GHMC Elections 2020
-
జీహెచ్ఎంసీ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన విజయలక్ష్మి
-
జీహెచ్ఎంసీ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన విజయలక్ష్మి
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ మేయర్‌గా గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని 7వ అంతస్తులోని మేయర్ చాంబర్లో విజయలక్ష్మి, ఒకటవ అంతస్తులోని డిప్యూటీ మేయర్ చాంబర్లో శ్రీలత సర్వమత ప్రార్థనల అనంతరం పదవీ బాధ్యతలు తీసుకునే ఫైళ్లపై తొలి సంతకాలు చేశారు. రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, మహమూద్‌అలీ, ఈటల రాజేందర్, ఎంపీ కె.కేశవరావు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, పలువురు కార్పొరేటర్లు మేయర్, డిప్యూటీ మేయర్లను అభినందించారు. నగరంలోని పలువురు ప్రముఖులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల కోసం పనిచేస్తా : మేయర్ విజయలక్ష్మి నగర ప్రజలకు సేవ చేసేందుకు తన శక్తి సామర్థ్యాలను పూర్తిస్థాయిలో వినియోగిస్తానని సోమవారం మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన గద్వాల్ విజయలక్ష్మి ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. హైదరాబాద్ నగర మేయర్‌గా ప్రమాణం చేయడం తనకు లభించిన సంపూర్ణ గౌరవమని, అందుకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: షేక్‌పేట తహసీల్దార్.. బదిలీ రగడ! -
అమెరికా పౌరసత్వాన్ని వదిలేసుకున్న విజయలక్ష్మి
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ నూతన మేయర్‌గా టీఆర్ఎస్ అభ్యర్థి గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. మేయర్ పీఠం కోసం పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆమె వైపు మొగ్గు చూపింది. సీనియర్ నేత, కేసీఆర్ సన్నిహితుడు కేశవరావు కూతురైన విజయలక్ష్మి.. బంజారాహిల్స్ డివిజన్ 93 కార్పొరేటర్‌గా రెండు సార్లు ఎన్నికయ్యారు. ఈ సారి ఏకంగా మేయర్ పీఠాన్ని అధిరోహించారు. ఆమె వ్యక్తిగత వివరాలు ఇలా ఉన్నాయి... బాల్యం, విద్యాభ్యాసం.. కేశవరావు కుమార్తె అయిన విజయలక్ష్మి బాల్యం, విద్యాభ్యాసం మొత్తం అంతా హైదరాబాద్‌లోనే సాగింది. హోలీ మేరీ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసిన విజయలక్ష్మి.. రెడ్డి మహిళా కాలేజీలో చదివారు. భారతీయ విద్యాభవన్‌లో జర్నలిజం పూర్తి చేశారు. అనంతరం సుల్తానా ఉల్ లూమ్ లా కాలేజీలో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. వివాహం.. విజయలక్ష్మి వివాహం బాబీ రెడ్డితో జరిగింది. పెళ్లి తర్వాత ఆమె అమెరికా వెళ్లారు. దాదాపు 18 ఏళ్లపాటు అమెరికాలోనే ఉన్నారు. అక్కడ ఆమె అగ్రరాజ్యంలోనే ఐదు అతిపెద్ద యూనివర్సిటీల్లో ఒకటైన నార్త్ కరోలినా యూనివర్సిటీలో.. కార్డియాలజీ విభాగంలో రీసెర్చ్ అసిస్టెంట్‌గా పని చేశారు. 2007లో భారత్ తిరిగొచ్చిన విజయలక్ష్మి.. రాజకీయాల్లో తండ్రి వారసత్వాన్ని కొనసాగించడం కోసం అమెరికా పౌరసత్వాన్ని వదిలేసుకున్నారు. రాజకీయ ప్రస్థానం తొలిసారి 2016లో విజయలక్ష్మి టీఆర్ఎస్ తరఫున బంజారాహిల్స్ కార్పొరేటర్‌గా భారీ మెజార్టీతో విజయం సాధించారు. అప్పటి నుంచి బంజారాహిల్స్ డివిజన్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మరో సారి విజయం సాధించి.. ఈ సారి ఏకంగా మేయర్ పదవిని అలంకరించారు. డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత.. డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన మోతే శ్రీలత తార్నాక డివిజన్ నుంచి గెలుపొందారు. ఆమె వ్యక్తిగత జీవితానికి వస్తే.. బీఏ చదివిన శ్రీలత శోభన్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు రాజీవి, శ్రీతేజస్వి. 20 ఏళ్లుగా బొటిక్ నిర్వహించిన శ్రీలత.. తరువాత రాజకీయాల్లో ప్రవేశించారు. కొంతకాలం పాటు టీఆర్ఎస్ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. తాజా ఎన్నికల్లో తార్నక కార్పొరేటర్‌గా విజయం సాధించిన మోతే శ్రీలత.. డిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకున్నారు. -
మేయర్ ఎన్నిక: గ్రేటర్‌పై మరోసారి గులాబీ జెండా
-
మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను దక్కించుకున్న టీఆర్ఎస్
-
కేసీఆర్ వ్యూహం: ఒవైసీ అనూహ్య నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : ఉత్కంఠకు తెరపడింది. జీహెచ్ఎంసీ మేయర్ పీఠంపై అధికార టీఆర్ఎస్ జెండా ఎగరేసింది. ముందునుంచి ఊహించినట్లే గులాబీ బాస్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు వ్యూహత్మకంగా వ్యవహరించి మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను దక్కించుకున్నారు. మెరుపు వేగంతో దూసుకువచ్చిన బీజేపీ దూకుడును సునాయాసంగా ఎదుర్కొన్నారు. మిత్రపక్షం ఎంఐఎంతో కలిసి టీఆర్ఎస్ గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. అయితే ఎన్నిక సందర్భంగా ఎంఐఎం పార్టీ వ్యవహరించిన తీరు ఆశ్చర్యానికి గురిచేసింది. మేయర్ బరిలో తాము కూడా ఉంటామని తొలినుంచి ప్రచారం చేసిన అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ చివరి నిమిషంలో ప్లేటు ఫిరాయించింది. కీలకమైన సమయంలో అధికార టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించింది. మేయర్ అభ్యర్థిని బరిలో నిలపకుండా టీఆర్ఎస్ అభ్యర్థి గద్వాల విజయలక్ష్మి విజయానికి సపొర్టు తెలిపింది. మేయర్ అభ్యర్థులుగా టీఆర్ఎస్ నుంచి విజయలక్ష్మి, బీజేపీ నుంచి మేయర్ అభ్యర్ధి రాధా ధీరజ్‌రెడ్డి పోటీలో నిలిచారు. ఎన్నిక ప్రక్రియను చేపట్టిన హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి.. నియమనిబంధనల ప్రకారం మేయర్ ఎన్నిక ప్రక్రియను చేపట్టారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో పాటు వివిధ పార్టీలకు చెందిన ఎక్స్ అఫిషియో సభ్యులు కౌన్సిల్ హాల్లో కూర్చున్నారు. అనంతరం పోటీలో నిలిచిన ఇద్దరు సభ్యులకు ఎక్కువ మంది సభ్యులు ఎవరికి మద్దతు తెలిపితే (చేతులెత్తి) వారిని విజేతలు ప్రకటిస్తామన్నారు. దీంతో అధికార టీఆర్ఎస్ అభ్యర్థికి ఎక్కువ మంది మద్దతు (56+32) తెలపడంతో విజయం సాధించారు. వ్యూహత్మకంగా వ్యహరించిన కేసీఆర్.. అయితే 44 మంది కార్పొరేటర్ల మద్దతుతో పాటు పదిమంది ఎక్స్అఫిషియో సభ్యులున్న ఎంఐఎం మేయర్ ఎన్నికకు దూరంగా ఉండటం రాజకీయ వర్గల్లో చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్-ఎంఐఎం పార్టీల మధ్య ఉన్న ఒప్పందం కారణంగానే ఒవైసీ ఈ నిర్ణయం తీసుకున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే మేయర్ పీఠం టీఆర్ఎస్కు, డిప్యూటీ మేయర్ ఎంఐఎంకు దక్కెలా సీఎం కేసీఆర్, ఒవైసీ ఒప్పందం కుదుర్చుకున్నారని తొలినుంచి ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే గ్రేటర్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్.. రెండు కీలక పదవులను దక్కించుకోవడంలో వ్యూహత్మకంగా వ్యవహరించారు. దీంతో రాజధాని నగరంపై మరోసారి పట్టునిలుకున్నారు. మేయర్ ఎన్నిక: గ్రేటర్‌పై మరోసారి గులాబీ జెండా -
‘బల్దియా’ రాణులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) మేయర్‌గా టీఆర్ఎస్ పార్టీకి చెందిన బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీలతారెడ్డి ఎన్నికయ్యారు. జీహెచ్ఎంసీలో ఈసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు అవకాశం లేకపోవడంతో టీఆర్ఎస్, బీజేపీలు బరిలో నిలవగా రెండు పదవులు కూడా గులాబీనే వరించాయి. బుధవారం ఎంఐఎం కూడా విప్‌ను నియమించడంతో పోటీలో ఉంటుందని భావించినా.. ఎంఐఎం నుంచి అభ్యర్థులెవరూ పోటీ చేయలేదు. మేయర్, డిప్యూటీ మేయర్ రెండు పదవులకూ ఎంఐఎం సభ్యులు టీఆర్ఎస్కే ఓట్లు వేశారు. చేతులెత్తే పద్ధతిలో ఎన్నికలైనందున ఎంఐఎం వైఖరి ఎలా ఉంటుందోనని పలువురు భావించినా.. ఎంఐఎం సైతం టీఆర్ఎస్కు మద్దతు పలకడంతో గత పాలకమండళ్ల తరహాలోనే ఈసారి కూడా టీఆర్ఎస్, ఎంఐఎం సఖ్యతతోనే పనిచేయగలవని భావిస్తున్నారు. గత ఎన్నికల్లోనే వరిస్తుందనుకున్నా.. రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు తనయ అయిన విజయలక్ష్మిని గత ఎన్నికల్లోనే మేయర్ పదవి వరిస్తుందని భావించినా.. అప్పట్లో ఆమెకు టికెట్ లభించలేదు. విజయలక్ష్మి ఉన్నత విద్యావంతురాలు, విదేశాల్లో ఉండి వచ్చారు. కాగా, టీఆర్ఎస్ తొలినాళ్ల నుంచి పనిచేస్తున్న మోతె శోభన్‌రెడ్డి సతీమణి మోతె శ్రీలతను మేయర్ పదవి వరించనుందని ప్రచారం జరిగినా.. ఆమెకు డిప్యూటీ మేయర్ అవకాశం కల్పించారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఇద్దరూ మహిళలే కావడం విశేషం. డిప్యూటీ మేయర్‌గా మైనార్టీ వర్గాలకు టీఆర్ఎస్ అవకాశం కల్పిస్తుందని తొలుత భావించినా అలా జరగలేదు. ఐదో మహిళా మేయర్.. గద్వాల విజయలక్ష్మి బల్దియాకు 26వ మేయర్ కాగా, ఐదో మహిళా మేయర్. చివరి వరకు పలు ఊహగానాలు, ఉత్కంఠ నెలకొన్నా.. ఎన్నికల ప్రక్రియ మొత్తం 20 నిమిషాల్లోనే ప్రశాంతంగా ముగిసింది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మొహంతి ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారి సందీప్‌కుమార్ సుల్తానియా పరిశీలకులుగా వ్యవహరించారు. మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికకు ముందు ఉదయం 11 గంటలకు కొత్తగా కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్ భాషల వారీగా గ్రూపులుగా విడదీసి అందరినీ ఒకేసారి ప్రమాణం చేయించారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ప్రక్రియ ఇలా సాగింది.. ఎన్నిక ప్రారంభం కాగానే ఎంఐఎం ఓటు వేస్తుందా లేదా తటస్థంగా ఉంటుందా అన్న ఉత్కంఠ సభలో నెలకొంది. అయితే ఎంఐఎం సభ్యులంతా టీఆర్ఎస్ సభ్యులతో పాటు టీఆర్ఎస్ అభ్యర్థులకే ఓట్లు వేశారు. దీంతో బీజేపీ సభ్యులు సభలో కొద్దిసేపు గొడవ చేశారు. టీఆర్ఎస్ సభ్యులు, ఎక్స్అఫీషియో సభ్యులు సహ మొత్తం బలం 88 మంది ఉన్నా.. ఎన్నికయ్యేందుకు వారంతా అవసరం లేకపోవడంతో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలందరూ హాజరు కాలేదు. వారి ఎక్స్అఫీషియో ఓట్లను ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఉపయోగించుకునే అవకాశం ఉన్నందున వాటిని ఇక్కడ వినియోగించుకోలేదని టీఆర్ఎస్ విప్ ఎంఎస్ ప్రభాకర్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. కాంగ్రెస్ నుంచి ఇద్దరు మహిళా కార్పొరేటర్లు మాత్రమే ఉండటంతో, వారు ఎవరికీ ఓట్లు వేయొద్దని నిర్ణయించుకుని ఎన్నిక ప్రక్రియలో పాలు పంచుకోలేదు. ప్రమాణ స్వీకారం చేయగానే వెళ్లిపోయారు. -
కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లకు శుభాకాంక్షలు:కలెక్టర్ శ్వేతామహంతి
-
టీఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు...
-
మేయర్ ఖరారు.. అందరి కళ్లు ఆమెపైనే
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ నూతన కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం కాసేపట్లో జరగనుంది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు కూడా అనంతరం జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మేయర్ ఎవరన్నదానిపై సర్వత్రా చర్చలు జోరుగా సాగుతున్నాయి. అందరి దృష్టి బంజారాహిల్స్ కార్పొరేటర్‌పైనే నిలిచింది. బంజారాహిల్స్ కార్పొరేటర్‌గా రెండోసారి గెలిచిన గద్వాల్ విజయలక్ష్మికి మేయర్ పదవి వరించనుందనే వార్తలు గత రెండు, మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గురువారం ఉదయం తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్ దాదాపు ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీంతో బంజారాహిల్స్ రోడ్ నెంబర్.12లోని ఎన్బీటీనగర్లో ఆమె ఇంటి వద్ద కూడా సందడి నెలకొంది. కార్యకర్తలు, నేతల రాకపోకలతో కొత్త వాతావరణం కనిపిస్తోంది. కార్పొరేటర్ తండ్రి టీఆర్ఎస్ సెక్రెటరీ జనరల్ కేకే కూడా ఢిల్లీకి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయారు. దీంతో మేయర్ పదవి దాదాపుగా గద్వాల్ విజయలక్ష్మినే వరిస్తుందనే ప్రచారం జోరుగా సాగుతున్నది. ఉత్కంఠకు తెర వేయాలంటే ఇంకొద్ది సమయం మిగిలి ఉన్న నేపథ్యంలో అందరి కళ్లు బంజారాహిల్స్‌పైనే కేంద్రీకృతమయ్యాయి. దాదాపుగా గద్వాల్ విజయలక్ష్మి పేరు సీల్డ్ కవర్లోకి ఎక్కిందని ప్రచారం జరుగుతుంది. ఆమె మేయర్‌గా ఎన్నికైతే ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి మేయర్ పదవి దక్కిన వారిలో రెండోవారు అవుతారు. 1961లో ఖైరతాబాద్ కార్పొరేటర్‌గా గెలిచిన ఎంఆర్ శ్యామ్‌రావు మేయర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. మరోవైపు టీఆర్ఎస్ డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత శోభన్‌రెడ్డిను ఖరారు చేసినట్లు సమాచారం. -
గ్రేటర్ : మేయర్ బరిలో బీజేపీ
-
రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న గ్రేటర్ ఎన్నికలు
-
జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక: ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, సిటీబ్యూరో: మేయర్ ఎన్నికల నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) అనిల్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంక్షలు గురువారం ఉదయం 9 నుంచి సా. 4 గంటల వరకు అమలులో ఉంటాయి. ►అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు నుంచి లిబర్టీ జంక్షన్ వైపు వాహనాలను అనుమతించరు. వీటిని అంబేడ్కర్ విగ్రహం చౌరస్తా నుంచి తెలుగు తల్లి జంక్షన్ వైపు మళ్ళిస్తారు. ►లోయర్ ట్యాంక్‌బండ్ వైపు నుంచి అంబేడ్కర్ విగ్రహం చౌరస్తా వైపు వాహనాలను అనుమతించరు. కట్టమైసమ్మ చౌరస్తా నుంచి తెలుగు తల్లి ఫైఓవర్ మీదుగా పంపిస్తారు. ►హిమాయత్‌నగర్ నుంచి వచ్చే వాహనాలను అంబేడ్కర్ విగ్రహం చౌరస్తా వైపు అనుమతించరు. వీటిని లిబర్టీ జంక్షన్ నుంచి బషీర్‌బాగ్, నిజాం కాలేజీ, అసెంబ్లీ మీదుగా పంపిస్తారు. ►బషీర్‌బాగ్ వైపు నుంచి అంబేడ్కర్ విగ్రహం చౌరస్తా వైపు వచ్చే వాహనాలను బషీర్‌బాగ్ జంక్షన్, పోలీసు కంట్రోల్ రూమ్, రవీంద్రభారతి మీదుగా పంపిస్తారు. ►తెలుగుతల్లి చౌరస్తా నుంచి ఆదర్శ్‌నగర్ వైపు వాహనాలను పంపించరు. వీటిని ఇక్బాల్ మీనార్ జంక్షన్ నుంచి రవీంద్రభారతి చౌరస్తా మీదుగా మళ్లిస్తారు. ►పోలీసు కంట్రోల్ రూమ్ చౌరస్తా నుంచి ఆదర్శ్‌నగర్ మీదుగా తెలుగుతల్లి చౌరస్తా వైపు వచ్చే వాహనాలను రవీంద్రభారతి, ఇక్బాల్ మీనార్ వైపు నుంచి పంపిస్తారు. -
గ్రేటర్ : మేయర్ బరిలో బీజేపీ
సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. మేయర్ అభ్యర్థిగా ఆర్కేపురం కార్పొరేటర్ రాధాధీరజ్‌రెడ్డి పేరును ఖరారు చేసినట్లు తెలిసింది. వరుసగా నాలుగుసార్లు కార్పొరేటర్‌గా గెలుపొందిన సీనియర్ నాయకుడు శంకర్ యాదవ్‌కు పార్టీ ఫ్లోర్‌లీడర్ పదవి కట్టబెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాలను కైవసం చేసుకోగా, లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ ఇటీవల మృతి చెందారు. దీంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 47కు చేరింది. మరో రెండు ఎక్స్ అఫీషియో ఓట్లు ఉన్నాయి. మొత్తంగా అధికార టీఆర్ఎస్తో పోలిస్తే బీజేపీ బలం తక్కువగానే ఉంది. అయితే మేయర్ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థుల నుంచి తమకు కొంత మంది సపోర్ట్ చేసే అవకాశం ఉందని, ఆ మేరకే పార్టీ అభ్యర్థిని మేయర్ బరిలో నిలిపినట్లు బీజేపీ స్పష్టం చేసింది. బుధవారం అభ్యర్థులతో సమావేశం నిర్వహించి ఓటింగ్‌పై జాగ్రత్తలను వివరించింది. అభ్యర్థులకు విప్ జారీ చేసింది. ప్రమాణ స్వీకారానికి ముందు అభ్యర్థులు గురువారం ఉదయం బషీర్‌బాగ్‌లోని అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించనున్నారు. అల్పాహారం తీసుకుని జీహెచ్ఎంసీకి ర్యాలీగా వెళతారు. పోటీలో ఎంఐఎం.. ఎక్స్అఫీషియో సభ్యులతో కలుపుకొని రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన మజ్లిస్ (ఏఐఎంఐఎం) మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు పోటీ పడేందుకు సిద్ధమైంది. ఇందుకు అంతర్గతంగా అభ్యర్థుల ఖరారుపై కసరత్తు పూర్తి చేసింది. పార్టీ జాతీయ కార్యదర్శి, యాకుత్‌పురా ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీకి విప్ జారీ చేసే అధికారం కట్టబెట్టింది. పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉండటంతో మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థిత్వాలకు సంబంధించి బీఫాం బాధ్యతలను కూడా పాషా ఖాద్రీకి అప్పగించింది. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీ, ఎమెల్సీ సయ్యద్ అమీన్–ఉల్–హసన్ జాఫ్రీలు కలిసి హైదరాబాద్ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి శ్వేతా మహంతికి ఫాం– ఎ,అనెక్జ్సర్–1, 2లను సమర్పించారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలపై పార్టీపరంగా అవలంబించాల్సిన వ్యూహంపై గురువారం ఉదయం దారుస్సలాంలో జరిగే కొత్త కార్పొరేటర్ల ప్రత్యేక సమావేశంలో దిశానిర్దేశం జరగనుంది. -
GHMC: మేయర్‌గా కేకే కుమార్తె
Time 12:35 టీఆర్ఎస్ పార్టీ సినియర్ నేత, రాజ్యసభ సభ్యులు కే కేశవరావు కుమార్తె విజయలక్ష్మి జీహెచ్ఎంసీ మేయర్‌గా ఎన్నికయ్యారు. విజయలక్ష్మి అభ్యర్థిత్వాన్ని మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీవుద్దీన్ ప్రతిపాదించారు. బీజేపీ నుంచి ఆర్కేపురం కార్పొరేటర్ రాధాధీరజ్‌రెడ్డి పేరును ఆ పార్టీ సభ్యులు ప్రతిపాదించారు. మేయర్ పీఠం కోసం ఇద్దరు అభ్యర్థులు మాత్రమే పోటీ పడ్డారు. సభ్యులు చేతులెత్తి మేయర్‌ను ఎన్నుకున్నారు. సంఖ్యాపరంగా టీఆర్ఎస్కు ఎక్కువమంది సభ్యుల మద్దతు ఉండటంతో మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. Time 11:10 AM హైదరాబాద్ కలెక్టర్ శ్వేతామహంతి సమావేశాన్ని ప్రారంభించారు. సమావేశానికి హాజరైన సభ్యులకు తొలుత ఆమె ధన్యవాదాలు తెలిపారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఒక్కో పార్టీలతో కూడిన సభ్యులు ఓ గ్రూపుగా ఏర్పడి ప్రమాణం చేస్తామని కొందరు కోరారు. భాషల ప్రతిపాదికన గ్రూపులుగా ఏర్పడిన ప్రమాణం చేస్తామని మరికొందరు కోరారు. కలెక్టర్ శ్వేతామహంతి దానికి అంగీకరించారు. భాష ప్రకారంలో సభ్యులంతా సామూహికంగా ఏర్పడి ప్రమాణం చేశారు. కౌన్సిల్ హాల్లో శ్వేతా మహంతి కార్పొరేటర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. 12:30 నిమిషాలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగనుందని కలెక్టర్ తెలిపారు. సభ్యులంతా పది నిమిషాల ముందు కౌన్సిల్ హాల్లోకి రావాలని సూచించారు. తొలుత తెలుగు భాషలో సభ్యులు ప్రమాణం చేశారు. అనంతరం ఉర్దూ భాషలో మాట్లాడే సభ్యులు ప్రమాణం చేశారు. మూడో విడతలో హిందీలో మాట్లాడే సభ్యులు ప్రమాణం చేశారు. చివరిగా ఇంగ్లీష్ భాషలో మాట్లాడే సభ్యులు ప్రమాణం చేశారు. పార్టీ నేతలతో ముఖ్య సమావేశం అనంతరం అన్ని పార్టీల కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు జీహెచ్ఎంసీ కార్యాలయానికి చేరుకున్నారు. నూతన కార్పొరేటర్లు పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమైంది. మొత్తం 149 మంది సభ్యులు ప్రమాణం చేయనున్నారు. సభ్యుల ప్రమాణం అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నిక జరుగనుంది. Time 10:37 Am తెలంగాణ భవన్లో ముఖ్య సమావేశం అనంతరం టీఆర్ఎస్ కార్పొరేటర్ల జీహెచ్ఎంసీ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రత్యేక బస్సులో జీహెచ్ఎంసీ ఆఫీస్‌కు చేరుకున్నారు. మరోవైపు ఎంఐఎం కార్పొరేటర్లు దారుసలాం నుంచి జీహెచ్ఎంసీ ఆఫీస్‌కు బయల్దేరారు. బషీర్‌బాగ్ నుంచి బీజేపీ కార్పొరేటర్లు సైతం జీహెచ్ఎంసీ కార్యాలయానికి చేరుకున్నారు. కాసేపట్లో సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభం కానుంది. Time 10:4 Am జీహెచ్ఎంసీ కొత్త పాలకమండలి భేటీ కాకముందే సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాణస్వీకారానికి ముందు కనీసం కరోనా టెస్టులు కూడా చేయలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే లింగోజీ కూడా కార్పొరేటర్ కరోనాతో మరణించడం సభ్యులను కలవరానికి గురిచేస్తోంది. కౌన్సిల్ హాల్లో కనీసం సామాజిక దూరం కూడా పాటించలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 193 మంది సభ్యులతో పాటు 34 మంది ఆఫీసర్లు, మరొక 20 మంది ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. హాలులో దాదాపు మూడు గంటల పాటు 250 మంది వరకు ఉంటున్న నేపథ్యంలో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. TIME 10 AM నూతన కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులతో తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశం ముగిసింది. అక్కడి నుంచి సభ్యులంతా జీహెచ్ఎంసీ కార్యాలయానికి బయలుదేరారు. ఈ సమావేశంలో సభ్యులకు మంత్రి కేటీఆర్ కీలక సూచనల చేశారు. TIME 9:40 టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులతో భేటీ అయ్యారు. మేయర్ ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చిస్తున్నారు. సభ్యులకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా హాజరయ్యారు. TIME 9:04 జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత శోభన్‌రెడ్డిని అధిష్టానం ఖరారు చేసినట్లు సమాచారం. బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి ప్రాతినిథ్యం వహిస్తుండగా.. మోతె శ్రీలత శోభన్‌రెడ్డి తార్నాక కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. TIME 8:47 బషీర్‌బాగ్ సమీపంలోని ముత్యలమ్మ ఆలయానికి చేరుకుంటున్న బీజేపీ కార్పొరేటర్లు. వారితో పాటు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అక్కడికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనల అనంతరం బయలుదేరనున్నారు. TIME 8:40 తెలంగాణ భవన్‌కు చేరుకుంటున్న నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు. మేయర్ ఎన్నికలో భాగంగా ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్ వారితో సమావేశం కానున్నారు. అనంతరం జీహెచ్ఎంసీ కార్యాలయానికి చేరుకోనున్నారు. అర్హత కలిగిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ గుర్తింపు కార్డులు ధరించి అధికారులకు సహకరించాల్సిందిగా సూచించారు. వారిని గుర్తించేందుకు ఉన్నతాధికారులు ప్రవేశద్వారం వద్ద ఉంటారు. కార్పొరేటర్లు వారు ఎన్నికైనట్లు తెలిపే ధ్రువీకరణ పత్రాన్ని, ప్రిసైడింగ్ అధికారి జారీ చేసిన నోటీసును తీసుకొని రావాల్సిందిగా కోరారు. వారు హాల్లోకి ప్రవేశించి రిజిస్టర్లో సంతకాలు చేస్తారు. వారు ఎక్కడ కూర్చోవాలో సంబంధిత వరుసను ఆఫీసర్లు సూచిస్తారు. ఇందుకు 34 మందిని నియమించారు. ప్రమాణం చేసేందుకు తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, హిందీ భాషల్లో ప్రమాణ పత్రాలు సిద్ధం చేశారు. తొలుత తెలుగులో ప్రమాణం చేయాలనుకున్న వారందరితో ఒకేసారి చేయిస్తారు. తర్వాత మిగతా భాషల వారీగా చేయిస్తారు. కొత్త కార్పొరేటర్లు తాము ఎంచుకునే భాషలో ప్రమాణ పత్రాన్ని ముందుగానే చదువుకొని రిహార్సల్ చేసుకుంటే తప్పులు దొర్లకుండా ఉంటుందని సూచించారు. ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి శ్వేతామహంతి, ఎన్నికల సంఘం నియమించిన అబ్జర్వర్ సందీప్ సుల్తానియా మాత్రమే వేదికపై కూర్చుంటారు. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. దాదాపు 500 మంది పోలీసు సిబ్బంది విధుల్లో ఉండనున్నారు. నిజాం కాలేజీ, ఎమ్మెల్యే క్వార్టర్లలో పార్కింగ్ చేయాల్సిందిగా సూచించారు. అన్నీ సజావుగా సాగితే మధ్యాహ్నం రెండుగంటలకు అటూఇటూగా కార్యక్రమం పూర్తికావచ్చని భావిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఏర్పాటయ్యాక జరగుతున్న రెండో ఎన్నిక ఇది. టీఆర్ఎస్తోపాటు ఎంఐఎం, బీజేపీలు విప్ జారీకి సభ్యులను నియమించాయి. సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎంపికకు రంగం సిద్ధమైంది. గురువారం మధ్యాహ్నం 12:30 నిమిషాలకు కొత్త నగరానికి కొత్త మేయర్ ఎన్నిక కానున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సీల్డ్ కవర్లో నూతన మేయర్, డిప్యూటీ మేయర్లను పంపించనున్నారు. అంతకుముందు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులతో కేసీఆర్ తెలంగాణ భవన్లో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు హోదాలో మంత్రి కేటీఆర్ హాజరుకానున్నారు. గ్రేటర్ బరిలో ప్రధానంగా నిలిచిన అధికార టీఆర్ఎస్తో పాటు బీజేపీ, ఎంఐఎంలకు స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఈ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 150 స్థానాలకు కాగా.. టీఆర్ఎస్ నుంచి 56 మంది కార్పొరేటర్లు గెలిచారు. 32 మంది ఎక్స్అఫిషియో సభ్యులు ఉన్నారు. ఎంఐఎంకు 44 మంది కార్పొరేటర్లు 10 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు. ఇక బీజేపీకి 48 మంది కార్పొరేటర్లు ఉండగా.. ఇద్దరు ఎక్స్అఫిషియో సభ్యులు కిషన్‌రెడ్డి, రాజాసింగ్ ఓటు హక్కును కలిగి ఉన్నారు. గ్రేటర్ మేయర్ ఎంపిక.. Updates జీహెచ్ఎంసీ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తి. ఐదు వందల మంది పోలీసులతో భద్రత ఉదయం 10:45 కి జిహెచ్ ఎంసి కార్యాలయానికి కార్పొరేటర్లు చేరుకోవాలి 11 గంటల నుంచి నాలుగు భాషల్లో ప్రమాణ స్వీకారం ప్రారంభం అవుతుంది 12:30 వరకు అందరి చేత ప్రమాణ స్వీకారం పూర్తి చేస్తారు 12:30 నుండి మేయర్ ఎన్నిక ప్రారంభం అవుతుంది సభలో 97 మంది సభ్యలు ఉంటే మేయర్ ఎన్నికను ప్రారంభిస్తారు హాజరైన వారిలో ఎక్కువ మంది ఎవరికి చేతులు లేపి ఆమోదాన్ని తెలియజేస్తారో వారే మేయ ఇదే పద్దతిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది -
హాట్ డే.. కౌన్ బనేగా మేయర్
సాక్షి, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్లు ఎవరన్నది ఇంకా తేటతెల్లం కాలేదు. నిర్ణీత సమయంలోగా నేరుగా సీల్డ్ కవర్లో పేర్లు పంపిస్తామని స్వయానా సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఆ పేరు ఎవరివి అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. గురువారం మేయర్ ఎన్నిక జరుగుతుందా.. లేదా..? అనే సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఎన్నిక సమయానికి సీల్డ్ కవర్లో పంపుతామన్నప్పటికీ, పేరే రాకుండా ఎన్నిక సమావేశానికి హాజరు కావద్దనే సంకేతాలందితే..? అన్న చర్చ సైతం జరుగుతోంది. బహిరంగంగా అంగీకరించకపోయినా.. టీఆర్ఎస్, ఎంఐఎంలు సఖ్యతతోనే వ్యవహరిస్తాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ రెండు పార్టీలూ హాజరు కాకపోతే మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగదు. జీహెచ్ఎంసీ నిబంధనలు.. మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికల విధివిధానాల మేరకు మర్నాటికి వాయిదా పడుతుంది. శుక్రవారం సైతం కోరం లేకుంటే, విషయాన్ని వివరిస్తూ, ఎన్నికల సంఘానికి నివేదిస్తారు. అప్పుడిక ఎన్నికల సంఘమే నిర్ణయం తీసుకుంటుంది. ఎన్నికలు ఏ తేదీన నిర్వహించాలో ప్రకటిస్తుంది. ఎంత వ్యవధిలోగా ఎన్నిక నిర్వహించాలో మాత్రం నిబంధనల్లో లేదు. అంటే అది రోజులా.. అంతకుమించి నెలలకు వెళ్తుందా అన్న విషయంలో స్పష్టతలేదు. రోజుల వ్యవధిలోనే ఎన్నికల సంఘం తేదీ ప్రకటిస్తుందని చెబుతున్నా పరోక్షంగా టీఆర్ఎస్ అభీష్టం మేరకే ఎన్నికల తేదీ ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాక చూసుకోవచ్చులే అనుకుంటే, ఎక్కువ కాలం వాయిదా పడటానికి కూడా అవకాశం ఉంటుదంటున్నారు. రెండో రోజూ వాయిదా పడినా.. ఎక్కువ సమయం తీసుకోకుండానే ఎన్నికల సంఘం తేదీని వెలువరిస్తుందని అధికారులు చెబుతున్నారు. అప్పుడు కోరంతో సంబంధం లేకుండా ఎంతమంది హాజరైతే, వారి ఓట్లలోనే ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే ఎన్నికవుతారు. మేయర్ గౌను.. గుర్తుకొచ్చేను! మేయర్ అనగానే ప్రత్యేకంగా ధరించే గౌను గుర్తుకొస్తుంది. ఆ గౌను మనకు ఇంగ్లండ్ నుంచి పరిచయమైంది. గతంలో రాజభోగాలనుభవించిన మేయర్లు కాలక్రమేణా కార్పొరేషన్లకు పరిమితమయ్యారు. రోమన్ మహా సామ్రాజ్యాన్ని పరిపాలించిన వారు తమ ఎస్టేట్ వ్యవహారాలు పర్యవేక్షించేందుకు మేజర్ డోమస్ (మేయర్)లను నియమించేవారు. క్రీ.శ 6– 8 శతాబ్దాల్లో ఐరోపా దేశాలను పాలించిన మెరొవింజియన్ మహారాజులు కూడా మేయర్లను నియమించారు. వారిని ప్యాలెస్ మేయర్లనేవారు. ఆ తర్వాత వివిధ అధికారాలు చలాయించిన మేయర్లు, క్రమేణా మున్సిపల్ కార్పొరేషన్లకు పరిమితమయ్యారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాక ఫ్రాన్స్‌వంటి కొన్ని దేశాల్లో ఐరోపాలో మేయర్లకు ఎన్నికలు నిర్వహించారు. బ్రిటిష్‌వారు ఇండియాను పాలించడంతో మనకూ వారిలా గౌను.. మేయర్ పదవికి ప్రత్యేక ఆకర్షణగా మారింది. గత పాలకమండళ్లలో కౌన్సిల్ సమావేశాల్లో తప్పనిసరిగా ధరించేవారు. దేశ, విదేశీ ప్రతినిధులకు విమానాశ్రయాల్లో స్వాగతం పలికేందుకు గౌను ధరించే వెళ్లేవారు. బొంతు రామ్మోహన్ మాత్రం ఆ సంప్రదాయానికి మినహాయింపునిచ్చారు. సాధారణ దుస్తుల్లోనే కౌన్సిల్ సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రపతి, ప్రధాని వంటివారు వచ్చినప్పుడు తప్ప మిగతా వారికి స్వాగతం పలికేందుకు సివిల్ డ్రెస్‌లోనే వెళ్లారు. -
ఐదేళ్ల పదవి.. అమావాస్య నాడు ప్రమాణం
సాక్షి, హైదరాబాద్ : ఐదేళ్లపాటు ఉండాల్సిన కార్పొరేటర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అమావాస్య రోజున పెడతారా.. అంటూ రాజకీయపార్టీల ప్రతినిధులు అధికారుల ఎదుట అసంతృప్తి వ్యక్తం చేశారు. అది ఎన్నికల కమిషనర్ నిర్ణయమని, రాజ్యాంగ విధి అయినందున చేయగలిగిందేమీ లేదని ఎన్నికల అధికారి లోకేశ్‌కుమార్ వివరించారు. కనీసం.. రాహుకాలం ముగిసేంత వరకైనా సమయమివ్వాలని, ఉదయం 11.30 గంటల వరకు రాహుకాలం ఉంటుందని చెప్పడంతో, ఎన్నిక నిర్వహించేది ప్రిసైడింగ్ ఆఫీసర్ అని తెలిపారు. అందరూ వచ్చి, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యేంతవరకు దాదాపుగా అంతే సమయమవుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ నెల 11న జరగనున్న ప్రమాణ స్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రక్రియ విధానాన్ని వివరించేందుకు జీహెచ్ఎంసీలో మంగళవారం రాజకీయపార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఆయా రాజకీయపార్టీల నుంచి ఎమ్మెల్సీ శ్రీనివాస రెడ్డి (టీఆర్ఎస్ ), ఎమ్మెల్సీ సయ్యద్ అమినుల్ జాఫ్రి (ఎంఐఎం), నిరంజన్ (కాంగ్రెస్ ), బీజేపీ నుంచి శంకర్ యాదవ్, దేవర కరుణాకర్‌లు హాజరయ్యారు. ఎన్నికలకు సంబంధించిన ప్రత్యేక సమావేశంలో సభ్యులు వ్యవహరించాల్సిన తీరు, తదితరమైన వాటి గురించి లోకేశ్‌కుమార్ వారికి వివరించారు. ప్రమాణ స్వీకారం చేయనున్న సభ్యులు 11వ తేదీన 10.45 గంటల వరకు గుర్తింపు కార్డు, సమావేశ నిర్వహణపై జీహెచ్ఎంసీ జారీ చేసిన నోటీసును తీసుకొని కౌన్సిల్ హాల్‌కు రావాలి. సభ్యుల ప్రమాణ స్వీకారం తెలుగు, ఉర్దూ, హిందీ ఇంగ్లీష్ నాలుగు భాషల్లో ఉంటుంది. ఎవరికిష్టమైన భాషలో వారు చేయవచ్చు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికలకు ఎక్స్అఫీషియో సభ్యులతో కలిపి 97 మంది సభ్యులు హాజరైతేనే పూర్తి కోరంతో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరుగుతాయి. చేతులు ఎత్తడం ద్వారా మేయర్, డిప్యూటీ ఎన్నిక జరుగుతుంది. ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీస్తారు. వచ్చిన సభ్యులందరి వివరాలు సరిచూసి, హాలులోకి ప్రవేశించే ముందు సంతకాలు తీసుకోవడం, వారికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు 30 మంది అధికారులుంటారు. బల్దియా పాలకమండలికి నేడే చివరి రోజు సాక్షి, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీ ప్రస్తుత పాలకమండలి గడువు బుధవారం (10వ తేదీతో)ముగిసిపోనుంది. 2016 ఫిబ్రవరి 11న పాలకమండలి సభ్యులు ప్రమాణం చేశారు. వారి ఐదేళ్ల గడువు పదో తేదీతో ముగిసిపోనుంది. అందువల్లే కొత్త పాలకమండలి ప్రమాణ స్వీకారం కూడా మర్నాడే ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికలు కూడా నిర్వహించనున్నారు. అప్పుడు..ఇప్పుడు కూడా కొత్త పాలకమండలి ఫిబ్రవరి నెల 11వ తేదీ..గురువారం కావడం యాధృచ్ఛికమే అయినా విశేషంగా మారింది. ప్రతిపక్షం లేకుండా.. బల్దియా చరిత్రలోనే ప్రతిపక్షం, విమర్శలు, సవాళ్లు–ప్రతిసవాళ్లు లేకుండా ఐదేళ్లు పూర్తిచేసుకున్న పాలకమండలి ఇప్పటి వరకు లేదు. అధికార టీఆర్ఎస్ నుంచే మేయర్, డిప్యూటీ మేయర్లు ఉండటం, తగినంతమంది సభ్యుల బలమున్న ఎంఐఎం మిత్రపక్షంగా వ్యవహరించడంతో ప్రతిపక్షమనేది లేకుండా పోయింది. బీజేపీ, కాంగ్రెస్‌లకు తగిన బలమే లేనందున ఏమీ చేయలేకపోయారు. ముందస్తుగా వచ్చిన ఎన్నికలతో కొత్త కార్పొరేటర్లు వచ్చినప్పటికీ, అధికారికంగా ప్రొటోకాల్ ప్రకారం కార్పొరేటర్ల హోదాల్లో కొనసాగారు. కొన్ని ప్రాంతాల్లో వివాదాలు చెలరేగాయి. ప్రతిపక్షం లేకుంటే పాలన ఎలా ఉంటుందో కూడా ఈ పాలకమండలి హయాంలోనే తెలిసివచ్చింది. ప్రజాసమస్యల గురించి ప్రశ్నించిన వారు లేరు.ఒకరిద్దరు సభ్యులున్న పార్టీలకు అవకాశమే రాలేదు. వారి వాదన విన్నవారే లేరు. కరోనా కారణంగా దాదాపు పదినెలలపాటు సర్వసభ్యసమావేశాలు జరగలేదు. చివరిసారిగా బడ్జెట్ సమావేశమైనా నిర్వహించాలనుకోగా, మేయర్ ఎన్నిక నోటిఫికేషన్‌తో కోడ్ అడ్డొచ్చింది. మేయర్ ఎన్నికలో వీరికి ఓటు లేదు సాక్షి, సిటీబ్యూరో: మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల కోసం గ్రేటర్ పరిధిలోని అన్ని పార్టీలకు సంబంధించి ఎక్స్అఫీషియో సభ్యుల లెక్క ఖరారైనప్పటికీ, ఇంకా ఎవరైనా అర్హులున్నారేమోనని అధికారులు పరిశీలించారు. వివిధ పార్టీల్లోని వారు గత సంవత్సరం జనవరిలో జరిగిన మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఓటు వేసినట్లు ఖరారు చేసుకున్నారు. దాంతో వారిక్కడ ఓటువేసేందుకు అర్హులు కాదని తేల్చారు. ఆ వివరాలిలా ఉన్నాయి. ఎవరు పార్టీ ఎక్కడ వేశారు ఎ.రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కొంపల్లి జి.రంజిత్‌రెడ్డి టీఆర్ఎస్ నార్సింగి ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు టీఆర్ఎస్ కొంపల్లి కాటేపల్లి జనార్దన్‌రెడ్డి స్వతంత్ర తుక్కుగూడ కసిరెడ్డి నారాయణరెడ్డి టీఆర్ఎస్ కోస్గి పల్లా రాజేశ్వర్‌రెడ్డి టీఆర్ఎస్ నల్గొండ మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి టీఆర్ఎస్ ఆదిభట్ల ఎన్.రామచంద్రరావు బీజేపీ మక్తల్ ఎగ్గె మల్లేశం టీఆర్ఎస్ తుక్కుగూడ కె.నవీన్‌కుమార్ టీఆర్ఎస్ పెద్ద అంబర్‌పేట దర్పల్లి రాజేశ్వరరావు టీఆర్ఎస్ నిజామాబాద్ పట్నం మహేందర్‌రెడ్డి టీఆర్ఎస్ పెద్ద అంబర్‌పేట ఫారూఖ్ హుస్సేన్ టీఆర్ఎస్ నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి టీఆర్ఎస్ బొల్లారం కేపీ వివేకానంద టీఆర్ఎస్ కొంపల్లి పి.సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ తుక్కుగూడ టి.ప్రకాశ్‌గౌడ్ టీఆర్ఎస్ నార్సింగి -
అంతు పట్టని అధినేత అంతరంగం
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ మేయర్ పదవి ఎవరిని వరించనుందన్నది ఇప్పుడు నగరంలో హాట్‌టాపిక్‌గా మారింది. సీల్డు కవరులో మేయర్, డిప్యూటీ మేయర్ల పేర్లను గురువారం రోజున.. ఎన్నికకు కొద్దిసేపు ముందు సీల్డు కవరులో పంపుతామని టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఆ అదృష్టవంతులెవరా అన్నది ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా ప్రచారంలో ఉన్న పేర్లకు మించి కొత్తపేర్లు తెరపైకి రాకపోయినప్పటికీ, వీరిలోనే ఒకరుంటారా.. లేక ఎవరి అంచనాలకు అందని విధంగా, ఊహించని రీతిలో కొత్తవారు రానున్నారా అన్న ఉత్కంఠ నెలకొంది. రాజకీయ ప్రముఖులు కేకే కుమార్తె విజయలక్ష్మి, పీజేఆర్ తనయ విజయారెడ్డి, కనకారెడ్డి కోడలు విజయశాంతిలతోపాటు కవితారెడ్డి, మోతె శ్రీలత, సింధురెడ్డి, పూజిత గౌడ్, బొంతు శ్రీదేవిల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. మేయర్ అ య్యే వారికి ఉండాల్సిన లక్షణాలు, వారి ప్రవర్తన వల్ల పార్టీ ఇరకాటంలో పడుతుందా, బల్దియా కార్యక్రమాలు సాఫీగా సాగుతాయా వంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకొని, అన్ని విధాలా తగునని భావించిన వారినే ఎంపిక చేసే వీలుందని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. సామాజిక వర్గాలను పరిగణనలోకి తీసుకొని బీసీలకు ఇవ్వాలనుకుంటే శ్రీదేవి, పూజిత, విజయలక్ష్మిలలో ఒకరికి అవకాశం దక్కనుందని చెబుతున్నారు. బల్దియాలో బీజేపీ బలమైన ప్రతిపక్షంగా మారడం, ఎంఐఎంను అన్ని విషయాల్లో కలుపుకొని పోవడం, సర్వసభ్య సమావేశం, స్టాండింగ్ కమిటీ సమావేశాలను సవ్యంగా నడిపించగల సామర్థ్యం ఉందా లేదా.. తదితరమైనవి పరిగణనలోకి తీసుకోనున్నారని సమాచారం. దూకుడుగా, ఇగోలతో వ్యవహరించేవారి వల్ల పార్టీ ఇరకాటంలో పడుతుందని, అన్నింటినీ పరిశీలించి తగిన అర్హతలు ఉన్నవారికే అవకాశం లభించనున్నట్లు చెబుతున్నారు. అలాంటి లక్షణాలున్నాయని నమ్మినవారికే పదవి దక్కుతుందని, లేని పక్షంలో ఇప్పటి వరకు ఊహకే అందని వారు సైతం మేయర్ కావచ్చునని టీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తోంది. ఆశావహులకు ఎమ్మెల్యేల బ్రేకులు.. కొందరు ఆశావహులకు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లోని స్థానిక ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత ఉందనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేల అభ్యంతరాల వల్ల అవకాశం చేజారే పరిస్థితి ఉందంటున్నారు. మేయర్ కూడా ఉంటే తమ ప్రాధాన్యత తగ్గుతుందని, ప్రొటోకాల్ , తదితరమైన వాటి దృష్ట్యా కొందరు ఎమ్మెల్యేలు తమ పరిధిలోని వారు మేయర్ కాకుండా ఉండేందుకు వారివంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. పదవులు అడ్డొచ్చేనా? విజయలక్ష్మి కోసం ఆమె తండ్రి కేకే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, దాదాపుగా ఖాయమని చెబుతున్నారు. మరోవైపు, ఆయన మూడు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడు కావడం, రెండుసార్లు ఫ్లోర్‌లీడర్, ఆయన కుమారుడు టీయూఎఫ్ఐడీసీ చైర్మన్ కావడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఒకే కుటుంబంలోని వారికే ఇన్ని పదవులిస్తే, మిగతా వారికి ఎలాంటి సందేశం వెళ్తుంది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. డిప్యూటీ రేసులో... డిప్యూటీ మేయర్ పదవికి రేసులో ఉన్నవారి పేర్లు కూడా పెరిగిపోతున్నాయి. సిట్టింగ్ బాబా ఫసియుద్దీన్కే మరోమారు అవకాశం దక్కనుందనే ప్రచారం జరుగుతున్నా, జగదీశ్వర్‌గౌడ్, షేక్ హమీద్, సబీహాబేగం, ఎం.నరసింహయాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మేయర్ మహిళ కావడాన్ని కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు. నేడే ‘సాగర్’ భేరి... -
మేయర్ పదవికి ఎవరి బలం ఎంత?
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగబోయే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కార్పొరేటర్లు, గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు రాష్ట్రంలోని ఇతర స్థానిక సంస్థల నుంచి, వివిధ నియోజకవర్గాల నుంచి, వివిధ కోటాల నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా ఓటర్లే. అలాంటి వారిలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు ఫరీదుద్దీన్, గోరటి వెంకన్న తదితరులెందరో ఉన్నారు. వారంతా ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినా, ఎక్కడి ప్రజలకు సేవలందిస్తున్నా జీహెచ్ఎంసీ పరిధిలో ఓటరు జాబితాలో పేరుండటంతో వారు జీహెచ్ఎంసీ ఎక్స్అఫీషియో సభ్యులుగా మేయర్ ఎన్నికలో ఓటు వేసేందుకు అర్హులేనని అధికారులు పేర్కొన్నారు. ఇదే తరుణంలో గ్రేటర్ పరిధిలోనే ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైనప్పటికీ కొందరు మాత్రం ప్రస్తుత మేయర్ ఎన్నికకు ఓటర్లుగా లేరు. ఎందుకంటే వారు ఇప్పటికే ఇతర మునిసిపాలిటీ/కార్పొరేషన్లో ఎక్స్అఫీషియో సభ్యులుగా ఓటు వినియోగించుకోవడంతో ఇక్కడ అర్హత లేకుండా పోయింది. పదవీకాలంలో ఎక్కడైనా ఒక్కచోట మాత్రమే మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకునేందుకు అవకాశముంటుంది. అలా గ్రేటర్ పరిధిలోనే ఉన్నప్పటికీ, ఓటు వేసే అవకాశం లేని వారిలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తదితరులున్నారు. ఇలా ఎవరెవరికి ఇక్కడ ఓటు హక్కు ఉంది? ఉన్నవారిలో ఇతర ప్రాంతాల్లో వినియోగించుకున్నదెవరు..? వంటి వివరాలు, తాజా సమాచారంతో కసరత్తు పూర్తిచేసిన సంబంధిత అధికారులు ఉన్నతస్థాయిలోని అధికారులకు వివరాలు అందజేశారు. తాజా సమాచారం మేరకు, అధికార టీఆర్ఎస్ పార్టీకి నామినేటెడ్లతో సహా 32 మంది సభ్యుల ఎక్స్‌అఫీషియోల బలం ఉంది. రెండు రోజుల ముందు ఇది 33గా ఉన్నప్పటికీ, ఇతర ప్రాంతాల్లో ఓటు వేయడం, ఇతరత్రా కారణాలు పరిశీలించాక 32గా ఉన్నట్లు తెలిసింది. ఎటొచ్చీ.. మేయర్ ఎన్నిక జరపాలంటే నిర్వహించాల్సిన ప్రత్యేక సమావేశానికి అవసరమైన కోరం మాత్రం 97గానే ఉంది. తీరా ఎన్నిక తేదీ నాటికి ఏవైనా మార్పుచేర్పులు జరిగితే తప్ప ఇదే కోరం ఖరారు కానుంది. మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికకు ఓటర్లయిన కార్పొరేటర్లు, ఎక్స్అఫీషియో సభ్యుల్లో సగం మంది హాజరు తప్పనిసరి. జీహెచ్ఎంసీలోని 150 కార్పొరేటర్లలో లింగోజిగూడ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ మరణించడంతో 149 మంది ఉన్నారు. వీరు, ఎక్స్అఫీషియో సభ్యులు 44 మంది కలిపి మొత్తం ఓటర్ల సంఖ్య 193. ఇందులో కనీసం సగం మంది అంటే 97 మంది ఉంటేనే ఎన్నిక జరుగుతుంది. గ్రేటర్ పరిధిలోని మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచే గెలిచినప్పటికీ కాంగ్రెస్ నాయకుడు రేవంత్‌రెడ్డి వేరే చోట ఓటు వినియోగించుకోవడంతో ఇక్కడి మేయర్ ఎన్నికలో ఓటు లేదు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు గతంలో శివారు మునిసిపాలిటీలో ఎక్స్అఫీషియో ఓటు వినియోగించుకున్నప్పటికీ, తిరిగి ఎన్నికయ్యాక వినియోగించుకోకపోవడంతో ఆయనకు ఇక్కడ ఓటు హక్కు ఉందని అధికారులు తెలిపారు. బీజేపీకి చెందిన ఎమ్మెల్సీ రామచంద్రరావు ఇతర మునిసిపాలిటీలో ఓటు వినియోగించుకున్నందున ఇక్కడ ఓటు వేయడం కుదరదు. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఇప్పటి వరకు ఎక్కడా ఎక్స్అఫీషియో ఓటు వేయలేదని, గ్రేటర్లో ఓటరుగా ఉన్నందున అర్హురాలేనని సమాచారం. ఇలా.. ఎవరెవరు ఓటర్లుగా ఉన్నారో తేల్చుకోవడమే అధికారులకు పెద్దపనిగా మారింది. ఎట్టకేలకు ఈ కసరత్తు పూర్తిచేసి మొత్తం ఓటుహక్కున్న ఎక్స్‌అఫీషియోలు 44 మంది ఉన్నట్లు తేల్చినట్లు సమాచారం. టీఆర్ఎస్ ఎక్స్అఫీషియోల్లో భూపాల్‌రెడ్డి, సతీష్‌కుమార్, మహమూద్‌అలీ, ఎంఎస్ ప్రభాకర్‌రావు, లక్ష్మీనారాయణ, బసవరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్, నవీన్‌కుమార్, ముఠాగోపాల్, కాలేరు వెంకటేశ్, దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, టి.పద్మారావు, జి.సాయన్న, మాధవరం కృష్ణారావు, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఆరెకపూడి గాంధీ తదితరులున్నట్లు సమాచారం. -
ఫిబ్రవరి 11న జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్ ఎన్నిక ఫిబ్రవరి 11న జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం నోటిఫికేషన్‌ను జారీచేసింది. వచ్చేనెల 11వ తేదీన ఉదయం 11 గంటలకు కొత్తగా ఎన్నికైన జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో ప్రిసైడింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు నిర్వహించే ప్రత్యేక సమావేశంలో ముందుగా మేయర్ ఎన్నిక జరుగుతుంది. ఆ తర్వాత డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకుంటారు. ఏవైనా అనివార్య కారణాల వల్ల 11న ఈ ఎన్నిక నిర్వహించలేని పక్షంలో మరుసటి రోజు 12న (ఒకవేళ సెలవు రోజు అయినప్పటికీ) ఈ ఎన్నిక నిర్వహిస్తారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పరోక్ష ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌తో పాటు దీనికి సంబంధించిన విధానపరమైన సూచనలను విడుదల చేసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా ఎన్నికైన 150 మంది కార్పొరేటర్లతో పాటు గ్రేటర్లో ఎక్స్అఫీషియో సభ్యులుగా నమోదైన లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని 6వ తేదీకల్లా తెలియజేస్తారు. గత ఏడాది డిసెంబరు ఒకటో తేదీన జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 56, బీజేపీ 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ 2 స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈసారి మేయర్ స్థానం జనరల్ మహిళకు రిజర్వు అయింది. -
మేయర్ ఎన్నిక.. కార్పొరేటర్లకు 5కోట్లు
సాక్షి, ఖమ్మం : తెలంగాణ పోలీసులపై బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ ప్రశంసలు కురిపించారు. వారు నిజంగా హీరోలే అని, 15 నిమిషాల పాటు పాతబస్తీని వారికి అప్పగిస్తే అంతా జల్లెడ పడతారని అన్నారు. ఓల్డ్ సిటీలోని రొహింగ్యాలు, పాకిస్తానిలను బయటకు తీస్తారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి దమ్ముంటే వారికి 15 నిమిషాల పాటు సమయం ఇచ్చి పాతబస్తీని అప్పగించాలని కోరారు. గురువారం ఖమ్మంలో బండి సంజయ్ పర్యటించారు. దీనిలో భాగంగా పలువురు నేతలు బీజేపీకిలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో సంజయ్ ప్రసంగించారు. ఖమ్మం, వరంగల్, సిద్దిపేట కార్పొరేషన్ చాలామంది నాయకులు బీజేపీ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసి ఎన్నికల్లో ఓడిపోయినా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అహంకారం తగ్గలేదని విమర్శించారు. ఆదరబాదరాగా ఎన్నికలు నిర్వహించిన ప్రభుత్వం మేయర్ ఎన్నికను ఎందుకు చేపట్టడంలేదని ప్రశ్నించారు. తమ పార్టీ నుంచి గెలిచిన కార్పొరేటర్లకు టీఆర్ఎస్ నేతలు ఫోన్స్ చేసి రూ.5కోట్లు ఇస్తామని మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఖమ్మం, వరంగల్లోనూ ఓటర్లను భయబ్రాంతులకు గురి చేసి గెలవాలనుకుంటున్నారని మండిపడ్డారు. కొత్తగుడం జిల్లా లక్ష్మీ దేవి మండలంలో ఐదుగురు మైనర్ బాలికలపై ప్రధాన ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై సంజయ్ ఘాటుగా స్పందించారు. ఈ ఘటన బయటకు రాకుండా టిఆర్ఎస్ నేతలు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికయినా కలెక్టర్, సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
కాచుకున్న కరోనా!
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల పర్వం ముగిసింది. ప్రచారంలో, రోడ్‌షోలు, సభలు సమావేశాల్లో జనం ఎలాంటి భౌతిక దూరం పాటించకుండా పాల్గొన్నారు. మంగళవారం భారత్‌బంద్ సందర్భంగా కూడా ధర్నాలతో పాటు ఇతర కార్యక్రమాల్లో జనం కరోనా కాలాన్ని మరిచిపోయారు. లింగోజిగూడ కార్పొరేటర్‌గా విజయం సాధించిన ఆకుల రమేష్ గౌడ్‌కు రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ప్రజాప్రతినిధులు, ప్రచారంలో పాల్గొన్న జనానికి కోవిడ్‌భయం పట్టుకుంది. తమకు కూడా కరోనా సోకి ఉంటుందని జనం గుబులు పడుతున్నారు. అసలే చలికాలం ఆపై జ్వరంతో ఎక్కువ మంది బాధపడుతున్నారు. కార్పొరేటర్‌కు కరోనా వచి్చందనే వార్త వైరల్ కావడంతో గ్రేటర్లో తిరిగి ఈ వ్యాధి వ్యాప్తి చెందుతోందని ఇటు వైద్య శాఖ అటు సాధారణ జనం భయాందోళనకు గురవుతున్నారు. కేసులు ఇలా.. ⇔ ఎన్నికల ముందు నవంబర్‌లో రోజుకు సుమారు 100కుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం 180 మందికి కరోనా నిర్ధారణ అయింది. ⇔ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వారు క్వారంటైన్లోకి వెళ్లక పోవడం ఆందోళన కల్గిస్తున్న అంశం. దీంతో ఈ సంఖ్య రానున్న మూడు, నాలుగు రోజుల్లో పెరిగే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. ⇔ ఆయా రాజకీయ నాయకులతో వైరస్ సోకే ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు. మున్ముందు కేసుల సంఖ్యను నివారించాలంటే ప్రచారంలో పాల్గొన్న ఆయా పారీ్టల నేతలు, కార్యకర్తలు క్వారంటైన్లోకి వెళ్తే మంచిదని సూచిస్తున్నారు. ⇔ వీరంతా వారం రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలి. కానీ అవేవీ పట్టనట్లుగా వీరు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. వీరంతా కచి్చతంగా క్వారంటైన్లో ఉండాలని డైరెక్టర్ ఆఫ్ హెల్త్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులు చెబుతున్నారు. సాధారణ జనంతో కలిసి సంచరించడంతో కోవిడ్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఉంటుందా? రాష్ట్రానికి సెకండ్ వేవ్ కరోనా ముప్పు పొంచి ఉందని వార్తలు వస్తున్నాయి. దీంతో మరోసారి కోవిడ్ వ్యాపించే ప్రమాదం ఉంది. ప్రచారంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తల ద్వారా వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం వివిధ రాజకీయ పారీ్టలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, నేతలు, అభిమానులతోపాటు ఇతర జిల్లాల నుంచి హైదరాబాద్‌కు ప్రచారం నిమిత్తం వచి్చనవారు తిరిగి సొంత జిల్లాలు, గ్రామాలకు వెళ్లిపోయారు.ఈ ప్రభావం కూడా మరో వారం రోజుల్లో బయటకు వచ్చే ప్రమాదం ఉందని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. 18 మందికి పాజిటివ్ ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్‌లో పాల్గొన్న వారిలో బుధవారం 18 మందికి కరోనా సోకినట్లు వైద్యాధికారులు నిర్ధారించారు. పార్టీలు నేతలు, పోలీసులకు సైతం.. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఓ ఎమ్మెల్యే, ఓ ఎంపీ కుమారుడు, నలుగురు కార్పొరేటర్లు, వారి కుటుంబికులు, అధికారులకు కరోనా వచి్చనట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఎన్నికల విధులు నిర్వర్తించిన ముగ్గురు పోలీస్ అధికారులకు, ఎస్ఆర్నగర్ పీఎస్ పరిధిలో ఆరుగురు సిబ్బందికి రెండోసారి కరోనా వచి్చనట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో పోలింగ్, కౌంటింగ్ లో పాల్గొన్న మిగతా ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. -
నేరేడ్మెట్లో టీఆర్ఎస్ విజయం
సాక్షి, హైదరాబాద్: నేరేడ్మెట్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. 782 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి గెలిచారు. ఇతర గుర్తులున్న 544 ఓట్లలో టీఆర్ఎస్కు 278 ఓట్లు వచ్చాయి. తాజా విజయంతో జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ కార్పొరేటర్ల సంఖ్య 56కు చేరింది. తమ పార్టీ అభ్యర్ధి విజయంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోగా, బీజేపీ కార్యకర్తలు నిరుత్సాహానికి గురయ్యారు. బీజేపీ ఆందోళన నేరెడ్మెట్ కౌంటింగ్ కేంద్రం వద్ద బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తిరస్కరణకు గురైన 1300 ఓట్లు లెక్కించాలని బీజేపీ అభ్యర్థి ప్రసన్ననాయుడు డిమాండ్ చేశారు. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో అవకతవకలు జరిగాయని, అధికార పార్టీకి ఎన్నికల అధికారులు అనుకూలంగా వ్యవహరించి 600కుపైగా చెల్లని ఓట్లను టీఆర్ఎస్ ఖాతాలో వేశారని ప్రసన్ననాయుడు ఇంతకుముందు ఆరోపించిన సంగతి తెలిసిందే. 8 గంటలకు మొదలైన కౌంటింగ్ కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల కౌటింగ్ సందర్భంగా నిలిచిపోయిన నేరేడ్మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు మొదలైంది. ఇతర ముద్రలు ఉన్న 544 ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకొని లెక్కించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు సూచించింది. ఇదిలావుంటే, జీహెచ్ఎంసీ కౌంటింగ్ సమయంలో స్వస్తిక్ కాకుండా ఇతర ముద్రలతో కూడిన ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్న రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. బీజేపీ ఈ నెల 4న హైకోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టు ఎన్నికల సంఘం వాదనలతో ఏకీభవించింది. దీంతో స్వస్తిక్‌తో పాటు ఇతర ముద్రతో ఉన్న ఓట్లను పరిగణలోకి తీసుకోవాంటూ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఇతర ముద్ర ఉన్న మరో 544 ఓట్లను లెక్కించిన తర్వాత నేరేడ్మెట్ ఫలితం ప్రకటించనున్నారు. కాగా, ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థి 504 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. -
ఆ ఓట్లను లెక్కించండి: హై కోర్టు
-
ఇంకొంచెం కష్టపడితే.. గెలిచే వాళ్లం!
సాక్షి, హైదరాబాద్: ఎక్కడైనా గెలుపు, ఓటములు ఉంటాయి. గెలుపులోనూ చాలా చోట్ల ఒకటి, రెండో, మూడో స్థానాలుంటాయి. ఎన్నికల్లో మాత్రం ఒక్కటే గెలుపు. దానికి రెండు, మూడు స్థానాలంటూ ఉండవు. కానీ, రెండో స్థానంలో ఉన్నవారెవరైనా ఇంకొంచెం కష్టపడితే గెలిచే వారం అనుకోవడం సహజం. అలా బల్దియా ఎన్నికల్లో టీఆర్ఎస్ 67 సీట్లలో, బీజేపీ 78 సీట్లలో రెండో స్థానంలో నిలిచాయి. కాంగ్రెస్ ఒక్కచోట మాత్రమే రెండో స్థానంలో నిలిచింది. అది 94 స్థానాల్లో మూడో స్థానానికి దిగజారింది. ఇక టీడీపీ కనీసం రెండో స్థానంలో కూడా లేకుండా పోయింది. టీఆర్ఎస్ 2వ స్థానంలో ఉన్న డివిజన్లు ఇవీ. మోండా మార్కెట్, రామ్‌గోపాల్‌పేట, మల్కాజిగిరి, మౌలాలి, వినాయకనగర్, జీడిమెట్ల, మూసాపేట, గచ్చిబౌలి, ఎర్రగడ్డ, అమీర్‌పేట,జూబ్లీహిల్స్, కవాడిగూడ, గాంధీనగర్, భోలక్‌పూర్, రామ్‌నగర్, ముషీరాబాద్, ఆడిక్‌మెట్, బాగ్‌అంబర్‌పేట, నల్లకుంట, కాచిగూడ, హిమాయత్‌నగర్,గన్‌ఫౌండ్రి, అహ్మద్‌నగర్, గుడిమల్కాపూర్, నానల్‌నగర్, టోలిచౌకి, గోల్కొండ, మంగళ్‌హాట్, జియాగూడ, అత్తాపూర్, రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి, శాస్త్రిపురం, సులేమాన్‌నగర్, కిషన్‌బాగ్, రామ్నాస్పురా, జహనుమా, గోషామహల్, బేగంబజార్, నవాబ్‌సాహెబ్‌కుంట, ఫలక్‌నుమా, బార్కాస్, కంచన్‌బాగ్, సంతోష్‌నగర్, ఐఎస్ సదన్, గౌలిపురా, తలాబ్‌చంచలం,పత్తర్‌గట్టి, రెయిన్‌బజార్, మూసారాంబాగ్, సైదాబాద్, గడ్డిఅన్నారం, చైతన్యపురి, కొత్తపేట, రామకృష్ణాపురం, సరూర్‌నగర్, లింగోజిగూడ,చంపాపేట, హస్తినాపురం, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి నగర్, హయత్‌నగర్, మన్సూరాబాద్, నాగోల్, ఉప్పల్, రామంతాపూర్, హబ్సిగూడ ఉన్నాయి. బీజేపీ 2వ స్థానంలో ఉన్న డివిజన్లు ఇవీ.. బేగంపేట, బన్సీలాల్‌పేట, బౌద్ధనగర్, సీతాఫల్మండి, మెట్టుగూడ, తార్నాక, అడ్డగుట్ట, గౌతమ్‌నగర్, ఈస్ట్ ఆనంద్‌బాగ్, వెంకటాపురం, అల్వాల్, మచ్చబొల్లారం, కుత్బుల్లాపూర్, సుభాష్‌నగర్, సూరారం,చింతల్, రంగారెడ్డినగర్, జగద్గిరిగుట్ట,ఆల్విన్‌కాలనీ, హైదర్‌నగర్, వీవీనగర్, కూకట్పల్లి, బాలానగర్, ఓల్డ్‌బోయిన్‌పల్లి, ఫతేనగర్, అల్లాపూర్, బాలాజీనగర్, కేపీహెచ్‌బీ కాలనీ, పటాన్చెరువు, రామచంద్రాపురం, భారతీనగర్, చందానగర్, హఫీజ్‌పేట, మియాపూర్, మాదాపూర్, శేరిలింగంపల్లి, కొండాపూర్, బోరబండ, రహ్మత్‌నగర్, సనత్‌నగర్, వెంగళ్రావునగర్, సోమాజిగూడ, యూసుఫ్‌గూడ, షేక్‌పేట, బంజారాహిల్స్, వెంకటేశ్వరకాలనీ, ఖైరతాబాద్, అంబర్‌పేట,గోల్నాక, మల్లేపల్లి, రెడ్‌హిల్స్, విజయనగర్‌కాలనీ, ఆసిఫ్‌నగర్, మెహదీపట్నం, లంగర్‌హౌస్, కార్వాన్, దత్తాత్రేయనగర్, దూద్‌బౌలి, పురానాపూల్, ఘాన్సీబజార్, శాలిబండ, జంగమ్మెట్, ఉప్పుగూడ, చాంద్రాయణగుట్ట, రియాసత్‌నగర్, కుర్మగూడ, లలితాబాగ్, మొఘల్‌పురా, డబీర్‌పురా, అక్బర్‌బాగ్, ఓల్డ్‌మలక్‌పేట, చిలుకానగర్, నాచారం, మల్లాపూర్, మీర్‌పేట హెచ్‌బీకాలనీ, చర్లపల్లి, డాక్టర్ ఏఎస్‌రావునగర్, కాప్రాలున్నాయి. అత్యధికంగా 15 వేల నుంచి 20 వేల ఓట్ల మెజార్టీ పొందిన అభ్యర్థులు 12 మంది ఉన్నారు. వారంతా ఎంఐఎం వాళ్లే కావడం విశేషం. 2వ స్థానం టీఆర్ఎస్ 67 బీజేపీ 78 ఎంఐఎం 1 కాంగ్రెస్ 1 ఇండిపెండెంట్లు 2 టీడీపీ 0 -
‘నేరేడ్మెట్’ కౌంటింగ్‌కు అనుమతిచ్చిన హై కోర్టు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా నేరేడ్మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపునకు అడ్డంకి తొలగింది. బ్యాలెట్ పేపర్‌పై స్వస్తిక్ గుర్తు కాకుండా ఇతర గుర్తులు ఉన్నా వాటిని లెక్కించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఇతర గుర్తులు ఉన్న బ్యాలెట్ పేపర్ల లెక్కింపుపై అభ్యంతరాలున్న వారు ఎన్నికల ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డి సోమవారం తీర్పునిచ్చారు. స్వస్తిక్ గుర్తు కాకుండా ఇతర నిరి్ధష్టమైన గుర్తులు ఉన్నా వాటిని లెక్కించేందుకు అనుమతిస్తూ ఈ నెల 3న ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ ఇన్చార్జీ అంథోనిరెడ్డితోపాటు మరొకరు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి సోమవారం విచారించారు. స్వస్తిక్ గుర్తు కాకుండా ఇతర గుర్తులు ఉన్న ఓట్లను లెక్కించడానికి వీల్లేదని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది డి.ప్రకాష్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఏ గుర్తు ఉన్నా వాటిని లెక్కించాలంటూ ఎన్నికల కమిషన్ అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. నేరెడ్మెట్ డివిజన్లోని ఓ పోలింగ్ బూత్‌లో స్వస్తిక్ గుర్తుకు బదులుగా సిబ్బంది పోలింగ్ కేంద్రాన్ని తెలిపే గుర్తును ఇచ్చారని, కొంతసేపటి తర్వాత ఈ తప్పును గుర్తించి సరిచేశారని ఎన్నికల కమిషన్ తరఫున సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ వాదనలు వినిపించారు. అప్పటికే మరో గుర్తుతో ఓట్లు పడిన విషయాన్ని పోలింగ్ సిబ్బంది తెలియజేయడంతో ఆ ఓట్లను కూడా లెక్కించాలని 3వ తేదీ సాయంత్రం ఉత్తర్వులు ఇచ్చామని తెలిపారు. నేరేడ్మెట్ డివిజన్లో మొత్తం 25,136 ఓట్లకు గాను, 24,612 ఓట్లను లెక్కించామని, ఇతర గుర్తులు ఉన్న 544 ఓట్లను మాత్రం లెక్కించకుండా పక్కనపెట్టామని పేర్కొన్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ 504 ఓట్ల మెజారిటీలో ఉందని, బూత్ నంబర్ 50లో ఎన్నికల సిబ్బంది పొరపాటు కారణంగా ఓటర్ల మనోగతం వృథా కాకూడదనే ఉద్దేశంతోనే ఇతర గుర్తులు ఉన్న ఓట్లను కూడా లెక్కించేందుకు అనుమతి ఇచ్చామని, ఇందులో ఎటువంటి దురుద్దేశం లేదని వివరించారు. ఈ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. (చదవండి: ఆ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోం) ఈ నెల 9న ఓట్ల లెక్కింపు... నేరేడ్మెట్: నేరేడ్మెట్ డివిజన్ కార్పొరేటర్ ఎన్నికపై కొనసాగుతున్న సస్పెన్షన్‌కు కోర్టు తీర్పుతో తెరపడింది. ఈ నెల 9న నేరేడ్మెట్లోని భవన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ (డీఆర్సీ)లో 544 ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నట్లు మల్కాజిగిరి ఉప ఎన్నికల అధికారి దశరథ్ చెప్పారు. -
జీహెచ్ఎంసీ: యంగ్ స్టార్స్..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పీఠంపై యువరక్తం కొలువు దీరనుంది. రాజకీయ కుటుంబ నేపథ్యంతో కొంతమంది బరిలోకి దిగితే.. సమాజసేవపై ఆసక్తితో మరికొంత మంది ఎన్నికల్లో పోటీకి దిగారు. నేరెడ్మెట్ను మినహాయిస్తే ఇప్పటి వరకు ఫలితాలు ప్రకటించిన 149 డివిజన్లలో కార్పొరేటర్లుగా గెలుపొందిన అభ్యర్థుల్లో 78 మంది మహిళలు ఉండగా, 71 మంది పురుషులు ఉన్నారు. వీరిలో 29 ఏళ్లలోపు వారు 10 మంది ఉండగా, 30–39 ఏళ్లలోపు వారు 43 మంది, 40–49 ఏళ్లలోపు వారు అత్యధికంగా 59 మంది, 50–59 ఏళ్లలోపు వారు 35 మంది ఉన్నారు. 60 వయసు దాటిన వారు కేవలం(లింగోజిగూడ, రియాసత్‌నగర్) ఇద్దరే ఉన్నారు. పత్తర్‌గట్టి, ఉప్పుగూడ, నవాబ్‌సాబ్‌కుంట, కవాడిగూడ, యూసూఫ్‌గూడ, సీతాఫల్‌మండీ అభ్యర్థులు అవివాహితులు. వీరంతా వైవాహిక జీవితానికి ముందే రాజకీయాల్లో అడుగుపెట్టడం గమనార్హం. యువతతోనే మార్పు హుడాకాంప్లెక్స్: ‘రాజకీయాలను చాలామంది బురద గుంటలా భావిస్తుంటారు. అందులోకి దిగితే ఎక్కడ తమకు అంటుకుంటుందోనని భయపడుతుంటారు. నీతి, నిజాయితీ, సేవాభావం కలిగిన వారు రాజకీయాలకు దూరంగా ఉండటం వల్ల అవినీతిపరులు, స్వార్థపరులు, వ్యాపారులు, రౌడీలు రాజకీయాల్లో వస్తున్నారు. ఎన్నికల్లో రూ.కోట్లు ఖర్చు చేసి గెలుపొందుతున్నారు. చట్టసభల్లో అడుగుపెట్టిన తర్వాత అవినీతికి పాల్పడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. యువత, ముఖ్యంగా అంకితభావంతో ప్రజలకు సేవ చేసే వారు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. వారితోనే రాజకీయాల్లో మార్పు సాధ్యమవుతుందని సరూర్‌నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి(38) అభిప్రాయపడ్డారు. సమాజసేవపై మక్కువతో రాజకీయాల్లోకి అడుగు పెట్టినట్లు ఆమె చెప్పారు. తల్లిదండ్రులది ప్రభుత్వ ఉద్యోగ నేపథ్యం. అత్తమామలది రాజకీయ నేపథ్యం. చిన్నప్పటి నుంచే నాకు రాజకీయంపై ఆసక్తి ఉంది. ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజీ, యూనివర్సిటీ రోజుల్లో విద్యార్థి సంఘంలో చురుకైన పాత్ర పోషించాను. ఎంఏ ఎకానామిక్స్‌లో డిస్టింక్షన్ సాధించాను. ఉన్నత చదువులు చదివిన నాకు నా భర్త అంజన్‌కుమార్ కుటుంబం ద్వారా నాకు రాజకీయ వారసత్వం లభించింది. గత ఎన్నికల్లో మా మామ, బావ పోటీ చేసి ఓడిపోయారు. అయినా వారు నిరుత్సాహపడలేదు. వారిచ్చిన ప్రోత్సాహంతోనే సరూర్‌నగర్ డివిజన్ నుంచి పోటీ చేశాను. ఓటర్లు నన్ను ఆదరించి ఎన్నికల్లో గెలిపించారు. బంధుప్రీతి, అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజాసేవ చేస్తాను’ అని ఆమె వివరించారు. క్రీడల నుంచి రాజకీయాల్లోకి.. కాప్రా: గ్రేటర్ ఎన్నికల్లో రెండోసారి గెలుపొంది సత్తాచాటిన కాప్రా సిట్టింగ్ కార్పొరేటర్, టీఆర్ఎస్ అభ్యర్థి స్వర్ణరాజ్ శివమణి రాజకీయాల్లోనే కాదు క్రీడల్లోనూ సత్తా చాటాడు. రాష్ట్రస్థాయి, జాతీయస్థాయిలో ఫుట్‌బాల్ క్రీడాకారుడైన స్వర్ణరాజ్ మైనంపల్లి హన్మంతరావు స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రం తరఫున రాష్ట్ర, జాతీయస్థాయి ఫుట్‌బాల్ క్రీడలో పాల్గొని తనదైన శైలిలో ఆటతీరు కనబర్చారు. కాప్రా సర్కిల్ ప్రస్తుతం పరిచయం అక్కర్లేని రాజకీయ నాయకుడు స్వర్ణరాజ్. డివిజన్లో ప్రజల సమస్యలు, తన సమస్యలుగా భావించి సత్వర పరిష్కారమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాడు. ఎక్కడ సమస్య ఉన్నా నేనున్నాననే భరోసా కల్పించి ప్రజల మన్ననలు పొందుతున్నాడు. స్వర్ణరాజ్ క్రీడాకారుడే కాకుండా రాజకీయాల్లోకి రాకముందు హార్డ్‌వేర్ ఇంజినీర్ కూడా.. యువత క్రీడల వైపు దృష్టి సారించేలా కందిగూడలో బాస్కెట్ బాల్ గ్రౌండ్ నిర్మించారు. స్వర్ణరాజ్ శివమణి కార్యకర్త కుటుంబం నుంచి.. అంబర్‌పేట: ఆమె తండ్రి టీఆర్ఎస్ పార్టీలో సామాన్య కార్యకర్త. బస్తీలో చిన్నపాటి లీడర్. పార్టీ జెండాలు మోయడం, అభ్యర్థుల గెలుపుకోసం కష్టపడి పనిచేయడం చేసేవారు. ఎన్నికల సమయంలో రత్నానగర్ బస్తీలో అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకునేవారు. బస్తీలకు వచ్చిన నాయకులకు జైకొడుతుండేవారు. చిన్నప్పటి నుంచి తండ్రి కష్టాన్ని దగ్గరగా చూసిన దూసరి లావణ్యకు ప్రజాసేవ అంటే ఇష్టం. పెళ్లి తర్వాత భర్త దూసరి శ్రీనివాస్‌గౌడ్ కుటుంబం సైతం అదే బస్తీలోనే నివాసం ఉండేది. భర్త శ్రీనివాస్‌గౌడ్‌కు చిన్నప్పటి నుంచి కష్టపడే మనస్తతత్వం. ఎవరు ఏ పని అప్పగించినా విజయవంతంగా పూర్తి చేసేవారు. భర్త కూడా రాజకీయాల్లో చురుగ్గా ఉండటంతో అతడికి అన్నివిధాలుగా ప్రోత్సాహం ఉండేది. భర్త ప్రోత్సాహంతో టీఆర్ఎస్ తరఫున పోటీలో దిగి విజయం సాధించారు దూసరి లావణ్య. బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తానని తెలిపారు. భర్త, పిల్లలతో .. డాక్టర్.. నుంచి కార్పొరేటర్‌గా.. బహదూర్‌పురా: బహదూర్‌పురా నియోజకవర్గం నవాబ్‌సాబ్‌కుంట డివిజన్ నుంచి మజ్లిస్ పార్టీ అభ్యర్థి షరీన్ ఖతూన్(26) రెండోసారి కార్పొరేటర్‌గా విజయం సాధించింది. 21 ఏళ్ల వయస్సులో గ్రాడ్యుయేషన్ చేస్తూ మజ్లిస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించింది. ప్రస్తుతం డాక్టర్ ఇన్ ఫార్మసీ కోర్సు పూర్తిచేసి ఆస్పత్రిలో పనిచేస్తూనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మళ్లీ మజ్లిస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అటు ఉన్నత చదువులు కొనసాగిస్తూనే డివిజన్ ప్రజలతో మమేకమవుతూ సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తున్నారు. తండ్రి అన్నాన్తో కలిసి స్థానిక బస్తీల్లో పర్యటిస్తూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తున్నారు. నిరక్షరాస్యులు ఐదుగురే.. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సీపీఎం, సీపీఐ, టీజేఏసీల నుంచే కాకుండా పలువురు స్వతంత్రులు పోటీ చేశారు. ఇలా మొత్తం 1,122 మంది పోటీ చేశారు. వీరిలో 600పైగా గ్రాడ్యూయేట్లు ఉన్నారు. ఇప్పటి వరకు గెలుపొందిన 149 మంది అభ్యర్థుల్లో 102 మంది విద్యాధికులే. వీరిలో 80 మంది బీఏ, బీకాం, బీఎస్సీ, బీఈ కోర్సులు పూర్తి చేసిన వారు ఉండగా, 13 మంది ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ కోర్సులను పూర్తి చేశారు. మరో ఇద్దరు ఎంబీఏ, ముగ్గురు బీటెక్, ఒకరు ఎంటెక్, ఇద్దరు వైద్య విద్యను పూర్తి చేశారు. ఒకరు ఎంసీఏ, పదో తరగతి పూర్తి చేసిన వారు 18 మంది ఉండగా, ఇంటర్మీడియట్ చదివిన వారు 11 మంది ఉన్నారు. ఐదుగురు నిరక్షరాస్యులు ఉండగా, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిదో తరగతి చదువుకున్న వారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. అంతేకాదు 2009, 2016లోని జీహెచ్ఎంసీ పాలకవర్గంలో విద్యావంతులు శాతం 50లోపే ఉండగా ఈ సారి ఏకంగా 68 శాతానికి పెరగడం విశేషం. చిన్నవయసులో.. కవాడిగూడ: డిగ్రీ బీకాం చదువుతుండగానే 22 ఏళ్ల వయసులోనే ఆమెకు బీజేపీ తరఫున పోటీ చేసే అవకాశం వచి్చంది. పేద దళిత కుటుంబానికి చెందిన రచనశ్రీ తండ్రి టెంట్‌హౌస్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దాదాపు 36 ఏళ్లుగా ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్, బీజేపీలో పనిచేసిన అనుభవం ఉంది. అతడి సేవలకు గానూ బీజేపీ రచనశ్రీని కవాడిగూడ డివిజన్ నుంచి అభ్యర్థిగా పోటీలో నిలిపింది. ఆమె తరఫున పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్థి లాస్యనందితపై 1,468 ఓట్ల మెజారీ్టతో ఆమె విజయం సాధించారు. రాజకీయ అనుభవం లేకున్నప్పటికీ పేదల కష్టాలపై తన తండ్రి చేస్తున్న పోరాటాన్ని దగ్గరగా చూసిన అనుభవం, ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రత్యక్షంగా చూసినందున వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. 22 ఏళ్లకే రాజకీయాల్లోకి.. చిలకలగూడ: ప్రపంచంలోని అన్ని అంశాలను ఫింగర్ టిప్స్‌పై ఆవిష్కరిస్తూ ఎన్నో విషయాలను తెలియజేస్తున్న గూగుల్ సంస్థ ఉద్యోగి ఆమె. 2016లో రాజకీయ రంగంలో అవకాశం రావడంతో ప్రజాసేవ చేసే ఆలోచనతో సరేనంది. కట్ చేస్తే 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున అత్యధిక మెజారీ్టతో సీతాఫల్మండి డివిజన్ కార్పొరేటర్‌గా విజయం సాధించింది సామల హేమ. అప్పటి నుంచి నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తూ స్థానికులకు మరింత దగ్గరైంది. మరోమారు అవకాశం రావడంతో విజయకేతనం ఎగురవేసింది. ఎంబీఏ పూర్తి చేసిన ఆమె ప్రస్తుతం బిజినెస్ మేనేజ్మెంట్ అంశంపై పీహెచ్డీ చేస్తున్నారు. 22 వయసులోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె కొద్దిరోజుల్లోనే తనదైన ముద్ర వేసింది. ఉద్యోగంలో ఎంత ఉత్సాహంగా ఉన్నానో, రాజకీయాల్లోకి వచి్చన తర్వాత కూడా అంతే ఆనందంగా ఉన్నానని, చెప్పులు అరిగేలా తిరిగిన వృద్ధురాలికి ఫించను అందిస్తే ఆమె కళ్లలో కనిపించే మెరుపే నాకు అనంతమైన ఆత్మసంతృప్తి ఇస్తుందని చెప్పారు. అతి పిన్న వయసు చాంద్రాయణగుట్ట: జీహెచ్ఎంసీలోనే 2016 ఎన్నికల్లో అతి పిన్న వయసు(21)లో కార్పొరేటర్‌గా గెలుపొందిన ఉప్పుగూడ కార్పొరేటర్ ఫహద్ బిన్ అబ్దుల్ సమద్ బిన్ అబ్దాద్ రెండోసారి కూడా 26 ఏళ్ల వయసులో ద్వితీయ విజయాన్ని అందుకున్నాడు. మజ్లిస్, బీజేపీల నడుమ జరిగిన పోరులో 8,006 ఓట్ల మెజారీ్టతో మజ్లిస్ తరఫున విజయం సాధించారు. బీఈ చదువుతున్న సమయంలోనే మొదటిసారి కార్పొరేటర్‌గా గెలిచిన ఫహద్ ఐదేళ్ల పాటు ప్రజల మధ్యే ఉంటూ అభిమానాన్ని చూరగొని రెండోసారి గెలుపును తన ఖాతాలో వేసుకున్నారు. మూడేళ్ల క్రితం ఫహద్‌కు వివాహం జరిగింది. కుల, మత, రాజకీయాలకతీతంగా చేసిన అభివృద్ధే తనకు మరోసారి అవకాశం కల్పించిందని ఆయన చెప్పారు. నాడు సాఫ్ట్వేర్ ఇంజినీర్ మల్కాజిగిరి: ప్రజాసేవ కోసమే సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చారు శ్రవణ్. 40 సంవత్సరాలుగా అతడి తండ్రి ఎలాంటి పదవి ఆశించకుండా బీజేపీ కార్యకర్తగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నారు. కుటుంబ సభ్యులు, పార్టీ, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు మద్దతుతో మల్కాజిగిరి డివిజన్ కార్పొరేటర్‌గా పోటీచేసే అవకాశం రావడంతో గెలుపొందారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని ఆయన తెలిపారు. నాడు రేషన్ డీలర్.. నేడు కార్పొరేటర్ అబిడ్స్: గోషామహాల్ డివిజన్లో అందరినోట అతడు సుపరిచితుడు. 30 సంవత్సరాలుగా గోషామహాల్ డివిజన్ పరిధిలోని ధూల్‌పేట్‌లో లాల్‌సింగ్ రేషన్ డీలర్. బీజేపీలో చురుకైన కార్యకర్తగా ఉంటూ ఓ వైపు రేషన్ షాపు నడుపుతూ.. మరోవైపు బీజేపీలో సైతం కొనసాగుతున్నాడు. గోషామహాల్ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన లాల్‌సింగ్ 7,369 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్ ముఖేష్‌సింగ్‌ను ఓడించారు. భారీ మెజార్టీతో విజయం సాధించడంతో అతడి ఆనందానికి అవధులు లేవు. 59 సంవత్సరాల లాల్‌సింగ్‌కు ఇద్దరు పిల్లలు. ఊహించని స్థాయిలో విజయం సాధించడంతో సంబురపడుతున్న లాల్‌సింగ్ మాట్లాడుతూ.. తాను ఇక నుంచి పూర్తిగా ప్రజాసేవలో మునిగిపోతానన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించారని, వారికి అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి, మౌలిక సదుపాయాల రూపకల్పనకు కృషి చేస్తానన్నారు. మేనత్త, మేనల్లుడి విజయం కుత్బుల్లాపూర్: వారు వరుసకు బంధువులు.. ఒకరు మూడుసార్లు కార్పొరేటర్‌గా గెలిస్తే.. మరొకరు రెండుసార్లు గెలిచారు. రంగారెడ్డినగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా మూడుసార్లు విజయం సాధించిన విజయ్‌శేఖర్‌గౌడ్, కుత్బుల్లాపూర్ డివిజన్ నుంచి రెండుసార్లు కార్పొరేటర్‌గా ఎన్నికైన గౌరీష్ పారిజాతగౌడ్ మేనత్త, మేనల్లుడు కావడం విశేషం. అధికార టీఆర్ఎస్ పార్టీ మరోమారు సిట్టింగ్‌లకే సీట్లు ఇవ్వడంతో వీరిద్దరూ విజయం సాధించారు. మూడుసార్లు మూడు పార్టీలు సైదాబాద్: ఐఎస్‌సదన్ ఓటర్లు గ్రేటర్ ఎన్నికల్లో ప్రతీసారి భిన్నంగా తీర్పునిస్తున్నారు. ఐఎస్‌సదన్ డివిజన్‌గా ఏర్పడిన తర్వాత నిర్వహించిన మూడు ఎన్నికల్లో మూడు పార్టీల అభ్యర్థులను గెలిపించారు. సైదాబాద్‌లో అంతర్భాగంగా ఉన్న ఐఎస్‌సదన్ 2009లో చేసిన పునరి్వభజనలో భాగంగా డివిజన్‌గా ఏర్పడింది. 2009లో జరిగిన ఎన్నికల్లో మొదటిసారి ఐఎస్‌సదన్ నుంచి టీడీపీ అభ్యర్థి మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి అప్పటి బీజేపీ అభ్యర్థి సామ సుందర్‌రెడ్డిపై గెలిచారు. ఆ తర్వాత 2016లో టీఆర్ఎస్ అభ్యరి్థగా రంగంలోకి దిగిన సామ స్వప్నాసుందర్‌రెడ్డి బీజేపీ అభ్యర్థి సునీతారెడ్డిపై గెలిచారు. ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి నిలిచిన జంగం శ్వేతామధుకర్‌రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ కార్పొరేటర్ సామ స్వప్నాసుందర్రెడ్డిపై గెలిచి విజయకేతనం ఎగురవేశారు. ఇలా డివిజన్ ఓటరు ప్రతీ గ్రేటర్ ఎన్నికల్లో ఇక్కడ పార్టీ మార్పును కోరుకుంటూ టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ అభ్యరి్థకి ఒక్కోసారి అవకాశం ఇచ్చారు. పచ్చపార్టీకి తీవ్ర పరాభవం సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీని గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. హైదరాబాద్‌ను తామే అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకునే టీడీపీకి గ్రేటర్ ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. హైటెక్ సిటీని తామే నిరి్మంచామని, చంద్రబాబు విజన్‌తోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని డబ్బా కొట్టే పచ్చ పారీ్టకి గ్రేటర్ ప్రజలు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. 38 ఏళ్ల పార్టీ చరిత్ర ఉన్న టీడీపీ గ్రేటర్‌వాసులు నమ్మలేదు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, 2016 జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ పరాభవం పాలైంది. ఈ సారి గ్రేటర్ ఎన్నికల్లో కనీసం ఉనికి కూడా చాటుకోలేకపోయింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ పూర్తిస్థాయిలో ఓటమిపాలైంది. అంతేకాదు ఆ పార్టీ అభ్యర్థులకు అన్నిచోట్లా డిపాజిట్ గల్లంతైంది. ఈ ఘోర పరాజయంతో నగరాన్ని ప్రపంచపటంలో పెట్టానని చెప్పుకుంటున్న చంద్రబాబు మాటల్లోని డొల్లతనం వెల్లడికావడంతో పాటు ఆ పార్టీ సంపూర్ణంగా నగర రాజకీయ ముఖచిత్రం నుంచి కనుమరుగైనట్టేనని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా దశలవారీగా కనుమరుగవుతూ వచి్చన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు హయాంలో హైదరాబాద్‌లో తన ప్రస్థా నాన్ని అత్యంత అవమానకరంగా ముగించింది. 92 డివిజన్ల్లో వెయ్యిలోపు ఓట్లు ఈసారీ గ్రేటర్ ఎన్నికల్లో ఆర్భాటానికి పోయి ఏకంగా 106 డివిజన్లలో అభ్యర్థులను బరిలో దింపిన ఆ పారీ్టకి ఎక్కడా డిపాజిట్ కూడా దక్కలేదు. గ్రేటర్ పరిధిలో టీడీపీ అభ్యర్థులు పోటీ చేసిన ఒక్క డివిజన్లో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు సాధించలేకపోయారు. పోటీ చేసిన 106 డివిజన్లలో 92 డివిజన్లలో వెయ్యిలోపు ఓట్లు పడ్డాయి. 14 డివిజన్లలో వెయ్యి ఓట్లు కంటే తక్కువ నమోదయ్యాయి. 65 డివిజన్లలో కేవలం 100 కంటే తక్కువ జనం ఓట్లు వేశారు. ఎస్సదన్లో టీడీపీ అభ్యరి్థకి అతితక్కువగా 22 ఓట్లు పడ్డాయి. కేపీహెచ్‌బీ డివిజన్లో అత్యధికంగా 2,656 ఓట్లు పడ్డాయి. బాలాజీనగర్ డివిజన్లో 2,252 ఓట్లు, వీవీనగర్‌లో 2,297 ఓట్లు, హైదర్‌నగర్‌లో 2,119 ఓట్లు పడ్డాయి. తక్కువగా ఘాన్సీబాజార్లో 54 , కూర్మగూడ 55, కిషన్‌బాగ్‌లో 71, దూద్»ౌలిలో 82 ఓట్లు పడ్డాయి. -
వలసలపై ఫోకస్
సాక్షి, హైదరాబాద్: పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి... ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలి. వీలైనంత త్వరగా తెలంగాణ అంతటా బలోపేతం కావాలి. మిషన్– 2023 లక్ష్యంగా దూసుకెళ్లాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కమలనాథులు శరవేగంగా వ్యూహరచన చేస్తున్నారు. పకడ్బందీగా భవిష్యత్ ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రాంతాల వారీగా బలాబలాలను బేరీజు వేసుకుంటున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ‘సర్జికల్ స్ట్రైక్’ఇచ్చిన ఉత్సాహంతో బీజేపీ ఇప్పుడు... ‘సాఫ్రాన్ స్ట్రైక్’కు పదును పెడుతోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల్లోని అసంతృప్త, కీలక నేతలను కాషాయదళంలోకి తీసుకురావడంపై ప్రత్యేకదృష్టి పెట్టింది. ఎవరెవరు వస్తారు, ఎవరైతే మనకు లాభం... అనే కోణంలో పార్టీల వారీగా... పక్కాగా జాబితాలను సిద్ధం చేస్తోంది. పార్టీలోకి వచ్చే నాయకులతో మాట్లాడే బాధ్యతలు ముఖ్యులకు అప్పగించి... అధినాయకత్వంతో భవిష్యత్తుకు భరోసా ఇప్పిస్తోంది. ఢిల్లీ కేంద్రంగా ఆపరేషన్ ఆకర్ష్‌ను నడిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు 2023లో వచ్చినా, అంతకుముందే వచ్చినా.. సర్వసన్నద్ధంగా ఉండేలా పార్టీ శ్రేణులను కార్యోన్ముఖులను చేస్తోంది. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చే లక్ష్యంతో భవిష్యత్తు కార్యాచరణను రూపొందించింది. ఇందులో భాగంగా గతంలో బీజేపీ గెలిచిన స్థానాలు, గట్టిపోటీనిచ్చిన స్థానాలు, ప్రజలు బీజేపీపై ఆదరణ చూపిన ప్రాంతాల్లో మొదట పట్టు సాధించాలనే వ్యూహంతో ముందుకు సాగుతోంది. వాటితో పాటు దశలవారీగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలపైనా దృష్టి పెట్టేలా కార్యాచరణ అమలులో పెట్టనుంది. పక్కాగా చేరికల వ్యూహం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో పలువురు నాయకులు కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల నుంచి బీజేపీలో చేరారు. వారిలో మాజీ మంత్రి డీకే అరుణ, జితేందర్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రాపోలు ఆనందభాస్కర్, వీరేందర్‌గౌడ్, బొడిగె శోభ తదితరులున్నారు. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ నేత, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ కుమారుడు విక్రమ్‌గౌడ్‌లను పార్టీలోకి తీసుకొచ్చింది. తాజాగా కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్పర్సన్ విజయశాంతిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా... టీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై ఆపరేషన్ సాఫ్రాన్ స్ట్రైక్‌కు శ్రీకారం చుట్టింది. బడానేతలకు గురిపెడితే... అవతలిపక్షాన్ని దెబ్బకొట్టడంతో పాటు బీజేపీవైపు ఆకర్షితులయ్యే వారి సంఖ్య పెరుగుతుందని భావిస్తోంది. మరోవైపు సామాజిక సమీకరణాలకూ ప్రాధాన్యం ఇస్తోంది. ఢిల్లీ కేంద్రంగా ఆపరేషన్ ఆకర్ష్‌ను అమలు చేస్తూ వలసల వ్యూహానికి పదును పెట్టింది. వరుస ఓటములతో డీలాపడ్డ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరే 20 మందికిపైగా నేతల జాబితాను రూపొందించినట్లు తెలిసింది. టీఆర్ఎస్ నుంచి కూడా అసంతృప్తుల వలసలు ఉంటాయని, అలా వచ్చే అవకాశమున్న వారితో జాబితాను కూడా సిద్ధం చేసినట్లు తెలిసింది. కొందరు ఎమ్మెల్యేలు కూడా వస్తారనే ధీమాతో ఉంది. వారితో సంప్రదింపులు జరిపే బాధ్యతను పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు మరికొందరు ముఖ్యనేతలకు అప్పగించింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రితో బీజేపీ ముఖ్యనేత ఒకరు ఇప్పటికే చర్చలు జరిపారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్రయాదవ్ ఇటీవల స్వయంగా భేటీ అయ్యారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి బీజేపీలో చేరుతారంటూ గతంలోనే ప్రచారం జరిగింది. మరోవైపు నాగార్జునసాగర్‌కు ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కుటుంబంతో బీజేపీ వర్గాలు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ముందుగా రంగారెడ్డి, మహబూబ్‌నగర్ హైదరాబాద్ సరిహద్దుల్లోని ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలపై బీజేపీ మొదట ఫోకస్ పెట్టింది. 1996లో హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో అప్పటి ఎంఐఎం చీఫ్ సలావుద్దీన్ ఒవైసీ చేతిలో వెంకయ్యనాయుడు ఓడిపోయినా... గట్టిపోటీనిచ్చారు. అప్పుడు హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్న చేవెళ్ల, పరిగి, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీకి అత్యధిక ఓట్లు లభించాయి. అందుకే అక్కడి నుంచి తమ కార్యాచరణ ప్రణాళికను అమలు చేసేందుకు పూనుంది. కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో టచ్‌లో ఉంది. మహమూబ్నగర్లోనూ పార్టీ కేడర్ బలంగా ఉందని విశ్వసిస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో మహబూబ్‌నగర్‌లో యెన్నం శ్రీనివాస్‌రెడ్డి బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న మాజీ ఎంపీ ఏపీ జితేందర్రెడ్డిది ఈ జిల్లాయే. దీనికితోడు జిల్లాలో పార్టీ విస్తరణను దృష్టిలో పెట్టుకొని డీకే అరుణకు ప్రాధాన్యత ఇచ్చిన బీజేపీ ఆమెను జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించింది. వీరిద్దరి నేతృత్వంలో మహబూబ్‌నగర్‌పై ప్రత్యేక దృష్టి సారించి పని చేసేలా బీజేపీ వ్యూహం రూపొందిస్తోంది. వరంగల్ కార్పొరేషన్లో పట్టు కోసం.. త్వరలో రానున్న గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ సత్తా చాటే దిశగా బీజేపీ పావులు కదుపుతోంది. ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీజేపీకి మంచి పట్టున్న స్థానాలు ఉన్నాయి. దేశంలో బీజేపీకి రెండే ఎంపీ స్థానాలు ఉన్న 1984లో హన్మకొండ నుంచి చందుపట్ల జంగారెడ్డి బీజేపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. అంతేకాదు పరకాల నియోజకవర్గం నుంచి 1985లోనే వి.జయపాల్ బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో మార్తినేని ధర్మారావు హన్మకొండ ఎమ్మెల్యేగా ఉన్నారు. మేయర్‌గా డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు బీజేపీ నుంచే పని చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా గ్రామీణ, పట్టణప్రాంతాల్లో బీజేపీకి మంచి కేడర్ ఉంది. అందుకే వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలపై గురి పెట్టింది. అక్కడ పార్టీ బలోపేతానికి ఈ ఎన్నికను పునాదిగా చేసుకోవాలని భావిస్తోంది. ఉత్తర తెలంగాణలో ముగ్గురు ఎంపీలపై భారం వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్ధిపేట్ మున్సిపల్ ఎన్నికల తరువాత మొత్తంగా ఉత్తర తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించి పని చేయాలని భావిస్తోంది. అందుకు ఇప్పుడు కార్యాచరణ ప్రణాళికలను కూడా సిద్ధం చేస్తోంది. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ పైనే ఉమ్మడి జిల్లాలో పార్టీ విస్తరణ బాధ్యత పెట్టారు. నిజామాబాద్‌లో ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ వంటి నేతలు ఉన్నారు. ఆదివాలాబాద్లో ఎంపీగా సోయం బాపురావు గెలిచారు. కాబట్టి ఆయా జిల్లాల్లో పార్టీ విస్తరణకు కోసం పెద్ద ఎత్తున చేరికలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ టీఆర్ఎస్లోని అసంతృప్త నేతలే టార్గెట్‌గా ముందుకు వెళుతోంది. మెదక్ జిల్లాపైనా కసరత్తు చేస్తోంది. దుబ్బాకలో బీజేపీ విజయం... పార్టీలోకి వలసలను పెంచుతుందనే ధీమాలో ఉంది. ఇక చివరగా ఖమ్మం, నల్గొండ జిల్లాలపై దృష్టి సారించేలా చర్యలు చేపడుతోంది. క్యాడర్ ఉంది... లీడర్లు కావాలి... రాష్ట్రంలో ఒకప్పుడు బీజేపీకి పట్టున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిం చింది. చాలాచోట్ల గ్రామీణ ప్రాంతా ల్లోనూ పార్టీకి కేడర్ ఉందని, సైలెంట్ ఓటర్లు ఉన్నారని... బలమైన నాయకత్వం అవసరమని భావి స్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీలోకి వచ్చే నేతల జాబితాలను సిద్ధం చేస్తోంది. ఒకప్పుడు హైదరాబాద్‌లో బలంగా ఉన్న పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతింది. ఆ తరువాత 2019లో తెలంగాణలో అనూహ్యంగా నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకుంది. బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడు అయ్యాక దుబ్బాకలో సంచలన విజయం సాధించిన బీజేపీ... జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అంచనాలకు మించి రాణించింది. గ్రేటర్లో పట్టు నిలిచిందని భావిస్తున్న కమలనాథులు... రాష్ట్రవ్యాప్తంగా విస్తరణపై దృష్టి సారించారు. -
నేరేడ్మెట్ కార్పొరేటర్ ఎన్నికపై హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: నేరేడ్మెట్ డివిజన్లో జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితం వెల్లడికి అడ్డంకి తొలగింది. నేరేడ్మెట్ కార్పొరేటర్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.ఇతర ముద్రతో ఉన్న ఓట్లను పరిగణనలోకి తీసుకునేందుకు హైకోర్టు అనుమతి సోమవారం ఆదేశాలు ఇచ్చింది. స్వస్తిక్ గుర్తు బదులు మరొక గుర్తుకు వచ్చిన 544 ఓట్లను లెక్కించాలంటూ తీర్పునిచ్చిన హైకోర్టు... లెక్కించకుండా మిగిలిపోయిన ఓట్లను పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది. స్వస్తిక్ గుర్తు కాకుండా ఇతర గుర్తులు ఉంటే... రిటర్నింగ్ ఆఫీసరే తుది నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు ఎన్నికల కమిషన్‌కు విచక్షణ అధికారం ఉంటుందని న్యాయస్థానం పేర్కొంది. అలాగే ఎన్నికల సంఘం వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. స్వస్తిక్ గుర్తుతో పాటు ఇతర గుర్తులను పరిగణనలోకి తీసుకోవాలని ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇవ్వగా, దాన్ని సవాల్ చేస్తూ బీజేపీ నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇరు పక్షాల వాదనలు విన్నఅనంతరం హైకోర్టు ఈ మేరకు తీర్పు నిచ్చింది. అలాగే బీజేపీ లీగల్ సెల్ ఇంచార్జి ఆంటోనీ రెడ్డి పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఎన్నికపై వివాదం ఉంటే ఎన్నికల ట్రిబ్యునల్‌ను ఆశ్రయించ వచ్చునన్న న్యాయస్థానం తెలిపింది. దీంతో నేరేడ్మెట్ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది. కాగా ఈనెల 1న జరిగిన పోలింగ్‌లో డివిజన్లోని చాలా పోలింగ్ కేంద్రాల్లో అవకతవకలు జరిగాయని, అధికార పార్టీకి ఎన్నికల అధికారులు అనుకూలంగా వ్యవహరించి 600కుపైగా చెల్లని ఓట్లను టీఆర్ఎస్ ఖాతాలో వేశారని బీజేపీ అభ్యర్థి ప్రసన్ననాయుడు ఆరోపించారు. తమతో పాటు కాంగ్రెస్ పార్టీ ఈ విషయమై ఎన్నికల అధికారిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆమె వివరించారు. డివిజన్లో మొత్తం పోలైన ఓట్లకు, కౌటింగ్లో అధికారులు చెబుతున్న ఓట్ల సంఖ్యకు మధ్య తేడా ఉందన్నారు. ఇక 50వ పోలింగ్ కేంద్రంలోని 544 ఓట్లపై స్వస్తిక్ గుర్తుకు బదులు వేలిముద్రతో పాటు వేరే ఇంకు గుర్తులు ఉన్న అంశం కోర్టు విచారణలో ఉందని, ఈ ఓట్లపై కోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. పొరపాట్లకు కారణమైన అధికారులపై కోర్టుకు వెళతానని ప్రసన్న నాయుడు స్పష్టం చేశారు. -
మాటల యుద్ధమే చేటు తెచ్చిందా?
సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ ఎన్నికల బరిలో లేని డివిజన్లలో సంప్రదాయ ఓటు బ్యాంక్ సైలెంట్‌గా టీఆర్ఎస్ను దెబ్బతీసింది. మజ్లిస్‌పై మాటల దూకుడు కారుకు చేటు తెచ్చి పెట్టినట్లయింది. టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలు కమలనాథుల వశం కావడంతో పాతబస్తీలో కారు అడ్రస్ గల్లంతైంది. నగరంలోని ఇతర ప్రాంతాల్లో సైతం మజ్లిస్ సంప్రదాయ ఓట్ల ప్రభావం టీఆర్ఎస్పై పడింది. ముస్లిం గళంగా మారి పాతబస్తీ రాజకీయాలను శాసిస్తున్న ఎంఐఎం పార్టీ నగరంలోని ముస్లిం ప్రాబల్యమున్న ప్రాంతాల్లో సైతం సంప్రదాయ ఓటు బ్యాంక్ కలిగి ఉంది. గత ఆరేళ్లుగా అధికార టీఆర్ఎస్తో దోస్తానా కొనసాగుతున్నప్పటికీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి పొత్తులు, సీట్ల సర్దుబాటు లేకుండా స్నేహపూర్వక పోటీ పేరుతో బరిలో ఒంటరిగా దిగుతూ వస్తోంది. మజ్లిస్ బరిలో లేనిప్రాంతాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను బలపర్చడమే కాకుండా ఏకంగా ఓటు వేసి గెలిపించాలంటూ పార్టీ సంప్రదాయ ఓటర్లకు విజ్ఞప్తి చేయడం ఆనవాయితీగా మారింది. కానీ.. జీహెచ్ఎసీం ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్– మజ్లిస్ మధ్య మాటల యుద్ధం దోస్తీ కటీఫ్‌కు దారితీసి ఫలితాలపై ప్రభావం చూపినట్లయింది. ప్రాతినిధ్య సెగ్మెంట్లలో సైతం.. అసెంబ్లీ ప్రాతినిధ్యం గల సెగ్మెంట్లల్లోని కొన్ని డివిజన్లలో సైతం లోపాయికారీ ఒప్పందం కారణంగా ఎన్నికల బరికి దూరం ఉంటూ అధికార పక్షానికి సహకరిస్తూ రావడం మజ్లిస్ పార్టీ ఆనవాయితీ. మలక్‌పేట అసెంబ్లీ సెగ్మెంట్లోని సైదాబాద్, మూసారంబాగ్, యాకుత్‌పురాలోని ఐఎస్ సదన్ డివిజన్ల్లో మజ్లిస్ పార్టీ ఎన్నికల బరిలో దిగని కారణంగా టీఆర్ఎస్కు కలిసి వచ్చేది. అధిష్టానం ఆదేశాల మేరకు మజ్లిస్ కేడర్ కూడా బాహాటంగా టీఆర్ఎస్కు సహకరిస్తూ వచ్చేది. తాజా పరిణామాల దృష్ట్యా మజ్లిస్ కేడర్ టీఆర్ఎస్కు దూరం పాటించింది. మజ్లిస్ సంప్రదాయ ఓటర్లు కూడా మొగ్గుచూపకపోవడంతో మూడు సిట్టింగ్ స్థానాలు కమలం ఖాతాలో చేరడం టీఆర్ఎస్కు మింగుపడటంలేదు. కొంత పట్టున్న డివిజన్లల్లో.. మజ్లిస్ పార్టీకి జూబ్లీహిల్స్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, రాజేంద్రనగర్, ఖైరతాబాద్ ముషీరాబాద్, అంబర్‌పేట, ఎల్బీనగర్, సికింద్రాబాద్, పటాన్‌చెరూ అసెంబ్లీ సెగ్మెంట్లలో సైతం కొంత వరకు సంప్రదాయ ఓటుబ్యాంక్ ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, ముషీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి రెండు చొప్పున మాత్రమే బరిలో దిగిన మజ్లిస్ తమ సంప్రదాయ ఓటు బ్యాంక్‌ను పదిలపర్చుకోగా, మిగతా డివిజన్ల విషయంలో అధికార పక్షంతో మైత్రి తెగిన కారణగా పార్టీ కేడర్‌కు ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. ఆయా డివిజన్లలోని పార్టీ కేడర్ కూడా దూరం పాటించడంతో టీఆర్ఎస్కు నష్టం వాటిల్లినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
‘గ్రేటర్’ తీర్పు: కారుకు బ్రేక్.. కమలానికి షాక్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. ఆయా పార్టీల ఆధిక్యతలపై స్పష్టమైన ప్రభావం చూపింది. ఎక్కువ స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన టీఆర్ఎస్ దాదాపు 17 చోట్ల స్వల్ప తేడాలతో విజయానికి దూరమైంది. బీజేపీ స్వల్ప తేడాతో ఓడిన స్థానాల్లోనూ నోటాకు ఎక్కువ ఓట్లు పడడం ఆ పార్టీ అభ్యర్థుల భవితవ్యాన్ని తలకిందులు చేసింది. ఇలా స్వల్ప తేడాతో ఓడిన స్థానాల్లో పరాజయానికి కారణాలపై ఆయా పార్టీలు విశ్లేషించుకునే పనిలో పడ్డాయి. అయితే.. బీఎన్‌రెడ్డి నగర్లో 32 ఓట్ల తేడాతో టీఆర్ఎస్ ⇔ బంజారాహిల్స్ డివిజన్లో టీఆర్ఎస్కు 10,227, బీజేపీకి 9,446 ఓట్లు వచ్చాయి. నోటాకు 805 ఓట్లు వచ్చాయి. 126 చెల్లని ఓట్లు ఉన్నాయి. బీజేపీ 781 ఓట్లతో తేడాతో ఓడిపోయింది. ఇక్కడా నోటాకు 805 ఓట్లు రావడం బీజేపీ ఓటమిపై ప్రభావాన్ని చూపింది. ⇔ మచ్చబొల్లారం డివిజన్లో టీఆర్ఎస్కు 12,089, బీజేపీకి 12,055 ఓట్లు వచ్చాయి. కేవలం 34 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి ఓడిపోయారు. ఇక్కడా నోటాకు 302 ఓట్లు పడడం కూడా టీఆర్ఎస్కు కలిసివచ్చింది. బీజేపీ ఓటమి పాలైంది. అభ్యర్థి పరాజయం పొందగా.. అది కూడా డమ్మీ అభ్యర్థిగా నిలిచిన ఆమె కుమారుడికి 39 ఓట్లు పడడంతో ఆమె విజయం తారుమారైంది. ఈ విధంగానే చాలాచోట్ల నోటా, చెల్లనిఓట్లు అభ్యర్థులు పరాజయం పొందిన ఓట్లకు ఎక్కువగా, సమంగా ఉండడం కూడా ఆయా పార్టీ నేతలను మథనపడేలా చేశాయి. బీఎన్‌రెడ్డి నగర్, మల్కాజిగిరి, అడిక్‌మెట్, హస్తినాపురం, వినాయక్‌నగర్, రాంగోపాల్‌పేట, రాంనగర్, మూసాపేట, రామంతాపూర్, వనస్థలిపురం, జూబ్లీహిల్స్, మంగళ్‌హాట్, సైదాబాద్, గచ్చిబౌలి, అమీర్‌పేట, హబ్సిగూడ, కవాడిగూడలలో స్వల్ప ఓట్ల తేడాతో టీఆర్ఎస్ పరాజయం పాలైంది. కొన్ని డివిజన్లలో ఇలా.. ⇔ మల్కాజిగిరి డివిజన్లో గెలిచిన బీజేపీ అభ్యర్థికి 8,361 ఓట్లు పోల్ కగా.. కేవలం 172 ఓట్ల తేడాతో ఓడిపోయిన టీఆర్ఎస్ అభ్యర్థికి 8,188 ఓట్లు పోలయ్యాయి. విచిత్రమేమిటంటే మెజారిటీ 172 ఓట్లను మించి ఇక్కడా నోటాకు 245 ఓట్లు పడడంతో టీఆర్ఎస్ అభ్యర్థికి భంగపాటుగా మారింది. ⇔ వినాయక్‌నగర్ డివిజన్లో బీజేపీకి 9,972 ఓట్లు, టీఆర్ఎస్కు 9,685 ఓట్లు పోలయ్యాయి. 287 ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోగా ఆ అంకెకు సమానంగా అంటే 287 ఓట్లు నోటాకు పోలయ్యాయి. ఇలా నోటా ఓట్లు అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ⇔ వనస్థలిపురం డివిజన్లో బీజేపీ అభ్యర్థికి 9,214 ఓట్లు, టీఆర్ఎస్కు 8,513 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్‌కు 1374, టీడీపీకి 772, ఇండిపెండెంట్ అభ్యర్థులకు 119 ఓట్లు పోలయ్యాయి. నోటాకు 259 ఓట్లు పడగా, చెల్లని ఓట్లు 269 ఉన్నాయి. ఇక్కడా టీఆర్ఎస్ అభ్యర్థి 702 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ⇔ హస్తినాపురం డివిజన్లో బీజేపీకి 8036, టీఆర్ఎస్కు 7,757 ఓట్లు వచ్చాయి. కేవలం 279 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోయారు. నోటాకు 247 ఓట్లు పడగా, 458 చెల్లని ఓట్లు ఉన్నాయి. ఈ లెక్కన చూసుకుంటే ఇటు నోటాకు ఓట్లు వేయకపోయినా, అటు చెల్లని ఓట్లు లేకుండా పరిగణనలోకి వచ్చి ఉంటే 279 ఓట్లు ఈజీగా తమ అభ్యర్థి ఖాతాలో చేరిపోయి ఉండేవని టీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. ⇔ అడిక్‌మెట్ డివిజన్లో బీజేపీకి 7,830, టీఆర్ఎస్కు 7600 ఓట్లు వచ్చాయి. కేవలం 239 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి పరాభవం పొందారు. గెలుపును ప్రభావితం చేసిన 239 ఓట్ల కన్నా ఎక్కువగా నోటాకు 265 ఓట్లు పోలవడంతో ఓడిన పార్టీ అభ్యర్థులు నైరాశ్యంలో మునిగిపోయారు. ⇔ రాంనగర్ డివిజన్లో బీజేపీకి 9,819, టీఆర్ఎస్కు 9291 ఓట్లు పోలయ్యాయి. 528 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోయారు. ఇక్కడా నోటాకు 215, చెల్లని ఓట్లు 307 వరకు అంటే మొత్తం 522 ఓట్లు అభ్యర్థులకు పనికిరాకుండా పోయాయి. ⇔ సైదాబాద్ డివిజన్లో బీజేపీకి 10,621, టీఆర్ఎస్కి 9,710 ఓట్లు పోలయ్యాయి. నోటాకు 188, చెల్లని ఓట్లు 370 ఉన్నాయి. ఇక్కడా టీఆర్ఎస్ అభ్యర్థి 911 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడా స్థానిక సమస్యల బాగా ప్రభావితం చేశాయి ⇔ గచ్చిబౌలి డివిజన్లో బీజేపీకి 10,602, టీఆర్ఎస్కు 9,467 ఓట్లు వచ్చాయి. నోటాకు 207 ఓట్లు పడ్డాయి. 562 చెల్లని ఓట్లు ఉన్నాయి. ఇక్కడ సైతం టీఆర్ఎస్ అభ్యర్థి 1,135 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ⇔ రామంతాపూర్ డివిజన్లో బీజేపీకి 10,033, టీఆర్ఎస్కు 9,378 ఓట్లు పోలయ్యాయి. నోటాకు 225 ఓట్లు వచ్చాయి, 310 చెల్లని ఓట్లు ఉన్నాయి. ఇక్కడా టీఆర్ఎస్ అభ్యర్థి 705 ఓట్లతో పరాజయం పొందారు. ⇔ హబ్సిగూడ డివిజన్లో బీజేపీకి 10,803, టీఆర్ఎస్కు 9,4356 ఓట్లు వచ్చాయి. నోటాకు 218 ఓట్లు వచ్చాయి. 426 చెల్లని ఓట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా టీఆర్ఎస్ అభ్యర్థి 1147 ఓట్లతో ఓడిపోయారు. ⇔ ఇక ఎంఐఎం విషయానికొస్తే అత్యల్ప మెజారిటీ (1583 ఓట్లు) గెలిచింది జంగమ్మేట్లోనే. ఇక్కడా ఎంఐఎంకు 10,629 ఓట్లు, బీజేపీకి 9046 ఓట్లు పడ్డాయి. మెజారిటీ 1583ఓట్లు ఎంఐఎంకు వచ్చాయి. నోటాకు 66, చెల్లని ఓట్లు 756 వచ్చాయి. ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉన్నా బీజేపీ అభ్యర్థి రాణించడంతో మెజారిటీ తగ్గిందని ఆ పార్టీ లెక్కలు వేసుకుంది. కారును ముంచిన వరద ప్రాంతాలివే.. నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గ్రేటర్‌తో పాటు శివారులోని చాలా ప్రాంతాలు జలమయ్యాయి. ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. అధికార పార్టీ నేతలు సహాయక చర్యల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో చైతన్యపురి, హబ్సిగూడ, రామంతాపూర్, చంపాపేట, నాగోలు, సరూర్‌నగర్, గడ్డి అన్నారం, హయత్‌నగర్, వనస్థలిపురం, లింగోజీగూడ, హస్తినాపురం, మన్సూరాబాద్, మైలార్‌దేవ్‌పల్లి, జీడిమెట్లలో బీజేపీ విజయకేతనం ఎగరవేసింది. -
8న భారత్ బంద్ విజయవంతం చేయాలి
-
లెక్క తప్పింది.. అక్కడే: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, అభివృద్ధి చేస్తూ ముందుకెళ్లాలని మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు (కేటీఆర్) అన్నారు. ఆదివారం ఆయన గ్రేటర్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘గ్రేటర్లో మన ప్రయత్న లోపం లేదు.. ఎమోషన్ ఎలక్షన్ జరిగింది. సిట్టింగ్‌లను మార్చిన చోట టీఆర్ఎస్ గెలిచింది. సిట్టింగ్‌లను మార్చని చోట ఓడిపోయాం.. ఇక్కడే లెక్క తప్పింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి రిపీట్ అయ్యే ప్రమాదం ఉంది. గ్రేటర్ ఫలితాలను గుణపాఠంగా తీసుకుందామని’’ ఆయన పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి పెట్టాలన్నారు. దేశంలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని.. సిద్ధంగా ఉండాలని సూచించారు. (చదవండి: పార్టీలో పోస్టుమార్టం చేసుకుంటాం : కేటీఆర్) ఈ నెల 8న భారత్ బంద్ విజయవంతం చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా గల్లీ గల్లీ బంద్ కావాలన్నారు. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు.. బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 8న వ్యాపార, వాణిజ్య వర్గాలు కూడా బంద్‌లో పాల్గొన్నాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి వ్యాపారవేత్త 2 గంటల పాటు బంద్ పాటించాలని, ఢిల్లీ పెద్దల దిమ్మతిరిగేలా తెలంగాణ బంద్ విజయవంతం కావాలని తెలిపారు. కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు వెనక్కి తీసుకోవాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. (చదవండి: బీజేపీ: ఆపరేషన్ ఆకర్ష్..) -
గ్రేటర్ ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం తెలంగాణ భవన్లో గ్రేటర్ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ఎన్నికల్లో గెలిచిన కార్పోరేటర్లతో సమావేశమయ్యారు. కొత్తగా ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. మేయర్ పీఠంపై కార్పోరేటర్లకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ( కీలకంగా మారిన మజ్లీస్.. మద్దతు ఎవరికి?) ప్రజల్లో తిరిగి.. ప్రజల్లోనే ఉండాలని వారికి సూచించారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపికపై కసరత్తులు చేశారు. ఎంఐఎంతో పొత్తు లేకుండానే పీఠం దక్కించుకునేలా టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. ఇందుకోసం పార్టీ పెద్దలు జీహెచ్ఎంసీ చట్టాలను పరిశీలిస్తున్నారు. -
బీజేపీ: ఆపరేషన్ ఆకర్ష్..
సాక్షి, రంగారెడ్డి: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సత్తా చాటిన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికార టీఆర్ఎస్ పార్టీలోని అసమ్మతి నేతలపై కాషాయదళం దృష్టి సారించింది. వికారాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌కు కాషాయ కండువా కప్పేందుకు బీజేపీ నేతలు రంగంలోకి దిగినట్లు తెలిసింది. పార్టీ అధిష్టానం తీరుపై అసంతృప్తిగా ఉన్న ఈ సీనియర్ నేత.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కమల తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే చివరి నిమిషంలో వెనకడుగు వేశారు. ఆ తర్వాత మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు ముందు కూడా మరోసారి ఈ అంశం చర్చకు వచ్చినా కార్యరూపం దాల్చలేదు. ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ నెగ్గడంతోపాటు తాజాగా రెండు రోజుల క్రితం వెలువడిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ గణనీయంగా స్థానాలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఊపుమీదున్న బీజేపీలో ఆయన చేరిక మరోసారి చర్చనీయాంశంగా మారింది. తాజాగా బీజేపీకి చెందిన పలువురు నాయకులు.. చంద్రశేఖర్‌తో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. బీజేపీలో చేరికకు ఆయన సుముఖంగా ఉన్నప్పటికీ.. కొంత సమయం కావాలని కాషాయదళ నేతలను కోరినట్లు వార్తలు వినిపించాయి. తన అనుయాయులు, పార్టీ శ్రేణులు, సన్నిహితులతో చర్చించి వారి అభీష్టాన్ని తెలుకుంటానని చెప్పినట్లు సమాచారం. మూడు నాలుగు రోజుల్లో మాజీ మంత్రి చేరికపై స్పష్టత వస్తుందని కమల నేతలు చెబుతున్నారు. ఎలాగైనా పార్టీలో చేరతారన్న ధీమాతో వారు ఉన్నారు. ఈయన రాకతో వికారాబాద్‌లో బీజేపీ మరింత బలపడుతుందన్న విశ్వాసాన్ని బీజేపీ వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్‌కు కష్టకాలమే.. ఇప్పటికే గ్రేటర్ ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బతగిలిన కాంగ్రెస్‌ను.. సీనియర్ నేతల వలసలు మరింత ఇబ్బందుల్లో నెట్టేస్తున్నాయి. సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ పార్టీ జిల్లాను శాసించిన స్థాయి నుంచి.. ఉనికే ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. నాయకత్వ లేమి, అధిష్టానానికి నాయకులకు మధ్య సమన్వయం కొరవడటం తదితర కారణాల వల్ల హస్తం చతికిల పడుతూ వస్తోంది. ఈ వైఫల్యాల వల్లే నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇదే తరహాలోనే ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రి చంద్రశేఖర్ కమలం వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న చంద్రశేఖర్‌కు సీఎం కేసీఆర్ సన్నిహితుడనే పేరుంది. అయితే గులాబీ పార్టీలో ఇమడలేకపోయిన ఆయన కాంగ్రెస్‌లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో ఆ పార్టీని వీడారు. ఏఐఎఫ్బీ తరఫున ఎన్నికల బరిలో దిగి.. ఓటమిపాలైన చంద్రశేఖర్ తిరిగి హస్తం గూటికి చేరారు. సొంత నియోజకవర్గమైన వికారాబాద్‌ని కాదని పొరుగున ఉన్న చేవెళ్ల సెగ్మెంట్ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించారు. దీనిపైనా ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. దీనికితోడు స్థానిక నేతనైన తనను కాదని వికారాబాద్‌లో మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌కు పార్టీ అధిష్టానం ప్రాధాన్యత ఇస్తోందని మథన పడ్డారు. ఈ పరిణామాలన్నీ చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీని వీడేందుకు మార్గం చూపుతున్నాయని తెలుస్తోంది. మొత్తంగా ఈ పార్టీకి భవిష్యత్ లేదన్న నిర్ణయానికి వచ్చిన ఈయన ప్రత్యామ్నాయంగా కమలం చెంతకు చేరేందుకు దాదాపుగా సిద్ధమయ్యారన్న వార్తలు వినిపిస్తున్నాయి. పక్కా వ్యూహంతో.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే గ్రేటర్ ఎన్నికలకు ముందు తెలంగాణ ఉద్యమ నేత, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, శేరిలింగంపల్లి సెగ్మెంట్ కాంగ్రెస్ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ తదితరులు కాషాయ కండువా కప్పుకున్నారు. మరికొందరి నేతలపై దృష్టి సారించిన కమలనాథులు వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్, ఇతర పార్టీల్లో పదవులు అలంకరించిన మాజీలు, క్రియాశీలక నేతలతోపాటు టీఆర్ఎస్లో ఎడమొహం పెడమొహంగా ఉన్న నేతలను పార్టీలో చేర్చుకోవాలని యోచిస్తోంది. వచ్చే సాధారణ ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య అధికార పార్టీలో అధికంగానే ఉంది. ఇటువంటి నియోజకవర్గాలను లక్ష్యంగా చేసుకుని ఆశావహులతో టచ్‌లోకి వెళ్లాలని బీజేపీ ప్రణాళిక రూపొందించుకుంటోంది. మొత్తానికి వీలైనంత వేగిరంగా జిల్లాలో టీఆర్ఎస్కు దీటుగా కమలదళాన్ని సిద్ధం చేసి ఎన్నికలను ఎదుర్కోవాలన్నది బీజేపీ వ్యూహంగా చెప్పవచ్చు. -
జీహెచ్ఎంసీ: గెలుపోటములకు కారణాలెన్నో..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో ముషీరాబాద్ నియోజవకర్గంలో కారు స్పీడుకు బ్రేక్ పడింది. అడిక్‌మెట్ డివిజన్లో సిట్టింగ్ కార్పొరేటర్ అభ్యర్థిని మార్చకపోవడం, ఇన్చార్జిగా వ్యవహరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇక్కడే తిష్టవేసి అహర్నిషలూ శ్రమించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ముషీరాబాద్ డివిజన్లో సిట్టింగ్ కార్పొరేటర్ అభ్యర్థి ఎడ్ల భాగ్యలక్ష్మిని మార్చకపోవడం, రూ.10వేల వదర సాయం, కార్పొరేటర్ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత అధికార పార్టీ ఓటమికి దారి తీసింది. రాంనగర్ డివిజన్లో టీఆర్ఎస్ అధిష్టానం సిట్టింగ్ కార్పొరేటర్ వి.శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన 5వేల ఓటు బ్యాంకున్న పలు బస్తీలు ముషీరాబాద్ డివిజన్లో కలవడం, అసమ్మతి నేతలను బుజ్జగించడంలో ఆలస్యం చేయడంతో బీజేపీ అభ్యర్థి వి.రవిచారికి విజయానికి దోహదం చేశాయి. భోలక్‌పూర్ డివిజన్లో ఎంఐఎం నాయకత్వం కొత్త అభ్యర్థికి టికెట్ ఇవ్వడంతో మరోసారి ఎంఐఎం తన పట్టును నిలుపుకొంది. గాంధీనగర్ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే ముఠా గోపాల్ మరదలు ముఠా పద్మ హ్యాట్రిక్ సాధిస్తారనుకున్నా.. టీఆర్ఎస్పై వ్యతిరేకత, బీజేపీ పాజిటివ్ ఓట్లు కొంపముంచాయి. కవాడిగూడ డివిజన్ టికెట్‌ను టీఆర్ఎస్ సిట్టింగ్ అభ్యర్థి లాస్యనందితకే మళ్లీ ఇచ్చారు. ఆమె తండ్రి ఎమ్మెల్యేగా ఉండటం, డివిజన్లో ఆమె పట్ల ఉన్న వ్యతిరేకత, బీజేపీ గాలి తోడవడం, బీజేపీ అభ్యర్థి ఒక టెంట్ హౌస్ నడుపుకునే సామాన్య నాయకుడి కుమార్తె కావడంతో టీఆర్ఎస్ ఓటమికి కారణంగా కనిపిస్తోంది. చీలిన ఓట్లు.. సంక్షేమ పథకాలు జూబ్లీహిల్స్: ఆరు సిట్టింగ్ స్థానాలకుగాను టీఆర్ఎస్ నాలుగు డివిజన్లను నిలబెట్టుకుంది. బోరబండ, యూసుఫ్‌గూడ, వెంగళరావునగర్, రహమత్‌నగర్‌లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. చీలిన ఓట్లు, ప్రభుత్వ పథకాలు, అధికార పార్టీకి కలిసొచ్చాయని చెబుతున్నారు. షేక్‌పేట, ఎర్రగడ్డ డివిజన్లలో మైనార్టీలు పెద్దసంఖ్యలో ఉండడంతో ఎంఐఎం సులభంగా విజయం సాధించింది. ఎల్బీనగర్లో వరద సాయం, ఎల్ఆర్ఎస్ ప్రభావం ఎల్బీనగర్: ఎల్బీనగర్లో ఇటీవల కురిసిన భారీ వర్షానికి వరదలు ముంచెత్తడంతో చాలా కాలనీలు నీట మునిగి కోలుకోలేని నష్టం వాటిల్లింది. ప్రభుత్వం అందించిన వరద సాయం అసలైన బాధితులకు అందలేదనే కారణంతో టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓట్లు వేయలేదు. దీంతో ఆ పార్టీ పోటీ చేసిన స్థానాల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. నీట మునిగిన కాలనీలకు చెందిన వరద బాధితులకు సహాయ అందిచండంలో అధికార పార్టీ కార్పొరేటర్లు తమ బంధువర్గాలకు, సన్నిహితులకు, కార్యకర్తలకు ఇచ్చారని కారణంగా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే నగర శివారు ప్రాంతాల్లో ఖాళీ ప్లాట్లు ఉన్నవారు ఎల్ఆర్ఎస్ను వ్యతిరేకించారు. పట్టు నిలుపుకొన్న ఎంఐఎం నాంపల్లి: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం విజయ ఢంకా మోగించింది. నియోజకవర్గంలోని మొత్తం ఏడు స్థానాల్లో ఆరు స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. టీఆర్ఎస్కు ఉన్న ఒక్క స్థానాన్ని చేజార్చుకుంది. గుడిమల్కాపూర్ నుంచి బీజేపీ ఖాతా తెరుచుకుంది. బీజేపీ అగ్రనేతల ప్రచారం‘కమల’ వికాసం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లు చేసిన ప్రచారం బీజేపీ అభ్యర్థుల ‘స్టార్’ మార్చేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ఇతర అగ్రనేతలు చేసిన ప్రచారం గ్రేటర్లో ఆ పార్టీ పుంజుకునేందుకు దోహదపడింది. 150 డివిజన్లలో పోటీ చేసిన ఆ పార్టీ ఎవరి ఊహలకు అందని విధంగా ఏకంగా 48 సీట్లు సొంతం చేసుకొని గ్రేటర్లో అత్యధిక సీట్లు సాధించిన రెండో పెద్ద పార్టీగా అవతరించింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అభ్యర్థుల ఎంపిక, అనంతరం ప్రచార తీరుతెన్నులు, బావోద్వేగ ప్రసంగాలతో ప్రజల దృష్టిని తమ వైపునకు తిప్పుకొనేలా బీజేపీ నేతల వ్యవహరించిన తీరు కమలం వికాసానికి తోడ్పడింది. గ్రేటర్ ఎన్నికలతో అధికార పార్టీ టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ బలంగా చెప్పగలిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్నికల నోటిఫికేషన్ నుంచి పోలింగ్ వరకు ఉన్న అతి తక్కువ సమయంలో బీజేపీ అభ్యర్థులు పెద్దగా ప్రజలకు పరిచయం లేకున్నా అగ్రనేతల ప్రచారశైలి వారికి ఓట్లు తెచ్చిపెట్టింది. ఎక్కడెక్కడ ఫలితాలు ఎలా.. కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వారాసిగూడ నుంచి సీతాఫల్మండి వరకు చేసిన రోడ్డు షో ఆ ప్రాంతానికి ఆనుకొని ఉన్న మిగతా డివిజన్లలో గెలుపుపై ప్రభావాన్ని చూపింది. అడిక్మేట్, కవాడిగూడ, రాంనగర్ ప్రాంతాల్లో కాషాయ జెండా రెపరెపలాడింది. బీజేపీ కేంద్ర అధ్యక్షుడు జేపీ నడ్డా నాగోల్ నుంచి చైతన్యపురి వరకు రోడ్డు షో మాత్రం అనూహ్య ఫలితాన్ని రాబట్టింది. ఆయా ప్రాంతాల్లో వరదలు వచ్చిన సమయంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు వ్యవహరించిన తీరును కూడా ప్రసంగాల్లో ఎండగడుతూ చేసిన ప్రచారం కమలం పార్టీకి ఓట్లు కురిపించింది. ఏకంగా ఎల్బీ నియోజకవర్గంలోని 13 సీట్లను క్లీన్‌స్వీప్ చేసింది. ఆర్కేపురం, సరూర్‌నగర్, బీఎన్ రెడ్డి, హస్తినాపురం, చంపాపేట, మన్సూరాబాద్, నాగోల్, వనస్థలిపురం, హయత్‌నగర్, లింగోజిగూడ, కొత్తపేట, చైతన్యపురిలలో కాషాయ జెండా రెపరెపలాడింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారం నిర్వహించిన జీడిమెట్ల ప్రాంతంలో బీజేపీ అభ్యర్థి చెరకుపల్లి తారాచంద్రరెడ్డి భారీ మెజారిటీతో గెలిచారు. యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వినిసూర్య కూడా అన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రచారం చేశారు. ఎన్నికల పరిశీలకుడు బీజేపీ జాతీయ నేత భూపేందర్ యాదవ్ వ్యూహాలను రాష్ట్ర పార్టీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు అమలు చేసి ప్రచారంలో ఓటర్లను ఆకర్షించి విజయం వైపు తీసుకెళ్లారు. మోండాలో విలక్షణ తీర్పు కంటోన్మెంట్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ప్రాంతాలతో కూడుకున్న మోండా మార్కెట్ డివిజన్ పరిధిలో వ్యాపార, వాణిజ్య వర్గాలకు చెందిన ప్రజలకు అధిక సంఖ్యలో ఉన్నారు. డివిజన్ పరిధిలోనే ఉండే మారేడుపల్లిలో అధిక ఆదాయ వర్గాలు, ఉన్నత విద్యావంతుల శాతం ఎక్కువగా ఉంది. బస్తీలు పరిమిత సంఖ్యలోనే ఉండే ఈ ఓటర్లలో రాజకీయ చైతన్యం ఎక్కువగానే ఉండటంతో ప్రతీ ఎన్నికల్లోనూ అప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా విలక్షణ తీర్పునిస్తూ ఉంటారు. ఈ నేపపథ్యంలోనే తాజా ఎన్నికల్లో టీఆర్ఎస్పై వ్యతిరేకతతో బీజేపీకి మద్దతుగా నిలిచారు. కంటోన్మెంట్‌కు చెందిన కీలక నేతలు రామకృష్ణ, మల్లికార్జున్‌లు ఇటీవలే బీజేపీలో చేరడంతో మోండా పరిధిలోని వారి అనుచరగణం పెద్ద సంఖ్యలో బీజేపీ గెలుపు కోసం పనిచేశారు. సిట్టింగ్ కార్పొరేటర్‌గా బరిలోని నిలిచిన టీఆర్ఎస్ అభ్యర్థి గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీల్లో చాలా వరకు నెరవేర్చకపోవడంతో కొంత వ్యతిరేకత నెలకొంది.అంబేడ్కర్‌నగర్, లోహియా నగర్ వంటి బస్తీల్లోనూ ఆంధ్రా సెటిలర్లు బీజేపీకి అనుకూలంగా వేసినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ సిట్టింగ్‌లపై వ్యతిరేకత.. టీఆర్ఎస్ను సిట్టింగ్ అభ్యర్థులే కొంపముంచారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కార్పొరేటర్లపై జనంలో వ్యతిరేకత ఉందనేందుకు ఎన్నికల ఫలితాలే స్పష్టం చేస్తున్నాయి. ఈసారి 72 మంది సిట్టింగ్‌లకు టీఆర్ఎస్ సీట్లు ఇవ్వగా.. ఇందులో 28 మంది మాత్రమే గెలుపొందారు. అంటే దాదాపు 44 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులకు చుక్కెదురైంది. స్వయంకృతాపరాధంతో.. ఉప్పల్: ఉప్పల్ సర్కిల్ పరిధిలో ఉన్న నాలుగు టీఆర్ఎస్ సీట్లలో ఒకదాన్ని మాత్రమే దక్కించుకోగలిగింది. ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి భార్య భేతి స్వప్న హబ్సిగూడ డివిజన్ నుంచి బరిలో దిగారు. దీంతో ఆయన ఇతర డివిజన్లలో ప్రచారం చేయకపోవడం, వరదతో హబ్సిగూడ, రామంతాపూర్, ఉప్పల్‌లోని కాలనీలు ముంపునకు గురికావడంతో అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వెరసి ఉప్పల్ సర్కిల్లో టీఆర్ఎస్ కేవలం ఒక్క సీటుకే పరిమితం కావాల్సి వచ్చింది. కాప్రా సర్కిల్లో ఏఎస్‌రావునగర్ స్థానం మినహా అన్ని సీట్లు టీఆర్ఎస్ దక్కించుకుంది. కార్పొరేటర్లు చేసిన అభివృద్ధి, కేసీఆర్ పథకాలు శ్రీరామరక్షగా నిలిచాయి. కొంపముంచిన అతివిశ్వాసం.. ఆరోపణలు మల్కాజిగిరి: సర్కిల్ పరిధిలోని మూడు డివిజన్లలో సిట్టింగ్ కార్పొరేటర్లు బీజేపీ అభ్యర్థుల చేతిలో ఓడిపోయారు. అతివిశ్వాసం, వరద సహాయం అందని బాధితుల అసంతృప్తితో పాటు కార్పొరేటర్లపై ఆరోపణలు, ఉద్యమకారులు, కార్యకర్తలను పట్టించుకోకపోవడంతో ఓటమికి కారణాలుగా భావిస్తున్నారు. ఓల్డ్‌సిటీలో బీజేపీ పాగా ఎంఐఎంకు కంచుకోటగా ఉన్న ఓల్డ్‌సిటీలో బీజేపీ పాగా వేసింది. మూడు డివిజన్లకే పరిమితమైన ఆ పార్టీ 10 డివిజన్లకు విస్తరించింది. ఓల్డ్ సిటీపై సర్జికల్ స్ట్రైక్, రోహింగ్యాల ఏరివేత ప్రధాన అస్త్రాలుగా బీజేపీ ప్రచారం చేసి పాగా వేసింది. 7 టీఆర్ఎస్, ఒక ఎంఐఎం సిట్టింగ్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. సికింద్రాబాద్‌లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ సికింద్రాబాద్: సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని అయిదు డివిజన్లనూ టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ చేసింది. నగరం అంతా బీజేపీ పవనాలు వీచినా ఇక్కడ మాత్రం అధికార పార్టీ తన స్థానాలను పదిలపర్చుకుంది. సీఎం సహాయనిధి, పెన్షన్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వంటి కార్యక్రమాలు నియోజకవర్గంలో విస్తృతంగా అమలు చేశారు. డిప్యూటీ స్పీకర్‌గా కొనసాగుతున్న ఇక్కడి ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండడం ఒక కారణంగా చెప్పుకోవచ్చు. నియోజకవర్గంలో మైనారిటీ ఓట్లు అధికంగా ఉన్నాయి. వీరందరు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి టీఆర్ఎస్కు బాసటగా నిలుస్తున్నారు. నియోజకవర్గంలోని అయిదు డివిజన్లలో తెలంగాణ జిల్లాలకు చెందినవారు పెద్దసంఖ్యలో ఓటర్లు ఉన్నారు. వీరంతా తెలంగాణ ఉద్యమకాలం నుంచి టీఆర్ఎస్కు అండగా ఉంటున్నారు. ఫలించని మంత్రుల వ్యూహం... దిల్సుఖ్నగర్: మలక్‌పేట్ నియోజకవర్గంలోని 6 డివిజన్లలో నాలుగు స్థానాలను ఎంఐఎం తిరిగి గెలుచుకోగా టీఆర్ఎస్ రెండు స్థానాలను కోల్పోయింది. అజంపుర, ఓల్డ్‌మలక్‌పేట్, చావుణి, అక్బర్‌బాగ్ డివిజన్లలో కొంత వ్యతిరేకత ఉన్నా ఎంఐఎంకు గట్టి ప్రత్యర్థులు లేకపోవడంతో వారి విజయం నల్లేరు మీద నడకలా సాగింది.వరదల సమయంలో సరైన సహాయం అందకపోవడంతో మూసారంబాగ్, సైదాబాద్ డివిజన్లలో టీఆర్ఎస్ ఓడిపోయింది. దానికితో వరదసాయం అందకపోవడంతో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. దీంతో ప్రజలు బీజేపీ అభ్యర్థులకు పట్టం కట్టారు. మహేశ్వరం నియోజకవర్గంలోని సరూర్‌నగర్‌లో ప్రభుత్వ వ్యతిరేకత, వరదసాయం అందరికీ అందకపోవడంతో టీఆర్ఎస్ను ఓడించారు. ఇద్దరు మంత్రుల వ్యూహం ఫలించలేదు. అనూహ్యంగా బీజేపీ 5 డివిజన్లలో గెలిచి సత్తా చాటింది. టీఆర్ఎస్కు ఒక్కసీటూ దక్కలేదు. లోకల్ కేడర్ పట్టించుకోకవడం వల్లే.. హుడా కాంప్లెక్స్: లోకల్ కేడర్‌తో కాకుండా డివిజన్లతో సంబంధం లేని నేతల జోక్యమే అధికార పార్టీ పుట్టి ముంచిదా? అంటే అవుననే అంటున్నారు టీఆర్ఎస్ నాయకులు. ఓటర్లతో ముఖాముఖి పరిచయాలు, క్షేత్రస్థాయి సమస్యలపై అవగాహన, బంధుగణం అధికంగా ఉన్న స్థానిక నేతలను పక్కన పెట్టి.. ఓటర్లతో ఏ మాత్రం పరిచయం లేని ఇతర ప్రాంత నేతలకు ప్రచార బాధ్యతలను అప్పగించింది. ఒక్కో డివిజన్‌కు మంత్రి సహా ఎమ్మెల్యేలను ఇన్‌చార్జీలగా నియమించింది. వీరు క్షేత్రస్థాయిలో పని చేస్తున్న లోకల్ కేడర్‌ను కాకుండా తమ నియోజకవర్గాల పరిధిలోని లీడర్లను రంగంలోకి దింపారు. ప్రచార సరళి, ఓటర్లకు మద్యం, నగదు పంపిణీలో వీరే కీలకంగా వ్యవహరించారు. దీంతో లోకల్ కేడర్ మనస్తాపంతో పోల్ మేనేజ్మెంట్కు దూరంగా ఉంది. సరూర్‌నగర్ సిట్టింగ్ అభ్యర్థిపై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేకపోయినçప్పటికీ ఇతర నేతల ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేక వారంతా దూరంగా ఉండిపోయారు. ఇది బీజేపీకి బాగా కలిసి వచ్చింది. వరద సహాయం పంíపిణీలో చోటు చేసుకున్న అవకతవకలు కూడా బీజేపీ బలం పెంచుకునేందుకు పరోక్షంగా కారణమైంది. బీజేపీ సిట్టింగ్ స్థానం ఆర్కేపురంపై ఎలాగైనా పట్టు సాధించాలని అధికార పార్టీ భావించింది. ఆ మేరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రచారంలో కీలకపాత్ర పోషించారు. అయినా ఇక్కడి ఓటర్లు మాత్రం సిట్టింగ్ అభ్యర్థి రాధాధీరజ్రెడ్డికే మళ్లీ పట్టం కటారు. ‘కార్వాన్’లో సత్తా చాటిన మజ్లిస్.. గోల్కొండ: కార్వాన్ నియోజకవర్గంలో మజ్లిస్ మరోసారి సత్తాను చాటింది. గత ఎన్నికల్లో గెలిచిన అయిదు స్థానాల్లో ఆ పార్టీ మళ్లీ విజయం సాధించింది. ముగ్గురు సిట్టింగ్, ఇద్దరు కొత్తవారిని బరిలో దింపి టోలిచౌకి, నానల్‌నగర్, గోల్కొండ డివిజన్లలో మెజార్టీ మరింత పెంచుకుంది. నియోజకవర్గంలోని ఆరు స్థానాలలో అయిదు మజ్లిస్ గెలుపొందగా, జియాగూడ స్థానంలో కమలం వికసించింది. జియాగూడలో సిట్టింగ్ టీఆర్ఎస్ అభ్యర్థి మిత్ర కృష్ణ బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. గట్టి పోటీ అనుకున్న లంగర్‌హౌస్‌లో మజ్లిస్ సిట్టింగ్ అభ్యర్థి మరోసారి గెలుపొందారు. కార్వాన్ నియోజకవర్గం మజ్లిస్‌కు కంచుకోటగా మరోసారి రుజువైంది. కార్వాన్, లంగర్‌హౌస్, నానల్‌నగర్, గోల్కొండ, టోలిచౌకి డివిజన్లలో మజ్లిస్ అభ్యర్థులు గెలుపొందారు. జియాగూడలో కమలం పదేళ్ల తర్వాత మళ్లీ వికసించింది. ఆరు డివిజన్లలో టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. అటు అసమ్మతి.. ఇటు మార్పు అంబర్‌పేట: కాచిగూడ డివిజన్లో గతంలో ఓడిన బీజేపీ అభ్యర్థి ప్రజల మధ్యలో ఉండటం, దీనికి తోటు సిట్టింగ్ కార్పొరేటర్ రెబల్‌గా ఉండటంతో టీఆర్ఎస్ ఓటమి పాలైంది. ఈ డివిజన్ బీజేపీ అభ్యర్థి కన్నె ఉమా రమేష్‌యాదవ్ గెలుపొందారు. నల్లకుంట డివిజన్లో సిట్టింగ్ కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి పదేళ్లు కార్పొరేటర్‌గా వ్యవహరించడంతో ఈ దఫా ప్రజలు మార్పు కోరుకొని బీజేపీ అభ్యర్థి అమృతను గెలిపించారు. రెబల్‌గా నామినేషన్ వేసిన ఉద్యమకారుడు కట్ట సుధాకర్‌ను ఉపసంహరించడంలో.. సీనియర్ నాయకులను సైతం ఎన్నికల ప్రచారంలో భాగస్వామ్యం చేయలేకపోవడం ఓటమికి మరో కారణం. దీనికి తోటు ఈ డివిజన్లో ముంపు సాయం కూడా ప్రభావం చూపింది. గోల్నాక డివిజన్లో టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ అభ్యర్థిని కాకుండా కొత్తవారైన దూసరి లావణ్యకు అవకాశం ఇచ్చింది. ఇక్కడ మైనార్టీలతో పాటు ఎమ్మెల్యే సొంత డివిజన్ కావడంతో గులాబీ అభ్యర్థి విజయం సాధించగలిగారు. అంబర్‌పేట డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ కార్పొరేటర్ పులి జగన్‌కు కాకుండా కొత్త అభ్యర్థి విజయ్కుమార్గౌడ్కు అధిష్టానం అవకాశం కల్పించింది. ఇన్చార్జిగా వ్యవహరించిన మంత్రి నిరంజన్‌రెడ్డి అసమ్మతి నేతలను అతి కష్టంమీద బుజ్జగించడం, మైనార్టీ ఓటు బ్యాంకింగ్‌తో టీఆర్ఎస్ గెలిచింది. బాగ్ అంబర్‌పేట డివిజన్లో టీఆర్ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్ కె.పద్మావతిరెడ్డిపై అసమ్మతి సెగతో పాటు కాలనీల్లో బీజేపీకి ఓటు బ్యాంకు అధికంగా ఉంది. వరద సాయంలో అవకతవకలూ బీజేపీ అభ్యర్థి పద్మావెంకట్రెడ్డికి కలిసివచ్చాయి. టీఆర్ఎస్ ఓటమి పాలైంది. మూడు సిట్టింగ్ స్థానాలు స్వాహా.. అబిడ్స్: గోషామహల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గత ఎన్నికల్లో సాధించిన మూడు డివిజన్లను బీజేపీ దక్కించుకుంది. జాంబాగ్, గన్‌ఫౌండ్రీ, బేగంబజార్, గోషామహల్, మంగళ్‌హాట్ డివిజన్లలో బీజేపీ విజయం సాధించగా దత్తాత్రేయనగర్ డివిజన్లో మాత్రం మజ్లిస్ విజయం సాధించింది. గత మూడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దత్తాత్రేయనగర్, జాంబాగ్‌లో మజ్లిస్ గెలుస్తూ వచ్చింది. ఈ ఎన్నికల్లో జాంబాగ్‌ను బీజేపీ గెలుచుకుంది. దీంతో టీఆర్ఎస్ మూడు సీట్లతో పాటు మజ్లిస్ ఒక్క సీటును బీజేపీ కైవసం చేసుకుంది. అలా కలిసొచ్చి.. ఇలా వెనకబడి.. సనత్‌నగర్: సనత్‌నగర్ డివిజన్లో టీఆర్ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్ కొలను లక్ష్మీ మరోసారి విజయదుందుభి మోగించడానికి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చొరవతో పాటు ఇక్కడ మంచినీటి రిజర్వాయర్, ఇండోర్ స్టేడియం, వైకుంఠధామం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు పూర్తికావడంతో పాటు అభివృద్ధే కారణంగా చెప్పాలి. అమీర్‌పేటలో ఇక్కడ టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ కార్పొరేటర్ శేషుకుమారి ఓటమి చవిచూశారు. ఈ డివిజన్ నుంచి కార్పొరేటర్ టికెట్ ఆశించడంతో పాటు శేషుకుమారి అభ్యర్ధిత్వంపై బాహాటంగానే వ్యతిరేకించారు. దీంతో అసంతృప్తిగా ఉన్న పలువురు నేతలు ఆమెకు పనిచేయకుండా ఓటమికి కారణమయ్యారనే వార్తలు వస్తున్నాయి. బీజేపీ నుంచి తొలిసారి పోటీ చేసిన కేతినేని సరళకు ఉత్తర భారతీయుల ఓటింగ్ కలిసొచ్చింది. బన్సీలాల్‌పేటలో టీఆర్ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్ హేమలత విజయానికి ఇక్కడ నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల కారణంగా చెప్పవచ్చు. బీజేపీ అభ్యర్థి స్పందన గట్టి పోటీ ఇచ్చినా ఆర్థిక, అంగబలం అంతగా లేకపోవడంతో ఓటమి పాలైనట్లు తెలుస్తోంది. రాంగోపాల్‌పేట డివిజన్ టీఆర్ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్ అరుణగౌడ్ ఓటమికి స్థానికంగా కొంత బయటపడని వ్యతిరేకత. బీజేపీ అభ్యర్ధి సుచిత్ర గెలుపు వెనుక ఆ పార్టీ వేవ్‌తో పాటు స్థానికంగా సత్సంబంధాలు మెరుగ్గా ఉండడం, నార్త్ ఇండియన్ ఓట్లు శాతం ఎక్కువగా ఉండడం. బేగంపేట డివిజన్ నుంచి గెలుపొందిన టీఆర్ఎస్ అభ్యర్థి టి.మహేశ్వరికి గతంలో కార్పొరేటర్‌గా చేసిన అనుభవం, ప్రభుత్వ సంక్షేమ పథకాలూ కలిసొచ్చాయి. -
కీలకంగా మారిన మజ్లీస్.. మద్దతు ఎవరికి?
