'కాంగ్రెస్ చేసిన పనులకు మోడీ రిబ్బన్ కటింగ్‌' | Narendra modi ribbon cutting to congress programmes | Sakshi
Sakshi News home page

'కాంగ్రెస్ చేసిన పనులకు మోడీ రిబ్బన్ కటింగ్‌'

Published Sun, Aug 24 2014 2:37 PM | Last Updated on Tue, Aug 14 2018 3:55 PM

'కాంగ్రెస్ చేసిన పనులకు మోడీ రిబ్బన్ కటింగ్‌' - Sakshi

'కాంగ్రెస్ చేసిన పనులకు మోడీ రిబ్బన్ కటింగ్‌'

ఇబ్రహీంపట్నం: సోషల్‌ మీడియాను బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకుంటుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. తప్పుడు పోస్ట్‌లతో మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలని బీజేపీ ప్రయత్నం చేసిందని ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయామని వాపోయారు. పనులు చేయడం.. ప్రచారం చేసుకోకపోవడం కాంగ్రెస్ బలహీనత అని, ఆ లోపం వల్లే కాంగ్రెస్ ఓటమిపాలయిందన్నారు.

మోడీ స్పీచ్‌లు బాగా ఇస్తారని, తప్పుడు హామీలివ్వడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. తాము చేసిన పనులకు మోడీ రిబ్బన్ కటింగ్‌ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్దార్ పటేల్‌, జవహర్లాల్ నెహ్రూలు సోదరభావంతో ఉండేవారని గుర్తు చేశారు. కొన్ని రాజకీయ శక్తులు సర్దార్ పటేల్ కంటే నెహ్రూను తక్కువ చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ సహించదని స్పష్టం చేశారు. ప్రజలు కాంగ్రెస్‌ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని, ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ సదస్సులో అన్నారు. ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ కార్యకర్తలకు దిగ్విజయ్‌ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement