పీసీసీ అధ్యక్ష పదవి అడిగితే తప్పేంటి?
హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీయే ఉంటుందని రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్సే అని.. ఇందులో బీజేపీ పాత్ర ఏమీ లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు ఈనెల 20న దిగ్విజయ్ సింగ్ వస్తున్నారని తెలిపారు.
పార్టీ ప్రక్షాళనపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. మూడుసార్లు ఓడిపోయిన వారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని, తాను పీసీసీ అధ్యక్ష పదవి అడిగితే తప్పేంటని హనుమంతరావు ప్రశ్నించారు.