జీహెచ్ఎంసీ మేయర్ ఎంపికలో ‘మజ్లిస్’ పాత్ర కీలకంగా మారింది. దాదాపు 30 శాతం సీట్లు దక్కించుకున్నఎంఐఎం మద్దతుపైనే మేయర్ ఎన్నిక ఆధారపడి ఉంది. అందుకే ఆ పార్టీ నేతలు గుంభనంగా వ్యవహరిస్తున్నారు.‘మేం ఎవ్వరి దగ్గరకు వెళ్లం.. మా దగ్గరికే వాళ్లు రావాలి’ అన్న రీతిలో ఆ పార్టీ అధినేత వ్యాఖ్యానించడం గమనార్హం. తాజా పరిణామాల దృష్ట్యా ‘తాము కారెక్కడం కంటే తమ బండి ఎక్కితే హైదరాబాద్ మొత్తం తిప్పి చూపిస్తాం’ అని మీడియా సమావేశంలో ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వడం ఇందుకు బలం చేకూరుస్తోంది. మరో వైపు లోపాయికారీ ఒప్పందంతో టీఆర్ఎస్తో కలిసి పోయే అవకాశాలు కూడా లేకపోలేదు. సాక్షి, సిటీబ్యూరో : మేయర్ ఎన్నికలో కీలకంగా మారిన ఎంఐఎంలో ముఖ్య నిర్ణయాలు తీసుకునేది అసదుద్దీన్ ఓవైసీ మాత్రమే. కానీ, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపధ్యంలో ‘పార్టీలో చర్చించి మేయర్ పీఠంపై నిర్ణయం తీసుకుంటాం’ అని సాక్ష్యాత్తు ఆయనే పేర్కొనడం కాస్త విస్మయం గొలుపుతోంది. చివరి వరకు విషయాన్ని సాగదీయాలనే ఉద్దేశంతోనే ఆయన పార్టీలో చర్చిస్తామని చెప్పుకొచ్చారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. (కాంగ్రెస్‌కు భారీ షాక్.. బీజేపీలోకి జానారెడ్డి!) ఆరేళ్ల బంధం.. గత ఆరేళ్లుగా అధికార టీఆర్ఎస్–మజ్లిస్ మధ్య దోస్తీ కొనసాగుతున్నప్పటికి ప్రతి ఎన్నికల్లో స్నేహ పూర్వక పోటీ పేరుతో ఎవరికి వారు ఒంటరిగా బరిలో దిగుతూ వచ్చారు. ఈసారి కూడా ఎవరికి వారే పోటీకి దిగగా.. టీఆర్ఎస్ ఒక అడుగు ముందుకు వేసి మజ్లిస్‌తో దోస్తీ గీస్తీ లేదని, గత పర్యాయం ఐదు సీట్లలో ఓడగొట్టాం.. ఈ సారి పది డివిజన్లలో ఓడిస్తామని చెప్పింది. దానికి మజ్లిస్ ఘాటుగానే స్పందించింది. పరస్పర విమర్శలు కూడా తీవ్రస్థాయికి చేరడంతో ఆరేళ్ల బంధం కాస్త బెడిసినట్టయింది. ఈ నేపథ్యంలో తిరిగి దోస్తీ కోసం ఒకరికి ఒకరు సంప్రదించుకునేందుకు సంశయిస్తున్నట్లు తెలుస్తోంది. (కాంగ్రెస్ ఓటమి.. రేవంత్ వర్గంలో ఆశలు) సంఖ్యా బలంపై ధీమా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ పక్షాన 44 మంది అభ్యర్థులు విజయం సాధించగా, మరో పది మంది ఎక్స్ అఫీషియో సభ్యులున్నారు. దీంతో బల్దియాలో మజ్లిస్ సంఖ్యా బలం 54కి చేరింది. అయితే మేయర్ పీఠం సాధించేందుకు ఈ బలం సరిపోదు. అందువల్ల టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడమా..? లేక టీఆర్ఎస్ సహకారం తీసుకోవడమా? అనే రెండు మార్గాలు మాత్రమే మజ్లిస్ ముందు ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ హయాంలో మాదిరిగా పాలనలో భాగస్వాములై రెండున్నరేళ్లు మేయర్ పదవి చేపట్టడమా... లేక బేషరతుగా మద్దతిచ్చి డివిజన్లలో అభివృద్ధి పనులు చేపట్టడమా అన్న దానిపై తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై వెంటనే నిర్ణయం వెలువరించకుండా... వేచి చూసే ధోరణి అవలంబించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. (వాళ్లడిగితే.. ఆలోచిస్తాం) దారుస్సలాంలో సందడి మజ్లిస్ పార్టీ కేంద్ర కార్యాలయమైన హైదరాబాద్ దారుస్సలాం సందడిగా మారింది. శనివారం పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో వేర్వేరుగా ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సమావేశమయ్యారు. మేయర్ పీఠం అంశం పెద్దగా చర్చించనప్పటికీ ‘అధికారం ముఖ్యం కాదు.. ఓట్లు వేసిన ప్రజలకు న్యాయం చేయాలి. సమస్యలు పరిష్కరించి వారిని సంతృప్తిపర్చాలి’ అని ఆయన ఉద్బోధించారు. 51 స్థానాలకు గాను 44 డివిజన్లలో విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. -
బండి సంజయ్ (బీజేపీ).. రాయని డైరీ
ప్రెస్‌వాళ్లు వచ్చి కూర్చున్నారు. తెలంగాణలో బీజేపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక తొలిసారి ఆ సీఎం పెట్టిన ప్రెస్ మీట్‌కు వచ్చినట్లుగా వచ్చింది మీడియా మొత్తం! హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఘన విజయం ముందు పార్టీ ఆఫీసు బాగా చిన్నదైపోయినట్లుగా కనిపిస్తోంది. ఒకరిద్దరు మీడియా మిత్రులు ఒకే కుర్చీపై సర్దుకుని కూర్చోవడం గమనించాను. ‘‘ఈ విజయాన్ని మీరెలా ఆస్వాదిస్తున్నారు?’’ అని వారిలోంచి ఒకరు అడగడంతో నా ప్రమేయం లేకుండానే ప్రెస్ మీట్ మొదలైంది. అసలైతే ప్రెస్ మీట్‌ను నేను ఇంకోలా ప్రారంభించాలని తలచాను. ‘‘మీరెలా ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు?’’ అని నేనే ప్రెస్‌ను అడగదలచుకున్నాను. మోదీజీ అయితే ఇలానే అడుగుతారు ప్రెస్‌ని. అయినా, ఆయనెప్పుడు విజయాన్ని ఆస్వాదించారని! ఆరేళ్లుగా ప్రతిపక్షాల అపజయాలను ఆస్వాదించడంతోనే సరిపోతోంది మోదీజీకి. ‘‘చెప్పండి, ఈ విజయాన్ని మీరెలా ఆస్వాదిస్తున్నారు?’’ అని గద్దించినట్లుగా తన ప్రశ్నను రిపీట్ చేశాడు ఆ పత్రికా ప్రతినిధి. ‘‘విజయం ఆసనం లాంటిది. ఆసనంపై ఆసీనమవడమే కానీ, ఆస్వాదించడం ఉండదు’’ అన్నాను. ఆ మాటకు ఎవరైనా నవ్వుతారని ఆశించాను. నవ్వలేదు! ప్రెస్ మీట్లో కేసీఆర్ ఏదైనా అంటే నవ్వుతారు. కేటీఆర్ ఏదైనా అంటే నవ్వుతారు. కేసీఆర్ లేదా కేటీఆర్ మాటలకే నవ్వడానికి వీళ్లు అలవాటు పడ్డారా?! అలా అలవాటు చేయబడ్డారా?! ‘మిత్రులారా, బీజేపీ విజయం గురించి అడగడానికి మీ దగ్గర ప్రశ్నలేమీ ఉండవని నాకు తెలుసు. టీఆర్ఎస్ అపజయం గురించి మీరు కొన్ని ప్రశ్నలు వేయవచ్చు..’’ అన్నాను. ‘‘టీఆర్ఎస్ది అపజయం అని మీరెలా అంటారు బండి గారు’’ అన్నాడు ఓ ప్రతినిధి. ఆశ్చర్యపోయాను. ‘‘కొన్ని గంటల ముందే కదా.. ప్రెస్‌కి మా విజయాన్ని గుర్తించవలసిన పరిస్థితి ఏర్పడి మీరంతా నన్ను కలుసుకున్నది. ఆ కొత్తదనమైనా లేకుండా అప్పుడే మీరు నన్ను బండి గారు అంటున్నారేమిటి! నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నదేమిటంటే.. బీజేపీ విజయాన్ని మీరు టీఆర్ఎస్ అపజయంగా భావించో లేదా, టీఆర్ఎస్ అపజయాన్ని బీజేపీ విజయంగా భావించో బీజేపీని ఏ విధంగానూ అంగీకరించేందుకు మనసొప్పక, ఆ అనంగీకారతతో నన్ను ‘బండి’ అని సంబోధిస్తున్నారని! ఇక నా అభ్యర్థన ఏమిటంటే.. నేను మీ చేత బండి అని పిలిపించుకోడానికి నాక్కొంత శక్తిని, తగినంత సమయాన్ని ఇమ్మని. ఇప్పటికైతే సంజయ్ అనొచ్చు’’ అన్నాను. ఈలోపు మరొక ప్రతినిధి చెయ్యి లేపాడు. ‘‘సంజయ్ గారూ.. టీఆర్ఎస్ సీట్లు తగ్గి, బీజేపీ సీట్లు ఎక్కువ రావడానికి మీకు కనిపి స్తున్న కారణాలు ఏమిటి? మీకు అనిపిస్తున్న కారణాలు ఏమిటి?’’ అని అడిగాడు. ‘‘మిత్రమా.. నాకు కనిపిస్తున్న కారణాలు, నాకు అనిపిస్తున్న కారణాలు ఏమిటని మీరు అడిగారు. నిజానికి మీకు కదా కారణాలు కనిపించవలసినదీ, కారణాలుగా ఏవైనా అనిపించవలసినదీ. కనుక మీరే చెప్పండి’’ అని అడిగాను. తర్వాత కొన్ని ప్రశ్నలు. వాటికి జవాబులుగా నా ప్రశ్నలు. చివరి ప్రశ్న ఒక మహిళా ప్రతినిధి నుంచి వచ్చింది. ‘‘సంజయ్ గారూ.. మీరేమైనా చెప్పదలచుకున్నారా?’’ అని! గుడ్ క్వొశ్చన్ అన్నాను. ‘‘అయితే గుడ్ ఆన్సర్ ఇవ్వండి’’ అన్నారు నవ్వుతూ ఆ ప్రతినిధి. ‘‘నేను చెప్పదలచినది, గ్రేటర్ ఫలితాలు చెప్పేశాయి’’ అన్నాను. -
రెండు పార్టీలు – రెండు రాష్ట్రాలు
హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాలు రెండు కీలకమైన రాజకీయ పరిణామాలకు అద్దంపట్టే విధంగా ఉన్నాయి. ఒకటి: అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఉన్న పలుకుబడి తగ్గుముఖం పట్టింది. ఈ పరిస్థితిని చక్కదిద్దు కునే అవకాశం, సమయం రెండూ ఆ పార్టీకి ఇంకా వున్నాయి. రెండు: తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం పాత్ర నుంచి కాంగ్రెస్ జారిపడటం పూర్తయింది. ఇక లేచి నిలబడే అవకాశాలు లేనట్టే. ఇందుకు కారణాలున్నాయి. ఆ పాత్రలోకి ప్రవేశిం చడానికి భారతీయ జనతా పార్టీ చేపట్టిన యాత్ర విజయ వంతంగా ప్రారంభమైంది. టీఆర్ఎస్ పలుకుబడి ఎందుకు తగ్గుముఖం పట్టింది? ఆ పార్టీ నాయకులు చెబుతున్నట్టు... బీజేపీ శ్రేణులు వెదజల్లిన మత విద్వేషం ప్రభావం చూపిందా? వందేళ్లలో కనీవినీ ఎరుగని వరదలు సరిగ్గా ఎన్నికలకు ముందే దాపురించడం కారణమా? పదిపదిహేను డివిజన్లను కొద్ది ఓట్ల తేడాతో కోల్పోయే విధంగా దురదృష్టం వెక్కిరించిందా? ఇటువంటి సాకులకు మాత్రమే టీఆర్ఎస్ విశ్లేషణ పరిమితమైతే ఆ పార్టీకి లాభం చేకూరదు. వాస్తవానికి నగరవ్యాప్తంగా రెండు పార్టీలకు పోలయిన ఓట్లు దాదాపు సమానంగానే ఉన్నాయి. కానీ టీఆర్ఎస్కే ఏడు డివిజన్లు ఎక్కువొచ్చాయి. దురదృష్టం ఎవరితో ఉన్నట్టు? టీఆర్ఎస్ స్కోర్ బోర్డు 56 దాకా పరుగెత్త డంతో మూడు అదనపు కారణాలు ముఖ్యపాత్రను పోషిం చాయి. ఒకటి: ఆంధ్రప్రదేశ్ సెటిలర్లు. రెండు: వామపక్ష– సెక్యులర్ ఆలోచనాపరులు, మూడు: వంద డివిజన్లలో ముస్లిం మైనారిటీలు. ఈ మూడు వర్గాలు టీఆర్ఎస్ పార్టీ సొంత ఓటు బ్యాంకులు కావు. పరిస్థితులకు అనుగుణంగా మారేవి. ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల్లో అవి టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లాయి. మతపరమైన ఎజెండాతో బీజేపీ సాధించిన ఓట్ల కంటే ఈ ఓట్లు తక్కువేమీ కాదు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి స్థిరపడిన ఓటర్లు ఎక్కువగా నివసించే జూబ్లీహిల్స్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగం పల్లి నియోజకవర్గాల పరిధిలోని 32 డివిజన్లలో 27 సీట్లను టీఆర్ఎస్ గెలుచుకోగలిగింది. ఈ నాలుగు నియోజకవర్గాల్లో కలిసి బీజేపీ కంటే లక్ష పైచిలుకు ఓట్లను టీఆర్ఎస్ అధికంగా సంపాదించుకోగలిగింది. పోస్ట్‌పోల్ సర్వే ద్వారా ఏ సామాజిక వర్గం ఎటువైపు మొగ్గుచూపిందో తెలుసుకునే ప్రయత్నాన్ని ‘ఆరా’ అనే సంస్థ చేసింది. ఈ సంస్థ లెక్క ప్రకారం టీఆర్ఎస్కు అత్యధిక శాతం ఓట్లేసింది ఏపీలో టీడీపీకి వెన్నెముకగా ఉండే సామాజికవర్గమే. ఏపీ సెటిలర్లలో అన్ని సామాజికవర్గాల వారూ గులాబీ పార్టీవైపే మొగ్గుచూపినప్పటికీ టీడీపీ వెన్నెముక సామాజికవర్గం మొగ్గు మిగతా వారికంటే హెచ్చుగా ఉన్నది. రెండు తరాల్లో జరిగిన కమ్యూనిస్టు విప్లవ పోరాటాలకు కార్యక్షేత్రంగా నిలిచిన తెలంగాణ ప్రాంతంలో ఆ ప్రభావం వల్ల వామపక్ష, లౌకిక ఆలోచనాపరుల సంఖ్య ఇప్పటికీ విస్తారంగానే ఉన్నది. కమ్యూనిస్టు పార్టీల్లో ఇప్పుడున్న సభ్యులకంటే ఈ ఆలోచనాపరుల సంఖ్య ఎన్నోరెట్లు అధికం. వీరికీ కమ్యూనిస్టు పార్టీలకూ ఎటువంటి సంబంధం ఉండదు. ఆ పార్టీల విధానా లతో పొసగదు కనుక ఇటువంటి వారంతా స్వతంత్రంగా ఉంటున్నారు. వీరిలో అత్యధికులు మొదట్లో టీఆర్ఎస్కు సహకరించినవారే. ఇటీవలికాలంలో బద్ధవ్యతిరేకులుగా మారిపోయారు. కానీ,ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రధాన వైరిపక్షంగా బీజేపీ ముందుకు రావడంతో మరో గత్యంతరం లేదన్నట్టుగా వీరంతా మళ్లీ టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపారు. ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ను ఎంపిక చేసుకోకపోవడానికి రెండు కారణాలను వీరు చెబుతున్నారు. ఒకటి: కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి కనిపించకపోవడం, తాము కాంగ్రెస్‌కు ఓటేసినట్లయితే పరోక్షంగా బీజేపీకి మేలు జరుగుతుందని భావించడం. రెండు: కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన ప్రజా ప్రతినిధులు అదే పార్టీలో కొనసాగుతారన్న గ్యారంటీ లేకపోవడం. 150 డివిజన్లున్న నగరంలో మజ్లిస్ పార్టీ 51 డివిజన్లలోనే పోటీ చేసింది. 44 చోట్ల గెలిచి తన పూర్వబలాన్ని నిలుపుకోవడమేగాక అత్యుత్తమమైన స్ట్రయిక్ రేట్‌ను సాధించింది. మజ్లిస్ పోటీ చేయని మిగిలిన 99 డివిజన్లలో కూడా ముస్లిం మైనారిటీల్లో గణనీయమైన భాగం టీఆర్ఎస్కే వేసి ఉంటారనడంలో ఎవరికీ ఎటువంటి సందేహం ఉండదు. ఈ రకంగా అనేక స్రవంతులు టీఆర్ఎస్ పార్టీకి సహకరించినా అత్తెసరు గెలుపే దక్కడానికి కారణాలేమిటో అధ్యయనం చేయవలసిన సమయం ఆ పార్టీకి ఆసన్నమైంది. వాటిని గుర్తించి చక్కదిద్దుకోగలిగితే ఇకముందు కూడా తెలంగాణ ప్రజల బెస్ట్ చాయిస్‌గా టీఆర్ఎస్ ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజకీయ అజ్ఞానాన్ని ప్రదర్శించి చంద్రబాబును కౌగిలించుకున్న కారణంగా చాలామంది ‘గత్యంతరం’ లేక టీఆర్ఎస్కు ఓటేశారు. బల్దియా ఎన్నికల్లో బీజేపీ ప్రధాన పోటీదారుగా ఎదగడంతో అనేకమంది ‘గత్యంతరం‘ లేక టీఆర్ఎస్కు ఓటేశారు. ఈ గత్యంతరం లేని పరిస్థితి ఎల్లకాలం ఉండకపోవచ్చు. ఈ ఎన్నికల ఫలితాల వల్ల టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన తక్షణ ప్రమాదం ఏమీ లేదు కానీ, కొస ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న మరో జీవి వృత్తాంతం వెలుగులోకి వచ్చింది. ఆ జీవి కాంగ్రెస్ పార్టీ. ఘనత వహించిన గతం కలిగిన ఆ పార్టీ ఇప్పుడు వెంటిలేటర్ సాయంతో ఊపిరి పీల్చుకుంటున్న వైనం బయట పడింది. ఒక గమ్యం, లక్ష్యం, వ్యూహం, సమన్వయం లేకుండా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆరేళ్ల కాలాన్ని ఉఫ్‌మని ఊదేసింది. ఇందుకు బాధ్యత వహించవలసింది రాష్ట్ర నాయకత్వం కాదు. మార్గ దర్శనం చేయలేని గందరగోళ స్థితిలో ఉన్న కేంద్ర నాయకత్వం. గత ఏడాదిన్నర కాలంగా ఆ పార్టీ జాతీయ ముఖచిత్రం ఎవరిదో చెప్పుకోలేని దుస్థితిలో కాంగ్రెస్ శ్రేణులు నిస్పృహకు లోన య్యాయి. నాయకులు, కార్యకర్తలు క్యూ కట్టి మరీ ఇతర పార్టీల్లోకి వలసపోతున్నా పట్టించుకునే దిక్కులేని అనాథలా వుంది కాంగ్రెస్ పరిస్థితి. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే అతడు కచ్చితంగా పార్టీ ఫిరాయిస్తాడన్న అభిప్రాయం జనంలో ఏర్పడింది. ఈ ఒక్క అభిప్రాయం చాలు.. ఎటువంటి తటపటాయింపు లేకుండా ఆ పార్టీకి డెత్ సర్టిఫికెట్ జారీ చేయడానికి. ఫిరాయింపుల కారణంగా కాంగ్రెస్ పార్టీ క్రెడిబిలిటీని పూర్తిగా పోగొట్టుకున్నది. ఫిరాయింపులను ప్రోత్సహించిన టీఆర్ఎస్ కూడా బావుకున్నదేమీ లేదు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలంతా అదే పార్టీలో కొనసాగుతున్నట్లయితే మరికొంతకాలం పాటు ఒక అర్భకపు ప్రతిపక్షంతో ఆహ్లాదకరంగా టీఆర్ఎస్ సహజీవనం కొనసాగేది. కాంగ్రెస్‌ను పూర్తిగా నిర్వీర్యం చేసి మరో ప్రమాదకరమైన ప్రతిపక్షాన్ని గులాబీ పార్టీ ఆహ్వానించింది. హైదరాబాద్‌లో ఎన్నికలు జరుగుతున్న రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల సందర్భంగా సీనియర్మోస్ట్ పొలిటీషియన్, 14 ఏళ్లు ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్షనేత చంద్రబాబు ప్రదర్శించిన ఆంగిక, వాచికాభినయాలు సభ్యసమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. చేతులు విసురుతూ, రొమ్ము విరుస్తూ, కళ్లను విప్పారుస్తూ, తల ఎగరేస్తూ, సభ్యులను దుర్భాషలాడుతూ సర్రున జారిపడ్డట్టుగా స్పీకర్ పోడియం ఎదుట దభేల్మని కూలబడిపోయారు. గతంలో ఎక్కడా ఏ ప్రతిపక్ష నాయకుడూ ఇంతటి ‘నేలబారు’ తనాన్ని ప్రదర్శించలేదు. స్పీకర్‌ను బెదిరించడం, మీడియా సమావేశంలో సాక్షాత్తూ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇష్టం వచ్చి నట్టు మాట్లాడడం, సభలో సంక్షేమ పథకాలపై అసత్యాలను వల్లించడం, తన సభ్యులచేత అవాస్తవాలను మాట్లాడించడం, చివరికి తన పార్టీ సభ్యుల ప్రసంగాలనే అడ్డుకోవడం.. అంతా ఒక వింతైన విచిత్ర ప్రవర్తన. చంద్రబాబు ప్రవర్తన ముందు బండి సంజయ్ ‘సర్జికల్ స్ట్రయిక్స్’ తరహా కామెంట్లు సైతం చిన్నబోయాయి. ఎందుకని ఆయన ఆవిధంగా ప్రవర్తించారు? అసహనం, నిస్పృహ, క్రోధం, చిరాకు వంటివన్నీ ఏకకాలంలో ఆయన ముఖకవళికల్లో ముప్పిరిగొనడం ఎలా సాధ్యమైంది? కారణాలు స్పష్టం. పాతికేళ్ల కిందట ఎల్లో మీడియా సహకారంతో తాను హైజాక్ చేసి హస్తగతం చేసుకున్న పార్టీ తన కళ్లముందటే ఐసీయూలోకి చేరింది. గత తొమ్మిది నెలలుగా పార్టీలో కదలిక లేదు. కరోనా వచ్చిన దగ్గర నుంచి క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఉనికి లేదు. తానెంత ‘జూమ్’ చేసి చూసినా పార్టీ బొమ్మ కనిపించడంలేదు. జనరంజకమైన జగన్ పరిపాలన ఫలితంగా ఏడాదిన్నర గడిచినా ఎక్కడా చిన్న ఆందోళన లేదు. రజతోత్సవాలకోసం తన పార్టీ నడిపిస్తున్న మందడం శిబిరం, దానికి పోటీగా దళితుల శిబిరం తప్ప మూడో ధర్నా రాష్ట్రంలో లేదు. భారీవర్షాల సందర్భంగా వరద నష్టాలపై ఎంత రెచ్చగొట్టినా ఒక్క రైతూ రోడ్డెక్కలేదు. తన పార్టీ జెండా ఎక్కడా ఎగర్లేదు. అనుభవజ్ఞుడు కనుక పరిస్థితి అర్ధమవుతున్నది. తన పార్టీ ఇంకెంతో కాలం బతకదు. కాకపోతే ఎల్లోమీడియా ఉన్నది. సంపన్న వర్గాల దన్ను ఉన్నది. కనుక భౌతిక కాయాన్ని సైతం వజ్రకాయంగా కొన్నాళ్లు ప్రొజెక్ట్ చేయగలరు. కానీ వాస్తవ పరిస్థితి అధినేతకు తెలుసు, పార్టీలో పూర్వపు జవసత్వాలు ఇక కల్ల. క్లిష్ట పరిస్థితుల్లో తాను చక్రం తిప్పగలనని గతంలో ఎల్లో మీడియా నమ్మించేది. ఇప్పుడు ఎవరూ నమ్మడం లేదు. వేలికి చక్రం తొడగడం ఇప్పుడిక వేస్ట్. వ్యవస్థలను మేనేజ్ చేసే గారడీ విద్యలన్నీ ప్రజలందరికీ తెలిసిపోయాయి. తన మేనేజ్మెంట్ కథ చివరి మజిలీకి చేరుకుంటున్నది. సరిగ్గా పదేళ్లు వెనక్కి వెళదాం. 2010 నవంబర్ 29. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన తల్లిగారు వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్. విజయమ్మ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ గుర్తుపై గెలిచిన పార్లమెంట్, అసెంబ్లీ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. కారణాలు తెలుగు ప్రజలకు తెలిసినవే. తన తండ్రి మరణవార్తను తట్టుకోలేక గుండె పగిలి చనిపోయినవారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వస్తానని సంతాప సభలో వారికి ఆయన మాట ఇచ్చారు. అందుకు అనుమతినివ్వాలని పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న సోనియాగాంధీని ఢిల్లీకి వెళ్లి మరీ అభ్యర్థించారు. అందుకు ఆమె సమ్మతించలేదు. అప్పుడామె జస్ట్ పార్టీ అధ్యక్షురాలు మాత్రమే కాదు. ఢిల్లీ మహాసామ్రాజ్య సామ్రాజ్ఞి స్థాయిలో చక్రం తిప్పు తున్నారు. నాటి ప్రపంచంలో శక్తిమంతమైన ఐదుగురు వ్యక్తుల్లో ఒకరిగా ‘టైమ్’ మన్ననలందుకున్న స్థితిలో ఉన్నారు. అంతటి మహాసామ్రాజ్ఞి హుకుంనామా కంటే తాను సంతాప సభలో ఇచ్చిన మాటే విలువైనదిగా జగన్ భావించారు. అందుకే రాజీనామా చేశారు. ధిక్కారాన్ని సింహాసనం సహించలేదు. మూడు దశాబ్దాల వైరాన్ని పక్కనపెట్టి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌తో చేతులు కలిపింది. ఒక్క వ్యక్తిని వేటాడటానికి ఆ రెండు పార్టీలు కలిసి దిగజారకూడని లోతుల్లోకి పతనం అయ్యారు. ఫలితంగా పదేళ్లలో తెలుగునాట ఆ రెండు పార్టీల కథ చివరి దశకు చేరుకుంటున్నది. రెండు శవాలు కాలుతున్న కమురువాసన క్రమంగా వ్యాపిస్తున్నది. -వర్ధెల్లి మురళి muralivardelli@yahoo.co.in -
ఆ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోం
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో స్వస్తిక్ గుర్తు కాకుండా నిర్దిష్టమైన ఇతర గుర్తులున్నా వాటినీ లెక్కించాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) జారీ చేసిన సర్క్యులర్‌ను నిలిపేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యానికి హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎస్ఈసీ దాఖలు చేసిన అప్పీల్‌ను విచారించబోమని తేల్చిచెప్పింది. ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర్వులు జారీ చేసినప్పుడు జోక్యం చేసుకొనే అధికారం న్యాయస్థానాలకు ఉందని స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులతో ఒక డివిజన్ ఫలితాలు మాత్రమే ఆగిపోయాయని, సోమవారం ఈ కేసును సింగిల్ జడ్జి మొదటి కేసుగా విచారించనున్న నేపథ్యంలో అభ్యంతరాలుంటే అక్కడే చెప్పుకోవాలని సూచించింది. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో జోక్యం చేసుకోవడం సరికాదని ఎస్ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ వాదించగా... ఏ గుర్తు ఉన్నా ఆ బ్యాలెట్ పేపర్లను కూడా లెక్కిం చాలని ఎస్ఈసీ ఉత్తర్వులు జారీచేయడం నిబంధనలకు విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. ఈ వ్యవహారంలో సింగిల్ జడ్జి ఉత్తర్వులు సమర్థనీయమేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్. చౌహాన్, జస్టిస్ బి. విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పీల్‌కు అంత తొందరెందుకు? ‘‘ఎన్నికల ప్రక్రియను ఆపాలని సింగిల్ జడ్జి ఆదేశించలేదు. అన్ని డివిజన్ల ఫలితాలు ఆపాలని ఆదే శించలేదు. బ్యాలెట్ పేపర్‌పై ఏ గుర్తులు ఉన్నా లెక్కించాలంటూ ఎన్నికల కమిషన్ అర్ధరాత్రి ఇచ్చిన ఉత్తర్వులపై స్పష్టత కోరుతూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. 150 డివిజన్లకుగాను 149 డివిజన్ల ఫలితాలు శుక్రవారమే వెలువడ్డాయి. ఒక డివిజన్ ఫలితం మాత్రమే ఆగింది. దాని వల్ల ఎటువంటి నష్టం లేదు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. ఎన్నికల సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వకపోవడం వల్ల కొన్ని కేంద్రాల్లో ఓటర్లకు స్వస్తిక్ గుర్తు కాకుండా ఇతర గుర్తులను ఇచ్చి తప్పిదం చేశారు. స్వస్తిక్ గుర్తుకు బదులుగా పోలింగ్ కేంద్రం నంబర్ సూచించే గుర్తులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో బ్యాలెట్‌పై ఏ రకమైన గుర్తులు ఉన్నాయనే విషయంలో స్పష్టత కోసం రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఎన్నికల కమిషన్‌ను కౌంటర్ దాఖలు చేయాలని సింగిల్ జడ్జి ఆదేశిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేశారు. రెండు రోజులు కూడా ఆగకుండా అంత అత్యవసరంగా ఎందుకు అప్పీల్ దాఖలు చేశారు? ఆ ఉత్తర్వులపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే సింగిల్ జడ్జి దగ్గరే నివేదించండి’’అని ధర్మాసనం స్పష్టం చేసింది. -
మేయర్ ఎన్నిక జరిగేదిలా..
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ ఒక్కపార్టీకీ స్పష్టమైన ఆధిక్యత రాకపోవడంతో మేయర్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో మేయర్ ఎన్నిక ఎలా జరుగుతుంది. ఎవరెవరు ఎన్నుకుంటారనే అంశాలపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. 150 మంది కార్పొరేటర్లతో పాటు గ్రేటర్ పరిధిలోని రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉంటారు. గ్రేటర్లో 45 మంది ఎక్స్అఫీషియో సభ్యులు, 150 కార్పొరేటర్లతో కలిపి మొత్తం 195 మంది మేయర్ ఎన్నికలో ఓటర్లుగా ఉంటారు. వీరు మేయర్‌ను, డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకుంటారు. ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎన్నిక నిర్వహిస్తారు. జీహెచ్ఎంసీ చట్టం మేరకు విధివిధానాలు ఇలా ఉంటాయి. – సాక్షి, హైదరాబాద్ ► మేయర్‌ను ఎన్నుకునేందుకు కార్పొరేటర్లు, ఎక్స్అఫీషియో సభ్యులు తమకు అందిన నోటీసు(ఆహ్వానం)తో రావాల్సి ఉంటుంది. ► ఎన్నికకు కనీసం మూడు రోజుల ముందు సమాచారం పంపుతారు. ► తొలుత ఎన్నికైన పాలకమండలి సభ్యులతో ప్రమాణస్వీకారం చేయిస్తారు. అనంతరం మేయర్ ఎన్నిక నిర్వహిస్తారు. ► తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, హిందీలో ప్రమాణపత్రాలు ఉంచుతారు. ► మేయర్ అభ్యర్థిత్వానికి ఒకరు పేరును ప్రతిపాదించాలి. మరొకరు బలపరచాలి. ► చెయ్యి పైకెత్తడం ద్వారా ఓటింగ్ ఉంటుంది.. ఎవరికి అనుకూలంగా ఎందరు చేతులెత్తారో లెక్కిస్తారు. ► పోలైన ఓట్లలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారిని మేయర్‌గా ప్రకటిస్తారు. ► ఈ తరహాలో డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా. ► తొలుత మేయర్, తర్వాత డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించాలి. ► ఎన్నిక నిర్వహించాలంటే ఎక్స్‌అఫీషియోలతో సహ మొత్తం ఓటర్లలో కనీసం 50 శాతం మంది హాజరు ఉండాలి. దీన్ని కోరంగా పరిగణిస్తారు. కోరం లేని పక్షంలో గంటసేపు వేచి చూస్తారు. అప్పటికీ లేకపోతే మర్నాటికి వాయిదా వేస్తారు. ► మర్నాడు కూడా కోరం లేకపోతే ఎన్నికల సంఘానికి నివేదిస్తారు. అక్కడినుంచి వచ్చే సూచనలకు అనుగుణంగా కోరం లేకపోయినప్పటికీ ఎన్నిక నిర్వహిస్తారు. ► జీహెచ్ఎంసీలో ఎక్స్అఫీషియోలుగా పేర్లు నమోదు చేసు కున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకూ మేయర్ ఎన్నికలో ఓటు హక్కు ఉంటుంది. అయితే వీరు తాము మరే పురపాలికలోనూ ఓటు వేయలేదనే డిక్లరేషన్‌పై సంతకం చేయాలి. ► మేయర్ పదవికి పోటీ చేసేందుకు మాత్రం కార్పొరేటర్లే అర్హులు. ► గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేస్తాయి. ► ఎన్నికకు 24 గంటల ముందు పార్టీ అధ్యక్షుడు లేదా ఆయన అధీకృతంగా నియమించిన వారు విప్ జారీ చేయవచ్చు. ఈ విషయాన్ని ఎన్నికల ప్రిసైడింగ్ అధికారికి తెలియజేయాలి. ఇదిలాఉండగా.. విప్ ఉల్లంఘించిన వారు ఒకవేళ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటే, తుదితీర్పు మేరకు చర్యలుంటాయి. అప్పటివరకు వారి పదవికి ఢోకా ఉండదని సంబంధిత అధికారి తెలిపారు. -
వాళ్లడిగితే.. ఆలోచిస్తాం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వైఖరిపై హడావుడిగా నిర్ణయం తీసుకోవాల్సిన అవస రంలేదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. టీఆర్ఎస్ తమ మద్దతు కోరితే అప్పుడు ఆలోచిస్తామని, ప్రస్తుతానికైతే ఈ పార్టీ నుంచి తమనెవరూ సంప్రదించలేదన్నా రు. ‘బీజేపీది బలం అని నేను అనుకోవటం లేదు. బండి సంజయ్ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న కరీంనగర్లో మేయర్, డిప్యూటీ మేయర్లుగా బీజేపీ వారిని గెలిపించుకోలేకపోయారు. మరో ఎంపీ అరవింద్ నిజామాబాద్‌లో ఇలాగే విఫలమయ్యారు. కొన్ని తాత్కాలిక పరి స్థితుల ప్రభావంతో ఇక్కడ బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచింది. దక్షిణ భారత్‌లో సత్తా ఉన్న నేతల్లో కేసీఆర్ ఒకరు. భవిష్యత్తులోనూ తెలంగాణ జనం ఆయనకు అనుకూలంగా ఉంటారనే విశ్వ సిస్తున్నా’ అని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. శనివా రం సాయం త్రం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. తాజా పరిస్థితులపై తన అభిప్రాయాలను వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. మిగిలిన ఏడు కూడా నెగ్గుతామనుకున్నాం మేం ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 51 డివిజన్లలో పోటీచేసి 44 గెలిచాం. అన్ని చోట్లా నెగ్గుతామని ఆశించాం. కానీ మా అభ్యర్థులు కొందరు సరిగా పనిచేయలేకపోవటం వల్ల మిగతా వాటిని సాధించలేకపోయాం. దీనిపై కూడా అంతర్గతంగా విశ్లేషించుకుని పొరపాట్లు సరిదిద్దుకుంటాం. బీజేపీకి భయపడం... ఎప్పుడూ ప్రజల్లో ఉండి, వారి సమస్యలు పరిష్కరిస్తూ.. వారికి దగ్గరవుతుండటమే మా విజ యరహస్యం. ఇక ముందూ అలాగే ఉంటాం. బీజేపీ ఇప్పుడు ఎక్కువ సీట్లు గెలిచినంత మాత్రాన ఆ పార్టీతో మాకు పోటీ ఏం లేదు. మాకు పట్టున్న చోట పనిచేసుకుంటూ పోతాం. ఎన్నికల్లో ఎవరిని ఆదరించాలో ప్రజలే నిర్ణయించుకుంటారు. బీజేపీని చూసి మేం భయపడం. టీఆర్ఎస్ కూడా భయపడొద్దనే సూచిస్తున్నా. ఎవరికీ అనుకూల తీర్చు ఇవ్వలేదు తాజా ఎన్నికల్లో హైదరాబాద్ నగర ఓటరు మూడు పార్టీలకు సమ ప్రాధాన్యం ఇచ్చినట్టుగానే అనిపిస్తోంది. టీఆర్ఎస్, బీజేపీ, మా పార్టీ... దేనికీ పూర్తి అనుకూల తీర్పు చెప్పలేదు. ఇది కొంత ఇబ్బందికర విషయమే. అలా ఎందుకు జరిగిందో విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీలో అంతర్గతంగా చర్చిస్తాం జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వెల్లడై 2 రోజులు కూడా గడవలేదు. అప్పుడే మేయర్ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సినంత హడావుడి లేదు. నేరేడ్మెట్ ఫలితం పెండింగ్‌లో ఉంది. అది వచ్చాక మేయర్ ఎన్నికపై అంతర్గతంగా పార్టీలో చర్చించి ఓ అభిప్రాయానికి వస్తాం. టీఆర్ఎస్ సంప్రదించలేదు మా ఫలితాలను విశ్లేషించుకునే పనిలో ఉన్నాం. మేయర్ విషయంలో టీఆర్ఎస్ మా మద్దతు కోరితే అప్పుడు ఆలోచిస్తాం. ఇప్పటి వరకు ఆ పార్టీ నుంచి మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు. మా అవసరం ఏర్పడి సహకారం కోరితే .. మా పార్టీ నేతల అభిప్రాయానికనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం. దుబ్బాకతో గ్రేటర్‌కు పోలిక లేదు ఇటీవల జరిగిన దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ గెలవటానికి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ ఎక్కువ సీట్లు సాధించటానికి పోలిక లేదు. టీఆర్ఎస్ చేసిన కొన్ని తప్పిదాల వల్ల దుబ్బాక ఫలితం అలా వచ్చింది. దివంగత ఎమ్మెల్యేపై ప్రజల్లో వ్యతిరేకత ఉండటం, ప్రచార సమయంలో బీజేపీ అభ్యర్థి ఇంటిలో సోదాల పేరుతో హడావుడి చేయటం, పోలింగ్‌కు మూడు నెలల సమయం దొరికినా టీఆర్ఎస్ దాన్ని సరిగా వినియోగించుకోలేకపోవటం... ఇలాంటి కారణాలతో టీఆర్ఎస్ ఓడిందని నేను అనుకుంటున్నా. -
తేడా అతి స్వల్పం..!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ హోరాహోరీగా తలపడ్డాయి. టీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుచుకున్నా.. గతంతో పోలిస్తే ఓటింగ్ శాతం మాత్రం భారీగా తగ్గింది. బీజేపీ ఓటింగ్ శాతం మాత్రం అనూహ్యంగా పెరిగింది. ఈ రెండు పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం 0.28 శాతమే కావడం, టీఆర్ఎస్ కంటే బీజేపీకి 9,744 ఓట్లు మాత్రమే తక్కువ రావడం గమనార్హం. ఈ ఓట్ల శాతం తేడాతో 55 డివిజన్లను టీఆర్ఎస్ గెలుచు కోగా, 48 డివిజన్లలో బీజేపీ గెలిచింది. పాత బస్తీలో ఎంఐఎం తన ఓటు బ్యాంకును పదిల పరుచుకుని 18.76% ఓట్లు సాధించింది. కాంగ్రెస్ మాత్రం గతం కంటే తక్కువగా 6.67% ఓట్లకే పరిమితమైందని బ్యాలెట్ లెక్కలు చెబుతున్నాయి. 2016లో టీఆర్ఎస్.. 42% ఓట్లతో 99 స్థానాల్లో గెలుపొందగా, ప్రస్తుతం 34.62% ఓట్లకే పరిమితమైంది. ఇక బీజేపీ 2016లో 10% ఓట్లకు పరిమితం కాగా, ఈ సారి ఏకంగా 34.34 శాతానికి ఎగబాకింది. 2016తో పోలిస్తే అధికార పార్టీ సుమారు ఆరు శాతం ఓట్లు కోల్పోగా, బీజేపీ మాత్రం అనుహ్యంగా గతంతో పోలిస్తే 24 శాతం ఓటు బ్యాంకును పెంచుకుంది. 79 డివిజన్లలో రెండో స్థానంలో బీజేపీ గ్రేటర్ పరిధిలో 24 నియోజకవర్గాలు ఉండగా, వీటిలో సికింద్రాబాద్, పటాన్చెరు, చార్మినార్, చాంద్రాయణగుట్ట, బహుదుర్‌పురా నియోజకవర్గాల్లో ఒక్క డివిజన్‌ను కూడా బీజేపీ రాబట్టుకోలేకపోయింది. ఎంఐఎం బలంగా ఉన్న చార్మినార్, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో అధికార టీఆర్ఎస్ కంటే ఎక్కువ ఓట్లు సాధించింది. సికింద్రాబాద్, పటాన్చెరులోనూ టీఆర్ఎస్కు గట్టిపోటీ ఇచ్చింది. ఎల్బీనగర్ నియోజకవర్గంలో అత్యధికంగా 11 డివిజన్లు, ముషీరాబాద్‌లో 5, సనత్‌నగర్‌లో 2, గోషామహల్లో 4, అంబర్‌పేటలో 2, కంటోన్మెంట్లో ఒకటి, యాకుత్‌పురలో 2, కూకట్‌పల్లిలో ఒకటి, మహేశ్వరంలో 2, మలక్‌పేటలో 2, కార్వాన్లో ఒకటి, మల్కాజ్‌గిరిలో 3, కుత్బుల్లాపూర్‌లో ఒకటి, శేర్లింగంపల్లిలో ఒకటి, ఉప్పల్ నియోజకవర్గంలో 2 డివిజన్ల చొప్పున విజయం సాధించింది. ఓడిపోయిన స్థానాల్లోనూ టీఆర్ఎస్, ఎంఐఎం అభ్యర్థులకు గట్టిపోటీ ఇచ్చింది. 150 డివిజన్లకు గాను 149 స్థానాల్లో పోటీ చేసి, 48 స్థానాల్లో విజయం సాధించింది. మరో 79 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఎంఐఎం, టీఆర్ఎస్ గెలిచిన స్థానాల్లోనూ సరాసరిగా బీజేపీకే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. వందకంటే తక్కువ ఓట్లతో రెండు సీట్లు, 500 కన్నా తక్కువ ఓట్లతో 5 సీట్లు, వెయ్యి కన్నా తక్కువ సీట్లతో మరో 5 సీట్లను బీజేపీ కోల్పోయింది. పార్టీల వారీగా పోలైన ఓట్లు.. శివారుల్లో ఇరుపార్టీలకూ జై.. బల్దియా ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీలకు వచ్చిన ఓట్లను పరిశీలిస్తే శివారు ప్రాంతాల ఓటర్లు ఇరు పార్టీలనూ ఆదరించారు. నగరానికి ఓ వైపున ఉన్న రాజేంద్రనగర్, మహేశ్వరం, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో బీజేపీ దూకుడు కనబరిస్తే.. కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, పఠాన్‌చెరు ప్రాంతాల్లో టీఆర్ఎస్ హవా కొనసాగింది. ముఖ్యంగా ఏపీకి చెందిన సెటిలర్లు ఎక్కువగా ఉన్న ఈ మూడు నియోజకవర్గాలు గులాబీ పార్టీకే హారతి పట్టాయి. ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 11 డివిజన్లలో కలిపి బీజేపీకి 1.29 లక్షలకు పైగా ఓట్లు రాగా, టీఆర్ఎస్ 86 వేల ఓట్లకే పరిమితమైంది. మహేశ్వరంలో కూడా రెండు పార్టీల మధ్య 8 వేల ఓట్ల తేడా కన్పిస్తోంది. ఇక్కడ కూడా బీజేపీయే పైచేయి సాధించింది. రాజేంద్రనగర్‌లో కూడా బీజేపీ స్వల్ప ఆధిక్యాన్ని కనబర్చింది. కూకట్‌పల్లిలో టీఆర్ఎస్కు 1.03 లక్షల పైచిలుకు ఓట్లు రాగా, బీజేపీకి 73 వేల వరకు వచ్చాయి. కుత్బుల్లాపూర్‌లో బీజేపీ కంటే టీఆర్ఎస్కు 30 వేల ఓట్ల ఆధిక్యత లభించింది. పఠాన్‌చెరు, మల్కాజ్గిరి, ఉప్పల్‌లో టీఆర్ఎస్కు ఎక్కువ ఓట్లు వస్తే, అంబర్‌పేట, ముషీరాబాద్‌లలో బీజేపీ పైచేయి సాధించింది. సికింద్రాబాద్‌లోనూ టీఆర్ఎస్కు 12 వేల ఓట్లు ఎక్కువ రాగా, సగనత్‌నగర్‌లో టీఆర్ఎస్ 3 వేల ఓట్ల స్వల్ప ఆధిక్యాన్ని దక్కించుకుంది. కోర్‌సిటీలో టీఆర్ఎస్ ఆధిక్యం.. ఇక కోర్‌సిటీ అయిన ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యమే కన్పించింది. గోషామహల్లో టీఆర్ఎస్ కంటే బీజేపీకి దాదాపు 23 వేల ఓట్ల ఆధిక్యం లభించింది. పాతబస్తీలో ఎంఐఎంకు ఎదురులేదని మరోసారి బల్దియా ఎన్నికలు నిరూపించాయి. చార్మినార్, కార్వాన్, చాంద్రాయణగుట్ట, మలక్‌పేట, నాంపల్లి, యాకుత్‌పూర, బహుదూర్‌పుర నియోజకవర్గాల్లో పతంగి ఆధిక్యం కనబర్చింది. ఈ నియోజకవర్గాలన్నింటిలో (బహుదూర్‌పుర మినహా) ఎంఐఎం తర్వాత బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. అంటే గతంలో కంటే పాతబస్తీలో కూడా బీజేపీకి ఓట్ల సంఖ్య పెరిగిందని అర్థమవుతోంది. కాంగ్రెస్ విషయానికి వస్తే ఉప్పల్‌లో అత్యధికంగా 45 వేల ఓట్లు సాధించింది. కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో కూడా కొంతమేర ప్రభావాన్ని చూపింది. మిగిలిన ఏ నియోజకవర్గంలోనూ టీఆర్ఎస్, బీజేపీ దరిదాపుల్లోకి కూడా కాంగ్రెస్ రాలేకపోయింది. నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కలు... -
‘గ్రేటర్’లో నేరచరిత్ర ఉన్న కార్పొరేటర్లు వీరే
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో నేరచరిత్ర ఉన్న కార్పొరేటర్ల జాబితాను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ విడుదల చేసింది. మూడు పార్టీల్లో మొత్తం 25 మంది నేరచరితులు ఉన్నట్లు పేర్కొంది. బీజేపీ 10, టీఆర్ఎస్ 8, ఎంఐఎంలో ఏడుగురు కార్పొరేటర్లు నేర చరిత్ర కలిగి ఉన్నట్లు ప్రకటించింది. కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 55 బీజేపీ 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలిచిన విషయం తెలిసిందే. నేరచరిత్ర ఉన్న కార్పొరేటర్ల జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అలా అయితే 100 సీట్లు గెలిచేవాళ్లం : బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో ఎన్నికల సంఘం ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లు నడిచిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.. రిగ్గింగ్ కోసమే బ్యాలెట్ పేపర్లు పెట్టారని ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీని తక్కువ అంచనా వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజలు తగిన బుద్ది చెప్పారని విమర్శించారు. ఎన్నికలు హడావుడిగా నిర్వహించకపోతే బీజేపీ వందకు పైగా స్థానాల్లో గెలిచి, మేయర్ పీఠం సాధించేవాళ్లమని చెప్పారు. టీఆర్ఎస్ అడ్డదారిలో వెళ్లి గెలిచేందుకు ప్రయత్నించి విఫలమైందని విమర్శించారు. (చదవండి : ఒవైసీ, కేసీఆర్ కలిసి బిర్యానీ తింటారు) ఎంఐఎంకు బీజేపీ అడ్డుకునే స్థాయి లేదన్నారు. హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చాలన్న బీజేపీ వాదాన్ని ప్రజలు సమర్థించారన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుమార్చుకోవాలని, లేదంటే ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కేంద్రం నిధుల విషయంలో హైదరాబాద్ అభివృద్దికి సహకరిస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు. ఇక జానారెడ్డి బీజేపీలో చేరతారనే అంశంపై స్పందిస్తూ.. ఆయన నుంచి ఎటువంటి ఫోన్ కాల్ రాలేదన్నారు. అలాగే ఢిల్లీ పెద్దల సమక్షంలో సోమవారం విజయశాంతి బీజేపీలో చేరుతున్నారని వెల్లడించారు. కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నగర ఓటరు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. టీఆర్ఎస్-55, బీజేపీ-48, ఎంఐఎం-44, కాంగ్రెస్-2 స్థానాల్లో విజయం సాధించింది. (చదవండి : 7న ఢిల్లీకి వెళ్లనున్న బండి సంజయ్) -
బీజేపీ గెలుపు తాత్కాలికమే : ఒవైసీ
-
ఒవైసీ, కేసీఆర్ కలిసి బిర్యానీ తింటారు
సాక్షి, న్యూఢిల్లీ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో టీఆర్ఎస్, ఎంఐఎం రహస్య పొత్తు పెట్టుకున్నాయమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మరోసారి ఆరోపించారు. మేయర్ ఎన్నికతో వారి బండారం బయటపడుతుందని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో నగర ఓటరు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. టీఆర్ఎస్-55, బీజేపీ-48, ఎంఐఎం-44, కాంగ్రెస్-2 స్థానాల్లో విజయం సాధించింది. మేయర్ పీఠం కోసం ఎంఐఎంతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో శనివారం ఈ అంశంపై కిషన్ రెడ్డి వ్యగ్యంగా స్పందించారు. ‘కేసీఆర్, అసదుద్దీన్ ఒవైసీ కలిసి బిర్యానీ తింటారు’ అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. (చదవండి : బీజేపీ గెలుపు తాత్కాలికమే : ఒవైసీ) ‘హైదరాబాద్ ఒక మిని తెలంగాణ. అక్కడ ప్రజలు బీజేపీకి 48 సీట్లు ఇచ్చి ఆశీర్వదించారు. ఈ ఫలితాలు అధికార టీఆర్ఎస్కు చెంపపెట్టు. తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోందని తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపును ఒవైసీ కానీ, కేసీఆర్ ఆపలేరు’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. -
‘ఎంఐఎంతో కాంగ్రెస్ ఎప్పుడు పొత్తు పెట్టుకోలేదు’
-
‘ఎంఐఎంతో కాంగ్రెస్ ఎప్పుడు పొత్తు పెట్టుకోలేదు’
సాక్షి, హైదరాబాద్ : ఎంఐఎం పార్టీతో కాంగ్రెస్ ఎప్పుడు పొత్తు పెట్టుకోలేదని కాంగ్రెస్ శాసనసభ పక్షనేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ మత పరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టిందని ఆయన ఆరోపించారు. ఎంఐఎం, బీజేపీ నగర ప్రజలను భయాందోళనకు గురిచేశారన్నారు. ఈ మేరకు శనివారం గాంధీ భవర్లో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు, కార్యకర్తలకు, ఓటు వేసిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల తీర్పును గౌరవిస్తూ.. స్వాగతిస్తున్నామన్నారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో నగరంలో ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని పోలీసు అధికారులతో చెప్పించారని విమర్శించారు. భావోద్వేగాలతో తాత్కాలికంగా లాభం పొందవచ్చు కానీ అభివృద్ధి జరగదని తెలిపారు. చదవండి: బీజేపీ గెలుపు తాత్కాలికమే : ఒవైసీ ఎన్నికలు మత పరమైన భావోద్వేగాల చుట్టూ తిరగడంతో కాంగ్రెస్ ఓటమి చెందిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియలో గెలుపు ఓటములే ప్రామాణికంగా తీసుకుంటారని, కాంగ్రెస్ పార్టీ ఓటమిపై రి-ఓరియెంటెషన్ చేసుకుంటామని తెలిపారు. అందరం కలిసి సమిష్టిగా సమీక్ష చేసుకుంటామని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు తాత్కాలికమేనని తెలిపాన బట్టి విక్రమార్క.. భవిష్యత్తులో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అభివృద్ధి కోసం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. జానారెడ్డి పార్టీ మారుతున్నారని చెబితే స్పందించేవాళ్ళమని అన్నారు. -
బీజేపీ గెలుపు తాత్కాలికమే : ఒవైసీ
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నగర ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఆయన ఎన్నికల ఫలితాలపై శనివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ పాతబస్తీలో బీజేపీ ప్రభావం లేదని అన్నారు. ముస్లింలు, హిందువులు అందరూ ఎంఐఎంకు ఓటు వేశారని తెలిపారు. అయితే తమ పార్టీకి వచ్చిన ఫలితాలపై సమీక్ష జరుపుతున్నామన్నారు. గ్రేటర్లో బీజేపీ గెలుపు తాత్కాలికమేనని, దాని ప్రభావం రాష్ట్రంలో ఉండదని పేర్కొన్నారు. ఇక మేయర్ అభ్యర్థిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఒవైసీ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రభావం రాష్ట్రంలో ఉండదని, తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌పై ఎనలేని గౌరవం ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీ బలహీనపడటం వల్లే బీజేపీ ఓట్ల శాతం పెరిగిందన్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన తెలిపారు. కాగా ఎంఐఎం పాతబస్తీపై తమ పట్టును మరోసారి నిరూపించుకుంది. 44 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. 2016లోనూ ఎంఐఎంకు సరిగ్గా ఇన్ని సీట్లే రావడం గమనార్హం. 2023లో బీజేపీదే గెలుపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన స్థానాలు వచ్చాయని కేంద్రమంత్రి కిషన్ అన్నారు. ఈ ఫలితాలు అధికార టీఆర్ఎస్కు చెంపపెట్టు అన్నారు. తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోందని తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపును ఒవైసీ కానీ, కేసీఆర్ ఆపలేదన్నారు. -
7న ఢిల్లీకి వెళ్లనున్న బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 7న(సోమవారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. పర్యటనలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల వివరాలను బీజేపీ జాతీయ నేతలకు వివరించనున్నారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన కేంద్రమంత్రులు ప్రకాష్ జావడేకర్, స్మృతీ ఇరానీ సహా పలువును కలిసి కృతజ్ఞతలు తెలిపే అవకాశం ఉంది. (చదవండి : గ్రేటర్లో మూడు ముక్కలాట) కాగా, గ్రేటర్ ఎన్నికల్లో నగర ఓటరు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. టీఆర్ఎస్-55, బీజేపీ-48, ఎంఐఎం-44, కాంగ్రెస్-2 స్థానాల్లో విజయం సాధించింది. మేయర్ పీఠం దక్కించుకోవాలంటే 76 స్థానాల్లో విజయం సాధించాలి. కానీ ఒక్క పార్టీ కూడా 60 దాటలేదు. దాంతో హంగ్ తప్పదంటున్నారు విశ్లేషకులు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై జాతీయ నేతలతో బండి సంజయ్ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
రేపు భాగ్యలక్ష్మి టెంపుల్‌కు బీజేపీబ్ కార్పొరేటర్లు
-
ఆశించిన విధంగా ఫలితాలు రాలేదు : కేటీఆర్
-
కేసీఆర్ సర్కారుకు సమయం దగ్గర పడింది
-
కాంగ్రెస్ ఓటమి.. రేవంత్ వర్గంలో ఆశలు
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ ఫలితాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ.. గెలుపు ముంగిట బొక్కబోర్లాపడింది. గతంలో చక్రంతిప్పిన గడ్డపైనే చతికలపడింది. ఓటమితో పోటీపడుతున్నట్లు నానాటికీ ప్రజాదరణ కోల్పోతుంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకే పరిమితమైన హస్తం పార్టీ.. ఈసారి కూడా అవే ఫలితాలను పునరావృత్తం చేసింది. కేవలం 2,24,528 ఓట్లు (5శాతం) దక్కించుకుని దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇతర పార్టీలను ఏమాత్రం ఎదుర్కోలేక ఓటమి ముందు తలవంచింది. ఇప్పటికే వరుస ఓటములతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న గ్రాండ్ ఓల్డ్ పార్టీకి గ్రేటర్ ఎన్నికలపరాజయం ఆ పార్టీ భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఓవైపు సీనియర్ నేతలు ఒక్కకరూ పార్టీని వీడి కాషాయతీర్థం పుచ్చుకుంటుండగా.. కార్యకర్తలు సైతం తమదారి తాము చూసుకుంటున్నారు. (మంత్రులకు షాకిచ్చిన గ్రేటర్ ఫలితాలు) ఈ తరుణంలో టీపీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు, ఆ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రకటించారు. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పీసీసీ పదవి నుంచి వైదులుగుతున్నట్లు ఓ లేఖను విడుదల చేశారు. కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియను సైతం ప్రారంభించాలని ఏఐసీసీని కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాజయం నాటి నుంచి ఉత్తమ్ రాజీనామా కోసం పార్టీలోని ఓ వర్గం బలంగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో పార్లమెంట్, దుబ్బాక ఉప ఎన్నిక, బల్దియా పోరులో ఓటములతో ఆ ఒత్తిడి మరింత పెరిగింది. దీంతో పదవికి రాజీనామా చెయకతప్పలేదు. (హస్తం ఖేల్‌ఖతం.. మరోసారి సింగిల్ డిజిట్!) రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డి..! ఉత్తమ్ కుమార్ రాజీనామాతో టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి వర్గంలో ఆశలు చిగురిస్తున్నాయి. పీసీసీ పదవీ బాధ్యతలు రేవంత్‌ను అప్పగిస్తారని ఆయన వర్గం నేతలు, అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో నానాటికీ దిగజారిపోతున్న కాంగ్రెస్ పార్టీని ఆయన మాత్రమే గాడిలోపెట్టగలరని, కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకురాగలరని బలంగా నమ్ముతున్నారు. అయితే ఇప్పటికే రేవంత్‌కు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చిందని డిసెంబర్ 9న దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలంగాణ రాజకీయాల్లో జోరుగా చర్చసాగుతోంది. ఈ క్రమంలోనే మరో అసమ్మతి వర్గం నిరసన స్వరాన్ని వినిపిస్తోంది. పార్టీలో ఎప్పటినుంచో ఉంటున్న సీనియర్లను కాదని టీడీపీ నుంచి వచ్చిన రేవంత్‌కు పీసీసీ బాధ్యతలు ఎలా ఇస్తారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి వర్గం బహిరంగంగానే నిలదీస్తోంది. ఈ మేరకు అధిష్టానానికి సైతం ఫిర్యాదు చేసినట్లు సమాచారం అందుతోంది. పీసీసీ పదవి తమకే ఇవ్వాలని కోమటిరెడ్డి సోదరులు మీడియా ముఖంగా పలుమార్లు డిమాండ్ చేశారు. పదవి తమకు దక్కనిపక్షంలో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరతామని రాజ్‌గోపాల్ చేసిన వ్యాఖ్యలు ఆ మధ్య పెను దుమారాన్నే లేపాయి. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ ఓటమి, ఉత్తమ్ రాజీనామా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలను ఆ పార్టీ నేతలు ఏ విధంగా ఎదుర్కొంటారనేది చూడాల్సిఉంది. -
మంత్రులకు షాకిచ్చిన గ్రేటర్ ఫలితాలు
కమలానికి ఊపు... కారుకు కుదుపు.. పతంగి మెరుపు.. చేతికి షాకు.. గ్రేటర్ ఓటరు విలక్షణ తీర్పు వెలువరించాడు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకీ పూర్తి మెజార్టీ దక్కలేదు. మేయర్ సీటు రేసులో ఎవరికీ స్పష్టత ఇవ్వలేదు. ఊహించని ఫలితాలు.. ఎదురు దెబ్బలతో సిట్టింగ్‌లు గల్లంతయ్యారు. పెద్ద పార్టీల అభ్యర్థులకూ డిపాజిట్ దక్కక అవాక్కయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు ఈ ఫలితాలు కోలుకోలేని దెబ్బకాగా... మరి కొందరు ఊరట చెందారు. 55 సీట్లతో అధికార టీఆర్ఎస్ పార్టీ మేయర్ పీఠానికి కొద్ది దూరంలో నిలిచింది. 48 సీట్లతో బీజేపీప్రధాన ప్రతిపక్షమైంది. 44 సీట్లతో ఎంఐఎం మేయర్ ఎన్నికలో కీలకంగా మారింది. మొత్తంగా గ్రేటర్–2020 ఎన్నికలసమరం రసవత్తరంగా ముగిసింది. మేయర్ పీఠంపై సస్పెన్స్‌ను మిగిల్చింది. సాక్షి, హైదరాబాద్ : బల్దియా ఫలితాలు నగర మంత్రులకు షాక్‌నిచ్చాయి. మంత్రులు సబిత, మహమూద్ అలీ, తలసానికి ఈ ఎన్నికలు అసంతృప్తినివ్వగా... కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఆనందాన్ని కలిగించాయి. మహేశ్వరం నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సబితా ఇంద్రారెడ్డికి తన పరిధిలోని రెండు డివిజన్లలోను అభ్యర్థులు ఓటమి పాలుకావడం నిరాశను మిగిల్చింది. ఇక మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తన నియోజకవర్గంలో సగం సీట్లతోనే సరిపెట్టుకోవాల్సివచ్చింది. రాజేంద్రనగర్ సెగ్మెంట్లో ఇన్చార్జిగా వ్యవహరించిన హోంమంత్రి మహమూద్ అలీ కూడా బల్దియా సమరంలో చతికిలపడ్డారు. మొత్తం ఐదు డివిజన్లలోనూ ప్రత్యర్థి పార్టీలే విజయం సాధించడం ఆయనకు ఆవేదన మిగిల్చింది. ఇక మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, గంగుల, నిరంజన్‌రెడ్డి, ఈటల ప్రచారం చేసిన డివిజన్లలో గులాబీకి చుక్కెదురైంది. పటాన్చెరు నియోజకవర్గంలోని మూడు డివిజన్లలో ప్రచార బాధ్యతలు నిర్వర్తించిన మంత్రి హరీశ్‌రావు.. ఈ మూడింటి గెలుపుతో మరోసారి చర్చనీయాంశమయ్యారు. కాగా, సీఎం తనయ, ఎమ్మెల్సీ కవిత ఇన్చార్జిగా వ్యవహరించిన గాంధీనగర్‌లో కారుకు పరాభవమే మిగిలింది. దీంతో గ్రేటర్ ఫలితాలు మంత్రులకు షాకింగ్‌కు గురిచేశాయి. ఎల్బీనగర్లో అత్యధిక సీట్లు అధికార టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఎల్బీనగర్ నియోజకవర్గం కమలం ధాటికి చెల్లా చెదురైంది. ఇక్కడ 11 డివిజన్లు ఉండగా, మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో రెండు డివిజన్లు ఉన్నాయి. ఈ 13 డివిజన్లను బీజేపీ అభ్యర్థులే గెలుచుకోవడం విశేషం. ఇటీవల కురిసిన వర్షాలకు సరూర్‌నగర్, బీఎన్‌రెడ్డి, వనస్థలిపురం, నాగోల్, హస్తినాపురం డివిజన్లలో అనేక కాలనీలు నీటమునిగాయి. బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల వదర సహాయం అర్హులకు అందజేయకుండా కార్పొరేటర్లు, వారి బంధువులు, కార్యకర్తలు పంచుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాదు ఎల్ఆర్ఎస్, రిజిస్ట్రేషన్ల నిలిపివేత నిర్ణయాలు ఇక్కడి ఓటర్లలో వ్యతిరేకతను పెంచాయి. వారసులకు దక్కని యోగం గ్రేటర్ ఎన్నికల్లో పలువురు అగ్ర నాయకుల వారసులుగా రంగంలోకి దిగిన వారిలో కొందరు గెలుపొందగా మరికొందరు ఓటమి పాలయ్యారు. వీరిలో రెండో సారి పోటీచేసిన వారిలో ఎక్కువ మంది మరోసారి గెలుపొందగా తొలిసారి పోటీచేసిన వారిలో ఎక్కువ మంది ఓటమిపాలవడం విశేషం. ఓడినవారిలో.. మాజీ మంత్రి, దివంగత నేత నాయని నర్సింహారెడ్డి వారసుడిగా రాంనగర్ డివిజన్ నుంచి తొలిసారి బరిలోకి దిగిన ఆయన అల్లుడు శ్రీనివాసరెడ్డి ఓటమి పాలయ్యారు. అలాగే మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ గాజుల రామారం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. హబ్సిగూడ డివిజన్ నుంచి పోటీచేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి సతీమణి స్వప్నకు విజయం దక్కలేదు. సీనియర్ నేత, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్య నందిత కూడా కవాడి గూడ డివిజన్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మరదలు పద్మ గాంధీనగర్ డివిజన్లో పోటీ చేసి గెలవలేకపోయారు. బీజేపీ సీనియర్ నేత బద్దం బాల్‌రెడ్డి కుమారుడు బద్ధం మహిపాల్ రెడ్డి బంజారాహిల్స్ బీజేపీ ఆభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. -
గ్రేటర్.. వరదలో మునిగిన కారు
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి వరద దెబ్బ గట్టిగానే తగిలింది. విశ్వనగరం వైపు నగరాన్ని పరుగులు పెట్టిస్తున్నామని...‘మాది మాటలు కాదు చేతల ప్రభుత్వమని చెప్పిన టీఆర్ఎస్... అందుకు నిదర్శనమే ఫ్లైఓవర్లు, రహదారులు, కేబుల్ బ్రిడ్జ్, స్కైవేల నిర్మాణమని ఢంకా బజాయించింది. అయితే అనుకోకుండా భాగ్యనగరాన్ని ప్రకృతి విలయం చుట్టుముట్టి కాలనీలు, బస్తీల్లోకి వరదలు వచ్చినా... అవి తాత్కాలిక ఇబ్బందులేనని, ప్రజలు తమవైపే ఉంటారని టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో వేసుకున్న అంచనాలను ఓటరు తలకిందులు చేశాడు. ముఖ్యంగా ఈ ఏడాది అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలతో ముంపునకు గురైన ప్రాంతాల్లో బాధితులకు అందిస్తామన్న వరద సహాయం చేతికి అందకపోవడం ఆ పార్టీ అభ్యర్థుల గెలుపుపై ప్రభావం చూపింది. ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాజ్గిరి, రాజేంద్రనగర్, శేర్లింగంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు ఇతర నియోజకవర్గాల్లోని పలు కాలనీలు, బస్తీలు నీట మునిగాయి. అయితే ఆయా ప్రాంతాల్లో టీఆర్ఎస్ నేతలు మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యటించిన సందర్భంలోనూ అధికారులు పట్టించుకోవడం లేదంటూ జనాల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో వరదల్లో చిక్కుకొని నష్టపోయిన వారికి రూ.10వేల ఆర్థిక సహాయమంటూ ప్రకటించిన టీఆర్ఎస్ ప్రభుత్వం 6.50 లక్షల మందికి రూ.650 కోట్లు పంపిణీ చేసింది. మరో 2.50 లక్షల మందికి ఇంకా వరద సహాయం అందిస్తామని నేతలు ఎన్నికల ప్రచారం చేసినా ప్రకటించినా ప్రజలు మాత్రం ఆదరించలేదు. మరోవైపు వరద సహాయం పంపిణీలోనూ కార్పొరేటర్లు డబ్బులు నొక్కారంటూ ఆరోపణలు రావడం కూడా ఆ పార్టీకి నష్టదాయకంగా మారిందనే ఈ ఫలితాల ద్వారా తేటతెల్లమైంది. దీనికితోడు బీజేపీని గెలిపిస్తే బాధితులకు రూ.25వేల వరద సహాయం అందిస్తామని ప్రకటించడం ఆయా అభ్యర్థుల విజయానికి దోహదపడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చాలా మటుకు వరదలు వచ్చిన ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులు జయకేతనం ఎగరవేయడం విశేషం. హోంమంత్రి ఇలాకాలో కారు పంక్చర్ హోంమంత్రి మహమూద్ అలీ ఇలాకా అయిన మలక్‌పేట నియోజకవర్గంలో 7 డివిజన్లు ఉండగా 5 ఎంఐఎం గెలుచుకోగా, 2 బీజేపీ కైవసం చేసుకున్నాయి. గతంలో ముసారాంబాగ్, సైదాబాద్ డివిజన్లను టీఆర్ఎస్ గెలుచుకోగా ఇప్పుడు ఆ రెండు డివిజన్లలో బీజేపీ గెలుపొందడం పార్టీకి కోలుకోలేని దెబ్బని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. హోంమంత్రి, నియోజకవర్గ ఇంచార్జి, డివిజన్ల అధ్యక్షులు పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేసినప్పటికీ ఫ్రెండ్లీ కంటెస్ట్‌తో ఇతర పార్టీల నాయకులతో ప్రచారం చేయవద్దని ఒత్తిడి రావడంతో హోంమంత్రి తూతూ మంత్రంగా ప్రచారం చేశారు. ఫ్రెండ్లీ కంటెస్ట్ లేకపోతే కనీసం మూసారాంబాగ్, సైదాబాద్, అక్బర్‌బాగ్, ఓల్డ్ మలక్‌పేట డివిజన్లను గెలిచేవారమని పలువురు టీఆర్ఎస్ నాయకులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ మలక్‌పేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ను గ్రేటర్ ఫలితాలు కోలుకోలేని దెబ్బ తీశాయని చెప్పాలి. -
గ్రేటర్లో మూడు ముక్కలాట
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 2016లో నాలుగు సీట్లకే పరిమితమైన ఆ పార్టీ ఇప్పుడు ఏకంగా అర్ధ సెంచరీకి అటు ఇటుగా నిలిచింది. 48 స్థానాలు గెలుచుకొని అధికారపార్టీకి ప్రత్యామ్నాయంగా అవతరించింది. అయితే, అనూహ్య ఫలితాల వెనుకఅగ్రనేతల వ్యూహాలు.. స్థానికనేతల సమన్వయం ఆ పార్టీని విజయతీరాలకు చేర్చాయి. పార్టీలో చేరికలు.. అధికారపార్టీపైనవ్యతిరేకత బీజేపీకి కలిసొచ్చాయి. స్వల్పసమయంలో అగ్రనేతల పర్యటనల ఖరారు, భావోద్వేగ ప్రసంగాలతో టీఆర్ఎస్, మజ్లిస్‌ను ఇరుకున పెట్టేలా ఆ పార్టీ అధినేత సంజయ్ చేసిన వ్యాఖ్యలు కూడా ఒక వర్గం ఓటర్లు కమలంవైపు మళ్లేందుకు కారణమయ్యాయి. (ఫలించిన వ్యూహం.. టార్గెట్ 2023) అమిత్‌షా చరిష్మా, జేపీ నడ్డా,యోగి ఆదిత్యనాథ్, తేజస్వీ సూర్య ప్రసంగాలతో ప్రజల దృష్టిని తమవైపు తిప్పుకోవడంలోకాషాయదళం సఫలీకృతమైంది. పట్టించుకోలేదనే ఆవేదన, సిట్టింగ్ కార్పొరేటర్లపై ఉన్న వ్యతిరేకత ఆ పార్టీ ఓటమికి దారితీసింది. ఈ పరిణామాలే 99 సీట్లు ఉన్న అధికారపార్టీని 55 స్థానాలకు పరిమితం చేశాయి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. భావోద్వేగ ప్రసంగాలు, అగ్రనేతల ప్రచార హోరుతో భాగ్యనగరంలో తొలిసారి కమలం వికసించింది. (టీఆర్ఎస్కు వ్యతిరేకంగా సెటిలర్స్ తీర్పు) పాతబస్తీపై మరోసారి పతంగి ఎగిరింది. 2016లో గెలిచిన 44 సీట్లను తిరిగి దక్కించుకొని మేయర్ పీఠం సాధనలో కీలకంగా మారింది. అసద్ వ్యూహరచన.. అక్బర్ వాడి వేడి ప్రసంగాలతో మైనార్టీ ఓటు బ్యాంకును తమవైపే నిలుపుకొన్నారు. అక్కడక్కడా అభ్యర్థులపై వ్యతిరేకత ఉన్నా.. ఓవైసీ సోదరుల ప్రచారంతో సీట్లు నిలుపుకుంది. జాంబాగ్ స్థానాన్ని కోల్పోయి.. కొత్తగా దాని స్థానే ఘాన్సీబజార్‌ను గెలుచుకుంది. కిషన్.. రాజాసింగ్‌కు అచ్చేదిన్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఈ ఎన్నికలు మధుర జ్ఞాపకంగా మారాయి. తన పరిధిలోనే గణనీయంగా సీట్లు గెలుచుకోవడమేగాకుండా.. ప్రచారపర్వంలోనూ కీలకంగా వ్యవహరించారు. అలాగే, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తనదైన శైలిలో అలకలు..బెదిరింపులతో పార్టీలో తొలుత వేడి పుట్టించినా.. ఆఖరికి తన నియోజకవర్గంలో సంపూర్ణ ఆధిక్యతను కనబరిచారు. వీరేగాకుండా.. ఓబీసీ మోర్చా లక్ష్మణ్, ఇతర నగర నేతలు కూడా తమ పరిధిలో సత్తా చాటారు. కాంగ్రెస్ ఖేల్ ఖతం! గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ మట్టికరిచింది. ఆ పార్టీ కేవలం రెండింటితో సరిపెట్టుకుంది. టీఆర్ఎస్, మజ్లిస్, బీజేపీ పోరులో పోటీపడలేక చతికిలపడింది. ఆ పార్టీ నేతల మధ్య సమన్వయలోపం, ప్రచారలేమీ, కనిపించని స్టార్ క్యాంపెయినర్లతో ప్రజల దరికి చేరలేకపోయింది. మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న మల్కాజిగిరి సెగ్మెంట్లలో మాత్రం రెండు సీట్లను గెలుచుకొని కాస్తోకూస్తో పరువు నిలుపుకుంది. ఈ ఎన్నికల్లో తొలిసారి ఆనేక చోట్ల ఆ పార్టీ డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. ఇక టీడీపీ గ్రేటర్లో తుడుచుకుపెట్టుకుపోయింది. సీట్ల మాట అటుంచితే పోటీ చేసిన ఏ స్థానంలో కనీసం డిపాజిట్ కూడా రాలేదు. ఎమ్మెల్యేలకు కలిసిరాని ఎన్నికలు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి ఈ ఎన్నికలు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చాయి. తన పరిధిలోని 11 సీట్లను ప్రత్యర్థి పార్టీ కైవసం చేసుకోవడం ఆయనను ఆత్మరక్షణలో పడేసింది. ఉప్పల్, ముషీరాబాద్ ఎమ్మెల్యేలకు ఈ ఎన్నికలు కలిసిరాలేదు. తమ పరిధిలోని మెజార్టీ డివిజన్లను దక్కించుకోకపోవడం వారిని నిరాశకు గురిచేసింది. -
తెలంగాణలో టీడీపీ దుకాణం బంద్
సాక్షి, హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీని గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. ఈ ఎన్నికల్లో ఆర్భాటానికి పోయి ఏకంగా 106 డివిజన్లలో అభ్యర్థులను బరిలో దింపిన ఆ పార్టీకి ఎక్కడా డిపాజిట్ కూడా దక్కలేదు. హైటెక్ సిటీని తామే నిర్మించామని, చంద్రబాబు విజన్‌తోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని డబ్బా కొట్టే పచ్చ పార్టీకి జీహెచ్ఎంసీ ప్రజలు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. గ్రేటర్ పరిధిలో టీడీపీ అభ్యర్థులు పోటీ చేసిన ఒక్క డివి జన్‌లో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు సాధించలేక పోయారు. ఇప్పటికే గ్రామీణ తెలంగాణలో దాదాపు కనుమరుగయిన తెలుగుదేశం పార్టీ, జీహెచ్ఎంసీ ఫలితాలతో హైదరా బాద్‌లో ఖతం అయిందని, ఇక ఆ పార్టీ దుకాణం తెలంగాణలో బంద్ అయినట్టేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల సంద ర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కూడా బోసిపోయింది. కనీసం ఒక్క నాయకుడు కూడా కార్యాలయానికి వచ్చి ఫలితాలపై ఆరా తీసే పరిస్థితి లేకుండా పోవడం గమనార్హం. తల్లీ, కొడుకు పోటీ.. చేజారిన సీటు హయత్‌నగర్: వాళ్లిద్దరూ తల్లీ.. కొడుకులు. గ్రేటర్ ఎన్నికల్లో ఒకే డివిజన్ నుంచి పోటీలో నిలిచారు. ఇందులో తల్లి టీఆర్ఎస్ అభ్యర్థి కాగా, కొడుకు స్వతంత్ర అభ్యర్థి. అయితే ఈ పోటీ చివరికి బీజేపీ అభ్యర్థికి కలిసొచ్చింది. ఎలాగంటే... ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని బీఎన్‌రెడ్డినగర్ డివిజన్ నుంచి టీఆర్ఎస్ తరఫున ముద్దగోని లక్ష్మీప్రసన్న, స్వతంత్ర అభ్యర్థిగా ఆమె కొడుకు రంజిత్‌గౌడ్, బీజేపీ నుంచి మొద్దు లచ్చిరెడ్డి పోటీ చేశారు. ముద్దగోని లక్ష్మీప్రసన్నకు 11,406 ఓట్లు రాగా ఆమె ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి మొద్దు లచ్చిరెడ్డికి 11,438 ఓట్లు వచ్చాయి. ఇద్దరి మధ్య 32 ఓట్ల తేడా ఉంది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన లక్ష్మీప్రసన్న కొడుకు రంజిత్ గౌడ్‌కు 39 ఓట్లు వచ్చాయి. ఆ 39 ఓట్లు లక్ష్మీప్రసన్నకు వచ్చి ఉంటే ఆమెనే విజయం సాధించి ఉండేవారని పార్టీ వర్గాలు అంటున్నాయి. తల్లీ.. కొడుకు పోటీలో ఉండడంతో స్వల్ప ఆధిక్యంతో బీజేపీ ఈ సీటును దక్కించుకుంది. సింగిల్ డిజిట్.. నాలుగో స్థానం సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి కుదేలైంది. అధికార టీఆర్ఎస్, విపక్ష బీజేపీ మధ్య హోరాహోరీగా సాగిన పోరులో చిత్తయింది. 150 డివిజన్లకు 146 చోట్ల పోటీ చేసి కేవలం 2 స్థానాల్లోనే గెలుపొంది నాలుగో స్థానానికి పరిమిత మైంది. గతంలోనూ కాంగ్రెస్‌కు జీహెచ్ఎంసీలో ఇద్దరే సభ్యులుండగా ఇప్పుడు కూడా ఇద్దరే గెలిచారు. ఓట్ల శాతం పరంగా చూస్తే గతంకన్నా కొంత మెరుగుపడ్డామని కాంగ్రెస్ ముఖ్య నేతలు చెబుతున్నా... లభించిన స్థానాలు, గ్రేటర్ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రదర్శన పేలవంగానే ముగిసిందని రాజకీయ ముఖచిత్రం వెల్లడిస్తోంది. మొత్తం బల్దియా పరిధిలో కేవలం 15–20 డివిజన్లలోనే ప్రత్యర్థులకు పోటీ ఇచ్చే స్థాయికి కాంగ్రెస్ పరిమితం కావడం టీఆర్ఎస్కు ప్రత్యామ్నా యం తామేనన్న ఆ పార్టీ నాయకుల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. కనీస పోటీ ఏదీ? గ్రేటర్ ఫలితాలపై కాంగ్రెస్ నేతలు గంపెడాశలు పెట్టుకున్నారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ విజ యం సాధించి దూకుడు మీద ఉన్న తరుణంలో జరిగిన ఈ ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలు దక్కించు కోవాలని, తద్వారా రాష్ట్రంలో టీఆర్ ఎస్‌కు దీటుగా నిలబడేది తామేనని ప్రజలకు సంకేతం ఇవ్వాలని ఆశిం చారు. కానీ అందుకు భిన్నంగా గ్రేటర్ తీర్పు రావడంతో భవిష్యత్తుపై కూడా ఆ పార్టీ నేతలకు బెంగ పట్టుకుంది. ముఖ్యంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసి డెంట్ రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహి స్తున్న మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో ఉన్న 47 డివిజన్లు, ఇతర శివారు స్థానాల్లో సత్తా చాటగలమని, పార్టీ కేడర్ బలంగా ఉన్నందున కనీసం డబుల్ డిజిట్ స్థానాల్లో విజ యం దక్కు తుందని కాంగ్రెస్ నేతలు లెక్కలేసు కున్నారు. అదే ధీమాతో ఎన్ని కలను ఎదుర్కొన్నారు. కానీ రేవంత్ కోటలోనూ కాంగ్రెస్ కంగు తింది. మైనార్టీలు, సెటిలర్లు, శివారు కాలనీల్లోని బస్తీల ప్రజలు తమకు అండగా నిలుస్తారనే కాంగ్రెస్ అంచ నాలు తారుమారు కావడంతో ఆ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. ఎక్కడా కనీస పోటీ ఇవ్వలేక చతికిల పడింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌తోపాటు సీఎల్పీ నేత భట్టి, ముఖ్య నాయకులంతా గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోయింది. భవిష్యత్తు ఏమిటో..? గ్రేటర్ ఫలితాలు రాష్ట్ర కాంగ్రెస్ నేతలను పునరాలోచనలో పడే స్తాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. టీఆర్ ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ రూపుదిద్దు కుంటోందనే చర్చలు ఆ పార్టీ నేతల భవిష్య త్తుపై గుబులు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా త్వరలో జరగ బోయే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక విషయంలో ఏం జరుగు తుందో ననే ఆందోళన వారిలో వ్యక్తమవు తోంది. ఇక్కడ కూడా ఇవే ఫలితాలు పునరావృ తమైతే తామిక మూడో స్థానంలో సెటిల్ కావడం ఖాయమేనని ఆ పార్టీ నేతలు బహిరంగం గానే వ్యాఖ్యానిస్తు న్నారు. పార్టీ ఇప్పటికైనా వైఖరి మార్చుకొని ప్రజలపక్షాన దూకుడుగా వ్యవహరించా లని, లేదంటే ఎన్ని ఎన్నికలు జరిగినా ఇదే ఫలితం వస్తుం దని వారంటున్నారు. మరి గ్రేటర్ తీర్పుతో కాంగ్రెస్ ఏం మారుతుందో.. ప్రత్యామ్నా యం దిశగా ఏ మేరకు ముందు కెళ్తుందో వేచి చూడాల్సిందే. -
టీఆర్ఎస్కు వ్యతిరేకంగా సెటిలర్స్ తీర్పు
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు కీలకాంశాలను వెలుగులోకి తీసుకొచ్చాయి. ఇప్పటికీ సీమాంధ్రకు చెందిన వారిలో అత్యధికులు ‘కారు’తోనే ప్రయాణిస్తున్నారని స్పష్టమైంది. అయితే ఉత్తరాది నుంచి వలసవచ్చిన, దక్షిణ తెలంగాణకు చెందిన ‘సెటిలర్స్’తీర్పు మాత్రం టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగానికి చెందిన వాళ్ళల్లో అత్యధికులు అభివృద్ధికే జై కొడుతూ టీఆర్ఎస్కే ఓటు వేసినట్లు ఈ ఫలితాలు పునరుద్ఘాటించాయి. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సీమాంధ్ర ఓటర్లు టీఆర్ఎస్కే మద్దతు పలికారు. అలాగే ఈ ఎన్నికల్లోనూ ఆ పార్టీకి పట్టం కట్టారు. ఫలితంగానే శేరిలింగంపల్లి, కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో టీఆర్ఎస్ భారీగా సీట్లు దక్కించుకుంది. ఈ ఏరియాల్లో స్థిరపడిన వారిలో రాయలసీమ, దక్షిణాంధ్రతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. వీళ్ళు ఇప్పటికీ తమను అక్కున చేర్చుకున్న టీఆర్ఎస్తోనే కలసి నడుస్తున్నారు. ఫలితంగా శేరిలింగంపల్లిలో అత్య ధిక సీట్లు రాగా.. కూకట్‌పల్లిని టీఆర్ఎస్ స్వీప్ చేసింది. ఉత్తరాది వారు బీజేపీతోనే.. ఉత్తర భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన వారు మాత్రం బీజేపీకి జై కొట్టారు. ఈ కారణంగానే కోర్ సిటీలోని అనేక ప్రాంతాలతో పాటు ఉత్తరాది వారు స్థిరపడిన గోషామహాల్, గన్‌ఫౌండ్రి, బేగంబజార్, జియాగూడ, హిమాయత్‌నగర్ తదితర డివిజన్లలో బీజేపీ అత్యధిక సీట్లు కైవసం చేసుకుంది. ఆ పార్టీ తరఫున ప్రచారం చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, మంత్రి జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ తది తరులు వీరిని ప్రభావితం చేయ గలిగారు. దక్షిణ తెలంగాణ వాసులు ఎక్కువగా నివసిం చే ఎల్బీనగర్, మహేశ్వరం నియోజకవర్గాలతో పాటు ఆ చుట్టు పక్కల ప్రాంతా ల్లోనూ ఈ సారి టీఆర్ఎస్ పార్టీ తన మార్కు చూపించ లేకపోయింది. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో టీఆర్ఎస్కు కాస్త పట్టు తక్కువగా ఉంది. ఇక గతంలో పోలిస్తే ఈసారి టెకీలు అతి తక్కువ సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన వారందరూ అభివృద్ధికి పట్టం కడుతూ అధికార పార్టీకి జై కొట్టారు. ఈ కారణంగానే ఐటీ జోన్లో ఉన్న డివిజన్లలో ఒక్క గచ్చిబౌలి మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్లా టీఆర్ఎస్ జెండా ఎగిరింది. -
సర్కారు ఉద్యోగుల అసమ్మతి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు ఏవైనా సరే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అధికార టీఆర్ఎస్ పారీ్టకి వ్యతిరేకంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసి తమ అసమ్మతి తెలియజేస్తున్నారు. గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అత్యధికంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రాగా, ప్రస్తుత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకు లభించాయి. ఉద్యోగుల సమస్యల పెండింగ్ వల్లే.. ఎన్నికల విధుల్లో ఉండే ఎన్నికల సిబ్బందితో పాటు దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పనిచేసే సైనికులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కలి్పస్తారు. ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను దక్కించుకోవడంలో వెనకబడిన అధికార టీఆర్ఎస్.. సాధారణ ప్రజానీకం ఈవీఎం/బ్యాలెట్ పేపర్ ద్వారా వేసే ఓట్లను దక్కించుకోవడంలో మాత్రం ముందంజలో ఉంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు, టీఎన్జీవోలు, ఎన్జీవోలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు గత కొంతకాలంగా కేసీఆర్ ప్రభుత్వ వైఖరి పట్ల అసంతృప్తితో ఉండటంతో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను దక్కించుకోవడంలో టీఆర్ఎస్ వెనకబడిందని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. కొత్త పీఆర్సీ అమలు, డీఏ బకాయిల విడుదలలో తీవ్ర జాప్యం, ఏళ్ల తరబడిగా ఉపాధ్యాయులకు పదోన్నతులు కలి్పంచకపోవడం, స్పౌజ్ కేటగిరీ కింద బదిలీలు చేపట్టకపోవడం వంటి సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు చాలాకాలం నుంచి కోరుతున్నాయి. త్వరలో ఉద్యోగ సంఘాలతో సమావేశమై ఈ సమస్యలను పరిష్కరిస్తానని సీఎం కేసీఆర్ గత మూడేళ్లలో పలుమార్లు హామీనిచి్చనా, నెరవేర్చలేకపోయారు. దీంతో ఉద్యోగ వర్గాల్లో ప్రభుత్వం పట్ల కొంత వ్యతిరేక భావం ఏర్పడిందని సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. అసెంబ్లీ ఓట్ల నుంచి జీహెచ్ఎంసీ వరకు.. ఇక 2018లో జరిగిన శాసనసభ మధ్యంతర ఎన్నికల్లో మొత్తం 95,689 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవ్వగా, అత్యధికంగా కాంగ్రెస్ పారీ్టకి 38,918, టీఆర్ఎస్కు 32,880, బీజేపీకు 9,567 ఓట్లు లభించాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేయగా, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ కూటమికి వచ్చిన మొత్తం పోస్టల్ ఓట్ల సంఖ్య 46,651 కావడం గమనార్హం. అయితే, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ మొత్తంగా 46.87 శాతం ఓట్లను సాధించి 88 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ 28.43 శాతం ఓట్లతో 19 సీట్లు, బీజేపీ 6.98 శాతం ఓట్లతో కేవలం ఒకే సీటును గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం పోలైన 906 పోస్టల్ ఓట్లలో బీజేపీకు 515 ఓట్లు రాగా, టీఆర్ఎస్కు కేవలం 218 ఓట్లు మాత్రమే లభించాయి. ఎంఐఎంకు 50, కాంగ్రెస్‌కు 40, ఇతరులకు 20 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు గత కొన్నేళ్లుగా అసమ్మతి తెలియజేస్తున్నా, ప్రభుత్వం మాత్రం వారి సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపడం లేదని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. -
ఫలించిన వ్యూహం.. టార్గెట్ 2023
సాక్షి, హైదరాబాద్ : భాగ్యనగరంలో కమలం వికసించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటింది. టీఆర్ఎస్ కారు స్పీడును నిలువరించింది. 4 స్థానాల నుంచి 48 స్థానాలకు ఎగబాకింది. దుబ్బాక విజయం ఇచ్చిన స్ఫూర్తితో గ్రేటర్‌లోనూ హవా కొనసాగించింది. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీలో రెండో స్థానంలో ఉన్న ఎంఐఎంను వెనక్కితోసింది. కాంగ్రెస్‌ను 4వ స్థానంలోకి నెట్టి రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామేననే సంకేతాలను పంపింది. దుబ్బాక కిక్కుకు తోడు జీహెచ్ ఎంసీ ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో భవిష్యత్తు ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయని కమల నాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఊపుతో టార్గెట్ 2023 (అసెంబ్లీ ఎన్నికలే) లక్ష్యంగా తమ కార్యా చరణను మరింత వేగవంతం చేయాలని నిర్ణయించారు. (బీజేపీ ఆధిక్యం.. రెండో స్థానంలో టీఆర్ఎస్) ఫలించిన వ్యూహం.. ప్రత్యేక కార్యాచరణ బీజేపీ అనుసరించిన వ్యూహం, ప్రత్యేక కార్యాచరణ ఫలితాలను ఇచ్చింది. ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్చార్జిని నియమించి బాధ్యతలను అప్పగించి పనిచేయించింది. వారికి అదనంగా 26 కమిటీలు, పార్టీ శ్రేణులు బీజేపీ గెలుపు కోసం విశేషంగా కృషి చేశాయి. రోడ్‌షోలు, బస్సుయాత్రలతో ప్రచారం నిర్వహించారు. పనిచేసిన భూపేంద్రజాలం బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేను విజయ తీరాలకు చేర్చిన భూపేంద్ర యాదవ్‌ను జీహెచ్ఎంసీ ఎన్నికల ఇన్చార్జిగా పంపించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, సీనియర్ నేతలు డాక్టర్ కె.లక్ష్మణ్, డీకే అరుణ, ఎంపీ ధర్మపురి అరవింద్ తదితర నేతల ప్రచారానికితోడు పార్టీ జాతీయ అధ్య క్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్, స్మృతి ఇరానీ, ప్రకాశ్ జవదేకర్, దేవేంద్ర ఫడ్నవీస్ వంటి నేతల ప్రచారం బీజేపీకి మేలు చేసిందని పార్టీ వర్గాలు భావిస్తు న్నాయి. పార్టీ ముఖ్య నేతలు ప్రచారంలో మాట్లాడాల్సిన అంశాలను కూడా భూపేంద్రయాదవ్ సూచనల మేరకు రూపొందించి అమలు చేయడం కలిసొచ్చింది. కుల సమీకరణలు తోడుగా.. వివిధ కుల, విద్యార్థి, యువజన సంఘాలతో సమావేశాలు కూడా బీజేపీ అభ్యర్థుల గెలుపునకు దోహద పడ్డాయి. మాజీమంత్రి డీకే అరుణను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించడం ద్వారా ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పకనే చెప్పింది. బీసీ సామాజిక వర్గాల్లో గౌడ్, యాదవ, మున్నూరుకాపులతోపాటు ఇతర సామాజిక వర్గాలను కూడా కలుపుకుని పనిచేయడం కలిసివచ్చింది. టీఆర్ఎస్ ఎంఐఎం మధ్య అవగాహన ఉందని యువత మెదళ్లలోకి ఎక్కించడంలో బండి సంజయ్ సఫలమయ్యారు. పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని, అక్ర మంగా వలస వచ్చిన వారిని, రోహింగ్యాలను ఏరివేస్తా మని చెప్పడం వారిని బీజేపీ వైపు మళ్లించింది. ఇక ఆపరేషన్ అసెంబ్లీనే.. ఓవైపు దుబ్బాక విజయం.. మరోవైపు జీహెచ్ఎంసీలో అత్యధిక స్థానాలు గెలుపొందడంతో బీజేపీ ఆనందంలో మునిగింది. ఈ విజయాలే సోపానాలుగా, ఈ ఎన్నికల్లో పని చేసిన తీరునే స్ఫూర్తిగా ముందుకుసాగాలని నిర్ణయించింది. రాష్ట్ర పార్టీ నేతలంతా ఇదే ఐక్యతతో మరో మూడేళ్లలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేయాలని నిర్ణయించారు. తద్వారా పార్టీని అధికారంలోకి తేవచ్చన్న లక్ష్యంతో కార్యాచరణ ప్రణాళికల అమలును వేగవంతం చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంబురాలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గణనీయ సంఖ్యలో గెలుపొందటంతో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. నాలుగు స్థానాల నుంచి 48 స్థానాల వరకు పార్టీని తీసుకెళ్లడం పట్ల పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వానికి అనుకూల నినాదాలు చేశారు. అనంతరం సంజయ్‌తోపాటు పార్టీ ముఖ్య నేతలు కిషన్‌రెడ్డి, డాక్టర్ కె.లక్ష్మణ్, డీకే అరుణ, ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ ఎంపీ వివేక్, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్‌రావు తదితరులు స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా డీకే అరుణ బండి సంజయ్‌కి స్వీటు తినిపించి సంబురాలు జరుపుకున్నారు. ఉపయోగపడిన టీఆర్ఎస్పై వ్యతిరేకత ఆరేళ్లలో హైదరా బాద్ అభి వృద్ధి విషయంలో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు, వాటి అమలులో వైఫల్యా లను బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది. ఉద్యోగులు, నిరుద్యోగుల్లో టీఆర్ఎస్ పట్ల ఉన్న వ్యతిరేకత బీజేపీకి కలిసొచ్చింది. బ్యాలెట్ ఓట్లు 83 డివిజన్లలో భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా రావడమే ఇందుకు నిదర్శనం. వరదసాయం పంపిణీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడంతో బీజేపీ సక్సెస్ అయింది. అలాగే సోషల్ మీడియాలో కూడా బీజేపీ వ్యతిరేకప్రచారాన్ని బలంగా తిప్పికొట్టగలిగింది. -
కారు ‘కంగు’.. కమలం ‘స్వింగు’.. గ్రేటర్ హంగు
సవాళ్లు, ప్రతిసవాళ్లు.. మహామహుల ప్రచారాలతో గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో కాక రేపినగ్రేటర్ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. శుక్రవారం వెల్లడైన ఫలితాల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకోగా.. అధికార టీఆర్ఎస్ జోరు తగ్గి వెనకబడింది. మొత్తం 150 డివిజన్లకుగాను నేరెడ్మెట్ ఫలితం (ఇక్కడ టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది) మినహా 149 స్థానాల్లో విజేతలను ప్రకటించారు. కారు 55 డివిజన్లలో దూసుకెళ్లగా.. 48 స్థానాల్లో కమలం వికసించింది. ఇక ఎంఐఎం పతంగి 44 స్థానాల్లో రెపరెపలాడింది. కాంగ్రెస్ తన రెండు స్థానాలకే పరిమితమైంది. ఇక హంగ్ ఏర్పడిన కారణంగా మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ ఎలా కైవసం చేసుకుంటుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 150 మంది కార్పొరేటర్లు, 45 మంది ఎక్స్అఫీషియో సభ్యులతో కలిపి బల్దియా మేయర్ ఎన్నికల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 195 ఉండగా.. పీఠం దక్కించుకోవడానికి 98 మంది మద్దతు అవసరం. ఎక్స్అఫీషియో సభ్యులతో కలిసి టీఆర్ఎస్కు 86 మంది బలం మాత్రమే ఉండటంతో మేయర్ కుర్చీకి కొద్ది అడుగుల దూరంగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో పీఠం కైవసానికి టీఆర్ఎస్ ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందనేది శనివారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని తేల్చిచెప్పారు. ఏ ఒక్క పార్టీకీ స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టలేదు. ఫలితంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో హంగ్ ఏర్పడింది. కారు స్పీడుకు బ్రేక్ పడగా... కమలం వికసించింది. టీఆర్ఎస్ 55 సీట్లకే పరిమితమైంది. 2016 ఎన్నికల్లో 99 చోట్ల నెగ్గి ఏకపక్షంగా గ్రేటర్ మేయర్ పీఠాన్ని సొంతం చేసుకున్న గులాబీ పార్టీకి ఈసారి ఏకంగా 44 స్థానాలు తగ్గాయి. దుబ్బాక విజయంతో గ్రేటర్లో దూకుడు ప్రదర్శించిన బీజేపీ అంచనాలకు మించి రాణించింది. అనూహ్యంగా 48 డివిజన్లలో విజయం సాధించింది. కిందటిసారి నాలుగు సీట్లు మాత్రమే గెలిచిన కమలదళం... ఈసారి సర్వశక్తులూ ఒడ్డి అంతకు ఎన్నోరెట్ల విజయాన్ని నమోదు చేసింది. భవిష్యత్తులో తెలంగాణలో ఎదగడానికి కావాల్సిన ఉత్సాహం బీజేపీకి లభించింది. పాతబస్తీపై తమ పట్టును మజ్లిస్ మరోసారి నిరూపించుకుంది. 44 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. 2016లోనూ ఎంఐఎంకు సరిగ్గా ఇన్ని సీట్లే రావడం గమనార్హం. కాంగ్రెస్‌కు కూడా తీవ్ర నిరాశే ఎదురైంది. కిందటిసారి లాగే కేవలం రెండు స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక టీడీపీ గొప్పకు పోయి 106 స్థానాల్లో పోటీచేసినా... ప్రజలు అదొక పార్టీ ఉందనే గుర్తించలేదు. అన్నిచోట్లా డిపాజిట్లు కోల్పోయింది. వరద ‘దెబ్బే’! టీఆర్ఎస్ అంచనాలు తల్లకిందులు కావడానికి వరదలు ప్రధాన కారణమ య్యాయి. ఎన్నికలకు ముందు వరదసాయం కింద బాధితులకు రూ.10 వేల చొప్పున అందించిన నగదుపరిహారమే దెబ్బకొట్టింది. అర్హులైన అందరికీ సహాయం అందకపోవడం, పంపిణీలో చోటుచేసుకున్న అవకతవకలు, తర్వాతి దశలో దరఖాస్తు చేసుకోవడానికి గంటల తరబడి మీసేవ కేంద్రాల ముందు నిలబడ్డా... ఆఖరికి సాయం అందకపోవడంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. దాన్ని ఓట్ల రూపంలో చూపించారు. గ్రేటర్లో టీఆర్ఎస్ దెబ్బతినడానికి ఇదే ప్రధాన కారణంగా చెబుతున్నారు. పై అంతస్తుల్లో ఉన్నవారికి అందిన సాయం నిజంగా దెబ్బతిన్న కుటుంబాలకు అందకపోవడం లాంటి ఘటనలూ జనంలో వ్యతిరేకతను పెంచాయి. నగదు రూపంలో అందజేసిన వరదసాయాన్ని స్థానిక నాయకులు సొంతజేబుల్లో వేసుకున్నారని, తమ అనుయాయులకే ఇప్పించుకున్నారని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. వరదతాకిడికి బాగా దెబ్బతిన్న ఉప్పల్, నాగోల్, మన్సూరాబాద్, హయత్‌నగర్, వనస్థలిపురం, హస్తినాపురం, లింగోజిగూడ, సరూర్‌నగర్, చంపాపేట, ఐఎస్‌సదన్ తదితర ప్రాంతాల్లో టీఆర్ఎస్ ఓటమికి వరదసాయంలో అవకతవకలు, అర్హులైన వారికి అందకపోవడమే కారణమని చెబుతున్నారు. డివిజన్‌కో ఎమ్మెల్యేను ఇన్చార్జిగా నియమించి... పకడ్బందీగా ప్రచారం నిర్వహించిన టీఆర్ఎస్ ఈస్థాయిలో వ్యతిరేకతను ఊహించలేకపోయింది. కిందటి ఎన్నికల్లో కంటే కొన్నిసీట్లు తగ్గినా... ఎక్స్అఫీషియో బలంతో సొంతంగా మేయర్ పీఠాన్ని దక్కించుకోగలమనే భావించింది. కానీ వారి అంచనాలు తప్పాయి. కమలం... సక్సెస్ భావోద్వేగాలపై ప్రచారం సాగించి బీజేపీ ఆశించిన దానికంటే ఎక్కువ లాభపడింది. భవిష్యత్తులో బలపడే అవకాశాలున్నాయని పసిగట్టిన బీజేపీ కేంద్ర నాయకత్వం... ఒక కార్పొరేషన్ ఎన్నికే అయినా గ్రేటర్‌పై పూర్తి ఫోకస్ పెట్టింది. బీజేపీ అగ్రనాయకులు పలువురు ప్రచారం నిర్వహించడం, వరదసాయం నగదుపంపిణీలో అవతకవకల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం... కలిసొచ్చాయి. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామేనని ఓటర్లలో విశ్వాసాన్ని కలిగించడంలో కాషాయదళం సఫలమైంది. పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామనడం, రోహింగ్యాలకు, అక్రమంగా వచ్చిన బంగ్లాదేశీయులకు ఆశ్రయం కల్పిస్తున్నారనే ఆరోపణలతో హిందువుల ఓట్లను బీజేపీ ఆకర్షించగలిగింది. బల్దియా ఎన్నికలకు వెళ్లేందుకు టీఆర్ఎస్ తొందరపాటు సైతం ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించింది. ఈ అంశాలన్నింటినీ బేరీజు వేసిన ప్రజలు బీజేపీ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీని, నేతల్ని ప్రజలు విశ్వసించలేదు. వాళ్లు ఎన్నోకొన్ని సీట్లు గెలిచినా ఒరిగేదేమీ ఉండదనే తలంపుతోనూ ప్రజలు ఆ పార్టీని పట్టించుకోలేదు. ఇక టీడీపీ 106 వార్డుల్లో పోటీచేసినా ఒక్కచోట కూడా గెలువలేకపోయింది. రెండు నెలలు ఆగాల్సిందే... జీహెచ్ఎంసీలో కొత్త పాలకమండలి కొలువుదీరాలంటే మరో రెండు నెలలు ఆగాల్సిందే. ఎందుకంటే ప్రస్తుత పాలకమండలి గడువు ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఉంది. జీహెచ్ఎంసీ నిబంధనల మేరకు గడువు ముగిసేవరకు పాలకమండలి ఉంటుంది. ఫిబ్రవరి 10 తర్వాతే కొత్త సభ్యులు బాధ్యతలు చేపడతారు. అధికార వర్గాల సమాచారం మేరకు ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీ సిఫార్సుల కనుగుణంగా ఎన్నికైన కార్పొరేటర్ల పేర్లను గెజిట్ నోటిఫికేషన్ వెలువరిస్తుంది. -
పీఠం.. కాసింత దూరం
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సంఖ్యాపరంగా అతిపెద్ద పార్టీగా అవతరించింది. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లలో పోటీ చేసిన టీఆర్ఎస్.. దాదాపు మూడింట ఒక వంతు ఫలితాన్ని మాత్రమే సాధించింది. గ్రేటర్ ఎన్నికల్లో తాము అనుకున్న ఫలితాన్ని సాధించ లేక పోయామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటిం చారు. గత నెల 17న గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత ప్రధాన రాజకీయ పక్షాలతో పోలిస్తే శరవేగంగా ఎన్నికల క్షేత్రంలోకి అడుగు పెట్టినా ఫలితాల సాధనలో వెనుక బడటానికి దారితీసిన పరిస్థితులను టీఆర్ఎస్ విశ్లేషిస్తోంది. 2016లో సాధించిన ఫలితంతో పోలిస్తే పార్టీ గెలిచే డివిజన్ల సంఖ్య తగ్గుతుందని అంతర్గతంగా అంచనా వేయగా, ఎగ్జిట్ పోల్స్ కూడా దాదాపు అదే ఫలితాన్ని సూచించాయి. అయితే శుక్రవారం వెలువడిన గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో అంచనా కంటే తక్కువ డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలవడంపై ఆ పార్టీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. దుబ్బాక మొదలుకుని.. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితం వెలువడిన పక్షం రోజుల్లోనే గ్రేటర్ షెడ్యూల్ వెలువడటం గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ ఎస్ నష్టానికి బాటలు వేసిందనే అభిప్రాయం ఆ పార్టీలో కన్పిస్తోంది. అభివృద్ది ఎజెండాతో ప్రజల్లోకి వెళ్లాలనే టీఆర్ఎస్ వ్యూహానికి దుబ్బాక గెలుపుతో జోష్ మీదున్న బీజేపీ అడ్డుకట్ట వేసిందనే భావనను పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. ఎంఐఎంతో టీఆర్ఎస్కు మితృత్వం ఉందంటూ బీజేపీ చేసిన ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోవడం, నగర అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికను ప్రజలకు మిగతా 2వ పేజీలో u వివరించలేకపోవడం వంటి కారణాలు టీఆర్ఎస్ను దెబ్బతీశాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో సంభవించిన వర్షాలు, వరదల మూలంగా నగరంలోని చాలా ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. బాధితులను అదుకునేందుకు రూ.10 వేల నగదు పంపిణీ లబ్ధిదారులు అందరికీ చేరకపోవడం, పంపిణీలో అవకతవకలు, వరద సాయం పంపిణీ అర్ధంతరంగా నిలిపేయడం వంటి అంశాలు ప్రభావితం చేశాయి. మరోవైపు ఓటర్లను ఆకట్టుకునేందుకు టీఆర్ఎస్ ప్రకటించిన ఉచిత తాగునీరు సరఫరా వంటి హామీలు కూడా ప్రభావితం చేయలేకపోయాయి. ఆస్తి పన్ను తగ్గింపు వంటి వరాలు కూడా ఓటర్లను ఆకట్టుకోలేక పోయాయి. పార్టీ యంత్రాంగాన్ని మోహరించినా.. మేయర్ పీఠాన్ని సొంతంగా గెలుచుకుంటామనే ధీమాతో గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లలోనూ అభ్యర్థులను నిలబెట్టిన టీఆర్ఎస్.. 55 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. 2016 గ్రేటర్ ఎన్నికల్లో 99 స్థానాల్లో గెలుపొందిన టీఆర్ఎస్ కనీసం 75 నుంచి 80 డివిజన్లు సాధిస్తామనే ధీమా వ్యక్తం చేసింది. రాష్ట్ర మంత్రులు, పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్, జెడ్పీ చైర్మన్లు కలుపుకుని సుమారు 180 మందికి ప్రచార బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది మంది కార్యకర్తలు గ్రేటర్ పరిధిలో మకాం వేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచార సారథ్యం వహించగా, పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ గత నెల 28న ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. బీజేపీ జాతీయ నాయకత్వం హైదరాబాద్‌కు బారులు తీరడంతో టీఆర్ఎస్ భారీ బలగాన్ని మోహరించి ఓటర్లను అకట్టుకోవాలనే వ్యూహం ఫలితం సాధించలేక పోయింది. -
ఎంఐఎంని వెనక్కి నెట్టిన కమలం..!
సాక్షి, హైదరాబాద్: బల్దియా ఎన్నికల ఫలితాలు ముగింపుకు చేరుకున్నాయి. మరొక డివిజన్లో ఫలితం వెల్లడి కావాల్సి ఉంది. ఇప్పటివరకు టీఆర్ఎస్-56, బీజేపీ-48, ఎంఐఎం-44, కాంగ్రెస్-2 స్థానాల్లో విజయం సాధించింది. ఇక గత ఎన్నికల్లో పోలీస్తే.. ఈ ఫలితాలు అధికార టీఆర్ఎస్ పార్టీకి, పతంగి పార్టీకి షాక్ ఇచ్చాయి. గతంలో టీఆర్ఎస్ మేజిక్ ఫిగర్‌ని సాధించగా.. ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించి అతి పెద్ద రెండో పార్టీగా నిలిచింది. ఇక ఈ సారి బల్డియా పోరులో ఫలితాలు తారుమారయ్యాయి. గ్రేటర్ ఓటర్ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. ఇక గత ఎన్నికల్లో 44 స్థానాలు సాధించిన ఎంఐంఎ ఈ సారి 43 మాత్రమే సాధించింది. ఇక గతంలో 4స్థానాలకే పరిమితమైన బీజేపీ ఈ సారి ఏకంగా 48 స్థానాల్లో విజయం సాధించి.. రెండో అతి పెద్ద పార్టీగా నిలిచి.. ఎంఐఎంని వెనక్కి నెట్టింది. కానీ పాత బస్తీలో మాత్రం పాగా వేయలేకపోయింది. అమిత్ షా భాగ్యలక్ష్మీ ఆలయం సందర్శించినప్పటికి పెద్దగా ఫలితం లేకపోయింది. ఇక ఇప్పటికి పాతబస్తీలో తమకు తిరుగు లేదని పతంగి పార్టీ మరోసారి రుజువు చేసుకుంది. ఈ సారి ఎంఐఎం మూడో స్థానానికి పరిమితమయ్యింది. అయినప్పటికి మేయర్ ఎన్నికల్లో ఎంఐంఎ కీలక పాత్ర పోషించనుంది. (చదవండి: హంగ్ దిశగా.. గ్రేటర్ జడ్జిమెంట్) -
మేయర్ పీఠంపై ఉత్కంఠ..!
సాక్షి, హైదరాబాద్: బల్దియా పోరులో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. టీఆర్ఎస్-56, బీజేపీ-47, ఎంఐఎం-43, కాంగ్రెస్-2 స్థానాల్లో విజయం సాధించాయి. ఏ పార్టీ మేజిక్ ఫిగర్ సాధించకపోవడంతో హంగ్ పరిస్థితులు ఏర్పడ్డాయి. 56 స్థానాల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఇక 47 స్థానాల్లో విజయం సాధించి బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఈ తరుణంలో ఏవైనా రెండు పార్టీలు కలిస్తేనే బల్దియా పాలక వర్గం కొలువుదీరుతుంది. టీఆర్ఎస్-బీజేపీ, ఎంఐంఐ-బీజేపీ పొత్తు అసాధ్యం. ఈ పరిస్థితుల్లో టీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని అధిరోహించాలంటే ఎంఐంఎం మద్దతు తప్పని సరి. అయితే నిన్నటి వరకు తమకు ఎంఐఎంతో ఎలాంటి పొత్తు లేదంటూ ప్రచారం చేసుకున్న టీఆర్ఎస్.. ఇప్పుడు ఖచ్చితంగా పతంగి పార్టీ మద్దతు తీసుకోవాల్సిందే. ఇలాంటి తరుణంలో ఎంఐఎం, టీఆర్ఎస్కు మద్దతిస్తుందా.. లేదా.. ఒకవేళ ఇచ్చినా.. ఎలాంటి షరతులు పెడుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఏకంగా మేయర్ కుర్చీ తమకు ఇవ్వాలని అడిగే ఛాన్స్ ఉందని ప్రచారం. డిప్యూటీ మేయర్‌తో సరిపెట్టుకోవాలని టీఆర్ఎస్ బేరసారాలు సాగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రెండు పార్టీల అధినేతల మధ్య అంగీకారం కుదిరితేనే హంగ్‌తో బల్దియా పాలక వర్గం కొలువుదీరుతుంది. (చదవండి: టీఆర్ఎస్ కొంపముంచిన డమ్మీ అభ్యర్థి..! ) గతంలో 2009లో ఉమ్మడి రాష్ట్రంలో గ్రేటర్లో ఇదే పరిస్థితి తలెత్తింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ, ఎంఐంఎంతో కలిసి అధికారంలోకి వచ్చింది. ఈ రెండు పార్టీలు చెరో రెండున్నరేళ్లు మేయర్ పదవిని పంచుకున్నాయి. ప్రస్తుతం టీఆర్ఎస్, ఎంఐఎం కూడా ఇలాంటి అవగాహనకు వస్తాయా.. టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి అధికారం పంచుకుంటాయా.. లేక ఒకరు మేయర్, మరొకరు డిప్యూటీ మేయర్ తీసుకుంటారా అనే అంశాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. -
‘పూర్తి ఫలితాలు వచ్చాక హంగ్‌పై స్పందిస్తాం’
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఫలితాల్లో అధికార టీఆర్ఎస్, బీజేపీల మధ్య హోరా హోరిగా పోరు సాగింది. టీఆర్ఎస్ 56 స్థానాలు దక్కించుకొని అతిపెద్ద పార్టీగా నిలవగా బీజేపీ 47 డివిజన్లలో విజయ కేతనం ఎగురవేసి రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దుబ్బాక ఉప ఎన్నిక జోష్‌లో ఉన్న బీజేపీ గ్రేటర్లో మరింత దూకుడుగా వ్యవహరించింది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నాలుగు సీట్లతో సరిపెట్టుకున్న బీజేపీ ఈ సారి భారీగా పుంజుకుంది. చదవండి: బీఎన్‌రెడ్డి నగర్లో టీఆర్ఎస్కు షాక్.. జీహెచ్ఎంసీ ఫలితాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ తప్పుడు ఆరోపణలకు ప్రజలే సమాధానం చెప్పారని పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన సవాల్‌ను టీఆర్ఎస్ ప్రభుత్వం స్వీకరించాలని అన్నారు. టీఆర్ఎస్ ప్రజల ఆదరణను వేగంగా కోల్పోతుందని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు. 2023లో అధికారానికి రావడానికి గ్రేటర్ ఎన్నికలు ప్లాట్ ఫామ్‌గా నిలిచిందన్నారు. చదవండి: టీఆర్ఎస్ కొంపముంచిన డమ్మీ అభ్యర్థి..! టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. బీజేపీపై టీఆర్ఎస్ చేసిన తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదని అన్నారు. అక్రమ కేసులు పెట్టినా.. బీజేపీ కార్యకర్తలు వెనకడుగు వేయలేదని, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతీయులను సోషల్ మీడియా ద్వారా టీఆర్ఎస్ భయభ్రాంతులకు గురిచేసిందన్నారు. కూలిపోతున్న టీఆర్ఎస్ పార్టీలోకి తమ కార్పోరేటర్లు వెళ్లరని స్పష్టం చేశారు. అదే విధంగా పూర్తి ఫలితాలు వచ్చాక హంగ్‌పై స్పందిస్తామన్నారు. చదవండి: పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ రాజీనామా -
టీఆర్ఎస్ కన్ను లొట్టపోయింది: డీకే అరుణ
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో వంద సీట్లు గెలుస్తామని చెప్పిన టీఆర్ఎస్ చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు ఫలితాలు వచ్చాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీఆర్ఎస్కు కాలం చెల్లినట్లేనని అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీయే ప్రత్యామ్నాయ పార్టీ అని చెప్పారు. హైదరాబాద్ నగర ప్రజలకు బీజేపీ అండగా ఉంటుందని అన్నారు. ( జీహెచ్ఎంసీ ఎన్నికల విజేతలు వీరే ) కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 స్థానాలకు గానూ టీఆర్ఎస్ 56, బీజేపీ, 49, ఎమ్ఐఎమ్ పార్టీ 43 స్థానాలను గెలుచుకున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలకే పరిమితం కాగా, తెలుగు దేశం పార్టీ ఒక్క చోట కూడా గెలవకపోవటం గమనార్హం. -
జీహెచ్ఎంసీ ఎన్నికల విజేతలు వీరే
సాక్షి, హైదరాబాద్ : ఎట్టకేలకు ఉత్కంఠకు తెర పడింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. జీహెచ్ఎంసీలోని 150 డివిజన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ 56 డివిజన్లలో గెలుపొందింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీలు బల్దియా ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని హోరాహోరీగా ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో విజయ ఢంకా మోగించి వరుస ప్రభంజనాలు సృష్టించిన టీఆర్ఎస్ పార్టీ.. ఇటీవల కాలంలో కేంద్రంలోని బీజేపీ నుంచి కొంత పోటీని ఎదుర్కొంటోంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 డివిజన్లకు గాను 99 డివిజన్లను దక్కించుకున్న టీఆర్ఎస్.. రాష్ట్ర రాజకీయాల్లో పట్టును నిలుపుకోవడానికి శతవిధాలా ప్రయత్నించినా 56 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇటు పాతబస్తీలో ఎదురులేని ఎంఐఎం.. గత ఎన్నికల్లో గెలిచిన 44 స్థానాలను నిలుపుకుంది. ఇటు గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా పోటీ చేసిన 68 డివిజన్లకు గాను కేవలం 4 స్థానాల్లో గెలిచిన బీజేపీ ఈసారి అనూహ్యంగా రెండో స్థానం దక్కించుకుంది. 48 డివిజన్లలో విజయం సాధించింది. వార్డువిజేతలు పార్టీ 1 కాప్రా స్వర్ణరాజ్ టీఆర్ఎస్ 2 ఏఎస్ రావు నగర్ శిరీషా రెడ్డి కాంగ్రెస్ 3 చర్లపల్లి బొంతు శ్రీదేవి టీఆర్ఎస్ 4 మీర్‌పేట హెచ్‌బీ కాలనీ జె.ప్రభుదాస్ టీఆర్ఎస్ 5 మల్లాపూర్ దేవేందర్‌రెడ్డి టీఆర్ఎస్ 6 నాచారం శాంతి సాయిజన్ టీఆర్ఎస్ 7 చిలుకా నగర్ గోనె శైలజ బీజేపీ 8 హబ్సిగూడ కె.చేతన బీజేపీ 9 రామాంతపూర్ బండారు శ్రీవాణి బీజేపీ 10 ఉప్పల్ రజిత కాంగ్రెస్ 11 నాగోల్ సిహెచ్ అరుణ బీజేపీ 12 మన్సూరాబాద్ కొప్పుల నరసింహారెడ్డి బీజేపీ 13 హయత్‌నగర్ కళ్లెం నవజీవన్ రెడ్డి బీజేపీ 14 బీఎన్ రెడ్డి నగర్ ఎం లచ్చిరెడ్డి బీజేపీ 15 వనస్థలిపురం వెంకటేశ్వర్ రెడ్డి బీజేపీ 16 హస్తినాపురం సుజాతా నాయక్ బీజేపీ 17 చంపాపేట్ వంగ మధుసూదన్ రెడ్డి బీజేపీ 18 లింగోజీగూడ ఆకుల రమేష్‌బాబు బీజేపీ 19 సరూర్ నగర్ ఆకుల శ్రీవాణీ బీజేపీ 20 రామకృష్ణాపురం రాధ బీజేపీ 21 కొత్తపేట్ పవన్ కుమార్ బీజేపీ 22 చైతన్యపురి నర్సింహ గుప్తా బీజేపీ 23 గడ్డి అన్నారం ప్రేమ్ మహేశ్వర్‌రెడ్డి బీజేపీ 24 సైదాబాద్ కె అరుణ బీజేపీ 25 ముసారాంబాగ్ భాగ్యలక్ష్మిరెడ్డి బీజేపీ 26 ఓల్డ్ మలక్‌పేట్ జువేరియా ఫాతిమా ఎంఐఎం 27 అక్బర్‌బాగ్ మినాజుద్దీన్ ఎంఐఎం 28 అజాంపుర అయేషా జహాన్ ఎంఐఎం 29 చావని అబ్దుల్ సలాం షాహిద్ ఎంఐఎం 30 డబ్బీర్‌పురా అలందార్ హుస్సేన్ ఎంఐఎం 31 రైన్ బజార్ వసీ యుద్దీన్ ఎంఐఎం 32 పతర్ గట్టి సొహైల్ ఖాద్రి ఎంఐంఎం 33 మొఘల్‌పుర నసరీన్ సుల్తానా ఎంఐఎం 34 తలబ్ చంచలం డా.సమీనా ఎంఐఎం 35 గౌలీపురా ఏ. భాగ్యలక్ష్మీ బీజేపీ 36 లలితాబాగ్ ఆలీ షరీఫ్ ఎంఐఎం 37 కుర్మాగూడ మహాపర ఎంఐఎం 38 ఐఎస్ సదన్ జె. శ్వేత బీజేపీ 39 సంతోష్ నగర్ ముజఫర్ హుస్సేన్ ఎంఐఎం 40 రియాసత్ నగర్ ముస్తఫా బేగ్ ఎంఐఎం 41 కాంచనబాగ్ రేష్మాఫాతిమా ఎంఐఎం 42 బార్కాస్ షబానా బేగం ఎంఐఎం 43 చంద్రాయణగుట్ట అబ్దుల్ వాహబ్ ఎంఐఎం 44 ఉప్పుగూడ ఆబ్దాద్ ఎంఐఎం 45 జంగంమెట్ ఎంఐఎం 46 ఫలక్‌నుమా తారాభాయ్ ఎంఐఎం 47 నవాబ్ సాహెబ్ కుంట షిరీన్ ఖాతూన్ ఎంఐఎం 48 షహాలీబండ ముస్తఫా అలీ ఎంఐఎం 49 ఝాన్సీ బజార్ ఫర్విన్ సుల్తానా ఎంఐఎం 50 బేగంబజార్ జి. శంకర్ యాదవ్ బీజేపీ 51 గోషామహల్ లాల్ సింగ్ బీజేపీ 52 పురానాపూల్ రాజ్ మోహన్ ఎంఐఎం 53 దూద్ బౌలీ ఎండీ సలీమ్ ఎంఐఎం 54 జహానుమా అబ్దుల్ ముక్తదీర్ ఎంఐఎం 55 రాంనాస్తపుర అబ్దుల్ ఖదీర్ ఎంఐఎం 56 కిషన్‌బాగ్ హుస్సేనీ పాషా ఎంఐఎం 57 సులేమాన్ నగర్ అబిదా సుల్తానా ఎంఐఎం 58 శాస్త్రీపురం మహ్మద్ ముబిన్ ఎంఐఎం 59 మైలర్ దేవ్‌పల్లి తోకల శ్రీనివాసరెడ్డి బీజేపీ 60 రాజేంద్రనగర్ పి. అర్చన బీజేపీ 61 అత్తాపూర్ ఎం. సంగీత బీజేపీ 62 జియాగూడ బి.దర్శన్ బీజేపీ 63 మంగళ్‌హట్ ఎం. శశికళ బీజేపీ 64 దత్తాత్రేయ నగర్ జాకీర్ బాకరి ఎంఐఎం 65 కార్వాన్ ఎం. స్వామి యాదవ్ ఎంఐఎం 66 లంగర్ హౌస్ అమీనా బేగం ఎంఐఎం 67 గోల్కొండ సమీనా యాస్మిన్ ఎంఐఎం 68 టోలీచౌకీ అయేషా ఉమేరా ఎంఐఎం 69 ననల్ నగర్ నసిరుద్దీన్ ఎంఐఎం 70 మెహదీపట్నం మాజిద్ హుస్సేన్ ఎంఐఎం 71 గుడిమల్కాపూర్ కర్ణాకర్ బీజేపీ 72 అసిఫ్ నగర్ గౌసియా సుల్తానా ఎంఐఎం 73 విజయనగర్ కాలనీ బి.జబీన్ ఎంఐఎం 74 అహ్మద్ నగర్ రఫత్ సుల్తానా ఎంఐఎం 75 రెడ్ హిల్స్ సద్దియా మజ్హర్ ఎంఐఎం 76 మల్లేపల్లి యాస్మిన్‌బేగం ఎంఐఎం 77 జామ్‌బాగ్ రాకేశ్ జైస్వాల్ బీజేపీ 78 గన్‌ఫౌండ్రీ బి. సురేఖ బీజేపీ 79 హిమాయత్ నగర్ జి.ఎన్.వి. కె. మహాలక్ష్మి బీజేపీ 80 కాచిగూడ కె. ఉమారాణి బిజేపీ 81 నల్లకుంట వై.అమృత బీజేపీ 82 గోల్నాక దూసరి టీఆర్ఎస్ 83 అంబర్పేట్ విజయ్ కుమార్‌గౌడ్ టీఆర్ఎస్ 84 బాగ్ అంబర్పేట్ బి. పద్మ వెంకటరెడ్డి బీజేపీ 85 అడిక్‌మెట్ సునీత బీజేపీ 86 ముషీరాబాద్ ఎం.సుప్రియ బీజేపీ 87 రాంనగర్ కె.రవికుమార్ బీజేపీ 88 భోలక్‌పూర్ మహ్మద్ గౌసుద్దిన్ ఎంఐఎం 89 గాంధీనగర్ పావని బీజేపీ 90 కవాడిగూడ జి. రచన శ్రీ బీజేపీ 91 ఖైరతాబాద్ విజయా రెడ్డి టీఆర్ఎస్ 92 వెంకటేశ్వరా కాలనీ మన్నె కవితా రెడ్డి టీఆర్ఎస్ 93 బంజారహిల్స్ విజయలక్ష్మీ టీఆర్ఎస్ 94 షేక్‌పేట్ మహ్మద్ ఫరాజుద్దీన్ ఎంఐఎం 95 జూబ్లీహిల్స్ డి. వెంకటేష్ బీజేపీ 96 యూసఫ్‌గూడ రాజ్‌కుమార్ టీఆర్ఎస్ 97 సోమాజిగూడ వనం సంగీత టీఆర్ఎస్ 98 అమీర్‌పేట్ సరళ బీజేపీ 99 వెంగళరావు నగర్ జి. దేదిప్య టీఆర్ఎస్ 100 సనత్ నగర్ కొలను లక్ష్మి టీఆర్ఎస్ 101 ఎర్రగడ్డ షాహిన్ బేగం ఎంఐఎం 102 రహమత్ నగర్ సి.ఎన్ రెడ్డి టీఆర్ఎస్ 103 బోరబండ బాబా ఫసియుద్దీన్ టీఆర్ఎస్ 104 కొండాపూర్ హమీద్ పటేల్ టీఆర్ఎస్ 105 గచ్చిబౌలీ గంగాధర్ బీజేపీ 106 శేరిలింగంపల్లి రాగం నాగేందర్ టీఆర్ఎస్ 107 మాదాపూర్ జగదీశ్వర్ గౌడ్ టీఆర్ఎస్ 108 మియాపూర్ ఉప్పలపాటి శ్రీకాంత్ టీఆర్ఎస్ 109 హఫీజ్ పేట్ పూజితా జగదీశ్వర్ టీఆర్ఎస్ 110 చందానగర్ ఆర్.మంజుల టీఆర్ఎస్ 111 భారతీ నగర్ వి.సింధు ఆదర్శ్‌రెడ్డి టీఆర్ఎస్ 112 రామచంద్రాపురం పుష్ప నగేష్ యాదవ్ టీఆర్ఎస్ 113 పటాన్చెరువు కుమార్ యాదవ్ టీఆర్ఎస్ 114 కేపీహెచ్‌బీ కాలనీ మందడి శ్రీనివాసరావు టీఆర్ఎస్ 115 బాలాజీ నగర్ శిరీష టీఆర్ఎస్ 116 అల్లాపూర్ సబీహా బేగం టీఆర్ఎస్ 117 మూసాపేట్ కె. మహిందర్ బీజేపీ 118 ఫతే నగర్ పండాల సతీష్ గౌడ్ టీఆర్ఎస్ 119 ఓల్డ్ బోయన్ పల్లి ఎం. నర్సింహా యాదవ్ టీఆర్ఎస్ 120 బాలానగర్ ఆవుల రవీందర్‌రెడ్డి టీఆర్ఎస్ 121 కూకట్పల్లి జూపల్లి సత్యనారాయణ టీఆర్ఎస్ 122 వివేకానందనగర్ కాలనీ మాధవరం రోజాదేవి టీఆర్ఎస్ 123 హైదర్ నగర్ నార్నె శ్రీనివాసరావు టీఆర్ఎస్ 124 ఆల్వీన్ కాలనీ డి. వెంకటేష్‌గౌడ్ టీఆర్ఎస్ 125 గాజుల రామారం రావూరి శేషగిరి టీఆర్ఎస్ 126 జగద్గిరి గుట్ట కొలుకుల జగన్ టీఆర్ఎస్ 127 రంగారెడ్డి నగర్ విజయ్‌శేఖర్ గౌడ్ టీఆర్ఎస్ 128 చింతల్ రషీదా బేగం టీఆర్ఎస్ 129 సురారం మంత్రి సత్యనారాయణ టీఆర్ఎస్ 130 సుభాష్ నగర్ జి. హేమలత టీఆర్ఎస్ 131 కుత్బుల్లాపూర్ కూన పారిజాత గౌరీష్గౌడ్ టీఆర్ఎస్ 132 జీడిమెట్ల తారా చంద్ర రెడ్డి బీజేపీ 133 మచ్చ బొల్లారం ఇ.ఎస్.రాజ్ జితేంద్రనాథ్ టీఆర్ఎస్ 134 అల్వాల్ శాంతి శ్రీనివాస్‌రెడ్డి టీఆర్ఎస్ 135 వెంకటాపురం సబితా కిషోర్ టీఆర్ఎస్ 136 నేరేడ్మెట్ 137 వినాయక్ నగర్ రాజ్యలక్ష్మీ బీజేపీ 138 మౌలాలి ఫాతిమా టీఆర్ఎస్ 139 ఈస్ట్ ఆనంద్ బాగ్ ప్రేమ్ కుమార్ టీఆర్ఎస్ 140 మల్కాజ్ గిరి వి. శ్రవణ్ బీజేపీ 141 గౌతమ్ నగర్ మేకల సునీత టీఆర్ఎస్ 142 అడ్డగుట్ట ఎల్ ప్రసన్న లక్ష్మి టీఆర్ఎస్ 143 తార్నాక ఎం. శ్రీలత టీఆర్ఎస్ 144 మెట్టుగూడ రాసూరి సునీత టీఆర్ఎస్ 145 సీతాఫల్మండి సామల హేమ టీఆర్ఎస్ 146 భౌద్దనగర్ కంది శైలజ టీఆర్ఎస్ 147 బన్సీలాల్ పేట్ కుర్మా హేమలత టీఆర్ఎస్ 148 రాంగోపాల్ పేట్ సీహెచ్ సచిత్ర బీజేపీ 149 బేగంపేట్ టి. మహేశ్వరి టీఆర్ఎస్ 150 మోండా మార్కెట్ దీపిక బీజేపీ -
టీఆర్ఎస్ కొంపముంచిన డమ్మీ అభ్యర్థి!
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల ఫలితాలు చివరి దశకు చేరుకున్నాయి. రెండు చోట్ల ఫలితం వెల్లడి కావాల్సి ఉంది. ఇప్పటికే టీఆర్ఎస్-56, బీజేపీ-47, ఎంఐఎం-43, కాంగ్రెస్-2 చోట్ల విజయం సాధించగా, మరో రెండుచోట్ల బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇకపోతే, బీఎన్ రెడ్డి నగర్లో రీ కౌంటింగ్ జరిగింది. తొలుత టీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మీ ప్రసన్నపై బీజేపీ అభ్యర్థి లచ్చిరెడ్డి 10 ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే దీనిపై టీఆర్ఎస్ అభ్యర్థి రీకౌంటింగ్ కోసం డిమాండ్ చేయడంతో అక్కడ రీకౌంటింగ్ జరిపారు. రీకౌంటింగ్‌లో బీజేపీ అభ్యర్థి 32 ఓట్లతో విజయం సాధించినట్టు ప్రకటించారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే టీఆర్ఎస్ డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన వ్యక్తికి 39 ఓట్లు పడ్డాయి. టీఆర్ఎస్ అసలు అభ్యర్థికి రావాల్సిన ఓట్లు డమ్మి అభ్యర్థికి పడటంతో ఇక్కడ బీజేపీ విజయం సాధించింది. ఓ రకంగా చెప్పాలంటే డమ్మీ అభ్యర్థి కారణంగా టీఆర్ఎస్ అసలు అభ్యర్థి ఓడిపోయినట్టయింది. -
గ్రేటర్ వార్: నాడు-నేడు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఫలితాలు వెలువడ్డాయి. జీహెచ్ఎంసీలోని 150 డివిజన్ల పరిధిలో మొత్తం 1,122 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు. 2016లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 డివిజన్లను దక్కించుకున్న టీఆర్ఎస్.. పట్టును నిలుపుకోవడానికి శతవిధాలా ప్రయత్నించినా 56 స్థానాలతో సరిపెట్టుకుంది. నాడు-నేడు గెలిచిన పార్టీల వివరాలు... గెలిచిన పార్టీ వార్డు 2016 2020 1 కాప్రా టీఆర్ఎస్ టీఆర్ఎస్ 2 ఏఎస్రావు నగర్ టీఆర్ఎస్ కాంగ్రెస్ 3 చర్లపల్లి టీఆర్ఎస్ టీఆర్ఎస్ 4 మీర్పేట్ హెచ్‌బీ కాలనీ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 5 మల్లాపూర్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 6 నాచారం కాంగ్రెస్ టీఆర్ఎస్ 7 చిలుకా నగర్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 8 హబ్సీగూడ టీఆర్ఎస్ బీజేపీ 9 రామాంతపూర్ టీఆర్ఎస్ బీజేపీ 10 ఉప్పల్ టీఆర్ఎస్ కాంగ్రెస్ 11 నాగోల్ టీఆర్ఎస్ బీజేపీ 12 మన్సూరాబాద్ టీఆర్ఎస్ బీజేపీ 13 హయత్‌నగర్ టీఆర్ఎస్ బీజేపీ 14 బీఎన్ రెడ్డి నగర్ టీఆర్ఎస్ బీజేపీ 15 వనస్థలిపురం టీఆర్ఎస్ బీజేపీ 16 హస్తినాపురం టీఆర్ఎస్ బీజేపీ 17 చంపాపేట్ టీఆర్ఎస్ బీజేపీ 18 లింగోజీగూడ టీఆర్ఎస్ బీజేపీ 19 సరూర్ నగర్ టీఆర్ఎస్ బీజేపీ 20 రామకృష్ణాపురం బీజేపీ బీజేపీ 21 కొత్తపేట్ టీఆర్ఎస్ బీజేపీ 22 చైతన్యపురి టీఆర్ఎస్ బీజేపీ 23 గడ్డి అన్నారం టీఆర్ఎస్ బీజేపీ 24 సైదాబాద్ టీఆర్ఎస్ బీజేపీ 25 మూసారం బాగ్ టీఆర్ఎస్ బీజేపీ 26 ఓల్డ్ మలక్‌పేట్ ఎంఐఎం ఎంఐఎం 27 అక్బర్‌బాగ్ ఎంఐఎం ఎంఐఎం 28 అజాంపుర ఎంఐఎం ఎంఐఎం 29 చావని ఎంఐఎం ఎంఐఎం 30 డబీర్‌పురా ఎంఐఎం ఎంఐఎం 31 రైన్ బజార్ ఎంఐఎం ఎంఐఎం 32 పతర్ గట్టి ఎంఐఎం ఎంఐఎం 33 మొఘల్‌పుర ఎంఐఎం ఎంఐఎం 34 తలబ్ చంచలం ఎంఐఎం ఎంఐఎం 35 గౌలీపురా బీజేపీ బీజేపీ 36 లలితాబాగ్ ఎంఐఎం ఎంఐఎం 37 కుర్మగూడ ఎంఐఎం ఎంఐఎం 38 ఐఎస్ సదన్ టీఆర్ఎస్ బీజేపీ 39 సంతోష్ నగర్ ఎంఐఎం ఎంఐఎం 40 రియాసత్ నగర్ ఎంఐఎం ఎంఐఎం 41 కాంచనబాగ్ ఎంఐఎం ఎంఐఎం 42 బర్కాస్ ఎంఐఎం ఎంఐఎం 43 చంద్రాయణగుట్ట ఎంఐఎం ఎంఐఎం 44 ఉప్పుగూడ ఎంఐఎం ఎంఐఎం 45 జంగంమెట్ ఎంఐఎం ఎంఐఎం 46 ఫలక్‌నుమా ఎంఐఎం ఎంఐఎం 47 నవాబ్ సాహెబ్ కుంట ఎంఐఎం ఎంఐఎం 48 షహలీబండ ఎంఐఎం ఎంఐఎం 49 ఘాన్సీ బజార్ బీజేపీ ఎంఐఎం 50 బేగం బజార్ బీజేపీ బీజేపీ 51 గోషా మహల్ టీఆర్ఎస్ బీజేపీ 52 పురానాపూల్ ఎంఐఎం ఎంఐఎం 53 దూద్ బౌలీ ఎంఐఎం ఎంఐఎం 54 జహానుమా ఎంఐఎం ఎంఐఎం 55 రాంనాస్పుర ఎంఐఎం ఎంఐఎం 56 కిషన్‌బాగ్ ఎంఐఎం ఎంఐఎం 57 సులేమాన్ నగర్ ఎంఐఎం ఎంఐఎం 58 శాస్త్రీపురం ఎంఐఎం ఎంఐఎం 59 మైలర్ దేవ్‌పల్లి టీఆర్ఎస్ బీజేపీ 60 రాజేంద్ర నగర్ టీఆర్ఎస్ బీజేపీ 61 అత్తాపూర్ టీఆర్ఎస్ బీజేపీ 62 జియాగూడ టీఆర్ఎస్ బీజేపీ 63 మంగళ హట్ టీఆర్ఎస్ బీజేపీ 64 దత్తాత్రేయ నగర్ ఏఐఎంఐఎం ఎంఐఎం 65 ఖార్వాన్ ఎంఐఎం ఎంఐఎం 66 లంగర్ హౌస్ ఎంఐఎం ఎంఐఎం 67 గోల్కొండ ఎంఐఎం ఎంఐఎం 68 టోలీచౌకీ ఎంఐఎం ఎంఐఎం 69 నానల్ నగర్ ఎంఐఎం ఎంఐఎం 70 మెహదీపట్నం ఎంఐఎం ఎంఐఎం 71 గుడిమల్కాపూర్ టీఆర్ఎస్ బీజేపీ 72 అసిఫ్ నగర్ ఎంఐఎం ఎంఐఎం 73 విజయనగర్ కాలనీ ఎంఐఎం ఎంఐఎం 74 అహ్మద్ నగర్ ఎంఐఎం ఎంఐఎం 75 రెడ్ హిల్స్ ఎంఐఎం ఎంఐఎం 76 మల్లేపల్లి ఎంఐఎం ఎంఐఎం 77 జామ్‌బాగ్ ఎంఐఎం బీజేపీ 78 గన్‌ఫౌండ్రీ టీఆర్ఎస్ బీజేపీ 79 హిమాయత్ నగర్ టీఆర్ఎస్ బీజేపీ 80 కాచిగూడ టీఆర్ఎస్ బీజేపీ 81 నల్లకుంట టీఆర్ఎస్ బీజేపీ 82 గోల్నాక టీఆర్ఎస్ టీఆర్ఎస్ 83 అంబర్పేట్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 84 బాగ్ అంబర్పేట్ టీఆర్ఎస్ బీజేపీ 85 అడిక్‌మెట్ టీఆర్ఎస్ బీజేపీ 86 ముషీరాబాద్ టీఆర్ఎస్ బీజేపీ 87 రాంనగర్ టీఆర్ఎస్ బీజేపీ 88 భోలక్‌పూర్ ఎంఐఎం ఎంఐఎం 89 గాంధీనగర్ టీఆర్ఎస్ బీజేపీ 90 కవాడిగూడ టీఆర్ఎస్ బీజేపీ 91 ఖైరతాబాద్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 92 వెంకటేశ్వరా కాలనీ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 93 బంజారాహిల్స్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 94 షేక్‌పేట ఎంఐఎం ఎంఐఎం 95 జూబ్లీ హిల్స్ టీఆర్ఎస్ బీజేపీ 96 యూసఫ్ గూడ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 97 సోమాజీగూడ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 98 అమీర్‌పేట్ టీఆర్ఎస్ బీజేపీ 99 వెంగళరావు నగర్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 100 సనత్ నగర్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 101 ఎర్రగడ్డ ఎంఐఎం ఎంఐఎం 102 రహమత్ నగర్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 103 బోరబండ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 104 కొండాపూర్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 105 గచ్చిబౌలీ టీఆర్ఎస్ బీజేపీ 106 శేరిలింగంపల్లి టీఆర్ఎస్ టీఆర్ఎస్ 107 మాదాపూర్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 108 మియాపూర్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 109 హఫీజ్‌పేట్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 110 చందానగర్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 111 భారతీ నగర్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 112 రామచంద్రాపురం టీఆర్ఎస్ టీఆర్ఎస్ 113 పటాన్ చెరువు కాంగ్రెస్ టీఆర్ఎస్ 114 కేపీహెచ్‌బీ కాలనీ టీడీపీ టీఆర్ఎస్ 115 బాలాజీ నగర్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 116 అల్లాపూర్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 117 మూసాపేట్ టీఆర్ఎస్ బీజేపీ 118 ఫతే నగర్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 119 ఓల్డ్ బోయన్ పల్లి టీఆర్ఎస్ టీఆర్ఎస్ 120 బాలానగర్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 121 కూకట్పల్లి టీఆర్ఎస్ టీఆర్ఎస్ 122 వివేకానందనగర్ కాలనీ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 123 హైదర్ నగర్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 124 ఆల్వీన్ కాలనీ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 125 గాజుల రామారం టీఆర్ఎస్ టీఆర్ఎస్ 126 జగద్గిరి గుట్ట టీఆర్ఎస్ టీఆర్ఎస్ 127 రంగారెడ్డి నగర్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 128 చింతల్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 129 సురారం టీఆర్ఎస్ టీఆర్ఎస్ 130 సుభాష్ నగర్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 131 కుత్బుల్లాపూర్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 132 జీడిమెట్ల టీఆర్ఎస్ బీజేపీ 133 మచ్చ బొల్లారం టీఆర్ఎస్ టీఆర్ఎస్ 134 అల్వాల్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 135 వెంకటాపురం టీఆర్ఎస్ టీఆర్ఎస్ 136 నేరేడ్మెట్ టీఆర్ఎస్ 137 వినాయక్ నగర్ టీఆర్ఎస్ బీజేపీ 138 మౌలాలి టీఆర్ఎస్ బీజేపీ 139 ఈస్ట్ ఆనంద్ బాగ్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 140 మల్కాజ్ గిరి టీఆర్ఎస్ బీజేపీ 141 గౌతమ్ నగర్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 142 అడ్డగుట్ట టీఆర్ఎస్ టీఆర్ఎస్ 143 తార్నాక టీఆర్ఎస్ టీఆర్ఎస్ 144 మెట్టుగూడ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 145 సీతాఫల్మండి టీఆర్ఎస్ టీఆర్ఎస్ 146 భౌద్దనగర్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 147 బన్సీలాల్ పేట్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 148 రాంగోపాల్ పేట్ టీఆర్ఎస్ బీజేపీ 149 బేగంపేట్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ 150 మోండా మార్కెట్ టీఆర్ఎస్ బీజేపీ -
హంగ్ దిశగా.. గ్రేటర్ జడ్జిమెంట్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. టీఆర్ఎస్-56, బీజేపీ-48,ఎంఐఎం-44, కాంగ్రెస్-2 చోట్ల విజయం సాధించింది. ఇక గ్రేటర్ ఎన్నికల్లో నగర ఓటరు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. మేయర్ పీఠం దక్కించుకోవాలంటే 76 స్థానాల్లో విజయం సాధించాలి. కానీ ఒక్క పార్టీ కూడా 60 దాటలేదు. దాంతో హంగ్ తప్పదంటున్నారు విశ్లేషకులు. ఇక ఎగ్జిట్ పోల్స్‌లో టీఆర్ఎస్ సొంతంగా మెజారిటీ సాధిస్తుందని ప్రకటించినప్పటికి తాజా ఫలితాల్లో మాత్రం 56 స్థానాలకే పరిమితమయ్యింది. ఎలాగు ఎంఐఎం మద్దతుతో మేయర్ పీఠం దక్కించుకోనున్నప్పటికి.. గ్రేటర్ ఫలితల్లో టీఆర్ఎస్కు భారీ పరాజయమనే చెప్పవచ్చు. జీహెచ్ఎంసీ పోరులో బీజేపీ, కారుకు బాగానే బ్రేక్ లేసిందనే చెప్పవచ్చు. 2016 ఎన్నికల్లో కేవలం నాలుగు స్థానాలకే పరిమితైన బీజేపీ తాజాగా 48 స్థానాల్లో విజయం సాధించి రెండవ స్థానంలో నిలిచింది. శివారు కాలనీల్లో దూసుకుపోయిన కారు జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో 100కు పైగా స్థానాల్లో విజయం సాధిస్తామని టీఆర్ఎస్ ప్రకటించింది. కానీ చివరకు మేజిక్ ఫిగర్ కూడా చేరలేదు. తాజా ఫలితాల్లో టీఆర్ఎస్ నగర శివార్లలో మెరుగైన ఫలితాలు సాధించినప్పటికి సిటీలో మాత్రం దారుణంగా విఫలమయ్యింది. ఎన్ని ఉచిత హామిలిచ్చినా ఓటరు పెద్దగా పట్టించుకోలేదు. ఆరేళ్లలో టీఆర్ఎస్ సిటీలో పెద్దగా అభివృద్ధి చేసింది ఏం లేకపోగా.. తాజాగా వరదల సమయంలో.. ముఖ్యమంత్రి, మంత్రులు, కార్పొరేటర్లు స్పందించిన తీరు నగరవాసికి నచ్చలేదు. దాంతో కేవలం 56 స్థానాలతో సరిపెట్టాడు. కేసీఆర్ ప్రకటించిన 10 వేల రూపాయల వరద సాయం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. గ్రేటర్ ఫలితం టీఆర్ఎస్పై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను స్పష్టం చేసింది. టీఆర్ఎస్ మీద వ్యతిరేకత వల్లే ఓటింగ్ తగ్గిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇలానే కొనసాగితే.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కారుకు కష్టాలు తప్పవంటున్నారు విశ్లేషకులు. 4 నుంచి 48కు ఎదిగిన బీజేపీ దుబ్బాక ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ బల్దియాలో కూడా బలంగా తన ప్రభావం చూపించింది. 2016 ఎన్నికల్లో కేవలం నాలుగు స్థానాలకే పరిమితైమన బీజేపీ ఈ ఎన్నికల్లో ఏకంగా 48 స్థానాల్లో విజయం సాధించి రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక గ్రేటర్లో బీజేపీ పుంజుకోవడంలో బండి సంజయ్ కీలక పాత్ర పోషించారనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎంఐఎం, అధికార పార్టీ నాయకుల విమర్శలకు కౌంటర్లు ఇస్తూ.. కేంద్రం నుంచి రాష్ట్రం పొందిన ప్రయోజనాల గురించి ప్రజలకు తెలుపుతూ.. ప్రచారంలో దూసుకుపోయింది బీజేపీ. ఈ ఎన్నికల్లో మేజిక్ ఫిగర్ సాధించనప్పటికి రెండో స్థానంలో కొనసాగడం అంటే కమలానికి గెలుపుతో సమానం. ఇక గ్రేటర్ ఫలితాలతో తెలంగాణలో టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నయం అని బీజేపీ మరో సారి రుజువు చేసింది. ఇక గ్రేటర్ జోష్‌నే కొనసాగిస్తే.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కారును కట్టడి చేయగల్గుతుందనడంలో సందేహం లేదు. (చదవండి: షాడో టీమ్స్.. ఎత్తుకు.. పై ఎత్తులు!) పాతబస్తీలో పట్టు నిలుపుకున్న మజ్లీస్ ఇక మజ్లీస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోన్నక్కర్లేదు. పాతబస్తీలో పతంగి పార్టీకి మంచి పట్టుంది. 40కిపైగా స్థానాల్లో మజ్లీస్ విజయం సాధిస్తుందని ముందు నుంచి అంచనా వేసిందే. గత ఎన్నికల్లో ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించగా.. ఈసారి కూడా ఆ స్థానాలను నిలుపుకుంది. సింగిల్ డిజిట్‌కే పరిమితమైన హస్తం వరుస ఓటములతో సతమవుతున్న కాంగ్రెస్ పార్టీకి.. గ్రేటర్లో కూడా అదే పరిస్థితి ఎదురయ్యింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం రెండు స్థానాలకే పరిమితం అయ్యింది. అధికార పార్టీకి పోటిగా తాము గెలిస్తే ఏకంగా వరద సాయం 50 వేల రూపాయలు ఇస్తామన్నప్పటికి ఓటరు కాంగ్రెస్‌ను లైట్ తీస్కున్నాడు. ఇప్పటికి కాంగ్రెస్‌కు కార్యకర్తల బలం ఉన్నప్పటికి పార్టీ నేతల మధ్య విభేదాలు, సమన్వయం లోపం.. ప్రచారానికి అగ్ర నాయకత్వం దూరంగా ఉండటం వంటి అంశాలు కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మారాయి. (చదవండి: జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై కంగనా ట్వీట్) బోణీ కూడా కొట్టని తెలుగుదేశం పార్టీ గెలవమని తెలిసి కూడా 106 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ.. కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఒక్క చోట కూడా విజయం సాధించలేదు. ఇక తెలంగాణలో టీడీపీ తన ఉనికిని పూర్తిగా మర్చిపోతే బెటర్ అంటున్నారు విశ్లేషకులు. -
పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ రాజీనామా
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు ఏఐసీసీకి లేఖను పంపించారు. కాగా గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ఉత్తమ్ లేఖలో పేర్కొన్నారు. తాను పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని తెలిపిన ఉత్తమ్.. గతంలోనే ఏఐసీసీకి లేఖ రాశానని, ఆమోదించాలని కోరారు. కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించుకోవాలని లేఖలో పేర్కొన్నారు. చదవండి: హస్తం ఖేల్‌ఖతం.. మరోసారి సింగిల్ డిజిట్! ఇదిలా ఉండగా గత కొద్ది కాలంగా ఉత్తమ్ పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగడంపై పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఉంది. దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి అనంతరం ఈ ఒత్తిడి మరింత ఎక్కువైంది. తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కేవలం 2 డివిజన్లలో(ఉప్పల్, ఏఎస్ రావు నగర్) మాత్రమే విజయం సాధించడంతో ఓటమికి భాద్యత వహిస్తూ ఉత్తమ్ రాజీనామా చేశారు. చదవండి: 2023లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తాం: బండి సంజయ్ -
జీహెచ్ఎంసీ ఎన్నికలు: సైకిల్ పంక్చర్!!
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. 150 స్థానాలకు గానూ ఈ సారి 106 డివిజన్లలో పోటీ చేయగా ఒక్కటి కూడా గెలవలేదు. ఏ డివిజన్‌లోనూ డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో భాగంగా 82 స్థానాల్లో పోటీ చేసి కేవలం ఒక వార్డు మాత్రమే గెలుచుకుంది. ఈ సారి ఆ ఒక్క వార్డు కూడా గెలుచుకోలేకపోవటం గమనార్హం. ( గ్రేటర్ ఫలితాలు : గెలిచిన అభ్యర్థులు వీరే..) కాగా, గతంలో టీడీపీతో పొత్తులో భాగంగా 68 స్థానాల్లో బరిలోకి దిగిన బీజేపీ 4 స్థానాలు గెలిచింది. ఈ సారి 150 స్థానాల్లో పోటీ చేసి 49 డివిజన్లను కైవసం చేసుకుంది. ఇక టీఆర్ఎస్ 56, ఎమ్ఐఎమ్ 43 స్థానాలు సొంతం చేసుకున్నాయి. -
2023లో అధికారమే లక్ష్యంగా : బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అనూహ్యంగా ఫుంజుకుంది. మొత్తం 150 డివిజన్లకు గానూ 47 స్థానాల్లో విజయం సాధించి గ్రేటర్లో సత్తా చాటింది. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేవలం నాలుగే సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి మాత్రం 47 సీట్లను కైవసం చేసుకొని మరో రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో సంబరాలు షురూ అయ్యాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంతత్రి కిషన్ రెడ్డితో పాటు డీకే అరుణ, లక్క్ష్మణ్‌లు కలిసి కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకున్న కార్యకర్తలతో కలిసి బాణాసంచా కాల్చారు. అనంతరం ఒకరినొకరు స్వీట్లు పంచుకొన్న బీజేపీ నేతలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాగా 2023లో తెలంగాణలో అధికారమే లక్క్ష్యంగా పనిచేస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు. (చదవండి : గ్రేటర్ ఫలితాలు : గెలిచిన అభ్యర్థులు వీరే..) కాగా గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో అనూహ్యంగా హంగ్ ఏర్పడడంతో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కలేదు. టీఆర్ఎస్ 56 స్థానాలు సాధించి గ్రేటర్ పరిధిలో అతి పెద్ద పార్టీగా అవతరించగా.. బీజేపీ 49( రెండు ఆధిక్యం), ఎంఐఎం 43, కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలుపొందాయి. కాగా 100 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ ఒక్కస్థానం గెలవకపోగా చాలా చోట్ల డిపాజిట్లు గల్లంతవ్వడం విశేషం. కాగా గ్రేటర్లో మేయర్ ఎన్నికకు ఎంఐఎం పార్టీ కీలకం కానుంది. -
బరిలో తోడల్లుళ్లు.. జూపల్లిదే గెలుపు
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూకట్‌పల్లిలో టీఆర్ఎస్ క్లీన్‌స్విప్ చేసింది. ఈ డివిజన్ నుంచి పోటీ చేసిన జూపల్లి సత్యనారాయణ విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థులు కూకట్‌పల్లికి చెందిన ‘మాధవరం’ ఇంటికి అల్లుళ్లు కావటం విశేషం. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులుగా మాధవరం కుటుంబానికి అల్లుళ్లు కావటంతో పోటీ రసవత్తరంగా మారింది. బంధువుల మధ్యనే పోటీ నెలకొనడంతో ఎవరికి ప్రచారం చేయాలో, ఓటు ఎవరికి వేయాలో తేల్చుకోలేకపోయారు. చదవండి: గ్రేటర్ ఫలితాలు : గెలిచిన అభ్యర్థులు వీరే.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మాధవరం రామచంద్రరావు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మాధవరం కృష్ణారావు రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. కూకట్పల్లి వెలమ సామాజిక వర్గంలో సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న మాధవరం కుటుంబ సభ్యులకు అల్లుళ్లుగా ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థి జూపల్లి సత్యనారాయణ, బీజేపీ అభ్యర్థి నాయినేని పవన్ కుమార్, కాంగ్రెస్ అభ్యర్థి విశ్వ తేజేశ్వరరావులు కూకట్పల్లి వాస్తవ్యులే. అయినా ఓ విధంగా తోడల్లుళ్ల మధ్య పోరాటం సాగిందని చెప్పవచ్చు. చివరికి జూపల్లి సత్యనారాయణకే ఓటర్లు పట్టం కట్టారు. చదవండి: ఏఎస్రావు నగర్, ఉప్పల్‌లో కాంగ్రెస్ గెలుపు -
గ్రేటర్ ఫలితాలు : గెలిచిన అభ్యర్థులు వీరే..
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు 150 డివిజన్ల ఫలితాలకు గానూ 100 డివిజన్లలో తుది ఫలితాలు ప్రకటించారు. టీఆర్ఎస్ 54 స్థానాల్లో విజయం సాధించగా.. 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 స్థానాలు గెలిచిన టీఆర్ఎస్ ఈసారి మాత్రం 58-60 స్థానాల్లో మాత్రమే విజయం సాధించేలా కనిపిస్తోంది. కాగా గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేవలం నాలుగు స్థానాలు మాత్రమే గెల్చుకున్న బీజేపీ ఈసారి మాత్రం సత్తా చాటింది. ఇప్పటివరకు 41 స్థానాల్లో జయకేతనం ఎగురవేయగా.. ఇంకా 4 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుంది. ఇక ఎంఐఎం తాను పోటీ చేసిన 52 స్థానాలకు గానూ 39 స్థానాల్లో గెలిచి.. మరో 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాగా పార్టీల వారిగా వివిధ పార్టీలకు చెందిన గెలిచిన అభ్యర్థులు వివరాలను ఒకసారి పరిశీలిస్తే.. టీఆర్ఎస్ కాప్రా - స్వర్ణ రాజ్ చర్లపల్లి - బొంతు శ్రీదేవి శేరిలింగం పల్లి - రాగం నాగేందర్ బోరబండ - బాబా ఫసియుద్దీన్ భారతీ నగర్ - సింధూ ఆదర్శ్ రెడ్డి మెట్టుగూడ - రాసూరి సునీత సూరారం - మంత్రి సత్యనారాయణ బాలాజీ నగర్ - పగడాల శిరీష రంగా రెడ్డి నగర్ - శేఖర్ గౌడ్ కెపీహెచ్బీ - మందాడి శ్రీనివాస్ రావ్ కూకట్ పల్లి - జూపల్లి సత్యనారాయణ పఠాన్ చెరువు - మెట్టు కుమార్ హైదర్ నగర్ - నార్నె శ్రీనివాస్ ఆల్వాల్ - చింతల విజయశాంతి రెడ్డి వెంకటాపురం - సబితా గౌడ్ జగద్గిరిగుట్ట - జగన్ వివేకానందనగర్ - మాదవరం రోజా గోల్నాక - దూసరి హఫీజ్ పేట్ - పూజిత కొండాపూర్ - హమీద్ పటేల్ యూసుఫ్ గూడ - రాజ్ కుమార్ పటేల్ ఫతేనగర్ - పండాల సతీష్ గౌడ్ నాచారం - శాంతి సాయిజేన్ ఖైరతాబాద్..విజయా రెడ్డి గాజులరామారం- రావుల శేషగిరి సోమాజిగూడ- వనం సంగీత బీజేపీ అమీర్ పేట్ - సరళ చిలుకా నగర్ - గోనె శైలజ హబ్సిగూడ - చేతన అక్బర్ బాగ్ - మినాజ్ ఉద్దీన్ హయత్ నగర్ - కళ్లెం నవజీవన్ రెడ్డి గచ్చి బౌలి - గంగా ధర్ రెడ్డి అడిక్ మెట్ - సునీత ప్రకాష్ గౌడ్ జీడిమెట్ల - తారా చంద్ర రెడ్డి గుడిమల్కాపూర్ - కర్ణాకర్ హస్తినాపురం - బానోతు సుజాత వనస్థలిపురం - వెంకటేశ్వర్ రెడ్డి చైతన్య పురి - నర్సింహ గుప్త మోండా మార్కెట్- దీపిక బేగంబజార్- శంకర్ యాదవ్ గోశామహల్ 51- లాల్ సింగ్ మంగల్ హాట్ - శశి కళ జాంబాగ్ - రాకేష్ జైస్వాల్ గన్ ఫౌండ్రి- డాక్టర్ సురేఖ ఓం ప్రకాష్ ఎంఐఎం చావ్ని - ఎంఐఎం అబ్దుల్ సలాం షహీ డబీర్ పుర - ఎంఐఎం ఉప్పుగూడ - ఆబ్దాద్ తలాబ్ చంచలం - సమీనా బేగం నవాబ్ సహేబ్ కుంట - షీరీన్ కాతూన్ మెహెదీ పట్నం- మాజిద్ హుస్సేన్ సంతోష్ నగర్ - ముజ్ఫర్ హుస్సేన్ దత్తత్రేయనగర్ - జాకీర్ బక్రి మొగల్పుర - నస్రీన్ సుల్తానా ఛాంద్రాయణగుట్ట - అబ్దుల్ వాహబ్ రియాసత్ నగర్- మిర్జా ముస్తాఫా బేగ్ ఆనంద్ నగర్ - నసీరుద్దీన్ రమాన్సపుర- అబ్దుల్ ఖాదీర్ జహనుమా-అబ్దుల్ ముక్తదీర్ శాస్ర్తీపురం కాంగ్రెస్ ఏస్ రావ్ నగర్ - సింగిరెడ్డి శిరీషా రెడ్డి ఉప్పల్ - రజిత -
ఏఎస్రావు నగర్, ఉప్పల్‌లో కాంగ్రెస్ గెలుపు
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు రెండు డివిజన్లలో విజయం సాధించింది. ఏఎస్ రావు నగర్, ఉప్పల్‌లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. అయితే వీరిద్దరూ మహిళా అభ్యర్థులే కావడం విశేషం. ఏఎస్ రావు నగర్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సింగిరెడ్డి శిరీషా రెడ్డి, ఉప్పల్ (10వ డివిజన్) నుంచి మందముల్లా రజిత 5912 ఓట్లతో గెలుపొందారు. కాగా గ్రేటర్ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీని హైదరాబాద్ ఓటర్లు మరోసారి తిరస్కరించారనే చెప్పవచ్చు. ( జీహెచ్ఎంసీలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు ) ఇప్పటి వరకూ వెల్లడైన ఫలితాల ప్రకారం.. హస్తం పార్టీ కనీసం ప్రభావం చూపలేకపోయింది. ఇక దుబ్బాక విజయంతో ఒక్కసారే రేసులోకి వచ్చిన బీజేపీ.. కాంగ్రెస్ ఓట్లకు భారీగా గండికొట్టినట్లు కనిపిస్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి కాషాయదళం భారీగా ఓటింగ్ శాతాన్ని పెంచుకుంది. నేను చేసిన అభివృద్ధే గెలిపించింది: రజిత ప్రజా సంక్షేమం కోసం తాను చేపట్టిన అభివృద్ధి పనులే తనను గెలిపించాయని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందముల్లా రజిత అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను పార్టీలు మారతానన్న మాటలు అవాస్తవం అని స్పష్టం చేశారు. -
హైదరాబాద్ ప్రజలు మార్పును కోరుకున్నారు
-
హస్తం ఖేల్‌ఖతం.. మరోసారి సింగిల్ డిజిట్!
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీని హైదరాబాద్ ఓటర్లు మరోసారి తిరస్కరించారు. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. హస్తం పార్టీ కనీసం ప్రభావం చూపలేకపోయింది. కేవలం ఒక్క డివిజన్లో విజయం సాధించి.. మరో రెండు స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం గ్రేటర్లో మరోసారి సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి నగరంలో విసృతంగా ప్రచారం చేసినప్పటికీ పెద్దగా ఓటర్లను ఆకట్టుకుకోలేకపోయారు. అయితే పలు డివిజన్లో మాత్రం టీఆర్ఎస్, బీజేపీకి గట్టిపోటీనిస్తోంది. ఇక దుబ్బాక విజయంతో ఒక్కసారే రేసులోకి వచ్చిన బీజేపీ.. కాంగ్రెస్ ఓట్లకు భారీగా గండికొట్టినట్లు కనిపిస్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి కాషాయదళం భారీగా ఓటింగ్ శాతాన్ని పెంచుకుంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఆ పార్టీ అభ్యర్థులు 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. పలుచోట్ల అధికార టీఆర్ఎస్కు గట్టిపోటీనిచ్చింది. మరోవైపు హైదరాబాద్‌పై మజ్లీస్ మరోసారి పట్టునిలుపుకుంది. 28 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ఇప్పటికే నాలుగు స్థానాల్లో విజయం నమోదు చేసింది. (మెజార్టీ డివిజన్లలో బీజేపీ ఆధిక్యం) రాష్ట్రమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. మొదట లెక్కించిన పోస్టల్ ఓట్లలో కాస్త వెనకబడ్డ అధికార టీఆర్ఎస్... బ్యాలెట్ ఓట్లలో జోరుపెంచింది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. టీఆర్ఎస్ 40 డివిజన్లో ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ 20, ఎంఐఎం అభ్యర్థులు 16 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు. మెహదీపట్నంలో ఎంఐఎం విజయం సాధించిన.. గ్రేటర్లో తొలి గెలుపును నమోదు చేసింది. అక్కడి నుంచి ఎంఐఎం అభ్యర్థి, మాజీ డిప్యూటీ మేయర్ మాజిద్ హుస్సేన్ విజయం సాధించారు. యూసఫ్‌గూడ (రాజ్‌కుమార్ పటేల్), మెట్టుగూడ (రాసూరి సునీత) డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మరోసారి గ్రేటర్ పీఠంపై గులాబీ జెండా ఎగిరే అవకాశం కనిపిస్తోంది. ఏఎస్రావు నగర్లో కాంగ్రెస్ (శిరీషారెడ్డి) గెలుపొంది.. గ్రేటర్లో ఖాతా తెరిచింది. పలుచోట్ల టీఆర్ఎస్-బీజేపీ మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. మరికొన్ని డివిజన్లలో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థులు భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు మజ్లీస్ సైతం మరోసారి తన పట్టునిలుపుకుంది. సిట్టింగ్ స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థులు మెజార్టీ దిశగా దూసుకుపోతున్నారు. అయితే పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ ఆధిక్యం కనబర్చడం విశేషం. ఇక గ్రేటర్ ఫలితాల్లో గులాబీ పార్టీకి అనుకూలంగా తీర్పు వెలువడుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆపార్టీ అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్ పరిధిలో టీఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు. -
కౌంటింగ్‌పై ఉత్కంఠ: హౌజ్‌మోషన్ పిటిషన్ దాఖలు
-
బీజేపీ ఆధిక్యం.. రెండో స్థానంలో టీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్నాయి. మొదట లెక్కించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో అనుహ్య రీతిలో బీజేపీ ఓట్లను సాధించింది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. పోస్టల్ ఓట్లలో బీజేపీ ముందంజలో ఉంది. మెజార్టీ డివిజన్లలో టీఆర్ఎస్పై పూర్తిస్థాయిలో బీజేపీ ఆదిపత్యం ప్రదర్శించింది. పోస్టల్ బ్యాలెట్లో మొదటి స్థానంలో బీజేపీ ఉండగా.. రెండో స్థానంలో టీఆర్ఎస్ ఉంది. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లలో కేవలం 1926 పోస్టల్ ఓట్లు పోలయ్యాయి. ఎవరూ ఊహించని విధంగా బీజేపీ అత్యధిక ఓట్లను కైవసం చేసుకుంది. పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ అనూహ్యంగా ఓట్లు రాబట్టుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 40శాతం ఓట్లు చెల్లని ఓట్లుగా కౌంటింగ్ అధికారులు గుర్తించారు. మరోవైపు బ్యాలెట్ పత్రాల లెక్కింపులో టీఆర్ఎస్ పుంజుకుంది. పోస్టల్ బ్యాలెట్ వివరాలు.. హిమాయత్‌నగర్ డివిజన్ (పోస్టల్ బ్యాలెట్): టీఆర్ఎస్ 17, బీజేపీ 10, కాంగ్రెస్ జంగంమెట్ డివిజన్ : ఎంఐఎం 7, బీజేపీ 6 ఉప్పుగూడ డివిజన్ : బీజేపీ 5, ఎంఐఎం 4 చంద్రయాణగుట్ట డివిజన్ : ఎంఐఎం 1, టీఆర్ఎస్ 1 కంచన్‌బాగ్ డివిజన్ : బీజేపీ 2, ఎంఐఎం 1 రియాసత్‌నగర్ డివిజన్ : ఎంఐఎం 3, బీజేపీ 2, టీఆర్ఎస్ 1 లలితాబాగ్ డివిజన్ : బీజేపీ 3, టీఆర్ఎస్ 1 నేరేడ్మెట్ డివిజన్ : టీఆర్ఎస్ 4, బీజేపీ 3, నోటా 1 వినాయక్‌నగర్ డివిజన్ : టీఆర్ఎస్ 3, బీజేపీ 2, కాంగ్రెస్ 1 బన్సీలాల్‌పేట్ డివిజన్ : బీజేపీ 11, టీఆర్ఎస్ 2 రాంగోపాల్‌పేట డివిజన్ : టీఆర్ఎస్ 2 బేగంపేట్ డివిజన్ : బీజేపీ 11, టీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 2 మోండామార్కెట్ డివిజన్ : బీజేపీ 9, టీఆర్ఎస్ 1 ఈస్ ఆనంద్‌బాగ్ డివిజన్ : టీఆర్ఎస్ 3, బీజేపీ 3, కాంగ్రెస్ 1 ఫలక్‌నుమా డివిజన్ : ఎంఐఎం 2 నవాబ్‌సాహెబ్‌కుంట డివిజన్ : ఎంఐఎం 3 దూద్‌బౌలి డివిజన్ : ఎంఐఎం 3, టీఆర్ఎస్ 1 రణ్మస్తపురా డివిజన్ : ఎంఐఎం 4 కిషన్‌బాగ్ డివిజన్: ఎంఐఎం 3, టీఆర్ఎస్ 1, బీజేపీ 2 సైదాబాద్ డివిజన్ : బీజేపీ 30, టీఆర్ఎస్ 6 ముసారాంబాగ్ డివిజన్ : టీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 1 ఓల్డ్ మలక్‌పేట్ డివిజన్ : టీఆర్ఎస్ 1 అజంపురా డివిజన్ : ఎంఐఎం 2, ఇండిపెండెంట్ 1 చామిని డివిజన్: బీజేపీ 2 అడిక్‌మెట్ డివిజన్ (పోస్టల్ బ్యాలెట్) : బీజేపీ 4, టీఆర్ఎస్ 3, కాంగ్రెస్ 1 రామ్‌నగర్ డివిజన్ : బీజేపీ 4, టీఆర్ఎస్ 5 మల్కాజ్గిరి డివిజన్ : బీజేపీ 5 బేగంబజార్ డివిజన్ : బీజేపీ 6, టీఆర్ఎస్ 1 నాగోల్ డివిజన్ : బీజేపీ 13, టీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 1 బేగంబజార్ డివిజన్ : బీజేపీ 6, టీఆర్ఎస్ 1 హయత్‌నగర్ డివిజన్ : బీజేపీ 8, టీఆర్ఎస్ 1, కాంగ్రెస్ 1, టీడీపీ 1 బోయిన్పల్లి డివిజన్ : టీఆర్ఎస్ 8, బీజేపీ 7 హైదర్‌నగర్ డివిజన్ : బీజేపీ 3, టీఆర్ఎస్ 1, టీడీపీ 1 భారతీనగర్ డివిజన్ : బీజేపీ 4, టీఆర్ఎస్ 3 గచ్చిబౌలి డివిజన్ : టీఆర్ఎస్ 1, చెల్లనివి 2 వనస్థలిపురం డివిజన్ : బీజేపీ 5, టీఆర్ఎస్ 2, నోటా 1 చంపాపేట్ డివిజన్ : బీజేపీ 5, టీఆర్ఎస్ 2, కాంగ్రెస్ 1 శేరిలింగంపల్లి డివిజన్ : టీఆర్ఎస్ 5, బీజేపీ 3 లింగోజీగూడ డివిజన్ : బీజేపీ 5, కాంగ్రెస్ 3, టీఆర్ఎస్ 1 హస్తినాపురం డివిజన్ : బీజేపీ 2 పటాన్చెరు డివిజన్ (పోస్టల్ బ్యాలెట్): టీఆర్ఎస్ 1, కాంగ్రెస్ 1 కూకట్పల్లి డివిజన్ : బీజేపీ 24, టీఆర్ఎస్ 21, టీడీపీ 2, నోటా 2 సూరారం డివిజన్: టీఆర్ఎస్ 1, బీజేపీ 1, చెల్లనివి 2 గాజులరామారం డివిజన్ : బీజేపీ 3, టీఆర్ఎస్ 2, కాంగ్రెస్ 1 అల్వాల్ డివిజన్ : బీజేపీ 12, టీఆర్ఎస్ 6, నోటా1, చెల్లనివి 23 జీడిమెట్ల డివిజన్ : బీజేపీ 6, టీఆర్ఎస్ 4, చెల్లనివి 1 సుభాష్‌నగర్ డివిజన్ : టీఆర్ఎస్ 9, బీజేపీ 3 కొండాపూర్ డివిజన్ : బీజేపీ 5 అల్లాపూర్ డివిజన్ : బీజేపీ 3 మూసాపేట్ డివిజన్ : బీజేపీ 3, టీఆర్ఎస్ 2, టీడీపీ 1 ఫతేనగర్ డివిజన్ : టీఆర్ఎస్ 1 కేపీహెచ్‌బీ కాలనీ డివిజన్ : బీజేపీ 5, టీఆర్ఎస్ 2 బాలాజీనగర్ డివిజన్ : బీజేపీ 4, టీఆర్ఎస్ 3 మన్సూరాబాద్ డివిజన్ : బీజేపీ 8, టీఆర్ఎస్ 5 కవాడీగూడ డివిజన్ : బీజేపీ 10, టీఆర్ఎస్ 1, టీడీపీ 1 నాగోల్ డివిజన్ : బీజేపీ 13, టీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 1 కుత్బుల్లాపూర్ డివిజన్ : టీఆర్ఎస్ 5, బీజేపీ 2 మాదాపూర్ డివిజన్ : బీజేపీ 2, టీఆర్ఎస్ 1 మియాపూర్ డివిజన్ : టీఆర్ఎస్ 1, కాంగ్రెస్ 1 హఫీజ్‌పేట డివిజన్ : బీజేపీ 4 చందానగర్ డివిజన్ : బీజేపీ 2, టీఆర్ఎస్ 1 మూసాపేట డివిజన్ : బీజేపీ 15, టీఆర్ఎస్ 8, టీడీపీ 1 బాలానగర్ డివిజన్ : టీఆర్ఎస్ 5, బీజేపీ 2 జగద్గిరిగుట్ట డివిజన్ : బీజేపీ 1, టీఆర్ఎస్ 1 కుత్బుల్లాపూర్ డివిజన్ : టీఆర్ఎస్ 20, బీజేపీ 14 మల్కాజ్గిరి డివిజన్ : బీజేపీ 5, టీఆర్ఎస్ 1 బీఎన్‌రెడ్డి డివిజన్ : టీఆర్ఎస్ 10, బీజేపీ గాంధీనగర్ డివిజన్ : బీజేపీ 7, టీఆర్ఎస్ 2, నోటా 1 భోలక్‌పూర్ డివిజన్ : బీజేపీ 2, టీఆర్ఎస్ 1 -
నేరేడ్మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపు నిలిపివేత
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల ఫలితాలలో ఏ పార్టీకి మెజార్టీ దక్కలేదు. మొత్తం 150 డివిజన్లకు గాను టీఆర్ఎస్ 55 డివిజన్లలో గెలుపొందగా, బీజేపీ 48 డివిజన్లను కైవసం చేసుకుంది. ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. రెండు స్థానాలతో సరిపెట్టుకుంది.106 చోట్ల పోటీ చేసిన టీడీపీకి.. ఒక్క స్థానంలో కూడా డిపాజిట్ దక్కలేదు. ఏ పార్టీ మేజిక్ ఫిగర్ సాధించకపోవడంతో హంగ్ పరిస్థితులు ఏర్పడ్డాయి. 56 స్థానాల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా, 48 స్థానాల్లో విజయం సాధించి బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. కాగా, స్వస్తిక్ గుర్తుపై నెలకొన్న వివాదం కారణంగా నేరెడ్మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపును నిలిపివేశారు. ఫలితం వాయిదా పడింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం లెక్కింపు నిలుపుదల చేశారు. రిటర్నింగ్ అధికారి.. ఎస్ఈసీకి నివేదిక పంపించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఫలితాలు.. కుత్బుల్లాపూర్ (8): టీఆర్ఎస్-7, బీజేపీ-1 పటాన్చెరు (3): టీఆర్ఎస్ - 3 శేరిలింగంపల్లి (10): టీఆర్ఎస్-9, బీజేపీ-1 జూబ్లీహిల్స్ (7): టీఆర్ఎస్ - 4, ఎంఐఎం - 2, బీజేపీ -1 ముషీరాబాద్ (6): బీజేపీ-5, ఎంఐఎం-1 అంబర్పేట్ (5): బీజేపీ-3, టీఆర్ఎస్-2 గోషామహల్ (6): బీజేపీ-5, ఎంఐఎం-1 చార్మినార్ (5): ఎంఐఎం-5 చాంద్రాయణగుట్ట (7): ఎంఐఎం-6, బీజేపీ-1 బహదూర్‌పురా (6): ఎంఐఎం-6 యాకుత్‌పురా (7): ఎంఐఎం-5, బీజేపీ-2 మలక్‌పేట్ (6): ఎంఐఎం-4, బీజేపీ-2 మహేశ్వరం (2): బీజేపీ-2 ఉప్పల్ (10): టీఆర్ఎస్-6, బీజేపీ-2, కాంగ్రెస్-2 ఎల్బీనగర్ (11): బీజేపీ-11 రాజేంద్రనగర్ (5): ఎంఐఎం-2, బీజేపీ-3 మైలార్ దేవుపల్లి డివిజన్లో బీజేపీ విజయం మైలార్ దేవుపల్లి డివిజన్లో బీజేపీ అభ్యర్థి తోకల శ్రీనివాస్‌రెడ్డి విజయం సాధించారు. సమీప అభ్యర్థి మాజీ కార్పొరేటర్ ఎమ్మెల్యే సోదరుడు ప్రేమ్‌దాస్ గౌడ్‌పై గెలుపొందారు. ఫలితం ఆశించినంతగా రాలేదు: కేటీఆర్ గ్రేటర్ ఫలితం తాము ఆశించిన ఫలితాలు రాలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నికల ఫలితాలపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ మరో 20 సీట్లు ఎక్కువ వస్తాయని ఆశించామని అన్నారు. 12 డివిజన్లలో స్వల్ప తేడాతో ఓటమి చెందామన్నారు. ఫలితాలపై నిరాశ చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మేయర్ పీఠంపై కూర్చునేందుకు రెండు నెలల సమయం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. మచ్చబొల్లారం డివిజన్లో వివాదం.. మచ్చబొల్లారం డివిజన్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. 36 ఓట్లతో తొలత టీఆర్ఎస్ గెలుపొందగా, రీ కౌంటింగ్ చేయాలంటూ బీజేపీ డిమాండ్ చేసింది. కౌంటింగ్ కేంద్రం ముందు బీజేపీ ఆందోళనకు దిగింది. బీఎన్‌రెడ్డి నగర్లో టీఆర్ఎస్కు షాక్.. బీఎన్‌రెడ్డి నగర్లో టీఆర్ఎస్కు షాక్ తగిలింది. డమ్మీ అభ్యర్థి కారణంగా టీఆర్ఎస్ పరాజయం పాలైంది. 32 ఓట్లు తేడాతో ఆ పార్టీ ఓడిపోయింది. టీఆర్ఎస్ డమ్మీ అభ్యర్థికి 39 ఓట్లు రాగా, 32 ఓట్లతో బీఎన్‌రెడ్డి నగర్ బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామా.. పీసీసీ అధ్యక్ష పదవికి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా. గ్రేటర్ ఎన్నికల్లో ఘోర పరాభవానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జంగమెట్లో హోరాహోరీ.. జంగమెట్లో ఉత్కంఠ నెలకొంది. పోటీ హోరాహోరి కొనసాగుతుంది. 603 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ కొనసాగుతుంది. గతంలో జంగమెట్ ఎంఐఎం సిట్టింగ్ సీటు కాగా, అక్బరుద్ధిన్ ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రాయణ గుట్ట అసెంబ్లీ పరిధిలోనిది. గోషామహల్లో ఆరు డివిజన్లు బీజేపీవే.. గోషామహల్ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లను బీజేపీ గెలుచుకుంది. బేగంబజార్ - శంకర్ యాదవ్, గోషామహల్ - లాల్ సింగ్, మంగళ్ హాట్ - శశి కళ, జాంబాగ్ - రాకేష్ జైస్వాల్, గన్ ఫౌండ్రి- డాక్టర్ సురేఖ ఓం ప్రకాష్‌లు విజయం సాధించారు. ప్రగతి భవన్‌కు సింధు ఆదర్శ్ రెడ్డి? గ్రేటర్ ఎన్నికల్లో 59 డివిజన్లలో విజయం సాధించిన టీఆర్ఎస్.. మేయర్ అభ్యర్థి ఎంపికపై దృష్టి పెట్టింది. 111 డివిజన్ భారత్ నగర్లో విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి సింధు ఆదర్శ్ రెడ్డి ప్రగతి భవన్‌కు రావాలని పిలుపు అందుకున్నట్లు సమాచారం. కాగా సింధు ఆదర్శ్ రెడ్డి.. మెదక్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి కోడలు. ఆల్విన్ కాలనీలో టీఆర్ఎస్ విజయం ఆల్విన్ కాలనీ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి దొడ్ల వెంకటేష్ గౌడ్ 1249 ఓట్లతో గెలుపొందారు, ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి ముద్దం నరసింహ యాదవ్ 7470 ఓట్లతో విజయం సాధించారు. అల్లాపూర్ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి సబిహా గౌసుద్దీన్ 10310 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆ డివిజన్లలో బీజేపీ విజయం.. హయత్‌నగర్, నాగోల్, మాన్సూరాబాద్ డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. హయత్ నగర్ డివిజన్లో కళ్లెం నవ జీవన్‌రెడ్డి, నాగోల్ డివిజన్లో చింతల అరుణ సురేందర్ యాదవ్, మాన్సూరాబాద్ డివిజన్లో కొప్పుల నర్సింహారెడ్డి గెలుపొందారు. మౌలాలి, మూసాపేట్ డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మౌలాలి డివిజన్లో సునీత యదవ్, మూసాపేట్ డివిజన్లో కోడిచర్ల మహేందర్ గెలుపొందారు. బీఎన్ రెడ్డి నగర్లో రీ కౌంటింగ్.. టీఆర్ఎస్ అభ్యర్థన మేరకు బీఎన్ రెడ్డి నగర్లో అధికారులు రీ కౌంటింగ్ జరుపుతున్నారు. 16 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. అయితే తమకు అనుమానం ఉందంటూ టీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ రీకౌంటింగ్ కోరింది. దాంతో అధికారులు మళ్లీ కౌంటింగ్ జరుపుతున్నారు. దూసుకుపోతున్న టీఆర్ఎస్.. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ దూసుకుపోతుంది. గోల్నాకా, మల్లాపూర్, ఫతేనగర్, సోమాజిగూడ, శేరిలింగంపల్లి టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. మల్లాపూర్‌లో పన్నాల దేవేందర్ రెడ్డి, ఫతేనగర్‌లో పండాల సతీష్ గౌడ్, సోమాజిగూడలో వనం సంగీత, శేరిలింగంపల్లిలో రాగం నాగేందర్ యాదవ్ గెలుపొందారు. గోల్నాకా డివిజన్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి దూసరి లావణ్య 2,716 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎంఐఎం, బీజేపీల మధ్య ఘర్షణ.. జంగంమెట్ డివిజన్ కౌంటింగ్‌లో ఎంఐఎం, బీజేపి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఉప్పుగుడా, జంగంమెట్‌లో బీజేపీ లీడ్‌ను జీర్ణించుకోలేకే దాడికి పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపిసున్నారు. దాడిలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయని, పోలీసుల ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులు మోహరించారు. అడిషనల్ సీపీ చౌహన్, ఎస్పీ కోటిరెడ్డి అరోరా కళాశాలకు చేరుకున్నారు. పోటాపోటీగా.. ఎంఐఎం-బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఐంఎం, బీజేపీ పోటా పోటీగా దూసుకు వెళుతున్నాయి. ఇప్పటివరకూ ఎంఐఎం 31 డివిజన్లలో గెలుపొంది, 10 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు కమల దళం కూడా 30 స్థానాలు కైవసం చేసుకుని 15 డివిజన్లలో ఆధిక్యంలో ఉంది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఆ డివిజన్లలో బీజేపీ గెలుపు.. కొత్తపేట, సరూర్‌నగర్, గడ్డి అన్నారం, వినాయక్‌నగర్, రామంతపూర్ డివిజన్లలో బీజేపీ విజయం సాధించింది. కొత్తపేటలో నాగకోటి పవన్‌కుమార్, సరూర్‌నగర్‌లో ఆకుల శ్రీవాణి అంజన్, గడ్డి అన్నారంలో బద్ధం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, వినాయక్‌నగర్‌లో రాజ్యలక్ష్మి, అమీర్‌పేటలో కేతినేని సరళ, రామంతపూర్‌లో బండారు శ్రీవాణి గెలుపొందారు. చిలుకానగర్ డివిజన్లో బీజేపీ అభ్యర్థి గోనె శైలజ 200 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఖైరతాబాద్, కూకట్‌పల్లిలో టీఆర్ఎస్ గెలుపు గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా కొనసాగుతుంది. ఖైరతాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయారెడ్డి విజయం సాధించారు. కూకట్‌పల్లిలో జూపల్లి సత్యనారాయణ గెలుపొందారు. హస్తినపురంలో బీజేపీ అభ్యర్థి సుజాత నాయక్ 680 ఓట్లతో గెలుపొందారు. కె.పి.హెచ్.పీ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి మందాడి శ్రీనివాసరావు 1540 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వనస్థలిపురంలో బీజేపీ గెలుపు.. వనస్థలిపురం డివిజన్లో బీజేపీ అభ్యర్థి రాగుల వెంకట్ రెడ్డి గెలుపొందారు. నాచారం డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి శాంతి సాయిజన్, జగద్గిరిగుట్ట డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి జగన్ విజయం సాధించారు. హబ్సిగూడలో బీజేపీ అభ్యర్థి కే. చేతన గెలుపొందారు. మేయర్ సతీమణి విజయం గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీదేవీ గెలుపొందారు. చర్లపల్లి డివిజన్ నుంచి టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన ఆమె విజయం సాధించారు. ఇక 8వ డివిజన్ హబ్సిగూడ నుంచి పోటీ చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి సతీమణి స్వప్నపై బిజెపి అభ్యర్థి చేతన గెలుపొందారు. కూకట్పల్లి జోన్లో ఇరవై డివిజన్లలో టీఆర్ఎస్ ఆధిక్యం కొనసాగుతుంది. 22 డివిజన్లకు 19 డివిజన్లలో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. కూకట్పల్లి జోన్లో మూడు చోట్ల బీజేపీ ఆధిక్యం కొనసాగుతుంది. సోమాజిగూడ,చందానగర్, నేరెడ్‌మెట్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం కొనసాగుతుంది. పటాన్చెరు, క్రాపాలో టీఆర్ఎస్ విజయం: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పటాన్చెరు, కాప్రా డివిజన్లలో టీఆర్ఎస్ విజయం సాధించింది. పటాన్చెరులో కుమార్ యాదవ్, కాప్రాలో స్వర్ణరాజ్ విజయం సాధించారు. ఏఎస్రావు నగర్, ఉప్పల్ ‘హస్త’గతం గ్రేటర్ ఎన్నికల్లో ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ రెండు డివిజన్లను గెలుచుకుంది. ఏఎస్ రావు నగర్, ఉప్పల్‌ను ‘హస్త’గతం చేసుకుంది. ఏఎస్ రావు నగర్లో సింగిరెడ్డి శిరీషా రెడ్డి, ఉప్పల్‌లో మందముల్లా రజిత విజయం సాధించారు. చింతల్లో టీఆర్ఎస్లో విజయం హోరా హోరీగా సాగుతున్న ఎన్నికల కౌంటింగ్‌లో టీఆర్ఎస్ దూసుకుపోతుంది. చింతల్ డివిజన్లో ఆ పార్టీ విజయం సాధించింది. టీఆర్ఎస్ ఆభ్యర్థి రషీదా బేగం గెలుపొందారు. అమీర్‌పేట్‌లో 960 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ కొనసాగుతుంది. మాదాపూర్‌లో 4,999 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్, మియాపూర్‌లో 1935 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ కొనసాగుతుంది. రాజేంద్రనగర్‌లో 1614 ఓట్లతో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. గచ్చిబౌలిలో 1000 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ కొనసాగుతుంది. మల్లాపూర్‌లో 1,841 ఓట్లు, బాలాజీనగర్‌లో 7,501 ఓట్లతో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతుంది. సనత్ నగర్లో కారు విజయం సనత్ నగర్ డివిజన్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొలను లక్ష్మి రెడ్డి దాదాపు 2429 ఓట్ల మెజారిటీ విజయం సాధించారు. దత్తాత్రేయ నగర్లో ఎంఐఎం గెలుపు పాతబస్తీలో ఎంఐఎం పార్టీ తన హవా కొనసాగిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థి జాకిర్ బక్రీ గెలుపు దత్తాత్రేయ నగర్ డివిజన్లో విజయం సాధించారు. భారతినగర్‌లో టీఆర్ఎస్ గెలుపు సంగారెడ్డి జిల్లా భారతినగర్ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి సింధు ఆదర్శ్ రెడ్డి సుమారు 3900 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కుత్బుల్లాపూర్‌లో టీఆర్ఎస్ విజయం టీఆర్ఎస్ పార్టీ పలు డివిజన్లలో ఆధిక్యం కొనసాగిస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థి పారిజాతం సుమారు 2025 ఓట్లతో మెజారిటీతో గెలుపొందారు. రంగారెడ్డి నగర్లో టీఆర్ఎస్ గెలుపు టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కొనసాగుతోంది. రంగారెడ్డి నగర్ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయ్‌శేఖర్ గౌడ్ విజయం సాధించారు. కూకట్పల్లి సర్కిల్లో అధికార టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ చేసింది. కూకట్పల్లి పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి, బాలానగర్, కూకట్పల్లి.. వివేకానందనగర్ కాలనీ, హైదర్‌నగర్, అల్విన్ కాలనీలో కారుపార్టీ పూర్తి ఆధిక్యంలో కొనసాగుతోంది. బాలానగర్‌లో టీఆర్ఎస్ గెలుపు బాలానగర్ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. టీఆర్ఎస్ అభ్యర్ధి ఆవుల రవీందర్‌రెడ్డి విజయం సాధించారు. చైతన్యపురిలో బీజేపీ విజయం పలు డివిజన్లలో ఆధిక్యంలో ఉన్న బీజేపీ చైతన్యపురిలో గెలుపొందింది. బీజేపీ అభ్యర్థి నర్సింహ గుప్తా విజయం సాధించారు. నవాబ్ సాహెబ్ కుంటలో ఎంఐఎం విజయం ఎంఐఎం మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. నవాబ్ సాహెబ్ కుంట డివిజన్లో ఎంఐఎం అభ్యర్థి షిరీన్ ఖాతూన్ గెలుపొందారు. ఇప్పటి వరకు ఏడు డివిజన్లలో విజయం సాధించింది. రియాసత్‌నగర్‌లో ఎంఐఎసం విజయం: ఎంఐఎం పార్టీ రియాసత్ నగర్ డివిజన్లో గెలుపొందింది. ఆ పార్టీ అభ్యర్థి ముస్తఫా బేగ్ విజయం సాధించారు. బార్కాస్‌లో ఎంఐఎం గెలుపు ఎంఐఎం గెలుపు పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు డివిజన్లలో ఎంఐఎం గెలుపొంది. బార్కాస్‌లో ఎంఐఎం విజయం సాధిందిచి మరో డివిజన్‌ను తన ఖాతాలో వేసుకుంది. బార్కాస్‌లో ఎంఐఎం అభ్యర్థి షబానా బేగం విజయం సాధించారు. ఆర్సీపురంలో టీఆర్ఎస్ విజయం టీఆర్ఎస్ జోరు కొనసాగుతోంది. పలు డివిజన్లలో టీఆర్ఎస్ ఆధిక్యంతో ముందంజలో ఉంది. ఆర్సీపురంలో టీఆర్ఎస్ అభ్యర్థి పుష్ప నగేష్‌యాదవ్ గెలుపొందారు. దీంతో టీఆర్ఎస్ ఖాతాలో నాలుగు డివిజన్లు చేరాయి. పుష్ప నగేష్ యాదవ్ సుమారు 5759 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బోరబండలో టీఆర్ఎస్ విజయం బోరబండలో టీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ విజయం సాధించారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. బీజేపీ తొలి గెలుపు.. పలు డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగిస్తున్న బీజేపీ బోణి కొట్టింది. మంగళ్‌హాట్ డివిజన్లో బీజేపీ అభ్యర్థి శశికళ గెలుపొందారు. పులు డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తోంది. హైదర్‌నగర్‌లో టీఆర్ఎస్ గెలుపు నువ్వా నేనా అనే తరహాలో కొనసాగుతన్న ఎన్నికల కౌంటింగ్‌లో టీఆర్ఎస్ మరో విజయం సాధించింది. హైదర్‌నగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి నార్నె శ్రీనివాసరావు విజయం సాధించారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ ఖాతాలో మూడు డివిజన్లు చేరాయి. అహ్మద్‌నగర్‌లో ఎంఐఎం విజయం జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో ఎంఐఎం తన హవా కోనసాగిస్తోంది. ఇప్పటికే మూడు డివిజన్లలో విజయం సాధించిన ఎంఐఎం మరో గెలుపును తన ఖాతాలో వేసుకుంది. అహ్మద్‌నగర్‌లో ఎంఐఎం అభ్యర్థి రఫత్ సుల్తానా గెలుపొందారు. దీంతో ఇప్పటి వరకు ఎంఐఎం నాలుగు డివిజన్లను గెలుచుకొని ముందంజలో ఉంది. చాంద్రాయణగుట్టలో 10వేల ఓట్ల ఆధిక్యంలో ఎంఐఎం కొనసాగుతోంది. టీఆర్ఎస్-బీజేపీ మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. పలు డివిజన్లలో నువ్వా నేనా అనే తరహాలో ఆధిక్యం కొనసాగుతోంది. ఇప్పటికే మూడు డివిజన్లలో గెలుపు సొంతం చేసుకున్న మజ్లీస్ సైతం మరోసారి తన పట్టునిలుపుకుంటోంది. కిషన్‌బాగ్‌లో ఎంఐఎం అభ్యర్థి విజయం హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల ఫలితాల్లో కిషన్‌బాగ్‌లో ఎంఐఎం విజయ సాధించింది. దీంతో ఎంఐఎం చెందిన మూడో గెలుపొందారు. ఈ డివిజన్లో ఎంఐఎం అభ్యర్థి హుస్సేనీ పాషా విజయం సాధించారు. డబీర్‌పురాలో ఎంఐఎం అభ్యర్థి గెలుపు డబీర్‌పురా డివిజన్లో ఎంఐఎం రెండో విజయం నమోదు చేసుకుంది. ఈ డివిజన్లో ఎంఐఎం అభ్యర్థి అలందార్ హుస్సేన్ గెలుపొందారు. బార్కస్‌లో ఘర్షణ: బార్కస్‌లో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మరోవైపు బీజేపీ, ఎంఐఎం అభ్యర్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఖాతాలో ఏఎస్ రావు నగర్ కాంగ్రెస్ పార్టీ బోణి కొట్టి ఏఎస్ రావు నగర్ డివిజన్లో విజయం సాధించింది. ఏఎస్ రావు నగర్లో కాంగ్రెస్ అభ్యర్థి శిరీషారెడ్డి గెలుపొందారు. యూసఫ్‌గూడలో టీఆర్ఎస్ గెలుపు ఉత్కంఠ రేపుతున్న జీహెచ్ఎంసీ కౌంటింగ్‌లో టీఆర్ఎస్ పార్టీ పలు డివిజన్లలో తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తోంది. తాజాగా యూసఫ్‌గూడలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్‌కుమార్ పటేల్ విజయం సాధించారు. మెట్టుగూడలో టీఆర్ఎస్ గెలుపు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో టీఆర్ఎస్ పార్టీ పలు డివిజన్లలో ఆధిక్యంలో దూసుకుపోతుంది. మెట్టుగూడ డివిజన్లో టీఆర్ఎస్ తొలి విజయం నమోదు చేసుకుంది. మెట్టుగూడలో టీఆర్ఎస్ అభ్యర్థి రాసూరి సునీత విజయం సాధించారు. మెహిదిపట్నంలో ఎంఐఎం విజయం జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌లో తొలి ఫలితం ఎంఐఎం ఖాతాలో చేరింది. మెహిదిపట్నం డివిజన్లో ఎంఐఎం మొదటి విజయం నమోదు చేసుకుంది. ఇక్కడ పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావటంతో తొలి రౌండ్లోనే ఫలితం తేలింది. మెహదీపట్నంలో ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్ గెలుపొందారు. తొలి రౌండ్లో టీఆర్ఎస్ ఆధిక్యం తొలి రౌండ్ ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ ఆధిక్యం దిశగా సాగుతోంది. ఇప్పటి వరకు 31 డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. బీజేపీ 15, ఎంఐఎం 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆర్సీపురం, పఠాన్‌చెరు, భారతీనగర్, చందానగర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, ఓల్డ్ బోయిన్పల్లి, బాలానగర్, హఫీజ్‌పేట్, హైదర్‌నగర్, చర్లపల్లి, కాప్రా, మీర్పేట్ హెచ్‌బీకాలనీ, రంగారెడ్డి, శేరిలింగంపల్లి, గాజులరామారం డివిజన్లలో టీఆర్ఎస్ ఆధిక్యం దిశగా సాగుతోంది. ఇక బీజేపీ హయత్‌నగర్, ఆర్సీపురం, భారతీనగర్, గోషామహల్, బేగంబజార్, హయత్‌నగర్, ఆర్సీపురం, భారతీనగర్ డివిజన్లలో ఆధిక్యం కొనసాగుతోంది. ఏఎస్ రావు నగర్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఉత్తర్వులపై స్పందించిన ఎలక్షన్ కమిషన్ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై ఎలక్షన్ కమిషన్ లంచ్ మోషన్ దాఖలు చేయనుంది. ఎలక్షన్ కమిషన్ వ్యవహారంలో కోర్టులు జోక్యం చేసుకోరాదని పేర్కొంది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పునఃపరిశీలించాలని, రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తే స్వీకరించాలని విజ్ఞప్తి చేయనుంది. బీజేపీ ఆధిక్యం ఓట్ల లెక్కింపులో భాగంగా మొత్తం 1926 పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి అయింది. అందులో పార్టీల వారిగా.. బీజేపీ 92, టీఆర్ఎస్ 33, కాంగ్రెస్ 4, ఎంఐఎం 15 డివిజన్లలో ఆధిక్యం సాధించాయి. బీజేపీ అభ్యంతరం జాంబాగ్ డివిజన్ ఓట్ల లెక్కింపుపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ డివిజన్లోని బూత్ నంబర్ 8లో పోలైన ఓట్లు 471 కాగా, బ్యాలెట్ బాక్సులో 257 ఓట్లు మాత్రమే ఉన్నాయని ఆరోపిస్తోంది. తొలి రౌండ్ ఫలితాలపై ఉత్కంఠ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బీజేపీ ఆధిక్యం సాధించగా, టీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది. దీంతో తొలి రౌండ్ ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పార్టీల వారిగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు.. బీజేపీ 87, టీఆర్ఎస్ 30, ఎంఐఎం 16, కాంగ్రెస్ 2 ఓట్లు వచ్చాయి. మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు: 1926 కాగా, అందులో దాదాపు 40 శాతం చెల్లని ఓట్లు ఉన్నాయి. ఉత్తర్వులను తోసిపుచ్చిన హైకోర్టు ఎన్నికల కౌటింగ్ జరుగుతున్న క్రమంలో ఎస్ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. స్వస్తిక్ గుర్తు ఉన్న ఓటును మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో స్వస్తిక్ గుర్తును మాత్రమే పరిగణనలోకి తీసుకోవలని ఎన్నికల సంఘానికి హైకోర్టు అదేశం జారీ చేసింది. బీజేపీ నేతల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. స్వస్తిక్ గుర్తు ఉన్న బ్యాలెట్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. గెలుపు, ఓటముల దగ్గర మార్కింగ్ ఓట్లు ఉంటే.. హైకోర్టు ఉత్తర్వులకు లోబడి తుది ఫలితాలు విడుదల చేయాలని ఆదేశించింది. వెంటనే అన్ని కౌంటింగ్ కేంద్రాలకు సమాచారం అందించాలని ఎన్నికల కమిషన్‌ను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ ధాఖలు చేయాలని తదుపరి విచారణను సోమవారంకు హైకోర్టు వాయిదా వేసింది. పెన్నుతో టిక్‌పెట్టినా ఓటేసినట్లేనని ఎస్ఈసీ సర్క్యులర్ జారీ చేసింది. ఆ వెంటనే ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీజేపీ శ్రేణులు హైకోర్టులో హౌజ్‌మోషన్ పిటిషన్‌ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. బీజేపీ, టీఆర్ఎస్ ఏజెంట్ల మధ్య ఘర్షణ హయత్‌నగర్ కౌంటింగ్ సెంటర్ వద్ద గందరగోళం చోటు చేసుకుంది. బీజేపీ, టీఆర్ఎస్ ఏజెంట్ల మధ్య ఘర్షణ జరిగింది. ఇప్పటికే బీజేపీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఆధిక్యం ప్రదర్శించగా, టీఆర్ఎస్ రెండో స్థానంలో ఉంది. బీజేపీకి పోస్టల్ బ్యాలెట్లో ఆధిక్యం పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీకి ఆధిక్యం ఉంది. మెజార్టీ డివిజన్లలో బీజేపీకే పోస్టల్ బ్యాలెట్లు దక్కాయి. పోస్టల్ బ్యాలెట్లలో రెండో స్థానంలో టీఆర్ఎస్ కొనసాగుతోంది. లెక్కింపు ప్రారంభం ఉత్కంఠ నడుమ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తున్నారు. తర్వాత బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తారు. ఒక్కో రౌండ్‌కు గంట నుంచి గంటన్నర సమయం పట్టే అవకాశముంది. పెన్నుతో టిక్ పెట్టినా ఓటేసినట్లేనని ఎస్ఈసీ సర్క్యూలర్ జారీ చేయడంతో ఉత్కంఠ నెలకొంది. ఈసీ సర్క్యులర్‌పై హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ ఈసీ సర్క్యులర్‌పై హైకోర్టులో బీజేపీ హౌజ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో ఉత్కంఠ నెలకొంది. పెన్నుతో టిక్ పెట్టినా ఓటేసినట్లేనని ఎస్ఈసీ సర్క్యూలర్ జారీ చేయడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈసీ సర్క్యులర్‌ను అమలు చేస్తారా, లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు కోసం 30 కౌంటింగ్ కేంద్రాల్లో 166 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో డివిజన్‌కు 14 టేబుళ్లతో కూడిన కౌంటింగ్ హాల్ ఉంటుంది. 16 డివిజన్లకు రెండు కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. రౌండ్‌కు 14 వేల ఓట్లు లెక్కిస్తారు. తొలి రెండు రౌండ్లలోనే 136 డివిజన్ల ఫలితాలు వచ్చే అవకాశముంది. మూడోరౌండ్ తర్వాత 13 డివిజన్ల ఫలితాలు రానున్నాయి. రెడీ.. కౌంట్.. అనివార్య కారణాల నేపథ్యంలో రీ– పోలింగ్ జరిగిన ఓల్డ్ మలక్‌పేట సహా జీహెచ్ఎంసీలో ఉన్న 150 డివిజన్ల లెక్కింపు మూడు కమిషనరేట్ల పరిధిలో ఉన్న 30 కేంద్రాల్లో జరగనుంది. ఆయా ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక ప్రాంతాలను సైతం కేటాయించారు. -
కౌంటింగ్‌పై ఉత్కంఠ: హౌజ్‌మోషన్ పిటిషన్ దాఖలు
సాక్షి, హైదరాబాద్: మరికాసేపట్లో జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో.. పెన్నుతో టిక్‌పెట్టినా ఓటేసినట్లేనని ఎస్ఈసీ సర్క్యులర్ జారీ చేసింది. ఆ వెంటనే ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీజేపీ శ్రేణులు హైకోర్టులో హౌజ్‌మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశాయి. మరికాసేపట్లో దీనిపై వాదనలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఒట్ల లెక్కింపుపై ఉత్కంఠ నెలకొంది. -
ఫలితాలు: ఆర్వోలదే తుది నిర్ణయం
సాక్షి,హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియలో రిటర్నింగ్ అధికారులదే (ఆర్వోలు) తుది నిర్ణయమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి పేర్కొన్నారు. అందరినీ సమన్వయం చేసుకుని, బాధ్యతాయుతంగా ఈ పని పూర్తి చేయాలని సూచించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి పూర్తి అధికారం రిటర్నింగ్ అధికారులదేనని పేర్కొన్నారు. కోవిడ్–19 నిబంధనలు తప్పక పాటించాలని, కౌంటింగ్ సిబ్బంది మాస్క్, ఫేస్ షీల్డ్ తప్పకుండా ధరించాలని ఆదేశించారు. గురువారం జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి/ కమిషనర్, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఆర్వోలతో కౌంటింగ్ ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫలితాలను పరిశీలకుల ఆమోదం తర్వాతే రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం వీడియోగ్రఫీ ద్వారా చిత్రీకరించి, పారదర్శకంగా నిర్వహిం చాలని, స్ట్రాంగ్ రూంను అభ్యర్థి లేదా వారి ఏజెంట్ సమక్షంలో ఉదయం 7.45 గంటలకు తెరవాలని చెప్పారు. సందేహాత్మక బ్యాలెట్ పేపర్లపై రిట ర్నింగ్ అధికారులదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా కౌంటింగ్ నిర్వహించాలని, ప్రతి రౌండు తర్వాత ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ ఏజెంట్ల సంతృప్తి మేరకు వారి సంతకాలు తీసుకోవాలని చెప్పారు. మొబైల్ ఫోన్లు కౌంటింగ్ సెంటర్‌లోనికి అనుమతించరాదని పేర్కొన్నారు. హాల్ చిన్నగా ఉన్న 16 వార్డులలో 7 టేబుళ్ల చొప్పున రెండు కౌంటింగ్ హాల్స్‌కు అనుమతిస్తూ ఆర్వోలు, అదనపు ఆర్వోలను కేటాయించినట్లు ఆయన తెలిపారు. మొత్తం కౌంటింగ్ సిబ్బంది 8,152, ఒక్కో రౌండ్‌కు 14,000 ఓట్ల లెక్కింపు పూర్తవుతుందన్నారు. 74,67,256 మంది ఓటర్లకుగాను 34,50,331 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని, 1,926 పోస్టల్ బ్యాలెట్స్ జారీ చేశారన్నారు. -
భాగ్యమెవరికో?
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో పోలైన ఓట్లను శుక్రవారం లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు. ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ప్రకటించింది. శుక్రవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు నిర్వహించినందున ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడికి కొంత ఎక్కువ సమయం పట్టనుంది. తక్కువ ఓట్లు పోలైన మెహిదీపట్నం డివిజన్లో (ఒక్క రౌండ్లోనే) మధ్యాహ్నం 12 గంటలకు తొలి ఫలితం వెల్లడి కానుంది. అధిక ఓట్లు పోలైన మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ ఫలితాలు చివరగా వచ్చే అవకాశాలున్నాయి. ఓట్ల ఆధిక్యతల రూపంలో మధ్యాహ్నం ఒంటి గంటకల్లా ఫలితాల సరళిపై స్పష్టత రానుంది. సాయంత్రం 4 గంటల వరకు అన్ని డివిజన్ల ఫలితాలు వెలువడతాయని ఎస్ఈసీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 1న జరిగిన జీహెచ్ఎంíసీ ఎన్నికల్లో 46.55 శాతం పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే. మొత్తం 74,67,256 ఓటర్లకు గాను 34,50 331 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపు ఇలా.. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. జీహెచ్ఎంసీ పరిధిలో 30 ప్రాంతాల్లో కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఒక్కో డివిజన్‌కు ఒక్కో కౌంటింగ్ హాల్.. ప్రతి హాల్లో 14 టేబుల్స్ ఉంటాయి. కౌటింగ్ హాళ్ల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పెట్టెల్లోని ఓట్ల కంటే ముందు పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఒక్కో రౌండ్లో 14 వేల చొప్పున ఓట్లు లెక్కిస్తారు. పోలైన ఓట్ల సంఖ్యను బట్టి రౌండ్ల సంఖ్య పెరగనుంది. బ్యాలెట్ బాక్స్‌లు తీసుకెళ్లే సిబ్బంది, బ్యాలెట్ పేపర్లను మిక్స్ చేసే వ్యక్తులకు పీపీఈ కిట్స్ అందించాలని ఎస్ఈసీ సూచించింది. కౌంటింగ్ ఎలా? ► మొదటి విడతలో లెక్కింపు పోలింగ్ స్టేషన్ వారీగా జరుగుతుంది. ఇందులో బ్యాలెట్ పేపర్ల మడతలు విప్పకుండానే 25 ఓట్ల చొప్పున కట్టలుగా చేసి రబ్బర్ బ్యాండు వేసి, బ్యాలెట్ పేపర్ అకౌంట్‌తో సరిచూసి కట్టలను రిటర్నింగ్ అధికారి వద్ద గల డ్రమ్ములో వేస్తారు. ► రెండో విడతలో బ్యాలెట్ బండిళ్లు ఉన్న డ్రమ్ములోని బండిళ్లను జాగ్రత్తగా కలిపి ఆ హాలులో ఉన్న అన్ని కౌంటింగ్ టేబుళ్ల వద్దకు డ్రమ్ములో నుంచి 40 బండిళ్లను (వెయ్యి బ్యాలెట్ పేపర్లను) లెక్కింపు కోసం ఇస్తారు. ఎన్నికల విధుల్లో మైనర్‌ను నియమించలేదు.. పదిహేడేళ్ల బాలుడిని ఎన్నికల విధుల్లో నియమించినట్లు సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని ఎస్ఈసీ స్పష్టం చేసింది. ఆ అబ్బాయిని వెబ్ క్యాస్టింగ్ నిర్వహణకు పోలింగ్ కేంద్రంలో నియమించినట్లు తెలిపింది. వెబ్ క్యాస్టింగ్ కోసం కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న విద్యార్థులను మాత్రమే నియమించామని, వీరికి వయసుతో సంబంధం లేదని పేర్కొంది. మధ్యాహ్నం భోజనం చేయడానికి మాత్రమే ఆ కుర్రాడు ఇతర పోలింగ్ సిబ్బందితో ఉన్నాడని, అతడికి ఎన్నికల విధులు కేటాయించినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. ఆ రెండు డివిజన్లలోనూ.. ఘాన్సీబజార్ డివిజన్(49), పురానాపూల్ డివిజన్ (52)లలో యథావిధిగా ఓట్ల లెక్కింపు కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. ఈ రెండు డివిజన్లలో అవసరం ఉంటే కొన్ని ప్రాంతాల్లో రీపోలింగ్ నిర్వహించాలని గురువారం రాష్ట్ర హైకోర్టును బీజేపీ ఆశ్రయించింది. బీజేపీ చేసిన విజ్ఞప్తిని పరిశీలించాలని హైకోర్టు పేర్కొన్న నేపథ్యంలో ఆయా పోలింగ్‌బూత్‌లలో రీపోలింగ్‌పై వెంటనే ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఆ పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు. దీనిపై జీహెచ్ఎంసీ కమిషనర్, జోనల్, రిటర్నింగ్, పోలింగ్ అధికారుల నుంచి నివేదిక ఎస్ఈసీ తెప్పించుకుంది. ఈ డివిజన్లలో పెద్దగా గొడవలు జరగలేదని, బీజేపీ నేతల ఫిర్యాదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో రీపోలింగ్‌కు ఆదేశించే పరిస్థితులు లేవనే అభిప్రాయంతో ఎస్ఈసీ వర్గాలున్నాయి. -
అయినను... వేసి రావలెను...
‘ఓటింగ్ పట్ల ఓటరు నిరాసక్తత, విముఖత ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం’ అన్నది అక్షరసత్యం. ఆదర్శవంతమైన ఆలోచనల పరంగానే కాకుండా శాస్త్రీయంగానూ ఇది రుజువైన అంశం. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో ఓటింగ్ శాతం దయనీయంగా, సగం కన్నా తక్కువ నమోద వడం పట్ల రాజకీయ, సామాజిక వర్గాల్లో ఆందోళన వ్యక్తమౌతోంది. నిపుణులు, మేధా వులు పలురకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రసార మాధ్యమాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కొందరైతే ఆవేదనను మించిన ఆవేశంతో స్పందిస్తున్నారు. ఓటేయని వారి హక్కును రద్దు చేయా లనో, ఆధార్‌కార్డు వెనక్కి తీసుకోవాలనో, ప్రభుత్వ సంక్షేమ ప్రయోజ నాలు వారికిక నిలిపివేయాలనో... తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఓటరు నిర్లిప్తత, గైర్హాజరీని మరికొందరు సమర్థిస్తున్నారు. రాజకీయ వ్యవ స్థను సరిదిద్దుకోండి తప్ప ఓటరును ఏమీ అనొద్దని వారి తరపున వకాల్తా పుచ్చుకు మాట్లాడుతున్నారు. ఇక, సామాజిక మాధ్యమ వేది కలపై ఈ ఇరుపక్షాల వాదనలకు, ఖండనమండనలకు, తిట్లపురాణా నికి అంతే లేదు. గ్రామీణ ప్రాంతాలతో పోల్చి చూసినా పట్టణ, నగర ప్రాంతాల్లో ఎందుకు ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతోంది? అన్నది కాస్త లోతుగా పరిశీలించాల్సిన అంశం. ఈసారి హైదరా బాద్‌లో 47 శాతం మంది ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఏ ప్రమాణాలతో చూసినా ఇది ఆరోగ్యకరమైన పరిస్థితి కాదు. గడచిన ఇరవయ్యేళ్లలో హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల్ని పరిశీలిస్తే, కొంచెం కుడి ఎడమగా ఎప్పుడైనా ఇదే పరిస్థితి! ఎందుకిలా జరుగుతోంది? కారణాలేంటి? ఓటింగ్ శాతం తక్కువ నమోదు కావడానికి దారితీస్తున్న కారణాల్ని గుర్తించి, తగు రీతిలో విశ్లేషించి, విరుగుడు మార్గాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓటర్లందరూ క్రియాశీలంగా పోలింగ్ ప్రక్రియలో పాల్గొని, తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడవలసిన బాధ్యత ఎన్నికల సంఘం, ప్రభుత్వాలు, పౌరసమాజంపైన ఉన్నాయి. ఇందుకోసం నిర్దిష్ట చర్యలు తీసుకోవాలి. కార్యాచరణ ఉండాలని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. లేకుంటే, ప్రజాస్వామ్యం మరింత అపహాస్యం పాల వుతుంది. మనది ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం, భాగస్వామ్య ప్రజా స్వామ్యం అన్న మాటలు అర్థం లేకుండా పోతాయి. నిర్ణయాధి కారంలో ప్రజల పాత్ర–ప్రమేయం దారుణంగా పడిపోతుంది. భంగ పోయేది ప్రజలే! మలి విడత సంస్కరణలు రావాల్సిందే! పట్టణ, నగర ఓటరు నిర్లిప్తత కొత్తది కాదు. స్వాతంత్య్రానంతర కాలంలో ఈ దురవస్థ ముదురుతూ వస్తోంది. ఎవరూ సరిగా పట్టిం చుకోవడం లేదు. హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల్లోనే వరు సగా 2002 (41.22 శాతం), 2009 (42.95 శాతం), 2016 (45.27 శాతం), 2020 (46.55 శాతం) యాభైకన్నా తక్కువ శాతం ఓటింగ్ నమోదవుతూ వస్తోంది. జాగ్రత్తగా గమనిస్తే, ఎక్కువ చదువుకున్న వాళ్లు, ఐటీ తదితర రంగాల ఉద్యోగులు, ఆర్థిక స్థితిమంతులున్న ప్రాంతాల్లోనే ఓటింగ్ శాతం తగ్గిపోతోంది. ఈసారి కూడా పేదలు, పెద్దగా విద్యార్హతలు లేని వాళ్లు నివసించే బస్తీల్లో ఎక్కువ శాతం పోలింగ్ జరిగింది. ఇది అఖిల భారత స్థాయి కొన్ని అధ్యయనాల్లో తేలినదానికి భిన్నం. పేదలు, అణచివేతకు గురైన వారే తక్కువగా ఓటింగ్‌లో పాల్గొంటారని ‘ఎస్బీఐ–ఎకోరాప్’ దేశవ్యాప్త అధ్యయనం చెబుతోంది. పేదలు ఎక్కువగా ఉన్న బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్య ప్రదేశ్, జార్ఖండ్ వంటి ఉత్తరాధి రాష్ట్రాల్లో ఓటింగ్ శాతం తక్కువ నమోదును ఈ నివేదిక ఉటంకించింది. అణచివేత తక్కువగా ఉండే హరియాణా, పంజాబ్‌లతోపాటు పౌర చైతన్యం గల దక్షిణాది కేరళ, తమిళనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, గోవా వంటి రాష్ట్రాల్లో పోలింగ్ శాతం ఎక్కువ ఉండటాన్ని ఈ నివేదిక ఎత్తిచూపింది. కానీ, నగరాల్లో, ముఖ్యంగా హైదరాబాద్‌లో, అదీ నగరపాలక సంస్థ ఎన్నికల్లో ప్రతిసారీ ఓటింగ్ శాతం తక్కువ నమోదవడం ఇందుకు భిన్నమైన పరిస్థితి. మెరుగైన ఆర్థిక స్థితిగతులకు, విద్యార్హతలకు ఓటింగ్ పట్ల అనురక్తి–బాధ్యతకు సంబంధమే లేదని, వారిలోనే అత్యధికులు గైర్హా జరవుతున్నారని ఇక్కడి గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వాలు, పాలక సంస్థ వైఫల్యాలను అంగీకరిస్తూనే, ఒకరకంగా ఇది వారి బాధ్యతారాహిత్యమని సామాజికవేత్తలంటున్నారు. తొలివిడత ఎన్ని కల సంస్కరణల్ని సమర్థంగా అమలుపరచిన టీ.ఎన్.శేషన్ వంటి అధికారులే ఇవి సరిపోవని, ఇంకో విడత సంస్కరణలు అవసరమని నొక్కి చెప్పారు. ఓటరును చైతన్యపరచి, ఓటింగ్ ప్రక్రియలో విధిగా పాల్గొనేట్టు వ్యవస్థల్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని నిపుణులు నొక్కి చెబుతున్నారు. అత్యధికులు ఓట్లు వేయలేదని నిందించడం కాకుండా, వారిని ఓటింగ్‌కు రప్పించలేని మన వ్యవస్థల దురవస్థను మార్చుకోవాలనేది సూచన. ఏం విశ్వాసం కల్గిస్తున్నారని? పోలింగ్‌కు 53 శాతానికి పైగా గైర్హాజరయ్యారని ఓటరును తప్పు బట్టేటప్పుడు ఏయే అంశాలు అందుకు కారణమై ఉంటాయో ఆలో చించాలి. హైదరాబాద్ ఓటరు ఓటింగ్ పట్ల నిర్లిప్తంగా ఉండటానికి చాలా కారణాలే ఉన్నాయి. ఓటరు నమోదు, పేర్ల సవరణ, జాబితా ఖరారు... వంటి ప్రక్రియ సజావుగా జరగట్లేదు. అంతా అయి పోయాక, ‘అవును పొరపాట్లు జరిగాయి, నిజమే!.. ఇక ముందు జర క్కుండా సరిదిద్దుకుంటాం’ అని ఎన్నికల సంఘం ప్రకటిస్తే సరి పోతుందా? ఇటీవల ఒక టీవీ చర్చలో పొల్గొన్న పాలసీనిపుణుడు దొంతి నర్సింహారెడ్డి లేవనెత్తిన మూడంశాలు నాటి చర్చ సరళినే మార్చాయి. 1. సెలబ్రిటీలతో సహా, తమ ఓట్లు గల్లంతయ్యాయని ముందుగా చెప్పినా సవరించే వ్యవస్థ లేని ఎన్నికల ప్రక్రియపైనే ఓటర్లు విశ్వాసం కోల్పోతున్నారు. 2. ఒకవంక కరోనా మహమ్మారి భయపెడుతుంటే మరోవంక వరద బీభత్సం నుంచి నగరవాసులింకా కోలుకోని ఈ సమయంలో తగిన వ్యవధి ఇవ్వ కుండా ఎన్నికల నిర్వహణ సరైంది కాదు. 3. నగర సమస్యలు, అభివృద్ధి వంటి అంశాల్ని పక్కకునెట్టి ఇతరేతర విషయాల్ని ప్రచారంలోకి తెచ్చిన రాజకీయ పార్టీలు, అభ్యర్థులు భవిష్యత్ పాలనపై ఏమాత్రం భరోసా ఇవ్వలేకపోవడం. ఫలితంగా, మొత్తం ఎన్నికల ప్రక్రియను ఒక తంతులా నిర్వహించారనే భావన నగర వాసుల్లో బలపడింది. గతంలో కనీసం ఓ ముసుగైనా ఉండేది, ఈ సారి ముసుగుకూడా లేకుండా, పచ్చిగా మతాన్ని ప్రచారాస్త్రం చేసినా ఎన్నికల సంఘం కిమ్మనలేదు. ఇవే ఓటరు నిరాసక్తతకు ప్రధాన కారణాలనే అభి ప్రాయం సర్వత్రా ఉంది. ఓటరు జాబితాల్లో పలు అవాంఛనీయ మార్పులు జరిగాయి. ఒకచోట భర్త ఓటుండి భార్యది గల్లంతు, మరో చోట భార్యది ఉండి భర్త ఓటు గాయబ్! ఒకోచోట గంపగుత్తగా ఓట్లు లేకపోవడం... ఇదీ జరిగింది. పోల్ చిట్టీల పంపిణీ సవ్యంగా జరుగ లేదు. ఓటర్ని చైతన్యపరిచే ప్రచారం కూడా అంతంతే! పోలింగ్ శాతం తగ్గడానికి ఇవన్నీ కారణమయ్యాయి. మాదేనా....! ఎవరి నగరమిది? ‘ఉద్యోగ, ఉపాధి, వ్యాపార తదితర కారణాలవల్ల ఇక్కడ ఉంటున్నాం తప్ప ఈ నగరం మనది కాదు, మనమీ నగరానికి చెందిన వారం కాదు’ అన్న భావనే అధికుల్లో ఉంటోంది. ఎంతసేపూ సొంతూరిపైనే ధ్యాస! ముఖ్యంగా రాజకీయ పరమైన ఎన్నికలు వంటి ప్రక్రియలో క్రియాశీలంగా పాల్గొనకపోవడానికి ఇదొక ముఖ్య కారణమని నిపుణుల విశ్లేషణ. అందుకే, లక్షలాది మందికి ఇక్కడే కాకుండా వారి స్వస్థలాలలోనూ ఓటుంటుంది. అక్కడ ఓటేస్తే చాలను కుంటారు. రెండు చోట్ల ఉండటం చట్టరీత్యా తప్పన్నపుడు, కొందరు నగరంలో తమ ఓటును రద్దు చేసుకున్నారు. ఇక్కడ ఓటున్నా వేయడానికి ఆసక్తి చూపరు. ‘ఈ నగరం మాది’ అని అందరిలో సొంతం చేసుకునే భావన తెచ్చే ఏ సాంస్కృతిక, సామాజిక కార్య క్రమాలూ ఇక్కడ జరుగవు. ప్రభుత్వాలు, నగరపాలక సంస్థ పనిగట్టుకొని ప్రత్యేకంగా అటువంటి ఏ పండుగా నిర్వహించవు. బోనాలు, సదర్, రంజాన్, క్రిస్టమస్ వంటి సంప్రదాయ పండుగ ల్లోనూ అంతో ఇంతో మూల హైదరబాదీలైన వారే ఉత్సాహంగా పాల్గొంటారు తప్ప, బయటి నుంచి వచ్చి స్థిరపడిన వారు, శివారు కాలనీల భాగస్వామ్యం అంతంతే! ఈసీ–మూసీ నదుల సంగమం, రిజర్వాయర్లకు వందే ళ్లయింది, గొప్ప ‘హైదరబాదీ’ పండుగ జరు పొచ్చు! ఎవరికీ పట్టలే! గోల్కొండ ఉత్సవాల ఊసేలేదు. అందర్నీ ఒక్కటి చేసే నగరాత్మ లేకుండా చేశారు. పైపెచ్చు, మతాల ప్రాతిపదికన విభజించే యత్నాలు ముమ్మరమయ్యాయి. నగరానికి సంబంధించిన కీలక నిర్ణయాలన్నీ రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుంది. ముఖ్యమంత్రో, మున్సిపల్ మంత్రో... అలా పైవాళ్లే తప్ప నగర పాలక సంస్థ, మేయర్, గవర్నింగ్ కౌన్సిల్‌ను నామమాత్రం చేయడాన్ని నగర పౌరులు బాగా గుర్తించారు, జీర్ణించుకోలేకపోతున్నారు. ఐక్యరాజ్య సమితి (యూఎన్) సుస్థిరాభివృద్ధి లక్ష్యా(ఎస్జీడీ–16)ల్లో పేర్కొన్నట్టు సంస్థలు బలోపేతం కావాలి. అప్పుడే ప్రజలకు విశ్వాసం, వాటిపట్ల మమకారం పెరుగుతాయి. ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఇవన్నీ ఓటింగ్ శాతాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసిన అంశాలే! ఇరువైపులా తప్పున్నట్టే! ప్రజాస్వామ్యంలో తమ ప్రతినిధుల్ని, తద్వారా ప్రభుత్వాల్ని ఎన్నుకునే ఓటు హక్కు పౌరులకు జీవనరేఖ! ఎన్ని ఇబ్బందులున్నా, ప్రతికూల పరిస్థితులున్నా ఓటు వేయాలి. పల్లెటూర్లో ఒక నిర క్షరాస్యుడికి ఉన్న స్పృహ చదువరుల్లో కొరవడుతోంది. ఆ హక్కును వినియోగించుకొని పాలనా నిర్ణయాధికారంలో పౌరులు భాగస్వా ములు కావాలి. తాము కోరుకునే విధానాలు, వ్యవస్థల్ని అలా తెచ్చుకోవాలి. లేకుంటే అంతిమంగా నష్టపోయేది వారే! సౌకర్యాలు– అసౌకర్యాలనే దృష్టి కోణంలో ఆలోచించి ఓటు వేయకపోవడం సమర్థనీయం కాదు. రాజకీయ వ్యవస్థలు బాగో లేవనో, ప్రచా రాంశాలు దుర్మార్గంగా ఉన్నాయనో, అర్హులైన అభ్యర్థులు లేరనో.... భావించే ఓటర్ల గైర్హాజరీని, వారి నిరసనగా గౌరవించాలనే వాదనను కొందరు ముందుకు తెస్తున్నారు. అది తప్పు. ఓటింగ్ శాతం తగ్గితే, నిర్ణయాధికారంలో ప్రజాభాగస్వామ్యం తగ్గినట్టే లెక్క! ఎందుకంటే, ఎంత తక్కువ శాతం పోలింగ్ జరిగినా ఎన్నిక రద్దయ్యే వ్యవస్థ లేనపుడు, తమ గైర్హాజరీ ప్రభావం శూన్యం. తాము పాల్గొనకుండా, జరిగే తక్కువ శాతం ఓటింగ్ వల్ల తమ అభీష్టానికి వ్యతిరేక ప్రతినిధులు వచ్చే, ప్రభుత్వాలు ఏర్పడే, నిర్ణయాలు జరి గిపోయే పరిస్థితిని పౌరులు నిలువరించలేరు. అది వారికి జరిగే నికర నష్టం, ప్రజాస్వామ్య వ్యవస్థకు జరిగే ఉమ్మడి నష్టం. ఓటరు ఉత్సా హంగా పాల్గొనే వ్యవస్థను కల్పించలేని ప్రభుత్వాల వైఫల్యం ఎంత తప్పో, నిర్లక్ష్యమో, ఉదాసీనతో, బద్దకమో, మరే నిర్హేతుక కారణ మైనా... పౌరులు తమ ఓటు హక్కు వినియోగించుకోకపోవడం అంతే తప్పు! -దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
జీహెచ్ఎంసీ ఎన్నికలు : హైకోర్టు కీలక సూచన
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక సూచన చేసింది. ఝాన్సీ బజార్, పురానాపూల్ డివిజన్లలో నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి(ఎస్ఈసీ) సూచించింది. ఝాన్సీ బజార్, పురానాపూల్ డివిజన్లలో రీపోలింగ్ నిర్వహించాలని అక్కడి బీజేపీ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ రెండు డివిజన్లలో ఎంఐఎం పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడిందని బీజేపీ ఆరోపించింది. దీంతో రీపోలింగ్ నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని ఎస్ఈసీకి హైకోర్టు సూచించింది. అయితే రేపే ఎన్నికల కౌంటింగ్ ఉండడంతో ఈ అంశం మీద ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది ఆసక్తికరంగా మారింది. (చదవండి : జీహెచ్ఎంసీ ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ) -
ఎగ్జిట్ పోల్స్: పుంజుకున్న బీజేపీ
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేశాయి. ఓల్డ్ మలక్‌పేట్ రీపోలింగ్ ఉండటంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆలస్యమయిన సంగతి తెలిసిందే. ఇక గురువారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం అధికార టీఆర్ఎస్ పార్టీ మరోసారి సొంతంగా మేయర్ పీఠం చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే దుబ్బాక విజయంతో బల్దియా ఎన్నికల్లో బీజేపీ జోరుగా ప్రచారం చేసింది. ఢీ అంటే ఢీ అన్నట్లు అధికార పార్టీపై విమర్శలు చేసింది. ఇక అమిత్ షా సహా పలువురు బీజేపీ ప్రముఖులతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేయించింది. ఈ అంశాలన్ని బీజేపికి అనుకూలించాయి. ఇక ఎగ్జిట్ పోల్స్ ఫలితాల మేరకు టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఆరు శాతం ఓట్ల వ్యత్యాసం ఉండటం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే.. నగరంలో బీజేపీ సైలెంట్ వేవ్ కొనసాగిందని చెప్పవచ్చు. ఇక చాలా డివిజన్లలో త్రిముఖ పోరు కొనసాగింది. ఫలితంగా ఓట్లు చీలడంతో టీఆర్ఎస్కు కలిసి వచ్చింది. ఇక బీజేపీకి ఓటు బ్యాంకు భారీగా పెరిగినట్లు అర్థమవుతోంది. ఇది టీఆర్ఎస్కు ఆందోళన కలిగించే అంశంగా భావిస్తున్నారు విశ్లేషకులు. ఇక రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిచిన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో హస్తం పార్టీ హవా కొనసాగింది. ఇక్కడ టీఆర్ఎస్, బీజేపీకి గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్.. సికింద్రాబాద్, హైదరాబాద్ లోక్‌సభ పరిధిలో తేలిపోయింది. ఇక పాతబస్తీలో ఊహించనట్లుగానే మజ్లిస్ స్ట్రాంగ్‌గా నిలిచింది. ఇక ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మజ్లిస్ మొత్తం తాను పోటీ చేసిన 51 స్థానాల్లో 42 చోట్ల గెలిచే చాన్స్ ఉంది. ఇక తెలంగాణలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయిందని బల్దియా ఎన్నికలు మరోసారి నిరూపించాయి. నామమాత్రపు ఓట్లతో సైకిల్ మూలకు పడింది. (చదవండి: గ్రేటర్ ఎన్నికల్లో సెంచరీ కొడతాం..) ఇక సిట్టింగ్ కార్పొరేటర్లపై ప్రజల్లో భారీగా ఆగ్రహం ఉన్నట్లు ఓట్ల శాతాన్ని బట్టి అర్థమవుతోంది. అధికార పార్టీపై ఆగ్రహాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకోవడంలో బాగానే సక్సెస్ అయ్యిందని చెప్పవచ్చు. దాంతో బీజేపీ బల్దియాలో భారీగా ఓటు శాతాన్ని పెంచుకుంది. ఇక రాబోయే రోజుల్లో తెలంగాణలో భారీ రాజకీయ మార్పులు చోటు చేసుకోబోతున్నట్లు గ్రేటర్ ఎన్నికలు రుజువు చేశాయి. ఇక టీఆర్ఎస్కు ప్రత్యామ్నయం బీజేపీ అనే భావన ప్రజల్లో బలంగానే నాటుకుపోనుంది. ఇక బీజేపీ ఇదే జోష్ కొనసాగిస్తే.. తెలంగాణలో పార్టీ పుంజుకునే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఎగ్జిట్ పోల్స్‌లో టీఆర్ఎస్కే మొగ్గు
-
జీహెచ్ఎంసీ ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ టీఆర్ఎస్కే పట్టం కట్టాయి. ఇప్పటివరకూ వచ్చిన ఎగ్జిట్‌పోల్స్‌లో అధికారి పార్టీదే హవా. గతంలో కంటే సీట్లు తగ్గుతున్నా.. టీఆర్ఎస్ సొంతంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఓట్ల శాతం మెరుగ్గా ఉన్నా సీట్లలో బీజేపీ వెనకబడే ఛాన్స్ ఉంది. ఇక మజ్లిస్ పార్టీ 40 కంటే ఎక్కువ సీట్లలో గెలవనుంది. కాగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు స్వల్ప ఆధిక్యత లభించే అవకాశం ఉంది. ‘పీపుల్స్ పల్స్’ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాల ప్రకారం.. టీఆర్ఎస్కు 68-78 స్థానాలు, బీజేపీకి 25-35, ఎంఐఎంకు 38-42 స్థానాలు, కాంగ్రెస్‌కు 1-5 స్థానాలు వచ్చే అవకాశాలున్నాయి. టీఆర్ఎస్ మ్యాజిక్ ఫిగర్ (76)కు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సర్వే ప్రకారం టీఆర్ఎస్, బీజేపీకి మధ్య 6 శాతం ఓట్ల వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో సైలెంట్ వేవ్ కన్పిస్తోంది. ఈ వేవ్ పనిచేస్తే బీజేపీ మరింత లాభపడే అవకాశం ఉంది. ఆరా సర్వేలో టీఆర్ఎస్కు సొంతంగా అధికారం (78) పీపుల్స్ పల్స్ సర్వేలో బీజేపీకి టీఆర్ఎస్కు 68 నుంచి 78 సీపీఎస్‌సర్వేలో టీఆర్ఎస్కు భారీ మెజార్టీ (82 నుంచి 96) ఆత్మసాక్షి సర్వేలో టీఆర్ఎస్కు భారీ సీట్లు (82 నుంచి 88) వెల్లడైన అన్ని సర్వేల్లోనూ టాప్‌గా కనిపిస్తోన్న టీఆర్ఎస్ శాంతి భద్రతల అంశంలో టీఆర్ఎస్కు మార్కులు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపిన మహిళలు, వృద్ధులు కరోనా విషయంలో 57%పైగా టీఆర్ఎస్కు అనుకూలం వరద సాయం విషయంలో 51% టీఆర్ఎస్కు వ్యతిరేకం డబుల్ బెడ్రూం అంశంలో 39% టీఆర్ఎస్కు వ్యతిరేకం డ్రైనేజీ వ్యవస్థ, రహదారులపై 44% టీఆర్ఎస్కు వ్యతిరేకం బీజేపీకి అనుకూలంగా యువత, నిరుద్యోగులు పాతబస్తీలో పట్టు కొనసాగించిన మజ్లిస్ పార్టీ 12 నుంచి 14 సీట్లలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ -
గ్రేటర్ ఎన్నికల్లో సెంచరీ కొడతాం..
సాక్షి, కరీంనగర్: గ్రేటర్ పీఠంపై గులాబీ జెండా ఎగురవేస్తామని మంత్రి గంగుల కమలాకర్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వందకు పైగా సీట్లు గెలుచుకుంటామన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో సెంచరీ కొట్టి టీఆర్ఎస్ సత్తా ఏంటో చూపిస్తామని తెలిపారు. దేశానికే ఆదర్శంగా హైదరాబాద్‌ను సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్పై బీజేపీ తప్పుడు ఆరోపణలు మానుకుంటే మంచిదని హితవు పలికారు. ఢిల్లీ, ముంబాయి, చెన్నై, కొల్కత్తా తర్వాత హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని చెప్పారు. మతం పేరు చెప్పి యువతను బీజేపీ రెచ్చగొట్టాలని చూసిందని విమర్శించారు. ఆరేళ్ల పరిపాలనకు గ్రేటర్ ఎన్నికలు నిదర్శనమని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. (చదవండి: నోముల ఆడియో దుమారం) -
హైదరాబాద్: ఓల్డ్ మలక్‌పేట రీపోలింగ్ ప్రారంభం
-
ఓల్డ్ మలక్‌పేటలో ముగిసిన రీపోలింగ్
సాక్షి, హైదరాబాద్: ఓల్డ్ మలక్‌పేట వార్డు(డివిజన్) జరిగిన రీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం ఆరు గంటల వరకూ క్యూలైన్లో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం ఉంది. కాగా బ్యాలెట్ పేపర్లో సీపీఐ అభ్యర్థి గుర్తు తప్పుగా ముద్రించడంతో రీపోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల అయ్యాయి. అన్ని ఎగ్జిట్ పోల్స్ అధికార టీఆర్ఎస్కే పట్టం కట్టాయి. ఇప్పటివరకూ వచ్చిన ఎగ్జిట్ పోల్స్‌లో కారు జోరే కొనసాగుతుంది. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటల వరకు: రీపోలింగ్ కట్టు దిట్టమైన భద్రత నడుమ కొనసాగుతోంది. తాజాగా ఉదయం 11 గంటలకు వరకు పోలింగ్ శాతం 13.41గా నమోదు అయింది. ఉదయం 9 గంటలకు వరకు: ఓల్డ్ మలక్‌పేట వార్డు( డివిజన్)లో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9గంటల వరకు 4.4 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. కాగా, ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6గంటల వరకు జరుగుతుంది. భారీ భద్రత నడుమ రీపోలింగ్ ప్రక్రియ సాగుతోంది. వార్డులో మొత్తం ఓట్లు: 54,655 పురుషులు : 27889 మహిళలు: 26763 ఇతరులు 3 పోలింగ్ కేంద్రాలు 69 విధుల్లో ఉండే మైక్రో అబ్జర్వర్లు 12 మంది. వెబ్‌కాస్టింగ్ జరిగే పోలింగ్ కేంద్రాలు:23 నేడు సెలవు: జీహెచ్ఎంసీ పరిధిలోని ఓల్డ్ మలక్‌పేట డివిజన్ పరిధిలో పోలింగ్ సందర్భంగా గురువారం సెలవు ప్రకటించినట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి తెలిపారు. ఎన్నికలు జరిగే ప్రాంతమైన ఓల్డ్ మలక్‌పేట డివిజన్లో అన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు, వ్యాపార కేంద్రాలకు సెలవు వర్తిసుందన్నారు. అన్ని కార్యాలయ అధిపతులు ఈ ఆదేశాలను పాటించాలని సూచించారు. 48 గంటల పాటు ర్యాలీ నిషేధం ఉదయం 7 గంటలకు ఓల్డ్ మలక్ పేట్లో ప్రారంభమైన రీపోలింగ్ 69 పోలింగ్ కేంద్రాల్లో జరుగుతుందని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ అన్నారు. పెట్రోలింగ్, పోలీస్ సిబ్బందితో పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందన్నారు. రేపటి కోసం కూడా భారీ బందోబస్తు ఉందన్నారు. 200 మీటర్ల పరిధిలో ఎవరికి అనుమతి ఉండదని,.కేవలం అనుమతి పత్రం ఉన్నవారికి మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి ఉన్నట్లు తెలిపారు. 48 గంటల పాటు ర్యాలీ నిషేధించినట్లు వెల్లడించారు. ఓటర్లందరు చాలా ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొంటున్నారని, వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. -
క్వారంటైన్లో ఉండాల్సిందే
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్న రాజకీయ నేతలు, కార్యకర్తలంతా వారం రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని ప్రజారోగ్య డైరెక్టర్ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం జిల్లాల నుంచి అన్ని పార్టీలకు చెందిన కార్యకర్తలు, నేతలంతా పెద్ద సంఖ్యలో వచ్చారని, వారంతా లక్షణాలున్నా లేకున్నా 7 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని సూచించారు. అనుమానం ఉంటే కరోనా పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. ఈ మేరకు బుధవారం డీఎంఈ రమేశ్‌రెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ పరి ధిలో 10 రోజులపాటు ఎన్నికల ప్రచారంలో వేలాది మంది పాల్గొన్నారని శ్రీనివాసరావు పేర్కొన్నారు. కొందరు కోవిడ్ నిబంధనలు పాటించలేదన్న విషయం తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. అందుకే నేతలంతా క్వారంటైన్లో ఉండాలని సూచించారు. వైద్యపరంగా అత్యవసరమైతేనే బయటకు రావాలని కోరారు. అంతర్జాతీయంగా, మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత మొదలైందని పేర్కొన్నారు. అందుకే రోజుకు రాష్ట్రంలో 65 వేల పరీక్షలు చేసేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,090 కేంద్రాల్లో కోవిడ్ టెస్టులు జరుగుతుండగా, వాటికి అదనంగా మరో 50 కేంద్రాల్లో పరీక్షలు చేయనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లో 25, రంగారెడ్డిలో మరో 25 కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటికి తోడు మరో 300 మొబైల్ వాహనాల ద్వారా కూడా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. సెకండ్ వేవ్ పరిస్థితుల దృష్యా వృద్ధాశ్రమాలు, చైల్డ్ హోమ్స్, అనాథ శరణాలయాల్లో ప్రతి పది రోజులకోసారి కరోనా పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల గురించి మరింత సమాచారం కోసం 104కు కాల్ చేయాలని, ఒకవేళ అది కలవకుంటే ప్రజారోగ్య డైరెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 040–24651119కు ఫోన్ చేసి మరింత సమాచారం తెలుసుకోవచ్చని చెప్పారు. పెళ్లిళ్ల వల్ల భారీగా కేసులు.. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న పెళ్లిళ్ల వల్ల కూడా కొన్నిచోట్ల కేసులు ఆకస్మికంగా పెరుగుతున్నట్లు తెలిపారు. పెళ్లిళ్లకు వందలాది మంది హాజరుకావడం వల్ల జగిత్యాలలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. సెకండ్ వేవ్ రాకుండా చూసే బాధ్యత మన చేతుల్లోనే ఉందన్నారు. మొదటి దశలో వ్యాక్సిన్ ఇచ్చేందుకు జాబితా సిద్ధం చేశామన్నారు. టీకా మొదటి డోసు ఇచ్చిన 3 వారాల తర్వాత మళ్లీ ఇంకో డోసు ఇవ్వాలని, అది ఇచ్చిన తర్వాత 9 నెలల పాటు దాని ప్రభావం ఉంటుందన్నారు. వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో అందరికీ అందించడానికి సమయం పడుతుందన్నారు. వాక్సిన్ సాఫ్ట్వేర్ డ్రై రన్‌కు రాజస్తాన్, తెలంగాణ రాష్ట్రాలను కేంద్రం ఎంపిక చేసిందని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని బొగ్గులకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కేంద్ర బృందం డ్రై రన్ నిర్వహిస్తోందని తెలిపారు. గత నాలుగు నెలలుగా కరోనా వ్యాప్తి రేటు తగ్గిందన్నారు. రాష్ట్రంలో 70–80 లక్షల మందికి మొదటి దశలో కరోనా టీకాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అయితే అందరికీ టీకాలివ్వడం సాధ్యం కాదని కేంద్రం రాష్ట్రాలకు తెలిపిందని చెప్పారు. మెడికల్ కాలేజీల ప్రారంభానికి చర్యలు.. టీకా వచ్చిన తర్వాత వైద్య సిబ్బందికే ముందుగా వ్యాక్సిన్ ఇస్తామని, అందుకు సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసిందన్నారు. మెడికల్ కాలేజీ తరగతులు ప్రారంభించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. నర్సులు పరిధి దాటి ధర్నాలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్వారంటైన్ సెలవులను రద్దు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిందని, అదే పాటిస్తున్నామని చెప్పారు. కోవిడ్ సోకిన వారు 3 నెలల నుంచి ఏడాది పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలని తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో నాన్ కోవిడ్ సేవలు మొదలు పెట్టినట్లు వెల్లడించారు. అన్ని శస్త్ర చికిత్సలు త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. -
గ్రేటర్ పోలింగ్ 46.55%
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ లెక్కలు తేలాయి. మొత్తం 74,12,601 మంది ఓటర్లలో 34,50,331 మంది ఓట్లు వేశారని, 46.55 శాతం పోలింగ్ జరిగిందని అధికారులు ప్రకటించారు. పోలింగ్ శాతంపై ఒకటో తేదీ అర్ధరాత్రి దాటాక కూడా విభిన్న గణాంకాలు వెల్లడిస్తూ వచ్చారు. దాంతో కొంత గందరగోళం నెలకొంది. అంతిమంగా 46.55 శాతం పోలింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ బుధవారం స్పష్టం చేశారు. గురువారం రీపోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఓల్డ్ మలక్‌పేటను మినహాయించి ఈ వివరాలు వెల్లడించారు. పోలింగ్ జరిగిన 149 వార్డుల్లో అత్యధికంగా రామచంద్రాపురం డివిజన్లో 67.71 శాతం ఓట్లు పోలయ్యాయి. అత్యల్పంగా యూసుఫ్‌గూడలో 32.99 శాతం ఓట్లు పోలయ్యాయి. 60% దాటిన డివిజన్లు 3 డివిజన్ పోలింగ్ ఆర్సీపురం 67.71 పటాన్చెరువు 65.77 భారతీనగర్ 61.88 -
స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర భద్రత కట్టుదిట్టం
-
‘గ్రేటర్’ ఫైనల్ ఓటింగ్ శాతం ప్రకటించిన ఈసీ
సాక్షి, హైదరాబాద్ : బల్దియా ఎన్నికల్లో తుది ఓటింగ్ శాతాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. గ్రేటర్ పరిధిలోని మొత్తం 149 డివిజన్లలో పోలింగ్ జరగగా 46.68 శాతం ఓటింగ్ నమోదు అయింది. అత్యధికంగా కంచన్‌బాగ్‌లో 70.39 శాతం నమోదు కాగా, అత్యల్పంగా 32.99శాతం పోలింగ్ యూసప్‌గూడలో నమోదైంది. కాగా గత 20 ఏళ్లలో జీహెచ్ఎంసీలో ఇదే అత్యధికంగా పోలింగ్ నమోదు కావడం గమనార్హం. క్రితంసారి ఎన్నికల్లో (2016) 45శాతం పోలింగ్ నమోదు అయింది. ఎన్నిక ఆగిపోయిన ఓల్డ్ మలక్‌పేటలో గురువారం రీ-పోలింగ్ జరగనుంది. ఇక ఎన్నికల ముగియడంతో అభ్యర్థులు ఇప్పుడు ఫలితాలపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 4న ఓట్ల లెక్కింపు ఉండగా, సాయంత్రానికి ఫలితాలు వెల్లడి కానున్నాయి. మరోవైపు బ్యాలెట్ బాక్స్‌లు పోలీసులు బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్‌లలో మూడంచెల భద్రత కొనసాగుతోంది. -
గ్రేటర్ వార్: బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు ఓటేశాం..
కదలిరండి, మీ విలువైన ఓటు హక్కును వినియోగించుకోండి.. అని ప్రభుత్వ యంత్రాంగం, ఎన్నికల కమిషన్ నెత్తీనోరూ మొత్తుకుంది. అయినా సరే హైదరాబాదీలు బద్ధకం వదల్లేదు. పోలింగే ప్రారంభం అయ్యే సమయం నుంచీ ముగిసే సమయం వరకు ఎక్కడా పెద్దగా హడావుడి కనిపించలేదు. కొన్నిచోట్ల పోలింగ్ సిబ్బంది ఈగలు తోలుకావాల్సిన దారుణ పరిస్థితి దాపురించింది. మొత్తానికి జనాల బద్ధకంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ 45.71 శాతానికి పరిమితమైంది. హైదరాబాదీల తీరుపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ఈ నగరానికి ఏమైంది? బిగ్‌బాస్ షోలో ఓట్లు వేసేందుకు ఆసక్తి చూపే జనం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం మొహం చాటేశారేంటి? అని విమర్శిస్తున్నారు. (చదవండి: బిగ్‌బాస్: వచ్చే వారం నుంచి రాత్రి పదింటికి!) నిన్న ఈ సమయానికి ఓటేయండని కొందరు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ప్రచారం చేయగా నెటిజన్లు వారికి కూడా ఊహించని షాకులు ఇచ్చారు. 'మేము అభిజిత్‌కు వేశాం, లేదు, లేదు.. అఖిల్‌కు వేశాం', 'మా వాడంటే మా వాడే గెలుస్తాడు, మీరు కూడా ఈ కంటెస్టెంట్‌కే సపోర్ట్ చేయండి, ఇతడికే ఓట్లు వేయండి..' అంటూ వాళ్లకే తిరిగి సలహాలు ఇచ్చారు. ఈ షాకులతో అవాక్కయిన సెలబ్రిటీలు నవ్వాలో, ఏడవాలో తెలీని అయోమయంలో పడ్డారు. మేం చెప్తోంది హైదరాబాద్ ఎలక్షన్స్ గురించిరా బాబూ అని నెటిజన్లకు పెద్ద దండం పెట్టేశారు. నెట్టింట కూడా జీహెచ్ఎంసీ పోల్స్ మీద ఫన్నీ మీమ్స్ బాగా వైరల్ అయ్యాయి. బాధ్యత గల వ్యక్తిగా ఓటు వేయడం చాలా ముఖ్యం అని ఒకరు చెప్తుంటే.. అవును, అభి ఎలాగో సేఫ్, హారిక డేంజర్ జోన్లో ఉంది కాబట్టి ఆమెకు వేశాను... అంటూ కేవలం బిగ్‌బాస్ ఓట్ల గురించే మాట్లాడుతున్నట్లుగా మీమ్స్ హల్చల్ చేస్తున్నాయి. (చదవండి: హైదరాబాదీల బద్ధకంపై జోకులు..!) -
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సెంచరీ కొడతాం: కవిత
సాక్షి, కరీంనగర్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో సెంచరీ కొడతామని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. గడిచిన 20 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ నమోదైందని అన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా బీజేపీ విమర్శలు చేస్తూ పోలింగ్‌పై తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు. ఎమ్మెల్సీ అయిన తర్వాత బుధవారం తొలిసారి కరీంనగర్‌కు వచ్చిన కవిత పాత బజార్‌లోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివుడికి అభిషేకం నిర్వహించి గౌరీమాత పూజలు చేశారు. మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి శివాలయంతో పాటు దాని ప్రక్కనే ఉన్న కరీముల్లాషా దర్గాను సందర్శించి చాదర్ కప్పి ప్రార్థనలు చేశారు. ( గణేష్ గుప్తాకు సీఎం కేసీఆర్ పరామర్శ) ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బండి సంజయ్ ఎంపీ అయి రెండేళ్లు అవుతున్న సందర్భంగా కరీంనగర్‌కు ఏం చేశారో ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు. కరీంనగర్‌కు రావలసిన త్రిబుల్ ఐటీ ఎందుకు రాకుండా పోయిందో బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో కరీంనగర్ అభివృద్ధి చెందుతుందని, ఇప్పటికే వెయ్యి కోట్లతో వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. కరీంనగర్లో మెడికల్ కళాశాల ఏర్పాటుకై కృషి చేస్తున్నామని చెప్పారు. -
బండి సంజయ్‌కు ప్రధాని మోదీ ఫోన్
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్‌కు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ బుధవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. 'తాజాగా జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల స్థితిగతులపై ప్రధాని వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాదాపు 10 నిమిషాలపాటు, ఎన్నికల సరళిపై పార్టీ పరిస్థితులపై ప్రధాని ముచ్చటించారు. నాయకులు, కార్యకర్తలపైన జరిగిన దౌర్జన్యంపై ప్రధాని వివరాలు అడిగి తెలుసుకున్నారు. చదవండి: (అదే తీరు.. అత్తెసరు) ఈ సందర్భంగా కార్యకర్తలు అద్భుతంగా పోరాటం చేశారని ప్రధాని మోదీ అభినందించారు. పార్టీని విజయతీరాలకు చేర్చడానికి అన్ని విధాలా పోరాడిన తెలంగాణ శాఖ కార్యకర్తల పోరాట పటిమను మోదీ కొనియాడారు. నూతన ఉత్సాహంతో పార్టీ క్యాడర్ నడవడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. దైర్యంగా ముందుకు సాగాలని అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలి' అని ప్రధాని మోదీ సూచించినట్లు తెలంగాణ బీజేపీ ఆ ప్రకటనలో తెలిపింది. చదవండి: (విదేశాల్లో భారతీయులకు పోస్టల్ బ్యాలెట్) -
గ్రేటర్ ఎన్నికలు: ఆఖరి గంట అద్భుతం
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ పోలింగ్‌లో ఆఖరి గంట సమయంలో ఏం జరిగిందనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఇప్పటి వరకూ చాలా ఎన్నికల సరళిని చూసిన రాజకీయ పార్టీలకు, ఎన్నికల బాధ్యతలు నిర్వహించిన అధికారులు, ఎన్నికల విధులు నిర్వర్తించిన సిబ్బందికి మంగళవారం సాయంత్రం 5 నుంచి 6 గంటల సమయంలో ఎలాంటి మిరాకిల్ జరిగిందో తెలియడం లేదు. ఎందుకంటే ఒక్క గంటలోనే పోలింగ్ శాతం రెడ్ మార్కును దాటింది. 12 గంటల పాటు ఓటర్లు వస్తారేమోనని నిద్రాహారాలు మానుకుని.. కళ్లల్లో వత్తులేసుకుని ఎదురుచూసిన ఎన్నికల సిబ్బందికి ఆ ఒక్కగంటలో వేలమంది ఓటర్లు క్యూ కట్టారు. అయినా ఎన్నికల్లో చీమ చిటుక్కుమన్నా హడావుడి చేసే మీడియా… ఇష్టం వచ్చినట్లు రాసుకునే స్వేచ్ఛ ఉన్న సోషల్ మీడియాకు ఎక్కడా బారులు తీరిన ఓటర్లు కనిపించలేదు. అయినా ఆఖరి గంటలో మాత్రం అన్నికేంద్రాల్లో ఓటర్లు బారులు తీరి… సమయం దాటినా లైన్లో ఉండి ఓట్లేశారని ఎన్నికల సంఘం చెప్పిన లెక్కల ప్రకారం తెలుస్తోంది. అసలేం జరిగింది..? ఆఖరి గంటలో ఎక్కడా హడావుడి లేకుండా, క్యూ లైన్లు కనిపించకుండా పోలింగ్ ఎలా పెరిగిందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మంగళవారం నాటి పోలింగ్‌తో పట్టణ ఓటర్లు బద్దకిస్తులు అనేది తేలిపోయింది. గ్రామవాసులకు తెలిసిన ఓటు విలువ పట్టణాల్లో ఉండే వారికి తెలియదంటూ ఆటాడుకున్నారు. ఇదంతా ఒకవైపు ఉంటే… సాయంత్రం ఆఖరి గంట మాత్రం దాదాపు సగం రోజు ఓట్లను రాబట్టినట్లు ఎన్నికల సంఘం లెక్కలు చెప్పుతున్నాయి. దీంతో అసలేం జరిగిందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ( మావైపే గ్రేటర్ ఓటర్.. కాదు మా వైపు! ) అయితే ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం పనితీరును రాష్ట్రమంతా తప్పు పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ప్రలోభాలు నివారించలేదని, ప్రచారంలో కచ్చితమైన నిబంధనలు పాటించలేదని, అధికారులకు వత్తాసు పలికారని, గొడవలు ఆపలేకపోయారని ఎన్నికల సంఘం అపవాదు మూటగట్టుకుంది. గతంలో రాష్ట్రమంతా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించిన ఎస్ఈసీ.. కేవలం మహా నగరంలో జరిగిన కేవలం 150 డివిజన్ల ఓట్లలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. పోలింగ్ నిర్వహించలేక చేతులెత్తేసింది. ఆఖరి గంట అద్భుతం మంగళవారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు జరిగిన పోలింగ్ కేవలం 3.96 శాతమే. చలి ఉంది కాబట్టి ఓటర్లు రాలేదనుకున్నారు. ఇక కొంచెం ఎండ వచ్చి చలి పోతుండటంతో ఓటర్లు వస్తారనుకున్నారు. కానీ 11 గంటల వరకు కూడా అదే పరిస్థితి. ఇంకో నాలుగున్నర శాతం వచ్చారు. అంటే 8.90 శాతం పోలింగ్. ఇక మధ్యాహ్నం ఓటర్లు వస్తారని, తినే తీరిక ఉండదనే ఎదురుచూపుల్లో సిబ్బంది ఉన్నారు. అయినా మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఇంకో పదిశాతం పోలైంది. దీంతో సగం రోజులో 18శాతం పోలింగ్ జరిగింది. ఆ తర్వాత కూడా గంటలకు మూడు, నాలుగు శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచి అసలు ఇవి ఎన్నికలేనా.. అన్నట్టు సాగిన పోలింగ్ ఆఖరి గంట మాత్రం అద్భుతాన్ని సృష్టించింది. ఈ అద్భుతం అధికార పార్టీ ముసుగులో ఎన్నికల సంఘం సృష్టించిందా.. అంతా తప్పుపడుతున్నట్టే పోలీసుల సమక్షంలోనే జరిగిందా అనేది రాష్ట్రమంతా తొలిచివేస్తున్న ప్రశ్న. సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పోలింగ్ శాతం 35.80 శాతం. అప్పటికే అధికారుల మీద, రాజకీయ పక్షాల మీద ఒత్తిడి, ఆరోపణలు పెరుగడంతో ఎలాగోలా తీసుకువచ్చి ఓట్లేయించారు. కొంతమంది దొంగ ఓట్లు వేస్తుంటే గుర్తించి పట్టకున్నారు. ఎందుకంటే అప్పుడు సమయం సాయంత్రం 5 గంటలలోపే. ఇక అప్పటి వరకు ప్రతి గంట గంట పోలింగ్‌ను పది నిమిషాల్లో ప్రకటించిన ఎన్నికల సంఘం సాయంత్రం 5 గంటల తర్వాత పోలింగ్ శాతాన్ని నిలిపివేసింది. కారణాలను మాత్రం తెలుపలేదు. దీంతో పోలింగ్ శాతం 38 శాతం ఉంటుందని భావించారు. 2016 గ్రేటర్ ఎన్నికల కంటే తక్కువ జరిగిందనే అంచనాకు వచ్చారు. ఎందుకంటే అనుకున్న సమయానికే పోలింగ్ ముగిసింది. ఎక్కడా ఓటర్లు లైన్లో ఉన్నట్లు, పోలింగ్ కోసం అదనపు సమయం తీసుకున్నట్లు ప్రకటించలేదు. దీంతో పోలింగ్ ముగిసినట్లుగానే భావించారు. కానీ ఆఖరి గంట పోలింగ్ శాతాన్ని మాత్రం అర్థరాత్రి 12 గంటల తర్వాత ప్రకటించారు. మొత్తం పోలింగ్ 45.70 శాతంగా నమోదైనట్లు ఎస్ఈసీ వెల్లడించింది. గత ఎన్నికల్లో జరిగిన పోలింగ్ 45.29 శాతం మాత్రమే. కానీ ఈసారి 0.50 శాతం ఎక్కువగా జరిగింది. ఈ లెక్కన సాయంత్రం ఆఖరి గంటలో జరిగిన పోలింగ్ శాతం 10 శాతంగా నమోదైంది. అప్పటి వరకు పోలింగ్ కేంద్రాల వైపు చూడని ఓటర్లు ఒక్కసారిగా కేంద్రాల్లోకి పోటెత్తారు. సమయం మించిపోతుందని కేంద్రాల్లోకి చొచ్చుకువచ్చారని ఎన్నికల సంఘం లెక్కలు చెప్పుతున్నాయి. కానీ ఇదెలా సాధ్యం. 12 గంటల పాటు రాని ఓటర్లు ఒక్కసారిగా ఎలా వచ్చారు… ఎక్కడి నుంచి వచ్చారు… అసలు ఒక్కచోట కూడా సమయం దాటిన తర్వాత లైన్లలో ఉన్నట్లు ఎన్నికల సంఘం కనీసం ప్రకటించలేదు. పోలింగ్ ముగిసినట్లుగానే భావించారు. కానీ సమయం దాటినా ఓట్లు వేసినట్లు పోలింగ్ శాతాన్ని చూస్తే తెలుస్తోంది. మరి ఎక్కడ ఇలా లైన్లు కట్టి ఓట్లేశారు… నిజంగానే ఇదంతా ఓ మిరాకిల్‌లా ఉంది… అంటూ రాజకీయ పక్షాలు విషయం తెలియక తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. దొంగ ఓట్లా… రిగ్గింగా…? ‘అవేవో… అప్పడెప్పడో తెలుగు సినిమాలు ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయి. అప్పుడు రాయలసీమలో ఎన్నికలంటేనే పోలీసులు పక్కన కాపలా ఉంటే రాజకీయ నేతలు వచ్చి బ్యాలెట్ పేపర్లలో తమ గుర్తుపై ఓటు గుద్దుకుని బాక్స్ ల్లో వేసుకుంటారు. ఇది హీరో అడ్డుకుందామంటే చాలా కష్టాలు ఎదుర్కొవాల్సిందే. ఆ ఫైట్లు, బాంబుల మోతలు చూసి రిగ్గింగ్ పై ఈలలు వేసుకునేది. కానీ తెలంగాణలో ఇప్పుడు సీన్ మారిందని చెప్పుతున్నారు. పోలింగ్ శాతం పెరుగడంలో అంతా అలాగే జరుగుతుందని, కానీ ఫైట్లు, బాంబుల మోతలు మాత్రమే లేవంటున్నారు ప్రతిపక్షాలు. ఎందుకంటే ఆఖరి గంట సమయంలో దొంగ ఓట్లు వేయించారని, రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పోలీసులు, ఎన్నికల సంఘం సంయుక్తంగా అధికార పార్టీకి ఓట్లేయించారని మండిపడుతున్నారు. కానీ ఆరోపణలకు బలం చేకూర్చినట్టుగానే అసలు కనీసం ఎక్కడా ఒక్క లైన్ లేకుండా… సమయంలో ఓటర్లు వచ్చినా.. సమయం దాటినా లైన్లలో లేకున్నా ఓటింగ్ శాతం ఎలా పెరిగిందో అంతు చిక్కకుండా మారింది. ఇక స్వయంప్రతిపత్తి కలిగిన రాష్ట్ర ఎన్నికల సంఘం అధికార పార్టీకి తొత్తుగా పని చేసిందనే రాజకీయ పక్షాల ఆరోపణలకు ఆఖరి గంట మరింత బలాన్ని చేకూర్చుతోంది. -
మావైపే గ్రేటర్ ఓటర్.. కాదు మా వైపు!
బల్దియా పోలింగ్ ముగియడంతో రాజకీయ పార్టీలు గెలుపు లెక్కలు వేసుకుంటున్నాయి. పోలింగ్ సరళిని బట్టి విజయం మాదంటే.. మాదే అనే ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మళ్లీ మేయర్ కుర్చీ తమదేనని, ఈసారి కచ్చితంగా 100 స్థానాల్లో గెలుస్తామని, పోలింగ్ జరిగిన తీరు, ప్రజాభిప్రాయం కూడా ఇదే చెబుతోందని టీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా పోలింగ్ సరళిపై ఆ పార్టీ గంపెడాశలు పెట్టుకుంది. ఇక, గ్రేటర్ ఎన్నికల్లో దుబ్బాక ఫలితాన్ని పునరావృతం చేస్తామనే ధీమాతో ఉన్న బీజేపీ కూడా మెజార్టీ స్థానాలు తమవేనన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత తమకు లాభిస్తుందని, 50కి పైగా స్థానాల్లో విజయం సాధించి తీరుతామని కమలనాథులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతల్లోనూ గెలుపు ధీమా గట్టిగానే కనిపిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల సరళిలో తాము వెనుకబడినట్టు కనిపించినా కనీసం 20 స్థానాల్లో గెలుస్తామని, మల్కాజ్గిరి పార్లమెంటు పరిధి నుంచి మంచి ఫలితాలు వస్తాయని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. ఎంఐఎం ఎప్పటిలాగే పాతబస్తీలో పాగా వేస్తామనే విశ్వాసంతో ఉండగా, వామపక్షాలు, ఇతర పార్టీలు, స్వతంత్రులు కూడా గెలుపు తీరం చేరుతామని లెక్కలు వేసుకుంటున్నాయి. – సాక్షి, హైదరాబాద్ సెంచరీ కొట్టేనా..? జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ మళ్లీ మేయర్ పీఠం తమదేనన్న ధీమాతో ఉంది. పోలింగ్ శాతం తగ్గినా, గతంలో మాదిరి 100కు డివిజన్లలో పాగా వేయడం ఖాయమనే అంచనాలో ఉంది. మంగళవారం ఉదయమే ఓటు వేసిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తన నివాసంలోని వార్‌రూం నుంచి పార్టీ అభ్యర్థులు, డివిజన్ ఇన్‌చార్జ్‌లతో పోలింగ్ తీరుతెన్నులపై సమీక్షించారు. ఏ డివిజన్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకున్న ఆయన బీజేపీతో గట్టిపోటీ ఉన్న డివిజన్లలో పోలింగ్ గురించి ప్రత్యేకంగా ఆరా తీశారు. అయితే, నగర వ్యాప్తంగా పోలింగ్ శాతం భారీగా తగ్గుతోందనే సమాచారం మేరకు అభ్యర్థులు, డివిజన్ ఇన్‌చార్జ్‌లను అప్రమత్తం చేశారు. పార్టీకి పట్టున్న కాలనీలు, బస్తీల నుంచి ఓటర్లను పోలింగ్ బూత్‌లకు తరలించేలా చొరవ తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో పోల్ అయిన ఓట్లలో మెజార్టీ ఓట్లు తమ ఖాతాలోనే పడ్డాయనే లెక్కల్లో గులాబీ నేతలున్నారు.(చదవండి: గ్రేటర్ వార్: స్పందించని నగర వాసులు) జనం మావైపే... ఈ ఎన్నికల్లో గ్రేటర్ ప్రజలు తమ వైపే నిలిచారని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ శాతం తగ్గినా... పోలైన ఓట్లు తమకే పడ్డాయని, టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటర్లు బ్యాలెట్ బాక్సులు నింపారని అంటున్నారు. ఈ ఎన్నికల్లో తాము సెంచరీ కొడతా మని పైకి చెబుతున్నా.. కనీసం 50 కన్నా ఎక్కువ డివిజన్లలో గెలిచి తీరుతామని రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలు భరోసాగా ఉన్నారు. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు ముఖ్య నాయకులు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, డి.కె.అరుణ, ధర్మపురి అరవింద్ తదితరులు పోలింగ్ సరళిపై ఎప్పటికప్పుడు డివిజన్ల వారీగా ఆరా తీస్తూ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. గెలిచే స్థానాల్లో పోలింగ్ ముగిసేంత వరకు పట్టువీడొద్దని సూచించారు. అయితే, తగ్గిన పోలింగ్ శాతం ఏం చేస్తుందన్న టెన్షన్ కూడా బీజేపీ నేతల్లో కనిపిస్తోంది. యువత, విద్యాధికుల ఓట్లు పెద్దగా పోల్ కాకపోవడం నష్టం చేస్తుందేమోనన్న ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. కాంగి‘రేసు’ఎంత వరకు? రాష్ట్రంలో ఆటుపోట్లు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ విషయం లో జీహెచ్ఎంసీ ఓటర్లు ఏం చేశారన్నది ఆసక్తికరంగా మారింది. పోలింగ్ సరళిని పరిశీలించిన నాయకులు తాము 15–20 స్థానాల్లో గెలుస్తామని లెక్కలు వేసుకుంటున్నారు. రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్గిరి పరిధిలోని 47, చేవెళ్ల పరిధిలోని 18 డివిజన్లలో గట్టిపోటీ ఇచ్చామని చెబుతున్నారు. కోర్‌సిటీలో కొన్ని డివిజన్లలో తమకు అనుకూల పోలింగ్ జరిగిందని అంటున్నారు. పాతబస్తీ పతంగిదేనా..? పాతబస్తీలో మంచి పట్టు ఉన్న ఎంఐఎం మళ్లీ తన స్థానం అక్కడ పదిలమేనని అంటోంది. గతంలో గెలిచిన 44 స్థానాలకు ఒకట్రెండు ఎక్కువే కానీ తగ్గేది లేదని ధీమా వ్యక్తం చేస్తోంది. పోలింగ్ సరళిని పార్టీ ముఖ్య నేతలు అసద్, అక్బర్లు సమీక్షించి కేడర్‌ను అప్రమత్తం చేశారు. పాతబస్తీపై పట్టు అలాగే కొనసాగుతుందన్న ధీమా దారుస్సలాం వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇక, 29 స్థానాల్లో పోటీ చేసిన సీపీఐ, సీపీఎం లతో పాటు 26 చోట్ల బరిలోకి దిగిన టీజేఎస్ కూడా తాము గట్టిపోటీ ఇవ్వగలిగామనే అభిప్రాయంతో ఉన్నాయి. స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో సత్తా చాటుతామనే ధీమాలో ఉన్నారు. ఎవరికి వారే తమ డివిజన్లలో పోలైన ఓట్లలో ఎన్ని తమకు సానుకూలమనే లెక్కలు కట్టుకుంటున్నారు. ఏం జరుగుతుంది... రాజకీయ పార్టీల భవితవ్యం ఎలా ఉండబోతుందన్నది ఈనెల 4న తేలనుంది. -
ఏ బాక్సులో...ఏముందో
గ్రేటర్ వార్ ముగిసింది. నాయకుల్లో మరో టెన్షన్ మొదలైంది. ఓటింగ్ శాతం తగ్గడం ఎవరిని ముంచుతుందో... అనే ఆందోళన ఒకవైపు నెలకొంది. మరోవైపు నిక్షిప్తమైన ఓటరు తీర్పు ఎటువైపనే భయం వెంటాడుతోంది. ఆయా డివిజన్లకు పార్టీలు నియమించిన ఇన్చార్జిల్లో ఇప్పుడు గుబులు మొదలైంది. తేడా వస్తే అధిష్టానం దృష్టిలో పలుచనవుతామని భయపడుతున్నారు. ఎప్పటిలాగా కాకుండా జీహెచ్ఎంసీ ఎన్నికలు ఈసారి ఒక ఊపుమీద జరిగాయి. ప్రచారంలో చాలామంది కనిపించినా ఓటింగ్‌కు మాత్రం నగర యువత దూరంగా ఉంది. ఓటింగ్ శాతం భారీగా తగ్గడంతో మెజారిటీ దేవుడు ఎరుగు... గట్టెక్కితే చాలనే అభిప్రాయంతో డివిజన్ల ఇన్చార్జిలు ఉన్నారు. ఓటర్ అంతరంగం అంతుపట్టడం లేదంటున్నారు. అభివృద్ధి మీద కాకుండా... మతం, దేశం పేరిట భావోద్వేగాలతో పార్టీలు ప్రచారం ముగించాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎవరి అంచనాలు తారుమారవుతాయి, ఎవరికి దెబ్బపడుతుందనేది... ఈనెల 4న బాక్సులు తెరిచి ఓట్లు లెక్కిస్తే తేలనుంది. అప్పటిదాకా వేచిచూడాల్సిందే. –సాక్షి, హైదరాబాద్ సమయమే లేదు... ప్రచారానికి కేవలం 10 రోజుల వ్యవధి మాత్రమే చిక్కింది. పెద్దగా సమయం లభించలేదు. ఏం చేయాలి, ఎలా చేయాలని ఆలోచించుకొని పూర్తిస్థాయిలో కార్యరంగంలోకి దిగేసరికి ప్రచారం గడువు ముగిసింది. ప్రతీ ఓటర్ను కలిసి ఓటు అడిగే సమయం దొరకలేదని అభ్యర్థులు, నాయకులు అంటున్నారు. టీఆర్ఎస్ మంత్రులను, ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి ఒక్కో డివిజన్ బాధ్యతను అప్పగించింది. గ్రేటర్ ప్రచారబాధ్యత తీసుకున్న కేటీఆర్ అన్నీ తానై రోడ్‌షోలు నిర్వహించారు. వివిధ సంఘాలతో, వాణిజ్యవర్గాలతో భేటీ అయ్యారు. చివర్లో... నవంబర్ 28న జరిగిన సీఎం సభ టీఆర్ఎస్లో జోష్ నింపిందని చెప్పొచ్చు. బీజేపీ కూడా ముఖ్యులకు డివిజన్ల బాధ్యతలు అప్పగించినా... ఎక్కువగా స్టార్ క్యాంపెయినర్ల ప్రచారంపైనే ఆధారపడింది. అమిత్ షాతో సహా పలువురు కేంద్ర మంత్రులు, యూపీ సీఎం యోగి, జాతీయ అధ్యక్షుడు నడ్డా తదితరులు ప్రచారానికి ఊపు తెచ్చారు. అయితే పార్టీని చివర్లో ఓటర్ల దగ్గరికి తీసుకెళ్లలేకపోయారనే భావన నెలకొందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. పార్టీ అగ్రనేతలు అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఒవైసీలు ప్రచారం నిర్వహించినా... ఎంఐఎం ప్రధానంగా ఎమ్మెల్యేలపై భారం మోపింది. పాతబస్తీలో పట్టు నిలుపుకునేందుకు శ్రమించింది. వరదల కారణంగా బస్తీల్లో కొంత వ్యతిరేకత వచ్చినా... అది పార్టీకి ఇబ్బందికరంగా పరిణమించదనే భావనలో మజ్లిస్ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇళ్లు సర్దుకొని రంగంలోకి దిగేసరికి ప్రచారం ముగింపుకొచ్చింది. పెద్ద నాయకులు విస్తృతంగా తిరగకపోవడం, పార్టీ నేతలు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించడం కాంగ్రెస్‌కు ప్రతికూలమని చెప్పొచ్చు. ఎంతచేసినా... ఓటింగ్ పెరగలేదు ఆయా డివిజన్లకు పార్టీలు నియమించిన ఇన్చార్జీల్లో గుబులు మొదలైంది. గ్రేటర్ పోరు ప్రతిష్టాత్మకంగా మారడంతో ఈ ఇన్చార్జీలు తమ సొంత నియోజకవర్గాల నుంచి పార్టీ కేడర్‌ను దింపి మరీ ప్రచారం చేయించారు. ప్రచారంలో ఉన్న జోష్ ఓటింగ్‌లో లేకపోవడం... వీరికి ఇబ్బందిగా మారింది. స్థానిక నాయకులకు బాధ్యతలు అప్పగించినా... ఓటింగ్ శాతాన్ని పెంచలేకపోయామని మధనపడుతున్నారు. ఫలితంలో తేడా వస్తే... తమ రాజకీయ జీవితంపై ఇదొక రిమార్క్‌గా ఎక్కడ మారుతుందోనని ఆందోళన చెందుతున్నారు. పోటీ ముఖ్యంగా టీఆర్ఎస్, మజ్లిస్, బీజేపీ మధ్యే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 31 మంది ఎక్స్అఫీషియో సభ్యుల బలంతో టీఆర్ఎస్ మేయర్ రేసులో ముందుంటుందని భావిస్తున్నారు. -
ఈ నగరానికి ఏమైంది ?
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటేసేందుకు నగర ప్రజలు బద్ధకించడం, పోలింగ్ ఆద్యంతం మందకొడిగా సాగడం పట్ల సామాజిక మాధ్యమాల్లో భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్ శాతం తగ్గిపోవడం పట్ల కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తే, ఓటేయకపోవడం కూడా అసమ్మతి ప్రకటనే, దాన్ని గౌరవిద్దామని మరికొందరు పేర్కొన్నారు. ఇంకొంతమంది హైదరాబాదీల బద్ధకంపై జోకులను పేల్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగడం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ‘ఈ నగరానికి ఏమైంది.. ఎందుకు ఇంత తక్కువ పోలింగ్.. సాఫ్ట్వేర్ వాళ్లే కాదు, పాతబస్తీలో కూడా ఇంత తక్కువ పోలింగ్..’అని నెటిజన్ శ్రీశైల్‌రెడ్డి పంజుగుల ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వాలు తమను ఎన్నుకునే ప్రక్రియ (పోలింగ్)లో పాల్గొనని వారికోసం పనిచేస్తా యని జీహెచ్ఎంసీ ఎన్నికలు రుజువు చేశాయి’ అని వ్యవసాయ శాస్త్రవేత్త జీవీ రామాంజనేయులు అభిప్రాయపడ్డారు. సంపన్న వర్గాలు ఓటింగ్‌కు దూరంగా ఉంటారని, ప్రభుత్వాలు మాత్రం ఇలాంటి వారి ప్రయోజనాల కోసమే పనిచేస్తాయని ఆయన పాలకుల తీరుపై పరోక్షంగా చురకలంటించారు. ‘గలీజు ప్రచారాలకు ఖాండ్రించి ఉమ్మేసిన హైదరాబాద్ సగటు ఓటరు’ అని ఆర్జేవై నవీన్ రాజకీయ పార్టీల వైఖ రిపై మండిపడ్డారు. ‘రూ.10వేల వరద సహాయానికై మీసేవ కేం ద్రాల వద్ద వరద వెల్లువలా పోటెత్తిన సిటిజన్లు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటెత్తలేదెందుకూ..?’ అని బొగ్గుల శ్రీనివాస్ ప్రశ్నించారు. సాయంత్రం 6 కాకుండానే నగరంలోని మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతంలో మూసి ఉన్న మద్యం దుకాణం ముందు బారులు తీరిన జనం మొబైల్ పోలింగ్ బూత్‌లు పెట్టుకోవాలే! ‘మొబైల్ పోలింగ్ బూత్‌లు పెట్టుకోవాల్నేమో ఇగ..’ అని వేదుల పవన్‌కుమార్ ఎన్నికల సంఘానికి కొత్త ఐడియా ఇచ్చారు. ‘ఒక్క రెండు గంటలు హైదరాబాద్‌లో నెట్ బంద్ చేయండ్రి. కలుగులో ఎలుకల్లా పోలింగ్ బూత్‌లకు వస్తరని ప్రజల మొబైల్ ఫోన్ల వ్యవసనంపై రేగుంట రాజేశ్వర్ సెటైర్ వేశారు. ‘మిట్ట మిధ్యాహ్నం అవుతున్నా.. నగరం నిద్రపోతున్న వేళ, లేసి ఓటేయకపోతే జనాభా లిస్టులో ఉన్నా లేనట్లే..’అని గోనె మార్కండేయులు హైదరాబాదీల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఓటేయాలని ఒత్తిడి చేయడం, ఓటేయని వాళ్లను అవమానించడం కూడా ఫాసిజమే. ఓటేయకపోవడం కూడా నిరసనే..’ అని పి.మోహన్ అనే చిత్రకారుడు అభిప్రాయపడ్డారు. ‘ఓటేయకపోవడం అసమ్మతి ప్రకటనే.. దాన్ని గౌరవిద్దాం.. రాజ్యాంగం పట్ల విశ్వాసం లేకపోయినా రాజ్యాంగ హక్కులు పౌరులకు అందుతాయి. ఓటేసినా, వేయకున్నా ప్రశ్నించే హక్కు వారికి ఉంటుంది. అతిగా ఆవేశపడి వాట్సాప్ యూనివర్సిటీల్లో చదువుకున్నట్టు ట్రోలింగ్ చేయకండి..’అని అరుణాంక్ లత పేర్కొన్నారు. రాజకీయ పార్టీల దూషణలు, రెచ్చగొట్టే ప్రసంగాల తరహాలో కాకుండా జీహెచ్ఎంసీ ఎన్నికల సరళిపై నెటిజన్లు ప్రజాస్వామ్యంగా, మర్యాదపూర్వకంగా చర్చించుకోవడం విశేషం. -
గ్రేటర్లో పోలింగ్ 45.71%
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో 45.71 శాతం పోలింగ్ నమోదైనట్లు మంగళవారం రాత్రి ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అయితే పూర్తి స్థాయి పోలింగ్ వివరాలను బుధవారం ప్రకటించనున్నట్లు వెల్లడించింది. కాగా, కొన్ని డివిజన్లలో కనీసం 25 శాతం కూడా పోలింగ్ నమోదు కాలేదని తెలుస్తోంది. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45.29 శాతం పోలింగ్ నమోదైంది. జీహెచ్ఎంసీలోని 149 డివిజన్ల పరిధిలో మంగళవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ ఆద్యం తం మందకొడిగా సాగింది. కరోనా భయానికి తోడు పార్టీలు, నేతల తీరుపై సరైన అభిప్రాయం లేక చాలామంది ఓటేసేందుకు అయిష్టత వ్యక్తం చేశారు. ఆయా డివిజన్లలో పోటీచేస్తున్న 1,122 మంది అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ పెట్టెల్లో నిక్షిప్తమైంది. పోలీసు భద్రత నడుమ బ్యాలెట్ పెట్టెలను స్ట్రాంగ్ రూంలకు తరలించారు. ఈ నెల 4న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలు ప్రకటిస్తారు. ఓల్డ్ మలక్‌పేటలో రీపోలింగ్.. ఓల్డ్ మలక్‌పేట డివిజన్ (నంబర్ 26) లో సీపీఐ అభ్యర్థి గుర్తు కంకి కొడవలిని బ్యాలెట్ పేపర్‌పై ముద్రించాల్సి ఉండ గా, పొరపాటున సీపీఎం గుర్తు సుత్తి కొడవలి, నక్షత్రం గుర్తు ముద్రించారు. సీపీఐ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ డివిజన్లో పోలింగ్‌ను నిలిపేసి 3న రీపోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. రీపోలింగ్‌లో ఓటర్ల మధ్య వేలుకు సిరా గుర్తు వేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఒక్క ఘటన మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కాగా, 3న రీపోలింగ్ నిర్వహిస్తుండడంతో ఆ రోజు సాయంత్రం 6 గంటల వరకు జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రకటించొద్దని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఫిబ్రవరి 10 తర్వాతే.. ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలక మండలి పదవీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 వరకు ఉంది. ఆ తర్వా తే కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల ప్ర మాణ స్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఆలోగా ప్రభుత్వం చట్ట సవరణలు తీసుకొస్తే మాత్రం ముందే మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకునే అవకాశముంది. వారు ఫిబ్రవరి 10 తర్వాతే బా ధ్యతలు స్వీకరించాలి. దీనిపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అధికార వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 10 వరకు వేచి చూస్తే కొత్తగా ఎన్నికైనా కార్పొరేటర్లను ప్రలోభాలకు గురి చేసి వేరే పార్టీల వారు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చట్ట సవరణ ద్వారా ముందే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. భయంతోనే ఓటర్లు రాలేదా? సార్వత్రిక ఎన్నికల తరహాలో పార్టీలు హోరాహోరీ ప్రచారం నిర్వహించడం, వ్యక్తిగత దూషణలు, రెచ్చగొట్టే ప్రసంగాలు, అక్కడక్కడ ఘర్షణలకు సైతం దిగడంతో.. పోలింగ్ రోజు అవాంఛనీయ ఘటన లు, ఉద్రిక్తతలు తలెతొచ్చని చాలామంది ఓటు వేసేందుకు రాలేదని తెలుస్తోంది. అయితే చెదురు మదురు ఘటనలు తప్ప అంతటా పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో ప్రభుత్వ, పోలీస్ యంత్రాం గం ఊపిరి పీల్చుకుంది. కరోనా మహమ్మారి భయం వేధిస్తున్నా 48 వేల మంది పోలింగ్ సిబ్బంది, 52,500 మంది పోలీసు సిబ్బంది ఎన్నికల విధులను విజయవంతంగా నిర్వహించారు. -
అదే తీరు.. అత్తెసరు
సాక్షి, హైదరాబాద్: ఓటుపై కరోనా కాటు పడింది. గ్రేటర్ సమరంలో జనం భయంతో ఇళ్లకే పరిమితమయ్యారు. అధికార యంత్రాంగం తీసుకున్న కోవిడ్ జాగ్రత్తలు... ఓటర్లలో విశ్వాసాన్ని పెంచలేకపోయాయి. ఎందుకు వెళ్లడం, అంటించుకోవడం... లేని పోని ‘రిస్క్’మనకొద్దు అనుకున్నారు. కరోనా సెకండ్ వేవ్‌కు భయపడి.. ‘సేఫ్’జోన్లో ఉండిపోయారు. జనం గుమిగూడే చొటుకు వెళ్లడానికి జంకారు. ఓటేయడానికి ముందుకు రాలేదు. వయోవృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారైతే అసలు పోలింగ్ కేంద్రాల వైపు చూడలేదు. ఫలితంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం అనుకున్నంతగా పెరగలేదు. 2016లో గ్రేటర్లో 45.29% పోలింగ్ నమోదు కాగా.. ఇప్పుడు అదే అత్తెసరు పోలింగ్ నమోదైంది. నిజానికి ఈసారి పోలింగ్ పెరుగుతుందని అందరూ ఆశించారు. గ్రేటర్లో హోరాహోరీగా ప్రచారం జరగడం.. పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం.. చతురంగ బలాలను మోహరించి సర్వశక్తులూ ఒడ్డడం.. జాతీయస్థాయి నేతలు, కేంద్రమంత్రులు, సీఎంలు రంగంలోకి దిగడం వంటి పరిణామాలతో.. ఓట్లు పోటెత్తుతాయని భావించారు. కానీ కరోనా దెబ్బేసింది. 2016 పోలింగ్ కంటే కేవలం 0.42%మాత్రమే అధికంగా 45.71% పోలింగ్ నమోదైంది. సాధారణంగా సంపన్నవర్గాలు ఓటేయడానికి ఆసక్తి చూపవు. ఈసారి అందుకు భిన్నంగా హైదరాబాద్‌లో అత్యధికంగా ఉండే బస్తీవాసులు, నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు కూడా మొహం చాటేశారు. టెకీలూ దూరంగా ఉన్నారు. ప్రధాన కారణం కరోనా భయం. వరుస సెలవులు, వర్క్ ఫ్రం హోం వంటివి కూడా ఓటింగ్‌శాతం తగ్గిపోవడానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. తాము ఎంతగా ప్రయత్నం చేసినా జనం ఇళ్లు విడిచి బయటకురాకపోవడంతో నాయకులు తలలుపట్టుకుంటున్నారు. పడిన ఓట్లు ఎవరికనేది... ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నా లోలోపల ఆందోళన చెందుతున్నారు. కరోనా... డర్: బ్యాలెట్ పేపర్‌తో ఓటింగ్ కావడంతో పలుచోట్ల చేతులతో తాకాల్సి ఉంటుంది. బ్యాలెట్‌పై వేసే ఎన్నికల ముద్రను ఓట్లు వేసేందుకు వచ్చే వారంతా చేతులతో పట్టుకుంటారని, దాంతో కరోనా వస్తుందేమోనని అనేక మంది భయపడ్డారు. పోలింగ్‌బూత్‌ల వద్దకు ఎక్కువమంది జనం వస్తారని, కరోనా వ్యాప్తికి ఆస్కారమున్న చోటికి వెళ్లడం శ్రేయస్కరం కాదని భావించినట్లు కొంతమంది చెప్పుకొచ్చారు. కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి చాలామంది వయోవృద్ధులు ఇళ్లకే పరిమితమై ఉంటున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావట్లేదు. ఇంట్లో కూడా మిగిలిన కుటుంబ సభ్యులతో దూరం పాటిస్తున్నారు. ఓటేసేందుకు వేళ్తే కరోనా సోకే ప్రమాదముందని భయంతో వయోవృద్ధులతో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కడా ఓటర్లు బారులు తీరి కనిపించకపోవడానికి ప్రధాన కారణం కరోనా భయమే అని చర్చ జరుగుతోంది. ప్రచారంలో నువ్వానేనా అన్నట్లు మాటల యుద్దం చేసిన నాయకులు ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించడంలో విఫలమయ్యారు. కరోనా వల్ల హైదరాబాద్‌లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయిన వారంతా గ్రామాల్లోనే ఉండిపోయారు. దీనికి తోడు వరుసగా మూడు రోజులు సెలవులు రావడం సైతం జీహెచ్ఎంసీ పోలింగ్ శాతం తగ్గడానికి కారణమైంది. గత నెల 29న ఆదివారం, 30న గురునానక్ జయంతి,, ఈ నెల 1న (మంగళవారం) జీహెచ్ఎంసీ ఎన్నికల రూపంలో వరుసగా మూడు రోజులు (టెకీలకు అయితే శనివారంతో కలిపి నాలుగు రోజులు) సెలవులు లభించడంతో చాలామంది నగర ప్రజలు పల్లెలకు వెళ్లిపోయారు. వర్క్‌ఫ్రం హోం... నగరానికి దూరం నగరంలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు అధికంగా ఉండే శేరిలింగంపల్లి, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, సనత్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఓటింగ్‌శాతం భారీగా పడిపోవడానికి కారణం వర్క్‌ఫ్రం హోం అని రాజకీయ నాయకులు వాపోతున్నారు. ఐటీ రంగంలో పనిచేసే 5.5 లక్షల మందిలో దాదాపు లక్ష మందికి ఓటు హక్కు ఉన్నా.. వారిలో 90 శాతం మంది గత కొన్ని నెలలుగా వర్క్ ఫ్రం హోం చేస్తూ తమ స్వస్థలాల్లోనే ఉండిపోయారు. కార్తీక పౌర్ణమికి సోమవారం ఉపవాసాలతోనే గడిపి.. మరునాడు నగరానికి వచ్చి ఓటేసే చొరవ తీసుకోలేకపోయారు. వర్క్‌ఫ్రం హోం విధానం తమ విజయావకాశాలను తీవ్రంగా ప్రభావితం చేసిందని ఓ నాయకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభావితం చేయలేకపోయిన హామీలు రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, భావోద్వేగ ప్రసంగాలు ఓటర్లను ప్రభావితం చేయలేకపోయాయి. ఈసారి పార్టీలు పోటీపడి ప్రజాకర్షక పథకాలు ప్రకటించాయి. వరదసాయం టీఆర్ఎస్ రూ.10 వేలు ఇస్తే... బీజేపీ రూ.25 వేలు, కాంగ్రెస్ రూ.50వేలు ఇస్తామన్నాయి. ఇందులో బీజేపీ ఓ అడుగు ముందుకేసి వరదల్లో బైకు, కారు కొట్టుకుపోతే... కొత్తవి ఇస్తామని వాగ్దానం చేసింది. ఇవేవీ జనాన్ని ఆకట్టుకోలేకపోయాయని పోలింగ్ శాతాన్ని బట్టి స్పష్టమవుతోంది. కానుకలు పంచినా.. కనికరించలే! పలు పార్టీలు సోమవారం ఓటర్లను ప్రసన్నం చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాయి. ఓటరు స్లిప్పుల రూపంలో ఇంటింటికీ కానుకలు, చీరలు, నగదు, మద్యం బాటిళ్లు విపరీతంగా పంచారు. అంతేకాకుండా కార్తీక భోజనాలు, బర్త్‌డేలు, గెట్ టు గెదర్‌ల పేరుతో భారీ విందులు ఏర్పాటు చేశారు. వీటికి హాజరైన వారికి రిటర్న్ గిఫ్ట్‌ల రూపంలో విలువైన కానుకలు అందజేశారు. ఇవి తీసుకున్న ఓటర్లలో సగం మందికి పైగా నేతలకు హ్యాండిచ్చారు. ఇంటి నుంచి బయటికి రాకుండా నేతలకు ఊహించని రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. రూ.లక్షలు పోసి ఓట్లను కొందామనుకుంటే.. ఈ స్థాయిలో ఓటర్ల నుంచి పరాభవం ఎదురవుతుందని ఊహించలేదని పలువురు వాపోతున్నారు. సోషల్ మీడియాలోనే చైతన్యం ఎవరు గెలిచినా ఏం లాభం .. అంతా ఒక తాను ముక్కలేనని సంపన్నవర్గాలతో పాటు విద్యావంతుల్లో సైతం ఓ అభిప్రాయం ఉంది. నగరంలో రోడ్ల దుస్థితి, రోడ్లపై డ్రైనేజీ ప్రవాహం, విద్యుత్ సరఫరాకు అంతరాయం, నీటి సరఫరా బంద్... సమస్య ఏదైనా సరే వీరు సంబంధిత ప్రభుత్వ కార్యాలయాలకు కానీ, స్థానిక ప్రజాప్రతినిధులకు కానీ ఫిర్యాదు చేయకుండా కేవలం సోషల్‌మీడియా ద్వారా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంటారు. వీరు సామాజిక మాధ్యమాల్లో... పోస్టింగుల్లో చూపే చైతన్యం ఓటుకు వచ్చేసరికి చూపలేదని చర్చ జరుగుతోంది. -
ఓటేయని వారికి ప్రభుత్వ పథకాలు ఇవ్వొద్దు
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో తక్కువ ఓటింగ్ నమోదు కావడం బాధాకరమిని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. చాలా మంది ఓటర్లు తమ ఓటు హక్కు ఉపయోగించుకునేందుకు ఆసక్తి చూపకపోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఓటు హక్కుపై ఎన్నికల కమిషన్ మరింత అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులకు సీట్లు పొందాలన్నా, సర్టిఫికెట్ తీసుకోవాలన్న కచ్చితంగా ఓటు వేసి ఉండాలన్న నిబంధన పెట్టాలి అని సూచించారు. ఓటు వేసిన వ్యక్తులకే ఉద్యోగ, విద్యావకాశాలు కల్పించాలన్నారు. అలాగే ఓటేయని వారికి ప్రభుత్వ పథకాలు ఇవ్వకుండా చర్యలు తీసుకుంటేనే ఓటింగ్ శాతం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. (చదవండి : గ్రేటర్ వార్: పోలింగ్ కేంద్రంలో సిబ్బంది కునుకుపాట్లు) -
ఎల్లుండి ఓల్డ్‌మలక్‌పేటలో రీపోలింగ్
-
అందుకే ఓటింగ్ శాతం తగ్గింది : కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గినందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం సిగ్గుతో తల దించుకోవాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా విద్వేషాలు జరుగుతాయని చెప్పడం వల్లే ఓటింగ్ శాతం తగ్గిందన్నారు. మంగళవారం ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం, ఎన్నికల సంఘం కుమ్మక్కై ఎన్నికలు నిర్వహించారని ఆరోపించారు. (చదవండి : గ్రేటర్ పోరు: నగరవాసికి ఎందుకింత బద్ధకం?!) పోలీసు అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించారని మండిపడ్డారు. ఉపాధ్యాయులు లేకుండా ఎన్నికలు జరిపి ప్రభుత్వం వారిని అవమానించిందన్నారు. ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ పెట్టడం తిరోగమన చర్యగా అభివర్ణించారు. పోలింగ్ శాతం తగ్గించడానికి టీఆర్ఎస్ లేనిపోని అపోహలు సృష్టించారని విమర్శించారు. టీఆర్ఎస్ నేతలు కుట్రలు చేసి బీజేపీ విజయాన్ని అడ్డుకోవాలని చూశారని, కానీ పోలింగ్ సరళి చూశాక గెలుస్తామనే విశ్వాసం కలిగిందని మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. (చదవండి : పోలింగ్ కేంద్రంలో సిబ్బంది కునుకుపాట్లు) కాగా, గత ఎన్నికలలో పోలిస్తే ఈ సారి గ్రేటర్లో ఓటింగ్ శాతం భారీగా తగ్గింది. సాయంత్రం 5 గంటల వరకు 35.80 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. ఆర్సీపురం, పటాన్చెరు, అంబర్‌పేట్‌లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదు కాగా, మలక్‌పేట్, కార్వాన్లో అత్యల్పంగా ఓటింగ్ నమోదైంది. -
ముగిసిన జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్
-
పోలింగ్ కేంద్రంలో సిబ్బంది కునుకుపాట్లు
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ దారుణంగా ఉంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు కేవలం 25 శాతం మాత్రమే పోలింగ్ నమోదయ్యింది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అత్యల్ప ఓటింగ్ నమోదవుతోంది. ఐటీ ఉద్యోగులు ఉన్న ప్రాంతాల్లో కంటే నగర శివారుల్లో పోలింగ్ కాస్త మెరుగ్గా ఉంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు భారీఎత్తున ప్రచారం చేసినా నగర ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గరకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. (చదవండి : గ్రేటర్ పోరు: నగరవాసికి ఎందుకింత బద్ధకం?!) పోలింగ్‌కు మరో గంటన్నర సమయం మాత్రమే ఉన్నా.. ఓటర్లు బయటకు రావడంలో లేదు. చాలా చోట్ల పోలీంగ్ బూత్‌లు ఖాళీగా కనిపిస్తున్నాయి. చాలా చోట్ల పోలింగ్ సిబ్బంది, పోలీసులు తప్ప ఓటర్లు కనిపించడం లేదు. మధ్యాహ్నం దాటిన ఓటర్లు రాకపోవడంతో ఓ పోలింగ్ కేంద్రంలో సిబ్బంది నిద్రపోయారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్‌గా మారాయి. (చదవండి : గ్రేటర్ ఫైట్: లంగర్‌హౌస్‌లో అత్యల్పంగా 6.77 శాతం పోలింగ్) జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతిసారి తక్కువ ఓటింగ్ శాతం నమోదువుతుంది. 2016లో 45.25 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. గతంతో పోలిస్తే ఈసారి తక్కువ పోలింగ్ నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారాన్ని ఊదరగొట్టిన నాయకులు.. ఓటర్లను బూత్‌కి రప్పించడంలో విఫలమయ్యారనే చెప్పొచ్చు. -
జీహెచ్ఎంసీ ఎన్నికలో ఓటేసిన ప్రముఖులు
-
గ్రేటర్ పోరు: నగరవాసికి ఎందుకింత బద్ధకం?!
