ఫైల్ ఫొటో
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఆమె హస్తం గూటికి వెళ్తారా? అనే సస్పెన్స్ నెలకొంది.
కాగా, తెలంగాణలో రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ సిటీ నాయకులపై దృషి సారించింది. దీంతో, తాజాగా జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మితో తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మేయర్‌ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో, ఆమె నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
అనంతరం విజయలక్ష్మి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చేరాలని దీపాదాస్ మున్షీ ఆహ్వానించారు. కార్యకర్తలతో చర్చించిన తర్వాత నిర్ణయం చెబుతాను. వారి అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటాను. రెండు సార్లు నన్ను గెలిపించిన కార్యకర్తలకు చెప్పకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోను అని కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నేతలు వేగవంతం చేశారు. బీఆర్‌ఎస్, బీజేపీ, అసంతృప్త నేతలను టార్గెట్ చేసి హస్తం గూటికి తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల కాంగ్రెస్ గూటికి ప్రతిపక్ష పార్టీలోని సీనియర్ నేతలు, అంతకుముందు కాంగ్రెస్‌ను వీడిన నేతలు హస్తం గూటికి చేరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment