Ibrahimpatnam
-
హయత్ నగర్ పీఎస్ కానిస్టేబుల్ నాగమణి హత్య
-
లేడీ కానిస్టేబుల్ హత్యలో ట్విస్ట్.. వెలుగులోకి కొత్త కోణం
సాక్షి,రంగారెడ్డిజిల్లా: ఇబ్రహీంపట్నంలో లేడీ కానిస్టేబుల్ హత్య సంచలనం రేపింది. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగమణిని సొంత తమ్ముడే హత్య చేశాడు. ఇది పరువు హత్య అని తొలుత భావించినప్పటికీ పోలీసుల ప్రాథమిక విచారణలో ఆస్తి గొడవలే హత్యకు కారణమని తెలుస్తోంది. రాయపోల్‌కు చెందిన శ్రీకాంత్,నాగమణిలు నవంబర్ ఒకటో తేదీన యాదగిరిగుట్టలో ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం హయత్‌నగర్‌లో నాగమణి, శ్రీకాంత్ నివాసం ఉంటున్నారు. నిన్న సెలవు కావడంతో నాగమణి తన సొంత గ్రామానికి వెళ్ళింది.నాగమణి స్కూటీపై డ్యూటీకి వెళుతుండగా వెంబడించిన తమ్ముడు పరమేష్ తొలుత ఆమెను కారుతో ఢీకొట్టి అనంతరం కొడవలితో మెడ నరికి చంపాడు.హత్య చేసిన పరమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసులో ట్విస్ట్.. వెలుగులోకి అసలు నిజాలుఆస్తి కోసమే అక్క నాగమణిని తమ్ముడు పరమేష్ చంపినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నాగమణికి తల్లిదండ్రులు లేకపోవడంతో అన్నీ తానే చూసుకున్నాడు పరమేష్. కాగా నాగమణికి ఇదివరకే వివాహమై విడాకులు కూడా అయ్యాయి. తమ వారసత్వ భూమిని మొదటి వివాహం తర్వాత నాగమణి తమ్ముడికి ఇచ్చేసింది.రెండవ భర్త శ్రీకాంత్‌ను ఇటీవలే కులాంతర వివాహం చేసుకున్న నాగమణి భూమిలో తనకు వాటా ఇవ్వాలని తమ్ముడిని మళ్లీ ఒత్తిడి చేసినట్లు తెలిసింది. దీంతో ఆగ్రహించిన పరమేష్ నాగమణి స్కూటీపై వెళుతుండగా కారుతో ఢీకొట్టి అనంతరం కొడవలితో నరికి చంపాడు. ఇదీ చదవండి: ఎస్సై ఆత్మహత్య.. ప్రేమ వ్యవహారమే కారణం..? -
డబ్బు కోసమే కిడ్నాప్
ఇబ్రహీంపట్నం రూరల్: వ్యాపారిని కిడ్నాప్ చేసి..కణతకు గన్ గురిపెట్టి బెదిరించిన కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు మహేశ్వరం జోన్ డీసీపీ సునీతారెడ్డి శుక్రవారం మీడియాకు వెల్లడించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నం చెందిన రచ్చ నారాయణ (71) వివిధ వ్యాపారాలు చేస్తుంటాడు. ఇతని వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నాయని గుర్తించిన చర్లపటేల్‌గూడ గ్రామానికి చెందిన కొరవి ధన్‌రాజ్ అలియాస్ అర్జున్..నారాయణ వద్ద డబ్బు కొట్టేయాలని పథకం పన్నాడు. ఇందులో భాగంగా నారాయణ పేరుతో హయత్‌నగర్‌లో రెండు రూ.100 బాండ్ పేపర్లు కొనుగోలు చేశాడు. అనంతరం కిడ్నాప్, బెదిరింపు స్కెచ్ వేశాడు. ఈ విషయాన్ని తన మేనల్లుడు శివకుమార్, స్నేహితులు శ్రీకాంత్, శేఖర్‌కు విషయం చెప్పాడు. వారు అంగీకరించడంతో ప్లాన్ అమలు చేశారు. మహిళతో ఫోన్ చేయించి.. నారాయణను కిడ్నాప్ చేసే వ్యూహంలో భాగంగా..నగరంలోని మౌలాలికి చెందిన మక్కల భవానీకి డబ్బు ఆశ చూపారు. నారాయణకు ఫోన్ చేయించి మాయమాటలతో హనీ ట్రాప్ చేశారు. ఈ నెల 21న బొంగ్లూర్ వద్దకు పిలిపించారు. అప్పటికే ఆన్లైన్లో కొనుగోలు చేసిన పోలీస్ యూనిఫామ్ ధరించిన ధన్‌రాజ్ తాను ఎస్ఐ అని చెప్పి శివకుమార్, శ్రీకాంత్, శేఖర్ తనకు గన్మెన్లు అని చెప్పాడు. అనంతరం నారాయణతో పాటు అతని డ్రైవర్ ముజీబ్‌ను కారులో ఎక్కించి, ముఖాలకు నల్లటి ముసుగు వేసి కిడ్నాప్ చేశారు. వీరిని ఆదిబట్ల మున్సిపాలిటీ సమీపంలోని జేబీ గ్రీన్ వెంచర్ వద్దకు తీసుకెళ్లి గదిలో పెట్టారు. నీవు అమ్మాయిలతో కలిసి ఉన్న ఫొటోలు మా వద్ద ఉన్నాయని బెదిరించారు. పోలీస్ డ్రస్సులో ఉన్న ధన్‌రాజ్ డమ్మీ గన్ తీసి నారాయణ కణతకు పెట్టి రూ.3 కోట్లు ఇవ్వాలని బెదిరించాడు. అంత డబ్బు లేదని చెప్పడంతో రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు రెండు రోజుల్లో రూ.20 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుని..ముందుగానే తెచి్చన 100 రూపాయల బాండ్ పేపర్లపై సంతకాలు, వేలిముద్రలు పెట్టించుకున్నారు. విషయం బయటకు చెబితే చంపేస్తామని కత్తులతో హెచ్చరించారు. అనంతరం ఏవీసీ టౌన్ షిప్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. ఐదుగురు నిందితుల రిమాండ్.. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి డమ్మీ పిస్టల్, పోలీసు యూనిఫామ్, బూట్లు, కత్తులను స్వా«దీనం చేసుకున్నారు. వీరిలో «ఏ–1 నిందితుడు ధన్‌రాజ్ ఎంబీబీఎస్ మధ్యలో ఆపేశాడు. అనంతరం పలు ప్రైవేటు అస్పత్రుల్లో పనిచేశాడు. విలువిద్యలో గోల్డ్ మెడల్ సాధించాడు. వలవోజు శివకుమార్, డేరంగుల శ్రీకాంత్, సుర్వి శేఖర్, మక్కల భవానీని సైతం రిమాండ్‌కు తరలించారు. ఏసీపీ కేపీవీ రాజు పర్యవేక్షణలో చాకచక్యంగా కేసును ఛేదించిన సీఐ రాఘవేందర్‌రెడ్డి, ఎస్ఐలు రాజు, వెంకటేశ్, హెడ్ కానిస్టేబుల్ గిరి, రవీందర్, ఉపేందర్‌రెడ్డి, సందీప్, కృష్ణ, సంతోష్, శివచంద్ర, బి.రాజును డీసీపీ సునీతారెడ్డి అభినందించారు. -
HYD: బిడ్డలతో కలిసి తల్లి ఆత్మహత్య.. కారణమేంటి?
సాక్షి, ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలో తల్లి, కుమారుడి మృతదేహాలు లభించగా.. పాప డెడ్‌బాడీ కోసం గాలిస్తున్నారు.వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నంలో తల్లి మంగ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఈరోజు సాయంత్రం 7 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకుంది. పిల్లలతో కలిసి సమీపంలో ఉన్న చెరువులో దూకింది. అది గమనించిన స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ సఫలం కాలేదు. ఈ క్రమంలో వారు ముగ్గురు చనిపోయారు. అనంతరం, వారి మృతదేహాల కోసం గాలించగా తల్లి మంగ, కుమారుడి మృతదేహాలు లభించాయి. పాప డెడ్‌బాడీ ఇంకా లభ్యం కాలేదు. పాప మృతదేహాం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.ఇదిలా ఉండగా.. మంగ మరో కుమారుడిని ఆమె ఇంటి వద్దనే వదిలి వెళ్లింది. ఇక, ఆత్మహత్య సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకుంటున్నారు. -
ప్రాణాలు తీస్తున్న వీధికుక్కలు
ఇబ్రహీంపట్నం/ మణికొండ/ ఎంజీఎం (వరంగల్): రాష్ట్రంలో వీధి కుక్కల దాడి ఘటనలు మరింతగా పెరుగుతున్నా యి. అభంశుభం ఎరుగని చిన్నారులపై దాడి చేస్తున్న వీధి కుక్కలు ‘విధి’రాత మార్చేస్తున్నాయి. పిల్లలను పొట్టనపెట్టు కుంటున్నాయి. శుక్రవారం ఒక్కరోజే జరిగిన మూడు ఘట నలు భయాందోళన రేపుతున్నాయి. శునకాల దాడిలో గాయపడిన ఓ చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందితే.. మరో ఘటనలో దివ్యాంగ బాలుడిపై వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. మరోచోట శిశువు మృతదేహాన్ని కుక్క పీక్కుతినడం కలకలం రేపింది.నాలుగేళ్ల చిన్నారి మృతిరంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని రాయపోల్‌లో గత నెల 12న స్కూల్ బయట వీధికుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డ నాలుగేళ్ల చిన్నారి క్రియాన్‡్ష.. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ముక్కుపచ్చలారని తమ కుమా రుడిని కుక్కలు పొట్టనపెట్టుకున్నాయంటూ తల్లిదండ్రులు ఉడుగుల మాధురి, శివగౌడ్ దంపతులు రోదించడం అందరినీ కంటతడి పెట్టించింది.శుక్రవారం గ్రామంలో నిర్వ హించిన బాలుడి అంత్యక్రియలకు ఊరంతా తరలివచ్చింది.దివ్యాంగ బాలుడిపై దాడిహైదరాబాద్ శివార్లలోని నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని సబితానగర్‌లో ఉంటున్న నర్సింహ, అంజమ్మల కుమా రుడు భరత్ (7). అతను దివ్యాంగుడు. తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్తే ఇంట్లోనే ఉంటాడు. శుక్రవారం అలా ఇంటి వద్దే ఉన్న భరత్.. బహిర్భూమికి వెళ్లి, గుడిసెలోకి వచ్చాడు. వెనకాలే వచ్చిన ఓ వీధికుక్క బాలుడిపై దాడి చేసింది. జననాంగంపై కరిచింది. బాలుడి చేతులు పనిచేయక పోవటం, చిన్న గుడిసె కావడంతో తప్పించుకోలేక పోయాడు. గట్టిగా అరుస్తూ, ఏడవటంతో చుట్టుపక్కల వారు వచ్చి కుక్కను తరిమేశారు. నార్సింగిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాలుడికి శస్త్రచికిత్స చేయాలని, రూ.40 వేలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారని.. తమను ఆదుకోవాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. కాగా.. ఈ ఘటనతో స్పందించిన నార్సింగి మున్సిపాలిటీ సిబ్బంది.. శుక్రవారం కాలనీలోని కుక్కలను పట్టుకుని, అక్కడి నుంచి తరలించారు.ఎంజీఎంలో పసికందు మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్క!వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో నిత్యం రద్దీగా ఉండే క్యాజువాలిటీ ప్రాంతం వద్ద ఓ పసికందు మృతదేహాన్ని కుక్క పీక్కుతింది. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో దీన్ని గమనించిన ఓ కానిస్టేబుల్ కుక్కను తరిమివేసి ఆస్పత్రి అధికారులకు సమాచారమిచ్చారు. అప్పటికే శిశువు ఎవరనేది గుర్తించలేనంతగా కుక్క కొరికేసింది. మృతదేహాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు.. ఆడ శిశువుగా గుర్తించారు. రెండు, మూడు రోజుల క్రితమే చనిపోయి ఉంటే కుళ్లిన వాసన వస్తుందని, మృతదేహం నుంచి ఎలాంటి దుర్వాసన రాకపోవడంతో శుక్రవారమే చనిపోయి ఉంటుందని భావిస్తున్నారు.సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో..ఆ పసికందు ఎవరు? ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శిశువులదా? బయటినుంచి తీసుకువచ్చిందా? శిశువు బతికి ఉండగా కుక్కల బారిన పడిందా? ఎవరైనా శిశువు చనిపోతే ఆస్పత్రిలో వదిలేసి వెళ్లిపోయారా? అనే సందేహాలతో కలకలం చెలరేగింది. అక్కడ సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో.. పసికందును కుక్క ఎక్కడి నుంచి తీసుకువచ్చిందో తెలుసుకోవడం కష్టంగా మారింది. అయితే.. ఎంజీఎం ఆస్పత్రిలోని నవజాత శిశు కేంద్రంలో శుక్రవారం చిన్నారులెవరూ మృతి చెందలేదని.. పసికందు మృతదేహం ఎంజీఎం ఆస్పత్రికి సంబంధించినది కాదని సూపరింటెండెంట్ మురళి చెప్పారు. శనివారం పాప మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తామని, వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. -
భూకబ్జా కేసులో కన్నారావు అరెస్టు
ఇబ్రహీంపట్నం రూరల్: భూకబ్జా వవహారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్న కుమారుడు తేజేశ్వర్రావు అలియాస్ కన్నారావును మంగళవారం రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీసులు అరెస్టు చేశారు. మన్నెగూడలో రెండు ఎకరాల స్థలం సెటిల్మెంట్ వ్యవహారంలో మార్చి 3న కన్నారావుపై ఆదిబట్ల పోలీసులు కేసు (క్రైం నంబరు 123/2024) నమోదు చేశారు. మన్నెగూడకు చెందిన జక్కిడి సురేందర్‌రెడ్డి అవసరం నిమిత్తం చావ సురేష్ వద్ద రూ.50 లక్షలు తీసుకున్నాడు. ఇందుకోసం తన భూమిని ఏజీపీఏ చేశాడు. చావ సురేష్ సేల్‌డీడ్ చేసుకొని ఓఎస్ఆర్ కంపెనీ పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు. ఎలాగైనా భూమిని చావ సురేష్ కు దక్కకుండా చూడాలని జక్కిడి సురేందర్‌రెడ్డి అతని బంధువుల ద్వారా కన్నారావును ఆశ్రయించాడు. దీంతో రూ. 3 కోట్లు ఇస్తే సెటిల్ చేస్తానని కన్నారావు చెప్పడంతో రూ. 2.30 కోట్లను సురేందర్‌రెడ్డి కన్నారావుకు ఇచ్చాడు. రోజులు గడిచినా ఆయన ఎలాంటి పని చేయకపోవడం, ఓఎస్ఆర్ కంపెనీ యాజమాన్యం స్థలం చుట్టూ ప్రహరీ నిర్మాణం చేపట్టి హద్దులు పెట్టుకోవడంతో ఇదేమిటని సురేందర్‌రెడ్డి కన్నారావును ప్రశ్నించాడు. దీంతో మార్చి 3న కన్నారావు మనుషులు వచ్చి ఆ భూమిని కబ్జా చేసి అందులోని సామగ్రి ధ్వంసం చేశారు. దీనిపై అదే రోజు ఆదిబట్ల పోలీసులకు ఓఎస్ఆర్ కంపెనీ యజమాని ఫిర్యాదు చేయడంతో కన్నారావుతోపాటు 38 మందిపై కేసులు నమోదయ్యాయి. వారిలో పది మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బెయిల్‌కు ప్రయత్నిస్తూ పట్టుబడి.. తనపై కేసు నమోదైనప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా బెంగళూరు, ఢిల్లీలో తలదాచుకున్న కన్నారావు.. తనపై కేసును తొలగించాలంటూ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌ను కోర్టు కోట్టేయడంతో బెయిల్ కోసం మరో పిటిషన్ వేశాడు. దాన్ని కూడా న్యాయస్థానం కొట్టేయడంతో హైదరాబాద్ మాదాపూర్‌లోని తన అడ్వకేట్‌ను కలవడానికి కన్నారావు వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సోమవారం రాత్రి 12:30 గంటలకు బాలాపూర్‌లో ఆదిబట్ల పోలీసులకు కన్నారావు పట్టుబడ్డాడు. దీంతో అతన్ని అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ఆయన ఏ3గా ఉన్నాడు. కన్నారావుపై 307, 436, 447, 427, 148 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వైద్య పరీక్షల అనంతరం ఇబ్రహీంపట్నం కోర్టుకు తరలించగా న్యాయమూర్తి 14 రోజులపాటు రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ను చర్లపల్లి జైలుకు తరలించారు. నేనే ఫోన్ చేసి లొంగిపోయా: కన్నారావు ఇది ఒక భూ వివాద సమస్య. ఇందులో కొద్దిగా నాన్‌బెయిలబుల్ సెక్షన్లు పెట్టారు. ఈ సెక్షన్లకు ముందస్తు బెయిల్ లభించనందున ఆదిబట్ల ఎస్సై రాజు, సీఐ రాఘవేందర్‌రెడ్డికి ఫోన్ చేసి ఫలానా చోట ఉన్నానని చెప్పి సరెండర్ అయ్యాను. నాకు కచ్చితంగా బెయిల్ వస్తుంది. ఈ కేసును సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. -
అవును.. అమ్మే భార్గవికి ఉరేసింది
సాక్షి, రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం దండుమైలారంలో కలకలం రేపిన యువతి అనుమానాస్పద మృతి కేసును.. పోలీసులు ఎట్టకేలకు పరువు హత్యగా తేల్చారు. భార్గవి(19)ని తల్లే చంపిందని.. ప్రియుడితో కలిసి కూతురు కనిపించేసరికి భరించలేక తల్లి జంగమ్మ ఉరేసి చంపినట్లు నిర్ధారించారు. దండుమైలారం గ్రామానికి చెందిన మోటే ఐలయ్య, జంగమ్మ దంపతులకు కుమార్తె భార్గవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్గవి హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవల భార్గవి తల్లిదండ్రులు మేనబావను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశారు. దీంతో ఆమె తాను స్థానికంగా ఓ యువకుడిని ప్రేమిస్తున్నానని.. అతన్నే పెళ్లి చేసుకుంటానంది. దీంతో ఇంట్లో గొడవలు జరిగాయి. ఈ క్రమంలో మూడు రోజులపాటు భార్గవి కాలేజీకి కూడా వెళ్లలేదు. ఇదిలా ఉంటే.. సోమవారం తల్లిదండ్రులు వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. ఆ సమయంలో సదరు యువకుడు.. భార్గవి ఇంటికి వచ్చి ఆమెతో మాట్లాడుతుండగా తల్లి జంగమ్మ ఇంటికి వచ్చింది. కుమార్తెపై తల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడి చేసిందని, చీరతో ఉరి వేసి హతమార్చింది. ఈలోపు భర్త, కొడుకు ఇంటికి వచ్చేసరికి స్పృహ కోల్పోయినట్లు నటించి.. కూతురిని ఎవరో చంపేశారని కన్నీళ్లు పెట్టుకుంది. అయితే.. అక్కను తల్లే చంపి ఉంటుందని భార్గవి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు తాను చంపలేదని జంగమ్మ, తన భార్య చంపి ఉండకపోవచ్చని ఆమె భర్త వాదించారు. ఈ క్రమంలో ప్రియుడి పాత్రపైనా పోలీసులు అనుమానాలు మళ్లాయి. అయితే.. తమదైన శైలిలో ఈ కేసును విచారించగా.. చివరకు కూతురిని తానే ఉరేసి చంపిటనట్లు జంగమ్మ అంగీకరించింది. -
పరువు హత్య కలకలం
-
ఇబ్రహీంపట్నంలో పరువు హత్య!
సాక్షి, రంగారెడ్డి: ఇబ్రహీంపట్నంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారం పరువు హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. నవ మాసాలు మోసి కన్న తన కూతురునే ఓ తల్లి కడతేర్చింది. దీంతో, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం దండుమైలారంలో పరువు హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. డిగ్రీ మొదటి సంవత్సం చదువుతున్న భార్గవి, శశి అనే యువకుడు కొద్ది రోజలుగా ప్రేమించుకుంటున్నారు. ఇక, వీరి ప్రేమ విషయమై గత కొద్ది రోజులుగా కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరుగుతోంది. శశితో మాట్లాడటం, కలవడం మానేయాలని తన తల్లి జంగమ్మ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. భార్గవి ఇంట్లో ఉన్న ఉండగా శశి ఇటీవలే ఆమె ఇంటికి వచ్చాడు. ఈ విషయం భార్గవి తల్లికి తెలియడంతో వారి మధ్య మరోసారి గొడవ జరిగింది. ఈ సందర్బంగా శశినే పెళ్లిచేసుకుంటానని భార్గవి చెప్పడంతో జంగమ్మ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈలోపు.. సోమవారం భార్గవి తన ఇంట్లో విగతజీవిగా కనిపించింది. భార్గవిని ఎవరో చీరతో ఉరి వేసి చంపినట్టు ఆనవాళ్లను ఆమె సోదరుడు గుర్తించాడు. తన తల్లే భార్గవిని చంపినట్టు అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు తల్లి జంగమ్మను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక, శశి మృతిపై ఆయన తండ్రి మాట్లాడుతూ.. కన్న తల్లి ఎక్కడైనా కూతురును చంపుకుంటుందా?. భార్గవిని నా మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నాను. భార్గవి మాత్రం శశిని పెళ్లిచేసుకుంటానని చెప్పింది. నిన్న శశి మా ఇంటికి వచ్చాడు. నా భార్యను చూసిన వెంటనే ఇంట్లో నుంచి పారిపోయాడు. ఆ తర్వాతే ఇలా జరిగింది అని చెప్పారు. -
Abhaya Foundation: పేదలకు అభయం బాలచంద్రుని ఆనంద నిలయం
పరాన్న జీవులుగా కాదు.. పరమాత్మ జీవులుగా మనమంతా ఎదగాలి’ అంటారు సుంకు బాలచంద్ర. పదిహేడేళ్లుగా సేవారంగంలో వేలాది మందికి అండగా ఉంటున్నారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉంటున్న యాభై ఏళ్ల బాలచంద్ర. అభయ ఆనంద నిలయం పేరుతో నిరుపేదలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ఉద్యోగం చేస్తూ వచ్చిన ఆదాయాన్ని పేదలకు పంచుతూ మొదలుపెట్టిన సేవామార్గం ఇప్పుడు ఎంతో మందికి నీడనిస్తుంది. అనాథ వృద్ధులను చేరదీస్తూ, విద్యార్థుల చదువుకు అవసరాలను సమకూరుస్తూ, రోగులకు వైద్యచికిత్సను అందజేస్తూ, నిరుద్యోగుల ఉపాధికి కావల్సిన నైపుణ్యాలను అందిస్తున్నారు. స్కూల్ పిల్లలను కలుస్తూ, వారి ప్రశ్నలకు సమాధానాలను పుస్తక రూపంలో తీసుకువచ్చారు. పది వేల రూపాయలతో మొదలుపెట్టిన సేవా మార్గం నేడు ఎంత మందికి చేరవయ్యిందో తెలియజేస్తూ మనం తలుచుకుంటే సమాజంలో పేదరికం, కష్టాలు, కన్నీళ్లు లేకుండా చేయచ్చు అని వివరిస్తున్నారు. పద్దెనిమిదవ వసంతంలోకి అడుగు పెడుతున్న తన సేవా ప్రస్థానాన్ని ఇలా ముందుంచారు. ‘‘ఎనిమిదేళ్ల క్రితం ఓ రోజు నాగర్‌కర్నూలు నుంచి ఫోన్ వస్తే అక్కడకు వెళ్లాను. ఎనభై ఏళ్ల ముసలాయన బాగోగులు చూడలేక వారి పిల్లలు ఇంటి నుంచి అతన్ని రోడ్డు మీదకు తోసేస్తే కొన్ని రోజులుగా చెత్త కుప్ప వద్ద ఉన్నాడు. అతన్ని ఆశ్రమానికి తీసుకువచ్చిన ఆరునెలలకు ఆయన భార్య కూడా వచ్చింది. ఇద్దరూ ఎనిమిదేళ్లపాటు నాతోనే ఉన్నారు. నాకు కరోనా వచ్చి ఆసుపత్రిలో ఉంటే ఆవిడ బెంబేలెత్తిపోయి తన మెడలో ఉన్న మంగళసూత్రాలు, కమ్మలు ఇచ్చి ‘అమ్మి, ఆ బాబును బతికించడయ్యా’ అని వేడుకుంది. కోలుకుని వచ్చాక విషయం తెలిసి కళ్ల నీళ్లు వచ్చాయి. పన్నెండేళ్ల క్రితం పాతికేళ్లమ్మాయి రోడ్డు ప్రమాదంలో హిప్బాల్ దెబ్బతిని మంచానికి పరిమితం అయ్యింది. హైదరాబాద్ గాంధీ నగర్లో ఉండే ఆమెను గుండె నొప్పితో బాధపడే తల్లి తప్ప చూసుకునేవారు ఎవరూ లేరు. నాలుౖగైదేళ్లు ఆ అమ్మాయి బెడ్‌మీదే ఉండిపోయింది. ఆమెకు పలుమార్లు ఆపరేషన్ చేయిస్తే ఏడెనిమిదేళ్లకు కోలుకుంది. ఇప్పుడు పెళ్లి చేసుకొని కుటుంబంతో సంతోషంగా ఉంది. మా అమ్మాయి బాగా చదువుకుంటుంది. డాక్టర్ కావాలన్నది తన కల. కానీ, చదివించే స్థోమత మాకు లేదని బాధపడుతూ వచ్చారు ఒకమ్మాయి తల్లిదండ్రులు. ఆ బిడ్డ ఈ రోజు డాక్టర్ అయి పేదలకు సేవలందిస్తోంది. ఈ పదిహేడేళ్లలో ఇలాంటి కథనాలు ఎన్నో... స్వచ్ఛందంగా ఎంతో మంది కదిలివచ్చి ‘అభయ ఫౌండేషన్’తో చేయీ చేయీ కలిపారు. ఉపనయనం డబ్బులతో... పుట్టి పెరిగింది అనంతపురం జిల్లా తాడిపత్రిలో. బీఎస్సీ ఎల్ఎల్బీ చేశాను. ఇరవై నాలుగేళ్ల క్రితం నాకు ఉపనయనం చేసినప్పుడు బంధువుల ద్వారా పది వేల రూపాయలు వచ్చాయి. ఆ డబ్బుతో నలుగురికి మేలు కలిగే పని చేయాలనుకుంటున్నాను అని మా కుటుంబంలో అందరికీ చెప్పాను. అందరూ సరే అన్నాను. వారందరి మధ్యనే ‘అభయ’ అనే పేరుతో ఫౌండేషన్‌ను ఏర్పాటు చేస్తున్నాను అని, తమకు తోచిన సాయం అందిస్తూ ఉండమని కోరాను. అక్కణ్ణుంచి హైదరాబాద్ వచ్చి, ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు చేశాను. నా ఖర్చులకు పోను మిగతా జీతం డబ్బులు, బంధుమిత్రులు ఇచ్చినదానితో ఫుట్‌పాత్‌ల మీద ఉండే నిరాశ్రయులకు సాయం చేస్తూ ఉండేవాణ్ణి. నైపుణ్యాల వెలికితీత.. ఏ మనిషి అయినా ఎవ్వరి మీదా ఆధారపడకుండా బతకాలి. అందుకు తగిన నైపుణ్యం కూడా ఉండాలి. దీంతో వారాంతాలు స్కిల్ ప్రోగ్రామ్‌లు ఏర్పాటు చేస్తుండేవాడిని. చదువుకున్న రోజుల్లో నేను మా బంధువుల నుంచి పుస్తకాలు, ఫీజులు, బట్టల రూపంలో సాయం పొందాను. వారందరిలోనూ ఒక ఎఫెక్షన్ చూశాను. నాలాగే ఎంతో మంది సాయం కోసం ఎదురుచూస్తుండవచ్చు అనే ఆలోచనతో విద్యార్థుల చదువుకు ఊతంగా ఉండాలనుకున్నాను. పుట్టి పెరిగిన జిల్లాతో పాటు ఇప్పుడు దాదాపు 17 రాష్ట్రాలలో నిరుపేద విద్యార్థుల చదువుకు అండగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగు రాష్ట్రాలతో పాటు మరో మూడు రాష్ట్రాల్లో 12 వేల మంది యువతకు ఉపాధి అవకాశాలకు శిక్షణ ఇస్తున్నాం. వీరిలో మహిళలూ ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. కర్ణాటక రాష్ట్రంలో నాదస్వరం స్కూల్‌ను కూడా ఏర్పాటు చేశాం. ఏ వృత్తుల వారికి ఆ వృత్తులలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి, వారి కాళ్ల మీద వారు నిలబడేలా సాయంగా ఉంటున్నాం. సేవకు చేయూత ఒక మంచి పని చేస్తే ఎంత దూరమున్నవారినైనా ఆకట్టుకుంటుందని ఓ సంఘటన నాకు అర్థమయ్యేలా చేసింది. పదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో ఒక సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అక్కడకు 75 ఏళ్ల ఆవిడ వచ్చి ‘నేనూ మీ సేవలో పాలు పంచుకుంటాను, నెలకు 5వేల రూపాయలు ఇవ్వగలను’ అంది. ఆశ్చర్యంగా చూస్తే ‘నేను రిటైర్డ్ ప్రిన్సిపాల్‌ను. 20 వేల రూపాయల పెన్షన్ వస్తుంది. ప్రతి నెలా ఐదు వేల రూపాయలు సేవకు నా జమ’ అంది. నోటమాటరాలేదు. ఎక్కడ సేవ రూపంలో వెళితే అక్కడకు పది, వంద రూపాయలు సాయం అందించినవారున్నారు. ఇంతమందిలో మానవత్వం ఉంటే ఇక మనకు కొరతేముంది అనుకున్నాను. ఎవరికి సాయం అందిందో తిరిగి వాళ్లు ఎంతో కొంత సాయం అందిస్తూ వచ్చారు. కొంతమంది పిల్లలు తమ కిడ్డీ బ్యాంకులో దాచుకున్న డబ్బును కూడా సాయంగా ఇచ్చారు. స్వచ్ఛందంగా ముందుకు.. నేపాల్ కరువైనా, ఉత్తరాఖండ్ వరదలైనా, ఆంధ్ర, తమిళనాడు, కేరళలలో అకాల వర్షాలు ముంచెత్తినా.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సాయం అవసరమున్నవారికి అండగా ఉంటే చాలు అన్న తపన నన్ను చాలా మందికి చేరువ చేసింది. నాతో పాటు ఎలాంటి స్టాఫ్ లేదు. ప్రత్యేకించి ఆఫీసు లేదు. అందరూ స్వచ్ఛందంగా తమ చేయూతను ఇస్తున్నారు. దీనికి నేను చేస్తున్నదల్లా సాయం చేసే చేతులను కలపడం. ఈ సేవా ప్రస్థానంలో ఇప్పుడు వేల మంది జమ కూడారు. అంతా నా కుటుంబమే! సేవ మార్గమే నా ప్రయాణం కాబట్టి, పెళ్లి, కుటుంబం వద్దనుకున్నాను. హైదరాబాద్‌లో ఒక ప్లాట్ ఉంది. ఇటీవల ఆ ఇంటిని అభయ ఫౌండేషన్‌కు ఇచ్చేశాను. ఆరేళ్ల క్రితం ఇబ్రహీంపట్నంలో వృద్ధులకు, వైద్య సాయం అవసరమైన పేదలకు అభయ ఆనంద నిలయం ఏర్పాటు చేశాను. నేను మరణించేదాకా, మరణించాక కూడా నలుగురిని బతికించే ప్రయత్నం చేయాలన్నది తపన. ఈ ప్రయాణంలో ఎన్నో ఆవేదనలు చుట్టుముట్టాయి. ఎందరి కష్టాలనో దగ్గరుండి చూసి, దుఃఖం కలిగేది. చేసే ప్రతి పనినీ దైవాంశగా భావిస్తూ వచ్చాను. పిల్లల కోసం కంపాస్ రేపటి తరం బాగుండాలంటే విద్యార్థుల్లో మానవతా స్పృహ కలగాలి. అందుకే, ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి చిన్నారులకు మన దేశ నాయకుల గురించి, సంస్కార పాఠాలు అందించే ప్రయత్నం చేస్తున్నాను. పిల్లలు అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానంగా ‘కంపాస్’అనే పేరుతో పుస్తకం తీసుకువచ్చాను. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రతి రోజూ ఉదయం నుంచి 10 వేల మందికి టచ్‌లో ఉంటాం. నేను కోరేది ఒక్కటే ... వాలంటీర్లుగా వారంలో ఒక్క రోజు మాకివ్వండి. సేవా మార్గంలో తోడవ్వండి. అంకితభావంతో ఉన్న యువత ఇలాంటి సంస్థలలో పనిచేయడం వల్ల వారిలో జీవన నైపుణ్యాలు పెరుగుతాయి. సమాజం బాగుండాలంటే యువత చేతులు ఏకమవ్వాలి’’ అని తెలియజేస్తున్నారు బాలచంద్ర. – నిర్మలారెడ్డి -
RangaReddy: ఆర్డీవో ఆఫీసు వద్ద ఉద్రిక్తత.. పోస్టల్ బ్యాలెట్‌కు నో సీల్!
