Free power Scheme
-
ఫిబ్రవరి నుంచి 200 యూనిట్ల ఉచిత కరెంట్ హామీ అమలు: మంత్రి కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ సర్కార్ నిర్వాకం వల్ల తెలంగాణ అప్పులపాలైందన్నారు రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అందువల్లే ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో జాప్యం జరుగుతోందన్నారు. ఫిబ్రవరి నెల నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు హామీ అమలు చేస్తామని చెప్పారు. నిరుద్యోగ భృతి మొదలుకొని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వరకు అన్ని హామీలను గత ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదన్న మంత్రి.. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు అన్ని అక్రమాలపై విచారణ కొనసాగుతుందని తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ భేటీ మంగళవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపదాస్ మున్శి , ఏఐసీసీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఏఐసీసీ మ్యానిఫెస్టోలో తెలంగాణ నుంచి చేర్చాల్సిన అంశాలపై చర్చించారు. అన్ని రాష్ట్రాల్లో తిరిగి అభిప్రాయాలను సేకరిస్తున్న కేంద్ర మేనిఫెస్టో కమిటీ.. తెలంగాణ మేనిఫెస్టో కమిటీ నుంచి కూడా అభిప్రాయాలను సేకరించింది. నాలుగైదు కామన్ స్కీములతో పాటు.. రాష్ట్రాల కోసం ప్రత్యేక అంశాలను మేనిఫెస్టోలో పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయం నిర్ణయించింది. చదవండి: కేటీఆర్, హరీశ్‌రావుపై బీజేపీ నేత రఘునందన్ రావు ఫైర్ ప్రతిపక్షాలవి తొందరపాటు విమర్శలు మేనిఫెస్టోతోనే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలించిందని అన్నారు పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఎంతో విశ్వసాన్ని చూపారని అన్నారు. ప్రతిపక్ష పార్టీ చేస్తున్న విమర్శలు చాలా తొందరపాటుగా ఉన్నాయని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఏఐసీసీ మ్యానిఫెస్టోకు టీ కాంగ్రెస్ సాయం తీసుకుంటాం మేనిఫెస్టో అంటే ప్రజలకు దగ్గరగా, అమలుకు నోచుకునే విదంగా ఉండాలని ఏఐసీసీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి తెలిపారు. తెలంగాణలో మంచి మేనిఫెస్టో అందించారని.. అందుకే రాష్ట్ర ప్రజలు విశ్వసించారని పేర్కొన్నారు. ఏఐసీసీ మేనిఫెస్టో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం నేతృత్వంలో రూపొందుతుందని చెప్పారు. మ్యానిఫెస్టో పబ్లిక్ ఫ్రెండ్లీగా, క్రోని కాపిటల్కు దూరంగా ప్రజావసరాలకు దగ్గరకు ఉండాలన్నారు. ఏఐసీసీ మ్యానిఫెస్టోకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సహకారం తీసుకుంటామన్నారు. -
TS: కొత్త పాలసీ? ఉచిత విద్యుత్‌పై కీలక ఆదేశాలు
హైదరాబాద్, సాక్షి: విద్యుత్ శాఖపై సుదీర్ఘ సమీక్ష సందర్భంగా బుధవారం ముఖ్యమంత్రి ఎనుములు రేవంత్‌రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 24 గంటలపాటు నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండాల్సిందేనని అధికారులకు తేల్చి చెప్పారాయన. అలాగే.. ఎన్నికల హామీ అయిన గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్ అమలుకు సిద్ధంగా కావాలని అధికారుల్ని ఆయన కోరినట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా త్వరలో కొత్త విద్యుత్ పాలసీ అమలు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయిచింది. అయితే ఆ పాలసీ ఎలా ఉండాలనే దానిపై ఇప్పటికప్పుడు అధికారులు స్పష్టత ఇవ్వలేకపోయారు. దీంతో.. ఇతర రాష్ట్రాల్లో అమలు అవుతున్న విద్యుత్ విధానంపైనా అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక నుంచి విద్యుత్ విధానంపై విస్తృతంగా చర్చిస్తామని అధికారులతో చెప్పిన సీఎం రేవంత్.. బహిరంగ మార్కెట్‌తో తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు జరపాలని అధికారుల్ని ఆదేశించారు. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక వివిధ రాష్ట్రాలతో విద్యుత్ కొనుగోలు పేరిట ఒప్పందాలు(పీపీఏ).. ఈఆర్సీ ఇచ్చిన అనుమతుల వివరాలు అందజేయాలని అధికారులను ఆదేశించారారయన. -
‘కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా.. బీఆర్ఎస్ రావాలా’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. రాష్ట్రంలో 24 గంటల కరెంట్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా.. కరెంట్ వెలుగుల బీఆర్ఎస్ కావాలో తెలంగాణ రైతులు తెల్చుకోవాలని సూచించారు. కాగా, మంత్రి కేటీఆర్ శనివారం బీఆర్ఎస్ శ్రేణులతో టెలీకాన్షరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు మద్దతిస్తే ఉచిత విద్యుత్ రద్దే. రైతులకు మూడు గంటలు విద్యుత్ చాలన్న కాంగ్రెస్ విధానంపై ప్రతీ గ్రామంలో చర్చ జరగాలి. ఇదే అంశాన్ని ప్రజల్లోకి విసృతంగా తీసుకెళ్లాలని తెలిపారు. ఈనెల 17వ తేదీ నుంచి పదిరోజుల పాటు రైతు సమావేశాలు జరుగుతాయి. ప్రతీ రైతు వేదిక వద్ద రైతు సమావేశం ఉంటుంది. బీఆర్ఎస్ విధానం మూడు పంటలు.. మూడు గంటల కరెంట్ కాంగ్రెస్ విధానం పేరిట ఈ సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. రైతులను అవమానించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పేలా తీర్మానాలు చేయాలన్నారు. తెలంగాణలో 24 గంటల ఉచిత విద్యుత్ వద్దన్న రైతు వ్యతిరేక కాంగ్రెస్ కుట్రను రైతాంగానికి వివరించాలని సూచించారు. ఇది కూడా చదవండి: సీఎం కేసీఆర్‌పై ఒవైసీ సంచలన కామెంట్స్.. -
తెలంగాణలో 24 గంటల కరెంట్.. బీఆర్ఎస్కు చెక్ పెట్టిన కాంగ్రెస్!
సాక్షి, హైదరాబాద్/నల్లగొండ: తెలంగాణలో ఉచిత కరెంట్ అంశంపై పొలిటికల్ హీట్ నడుస్తోంది. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో ఎక్కడా 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని తేలిందన్నారు. కాగా, రేవంత్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో విద్యుత్ కొనుగోలులో భారీ అవినీతి జరిగింది. కేసీఆర్ అవినీతి బయటపెడతాం.. జైలుకు పంపిస్తాం. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సబ్స్టేషన్ల పర్యటనల్లో ఎక్కడా 24 గంటల కరెంట్ ఇవ్వడంలేదని తేలింది. సబ్స్టేషన్ల సవాల్‌ను స్వీకరించే ధైర్యం బీఆర్ఎస్కు ఉందా?. ఏం చేసినా మోటర్లకు మీటర్లు పెట్టం అన్న కేసీఆర్.. ఇప్పుడు మీటర్లు పెడతామని ఒప్పుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోతారనే భయం కేసీఆర్‌కు పట్టుకుంది. ప్రతిపక్షం ఎలా ఉండాలో బీఆర్ఎస్ నేతలు ట్రయల్ వేస్తున్నారు. ఖమ్మం సభ ద్వారా మేము ఎన్నికల ప్రచారం ప్రారంభించాం. నిన్నటి(బుధవారం) నిరసనలతో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల పోలరైజేషన్ ప్రారంభమైంది. సీఎం కేసీఆర్‌కు కూడా గజ్వేల్‌లో నెగిటివ్ ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్ ఇస్తామని చెప్పే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. మరోవైపు.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ అనేది పచ్చి అబద్ధం. 11 గంటల విద్యుత్‌లో కూడా కోతలే ఉన్నాయి. ఉద్యోగులకు సరైన సమయంలో వేతనాలు ఇవ్వలేని దుస్థితి ఉంది. తెలంగాణలో 11 గంటల కంటే విద్యుత్ ఎక్కువ ఇచ్చినట్టు నిరూపిస్తే నేను రాజీనామాకు సిద్ధం అని సవాల్ విసిరారు. ఇది కూడా చదవండి: బాధగా ఉంది.. కనీస కృతజ్ఞత కూడా లేదు: మంత్రి ప్రశాంత్ ఆవేదన -
రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వొద్దు..: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
రైతులకు నిరంతరాయ ఉచిత కరెంట్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ అవసరం లేదని.. 3 గంటలు ఇస్తే చాలని వ్యాఖ్యానించారు. కాగా అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్.. సోమవారం తానా మహాసభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తానా ప్రతినిధులనుద్దేశించి ఆయన మాట్లాడారు. అనంతరం ఎన్ఆర్ఐలు, పలు మీడియా వ్యక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ క్రమంలో ఓ ఎన్ఆర్ఐ రేవంత్‌ను ఆసక్తికర ప్రశ్న వేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు నిరాంతరాయంగా అందుతున్న కరెంట్‌ను, దళిత బంధు పథకాన్ని కొనసాగిస్తారా లేక తొలగిస్తారా అని ప్రశ్నించారు. దీనిపై రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణలో 95శాతం మంది రైతులు మూడెకరాల లోపున్న చిన్న, సన్నకారు రైతులేనని తెలిపారు. ఒక ఎకరాకు సాగు నీరు పారించాలంటే ఒక గంట సరిపోతుందని, అదే మూడు ఎకరాలకు ఫుల్లుగా నీళ్లు పట్టాలంటే మూడు గంటలు చాలని వ్యాఖ్యానించారు. మొత్తం మీద ఒక రైతుకు ఎనిమిది గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందని పేర్కొన్నారు. కేవలం విద్యుత్ సంస్థల వద్ద కమీషన్‌కు కక్కుర్తి పడి వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంట్ అనే నినాదాన్ని తీసుకొచ్చారని విమర్శించారు. ఉచిత కరెంట్ పేరుతో సీఎం కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నాడని, ఉచితాన్ని మన స్వార్థానికి వాడుకోవద్దని అన్నారు. చదవండి: ఉప ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తారా? అవసరమైతే సీతక్కే సీఎం.. -
ఢిల్లీలో ‘ఉచిత విద్యుత్’పై దర్యాప్తు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అమలవుతున్న ఉచిత విద్యుత్ పథకంలో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరపాలని లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్‌కుమార్ సక్సేనా ఆదేశాలు జారీ చేశారు. వారం రోజుల్లోగా తనకు నివేదిక అందజేయాలని చీఫ్ సెక్రటరీ నరేశ్ కుమార్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ సూచించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత్ విద్యుత్ పథకంలో అక్రమాలు జరిగాయని, ఇందులో లోపాలున్నాయని లెఫ్టినెంట్ గవర్నర్ సెక్రటేరియట్‌కు ఫిర్యాదులు అందినట్లు వెల్లడించాయి. ఈ పథకం వెనుక భారీ కుంభకోణం ఉందంటూ న్యాయవాద వర్గాల నుంచి కూడా ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నాయి. ఉచిత విద్యుత్‌ను అడ్డుకొనే కుట్ర: కేజ్రీవాల్ తాము ప్రకటించిన ఉచిత విద్యుత్ పథకం పట్ల గుజరాత్ ప్రజలు ఆకర్శితులు అవుతున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. అందుకే ఢిల్లీలో ఉచిత్ విద్యుత్‌కు అడ్డంకులు సృష్టించేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాల నేపథ్యంలో ఈ మేరకు మంగళవారం ట్వీట్ చేశారు. దేశ రాజధానిలో ఉచిత విద్యుత్ పథకాన్ని ఆపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. గుజరాత్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వచ్చే ఏడాది మార్చి 1వ తేదీ నుంచి ప్రజలకు ఉచితంగా కరెంటు సరఫరా చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం పన్నుల పేరిట ప్రజల రక్తం పీల్చేస్తోందని, వారికి కొంత ఊరటనివ్వాలని తాము సంకల్పిస్తే బీజేపీ సహించలేకపోతోందని దుయ్యబట్టారు. ఇదిలా ఉండగా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ విజయాన్ని అడ్డుకోవడానికి కేంద్ర సర్కారు కుతంత్రాలకు పాల్పడుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శించింది. ఢిల్లీలో ఉచిత విద్యుత్ పథకంపై వస్తున్న ఆరోపణలను ఖండించింది. -
AP: రైతులు పైసా చెల్లించక్కర్లేదు
