GHMC Mayor
-
ఆఫీస్ ఎన్ని గంటలకు?..మీరు వస్తున్నది ఎన్నింటికి?
సాక్షి,సిటీబ్యూరో: అయినా తీరు మారలేదు. ఎంతకూ రీతి మారలేదు. ఇష్టం వచి్చనప్పుడు రావడం.. ఓపిక ఉన్నప్పుడు ఫైళ్లు కదపడం.. ఏళ్లుగా ఇదే తంతు. తనిఖీలు చేసి హెచ్చరించినా వారికి లెక్కలేదు. మేయర్ సీరియస్ అయినా పట్టించుకోరు. ఇదీ జీహెచ్ఎంసీ సిబ్బంది, అధికారుల పనితీరు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మికి మరోసారి కోపమొచ్చింది. గతంలో రెండు పర్యాయాలు కార్యాలయాల్లో తనిఖీలు చేసినప్పుడు సిబ్బంది ఎవరూ తమ సీట్లలో కనిపించకపోవడంపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం ఆయా విభాగాల్లో ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొన్ని విభాగాల్లో మధ్యాహ్నం 12 గంటలవుతున్నా అధికారులు తమ తమ స్థానాల్లో లేకపోవడంపై మేయర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై సహించేది లేదని, సమయపాలన పాటించనివారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆలస్యంగా వచ్చేవారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తనకు నివేదిక పంపాల్సిందిగా అన్ని విభాగాలకు సర్క్యులర్లు పంపినా, ఎందుకు పంపలేదంటూ టౌన్‌ప్లానింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టౌన్ ప్లానింగ్‌పైనే ఎక్కువ ఫిర్యాదులు ప్రజావాణిలో ఎక్కువ ఫిర్యాదులు టౌన్ ప్లానింగ్‌వే ఉంటున్నాయని, పరిష్కారం కాక ప్రజలు జీహెచ్ఎంసీ చుట్టూ తిరుగుతున్నారని మేయర్ అన్నారు. హెల్త్ సెక్షన్లో కొందరు పని మాని సెల్‌ఫోన్ వీక్షణంలో నిమగ్నం కావడాన్ని గుర్తించి సీరియస్ అయ్యారు. ఇన్చార్జి సీఎంఓహెచ్ సీట్లో లేకపోవడంపై మండిపడ్డారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎక్కడ తనిఖీలు చేస్తున్నారో తెలుసుకోవాలని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ముత్యం రాజును ఆదేశించగా, ఆయన శేరిలింగంపల్లి ఫుడ్ఇన్స్పెక్టర్కు ఫోన్ చేశారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ సక్రమంగా సమాధానం ఇవ్వకపోవడంతో మేయర్ మండిపడ్డారు. వెటర్నరీ విభాగంలోనూ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఇంతకు ముందు కూడా రెండుసార్లు అన్ని విభాగాల్లో ఆకస్మిక తనిఖీలు చేశానని, అయినా వారి తీరు మారలేదన్నారు. ఆయా విభాగాల సిబ్బంది ఉదయం 10:30 గంటల వరకు ఆఫీసులకు రావాలని, 10:40 నిమిషాల వరకు కూడా రాకపోతే ఆలస్యంగా నమోదు చేస్తామని, ఇలా మూడు పర్యాయాల ఆలస్యానికి క్యాజువల్ లీవ్ కట్ చేస్తామని, అవి లేనివారికి ఈఎల్ కట్‌చేస్తామని హెచ్చరించారు. తనిఖీల సందర్భంగా మేయర్ వెంట అడిషనల్ కమిషనర్ నళినీపద్మావతి ఉన్నారు. అనంతరం మేయర్ మీడియాతో మాట్లాడుతూ ఆలస్యంగా వచ్చేవారి గురించి తనకు ప్రతినెలా నివేదిక అందజేయాలని అన్ని విభాగాలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. జీహెచ్ఎంసీలోని ప్రతి ఉద్యోగి ఫేషియల్ రికగి్నషన్ హాజరులో పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు. -
కాంగ్రెస్‌లో చేరిన జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ సమక్షంలో ఆమె హస్తం గూటికి చేరుకున్నారు. కాగా, కొద్దిరోజలుగా మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు ఆమె హస్తం గూటికి చేరారు. ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ నివాసానికి చేరుకున్న విజయలక్ష్మి.. సీఎం, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఇక, అంతకుముందు మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కూడా హస్తం తీర్థం పుచ్చుకున్నారు. -
పార్టీ మారినా.. నో ఫియర్!!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా ఆమె పదవికి ఢోకా లేదు. అలాగే డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నా ఆమె పదవికీ నష్టం లేదు. ఎన్నికైన పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వేరే పార్టీకి మారితే అనర్హత వేటుపడే ప్రమాదం ఉన్నా మేయర్, డిప్యూటీ మేయర్లకు మాత్రం పదవులు పోయే ప్రమాదం లేదు. జీహెచ్ఎంసీ చట్టం, నిబంధనల మేరకు కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ పారీ్టలు మారినా వారి పదవులు పోయే అవకాశం లేదు. మొత్తం పాలక మండలిలో మెజార్టీ సభ్యుల అవిశ్వాస తీర్మానం ద్వారా మాత్రమే వారి పదవులు పోయే ప్రమాదం ఉన్నా, బాధ్యతలు చేపట్టాక నాలుగేళ్ల వరకు కూడా అలాంటి అవకాశం లేదు. అందుకే వారు ఏ పారీ్టకి మారినా దాదాపు మరో ఏడాది వరకు వారి çపదవులకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ప్రస్తుత పాలకమండలిలో మేయర్‌గా విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా శ్రీలత బాధ్యతలు స్వీకరించింది 2021 ఫిబ్రవరి 11న. 2025 ఫిబ్రవరి 10 వరకు వారి పదవులకు వచి్చన ముప్పు ఏమీ లేదు. ఒకవేళ వారి పనితీరు బాగాలేదనో, మరో కారణంతోనో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలనుకున్నా అప్పటి వరకు ఆగాల్సిందే. కాబట్టి.. ఇప్పుడు జీహెచ్ఎంసీలో పార్టీల బలాబలాలు, అవిశ్వాస తీర్మానాలు అనేవి అసలు అంశమే కాదని అటు అధికారులతో పాటు ఇటు రాజకీయ నేతలు సైతం చెబుతున్నారు. నాలుగేళ్ల గడువు తర్వాత అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా వారి పదవులకు మిగిలి ఉండేది స్వల్ప సమయం మాత్రమే. అప్పటికి పార్టీల బలాబలాల్లో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయి. మారనున్న బలాబలాలు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరికలు భారీగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మేయర్ పార్టీ మారుతుండగా, ఇదివరకే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, డిప్యూటీ మేయర్ దంపతులు శ్రీలత, శోభన్‌రెడ్డిలు సైతం కాంగ్రెస్‌లో చేరడం తెలిసిందే. ఇదే వరుసలో దాదాపు ఇరవైమంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి సైతం కొందరిని లాగే ప్రయత్నాల్లో కాంగ్రెస్ ఉన్నట్లు తెలిసింది. ఫలించిన కాంగ్రెస్ వ్యూహం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచి్చనప్పటి నుంచే జీహెచ్ఎంసీ మేయర్‌గా ప్రతిపక్ష పార్టీ వారుండరాదనే పట్టుదలతో ఉంది. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసేది తమ ప్రభుత్వమే అయినందున మేయర్, డిప్యూటీ మేయర్లు కూడా తమ పార్టీ వారే ఉండాలనే వ్యూహంతో పనిచేసింది. ఆ దిశగా సఫలమైన కాంగ్రెస్ ఇక కార్పొరేటర్లపైనా వల వేయనుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ సభ్యులు గెలిచింది ఇద్దరే అయినప్పటికీ, ప్రస్తుతం ఆ సంఖ్య డజనుకు చేరింది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్, బీజేపీల నుంచి దాదాపు 30 మంది వరకు కాంగ్రెస్‌లో చేరతారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరిగినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని, ఎమ్మెల్యేలు పారీ్టలు మారితే వారి అనుయాయులు, అనుచరులుగా ఉన్న కార్పొరేటర్లు కూడా పార్టీ మారతారని చెబుతున్నారు. తమ డివిజన్లలో ఎక్కువ అభివృద్ధి పనులు జరగాలంటే, అందుకు అవసరమైన నిధులు పొందాలంటే అధికార పారీ్టలో ఉంటేనే సాధ్యమని కార్పొరేటర్లు సైతం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల నాటికే కాంగ్రెస్ సభ్యుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందనే అభిప్రాయాలున్నాయి. -
జీహెచ్ఎంసీ మేయర్‌కు కాంగ్రెస్ ఆహ్వానం
బంజారాహిల్స్ (హైదరాబాద్): ‘రెండుసార్లు కార్పొరేటర్‌గా బంజారాహిల్స్ డివిజన్ ప్రజలు గెలిపించారు. దీపాదాస్ మున్షీ మా ఇంటికి వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. మా డివిజన్ ప్రజలు, కార్యకర్తలు, కార్పొరేటర్లతో చర్చించిన తర్వాతనే నా నిర్ణయం ప్రకటిస్తాను’ అని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహా రాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ, డీసీసీ అధ్యక్షుడు రోహిణ్రెడ్డిలు బంజారాహిల్స్‌లోని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ కేశవరావు ఇంటికి వెళ్లారు. అక్కడే జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కేశవరావులతో గంటపాటు చర్చించారు. కాంగ్రెస్‌లోకి రావాల్సిందిగా, పార్టీని బలోపేతం చేయా ల్సిందిగా దీపాదాస్ వారిని ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో విజయలక్ష్మి రాజకీయ భవిష్యత్‌పై భరోసా ఇచ్చినట్టు సమాచారం. -
హస్తం గూటికి జీహెచ్ఎంసీ మేయర్?