సాక్షి, రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాయలం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. నవంబర్ 29వ తేదీ నాటి పోస్టల్ బ్యాలెట్లను స్ట్రాంగ్ రూమ్‌కి అధికారులు పంపించకపోవడం కలకలం సృష్టించింది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు ఆర్డీవో ఆఫీసు వద్దకు భారీగా చేరుకుంటున్నారు. వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాయలం వద్ద ఉద్రిక్తత నెలకొంది. నవంబర్ 29వ తేదీ నాటి పోస్టల్ బ్యాలెట్లను అధికారులు స్ట్రాంగ్ రూమ్‌కు తరలించలేదు. దీంతో, ఈ విషయంపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, అక్కడ ఉద్రికత్త పరిస్థితి చోటుచేసుకుంది. అనంతరం, పోస్టల్ బ్యాలెట్‌ను అధికారులు స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు. ఇక, పోస్టల్ బ్యాలెట్‌ను స్ట్రాంగ్ రూమ్‌కు తరలించిన తర్వాతే అధికారులు సీల్ వేశారు. పోలింగ్ జరిగి రెండు రోజులు దాటినా స్ట్రాంగ్ రూమ్‌కు తాళం లేకపోవడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే ఆర్డీవోను నిలదీశారు. -
ఇబ్రహీంపట్నంలో బారులు తీరిన ఓటర్లు
-
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో టెన్షన్
-
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత
-
ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రాళ్లదాడి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాళ్ల దాడి చేసుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి. కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి గురువారం నామినేషన్ వేసేందుకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నియోజకవర్గంలో ఒకేసారి రెండు పార్టీలు భారీ ర్యాలీ చేపట్టాయి. ర్యాలీగా వెళుతున్న సమయంలో ఇరు పార్టీలు ఎదురుపడగా.. కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ జెండాలను కాంగ్రెస్ నేతలపై, కాంగ్రెస్ పార్టీ జెండాలను బీఆర్ఎస్ నేతలపై విసురుకున్నారు. ఈ ఘటనలో పలువురు నాయకులు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు పార్టీ నేతలపై లాఠీచార్జ్ చేసి పరిస్థితి అదుపుచేసేందుకు యత్నించారు. -
డబుల్ మర్డర్ కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సంచలనం సృష్టించిన ఇబ్రహీంపట్నం కాల్పుల కేసులో నిందితులకు యావజ్జీవ శిక్ష విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. కర్ణంగూడలోని లేక్‌విల్లా ఆర్చిడ్స్‌లో నెలకొన్న భూ వివాదాలపై శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్ రెడ్డిల హత్య కేసులో ప్రధాన నిందితుడు మేరెడ్డి మట్టారెడ్డితో పాటుగా ఖాజా మొయినోద్దీన్ , భిక్షపతిలకు రంగారెడ్డి కోర్టు జీవిత ఖైదు విధించింది. కర్ణంగూడ గ్రామ సమీపంలో ఇద్దరు భాగస్వాములైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి రాఘవేందర్‌రెడ్డిలు 10 ఎకరాల భూమి కొన్నారు. కానీ అప్పటికే ఆ భూమి తనదేనంటూ మట్టారెడ్డి దాన్ని కబ్జా చేశారు. ఈ విషయంలో వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శ్రీనివాస్ రెడ్డి మరో వ్యక్తితో కలిసి సైట్ వద్దకు వెళ్లగా, అక్కడే ఉన్న మట్టారెడ్డితో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో 2022 మార్చి 1, మంగళవారం ఉదయం మట్టారెడ్డి ఇతరులతో కలిసి శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డిపై కాల్పులు జరిపారు. శ్రీనివాస్ అక్కడికక్కడే చనిపోగా, రాఘవేందర్‌రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. హత్య అనంతరం మృతుల రెండు కుటుంబాల వారు కూడా మట్టారెడ్డిపైనే అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులకు విచారణ మరింత సులువు అయ్యింది. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ జరపగా మట్టారెడ్డే సుపారీ గ్యాంగ్‌తో ఈ హత్యలు చేయించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కర్ణంగూడలోని లేక్ విల్లా ఆర్చిడ్స్ లో నెలకొన్న భూ వివాదం ఈ హత్యలకు కారణమైంది. దీంతో శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డిలను హత్య చేయాలని సుఫారీ ఇచ్చి మట్టారెడ్డి ప్లాన్ చేశారు. వివాదంలో ఉన్న భూమి వద్దకు వచ్చిన శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలపై కాల్పులకు దిగి హత్య చేశారు నిందితులు. ఈ కేసులో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అప్పటి ఇబ్రహీం పట్నం ఏసీపీ బాలకృష్ణ రెడ్డిపై పోలీస్ శాఖ విధుల నుండి తప్పించి శాఖపరమైన చర్యలు తీసుకుంది. చదవండి: ‘మణప్పురం’లో బంగారం మాయం -
రంగారెడ్డి: యూత్ ఫెస్టివల్లో శ్రుతిహాసన్ సందడి (ఫోటోలు)
-
‘పట్నం’లో భారీగా ట్రాఫిక్‌జాం
ఇబ్రహీంపట్నం: ట్రాఫిక్ జాంతో ఇబ్రహీంపట్నం ప్రధాన రహదారిపై శనివారం సాయంత్రం స్థానికులు, వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. సుమారు గంటకుపైగా రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. హైదరాబాద్–నాగార్జునసాగర్ హైవేపై ఈ రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. స్థానిక అంబేడ్కర్, డాక్‌బంగ్లా చౌరస్తాల వద్ద పాత ఇబ్రహీంపట్నం, మంచాల రోడ్డు, బృందావన్ కాలనీ వైపు వెళ్లేందుకు దారులుంటాయి. ఇక్కడే వాహనాదారులు టర్న్ చేసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్–సాగర్ రోడ్డుపై వెళ్లే వాహనాలతోపాటు ఈ మూడు దిక్కుల నుంచి వాహనాలు టర్న్ చేసుకునేందుకు నిరీక్షించాల్సి వస్తుండటంతో తరచూ ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. శనివారం సాయంత్రం ఒక్కసారిగా రోడ్లపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో వాటిని కంట్రోల్ చేయడం పోలీసులకు ఇబ్బందిగా మారింది. వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. దీంతో ఆర్టీసీ సిబ్బంది, ఓ బాటసారి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు సాయపడ్డారు. వారి సాయంతో పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఇబ్రహీంపట్నానికి మంజూరైన ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌ను వెంటనే ఏర్పాటు చేసి ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కించాలని స్థానికులు కోరుతున్నారు. -
ఎన్టీఆర్ జిల్లా: రన్నింగ్ కారులో మంటలు.. ఒక్కసారిగా
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నం మండలం కిలేశపురం దగ్గర రన్నింగ్ కారులో మంటలు చెలరేగాయి. గ్యాస్ లీకవ్వడంతో కారు దగ్ధమైంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన జరిగింది. కారు డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. గ్యాస్ లీకవ్వడంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. కారును రోడ్డు పక్కన నిలిపివేసి అందులో ఉన్న వ్యక్తులు తమ ప్రాణాలను దక్కించుకున్నారు. చదవండి: రంగారెడ్డి: వీడిన మైనర్ రాజా కేసు మిస్టరీ -
భర్తల సంపాదనపైనే ఆధార పడకుండా సొంతంగా వ్యవసాయం
-
బావమరిదిని చంపిన బావకు జీవిత ఖైదు!
రంగారెడ్డి: బావమరిదిని చంపిన బావకు జీవిత ఖైదు విధిస్తూ జిల్లా కోర్టు తీర్పు వెల్లడించింది. ఆదిబట్ల సీఐ రవికుమార్ తెలిపిన ప్రకారం.. ఒడిసా రాష్ట్రం బానర్ డివిజన్ కలహండి జిల్లాకు చెందిన సంజుక్త మాఝీ, ఆమె భర్త విశ్వప్రధాన్ మన్నెగూడ సమీపంలోని హరీస్ ప్రణవ్ విల్లాస్‌లో కాంట్రాక్టర్ ప్రభాకర్‌రెడ్డి వద్ద సెంట్రింగ్ పనిచేస్తూ జీవనం సాగించేవారు. వారితో పాటు సంజుక్త మాఝీ సోదరుడు బానామాఝీ అదే కాంట్రక్టర్ వద్దే పనిచేసేవాడు. విశ్వప్రధాన్ నిత్యం మద్యం సేవించి సంజుక్త మాఝీతో గొడవపడేవాడు. 2021 అక్టోబర్ 11న దంపతులు ఇద్దరు గొడవపడుతుండగా పక్కగదివారు గమనించి బానామాఝీ చెప్పడంతో అక్కడి చేరకుని బావను నిలదీశాడు. దీంతో కక్ష పెంచుకున్న విశ్వప్రధాన్ రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో బావమరిది తలపై బండరాయి వేశాడు. దీంతో తీవ్రరక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. మాకుటుంబ విషయంలో జోక్యం చేసుకున్నందునే హతమార్చినట్లు ఒప్పుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు సోమవారం ఎల్బీనగర్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి(ఏడీజే) నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ తీర్పువెల్లడించారు. విశ్వప్రదాన్ ఇప్పటికే చర్లపల్లి జైలులో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. -
అనుమతి లేకుండా అడ్మిషన్లు.. విద్యార్థులకు న్యాయం చేయాలి
-
అనుమతి లేకుండా అడ్మిషన్లు.. విద్యార్థులకు న్యాయం చేయాలి
సాక్షి హైదరాబాద్: అనుమతి లేకుండా అడ్మిషన్లు స్వీకరించి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న గురునానక్ యూనివర్సిటీ యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టి విద్యార్థులకు న్యాయం చేయాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ఓరుగంటి యాదయ్య డిమాండ్ చేశారు. పోలీసులు జరిపిన లాఠీ ఛార్జిని ఆయన తీవ్రంగా ఖండించారు. అరెస్ట్ అయిన వారిని వెంటనే విడుదల చేయాలని, 4 వేల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏం జరిగిందంటే.. కొత్తగా రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2022లో ఓ చట్ట సవరణ తెచ్చింది. గత ఏడాది సెపె్టంబర్ 13న ఈ బిల్లుకు అసెంబ్లీ కూడా ఆమోదం తెలపడం.. ఆ తర్వాత ఈ బిల్లును గవర్నర్‌కు పంపారు. అయితే ఇప్పటివరకూ దీనిపై గవర్నర్ దగ్గర్నుంచి ఎటువంటి స్పష్టత రాలేదు. ఇదిలా ఉండగా గురునానక్‌తోపాటు మరో కాలేజీ కూడా బిల్లుపై స్పష్టత రాకుండానే విద్యార్థులను చేర్చుకుంటూ, భారీగా డబ్బులు వసూలు చేసింది. 2022–23 విద్యా సంవత్సరం ముగిసినప్పటికీ అనుమతులు రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. చదవండి: ఉత్తమ్‌కుమార్ రెడ్డి పార్టీ మారుతున్నారంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ -
గురునానక్ కాలేజ్ ముందు ఉద్రిక్తత.. విద్యార్థులపై పోలీసుల లాఠీ ఛార్జ్
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ కాలేజ్ ముందు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. యూనివర్శిటి నుంచి అనుమతులు లేకుండా యాజమాన్యం అడ్మిషన్లు తీసుకున్నారు. ఈ విషయం తెలియడంతో ఉదయం నుంచి కాలేజ్ గేట్ ముందు విద్యార్థులు, వాళ్ల తల్లితండ్రులు, ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. కాలేజ్ యజమాన్యం వచ్చి సరైన సమాధానం చెప్పే వరకు అక్కడ నుండి కదిలేదు లేదంటూ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ స్పష్టం చేశారు. కాలేజ్ యాజమాన్యంతో విద్యార్థి తల్లిదండ్రులు చర్చలు జరిపి అనురాగ్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవచ్చని నచ్చజెప్పారు. దీంతో ప్రత్యేక బస్సులో అనురాగ్ యూనివర్సిటీకి వెళ్లిన తల్లిదండ్రులు.. తిరిగి గురునానక్ కాలేజ్‌కు వచ్చి తమకు అక్కడ న్యాయం జరగలేదని వాపోయారు. ఈ క్రమంలో ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ ఆధ్వర్యంలో విద్యార్థులు కాలేజ్ గేటు దుకి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించగా.. పోలీసులకు, ఎన్ఎస్యూఐ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో విద్యార్థులపై పోలీసులు లాఠీ జార్జ్ చేయడంతో పాటు ధర్నాకు మద్దతు తెలిపిన వివిధ సంఘాల నేతలను అదుపులోకీ తీసుకున్నారు. చదవండి: మంత్రి మల్లారెడ్డి కాలేజీలో భారీగా నగదు స్వాధీనం: ఈడీ -
గురునానక్ ఇంజినీరింగ్ కళాశాల వద్ద బీజేవైఎం ధర్నా
-
హైదరాబాద్: అక్కడ ప్రాపర్టీలకు యమ డిమాండ్.. ఎగబడుతున్న జనం
సాక్షి, హైదరాబాద్: తూర్పు హైదరాబాద్‌లో శర వేగంగా అభివృద్ధి చెందుతున్న నివాసిత ప్రాంతం ఇబ్రహీంపట్నం. ఐటీ, ఏరోస్పేస్ హబ్‌గా పేరొందిన ఆదిభట్ల, ప్రభుత్వ కార్యాలయాలకు కేంద్రమైన కొంగరకలాన్ ప్రాంతాలకు కూతవేటు దూరంలో ఉండటంతో ఇబ్రహీంపట్నానికి డిమాండ్ పెరిగింది. అపార్ట్మెంట్లు, వ్యక్తిగత గృహాలే కాకుండా వాణిజ్య సముదాయాలు, మల్టీప్లెక్స్‌ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. రోడ్లు, విద్యుత్ వంటి మెరుగైన మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, అందుబాటు ధరలు ఇబ్రహీంపట్నం అభివృద్ధి చోదకాలు. స్థిరాస్తి రంగంలో పెట్టుబడుల స్వరూపం మారిపోయింది. సొంతంగా ఉండేందుకు విస్తీర్ణమైన ఇళ్లు కొనుగోలు చేశాక.. రెండో పెట్టుబడి వాణిజ్య సముదాయంలోనే చేయాలనే భావన కొనుగోలుదారులలో పెరిగిపోయింది. దీంతో ఇన్నాళ్లు ప్రధాన నగరంలోనే కేంద్రీకృతమైన గ్రేడ్–ఏ కమర్షియల్ ప్రరాపార్టీలు.. క్రమంగా ద్వితీయ శ్రేణి పట్టణాలకూ విస్తరించాయి. ప్రధానంగా హైదరాబాద్‌కు అనుసంధానమై ఉన్న ఇబ్రహీంపట్నంలో షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌లకు డిమాండ్ ఏర్పడిందని టీఎన్ఆర్ గ్రూప్ ఎండీ టీ నర్సింహారావు తెలిపారు. (ఇదీ చదవండి: భారత్‌లో లభించే టాప్ 5 బెస్ట్ సీఎన్జీ కార్లు - ధర తక్కువ & ఎక్కువ మైలేజ్!) ఇప్పటివరకు షాపింగ్ మాల్స్‌లలో రిటైల్ స్థలం కొనాలంటే పెద్ద ప్రహసనమే. ధర, డిమాండ్, అగ్రిమెంట్, నిర్మాణం వంటి చాలా అంశాలలో పరిజ్ఞానం ఉండాలి. దీంతో విద్యావంతులైన పెట్టుబడిదారులే ఈ తరహా ప్రాపర్టీలను ఎంచుకునేవారు. సామాన్య, మధ్యతరగతి కూడా గ్రేడ్–ఏ కమర్షియల్ ప్రాపర్టీలలో పెట్టుబడులు పెట్టే విధంగా అత్యంత సులువు చేస్తున్నాయి పలు నిర్మాణ సంస్థలు. నిర్మాణ రంగంలో అనుభవం, నమ్మకమైన నిర్మాణ సంస్థ చేపట్టే వాణిజ్య సముదాయాలైతే ధైర్యంగా నిర్ణయం తీసుకోవచ్చు. ఓటీటీ, యాప్‌లు వచ్చాక ప్రధాన నగరంలో థియేటర్‌కు వెళ్లి సినిమా చూసే వాళ్ల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. అయితే ఈ సంస్కృతి ద్వితీయ శ్రేణి పట్టణాలలో ఇంకా రాలేదు. ఇలాంటి తరుణంలో ఇబ్రహీంపట్నంలో మల్టీప్లెక్స్ కం షాపింగ్ మాల్స్‌కు నిర్మించాలని నిరయించామని టీఎన్ఆర్ గ్రూప్ డైరెక్టర్ టీ విక్రమ్ కుమార్ అన్నారు. ఇబ్రహీంపట్నం, కర్మన్ఫట్లలో 8 లక్షల చ.అ.లలో రెండు షాపింగ్ వల్స్‌ను నిర్మిస్తున్నామని చెప్పారు. (ఇదీ చదవండి: మొబైల్ ఛార్జ్ తక్కువున్నప్పుడు ఉబర్ ఛార్జ్ ఎక్కువవుతుందా? కంపెనీ ఏం చెబుతోందంటే?) ఇబ్రహీంపట్నంలో రెండ్నునర ఎకరాల విస్తీరంలో టీఎన్ఆర్ జగదాంబ, కర్మన్‌ఫట్‌లో మూడున్నర ఎకరాలలో టీఎన్ఆర్ ప్రిస్టన్ వల్‌ను నిరి్మస్తున్నాం. జగదాంబలో ఏడు స్క్రీన్లు, ప్రిస్టన్‌లో 11 స్క్రీన్ల మల్టీప్లెక్స్‌లు ఉంటాయి. దీంతో పాటు ఫుడ్ కోర్టులు, గేమింగ్ జోన్లు, ప్రముఖ బ్రాండ్లకు చెందిన రిటైల్ దుకాణాలుంటాయి. జగదాంబ షాపింగ్ మాల్లో రెంటల్ ఇన్‌కం స్కీమ్‌ను ప్రారంభించాం. 100 చ.అ. రిటైల్ స్పేస్‌ను రూ.12 లక్షలకు అందిస్తున్నాం. దీంతో కొనుగోలుదారులకు నెలకు రూ.6 వేలు అద్దె కంపెనీ చెల్లిస్తుంది. ఇరవై ఏళ్ల గ్యారంటీ లీజు ఉంటుంది. విద్యా సంస్థలు, ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్, సపర్ వర్కెట్లు, బ్యాంకులు, వంటి అన్ని రకాల వ్యాపార సముదాయాలు ఇబ్రహీంపట్నంలో ఉన్నాయి. ఇక్కడ అపార్ట్మెంట్ల ధరలు రూ. 40 లక్షల నుంచి ఉన్నాయి. ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఇబ్రహీంపట్నం మీదుగా భువనగిరి, చౌటుప్పల్ ప్రాంతాలను అనుసంధానిస్తుంది. కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్ కంపెనీకి ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే ప్రభుత్వంతో తుది దశ చర్చలు ముగిశాయి కూడా. కొంగరకాన్ - రావిర్యాలలో ఎల్రక్టానిక్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. -
ఎన్టీఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం
-
ఘోర ప్రమాదం.. వైర్లు తెగి ఊడిపడిన లిఫ్ట్.. ముగ్గురి మృతి
సాక్షి, ఎన్టీఆర్: జిల్లాలోని ఇబ్రహీంపట్నం వీటీపీఎస్‌లో ఘోర ప్రమాదం జరిగింది. వైర్లు తెగడంతో లిఫ్ట్ అమాంతం కిందపడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో లిఫ్టులో మొత్తం 8 మంది ఉన్నారు. వీరంతా పైకి వెళ్తుండగా లిఫ్టు వైర్లు ఒక్కసారిగా తెగిపోయాయి. దీంతో అంతా లిఫ్టుతో పాటు కిందపడిపోయారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. చదవండి: పెళ్లింట విషాదం.. అప్పుడు వరుడి తండ్రి.. ఇప్పుడు వధువు తండ్రి.. -
పెళ్లి చేసుకోవాలని వివాహితపై ఒత్తిడి.. ఇంట్లోకి చొరబడి స్క్రూ డ్రైవర్‌తో
సాక్షి, రంగారెడ్డి: ఫేస్ బుక్ పరిచయం ఓ వివాహితను ఇబ్బందుల పాలు చేసింది. ఈ ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కందుకూరు మండలం గుమ్మడవెళ్లి గ్రామానికి చెందిన మహిళ స్థానిక ఎంబీఆర్ నగర్లో నివాసం ఉంటోంది. భర్త రెస్టారెంట్లో పనిచేస్తున్నాడు. నాలుగేళ్ల కూతురు ఉంది. ఈమెకు ఫేస్బుక్ ద్వారా మంచాల మండలం రంగాపూర్‌కు చెందిన శివకాంత్(28)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని అడ్డం పెట్టుకొని యువకుడు తనను పెళ్లి చేసుకోవాలని బెదరింపులకు పాల్పడుతున్నాడు. సోమవారం ఏకంగా వివాహిత ఇంట్లోకి చొరబడి స్క్రూ డ్రైవర్‌తో ఆమె మెడ, చెంప, కూడి చేతిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో బాధిత మహిళ, ఆమె అమ్మమ్మ కేకలు వేయడంతో నిందితుడు పారిపోయేందుకు యత్నించాడు. అదే భవనంలో ఉన్న వారు నిందితున్ని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామకృష్ణ తెలిపారు. చదవండి: Hyderabad: ఫుడ్ డెలివరీ ఆలస్యమైందని దారుణం.. డెలివరీ బాయ్ వెంటపడి మరీ.. -
నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు కొండల్‌రెడ్డి అరెస్ట్
-
Liquor Case: నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు కొండల్‌రెడ్డి అరెస్ట్ అయ్యాడు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని హయత్‌నగర్ ఎక్సైజ్ పోలీసులు.. కొండల్‌రెడ్డిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. కొండల్‌రెడ్డితో పాటు మరో ప్రధాన నిందితుడు బాలరాజ్‌గౌడ్‌ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నకిలీ మద్యం కేసులో వీళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణ కోసం ఇబ్రహీంపట్నంకు తరలిస్తున్నారు. ఆ మధ్య జరిగిన నల్లగొండ మునుగోడు ఉప ఎన్నిక సమయంలోనూ.. నకిలీ మద్యం సరఫరా అయినట్లు గుర్తించారు. డిసెంబర్ 16వ తేదీన ఇబ్రహీంపట్నం పరిధిలోని యాచారంలో ఒక వ్యక్తి కల్తీ మద్యం తాగి.. అస్వస్థతకు గురైన విషయాన్ని ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. ఆపై ఈ దందా మొత్తం వెలుగులోకి వచ్చింది. ఐబీ, ఓసీ లాంటి బ్రాండ్లకు నకిలీ లిక్కర్‌ను ఒడిషా తయారు చేస్తున్నారు. వాటిని తెలంగాణ శివారు ప్రాంతాలకు తరలించి.. రంగారెడ్డి, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని బెల్ట్ షాపులకు చేరవేస్తున్నారు. ఈ వ్యవహారానికి గతంలో పాతిక మందిని అదుపులోకి తీసుకున్నారు కూడా. ఈ స్కామ్‌లో వీళ్లిద్దరి పాత్ర, లింకులపై ఇప్పుడు ఎక్సైజ్ పోలీసులు తేల్చాల్సి ఉంది. -
23న ‘చలో రామోజీ ఫిలిం సిటీ’: సీపీఎం
ఇబ్రహీంపట్నం: రామోజీ ఫిలింసిటీ సమీపంలోని నాగన్‌పల్లిలో 670 మంది పేదలకు మంజూరైన ఇళ్లస్థలాలను వారికి అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామం నుంచి రామోజీ ఫిలిం సిటీ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జాన్‌వెస్లీ తెలిపారు. రాయపోల్‌లో ఆదివారం జరిగిన లబ్ధిదారులు, ఇంటి స్థలాల్లేని పేదల సమావేశంలో ఆయన మాట్లాడారు. 670 మంది పేదలకు 60 గజాల చొప్పున ఇంటి స్థలాలకు సంబంధించిన పట్టాలు ఇచ్చి, ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేందుకు అప్పట్లో ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. అయితే ఈ స్థలాల్లోకి లబ్ధిదారులు వెళ్లకుండా రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం అడ్డుకుంటోందని ఆరోపించారు. ఆ స్థలాల్లో సినిమా షూటింగ్ సెట్టింగ్‌లను ఏర్పాటు చేసి ఆక్రమణకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఫిలింసిటీ అధినేత రామోజీరావుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం బాసటగా నిలుస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే పేదలందరికీ స్థలాలు చూపించి, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థికసాయం అందించాలని జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. -
గురునానక్ కాలేజీలో విద్యార్ధి ఆత్మహత్యా యత్నం
-
రామోజీపై భూకబ్జా కేసు పెట్టాలి.. ఆ 70 ఎకరాలు..