సాక్షి, అమరావతి: రైతులకు పగటి పూట 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంపై ప్రజల్లో అనేక అపోహలు సృష్టించేందుకు కొందరు అదే పనిగా ప్రయత్నాలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు.. కె.సంతోషరావు, జె.పద్మజనార్దనరెడ్డి, హెచ్.హరనాథరావు మండిపడ్డారు. సర్వీసులు తొలగిస్తారని, బిల్లులు వసూలు చేస్తారని తప్పుడు ప్రచారం నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడిన డిస్కంల సీఎండీలు ఉచిత విద్యుత్ పథకం వల్ల ఏ ఒక్క విద్యుత్ సర్వీసునూ తొలగించబోమని, ఒకరి పేరు మీద ఎన్ని సర్వీసులున్నా ఇబ్బంది లేదని స్పష్టం చేస్తున్నారు. సీఎండీలు ఇంకా ఏమన్నారంటే.. రైతులకు నాణ్యమైన విద్యుత్ పొందే హక్కు.. రాష్ట్రంలో దాదాపు 18 లక్షల వ్యవసాయ సర్వీసులకు స్మార్ట్ ఎనర్జీ మీటర్లను అమర్చాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికయ్యే ఖర్చును సబ్సిడీగా ప్రభుత్వమే భరిస్తుంది. రైతులు తమ జేబు నుంచి ఒక్క పైసా చెల్లించనవసరం లేదు. ప్రస్తుతం రైతుల పేరిట ఉన్న బ్యాంక్ ఖాతాలతో సంబంధం లేకుండా ప్రభుత్వమే కొత్త ఖాతాలు తెరిపిస్తుంది. వినియోగం ఆధారంగా వ్యవసాయ సబ్సిడీ మొత్తాన్ని ఖాతాలకు జమ చేస్తుంది. ఆ తర్వాత ఆ మొత్తం విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు బదిలీ అవుతుంది. దీంతో నాణ్యమైన విద్యుత్‌ను పొందే హక్కు రైతులకు లభిస్తుంది. బిల్లులు సకాలంలో చెల్లించలేకపోయినా రైతులకు విద్యుత్ సరఫరాను నిరాటంకంగా అందించాలని, కనెక్షన్లు తొలగించకూడదని ప్రభుత్వం స్పష్టంగా విద్యుత్ సంస్థలను ఆదేశించింది. కౌలు రైతులు కూడా యథావిధిగా ఉచిత విద్యుత్ పొందొచ్చు. నిరంతర విద్యుత్ సరఫరాకే మీటర్ల అమరిక ట్రాన్స్ఫార్మర్లు కాలిపోకుండా ఉండాలన్నా, సబ్ స్టేషన్లపై లోడ్ ఎక్కువై లోఓల్టేజ్ సమస్య రాకుండా ఉండాలన్నా, రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా జరగాలన్నా మీటర్లు అమర్చాలి. మీటరు బిగించడానికి అయ్యే ఖర్చును ప్రభుత్వం, మీటర్లు కాలిపోయినా, పనిచేయకపోయినా, దొంగతనానికి గురైనా, మరమ్మతు ఖర్చులు మొత్తం విద్యుత్ కంపెనీలు భరిస్తాయి. ఏ ఒక్క సర్వీసునూ తొలగించరు.. ప్రస్తుతం ఉన్న ఏ ఒక్క విద్యుత్ సర్వీసునూ తొలగించరు. ఒక వినియోగదారుడి పేరిట ఇన్ని కనెక్షన్లే ఉండాలనే నిబంధన ఏదీ లేదు. ఎక్కువ కనెక్షన్లు ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రస్తుత యజమాని పేరిట సర్వీసు కనెక్షన్ల పేరు మార్చుకోవాలన్నా చేసుకోవచ్చు. అనధికార, అదనపు లోడు కనెక్షన్లన్నీ క్రమబద్ధీకరిస్తారు. అవి కూడా వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంలోకి వస్తాయి. పేర్ల మార్పు ప్రక్రియ కోసం, బ్యాంకు ఖాతాలు తెరవడానికి రైతులు ఎవరి దగ్గరకూ వెళ్లనవసరం లేదు. డిస్కం, గ్రామ సచివాలయ సిబ్బందే రైతుల వద్దకు వచ్చి అవసరమైన మార్పులు చేర్పులు చేస్తారు. రైతులకు విద్యుత్ షాకులు ఉండవు మీటర్ రీడింగ్ కోసం మోటారు దగ్గరకు లైన్మెన్లు రావడం వల్ల విద్యుత్ సమస్య ఏదైనా ఉంటే అతడి దృష్టికి తెచ్చి తక్షణమే పరిష్కరించుకోవచ్చు. రీడింగ్‌ను బట్టి పంపు, మోటారు పనిచేసే విధానాన్ని తెలుసుకుని మెరుగుపరుచుకోవచ్చు. ఎంత లోడు వాడుతున్నారో ఖచ్చితంగా తెలియడం వల్ల ఆ మేరకు విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు పటిష్టం చేసుకోవచ్చు. అనధికార కనెక్షన్లు ఉండవు. ఎర్త్ వైరు, పైపులను ప్రమాణాలకు అనుగుణంగా ఏర్పాటు చేయడం వల్ల రైతులు విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోకుండా కాపాడవచ్చు. -
ఆ ఘనత వైఎస్సార్‌దే : వల్లభనేని వంశీ
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలోని రైతులకు ఉచిత విద్యుత్ అందించిన ఘనత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందని టీడీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. నాడు చంద్రబాబు నాయుడు చేయలేని పనిని వైఎస్ఆర్ అధికారంలోకి రాగానే చేసి చూపించారని గుర్తుచేశారు. చంద్రబాబు ఉచిత విద్యుత్ సాధ్యం కాదన్నారని, కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలని హేళన చేశారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గత ఐదేళ్ల పాలనలో ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బషీర్‌బాగ్‌లో కాల్పులు జరిపి రైతులను పొట్టన పెట్టుకున్న ఘనత చంద్రబాబే అని మండిపడ్డారు. వైఎస్సార్ దారిలోనే నడుస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నారని అభినందించారు. సీఎం జగన్ ఉచిత విద్యుత్ పథకంలో సంస్కరణలు చేపట్టారని, నగదు బదిలీ పథకం వల్ల రైతులకు భరోసా ఉంటుందన్నారు. (మహిళలకు మరో ‘రత్నం’) వైఎస్సార్ తొలి సంతకం.. సోమవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో వల్లభనేని వంశీ మాట్లాడారు. ‘రానున్న 30 ఏళ్లకు రైతులకు భరోసాగా ఉండాలని వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ పథకం తీసుకువచ్చారు. 1982లో ఎన్టీఆర్ పార్టీ పెట్టక ముందు కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితి ఉంది. ఆనాడు మోటార్లకు ఉన్న మీటర్లు పీకిసి స్లాబ్ సిస్టం తీసుకువచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ పై చులకనగా మాట్లాడారు. ఆనాడు వైఎస్ ఉచిత విద్యుత్ ఇస్తానని మాట ఇచ్చి అధికారంలోకి రాగానే తొలి సంతకం చేసి అమలు చేశారు. రైతులకు నేరుగా వారి బ్యాంకు ఖాతలో ఉచిత విద్యుత్‌కు గాను నగదు బదిలీ చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. (అన్‌లాక్ 4.0: ఏపీ సర్కార్ మార్గదర్శకాలు జారీ) చంద్రబాబు 42 ఏళ్ళ అనుభవం ఏమైంది..? గన్నవరం నియోజకవర్గంలో మెట్టప్రాంత మండలాల్లో పోలవరం కుడి కాలువ నుంచి రైతులు 600 మోటార్లు ద్వారా నీరు వినియోగిస్తున్నారు. ఆనాడు చంద్రబాబు విద్యుత్ కనెక్షన్లు క్రమబద్దీకరణ చేయలేదు.ఈ రోజు సీఎం జగన్మోహన్రెడ్డి విద్యుత్ కనెక్షన్లు రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 17 లక్షలు విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి, అదనంగా ఉన్న మరో లక్ష విద్యుత్ కనెక్షన్లు రెగ్యులరైజ్ చేస్తామన్నారు. పదివేల మెగావాట్ల సోలార్ పవర్ అందుబాటులోకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. చంద్రబాబు 42 ఏళ్ళ అనుభవం ఏమైంది..? చంద్రబాబు తన కొడుకు లోకేష్‌లా స్థాయి దిగి మాట్లాడుతున్నారు. రాజకీయ అనుభవం ఉండి చిల్లరగా మాట్లాడితే పిచ్చి పట్టింది అనుకుంటున్నారు. ఉచిత విద్యుత్‌పై విమర్శలు సరికాదు. గన్నవరం నియోజకవర్గంలో అందరిని కలుపుకుని ముందుకు వెళ్తాను, వైఎస్సార్సీపీ, టీడీపీ నేతలు అందరూనాతోనే ఉన్నారు. వైఎస్సార్సీపీలో ఉన్న సీనియర్లు అందరిని తాను కలుపుకుని ముందుకు వెళ్తున్నాను. నూటికి 95 మందిని అందరిని కలుపుకుని గన్నవరం నియోజకవర్గంలో పనిచేస్తాను. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అందరికి అందుతున్నాయి. వలంటీర్లు వ్యవస్థ సక్రమంగా పనిచేస్తోంది. వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే చాలా మెరుగ్గా పని చేస్తోంది. గతంలో ఫించన్, ఇళ్ల స్థలాలు రాలేదని ఎన్నో ఫిర్యాదులు వచ్చేవి. ఇప్పుడు 90 % క్షేత్రస్థాయిలో సమస్యలు తీరాయి.’ అని వ్యాఖ్యానించారు. -
'కోత'లే కోతలు
‘‘వ్యవసాయానికి ఉచిత విద్యుత్ రైతన్నకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన ఓ వరం. మండుటెండల్లో పాదయాత్ర చేసి రైతుల కష్టాలు కడగళ్లు చూసిన వైఎస్.. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన తొలి సంతకం ఉచిత విద్యుత్ ఫైల్‌పైనే పెట్టారు’’కోతల బాబుకు పట్టని కరెంటు కోతలుచెప్పింది 9 గంటలు.. ఇచ్చింది 4 గంటలు సాక్షి, అమరావతి: 2014 మేనిఫెస్టోలో రోజుకు 9 గంటల వ్యవసాయ ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించిన టీడీపీ.. నాలుగున్నరేళ్లు ఆ ఊసే ఎత్తలేదు. ఎన్నికలు సరిగ్గా మరో ఆర్నెల్లు ఉన్నాయనగా.. కేవలం నాలుగు నెలల కోసం హడావుడిగా రోజుకు 9 గంటల విద్యుత్ ఇస్తామని ప్రకటించింది చంద్రబాబు సర్కారు. దీన్ని అదే పనిగా ప్రచారం చేసుకుంటున్నారు. ఈ ప్రచారం మాటెలా ఉన్నా.. అసలు వాస్తవాలు పరిశీలిస్తే చంద్రబాబు సర్కారు మాయాజాలం ప్రతీ ఒక్కరికీ ఇట్టే అర్థమవుతుంది. నాలుగు గంటలకే దిక్కులేదు తొమ్మిది గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిన టీడీపీ.. ఐదేళ్లుగా రైతుకు కనీసం 7 గంటలైనా వ్యవసాయానికి కరెంట్ ఇవ్వలేదనేది వాస్తవం. రాష్ట్రంలో 17 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లున్నాయి. అన్ని పంపుసెట్లకు 5 అశ్వశక్తి సామర్థ్యం (హెచ్‌పి) మోటర్లనే బిగించారు. ఒక పంపుసెట్ గంట నడిస్తే 5 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. ప్రభుత్వం ఏడు గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెబుతోంది. అంటే.. రోజుకు ఒక్కో పంపుసెట్‌కు 35 యూనిట్లు విద్యుత్ ఖర్చవుతుంది. ఈ లెక్కన 17 లక్షల పంపుసెట్లకు రోజుకు 59 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం. కానీ ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న ఉచిత విద్యుత్ రోజుకు కేవలం 29.67 మిలియన్ యూనిట్లే. అంటే.. ఒక్కో పంపుసెట్‌కు గంటకు 5 యూనిట్ల చొప్పున లెక్కేస్తే కేవలం మూడున్నర గంటల పాటు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదు. కానీ రోజుకు ఏడు గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్టు నాలుగున్నరేళ్లుగా ప్రచారం చేసుకుంటోంది. 9గంటలకేటాయింపేది రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు రోజుకు 9 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలంటే.. ఒక్కో పంపుసెట్‌కు రోజుకు 45 యూనిట్ల విద్యుత్ అవసరం. అంటే 17 లక్షల పంపుసెట్లకు రోజుకు 76 మిలియన్ యూనిట్లు ఇవ్వాలి. ఈ లెక్కన ఏడాదికి 27,922.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా అవసరం. కానీ ప్రభుత్వం ప్రస్తుతం ఏటా ఇస్తున్న 10,831.44 మిలియన్ యూనిట్లతోపాటు మరో 1200 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే అదనంగా ఇస్తానంటోంది. మొత్తం కలిపినా ఉచిత విద్యుత్‌కు ఇచ్చేది 12031.44 మిలియన్ యూనిట్లు మాత్రమే. పెంచిన ఈ విద్యుత్‌ను కలుపుకున్నా నిండా రోజుకు నాలుగు గంటల పాటు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వలేని పరిస్థితి. వాస్తవ విద్యుత్ వినియోగం, ప్రభుత్వం ఇస్తామనే విద్యుత్ సరఫరాకు మధ్య 15891.06 మిలియన్ యూనిట్ల తేడా ఉంది. ఇంత తేడా పెట్టుకుని రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగా ఉందని విద్యుత్ వర్గాలే అంటున్నాయి. వ్యవసాయ విద్యుత్‌కు ఇవ్వాల్సిన సబ్సిడీ రూ.13 వేల కోట్లకు గాను రూ.5 వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. రోజుకు మూడు, నాలుగు గంటలే విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. ఐదేళ్లుగా ఉచిత విద్యుత్ సరఫరాలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఐదేళ్లుగా వైఫల్యమే! దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్ పథకం అమలులోకి తెచ్చిన తర్వాత విద్యుత్ కనెక్షన్ల దరఖాస్తులు భారీగా పెరిగాయి. వైఎస్ హయాంలో అడిగిన ప్రతీ రైతుకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. రాష్ట్ర విభజన నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 15.5 లక్షల వ్యవసాయ కనెక్షన్లున్నాయి. ప్రస్తుతం వీటి సంఖ్య 17 లక్షలకు చేరింది. ఏటా 1.5 లక్షల కొత్త కనెక్షన్ల కోసం దరఖాస్తులొచ్చాయి. కానీ టీడీపీ ప్రభుత్వం మాత్రం సంవత్సరానిక 30 వేలకు మించి అనుమతించలేదు. ఉన్న కనెక్షన్లను జియో టాగింగ్లోకి తెచ్చింది. రైతు పేరు మీద భూమి ఉంటేనే కనెక్షన్ ఉండాలని.. ఆదాయ పరిమితికి లోబడి ఉండాలని.. 2.5 ఎకరాల సాగుబడే ఉండాలంటూ షరతులు పెట్టింది. 3 లక్షల కనెక్షన్లను తొలగించాలని భావించింది. రైతుల తిరుగుబాటు, ఎన్నికలు రావడంతో ఈ ప్రతిపాదిన ప్రస్తుతానికి పెండింగ్‌లో పెట్టారు. ఇదీవాస్తవచిత్రం ♦ రాష్ట్రంలో వ్యవసాయకనెక్షన్ల సంఖ్య17 లక్షలు ♦ ఏడు గంటల విద్యుత్ ఇస్తే అవసరమయ్యే విద్యుత్ 59 మిలియన్ యూనిట్లు (రోజుకు) ♦ ఇచ్చే ఈ విద్యుత్ ఎన్ని గంటలకు సరిపోతుంది 3.5 గంటల లోపు (రోజు) ♦ 9 గంటల విద్యుత్ ఇవ్వాలంటే కావాల్సిన విద్యుత్ 76 మిలియన్ యూనిట్లు (రోజుకు) ♦ ప్రభుత్వం ఇప్పుడిస్తోంది 29.67 మిలియన్ యూనిట్లు(రోజుకు) ♦ ఇప్పుడు ఇవ్వాలనుకునే విద్యుత్ (9 గంటలకు) 32.96 మిలియన్ యూనిట్లు (రోజుకు) ♦ ఇది ఎన్నిగంటలకు సరిపోతుంది? 4 గంటలు (రోజుకు) తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే వ్యవసాయానికి 9 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను రైతులకు ఉచితంగా ఇస్తాం– 2014 ఎన్నికలప్పుడు చంద్రబాబు రైతులకు ఇచ్చిన హామీ! రాష్ట్రంలోని రైతులకు ఎలాంటి ఆటంకం లేకుండా.. వ్యవసాయానికి 9గంటల ఉచిత కరెంట్ ఇస్తామని నమ్మబలికితే నిజమే అనుకున్నారు రైతులంతా..! వాస్తవానికి గత ఐదేళ్లుగా ఏనాడూ నిండా నాలుగు గంటలకు మించి రైతులకు కరెంట్ ఇవ్వలేదన్నది నూటికి నూరుపాళ్లు నిజం. -