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఆమె హస్తం గూటికి వెళ్తారా? అనే సస్పెన్స్ నెలకొంది. కాగా, తెలంగాణలో రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ సిటీ నాయకులపై దృషి సారించింది. దీంతో, తాజాగా జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మితో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మేయర్‌ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో, ఆమె నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. అనంతరం విజయలక్ష్మి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చేరాలని దీపాదాస్ మున్షీ ఆహ్వానించారు. కార్యకర్తలతో చర్చించిన తర్వాత నిర్ణయం చెబుతాను. వారి అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటాను. రెండు సార్లు నన్ను గెలిపించిన కార్యకర్తలకు చెప్పకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోను అని కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నేతలు వేగవంతం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ, అసంతృప్త నేతలను టార్గెట్ చేసి హస్తం గూటికి తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల కాంగ్రెస్ గూటికి ప్రతిపక్ష పార్టీలోని సీనియర్ నేతలు, అంతకుముందు కాంగ్రెస్‌ను వీడిన నేతలు హస్తం గూటికి చేరుతున్నారు. -
రణరంగమైన జీహెచ్ఎంసీ
హైదరాబాద్: బల్దియా సర్వసభ్య సమావేశం రణరంగమైంది. ప్రతిపక్షాల నిరసనలు, ధర్నాలతో దద్దరిల్లింది. బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం 9 గంటలకే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయ పరిసరాల్లో వందలాది పోలీసులు పహారా కాశారు. తమను పర్మనెంట్ చేయాలంటూ కొద్దిరోజులుగా సమ్మె చేస్తున్న బల్దియా ఔట్ సోర్సింగ్ కార్మికులను బీజేపీ కార్పొరేటర్లు తమ వెంట తీసుకుని జీహెచ్ఎంసీ కార్యాలయానికి ర్యాలీగా వస్తుండగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. కొందరు కార్మికులను ఈడ్చి వాహనాల్లో పడేశారు. చెత్త ఊడ్చి నగర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న తమను ప్రభుత్వం అత్యంత హీనంగా చూస్తోందంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయనిపక్షంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ తడాఖా చూపిస్తామని, బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. మేయర్ చాంబర్ వద్ద బైఠాయింపు.. ► సమావేశాన్ని తొందరగా ముగించడంతో బయటకు వచ్చిన బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు మేయర్ చాంబర్ వద్ద బైఠాయించారు. వీరి నినాదాలతో జీహెచ్ఎంసీ ప్రాంగణం హోరెత్తింది. ధర్నా చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మేయర్ ఒక డమ్మీ అంటూ బీజేపీ కార్పొరేటర్లు ఆకుల శ్రావణి, మహాలక్ష్మిగౌడ్, ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్‌లు ఆరోపించారు. తాము కొత్త హామీలను నెరవేర్చాలని అడగట్లేదు. ఔట్సోర్సింగ్ కార్మికులు కూడా ప్రభుత్వ ఉద్యోగులేనని సీఎం గతంలో ప్రకటించారని, ఆయన ప్రకటనను అమలు చేయాలని కోరితే కౌన్సిల్‌ని రద్దు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా మేయర్ రద్దు చేయడం దారుణమంటూ విమర్శించారు. వారం రోజులుగా కార్మికులు సమ్మె చేస్తుంటే మేయర్ ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. అమెరికాలో ఉన్న మంత్రి కేటీఆర్ ఫోన్ ద్వారా ఆపరేట్ చేస్తూ కౌన్సిల్‌ను అర్ధంతంగా రద్దు చేయించారంటూ బీజేపీ కార్పొరేటర్లు ఆరోపించారు. పోలీసులు రంగప్రవేశం చేసి బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లను అక్కడినుంచి పంపించారు. ఈ క్రమంలో పోలీసులకు కార్పొరేటర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. ప్రొటోకాల్ రగడ జీహెచ్ఎంసీలో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని రాజకీయాల కతీతంగా అన్ని పార్టీలూ కోరాయి. అభివృద్ధి పనుల శిలాఫలకాలపై కార్పొరేటర్ల పేర్లు వేయడం లేదని, ప్రొటోకాల్ పాటించడం లేదని.. ముఖ్యంగా వాటర్ బోర్డు పనుల్లో ఇవి ఎక్కువగా జరుగుతున్నాయని కార్పొరేటర్లు మండిపడ్డారు. వీధి దీపాలు, చెత్త సమస్యలు, డీసిల్టింగ్, నాలాల సమస్యలు తదితర సమస్యలపై ధ్వజమెత్తారు. ఎప్పటిలాగే అధికార, ప్రతిపక్ష సభ్యుల పరస్పర వాదోపవాదోలతో సభను మేయర్ విజయలక్ష్మి త్వరితంగా ముగించారు. అందుకు నిరసనగా మేయర్ కార్యాలయం ఎదుట ప్రతిపక్షాలు ధర్నా నిర్వహించాయి. కార్మికుల సమస్యలు తెలిసేలా బీజేపీ సభ్యులు చెత్త తరలింపు కార్మికుల వేషధారణలతో ఆందోళన నిర్వహించారు. మంగళవారం జరిగిన జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం ముఖ్యాంశాలు ఇలా.. ► తెలంగాణ రాష్ట్రం వచ్చాక జీహెచ్ఎంసీ ఔట్సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి వారిని పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని అమలు చేయాలని సభ్యులు మధుసూదన్‌రెడ్డి (బీజేపీ), రాజశేఖర్‌రెడ్డి (కాంగ్రెస్), సలీంబేగ్ (ఎంఐఎం)లు కోరారు. బీఆర్ఎస్ సభ్యుడు, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ సమర్థించారు. పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెంచింది కూడా కేసీఆరే అన్నారు. ఆర్టీసీ కార్మికుల మాదిరిగానే సందర్భం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి తప్పకుండా చేస్తారని బీఆర్ఎస్ సభ్యులు అన్నారు. అందుకు ఎవరు అడ్డుపడ్డారో తెలుసునన్నారు. ఈ మేరకు తీర్మానం చేయాలని ప్రతిపక్ష సభ్యులు కోరారు. ఈ అంశంపై మేయర్ సూచన మేరకు కమిషనర్ రోనాల్డ్‌రాస్ మాట్లాడుతూ.. మేయర్‌తో చర్చించి సభ్యుల అభిప్రాయాన్ని ప్రభుత్వానికి పంపించి ప్రభుత్వ నిర్ణయం మేరకు వ్యవహరిస్తామని చెప్పారు. నిబంధనలు పాటించడం లేదు.. ► ఆయా పనుల సందర్భంగా అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని, శిలాఫలకాలపై కార్పొరేటర్ల పేర్లు వేయడం లేరని, ప్రారంభోత్సవాలకు చివరి నిమిషంలో సమాచారమిస్తున్నారని, ప్రారంభోత్సవాలకు వస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీ డివిజన్ నాయకుల ఫొటో లేనందున వెళ్లిపోయిన సంఘటనలున్నాయని సభ దృష్టికి తెచ్చారు. వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేసినా పంద్రాగస్టు నాడు జెండా ఎగురవేసే దిక్కు లేకుండా పోయిందని, ప్రభుత్వ పథకాలైన కళ్యాణలక్ష్మి, దళితబంధువంటి వాటి పంపిణీ సందర్భంగా తమను ఆహ్వానించడం లేరని, అక్కడా ఎమ్మెల్యేల పెత్తనమే సాగుతోందన్నారు. ప్రొటోకాల్ పాటించడం లేదని మేయర్ అంగీకరించారు. ఇంటర్నల్ రాజకీయాల వల్లేనని అధికారి తెలపడంతో ఇకపై ఇలాంటి పరిస్థితి ఎదురవకుండా తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ రోనాల్డ్ రాస్ హామీ ఇచ్చారు. ►వీధిదీపాలు, చెత్త, నాలాలు, వీధికుక్కలు తదితర సమస్యల్ని సభ్యులు ప్రస్తావించారు. ► కార్పొరేటర్లకు గౌరవమివ్వకున్నా భరిస్తున్న మీరు బానిసలంటూ బీఆర్ఎస్ సభ్యులనుద్దేశించి బీజేపీ సభ్యులు వ్యాఖ్యానించారు. కిషన్‌రెడ్డి చెప్పులు మోసేవారంటూ ఒకరు, కేసీఆర్ చెప్పులు మోసేవారంటూ ఒకరు రెండు పార్టీల వారు పరస్పరం వాదించుకున్నారు. ► జడ్సీలు కార్పొరేటర్లతో నెలకోసారి సమావేశం పెడితే స్థానికంగానే సమస్యలు పరిష్కారమవుతాయని బీజేపీ సభ్యులు ప్రస్తావించారు. ► పారిశుద్ధ్య కార్మికుల వేతనం రూ.500 నుంచి అన్ని ప్రభుత్వాలు పెంచుతూవచ్చాయని, చరిత్ర తెలియనందున మేయర్ బీఆర్ఎస్సే పెంచిందన్నారని కాంగ్రెస్ సభ్యురాలు అనడంతో, మేయర్‌ను అవమానించారని, క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. ► మేయర్ అన్ని అంశాలను చర్చించకుండా సభను త్వరితంగా ముగించడంపై బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు మేయర్ చాంబర్ ఎదుట బైఠాయించి మేయర్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు వారిని అక్కడి నుంచి పార్కింగ్ ప్రదేశానికి తరలించారు.అక్కడా ధర్నాకు దిగడంతో పోలీస్ వ్యాన్లలోకి ఎక్కించారు. ► కార్మికులను పర్మనెంట్ చేయాలంటూ అన్ని పార్టీలూ కోరినా మేయర్ తీర్మానం చేయకపోవడంపై వారు మండిపడ్డారు. ► మీడియాను కౌన్సిల్హాల్లోకి అనుమతించలేదు. నిరసనగా విషయాన్ని మేయర్‌కు తెలియజేయాలనుకున్న ప్రతినిధులను పట్టించుకోకుండా మేయర్ కౌన్సిల్ హాల్లోకి వెళ్లిపోయారు. ► ప్రజాధనంతో ఏర్పాటు చేస్తున్న సమావేశంలో ప్రజాసమస్యలను పట్టించుకోకుండా త్వరగా ముగించారని బీజేపీ, కాంగ్రెస్ విమర్శించాయి. ఇక పోలీస్స్టేషన్ల వద్ద నిరసనలు పార్టీలకతీతంగా జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో మొదటి అంశంగా ఔట్సోర్సింగ్ కార్మికుల పర్మనెంట్ అంశాన్ని లేవనెత్తి, విషయాన్ని ప్రభుత్వానికి పంపేలా చేసిన కార్పొరేటర్లకు జీహెచ్ఎంఈయూ అధ్యక్షుడు యు,గోపాల్ కృతజ్ఞతలు తెలిపారు. ఇకనుంచి జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో కాకుండా పోలీస్స్టేషన్ల వద్ద నిరసన తెలియజేయాల్సిందిగా గోపాల్ కార్మికులకు పిలుపునిచ్చారు. ఉదయం 5 గంటల నుంచి పోలీస్స్టేషన్ల వద్ద ఉంటూ శాంతియుతంగా సమస్యలపై నిరసన తెలియజేయాలని సూచించారు. సీఐ, ఎస్ఐలకు కార్మికుల సమస్యల గురించి వివరించాలని కోరారు. డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు ఉద్యమం ఆగవద్దన్నారు. -
కార్పొరేటర్లు కాదు.. అధికారులే వాకౌట్
హైదరాబాద్: కార్పొరేటర్లకు బదులుగా అధికారులు సమావేశాన్ని బహిష్కరించి వాకౌట్ చేసిన ఘటన బుధవారం జరిగిన జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో చోటుచేసుకుంది. వాటర్‌బోర్డు అధికారులను తీవ్రంగా అవమానించారంటూ వాటర్‌బోర్డు అధికారులు సమావేశం నుంచి వాకౌట్ చేయగా, వారికి మద్దతుగా జీహెచ్ఎంసీ అధికారులు సైతం తాము కూడా బాయ్‌కాట్ చేస్తున్నామంటూ ప్రకటించి బయటకు వెళ్లిపోయారు. దీంతో మేయర్ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సమావేశం నిర్వహించాలని బీజేపీ సభ్యులు పట్టుబట్టినా మేయర్ వినిపించుకోలేదు. మంగళవారం డ్రైనేజీ సిల్ట్‌ను తీసుకువెళ్లి బీజేపీ కార్పొరేటర్లు వాటర్‌బోర్డు ఎండి కార్యాలయంలో పూలకుండీల్లో వేయడం తెలిసిందే. దీనికి నిరసనగా వాటర్‌బోర్డు అధికారులు వాకౌట్ చేశారు. సమావేశం మొదలైన దాదాపు 20 నిమిషాలకే బీజేపీ సభ్యుల ఆందోళనల మధ్య వాయిదా వేస్తున్నట్లు మేయర్ ప్రకటించడంతో సమావేశం ఎలాంటి చర్చ, ప్రశ్నోత్తరాలు లేకుండానే వాయిదా పడింది. వాయిదా పడ్డాక సైతం కార్పొరేటర్లు, అధికారులు ఎవరికి వారుగా ఎదుటివారి తీరును విమర్శిస్తూ వాదనలు వినిపించారు. ఇంత చేస్తున్నా అవమానిస్తారా? మధ్యాహ్నం 12.30 గంటలకు సమావేశం ప్రారంభమైంది. ఇటీవల మరణించిన ఎమ్మెల్యే సాయన్న, బీజేపీ కార్పొరేటర్ దేవర కరుణాకర్, నాలాలో మరణించిన బాలిక మౌనిక, ఉగ్రవాదుల దాడిలో మరణించిన సైనికులకు సంతాపం తెలుపుతూ సభ్యులు మౌనం పాటించారు. సభాధ్యక్షత వహించిన మేయర్ విజయలక్ష్మి ప్రారంభోపన్యాసం ముగియగానే లంచ్ బ్రేక్ ప్రకటన చేయగా బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చే శారు. అంతలోనే వాటర్ బోర్డు ఈడీ సత్యనారాయణ తనకు మాట్లాడే అవకాశశమివ్వాలంటూ మాట్లాడారు. తాగునీరు, మురుగు నీరు నిర్వహణ పనులు చేస్తున్న తాము 186 కి.మీ నుంచి గోదావరి, 110 కి.మీ నుంచి కృష్ణాలతో పాటు సింగూరు, మంజీరాల నుంచి నీటిని ఇంటింటికీ అందిస్తున్నామని, 200 ఎయిర్‌టెక్ మెషీన్లతో మురుగునీటి సమస్యలు తీరుస్తున్నామని, అయినా తమను అవమానించినందుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నామంటూ వెళ్లిపోయారు. వెంటనే జీహెచ్ఎంసీ కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత లేచి వారికి మద్దతుగా జీహెచ్ఎంసీ అధికారులందరం బాయ్‌కాట్ చేస్తున్నామంటూ ప్రకటించడంతో అందరూ వెళ్లిపోయారు. బీజేపీ సభ్యులు పోడియం వైపు దూసుకెళ్లి సభ జరగాలని పట్టుబట్టినా మేయర్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో అందరూ బయటకు వెళ్లిపోయారు. అధికారులిలా ప్రవర్తిస్తారా?: బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు ప్రజల కోసం పని చేస్తున్న తాము వారి సమస్యలను ప్రస్తావిస్తే పట్టించుకోని అధికారులు సభను బహిష్కరించడం దారుణమని బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు విమర్శించారు. ఎక్కడైనా రాజకీయ నేతలు వాకౌట్ చేస్తారు కానీ.. ప్రజల సమస్యలు పరిష్కరించకుండా ప్రశ్నిస్తే వాకౌట్ చేస్తారా? అంటూ అధికారుల తీరును తప్పుబట్టారు. ఓవైపు నాలాల్లో , అగ్ని ప్రమాదాల్లో, కుక్కకాట్లు, దోమలతో ప్రజలు చస్తున్నా అధికారులకు చీమ కుట్టినట్లయినా లేదని, ప్రజల ఈ సమస్యలు చర్చించాల్సిన సమావేశం జరగకుండా చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ సభ్యులు నాలాల్లో పసిప్రాణాల మరణాలు, కుక్కకాట్ల చావులపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. నల్లదుస్తులతో సభకు.. ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోని జీహెచ్ఎంసీ తీరుకు నిరసనగా బీజేపీ కార్పొరేటర్లు నల్లదుస్తులతో సభకు హాజరయ్యారు. సభ వాయిదా పడ్డాక సైతం కౌన్సిల్ హాల్లోనే ఉన్న బీజేపీ కార్పొరేటర్లు మేయర్ రావాలంటూ డిమాండ్ చేశారు. కరెంట్ తీసేసినా వారు కదలకపోవడంతో, సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో పోలీసులు వారిని అక్కడినుంచి తరలించారు. నిరసన కార్యక్రమం కేటీఆర్‌కు ముందే తెలుసా? అధికారులు నిరసన వ్యక్తం చేయనున్న విషయాన్ని సభకు ముందస్తుగానే వాటర్‌బోర్డు అధికారులు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. వాటర్‌బోర్డులో జరిగిన ఘటనను ఎండీ దానకిశోర్ మంత్రికి వివరించగా, ఏ పార్టీ వారైనా కార్పొరేటర్లు అలా వ్యవహరించడం తగదని మంత్రి సమాధానమిచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అందువల్లే వాటర్‌బోర్డుకు మద్దతుగా జీహెచ్ఎంసీ అధికారులు బాయ్‌కాట్ చేశారంటున్నారు. గతంలో అధికారుల వాకౌట్లు గతంలో మాజిద్ హుస్సేన్ మేయర్‌గా ఉన్నప్పుడు కమిషనర్‌గా ఉన్న సోమేశ్‌కుమార్ సమావేశం నుంచి వాకౌట్ చేసినప్పటికీ, కొద్దిసేపు విరామం తర్వాత పలువురు నచ్చచెప్పడంతో తిరిగి సమావేశాన్ని నిర్వహించారు. సమీర్‌శర్మ కమిషనర్‌గా, బండ కార్తీకరెడ్డి మేయర్‌గా ఉన్నప్పుడు సైతం కమిషనర్ సమావేశం నుంచి వెళ్లిపోయిన ఘటనను కొందరు గుర్తు చేస్తున్నారు. కానీ అధికారులంతా మూకుమ్మడిగా వాకౌట్ చేయడం ఇదే ప్రథమం. మేయర్ వచ్చాకే అధికారులు సభలోకి ప్రవేశించడం ఈ సందర్భంగా గమనార్హం. ప్రజాధనం దుబారా.. ప్రతి సమావేశంలోనూ గందరగోళం సృష్టిస్తూ వాయిదా వేస్తున్నారని, ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని, సమావేశాల సందర్భంగా భోజనాలు, ఇతరత్రా ఖర్చుల పేరిట జీహెచ్ఎంసీ ఖజానాకు రూ.లక్షల ఖర్చు తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. బ్లాక్‌డే: మేయర్ సభ వాయిదా పడ్డాక బీఆర్ఎస్ కార్పొరేటర్లతో కలిసి మేయర్ మీడియాతో మాట్లాడుతూ.. సీటులోకి రాకముందే తనను మహిళ అని కూడా చూడకుండా దూషించారని, అధికారులను సిగ్గుందా? అనడం సమంజసమా అని ప్రశ్నించారు. గతంలో ఎప్పుడూ అప్రజాస్వామిక భాష వాడలేదన్నారు. కార్పొరేటర్లు అధికారులను అవమానించడంతో వారి ఆత్మగౌరవం దెబ్బతిన్నదన్నారు. ఇదొక బ్లాక్‌డే అని వ్యాఖ్యానించారు. మర్యాద ఇవ్వకపోతే పనులు చేయం: మమత కార్పొరేటర్లు అధికారులతో మర్యాదగా ప్రవర్తించకపోతే సహకరించబోమని కూకట్పల్లి జోనల్ కమిషనర్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు మమత తెలిపారు. సభ వాయిదా అనంతరం జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ.. కార్పొరేటర్ల అనుచిత ధోరణికి నిరసనగా సమావేశాన్ని బాయ్‌కాట్ చేశామన్నారు. జీహెచ్ఎంసీ, వాటర్‌బోర్డు అధికారులు కష్టపడి పనిచేస్తున్నా, అందరి ముందూ ఇష్టం వచ్చినట్లు తిడుతూ అధికారులకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదన్నారు. ► గ్రేటర్ నగరంలో ప్రజల ప్రాణాలకు రక్షణలేకుండా పోయిందంటూ బీజేపీ సభ్యులు వ్యంగ్యంగా ప్రదర్శనలు నిర్వహించారు. నన్ను చంపమని కోరేందుకు దోమ వేషంలో వచ్చానంటూ ఒకరు.. మేం కౌన్సిల్ హాల్లోకి వెళ్లాక ఏ అగ్ని ప్రమాదం జరుగుతుందోనని కుటుంబ సభ్యులు ఈ అగ్నిమాపక పరికరాలు ఇచ్చి పంపారని, కార్లలోనూ వీటిని ఉంచారని ఒకరు.. హఠాత్తుగా వానొస్తే చెరువులయ్యే రోడ్లతో కారు కొట్టుకుపోతే మాకు ఈత రానందున రక్షణగా టైర్లు, రక్షణ జాకెట్లు ఇచ్చారని కొందరు వివిధ పరికరాలతో, వేషధారణలతో వచ్చి సమావేశానికి ముందు వ్యంగ్యంగా నిరసనలు వ్యక్తం చేశారు. ► ఈ రకంగానైనా అధికారులకు సిగ్గు వస్తుందేమోననే తలంపుతోనే ఈ ప్రదర్శనలకు దిగామన్నారు. అధికారులు బాయ్‌కాట్ చేయడం సిగ్గుచేటని, మేయర్ కౌన్సిల్‌ను అదుపు చేయలేకపోయారని సభ వాయిదాపడ్డాక కొప్పుల నరసింహారెడ్డి, ఆకుల శ్రీవాణి తదితర కార్పొరేటర్లు మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. మేయర్ అనుమతి లేకుండానే, మేయర్ కుర్చీకి గౌరవమివ్వకుండా అధికారులు ఇష్టానుసారం వాకౌట్ చేయడం తగదని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని, సభను అదుపు చేయలేని మేయర్ దిగిపోవాలని కొందరు డిమాండ్ చేశారు. అధికారులు ఎక్కడా ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేరని, జోన్లలోనూ అవే పరిస్థితులని, ప్రజలకు తాము సమాధానాలు చెప్పలేకపోతున్నామని పేర్కొన్నారు. నగరాన్ని డల్లాస్ చేస్తామని చెప్పినా, నాలాల్లో ప్రాణాలు పోతుండటం వాస్తవం కాదా.. అని ప్రశ్నించారు. వాటర్‌బోర్డు వైఫల్యాలు తెలుపుతూ పూల మొక్కలిచ్చేందుకు వెళ్లిన తమను గూండాల్లా భావించి పోలీస్స్టేషన్లకు తరలిస్తారా అని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్, మేయర్ విజయలక్ష్మి మొద్దునిద్ర వీడాలన్నారు. కొసమెరుపు.. వాటర్‌బోర్డు సమస్యను జీహెచ్ఎంసీ సమావేశంలో లేవనెత్తి సభను రద్దు చేయడమేంటో అంతుచిక్కడంలేదంటూ నగరవాసులు ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా జీహెచ్ఎంసీ సమావేశాలకు వాటర్‌బోర్డు అధికారులు హాజరు కారు. ఏమైనా అత్యవసర సందర్భాల్లోనే సంబంధిత అధికారి మాత్రమే హాజరవుతారు. -
బీజేపీ కార్పొరేటర్ల తీరుపై అధికారుల నిరసన
-
సికింద్రాబాద్ కళాసిగూడలో విషాదంపై మేయర్ విజయలక్ష్మి రియాక్షన్
-
మలబార్ గోల్డ్ & డైమండ్స్‌ను ప్రారంభించిన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
-
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కచ్చితంగా చర్యలు తీసుకుంటాం: మేయర్
-
కుక్కల దాడిలో బాలుడి మృతి బాధాకరం: మేయర్
-
కుక్కల దాడిలో చిన్నారి మృతి బాధాకరం: మేయర్
సాక్షి, హైదరాబాద్: నగరంలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన బాధాకరమన్నారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. ఈ పరిణామంపై సాక్షి వరుస కథనాల నేపథ్యంలో స్పందించిన ఆమె అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వీధి కుక్కలను కంట్రోల్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి పేర్కొన్నారు. నగరంలో కుక్కలను స్టెరిలైజ్ చేసేందుకు.. ప్రతీరోజూ 30 వాహనాలు తిరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఇప్పటిదాకా 4 లక్షల కుక్కలకు స్టెరిలైజ్ చేసినట్లు గణాంకాలు వివరించారామె. నగరంలో ఐదున్నర లక్షలకుపైనే వీధి కుక్కలు ఉన్నట్లు అంచనా వేస్తున్నట్లు ఆమె తెలిపారు. అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందడం బాధాకరమన్న ఆమె.. ఘటనపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అలాగే ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారామె. కుక్కలు ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా తిరుగుతున్నాయో.. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారామె. అంతకు ముందు మేయర్ విజయలక్ష్మి అధికారులతో అత్యవసర భేటీ నిర్వహించారు. ఈ భేటీకి జోనల్ కమిషనర్లు, వెటర్నరీ అధికారులు హాజరయ్యారు. వీధి కుక్కల కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ఆమె అధికారుల నుంచి వివరాలను సేకరించారు. -
కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటనపై విచారణకు ఆదేశం
-
మూడు నెలల్లో నాలా పనులు పూర్తి చేయండి
ఎల్బీనగర్: జోనల్ పరిధిలో చేపట్టిన నాలా నిర్మాణ పనులను మూడు నెలలో పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలలో వరద ముంపు ప్రభావిత ప్రజలకు ఇబ్బంది ఉండకూడదని ప్రభుత్వం రూ.858 కోట్లతో 52 పనులను చేపట్టిందని ఆమె తెలిపారు. ఎల్బీనగర్ జోనల్ స్థాయి సమీక్ష సమావేశం మంగళవారం ఎల్బీనగర్ జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ పంకజతో కలిసి ఆమె నిర్వహించారు. సమావేశంలో ఎల్బీనగర్, హయత్‌నగర్, సరూర్‌నగర్, కాప్రా, ఉప్పల్ సర్కిల్ పరిధిలోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, సమయానికి పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని, రూ.114 కోట్లతో చేపట్టిన పనులు మూడు నెలలో పూర్తి చేయాలన్నారు. పనులు పూర్తయ్యే వరకు ఎవరికీ సెలవులు ఇవ్వొదని సీఈని మేయర్ ఆదేశించారు. టెండర్ ప్రక్రియ పూర్తి కాగానే ఏజెన్సీలు పనులు ప్రారంభించేలా అధికారులు కృషి చేయాలన్నారు. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం కింద 14 పనులు చేపట్టామని, వాటిలో 6 పనులు పూర్తి కాగా , మిగతావి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. శానిటేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ››ఈ విషయంలో ఏఎంహెచ్‌ఓలదే పూర్తి బాధ్యత అని అన్నారు. జోనల్లో మరుగుదొడ్లు వంద శాతం అందుబాటులో ఉండాలని, అవసరమైన చోట మరమ్మతులు చేపట్టాలన్నారు. మున్సిపాలిటీలో ఘన పదార్థాలు రోజు రోజుకూ పెరుగుతున్నందున సమర్థ నిర్వహణకు సర్కిళ్లలో ప్రత్యామ్నాయంగా రెండో స్థాలాన్ని చూసి ఉంచాలని డీసీలకు సూచించారు. ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రధాన రహదారులకు ఉన్న లింకు రోడ్డులను అభివృద్ధి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఎన్డీపీ సీఈ కిషన్, ఎస్ఈలు శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్, అశోక్‌రెడ్డి, సీపీ ప్రసాద్‌రావు, హార్టికల్చర్ డీడీ రాజ్‌కుమార్, ఈఈ ఎలక్ట్రికల్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. వరదనీటి కాలువ పనుల పరిశీలన నాగోలు: ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో దాదాపు 103 కోట్ల 25 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణ పనుల (వరదనీటి కాలువ పనులు)ను మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్‌రెడ్డి, ఎస్ఎన్డీపీ అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. నాగోల్ డివిజన్ పరిధిలోని బండ్లగూడ చెరువు వద్ద జరుగుతున్న పనులను వారు పరిశీలించారు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ, ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయని, ఈ పనులు పూర్తి అయితే నియోజకవర్గ పరిధిలోని కాలనీలు నీట మునిగే సమస్య పరిష్కారమవుతుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఆనంతులరాజిరెడ్డి, చెరుకు ప్రశాంత్, టీఆర్ఎస్ పార్టీ నాగోలు డివిజన్ అధ్యక్షుడు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
GHMC: ఆస్తుల ధ్వంసం, మేయర్ ఆగ్రహం, బీజేపీ కార్పొరేటర్లపై కేసు
సాక్షి, బంజారాహిల్స్: బీజేపీ కార్పొరేటర్లు తమ అనుచరులతో కలిసి జీహెచ్ఎంసీ ఆస్తులను ధ్వంసం చేయడం హేయమైన చర్య అని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. ప్రజాప్రతినిధులుగా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రజాస్వామ్య పద్ధతిలో అనేక మార్గాలు ఉన్నప్పటికీ మన కార్పొరేషన్ ఆస్తులను మనమే ధ్వంసం చేయడం సరికాదన్నారు. బంజారాహిల్స్‌లోని మేయర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్ విజయలక్ష్మి మాట్లాడారు. ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజల ఆస్తిని ధ్వంసం చేయడంపై బీజేపీ కార్పొరేటర్లు ఆత్మపరిశీలన చేసుకోవాలని, రాజ్యాంగ పరమైన పదవిలో ఉండి ఇలాంటి దాడులకు పాల్పడితే ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం పోతుందన్నారు. చదవండి: GHMC: రణరంగంగా మారిన మేయర్ చాంబర్.. తనను కలిసేందుకు అనుమతి ఇచ్చినప్పటికీ రాకపోవడంపై బీజేపీ కార్పొరేటర్లు సమాధానం ఇవ్వాలన్నారు. ఆ విషయాన్ని కూడా రాజకీయం చేస్తూ ఇలాంటి దాడులకు పాల్పడటం సరికాదన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు, కార్పొరేటర్లు ప్రజా సమస్యలపై స్పందించి వెంటనే పరిష్కరించటంలో రాజీపడటం లేదన్నారు. తాను నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో లోతట్టు ప్రాంతాలు సందర్శించి అధికారులను, ప్రజలను అప్రమత్తం చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఎల్బీనగర్ జోన్‌లోని సరూర్‌నగర్ ప్రాంతం ఎక్కువ ముంపునకు గురైన సందర్భంలో వెల్ఫేర్ అసోసియేషన్, కార్పొరేటర్లు, అధికారులతో సమీక్ష చేసి తాత్కాలిక, శాశ్వత పరిష్కార చర్యలు తీసుకున్నామని తెలిపారు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో జూన్ 29న వర్చువల్ ద్వారా జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా కార్పొరేటర్లు విన్నవించిన సమస్యలను పరిష్కరించినట్లు స్పష్టం ఆమె స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించలేకపోతున్నామని, ఈ విషయం బీజేపీ కార్పొరేటర్లకు తెలిసినప్పటికీ కావాలనే దాడి చేశారని అన్నారు. కార్పొరేటర్లు సహా 20 మందిపై కేసు ఖైరతాబాద్: జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కుర్చీలు, పూల కుండీలు, టేబుల్, అద్దాలను ధ్వంసం చేయడంతో బీజేపీ కార్పొరేటర్లు సహా 20 మందిపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
GHMC: రణరంగంగా మారిన మేయర్ చాంబర్..
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించాలని, కార్పొరేటర్లకు బడ్జెట్ కేటాయించాలనే డిమాండ్లతో బీజేపీ కార్పొరేటర్లు తమ అనుచరులతో మేయర్ విజయలక్ష్మి కార్యాలయంలోనికి చొచ్చుకుపోవడం రణరంగాన్ని తలపించింది. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో తీవ్ర తోపులాట జరిగింది. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్లు కమిషనర్ చాంబర్ వద్దకు చేరుకున్నారు. అక్కడ గుంపుగా పోగైన వారు జనరల్ బాడీ సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేస్తూ కాసేపు బైఠాయించారు. అక్కడి నుంచి మేయర్ చాంబర్‌వైపు వెళ్లారు. కార్పొరేటర్లతో పాటు వారి అనుచరులు దాదాపు రెండొందల మంది వరకు గుంపులుగా చేరడాన్ని గుర్తించిన పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ముందుకు దూసుకువెళ్తూ వరండాలోని పూలకుండీలను ధ్వంసం చేశారు. చదవండి: కుంకుమ పువ్వు సాగుపై కేటీఆర్ ప్రశంస మేయర్ అప్పటికింకా కార్యాలయానికి రాలేదు. ఆమె చాంబర్లోకి వెళ్లి ఫర్నిచర్‌ను, ల్యాంపులు, పూలకుండీలను ధ్వంసం చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ల నేమ్‌బోర్డులు పీకిపారేశారు. కేబుల్‌వైర్లు తెంపారు. జీహెచ్ఎంసీ పేరున్న బోర్డుపై నల్లరంగు పూశారు. చాంబర్లో బైఠాయించారు. మేయర్‌కో హటావో.. జీహెచ్ఎంసీ బచావో తదితర నినాదాలతో కూడిన పోస్టర్లను చాంబర్లో అంటించారు. మెరుపు ధర్నాతో కాసేపు ఏం జరుగుతోందో అక్కడున్నవారికి అర్థం కాలేదు. ఈ పరిణామాలతో దాదాపు రెండు గంటల పాటు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చదవండి: ఎంకి పెళ్లి సుబ్చి చావుకొచ్చిందన్నట్టు.. వారికి సంతోషమే.. కానీ.. పగిలిపోయిన పూలకుండీలను ఒకచోటకు చేరుస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది కార్పొరేటర్లుగా ఎన్నికై ఏడాదవుతున్నా ఇంతవరకు సమావేశాలు నిర్వహించలేదని, కార్పొరేటర్లకు బడ్జెట్ కేటాయించలేదని నినాదాలు చేశా రు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీస్ జులుం నశించాలని నినదించారు. సమస్యలు పరిష్కరించకపోతే కేసీఆర్, కేటీఆర్ కార్యాలయాలను ముట్టడిస్తామన్నారు. ఒకసారి నిర్వహించిన వర్చువల్ సమావేశంలో తమ వాణి వినిపించలేకపోయామన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించాలని, సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజాసమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పోలీసులు బీజేపీ నేతలు, వారి అనుయాయులను అరెస్టు చేశారు. -
నాకు తెలియకుండానే ప్రారంభిస్తారా? మేయర్ అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: తనకు తెలియకుండానే పనులు జరుగుతుండటంపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని ఇంజినీరింగ్ పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు తనకు తెలియకుండానే, తనకు ఆహ్వానం లేకుండానే జరగడంతో ప్రొటోకాల్ పాటించడం లేరని అసహనానికి గురైన మేయర్ విషయాన్ని కమిషనర్, ఇంజినీరింగ్ ఉన్నతాధికారులకు తెలియజేశారు. వివరణ కోరుతూ కమిషనర్ లోకేశ్‌కుమార్ సదరు పనులు జరిగిన నాలుగు జోన్లకు చెందిన డీఈఈలు, ఈఈలతో పాటు ఎస్ఈలకు కూడా మెమోలు జారీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంబంధిత అధికారులు ఇప్పటికే తమ వివరణలు కూడా పంపినట్లు సమాచారం. -
వివాదాల్లో మేయర్ గద్వాల్.. సోషల్ మీడియాలో విమర్శలు
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ మేయర్‌గా పదవీబాధ్యతలు స్వీకరించి ఇంకా నెలరోజులు కాలేదు...అప్పుడే గద్వాల్ విజయలక్ష్మి వార్తల్లో వ్యక్తిగా మారారు. ఆమె మాటలు, చేతలు ఎందుకనోగానీ వివాదాస్పదంగా మారుతున్నాయి. ముఖ్యంగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మేయర్ హోదాలో ఒక టీవీ చానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వరదలపై చేసిన వ్యాఖ్యలు, అందుకు ఆమె ప్రతిస్పందన జనం ఇంకా మరచిపోక ముందే జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఎన్నికల కరపత్రాల పంపిణీ వివాదానికి తావిచ్చింది. తాజాగా క్యాంప్ ఆఫీస్‌కు (ఇంటికి) 25 కేవీ జనరేటర్ కావాలంటూ కమిషనర్‌కు నోట్ పెట్టడం దుమారం రేపుతోంది. ఓవైపు ప్రభుత్వం 24 గంటలపాటు కోతల్లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెబుతుంటే, తరచూ విద్యుత్ కోతల వల్ల పనులకు అంతరాయం కలుగుతూ, రోజువారీ పనుల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ‘నోట్’లో పేర్కొన్నారు. ఈ నెల 2వ తేదీన ఆమె రాసిన ఈ నోట్ కాపీ వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది. దీంతో, శుక్రవారం సాయంత్రం వివరణనిస్తూ మేయర్ విజయలక్ష్మి పత్రికా ప్రకటన జారీ చేశారు. తన నివాసం వద్ద విద్యుత్లైన్ల నిర్మాణానికి తవ్వకాలు జరుగుతున్నందున విద్యుత్ అంతరాయం కలుగుతోందని, అందువల్లే తాత్కాలికంగా విద్యుత్ జనరేటర్ ఏర్పాటు చేయాల్సిందిగా కమిషనర్‌ను కోరినట్లు పేర్కొన్నారు. అంతేతప్ప నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉందని తాను పేర్కొన్నట్లుగా కొన్ని ప్రసారమాధ్యమాల్లో వస్తున్న కథనాలు అవాస్తవమని, ప్రజలను తప్పుదారి పట్టించేవిధంగా ఉన్న వీటిపై తానూ తీవ్ర వ్యధ చెందుతున్నానని వివరించారు. బయటకు పొక్కడంపై ఆరా.. ఇదిలా ఉండగా, కమిషనర్‌కు మేయర్ పంపిన నోట్ ప్రతి బయటకు ఎలా వెళ్లిందని జీహెచ్ఎంసీ అధికారులు ఆరా తీస్తున్నారు. సదరు సదుపాయం సమకూర్చేందుకుగాను నోట్ కాపీ ఎవరెవరి దగ్గరకు వెళ్లింది..ఎక్కడ లీకై ఉంటుందా అని ఆరా తీస్తున్నారు. మేయర్ గౌరవ వేతనం రూ.50 వేలు, కార్పొరేటర్లకు రూ.6 వేలు పాలకమండలి సభ్యుల జీతభత్యాలూ చర్చనీయాంశంగా మారాయి. కార్పొరేటర్లకు నెలకు రూ.6 వేల గౌరవ వేతనం ఉండగా, మేయర్‌కు రూ.50 వేలు, డిప్యూటీ మేయర్‌కు రూ.25 వేలుగా ఉంది. రూ.4 వేల ఫోన్‌బిల్లుతోపాటు కార్పొరేటర్ కుటుంబానికి రూ.5 లక్షల వరకు మెడికల్ ఇన్సూరెన్స్ సదుపాయం ఉంటుంది. మేయర్, డిప్యూటీ మేయర్లకు వాహనాల సదుపాయంతోపాటు కార్యాలయ ఖర్చులు కూడా చెల్లిస్తున్నారు. తమ గౌరవ వేతనాలు పెంచాల్సిందిగా గత పాలకమండలి నుంచే కార్పొరేటర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గౌరవ వేతనమనేది జీతం కాదని, ప్రజాసేవ చేస్తామని వచ్చేవారు ఎక్కువగా ఆశించవద్దని అభిప్రాయపడుతున్న వారూ ఉన్నారు. పన్నులు వసూలు చేయొద్దు: బీజేపీ కార్పొరేటర్లు గత సంవత్సరం నుంచి కరోనా వల్ల ప్రజల ఆర్థిక పరిస్థితులు దిగజారినందున ఆస్తిపన్ను వసూళ్లు, ట్రేడ్‌లైసెన్సుల ఫీజులు వసూలు చేయరాదని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. ఈమేరకు వారు శుక్రవారం జీహెచ్ఎంసీ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. చదవండి: మేయర్ అసంతృప్తి.. అస్సలు బాలేదంటూ కామెంట్ -
మేయర్ అసంతృప్తి.. అస్సలు బాలేదంటూ కామెంట్
సాక్షి, హైదరాబాద్ : ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్‌లో హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతీసేలా కేంద్రం ర్యాంకింగ్ ఇచ్చిందని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి వ్యాఖ్యానించారు. భారతదేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరాల జాబితాను ఇటీవల కేంద్ర విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై మేయర్ స్పదింస్తూ.. సులభతరం జీవనం ర్యాంకింగ్‌లో నగరానికి కేంద్రం 24వ స్థానం ఇవ్వడం సరికాదన్నారు. ముత్యాల నగరంగా పేరొందిన హైదరాబాద్.. దేశంలోని అన్ని మెట్రో నగరాల కన్నా అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే నగర ర్యాంకింగ్‌ను తగ్గించారని విమర్శించారు. 24వ ర్యాంక్‌ను హైదరాబాదీలు అంగీకరించరని విజయలక్ష్మి చెప్పారు. చదవండి: ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్: టాప్ ప్లేస్‌లో బెంగళూరు ఇదిలా ఉండగా.. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్-2020ను కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. నగరాల్లో జీవనం సాగించేందుకు అనుకూల పరిస్థితులకు అనుగుణంగా ఈ ర్యాంకులను కేటాయించింది. మిలియన్‌కు(10 లక్షల) పైగా జనాభా ఉన్న నగరాల్లో బెంగళూరు మొదటి స్థానంలో నిలవగా.. ఆ తరువాతి స్థానాల్లో పుణె, అహ్మదాబాద్ ఉన్నాయి. అయితే 13వ స్థానంలో ఢిల్లీ, 15వ స్థానంలో విశాఖ ఉంగా హైదరాబాద్ 24వ స్థానంలో నిలిచింది. చదవండి: నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు: మేయర్ గుజరాత్‌కేనా.. హైదరాబాద్‌కు ఆ అర్హత లేదా? -
జీహెచ్ఎంసీ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన విజయలక్ష్మి
-
జీహెచ్ఎంసీ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన విజయలక్ష్మి
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ మేయర్‌గా గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని 7వ అంతస్తులోని మేయర్ చాంబర్లో విజయలక్ష్మి, ఒకటవ అంతస్తులోని డిప్యూటీ మేయర్ చాంబర్లో శ్రీలత సర్వమత ప్రార్థనల అనంతరం పదవీ బాధ్యతలు తీసుకునే ఫైళ్లపై తొలి సంతకాలు చేశారు. రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, మహమూద్‌అలీ, ఈటల రాజేందర్, ఎంపీ కె.కేశవరావు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, పలువురు కార్పొరేటర్లు మేయర్, డిప్యూటీ మేయర్లను అభినందించారు. నగరంలోని పలువురు ప్రముఖులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల కోసం పనిచేస్తా : మేయర్ విజయలక్ష్మి నగర ప్రజలకు సేవ చేసేందుకు తన శక్తి సామర్థ్యాలను పూర్తిస్థాయిలో వినియోగిస్తానని సోమవారం మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన గద్వాల్ విజయలక్ష్మి ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. హైదరాబాద్ నగర మేయర్‌గా ప్రమాణం చేయడం తనకు లభించిన సంపూర్ణ గౌరవమని, అందుకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: షేక్‌పేట తహసీల్దార్.. బదిలీ రగడ! -
నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు: మేయర్
సాక్షి, బంజారాహిల్స్: నగరంలో వందేళ్లలో ఎన్నడూ రానంత రికార్డు స్థాయిలో గత ఏడాది అక్టోబర్‌లో కురిసిన వర్షాలతో వరదలతో నగర జనజీవనం అతలాకుతమైంది. అంతటి భారీ వర్షాలు, వరదలు రాకుండా చూడాలని దేవుణ్ని వేడుకుంటానని చెప్పే క్రమంలో తన వ్యాఖ్యలను వక్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశారని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. మంగళవారం బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇటీవల ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మాటలను వక్రీకరించి తప్పుడు సంకేతాలు వెళ్లేలా వైరల్ అవుతున్నాయన్నారు. హైదరాబాద్ నగరంలో వరదలు రావొద్దు అనేది మాత్రమే తన మనోగతమని, మొత్తానికే వర్షాలు రావొద్దని కాదని ఆమె స్పష్టం చేశారు. ఇక షేక్‌పేట తహసీల్దార్ బదిలీ వ్యవహారంలో రాజకీయ ప్రమేయమేమీ లేదని చెప్పారు. తనపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదన్నారు. బదిలీలనేవి రెవెన్యూ శాఖ చూసుకుంటుందని, దాంట్లో తనకు ఎలాంటి పాత్ర లేదని మేయర్ విజయలక్ష్మి స్పష్టం చేశారు. చదవండి: మేయర్ వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో వైరల్ మేయర్ ఎన్నిక: వారు అలా.. వీరు ఇలా.. -
జీహెచ్ఎం'షీ టీమ్'
-
మేయర్ ఎన్నిక: వారు అలా.. వీరు ఇలా..
