telangana pcc
-
కాంగ్రెస్ ‘సామాజిక అస్త్రం’.. రాజ్యాంగ పరిరక్షణ కవాతు ప్రణాళిక
సాక్షి, హైదరాబాద్: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు అదనంగా రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షణ కవాతు (సంవిధాన్ బచావో మార్చ్) నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలను తమవైపు తిప్పుకోవడమే లక్ష్యంగా 2 వారాలపాటు కవాతు నిర్వహించనుంది. దీనిపై చర్చించేందుకు వచ్చే నెల 4న కాంగ్రెస్ ముఖ్య నాయకులు దిగ్విజయ్‌సింగ్, జైరాం రమేశ్ హైదరాబాద్ రానున్నారు. నవంబర్ 3వ వారం తర్వాత.. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర అక్టోబర్ నెలాఖరులో రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 24న నారాయణపేట జిల్లా నుంచి తెలంగాణ లోకి రావాల్సిన యాత్ర 3–4 రోజులు ఆల స్యం కావొచ్చని గాంధీ భవన్ వర్గాలు చెబు తున్నాయి. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1లోగా ఏదో ఒకరోజు తెలంగాణలోకి యాత్ర వస్తుందని తెలుస్తోంది. రాష్ట్రంలో ఈ యాత్ర కనీసం 13 రోజులపాటు జరగ నుంది. అంటే నవంబర్ మూడో వారం వరకు రాహుల్ యాత్ర రాష్ట్రంలో జరగనుండగా ఆ తర్వాత 75 కి.మీ. రాజ్యాంగ పరి రక్షణ కవాతు ప్రారంభించాలని టీపీసీసీ నేతలు యోచిస్తున్నారు. మిగిలిన రాష్ట్రాల్లో నూ ఇలాంటి యాత్రలు చేపడుతున్నారని, అయితే తెలంగాణలో మాత్రం ఇతర రాష్ట్రా లకు భిన్నంగా కవాతు నిర్వహించాలనేది రాష్ట్ర కాంగ్రెస్ నేతల ఆలోచనగా కనిపిస్తోంది. ఇందుకోసం టీపీసీసీకి అనుబంధంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్, వృత్తి దారులు, కిసాన్, ఫిషర్మెన్ సెల్‌లను భాగ స్వాములను చేస్తూ యాత్ర నిర్వహిస్తామని టీపీసీసీ నేతలు చెబుతున్నారు. అన్యాయాన్ని వివరించడమే లక్ష్యంగా.. కాంగ్రెస్ హయాంలో ఆయా వర్గాలకు ఇచ్చి న ప్రాధాన్యం గురించి చెప్పడంతోపాటు బీజేపీ, టీఆర్ఎస్ల హయాంలో ఆయా వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని వివ రించడమే లక్ష్యంగా యాత్ర సాగుతుందని, భారత్ జోడో యాత్రకు ఎంత ప్రాధాన్య మి చ్చామో సామాజిక కవాతుకూ అంతే ప్రాధా న్యమిస్తామని టీపీసీసీ ముఖ్యనేత ఒకరు వెల్లడించారు. కవాతు ఏర్పాట్లపై చర్చించేందుకు పార్టీ ముఖ్య నాయకులు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేశ్ వచ్చే నెల 4న హైదరా బాద్‌కు రానున్నారు. ఈ సమావేశానికి హాజ రుకావాలంటూ పార్టీ అనుబంధ విభాగాల చైర్మన్లకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సెల్‌లకు ఏఐసీసీ సమన్వయకర్త కొప్పుల రాజు లేఖలు కూడా రాశారు. ఈ సమావేశంలోనే కవాతు ఎక్కడ ప్రారంభించి, ఎక్కడ ముగించాలి, ముగింపు సందర్భంగా నిర్వ హించే బహిరంగ సభకు ఎవరిని ఆహ్వానించాలన్న దానిపై స్పష్టత రానుంది. -
దేశాన్ని విచ్ఛిన్నం చేసే రాజకీయ శక్తులను అడ్డుకోవాలి
సాక్షి, హైదరాబాద్: బ్రిటిష్ పాలకులను తరిమికొట్టి ప్రజలకు స్వాతంత్య్రాన్ని సాధించి స్వేచ్ఛా వాయువులు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అయితే కొన్ని మతతత్వ శక్తులు దేశంలో చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు చూస్తున్నాయని, ఎన్నో త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులను ప్రతీ ఒక్కరూ ప్రతిఘటించాలని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్రోద్యమంలో వేలాదిమంది ప్రాణ త్యాగాలు చేశారని, లక్షలాదిమంది జైలు పాలయ్యారని, వారి త్యాగాల ఫలితంగానే నేడు స్వాతంత్య్రం సిద్ధించిందని వ్యాఖ్యానించారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా సోమవారం తన నివాసంలో జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. కరోనా కారణంగా గాంధీభవన్‌కు వెళ్లని ఆయన జూబ్లీహిల్స్‌లోని తన ఇంట్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న వీడియోను విడుదల చేశారు. మతకల్లోలాలు, దేశ విభజన నేపథ్యంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తొలి ప్రధానమంత్రి నెహ్రూ దూర దృష్టితో పనిచేశారని, అంబేడ్కర్ రచించిన రాజ్యాంగంతోనే 75 ఏళ్ల నుంచి దేశ ప్రజలు హక్కులు, బాధ్యతలతో స్వేచ్ఛగా జీవిస్తున్నారన్నారు. సోనియా, రాహుల్‌గాంధీల నాయకత్వంలో పటిష్టమైన పోరాటాలతో పనిచేయాలని, ప్రజాస్వామ్య, పార్లమెంటరీ వ్యవస్థల పతనాన్ని సంఘటితంగా అడ్డుకోవాలని కోరారు. చదవండి: ప్రశ్నిస్తే దాడులు చేయిస్తారా? నిరంకుశ పాలనను అంతం చేస్తాం -
బీజేపీకి తెలంగాణలో స్థానం లేకుండా చేయాలి: రేవంత్
సాక్షి, హైదరాబాద్: చేనేత మీద 12 శాతం జీఎస్టీ వేసి చేనేత కళను చంపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. చేనేత కార్మికుల జీవితాలతో బీజేపీ చెలగాటమాడు తోందని విమర్శిస్తూ ఆదివారం తన ట్విట్టర్లో పోస్టు చేశారు. నేతన్నకు అన్యాయం చేస్తున్న బీజేపీ దోపిడీ ముఠాకు తెలంగాణలో స్థానం లేకుండా చేయాలని ఆ ట్వీట్లో రేవంత్ పిలుపునిచ్చారు. కాగా, జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని నేతన్నలకు రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్రోద్యమంలో ప్రధాన భూమిక పోషించి స్వాతంత్య్ర సముపార్జనకు ఒక సాధనంగా నిలిచిన చేనేత రంగానికి ప్రత్యేకమైన రోజు ఉండాలన్న ఉద్దేశంతో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరమని పేర్కొన్నారు. గాంధీ కూడా రాట్నంపై నూలు వడకడానికి ప్రాధాన్యం ఇచ్చారని, కాంగ్రెస్ పార్టీలో నేత కార్మికులకు ప్రత్యేక స్థానం ఉంటుందని ఆ ప్రకటనలో రేవంత్ వెల్లడించారు. చదవండి: అయోధ్యలో బీజేపీ నేతల భూ కుంభకోణం.. అఖిలేశ్ యాదవ్ ఫైర్ -