సాక్షి, హైదారాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచి నగరంలో ఎక్కడ చూసినా కోలాహలమే. గ్రేటర్ ఎన్నికను ఎంతో సీరియస్‌గా తీసుకున్న ప్రధాన పార్టీలన్ని ఢీ అంటూ ఢీ అన్నట్లు ప్రచారాన్ని కొనసాగించాయి. లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మైకుల మోత.. టపాసుల కాల్చడం వంటివి చేస్తూ సందడి వాతావరణం కనిపించింది. అభ్యర్థులందరూ ప్రచారాలతో హోరెత్తించారు. కానీ నేడు పోలింగ్ చూస్తే.. ఆశ్చర్యం కలుగుతుంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు కేవలం 25 శాతం మాత్రమే పోలింగ్ నమోదయ్యింది. మొత్తం మీద 50 శాతం అయినా నమోదవుతుందా లేదా అనే సందేహం తలెత్తుతుంది. ఓటర్లు లేక పోలింగ్ కేంద్రాలు బోసి పోయి కనిపిస్తున్నాయి. చాలా చోట్ల బూత్ ఏజెంట్లు, పోలీసులు తప్ప ఓటర్లు కనిపించడం లేదు. బస్తీలు, నగర శివార్లలో పోలింగ్ కాస్త మెరగ్గా ఉంది. ఇక వైట్ కాలర్ జాబులు చేసే వారు, టెకీలు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో పోలింగ్ ఒక్కశాతం కూడా దాటకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో జాబ్ హోల్డర్స్, టెకీల తీరును నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు. ‘ఓటు మన బాధ్యత అంటూ వాట్సాప్ స్టేటస్లు పెట్టడం కాదు.. వచ్చి ఓటు వేయడం ముఖ్యం’.. ‘ఆ పార్టీ అలా.. ఈ పార్టీ ఇలా అన్ని తిట్టడానికి ముందుంటారు మరి ఓటేయడానికి ఏమైంది’.. ‘ఇంత నిరాసక్తత ఎందుకు.. మీకంటే నిరాక్షరాస్యులు మేలు.. ఓటు వేయడం తమ బాధ్యత అనుకుంటారు.. ఓటేయకపోతే.. నేరం చేసినట్లు భావిస్తారు.. కానీ సిటీ జనాలు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు’.. అంటే ‘వీరంతా కేవలం కీ బోర్డు వారియర్లేనా’ అంటూ నగరవాసుల తీరును దుయ్యబడుతున్నారు నెటిజనులు. (వారికి మీరే ప్రేరణ, థ్యాంక్స్ : కేటీఆర్) వరుస సెలవులు ఓ కారణం గ్రేటర్లో ఇంత తక్కువ పోలింగ్ నమోదు కావడానికి ప్రధాన కారణం వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడం. పోలింగ్ నాడు సెలవు ఇచ్చి.. ఓటు వేయమని చెప్పినా.. చాలా మందికి బద్ధకం. ఇళ్ల దగ్గరే ఉంటారు కానీ ఓటు వేయరు. అలాంటిది శని, ఆదివారాలు వీకాఫ్.. సోమవారం గురునానక్ జయంతి.. మంగళవారం పోలింగ్ కావడంతో ప్రభుత్వ సెలవు అన్ని కలుపుకుని వరుసగా నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. దాంతో టెకీలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగస్తులు ఊరి బాట పట్టారు. పోలింగ్ ఇంత తక్కువ నమోదవ్వడానికి ఇది ప్రధాన కారణం. ఇక ఓట్లు వేరే చోటకి మారడంతో అక్కడికి వెళ్లి ఓటు వేయడం ఇష్టం లేక కొందరు ఊరుకున్నారు. ఇక కరోనా భయంతో మరికొందరు ఓటు వేయడానికి ఇష్టపడలేదు. ప్రచారం వరకే.. పోలింగ్‌ను పట్టించుకోని పార్టీలు ఇక ఎన్నికలనగానే నామినేషన్ల దాఖలు నుంచి ప్రచార పర్వం ముగిసే వరకు ఎంతో ఉత్సాహంగా దూసుకుపోయే పార్టీలు.. పోలింగ్ని మాత్రం పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించదు. ప్రచారంలో దూసుకుపోయే పార్టీలు.. ఓటు వేయండి అంటూ ప్రజలను చైతన్యం చేయడంలో వెనకబడ్డాయనే చెప్పవచ్చు. సినీ, రాజకీయ ప్రముఖులు స్వయంగా వచ్చి ఓటేసి.. జనాలను ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేసినప్పటికి నగర ఓటరు తీరులో మాత్రం పెద్దగా మార్పు లేదు. (చదవండి: చేతులు కడగండి.. పాలిటిక్స్‌ను కూడా!) గ్రామాల్లో పండగ వాతావరణం ఇక ఏ ఎన్నికలయినా సరే పట్టణాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ అధికంగా ఉంటుంది. ఉపాధి కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు పోలింగ్ నాటికి స్వగ్రామాలకు వచ్చి తప్పక ఓటు వేస్తారు. స్థానిక నాయకులు కూడా ప్రత్యేక శ్రద్దతో ఓటర్లను తరలిస్తారు. ఇక గ్రామీణ ప్రాంత ప్రజలు ఎన్ని పనులున్నా ఓటు వేయడం మాత్రం మర్చిపోరు. ఇక నగరవాసుల తీరు పట్ల నెటిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటేయని వారి ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు, రేషన్ కార్డు వంటివి రద్దు చేయాలని సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా పోలింగ్ ముందు ఇలా వరుస సెలవులు రాకుండా చూసుకోవాలంటున్నారు. -
వారికి మీరే ప్రేరణ, థ్యాంక్స్ : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: హోరాహోరీగా జరుగుతున్న గ్రేటర్ ఎన్నికల పోరులో పేలవమైన పోలింగ్ శాతం నిరాశపరుస్తున్న తరుణంలో పెద్దవాళ్లు శ్రమకోర్చి మరీ ఓటు వేస్తున్న సంఘటనలు ఆసక్తికరంగా మారాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్‌పై నగర వాసుల ఆసక్తి అంతంత మాత్రంగానే ఉండగా వికలాంగులు, వయోవృద్ధులు ఆదర్శంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా 80 ఏళ్ల సీనియర్ సిటిజన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ విషయాన్ని ఆమె మనవరాలు పద్మశ్రీ ట్విటర్లో వెల్లడించారు. తన అమ్మమ్మకు టీఆర్ఎస్కు ఓటు వేసేందుకు లాక్డౌన్ తరువాత తొలిసారి గడప దాటి బయటకు వచ్చిందని పేర్కొన్నారు. ఇందుకు తనకు చాలా సంతోషంగా ఉందంటూ దీన్ని మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేయగా, ఆయన స్పందించారు. అమ్మమ్మకు చాలా థ్యాంక్స్ అంటూ రిప్లై ఇచ్చారు. ఫిర్యాదులు తప్ప బయటకు వచ్చి ఓటు వేయడానికి ప్రయత్నించని వారందరికీ ఆమె స్ఫూర్తిదాయకమని ట్వీట్ చేశారు. కరోనాకారణంగా గత 3 నెలలుగా కదల్లేకుండా ఉన్నప్పటికీ, రవీందర్ (చీఫ్ ఎన్విరాన్మెంట్ సైంటిస్ట్) అమీర్‌పేట పోలింగ్ కేంద్రానికి వీల్ చైర్లో వచ్చి మరీ ఓటు వేశారు. మరో సంఘటనలో తన తండ్రి, హృద్రోగి. నడవలేని స్థితిలో టీఆర్ఎస్కు ఓటు వేశారంటూ మరొకరు ట్వీట్ చేశారు. మీపనితనాన్ని చూసిన మా అత్తగారు తన జీవితంలో తొలిసారి ఓటువేశారంటూ ఇంకొకరు ట్వీట్ చేయడం విశేషం. అటు భార్యతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదవుతోంది. ఓటర్లు లేక పోలింగ్ కేంద్రాలు బోసి పోయి కనిపిస్తున్నాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అధికారిక లెక్కలప్రకారం మధ్యాహ్నం ఒంటిగంటకు పోలింగ్ శాతం 18.20 శాతం మాత్రమే. మరోవైపు గ్రేటర్ మేయర్ పీఠంపై కన్నేసిన టీఆర్ఎస్, బీజేపీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. దొంగ ఓట్లు వేస్తున్నారని, అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. అధికార టీఆర్ఎస్ రిగ్గింగ్‌కు పాల్పడుతోందని బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో పలుచోట్ల ఘర్షణ వాతావరణం నెలకొంది. అటు గుర్తులు తారుమారుకావడంతో ఓల్డ్ మలక్‌పేటలో పోలింగ్ రద్దయింది. ఓల్డ్ మలక్‌పేట 69వ డివిజన్లో డిసెంబరు 3న రీపోలింగ్ నిర్వహించేందుకు ఈసీ నిర్ణయించింది. Many thanks to your Ammama🙏 She is an inspiration to all those who only complain but do not make the effort to come out and vote https://t.co/bA10KQGKzn — KTR (@KTRTRS) December 1, 2020 Senior Actor #KotaSrinivasaRao along with his wife casted vote at FNCC.#GHMCElections2020 #GHMC2020 pic.twitter.com/5OHe1Ev2fE — BARaju (@baraju_SuperHit) December 1, 2020 🙏 https://t.co/Gf3AQ0oq0i — KTR (@KTRTRS) December 1, 2020 -
ఓటు హక్కును వినియోగించుకున్న హీరో విజయ్ దేవరకొండ
-
కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఉద్రిక్తత
-
ఓల్డ్ మలక్‌పేటలో పోలింగ్ రద్దు
-
జీహెచ్ఎంసీ ఎన్నికలు : మందకొడిగా పోలింగ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో పోలింగ్ శాతం పెంపుపై తీవ్రం కృషి చేసిన అధికారులకు నిరాశే ఎదురవుతోంది. గత ఎన్నికలతో పోలిస్తే తాజా ఎన్నికల్లో పోలింగ్‌ను గణనీయంగా పెంచాలని గ్రేటర్ అధికారులు కసరత్తు చేశారు. టీఆర్ఎస్, బీజేపీ లకు ప్రతిష్టాత్మకంగా మారిన తాజా ఎన్నికల్లో భారీ ఎత్తున ప్రచారాన్ని చేపట్టాయి. మరోవైపు పలువురు సినీ ప్రముఖులు కూడా ఓటు మన హక్కు... తప్పనిసరిగా అందరూ ఓటు వేయండి అంటూ సోషల్ మీడియా వేదికగా నగర ప్రజలకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. అయినా ఓటింగ్ శాతంగాఅంతంతమాత్రమే. దీంతో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ పోలింగ్ సరళిపై ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబంతో కలసి ఓటు వేసి వచ్చిన ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి ‘‘మేమంతా..ఓటు వేశాం.. మీరూ వేయండి! ఇది మన బాధ్యత... హక్కు!!’’ అంటూ ట్వీట్ చేశారు. డైరెక్టర్ తేజ, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి,సినీ నటుడు అక్కినేని నాగార్జున, ఆయన భార్య అమల, హీరో విజయ్ దేవరకొండ కుటుంబం తదితరులు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ చాలా ప్రాంతాల్ లోమందకొడిగా సాగుతోంది. పోలింగ్ మొదలై దాదాపు మూడు గంటలు గడుస్తున్నా చాలా చోట్ల పోలింగ్ శాతం 3 శాతానికి మించలేదంటే పరిస్థితిని అర్ధం చేసు కోవచ్చు. కాగా తాజా సమాచారం ప్రకారం ఇప్పటివరకు 8.9 శాతం పోలింగ్ నమోదైంది. ఒకవైపు చలి తీవ్రత, కోవిడ్-19 ఆందోళన ప్రభావితం చేసినట్టు భావిస్తున్నారు. అయితే ఇపుడిపుడే కొన్ని చోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్లలో ఓట్లరు బారులు తీరుతున్నారని సమాచారం. మేము అంతా ఓటు వేశాం.. మీరూ వేయండి! ఇది మన బాధ్యత... హక్కు!! #ghmcelections2020 pic.twitter.com/rUZbGuwzJZ — Tanikella Bharani (@TanikellaBharni) December 1, 2020 -
గ్రేటర్ వార్: స్పందించని నగర వాసులు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)పోలింగ్ ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. గత ఎన్నికల కంటే ఈ సారి అతి తక్కువ పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. ఆర్సీపురం, పటాన్చెరు, అంబర్‌పేట్‌లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదు కాగా, మలక్‌పేట్, కార్వాన్లో అత్యల్పంగా ఓటింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. ఉదయం సమయంలో ఎక్కువగా నమోదైన పోలింగ్.. మధ్యాహ్నం భారీగా తగ్గిపోయింది. మొత్తంగా గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో పోలింగ్ శాతం దారుణంగా పడిపోయింది. ఇక గుర్తులు తారుమారుతో ఓల్డ్ మలక్‌పేట్‌లో పోలింగ్ రద్దయింది. అక్కడ డిసెంబర్ 3న పోలింగ్ నిర్వహించనున్నారు. ఫలితంగా ఈ రోజు వెల్లడించాల్సిన ఎగ్జిట్ పోల్స్ వాయిదా పడ్డాయి. రీపోలింగ్ ముగిసే వరకు ఎవరూ ఎలాంటి ఎగ్జిస్ట్ పోల్స్ ప్రకటించడానికి వీలు లేదని ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. డిసెంబర్ 4న ఫలితాలు ప్రకటించనున్నారు. 4న జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారు. జీహెచ్ఎంసీలో ఓటింగ్ శాతం దారుణంగా పడిపోయింది. నగర వాసులు ఓటు వేసేందుకు ఆసక్తి చూపలేదు. వరుస సెలవులు ఉండటంతో సొంతూళ్లకు వెళ్లిపోయారు. మరో వైపు కరోనా భయంతో ఓటు వేసేందుకు జనం బయటకు రాలేదు. చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడంతో ఐటీ ఉద్యోగులు సొంతూళ్ల నుంచే ఉద్యోగాలు చేసుకుంటున్నారు. రాజకీయ నేతల దూషణల పర్వం కూడా ఓటింగ్ తగ్గడానికి కారణమని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2016లో 45.25 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ►మధ్యాహ్నం మూడు గంటల వరకు బోరబండ 35.69, అల్లాపూర్ 33.43, వెంగల్‌రావ్‌నగర్ 28.32, రెహమత్నగర్ 31.11 , ఎర్రగడ్డ 30.55, ఫతేనగర్ 34.77 శాతం, సనత్‌నగర్ 26.19, అమీర్‌పేట్ 26.21, ఫలక్‌నుమా 17, నవాబ్సాబ్ కుంట 18.2, దూద్‌బౌలి 17.98, జహాన్నుమా 11.95, కిషన్‌బాగ్ 14.23, లలితాబాగ్ 26.26, రియాసత్‌నగర్ 23.32, కంచన్‌బాగ్ 32.32, చాంద్రయాణగుట్ట 18.98, ఉప్పుగూడ 29.37, గోషామహల్ 16.03, మంగళ్‌హట్ 19.69, భారతినగర్‌లో 49.54, పటాన్చెరు 51.52 పోలింగ్ నమోదయ్యింది. లంగర్‌హౌస్‌లో అత్యల్పంగా 6.77 శాతం పోలింగ్ నమోదవ్వగా, అత్యధికంగా బాగ్అంబర్పేట్ 64.82 శాతం పోలింగ్ నమోదయ్యింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోలింగ్ పరిస్థితి... ►సికింద్రాబాద్ జోన్‌లోని అంబర్‌పేట 16వ నంబర్ సర్కిల్లో పరిధిలో ఆరు డివిజన్లలో ఇప్పటివరకు 42.47 శాతం పోలింగ్ నమోదయింది. అత్యధికంగా బాగ్ అంబర్ పేట డివిజన్లో 64.79 శాతం నమోదైంది. డివిజన్ వారీగా హిమాయత్ నగర్-35.89, కాచిగూడ-38.94, నల్లకుంట-38.03, గోల్నాక-36.34, అంబర్పేట్-38.59, బాగ్ అంబర్పేట్-64.78 శాతం ఓటింగ్ నమోదయ్యింది. ►కుర్మగూడ డివిజన్ ఆపిల్ స్కూల్లో నకిలీ ఓటు వేయడానికి వచ్చిన మహిళను ఏజెంట్లు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రెయిన్ బజార్ పోలీసులకి అప్పగించారు. బీజేపీ అభ్యర్థి శాంత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆగాపురాలో ఉద్రిక్తత.. ఎంఐఎం నాయకులు దాడికి యత్నించారంటూ జాంబాగ్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి ఆనంద్‌గౌడ్ ఆందోళనకు దిగారు. జూబ్లీ హైస్కూల్ పోలింగ్ బూత్‌లో రిగ్గింగ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎంఐఎం నాయకులను బూత్‌ల నుండి బయటకు పంపాలని టీఆర్ఎస్ అభ్యర్థి పోలీసులను కోరినా సహకరించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు మొత్తం ఎంఐఎంకు కొమ్ము కాస్తున్నారని ఆనంద్‌గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై టీఆర్ఎస్,బీజేపీ కార్యకర్తలు ధర్నా.. ►ఉప్పల్ పదవ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి రిగ్గింగ్ కు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు వరంగల్ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ సజ్జనార్.. సైబరాబాద్ పరిధిలోని పలు సమస్యాత్మక ప్రాంతాలను సైబరాబాద్ సీపీ సజ్జనార్ పరిశీలించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపుర్ డివిజన్ హఫీజ్‌పేట, ప్రేమ్‌నగర్ పోలింగ్ కేందాన్ని సీపీ సందర్శించారు. కూకట్పల్లి, జగద్గిరిగుట్ట, శేరిలింగంపల్లిలోని పలు డివిజన్లలోని పోలింగ్ బూత్‌లను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని సంఘటనలు మినహా అన్ని ప్రాంతాల్లోనూ పోలింగ్ ప్రశాంతంగా సాగుతుందని తెలిపారు. ఎవరైనా ఎటువంటి గొడవలకు పాల్పడిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. ప్రజలు అందరూ స్వేచ్ఛగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. డివిజన్ స్థాయి వారిగా ఓటింగ్ శాతం: ►ఉప్పల్ నియోజకవర్గంలో మధ్యాహ్నం మూడు గంటల వరకు ఓటింగ్ శాతం ఇలా ఉంది. కాప్రా-25.73 శాతం, ఏఎస్రావు నగర్-24.60 శాతం, చర్లపల్లి-24.67 శాతం, మీర్‌పేట హౌసింగ్ బోర్డు-24.05 శాతం, మల్లాపూర్ 29.93 శాతం, నాచారం- 23.60 శాతం, చిలుకానగర్ - 36.12 శాతం, హబ్సీగూడ-33.91 శాతం, రామాంతపూర్ 36.62 శాతం, ఉప్పల్- 41.01 శాతం. ►జీహెచ్ఎంసీ డివిజన్ స్థాయి వారిగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్ సరళి ఇలా ఉంది. వనస్థలిపురం- 29.03 శాతం, హస్తినపురం - 30.08 శాతం, నాగోల్ 24.93 శాతం, మన్సూరా బాద్-22.39 శాతం, హాయత్ నగర్-24.93 శాతం, బీఎన్‌రెడ్డి నగర్ 24.54 శాతం. గుండాలను తీసుకొచ్చి రిగ్గింగ్.. ►లింగంపల్లి డివిజన్ పాపిరెడ్డి కాలనిలో టీఆర్ఎస్, బీజేపీ వర్గీయులు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పరం దాడులు చేసుకున్నారు. బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. ►ఉప్పల్‌లో 10వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి మందముల్లా పరమేశ్వరరెడ్డి సూర్యాపేట నుండి గుండాలను తీసుకొచ్చి రిగ్గింగ్ కు పాల్పడుతున్నారని, వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని టీఆర్ఎస్ ఉప్పల్ అభ్యర్థి అరేటికాయల షాలిని భాస్కర్ తెలిపారు. రీపోలింగ్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు కూడ తమనే బెదిరిస్తున్నారని ఆవేదన చేశారు. ►సంతోష్ నగర్ రియసత్ నగర్ డివిజన్లో బుర్కా ధరించి ఓట్లు వేయడం పట్ల బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంక్ మార్క్ చెరిపేసుకుని మహిళలు మళ్ళీ ఓట్లు వేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు చోద్యం చూస్తున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు. దొంగ ఓట్లు అనుమానంతో.. ఉప్పల్ పదవ డివిజన్.. ఇరవై ఐదో బూత్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ నాయకులు దొంగ ఓట్లు వేస్తున్నారన్న అనుమానంతో టీఆర్ఎస్, బీజేపీ నాయకులు.. ఇద్దరిని పట్టుకుని ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. బీఎన్ రెడ్డి నగర్లో ఉద్రిక్తత ►బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ బూత్ నెంబర్ 60, 61లో ఉద్రిక్తత ఏర్పడింది. పోలింగ్ కేంద్రంలో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ బీజేపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి మొద్దు లచ్చిరెడ్డి పోలింగ్ కేంద్రం ముందు ధర్నా చేపట్టారు. ►జంగమేట్ డివిజన్లోని పోలింగ్ బూత్ 27, 32 వద్ద ఉద్రిక్తత నెలకొంది. రిగ్గింగ్, దొంగ ఓట్లు పడుతున్నాయని అడ్డుకోవడానికి వచ్చిన బీజేపీ నాయకులను ఎంఐఎం కార్యకర్తలు తరిమికొట్టారు. జగద్గిరి గుట్ట సీఐ వీరంగం కూకట్పల్లి 121 డివిజన్ దీనబంధు కాలనీ 48వ బూతు వద్ద జగద్గిరి గుట్ట సీఐ వీరంగం సృష్టించారు. పోలింగ్ బూత్ టేబుళ్లను బూటు కాళ్లతో తన్నుతూ.. బీజేపీ కార్యకర్తలను అసభ్య పదజాలంతో దూషించారని ఆ పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా సీఐకి ఎదురు మాట్లాడిన వారిపై దాడి చేశారని బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. ఓటేసిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ►జూబ్లిహిల్స్ బిఎస్ఎన్ కార్యాలయంలోని పోలింగ్ బూత్‌లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ►జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్లో మైహోమ్ గ్రూప్ చైర్మన్ రామేశ్వరరావు, భార్య శ్రీకుమారి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►బంజారాహిల్స్ ఈరో కిడ్స్ స్కూల్లో విజయ శాంతి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►షేక్‌పేట్ ఎమ్మార్వో కార్యాలయంలో హీరో రామ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ►జీడిమెట్ల డివిజన్ కుత్బల్లాపూర్ గవర్నమెంట్ స్కూల్ వద్ద బీజేపీ, టీఆర్ఎస్ నాయకుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఆధార్ కార్డులో ఫోటో మార్ఫింగ్ చేసి ఓటేశారు ఉప్పల్‌లో దొంగ ఓట్లు వేస్తున్న ఇద్దరు వ్యక్తులను టీఆర్ఎస్ కార్యకర్తలు పట్టుకున్నారు. ఆధార్ కార్డులోని ఫోటోలను మార్ఫింగ్ చేసి యువకులు ఓటు వేసినట్లు తెలుస్తోంది. వీరిని కాంగ్రెస్ నాయకులు సూర్యాపేట నుంచి తీసుకొచ్చినట్లు టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ►ఫిల్మ్ క్లబ్లో సీనియర్ నటులు కోట శ్రీనివాసరావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►సినీ నటుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ జూబ్లీహిల్స్ రోడ్ నెం.72లోని పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►గ్రేటర్ పోలింగ్‌లో గుర్తులు తారుమారైన నేపథ్యంలో ఓల్డ్ మలక్‌పేట డివిజన్లో 3న రీపోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో సాయంత్రం ఆరుగంటల తర్వాత వెల్లడయ్యే ఎగ్జిట్ పోల్స్‌పై ఎస్ఈసీ నిషేదం విధించింది. ఓటర్లు బాధ్యతగా ఓటు వేయాలి ►జూబ్లీహిల్స్ పోలింగ్ కేంద్రంలో మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికా లాంటి దేశాలు సైతం మన భారతదేశ ఎన్నికల విధానంపై ప్రశంసలు కురిపిస్తాయి. అలాంటిది మందకొడిగా పోలింగ్ శాతం సాగడం సరైంది కాదు. ఓటర్లు బాధ్యతగా ఓటు వేయాలిని పిలుపునిచ్చారు. ►బంజారాహిల్స్ జీఎస్డీ దేవ్ స్కూల్లో (డివిజన్ నెంబర్ 92 వెంకటేశ్వరరావు కాలనీ) ఎమ్మెల్సీ కవిత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►ఫిల్మ్ క్లబ్లో నిర్మాత సి అశ్వనీదత్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►ఫిల్మ్ క్లబ్లో అల్లు అర్జున్ సతీమణి స్నేహలతా రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఉదయం11 గంటల వరకు 8.90 శాతం పోలింగ్ నమోదైంది. ఓటు వేయడానికి ముందుకురండి: విజయ్ దేవరకొండ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో కుటుంబ సభ్యులతో కలిసి ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా కచ్చితంగా ఓటు వేయడానికి ముందకు రావాలని విజయ్ దేవరకొండ పిలుపునిచ్చారు. మంత్రి పువ్వాడ అనుచరుల కారు ధ్వంసం కేపీహెచ్‌బీ ఫోరంమాల్ సమీపంలో మంత్రి పువ్వాడ అజయ్ అనుచరులు డబ్బు పంచుతుండగా బీజేపీ కార్యకర్తలు వారిని పట్టుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మంత్రి అనుచరుల కార్లను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు లాఠీ చార్జి చేశారు. ఈ ఘటనలో పువ్వాడ అనుచరులకు సంబంధించిన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఓల్డ్ మలక్‌పేట్‌లో పోలింగ్ రద్దు..! ఓల్డ్ మలక్‌పేట్ డివిజన్లో సీపీఐ అభ్యర్ధిని గర్తు తారుమారుకావడంతో 1,2,3,4,5 కేంద్రాల్లో ఎన్నికల అధికారులు పోలింగ్‌ను రద్దు చేశారు. దీనిపై మరికాసేపట్లో ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఓల్డ్‌మలక్‌పేట్‌లో ఈ నెల 3న రీపోలింగ్ పెట్టే అవకాశం ఉంది. ఎన్నికలు రద్దు చేయాలి: సీపీఐ ఓల్డ్ మలక్‌పేట్ డివిజన్లో సీపీఐ అభ్యర్ధిని గర్తు తారుమారైంది. దీనిపై సీపీఐ నాయకులు ఆందోళనకు దిగుతున్నారు. సీపీఐ గుర్తు కంకి కొడవలికి బదులు, సుత్తి కొడవలి నక్షత్రాన్ని ఎన్నికల అధికారులు ముద్రించారు. దీంతో డివిజన్ ఎన్నికలు రద్దుచేసి మరోసారి తప్పిదాలు లేకుండా నిర్వహించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో పోలింగ్ ఇప్పటికీ మందకొడిగానే సాగుతోంది. జీ్హెచ్ఎంసీ పరిధిలో ఇప్పటిదాకా అత్యధికంగా రామచంద్రాపురం, పటాన్చెరు డివిజన్లలో అత్యధికంగా 9.02 పోలింగ్ శాతం నమోదైంది. అత్యల్పంగా సమస్యాత్మక ప్రాంతమైన చాంద్రాయణగుట్టలో 0.07శాతం పోలింగ్ నమోదైంది. ఓటేసేందుకు ముందుకు రండి: మంత్రి మహమూద్ అలీ మలక్‌పేట సర్కిల్ అజంపూరా డివిజన్లో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో పార్టీని గెలిపిస్తాయి. ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వంపై నమ్మకం ఉంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుకు రండి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేవి చాలా ముఖ్యమైనది. బల్దియా ఎన్నికల్లో వందకు పైగా డివిజన్లు టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగుతున్నాయి. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు' అని అన్నారు. పాతబస్తీలో పోలింగ్ ప్రశాంతం జీహెచ్ఎంసీ పోలింగ్ పాతబస్తీలో ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పుడిప్పుడే కూలైన్లలో ఓటర్లు పెరుగుతున్నారు. చంద్రాయనగుట్ట సర్కిల్ పరిధిలోని జంగమెట్ డివిజన్లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. అత్యంత సమస్యాత్మకంగా ఉన్న ఈ ప్రాంతంలో అత్యధికంగా 20 మంది అభ్యర్థులు ఇక్కడనుంచి పోటీపడుతున్నారు. ఓటును హక్కుగా భావించాలి: తలసాని మారేడుపల్లిలోని కస్తూర్భాగాంధీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేసి ఓటింగ్ శాతాన్ని పెంచాలని తలసాని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్ ఉందని వెనక్కి వెళ్లవద్దని ఓటును హక్కుగా భావించాలని తలసాని అన్నారు. ►కూకట్పల్లి కేపీహెచ్‌బీ 7వ ఫేస్ పోలింగ్ బూత్ నెంబర్ 58 వద్ద సినీ హీరో రాజేంద్రప్రసాద్ కుటుంబ సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సంగారెడ్డిలో ఉద్రిక్తత సంగారెడ్డి జిల్లా: భారతి నగర్ డివిజన్ ఎల్ఐజీ కాలనీలో సొసైటీ ఆఫీస్ 111వ నెంబర్ బూత్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీఆర్ఎస్ అభ్యర్థి సింధు ఆదర్శ్ రెడ్డి ఫోటోతో కూడిన పోలింగ్ స్లిప్‌ల పంపిణీపై బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు, ఎన్నికల సిబ్బంది టీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరిస్తూన్నారంటూ ఆరోపించారు. బీజేపీ కార్యకర్తపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే కుమారుడు పటాన్చెరు డివిజన్లోని చైతన్య కాలనీ పోలింగ్ బూత్ వద్ద బీజేపీ కార్యకర్త నర్సింగ్పై పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తనయుడు విష్ణు వర్ధన్ రెడ్డి చెయ్యిచేసుకున్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఎమ్మెల్యే సతీమణి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డిని అక్కడనుంచి తీసుకెళ్ళింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని గొడవ జరగకుండా ఆపారు. బీజేపీ కార్యకర్త నర్సింగ్‌ను పటాన్చెరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తున్నారు. ఉమెన్స్ కోఆపరేటివ్ సోసైటీలో అక్కినేని నాగార్జున, అమల ►జూబ్లీహిల్స్ ఉమెన్స్ కోఆపరేటివ్ సోసైటీలో బూత్ నెంబర్ 95లో సినీ నటుడు అక్కినేని నాగార్జున ఆయన సతీమణి అక్కినేని అమల తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి దంపతులిద్దరూ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►అల్వాల్ సర్కిల్ వెంకటాపురం 135వ డివిజన్లో బూత్ నెంబర్ 38లో ప్రజాగాయకుడు గద్దర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటేసిన ఎస్ఈసీ ►ఎస్ఈసీ పార్థసారధి బంజారాహిల్స్ రోడ్ నెంబర్-4లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఉదయం 9 గంటల సమయానికి 3.10 శాతం పోలింగ్ నమోదైంది. దైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి: డీజీపీ కుందన్‌బాగ్‌లో డీజీపీ మహేందర్‌రెడ్డి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ప్రజలందరూ ధైర్యంగా తమ ఓటును వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం తమ విధి. ప్రశాంతంగా పోలింగ్ జరిగేందుకు పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంది' అని తెలిపారు. ►జూబ్లీహిల్స్ బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలోని పోలింగ్ బూత్‌లో డైరెక్టర్ తేజ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో భాగంగా చర్లపల్లి డివిజన్ కుషాయిగూడ వి.ఎన్. రెడ్డి నగర్ ప్రగతి విద్యాలయ పాఠశాలలో నగర్ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకుని మంచి పరి పాలకుల్ని ఎన్నుకోవాలని సూచించారు. ప్రజలకు ఓటు హక్కు అస్త్రం లాంటిదన్నారు. ►ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్‌లో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హఫీజ్ పేటలో టెన్షన్ టెన్షన్.. గ్రేటర్ ఎన్నికల పోలింగ్ సమయంలో హఫీజ్ పేట డివిజన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఫోటోలు ప్రదర్శిస్తూ ఆ పార్టీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనిపై బీజేపీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్రమైన తోపులాటకు దారితీసింది. చివరకు టీఆర్ఎస్ కార్యకర్తలు ఫ్లెక్సీలు తొలగించడంతో.. బీజేపీ కార్యకర్తలు శాంతించారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయమే పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతా వచ్చి ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు. ►వెంకటేశ్వర కాలనీ డివిజన్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14, నందినగర్‌లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రాజ్యాంగం మనకిచ్చిన హక్కు ఓటు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, అభివృద్ధి చేసే వాళ్లకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. ►టీఆర్‌పార్టీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి ఆయన సతీమణి స్వప్న హబ్సిగూడలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర మైలాన్దేవ్ పల్లిలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►కుషాయిగూడ వెంకటేశ్వరస్వామి ఆలయంలో మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన భార్య, చర్లపల్లి డివిజన్ అభ్యర్థి బొంతు శ్రీదేవితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ►ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కుటుంబంతో సహా బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని మారుతీ నగర్ కాలనీలో సామాన్య ప్రజలతో కలిసి క్యూ లైన్లో నిల్చొని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►శాస్త్రిపురం డివిజన్లోని సేంట్ ఫైజ్ పాఠశాలలో బైక్‌పై వచ్చి ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►రాజేంద్రనగర్‌లోని ఉప్పరిపల్లిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►హీరో నాగశౌర్య తల్లి, నిర్మాత ఉష మూల్పూరి షేక్‌పేట్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►హైకోర్టు సీజే రాఘవేంద్రసింగ్ చౌహాన్ కుందన్‌బాగ్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలుచోట్ల ఘర్షణ వాతావరణం ►ఎల్బీనగర్ ఆర్కేపురం డివిజన్ బూత్ నెంబర్ 42, 45లో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ►మీర్ పేట మున్సిపాలిటీలో టీఆర్ఎస్ డిప్యూటీ మేయర్ విక్రమ్‌రెడ్డి ఓటర్లను ప్రలోభాలు పెడుతున్నాడని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖలు నిఘా పటిష్టం చేశాం: సీపీ మహేష్ భగవత్ ►కుందన్‌బాగ్‌లో రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నాం. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తుతో పాటు సీసీ కెమెరాల ద్వారా నిఘా పటిష్టం చేశాము. రాచకొండ కమిషనరేట్ పరిదిలో ప్రశాంత వాతావరణం ఉంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాలి. సమస్యాత్మక ప్రాంతాలపై గట్టి నిఘా పెట్టాము' అని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ►నాంపల్లిలోని వ్యాయమశాల హైస్కూల్లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►జూబ్లీక్లబ్‌లో చిరంజీవి సతీమణి సురేఖతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కాచిగూడలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►కుందన్‌బాగ్‌లో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరులు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సతీసమేతంగా ఓటేసిన మంత్రి కేటీఆర్ ►గ్రేటర్ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నందినగర్‌లోని పోలింగ్ కేంద్రానికి సతీసమేతంగా కలిసి వచ్చిన కేటీఆర్ 8వ నెంబర్ పోలింగ్ బూత్‌లో తన ఓటును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలి. అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని నగర అభివృద్ధిలో భాగస్వాములుకావాలని కోరారు. సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 150 డివిజన్లలో పోలింగ్ జరగనుంది. గ్రేటర్ పరిధిలో 74,44,260 మంది ఓటర్లు 1,122 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. 38,77,688 మంది పురుషులు, 35,65,896 మంది మహిళలు, 676 మంది ఇతరులు కలిపి మొత్తం 74,44,260 మంది ఓటర్లున్నారు. ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బంది కలిపి మొత్తం 48 వేల మంది పోలింగ్ విధుల్లో పాల్గొంటున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వీవీ ప్యాట్లు అందుబాటులో లేకపోవడంతో ఈవీఎంలకు బదులు పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించిన విషయం తెలిసిందే. 9,101 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 2,277 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ సదుపాయం కల్పించారు. కాగా, ఎన్నికల్లో 28,683 బ్యాలెట్ పెట్టె్టలను సిద్ధంగా చేయగా, 81,88,686 బ్యాలెట్ పత్రాలను ముద్రించారు. బల్దియా ఎన్నికలు కావడంతో తెలుపు రంగు బ్యాలెట్లను ఉపయోగిస్తున్నారు. బ్యాలెట్ పత్రాలపై నోటా చిహ్నాన్ని సైతం ముద్రించడం విశేషం. 2,831 మందికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించారు. ఇందులో దివ్యాంగులు, 80 ఏళ్లు దాటిన వృద్ధులతో పాటు 260 మంది కరోనా బాధితులు కూడా ఉన్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ పెట్టెలను ఎన్నికల సిబ్బంది పోలీసు భద్రత నడుమ స్ట్రాంగ్ రూంలకు తరలించనున్నారు. ఇందుకోసం 150 స్ట్రాంగ్ రూంలను నగరంలో ఏర్పాటు చేశారు. ఆ పార్టీలకు ప్రతిష్టాత్మకం.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీలు బల్దియా ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని హోరాహోరీగా ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో విజయ ఢంకా మోగించి వరుస ప్రభంజనాలు సృష్టించిన టీఆర్ఎస్ పార్టీ.. ఇటీవల కాలంలో కేంద్రంలోని బీజేపీ నుంచి కొంత పోటీని ఎదుర్కొంటోంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 డివిజన్లకు గాను 99 డివిజన్లను దక్కించుకున్న టీఆర్ఎస్.. రాష్ట్ర రాజకీయాల్లో పట్టును నిలుపుకోవడానికి ఈసారి సైతం గణనీయ సంఖ్యలో సీట్లను గెలవాలనుకుంటోంది. ఇటు పాతబస్తీలో ఎదురులేని ఎంఐఎం.. గత ఎన్నికల్లో గెలిచిన 44 స్థానాలను నిలుపుకునే దానిపై ధీమాతో ఉంది. ఇటు గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా పోటీ చేసిన 68 డివిజన్లకు గాను కేవలం 4 స్థానాల్లో గెలిచిన బీజేపీ.. ఇటీవల జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల విజయంతో సమరోత్సాహంలో ఉంది. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుచుకుని రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బలపడాలని భావిస్తోంది. ఇటు బల్దియా ఎన్నికల్లో తాము సైతం గట్టి పోటీ ఇచ్చి చెప్పుకోదగ్గ స్థానాల్లో విజయం సాధిస్తామని కాంగ్రెస్ అగ్రనాయకత్వం పేర్కొంటోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం రెండు డివిజన్లలో మాత్రమే గెలవగా, రాష్ట్రంలో పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి ఈ ఎన్నికలు కీలకంగా మారబోతున్నాయి. గత ఎన్నికల్లో 82 డివిజన్లలో పోటీ చేసిన టీడీపీ కేవలం ఒక్క స్థానం మాత్రమే గెలవగా, ఈ సారి కూడా పోటీలో ఉంది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థుల భవితవ్యంపై నగర ఓటర్లు కీలక తీర్పు ఇవ్వబోతున్నారు. డిసెంబర్ 4న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈసారి ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి 10 కరోనా కిట్లను, ఐదు శానిటైజర్ల సీసాలను సరఫరా చేశారు. ఓటర్లు క్యూలలో నిలబడేలా వృత్తాకారపు పరిధులు గీశారు. కరోనా నిర్ధారణ, అనుమానిత వ్యక్తులకు సైతం ఓటు హక్కు కల్పించేందుకు పోలింగ్ సమయాన్ని గంట పెంచారు. గత ఎన్నికల్లో ఇలా... గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం 74,24,096 ఓట్లకు 33,62,688 (45.29 శాతం) ఓట్లు పోలయ్యాయి. అందులో నోటాకు పోలైన ఓట్లు పోగా అభ్యర్థులు, స్వతంత్రులకు కలిపి 33,49,379 ఓట్లు లభించాయి. పోలైన ఓట్లలో టీఆర్ఎస్ అత్యధికంగా 14,68,618 (43.85 శాతం) ఓట్లను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. ఎంఐఎం 5,30,812 (15.85 శాతం) ఓట్లను దక్కించుకుని రెండో స్థానంలో నిలిచింది. టీడీపీ 4,39,047 (13.11 శాతం), కాంగ్రెస్ 3,48,388 (10.40 శాతం), బీజేపీ 3,46,253(10.34 శాతం) ఓట్లను సాధించాయి. ఇటు సీపీఐ 12,748 ఓట్లు, సీపీఎం 8,538, బీఎస్పీ 10,478, లోక్‌సత్తా 10,385, ఇతర రిజిస్టర్డ్ పార్టీలు 28,765, స్వతంత్ర అభ్యర్థులు 1,46,481 ఓట్లను దక్కించుకోగలిగారు. -
‘గ్రేటర్’లో జోరుగా ప్రలోభాల పర్వం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో ప్రచారం ముగిసి ప్రలోభాల పర్వానికి తెరలేచింది. మంగళవారం పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఏదో ఒక పేరుతో ‘గెట్ టు గెదర్’లు పెట్టి.. రిటర్న్ గిఫ్ట్‌లతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు సోమవారం ముమ్మరంగా సాగాయి. జీహెచ్ఎంసీలో ఈసారి ఎన్నికల ప్రచారం పోటాపోటీ జరిగింది. చాలా డివిజన్లలో నువ్వా– నేనా అన్నట్లుగా పోటీ నెలకొంది. దాంతో అభ్యర్థులు ‘ఆఖరి’అస్త్రాన్ని బయటకు తీశారు. ప్రజలకు బహుమతులు, కానుకలు ఇచ్చి తమ వైపునకు తిప్పుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేశారు. వరుసగా సెలవులు రావడం, పైగా సోమవారం కార్తీకపౌర్ణమి కావడంతో ఓటర్లంతా ఇంటి వద్దనే ఉన్నారు. ఇదే చక్కటి అవకాశంగా భావించిన నేతలు తమ తెలివితేటలకు పదును పెట్టారు. గల్లీ నాయకులను రంగంలో దింపి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పలు రూపాల్లో కానుకలు ముట్టజెప్పారు. ఇక్కడే నేతలను ఒక అనుమానం వేధిస్తోంది. అదేంటంటే... వరుస సెలవుల నేపథ్యంలో ఓటర్లు ఇళ్లు విడిచి బయటకు వస్తారా? కానుకలు తీసుకున్న వారంతా ఓటేస్తారా? అని. అందుకే కానుకలు తీసుకున్న వాళ్లంతా పోలింగ్ బూత్‌కు వచ్చే దాకా వారితో టచ్‌లో ఉండాలని అనుచరులు, కార్యకర్తలను ఆదేశించారు. నోములు, పార్టీల పేరుతో ప్రలోభాలు ఎన్నికల ప్రచారం ముగియడం, తెల్లారితే ఓటింగ్ కావడంతో చాలామంది నేతలు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా టౌన్‌షిప్పులు, అపార్ట్‌మెంట్లపె దృష్టిసారించారు. ఓటరు లిస్టు ఆధారంగా తమకు అనుకూలంగా ఉండేవారికి ఎక్కడికక్కడ ఆహ్వానాలు పంపారు. వారి స్థానిక సమస్యలు తీరుస్తామన్న హామీలతోపాటు కార్తీక నోములు, వ్రతాలు, బర్త్‌డేల పేరిట పలుచోట్ల విందులు నిర్వహించారు. వీటికి హాజరైన మహిళలకు రిటర్న్ గిఫ్ట్‌ల రూపంలో వెండి వస్తువులు, చీరలు, ఇతరత్రా కానుకలు ఇచ్చి ఆకట్టుకునే యత్నం చేశారు. ఇక బర్త్‌డే పార్టీల్లో, గెట్ టు గెదర్‌లలో పురుష ఓటర్లను మందు విందులతో ప్రసన్నం చేసుకున్నారు. నగదు పంపిణీ చేసి ఓట్లు వేయాలని కోరారు. అదే సమయంలో బస్తీలు, మురికివాడల్లో చాలామంది గల్లీ లీడర్ల సాయంతో ఓటుకు ఇంతని కుటుంబాలతో గంపగుత్తగా మాట్లాడుకుని నోట్లను పంచారు. వచ్చేలా చూడండి! ఆదివారం సాధారణ సెలవు. సోమవారం గురునానక్ జయంతి. మంగళవారం పోలింగ్ సందర్భంగా సెలవు... నగరపౌరులకు వరుసగా మూడురోజులు సెలవులు వచ్చాయి. దీంతో ఓటర్లు ఓటు వేసేందుకు బయటికి వస్తారా? లేదా అన్న అనుమానం అభ్యర్థులను వెంటాడుతోంది. అందుకే... తమ నుంచి కానుకలు అందుకున్న వారంతా పోలింగ్ కేంద్రానికి వెళ్లేలా చూడాలని చాలామంది నాయకులు గల్లీ లీడర్లు, అపార్ట్మెంటు సెక్రటరీలు, కార్యకర్తలను పురమాయించారు. వీరంతా అదే పనిలో నిమగ్నమయ్యారు. సోషల్ మీడియాలో నాన్‌స్టాప్ ప్రత్యక్ష ప్రచారం ఆదివారంతో ముగిసినా.. సోషల్ మీడియా, వాయిస్‌కాల్స్ ప్రచారహోరు మాత్రం ఆగడంలేదు. సెలవుల వల్ల జనమంతా ఇంటి వద్దనే ఉంటున్నారు. ఈ సమయాన్ని సమర్థంగా వాడుకోవాలన్న తాపత్రయంతో అభ్యర్థులు సోషల్‌మీడియా, వాయిస్‌కాల్స్ ప్రచారాన్ని ఆఖరు రోజు ముమ్మరం చేశారు. వాయిస్‌కాల్స్, ఫేస్బుక్, వాట్సాప్ సందేశాలు, ఎస్సెమ్మెస్... ఇలా అవకాశమున్న దేన్నీ వదల్లేదు. మొత్తానికి గ్రేటర్ ప్రచారం పుణ్యమాని... పలు పబ్లిక్ రిలేషన్స్ ఏజెన్సీలకు చేతినిండా పని దొరికింది. -
నేడే గ్రేటర్ పోరు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు మంగళవారం జరగనున్నాయి. జీహెచ్ఎంసీలోని 150 డివిజన్ల పరిధిలో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 150 డివిజన్లలో మొత్తం 1,122 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 38,77,688 మంది పురుషులు, 35,65,896 మంది మహిళలు, 676 మంది ఇతరులు కలిపి మొత్తం 74,44,260 మంది ఓటర్లున్నారు. -సాక్షి, హైదరాబాద్: పోలింగ్‌కు సర్వం సిద్ధం.. పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని, సర్వం సిద్ధం చేశామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ సి.పార్థసారథి ప్రకటించారు. సోమవారం రాత్రి కల్లా పోలింగ్ సిబ్బంది ఎన్నికల సరంజామాతో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బంది కలిపి మొత్తం 48 వేల మంది పోలింగ్ విధుల్లో పాల్గొంటున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వీవీ ప్యాట్లు అందుబాటులో లేకపోవడంతో ఈవీఎంలకు బదులు పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించిన విషయం తెలిసిందే. 9,101 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 2,277 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ సదుపాయం కల్పించారు. ఎన్నికల్లో 28,683 బ్యాలెట్ పెట్టె్టలను సిద్ధంగా చేయగా, 81,88,686 బ్యాలెట్ పత్రాలను ముద్రించారు. బల్దియా ఎన్నికలు కావడంతో తెలుపు రంగు బ్యాలెట్లను ఉపయోగిస్తున్నారు. బ్యాలెట్ పత్రాలపై నోటా చిహ్నాన్ని సైతం ముద్రించడం విశేషం. 2,831 మందికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించారు. ఇందులో దివ్యాంగులు, 80 ఏళ్లు దాటిన వృద్ధులతో పాటు 260 మంది కరోనా బాధితులు కూడా ఉన్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ పెట్టె్టలను ఎన్నికల సిబ్బంది పోలీసు భద్రత నడుమ స్ట్రాంగ్ రూంలకు తరలించనున్నారు. ఇందుకోసం 150 స్ట్రాంగ్ రూంలను నగరంలో ఏర్పాటు చేశారు. డిసెంబర్ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన, సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. ఇక ఎన్నికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పరిశ్రమలు, దుకాణాలు, ఇతర సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సెలవు ప్రకటించింది. జీహెచ్ఎంసీ ఓటర్లు జీహెచ్ఎంసీ వెలుపలి ప్రాంతాల్లో పనిచేస్తుంటే, ఓటేసేందుకు అవకాశం కల్పించేలా వారి పనివేళల్లో కొంత రిలీఫ్ కల్పించాలని పరిశ్రమలు, ఇతర సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది. ఆ పార్టీలకు ప్రతిష్టాత్మకం.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీలు బల్దియా ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని హోరాహోరీగా ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో విజయ ఢంకా మోగించి వరుస ప్రభంజనాలు సృష్టించిన టీఆర్ఎస్ పార్టీ.. ఇటీవల కాలంలో కేంద్రంలోని బీజేపీ నుంచి కొంత పోటీని ఎదుర్కొంటోంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 డివిజన్లకు గాను 99 డివిజన్లను దక్కించుకున్న టీఆర్ఎస్.. రాష్ట్ర రాజకీయాల్లో పట్టును నిలుపుకోవడానికి ఈసారి సైతం గణనీయ సంఖ్యలో సీట్లను గెలవాలనుకుంటోంది. ఇటు పాతబస్తీలో ఎదురులేని ఎంఐఎం.. గత ఎన్నికల్లో గెలిచిన 44 స్థానాలను నిలుపుకునే దానిపై ధీమాతో ఉంది. ఇటు గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా పోటీ చేసిన 68 డివిజన్లకు గాను కేవలం 4 స్థానాల్లో గెలిచిన బీజేపీ.. ఇటీవల జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల విజయంతో సమరోత్సాహంలో ఉంది. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుచుకుని రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బలపడాలని భావిస్తోంది. ఇటు బల్దియా ఎన్నికల్లో తాము సైతం గట్టి పోటీ ఇచ్చి చెప్పుకోదగ్గ స్థానాల్లో విజయం సాధిస్తామని కాంగ్రెస్ అగ్రనాయకత్వం పేర్కొంటోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం రెండు డివిజన్లలో మాత్రమే గెలవగా, రాష్ట్రంలో పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి ఈ ఎన్నికలు కీలకంగా మారబోతున్నాయి. గత ఎన్నికల్లో 82 డివిజన్లలో పోటీ చేసిన టీడీపీ కేవలం ఒక్క స్థానం మాత్రమే గెలవగా, ఈ సారి కూడా పోటీలో ఉంది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థుల భవితవ్యంపై నగర ఓటర్లు కీలక తీర్పు ఇవ్వబోతున్నారు. డిసెంబర్ 4న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈసారి ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి 10 కరోనా కిట్లను, ఐదు శానిటైజర్ల సీసాలను సరఫరా చేశారు. ఓటర్లు క్యూలలో నిలబడేలా వృత్తాకారపు పరిధులు గీశారు. కరోనా నిర్ధారణ, అనుమానిత వ్యక్తులకు సైతం ఓటు హక్కు కల్పించేందుకు పోలింగ్ సమయాన్ని గంట పెంచారు. గత ఎన్నికల్లో ఇలా... గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం 74,24,096 ఓట్లకు 33,62,688 (45.29 శాతం) ఓట్లు పోలయ్యాయి. అందులో నోటాకు పోలైన ఓట్లు పోగా అభ్యర్థులు, స్వతంత్రులకు కలిపి 33,49,379 ఓట్లు లభించాయి. పోలైన ఓట్లలో టీఆర్ఎస్ అత్యధికంగా 14,68,618 (43.85 శాతం) ఓట్లను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. ఎంఐఎం 5,30,812 (15.85 శాతం) ఓట్లను దక్కించుకుని రెండో స్థానంలో నిలిచింది. టీడీపీ 4,39,047 (13.11 శాతం), కాంగ్రెస్ 3,48,388 (10.40 శాతం), బీజేపీ 3,46,253(10.34 శాతం) ఓట్లను సాధించాయి. ఇటు సీపీఐ 12,748 ఓట్లు, సీపీఎం 8,538, బీఎస్పీ 10,478, లోక్‌సత్తా 10,385, ఇతర రిజిస్టర్డ్ పార్టీలు 28,765, స్వతంత్ర అభ్యర్థులు 1,46,481 ఓట్లను దక్కించుకోగలిగారు. -
చివరి ఓటూ పట్టేద్దాం..!
సాక్షి, హైదరాబాద్: పదిరోజులుగా పడ్డ కష్టానికి అసలు పరీక్ష. గ్రేటర్ పోరులో ‘బిగ్ డే’... మంగళవారం పోలింగ్. గల్లీ పోరుకు ఢిల్లీ కదిలొచ్చింది. మాటలతో అగ్గి రాజుకుంది. బస్ ఏక్ ఔర్ ధక్కా... ఆఖరి ప్రయత్నం. ప్రచారంపై సమీక్ష, ఓట్ల లెక్కలు, ప్రత్యర్థులపై నిఘా, గల్లీల్లో గస్తీ... ఎక్కడా తగ్గొద్దనే ఆరాటం. బల్దియా కురుక్షేత్రంలో విజయం కోసం అన్ని ప్రధాన రాజకీయపక్షాలు చివరి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. మరికొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుండటంతో ఓటర్లను తమవైపు ఆకట్టుకునేందుకు శతవిధాలా శ్రమిస్తున్నాయి. వీలైనన్ని రకాలుగా ప్రసన్నం చేసుకుంటున్నాయి. ఆదివారం సాయంత్రానికి ప్రచారపర్వం ముగియడంతో అప్పటివరకు హీటెక్కిన గ్రేటర్ ఎన్నికల క్షేత్రంలో ఇప్పుడు చాప కింద నీరులా వ్యవహారాలు సాగుతున్నాయి. గత రెండురోజులుగా అన్ని పార్టీల ముఖ్య నాయకులు, డివిజన్లలో పోటీచేస్తున్న అభ్యర్థులు, స్థానిక శ్రేణులు బ్యాలెట్ బాక్సులు నింపుకునేందుకు తాయిలాలతో ఓటరు ఇంటిబాట పట్టాయి. ఈ క్రమంలో అక్కడక్కడా చిన్న చిన్న ఘటనలు, డబ్బు, మద్యం పంపిణీపై ఆరోపణలు తెరపైకి వచ్చాయి. అధికారికంగా ప్రచారం ముగిసినా సోషల్‌మీడియాలో మాత్రం ప్రచారం ఆగలేదు. ఇంచార్జులతో సమన్వయం చేసుకుంటూ అన్ని పార్టీలు డివిజన్ల వారీగా గెలుపు తీరాలను చేరే దారులు వెతుక్కుంటున్నాయి. ప్రజల వద్దకు వెళ్లగలిగామా? గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రస్థాయి ఎన్నికలను తలపించిన గ్రేటర్ ప్రచారపర్వంపై అన్ని పార్టీలు సమీక్షలు పూర్తి చేసుకున్నాయి. డివిజన్ల వారీగా జరిగిన ప్రచార తీరుతెన్నులపై ఆయా డివిజన్ల ఇన్చార్జులు, అభ్యర్థులతో కసరత్తులు జరిపాయి. టీఆర్ఎస్ విషయానికి వస్తే డివిజన్ ఇంచార్జులతో పాటు నగర మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి వివరాలు సేకరించారు. గ్రేటర్ ఎన్నికల సమన్వయకర్తలతో కలిసి క్షేత్రస్థాయి నుంచి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి సోమవారం పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు నివేదించారు. బీజేపీ కూడా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కీలక సమీక్ష జరిపింది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు ముఖ్య నాయకులు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, డి.కె.అరుణలు డివిజన్ల వారీగా పార్టీ పరిస్థితిని అంచనా వేశారు. బండి సంజయ్ అయితే సోమవారం కూడా బిజీబిజీగా గడిపారు. సికింద్రాబాద్ ఉజ్జయిని దేవాలయం, బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో పూజలు నిర్వహించిన ఆయన సనత్‌నగర్ నుంచి నాంపల్లి వరకు మెట్రోరైలులో Ðవెళ్లారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గణపతి పూజ నిర్వహించారు. ఆ తర్వాత లోయర్‌ట్యాంక్‌బండ్‌లోని గోశాలను, గౌలిగూడ గురుద్వారను సందర్శించి రోజంతా వార్తల్లోనే ఉండే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ విషయానికి వస్తే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డిలు కూడా డివిజన్ల వారీగా పార్టీ పరిస్థితులను సమీక్షించారు. గట్టిపోటీ ఇచ్చే స్థానాలను గుర్తించి వాటిపై దృష్టి కేంద్రీకరించి పనిచేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. దారుస్సలాం కేంద్రంగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్, అక్బరుద్దీన్లు తాము పోటీ చేస్తున్న స్థానాల్లోపరిస్థితిపై పార్టీ నేతలతో మంతనాలు జరిపారు. పాతబస్తీలో బీజేపీ ప్రభావం చూపే అవకాశాలతో పాటు ఇతర పార్టీల నుంచి ఎదురవుతున్న పోటీపై చర్చించి పార్టీ నేతలకు సూచనలిచ్చారు. ప్రధానపార్టీలు క్షేత్రస్థాయి నివేదికలు, ఇతర మార్గాల ద్వారా సమాచారాన్ని సేకరించాయి. ముఖ్యంగా సర్వేలు, ఇంటెలిజెన్స్ నివేదికలపై దృష్టి సారించారు. పోలింగ్ ముగిసేవరకు... పారాహుషార్ గ్రేటర్ విజయం కోసం మూడు ప్రధాన పార్టీలు దాదాపు ఒకే వ్యూహాన్ని అనుసరించినట్టు అర్థమవుతోంది. పార్టీ అభ్యర్థి సునాయాసంగా గెలిచేవి, ఇతర పార్టీల నుంచి గట్టిపోటీ ఎదురవుతాయనే అంచనాకు వచ్చిన డివిజన్లపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఆయా డివిజన్లలో పరిస్థితులను బట్టి ఏం చేయాలన్న దానిపై స్థానిక నాయకత్వానికి పలు సూచనలిచ్చాయి. ముఖ్యంగా మూడు కేటగిరీల్లో డివిజన్లను విభజించిన రాజకీయ పార్టీలు... విజయావకాశాలున్న ఏ, బీ కేటగిరిల్లో పోలింగ్ రోజున అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టువీడొద్దని, పోలింగ్ ముగిసేంతవరకు ఇంచార్జులు, ఇతర నాయకులు డివిజన్లలోనే ఉండి సమన్వయంతో ముందుకెళ్లాలని, చివరి ఓటు వరకు పార్టీకి పడేలా పనిచేయాలని దిశానిర్దేశం చేశాయి. ఏమాత్రం ఏమరుపాటు తగదని హెచ్చరించాయి. ఎంఐఎం కూడా పాతబస్తీలో పట్టుజారకుండా తమ వ్యూహాలకు చివరినిమిషంలో పదును పెట్టింది. టీఆర్ఎస్ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రాంతాల్లో ఉండి మరీ తమకు అప్పగించిన డివిజన్లలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం అభ్యర్థులు అనుసరిస్తున్న ఎత్తుగడలపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఓటర్లు చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పట్టున్న కాలనీలు, స్లమ్లపై ప్రత్యేక దృష్టి కాలనీలు, మురికివాడల వారీగా పార్టీకి అనుకూలంగా ఉండే వర్గాలు, ఓటర్లపై అన్ని పార్టీలు ఒక అంచనాకు వచ్చాయి. చివరి నిముషంలో వీరి ఓట్లు చేజారకుండా ఉండేందుకు వివిధ పద్దతుల్లో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. తటస్థ ఓటర్లనూ మచ్చిక చేసుకునే పనిలో పడ్డాయి. అపార్ట్మెంట్లు, కాలనీల వారీ సమావేశాలతో గంపగుత్తగా ఓట్లు రాబట్టుకునే ప్రణాళికలను అమలుపరిచాయి. ఇక కొన్ని పార్టీల నేతలు అయితే కార్తీక భోజనాల పేరుతో కమ్యూనిటీ ప్రచారంలో పాల్గొన్నారు కూడా. బూత్‌ల వారీగా పోలింగ్ ఏజెంట్ల నియామకం పూర్తిచేశారు. తమకు అనుకూలంగా ఉంటారనే ఓటర్లను తరలించేందుకు వాహనాలు ఏర్పాటు చేసి... గల్లీల వారీగా బాధ్యతలు అప్పగించారు. మొత్తంమీద ఈసారి బల్దియా పోరులో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు చివరి క్షణం వరకు పట్టువీడని పోరాటం చేస్తున్నాయి. -
చేతులు కడగండి.. పాలిటిక్స్‌ను కూడా!
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధం. బాధ్యతాయుత పౌరులుగా ఓటు హక్కును వినియోగించుకుంటూ.. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలి. పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఓటు వేసి వచ్చేందుకు కొన్ని నిమిషాల సమయం పడుతుంది. ఆ కొద్దిసేపు జాగ్రత్తగా ఉండాలని, జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం, తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖలు ప్రజలకు విన్నవించాయి. పోలింగ్స్టేషన్లోకి ప్రవేశించేప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించి వెళ్లాలి. లేకపోతే లోనికి అనుమతించరు. అలాగే పోలింగ్ బూత్‌ల దగ్గర క్యూలైన్లలో ఒకరికొకరికి మధ్య ఆరు అడుగుల దూరం ఉండేలా వృత్తాకార గుర్తులు ఏర్పాటు చేశారు. వాటిల్లోనే నిలబడి బూత్‌లోకి లైన్‌గా వెళ్లాలి. బూత్‌లో పలుచోట్ల తాకాల్సి ఉంటుంది.. అక్కడ ఏర్పాటు చేసిన శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకున్నాక బూత్‌లోకి ప్రవేశించాలి. బ్యాలెట్ పత్రం ద్వారా ఓటు వేయాల్సి ఉన్నందున ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. బూత్లోనికి వెళ్లగానే మొదటి పోలింగ్ అధికారి ఓటర్ జాబితాలో పేరుందా లేదా చూస్తారు. అందుకోసం ఓటర్ తమ గుర్తింపు కార్డును అధికారికి ఇవ్వాలి. ఆ అధికారి గుర్తింపు కార్డును పట్టుకొని చూసి తిరిగి ఇచ్చేస్తారు. అధికారి తాకిన కార్డును తిరిగి తీసుకున్నప్పుడు కాంటాక్ట్ ఏర్పడుతుంది. తర్వాత రెండో అధికారి వద్దకు వెళ్లాలి. అక్కడ ఓటర్ ఎడమ చూపుడు వేలుపై సిరా మార్క్ వేస్తారు. మూడో పోలింగ్ అధికారి బ్యాలెట్ పత్రం ఇస్తారు. దాన్ని ఇచ్చేముందు బ్యాలెట్ కౌంటర్ పాయింట్‌పై ఓటర్ సంతకం లేదా వేలిముద్ర తీసుకుంటారు. తర్వాత బ్యాలెట్ పేపర్‌తోపాటు ఓటు వేసేందుకు ఇంకు అద్దిన రబ్బర్ స్టాంప్‌ను ఓటర్‌కు ఇస్తారు. అప్పుడు కూడా ఇతరులు వాడిన, అధికారి పట్టుకున్న స్టాంప్‌ను తీసుకోవడం ద్వారా కాంటాక్ట్ ఏర్పడుతుంది. ఆ తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లోకి వెళ్లి ఇష్టమైన అభ్యర్థి గుర్తుపై ముద్ర వేయాలి. తర్వాత దాన్ని మడతబెట్టి బయటకు వచ్చి ప్రిసైడింగ్ అధికారి వద్ద ఉన్న బ్యాలెట్ పెట్టెలో వేయాల్సి ఉంటుంది. ఇలా వివిధ దశల్లో పలుసార్లు చేతులతో వివిధ ప్రాంతాల్లో తాకాల్సి ఉంటుంది. అధికారి అనేకమంది ఓటర్లతో కాంటాక్ట్ అవుతారు. కాబట్టి ఓటేసి బయటకు వచ్చాక తక్షణమే చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. అందుకోసం అవసరమైతే సొంతంగా శానిటైజర్‌ను దగ్గర ఉంచుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులంతా మాస్క్‌లు, ఫేస్ షీల్డ్‌లు పెట్టుకుంటారు. పైగా బూత్‌లోకి ఒక్కరినే అనుమతిస్తారు. వారు ఓటేసి వెళ్లిపోయాక మరొకరిని లోనికి అనుమతిస్తారు. కరోనా బాధితులకు గంటపాటు ప్రత్యేక ప్రవేశం ► కరోనా పాజిటివ్ బాధితులు సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య ఓటేయడానికి ప్రత్యేక సమయం, ప్రత్యేక ద్వారం కేటాయించారు. వారికి మాస్క్‌లు, ఫేస్‌షీల్డులు అందజేస్తారు. అదే సమయంలో ఇతర ప్రవేశమార్గాల్లో సాధారణ ఓటర్లు ఓటేయవచ్చు. ► నవంబర్ ఒకటో తేదీ తర్వాత కరోనా పాజిటివ్ వచ్చిన వారికి పోస్టల్ బ్యాలెట్‌కు కూడా అవకాశం కల్పించారు. ► బ్యాలెట్ బాక్సులను తీసుకెళ్లే సిబ్బందికి, బ్యాలెట్ పేపర్లను ఒక దగ్గరకు చేర్చే ఉద్యోగులకు పీపీఈ కిట్లు ఇస్తారు. ► ఎన్నికల సిబ్బంది అంతా ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ► పోలింగ్ సిబ్బందిలో ఎవరికైనా కరోనా లక్షణాలుంటే, తక్షణమే వారిని మార్చడానికి రిజర్వుడు సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ► భౌతికదూరాన్ని పర్యవేక్షించేందుకు వాలంటీర్లను నియమించారు. ► సిబ్బంది, ఏజెంట్ల కోసం పోలింగ్స్టేషన్లలో భౌతికదూరం పాటిస్తూ సీటింగ్ ఏర్పాట్లు చేశారు. ► బూత్‌లో అధికారులు ఓటరును గుర్తించేందుకు ఒకసారి మాస్క్‌ను తొలగించి వెంటనే పెట్టుకోవచ్చు. -
సామరస్యతే మన సంస్కృతి కావాలి...
ఐదువందల ఏళ్ల మహోజ్వల చరిత్ర కలిగివున్న హైదరా బాద్ భారత స్వాతంత్య్ర కాలం నాటికే దేశంలోని ఐదు మహా నగరాల్లో ఒకటి. వివిధ భాషలకు, మతాలకు, సంస్కృతులకు కేంద్రం. మత సామరస్యానికి ప్రతీక. హైద రాబాదు కేంద్రంగా తెలం గాణ నేలిన నైజాం నవాబులు కాకతీయ రాజుల వ్యవసాయ నమూనాకు పొడిగింపుగా చెరువులు, కుంటలు, గొలుసు చెరువులతో వ్యవసాయం సాగిం చారు. నైజాం పాలన చివరి రోజుల్లో సంభవించిన రజాకారు దురంతాలను వదిలిపెడితే వారి పాలన ఏ ఇతర రాజుల పాలనకూ తీసిపోదు. ముస్లిం రాజుల పాలనలో కట్టబడిన గోల్కొండ ఖిల్లా, చార్మి నార్, మక్కామసీదు, ఉస్మానియా విశ్వవిద్యాలయం, సాలా ర్జంగ్ మ్యూజియం, ఫలక్‌నుమా ప్యాలెస్, ట్యాంక్ బండ్, ఇంకా అనేక చెరువులు, కుంటలు తెలంగాణ చారిత్రక వైభవానికి చిహ్నాలు. వందలేండ్లుగా హైదరా బాద్ ప్రజలు హిందూ ముస్లిం భాయీ భాయీ అన్న ట్టుగా సహజీవనం సాగిస్తున్నారు. స్వాతంత్య్రానంతరం వలస పాలకుల చేతుల్లోకి పాలన పోయిన తర్వాత హైదరాబాధలు మొదల య్యాయి. కుంటలు, చెరువులు ఆక్రమణకు గురై అక్రమ కట్టడాలతో డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతింది. వాతా వరణ కాలుష్యం పెరిగింది. జనాభా పెరుగుదలకు తగినట్టుగా నీటి వనరులు కల్పించకపోవడంవల్ల తాగునీటి కొరత ఏర్పడింది. ఈ అన్ని కారణాలవల్ల సమతుల వాతావరణంలో ఉండే నగర ఉష్ణోగ్రత పెరిగింది. నిరుద్యోగం పెరిగింది. వలసలు పెరిగాయి. వలస పాలకుల పాలనలో ముఖ్యమంత్రిని మార్చాల నుకున్నప్పుడల్లా హైదరాబాద్ మత కలహాలకు వేది కగా మారింది. కర్ఫ్యూలు, 144 సెక్షన్లతో ప్రజలు నానా ఇబ్బందుల్లో పడేవారు. అభివృద్ధి కుంటుపడి తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు కూడా రాని పరి స్థితి. నీళ్ళు, నిధులు, నియామకాలు అన్నీ దోపిడీకి గురై తెలంగాణ ప్రజలు పరాయీకరణ మాయలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో టీఆర్ఎస్ ఏర్ప డింది. తెలంగాణను సాధించడానికి 13 ఏళ్లు కేసీఆర్ నాయకత్వంలో రాజీలేని పోరాటం చేసింది. 2014లో అధికారంలోకి రాగానే టీఆర్ఎస్ హైద రాబాధను, తెలంగాణ బాధను అర్థం చేసుకుంది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ సమస్యలతో పాటు హైదరాబాద్ సమస్యలు కూడా ఒక్కొక్కటిగా పరిష్కారమవుతున్నాయి. సమస్యలన్నీ ఒకేసారి పరిష్కారం కాకపోవచ్చుగానీ వాటి పరిష్కా రానికి పథకాలు రచింపబడుతున్నాయి. రాష్ట్రాన్ని వేధి స్తున్న తాగునీటి సమస్య, సాగునీటి సమస్య తీర్చ డానికి, సగం జనాభాకుపైగా బతికే వ్యవసాయం, వ్యవసాయాధారిత పనులను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి అనేక పథకాల వల్ల నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే దిశగా పయనం కొన సాగుతోంది. హైదరా బాద్ ఐటీ, ఫార్మా హబ్‌గానే కాకుండా, విదేశీయులు కూడా పెట్టుబడులు పెట్టడా నికి అనువైన స్థలంగా భావింపబడుతోంది. ఏ పరిశ్రమలైనా సక్రమంగా కొనసాగాలంటే నిరంతర విద్యుత్ సరఫరా అవసరం. స్వాతంత్య్రానంతరం తెలంగాణలో పెద్ద సమస్యగా ఉన్న విద్యుత్ కొరతను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తీర్చడం జరిగింది. ఒకప్పుడు దక్షిణాది వాళ్లందరూ మదరాసీలుగానే పిలవబడితే ఇప్పుడు హైదరాబాద్ మహానగరంతో, రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ ప్రపంచ పటంలో స్థానం సంపాదిం చుకుంది. తెలంగాణ భాషకు గౌరవం పెరిగింది. లౌకికవాదిగా అన్ని మతాలకు సమాన గౌరవమిస్తూ, మత సామరస్యాన్ని కాపాడటంలో కేసీఆర్ దేశంలోనే ముందు వరుసలో ఉన్నాడు. సంక్రాంతి, దసరా, బతుకమ్మ లాంటి హిందువుల పండుగలకెంత ప్రాధా న్యమిస్తాడో రంజాన్, బక్రీద్, క్రిస్మస్, గుడ్ ఫ్రైడేలకు అంతే ప్రాధాన్యతనిస్తాడు. ఇవేవీ ప్రస్తావించకుండా బీజేపీ నాయకులు వర్షాలొస్తే హైదరాబాద్ చెరువవుతుందనీ, కరోనాను ఎదుర్కోలేదనీ, కుటుంబ పాలననీ, వరదసాయం రైతులకు అందలేదనీ అరిగిపోయిన రికార్డులతో ప్రచారం చేస్తునారు. వర్షాలను కానీ, వరదలను కానీ, కరోనాను కానీ ఎవరూ ఆపలేరు. ఇలాంటి విపత్తులు వచ్చినపుడు ప్రభుత్వాలు ఎలా ఎదుర్కొన్నాయన్నదే ప్రశ్న. ఈ అన్ని విషయాల్లోనూ బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కంటే టీఆర్ఎస్ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసింది. తెలంగాణ అభివృద్ధి ఇలాగే జరగాలన్నా, హైదరాబాదును విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్నా, మత సామరస్యాన్ని కాపాడుకోవాలన్నా టీఆర్ఎస్ పాలన ఒక అనివార్యం. వ్యాసకర్త: డా. కాలువ మల్లయ్య, ప్రముఖ రచయిత మొబైల్ : 91829 18567 -
గ్రేటర్ ఎన్నికలు: భారీ పోలీసు బలగాలు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికలకు హైదరాబాద్ పోలీసులు సన్నద్ధమయ్యారు. ఆదివారం సాయంత్రం ఆరు గంటలతో ఎన్నికల ప్రచారం ముగిసింది. 150 డివిజన్లలో ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్ 84, సైబరాబాద్ 38, రాచకొండ పరిధిలో 28, హైదరాబాద్ సిటీలో 4,979 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 50 వేల మందితో భారీ పోలీస్ భద్రతతో పాటు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించారు. స్ట్రాంగ్ రూం, డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. (చదవండి: జీహెచ్ఎంసీ: 13,500 మందితో పటిష్ట భద్రత) హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో.. రేపటి ఎన్నికల పోలింగ్‌కు భద్రతా పరమైన అన్నీ చర్యలు తీసుకున్నామని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో 89 వార్డులు ఉన్నాయని, 4979 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు- 1517, అత్యంత సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు 167 గుర్తించామని పేర్కొన్నారు. 406 మొబైల్ పార్టీలతో నిరంతరం మానిటరింగ్ చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో 29 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. 4187 గన్స్ డిపాజిట్ అయ్యాయి. 3066 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేశామని పేర్కొన్నారు. (చదవండి: జనతా గ్యారేజ్ X కల్వకుంట్ల గ్యారేజ్) ‘‘పోలీసుల తనిఖీల్లో 1.45 కోట్ల రూపాయల స్వాధీనం చేసుకున్నాం. పలు చోట్ల భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నాం. 63 ఫిర్యాదులో 55 ఎఫ్ఐఆర్లు నమోదు చేశాం. ప్రతి పోలింగ్ స్టేషన్‌కు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేశాం. సోషల్ మీడియా పై ప్రత్యేక నిఘా ఉంచాం. కౌంటింగ్ కేంద్రాల బయట నిరంతర సీసీటీవీ నిఘా ఉంచాం. రేపు ఉదయం 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ రోజున ప్రతి అభ్యర్థికి కేవలం ఒక్క వార్డు వద్ద ఒక్క వాహనం మాత్రమే అనుమతి ఇస్తాం. ఎలక్షన్ ఏజెంట్ కూడా అదే వాహనం లో వెళ్ళాలని’’ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో.. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మొత్తం 8వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. మొత్తం 13 పోలీస్స్టేషన్ల పరిధిలో ఎన్నికలు జరగుతాయని తెలిపారు. 29 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని చెప్పారు. 15 లక్షలు విలువైన మద్యాన్ని సీజ్ చేశామని వెల్లడించారు. ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రజలు 9490617111 కు సమాచారం అందించాలని తెలిపారు. కమిషనరేట్ పరిధిలో 4,800 మంది రోహింగ్యాలు ఉన్నారని వారిలో 4,500 మందికి బయోమెట్రిక్ నిర్వహించామని పేర్కొన్నారు. 160 మందిపై కేసులు నమోదు చేసామని వెల్లడించారు. నకిలీ పాస్‌పోర్టు కలిగిన వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని సీపీ మహేష్ భగవత్ పేర్కొన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ బ్యాలెట్ పద్ధతిలో జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ 9,101 పోలింగ్ కేంద్రాలు.. 74,67,256 మంది ఓటర్లు మొత్తం 150 వార్డులు, బరిలో 1,122 మంది అభ్యర్థులు టీఆర్ఎస్-150, బీజేపీ-149, కాంగ్రెస్-146 చోట్ల పోటీ టీడీపీ-106, ఎంఐఎం-51, సీపీఐ-17 డివిజన్లలో పోటీ సీపీఎం-12, స్వతంత్రులు-415, ఇతరులు 76 చోట్ల పోటీ 60 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 30 స్టాటిస్టిక్ సర్వేలెన్స్ టీమ్‌లు పోలింగ్ విధుల్లో 36,404 వేల మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో 45 వేల మంది సిబ్బంది గ్రేటర్లో అతిపెద్ద డివిజన్ మైలార్‌దేవ్‌పల్లి గ్రేటర్లో అతిచిన్న డివిజన్ ఆర్సీపురం గ్రేటర్ ఎన్నికల కోసం 18,202 బ్యాలెట్ బాక్స్‌లు పోస్టల్ బ్యాలెట్ కోసం 2,629 మంది దరఖాస్తు డిసెంబర్ 4న జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు -
కమిషనర్ కార్యాలయం వద్ద బీజేపీ ధర్నా
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్( జీహెచ్ఎంసీ) ఎన్నికల నేపథ్యంలో పోలీసులు టీఆర్ఎస్ పార్టీకి కొమ్ము కాస్తున్నారని బీజేపీ శ్రేణులు నగర పోలీసు కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎమ్మెల్సీ రామచంద్రరావును పోలీసులు అరెస్ట్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ డబ్బులు, మద్యం విచ్చలవిడిగా పంచినా వారిపై కేసులు నమోదు చేయడం లేదని రఘునందన్ రావు అన్నారు. టీఆర్ఎస్ ఆగడాలపై ప్రశ్నించిన తమపై కేసులు నమోదు చేసి దాడులు చేస్తున్నారని ఆయన తీవ్రంగా ఆరోపించారు. మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ఇల్లు ముట్టడి: మాన్సూరాబాద్ డివిజన్లో మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఉన్న ఇంటిని బీజేపీ కార్యకర్తలు ముట్టడించారు. డివిజన్ నుంచి వెళ్లిపోవాలంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సూర్యాపేట నుంచి వచ్చిన వాళ్ల వెంటనే వెళ్లిపోయి, ప్రజాస్వామ్యాన్ని కాపాడలంటూ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మంత్రి జగదీశ్వర్ రెడ్డిలతో పాటు తెరాస నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని బీజేపీ అభ్యర్థి కొప్పుల నరసింహరెడ్డి అన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడినుండి మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వెనుదిరిగారు. చిన్నారులతో డబ్బు పంపిణీ: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేట్ అభ్యర్థులు డబ్బుల పంపిణీకి కొత్త పంథా ఎంచుకున్నారు. కార్యకర్తలతో పంపిణీ చేస్తే పోలీసులు, ప్రతిపక్షాల నుంచి తలనొప్పులు వస్తాయని ఎవరికి అనుమానం రాకుండా చిన్న పిల్లలు ద్వారా డబ్బు పంపినీకి పూనుకున్నారు. నగరంలోని ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలో గడ్డిఅన్నారం డివిజన్లో చిన్నారులు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తూ కెమెరాకు చిక్కారు. అయితే వీడియో తీయడం చూసి ఆ చిన్నారులు వెళ్లిపోవడంతో.. వారు ఎవరి పార్టీ తరుఫున నగదు పంచుతున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. -
జీహెచ్ఎంసీ: 13,500 మందితో పటిష్ట భద్రత
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు. బల్దియా ఎన్నికల కోసం 13,500 మంది పోలీసులతో అన్ని భద్రతాపరమైనా ఏర్పాట్లు చేశామని అన్నారు. వీరిలో 10,500 మంది సివిల్, 3000 మంది ఏఆర్ సిబ్బంది ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రెస్మీట్లోని ముఖ్యాంశాలు.. ►జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి మూడు సార్లు తర్ఫీదు ఇచ్చాము. ►స్టేట్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం అన్ని ప్రాంతాల్లో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాము. ►ఆదివారం సాయంత్రం 6 గంటల వరకూ ఎన్నికల ప్రచారం ముగిసింది. ►నార్మల్, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్, క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద ఎస్ఐ, సీఐ స్థాయి అధికారి, ఏసీపీ, ఏడీసీపీ, డీసీపీల నేతృత్వంలో భద్రత ఏర్పాటు చేశాం. ►38 స్ట్రైకింగ్ ఫోర్స్, 11 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, 9 సీపీ రిజర్వ్ టీమ్స్, 11 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 11 స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్‌లు అందుబాటులో ఉంటాయి. ►73 హైపర్ సెన్సిటివ్ పికెట్లు నియమించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాము. ►హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల వద్ద ఒక ఎస్ఐ, 4 ఏఆర్ సిబ్బందిని ఏర్పాటు చేశాము. ►సైబరాబాద్ కమిషనరేట్‌లో 38 వార్డ్లు ఉన్నాయి ►2,437 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ►1,421 నార్మల్ పోలింగ్ స్టేషన్ లు ఉన్నాయి. ►766 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ లు ఉన్నాయి. ►250 అత్యంత సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ లు ఉన్నాయి. ►177 మొబైల్ పార్టీలతో నిరంతరం మానిటరింగ్ చేస్తున్నాము. ►సైబరాబాద్‌లో 15 బార్డర్ చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేశాం. ►587 లైసెన్సెడ్ గన్స్ డిపాజిట్ చేయడం జరిగింది. ►369 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేశాం. ►రూ.15 లక్షలు విలువ చేసే 396 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నాం ►ప్రతి పోల్ల్లింగ్ స్టేషన్‌కు జియో ట్యాగింగ్ చేశాం. ►సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉంచాం. ►పెండింగ్‌లో ఉన్న 24 మంది పై నాన్ బెయిలబుల్ వారెంటీలు ఎగ్జిక్యూట్ చేశాం. ►సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సిసిటివి లు ఏర్పాటు చేసి వాటిని ఎలక్ట్రానిక్ ప్లాట్ ఫామ్ ద్వారా అనుసంధానం చేశాం. ►జియో ట్యాగింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాన్ని అనుసంధానం చేశాము. ►1 లక్ష సీసీ కెమెరాలు ద్వారా సమస్యాత్మక ప్రాంతాలను మానిటరింగ్ చేస్తున్నాము. ►డీసీపీ, ఏసీపీ ఆఫీస్‌లో రౌండ్ ది క్లాక్ నిరంతర పర్యవేక్షణ ఉంచాము. ►ఎన్నికల అనంతరం లైవ్ స్ట్రీమింగ్ ద్వారా స్ట్రాంగ్ రూమ్ వద్ద నిఘా ఉంచాము. ►రేపు ఉదయం 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ►ఎన్నికల గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి.. ►ఎలక్షన్ ఏజెంట్‌కి ప్రత్యేక వాహనం అనుమతి ఉండదు. ►పోలింగ్ కేంద్రాల నుంచి 200 మీటర్ ల వద్ద ఓటర్ లు తమ వాహనాలు పార్క్ చేసుకోవాలి. ►ఓటర్లను తరలించడం చట్ట విరుద్ధం అలా చేస్తే వాహనాలు సీజ్ చేయబడతాయి. ►కోవిడ్ నియమ నిబంధనలు పాటించి ఓటింగ్‌లో పాల్గొనాలి. -
భారత రాజకీయాల్లో లైలా, మజ్నూ..
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కీలకమైన ప్రచార పర్వం ముగిసింది. గ్రేటర్ పీఠమే లక్ష్యంగా అన్ని పార్టీల అభ్యర్థులు ఆదివారం వరకు పోటాపోటీ ప్రచారం నిర్వహించారు. విపక్షాలకు ఏమాత్రం సమయం ఇవ్వని సీఎం కేసీఆర్ కేవలం పదిరోజుల్లోనే ఎన్నికల ప్రచారాన్ని ముగించారు. ప్రచారంలో అభివృద్ధి మాట కన్నా.. ప్రత్యర్థుల మధ్య మాటల యుద్ధమే ఎక్కువగా సాగింది. గల్లీ ఎన్నికలే అయినప్పటికీ దాని వేడి ఢిల్లీ వరకు పాకింది. అధికార టీఆర్ఎస్పై బీజేపీ నేతలు విమర్శలతో రాజధానిలో రాజకీయ వేడి సెగలు పుట్టించింది. మరోవైపు ఎంఐఎం-బీజేపీ మధ్య వివాదాస్పద వ్యాఖ్యలు, ప్రకటనలు భాగ్యనగరంలో ప్రకంపనలు రేపాయి. గ్రేటర్ ఎన్నికల్లో తాము గెలిస్తే పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించగా.. నగర నడిబొడ్డున ఉన్న మాజీ ప్రధాని పీవీ, ఎన్టీఆర్ ఘాట్స్‌ను కూల్చివేస్తామని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపాయి. (గ్రేటర్ ప్రచారం: ట్రంప్ ఒక్కరే మిగిలిపోయారు) మరోవైపు ప్రచారం చివరిరోజైన ఆదివారం నాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన కాషాయదళంలో మరింత ఉత్తేజాన్ని నింపగా.. రాజధానిలో పొలిటికల్ హీట్‌ను మరింత పెంచింది. ఇక బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఆదివారం నాడు ఓ జాతీయ మీడియా నిర్వహించిన ఇంటర్య్వూలో ఒవైసీ పలు వ్యాఖ్యలు చేశారు. దేశ రాజకీయాల్లో తాను లైలా పాత్ర పోషిస్తుంటే.. మిగత పక్షాలన్నీ మజ్నూలా తన చుట్టే తిరుగుతున్నాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (పిచ్చోళ్ల చేతిలో హైదరాబాద్‌ను పెట్టడమే) ‘పాత బస్తీలో రొహింగ్యాలు, పాకిస్తానీ ఓటర్లు, అక్రమ వలసదారులు ఉన్నారని కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు వ్యాఖ్యలు హ్యాస్యాస్పదం. కేవలం పాతబస్తీపైనే ఆ పార్టీ నేతలంతా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. అక్రమ వలసదారులు ఉంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏం చేస్తున్నారు. పాత బస్తీలో ఉన్న వారంతా కేంద్ర హోంమంత్రి శాఖ అనుమతితోనే ఉంటున్నారు. బీజేపీ నేతలతో పాటు ఇతర పార్టీ నేతలంతా నాపై అనేక ఆరోపణలు చేస్తున్నారు. బిహార్‌లో బీజేపీ విజయం వెనుక తన పాత్ర ఉందని అంటున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం అన్ని పార్టీల నేతలంతా నన్నే టార్గెట్‌గా చేసుకున్నారు. దేశ రాజకీయాల్లో నేను లైలా లాంటి వాడిని, మిగతా వారంతా మజ్నూలా నా వెంట పడుతున్నారు.’ అంటూ వ్యాఖ్యానించారు. -
గ్రేటర్ పోరు: కౌన్ బనేగా?
గ్రేటర్ ఎన్నికల్లో కీలక ఘట్టమైన ప్రచార పర్వం ముగిసింది. గెలుపు కోసం అన్ని పార్టీల అభ్యర్థులు ఆదివారం వరకు పోటాపోటీ ప్రచారం నిర్వహించారు. తామే గెలుస్తామంటూ లెక్కలు వేసుకుంటున్నారు. చాలా ప్రాంతాల్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్యే నువ్వా నేనా..? అనేలా పోటీ ఉండగా.. అక్కడక్కడా కాంగ్రెస్ పోటీ ఇస్తోంది. కొన్ని ప్రాంతాల్లో త్రిముఖ పోటీ నెలకొంది. అభివృద్ధి పథకాలు, సిట్టింగ్‌లు, క్యాడర్ టీఆర్ఎస్కు అనుకూలంగా ఉండగా.. వరదలు, రూ.10 వేల ఆరి్థక సాయం, దుబ్బాక ఓటమి బీజేపీకి కలిసొచ్చే అంశాలు. పాతబస్తీలో అత్యధిక స్థానాలు మజ్లిస్ పార్టీలకే అనుకూలంగా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో సెటిలర్లు, ఉత్తర భారతీయులు, ముస్లిం మైనార్టీ ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గుచూపినా అంచనాలు తారుమారయ్యే అవకాశం ఉంది. కూకట్పల్లి నియోజకవర్గంలో.. కూకట్పల్లి: కూకట్పల్లి నియోజకవర్గంలో 8 డివిజన్లు ఉన్నాయి. గతంలో కేపీహెచ్‌బీ డివిజన్ మినహా మిగిలిన అన్ని డివిజన్లను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కేపీహెచ్బీలో టీడీపీ నుంచి గెలుపొందిన కార్పొరేటర్ కూడా టీఆర్ఎస్లో చేరిపోయారు. మూసాపేటలో త్రిముఖ పోటీ నెలకొంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంది. టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు మూసాపేట ప్రాంతానికి చెందిన వారే కావడంతో ఓట్లు చీలే అవకాశం ఉంది. మోతీనగర్ ప్రాంతంలో కొంత భాగంలో ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే కనిపిస్తోంది. అభివృద్ధి టీఆర్ఎస్కు కలిసివచ్చే అవకాశం ఉంది. కేపీహెచ్‌బీ కాలనీలో అధికార టీఆర్ఎస్, బీజేపీకి హోరాహోరీ పోరు నడుస్తోంది. వలస ప్రాంతీయులు ఎక్కువగా ఉన్న ఈ డివిజన్లో పోటీ నువ్వా నేనా..? అన్న విధంగా ఉంది. సెటిలర్స్ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. బాలాజీనగర్ డివిజన్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థి రాజకీయ అనుభవజ్ఞుడు కావటం బీజేపీ అభ్యర్థి రాజకీయాలకు కొత్త కావడంతో కొంత తేడా కనిపిస్తోంది. అయినప్పటికీ ప్రజల్లో బీజేపీకి మంచి ఆదరణ లభిస్తోంది. అల్లాపూర్‌లో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. ఇక్కడ మైనార్టీ ఓట్లు కీలకంగా ఉండటంతో టీఆర్ఎస్కు అనుకూలమైన వాతావరణం కనిపిస్తోంది.ఫతేనగర్ డివిజన్లో టీఆర్ఎస్, బీజేపీకి హోరాహోరిగా ఉన్నప్పటికీ బీజేపీకి రెబల్ అభ్యర్థి, టీఆర్ఎస్కు ముస్లింఅభ్యర్థితో కొంత ఇబ్బంది నెలకొంది. దీంతో ఇరుపార్టీల అభ్యర్థులకు కూడా తలనొప్పిగా మారింది. బోయిన్‌పల్లిలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంది. బాలానగర్‌లో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ముఖ్యంగా ఇక్కడ పోటీ చేసే ముగ్గురు అభ్యర్థులు కొత్త వారు కావడంతో ఓటర్లు ఎవరికి తీర్పు ఇచ్చేదో ఉత్కంఠగా ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి గతంలో పోటీ చేయడంతో ఆయనకు కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది.కూకట్పల్లి డివిజన్లో త్రిముఖ పోటీ ఉంది. అధికార పార్టీ తాను చేసిన అభివృద్ధి పనులతో ముందుకు పోతుండగా బీజేపీ అభ్యర్థి ప్రచారంలో ఉత్సాహంగా దూసుకెళ్తున్నారు. ఇక్కడ ముగ్గురు ఒకే సామాజికవర్గం కావటంతో ఓటర్లు ఎవరికి తీర్పు ఇవ్వనున్నారో వేచి చూడాల్సిందే. శేరిలింగంపల్లి జంట సర్కిళ్ల పరిధిలో.. గచ్చిబౌలి: శేరిలింగంపల్లి జంట సర్కిళ్ల పరిధిలో ఏడు డివిజన్లు ఉన్నాయి. ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్యనే పోటీ నెలకొంది. ఓవరాల్‌గా ఎక్కువ స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. నార్త్ ఇండియన్స్ పోలింగ్‌లో పాల్గొంటేనే బీజేపీ పోటీ ఇవ్వగలుగుతుంది. కొండాపూర్ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి షేక్ హమీద్ పటేల్, బీజేపీ అభ్యర్థి రఘునాథ్ యాదవ్ మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఇక్కడ మైనార్టీ ఓట్లు కీలకంగా మారనున్నాయి. నార్త్ ఇండియన్ ఓట్లు ఎక్కువగా పోలైతే టీఆర్ఎస్కు మెజార్టీ తగ్గే అవకాశం ఉంది. గచ్చిబౌలి డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి కొమిరిశెట్టి సాయిబాబ, బీజేపీ అభ్యర్థి గంగాధర్‌రెడ్డి మధ్య పోటీ ఉంది. మైనార్టీ ఓట్లతో పాటు నార్త్ ఇండియన్ ఓట్లు కీలకంగా మారనున్నాయి. ఇప్పటికీ టీఆర్ఎస్కే ఎడ్జ్ ఉంది. శేరిలింగంపల్లి డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి రాగం నాగేందర్ యాదవ్, బీజేపీ అభ్యర్థి ఎల్లేష్ మధ్య పోటీ ఉంది. మాదాపూర్ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి జగదీశ్వర్‌గౌడ్, బీజేపీ అభ్యర్థి గంగల రాధాకృష్ణ యాదవ్ మధ్య పోటీ ఉంది. మైనార్టీ ఓట్లు కీలకం కానున్నాయి. మియాపూర్ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఉప్పలపాటి శ్రీకాంత్, బీజేపీ అభ్యర్థి రాఘవేందర్రావు మధ్య పోటీ ఉంది. మైనార్టీ ఓట్లు కీలకం. హఫీజ్‌పేట్ డివిజన్లో పూజితా జగదీశ్వర్‌గౌడ్, అనూష మహేష్ యాదవ్‌ల మధ్య పోటీ ఉంది. చందానగర్ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి మంజుల, బీజేపీ అభ్యర్థి సింధూ మధ్య పోటీ ఉంది. ఖైరతాబాద్ నియోజకవర్గంలో.. బంజారాహిల్స్: ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఆరు డివిజన్లు బంజారాహిల్స్‌లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. టీఆర్ఎస్ తరఫున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తొలిరోజు నుంచే ప్రచారంలో ఉన్నారు. మంత్రులు ఈటెల రాజేందర్, మహమూద్ అలీలు ఇక్కడ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ తరఫున ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు సీతక్క ప్రచారం నిర్వహించారు. బీజేపీ తరఫున ధర్మపురి అరవింద్ ప్రచారం నిర్వహించారు. వెంకటేశ్వరకాలనీలో టీఆర్ఎస్, బీజేపీ జోరుగా ప్రచారం చేసుకుంటున్నాయి. ఇక్కడ వార్ వన్‌సైడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జూబ్లీహిల్స్ డివిజన్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. ఇక్కడ కాంగెస్ అభ్యర్థి యువకుడు కావడంతో కొంత వరకు ఓట్లు చీలే అవకాశం ఉంది. బస్తీల్లో టీఆర్ఎస్కు ధీటుగా బీజేపీ బలంగానే ఉంది. ఇక్కడ ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్ల మధ్య పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఖైరతాబాద్ డివిజన్లో టీఆర్ఎస్ బలంగా ఉన్నప్పటికీ బీజేపీ చాపకింద నీరులా కొంత విస్తరిస్తోంది. ముఖ్యంగా యువత బీజేపీ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నడుస్తోంది. సోమాజిగూడ డివిజన్ ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ రెండు నియోజకవర్గాల మధ్యలో ఉంది. దీంతో ఇక్కడ ఒక వైపు ముస్లింలు, మరో వైపు హిందువులు ఉన్నారు. ఇక్కడ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా టఫ్ ఫైట్ నడుస్తోంది. కాంగ్రెస్ ముస్లింల ఓట్లను చీల్చే అవకాశం ఉంది. హిమాయత్‌నగర్ డివిజన్లో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా పోరు సాగుతోంది. అత్యధికంగా వ్యాపారులు, కాలనీలు, ఉన్నత విద్యావంతులు ఉండటంతో వారు ఎక్కువగా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మోండాలో పోటీ ఆ ఇద్దరి మధ్యే.. కంటోన్మెంట్: మోండా (డివిజన్ 150)లో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్(ఆకుల రూప), బీజేపీ(కొంతం దీపిక), కాంగ్రెస్(బాల ప్రశాంతి) బరిలో ఉన్నారు. ప్రధాన పోటీ టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్యే ఉంది. టీఆర్ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్‌పై స్థానికంగా కొంత వ్యతిరేకత ఉంది. ప్రచారంలోనూ నిరసనలు వ్యక్తమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే సాయన్న తన కూతురు లాస్యనందిత పోటీ చేస్తున్న ముషీరాబాద్ నియోజకవర్గంలోని కవాడిగూడ డివిజన్లో ప్రచారానికే పరిమతం అయ్యారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ తరఫున ఇన్చార్జి ముధోల్ ఎమ్మెల్యే, కొందరు స్థానిక నేతలు మినహా పార్టీ పెద్దలు ఎవరూ ఇక్కడ ప్రచారం చేయలేదు. బీజేపీ అభ్యర్థి రాజకీయాలకు కొత్త అయినా కొందరు స్వచ్ఛందంగా ఆమెకు ప్రచారం చేసేందుకు ముందుకు వచ్చారు. మలక్‌పేట నియోజకవర్గం మలక్‌పేట: నియోజకవర్గ పరిధిలో 6 డివిజన్లు ఉన్నాయి. మూసారంబాగ్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ ఉంది. సైదాబాద్ డివిజన్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉండగా మైనార్టీ ఓట్లు ఎక్కువగా పోలైతే టీఆర్ఎస్ అనుకూలం. మిగిలిన నాలుగు డివిజన్లు ఓల్డ్‌మలక్‌పేట, చవుని, ఆజంపుర, అక్బర్బాగ్లో ఎంఐఎం పార్టీ గెలుపు సునాయసమే. సైదాబాద్, మూసారంబాగ్లలో టీఆర్ఎస్కు ఎమ్మెల్యే బలాల ప్రచారం చేశారు. యాకత్‌పుర నియోజకవర్గం ఐఎస్‌సదన్‌లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉంది. కుర్మగూడ డివిజన్లో ఎంఐఎం, టీఆర్ఎస్, బీజేపీల మధ్య పోటీ ఉంది. మహేశ్వరం నియోజకవర్గం.. ఆర్కేపురం, సరూర్‌నగర్ డివిజన్లలో టీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. సనత్‌నగర్ నియోజకవర్గం సనత్‌నగర్: నియోజకవర్గం పరిధిలో ఆరు డివిజన్లు ఉన్నాయి. సనత్‌నగర్, అమీర్‌పేట, బేగంపేట, రాంగోపాల్‌పేట, బన్సీలాల్‌పేటలతో పాటు మోండా(పార్ట్) డివిజన్లు విస్తరించి ఉన్నాయి. సనత్‌నగర్ డివిజన్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. ఈ డివిజన్లో సెటిలర్స్ ఓటు బ్యాంక్ కీలకం. అమీర్‌పేట డివిజన్‌కు వచ్చేసరికి టీఆర్ఎస్–బీజేపీ నువ్వా నేనా అన్నట్లుగా ఉన్నాయి. ఇక్కడి నుంచి పోటీలో ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థికి రాజకీయ అనుభవంతో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. నార్త్ ఇండియన్స్ ఓటు బ్యాంకుపై తమకే అన్న ధీమాతో బీజేపీ నేతలు ఉన్నారు. బేగంపేట డివిజన్లో అధికార టీఆర్ఎస్ అభ్యరి్థకి మద్దతుగా ప్రచారం కొనసాగించారు. మంత్రులు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, ఇన్‌ఛార్జి రేఖానాయక్ ఇక్కడ ప్రచారంలో పాల్గొన్నారు. రాంగోపాల్‌పేట డివిజన్ నుంచి కూడా టీఆర్ఎస్, బీజేపీలు నువ్వా–నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. ఇక్కడ బీజేపీ ఉత్తర భారతీయుల మద్దతు లభిస్తుండటంతో ఆ పార్టీ జోష్‌లో ఉంది. బన్సీలాల్‌పేట డివిజన్లో బస్తీలు ఎక్కువగా ఉండటంతో కొన్ని హామీలు నెరవేర్చడంతో టీఆర్ఎస్ అభ్యరి్థని గట్టెక్కిస్తాయనే ధీమాతో ఆ పార్టీ నేతలు ఉన్నారు. గోషామహల్ నియోజకవర్గంలో.. అబిడ్స్: గోషామహల్ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లు ఉన్నాయి. బేగంబజార్ డివిజన్లో టీఆర్ఎస్, బీజేపీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి విజి.పురుషోత్తమ్ టీఆర్ఎస్ అభ్యర్థి పూజ వ్యాస్ బిలాల్‌కు మద్దతు ప్రకటించడంతో పోటీ పెరిగింది. గోషామహాల్ డివిజన్లో టీఆర్ఎస్, బీజేపీల మధ్య బిగ్ ఫైట్ నెలకొంది. టీఆర్ఎస్ అభ్యర్థి ముఖేష్ సింగ్, బీజేపీ నుంచి సీనియర్ బీజేపీ నేత లాల్‌సింగ్ పోటీలో ఉన్నారు. జాంబాగ్ డివిజన్లో టీఆర్ఎస్, మజ్లిస్, బీజేపీల మధ్యే ప్రధాన పోటీ. టీఆర్ఎస్ గత ఎన్నికల్లో కేవలం 5 ఓట్లతో ఓడిపోయింది. ఆ సింపతి కలిసొచ్చే అవకాశం ఉంది. గన్‌ఫౌండ్రీ డివిజన్లో టీఆర్ఎస్, బీజేపీల మధ్య పోటీ ఉంది. ఎల్బీస్టేడియంలోని కేసీఆర్ బహిరంగ సభ గన్‌ఫౌడ్రీ డివిజన్‌లోనే ఉండటం టీఆర్ఎస్లో ఉత్సాహం పెరిగింది. మంగళ్‌హాట్ డివిజన్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ. దత్తాత్రేయనగర్ డివిజన్లో మజ్లిస్ అభ్యర్థి జకీర్ బాక్రే, బీజేపీ అభ్యర్థి ధర్మేందర్ సింగ్‌లు బలంగా ఉన్నారు. ఇక్కడ 70 శాతం మైనార్టీ ఓట్లు ఉన్నాయి. సికింద్రాబాద్ నియోజకవర్గంలో.. సికింద్రాబాద్: నియోజకవర్గంలో ఐదు డివిజన్లు ఉన్నాయి. తార్నాకలో టీఆర్ఎస్ అభ్యర్థి మోతె శ్రీలతారెడ్డి, బీజేపీ అభ్యర్థి బండ జయసుధరెడ్డి మధ్యే పోటీ.. బౌద్ధనగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి కంది శైలజ, బీజేపీ అభ్యర్థి మేకల కీర్తి మధ్య పోటీ ఉంది. ఐదు డివిజన్లలో బస్తీలు ఎక్కువగా ఉన్నాయి. బస్తీల ఓట్లు కీలకంగా మారనున్నాయి. సీతాఫల్మండి, తార్నాక, మెట్టుగూడ డివిజన్లలో రైల్వే కాలనీల్లో రైల్వే కుటుంబాలకు చెందిన వేలాది ఓట్లు ఉన్నాయి. రైల్వే కుటుంబాలు పోలింగ్‌కు దూరంగా ఉండటంతో వీరి ప్రభావం లేకుండాపోయింది. కేటీఆర్ రోడ్ షోతో ఐదు డివిజన్లు తమవేనని టీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తుండగా, అమిత్ షా రోడ్‌షో ద్వారా తమకు 3 డివిజన్లు దక్కడం ఖాయమన్న ధీమాను బీజేపీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు. బౌద్ధనగర్, మెట్టుగూడ, తార్నాక, అడ్డగుట్ట డివిజన్ల నుంచి టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు అందరూ కొత్తవారిని రంగంలోకి దింపాయి. కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో.. కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో మొత్తం ఎనిమిది డివిజన్లు ఉండగా ప్రధాన పారీ్టల మధ్య పోటీ తీవ్రతరంగా ఉంది. కొన్నిచోట్ల ద్విముఖ పోటీ నెలకొనగా, మరికొన్ని డివిజన్లలో త్రిముఖ పోటీ నెలకొంది. ఒకటి, రెండు డివిజన్లలో ఏకపక్షంగా అభ్యర్థులు గెలిచే అవకాశముంది. గాజులరామారం డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి కూన శ్రీనివాస్‌గౌడ్, టీఆర్ఎస్ అభ్యర్థి రావుల శేషగిరి మధ్య గట్టి పోటీ ఉంది. జగద్గిరిగుట్ట డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి జగన్, బీజేపీ అభ్యర్థి మహేశ్ యాదవ్ మధ్య నువ్వా.. నేనా అన్నట్లుగా పోటీ నెలకొంది. చింతల్ డివిజన్లో బీజేపీ అభ్యర్థి కొట్టె రాధిక, టీఆర్ఎస్ అభ్యర్థి రషీదాబేగం మధ్య పోటీ నెలకొంది. సూరారం డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి సత్యనారాయణకు కాంగ్రెస్ అభ్యర్థి బట్ట పాలవెంకటేశ్ పోటీ ఇస్తున్నారు. సుభాష్‌నగర్ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి హేమలతకు అనుకూలంగా ఉంది. ఇక్కడ ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీల అభ్యర్థులు పోటీ ఇవ్వలేకపోతున్నారు. జీడిమెట్ల డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి పద్మాప్రతాప్, బీజేపీ అభ్యర్థి తారా చంద్రారెడ్డి మధ్య పోటీ ఉంది. కుత్బుల్లాపూర్ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా గౌరీష్ పారిజాత, బీజేపీ అభ్యర్థి గడ్డం సాత్విక్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. రంగారెడ్డినగర్ డివిజన్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. అంబర్‌పేట నియోజకవర్గంలో అంబర్‌పేట: అంబర్‌పేట నియోజకవర్గంలో ఐదు డివిజన్లలో టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ నెలకొంది. కాంగ్రెస్ మూడు డివిజన్లలో ఫలితాలను తారుమారు చేసే స్థాయిలో ప్రచారం చేస్తోంది. కాచిగూడ డివిజన్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉంది. టీఆర్ఎస్ సిటింగ్ కార్పొరేటర్ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉండటంతో బీజేపీ కాస్త అనుకూలంగా మారినా పోటీ తీవ్రంగానే ఉంది.నల్లకుంట డివిజన్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉంది. కాంగ్రెస్ బలమైన పోటీ ఇవ్వనుంది. గోల్నాక డివిజన్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ. గెలుపు అవకాశం టీఆర్ఎస్కే ఉన్నా సైలెంట్ ఓటింగ్ జరిగితే బీజేపీకి అవకాశం ఉంది. అంబర్‌పేట డివిజన్లో త్రిముఖ పోటీ ఉంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా పోరాడుతున్నాయి. బాగ్‌అంబర్‌పేట డివిజన్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉంది. అభ్యర్థులు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. బీజేపీ అభ్యరి్థకి రెబల్ బెడద ఉంది. మెహిదీపట్నంలో.. గోల్కొండ: మెహిదీపట్నంలో కార్వాన్ నియోజకవర్గానికి చెందిన ఆరు డివిజన్లు ఉన్నాయి. గతంలో జియాగూడ డివిజన్ టీఆర్ఎస్ గెలవగా.. కార్వాన్, లంగర్‌హౌస్, టోలిచౌకి, గోల్కొండ, నానల్‌నగర్ డివిజన్లలో మజ్లిస్ అభ్యర్థులు గెలిచారు. ప్రస్తుతం లంగర్‌హౌస్‌లో బీజేపీ, మజ్లిస్మధ్య పోటీ ఉంది. టోలిచౌకి, గోల్కొండ, నానల్నగర్లలో మజ్లిస్ పార్టీ అభ్యర్థులు ముందున్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో.. ఉప్పల్: ఉప్పల్ నియోజకవర్గంలో పది డివిజన్లు ఉన్నాయి. కాప్రా డివిజన్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు విజయం కోసం కష్టపడుతున్నా.. అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ అధికంగా ఉంది. ఎవరికి రెండో స్థానమో సందిగ్ధం నెలకొంది. ఏఎస్‌రావునగర్ డివిజన్లో టీఆర్ఎస్కు కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఉంది. చర్లపల్లి డివిజన్లో గతంలో గెలిచి మేయర్ అయిన బొంతు రామ్మోహన్ భార్య ప్రస్తుతం టీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్నారు. రూ.200 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేశారు. మీర్‌పేట–హెచ్‌బీకాలనీ డివిజన్లో టీఆర్ఎస్, బీజేపీల మధ్యే పోటీ ఉంది. మల్లాపూర్ డివిజన్లోటీఆర్ఎస్ అభ్యర్థి దేవేందర్‌రెడ్డికి వ్యతిరేకత ఉన్నప్పటికీ టీఆర్ఎస్కు అనుకూలం. నాచారం డివిజన్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. చిలుకానగర్ డివిజన్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నువ్వా.. నేనా? అనే అన్నట్లుగా పోటీ ఉంది. హబ్సిగూడ డివిజన్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య బిగ్ ఫైట్ నడుస్తోంది. రామంతాపూర్ డివిజన్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఉప్పల్ డివిజన్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ ఉంది. ముషీరాబాద్ నియోజకవర్గంలో.. ముషీరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గంలో ఆరు డివిజన్లు ఉన్నాయి. ఐదు డివిజన్లలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య తీవ్ర పోటీ నెలకొనగా.. భోలక్‌పూర్ డివిజన్లో మాత్రం ఎంఐఎం, టీఆర్ఎస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. నియోజకవర్గంలో ముస్లిం, క్రిస్టియన్ మైనారీ్టలు అధికంగా ఉన్నారు. వీరు టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీ అభ్యర్థులు కూడా సరైనవారికి ఇవ్వకపోవడంతో బీజేపీకి చెందిన పలువురు సీనియర్ నేతలు టీఆర్ఎస్లో చేరడం ఆ పారీ్టకి మరింత బలాన్ని చేకూర్చింది. నియోజకవర్గంలోని ఐదు డివిజన్లలో సిట్టింగులకే మళ్లీ టికెట్ కేటాయించడంతో వారిమీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. కొంతమంది టికెట్ ఆశించిన నేతలు అభ్యర్థుల విజయం కోసం పనిచేయడంలేదు. కాంగ్రెస్ నామమాత్రపు అభ్యర్థులకు టికెట్లను కేటాయించి ప్రచారంలో వెనుకపడటంతో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ టీఆర్ఎస్కా.. బీజేపీకా..? వేచి చూడాల్సిందే.. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో ఐదు డివిజన్లు ఉన్నాయి. శాస్త్రీపురం, సులేమాన్‌నగర్ డివిజన్లలో మజ్లిస్ ప్రాతినిధ్యం వహిస్తోంది. సులేమాన్‌నగర్, శాస్త్రీపురంలో మజ్లిస్‌కు అనుకూలంగా ఉంది. అత్తాపూర్, రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి మూడు డివిజన్లలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అనేలా పోటీ ఉంది. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ సిట్టింగ్ కార్పొరేటర్ బీజేపీలో చేరి పోటీ చేస్తున్నాడు. టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే ప్రకా‹Ùగౌడ్ సోదరుడు ప్రేమ్‌దాస్‌గౌడ్ పోటీలో నిలిచారు. రాజేంద్రనగర్‌లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ ఉంది. అత్తాపూర్ డివిజన్లో టీఆర్ఎస్, బీజేపీతో గట్టిపోటీ ఉంది. ఎల్బీనగర్ నియోజకవర్గంలో.. ఎల్బీనగర్: ఎల్బీనగర్ నియోజకవర్గంలో 11 డివిజన్లలో పోటీ తీవ్రంగా ఉంది. అన్ని డివిజన్లలో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు నువ్వా నేనా..? అనే రీతిలో ప్రచారంతో పాటు ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. చైతన్యపురి, నాగోల్,మన్సూరాబాద్, వనస్థలిపురం, హయత్‌నగర్, బీఎన్‌రెడ్డి, చంపాపేట్, కొత్తపేట డివిజన్లలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. హస్తినాపురంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఉంది. లింగోజిగూడలో మూడు పారీ్టల మధ్య పోటీ ఉంది. గడ్డిఅన్నారంలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పోటీ ఉంది. హస్తినాపురం, చంపాపేట, కొత్తపేట, నాగోల్, హయత్‌నగర్, మన్సూరాబాద్ డివిజన్లలో బస్తీలకు చెందిన ఓటర్లు కీలకం కాగా, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి, గడ్డిఅన్నారం, చైతన్యపురి డివిజన్లలో ఉద్యోగులు, ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓటర్లు కీలకం కానున్నారు. 11 డివిజన్లలో టీఆర్ఎస్ సిట్టింగ్కార్పొరేటర్లే అభ్యర్థులుగా ఉన్నారు. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో సఫలం కాకపోవడంతో ప్రత్యర్థులకు కలిసి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 6 డివిజన్లు ఉన్నాయి. యూసుఫ్‌గూడ టీఆర్ఎస్, బీజేపీల మధ్య పోటీ నెలకొంది. సిట్టింగ్ సంజయ్గౌడ్కు టికెట్ ఇవ్వకుండా రాజ్కుమార్పటేల్కు టికెట్ ఇవ్వడంతో సంజయ్‌గౌడ్ వర్గం చాపకిందనీరులా వ్యతిరేకంగా పనిచేస్తోంది. బీజేపీ అభ్యర్థి కుంభాల గంగరాజు పుంజుకున్నాడు. అవకాశాలు చెరి సగం ఉన్నాయి. వెంగళరావునగర్ సిట్టింగ్ కిలారి మనోహర్‌కు టికెట్ నిరాకరించడంతో బీజేపీ నుంచి బరిలో దిగారు. కమ్మ కులం మద్దతు ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థి దేదిప్య రాజకీయాలకు కొత్త కావడం కొంత ఇబ్బందికరంగా మారింది. ఎర్రగడ్డలో ఎంఐఎం సిట్టింగ్ షాహిన్‌బేగం ఉన్నారు. ముస్లింల మెజార్టీ ఉండటంతో ఎంఐఎంకు అనుకూలంగా ఉండే అవకాశం. రహమత్‌నగర్‌లో టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్యే ప్రధాన పోటీ ఉంది. ఇద్దరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. బోరబండ టీఆర్ఎస్ సిట్టింగ్ బాబా ఫసియుద్దీన్ పట్ల వ్యతిరేకత ఇబ్బందిగా ఉంది. సైట్ 3లో పట్టుకోల్పోతున్నట్లు కనిపిస్తోంది. బీజేపీ నుంచి తీవ్ర పోటీ ఉంది. పాతబస్తీలో మజ్లిస్ హవా చార్మినార్: మజ్లిస్ పార్టీకి కంచుకోటగా నిలిచిన పాతబస్తీలోని నాలుగు నియోజకవర్గాల్లో మజ్లిస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటనున్నారు. చారి్మనార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, బహదూర్‌పురా తదితర నాలుగు నియోజకవర్గాల పరిధిలోని 24 డివిజన్లలో మజ్లిస్ పార్టీ అభ్యర్థులు మొదటి స్థానంలో ఉండగా.. పోటీనిచ్చే స్థానంలో బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థులున్నారు. మల్కాజిగిరిలో.. మల్కాజిగిరి డివిజన్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉంది. టీఆర్ఎస్ నుంచి అభ్యర్థి జగదీష్‌గౌడ్ రెండవసారి పోటీ చేస్తుండగా.. బీజేపీ అభ్యర్థి వూరపల్లి శ్రవణ్ మొదటిసారి పోటీలో ఉన్నారు. బ్రాహ్మణ సామాజికవర్గం ఓట్లు అధికంగా ఉన్నాయి. ఈస్ట్ ఆనంద్‌బాగ్ డివిజన్లో త్రిముఖ పోటీ ఉండే అవకాశముంది. మాజీ కార్పొరేటర్ ప్రేమ్‌కుమార్ మరోమారు పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి బక్కా నాగరాజు డివిజన్ పరిధిలోని నాయకుడు కానప్పటికీ స్వచ్ఛ భారత్ కనీ్వనర్‌గా గుర్తింపు ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉమేష్‌సింగ్ సీనియర్ లీడర్, స్థానికంగా గుర్తింపు ఉండటం ఆయనకు కలిసివచ్చింది. ఇక్కడ పోటీ నువ్వా.. నేనా? అన్నట్లు ఉంది. -
ట్రంప్ టూర్ గొడవలతో పరువు పోయింది
సాక్షి, హైదరాబాద్ : డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వచ్చిన సందర్భంలో హిందూ, ముస్లింల మధ్య గొడవలు జరగడాన్ని అమెరికా పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయని, దీంతో అంతర్జాతీయంగా ఢిల్లీ బ్రాండ్ దెబ్బతిన్నదని, ఇప్పుడదే మాదిరిగా హైదరాబాద్ ఇమేజ్ను దెబ్బతీయాలని చూస్తున్నారా? అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బీజేపీ నేతలను ప్రశ్నించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నివసించే ఢిల్లీలోనే ఇలా జరిగిందంటే ఎలా అని ఆయన మండిపడ్డారు. ఆదివారం నగరంలోని పలుచోట్ల రోడ్ షోలు నిర్వహించిన కేటీఆర్ బీజేపీపై విరుచుకుపడ్డారు. ఐటీఐఆర్ రద్దుతో యువత నోట్లో మట్టి.. అమ్మ పెట్టదు..అడుక్కోనివ్వదు..అన్నట్లుగా బీజేపీ వ్యహరిస్తుందని, ఆ పార్టీ ఏమీ చేయదు..టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంటే అడ్డుకుంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. బేగంపేట పాటిగడ్డ చౌరస్తాలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పిన అమిత్‌షా.. ఐటీఐఆర్‌ను రద్దు చేసింది మీ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. ఐటీఐఆర్‌ను రద్దు చేసి తెలంగాణ యువత నోట్లో మట్టి కొట్టారని విమర్శించారు. తెలంగాణలో ఉన్నది నిజాం సంస్కృతి కాదు...1920లోనే మహాత్మాగాంధీ మెచ్చిన సామరస్యత ఉందని చెప్పారు. ఆరేళ్ల కాలంలో ఎన్డీయే ప్రభుత్వం ఒక్క రూపాయి అభివృద్ధి చేయలేదన్నారు. బీజేపీలో ఉన్నవారికి విషయం లేదని, వారికి ఉన్నదల్లా విషమేనన్నారు. హైదరాబాద్‌లో కలసి ఉండేవారి మధ్య చిచ్చుపెట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఒకరేమో బైక్ పోతే బైక్, కారు పోతే కారు ఇస్తామని చెబుతారని, దానికి ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తారని ఓ విలేకరి అడిగితే ఇన్సూరెన్స్‌తో ఇస్తానని చెప్పడం చూస్తుంటే ఆ వ్యక్తి ఇన్సూరెన్స్ ఏజెంటా? లేక పార్టీ ప్రెసిడెంటా? అని ప్రశ్నించారు. బీజేపికి ఓటు వేయడమంటే పిచ్చోళ్ల చేతిలో హైదరాబాద్‌ను పెట్టడమేనన్నారు. ఆడబిడ్డకు అన్యాయం చేసినోళ్లు ఎవరు? ఉత్తరప్రదేశ్ నుంచి ఒకరొచ్చారు..ఆ రాష్ట్రంలో ఆడ పిల్లలపై అఘాయిత్యం జరిగితే అక్కడ ప్రభుత్వం ఏమి చేసిందో చూశాం..ఇక్కడ ఆడ బిడ్డకు అన్యాయం జరిగితే ఏడాది క్రితం ఏమి జరిగిందో చూశామన్నారు. మోదీ ప్రభుత్వం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు తెస్తామని చెప్పింది, ఈ లెక్కన ఆరేళ్ళలో 12 కోట్ల ఉద్యోగాలు రావాలన్నారు. కొత్త ఉద్యోగాలు ఏమో గానీ ఉన్న ఉద్యోగాలు పోతున్నాయన్నారు. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే రేఖానాయక్, సనత్‌నగర్ నియోజకవర్గంలోని కార్పొరేటర్ అభ్యర్ధులు కొలను లక్ష్మి, శేషుకుమారి, మహేశ్వరి, అరుణగౌడ్, ఆకుల రూప, హేమలత తదితరులు పాల్గొన్నారు. డబుల్ ఇంజిన్ గ్రోత్ కావాలంటే టీఆర్ఎస్కే ఓటేయాలి... కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో కూడా బీజేపీని గెలిపిస్తేనే డబుల్ ఇంజిన్ గ్రోత్ సాధ్యమౌతుందని బిహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ చెప్పారని, ప్రధాని మాదిరే తాము చెబుతున్నామని..రాష్ట్రంలో ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. డబుల్ ఇంజిన్ గ్రోత్ కావాలంటే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్నే గెలిపించాలని మంత్రి కేటీఆర్ నగరవాసులను కోరారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గోషామహల్ నియోజకవర్గం జుమ్మెరాత్ బజార్లో రోడ్‌షో నిర్వహించారు. కార్యక్రమంలో అభ్యర్థులు పూజ వ్యాస్ బిలాల్, ఎం.ఆనంద్‌కుమార్ గౌడ్, పరమేశ్వరీ సింగ్, మమతా గుప్తా, ముఖేష్ సింగ్, రాష్ట్ర నాయకులు నందకిశోర్ వ్యాస్, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్ రాథోడ్ పాల్గొన్నారు. రూపాయి కడితే ఆఠాణా ఇచ్చారు గత ఆరేళ్లలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పన్నుల రూపంలో 2 లక్షల 72 వేల కోట్లు చెల్లిస్తే...కేంద్రం రాష్ట్రానికి కేవలం లక్షా 40 వేల కోట్లు మాత్రమే ఇచ్చిందని..అంటే రూపాయి మనం ఇస్తే వారు ఇచ్చింది ఆఠాణా అని మంత్రి కేటీఆర్ దుయ్యబట్టారు. ఆదివారం తార్నాక డివిజన్లోని శాంతినగర్‌లో మంత్రి కేటీఆర్ రోడ్డు షోలో మాట్లాడారు. సింహం సింగిల్‌గా వస్తుంది..పందులు గుంపుగా వస్తాయని అన్నారు. కార్యక్రమంలో మోతే శోభన్‌రెడ్డి, రామేశ్వర్‌గౌడ్, కుమార్ వంశరాజ్, మల్లికార్జున్, వేణుగోపాల్‌రెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
అతడే ఒక సైన్యం.. స్టార్‌గా కేటీఆర్
సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ తరపున..పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్టార్ అట్రాక్షన్‌గా నిలిచారు. ప్రచార పర్వంలో అన్నీ తానై విస్తృత ప్రచారం నిర్వహించారు. అభ్యర్థులకు అండగా నిలిచి గెలుపుపై భరోసా కల్పించారు. అభివృద్ధి, సంక్షేమం ఎజెండాతో దూసుకెళ్లిన కేటీఆర్..తన ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ నియోజకవర్గంలోని శాంతినగర్‌లో ముగించారు. చివరి రోజు జుమ్మేరాత్‌బజార్, పాటిగడ్డలో నిర్వహించిన రోడ్డు షోల్లో బీజేపీ ముఖ్యనేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నగరంలో వారం రోజుల పాటు ఆయన విరామం లేకుండా 15 నియోజకవర్గాలు, 33 ప్రాంతాల్లో రోడ్‌షోలు, సభలు, సమావేశాలు నిర్వహించారు. ప్రతిచోటా కేటీఆర్‌కు జనం నీరాజనాలు పలికారు. ఉదయం వేళల్లో సామాజిక సంఘాలు, డెలవప్మెంట్ ఫోరంలతో ప్రత్యేక భేటీలు నిర్వహించిన ఆయన..సాయంత్రం వేళల్లో రోడ్డు షోల్లో పాల్గొన్నారు. మొత్తంగా వంద డివిజన్ల ఓటర్లను తన సభల ద్వారా కలుసుకున్నారు. మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా డివిజన్లకు పరిమితం కాగా ప్రచార వ్యూహం, ప్రతిపక్షాలపై విమర్శల దాడి వంటి అంశాల్లో కేటీఆర్ కీలకంగా నిలిచారు. (హైదరాబాద్ పేరు మార్చేస్తే... బంగారం వస్తదా?) అభివృద్ధి ఎజెండాతో ముందుకు... జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నగర ఓటర్లు అరాచక వాదానికి కాకుండా అభివృద్ధి, సంక్షేమానికి ఓటేయ్యాలంటూ కేటీఆర్ ప్రతి సభలో పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థిగా అవతరించిన బీజేపీ దూకుడుగా వెళుతూ ఎంఐఎంతో పాటు టీఆర్ఎస్ను ఇరుకుపెట్టే యత్నాలను చేసింది. అయితే కేటీఆర్ ఎప్పటికప్పుడు బీజేపీ విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టగలిగారని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా వరద సహాయం నిలిపివేత, పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో బీజేపీని నిలువరించే ప్రయత్నం చేసిన కేటీఆర్, ట్యాంక్‌బండ్‌పై పీవీ, ఎన్టీఆర్ఘాట్లపై ఎంఐఎం చేసిన ఆరోపణలపై కూడా స్పందించారు. ఎంఐఎం తీరును తప్పుబట్టి తమ ఓటు బ్యాంక్‌కు గండిపడకుండా చేసుకోగలిగారని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. -
‘గ్రేటర్’ పోరు: స్థానికేతరులు వెళ్లిపోవాలి
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రం 6 గంటలకు ముగిసినందున స్థానికేతరులు, జీహెచ్ఎంసీలో ఓటు లేనివారు, నగరం విడిచి వెళ్లాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ప్రచారానికి వచ్చినవారిని పార్టీలు, అభ్యర్థులు స్వచ్ఛందంగా నగరం బయటికి పంపించి సహక రించాలని కోరింది. ఎన్నికల ప్రచార సమయం ముగిశాక ఆదివారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి మీడియాతో మాట్లాడారు. గడువు దాటాక కూడా ప్రచారం నిర్వహించే వారిపై కేసులు పెడతామని, రెండేళ్ల జైలుశిక్షతో పాటు జరిమానా కూడా పడుతుందన్నారు. ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుండి మంగళవారం సాయంత్రం పోలింగ్ ముగిసేవరకు జీహెచ్ఎంసీ పరిధిలో మద్యం అమ్మకాలపై నిషేధం ఉంటుందన్నారు. డిసెంబర్ ఒకటిన జరిగే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు చెప్పారు. కోవిడ్ జాగ్రత్తలతో.. కోవిడ్–19 నిబంధనలను అనుసరించి ప్రతి పోలింగ్ కేంద్రాన్ని శానిటైజేషన్ చేసి ఏర్పాట్లు చేసినందున ప్రజలు భయం లేకుండా స్వేచ్ఛగా వచ్చి ఓటేయాలని పార్థసారధి కోరారు. అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు 19 మందిని నోడల్ ఆఫీసర్లుగా నియమించి, వారి పర్యవేక్షణలో జాగ్రత్తలు చేపడుతున్నట్టు తెలిపారు. ఓటర్లు మాస్క్ ధరించాలని, క్యూలలో సామాజిక దూరం పాటించాలని కోరారు. చదవండి: హైదరాబాద్ పేరు మార్చేస్తే... బంగారం వస్తదా? -
ఓట్ల కోసమే షోలు: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హైదరాబాద్ ప్రజలను అవమానపరిచే విధంగా వ్యవహరించిందని టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌లో వరదలు వచ్చి వంద మంది చనిపోతే కనీసం పరామర్శకు రాని కేంద్ర హోంమంత్రి అమిత్ షా... ఓట్ల కోసం వచ్చి షోలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. వ్యాక్సిన్ పరిశీలన పేరుతో మోదీ హైదరాబాద్‌కు రావడం కూడా డ్రామాయేనని దుయ్యబట్టారు. మోదీ రాకపోతే కరోనా వ్యాక్సిన్ తయారీ ఆగిపోతుందా? అని ప్రశ్నించారు. ఆదివారం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, మాజీ మంత్రి జె. గీతారెడ్డి తదితరులతో కలసి ఉత్తమ్ మాట్లాడారు. కేవలం ఒకే ఒక్క కార్పొరేషన్ ఎన్నికల కోసం బీజేపీ ఇంత దిగజారుడు రాజకీయాలు చేయడం అవసరమా? అని ఉత్తమప్రశ్నించారు. సొంత రాష్ట్రంలో దళితులు, మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే నివారించలేని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్... హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి రావడం విడ్డూరంగా ఉందన్నారు. తాము గెలిస్తే హైదరాబాద్ పేరు మారుస్తామని బీజేపీ పెద్దలు చెబుతున్నారని, వారి పేర్లు మార్చుకున్నంత సులువుగా నగరాల పేర్లు మారవని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని చెప్పడానికి బీజేపీ నేతలకు బుద్ధి ఉండాలని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హైదరాబాద్‌కు ఏం చేసిందని నిలదీశారు. కేసీఆర్ అడ్డగోలుగా దోచుకుతిన్నారు... గత ఏడేళ్లలో సీఎం కేసీఆర్, ఆయన పార్టీ నేతలు అడ్డగోలుగా దోచుకున్నారని, జీహెచ్ఎంసీ ఎన్నికలే కేసీఆర్ పతనానికి నాంది పలుకుతాయని ఉత్తమ్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభ అట్టర్‌ఫ్లాప్ అయిందని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలు ఒకే తాను ముక్కలని, ఆ పార్టీలను మూసీలో పడేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో ఏ అభివృద్ధి జరిగినా కాంగ్రెస్ హయాంలోనే జరిగిందన్న విషయాన్ని గ్రేటర్ ప్రజలు గమనించాలని కోరారు. భవిష్యత్తులో నగరం మరింత అభివృద్ధి చెందేందుకు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఉత్తమ్ కోరారు. -
జనతా గ్యారేజ్ X కల్వకుంట్ల గ్యారేజ్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికలు జనతా గ్యారేజ్‌కి, కల్వకుంట్ల గ్యారేజ్‌కి మధ్య జరుగు తున్నవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలతో ఉండే బీజేపీకి ఓట్లు వేస్తారో లేక కల్వకుంట్ల కుటుంబం కోసం ఓట్లు వేస్తారో ఓటర్లు ఆలో చించాలన్నారు. ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర హోంశాఖ శాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్‌లతో కలసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. గ్రేటర్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పతనం ఖాయమని, సెక్రటేరియట్‌ను కూలగొట్టిన ఆ పార్టీ... బిర్యానీ సెంటర్ పెట్టుకోవాల్సిందేనన్నారు. ఫలితాల తర్వాత అమిత్ షా వచ్చి బిర్యానీ తిని వెళ్తారన్నారు. టీఆర్ఎస్ది అబద్ధాల ప్రచారం: కిషన్‌రెడ్డి రాష్ట్రంలో అవినీతి, కుటుంబ రాజకీయాలపట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పచ్చి అబద్ధాలు ప్రచారం చేసిందని, అయినా ప్రజలు వాటిని నమ్మే పరిస్థితిలో లేరన్నారు. హైదరాబాద్‌లో వరదలు వస్తే కేంద్ర మంత్రులు పరామర్శకు రాలేదని టీఆర్ఎస్ నేతలు అంటున్నారని... మరి సీఎం ఎక్కడకు వచ్చి తిరిగారో చెప్పాలన్నారు. ఈ ఎన్నికల్లో తాము గెలిచి మేయర్ పీఠాన్ని కైవసం చేసు కుంటామని ధీమా వ్యక్తం చేశారు. కాగా, ప్రజల దృష్టిని మరల్చేందుకు కేటీఆర్ నక్క వినయాలు ప్రదర్శిస్తున్నారని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ దుయ్యబట్టారు. ‘టీఆర్ఎస్ డబ్బులు పంచుతోంది’ టీఆర్ఎస్ పార్టీ నాయకులు హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో డబ్బు, మద్యం అక్రమంగా పంచుతూ ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఆది వారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ఓటర్లకు డబ్బు పంచుతుండగా పట్టుకోవడానికి ప్రయత్నించిన బీజేపీ నాయకులపై దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు. డబ్బులు పంచుతున్న టీఆర్ఎస్ నాయకులపై పోలీసులు కేసులు పెట్టట్లేదన్నారు. టీఆర్ఎస్ అక్రమాలను వివరించడానికి సోమవారం గవర్నర్‌ను కలుస్తామన్నారు. -
హైదరాబాద్ పేరు మార్చేస్తే... బంగారం వస్తదా?
ఎంఐఎం, బీజేపీ మతపిచ్చి పార్టీలు.. హైదరాబాద్ ఈ పిచ్చోళ్ల చేతిలో రాయి కావొద్దు. అగ్గి పెట్టడం సులభం, కానీ ఆర్పేదెవరు? విషయం లేనప్పుడు విషం నింపడమే పని. సబ్జెక్ట్ లేకుండా మాట్లాడి మమ్మల్ని విలన్‌గా చూపాలనే బీజేపీ ప్రయత్నం. -కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారిస్తే ఏమొస్తుంది? ఇంటింటికీ బంగారం ఏమైనా వస్తదా? పేర్లు మార్చడం కాదు.. పురోగతి కావాలి. నగర రూపురేఖలు మార్చాలి. పనితీరు మారాలి’అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఆరేళ్లలో హైదరాబాద్ అభివృద్ధికి చేసిన పనులను ప్రజల ముందు పెట్టాం. అభివృద్ధిని కొనసాగించేందుకు మరోమారు ఓటు వేయమని కోరాం. ఎక్స్అఫీషియో ఓట్ల అవసరం లేకుండా... టీఆర్ఎస్ కార్పొరేటర్ల మెజారిటీతోనే మేయర్ పీఠాన్ని దక్కించుకుం టుంది. ప్రస్తుత గ్రేటర్ ఎన్నికల్లో వందకు పైగా డివిజన్లలో కాస్త అటూఇటుగా ఫలితం సాధిస్తాం. బీజేపీకి దేశ ప్రధాని పదవి అప్పగిస్తేనే మార్పు సాధ్యం కాలేదు. గ్రేటర్ మేయర్ పదవి ఇస్తే ఏం మారుస్తారు. ఇలాంటి వారితో కొట్లాడటం మా దౌర్భాగ్యం’ అని కేటీఆర్ అన్నారు. ఆదివారం మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో కేటీఆర్ ఇంకా ఏమన్నారంటే.. ఎంఐఎంతో పొత్తు లేదు తెలంగాణలో బీజేపీ పోటీ చేయడం కొత్తేమీ కాదు. గతంలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని ఆరు లోక్‌సభ స్థానాల్లో గెలిచింది. అడపాదడపా బీజేపీ కొన్ని చోట్ల గెలుస్తున్నా స్థిరంగా ఫలితాలు సాధించడం లేదు. గ్రేటర్ ఎన్నికల్లో హిందుత్వ ఎజెండాను బలంగా చొప్పించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను హైదరాబాద్ ప్రజలు తిరస్కరిస్తారని గట్టిగా నమ్ముతున్నాం. గతంలో కేంద్రంలో బీజేపీకి పలు సందర్భాల్లో అంశాల వారీగా మేము మద్దతు ఇచ్చినట్లుగానే రాష్ట్రంలో ఎంఐఎం మాకు మద్దతు పలికింది. ఎంఐఎంతో మాకు ఎన్నికల పొత్తు లేదు. మాది సంకీర్ణ ప్రభుత్వం కాదు. ఆదివారం గోషామహల్ నియోజకవర్గంలోని జుమ్మేరాత్ బజార్లో కేటీఆర్ రోడ్ షో మతాన్ని బూచిగా చూపొద్దు 132 కోట్ల దేశ జనాభాలోని 30 కోట్ల ముస్లింలను బూచిగా చూపుతూ పిల్లల్లో మతపరంగా విషం నింపడం దేశానికి మంచిది కాదు. ఎంఐఎంపై బీజేపీ పోటీ చేస్తే మేము వద్దంటున్నామా. మేము కూడా చాలా డివిజన్లలో ఎంఐఎంతో పోటీ పడుతున్నాం. గ్రేటర్ ఎన్నికల్లో బిన్‌లాడెన్, అక్బర్, బాబర్ ప్రస్తావన ఎందుకు. వారేమైనా హైదరాబాద్ ఓటర్లా? బండి సంజయ్, ఒవైసీ లేదా టీఆర్ఎస్ లీడర్లు ఎవరైనా మతకలహాలు, ఘర్షణలు సృష్టిస్తే ఊచలు లెక్కపెట్టిస్తాం. నగరంలో పెట్టుబడులు, ఉపాధికి అడ్డువచ్చే వారిని ఉపేక్షించేది లేదు. ఎన్నికలొస్తేనే వ్యాక్సిన్ గుర్తుకొస్తదా? ప్రధాని మోదీ నగర పర్యటన ప్రపంచ వాక్సిన్ హబ్ హైదరాబాద్ అనే అంశాన్ని తేటతెల్లం చేసింది. బీహర్, గ్రేటర్ ఎన్నికలు వస్తేనే వాళ్లకు వాక్సిన్ గుర్తుకు వస్తుంది. ఆరేండ్లలో ప్రధాని రాష్ట్రానికి రెండుసార్లు వచ్చారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు ప్రధాని రావడాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారు. బండి సంజయ్వి పగటి కలలు గ్రేటర్ ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రద్దవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదం. మధ్యంతర ఎన్నికలకు మేము సిద్దం. మోదీని రద్దు చేయమనండి. ప్రభుత్వం కూలిపోతుందని బండి సంజయ్ పగటి కలలు కంటున్నారు. హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారిస్తే ఇంటింటికీ బంగారం వస్తుందా? గతంలో మద్రాస్, అలహాబాద్, ఫైజాబాద్ పేర్లు మార్చితే ఏం ఒనగూరింది. మారాల్సింది పేర్లు కాదు.. పనితీరు. యోగి ఆదిత్యనాథ్ నుంచి తెలుసుకునే స్థితిలో మేము లేము. పిచ్చొళ్ల చేతిలో రాయి కానివ్వొద్దు... ‘ఆవుకథ’తరహాలో ‘హిందూ, ముస్లిం, పాకిస్తాన్’మినహా బీజేపీకి వేరే అంశాలు ఉండవు. ఎంఐఎం, బీజేపీలు మతపిచ్చి పార్టీలు... హైదరాబాద్ ఈ పిచ్చోళ్ల చేతిలో రాయి కావొద్దు. అగ్గి పెట్టడం సులభం, కానీ ఆర్పేదెవరు? విషయం లేనప్పుడు విషం నింపడమే పని. సబ్జెక్ట్ లేకుండా మాట్లాడి మమ్మల్ని విలన్‌గా చూపాలనే బీజేపీ ప్రయత్నం హైదరాబాద్‌లో ఫలితాన్ని ఇవ్వదు. ఒకరు సమాధులు కూలగొడుతామంటే ఇంకొకరు మరేదో కూలగొడతామంటారు. కూల్చే వాళ్లు కావాలా.. నిర్మించే వాళ్లు కావాలా? దేశ ఖజానాకు నిధులు సమకూర్చుతున్నాం కేంద్రానికి రాష్ట్రం నుంచి చెల్లించిన నిధులన్నీ తిరిగి రావాలని కోరుకోవడం లేదు. తెలంగాణ దేశానికి నిధులు సమకూర్చడాన్ని గర్వకారణంగా భావిస్తున్నాం. యోగి లాంటి వారు కనీసం తెలంగాణకు కృతజ్ఞతలు అయినా చెప్పాలి. బీజేపీకి మేము కూడా మిత్రులమే. రాజకీయాల్లో శత్రువులు ఉండరు. ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు. దేశ ప్రయోజనాల కోసం రేపు బీజేపీకి సహరించాల్సి వస్తే... సిద్దాంతపరంగా ఏకీభవిస్తే మద్దతు ఇస్తాం. గ్రేటర్ ఎన్నికల తర్వాత మా పార్టీ జాతీయ రాజకీయాలకు సంబంధించిన కార్యాచరణను మీరే చూస్తారు. వ్యవస్థలను గౌరవించాలి కదా... ప్రధాని హోదాను తగ్గించడం మాకు ఇష్టం లేదు. రాజకీయ ఉద్దేశంతోనే ఆయన హైదరాబాద్ పర్యటనకు వచ్చారనే విషయం ప్రజలకు తెలుసు. ఎక్కడైనా రాష్ట్రాల్లో కొన్ని మర్యాదలు ఉంటాయి. పాటిస్తే వ్యవస్థకు మంచిది. ఎన్నికల్లో మేము తీరికలేకుండా ఉన్నా ఆయనకు స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యాం. ప్రధాని, ముఖ్యమంత్రి వ్యక్తులు కాదు.. వ్యవస్థ. దాని గౌరవాన్ని పెంచాలి. బీజేపీలో వారసులు లేరా? కుటుంబ రాజకీయాలకు బీజేపీలోనే... రాజ్‌నాథ్‌సింగ్, యడియూరప్ప, వసుంధరాజే, మనేకా వంటి ఎందరో ఉదాహరణలుగా ఉన్నారు. తమ అసమర్థత దాచుకునేందుకు ఇలాంటి అంశాలను బీజేపీ మాట్లాడుతూ ఉంటుంది. నేను సిరిసిల్ల నుంచి ప్రజాస్వామ్యబద్దంగా ప్రతీసారి మెజారిటీ పెంచుకుంటూ విజయం సాధించా. ప్రజలకు ఇష్టం లేకుంటే మమ్మల్ని ఇంటికి పంపుతారు. కాంగ్రెస్ క్షీణదశలో ఉంది కాంగ్రెస్ పార్టీ గురించి ఆ పార్టీ నేతలే చెప్పుకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్ దానంతట అదే క్షీణిస్తోంది. ఆ స్థానంలోకి ఎవరు వస్తారో కాంగ్రెస్‌కు సంబంధించిన తలనొప్పి. ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ.. ఇలా ఎవరితోనో ఒకరితో మేము కొట్లాడాలి. రోజూ ఒకరితోనే కొట్లాడితే మజా ఏం ఉంటుంది. హైదరాబాద్ మేలుకోరి ఓటేయండి టీఆర్ఎస్ కార్పోరేటర్ల మీద అక్కడక్కడ అసంతృప్తి ఉన్నా హైదరాబాద్, రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఈసారి ఓటేయండి. కార్పోరేటర్లకు శిక్షణ, ప్రజల భాగస్వా్మ్యం, వార్డు కమిటీల ద్వారా కార్పోరేటర్ల వ్యవస్థను గాడిలో పెడతాం. ఈసారి పోలింగ్ శాతం ఎలా ఉన్నా ప్రజల మద్దతు మాకు ఉంటుంది. అందరూ ఓటింగ్‌లో పాల్గొనండి. అందరికీ వ్యాక్సిన్... ఏడాదిన్నర పట్టొచ్చు వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడిన పడుతుంది. కోవిడ్ వాక్సిన్ అందరికీ అందుబాటులోకి వచ్చేందుకు మరో ఏడాదిన్నర పట్టొచ్చు. -
ప్రజలు మా వైపే
మేము ఏ ఎన్నికనూ చిన్నదిగా చూడం. మేము హైదరాబాద్‌కు సీఎంను కొట్టడానికి రాలేదు. మేము చేసింది, చేయబోయేది చెప్పడానికి, ఎన్నికల్లో పోరాడటానికే వచ్చాం. ఓట్లు, సీట్ల కోసం ఈ పోటీ కాదు.. మేయర్ పీఠం కైవసం చేసుకునేందుకే.. -అమిత్ షా సాక్షి, హైదరాబాద్: చీకటి పొత్తులు ఎందుకని, టీఆర్ఎస్కు దమ్ముంటే ఎంఐఎంతో బహిరంగంగా పొత్తుపెట్టుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. మజ్లిస్– టీఆర్ఎస్లు పొత్తు పెట్టుకుంటే తమకేమీ అభ్యంతరం లేదని, అదేదో బాహాటంగా చేయాలని... లోపాయికారీ వ్యవహారాలెందుకని నిలదీశారు. మజ్లిస్, టీఆర్ఎస్ల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల వల్లే హైదరాబాద్‌లో వరదలు వచ్చాయని, 7 లక్షల మంది ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. సీఎం నివాసం పరిసర ప్రాంతాల్లోని కాలనీలు కూడా మునిగిపోయాయన్నారు. బీజేపీ గెలిస్తే అక్రమ నిర్మాణాలన్నింటినీ తొలగిస్తామని, వరదల్లేని హైదరాబాద్‌గా చేస్తామన్నారు. వరదల సమయంలో కేసీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్ ఐటీ హబ్‌కు మౌలిక సదుపాయాలు కల్పించాల్సింది గ్రేటర్ మున్సిపల్ కార్పొరేçషన్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే సమగ్ర వసతులు కల్పించి హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతామని అమిత్‌షా తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆదివారం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నగరంలో సిటిజన్ ఛార్టర్ అమలు ఏమైందన్నారు. రోహింగ్యాల విషయంలో అసదుద్దీన్ ఒవైసీ పార్లమెంటులో ఏం మాట్లాడారో అంతా చూశారని, అక్కడ అడ్డుపడుతూ ఇక్కడ రాజకీయం చేస్తున్నారన్నారు. చిత్తశుద్ధి ఉంటే రోహింగ్యాలపై చర్యలు చేపట్టాలని రాతపూర్వకంగా ఇవ్వాలని, అప్పుడు తామేం చేస్తామో చేసి చూపిస్తామన్నారు. హైదరాబాద్‌ను పాకిస్తాన్లో కలపాలని ఎవరు చూశారో అసద్ చెప్పాలన్నారు. తాము గెలిస్తే నిజాం సంస్కృతి నుంచి హైదరాబాద్‌కు విముక్తి కల్పిస్తామని, నయా హైదరాబాద్‌గా తీర్చిదిద్దుతామన్నారు. ప్రజలు ఓట్లు వేసి బీజేపీని గెలిపించాలని కోరారు. వంద రోజుల ప్రణాళిక ఏమైంది... తాము ఏ ఎన్నికను చిన్నదిగా చూడమని, ఎన్నికలంటే ఎన్నికలేనన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు చిన్నవి కానేకాదన్నారు. తాము హైదరాబాద్‌కు సీఎంను కొట్టడానికి రాలేదని, సీఎం కేసీఆర్ 100 ఏళ్లు ఉండాలని కోరుకుంటున్నామన్నారు. తాము చేసింది, చేయబోయేది చెప్పడానికి, ఎన్నికల్లో పోరాడటానికే వచ్చామన్నారు. ఓట్లు, సీట్ల కోసం ఈ పోటీ కాదని, మేయర్ పీఠం కైవసం చేసుకునేందుకేనన్నారు. రోడ్‌షోలో ప్రజాస్పందన చూస్తుంటే మేయర్ పీఠం బీజేపీదేనన్నది స్పష్టమైందన్నారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కేసీఆర్చెప్పిన వంద రోజుల ప్రణాళిక ఏమైందన్నారు. ఐదేళ్లలో ఎందుకు చేయలేదన్నారు. ఫామ్‌హౌస్ నుంచి బయటకు ఎందుకు రావడం లేదన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఏవి? హైదరాబాద్‌కు 1.35 లక్షల ఇళ్లను మోదీ ఇస్తే అందులో 1,100 కూడా కట్టలేదన్నారు. సీఎం చెప్పిన డబుల్ బెడ్రూం ఇళ్లు ఏమయ్యాయన్నారు. నగర పరిసరాల్లో రూ.10 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పిన 15 డంప్‌యార్డులు ఏమయ్యాయని ప్రశ్నించారు. మూసీ చుట్టూ ఆరు లేన్ల రోడ్లు ఎక్కడున్నాయని, హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన ఏమైందన్నారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులపై భారం తగ్గించేందుకు నగరానికి నలువైపులా నిర్మిస్తామన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఎక్కడున్నాయని అడిగారు. తాము హైదరాబాద్‌కు ఈఎస్ఐ, ఎయిమ్స్ ఆసుపత్రులను ఇచ్చామన్నారు. కేసీఆర్ తన రాజకీయ కారణాలతోనే పేదలకు రూ.5 లక్షల విలువైన వైద్యం అందే ఆయుష్మాన్ భారత్‌ను తెలంగాణలో అమలు చేయడం లేదన్నారు. కేంద్రం రాష్ట్రానికి బయో డైవర్సిటీ రీసెర్చ్ సెంటర్ ఇచ్చిందన్నారు. జాతీయ రహదారులు నిర్మించామన్నారు. మెట్రో ఇచ్చామని, దానిని మోదీ ప్రారంభించారన్నారు. 40,800 మందికి ముద్ర రుణాలను ఇచ్చామన్నారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని నామాలగుండు వద్ద అమిత్ షా రోడ్ షో 3 లక్షల మంది వీధివ్యాపారులకు రుణాలు కరోనా కష్టకాలంలో వీధి వ్యాపారులను ఆదుకునేందుకు ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ యోజన కింద ఒక్క తెలంగాణలోనే 3 లక్షల మందికి రుణాలు ఇచ్చామని, అందులో జీహెచ్ఎంసీలోనే 30 వేల మందికి ఇచ్చామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొన్న సమయంలోనూ మోదీ విధానాల వల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐలు) వచ్చాయని, అందులో హైదరాబాద్‌కూ వచ్చాయన్నారు. తద్వారా ఐటీ సెక్టార్ అభివృద్ధిలో ఉందని, ఉద్యోగులకు వర్క్ ఫ్రం ఎనీవేర్ కల్పించి హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులకు ప్రయోజనం కల్పించామన్నారు. తాము గెలిస్తే జీహెచ్ఎంసీలో పారదర్శకతో కూడిన సుపరిపాలనను అందిస్తామని, కుటుంబపాలన నుంచి అభివృద్ధి వైపు తీసుకెళ్తామన్నారు. తాము చెప్పిందే చేస్తామని, తమకు అవకాశం ఇస్తే హైదరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉంటామన్నారు. కేసీఆర్‌కు ఆయన, ఆయన కుటుంబం మినహా మరెవరూ పట్టరని, తాము అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తామన్నారు. సచివాలయానికి వెళితే కదా... కేంద్రం ఏమిచ్చిందో తెలిసేది జీహెచ్ఎంసీలో అవినీతి తగ్గితే బడ్జెట్ పెరుగుతుందన్నారు. కేంద్రం ఏం ఇచ్చిందని మాట్లాడే ముందు సీఎం ఫామ్‌హౌస్‌ను వదిలి బయటకురావాలని, రెగ్యులర్‌గా సెక్రటేరియట్‌కు వెళితే కేంద్రం ఏం ఇచ్చిందో తెలుస్తుందన్నారు. వరదసహాయం కింద రూ. 500 కోట్లు ఇచ్చామన్నారు. ఇప్పుడు ప్రతిపక్ష స్థానానికి చేరుకున్నామని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం తమకు వస్తుందన్నారు. కేసీఆర్ విధానాలే తమకు లాభిస్తాయన్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని విమానం అద్దెకు తీసుకొని 16 రాష్ట్రాల్లో కేసీఆర్ తిరిగారని, చివరకు ఆయనకే సీట్లు తగ్గిపోయాయన్నారు. పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీది ఇదే పరిస్థితి అన్నారు. ప్రజాస్వామ్యంలో అందరికి తిరిగే హక్కు ఉంటుందని, కేసీఆర్ తిరిగితే తిరుగనివ్వండి అని పేర్కొన్నారు. వ్యవసాయ బిల్లులు రైతులకు మేలు చేసేవేనని, వాటిపై అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. తాము రైతులను గౌరవిస్తామన్నారు. కేసీఆర్‌లా రాజకీయం చేయమన్నారు. మతకలహాలపై మాట్లాడుతూ... బీజేపీ దేశంలో అనేక రాష్ట్రాల్లో, నగరాల్లో అధికారంలో ఉందని, అక్కడ శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో విమర్శలు చేసిన వారే సమాధానం చెపాలన్నారు. ఫోన్ ట్యాపింగ్‌పై ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తామన్నారు. తాను భాగ్యలక్ష్మి దేవాలయానికి అమ్మవారి దర్శనానికి మాత్రమే వెళ్లానన్నారు. ఈ విలేకరుల సమావేశంలో అమిత్‌షాతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జీహెచ్ఎంసీ ఎన్నికల ఇన్‌ఛార్జి భూపేంద్రయాదవ్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు. -
గంగా జమున తెహజీబ్ కాపాడుకుందాం!
‘‘సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని... ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః’’ అంటే... ఆత్మైక్యం చెందిన యోగి సమస్త ప్రాణికోటి పట్ల సమదృష్టి కలిగి, తనలో సర్వభూతాలనూ, సమస్త భూతాలలో తననూ దర్శిస్తాడు, అని తాత్పర్యం. ఇదే నిజ హిందూవాదం. ఇదే హైద్రాబాదీయత. అదే నిజ జాతీయత. మతాలకతీతంగా కవుల సృజనకు జీ హుజూర్ అన్నది మన హైద్రాబాదీ గడ్డ. ఈ గడ్డపైన కవ్వాలి శతకాలు కీర్తనలు ఏకరూపంలో వొకే వేదిక మీద వొలికిన స్వరఝరీ భాగ్యనగరి. దక్కనీ ఆత్మకు ఏకాత్మ మన హైద్రాబాద్. భాగమతీ కాలి అందెల రవళిలో తన్మయించిన ఈ సజీవ సంస్కృతిని భగ్నం చేయడానికి కుట్రలు నడుస్తున్నయి. గాయాల తెలంగాణ స్వయం పాలనలో కుదురుకుంటున్న సమయాన, నిన్నటిదాకా లేని వో కొత్త సామాజిక సమస్య మత విద్వేషం రూపంలో ముందుకు వస్తున్నది. గంగా జమునల తహజీబ్‌కు కేంద్రమైన హైద్రాబాద్ భాగ్యనగరం నడి బొడ్డున, సామరస్యంతో జీవిస్తున్న మనుషుల నడుమ, మత చిచ్చును రగిలించే కుట్రలకు బీజం పడుతున్నట్టుగా అర్థమౌతున్నది. ఇటువంటి ప్రమాదకర మత విద్వేషాన్ని కవులు, రచయితలు, కళాకారులు, మొత్తంగా సృజనకారులుగా మనందరం ముక్తకంఠంతో వ్యతిరేకించవలసి వున్నది. మత సామరస్యాన్ని సారవంత గుణంగా పొదువుకున్న హైదరాబాదీయతను రక్షించుకోవాల్సిన సందర్భం వచ్చింది. హైద్రాబాదీయతే నిజ జాతీయత. మతం పేరుతో చరిత్రలో లేని విషయాలను ముందుకు తెచ్చి మనలను మందిముందు అవమానాలకు గురిచేస్తున్నరు. అబద్ధపు దుష్ప్రచారాలను తుత్తునియలు చేసి మన ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడమే ప్రథమ కర్తవ్యంగా నడుం బిగించవలసివున్నది. సంపద్వంతమైన దక్షిణాపథాన్ని కొల్లగొట్టడానికి, ఆక్రమించడానికి హైదరాబాద్ అనే పెద్ద గడపను గెలిచి తెలంగాణను తమ మతవాద విస్తరణకు ఎరగావేసే కుట్రలకు ఉత్తరాది శక్తులు కుట్రలు పన్నుతున్నయి. దాన్ని తిప్పికొట్టవలసిన సందర్భం ముంచుకువచ్చింది. ఇటువంటి హైద్రాబాద్ వారసత్వాన్ని నిలుపుకోవాల్సిన కష్ట కాలంలో మనం ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా మన జీవ సంస్కృతిని జీవితకాలం కోల్పోవాల్సిన ప్రమాదంలో పడిపోతాం. అరవయేండ్ల పోరాటాన్నించి, స్వయం పాలనలో సాంత్వన పొందుతూ ప్రశాంత వాతావరణంలో తనను తాను పునర్నిర్మించుకుంటున్న క్రమంలో, దేశంలో సగర్వంగా తలెత్తుకోని ముందడుగు వేస్తున్నది తెలంగాణ. ఈస మూసీల సంగమంలా వెలసిల్లిన అవ్యక్తపు ఆధ్యాత్మిక బోధనాస్థలి, ఆధ్యాత్మిక మడి భాగ్యనగరి హైద్రాబాద్‌ను కాపాడుకుందాం. ద్వేషంతో కూడిన వాచాలత్వం, అప్రజాస్వామిక నడవడితో కూడిన, ఉత్తరాది దాష్టీకాన్ని ఎదురిద్దాం. మన కవనంతో గానంతో మేథో సృజన రచనలతో యోచనాత్మకమైన దార్శనిక దృక్పథంతో ప్రజలను చైతన్యం పరిచి నాటి ఉద్యమ స్ఫూర్తితో మతవిద్వేష శక్తుల కుట్రలను నిలువరిద్దాం. ఇట్లు... – తెలంగాణ కవులు, రచయితలు, కళాకారులు, చిత్రకారులు, సృజనకారులు – కవి సిద్దార్థ, అల్లం నారాయణ, కె.శ్రీనివాస్, వర్ధెల్లి మురళి, ఎన్.గోపి, కె.శివారెడ్డి, ఓల్గా, నందిని సిధారెడ్డి, గోరటి వెంకన్న, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, షాజాహాన, గోగు శ్యామల, జూపాక సుభధ్ర, మహెజబీన్, కుప్పిలి పద్మ, జ్వలిత, మెర్సీ మార్గరేట్, పెన్నా శివరామకృష్ణ, జిలుకర శ్రీనివాస్, శ్రీనివాస్ దెంచనాల, దేశపతి శ్రీనివాస్, మునాస వెంకట్, పసునూరి రవీందర్, కృపాకర్ మాదిగ, పగడాల నాగేందర్, యాకూబ్, అక్కినేని కుటుంబరావు, వేణు ఊడుగుల, ఎన్.శంకర్, బతుకమ్మ ప్రభాకర్, ఎస్.రఘు, ఏలె లక్ష్మణ్, కార్టూనిస్ట్ శంకర్, కోయి కోటేశ్వర్ రావు, సుద్దాల అశోక్ తేజ, స్కైబాబ, మోహన్ రుషి, జూలూరి గౌరీశంకర్, వఝల శివకుమార్, అన్నవరం దేవేందర్, నలిమెల భాస్కర్, పిల్లలమర్రి రాములు, నాళేశ్వరం శంకరం, ఒద్దిరాజు ప్రవీణ్, వాసు, కోడూరి విజయ్ కుమార్, కాంచనపల్లి, దామెర రాములు, అమ్మంగి వేణుగోపాల్, సీతారామ్, ప్రసేన్, వేముగంటి మురళి, బన్న అయిలయ్య, శిలాలోలిత, సంగిశెట్టి శ్రీనివాస్, బైరెడ్డి కృష్ణారెడ్డి, అంబటి వెంకన్న, మచ్చ దేవేందర్, బెల్లి యాదయ్య, వనపట్ల సుబ్బయ్య, తైదల అంజయ్య, ఆదేశ్ రవి, మోత్కూరి శ్రీనివాస్, శిఖామణి, కోట్ల వెంకటేశ్వర్ రెడ్డి, ఎం.ఎస్.నాయుడు, తాడి ప్రకాశ్, జివి రత్నాకర్, గుడిపల్లి నిరంజన్, చిక్కా రామదాసు, మామిడి హరికృష్ణ, బంగారి బ్రహ్మం, మౌనశ్రీ మల్లిక్, పుష్పగిరి, రమేశ్ హజారి, ఏనుగు నరసింహారెడ్డి, వర్ధెల్లి వెంకటేశ్వర్లు, మల్లేపల్లి లక్ష్మయ్య -
గ్రేటర్ ఎన్నికలు: చివరి రోజు హోరాహోరా ప్రచారం
-
జోకర్ని కాదు.. ఫైటర్ని : బండ్ల గణేష్
సాక్షి, హైదరాబాద్ : గత అసెంబ్లీ ఎన్నికల్లో బండ్ల గణేష్ చేసిన హడావుడి అంతా ఇంత కాదు. కాంగ్రెస్ పార్టీలో చేరి అధికార టీఆర్ఎస్ పార్టీపై అనేక విమర్శలు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు చేయని విమర్శలు ఆయన చేశారు. ఆ తర్వాత ఎన్నికలు ముగిసిన కొద్ది కాలానికే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మరోసారి బండ్ల గణేష్ పేరు పొలిటికల్ తెరపైకి వచ్చింది. (చదవండి : ‘మీకో దండం.. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు’) ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ నిర్వహించిన ఓ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ... గత అసెంబ్లీ ఎన్నికల్లో బండ్ల గణేష్ చేసిన కామెడీలా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బండి సంజయ్ చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. దీంతో మరోసారి బండ్ల గణేష్ వార్తల్లో నిలిచారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్సీ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా బండ్ల గణేష్ స్పందించారు. ‘నేను జోకర్ని కాదు.ఫైటర్ని. కానీ ప్రస్తుతం ఎలాంటి రాజకీయ పార్టీలో ఉండదలచుకోలేదు. ఆల్ ది బెస్ట్'అని పేర్కొంటూ కవితకు ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ అయింది. -
ముగిసిన గ్రేటర్ ఎన్నికల ప్రచారం
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇప్పటికే డిసెంబర్ 1వ తేదీన జరిగే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 74,67,256 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 150 వార్డులనుంచి 1122మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటల నుండి ఎన్నికలు ముగిసేవరకు జీహెచ్ఎంసీ పరిధిలో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఆదివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ... ‘‘ఇప్పటి వరకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగింది. డిసెంబర్ 1న ఉదయం 5:30 గంటల వరకు ఎన్నికల సిబ్బంది సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో సిద్ధంగా ఉండాలి. ఉదయం 6 గంటలకు పోలింగ్ ఏజెంట్లు హాజరుకావాలి. ఉదయం 6 గంటల నుండి 6:15 గంటల మధ్య మాక్ పోలింగ్ జరుగుతుంది. ఉదయం 6:55 గంటలకు బ్యాలెట్ బాక్స్‌లను సీల్ చేయడం జరుగుతుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ పూర్తి అవుతుంది. కోవిడ్-19 పాజిటీవ్ ఉండి పోస్టల్ బ్యాలెట్ పొందలేని ఓటర్లకు ప్రత్యేక లైన్ ద్వారా ఓటువేసే అవకాశం ఉంటుంది. కోవిడ్ పాజిటివ్ ఓటర్లు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు ఓటు వేయవచ్చు. ఓటరు గుర్తింపు కార్డులేని ఓటర్లకు ఎంపిక చేసిన 21 ఇతర గుర్తింపు కార్డులు ఉన్నా ఓటింగ్ అవకాశం కల్పిస్తాం. ప్రతి పోలింగ్ స్టేషన్లో వృద్దులు, వికలాంగులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశాం. ప్రతి పోలింగ్ స్టేషన్లో మౌలిక సదుపాయాలు కల్పించాం. ( గ్రేటర్ వార్: పోలీసులు సన్నద్ధం ) మొత్తం 9,101 పోలింగ్ స్టేషన్లలో 1752 హైపర్ సెన్సిటీవ్, 2934 సెన్సిటీవ్, 4415 నార్మల్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 2,909 పోలింగ్ లొకేషన్లు ఉన్నాయి. వీటిలో 450 పోలింగ్ లొకేషన్లు హైపర్ సెన్సిటీవ్ పోలింగ్ స్టేషన్లుగా ఉన్నాయి. 921 సెన్సిటీవ్ పోలింగ్ స్టేషన్లు, 1548 పోలింగ్ లొకేషన్లు నార్మల్‌గా ఉన్నాయి. ఈ ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు, శాంతి భద్రతల పరిరక్షణకు 52,500 పోలీసులచే బందోబస్తు ఉంటుంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశాం. 150 పోలింగ్ కేంద్రాల్లో ఫేస్ రికగ్నేషన్ సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నాం. కోవిడ్-19 నిబంధనలను అనుసరించి ప్రతి పోలింగ్ కేంద్రంలో ముందు రోజు శానిటైజేషన్ పూర్తి చేస్తాం. ఓటు హక్కు వినియోగించుకునేవారు తప్పకుండా మాస్క్ ధరించాలి. పోలింగ్ కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించాల’’ని అన్నారు. -
గ్రేటర్ వార్: పోలీసులు సన్నద్ధం
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలకు హైదరాబాద్ పోలీసులు సన్నద్ధమవుతున్నారు. నేటి సాయంత్రం ఆరు గంటలతో ఎన్నికల ప్రచారం ముగిసింది. 150 డివిజన్లలో ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్ 84, సైబరాబాద్ 38, రాచకొండ పరిధిలో 28, హైదరాబాద్ సిటీలో 4,979 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 50 వేల మందితో భారీ పోలీస్ భద్రతతో పాటు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించారు. స్ట్రాంగ్ రూం, డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. (చదవండి: ఎన్నికల ప్రచారం.. తిరక్కుండానే టైమౌట్) గ్రేటర్ వ్యాప్తంగా 50 చెక్‌పోస్ట్‌లు.. 1,704 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, 1,085 అత్యoత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. గ్రేటర్ వ్యాప్తంగా 50 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 1500 మంది రౌడీషీటర్ల బైండోవర్ చేశారు. ఎన్నికల సందర్భంగా 3,744 వెపన్స్ డిపాజిట్ చేశారు. జోన్ల వారిగా ఐపీఎస్ అధికారులను, డివిజన్ల వారిగా ఇంచార్జ్ ఏసీపీ, సీఐలను నియమించారు. ఎన్నికల నిబంధన ఉల్లంఘించిన నేతలపై 55 కేసులు నమోదయ్యాయి. పోలీసుల తనిఖీల్లో భారీగా పలుచోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ కమిషనరేట్స్ పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా పోస్టులపై ప్రత్యేక దృష్టి సారించారు.సీసీ టీవీ మానటరింగ్ టీమ్స్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. (చదవండి: కేసీఆర్‌ను కొట్టడానికి రాలేదు: అమిత్ షా) -
వాళ్లు బీజేపీకే ఓటు వేయండి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : ‘బీజేపీ అధికారంలోకి వస్తే జనధన్ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తానని ఆ పార్టీ నేతలు చెప్పారు. ఎవరి అకౌంట్లోనైనా రూ.15 లక్షలు పడ్డాయా?. ఒకవేళ రూ. 15 లక్షలు వచ్చిన వాళ్లు ఉంటే బీజేపీకే ఓటేయ్యండి’ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన సనత్‌నగర్‌లో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతు.. ఆరేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌కు చేసిందేమిటో ఆ పార్టీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. వరద సాయాన్ని బీజేపీయే అడ్డుకుందని మరోసారి పునరుద్ఘాటించారు.హైదరాబాద్‌ను ఐటీ హబ్ చేస్తామని అమిత్ షా చెబితే..నమ్మేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరన్నారు. విషయం లేనిది విషం చిమ్మితే నమ్మరని బీజేపీ నేతలకు చురకలు అంటించారు. కేంద్రం తెలంగాణకు ఇచ్చిన దాని కంటే.. మనమే ఎక్కువ ఇచ్చాం’ అని కేటీఆర్ తెలిపారు.కరోనా టైంలో రూ.20 లక్షల కోట్లు ప్రకటించామన్నారు.. కానీ ఎవరికీ రాలేదని విమర్శించారు. అన్నదమ్ముల్లా కలిసున్న హైదరాబాద్ వాసుల్లో చిచ్చుపెట్టాలని బీజేపీ నేతలు చూస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అధికారంలోకి వస్తే మోదీ 12 కోట్ల ఉద్యోగాలిస్తామన్నారు..ఏమైందని ప్రశ్నించారు. కొత్త ఉద్యోగాలేమో కానీ ఉన్న ఉద్యోగాలు పోతున్నాయని ఎద్దేవా చేశారు. సర్జికల్ స్ట్రేక్ అంటూ బీజేపీ పిచ్చొళ్లు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని.. వారిని ఓటుతో తరిమి కొట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
10 వేలు ఆపినోడు 25 ఇస్తామంటే నమ్ముతారా?
-
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలి
-
టీఆర్ఎస్ పతనానికి గ్రేటర్ ఎన్నికలే నాంది
-
కేసీఆర్‌ను కొట్టడానికి రాలేదు: అమిత్ షా
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి మేయర్ పీఠం దక్కించుకుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, తమ ప్రభుత్వ ఏర్పాటులో కేసీఆర్‌దే కీలక పాత్ర అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని నడుపుతున్న తీరు చూస్తేనే బీజేపీ విజయం ఖాయమని తెలుస్తుందన్నారు. (చదవండి : రోడ్డు షో మధ్యలోనే ముగించిన అమిత్ షా) జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం ఆయన సికింద్రాబాద్‌లో రోడ్ షో నిర్వహించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయం చేరుకొని మీడియాతో మాట్లాడారు. రోడ్ షోలో స్వాగతం పలికిన హైదరాబాద్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. సీట్లు పెంచుకోవడానికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని.. మేయర్ సీటు గెలుచుకోవడానికే పోటీ చేస్తున్నామన్నారు. బీజేపీ అభ్యర్థే మేయర్ అవుతాడని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి హైదరాబాద్‌ను ఐటీ హబ్ కాకుండా అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. బీజేపీ ఒక్కసారి అవకాశం ఇస్తే హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ హబ్‌గా మారుస్తామన్నారు. ఎంఐఎం అండతోనే అక్రమ కట్టడాలు ఏర్పాటయ్యాయని, ఎంఐఎం మార్గదర్శనంలోనే టీఆర్ఎస్ నడుస్తోందన్నారు. బీజేపీకి అవకాశమిస్తే.. హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలన్నీ కూల్చేస్తామన్నారు. హైదరాబాద్ నీళ్లలో మునిగినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రోడ్ల మీదకు రాలేదు.. ఎమ్మెల్యేలతో మాట్లాడలేదని విమర్శించారు. అమిత్ షా ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే.. హుస్సేన్‌సాగర్‌ను శుద్ధి చేశారా? ‘ప్రధాని మోదీ ఏం చెప్తారో.. అదే చేస్తారు. 2014, 19లో మేమిచ్చిన వాగ్ధాలన్నీ పూర్తిచేశాం.నేనడిగే ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్తారనే ఆశిస్తున్నా. గత ఎన్నికల తర్వాత వంద రోజుల ప్రణాళిక అన్నారు.. ఏమైంది? లక్ష ఇళ్లు కడతామన్నారు.. ఏమైంది? ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ నెరవేర్చలేకపోయింది. హుస్సేన్ సాగర్‌ను శుద్ధి చేస్తాం.. పర్యాటక కేంద్రంగా మారుస్తాం అన్నారు. ఏమయ్యాయి అవి. 15 డంపింగ్ యార్డులు అన్నారు.. ఎక్కడున్నాయి? 15 డంపింగ్ యార్డులు అన్నారు.. ఎక్కడున్నాయి? కొత్త ఆస్పత్రుల నిర్మాణం అన్నారు.. ఏమైంది? ప్రజలకు ఆయుష్మాన్ భారత్ ఫలాలు అందకుండా అడ్డుకున్నారు. హైదరాబాద్ ఒక మినీ ఇండియాగా తీర్చిదిద్దుతాం అవినీతిలో తెలంగాణ ప్రభుత్వం అన్నిసరిహద్దులు దాటేసింది. ఎంఐఎంతో పొత్తు ఉందో..లేదో చెప్పేందుకు ఎందుకు భయపడుతున్నారు? నేరుగా సీట్లు పంచుకొని పోటీ చేయండి. హైదరాబాద్‌లో రోహింగ్యాలను, బంగ్లాదేశీయులను ఏరివేద్దామనుకుంటే పార్లమెంటులో అడ్డుకున్నది ఎవరు? వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే అధికారం. మా ప్రభుత్వం ఏర్పాటులో కేసీఆర్‌దే కీలకపాత్ర. కేసీఆర్ ప్రభుత్వాన్ని నడుపుతున్న తీరు చూస్తేనే మా విజయం ఖాయమని తెలుస్తుంది. నేను ఎన్నికల కోసం వచ్చాను.. కేసీఆర్‌ను కొట్టడానికి కాదు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో వందేళ్లు బతకాలి. అధికారం ఇస్తే హైదరాబాద్‌ను ప్రపంచానికే ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతాం.కేంద్రం ద్వారా హైదరాబాద్ చిరువ్యాపారులకు అత్యధికంగా లాభం జరిగింది.నవాబు, నిజాం సంస్కృతుల నుంచి విముక్తి చేసి..హైదరాబాద్ ఒక మినీ ఇండియాగా తీర్చిదిద్దుతాం’ అని అమిత్ షా పేర్కొన్నారు. -
మా ప్రభుత్వం ఏర్పాటులో కేసీఆర్‌దే కీలకపాత్ర: అమిత్ షా
-
‘ఆయన రాకపోతే వ్యాక్సిన్ తయారు కాదా?’
సాక్షి, హైదరాబాద్: వరదల్లో వంద మంది చనిపోతే, హోంమంత్రిగా పరామర్శ చేయలేదు.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్ల కోసం వస్తారా అంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బీజేపీ నేతల ప్రవర్తన హైదరాబాద్ ప్రజలను అవమానపరిచేలా ఉందని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ.. కరోనా వ్యాక్సిన్ పరిశీలన పేరుతో డ్రామా చేస్తున్నారని.. ఆయన రాకపోతే వ్యాక్సిన్ తయారు కాదా..? అని ప్రశ్నించారు. (చదవండి: ఉత్తమ్‌కుమార్ మాటెత్తడానికే వణుకు..) ‘‘ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా.. యూపీ సీఎం.. ఆయన రాష్ట్రంలో దళిత మహిళలపై దాడులు జరుగుతుంటే మిన్నకుండి పోయారు. రాష్ట్రం లో అవినీతి పాలన జరుగుతుంటే కేంద్ర సంస్థలు ఏం చేస్తున్నాయి. కర్ణాటక ఎంపీ అడ్డగోలుగా మాట్లాడుతారు. యూపీ సీఎం వచ్చి హైదరాబాద్ పేరు మారుస్తామంటారు. మీరు ఎవరు ఆ మాట అనడానికి. బండి సంజయ్‌ది కరీంనగర్ కార్పొరేటర్ స్థాయి. హైదరాబాద్ గురించి మాట్లాడటానికి ఆయనకేం ఏం సంబంధం. కేంద్రం.. హైదరాబాద్‌కు ఏం చేసింది..? గ్రేటర్ అభివృద్ధి చేసిందంతా కాంగ్రెస్ హయాంలోనే. వరదలు వచ్చినప్పుడు కేంద్ర బలగాలు ఎందుకు రాలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం బలగాలను దింపుతారా.? పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తారా? కేసీఆర్ తెలంగాణను ఏడేళ్ల పాటు దోచుకున్నారు. నిన్న సభలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం గురించి మాట్లడలేదు. సభ అట్టర్ ఫ్లాప్. టీఆర్ఎస్ పతనానికి గ్రేటర్ ఎన్నికలే నాంది. హైదరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ వల్లే సాధ్యమైందని’’ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. (చదవండి: మేమే నంబర్ వన్) -
ఓటు తప్పక వేయండి: విజయ్ దేవరకొండ
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల ఓటింగ్ పెంపునకు జీహెచ్ఎంసీ పెద్దఎత్తున చైతన్య కార్యక్రమాలను చేపట్టింది. గ్రేటర్ పరిధిలోని ఓటర్లందరికీ ఓటరు స్లిప్‌ల పంపిణీ చేయడంతో పాటు, ఓటరు స్లిప్‌ల డౌన్‌లోడ్‌కు ప్రత్యేక యాప్ రూపొందించింది. ‘మైజీహెచ్ఎంసీ యాప్’ లో నో యువర్ ఓట్ ఆప్షన్లో పేరు, వార్డు నంబర్ ఎంటర్ చేస్తే ఓటరు స్లిప్, పోలింగ్ లొకేషన్ గూగుల్ మ్యాప్ కూడా వస్తుంది. నో యువర్ ఓట్‌పై ఎఫ్ఎం రేడియో, టి.వి స్క్రోలింగ్, బస్ షెల్టర్లపై హోర్డింగ్‌ల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. (చదవండి: రోడ్డు షో మధ్యలోనే ముగించిన అమిత్ షా) మొట్టమొదటి సారిగా ఓటర్ల జాబితాను రాష్ర్ట ఎన్నికల సంఘం వెబ్సైట్లో ప్రదర్శన, ఓటరు చైతన్యంపై పెద్ద ఎత్తున హోర్డింగులు ఏర్పాటు, జీహెచ్ఎంసీకి చెందిన 1500 సెల్ఫోన్ల రింగ్టోన్ల ద్వారా ఓటర్లను చైతన్యపర్చడం, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు పలు కమిటీలను ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో స్వయం సహాయక బృందాల ద్వారా ప్రత్యేక ఓటరు చైతన్య కార్యక్రమం చేపట్టింది. సర్కిళ్ల స్థాయిలో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ల సమావేశాలు నిర్వహించడంతో పాటు, ఎలక్ట్రానిక్ మీడియాలో షార్ట్ఫిలిమ్స్ ప్రదర్శన ద్వారా జీహెచ్ఎంసీ ఓటరు చైతన్య కార్యక్రమాలను చేపట్టింది. (చదవండి: బక్క కేసీఆర్‌ను కొట్టడానికి ఇంతమందా?)