హైదరాబాద్, సాక్షి: విద్యుత్ శాఖపై సుదీర్ఘ సమీక్ష సందర్భంగా బుధవారం ముఖ్యమంత్రి ఎనుములు రేవంత్‌రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 24 గంటలపాటు నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండాల్సిందేనని అధికారులకు తేల్చి చెప్పారాయన. అలాగే.. ఎన్నికల హామీ అయిన గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్ అమలుకు సిద్ధంగా కావాలని అధికారుల్ని ఆయన కోరినట్లు తెలుస్తోంది.
ఇక తెలంగాణ వ్యాప్తంగా త్వరలో కొత్త విద్యుత్ పాలసీ అమలు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయిచింది. అయితే ఆ పాలసీ ఎలా ఉండాలనే దానిపై ఇప్పటికప్పుడు అధికారులు స్పష్టత ఇవ్వలేకపోయారు. దీంతో.. ఇతర రాష్ట్రాల్లో అమలు అవుతున్న విద్యుత్ విధానంపైనా అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
ఇక నుంచి విద్యుత్ విధానంపై విస్తృతంగా చర్చిస్తామని అధికారులతో చెప్పిన సీఎం రేవంత్.. బహిరంగ మార్కెట్‌తో తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు జరపాలని అధికారుల్ని ఆదేశించారు. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక వివిధ రాష్ట్రాలతో విద్యుత్ కొనుగోలు పేరిట ఒప్పందాలు(పీపీఏ).. ఈఆర్సీ ఇచ్చిన అనుమతుల వివరాలు అందజేయాలని అధికారులను ఆదేశించారారయన.
Comments
Please login to add a commentAdd a comment