క్షణక్షణం.. భయం భయం
వారంతా నిరుపేదలు. షెడ్యూల్డు క్యాస్ట్ (ఎస్సీ), షెడ్యూల్డు తెగలు (ఎస్టీ)కు చెందిన వారు. ఇదివరకటి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ అందించింది. అప్పటి నుంచి వీరు విద్యుత్‌ను వినియోగించుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిపోయింది. ఎవరైతే ఉచితంగా కరెంటు పొందుతున్నారో.. వారందరూ విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారని గుర్తించి అనంతపురం విద్యుత్ చౌర్య నిరోధక పోలీసులు నోటీసులు జారీ చేశారు. అధికారులు జరిమానాగా విధించిన కాంపౌండ్ ఫీజు, అసెస్మెంట్ మొత్తాన్ని చెల్లించాలని, లేకపోతే నాన్‌బెయిలబుల్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామని అందులో పేర్కొన్నారు. అనంతపురం, కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో విద్యుత్ చౌర్యం కేసులు బెంబేలెత్తిస్తున్నాయి. మొత్తం 1,841 మందిపై నాన్‌బెయిలబుల్ కేసుల నమోదుకు నోటీసులు జారీ చేశారు. రూ.14.27 లక్షల రికవరీ కోసం విద్యుత్ చౌర్య నిరోధక పోలీసులు ఎస్సీ, ఎస్టీ కాలనీలకు వెళ్లి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాల వారిపైన 4,167 విద్యుత్ చౌర్యం కేసులు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి కేసులు నమోదయ్యాయి. నోటీసులు అందుకున్న వారు అరెస్టుల భయంతో వణికిపోతున్నారు. కొందరైతే ఊళ్లు వదిలి ఎక్కడో తలదాచుకుంటున్నారు. మరికొందరైతే పోలీసులకు పట్టుబడి బతిమలాడుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీల పట్ల తెలుగుదేశం ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని నోటీసులు అందుకున్న వారు మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో ఎస్సీ, ఎస్టీలను అన్ని విధాలా ఆదుకుంటామని, వారి సంక్షేమానికి కృషి చేస్తామని ఇచ్చిన హామీలన్నీ ఉత్తివేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తక్షణమే నోటీసులు ఉపసంహరించుకుని, కేసులు ఎత్తివేసి.. తమకు ఉచిత విద్యుత్ అమలయ్యేలా చూడాలని కోరుతున్నారు. టీడీపీ వచ్చాకే కష్టాలు టీడీపీ ప్రభుత్వం వచ్చాకే కరెంటు కేసులు పెడుతున్నారు. పోలీసులను ఇళ్లకు పంపి భయపెడుతున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా బిల్లు కట్టించుకోలేదు. కనీసం అధికారులు వచ్చి ఒత్తిడి చేసిందీ లేదు. ఆయన హయాంలో హాయిగా నిద్రపోయాం. ఇప్పుడు రికవరీ, కేసులు పేరిట పోలీసులు చేస్తున్న హడావుడితో క్షణక్షణం భయంభయంగా గడుపుతున్నాం. – సుజాతాబాయి, పాలవాయి తండా, కళ్యాణదుర్గం మండలం ఎస్సీ, ఎస్టీలను ఇబ్బందులు పెట్టొద్దు చంద్రబాబు ప్రభుత్వానికి ఎస్సీలు, ఎస్టీలంటే చిన్నచూపు. విద్యుత్ చౌర్యం కేసుల పేరుతో ఇళ్లకు వెళ్లి పోలీసుల ద్వారా భయపెడుతోంది. ఎస్సీ, ఎస్టీలతో ఓట్లు వేయించుకుని.. సంక్షేమానికి పాటుపడతామని హామీ ఇచ్చి.. ఇప్పుడు కేసుల పేరుతో ఇబ్బందులు పెట్టడం బాధాకరం. టీడీపీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. బనాయించిన విద్యుత్ చౌర్యం కేసులు ఎత్తేసి, విధించిన రుసుం రద్దు చేయాలి. లేకపోతే ప్రభుత్వంపై పోరాటం చేస్తాం.– తిప్పేస్వామి నాయక్, జీఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసులతో కంటిమీద కునుకు లేదు కరెంటు దొంగతనంగా వాడుకుంటున్నామంటూ ఎనిమిది నెలల కిందట మాపై కేసు నమోదు చేశారు. తొమ్మిది నూటా నలభై రూపాయలు కట్టించుకున్నారు. పోలీసులకు మళ్లా సపరేటుగా రూ.500 కట్టాను. వైఎస్సార్ ఉన్నప్పుడు ఏనాడూ ఇలాంటి కేసులు పెట్టలేదు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం వచ్చాక మాపై కేసులు పెట్టి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.– వసంతమ్మ,, ఎస్సీ, తూముకుంట ఉచిత విద్యుత్ అమలులో విఫలం ప్రతి ఇంటికీ విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు కేంద్రప్రభుత్వం ‘దీన్ దయాళ్’ పథకం ప్రవేశపెట్టింది. రూ.125 చెల్లిస్తే విద్యుత్ కనెక్షన్ మంజూరు చేస్తారు. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు అయితే వంద యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం. 125 యూనిట్ల వరకు వినియోగిస్తే.. అదనంగా కాల్చిన 25 యూనిట్లకు మాత్రమే బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. 126 యూనిట్లకు మించితే పూర్తి బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ బృహత్తర పథకం గురించి ప్రచారం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ అవకాశం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కల్పించి.. వారికి వర్తింపజేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించింది. ఇప్పుడు వారినే విద్యుత్ చౌర్యం కింద నేరస్తులను చేస్తోంది. కళ్యాణదుర్గం మండలం పాలవాయి గ్రామంలో బుధవారం విద్యుత్ చౌర్య నిరోధక పోలీసులు రికవరీ కోసం వెళ్లారు. పోలీసుల పక్కన కనిపిస్తున్న మహిళ టీడీపీ కార్యకర్త తిమ్మరాజు భార్య సుశీలమ్మ. వీరికి కూడా విద్యుత్ చౌర్యం కేసు నమోదు చేసి పోలీసులు హెచ్చరిక నోటీసులు జారీ చేశారు. -
ఉచితానికి ‘ఆధార్’ షాక్
తాడేపల్లిగూడెం :పూర్తిగా బోర్లపై ఆధారపడి సాగే మెట్ట వ్యవసాయం ఒకప్పుడు అస్సలు గిట్టుబాటయ్యేది కాదు. రైతుకు ఏటేటా అప్పుల భారం పెరిగిపోయేది. ఉన్న పొలం అమ్ముకొని ఊరొదిలి పోదామంటే కొనే నాథుడుండేవాడు కాదు. బిల్లులు కట్టమని రోజూ ఇళ్లకు వచ్చి విద్యుత్ శాఖ సిబ్బంది అడుగుతుంటే పుస్తెలతాళ్లు అమ్మి బిల్లులు చెల్లించిన ఉదంతాలున్నాయి. బిల్లులు కట్టకుంటే సామాన్లు బయటకు గిరాటేసి ఇళ్లకు తాళాలు వేసిన దృశాలు.. 2004కు ముందు మెట్ట ప్రాంతాలలో తరచుగా కనిపించేవి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా అధికారం చేపట్టిన తొలిరోజున చేసిన సంతకంతో.. రైతులకు ఉచిత విద్యుత్, పాత బకాయిల రద్దయ్యాయి. దీంతో నేలతల్లిని నమ్మి ఆరుగాలం శ్రమించిన రైతులు ఒడ్డున పడ్డారు. ఆయన చేసిన సంతకంతో బంజరు భూములు బంగరు భూములయ్యాయి. ఉచిత విద్యుత్ పుణ్యాన పంటలతో వ్యవసాయ క్షేత్రాలు కళకళలాడాయి. వేల రూపాయలకు మించి ఎకరం కొనని పరిస్థితి నుంచి మెట్టలో ఎకరా భూమి రూ.లక్షలకు చేరింది. రైతుల బిడ్డలు నేలతల్లి ద్వారా వచ్చిన ఆదాయంతో ఉన్నత విద్యను అభ్యసించగలిగారు. ప్రస్తుత ప్రభుత్వం ఉచిత విద్యుత్‌కు, ఆధార్‌కు లింకు పెట్టే ప్రయత్నాలు చేయడంతో మెట్ట ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. నాణ్యమైన విద్యుత్ అందకపోవడంతో ఇప్పటికే రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రుణమాఫీ వ్యవహారం ప్రహసనంగా మారిన నేపథ్యం. మరోపక్క దోమపోటు వంటి సమస్యల విషవలయంలో చిక్కుకొని విలవిల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వ్యవసాయాధారం పోతుందని ఆందోళన చెందుతున్నారు. బోరు లేకుండా మెట్టలో వ్యవసాయం చేయడం కష్టం. ఉచిత విద్యుత్ లేకపోతే, భూములను వైఎస్ పాలనకు ముందు మాదిరి బీడుగా ఉంచుకోవాలేమోననే బాధను రైతులు వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ బతికుంటే తమకీ కష్టాలు ఉండేవి కావని ఆయన పాలనను తలచుకుంటున్నారు. గూడెం ప్రాంతంలో 10 వేల మంది రైతుల పరిస్థితి అయోమయం తాడేపల్లిగూడెం ఎలక్ట్రిక ల్ డివిజన్ పరిధిలో ఉచిత విద్యుత్ పొందే రైతులు 10318 మంది ఉన్నారు. ఆధార్ లింకు వ్యవహారంతో వీరు ఆందోళన చెందుతున్నారు. ఈ నిబంధనను సాకుగా చూపి కరెంటు కనెక్షన్ తీసివేస్తారేమోనని మదనపడుతున్నారు. పేరుకు ఉచిత కరెంటు అని చెబుతున్నా, ైరె తుల వద్ద నుంచి నిర్వహణా ఖర్చుల పేరుతో ఒక్కొక్క కనెక్షన్ నుంచి ఆరు నెలలకు ఒకసారి 180 రూపాయలు ప్రభుత్వం వసూలు చేస్తోంది. చేసిన వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం కుటుంబానికే సరిపోవడంతో ఈ నిర్వహణ ఖర్చులు కూడా రైతులు చెల్లించలేకపోతున్నారు. తాడేపల్లిగూడెం డివిజన్లో 10318 కనెక్షన్ల ద్వారా నిర్వహణ ఖర్చుల బకాయి 72 లక్షల 82 వేల 553 రూపాయలు ఉందంటే.. ఉచిత విద్యుత్ పొందుతున్నా రైతు పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయవచ్చు. ఇలాంటి పరిస్థితులలో ఆధార్ లింకు పెట్టి ఉచిత విద్యుత్‌కు మంగళం పాడితే మా గతి ఏంటంటున్నారు. 65 లక్షల యూనిట్లకు మంగళమేనా గూడెం ఎలక్ట్రికల్ డివిజన్ పరిధిలో ఉన్న 10318 కనెక్షన్లకు ఉచిత విద్యుత్ తీసివేస్తే... రెండున్నర ఎకరాల లోపు పొలం కలిగిన చిన్నకారు రైతులు ఇదే కనెక్షన్ల కింద బోర్లు వాడితే నెలకు సుమారు 65 లక్షల యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం యూనిట్‌కు 50 పైసలు చార్జీలుగా వసూలు చేయాలి. ఈ లెక్కన చూసుకుంటే ఒక్క గూడెం ప్రాంతంలోనే రూ. 32.5 లక్షల విద్యుత్ భారం రైతుల నెత్తిన పడనుంది. అలాకాకుండా ఐదెకరాల పొలం ఉన్న రైతులు ఈ కనెక్షన్లలో ఉంటే వారిని కార్పొరేట్ రైతులుగా పరిగణిస్తారు. యూనిట్‌కు రెండున్నర రూపాయల వంతున బిల్లులు వసూలు చేస్తారని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. రైతుల నడ్డి విరిచే విధానం మార్చుకోవాలి రైతుల నడ్డి విరిచే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ విరమించు కోవాలి. నమ్మకంతో రైతులు అధికారాన్ని కట్టబెడితే ఏవిధంగా ఉచిత విద్యుత్‌ను ఎగ్గొట్టాలి అనే పనిలో చంద్రబాబు ఉన్నారు. ఇలాంటి విధానం మార్చుకోకపోతే రైతులు ఆందోళన చేపడతారు. - గంధం బసవయ్య, మాధవరం, రైతు ఇది మంచిది కాదు ఆధార్ ఉంటేనే ఉచిత విద్యుత్ అనే విధానం మంచిది కాదు. గత ప్రభుత్వాలు ఎటువంటి నిబంధనలు విధించకుండా రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చేవి. ఇప్పుడు ఎలా ఎగ్గొట్టాలా అనే ఉద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ విధానాన్ని మార్చుకోవాలి. - ర్యాలి నాగు, జగన్నాధపురం, రైతు -
ఉచిత విద్యుత్‌కు ఎసరు!
ఆదాయంతో లింకు పెట్టే యోచనలో సర్కారు కొనసాగుతున్న వ్యవసాయ కనెక్షన్లకు ఆధార్ అనుసంధానం సబ్సిడీ వర్తించకపోతే మార్కెట్ రేటు ప్రకారం చెల్లించాల్సిందే లక్షలాది మంది రైతులపై పెనుభారం సాక్షి ప్రతినిధి, తిరుపతి: తొమ్మిది గంటల ఉచిత విద్యు త్ కోసం ఎదురుచూస్తున్న రైతాంగానికి సర్కార్ షాక్ ఇవ్వబోతోంది. వ్యవసాయ విద్యుత్‌కు ఆదాయ పరిమితి లింకు పెట్టబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రతి వ్యవసా య కనెక్షన్‌ను బ్యాంకుల్లో, ఆధార్‌తో అనుసంధానం చేసే ప్రక్రియ కొనసాగిస్తున్నట్టు సమాచారం. విద్యుత్ పంపిణీ నష్టాలున్న చోట్ల ఆధార్ అనుసంధాన ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. మిగతా ప్రాంతాల్లోనూ త్వరగా పూర్తి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నారుు. ఫీడర్ స్థాయిలో సిబ్బందికి ఆదేశాలు వెళ్ళాయి. ఇదే జరిగితే రాష్ట్రంలోని 13.5 లక్షల ఉచిత వ్యవసాయ విద్యుత్ లబ్ధిదారుల్లో అనేక లక్షలమంది ఈ పథకానికి దూరమవుతారు. వీరంతా వాడిన ప్రతి యూనిట్‌కు మార్కెట్ రేటు ప్రకారం డబ్బు చెల్లించాల్సిందే. అంతిమంగా రైతుపై మోయలేని భారం పడుతుంది. రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఒప్పందాల రోజే.. ఈ దిశగా ఆలోచన మొదలైంది. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ దీనిని ప్రస్తావించారు. ప్రతి విద్యుత్ వినియోగదారుడికీ బ్యాంక్ ఖాతా ఉండేలా చూడాలన్నారు. దీనిపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించారు. ముందుగా వ్యవసాయ కనెక్షన్లపై విద్యుత్‌శాఖ దృష్టిపెట్టింది. విద్యుత్ పంపిణీకి సంబంధించిన నష్టాలన్నిటినీ ప్రభుత్వం ఇప్పటివరకు వ్యవసాయ ఖాతాలోనే చూపిస్తూ వస్తోంది. కాబట్టి ఈ రంగానికిచ్చే విద్యుత్‌ను తగ్గించాలనే నిర్ణయానికొచ్చారు. ఆధార్‌ను తప్పనిసరి చేసిన ప్రభుత్వం.. రైతుకిచ్చే రాయితీని నేరుగా బ్యాంకు ఖాతాకే జమ చేయాలనేది యోచనగా పైకి చెబుతోంది. కానీ ఉచిత విద్యుత్ లబ్ధిదారులను తగ్గించడమే అసలు లక్ష్యమని విద్యుత్‌రంగ నిపుణులంటున్నారు. ఇం దుకనుగుణంగా నెలాఖరుకల్లా ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు అంతర్గత ఆదేశాలు వెళ్ళినట్టు తెలిసింది. దక్షిణ, తూర్పు ప్రాంతాల విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలో ఇందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించినట్టు సమాచారం. చిత్తూరు జిల్లాలో 2,84,965 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు 56,774 కనెక్షన్లకు సంబంధించి లబ్ధిదారుల పేర్లు, బ్యాంకు ఖాతా నంబర్లు, ఆధార్ కార్డులు అనుసంధానం చేశారు. ఆధార్ కార్డుల్లేని రైతుల కనెక్షన్లను ఉచిత విద్యుత్ కోటా నుంచి తొల గిస్తామని డిస్కమ్ వర్గాలంటున్నాయి. ఇందులో భాగంగా చిన్న, మధ్య, భారీ తరహా సాగునీటి ప్రాజెక్టుల ఆయకట్టు పరిధిలో ఒక కుటుంబానికి ఒక వ్యవసాయ విద్యుత్ కనెక్షన్కన్నా ఎక్కువ ఉంటే.. వాటిని ఉచిత విద్యుత్ కోటా నుంచి తప్పించనున్నట్టు సమాచారం. రాయలసీమలో వర్షాభావ పరిస్థితుల వల్ల చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులకు జలకళ తప్పింది. వాటి ఆయకట్టులో రైతులు బోర్లు, బావులు తవ్వుకుని సేద్యం చేస్తున్నారు. ఇప్పుడు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఆధార్‌కార్డులను అనుసంధానం చేయడంతో ఆ ప్రాజెక్టుల కింద రైతులకు ఒక్క కనెక్షన్‌కే ఉచిత విద్యుత్‌ను పరిమితం చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సీడింగ్ పూర్తయ్యాక ఉచిత విద్యుత్ రాయితీ లబ్ధిదారులైన రైతులు ఇప్పుడు నెలనెలా సర్వీసు చార్జీల రూపంలో చెల్లిస్తోన్న రూ.20తోపాటు విద్యుత్ బిల్లునూ ముందుగా చెల్లించాలి. ఆ తర్వాత రైతు చెల్లించిన విద్యుత్ బిల్లును రాయితీ రూపంలో వారి ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఓ ఎస్పీడీసీఎల్ అధికారి ‘సాక్షి’కి వెల్లడించారు. ఆధార్ అనుసంధానం పూర్తయ్యాక ఆదాయ పరిమితిపై ప్రభుత్వం స్పష్టతిచ్చే అవకాశముంది. -
రూ.13 వేల కోట్లతో వ్యవసాయ బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ సుస్థిరత, స్వయంసమృద్ధి, అధికోత్పత్తి లక్ష్యంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శుక్రవారం శాసన సభలో తొలిసారి వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2014-15 సంవత్సరానికి ప్రతిపాదించిన ఈ బడ్జెట్ మొత్తం 13,109.39 కోట్ల రూపాయలు. ఇందులో ప్రణాళిక వ్యయం కింద రూ. 6,735.44 కోట్లు, ప్రణాళికేతర వ్యయం కింద రూ. 6,373.95 కోట్లు కేటాయిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఈ మొత్తంలో రూ. 5 వేల కోట్లు రుణమాఫీకి కేటాయించారు. మిగిలిన రూ. 8 వేల కోట్లను వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు కేటాయించారు. ప్రస్తుతానికి రైతులకు 7 గంటల ఉచిత విద్యుత్‌తో సరిపెట్టింది. భవిష్యత్‌లో 9 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని మంత్రి చెప్పారు. అప్పుడు గొడవ చేశారే.. :సీఆర్ వ్యవసాయానికి ప్రత్యేకంగా బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సభా నిబంధనలు అనుమతిస్తాయా? అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇది అసలు బడ్జెట్ భాగమా.. ప్రభుత్వ విధాన ప్రకటన అన్నది తేల్చాలని నిలదీశారు. శుక్రవారం శాసనమండలిలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టారు. ఆయన బడ్జెట్ ప్రసంగానికి సిద్ధమైన సమయంలో రామచంద్రయ్య జోక్యం చేసుకుంటూ ప్రత్యేక బడ్జెట్ పేరుతో దీనిని ప్రవేశపెట్టడానికి సభా నిబంధనలు అంగీకరించవని అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలంటే.. అంచనాల కమిటీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, దీంతోపాటు సభలో కొన్ని నిబంధలు పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వాటిని పాటించకుండా ప్రత్యేక బడ్జెట్ ను ఎలా ప్రవేశపెడతారని ప్రశ్నించారు. పొంతనేది?: బొత్స ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీలకు.. బడ్జెట్ కేటాయింపులకు ఏమాత్రమూ పొంతనలేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శుక్రవారం ఆరోపించారు. వ్యవసాయ రంగం నుంచి ప్రత్యేకంగా ఆదాయం లేనప్పుడు బడ్జెట్‌గా ఎలా పరిగణిస్తామన్నారు. చంద్రబాబు బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టినా మొక్కుబడిగానే ఉంటుందని ఎద్దేవా చేశారు. -
వ్యవసాయం.. పండగ చేసిండు...
దుర్భిక్షానికి తోడు.. ‘దండగ’మారి పాలన మిగిల్చిన దౌర్భాగ్యం.. పంట చేలలో ఇంకిన నీళ్లు.. కనుచూపు మేరా బీళ్లు.... అన్నదాత కళ్లలో సుడులు.. ఇవీ.. నాటివ్యథార్థ రైతుల యథార్థ దృశ్యాలు... రెక్కలు ముక్కలు చేసుకున్నా ఆరుగాలం శ్రమ నీరుకారిపోయి... అయినకాడికి మడిచెక్క అమ్ముకున్నా అప్పులు తీరకపోయి, దేహం ముక్కలు చేసుకున్నా, కిడ్నీలు అమ్ముకున్నా బతుకులు మారకపోయి... చెదిరిన ఆశలతో చూరుకు వేలాడిన దేహాలు!! ఇవీ.... తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలన మిగిల్చిన గాయాలు... ఆ కన్నీటి గాథలే ‘ప్రజాప్రస్థానం’లో రాజన్న గుండెను తాకాయి.. ఆ దైన్యం... ఆ వేదన రైతన్న భుజం తట్టేలా మహానేత వైఎస్‌ను చలింపజేసింది.. ఊరూరా తిరిగి అన్నదాతకు ఓదార్పు ఇచ్చేలా సంకల్పం ఇచ్చింది... అధికారంలోకి రాగానే రైతు కన్నీళ్లు తుడవడమే లక్ష్యమైంది.. ఉచిత కరెంటుకు బాటలు వేసింది... రైతు రుణాల మాఫీకి పురిగొల్పింది.... జలయజ్ఞానికి స్ఫూర్తినిచ్చింది... రైతు ఇంటికి పండగ తెచ్చింది... పావలా వడ్డీ రుణాలతో ఊరట పిన్నింటి గోపాల్ / వనం దుర్గాప్రసాద్: అదనులో పెట్టుబడి ఉంటేనే రైతులకు స్వాంతన అనేది నిజం చేస్తూ పంట రుణాలపై వడ్డీని పావలాకు తగ్గించారు వైఎస్. ఇదే స్ఫూర్తితో రైతులకు రుణ వితరణ కల్పించడంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలిపారు. దీనికి 2009-10లో రైతులకు ఇచ్చిన రూ. 28,434 కోట్ల పంట రుణాలే సాక్ష్యం. అన్ని రకాల పెట్టుబడి ఉపకరణాలకుతోడు రైతులకు కొండంత మనోధైర్యం కల్పించిన వైఎస్ హయాం(2009)లో రికార్డు స్థాయిలో 121 లక్షల హెక్టార్లలో పంటలు వేశారు. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అనే పేరును నిలబెడుతూ అదే ఏడాది ఏకంగా 204 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయ్యాయి. ఈ ఘనతకు గాను కేంద్ర ప్రభుత్వ అవార్డు కూడా దక్కింది. బీమాతో ధీమా పెంచి.. పెరుగుతున్న పెట్టుబడులకు తోడు ప్రకృతి విపత్తులతో వ్యవసాయం జూదంగా మారిన పరిస్థితుల నుంచి రైతుకు ధీమా కలిగించేందుకు దేశంలోనే మొదటిసారిగా ఖరీఫ్‌లో గ్రామం యూనిట్‌గా పంటల బీమా పథకం అమలు చేశారు వైఎస్. దీంతో 2008-09లో రాష్ట్రానికి ఏకంగా రూ.801 కోట్లు వచ్చింది. దీనివల్ల 7.58 లక్షల మంది రైతులకు దాదాపు పంటలు పండిన స్థాయిలో ఉపశమనం కలిగింది. వాతావరణంలోని మార్పుల వల్ల పంట నష్టపోయే రైతులకు భరోసా కల్పించేందుకు 2009 ఖరీఫ్‌లో రాష్ట్రంలోనే మొదటిసారిగా గుంటూరు జిల్లాలో మిరప పంటకు వాతావరణ బీమా అమలు చేశారు. విపత్తులతో పంటలు నష్టపోయే వారికి ఇవ్వాల్సిన పెట్టుబడి రాయితీని మూడింతలు పెంచి రైతుల్లో భరోసా కల్పించారు. ఆరు లక్షల ఎకరాల భూ పంపిణీ నిరుపేదలకు ఆరు లక్షల ఎకరాల భూములను వైఎస్సార్ పంపిణీ చేశారు. ఇందిరప్రభ పథకం కింద రూ.500 కోట్లతో ఈ భూములను అభివృద్ధి చేయించారు. బిందు సేద్యం, తుంపర సేద్యంపై రాయితీని 50 శాతం నుంచి 90 శాతానికి పెంచారు. ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం రాయితీ కల్పించారు. ఉపాధిహామీ, ఉద్యానవన శాఖల సమన్వయంతో పండ్ల తోటల అభివృద్ధికి పథకం రూపొందించారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచేందుకు వ్యవసాయ, అనుబంధ శాఖల మధ్య సమన్వయం కోసం అగ్రికల్చర్ టెక్నాలజీ మిషన్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఖాళీగా ఉన్న 460 వ్యవసాయ అధికారులు, 700 వ్యవసాయ విస్తీర్ణ పోస్టులను భర్తీ చేశారు. లీజు ఫీజు లేకుండా.. చెరువులు, జలాశయాల్లో చేపలు పెంచినందుకు గాను ఆయా మత్స్యకార సంఘాలు ప్రభుత్వానికి లీజు కింద ఫీజు చెల్లిస్తుంటాయి. ఈ ఫీజు మొత్తం ఏటా 10 శాతం పెరుగుతుండేది. దీనివల్ల మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన వైఎస్ 2008 నుంచి ఈ ఫీజును ఐదేళ్లపాటు పెంచ కూడదని నిర్ణయం తీసుకున్నారు. అలాగే చేపలను నిల్వచేసేందుకు 50శాతం రాయితీపై ఐస్‌బాక్స్‌లు పంపిణీ చేశారు. ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక ప్యాకేజీ అందరికీ అన్నం పెట్టే రైతు పురుగు మందులు తాగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకున్న వైఎస్ ఆత్మహత్యల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్న 16 జిల్లాలకు రూ.10 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ కల్పించారు. బాబు హయాంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు సైతం ఆర్థిక సహాయం అందించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాష్ర్టంలోని 63 లక్షల మంది రైతులకు 11,353 కోట్ల రూపాయల రుణాలు మాఫీ అయ్యేలా చేశారు. రుణమాఫీ పథకం వర్తించని 36 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.ఐదువేల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా రూ.1800 కోట్ల ప్రోత్సాహకం అందించారు. విప్లవాత్మక పథకాలు గొర్రెలు, మేకల పెంపకాన్ని లాభదాయకంగా చేయడంతోపాటు పెంపకందారుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారు. జీవక్రాంతి పథకాల పేరుతో సబ్సిడీపై మేలు జాతి గొర్రెలు, మేకలను 50 శాతం రాయితీతో రైతులకు సరఫరా చేశారు. విపత్తులతో పాడిపశువులు, గొర్రెలు చనిపోతే పెంపకందారులు రనష్టపోకుండా బీమా కల్పించారు. నిత్యం చెట్టుపుట్టల్లో తిరిగే పెంపకందారులకు రూ.లక్ష వరకు బీమా కల్పించారు. పల్లెల్లోని నిరుద్యోగ యువకులకు శిక్షణ ఇచ్చి గోపాలమిత్ర కార్యకర్తలుగా నియమిం చారు. మూగజీవాల వైద్యం కోసం రాష్ట్రవ్యాప్తంగా సంచార వైద్యశాలలు ఏర్పాటు చేశారు. సమాఖ్య, దీని పరిధిలోని సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకున్నారు. వరికి వెయ్యి మద్దతు.. పంటలు ఎంత బాగా పండినా వాటికి గిట్టుబాటు ధరలు వస్తేనే రైతు కష్టానికి ప్రతిఫలం ఉంటుందని నమ్మిన నేత వైఎస్. ఆయన పాలనలో మద్దతు ధర 70 శాతం పెరిగింది. వరి మద్దతు ధరను 2009 నాటికి రూ.1030కి పెంచేలా కేంద్రాన్ని ఒప్పించారు. కందుల ఎంఎస్పీని క్వింటాల్‌కు రూ. 1390 నుంచి రూ.3000లకు, రూ.1960 ఉన్న పత్తి ధరను రూ.3000 వరకు వచ్చేలా చేశారు. ‘మోన్శాంటో’పై ‘సుప్రీం’కు వ్యవసాయానికి మూలాధారమైన నాణ్యమైన విత్తనం సరఫరా చేసేందుకు రాజశేఖరరెడ్డి కృషి చేశారు. 2009లో రూ.315 కోట్లతో 22 లక్షల క్వింటాళ్ల రాయితీ విత్తనాలు సరఫరా చేశారు. రైతులను నిలువునా ముంచుతున్న బహుళజాతి విత్తన కంపెనీ ‘మోన్శాంటో’కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడారు. రూ 1850 బీటీ పత్తి విత్తనాల ప్యాకెట్ ధరను రూ.750కి తగ్గించారు. మోన్శాంటో కంపెనీ దిగివచ్చేలా చేశారు. వర్సిటీలు నెలకొల్పి.. రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ రంగాల విద్య, పరిశోధన, విస్తరణలకు వైఎస్సార్ అధిక ప్రాధాన్యం ఇస్తూ ఈ మూడు రంగాలకూ వేర్వేరుగా విశ్వవిద్యాలయాలు నెలకొల్పారు. ఐదేళ్లలోనే ఈ సంస్థలను వందల కోట్ల వ్యాపారం చేసే స్థాయికి తీసుకొచ్చి ఆ సంస్థల్లో పనిచేస్తున్న వేల మంది ఉద్యోగుల కుటుంబాలకు అండగా నిలిచారు. విత్తన గ్రామం పథకాన్ని పటిష్టంగా అమలుచేసి రాష్ట్రంలో విత్తన ఉత్పత్తి రెట్టింపు అయ్యేలా చేశారు. మత్స్యకారుల అభ్యున్నతికి.. సునామీ వల్ల సర్వం కోల్పోయిన మత్స్యకారులు తిరిగి సాధారణ జీవనం గడిపేందుకు వైఎస్ ఎంతో కృషి చేశారు. ఇళ్లు, పడవలు, వలలు.. ఇలా అన్నింటినీ గరిష్ట రాయితీతో పంపిణీ చేశారు. మత్స్యకార మహిళలతో మత్స్యమిత్ర బృందాలు ఏర్పాటు చేశారు. వీరికి తక్కువ వడ్డీతో రుణాలు ఇప్పించారు. మత్స్యకారులు వేటాడి తెచ్చిన చేపలను వారే అమ్ముకునేలా 50 శాతం రాయితీతో మొబైల్ మార్కెట్లు ఏర్పాటు చేశారు. రెండువేల మత్స్యకార సంఘాలకు ఉచితంగా చేప విత్తనాలను సరఫరా చేయడం ప్రారంభించారు. రుణమాఫీకి ప్రత్యేక జీవో రైతు రుణాల రద్దు విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించిన ఘనత వైఎస్‌కే చెల్లుతుంది. 63 లక్షల మందికి రుణాలు రద్దు చేయడం ఒక ఎత్తై, కేంద్ర మార్గదర్శకాల వల్ల రుణ మాఫీ వర్తించని రైతన్నలకు ప్రోత్సాహాన్నివ్వడం విశేషం. 2006 నాటికి బ్యాంకు రుణాలు తీసుకుని, తిరిగి చెల్లించిన రైతుల కోసం ఆయన ప్రత్యేక జీవో తెచ్చారు. దీనివల్ల మన రాష్ట్రంలో 32 లక్షల మంది రైతులకు రూ. 1600 కోట్ల ప్రోత్సహకం లభించింది. ప్రతీ రైతన్న రూ. 5 వేలకు తగ్గకుండా ఆర్థిక సాయం అందుకున్నారు. పంపుసెట్లకు ఉచిత విద్యుత్ రాష్ట్రాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దడానికి ఆయన కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వాలను కున్నారు. దీనికోసం లక్ష కోట్ల బడ్జెట్ రూపొందించారు. 70 ఏళ్ళుగా కాగితాలకే పరిమితమైన పోలవరం దశ, దిశ మార్చారు. 25 ఏళ్ళ పులిచింతల పురిటినొప్పులకు పరిష్కారం కనుగొన్నారు. 12 ప్రాజెక్టులను పూర్తి చేశారు. 22 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చారు. 56 ప్రాజెక్టుల పూర్తికి ప్రణాళికలు రూపొందించారు. 30 లక్షల పంపుసెట్లకు ప్రతీ రోజూ ఏడు గంటల పాటు నిరంతర ఉచిత విద్యుత్ ఇచ్చారు. పైసా పెరగని ఎరువులు అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు చుక్కల కెక్కాయి. 200 నుంచి 700 శాతం పెరిగాయి. అయినప్పటికీ రాష్ట్ర రైతాంగంపై ఆ భారం పడకుండా వైఎస్ ఆదుకున్నారు. 2003-04లో ఏ ధరకు రైతు ఎరువులు కొన్నారో, 2009 వరకు అదే ధరకు అందు బాటులో ఉండేలా సబ్సిడీ ఇచ్చి రైతులపై పెరిగిన ధరల భారం పడకుండా చూశారు. మిర్చి రైతుకు భరోసా మిరప సాగు వ్యయ ప్రయాసలతో కూడింది. వైఎస్ అధికారంలోకి వచ్చేనాటికి మిర్చి రైతు ఏనాడూ లాభాల పంట చూసింది లేదు. ప్రకృతి వైపరీత్యాలు నష్టాల్లోకి నెట్టాయి. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన మిర్చిరైతుకు వైఎస్ భరోసా ఇచ్చారు. వ్యవసాయ పెట్టుబడుల సబ్సిడీ కింద చెల్లించే రూ. 2250 మొత్తాన్ని రూ. 4500 పెంచారు. దీని కోసం రూ. 169 కోట్లు వెచ్చించారు. రైతుల ఎంపిక కూడా హైదరా బాద్ సచివాలయంలో కాకుండా, గ్రామ సభ లకే ఆ అధికారాన్ని అప్పగించడం విశేషం. ఉచితంపైనే తొలి సంతకం - అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం ‘ఉచిత విద్యుత్’ ఫైలు పైనే చేశారు. రైతుల విద్యుత్ బకాయిలను మాఫీ చేస్తూ ఆయన రెండో సంతకం చేశారు. - ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ లభించింది. రైతులు బకాయిపడ్డ రూ. 1250 కోట్ల కరెంటు బకాయిలు మాఫీ అయ్యాయి. సుమారు రెండు లక్షల మంది రైతులపై నాటి చంద్రబాబు ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులు రద్దయ్యాయి. - ప్రతీ ఏటా కొత్తగా లక్షన్నర వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. - 2004 నుంచి ఒక్క ఏడాది కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదు. కనీస సర్వీస్ చార్జీ అయిన రూ. 20లను కూడా వసూలు చేయలేదు. - వచ్చే ఐదేళ్లు కూడా విద్యుత్ చార్జీలు పెంచేది లేదని 2009 ఎన్నికలకు ముందు స్వయంగా వైఎస్ హామీ ఇచ్చారు. రైతులకిచ్చే ఉచిత విద్యుత్‌ను 7 గంటల నుంచి 9 గంటలకు పెంచుతామన్నారు. -
బాబు పాలనలో చీకటి రోజులు ఎలా మరిచిపోగలం..?
