనిఫెస్టోలోని అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రతిపాదనలు పంపాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది. తెలంగాణ తొలిబడ్జెట్ అయినందున లోపాలకు తావులేకుండా జాగ్రత్తగా రూపొందించాలని ఆర్థికశాఖ నిర్ణయించింది. -
షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి.. లేదంటే ..
రైతుల రుణమాఫీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ షరతులు విధించడం అన్యాయమని తెలంగాణ రాష్ట్ర శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ సభపక్ష నేత డీఎస్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం షరతులు విధించడం రైతులను ఓ విధంగా మోసం చేయడమేనని విమర్శించారు. ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాల్సిందేనని ఆయన సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. గురువారం డీఎస్ హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ముందు రుణమాఫీ అని గెలిచిన తర్వాత షరతులు విధించడం ఎంత వరకు సమంజసమని ఆయన ఈ సందర్భంగా కేసీఆర్‌ని డీఎస్ ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే రైతు రుణామాఫీ చేస్తామని టీఆర్ఎస్ పార్టీ తొలి హమీ ఇచ్చిందని డీఎస్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఇచ్చిన హమీని అమలు పరచకుండా మాట తప్పితే తెలంగాణ ప్రభుత్వానికి సహకరించమని డీఎస్ హెచ్చరించారు. ఎటువంటి షరతులు లేకుండా రూ. లక్ష రూపాయల రుణమాఫీ చేయాలిని కేసీఆర్ ప్రభుత్వాన్ని డీఎస్ డిమాండ్ చేశారు. -
రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్
* 7న రాష్ర్టపతి, ప్రధానమంత్రితో భేటీ * పోలవరంపై ప్రధానికి వినతి పత్రం * డిమాండ్ల చిట్టా సిద్ధం చేయాలని అన్ని శాఖల కార్యదర్శులకు సీఎస్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత కేసీఆర్ శుక్రవారం తొలిసారిగా ఢిల్లీ వెళుతున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయున కేంద్రం వుుందు పలు డివూండ్ల చిట్టా ఉంచనున్నారు. ఇందుకోసం నివేదికలు తయూరుచేయూలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అన్ని శాఖల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేశారు. బుధవారం సచివాలయుంలోని ‘సీ’ బ్లాక్‌లో అన్ని శాఖల కార్యదర్శులతో సవూవేశం నిర్వహించారు. ఈ నెల 7న సీఎం కేసీఆర్ రాష్ట్రపతి ప్రణబ్‌వుుఖర్జీ, ప్రధాని మోడీని కలవనున్నారు. పోల వరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేస్తూ తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను వెనక్కు తీసుకోవాలని కోరుతూ ప్రధానికి వినతిపత్రం అందజేయునున్నారు. పోలవరం ప్రాజెక్టు డిజైన్ వూర్చాలని టీఆర్ఎస్ డివూండ్ చేస్తున్న విషయుం విదితమే. రాష్ట్ర పునర్వ్వవస్థీకరణ చట్టంలో పేర్కొన్న మేరకు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలను ఏకరువు పెట్టనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించని కారణంగా కేంద్రం నుంచి నిలిచిపోరుున వుున్సిపల్, పంచాయుతీరాజ్ శాఖల నిధులు, జేఎన్‌ఎన్‌యుూఆర్‌ఎం ట్రాన్సిషన్ పీరియడ్‌లో రావాల్సిన నిధుల గురించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావించనున్నారు. ఎస్సీ, ఎస్టీ పథకాల కింద నిధులు, రహదారులు, ఇతర ప్రభుత్వ గ్రాంట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులకు సూచించినట్లు సమాచారం. అలాగే విద్యుత్ ప్రాజెక్టులకు బొగ్గు లేదా గ్యాస్ సరఫరాకు సంబంధించి కేసీఆర్ ప్రధానితో చర్చించనున్నట్లు తెలిసింది. -
ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా కంభంపాటి!
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా రాజ్యసభ మాజీ సభ్యుడు కంభంపాటి రామ్మోహనరావు నియమితులు కానున్నారు. ఈ నెల 8న ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కంభంపాటి నియామక ఉత్తర్వులు వెలువడనున్నాయి. సోమవారం తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం ఎన్టీఆర్ భవన్లో జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కంభంపాటిని నియమిస్తున్నట్లు చెప్పారు. -
రుణమాఫీపై బ్యాంకర్లతో భేటీకానున్న కేసీఆర్
తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా నిన్న బాధ్యతులు చేపట్టిన కేసీఆర్ ఎన్నికలలో ప్రకటించిన హామీలను నెరవేర్చేందుకు నడుంబిగించారు. అందులోభాగంగా వీలైనంత త్వరగా రైతులు రుణమాఫీపై నిర్ణయం తీసుకోవాలని ఆయన నిర్ణయించారు. అందుకోసం ఒకటి, రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో కేసీఆర్ హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. బ్యాంకర్లు, ఉన్నతాధికారులతో రుణమాఫీ సాధ్యసాధ్యాలపై కేసీఆర్ ఈ సందర్బంగా చర్చించనున్నారు. ఎన్నికల నేపథ్యంలో రూ.లక్షలోపు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని కేసీఆర్ రైతులకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
కుందన్‌బాగ్ క్వార్టర్స్‌లో తెలంగాణ సీఎం ఆఫీస్
- కేసీఆర్ కోరిక మేరకు ముమ్మర ఏర్పాట్లు - ఖాళీ చేయాలని అధికారులకు ఆదేశాలు - వాస్తు దోషం ఉందంటూ గ్రీన్‌ల్యాండ్స్‌లోని క్యాంప్ ఆఫీసు వద్దన్న కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: కుందన్‌బాగ్ క్వార్టర్స్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కొలువుదీరనుంది. కుందన్‌బాగ్‌లోని 3, 4వ నంబర్ క్వార్టర్లు క్యాంప్ ఆఫీసు, కేసీఆర్ నివాసంగా మారనున్నాయి. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ క్వార్టర్స్‌లో ఉంటున్న అధికారులను తక్షణమే ఖాళీ చేయాలంటూ సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లింగరాజు పాణిగ్రాహి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మూడో నంబర్ క్వార్టర్లో ఇంటెలిజెన్స్ అదనపు డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి నివసిస్తుండగా.. నాలుగో నంబర్ క్వార్టర్లో పర్యావరణ పరిరక్షణ శిక్షణ మరియు పరిశోధన సంస్థ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అశ్వినీకుమార్ పరీడా ఉంటున్నారు. వీరికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఏకే పరీడాకు కుందన్‌బాగ్ కావేరి బ్లాక్‌లోని ఫ్లాటు నెంబరు టీ7/1, మహేందర్ రెడ్డికి టీ2/4 ప్రభుత్వ క్వార్టర్లను కేటాయించారు. గ్రీన్‌ల్యాండ్స్‌లోని సీఎం క్యాంప్ ఆఫీసునే తెలంగాణ సీఎంకు కేటాయించాలని మొద ట నిర్ణయించారు. అయితే వాస్తు దోషం ఉందంటూ కేసీఆర్ దానిపై విముఖత చూపారు. కేసీఆర్ తన ఇంటినే క్యాంప్ ఆఫీసుగా వినియో గించుకోవాలని తొలు త భావించినా.. ఆ ఇల్లు చిన్నగా ఉంటుందని, పార్కింగ్‌కూ ఇబ్బందేనని అధికా రులు స్పష్టం చేశారు. దీంతో కుందన్‌బాగ్‌లోని