‘సభ్యత్వం’పై వద్దు అలసత్వం: పీసీసీ చీఫ్ రేవంత్ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: సంస్థాగత బలమే పార్టీకి ప్రాణమని, క్షేత్రస్థాయిలో బలోపేతం కోసం మండలాల ప్రాతిపదికన కార్యాచరణ రూపొం దించుకోవాలని కాంగ్రెస్ శ్రేణులకు పీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి సూచించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని, రాష్ట్రంలోని 34 వేల పోలింగ్ బూత్‌ల పరిధిలో ప్రతి బూత్‌కు 100 మందిని పార్టీ సభ్యులుగా చేర్పించాలని ఆదేశిం చారు. బుధవారం గాంధీభవన్‌లో పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలతో రేవంత్ సమీక్షించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు పార్టీ సభ్యత్వ నమోదును క్రియాశీలకంగా నిర్వహించాలని కోరారు. దేశంలోనే తెలంగాణను ఆదర్శవంతంగా నిలపాలని సూచించారు. సభ్యత్వ నమోదులో నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. నిర్లక్ష్యం చేస్తే ఎంతటివారైనా నష్టపోతారని హెచ్చరించారు. బలముంటేనే కొట్లాడగలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉంటే ఈ ప్రభుత్వాలపై కొట్లాడగలమని పార్టీ నేతలకు రేవంత్ స్పష్టం చేశారు. ‘‘ఐదు మండలాల్లో పార్టీ బలంగా ఉంటే అసెంబ్లీ స్థానాన్ని, 35 మండలాల్లో బలంగా ఉంటే లోక్‌సభ స్థానాన్ని గెలుస్తాం. అదే 600 మండలాల్లో పార్టీ బలపడితే రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం. మండలాల్లో అధ్యక్షులు సరిగా పనిచేయకపోతే వారిపై చర్యలు ఉంటాయి. ప్రతి మండలంలో 10వేలు, నియోజకవర్గంలో 50వేలు, ఎంపీ స్థానం పరిధిలో 3.5లక్షల సభ్యత్వం చేసిన వారికి రాహుల్ గాంధీతో సన్మానం చేయిస్తాం’’అని చెప్పా రు. సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస కృష్ణన్, ఎమ్మెల్యే సీతక్క, నేతలు మహేశ్‌కుమార్‌గౌడ్, హర్కర వేణుగోపాల్, మల్లు రవి, దీపక్‌జాన్, చిన్నారెడ్డి, గోపిశెట్టి నిరంజన్, వేం నరేందర్‌రెడ్డి, సోహైల్ పాల్గొన్నారు. ‘ఉద్యోగ, ఉపాధ్యాయులకు కాంగ్రెస్ అండ’ ఉద్యోగ, ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 317 జీవో చాలా ఇబ్బందులకు గురిచేస్తోందని, దీని కారణంగానే బడికి వెళ్లి పాఠాలు చెప్పాల్సిన టీచర్లు ప్రగతి భవన్ ముందు ఆందోళన చేస్తున్నారని టీపీసీసీ అధ్య క్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 317 జీవో రద్దయ్యేవరకు ఉద్యోగ, ఉపాధ్యాయులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉపాధ్యాయ సంఘం మాజీ నేత గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి బుధవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ మాట్లాడుతూ ఉద్యోగుల భవిష్యత్‌ను చీకట్లోకి నెట్టేస్తున్న 317 జీవోపై పోరాటం చేసేందుకే హర్షవర్ధన్‌ను కాంగ్రెస్‌లోకి తీసుకుంటున్నామని, ఆయనకు పార్టీలో గుర్తింపు ఉంటుం దని చెప్పారు. టీపీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ జి. చిన్నారెడ్డి మాట్లాడుతూ.. అందరం కలసి కాం గ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. -
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి
-
‘నాకు పీసీసీ అధ్యక్షుడిగా ప్రమోషన్ కావాలి’
సాక్షి, హైదరాబాద్ : ఉత్తమకుమార్ రెడ్డి రాజీనామాతో తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి ఆశావాహుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటికే పలువురు టీపీసీసీ రేసులో ఉన్నామంటూ ఫీలర్లు వదిలిన విషయం తెలిసిందే. పలువురు బాహాటంగా, మరికొందరు తాము ఆ పదవికి అర్హులే అంటూ పరోక్షంగా చెబుతున్నారు. తాజాగా ఆ రేసులో అంజనీ కుమార్ యాదవ్ కూడా చేరారు. రెండుసార్లు ఎంపీగా పని చేసిన తాను పీసీసీ అధ్యక్ష పదవికి అర్హుడేనని తెలిపారు. తనకు పీసీసీ అధ్యక్షుడుగా ప్రమోషన్ కావాలని, అందుకే హైదరాబాద్ అధ్యక్షుడుగా రాజీనామా చేశానని తెలిపారు. హైదరాబాద్ సిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయాన్ని అంజనీ కుమార్ గురువారం అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. నేను గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిని కాదు. హైదరాబాద్, సికింద్రాబాద్ మాత్రమే అధ్యక్షుడిని. సీట్ల కేటాయింపులో నా ప్రమేయం లేదు. ప్రతీ నియోజకవర్గానికి పెద్ద లీడర్లు ఉన్నారు. (టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు..) అంబర్ పేటలో వీ హనుమంతరావు, జూబ్లీహిల్స్‌లో విష్ణువర్థన్ రెడ్డి, సనత్ నగర్లో మర్రి శశిధర్ రెడ్డి.. ఇలా అందరూ పెద్ద నేతలే ఉన్నారు. గ్రేటర్ ఎన్నికల సీట్ల కేటాయింపులో నా పాత్ర సికింద్రాబాద్, ముషీరాబాద్ తప్ప ఎక్కడ లేదు. నా రాజకీయ జీవితం ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా. బీజేపీ లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లను. గ్రేటర్లో ఓటమి అపనింద పడటం ఇష్టం లేదు.’ అని తెలిపారు. (కోమటిరెడ్డికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పిన ఉత్తమ్) ఇక ఇప్పటికే తెలంగాణ పీసీసీ రేసులో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నారు. తనకు పగ్గాలు అప్పగిస్తే పార్టీని గాడిలో పెడతానంటూ ఆయన తన మనసులో మాటను వెల్లడించారు. మరోవైపు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)కి కొత్త అధ్యక్షుడు ఎవరన్న దానిపై కసరత్తు అధికారికంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందుకు రాష్ట్ర పార్టీ నేతల నుంచి అభిప్రాయాలు తీసుకునేందుకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ హైదరాబాద్‌లో మకాం వేశారు. కోర్‌కమిటీ సభ్యులతో కలసి కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపిక గురించి అభిప్రాయ సేకరణ చేపట్టారు. -
ఉస్మానియా వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్శిటీ భూముల పరిశీలన ఆదివారం ఉద్రికత్తకు దారితీసింది. ఓయూ భూములను పరిశీలించేందుకు వెళ్లిన తెలంగాణ పీసీసీ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. డీడీ కాలనీలో కబ్జా అయిన భూమి దగ్గరకు వెళ్లేందుకు యత్నించారు. అయితే వారిని అడ్డుకోవడంతో కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. తమను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలంటూ నిలదీశారు. ఈ కార్యక్రమంలో టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, వి.హనుమంతరావు, వంశీచంద్‌రెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. (ప్రభుత్వ వైఫల్యాలపై టీపీసీసీ ‘పోరుబాట’) కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరుబాట పట్టాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ ఓయూ భూములను పరిశీలించింది. ఉస్మానియా యూనివర్సిటీలో కొందరు బీజేపీ, టీఆర్ఎస్ నేతలు భూములు కబ్జా చేస్తున్నారన్న ఆరోపణలతో పీసీసీ నేతలు ఉస్మానియాకు వెళ్లారు. ఇక ప్రభుత్వ వైఫల్యాలపై అధ్యయనం చేసేందుకు నాలుగు కమిటీలు ఏర్పాటు చేయాలని తెలంగాణ పీసీసీ నిర్ణయించింది. ఆర్థిక వ్యవహారాలపై సీఎల్పీ నేత భట్టి నేతృత్వంలో, ఉస్మానియా భూములు, విద్యారంగాలపై మాజీ ఎంపీ పొన్నం నేతృత్వంలో, నూతన వ్యవసాయ విధానంపై అధ్యయనానికి చిన్నారెడ్డి, కోదండరెడ్డి, గోదావరి పెండింగ్ ప్రాజెక్టులపై ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి నేతృత్వంలో కమిటీలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
ప్రభుత్వం ఏం చేస్తుంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి
-
నన్ను అకారణంగా సస్పెండ్ చేశారు...
సాక్షి, హైదరాబాద్ : సస్పెన్షన్ వేటుపై తెలంగాణ పీసీసీ ప్రధాన కార్యదర్శి నగేశ్ ముదిరాజ్ స్పందించారు. పార్టీ నుంచి తనను అకారణంగా సస్పెండ్ చేశారని ఆయన ఆరోపించారు. దీనిపై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని నగేశ్ స్పష్టం చేశారు. క్రమశిక్షణా కమిటీ వీ హనుమంతరావుకు తొత్తులా పని చేస్తోందని ఆయన ఆరోపించారు. వాస్తవానికి, ఆ రోజు జరిగిన ఘటనలో తన తప్పేమీ లేదని, ఈ విషయం క్రమశిక్షణా సంఘం కూడా గుర్తించినా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని నగేశ్ ముదిరాజ్ వ్యాఖ్యానించారు. తనను సస్పెండ్ చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకున్న అనంతరం ఆయన గాంధీభవన్‌లోని గాంధీ విగ్రహం ముందు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తనపై అకారణంగా చేయి చేసుకోవడంతో పాటు వీహెచ్ తనను వ్యక్తిగతంగా దూషించారని చెప్పారు. అన్ని పార్టీల నేతల ముందు, తన నియోజకవర్గంలో వీహెచ్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. అయినా, కనీసం వీహెచ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈ 11వ తేదీన ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో మాజీ ఎంపీ వీ హనుమంతరావు, నగేశ్ మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. వేదికపైనే ఇద్దరు నేతలు బాహాబాహీకి దిగిన దిగటంతో విచారణ జరిపిన కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం...నగేశ్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : నా సస్పెన్షన్ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం -
నా పెళ్లి.. అయిపోయిందోచ్!
సాక్షి, హైదరాబాద్: రాహుల్ గాంధీ పెళ్లి అయిపోయిందట..! అమ్మాయి ఎవరు అని మాత్రం అడగకండి.. ఆయన పెళ్లి జరిగింది అమ్మాయితో కాదు.. కాంగ్రెస్ పార్టీతో!! ఈ విషయాన్ని మంగళవారం హరిత ప్లాజాలో ‘హైదరాబాద్ ప్రెస్‌క్లబ్’ నిర్వహించిన ఎడిటర్స్ మీట్లో రాహులే స్వయంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏ హడావుడి, హంగామా లేకుండా అతి సాధారణంగా టేబుల్ టేబుల్ తిరుగుతూ, కూర్చుంటూ, లేస్తూ, నడుస్తూ రాహుల్ ప్రసంగించారు. జాతీయ, అంతర్జాతీయ అంశాలు, రాజకీయాలతోపాటు వ్యక్తిగత అంశాలను పంచుకున్నారు. జర్నలిస్టులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఇదే సందర్భంలో మీరు పెళ్లెప్పుడు చేసుకుంటారు.. బ్రహ్మచారిగానే ఉండిపోతారా అని ఓ పాత్రికేయుడు అడగ్గానే రాహుల్ బిగ్గరగా నవ్వేస్తూ.. ‘కాంగ్రెస్ పార్టీ నే పెళ్లి చేసుకున్నా..’అంటూ బదులిచ్చారు. తొలుత మహిళా జర్నలిస్టులు కూర్చున్న టేబుల్ నుంచి తన చిట్‌చాట్‌ను ప్రారంభించారు. ‘అత్యంత శక్తివంతమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మీకు నానమ్మ ఇందిర, అమ్మ సోనియా, సోదరి ప్రియాంకాల్లో ఎవరు స్ఫూర్తి..’ అని ఒకరు ప్రశ్నించగా.. ‘ముగ్గురూ స్ఫూర్తే.. వాళ్లే బలం..’అని చెప్పారు. మహిళా జర్నలిస్టులున్న ఈ టేబుల్‌కు మరో రెండు నిమిషాల సమయాన్ని అధికంగా కేటాయిస్తానని చెప్పి.. వారితో అదనంగా మరో ప్రశ్న వేయించుకుని సమాధానం చెప్పారు. సెల్లో రికార్డింగ్‌పై చిరు కోపం సుమారు గంటా పది నిమిషాల పాటు జరిగిన ఈ మీట్లో ఓ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు తీరుపై రాహుల్ నొచ్చుకున్నారు. ‘ఈ మీట్ కేవలం ఆఫ్ ది రికార్డ్ కోసం ఉద్దేశించిందే.. నేను ఎంత ఫేర్‌గా ఉన్నానో.. మీరు అలాగే ఉండాలి’ అంటూ తన మాటల్ని సెల్ఫోన్లో రికార్డు చేసిన ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుపై చిరుకోపాన్ని ప్రదర్శించారు. కేసీఆర్ కుటుంబ పాలనపై విమర్శలు చేస్తున్న మీరు.. మీ కుటుంబ పాలనపై ఏమంటారు అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ‘మేం 30 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్నాం. నా తండ్రి ప్రధాని అయ్యాక మా కుటుంబం నుంచి ఇప్పటి వరకు ఎవరూ ప్రధాని పదవి తీసుకోలేదు’ అని బదులిచ్చారు. ఈ భేటీలో ఆయన సాధారణ వ్యక్తిలా కలిసిపోయి పూర్తి వివరాలు, విశేషాలతో కూడిన సమాధానలివ్వటంతో సమావేశం అనంతరం ఆయన్ను పలువురు ఎడిటర్లు, జర్నలిస్టులు చప్పట్లతో అభినందించారు. సమావేశం చివరలో ‘సాక్షి’ దినపత్రిక కార్టూనిస్ట్ శంకర్ రాహుల్‌పై గీసిన క్యారికేచర్‌ను ప్రెస్‌క్లబ్ ప్రతినిధులు అందజేయగా.. ‘దీన్ని నా సోదరికి గిఫ్ట్‌గా ఇస్తా’ అంటూ తీసుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఈ మీట్‌కు ఎస్పీజీ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయటంతో ముఖ్య కాంగ్రెస్ నాయకులు సైతం ఇబ్బంది పడ్డారు. చివరకు ఏఐసీసీ నాయకులు కొప్పుల రాజు చొరవతో సీఎల్పీ నాయకులు జానారెడ్డి, షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్క లోపలికి రాగలిగారు. సుమారు 80 మందికిపైగా మీడియా ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమం ఆద్యంతం ఉల్లాసంగా సాగింది. జర్నలిస్ట్‌తో చాలెంజ్ దేశంలో బీజేపీ వచ్చే ఎన్నికల్లో తప్పక ఓటమి పాలవుతుందని రాహుల్ అనడంతో.. ఓ టీవీ చానల్ ఎడిటర్ మధ్యలో కల్పించుకుని వచ్చే ఎన్నికల్లో జాతీయ స్థాయిలో మీరు ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? 100 లేదా 200 అని అడిగారు. స్పందించిన రాహుల్ ‘మేం గెలువబోతున్నాం.. మీకు సందేహం అవసరం లేదు’ అన్నారు. సీట్ల సంఖ్య చెప్పండి అంటూ చానల్ ఎడిటర్ మళ్లీ అడగడంతో.. రాహుల్ ఆయన సీటు వద్దకు వచ్చి.. ‘బెట్ ఏమిటో చెప్పండి’ అని అడిగారు. ‘నూరు శాతం విజయం నాదే. మేం గెలిస్తే ఏం కావాలో బెట్ చేయండి’ అనగా.. ప్రధాని హోదాలో ఫస్ట్ ఇంటర్వ్యూ తనకే ఇవ్వాలని చానల్ ఎడిటర్ బదులిచ్చారు. ఈ బెట్‌కు రాహుల్ ఓకే చెప్పేయటంతో హాలంతా నవ్వుల్లో మునిగిపోయింది. రాఫెల్ విమానాల కొనుగోళ్లపై ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. మోదీ ప్రభుత్వం ఈ వ్యవహారంలో భారీ కుంభకోణానికి పాల్పడిందని, దీనిపై తాను పార్లమెంటులో ప్రశ్నిస్తే తన కళ్లలో సూటిగా చూసి సమాధానం చెప్పలేక ప్రధాని దిక్కులు చూస్తూ దాటేసిపోయారన్నారు. -
బహిరంగ సభలో కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన రాహుల్
సాక్షి, హైదాబాద్ : ఏ కలల కోసం తెలంగాణ ప్రజలు పోరాటం చేశారో ఆ కలలు నెరవేరడం లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ సాధనలో ఆత్మబలిదానాలు చేసిన అమరులకు ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. సరూర్‌నగర్ స్టేడియంలో మంగళవారం జరిగిన ‘విద్యార్థి-నిరుద్యోగ గర్జన’సభలో టీఆర్ఎస్, ఎన్డీయే ప్రభుత్వాలపై ఆయన ధ్వజమెత్తారు. మన ఉద్యోగాలు మనకు వస్తాయని ఆశపడ్డాం, కానీ కొత్తగా వచ్చిన సీఎం నిరుద్యోగులకు, విద్యార్థులకు ఒరగబెట్టిందేం లేదని అన్నారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఆగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సభలో ఇంకా ఆయన ఏం మాట్లాడారంటే.. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి టెండర్లు పారదర్శకంగా లేవని విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో పూర్తిగా కేసీఆర్ కుటుంబం ఆధిపత్యమే ఉందని అన్నారు. నరేంద్ర మోదీ, కేసీఆర్‌లు రీడిజైన్‌లో స్పెషలిస్టులని ఎద్దేవా చేశారు. మోదీ నోట్ల రద్దు చేస్తే.. కేసీఆర్ దానికి వంతపాడారని అన్నారు. ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద మోదీ, హైదరాబాద్‌లో ధర్నా చౌక్‌లో కేసీఆర్ నిరసనలు చేపట్టనీయకుండా నియంతల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాగా, రాహుల్ తెలుగులో ప్రసంగం మొదలు పెట్టడంతో జనం నుంచి విశేష స్పందన లభించింది. నరేంద్రమోదీ బేటీ బచావో.. బేటీ పడావో అనే నినాదమిచ్చారు. కానీ, బిహార్‌లో బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దేశంలోని మహిళలపై ఇంతటి అమానుష ఘటనలు జరుగుతున్నా మోదీ మౌనం వీడడం లేదని రాహుల్ అన్నారు. మోదీ తన నినాదంలో ఆడపిల్ల ఎవరి నుంచి రక్షించబడాలో చెప్పలేదన్నారు. బీజేపీ ఎమ్మెల్యేల నుంచి ఆడపిల్లలను రక్షించాలా అని మోదీని ప్రశ్నించారు. -
కాంగ్రెస్‌లో నూతన ఉత్తేజం!
ఏఐసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన తరువాత, రాహుల్ గాంధీ మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఉరకలేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి అన్ని అనుకూలతలున్న రాష్ట్రం తెలంగాణ. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. ఇలాంటి కీలక సమయంలో రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు తీసుకొస్తుంది. జమిలీ ఎన్నికల మాట అటుంచి, రాష్ట్రంలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు పోనున్నారన్న ప్రచారం ఎక్కువైంది. అందుకు తగ్గట్టుగానే ఆ పార్టీ దూకుడు పెంచింది. ఏఐసీసీ ప్లీనరీలో చెప్పినట్టుగా కార్యకర్తలకు అధిష్టానానికి ఉన్న అడ్డుగోడలను కూల్చివేసే ప్రక్రియ తెలంగాణ నుంచే ఆరంభిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి అడ్డుపడుతున్న మోదీకి అన్ని సంద ర్భాలలో కేసీఆర్ మద్దతుగా నిలవటంతో టీఆర్ఎస్ పార్టీ బీజేపీ ‘బి–టీం’గా వ్యవహరిస్తోందని తేలి పోయింది. దీనితో సెటిలర్లలో, విభజన హామీలుS అమలు కావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే మార్గమనే భావన ఏర్పడింది. రెండు తెలుగు రాష్ట్రాలపై సవితి తల్లి ప్రేమ చూపిస్తూ, అన్యాయం చేస్తున్న మోదీకి బుద్ధి చెప్పాలని చూస్తున్న తరుణంలో, రాహుల్ పర్యటన తెలం గాణ ప్రజలకు భరోసా ఇవ్వనుంది. మోదీ రూపంలో ప్రజలను పట్టిపీడిస్తున్న ధరల పెరుగుదల, జీఎస్టీ భారం, బ్యాంకులు, ఏటీఎంలలో నగదు కొరత, అసహనం, దళితులపై దాడులు, రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణం తదితర అంశాలతో పాటు తెలుగు రాష్ట్రాలకు బీజేపీ చేస్తున్న ద్రోహాలను రాహుల్ తన రెండు రోజుల పర్యటనలో ఎత్తిచూపనున్నారు. ఇక రాహుల్ గతంలో నామకరణం చేసినట్టు ‘మినీ మోదీ’ కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలు ఎమ్మెల్యేల పదవీ కాలం రద్దు, ప్రాజెక్టుల్లో అవినీతి, ఇసుక మాఫియా, నేరెళ్ల ఘటన, కౌలు రైతులకు రైతు బంధు పథకం వర్తించకపోవటం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో స్తబ్దత, అభయ హస్తం పింఛన్లు, ఊసే లేని కేజీ నుంచి పీజీ ఉచిత విద్య, నిర్లక్ష్యానికి గురవుతున్న ఆరోగ్యశ్రీ, గ్రామ పంచాయతీ ఉద్యోగుల నిరసనలు, రేషన్ డీలర్ల సమస్యలు, నిరుద్యోగ సమస్యలు రైతు బీమా పేరుతో తెచ్చిన పథకం 60 ఏళ్ళు నిబంధన ఇలా ప్రజలు అసంతృప్తితోవున్న అనేక అంశాలు గ్రేటర్ వేదికగా, యావత్ తెలంగాణ ప్రజల మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలను రాజకీయాలకు అతీతంగా సందర్శించి, విద్యార్థులతో ఇష్టాగోష్టిలో పాల్గొంటున్నారు. అందులో భాగంగా, ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీకి రాహుల్ వస్తారంటే టీఆర్ఎస్ నేతలు దీన్నీ వివాదాస్పదం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ కోసం అన్ని సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేసుకుని సమన్వయంతో పని చేస్తుంటే, టీఆర్ఎస్ మద్దతుదారులు మాత్రం అనుమతి ఇవ్వొద్దని పోటీగా విజ్ఞాపన పత్రాలు ఇచ్చి యూనివర్సిటీ ప్రశాంతతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నవేళ, పార్టీ కార్యక్రమాలతో పాటు, సమాజంలోని అనేక రంగాల ప్రజలను రాహుల్ ఈ పర్యటనలో కలుస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు కూడా కలవరం మొదలైంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే బలమైన రాజకీయ శక్తి అని భావించి, ఈ మధ్యనే వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన నేతలు రాహుల్ పర్యటనను తమ ఉనికిని చాటుకోవడానికి అనువైన సమయంగా భావిస్తుండటంతో పాత–కొత్త కలయికతో పర్యటన ఆద్యంతం ఉత్సాహంగా సాగనుంది. ఊహించినట్టుగా ముందస్తు ఎన్నికలు డిసెంబర్‌లోపే వచ్చినా ఈ పర్యటనలో రాహుల్ స్ఫూర్తితో పనిచేసి, మెజారిటీ అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుని, అధికారంలోకి రావాలనే ఊపు పార్టీ శ్రేణులలో కనబడుతుంది. -కొనగాల మహేష్(వ్యాసకర్త సభ్యులు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ -98667 76999) -
టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత!
