GHMC Mayor Elections 2021 Live Updates: Mayor And Deputy Mayor Polls Today - Sakshi
Sakshi News home page

GHMC Mayor Election: మేయర్‌గా కేకే కుమార్తె

Published Thu, Feb 11 2021 8:24 AM | Last Updated on Thu, Feb 11 2021 2:38 PM

Hyderabad GHMC Mayor Election LIVE Updates, 2021 - Sakshi

Time 12:35
టీఆర్‌ఎస్‌ పార్టీ సినియర్‌ నేత, రాజ్యసభ సభ్యులు కే కేశవరావు కుమార్తె విజయలక్ష్మి జీహెచ్‌ఎంసీ మేయర్‌గా ఎన్నికయ్యారు. విజయలక్ష్మి అభ్యర్థిత్వాన్ని మాజీ డిప్యూటీ మేయర్‌ బాబా ఫసీవుద్దీన్‌ ప్రతిపాదించారు. బీజేపీ నుంచి ఆర్కేపురం కార్పొరేటర్‌ రాధాధీరజ్‌రెడ్డి పేరును ఆ పార్టీ సభ్యులు ప్రతిపాదించారు. మేయర్‌ పీఠం కోసం ఇద్దరు అభ్యర్థులు మాత్రమే పోటీ పడ్డారు. సభ్యులు చేతులెత్తి మేయర్‌ను ఎన్నుకున్నారు. సంఖ్యాపరంగా టీఆర్‌ఎస్‌కు ఎక్కువమంది సభ్యుల మద్దతు ఉండటంతో మేయర్‌ పీఠాన్ని టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది.

Time 11:10 AM
హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతామహంతి సమావేశాన్ని ప్రారంభించారు. సమావేశానికి హాజరైన సభ్యులకు తొలుత ఆమె ధన్యవాదాలు తెలిపారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఒక్కో పార్టీలతో కూడిన సభ్యులు ఓ గ్రూపుగా ఏర్పడి ప్రమాణం చేస్తామని కొందరు కోరారు. భాషల ప్రతిపాదికన గ్రూపులుగా ఏర్పడిన ప్రమాణం చేస్తామని మరికొందరు కోరారు. కలెక్టర్‌ శ్వేతామహంతి దానికి అంగీకరించారు. భాష ప్రకారంలో సభ్యులంతా సామూహికంగా ఏర్పడి ప్రమాణం చేశారు. కౌన్సిల్‌ హాల్‌లో శ్వేతా మహంతి కార్పొరేటర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. 12:30 నిమిషాలకు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక జరుగనుందని కలెక్టర్‌ తెలిపారు. సభ్యులంతా పది నిమిషాల ముందు కౌన్సిల్‌ హాల్‌లోకి రావాలని సూచించారు.

  • తొలుత తెలుగు భాషలో సభ్యులు ప్రమాణం చేశారు.
  • అనంతరం ఉర్దూ భాషలో మాట్లాడే సభ్యులు ప్రమాణం చేశారు.
  • మూడో విడతలో హిందీలో మాట్లాడే సభ్యులు ప్రమాణం చేశారు.
  • చివరిగా ఇంగ్లీష్‌ భాషలో మాట్లాడే సభ్యులు ప్రమాణం చేశారు.

పార్టీ నేతలతో ముఖ్య సమావేశం అనంతరం అన్ని పార్టీల కార్పొరేటర్లు, ఎక్స్‌ అఫిషియో సభ్యులు జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి చేరుకున్నారు. నూతన కార్పొరేటర్లు పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమైంది. మొత్తం 149 మంది సభ్యులు ప్రమాణం చేయనున్నారు. సభ్యుల ప్రమాణం అనంతరం మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులకు ఎన్నిక జరుగనుంది. 