క్వార్టర్స్‌ను పరిశీలించి.. అక్కడ క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఉన్నతాధికారులను కోరినట్లు తెలిసింది. దీంతో రెండు క్వార్టర్లను కలిపి క్యాంపు కార్యాలయంగా మార్చనున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ సీఎం క్యాంప్ ఆఫీసుగా లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌ను ప్రభుత్వం కేటాయించింది. దీన్ని చంద్రబాబు వద్దంటున్నట్టు సమాచారం. తాను ఉంటున్న ఇంటినే క్యాంపు ఆఫీసుగా వాడుకుంటానని బాబు చెబుతున్నారు. -
ప్రమాణస్వీకారంతోనే మేనిఫెస్టో అమలు చేయాలి
కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మేనిఫెస్టో అమలు చేయాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కోరారు. నగరంలోని డీసీసీ కార్యాల యంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తుంద ని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎల్పీ నాయకుడిగా ఎన్నికైన కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. టీఆర్ఎస్ మేనిఫెస్టో, జిల్లాలో కేసీఆర్ పర్యటనతో ఆ పార్టీకి ఊపొచ్చిందన్నారు. గెలుపోటములు ప్రజాజీవితంలో సాధారణమేనని తాము పడిలేచిన కెరటంలా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం పోరాడినప్పటికీ ప్రజ లు ఆదరించకపోవడం బాధకరమన్నారు. తనకు సహకరించిన మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఓడిపోయిన తాను ప్రజా సేవలోనే కొనసాగుతానని ఎలాంటి సమస్య వచ్చిన 9849004868 సెల్ నంబర్లో తనను సంప్రదించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిందనే ఆక్రోశంతో సీమాం ధ్రలో కాంగ్రెస్‌ను ఓడించారని, తెలంగాణలో ఆదరించకపోవడం ఆశ్చర్యకరమన్నారు. పొన్నం ప్రభాకర్ వంటి ఉద్యమకారుడు కూడా ఓడిపోవడం బాధాకరమన్నారు. సమావేశంలో చల్మెడ లక్ష్మీనర్సిం హారావు, కేతిరి సుదర్శన్‌రెడ్డి, డి.శంకర్, వై.సునీల్‌రావు, కన్న కృష్ణ, ఆమ ఆనంద్, కర్ర రాజశేఖర్, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, మల్లికార్జున రాజేందర్, గందె మాధవి, గుగ్గిళ్ల జయశ్రీ, గంట కల్యాణి, ఎస్.ఎ.మోసిన్, గందె మహేశ్, వీర దేవేందర్, వేల్పుల వెంకటేశ్, వేదాద్రి, కట్ట సత్తయ్య పాల్గొన్నారు. -
తెలంగాణకు మహిళా సీఎం నా స్వప్నం: రాహుల్
-
తెలంగాణకు మహిళా సీఎం నా స్వప్నం: రాహుల్
రూ.2 లక్షల్లోపు రైతు రుణాలు మాఫీ చేస్తాం మాట మార్చడం కేసీఆర్‌కు అలవాటే సీఎం కావాలని తహతహలాడుతున్నాడు రుణ మాఫీ కేసీఆర్ వల్ల కాదు ‘మేడిన్ తెలంగాణ’ వాచీ ధరించాలని ఉంది మడికొండ, హైదరాబాద్ సభల్లో పాల్గొన్న రాహుల్ సాక్షి, హైదరాబాద్, మడికొండ: తెలంగాణలో మహిళ ముఖ్యమంత్రి కావాలన్నదే తన కల అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పాలించాలంటే ఎంతో దూరదృష్టి, సంకల్పం కావాలని... తన స్వప్నం త్వరలోనే నెరవేరుతుందని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో మలివిడత అడుగుపెట్టిన రాహుల్ గాంధీ శుక్రవారం వరంగల్ జిల్లా మడికొండలో, హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలోనూ పార్టీ నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడిన ఆయన.. తెలంగాణ ఇచ్చింది తామేనని, ‘బ్రాండ్ తెలంగాణ’ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని పేర్కొన్నారు. టీఆర్ఎస్ అధినేత కే సీఆర్‌కు మాట మార్చడం అలవాటేనని, రుణ మాఫీ హామీని నెరవేర్చడం ఆయన వల్ల కాదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రెండు లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. ‘కేసీఆర్ రూ. లక్ష వరకే మాఫీ చేస్తానని చెప్పారు. మేం రూ. 2 లక్షల వరకు రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తాం’ అని రాహుల్ స్పష్టం చేశారు. తెలంగాణ కోసం కులమతాలకతీతంగా, చిన్నాపెద్దా తేడాలేకుండా పోరాడినట్టుగానే, దాని పరిపూర్ణ అభివృద్ధి కోసం కాంగ్రాస్ పార్టీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. స్వయం సంఘాలతో విప్లవం ‘తెలంగాణ ప్రగతిలో మహిళల భాగస్వామ్యం ఎంతో ఉంది. ఇక్కడ స్వయం సంఘాల విప్లవం వచ్చింది. తెలంగాణ, సీమాంధ్ర మహిళలు సాధించిన ప్రగతికి నేను ప్రభావితుడినయ్యాను. ఉత్తరప్రదేశ్, జమ్మూకాశ్మీర్‌సహా దేశవ్యాప్తంగా స్వయం సహాయ సంఘాలను విస్తరించాం. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది. అదే విధంగా పార్టీలో కూడా ఆ స్థాయిలో మహిళలకు భాగస్వామ్యం కల్పిస్తాం. 9 గ్యాస్ సిలిండర్ల పరిమితి సరిపోదని మహిళలు చెప్పడంతో ప్రధాని దృష్టికి తీసుకెళ్లి 3 నిమిషాల్లో ఆ సంఖ్యను 12కు పెంచగలిగాం. ఇప్పుడు మీ ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేనేం కల కంటున్నానో మీకు తెలుసా? తెలంగాణలో త్వరలో మహిళ... ముఖ్యమంత్రి కావాలన్నదే నా స్వప్నం. అది త్వరలోనే నెరవేరుతుందని ఆకాంక్షిస్తున్నా. రాష్ట్రాన్ని పాలించాలంటే ఎంతో దూరదృష్టి, సంకల్పం కావాలి’ అని రాహుల్ పేర్కొన్నారు. తెలంగాణ సాధనలో టీఆర్ఎస్ పాత్ర లేదు ‘60 ఏళ్లుగా ఎదురుచూసిన కలను మేం సాకారం చేసి చూపాం. జూన్ 2 తర్వాత ఏర్పడే రెండు రాష్ట్రాలు సర్వతోముఖాభివృద్ధి సాధించేందుకు కాంగ్రెస్ కృషి చేస్తుంది. ఎన్నికల సమయంలో అనేక పార్టీలు ముందుకొచ్చి ఏవేవో హామీలిస్తాయి. కాంగ్రెస్ వల్లే తెలంగాణ సాధ్యమైందని మీక్కూడా తెలుసు. తెలుగుదేశం, బీజేపీలు తెలంగాణను వ్యతిరేకించాయి. టీఆర్ఎస్ ఏర్పడక ముందే తెలంగాణ ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీర్మానం చేసి పంపారు. తెలంగాణ బిల్లు రూపొందించినప్పుడు, పార్లమెంట్లో ప్రతిపాదించినప్పుడు, రాజ్యాంగ, ప్రజాస్వామ్యబద్దంగా ఆమోదించినప్పుడు టీఆర్ఎస్ పాత్ర ఎక్కడా లేద’ని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్‌ను మోసం చేసిన కేసీఆర్: ‘తెలంగాణ కల సాకారమైనా ఇప్పుడు మలి అడుగు చాలా కీలకం. తెలంగాణను దేశంలోనే అగ్ర రాష్ట్రాల సరసన నిలబెట్టాల్సిన అవసరం ఉంది. అద్భుతమైన ప్రగతి జరగాలి. సామాజిక న్యాయం కావాలి. నిరుపేద వ్యక్తికి కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం ఉన్నప్పుడు సామాజిక న్యాయం జరిగినట్లు. ముఖ్యంగా తెలంగాణను ముందుకు తీసుకెళ్లే నాయకుడు కావాలి. ఆ నాయకుడు ఇచ్చే హామీలపట్ల విశ్వాసం ఉండాలి. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ను విలీనం చేస్తానన్న కేసీఆర్ మాట మార్చాడు. కాంగ్రెస్‌ను మోసం చేశాడు. దళితుడినే తెలంగాణ సీఎం చేస్తానని పజలకిచ్చిన హామీని కూడా మర్చిపోయాడు. తానే సీఎం కావాలని తహతహలాడుతున్నాడు’ అని ధ్వజమెత్తారు. మళ్లీ రుణాలను మాఫీ చేస్తాం: ‘రాష్ట్రాభివృద్ధిలో రైతులకు, వ్యవసాయానికి ఏమాత్రం భాగస్వామ్యం లేద ని టీడీపీ హయాంలో చెప్పారు. నాడు రుణం కోసం ఏ బ్యాంకుకు వెళ్లినా తలుపులు మూసేశారు. యూపీఏ అధికారంలోకి వచ్చాక బ్యాంకు తలుపులు తెరిచేలా చేసింది. రూ. 70 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేసింది. అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారని విపక్షాలు వేసిన ప్రశ్నను సవాల్‌గా తీసుకుని నెరవేర్చాం. కనీస మద్దతు ధరను పదేళ్లలో 7 రెట్లు పెంచాం. ఇప్పుడు రూ. లక్షలోపు రైతు రుణాలను మాఫీ చేస్తానని కేసీఆర్ చెబుతున్నాడు. తర్వాత అది కూడా మర్చిపోతాడు. అసలు రుణ మాఫీ చేయడం కేసీఆర్ వల్ల కాదు. కానీ కాంగ్రెస్ గురించి మీకు తెలుసు. మాట ఇస్తే నెరవేరుస్తాం. టీఆర్ఎస్ రూ. లక్ష రుణాన్ని మాత్రమే మాఫీ చేస్తానంటోంది. కానీ మేం రెండు లక్షల వరకు తీసుకున్న రైతుల రుణాలను మాఫీ చేస్తాం. మాట ఇస్తే ఎన్ని కష్టాలు ఎదురైనా ఆకాశం కిందపడినా నెరవేరుస్తాం. అధికారంలోకి వచ్చిన వెంటనే మాఫీ చేస్తాం’ అని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ‘మేడ్ ఇన్ తెలంగాణ’ మా సంకల్పం: ‘చెప్పులు, టీషర్టులు, మొబైల్స్, వాచీలు సహా మీరు ధరించే వస్తువులన్నీ చైనా ఉత్పత్తులే. వాటిపై ‘మేడ్ ఇన్ చైనా’ అని ఉంటుంది. అది చూసినప్పుడల్లా బాధ కలుగుతుంది. తెలంగాణ యువత సంపాదించిన సొమ్మంతా చైనాకు వెళుతోంది. ఫలితంగా ఇక్కడ ఉపాధి లేకుండా పోయింది. సాఫ్ట్వేర్ రంగంలో హైదరాబాద్ అద్భుతమైన ప్రగతి సాధించింది. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఒక సంకల్పం ఉంది. ఇకపై మనం కొనే, ధరించే ఏ వస్తువులపైనైనా ఇకపై ‘మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ తెలంగాణ, మేడ్ ఇన్ వరంగల్, మేడిన్ హైదరాబాద్’ అని ఉండేలా చేయాలన్నదే ఆ సంకల్పం. మార్కెట్లో వస్తువులను చూసినప్పుడల్లా అందులో తమ భాగస్వామ్యముందనే తృప్తి ప్రతి ఒక్కరికీ కలగాలి. తెలంగాణలో ఉత్పత్తి చేసిన గడియారాన్ని నా చేతికి ధరించాలని కోరికగా ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, పార్టీ మేనిఫెస్టోలోని అంశాలను రెండు సభల్లోనూ రాహుల్ ప్రస్తావించారు. టీ-కాంగ్రెస్ ముఖ్యనేతలతో పాటు, పలువురు పార్టీ అభ్యర్థులు, స్థానిక నేతలు ఈ సభల్లో పాల్గొన్నారు. ఓరుగల్లుకు వరాలు: వరంగల్ జిల్లాకు ప్రపంచ వారసత్వ హోదాను కల్పిస్తామని, రూ. 