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై కంటే అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువ కనిపిస్తోంది. అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకుంటూ సమర్థులైన అభ్యర్థులను బరిలోకి దింపితే కాంగ్రెస్ అధికారంలోకి రావడం సాధ్యమే.. ఇది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ సెక్రటరీలు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి నివేదించిన సారాంశం. తెలంగాణ కాంగ్రెస్ ఇఛార్జ్ సెక్రటరీలతో రాహుల్ సోమవారం సమావేశమయ్యారు. రాష్ట్రంలోని పార్టీ పరిస్థితులపై ముగ్గురు సెక్రటరీలతో చర్చించారు. నెల రోజుల తమ రాష్ట్ర పర్యటన వివరాలను ఈ భేటీలో ఏఐసీసీ సెక్రటరీలు రాహుల్ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని, పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామాల్లో కాంగ్రెస్‌కు అనుకూలత కనిపిస్తోందని రాహుల్‌కు వివరించినట్టు ఏఐసీసీ కార్యదర్శి ఎన్ఎస్ బోసురాజు తెలిపారు. కేసీఆర్ కుటుంబ పాలన, ఇచ్చిన హామీలు అమలుకాకపోవడం, నిరుద్యోగ సమస్య తదితర అంశాలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని పేర్కొన్నారు. స్థానిక సమస్యలపై దృష్టిపెట్టి ప్రజల్లోకి వెళితే పార్టీకి అనుకూలత ఉంటుందని రాహుల్‌కు వివరించామని తెలిపారు. తెలంగాణలో లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై మొదటదృష్టి సారించామని, అదే సమయంలో మండల స్థాయి నుంచి పీసీసీ వరకు పార్టీని బలోపేతం చేయాలని రాహుల్ సెక్రటరీలకు సూచించారు. ప్రతినెలా ఆయా స్థాయిల్లో ఒకసారైనా సమావేశాన్ని నిర్వహించాలని తెలిపారు. దేశవ్యాప్తంగా చూసినా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణాలో మంచి భవిష్యత్తు కనిపిస్తోందని రాహుల్ తమతో అన్నారని ఎన్ఎస్ బోసురాజు మీడియాకు తెలిపారు. తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన సహకారాన్ని అధిష్టానం నుంచి అందిస్తామని రాహుల్ తెలిపారని చెప్పారు. -
టీఆర్ఎస్ వెలమల పార్టీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీని వెలమ సామాజిక వర్గం వ్యక్తులు నడిపిస్తున్నారని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి, ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఆర్.సి.కుంతియా విమర్శించారు. టీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చే అవకాశం ఉందా అని ప్రశ్నించారు. ఆ పార్టీ బలహీనంగా ఉన్నందునే తమ పార్టీ నేతలను చేర్చుకుంటోందని ఎద్దేవా చేశారు. సోమవారం గాంధీభవన్‌లో జరిగిన ముఖ్య నేతల సమావేశం అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తదితరులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్ మభ్యపెట్టాలని చూస్తున్నారని, అయినా ఉత్తమ్ నాయకత్వంలో టీఆర్ఎస్ను తాము ఓడించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 40 శాతం మంది కౌలు రైతులు ఉన్నారని, వారికి కూడా రైతుబంధు పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఎన్నికలొచ్చినా తాము సిద్ధంగా ఉన్నామన్న కుంతియా.. పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెద్దపీట వేస్తామని వెల్లడించారు. గద్దె దించేందుకు ప్రజలూ సిద్ధం: ఉత్తమ్ ‘ముందస్తు ఎన్నికలకు సిద్ధం అంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ రద్దుపై గవర్నర్‌కు లేఖ ఇస్తానంటే కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందా..? ఎవరైనా వద్దన్నారా?’ అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నాలుగేళ్ల టీఆర్ఎస్ నిరంకుశ పాలనలో అన్ని రంగాల్లో అన్యాయానికి గురైన ప్రజలు కూడా ఎన్నికలకు, టీఆర్ఎస్ను గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారని దుయ్యబట్టారు. దానం నాగేందర్ పార్టీని వీడటం బాధాకరమన్న ఉత్తమ్.. సామాజిక న్యాయం విషయంలో కాంగ్రెస్ ఎప్పుడూ ముందుంటుందన్నారు. తప్పుడు సర్వేలతో కేసీఆర్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని, కేసీఆర్ కుటుంబాన్ని తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. -
కుంతియాను అవమానించారా?
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రామచంద్ర కుంతియాకు అవమానం జరిగిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తనకు జరిగిన అవమానంపై ఆయన కాంగ్రెస్ బస్సుయాత్ర కోఆర్డినేషన్ సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘నేను ఇన్చార్జ్గా ఉన్నా కదా. గులాం నబీకి స్వాగతం అంటూ సోషల్ మీడియాలో ఎలా పోస్ట్ చేస్తారు. అధిష్టానం నుంచి అధికార ప్రకటన రాకముందే ఇలా చేసి నన్ను అవమానించినట్టే. నేనే ఇన్చార్జ్గా ఉండాలని నాకేం లేదు. కానీ పార్టీ ప్రకటించిన తర్వాత ఏమైనా చేసుకోండి. అనవసరంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోవద్దో చెప్పాలని కుంతియా ఆగ్రహం చెందినట్లు తెలుస్తోంది.’ కాగా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోఅధికారం చేజిక్కించుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ అందుకు తగ్గ వ్యూహంతో ముందుకు వెళుతోంది. ప్రస్తుత ఇన్ఛార్జ్ కుంతియా సమర్థవంతంగా పని చేయడం లేదని భావించిన అధిష్టానం తాజాగా ఆజాద్ పేరును పరిశీలనకు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జిగా పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌ను నియమించనుందని తెలుస్తోంది. ఈ మేరకు త్వరలో అధికారిక ప్రకటన చేయనుంది. అయితే అధికారిక ప్రకటన రాకముందే తెలంగాణ కాంగ్రెస్ నేతలు పలువురు ఆజాద్ రాకను స్వాగతిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై కుంతియ కినుక వహించినట్లు సమాచారం. -
హైదరాబాద్‌లో సీమాంధ్రులకు టికెట్లు
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో సెటిలైన సీమాంధ్రులకు కూడా టికెట్లు ఇస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ అన్నారు. హైదరాబాద్, చుట్టుపక్కల నియోజకవర్గాల విషయంలో ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళుతున్నామని, ఈ సారి సెటిలర్లు కాంగ్రెస్ వైపే ఉంటారని నమ్ముతున్నట్లు చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో ఆయన చిట్‌చాట్ చేశారు. ‘‘హైదరాబాద్‌లోని సెటిలర్స్ నేతలతో మాట్లాడుతున్నాం. కొన్ని చోట్ల సీమాంధ్ర నేతలకు టికెట్లు ఇస్తాం. అధిష్టానం కూడా ఇందుకు ఓకే చెప్పింది. కాంగ్రెస్‌పై వారికి గతంలో ఉన్న కోపం లేదు కాబట్టి ఈసారి సెటిలర్స్ మావైపే ఉంటారు. పాతబస్తీలో ఎంఐఎంపై బలమైన అభ్యర్థులను నిలబెడతాం. ఎంఐఎంకు బీజేపీతో రహస్య ఒప్పందాలున్నాయి. కాబట్టే బలమైన మైనార్టీ నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేస్తాం. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ మా విజయాన్ని ఏ ఒక్కరూ అడ్డుకోలేరు’’ అని ఉత్తమ్ తెలిపారు. టీడీపీతో కాంగ్రెస్ పొత్తు..: మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కాంగ్రెస్-టీడీపీలు కలిసి పనిచేయబోతున్నాయన్న వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. నేటి విలేకరుల భేటీలోనూ పీసీసీ చీఫ్ ఉత్తమ్ అనుకూల వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘‘అవును. టీడీపీతో పొత్తు పెట్టుకోవద్దు అని ఎక్కడా లేదుగా! హైదరాబాద్‌లో కొన్ని చోట్ల టీడీపీకి ఓటు బ్యాంకు ఉంది. అయితే ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలా, వద్దా అనేది అధిష్టానమే నిర్ణయిస్తుంది. ఇకపోతే, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్లిన చాలా మంది నేతలు మళ్లీ వస్తామని చర్చలు జరుపుతున్నారు. కానీ దీనిపై పార్టీలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈసారీ టికెట్ ఇచ్చినవాడు యుద్ధం చేసేందుకు రెడీగా ఉండాలి. ఉత్తమ్ మనిషనో, ఇంకొకరి మనిషనో టికెట్లు ఇవ్వరు. భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ల పాదయాత్రల ఫలితాలు హైకమాండ్ విశ్లేషిస్తుంది’’ అని టీపీసీసీ చీఫ్ చెప్పారు. రాహుల్ అలా అనలేదు: దేశవ్యాప్తంగా 70 ఏళ్లు పైబడిన కాంగ్రెస్ నేతలంతా పదవుల నుంచి తప్పుకుంటుండంపై ఉత్తమ్ స్పందించారు. నిజానికి రాహుల్ గాంధీ సీనియర్లను తప్పుకోమనలేదని, యువతకు, కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని మాత్రమే సూచించారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి క్లియర్‌గా ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటిస్తున్నాం. క్లిష్టమైన స్థానాల్లో హైకమాండ్‌దే అంతిమ నిర్ణయం. కాంగ్రెస్‌లో నేతల మధ్య అభిప్రాయం భేదాలు చాలా సహజం. అయితే ఎన్నికల్లో అందరం ఒక్కటిగా పనిచేస్తాం’’ అని ఉత్తమ్ వివరించారు. -
నేటీ నుంటి టీకాంగ్రెస్ రెండో విడత బస్సు యాత్ర
-
కాంగ్రెస్‌లో నూతనోత్తేజం
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: టీపీసీసీ చేపట్టిన ప్రజాచైతన్య బస్సుయాత్ర కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో రెండురోజుల పాటు సాగిన ఈ యాత్ర నాలుగు చోట్ల బహిరంగసభలను నిర్వహించింది. తొలిరొజు బోధన్, నిజామాబాద్ నగరాల్లో నిర్వహించగా., సోమవారం నందిపేట్, భీంగల్‌లలో బహిరంగసభలు జరిగాయి. సభలను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సమీప ప్రాంతాల నుంచి జనసమీకరణ చేసింది. నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో ముగ్గురు, నలుగురు నాయకులు తమ ప్రాతినిధ్యాన్ని ప్రదర్శించేందుకు పోటీపడ్డారు. అంతర్గతంగా కుమ్ములాటలున్నప్పటికీ.. ఈ యాత్ర కోసం ఐక్యతారాగాన్ని ఆలపించారు. బస్సుయాత్ర సజావుగా సాగడంతో జిల్లా ముఖ్య నాయకత్వం ఊపిరి పీల్చుకుంది. రైతాంగ సమస్యలపై.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకే ఈ యాత్ర చేపట్టామని ప్రకటించిన రాష్ట్ర అధినాయకత్వం ఒకవైపు సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తూనే.. జిల్లా అంశాలను కూడా ప్రస్తావించారు. రెండో రోజు బస్సుయాత్ర సాగిన ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాలు వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు కావడంతో రైతాంగ సమస్యలపై దృష్టి సారించారు. పంట రుణ పరిమితి పెంపు, మద్దతు ధరలు వంటి అంశాలను నేతలు ప్రత్యేకించి ప్రస్తావించారు. కొన్ని నెలల క్రితం ఆర్మూర్ డిక్లరేషన్ పేరుతో ఆలూరులో రైతుసదస్సు నిర్వహించిన కాంగ్రెస్.. ఇప్పుడు ఈ బస్సుయాత్రలో కూడా రైతాంగ సమస్యలపై దృష్టి సారించింది. ప్రత్యేకంగా పార్టీ కిసాన్‌సెల్ రాష్ట్ర నాయకత్వం రైతుల అంశాన్ని ప్రస్తావించింది. ఆర్మూర్‌లో డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణం ప్రారంభానికే నోచుకోని అంశాన్ని లేవనెత్తారు. తొలిరోజు ఆదివారం బోధన్ చక్కెర కర్మాగారాన్ని ప్రారంభించాలనే ఎన్నికల హామీతో పాటు, మైనార్టీల సంక్షేమ అంశాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేసిన విషయం విదితమే. అంటీముట్టనట్టుగా మధుయాష్కి.. మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్ ఈ బస్సుయాత్రలో అంటీముట్టనట్టుగా వ్యవహరించడం పార్టీలో అంతర్గతంగా చర్చకు దారితీసింది. ఈ యాత్ర దాదాపు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే సాగడంతో నాలుగు బహిరంగసభల్లో ఆయన పాల్గొనే అవకాశాలున్నాయని భావించారు. ఒక్క నిజామాబాద్ అర్బన్‌లో సభకు మాత్రమే హాజరైన మధుయాష్కి, కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. మిగితా మూడు సభల్లో ఆయన కనిపించలేదు. రాహుల్‌గాంధీ విదేశీ పర్యటన ఏర్పాట్ల నిమిత్తం ఆయన మలేషియా వెళ్లడంతో ఈ సభలకు హాజరుకాలేక పోయారని ఆయన సన్నిహితవర్గాలు పేర్కొంటున్నాయి. -
మనస్పర్ధలు సర్దుకుంటాయ్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఏర్పడిన మనస్పర్ధలు త్వరలోనే సర్దుకుంటాయని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. కుటుంబ సభ్యుల మధ్య వచ్చే విభేదాల్లాంటివే ఇవికూడా.. వాటిని పైకి చెప్పనవసరంలేదని వ్యాఖ్యానిం చారు. ఢిల్లీలో మంగళవారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమైన ఆయన తెలుగు రాష్ట్రాల్లోని తాజా పరిస్థితులపై నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై దృష్టిసారించామని త్వరలోనే అన్నీ పరిష్కారమవుతాయని చెప్పారు. రాజ్భవన్లను ప్రజలకు మరింత చేరువ చేయడంపై హోం శాఖకు పలు సూచనలు చేసినట్టు తెలిపారు. గవర్నర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న కాంగ్రెస్ నేతల ఆరోపణలపై విలేకరులు ప్రశ్నించగా.. అపార్థాలతో బంధాలను విడగొట్టుకోలేమన్నారు. ప్రధాని మోదీతో గవర్నర్ భేటీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయానికి 24 గంటల విద్యుత్, భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి గవర్నర్ తీసుకెళ్లారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలో ప్రధానితో అరగంటసేపు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల్లోని పరిస్థితులను ప్రధానికి వివరించినట్లు తెలిసింది. కేంద్రం ఇచ్చిన అనుమతులతో తెలంగాణలో కాళేశ్వరం, ఏపీలో పోలవరం ప్రాజెక్టుల పనులు వేగంగా సాగుతున్నాయని వివరించారు. రెండు రాష్ట్రాల్లోనూ శాంతిభద్రతల పరంగా ఎలాంటి సమస్యలు లేవని నివేదించారు. -
ఆశావాహులకు రాహుల్ షాక్
న్యూఢిల్లీ : పీసీసీ పీఠంపై ఆశలు పెంచుకున్న ఆశావాహులకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ షాక్ ఇచ్చారు. అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ప్రాంతీయ కమిటీలను యథాతథంగా కొనసాగించాలని ఆయన శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని దక్కించుకొనేందుకుగాను కొంతకాలంగా పార్టీ సీనియర్లు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ పిసీసీ పీఠం కోసం తెలంగాణలో ఉత్తమ్ కుమార్ స్థానంలో తమకు అవకాశం కల్పించాలని, అలా అయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తామని బహిరంగంగానే ప్రకటనలు చేశారు. ఈ మేరకు హైకమాండ్‌కు విజ్ఞప్తులు కూడా చేశారు. అయితే రాహుల్ తాజా నిర్ణయం వారికి నిరాశ కలిగించిందనే చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ ఆయా కమిటీలే కొనసాగనున్నాయి. -
