
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు ఏఐసీసీకి లేఖను పంపించారు. కాగా గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ఉత్తమ్ లేఖలో పేర్కొన్నారు. తాను పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని తెలిపిన ఉత్తమ్.. గతంలోనే ఏఐసీసీకి లేఖ రాశానని, ఆమోదించాలని కోరారు. కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించుకోవాలని లేఖలో పేర్కొన్నారు. చదవండి: హస్తం ఖేల్‌ఖతం.. మరోసారి సింగిల్ డిజిట్!
ఇదిలా ఉండగా గత కొద్ది కాలంగా ఉత్తమ్ పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగడంపై పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఉంది. దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి అనంతరం ఈ ఒత్తిడి మరింత ఎక్కువైంది. తాజాగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కేవలం 2 డివిజన్లలో(ఉప్పల్, ఏఎస్ రావు నగర్) మాత్రమే విజయం సాధించడంతో ఓటమికి భాద్యత వహిస్తూ ఉత్తమ్ రాజీనామా చేశారు. చదవండి: 2023లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తాం: బండి సంజయ్
Comments
Please login to add a commentAdd a comment