150 కోట్లతో వరంగల్ మెడికల్ కళాశాలకు ఎయిమ్స్ హోదా తెస్తామని రాహుల్ హామీలిచ్చారు. మడికొండ సభలో 38 నిమిషాలు ప్రసంగించిన ఆయన జిల్లాపై వరాల జల్లు కురిపించారు. ‘తెలంగాణలో హైదరాబాద్ తర్వా త వరంగల్‌ను రెండో ఐటీ హబ్‌గా మారుస్తాం. జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తాం. ఇప్పటికే జిల్లాలో 7 లక్షల ఎకరాలకు ఆయకట్టును అందించాం. రూ. 400 కోట్లతో స్టేషన్‌ఘన్‌పూర్‌లో టెక్స్టైల్ పార్కు, వర్దన్నపేటలో రూ. 10 కోట్లతో టెక్స్టైల్, ఐటీ పార్కులను ఏర్పాటు చేస్తున్నాం. భూపాలపల్లిలో 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం’ అని పేర్కొన్నారు. ఈ సభలో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మ య్య, కేంద్ర మంత్రి బలరాం నాయక్, స్థానిక ఎంపీ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య ఐదు నిమిషాల చొప్పున మాట్లాడారు. ఓరుగల్లు చరిత్రను పొన్నాల వివరించగా, బలరాం నాయక్ తన ప్రసంగాన్ని గాంధీల కుటుంబాన్ని పొగిడేందుకు వినియోగించారు. ఇక రాజయ్య పూర్తిగా కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. హైదరాబాద్ అందరిది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎంతోమంది హైదారబాద్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారని, అందరి సహకారంతో ఈ నగరం అంతర్జాతీయ స్థాయిలో ఎదిగిందని రాహుల్ గాంధీ అన్నారు. రాష్ర్ట విభజన అనంతరం హైదరాబాద్‌లో ఉండే ఇతర ప్రాంతాల వారికి రక్షణ కల్పించే విషయంలో భరోసానిస్తామని హైదరాబాద్ సభలో రాహుల్ తెలిపారు. రూ. 14 వేల కోట్ల వ్యయంతో మెట్రో రైలు ప్రాజెక్టు, రూ. 632 కోట్ల వ్యయంతో ఎంఎంటీఎస్ వ్యవస్థ ఏర్పాటు చేయడంలో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం కీలకంగా వ్యవహరించిందని గుర్తు చేశారు. ఐటీ రంగంలో ఈ నగరం అగ్రస్థానంలో ఉండే లక్ష్యంతో ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్(ఐటీఐఆర్)’ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా, ఎల్బీస్టేడియం సభా వేదికపై ఆది నుంచీ హల్చల్ చేసిన మాజీ మంత్రి దానం నాగేందర్.. రాహుల్ హిందీ ప్రసంగాన్ని తెలుగులోకి అడ్డదిడ్డంగా అనువదించి పరువుతీశారు. రాహుల్ మాట్లాడే విషయంపై అవగాహనలేకో, అర్థంకాకనో తెలియదు కానీ... గందరగోళంగా సొంత మాటలు చెప్పి వేదికపై ఉన్న నేతలు నిర్ఘాంతపోయేలా చేశారు. మధ్యలో ఆపలేక, ఏం చేయాలో అర్థంకాక టీపీసీసీ నేతలు బిక్కమొహాలేసి అలాగే కూర్చుండిపోయారు. ఇక రాజ్యసభ సభ్యుడు, గాంధీ కుటుంబానికి వీర విధేయుడు వీహెచ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన్ని వేదికపైకి రాకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. తాను ఎంపీనని చెప్పినా వినిపించుకోలేదు. చివరకు పార్టీ నేతలు జోక్యం చేసుకుని ఆయన్ని వేదికపైకి తీసుకురావాల్సి వచ్చింది. ప్రజలను పెడదోవ పట్టిస్తున్న కేసీఆర్: ఆజాద్ సాక్షి, హైదరాబాద్: సీఎం అయ్యేందుకే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ ప్రజలను పెడదోవ పట్టిస్తున్నాడని కేంద్ర మంత్రి గులాం నబీ అజాద్ ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కేసీఆర్ కుటుంబం ఫామ్‌హౌస్‌లో తీసుకున్న నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాలేదని, కాంగ్రెస్ అధినే త్రి సోనియా సారథ్యంలోని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని యూపీఏ ప్రభుత్వం ఆమోదించడంతోనే తెలంగాణ సాకారమైందని గుర్తుచేశారు. కేసీఆర్ ఒక ఎంపీ మాత్రమేనని, ఒక్కరితో తెలంగాణ ఏర్పాటు ఎలా సాధ్యమవుతుందని ఆజాద్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని వాగ్దానం చేసి ఆయన మాట తప్పారని దుయ్యబట్టారు. తెలంగాణలో నివసిస్తున్న సెటిలర్స్‌కు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. బీజే పీ అగ్రనేత నరేంద్ర మోడీకి ఎంపీగా ఎలాంటి అనుభ వం లేదని, ఆయన కంటే తనకు మూడురెట్లు అధిక రాజకీయ అనుభవం ఉందని వ్యాఖ్యానించారు. మోడీ అధికారంలోకి వస్తే దేశ సెక్యూలరిజానికి ముప్పువాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సమర్థ పాలన అందించే సత్తా గల కాంగ్రెస్‌నే బలపరచాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. -
ముఖ్యమంత్రి రేసులో లేను: డీఎస్
ఐనా.. అభిమానులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు: డీఎస్ నిజామాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ ముఖ్యమంత్రి పదవి రేసులో తాను లేనని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అన్నారు. బుధవారం నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. అయితే, పార్టీ కార్యకర్తలు.. అభిమానులు మాత్రం తాను సీఎం కావాలని కోరుకుంటున్నారని, ప్రజలు కోరుకున్న నాయకులకే పదవులు వస్తాయని తెలిపారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీయే ఇచ్చిందని ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని, తప్పకుండా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 70 స్థానాలకు పైగా గెలుచుకుంటుందన్న విశ్వాసం వ్యక్తంచేశారు. తెలంగాణలో ఐదు జిల్లాలో టీఆర్ఎస్ ఉనికి కోల్పోయిందని, అటువంటప్పుడు ఆపార్టీ ఎలా అధికారంలోకి వస్తుందని డీఎస్ ప్రశ్నించారు. -
సోనియమ్మ సీఎం పదవిస్తే.. కాదంటానా?: సర్వే
సాక్షి, హైదరాబాద్: ‘మాయమ్మ సోనియమ్మ తెలంగాణ ముఖ్యమంత్రి పదవి నాకే ఇస్తానంటే వద్దనే ధైర్యంనాకు లేదు’ అని తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. అయితే సీఎం పదవికి జైపాల్‌రెడ్డి, జానారెడ్డి వంటి సమర్ధులు అనేకమంది ఉన్నారని చెప్పారు. సీఎం పదవి కోరుకుంటే వచ్చేది కాదని, పార్టీ అధిష్టానం, ఎమ్మెల్యేలు అంగీకరిస్తేనే వస్తుందన్నారు. దళితవర్గానికి చెందిన సీమాం ధ్ర వ్యక్తి సంజీవయ్యకు రెండేళ్లు మాత్రమే సీఎం పదవి దక్కిందని, తెలంగాణకు చెందిన దళితులకు అదీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం పదవి దళితులకు ఇవ్వాలన్న అభిప్రాయం రావడం మంచిదేనన్నారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు రూ. లక్షకోట్ల ప్యాకేజీ ఇవ్వాలన్న సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యలను సర్వే తోసిపుచ్చారు. ఇలాంటి ప్యాకేజీలు, బోర్డులు విఫలమయ్యాకే తెలంగాణ ఉద్యమం ఉద్ధృతమైందన్నారు.