కాంగ్రెస్ నుంచి 30 మంది సీనియర్లు ఔట్?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దాదాపు 30 మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు ఈ సారి టికెట్లు గల్లంతయ్యే అవకాశాలున్నాయి. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఇతర కీలక నేతలు కూడా ఈ జాబితాలో ఉన్నారని టీపీసీసీ ముఖ్యనేతలు చెబుతున్నారు. ఏఐసీసీ అధినేతగా రాహుల్ గాంధీ బాధ్యతలు తీసుకుని, పూర్తిస్థాయి పనులు ప్రారంభించిన తర్వాత తెలంగాణలో కీలకమార్పులు, పార్టీలో అంతర్గత సంస్కరణలు జరుగుతాయని వారంటున్నారు. పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగే సాధారణ ఎన్నికలు కాంగ్రెస్‌కే కాకుండా, ఆయనకు వ్యక్తిగతంగా అత్యంత ప్రతిష్టాత్మకం అవుతాయంటున్నారు. రాహుల్ గాంధీ రాజకీయ మనుగడకు పరీక్ష పెట్టబోయే వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రతీ ఎంపీ, అసెంబ్లీ అభ్యర్థి టికెట్‌పై ఆచితూచి నిర్ణయం తీసుకోనున్నారని చెబుతున్నారు. ‘రానున్న ఎన్నికల్లో టికెట్ల పంపిణీ, అభ్యర్థుల స్క్రీనింగ్ ఆషామాషీగా ఉండే అవకాశం లేదు. పార్టీలో సీనియర్లు అనే కోణంలో మాత్రమే టికెట్లు వచ్చే అవకాశాల్లేవు. అభ్యర్థి గెలుపోటములు, పనితీరు, వ్యక్తిగత చరిత్రపై ఆధారపడి టికెట్లు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కేటాయింపు అనేది ఎప్పుడైనా అధిష్టానం పరిధిలోని అంశమే. టీపీసీసీ నుంచి కేవలం ప్రతిపాదనలు, అభిప్రాయాలను మాత్రమే తీసుకుంటారనేది అందరికీ తెలిసిందే. అయితే ఈ సారి టీపీసీసీ నుంచి వచ్చే ప్రతిపాదనలను కూడా అత్యంత జాగ్రత్తతో పంపించాల్సి ఉంటుంది’ అని పీసీసీ ముఖ్యనాయకుడొకరు వెల్లడించారు. సీనియర్ అయితే సరిపోదు.. పార్టీలో సీనియర్.. అనే అర్హత ఒక్కటే వచ్చే ఎన్నికల్లో సరిపోదంటున్నారు. వరుసగా మూడుసార్లు ఓడిపోయిన నాయకునికి టికెట్ ఇచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. టికెట్ల ఎంపికకోసం అభ్యర్థుల జాబితాను పంపేటప్పుడు పాటించాల్సిన నిబంధనలను త్వరలోనే అధిష్టానం నుంచి వస్తాయని తెలుస్తోంది. మూడుసార్లు ఓడిపోయినవారికి టికెట్‌ను నిష్కర్షగా తిరస్కరించాలనేది ఇందులో ప్రధానమైనదని ఆ నాయకుడు వెల్లడించారు. 2014 ఎన్నికల్లో 30 వేల ఓట్ల తేడాతో ఓడిపోయినవారికి కూడా టికెట్ గల్లంతయ్యే అవకాశముందని ఆయన వివరించారు. వరుసగా మూడుసార్లు అవకాశం ఇచ్చినా గెలవని అభ్యర్థి, ఇక వచ్చే ఎన్నికల్లోనూ గెలిచే అవకాశం ఉండదనే అంచనాతోనే కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో 30 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన అభ్యర్థి వచ్చే ఎన్నికల నాటికి ఈ తేడాను అధిగమించి, గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయనే అంచనాతో పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది. డీసీసీ అధ్యక్షులకూ...? అలాగే డీసీసీ అధ్యక్షులుగా పనిచేస్తున్నవారు కూడా టికెట్లు అడగకూడదని ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం చాలా స్పష్టంగా సూచనలు చేసింది. అయితే ఈ నిబంధన వల్ల డీసీసీ అధ్యక్షులుగా పనిచేయడానికి చాలామంది నాయకులు విముఖంగా ఉన్నారని, డీసీసీ అధ్యక్షులుగా ఉండటం వల్లనే టికెట్లు నిరాకరిస్తే ఇబ్బంది అవుతుందని అధిష్టానానికి టీపీసీసీ వివరించింది. దీనిపై అధిష్టానం నుంచి ఇంకా ఎలాంటి సమాధానం రాలేదని తెలుస్తోంది. మరో పక్క డీసీసీ అధ్యక్షులకు కూడా టికెట్లు వస్తాయని, ఆ పదవి టికెట్‌కు అనర్హత కాకుండా చూస్తామని టీపీసీసీ అధ్యక్షుడు భరోసా ఇస్తున్నారు. అయితే పార్టీ అభివృద్ధికోసం జిల్లా అంతా సమన్వయం చేయడానికి డీసీసీ అధ్యక్షుడు పనిచేయాలని, టికెట్లు ఇస్తే డీసీసీ అధ్యక్షుడు కూడా తన నియోజకవర్గానికే పరిమితమైన అనుభవాలు ఉన్నాయని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. నిబంధనల గురించి ఇప్పటికే టీపీసీసీకి ఢిల్లీ వర్గాలనుంచి మౌఖికంగా సమాచారం అందినట్టు తెలుస్తోంది. -
తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ మార్పులు..?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సంస్థాగతంగా భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయా? తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశలో పీసీసీకి అనుబంధంగా లేదా సమాంతరంగా మరిన్ని కమిటీలు ఏర్పాటు కానున్నాయా? పార్టీ సీనియర్లు, సామాజిక సమతుల్యత వంటివాటికి ప్రాధాన్యత ఇవ్వనుందా? ఇలాంటి ప్రశ్నలకు సీనియర్ నేతలు అవుననే సమాధానం ఇస్తున్నారు. పార్టీలో నాయకత్వ సమస్యను పరిష్కరించడానికి పలు మార్పులూ చేర్పులను చేపట్టనున్నట్టుగా కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. ఏఐసీసీ అధ్యక్షునిగా రాహుల్ గాంధీ బాధ్యతలను తీసుకున్న తర్వాత రాష్ట్ర కాంగ్రెస్‌లోని సమస్యలను పరిష్కరించడానికి, పార్టీ సీనియర్లను ఏకతాటిపైకి తీసుకురావడానికి కీలకమైన చర్యలను తీసుకుంటారని చెబుతున్నారు. ఇందుకోసం పార్టీలో కొంత పేరు, పని చేయగలిగే సత్తా ఉన్న వారికి తగిన బాధ్యతలను అప్పగించాలనే ఏఐసీసీ స్థాయి లో స్థూలంగా నిర్ణయాలు జరిగాయని పార్టీ జాతీయ స్థాయిలో కీలకపాత్ర పోషిస్తున్న నేత ఒకరు వెల్లడించారు. సీడబ్ల్యూసీలోకి కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డిని తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. పొన్నాల, సర్వేలకూ అవకాశం.. కేంద్ర మంత్రిగా పలు కీలకమైన శాఖలకు పని చేసిన జైపాల్‌రెడ్డి సేవలను జాతీయ స్థాయిలో వినియోగించుకోవాలనే యోచనలో రాహుల్ గాంధీ ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే సీనియర్లు పొన్నాల లక్ష్మయ్య, సర్వే సత్యనారాయణ వంటివారికి కూడా జాతీయ స్థాయిలోనే అవకాశం కల్పిస్తారని సమాచారం. ఇప్పటికే వి.హన్మంతరావు, మధు యాష్కీ, చిన్నారెడ్డి వంటివారికి ఏఐసీసీలో బాధ్యతలున్నాయి. వీరితోపాటు మరో ఇద్దరు, ముగ్గురికి ఏఐసీసీలో అవకాశాలు వస్తాయని తెలుస్తోంది. అలాగే రాష్ట్రస్థాయిలో మరికొందరు ముఖ్యనేతలకు అవకాశాలు కల్పించనున్నట్టుగా తెలుస్తోంది. కోమటిరెడ్డి బ్రదర్స్‌లో ఒకరికి కీలక అవకాశం కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న సినీ నటి, మాజీ ఎంపీ ఎం.విజయశాంతికి పార్టీలో తగిన వేదికను కల్పించాలనే ప్రతిపాదన ఏఐసీసీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు పార్టీలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కోమటిరెడ్డి సోదరుల్లో ఒకరికి కీలకమైన అవకాశాలను కల్పించాలనే యోచన ఏఐసీసీకి ఉన్నట్టు సమాచారం. వీరికి తగిన అవకాశాలను కల్పించే ప్రతిపాదనపై విజయశాంతి, కోమటిరెడ్డి సోదరులతోనూ ఏఐసీసీ ముఖ్యులు ప్రాథమికంగా చర్చలను పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డికి పీసీసీలో కీలక అవకాశాన్ని కల్పిస్తారని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరణ పూర్తిచేసి, ఎన్నికలకు పీసీసీని సన్నద్ధం చేసే ప్రక్రియ త్వరలోనే జరుగుతుందని ఏఐసీసీ నేతలు చెబుతున్నారు. కొత్తగా మరో కమిటీ..! ఇప్పటికే టీపీసీసీ సమన్వయ కమిటీ ఉంది. దీన్ని పునర్వ్యవస్థీకరించే యోచనలో ఏఐసీసీ ఉంది. సమన్వయ కమిటీలో సత్తా లేని వారిని తొలగించి, పని చేయగలిగే శక్తి ఉన్న నేతలకు అవకాశం కల్పించనున్నారు. పీసీసీకి కీలకమైన రాజకీయ అంశాల్లో తోడ్పాటు అందించేలా, పార్టీ సీనియర్ల ప్రతిపాదనలకు తగిన ప్రాధాన్యం ఇచ్చేలా ఒక కమిటీని ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్లు సమాచారం. ఎన్నికల సమయంలో పీసీసీ ఎన్నికల కమిటీ ఉంటుందని, అంతకుముందు పార్టీ నేతల అభిప్రాయాలకు తగిన వేదిక ఉండాలనే యోచనలో ఏఐసీసీ ఉన్నట్టుగా తెలుస్తోంది. -
కాంగ్రెస్‌లోకి వారి చేరికను స్వాగతిస్తాం..
సాక్షి, నిజామాబాద్ : టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, టీజేఏసీ చైర్మన్ కోదండరాంలు కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతున్న తరుణంలోనే ఆ పార్టీ సీనియర్ నాయకుడు, శాసనమండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి కొత్త రక్తం వస్తే తప్పులేదని, వచ్చేవారిని స్వాగతిస్తామని అన్నారు. అయితే, ఎవరు కాంగ్రెస్‌లో చేరాలన్నా హైకమాండ్ ఆదేశానుసారంగా జరుగుతుందని, కోదండరాం వస్తానంటే అధిష్టానమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. నిజామాబాద్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అవినీతి ఆరోపణలపై సీఎం నోరువిప్పరా? : ‘‘అధికార పార్టీకి చెందిన నేతలు విచ్చలవిడిగా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. ఏకంగా స్పీకర్ మధుసూదనాచారి, ఇంకొందరు ఎమ్మెల్యేలలపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. మరి అవినీతి చేస్తే చెప్పుతో కొట్టండని జనానికి పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి ఈ విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు?’’ అని షబ్బీర్ ప్రశ్నించారు. గాడి తప్పిన పాలన : మిషన్ భగిరథ పథకంలో బాగంగా ఇంటింటికి నీళ్లు ఎప్పుడు ఇస్తారనేదానిపై సంబంధిత అదికారులకే స్పష్టత లేదని, అన్ని జిల్లాలోనూ పరిపాలన గాడి తప్పిందని షబ్బీర్ అన్నారు. సోంత పార్టీ నేతలే పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నా సీఎం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. గుజరాత్‌లోనూ గుర్దాస్పూర్ ఫలితమే : మరికొద్ది రోజుల్లో జరుగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చావుదెబ్బ తప్పదని షబ్బీర్ అలీ అన్నారు. నాందేడ్ కార్పోరేషన్, గురుదాస్ పూర్, కేరళ ఉప ఏన్నికల్లో వచ్చిన ఫలితాలే గుజరాత్‌లోనూ పునరావృతం అవుతాయని జోస్యం చెప్పారు. -
టీడీపీకి భారీ షాక్ : కాంగ్రెస్ గూటికి రేవంత్‌రెడ్డి!
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనున్నట్లు సమాచారం. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కొడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి పార్టీని వీడనున్నట్లు తెలిసింది. అధికార టీఆర్ఎస్తో టీటీడీపీ పొత్తు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న రేవంత్.. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధపడ్డారు. గడిచిన కొద్ది గంటలుగా ఢిల్లీలోనే మకాం వేసిన ఆయన.. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో చర్చలు జరుపుతున్నారని, రెండు మూడు రోజుల్లోనే చేరికకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే దీనిపై అటు కాంగ్రెస్‌కానీ, ఇటు రేవంత్‌గానీ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు. రాహుల్ గాంధీతో భేటీ! : ఢిల్లీలో ఉన్న రేవంత్‌రెడ్డి మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలుసుకున్నట్లు వార్తలు వచ్చాయి. నవంబర్ 9న హైదరాబాద్‌లో జరిగే బహిరంగ సభలో రాహుల్ సమక్షంలోనే రేవంత్ కాంగ్రెస్‌లోకి అధికారికంగా చేరతారని తెలుస్తోంది. ‘టీఆర్ఎస్తో పొత్తు’తో టీడీపీలో చిచ్చు : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో గణనీయమైన స్థానాలను కైవసం చేసుకున్న తెలుగుదేశం పార్టీ.. ఆ తర్వాత ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలను కోల్పోయింది. అధికార టీఆర్ఎస్లోకి ఫిరాయింపుల పర్వం మొదలైనప్పుడు, టీడీపీ పరువు కాపాడుకునేందుకు చంద్రబాబు ఆధ్వర్యంలో ఓటుకు కోట్లు కుట్రను అమలుచేయడం, అదికాస్తా బట్టబయలు కావడం, ఆ తర్వాత మిగిలిన టీడీపీ నేతలంతా టీఆర్ఎస్లోకి చేరడం.. తదితర పరిణామాలు తెలిసినవే. అయితే మొదటి నుంచి టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాడుతున్న రేవంత్‌రెడ్డి.. చివరినిమిషం దాకా అదేబాటను అట్టిపెట్టుకున్నారు. ఓటుకు నోట్లు కేసులో ఆయన జైలుకు కూడా వెళ్లొచ్చారు. ఏ చంద్రబాబు కోసమైతే తన రాజకీయ జీవితాన్ని త్యాగం చేసేందుకు రేవంత్ సిద్ధపడ్డరో.. అదే చంద్రబాబు ఇప్పుడు కేసీఆర్‌తో పొత్తుపెట్టుకోవడానికి సిద్ధం కావడం మిగుండు పడని విషయంలా మారింది. అందుకే రేవంత్ కాంగ్రెస్‌లోకి చేరి, టీఆర్ఎస్పై పోరాటాన్ని కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. -
‘మా పార్టీలో ఆయన మాటే ఫైనల్’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటే తుది నిర్ణయమని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఆర్సీ కుంతియా స్పష్టం చేశారు. ఆయన సోమవారం మీడియా చిట్ చాట్ లో ..2019 వరకూ ఉత్తమ్ కుమార్ రెడ్డే తమ కెప్టెన్ అని తెలిపారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించారు. పార్టీ కట్టు దాటితే..ఎంతటి నేత అయినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉత్తమ్ పనితీరు పట్ల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంతృప్తిగా ఉన్నారని కుంతియా పేర్కొన్నారు. పొత్తులపై హైకమాండ్‌దే తుది నిర్ణయం అని వివరించారు. ఎవరితో కలవాలి..ఎప్పుడు కలవాలన్నది అధిష్టానం నిర్ణయిస్తుందని, పొత్తులపై పీసీసీ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని తెలిపారు. తన నుంచి, పీసీసీ వరకూ ఏ పదవుల్లోనూ మార్పులు ఉండవన్నారు. ప్రజలు తమవైపు చూస్తున్నారనడానికి సంగారెడ్డి సభే నిదర్శనం అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ప్రతిమండలానికి వెళతామని, అన్నీ స్థాయిల్లో నేతల మధ్య విబేధాలు పరిష్కరిస్తామని తెలిపారు. రాహుల్ సందేశ్ యాత్రలు ఎన్నికల వరకు కొనసాగిస్తామన్నారు. తన నుంచి పీసీసీ వరకూ ఏ పదవుల్లోనూ మార్పులు ఉండవన్నారు. పార్టీలో ఎవరినీ విస్మరించబోమని కుంతియ తెలిపారు. వ్యక్తులపై కాదని, పాలసీలపై తమ పోరాటమన్నారు. జైరాం రమేష్, మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమన్నారు. ఓటమి చెందిన చోట రాహుల్‌ను తప్పుబడుతున్నవారు... గెలిచిన చోట ఆయనకు క్రెడిట్ ఇవ్వాలి కదా అని అన్నారు. 2014లో కాంగ్రెస్ నుంచి కేసీఆ అధికారాన్ని లాక్కున్నారని కుంతియా విమర్శించారు. కేసీఆర్, ఆయన కుటుంబం తప్ప తెలంగాణలో ఎవరికీ లబ్ధి జరగడం లేదని ఆయన దుయ్యబట్టారు.