సాక్షి, సిటీబ్యూరో: ఎన్నో సంశయాలు.. ఊహాగానాలు.. మరెన్నో అంచనాలను పటాపంచలు చేస్తూ జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పోటీ జరిగినప్పటికీ.. మేయర్ ఎన్నికకు 4, డిప్యూటీ మేయర్ ఎన్నికకు 4 నిమిషాలు చొప్పున 8 నిమిషాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. మొత్తం ఎన్నికల ప్రక్రియ 20 నిమిషాల్లోనే ముగిసింది. గురువారం ఉదయం 11 గంటలకు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం, అది ముగిశాక 12.30 గంటలకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఎన్నికలు పూర్తి చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను టీఆర్ఎస్ సునాయాసంగా గెలుచుకుంది. మేయర్‌గా రాజ్యసభ సభ్యుడు కేశవరావు కుమార్తె, బంజారాహిల్స్ డివిజన్ కార్పొరేటర్ గద్వాల విజయలక్షి్మ, డిప్యూటీ మేయర్‌గా టీఆర్ఎస్ నాయకుడు మోతె శోభన్‌రెడ్డి సతీమణి మోతె శ్రీలతారెడ్డి ఎన్నికయ్యారు. ఎంఐఎం సభ్యులు టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించారు. టీఆర్ఎస్కు 32 మంది ఎక్స్అఫీషియో సభ్యులున్నప్పటికీ అందరూ హాజరు కాలేదు. విప్‌కు అనుగుణంగానే అందరూ వ్యవహరించారని విప్ జారీ చేసిన ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్‌రావు తెలిపారు. టీఆర్ఎస్కు తగినంత బలమున్నందున ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో విని యోగించుకునేందుకు వీలుగా పారీ్టయే వారిని రావద్దని సూచించినట్లు తెలిపారు. హాజరుకాని వారిలో లోక్‌సభ సభ్యుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు బి.లక్ష్మీనారాయణ, ఫరీదుద్దీన్, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ తదితరులున్నారు. రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్‌కు మాత్రం విప్ జారీ కాలేదని సమాచారం. ఆయన సమావేశానికి హాజరు కాలేదు. మేయర్‌గా ఎన్నికయ్యాక గద్వాల విజయలక్ష్మి సభలోనే ఉన్న తన తండ్రి కేశవరావుకు పాదాభివందనం చేశారు. అనంతరం సభ్యులందరికీ విడివిడిగా ధన్యవాదాలు తెలిపారు. సన్నిహితులను ఆలింగనం చేసుకున్నారు. చేతులెత్తే పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్థులకు టీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులంతా ఓట్లు వేశారు. బీజేపీ అభ్యర్థులకు కేవలం బీజేపీ సభ్యులు మాత్రమే ఓట్లు వేశారు. జీహెచ్ఎంసీలో మొత్తం 150 మంది కార్పొరేటర్లుండగా, లింగోజిగూడ కార్పొరేటర్ మృతి చెందడంతో ప్రస్తుతం 149 మంది ఉన్నారు. వీరిలో ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు ఎన్నికలో పాల్గొనలేదు. మిగతా 147 మంది కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఎక్స్అఫిషియో సభ్యులుగా ఓటున్న అయిదుగురు రాజ్యసభ సభ్యుల్లో డి.శ్రీనివాస్, వి.లక్ష్మీకాంతరావు హాజరు కాలేదు.15 మంది ఎమ్మెల్సీల్లో 10 మంది, 21 మంది ఎమ్మెల్యేల్లో 20 మంది హాజరైనట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది. ఎంపీలు కిషన్‌రెడ్డి, అసదుద్దీన్ ఒవైసీ సైతం పోలింగ్‌లో పాల్గొనలేదు. ఎమ్మెల్సీ కవిత పలువురికి సూచనలిస్తూ కనిపించారు. మంత్రి తలసాని పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ టీఆర్ఎస్ సభ్యులకు సూచనలిచ్చారు. చదవండి: ‘మమ్మీ కంగ్రాట్చులేషన్, ఐ లవ్యూ’ మేయర్ పదవి ఆశించింది వాస్తవమే: మోతె శ్రీలతారెడ్డి తెలిసినా తగ్గలేదు సాక్షి, సిటీబ్యూరో: మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ తమవద్ద లేదని తెలుసు. అయినా బీజేపీ తమ అభ్యర్థులను మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు బరిలోకి దించింది. అప్పటి వరకు పైకి చూసేందుకు ఎవరికి వారే అన్నట్లుగా ఉన్న అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష మజ్లిస్‌లు తీరా ఓటింగ్ సమయం ఒక్కటవడంతో ఆ పారీ్టకి ఓటమి తప్పలేదు. ఎన్నికల సమయంలో ఆ రెండు పారీ్టలు పన్నిన కుట్రలను, కొనసాగిస్తూ వస్తున్న అంతర్గత సంబంధాలను బహిర్గతం చేయడంలో బీజేపీ సక్సెస్ అయింది. కౌన్సిల్ వేదికగా అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష మజ్లిస్ల అపవిత్ర పొత్తులను బహిర్గతం చేసి ఆందోళనకు దిగింది. ఆ రెండు పార్టీలపై తీవ్రంగా మండిపడింది. సంఖ్యాబలం లేదని తెలిసీ.. ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 56 స్థానాలను కైవసం చేసుకోగా, బీజేపీ 48 స్థానాలు, కాంగ్రెస్ 2 స్థానాలు, ఎంఐఎం 44 స్థానాలను కైవసం చేసుకుంది. వీరిలో లింగోజిగూడ కార్పొరేటర్ ఆకుల రమేష్‌గౌడ్ ప్రమాణ స్వీకారాణికి ముందే మృతి చెందారు. దీంతో బీజేపీ సీట్ల సంఖ్య 47కు చేరింది. ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు. దీంతో మేయర్ ఎన్నికకు ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారాయి. అధికార టీఆర్ఎస్కు ఎక్స్‌అఫిíÙయో ఓట్లు 32 ఉండగా, బీజేపీకి 2, ఎంఐఎంకు 10 ఉన్నాయి. అయితే అధికార టీఆర్ఎస్కు కార్పొరేటర్ సహా ఎక్స్ అఫిషియో ఓట్లు ఎక్కువే. తీరా ఓటింగ్ సమయంలో ఎంఐఎం మ ద్దతు తెలుపడంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను ఆ పార్టీ సునాయాసంగా దక్కించుకుంది.