బాబు డైరీ (ఎలక్షన్ సెల్): నరమాంసం రుచి మరిగిన పులి తాను శాకాహారిగా మారానని చెప్పుకుంటే అనుమానించాలా? నమ్మి దగ్గరకు వెళ్లాలా? వ్యవసాయూనికి రోజూ పగటిపూట 9 గంటల పాటు నాణ్యమైన కరెంటును ఉచితంగా సరఫరా చేస్తానంటున్న చంద్రబాబు హామీలను చూసి అందరికీ వస్తున్న సందేహమిది.. ఆయన పాలన నాటి చీకటి రోజులు గుర్తుకొచ్చి వణికి పోతున్న సందర్భమిది.. ఎలా మర్చిపోగలం.. నెత్తుటి జ్ఞాపకాలను అంటున్నది సామాన్యుడి మది!! - వైఎస్ ఉచిత కరెంటిస్తానంటే అది సాధ్యం కాదని, అందుకు ప్రపంచ బ్యాంకు నిధులివ్వదన్న కేకలను.. ఉచిత కరెంటిస్తే ప్రభుత్వం విశ్వసనీయత కోల్పోతుందని, తీగలు బట్టలారేసుకోవడానికేనన్న వెక్కిరింతను.. వ్యవసాయ విద్యుత్తుపై ఎన్టీఆర్ హెచ్‌పీకి రూ.50 వసూలు చేస్తే, దానిని రూ.600 చేసిన వెన్నుపోట్లను.. - మోటార్లకు మీటర్లు బిగించి, మళ్లీ యూనిట్‌కు ఇంతచొప్పున చార్జీలు పెంచాలనే ప్రయత్నాలను.. అన్నదాతలను దొంగలుగా చూసి బేడీలు వేసి జైళ్లలోకి తోసిన రోజులను.. - గిర్రున తిరుగుతూ వినియోగదారుల పర్సులు ఖాళీ చేసే చైనా మీటర్లను బిగించిన క్షణాలను.. - అధిక చార్జీలు, సర్‌చార్జీలు, పెనాల్టీ చార్జీలు.. లాంటి పేర్లతో పీల్చిపిప్పిచేసిన జ్ఞాపకాలను.. - కరెంటు సంస్థలను ముక్కలు చేసి ప్రైవేటు సంస్థలకు తెగనమ్మాలని రచించిన ప్రణాళికలను.. - విద్యుదుత్పత్తి ప్లాంట్లు స్థాపించకుండా, జెన్కోకు డబ్బివ్వకుండా దివాలా తీయించే యత్నాలను... - వ్యవసాయూనికి అధిక కరెంటు ఇస్తే ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందన్న ‘మనసులో మాట’ను.. మరీ ముఖ్యంగా.. - చార్జీలు తగ్గించాలని ఉద్యమించినవారిని కాల్చిచంపిన ‘పచ్చ పులిని’.. - ఇప్పుడు కరెంటు ఉచితం అంటున్న హామీలను.. బాబు ‘పవర్’లో ఉన్నపుడు.. - కరెంటు బిల్లు కట్టకపోతే కనెక్షన్ కట్.. పొలాల్లో పోలీసుల కవాతులు - అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లల్లో ఏకంగా 8 సార్లు కరెంటు చార్జీలను పెంచారు. - రైతులపై దాడులు.. కేసుల నమోదు.. రైతుల కోసం ప్రత్యేకంగా జైళ్ల ఏర్పాటు - పొలం మీద పడి మోటార్లు ఎత్తుకెళ్లారు. ఫ్యూజులు పీకేశారు. పంటలు ఎండిపోతున్నా కనికరించలేదు. అధికారం కోసం మళ్లీ.. - 2009 ఎన్నికల ముందు వ్యవసాయానికి 12 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీనిచ్చి... ఇపుడు దానిని కూడా తగ్గించి 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని అంటున్నారు. గంటకో మాట...గడియకో హామీ ఇచ్చే బాబును ఎలా నమ్మేదని రైతులు నిలదీస్తున్నారు. మళ్లీ ఆయన వస్తే మాకు జైలే గతి అని వాపోతున్నారు. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక.. - వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 78 వేల కేసులను ఎత్తివేశారు. సుమారు 2 లక్షల మంది రైతులు ఊపిరి పీల్చుకున్నారు. - రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షలకుపైగా వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ సరఫరా చేశారు. - రైతులు బకాయిపడ్డ రూ. 1250 కోట్ల కరెంటు బిల్లులను మాఫీ చేశారు. చంద్రబాబుకు మా ఉసురు తగులుద్ది కరెంటు చార్జీలు తగ్గించాలని అడిగినందుకు చంద్రబాబు బషీర్‌బాగ్‌లో పోలీసోళ్లను ఉసిగొల్పి నా భర్త రామకృష్ణను కాల్చి చంపించాడు. నా భర్తను పొట్టనబెట్టుకున్న చంద్రబాబుకు మా కుటుంబం ఉసురు తగిలింది. అందుకే రెండుసార్లు ఓడిపోయిండు. మళ్లీ ఓడిపోతాడు. రామకృష్ణ చనిపోయేనాటికి నా కడుపులో బిడ్డ పెరుగుతోంది. బతుకుపై మా కుటుంబమంతా ఆందోళన చెందాం. అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మాకు అండగా నిలిచాడు. నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చారు. ఆయన మేలును మా కుటుంబం ఎప్పటికీ మర్చిపోదు. - సత్తెనపల్లి మంగ, రామకృష్ణ భార్య -
వాగ్దానకర్ణులకు కళ్లెం!
సంపాదకీయం: ఎన్నికలు వచ్చేసరికల్లా పట్టపగ్గాల్లేకుండా వాగ్దానాలు కురిపించే రాజకీయ పార్టీలకు ఇక బ్రేక్ పడింది. ఎన్నిక ల ప్రణాళికలో చేసే ఏ వాగ్దానానికైనా పార్టీలు వివరణలివ్వడం తప్పనిసరిచేస్తూ ఎన్నికల సంఘం(ఈసీ) నిబంధన విధించింది. చేసిన వాగ్దానం నెరవేర్చడానికి అవసరమయ్యే ఆర్ధిక వనరులూ, వాటి సమీకరణకున్న మార్గాలూ ఇక వివరించి తీరాలని నిర్దేశించింది. ఓటర్లను అనుచితంగా ప్రభావితం చేసే, సమానావకాశాల వాతావరణాన్ని దెబ్బతీసే ఎలాంటి వాగ్దానాలూ చేయొద్దని కూడా పార్టీలన్నిటికీ సూచించింది. ఆచరణ సాధ్యమైన హామీలను మాత్రమే ఇవ్వాలని కూడా తెలిపింది. గత కొన్నేళ్లుగా రాజకీయ పార్టీల తీరుతెన్నుల్ని, వాటి బాధ్యతారహిత ప్రవర్తనను గమనించేవారికీ...ఎన్నికల్లో అవి చేస్తున్న వాగ్దానాలను చూసేవారికీ ఇలాంటి నిబంధనలు అత్యవసరమని అనిపిస్తాయి. అలా చూసి చూసి విసుగెత్తినవారే సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దానిపై గత ఏడాది జూలైలో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ పార్టీల ఎన్నికల ప్రణాళికల్లో చేసే వాగ్దానాలు చట్టపరంగా అవినీతి చర్యగా పరిగణించడం సాధ్యంకాదని తెలిపింది. అయితే, అన్ని పక్షాలకూ సమానావకాశాలుండేలా, ఎన్నికల ప్రక్రియకుండే స్వచ్ఛత దెబ్బతినకుండా చూసేలా తగిన నిబంధనలను రూపొందించాలని ఆ సందర్భంగా సుప్రీంకోర్టు ఈసీని కోరింది. తమిళనాట అన్నా డీఎంకే, డీఎంకే వంటి పార్టీలు పోటీబడి ‘ఉచిత’ వాగ్దానాలు చేయడం...తమకు ఓటేస్తే గ్రైండర్లు, మిక్సీలు, ఫ్యాన్లు, కలర్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, పెళ్లికూతుళ్లకు బంగారు తాళిబొట్లు ఇవ్వజూపటం నిజమే. యూపీ, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎస్పీ, బీజేపీ, జేడీ(ఎస్) వంటివి చేతికి ఎముకలేకుండా చేసిన వాగ్దానాలు కోకొల్లలు. ఇక క్రికెట్ కిట్లు, పట్టుచీరలు వంటివి ఎన్నికల సమయంలో ఓటర్లకు అందజేయడం సర్వసాధారణంగా మారింది. అయితే, ఈ సాకుతో అసలు రాజకీయపక్షాలు చేసే వాగ్దానాలపైనే ఆంక్షలు విధించడం, ఆ వాగ్దానాలు నెరవేర్చేది ఎలాగో చెప్పాలనడం అంత సైరె న నిర్ణయం అనిపించుకోదు. ఏవగింపు కలిగేలా, సామాన్య ఓటరును ప్రలోభపెట్టేలా రాజకీయపక్షాలు హామీలు గుప్పిస్తున్న సంగతిని ఎవరూ కాదనలేరుగానీ...అలా వాగ్దానాలు చేసినంత మాత్రానే జనం మెచ్చి ఆయా పార్టీలకు అధికారం అప్పగిస్తారనుకోవడం సరికాదు. సమాజంలోని కొన్ని వర్గాలకు ప్రభుత్వపరంగా ఆసరా అవసరమని భావించినప్పుడు, తాము వస్తే ఫలానావిధంగా చేస్తామని పార్టీలు చెబుతుంటాయి. ఆ వాగ్దానం ‘హేతుబద్ధం’గా ఉండాలని, వాటికి వనరులు ఎలా సమకూర్చుతారో చెప్పాలని ఇప్పుడు ఎన్నికల సంఘం నిర్దేశిస్తోంది. అధికారంలోకొస్తే రైతులందరికీ ఉచిత విద్యుత్ అందజేస్తానని 2004 ఎన్నికల్లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వాగ్దానం చేశారు. అప్పట్లో ఈ వాగ్దానంపై కాంగ్రెస్ అధిష్టానానికే స్పష్టతలేదు. స్వయంగా ఆర్ధికవేత్త అయిన ప్రధాని మన్మోహన్సింగ్ అయితే దాని సాధ్యతపై సంశయం వ్యక్తంచేశారు. ఇక అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇది అసాధ్యమని ప్రచారం చేశారు. ఒకవేళ అలా ఉచిత విద్యుత్ ఇచ్చినా కరెంటు తీగలు బట్టలు ఆరేసుకోవడానికి తప్ప పనికిరావని ఎద్దేవా చేశారు. కానీ, వైఎస్ అధికారంలోకొస్తూనే ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారు. దాన్ని అయిదేళ్లపాటూ జయప్రదంగా అమలుచేయగలిగారు. అందువల్ల తెలంగాణ జిల్లాల్లో పంటల దిగుబడి ఎంతగానో పెరిగింది. కరెంటు చార్జీలను పెంచబోమన్న హామీని కూడా ఆయన నెరవేర్చారు. ఇప్పుడు ఈసీ పెట్టిన నిబంధన ప్రకారం ‘ఉచిత విద్యుత్’ ఎలా సాధ్యమో కూడా ఎన్నికల ప్రణాళిక నిరూపించాల్సి ఉంటుంది. అలాంటి ప్రయత్నం చేసినా దాన్ని పూర్వపక్షం చేయడానికీ...అందులో అహేతుకత ఉన్నదని చెప్పడానికీ ప్రత్యర్థిపక్షాలు ప్రయత్నిస్తాయి. అప్పుడు ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయానికొస్తుంది? ఆ వాగ్దానం నెరవేర్చడానికి పార్టీ చూపిస్తున్న వనరుల సమీకరణ సవ్యంగా లేదని ఈసీ భావించినా, ప్రత్యర్థిపక్షాల వాదనలే సబబని విశ్వసించినా ఆ వాగ్దానం చెల్లదని చెబుతుందా? తొలగించమని సూచిస్తుందా? ఉచిత విద్యుత్ అమలుపై సందేహం వెలిబుచ్చిన మన్మోహనే తర్వాతకాలంలో దాన్ని ప్రశంసించారన్న సంగతిని గుర్తుంచుకుంటే ఇలాంటి వాటిపై నిర్ణయం తీసుకోగల సామర్థ్యం ఈసీ కి ఎంతవరకూ ఉంటుందో అనుమానమే. సమాజంలోని భిన్నవర్గాల సమస్యలను తెలుసుకుని, వాటికి పరిష్కార మార్గాలు వెదకడం ఒక సృజనాత్మక ప్రక్రియ. సమస్యలను గుర్తించడంలోగానీ, వాటికి పరిష్కారాలను ఆలోచించడంలోగానీ అందరికీ ఒకే రకమైన దృక్పథం ఉండదు. ఎన్టీఆర్ అధికారంలో కొచ్చేవరకూ పేదలకు చౌక ధరకు బియ్యం అందించవచ్చునని ఎవరికీ తోచలేదు. అలాగే ఆరోగ్యశ్రీ, 108 సేవలు, 104 సేవలు, ఫీజు రీయింబర్స్‌మెంటు వంటివి వైఎస్ వచ్చేవరకూ ఏ పాలకుడూ అమలు చేయలేదు. ఆయా పథకాలవల్ల అట్టడుగు వర్గాల ప్రజలకు ఎంతగానో మేలుకలిగింది. వాగ్దానాల్లోని సహేతుకతను పోల్చుకోవడంలో, వాటి ఆంతర్యాన్ని పసిగట్టడంలో మన ఓటర్లు ఎవరికీ తీసిపోరు. వారికి ఆ విచక్షణే లేకపోతే, 2009లో కొత్తగా ఒక్క హామీ కూడా ఇవ్వని వైఎస్ కాక...‘ఆల్ ఫ్రీ’ వాగ్దానాలు చేసిన బాబే గెల్చివుండేవారు. కనుక దొంగ వాగ్దానాల భరతంపట్టే పనిని ఓటర్లకు వదిలేయడమే ఉత్తమమని ఈసీ గ్రహిస్తే మంచిది. ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా, పారదర్శకంగా జరిగేలా చేయడంలో ఈసీ చాలావరకూ విజయం సాధించింది. కానీ, ఇంకా ఆ దిశగా చేయాల్సింది ఎంతో ఉన్నదని కొన్ని నియోజకవర్గాల్లో ఇటీవలికాలంలో భారీయెత్తున బయటపడిన దొంగ ఓటర్ల బాగోతం నిరూపించింది. అలాంటి అంశాలపై ఈసీ మరింతగా దృష్టిసారించాలి. -
ఉచిత విద్యుత్ కల సాకారం
ఉట్నూర్, న్యూస్‌లైన్ : ఉప ప్రణాళిక పుణ్యమాని షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు(ఎస్టీ)లకు ఉచిత విద్యుత్ సదుపాయం అందుబాటులోకి రానుంది. 50 లోపు యునిట్లు వినియోగించుకున్న వారికి విద్యుత్ చార్జీల మినహాయింపును ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో విద్యుత్ వినియోగంపై వివరాలపై పరిశీల న కూడా చేస్తున్నారు. రచ్చబండ నిర్వహణ దృష్ట్యా అధికారులు కొన్ని నివాసాలు గుర్తించినప్పటికీ పూర్తి క్షేత్రస్థాయి పరిశీలన సిద్ధం అవుతున్నారు. ఈ బాధ్యతలు సాంఘిక సంక్షేమ శాఖకు అప్పగించారు. ఎస్టీల్లోని అర్హులను గుర్తించడం పనులు ఏజెన్సీ అధికారులు చేపడుతున్నారు. వీటిని ఆన్లైన్ ద్వారా నిర్వహించనున్నారు. త్వరలోనే ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలో నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. 0 నుంచి 50 యూనిట్లు వినియోగించే వారికే.. 0 నుంచి 50 యూనిట్ల విద్యుత్ వినియోగించే ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే ఉచిత సదుపాయాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 50 యూనిట్లు దాటి బిల్లు వచ్చే వారికి ఈ విధానం వర్తించదు. దీని ద్వారా విద్యుత్ పొదుపునకు కూడా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు అలవాటు పడుతాయని ప్రభుత్వం భావిస్తుంది. గ్రామాల్లోని ఎస్సీ కాలనీల్లో నివసించే వారికి మాత్రమే ఈ ఉచిత సౌకర్యాన్ని అమలు చేయనున్నారు. అలాగే ఎస్టీ ప్రాంతాల్లో ఉచిత విద్యుత్‌కు చర్యలు తీసుకోవడం ద్వారా అర్హులైన కుటుంబాలు ప్రయోజనం పొందనున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వర్తింపు జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 50 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని అర్హులైన లబ్ధిదారులు అందించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. వీటి ప్రకారం గత సెప్టెంబర్ నుంచి అంటే మొత్తం ఆరు నెలలకు సంబంధించిన 50 యూనిట్లలోపు వినియోగించిన ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు వారు చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఆన్లైన్ ద్వారా చెల్లించడమా? లేక ఏదైనా ప్రత్యామ్నాయం ఆలోచించడమా అనేది ప్రభుత్వం త్వరలో ప్రకటించనున్నాట్లు తెలిసింది. ప్రభుత్వం మూడో విడుత నిర్వహిస్తూన్న రచ్చబండ సందర్భంగా అధికారులు జిల్లాలో యాభై యూనిట్లలోపు విద్యుత్ వినియోగించుకుంటుంన్నా దాదాపు 20,260 ఎస్సీ కుటుంబాలు, సుమారు 17,734 ఎస్టీ కుటుంబాలను గుర్తించారు. వీరందరికి ప్రభుత్వం దాదాపు రూ. 18.20 కోట్ల బిల్లులు మాఫీ చెయ్యనుంది. అయా శాఖల అధికారులు పూర్తి స్థాయిలో నివేదికలు సకాలంలో ప్రభుత్వానికి సమర్పిస్తే అర్హులైన కుటుంబాలు ఇక విద్యుత్ బిల్లులు చేల్లించాల్సిన అవసరం లేకుండా పోతుంది. అయా శాఖలకే బాధ్యతలు ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సాంఘిక సంక్షేమశాఖ, ఏజెన్సీ ప్రాంతాల అధికారులకు అప్పగించింది. అధికారులు విద్యుత్‌శాఖ అధికారుల నుంచి 50 యూనిట్లు వినియోగిస్తున్న ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన డిమాండ్ నోటీసులు తీసుకుని వాటి ఆధారంగా గ్రామాల్లో సర్వే నిర్వహించనున్నారు. వసతి గృహాల సంక్షేమాధికారులు, సహాయ సంక్షేమ అధికారులు త్వరలో రెండమ్ చెక్ పేరిట అయా ప్రాంతాల్లో జాబితాల్లో వివరాలు పరిశీలించి తగు నివేదికలు తయారు చేసి ఉన్నతాధికారులకు సమర్పించనున్నారు. అంత సక్రమంగా పూర్తయితే త్వరలోనే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద నిధులు విడుదలకు బడ్జెట్‌ను విడుదల చేసి 50 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలును ప్రభుత్వం చేపట్టనుంది. -
బడుగులే నిర్ణేతలు
మధ్యప్రదేశ్‌లో ఫలితాలపై ప్రభావం చూపనున్న ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు బీజేపీ నుంచి నెమ్మదిగా కాంగ్రెస్ వైపు చూపు మధ్యప్రదేశ్‌లో 35 ఎస్సీ, 47 ఎస్టీ నియోజకవర్గాలు మధ్యప్రదేశ్ నుంచి ప్రవీణ్, సాక్షి ప్రతినిధి: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బడుగులే జయాపజయాలను నిర్ణయించనున్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు ఫలితాలపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 230 నియోజకవర్గాల్లో 35 ఎస్సీ, 47 ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. 1998 వరకు కాంగ్రెస్‌కు బాసటగా ఉన్న ఈ నియోజకవర్గాల్లో దాదాపు 90 శాతం నియోజకవర్గాలు 2003 ఎన్నికల నాటికి బీజేపీ వైపు మొగ్గు చూపాయి. అయితే, ఈ నెల 25న జరగనున్న ఎన్నికల్లో సగానికి పైగా ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపే సూచనలు కనిపిస్తున్నాయి. గడచిన పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం ఈ నియోజకవర్గాల్లో కొంతమేరకు అభివృద్ధి చేసినా, ఇప్పటికీ పలు గ్రామాలకు మౌలిక వసతులు లేవు. రాష్ట్ర రాజధానికి దూరంగా సరిహద్దుల్లోని ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు అధికంగా ఉన్న బేతుల్, చింద్వాడ, సివోని, బాలాఘాట్ జిల్లాల్లోని పలు ప్రాంతాలను ‘సాక్షి’ బృందం సందర్శించింది. గత పదేళ్లలో బీజేపీ సర్కారు ఈ గ్రామాలకు విద్యుత్తు సౌకర్యం, పాఠశాలలను మాత్రమే సమకూర్చగలిగింది. అయితే, గ్రామాలకు విద్యుత్కాంతులు రావడంలో కేంద్రం వాటా కూడా ఉంది. పదేళ్ల బీజేపీ పాలనపై ఎస్సీ, ఎస్టీలు కొంత సంతృప్తి వ్యక్తం చేస్తున్నా, ఇది మాత్రమే చాలదని వారు చెబుతున్నారు. వ్యవసాయానికి విద్యుత్తు, రోడ్డు మార్గాల విషయంలో తమ ప్రాంతాలు నేటికీ వెనుకబడి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉచిత విద్యుత్తు, ఉచిత ఆహార పంపిణీ హామీలతో కాంగ్రెస్ సాగిస్తున్న ప్రచారం వారిని ఊరిస్తోంది. ఉచిత విద్యుత్తు, ఉచితంగా ఆహారం ఇస్తే మంచిదేనని, అయితే, కాంగ్రెస్ ఇస్తుందో లేదోనని సంశయం కూడా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ రానున్న పదిరోజుల్లో ఈ ప్రాంతాల్లోకి తన మేనిఫెస్టోను బలంగా తీసుకువెళ్లగలిగితే బీజేపీకి కష్టకాలం తప్పకపోవచ్చు. విద్యలో ఇంకా వెనుకబాటే: మధ్యప్రదేశ్‌లోని చాలా ప్రాంతాలు విద్యలో ఇంకా వెనుకబడే ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం 6, 9, 11 తరగతుల్లో చేరే విద్యార్థులకు సైకిళ్లు సమకూర్చడంతో మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరిగింది. అయి తే, ఇంటర్ పూర్తిచేశాక డిగ్రీ కోసం జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి. ప్రభుత్వ రవాణా వ్యవస్థ లేకపోవడంతో విద్యార్థులు ప్రైవేటు బస్సులు, ఆటోలను ఆశ్రయిం చి అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. అయినా, ప్రధాన రహదారుల నుంచి గ్రామాలకు చేరుకునేందుకు వారికి మూడు నాలుగు కిలోమీటర్ల కాలినడక తప్పదు. బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుంది: సుష్మా జబల్పూర్: మధ్యప్రదేశ్‌లో తమ పార్టీ హ్యాట్రిక్ సాధిస్తుందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ బుధవారం ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రజానుకూలత రాష్ట్రవ్యాప్తంగా ఉందని ఆమె అన్నారు. గత పదేళ్లలో సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం చూపిన నిబద్ధత కారణంగా తమ పార్టీపై ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతోందన్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ఇక్కడకు వచ్చిన ఆమె కొద్దిసేపు మీడియాతో ముచ్చటించారు. బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు తదితరులు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటికి కరెంటిస్తే సరిపోతుందా? ఇంటికి 22 నుంచి 24 గంటల వరకు కరెంటు వస్తోంది. పొలాలకు రావొద్దా? బీజేపీ మా పల్లెల్లో వెలుగులు తెచ్చినా, ఇంతవరకే సరిపోదు. కాంగ్రెస్ ఉచితంగా కరెంటు ఇస్తామని చెబుతోంది. అయితే, ఇస్తుందో లేదో తెలియదు.. ఇస్తే రైతులకు మేలు జరుగుతుంది. -తారాసింగ్ ఖట్రే, మోహన్పూర్, బైహ్రా నియోజకవర్గం, బాలాఘాట్ జిల్లా ఇల్లు ఇచ్చింది.. కానీ కూలీ సరిపోదు.. ప్రభుత్వం మాకు ఇల్లు ఇచ్చింది. అయితే, మాకు పొలం లేదు. కొంతైనా భూమి, పాడిపశువులను ఇస్తే వాటి ద్వారా కుటుంబాన్ని పోషించుకుంటాం. - సంతూ మార్కామ్, కూలీ, ఉక్వా, బైహ్రా నియోజకవర్గం 3 కిలోమీటర్లు నడిచేవెళుతున్నా.. నేను జిల్లా కేంద్రంలో బీఏ మూడో సెమిస్టర్ చదువుతున్నా. రోజూ మూడు కిలోమీటర్లు నడిచివెళ్లాల్సిందే. అక్కడి నుంచి మళ్లీ ప్రైవేటు బస్సుల్లో వె ళ్లాలి. ప్రభుత్వ పరంగా బస్సు సౌకర్యం లేదు. ప్రైవేటు బస్సుల్లో చార్జీలు ఎక్కువగా చెల్లించాల్సి వస్తోంది. -రాఖీ పవార్, బీఏ థర్డ్ సెమిస్టర్, బేతుల్ జిల్లా ప్రైవేటు కాలేజీల్లో ఖర్చు ఎక్కువ అమ్మా నాన్నలు చిన్నకారు రైతులు. నేను ప్రభుత్వ కళాశాలలోనే చదువుతున్నా. ప్రైవేటు కాలేజీల్లో ఫీజులు చాలా ఎక్కువ. ప్రభుత్వం మాకు ప్రైవేటు కాలేజీల్లో చదువుకునే వెసులుబాటు కల్పించాలి. -సప్న వంజారే, బీఎస్సీ థర్డ్ సెమిస్టర్, బేతుల్ జిల్లా -
‘ఉచితం’ పై ఉక్కుపాదం
సాక్షి, హైదరాబాద్: ఉచిత విద్యుత్ పథకంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే సర్వీసు చార్జీ పెంచటంతో పాటు ఏళ్లనాటి పాత బకాయిలను వసూలు చేస్తున్న ప్రభుత్వం.. తాజాగా ఉచిత విద్యుత్‌కు 7 గంటలకు మించి సరఫరా చేస్తే జీతాలు కత్తిరిస్తామని ఉద్యోగులను హెచ్చరించింది. అదే సమయంలో వ్యవసాయానికి ఏడు గంటల కంటే తక్కువ విద్యుత్ సరఫరా అయితే గతంలో మాదిరిగా మరుసటి రోజు సర్దుబాటు చేయటం కుదరదనీ తేల్చిచెప్పింది. ఈ మేరకు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు చెందిన కిందిస్థాయి సిబ్బందికి ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఈ ఆదేశాలు విద్యుత్ అధికారులు, సిబ్బందిలో గుబులు పుట్టిస్తున్నాయి. దీంతో ఉచిత విద్యుత్ సరఫరాను రాష్ట్రవ్యాప్తంగా గణనీయంగా కుదించారు. వాస్తవానికి ఏదైనా ఒక రోజు సాంకేతిక కారణాలు అంటే ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడం, సబ్‌స్టేషన్‌కు పై నుంచి సరఫరా లేకపోవటం, విద్యుత్ సరఫరా లైన్లు తెగిపోవడం తదితర కారణాల వల్ల వ్యవసాయానికి 7 గంటల విద్యుత్ సరఫరా కాకపోతే.. ఆ మేరకు కొరత పడిన విద్యుత్‌ను మరుసటి రోజు సరఫరా చేయాలి. ఈ మేరకు డిస్కంలకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఇక అలా చేయటం కుదరదని తాజాగా ఆదేశించారు. ఏ రోజైనా 7 గంటలకు మించి విద్యుత్ సరఫరా జరిగితే ఉద్యోగుల జీతాలకు కోత విధిస్తామని ఉన్నతాధికారులు హెచ్చరించటంతో.. 7 గంటల కంటే సాధ్యమైనంత తక్కువగా ఇచ్చేందుకే అధికారులు మొగ్గుచూపుతున్నారు. పారదర్శకతకూ పాతర... గతంలో ప్రతిరోజూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ ఫీడర్లకు ఎంత మేర విద్యుత్ సరఫరా జరిగిందనే వివరాలను ట్రాన్స్‌కో వెబ్సైట్లో వెల్లడించేవారు. పారదర్శకత కోసం ఈవిధంగా చేస్తున్నామని ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు కూడా. అయితే.. వ్యవసాయానికి 7 గంటల విద్యుత్ సరఫరా కావటం లేదనే విషయాన్ని ప్రభుత్వ అధికారిక సమాచారం మేరకే ఫీడర్ల వారీగా ఎంత విద్యుత్ సరఫరా జరిగిందనే వివరాలతో ‘సాక్షి’ అనేక కథనాలను ప్రచురించింది. దీంతో తమ తప్పు బయటపడుతోందని భావించిన ప్రభుత్వం ఈ సమాచారాన్ని వెబ్సైట్ నుంచి తొలగించాలని ట్రాన్స్‌కోను ఆదేశించింది. దీంతో ప్రస్తుతం ఈ సమాచారం అందుబాటులో లేకుండా పోయింది. వ్యవసాయానికి ఎంత విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామనే వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయకపోతుండటంతో.. అసలు ఉచిత విద్యుత్ పథకానికి క్రమంగా మంగళం పాడతారనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. నిజానికి.. సంక్షోభంలో కూరుకుపోయిన రైతాంగాన్ని ఆదుకోవటం కోసం ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టిన నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణించిన నాటి నుంచి.. తదనంతర ప్రభుత్వం ఈ పథకంపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తోంది. ఎలాగైనా ఉచిత విద్యుత్ సబ్సిడీ భారాన్ని తగ్గించుకునేందుకు అనేక ఆంక్షలను తెరమీదకు తెచ్చింది. పరిమితులు విధించటం మొదలయింది. రెండున్నర ఎకరాల మాగాణి (తరిపొలం) దాటిన వారికి బిల్లులు చెల్లించాలంటూ నోటీసులు జారీ అవుతున్నాయి. ఐఎస్ఐ మార్క్ పంపుసెట్లు వంటి డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్ (డీఎస్ఎం) నిబంధనలు పాటించని వారి నుంచీ విద్యుత్ బిల్లుల వసూలు షురూ అయ్యింది. బకాయిల పేరుతో వేలల్లో బిల్లులు... ఒకవైపు ఉచిత కనెక్షన్లకు సర్వీసు చార్జీలను వసూలు చేస్తున్న విద్యుత్ సంస్థలు.. మరోవైపు తత్కాల్ వ్యవసాయ కనెక్షన్లకు యూనిట్‌కు 20 పైసలు చొప్పున వసూలు చేయాలని నిర్ణయించారు. వాస్తవానికి తత్కాల్ వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు లేవు. దీంతో ఎంత విద్యుత్ వినియోగాన్ని వినియోగించారని లెక్కించటం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో 2009లో తత్కాల్ కనెక్షన్లకు కూడా ఉచిత విద్యుత్ పథకాన్ని వర్తింపచేశారు. తాజాగా 2004 నుంచి 2009 వరకు వాడుకున్న విద్యుత్‌కు చార్జీలు చెల్లిం చాలంటూ బకాయిల పేరిట రైతులకు బిల్లులు జారీచేస్తున్నారు. విద్యుత్ వాడకానికి సంబంధించి విద్యుత్ సంస్థలు వింత లెక్కను ముందుకు తెచ్చాయి. ‘వ్యవసాయానికి ఒక రైతు 5 హార్స్ పవర్ (హెచ్‌పీ) సామర్థ్యం కలిగిన మోటారు వాడుతున్నారు. ఈ మోటారును వాడటం వల్ల గంటకు 3.73 యూనిట్లు (హార్స్‌పవర్‌కు 0.746 యూనిట్ల చొప్పున) కాలుతుంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా అవుతుంది. ఈ లెక్కన రోజుకు 26.11 యూనిట్లు.. నెలకు 783.3 యూనిట్లు.. ఏడాదికి 9,399.6 యూనిట్లు కాలుతుంది. యూనిట్‌కు 20 పైసల చొప్పున ఏడాదికి రూ. 1,879.92 చెల్లించాల్సి ఉంటుంది. 2004 నుంచి 2009 వరకు చెల్లించలేదు. కాబట్టి ఐదేళ్లకు మొత్తం రూ. 9,396 చెల్లించాల్సిందే’నని బిల్లులు మంజూరు చేస్తున్నారు. ఈ విధంగా పాత బకాయిల పేరుతో రైతులపై వందల కోట్ల భారాన్ని ప్రభుత్వం మోపుతోంది. సర్వీసు చార్జీ బకాయిల వడ్డన... వైఎస్ 2004 నుంచి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టగా.. ఆ విద్యుత్ కనెక్షన్లకు సర్వీసు చార్జీల రూపంలో రూ. 20 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించారు. అయితే.. రైతుల నుంచి ఈ మొత్తాన్ని కూడా ఏనాడూ వసూలు చేయలేదు. ఈ సర్వీసు చార్జీని కాస్తా 2011 ఏప్రిల్ నుంచి రూ. 30కి పెంచారు. గతంలో వసూలు చేయని సర్వీసు చార్జీలు ఇప్పుడు చెల్లించాలంటూ 2004 నుంచి ఇప్పటివరకు అయిన మొత్తాన్ని లెక్కగట్టి రైతుల నుంచి బకాయిలు వసూలు చేస్తున్నారు. ఇంటికి ఇచ్చే విద్యుత్ బిల్లులోనే దీనిని కలిపేసి ఇస్తున్నారు. దీనివల్ల రైతులపై ఏకంగా రూ. 216 కోట్ల మేర భారం పడుతుందని అంచనా. -
ఎస్సీ, ఎస్టీలకు ‘ఉచిత విద్యుత్’ ఉత్తిదేనా
నల్లగొండ, న్యూస్‌లైన్: రాష్ట్రంలో ప్రస్తుతమున్న ప్రభుత్వం ప్రగల్భాకే పరిమితమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేద ప్రజల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెడుతున్నా అవి కాస్తా ఆదిలోనే హంసపాదుగా మారుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం దళితవాడలు, తండాల్లో నివశించే ఎస్సీ, ఎస్టీల కుటుంబాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది. కానీ, దీని అమలు విషయంలో పట్టించుకోవడం లేదు. 50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించుకునే ఎస్సీ, ఎస్టీల కుటుంబాలకు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించినా దీనిపై తమకు ఉత్తర్వులు అందలేదని కిందిస్థాయి అధికారులు చెబుతున్నారు. దీంతో వారు తమకు ఆదేశాలు రాలేదని చెబుతున్నారు. దీంతో ఈ పథకం అమలుపై లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. విద్యుత్ బిల్లులు భరించేందుకు నిర్ణయం విద్యుత్ వినియోగానికి సంబంధించిన బిల్లులను ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎస్సీలకు విద్యుత్ బిల్లులు చెల్లించనున్నట్లు సాంఘిక సంక్షేమశాఖ జీవోనెం. 58ను జారీ జారీ చేసింది. ఇదిలా ఉండగా గిరిజనులకు సంబంధించి మాత్రం త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. జిల్లాలో దళితవాడల్లో నివసిస్తూ 50 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించే కనెక్షన్లు సుమారు 40వేల వరకు ఉన్నాయని విద్యుత్ యంత్రాంగం గుర్తించింది. 50యూనిట్ల లోపు వినియోగించే ఆయా కుటుంబాలకు సంబంధించిన పాత బకాయిలు రూ.14.20 కోట్ల వరకు ఉండగా, గడిచిన ఏప్రిల్ నుంచి జూన్ వరకు మరో *72లక్షలు ఎస్సీ వినియోగదారులు బకాయిలు ఉన్నాయని, మొత్తంగా సుమారు రూ.15కోట్ల బకాయిలు ఉన్నాయని అధికారులు తెలియజేస్తున్నారు. సాంఘిక సంక్షేమ శాఖకు ఆదేశాలు కోట్లాది రూపాయల మొత్తంలో బకాయిలు పేరుకపోయినా, వీటితో పాటు గత నెల జూలై నెల నుంచి ఉచిత విద్యుత్ బిల్లులు చెల్లించేలా చర్యలు చేపట్టాలని ఆదేశిస్తూ సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకుల కార్యాలయానికి అధికారిక ఉత్తర్వులు కూడా అందాయి. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా జిల్లాలోని లబ్ధిదారులు, వారి బకాయిల వివరాలు పంపాలని విద్యుత్‌శాఖను సాంఘిక సంక్షేమశాఖ కోరింది. దీంతో ఎస్సీ లబ్ధిదారుల వివరాలు వెలికితీసే కార్యక్రమంలో యంత్రాంగం నిమగ్నమైంది. పూర్తిస్థాయి కసరత్తు చేయడం ద్వారా స్పష్టమైన గణాంకాలు సాంఘిక సంక్షేమ శాఖకు అందించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ విద్యుత్ అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే విద్యుత్ శాఖ అందించిన వివరాల ఆధారంగా పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని ఆయా శాఖల అధికారులు చెబుతున్నా ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల్లో మాత్రం అపోహలు మెండుగా ఉన్నాయి. జూన్ నుంచి ఉచిత విద్యుత్ అమలు చేయాలని ప్రభుత్వం అదేశించినా గత నెల బిల్లులు యధాతథంగా వచ్చాయని లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ఇదిలా ఉండగా ఎస్టీలకు ఉచిత విద్యుత్ అమలుకు సంబంధించి ఉత్తర్వులు అందినా కసరత్తు విషయంలో ఎలాంటి పురోగతి లేదు. జిల్లాలో 1132 గిరిజన తండాలు, ఆవాసగ్రామాలుండగా అందులో చాలావరకు తండాలకు విద్యుత్ సౌకర్యమే కరువైంది. ఏది ఏమైనా ఆయా తండాలు, ఆవాస గ్రామాల్లో గిరిజన కుటుంబాలు 50 యూనిట్లలోపు వారికి ఉచిత విద్యుత్‌ను అందించేందుకు అవసరమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఎస్టీ వినియోగదారుల విషయంలో కూడా ఉత్తర్వులు వెలువడినా ఎంతమంది ఉంటారన్న లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియలో ఇప్పుడిప్పుడే నిమగ్నమయ్యారు. గిరిజన కుటుంబాల్లో ఎవరెంత విద్యుత్ బకాయిలు లెక్కలు కడుతున్నారు. ఇళ్లు లేని వారి పరిస్థితేంటి? ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ అందించాలనే నిర్ణయం మంచిదైనా అద్దె ఇళ్లల్లో ఉంటున్నవారు, ఇతర ప్రాంతాల్లో నివసిస్తూ 50 యూనిట్ల విద్యుత్‌ను వాడేవారి పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ పథకం సమూహంగా ఉండే కాలనీలకే వర్తింపజేస్తామనే విధానం సరికాదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇతర ప్రాంతాల్లో నివసించే వారిలో ఎక్కువమంది కూలి పైనే ఆధారపడుతున్నారు. వారిని లెక్కల్లోకి తీసుకోకపోవడంతో చాలామందికి అన్యాయం జరుగుతుందని వాపోతున్నారు. ముక్కుపిండి మరీ కరెంటు బిల్లులు వసూలు చేస్తున్నారు సీఎం 50 యూనిట్లలోపు విద్యుత్ వరకు వాడుకున్న వారు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. కరెంటోళ్లు మాత్రం ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. నాకు ఒక బిల్లు 36 యూనిట్లు రాగా మరో బిల్లు 49 యూనిట్లలోపే వచ్చింది. ఎస్సీలు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదన్నరని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి చెప్పిన విషయాన్ని అధికారులను అడిగితే మీరు ముఖ్యమంత్రికి వద్దకు వెళ్లి ఆయననే ఈ విషయంపై అడగమన్నారు. - జె. సురేష్‌బాబు, గాంధీనగర్, మిర్యాలగూడ ఎక్కువ బిల్లు వస్తుంది 50యూనిట్ల కన్నా తక్కువ కరెంటు వాడుతున్న దళితులకు ఫ్రీగా ఇంటికి కరెంట్ ఇస్తామని గవర్నమెంటు సెప్పినా అప్పుడొచ్చినట్లే బిల్లులు వస్తున్నాయి. పాతప్పులు కూడా కట్టొద్దని చెబుతున్నా బలంతంగా కరెంటు కట్ చేస్తున్నారు. బిల్లు మాకు ఫ్రీ గదా అంటే మాకేమి తెలియది, ఇప్పుడైతే కట్టాల్సిందే అంటున్నారు. - కిన్నెర లింగమ్మ, తిప్పర్తి లేదన్నా బిల్లు వసూలు చేస్తున్నారు 50యూనిట్ల లోపు విద్యుత్ వాడుకున్న వారికి విద్యుత్ బిల్లు ఉండదని సీఎం ఇచ్చిన హామీ అమలు కావడంలేదు. అధికారులు 50యూనిట్ల లోపు విద్యుత్ వాడినా బిల్లులు వసూలు చేస్తున్నారు. అధికారులను అడిగితే అలాంటి జీవో అందలేదని చెబుతున్నారు. తక్కువ కరెంటు వాడుకున్నా జూన్‌లో *123, జూలైలో *147 వసూలు చేశారు. - లావూరి లక్ష్మీ, దామరచర్ల -
ఉచిత విద్యుత్ పథకంలో కోత!