సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. రాష్ట్రంలో 24 గంటల కరెంట్‌పై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా.. కరెంట్ వెలుగుల బీఆర్ఎస్ కావాలో తెలంగాణ రైతులు తెల్చుకోవాలని సూచించారు.
కాగా, మంత్రి కేటీఆర్ శనివారం బీఆర్‌ఎస్ శ్రేణులతో టెలీకాన్షరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు మద్దతిస్తే ఉచిత విద్యుత్ రద్దే. రైతులకు మూడు గంటలు విద్యుత్ చాలన్న కాంగ్రెస్ విధానంపై ప్రతీ గ్రామంలో చర్చ జరగాలి. ఇదే అంశాన్ని ప్రజల్లోకి విసృతంగా తీసుకెళ్లాలని తెలిపారు.
ఈనెల 17వ తేదీ నుంచి పదిరోజుల పాటు రైతు సమావేశాలు జరుగుతాయి. ప్రతీ రైతు వేదిక వద్ద రైతు సమావేశం ఉంటుంది. బీఆర్‌ఎస్ విధానం మూడు పంటలు.. మూడు గంటల కరెంట్ కాంగ్రెస్ విధానం పేరిట ఈ సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. రైతులను అవమానించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పేలా తీర్మానాలు చేయాలన్నారు. తెలంగాణలో 24 గంటల ఉచిత విద్యుత్ వద్దన్న రైతు వ్యతిరేక కాంగ్రెస్ కుట్రను రైతాంగానికి వివరించాలని సూచించారు.
ఇది కూడా చదవండి: సీఎం కేసీఆర్‌పై ఒవైసీ సంచలన కామెంట్స్..
Comments
Please login to add a commentAdd a comment