Time 10:37 Am
తెలంగాణ భవన్‌లో ముఖ్య సమావేశం అనంతరం టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ల జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రత్యేక బస్సులో జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌కు చేరుకున్నారు. మరోవైపు ఎంఐఎం కార్పొరేటర్లు దారుసలాం నుంచి జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌కు బయల్దేరారు. బషీర్‌బాగ్‌ నుంచి బీజేపీ కార్పొరేటర్లు సైతం జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి చేరుకున్నారు. కాసేపట్లో సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ‍ప్రారంభం కానుంది.

Time 10:4 Am
జీహెచ్‌ఎంసీ కొత్త పాలకమండలి భేటీ కాకముందే సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాణస్వీకారానికి ముందు కనీసం కరోనా టెస్టులు కూడా చేయలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే లింగోజీ కూడా కార్పొరేటర్‌ కరోనాతో మరణించడం సభ్యులను కలవరానికి గురిచేస్తోంది. కౌన్సిల్‌ హాల్‌లో కనీసం సామాజిక దూరం కూడా పాటించలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 193 మంది సభ్యులతో పాటు 34 మంది ఆఫీసర్లు, మరొక 20 మంది ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. హాలులో దాదాపు మూడు గంటల పాటు 250 మంది వరకు ఉంటున్న నేపథ్యంలో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

TIME 10 AM
నూతన కార్పొరేటర్లు, ఎక్స్‌​ అఫిషియో సభ్యులతో తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సమావేశం ముగిసింది. అక్కడి నుంచి సభ్యులంతా జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి బయలుదేరారు. ఈ సమావేశంలో సభ్యులకు మంత్రి కేటీఆర్‌ కీలక సూచనల చేశారు.

TIME 9:40
టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. కార్పొరేటర్లు, ఎక్స్‌ అఫీషియో సభ్యులతో భేటీ అ‍య్యారు. మేయర్‌ ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చిస్తున్నారు. సభ్యులకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా హాజరయ్యారు.


TIME 9:04
జీహెచ్‌ఎంసీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ అభ్యర్థులు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత శోభన్‌రెడ్డిని అధిష్టానం ఖరారు చేసినట్లు సమాచారం. బంజారాహిల్స్‌ కార్పొరేటర్‌ గద్వాల విజయలక్ష్మి ప్రాతినిథ్యం వహిస్తుండగా..  మోతె శ్రీలత శోభన్‌రెడ్డి తార్నాక కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు.

TIME 8:47
బషీర్‌బాగ్‌ సమీపంలోని ముత్యలమ్మ ఆలయానికి  చేరుకుంటున్న బీజేపీ కార్పొరేటర్లు. వారితో పాటు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ అక్కడికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనల అనంతరం బయలుదేరనున్నారు.

TIME 8:40
తెలంగాణ భవన్‌కు చేరుకుంటున్న నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు. మేయర్‌ ఎన్నికలో భాగంగా ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారితో సమావేశం కానున్నారు. అనంతరం జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి చేరుకోనున్నారు.



  • అర్హత కలిగిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ గుర్తింపు కార్డులు ధరించి అధికారులకు సహకరించాల్సిందిగా సూచించారు. వారిని గుర్తించేందుకు ఉన్నతాధికారులు ప్రవేశద్వారం వద్ద ఉంటారు.  
  • కార్పొరేటర్లు వారు ఎన్నికైనట్లు తెలిపే ధ్రువీకరణ పత్రాన్ని, ప్రిసైడింగ్‌ అధికారి జారీ చేసిన నోటీసును తీసుకొని రావాల్సిందిగా కోరారు.  
  • వారు హాల్‌లోకి ప్రవేశించి రిజిస్టర్‌లో సంతకాలు చేస్తారు. వారు ఎక్కడ కూర్చోవాలో సంబంధిత వరుసను ఆఫీసర్లు సూచిస్తారు. ఇందుకు 34 మందిని నియమించారు.  
  • ప్రమాణం చేసేందుకు తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, హిందీ భాషల్లో ప్రమాణ పత్రాలు సిద్ధం చేశారు. తొలుత తెలుగులో ప్రమాణం చేయాలనుకున్న వారందరితో ఒకేసారి చేయిస్తారు. తర్వాత మిగతా భాషల వారీగా చేయిస్తారు. కొత్త కార్పొరేటర్లు తాము ఎంచుకునే భాషలో ప్రమాణ పత్రాన్ని ముందుగానే చదువుకొని రిహార్సల్‌ చేసుకుంటే తప్పులు దొర్లకుండా ఉంటుందని సూచించారు.
     
  • ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారి శ్వేతామహంతి, ఎన్నికల సంఘం నియమించిన  అబ్జర్వర్‌ సందీప్‌ సుల్తానియా మాత్రమే వేదికపై కూర్చుంటారు. 
  • ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. దాదాపు 500 మంది పోలీసు సిబ్బంది విధుల్లో ఉండనున్నారు. నిజాం కాలేజీ, ఎమ్మెల్యే క్వార్టర్లలో పార్కింగ్‌ చేయాల్సిందిగా సూచించారు. 
  • అన్నీ సజావుగా సాగితే మధ్యాహ్నం రెండుగంటలకు అటూఇటూగా కార్యక్రమం పూర్తికావచ్చని  భావిస్తున్నారు.  
  • జీహెచ్‌ఎంసీ ఏర్పాటయ్యాక జరగుతున్న రెండో ఎన్నిక ఇది.
  •  టీఆర్‌ఎస్‌తోపాటు ఎంఐఎం, బీజేపీలు విప్‌ జారీకి సభ్యులను నియమించాయి. 

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ ఎంపికకు రంగం సిద్ధమైంది. గురువారం మధ్యాహ్నం 12:30 నిమిషాలకు కొత్త నగరానికి కొత్త మేయర్‌ ఎన్నిక కానున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సీల్డ్‌ కవర్‌లో నూతన మేయర్‌, డిప్యూటీ మేయర్‌లను పంపించనున్నారు. అంతకుముందు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, ఎక్స్‌ అఫీషియో సభ్యులతో కేసీఆర్‌ తెలంగాణ భవన్‌లో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు హోదాలో మంత్రి కేటీఆర్‌ హాజరుకానున్నారు. గ్రేటర్‌ బరిలో ప్రధానంగా నిలిచిన అధికార టీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ, ఎంఐఎంలకు స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఈ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 150 స్థానాలకు కాగా.. టీఆర్ఎస్‌ నుంచి 56 మంది కార్పొరేటర్లు గెలిచారు. 32 మంది ఎక్స్‌అఫిషియో సభ్యులు ఉన్నారు. ఎంఐఎంకు 44 మంది కార్పొరేటర్లు 10 మంది ఎక్స్‌ అఫిషియో సభ్యులు ఉన్నారు. ఇక బీజేపీకి 48 మంది కార్పొరేటర్లు ఉండగా.. ఇద్దరు ఎక్స్‌అఫిషియో సభ్యులు కిషన్‌రెడ్డి, రాజాసింగ్‌ ఓటు హక్కును కలిగి ఉన్నారు.

గ్రేటర్‌ మేయర్‌ ఎంపిక.. Updates

  • జీహెచ్ఎంసీ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తి.
  • ఐదు వందల మంది పోలీసులతో భద్రత
  • ఉదయం 10:45 కి జిహెచ్ ఎంసి కార్యాలయానికి కార్పొరేటర్లు చేరుకోవాలి
  • 11 గంటల నుంచి నాలుగు భాషల్లో ప్రమాణ స్వీకారం ప్రారంభం అవుతుంది
  • 12:30 వరకు అందరి చేత ప్రమాణ స్వీకారం పూర్తి చేస్తారు
  • 12:30 నుండి మేయర్ ఎన్నిక ప్రారంభం అవుతుంది
  • సభలో 97 మంది సభ్యలు ఉంటే మేయర్ ఎన్నికను ప్రారంభిస్తారు
  • హాజరైన వారిలో ఎక్కువ మంది ఎవరికి చేతులు లేపి ఆమోదాన్ని తెలియజేస్తారో వారే మేయ
  • ఇదే పద్దతిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement