PCC Chief Post
-
నేను పీసీసీ రేసులో లేను: శ్రీధర్ బాబు
సాక్షి, హైదరాబాద్: ‘‘నేను పీసీసీ రేసులో లేను.. ఏఐసీసీ ఏ నిర్ణయం తీసుకున్న అంగీకారమే.. దానికి కట్టుబడి ఉంటాను’’ అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. ఆయన మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం ముప్పై వేల ఎకరాల భూమిని అమ్మాలని చూస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన జీవో 13 ను వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఆస్తులను కాపాడుకునేందుకు సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చింది. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం నాలుగు లక్షల కోట్ల అప్పుల్లోకి వెళ్ళింది. ఉమ్మడి రాష్ట్రంలో భూములు అమ్మ లేదా అని హరీష్ రావు అంటున్నారు. ఆనాడు ఆస్తులు అమ్మతుంటే వద్దని మేము ఆనాటి ముఖ్యమంత్రి కి చెప్పాము. జిల్లాలో భూముల్ని అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని’’ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తెలిపారు. ‘‘ఆరున్నర సంవత్సరాలుగా అనేక పనులు కూడా ప్రజావ్యతిరేకంగానే ఉన్నాయి. ఇప్పుడు అమ్మే భూములు ఎవరికి ఏ ప్రాంతానికి అమ్ముతారు. ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధంగా తెలంగానేతరులకు భూములు అమ్మే ప్రయత్నం జరుగుతుంది. కాంగ్రెస్ హయాంలో వేల ఎకరాలు పేదలకు పంచాం. పొడు భూములు కూడా పంపిణీ చేశాం. మన భూములను మన తెలంగాణ రాష్ట్ర సమితి అమ్మే ప్రయత్నం చేస్తోంది.. మిమ్మల్ని ఏ విదంగా వెల్లగొట్టాలని ప్రజలు ఆలోచిస్తున్నారు’’ అంటూ శ్రీధర్ బాబు మండిపడ్డారు. చదవండి: కాంగ్రెస్‌లో వీహెచ్ వ్యాఖ్యల దుమారం -
పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ రాజీనామా
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు ఏఐసీసీకి లేఖను పంపించారు. కాగా గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ఉత్తమ్ లేఖలో పేర్కొన్నారు. తాను పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని తెలిపిన ఉత్తమ్.. గతంలోనే ఏఐసీసీకి లేఖ రాశానని, ఆమోదించాలని కోరారు. కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించుకోవాలని లేఖలో పేర్కొన్నారు. చదవండి: హస్తం ఖేల్‌ఖతం.. మరోసారి సింగిల్ డిజిట్! ఇదిలా ఉండగా గత కొద్ది కాలంగా ఉత్తమ్ పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగడంపై పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఉంది. దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి అనంతరం ఈ ఒత్తిడి మరింత ఎక్కువైంది. తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కేవలం 2 డివిజన్లలో(ఉప్పల్, ఏఎస్ రావు నగర్) మాత్రమే విజయం సాధించడంతో ఓటమికి భాద్యత వహిస్తూ ఉత్తమ్ రాజీనామా చేశారు. చదవండి: 2023లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తాం: బండి సంజయ్ -
‘నాకు పార్టీలో అన్యాయం జరిగింది’
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీలో తనకు అన్యాయం జరిగిందని ఆ పార్టీ మాజీ ఎంపీ వీ హనుమంతరావు అన్నారు. పార్టీలో ఆయారాం, గయరాం వంటి వారికే కీలక పదవులు ఇస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడిగా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను నియమించారని కొంతమంది ప్రచారం చేస్తున్నారని, అలాచేస్తే అనేకమంది పార్టీని వీడిపోతారని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో ఓడిపోయిన వాళ్లకు ఎంపీ టికెట్లు ఇస్తున్నారని, నేతల బ్యాక్‌గ్రౌండ్ చూసి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో అపరిశుభ్ర వాతావరణంతో రోగాలు ప్రబలుతున్నాయని, భారీ సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ నుంచి బయటకు వచ్చి ప్రజల పరిస్థితిని చూడాలని అన్నారు. -
పీసీసీ అడిగాను.. హైకమాండ్ ఇష్టం
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు కావాలని అధిష్టానాన్ని అడిగానని, దీనిపై హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని మాజీమంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. 20 ఏళ్లనుంచి ఎమ్మెల్యేగా ఓటమి లేకుండా పనిచేస్తున్నానని చెప్పారు. పీసీసీ పదవి ఇచ్చినా, ఇవ్వకున్నా అధిష్టానం చెప్పినట్టు చేస్తానన్నారు. నల్లగొండలో తనపై గెలిచేస్థాయి ఎవరికీ లేదన్నారు. గత ఎన్నికల్లో భూపాల్‌రెడ్డి భార్యా, పిల్లలు, కుటుంబసభ్యులు అంతా ప్రచారం చేసుకున్నా ఎన్ని ఓట్లు వచ్చాయో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. -
పీసీసీ అధ్యక్ష పదవి అడిగితే తప్పేంటి?
హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీయే ఉంటుందని రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్సే అని.. ఇందులో బీజేపీ పాత్ర ఏమీ లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు ఈనెల 20న దిగ్విజయ్ సింగ్ వస్తున్నారని తెలిపారు. పార్టీ ప్రక్షాళనపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. మూడుసార్లు ఓడిపోయిన వారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని, తాను పీసీసీ అధ్యక్ష పదవి అడిగితే తప్పేంటని హనుమంతరావు ప్రశ్నించారు. -
పీసీసీ చీఫ్ రేసులో లేను: వివేక్
కరీంనగర్ : పీసీసీ అధ్యక్ష పదవి రేసులో లేనని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వివేక్ స్పష్టం చేశారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ రుణమాఫీ వల్లే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని అన్ఓనారు. రైతులకు తొమ్మిది గంటల విద్యుత్ ఇవ్వాల్సిందేనని వివేక్ డిమాండ్ చేశారు. మరోవైపు మాజీమంత్రి డీకే అరుణ.... తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి కోసం తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పొన్నాల లక్ష్మయ్యను పదవి నుంచి తప్పించనున్నట్లు సంకేతాలతో ఆమె గత మూడు రోజులుగా హస్తనలోనే మకాం వేసి...అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు. -
పీసీసీ చీఫ్ పదవి ఇవ్వండి: దిగ్విజయ్‌ను కోరిన దానం
రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ తో మాజీ మంత్రి దానం నాగేందర్ భేటి అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత నెలకొన్న పరిస్థితులను దిగ్విజయ్ కు దానం వివరించినట్టు తెలుస్తోంది. రాష్టంలో త్వరలో జరుగనున్న ఎన్నికల్లో జంట నగరాల్లో పార్టీ విజయానికి తోడ్పాటునందించే అంశాలను దిగ్విజయ్ దృష్టికి తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రతికూల పవనాలు వీస్తున్నాయని.. తనకు పార్టీ పగ్గాలు అప్పగించితే తాను విజయానికి కృష్టి చేస్తానని దిగ్విజయ్ తో అన్నట్టు సమాచారం. ఎన్నికల ముందే పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని దిగ్విజయ్‌ను దానం కోరినట్టు తెలుస్తోంది. అయితే దానం విజ్ఞప్తికి దిగ్విజయ్ ఎలాంటి హామీ ఇవ్వలేదని విశ్వసనీయ సమాచారం.