రైతులకు నిరంతరాయ ఉచిత కరెంట్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ అవసరం లేదని.. 3 గంటలు ఇస్తే చాలని వ్యాఖ్యానించారు. కాగా అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్.. సోమవారం తానా మహాసభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తానా ప్రతినిధులనుద్దేశించి ఆయన మాట్లాడారు. అనంతరం ఎన్‌ఆర్‌ఐలు, పలు మీడియా వ్యక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
ఈ క్రమంలో ఓ ఎన్‌ఆర్‌ఐ రేవంత్‌ను ఆసక్తికర ప్రశ్న వేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు నిరాంతరాయంగా అందుతున్న కరెంట్‌ను, దళిత బంధు పథకాన్ని కొనసాగిస్తారా లేక తొలగిస్తారా అని ప్రశ్నించారు. దీనిపై రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణలో 95శాతం మంది రైతులు మూడెకరాల లోపున్న చిన్న, సన్నకారు రైతులేనని తెలిపారు.
ఒక ఎకరాకు సాగు నీరు పారించాలంటే ఒక గంట సరిపోతుందని, అదే మూడు ఎకరాలకు ఫుల్లుగా నీళ్లు పట్టాలంటే మూడు గంటలు చాలని వ్యాఖ్యానించారు. మొత్తం మీద ఒక రైతుకు ఎనిమిది గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందని పేర్కొన్నారు. కేవలం విద్యుత్ సంస్థల వద్ద కమీషన్‌కు కక్కుర్తి పడి వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంట్ అనే నినాదాన్ని తీసుకొచ్చారని విమర్శించారు. ఉచిత కరెంట్ పేరుతో సీఎం కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నాడని, ఉచితాన్ని మన స్వార్థానికి వాడుకోవద్దని అన్నారు.
చదవండి: ఉప ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తారా? అవసరమైతే సీతక్కే సీఎం..
Comments
Please login to add a commentAdd a comment