సాక్షి, ఇబ్రహీంపట్నం రూరల్: నిరుపేదలకు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలను కాజేసి, అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్న రామోజీ ఫిలింసిటీ యజమాని రామోజీరావుపై భూ కబ్జా కేసు నమోదు చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పరిధి నాగన్‌పల్లి సర్వే నంబరు 189లో 2007లో దివంగత సీఎండాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేదలకు పంపిణీ చేసిన ఫిలింసిటీలోని ప్రభుత్వ ఇళ్ల స్థలాలను, హద్దు రాళ్లను సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాన్‌వెస్లీ నేతృత్వంలోని ఆ పార్టీ ప్రతినిధి బృందం శుక్రవా రం పరిశీలించింది. అనంతరం జాన్‌వెస్లీ విలేకరులతో మాట్లాడారు. పోరాటాల ద్వారా సాధించుకున్న భూముల్లో ఇళ్ల స్థలాలు ఇస్తే వాటిని కబ్జా చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఫిలింసిటీలోని ప్రభుత్వ భూముల్లో 650మందికి పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పేదల స్థలాలు కబ్జా చేసి..సెట్టింగులా? స్థలాల్లో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తే వాటిని నిర్మించకుండా రామోజీరావు అడ్డుకుంటున్నారని జాన్‌వెస్లీ మండిపడ్డారు. పేదల ఇళ్ల స్థలాల్లో సినిమా షూటింగ్ షెడ్లు, సెట్టింగులు అక్రమంగా నిర్మిస్తున్నారని ఆరోపించారు. పాలకులు, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి రామోజీకి ఊడిగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాలు ఇచ్చిన వారికి ప్రభుత్వం వెంటనే రూ.5 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి రామోజీతో ఏం లాలూచీ ఉందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలను నిలిపివేయాలని కోరారు. లేదంటే ఆయా భూములను తామే ఆక్రమించి వాటిలో గుడిసెలు వేయిస్తామని హెచ్చరించారు. ప్రజలు రాకపోకలు సాగించే రోడ్డుతో పాటు 70 ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేశారన్నారు. 60 గజాల్లో గుడిసెలు వేస్తే పేదలపై కేసులు పెట్టే ప్రభుత్వాలు రామోజీని ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. డబ్బులు ఉన్నవాడికి ఊడిగం చేయడం తగదనీ, కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోకపోతే గుడిసెలు వేసి ఆక్రమిస్తామని హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలను తొలగించాల్సిందే: సీపీఎం జిల్లా కార్యదర్శి భాస్కర్ అక్రమ నిర్మా ణాలను వెంటనే తొలగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి భాస్కర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే భూములను ఆక్రమించి పొజిషన్ తీసుకుంటామని హెచ్చరించారు. నడకబాటలో ఉన్న రోడ్డు వెంట ప్రజలను రానివ్వకుండా అడ్డుకోవడం తగదన్నారు. రామోజీ పలుకుబడి ఉపయోగించి కబ్జాలు చేస్తున్నారని విమర్శించారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బి.సామేలు, డి.జగదీష్ తదితరులు పాల్గొన్నారు. -
ఇబ్రహీంపట్నం ఘటన.. డాక్టర్ శ్రీధర్ సస్పెన్షన్‌ను రద్దు చేసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సామాజిక ఆరోగ్య కేంద్రంలో(సీహెచ్‌సీ) నిర్వహించిన వైద్య శిబిరంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మరణించిన ఘటనలో కేంద్రం ఇన్చార్జీ డాక్టర్ శ్రీధర్‌ను సస్పెండ్ చేయడాన్ని హైకోర్టు రద్దు చేసింది. సస్పెన్షన్ ఉత్తర్వులకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను ఆదేశించింది. నలుగురు మహిళల మృతికి కారకులుగా పేర్కొంటూ పలువురిని వైద్య విధాన పరిషత్ సస్పెండ్ చేసింది. వీరిలో ఇబ్రహీంపట్నం సామాజిక ఆరోగ్య కేంద్రం ఇన్చార్జీ, సివిల్ అసిస్టెంట్ సర్జన్ శ్రీధర్ కూడా ఉన్నారు. ఈ ఉత్తర్వులను ఆయన హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై జస్టిస్ మాధవీదేవి తాజాగా విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున పీవీ కృష్ణయ్య వాదనలు వినిపించారు. ఆగస్టు 25న ఇబ్రహీంపట్నంలోని సీహెచ్‌సీలో పలువురికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారని.. అయితే, ఆ రోజున పిటిషనర్ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారని చెప్పారు. దీనికి సంబంధించిన ఐడీకార్డును, ఫొటోలను కోర్టుకు అందజేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్నారని వివరించారు. సస్పెండ్ చేయడం శిక్షేమీ కాదని, నలుగురు మృతికి ఎవరు కారణమో జరిగే విచారణ పూర్తి అయ్యే వరకు సస్పెన్షన్‌లో పెట్టడం తప్పుకాదని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. డాక్టర్ శ్రీధర్ సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణకు సహకరించాలని పిటిషనర్‌ను ఆదేశించింది. -
అధికార పార్టీలో ఈడీ కుదుపు.. కేడర్‌లో ఆందోళన
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జిల్లా రాజకీయాల్లో కలకలం సృష్టించింది. ఏకంగా అధికార టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన మంగళవారం ఈడీ ముందు హాజరయ్యారు. జిల్లా పార్టీ అధినేతపైనే మనీలాండరింగ్ ఆరోపణలు రావడం, ఈడీ నోటీసులు జారీ చేయడంతో కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2009లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2014లో రెండోసారి విజయం సాధించారు. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరి 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు ఇటీవల పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని కూడా కట్టబెట్టింది. సర్వత్రా చర్చనీయాంశం 2015లో ఇండోనేషియా వేదికగా గోల్డ్‌మైన్స్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టడంతోపాటు మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు అభియోగాలు ఉన్నాయి. ఈ అంశంపై ఆయనకు నెల రోజుల క్రితమే ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన లిఖితపూర్వకంగా వివరణ కూడా ఇచ్చారు. సంతృప్తి చెందని ఈడీ స్వయంగా హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చే యడంతో ఆయన ఈడీ ముందు హాజరవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్లలోనూ ఆందోళన మొదలైంది. మరోవైపు ఇటీవల ఈడీ విచారించిన క్యాసినో నిర్వాహకుడు చీకోటి శ్రీనివాస్తోనూ మంచిరెడ్డికి సంబంధాలున్నాయని, ఈ కేసులోనూ ఆయనను విచారించే అవకాశాలున్నాయని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు 2014లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో మంచిరెడ్డి సహా పలువురు పర్యటించారు. ఈ సందర్భంగా వినియోగించిన వ్యయంపై అనుమానాలు రావడం.. ఈ నిధులు విదేశాల నుంచి వచ్చినట్లు ఆరోపణలు రావడం కూడా ఈడీ విచారణకు కారణంగా కనిపిస్తోంది. ఈడీ మాత్రం మంచిరెడ్డిని ఏ కేసులో విచారించారనేదానిపై ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. ప్రజలకు వివరణ ఇవ్వాలి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అక్రమ సంపాదనపై ఈడీ విచారణ.. గతంలో వచ్చిన జూదం, భూ ఆక్రమణలపై ఇబ్రహీంపట్నం ప్రజలకు వివరణ ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది వ్యక్తిగత విషయం కాదని, ఒక ప్రజాప్రతినిధిగా జవాబుదారీగా ఉండాలని హితవుపలికారు. ఆయనపై ఇది కొత్త ఆరోపణ కాదని, అనేక భూ తగాదాల్లో ప్రజల పక్షం కాకుండా రియల్టర్ల పక్షాన నిలబడినట్లు విమర్శలు ఉన్నాయని తెలిపారు. తాజాగా ఖానాపురం గ్రామ ప్రజల విషయంలోనూ ప్రజల పక్షాన లేరన్నారు. వరుస ఆరోపణల నేపథ్యంలో వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు. -
ఇబ్రహీంపట్నం: కు.ని. ఆపరేషన్ల ఘటనపై కఠిన చర్యలు
సాక్షి, రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటనపై తెలంగాణ సర్కాలు చర్యలు తీసుకుంది. రంగారెడ్డి డీఎంహెచ్‌వో స్వరాజ్యలక్ష్మిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డీసీహెచ్ఎస్ ఝాన్సీలక్ష్మిపైనా బదిలీవేటుతో పాటు ఆపరేషన్ చేసిన డాక్టర్ సునీల్‌కుమార్‌పైనా క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. ఇక ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన తెలంగాణ సర్కాణ కఠిన చర్యలు తీసుకుంది. మొత్తం 13 మందిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని టీచింగ్ ఆసుపత్రులు, వైద్య విధాన పరిషత్ హాస్పిటళ్లు, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు వీటిని పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ వైద్యారోగ్యశాఖ. ఏం జరిగిందంటే.. ఆగస్టు 25న ఇబ్రహీంపట్నంలో 34 మంది మహిళకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు (డీపీఎల్ క్యాంప్) చేశారు. అయితే శాస్త్రచికిత్స వికటించి నలుగురు మహిళలు మృతిచెందారు. ఈ ఘటపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆధ్వర్యంలో విచారణ కమిటీని నియమించింది. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కమిటీ సిఫారసు చేసింది. దీంతో బాధ్యులపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకున్నది. ఇదీ చదవండి: ఇకపై తల్లిదండ్రులుంటేనే పిల్లలు ఇంటికి! -
‘పేదల ప్రాణాలతో ప్రభుత్వ చెలగాటం’
ఇబ్రహీంపట్నం: ప్రజల సొమ్ము దోచుకుంటూ, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు కోల్పోయిందని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో కు.ని. ఆపరేషన్లు వికటించి మృత్యువాత పడిన సీతారాంపేటకు చెందిన లావణ్య, లింగంపల్లికి చెందిన సుష్మ కుటుంబ సభ్యులను ఆదివారం సాయంత్రం అయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం డాక్‌బంగ్లాలో ఏర్పాటు చేసిన మిడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కుటుంబనియంత్రణ ఆపరేషన్లు చేయించుకునేందుకు వస్తే నలుగురి ప్రాణాలను తీశారని ఆరోపించారు. ఈ అంశంపై అసెంబ్లీలో ఒక్కముక్కా ప్రస్తావించకపోవడం సీఎం అహంకార ధోరణికి నిదర్శనమన్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు మంత్రులు, ముఖ్యమంత్రి రాకపోవడం సిగ్గుచేటన్నారు. ఇతర రాష్ట్రాలు తిరిగి రైతులకు డబ్బులు ఇచ్చేందుకు, డిల్లీకి వెళ్ళి రాజకీయాలు చేసేందుకు వీలవుతోంది కానీ... ఓట్లు వేసిన ప్రజలు పుట్టెడు శోకంలో ఉంటే వారిని పరామర్శించి, ఆదుకునేందుకు సమయం దొరకడంలేదా? అని ప్రశ్నించారు. విద్యార్థుల, పేద ప్రజల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోన్న ఈ దోపిడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. బాధిత కుటుంబాలకు 50 లక్షల ఎక్స్‌గ్రేషియాను చెల్లించి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, వారి పిల్లల బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని, ఆపరేషన్లు చేసిన వైద్యులపై, పర్యవేక్షించని సిబ్బందిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. -
టీఆర్ఎస్లో అసమ్మతి సెగలు.. ‘పట్నం’ మున్సిపాలిటీలో ముదిరిన వైరం
సాక్షి, ఇబ్రహీంపట్నం(రంగారెడ్డి): ‘పట్నం’ పురపాలక సంఘం పాలక వర్గం వ్యవహారశైలి రోజుకో మలుపు తిరుగుతోంది. అధికార పార్టీ చైర్పర్సన్ కప్పరి స్రవంతితో అమీతుమీ తేల్చుకునేందుకు అదే పార్టీకి చెందిన కౌన్సిలర్లు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మూకు మ్మడిగా మంత్రి సబితారెడ్డికి ఫిర్యాదు చేయడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మున్సిపాలిటీలో 24 మంది కౌన్సిలర్లకు ఆరుగురు కాంగ్రెస్, ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు ఉండగా మిగతా వారంతా అధికార టీఆర్ఎస్కు చెందిన వారే. చైర్ పర్సన్, అధికార పార్టీ కౌన్సిలర్ల మధ్య ఆరు నెలలుగా వైరం కొనసాగుతోంది. అదికాస్తా తీవ్రరూపం దాల్చింది. అక్రమ వసూళ్లతోపాటు మున్సిపాలిటీలో రూ.2 కోట్లకు పైగా తప్పుడు బిల్లులు, రికార్డులు సృష్టించి చైర్పర్సన్ అవినీతి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్‌కు ఫిర్యాదు చేయగా మే 26న మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన ఆయన రికార్డులను సీజ్ చేసి వెంట తీసుకెళ్లారు. అవినీతి ఆరోపణలపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని చైర్ పర్సన్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఏమైందో తెలియదుగానీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అనంతరం చైర్‌పర్సన్‌పై చర్యలు తీసుకోవాలంటూ అధికార పార్టీ కౌన్సిలర్లు కలెక్టర్ అమయ్‌కుమార్, మున్సిపల్ మంత్రి కేటీఆర్, సీడీఎంఏ అధికారుల కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొట్టినా ఫలితం కనిపించలేదు. దీంతో అధికార చైర్ పర్సన్ అధ్యక్షతన జరిగే కౌన్సిల్ సమావేశాలకు డుమ్మా కొట్టారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట చైర్పర్సన్ అవినీతిపై నిరసన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల శంకుస్థానలు, ప్రారంభోత్సవాలకు ఎవరివారే అన్నట్లు వ్యవహరించారు. అధికార పార్టీ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరితో కౌన్సిలర్లు జతకట్టారు. ఒకే పనిని చైర్పర్సన్, వైస్ చైర్మన్ వేర్వేరుగా చేపట్టడం ప్రారంభించారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అధికార పార్టీ కౌన్సిలర్ల మద్దతు లేకున్న చైర్ పర్సన్ ఒంటరిగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటుండంతో కౌన్సిలర్లకు మింగుడు పడటం లేదు. రూటు మార్చిన కౌన్సిలర్లు చైర్‌పర్సన్‌పై ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారికంగా చర్యలు లేకపోవడంతో కౌన్సిలర్లు రూటు మార్చారు. కొత్త ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నారు. చైర్‌పర్సన్‌పై చర్యలు తీసుకోకుంటే టీఆర్ఎస్ పార్టీకి, కౌన్సిలర్ల పదవులకు రాజీనామాలు చేస్తామని ఏకంగా మంత్రి సబితారెడ్డికి ఎమ్మెల్యే సమక్షంలోనే తెగేసి చెప్పారు. చైర్ పర్సన్ అవినీతి, అక్రమాలతో పార్టీకి, తమకు చెడ్డపేరు వస్తోందని మంత్రి దృష్టికి తెచ్చారు. ఒక్కసారిగా 15 మంది కౌన్సిలర్లు పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తే ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందనే కోణంలో అధికార పార్టీ నేతలు ఆలోచనల్లో పడ్డట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి కనుసన్నల్లోనే..! ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి కనుసన్నల్లోనే ఈ వ్యవహారం సాగుతోందని పలువురు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే మాట కాదని చైర్‌పర్సన్‌పై ఫిర్యాదు చేసేంత సాహసానికి కౌన్సిలర్లు ఒడిగట్టరనే వాదన వినిపిస్తోంది. చైర్ పర్సన్ అవినీతి చిట్టా ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చిన తర్వాతే ఫిర్యాదుల పర్వానికి కౌన్సిలర్లు తెరలేపారని.. ఆమె వ్యవహారశైలి కూడా ఎమ్మెల్యేకు నచ్చడం లేదనే చర్చ కొనసాగుతోంది. ఇటీవల కాలంలో చైర్పర్సన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లడం లేదని తెలుస్తోంది. రోజురోజుకూ ముదిరిపాకాన పడి తారాస్థాయికి చేరిన మున్సిపాలిటీ వ్యవహారం ఎంత వరకు వెళ్తుందో వేచి చూడాలి. -
ఇబ్రహీంపట్నంలో ఘోరం.. చిన్నారులపైకి దూసుకెళ్లిన స్కూల్ వ్యాన్
సాక్షి, రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం పరిధిలోని శేరిగుడలో మంగళవారం ఉదయం దారుణం జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థులపైకి ఓ ప్రైవేట్ స్కూల్ వ్యాన్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒక చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే వ్యాన్‌ను అక్కడే వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. మృతి చెందిన విద్యార్థి స్థానికుడు కాదని.. అతనిది బీహార్‌కు చెందిన కుటుంబంగా గుర్తించారు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలయాలు కావడంతో చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. మృతదేహంతో కుటుంబ సభ్యులు సాగర్ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో భారీగా ట్రాఫిక్ జామ్ కాగా, పోలీసులు జోక్యం చేసుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఇదీ చదవండి: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. చిన్నారిపై కుక్క దాడి! -
కు.ని. మరణాలపై డబ్ల్యూహెచ్ఓ విచారణ
ఇబ్రహీంపట్నం రూరల్: కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మరణించిన ఘటనపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) విచారణ చేపట్టింది. కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్ర ప్రోగ్రాం అధికారి డాక్టర్ సూర్యశ్రీరావు ఆధ్వర్యంలో వైద్య బృందం గురువారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించింది. గత నెల 25న జరిగిన ఆపరేషన్లపై వైద్యుల నుంచి బృందం సభ్యులు వివరాలు తెలుసుకున్నారు. శస్త్రచికిత్సల సమయంలో ఉపయోగించిన ఆపరేషన్ పరికరాలను పరిశీలించారు. వాటిని ఎలా స్టెరిలైజ్ చేశారో ఆపరేషన్ థియేటర్లో పని చేసే సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆపరేషన్లు జరిగిన అనంతరం మహిళలను ఇంటికి పంపే ముందు వాడిన మందుల గురించి రికార్డు చేసుకున్నారు. -
బాధ్యులపై చర్యలు తప్పవు
ఇబ్రహీంపట్నం రూరల్/ ఇబ్రహీంపట్నం: కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కారణంగా నలుగురు మహిళలు మృతి చెందిన ఘటనలో బాధ్యులను వదిలిపెట్టేది లేదని జాతీయ మహిళా కమిషన్ కార్యదర్శి మీటా రాజీవ్ లోచన్ హెచ్చరించారు. జాతీయ మహిళా కమిషన్ బృందం శనివారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించింది. బృందం సభ్యులు వైద్యులతో సమీక్ష నిర్వహించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీతారాంపేట్ గ్రామానికి వెళ్లి కు.ని. ఆపరేషన్ వికటించి మృతి చెందిన లావణ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆపరేషన్ జరిగిన సమయం నుంచి.. లావణ్య మరణించే వరకు ఏం జరిగిందని ఆరా తీశారు. ఈ సందర్భంగా మీటా రాజీవ్ లోచన్ మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం ఘటనపై ప్రాథమిక స్థాయిలో విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తప్పవన్నారు. బాధితులకు అందాల్సిన పరిహారంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. ఆరు నెలల్లో పూర్తి స్థాయిలో వివరాలు సేకరించి నివేదిక అందజేస్తామన్నారు. చివరగా కేంద్ర బృందం రంగారెడ్డి కలెక్టరేట్‌కు చేరుకుంది. అక్కడ అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్‌తో బృందం సభ్యులు సమావేశమయ్యారు. పూర్తిస్థాయిలో విచారణకు వైద్యాధికారులను ఆదేశించాలని.. వివరాలను మహిళా కమిషన్‌కు అందజేయాలని సూచించారు. -
కు.ని. మరణాలపై ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చాకే..
సాక్షి, హైదరాబాద్: ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో డీపీఎల్ ఆపరేషన్ల ఘటనపై విచారణ అత్యంత పారదర్శ కంగా చేస్తున్నట్లు ప్రజారోగ్య విభాగంసంచాలకుడు జి.శ్రీనివాసరావు తెలిపారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్టు వచ్చిన తర్వాతే తుది నివేదికను రూపొందించనున్నట్లు వివరించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకు నేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నా రు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు 12 లక్షల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. దురదృష్టవశాత్తూ తొలిసారిగా ఇబ్రహీంపట్నం సీహెచ్‌సీలో కుటుంబ నియంత్రణ చికిత్స చేయించుకున్న వారిలో నలుగురు ప్రాణాలు కోల్పోయా రని, ఇది అత్యంత బాధాకరమని అన్నా రు. ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయం తీసుకుందని, సర్జరీలు నిర్వహించిన ఆస్పత్రి వైద్య విధాన పరి షత్ పరిధిలో ఉండగా, ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రాం కుటుంబ సంక్షేమ శాఖ కమిషనరేట్ పరిధిలో ఉందన్నారు. ఈ నేపథ్యంలో విచారణ నిష్పక్షపాతంగా జరగాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం, ఆ రెండు విభాగాలకు కాకుండా ప్రజారోగ్య విభాగానికి విచారణ బాధ్యతలను అప్పగించిందని పేర్కొన్నా రు. ప్రాథమిక చర్యల్లో భాగంగా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేసినట్లు వివరించారు. అదేవిధంగా చికిత్స చేసిన వైద్యుడికి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నోటీసులు ఇచ్చిందని, వైద్యుడి లైసెన్స్‌ను తాత్కాలికంగా రద్దు చేశామని వెల్లడించారు. స్టెరిలైజేషన్‌లో జరిగిన లోపాల వల్లే బాధి తులు ఇన్ఫెక్షన్కు గురైనట్లు ప్రాథమికంగా భావి స్తున్నామని తెలిపారు. ప్రభుత్వ అనుమతితో ఆ నివేదికను మీడియాకు సైతం ఇస్తామన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు, ఇలాంటి ఘటనలు పునరావృతంకాకుండా చర్య లు తీసుకోవాలని ప్రభుత్వం కుటుంబ సంక్షేమ కమిషనర్‌ను ఆదేశించిందన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా క్యాంపులో చికిత్స చేయించు కున్న మిగతా వారిని నిమ్స్, అపోలో ఆస్పత్రులకు తరలించి ఉచితంగా చికిత్స అందిస్తున్నట్లు వివ రించారు. వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా అక్కడ వైద్యాధికారులను నియమించిందని, చికిత్స పొందుతున్న వారంతా ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉండగా, ఇప్పటికే 12 మందిని డిశ్చార్జ్ చేశామని వెల్లడించారు. ఒకట్రెండు రోజుల్లో మిగతావారిని కూడా డిశ్చార్జ్ చేస్తామని శ్రీనివాసరావు తెలిపారు. -
కు.ని. ఆపరేషన్లపై పారదర్శకంగా విచారిస్తాం
ఇబ్రహీంపట్నం: కుటుంబ నియంత్రణ (కు.ని.) ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు చనిపోయిన ఘటనలో ప్రభుత్వానికి 2 రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక ఇస్తామని నిపుణుల కమిటీ విచారణాధికారి, ప్రజారోగ్యశాఖ సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఆయన శుక్రవారం ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రిని ఆయన సందర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కు.ని. ఆపరేషన్లు చేయించుకున్నవారిలో నలుగురు మృతి చెందడం బాధాకరమన్నారు. ఈ ఘటనపై పారదర్శకంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏప్రిల్ నుంచి ఈ ఆస్పత్రిలో 5 క్యాంపులు నిర్వహించగా గత నెల 25న జరిగిన ఆపరేషన్లు వికటించాయన్నారు. ఇక్కడ ఆపరేషన్లు చేసిన వైద్యులు ఆ మరుసటి రోజు చేవెళ్లలో 60 మందికి, సూర్యాపేటలో 100 మందికి శస్త్రచికిత్సలు చేశారని చెప్పారు. ఎక్కడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలే దన్నారు. ఆరోజు ఆపరేషన్లు చేసుకున్న మరో 30 మంది ఆరోగ్య పరిస్థితి నిలకడ గా ఉందన్నారు. నిమ్స్ నుంచి ఐదుగురిని, అపోలో నుంచి ఆరుగురిని శుక్రవారం డిశ్చార్జి చేశామన్నారు. వైద్యులు, వైద్య సిబ్బందిని విచారిస్తున్నామని.. పోస్టు మార్టం, ఫోరెన్సిక్ నివేదికలు వస్తే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందన్నారు. -
హైదరాబాద్: ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రికి విచారణ కమిటీ
-
ఇవ్వాళ వచ్చి హడావుడి చేస్తున్నారు
లక్డీకాపూల్: ‘రెండు రోజుల అనంతరం విపక్షాల నేతలు ఇవ్వాళ హాస్పిటల్‌కు వచ్చి హడావుడి చేస్తున్నారంటూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి హరీశ్‌రావు మండిపడ్డారు. బుధవారం ఆయన నిమ్స్ ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతున్న ‘ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్’బాధితులను పరామర్శించారు. ఘటన జరిగిన మరుక్షణం నుంచి రాత్రింబవళ్లు వాళ్లను కాపాడుకుంటున్నామని స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నం ఘటనలో ఇన్ఫెక్షన్ సోకి నలుగురు చనిపోవడం దురదృష్టకరమని అన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వైద్యుడి లైసెన్స్ రద్దు చేశామని, సూపరింటెండెంట్ని సస్పెండ్ చేశామని చెప్పారు. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడతామని, విచారణ కమిటీ నివేదిక రాగానే చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. తాము రాజకీయాలు చేయబోమని, ప్రజల ప్రాణాలు కాపాడతామని మంత్రి స్పష్టం చేశారు. ఇళ్లల్లో ఉన్న మిగిలిన బాధితులను కూడా అంబులెన్స్‌ల్లో తీసుకువచ్చి అపోలో, నిమ్స్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఆరోగ్య శాఖ అధికారులు ఆయా ఆస్పత్రుల వద్దే ఉంటూ బాధితుల పరిస్థితిని గంటగంటకూ పర్యవేక్షిస్తున్నారని, నిమ్స్‌లో 17 మంది, అపోలోలో 13 మంది బాధితులు ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారన్నారు. ఇన్ఫెక్షన్ కూడా తగ్గుముఖం పట్టిందని, రెండు మూడు రోజుల్లో అందరూ డిశ్చార్జి అవుతారని చెప్పారు. ఆరేడేళ్లలో 12 లక్షల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగాయని, ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదన్నారు. మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల నష్టపరిహారాన్ని అందజేశామని, డబుల్ బెడ్ రూం ఇళ్లను కూడా ఇస్తామని మంత్రి హరీశ్ తెలిపారు. -
కు.ని. విషాద ఘటన.. అయ్యో దేవుడా! ఈ పిల్లల బతుకులెట్లా?
మౌలిక సదుపాయాల లేమి, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వెరసి అనేక మంది తల్లీపిల్లలకు తీరని కడుపుకోతను మిగుల్చుతోంది. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్యసేవలు పొందవచ్చని భావించి ఎంతో ఆశతో ఆస్పత్రులకు చేరుకుంటున్న గర్భిణులు, బాలింతలను మృత్యుపాశాలు వెంటాడుతున్నాయి. ఇబ్రహీంపట్నం సీహెచ్‌సీలో కు.ని చికిత్సలు వికటించి రెండు రోజుల్లో నలుగురు తల్లులు మృత్యువాతపడటం యావత్ రాష్ట్రాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. రోగుల నిష్పత్తికి సరిపడా మౌలిక సదుపాయాలు, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాల్సిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పట్టానట్టుగా వ్యవహరించడమే ఇందుకు కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, ఇబ్రహీంపట్నం: కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించడంతో మృత్యువుతో పోరాడి ప్రాణాలొదిలిన అవుతపురం లావణ్య (22) అంత్యక్రియలు సీతారాంపేటలో ప్రశాంతంగా ముగిశాయి. లావణ్యకు ఇద్దరు కుమార్తెలు అక్షర (6), భావన (4) కుమారుడు యశ్వంత్ (ఏడు నెలలు) ఉన్నారు. చివరి చూపుల సందర్భంగా అత్తమామలు,, బంధువుల రోదనలతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. ఏమి జరిగిందో తెలియని పసిమొగ్గలను చూసి వారు కన్నీటి పర్యంతమయ్యారు. బరువెక్కిన హృదయంతో ఓదార్చారు. అసలు ఏం జరిగిందో తెలియక పసిమొగ్గలు దీనంగా చూస్తుండటాన్ని అందరినీ కదిలించింది. తమ తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయిందని, ఇక తాము చూడ లేమని తెలియని ఆ చిన్నారులను చూసి చలించి పోయారు. భర్త లింగస్వామి ఓ రైతు వద్ద జీతం చేస్తూ అతని వ్యవసాయ పనులు చేస్తుంటాడు. సొంత ఇల్లు కూడలేని దీనస్థితి ఆ కుటుంబానిది. ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. తలకొరివి పెట్టిన మామ కట్టుకున్న భర్త, కన్న కుమారుడు ఉన్నప్పటికీ అర్ధంతరంగా తనువు చాలించడంతో లావణ్య మామ యాదయ్య అంత్యక్రియల ప్రక్రియ నిర్వహించారు. ఏడు నెలల బాబు చేతిని ముట్టించి దహన సంస్కారాల కార్యక్రమంలో మామ యాదయ్య ముందు నడిచాడు. ఏ జన్మలో రుణపడి ఉన్నానో నంటూ కో డలి మృతదేహం చుట్టూ తిరిగి దహన సంస్కా రాలు చేయడం అక్కడున్న వారిని కదిలించింది. సుష్మ కూతురు శాన్వి, కుమారుడు శ్రేయన్ను ఓదార్చుతున్న జెడ్పీటీసీ సభ్యురాలు నిత్యారెడ్డి లింగంపల్లిలో సుష్మ అంత్యక్రియలు మంచాల: కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి మృతి చెందిన మైలారం సుష్మ స్వగ్రామం లింగంపల్లిలో మంగళవారం విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె అంత్యక్రియలకు వివిధ గ్రామాల నుంచి ప్రజా ప్రతినిధులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. సుష్మ కూతురు శాన్వి, కుమారుడు శ్రేయన్ అమ్మ కావాలని ఏడవడం అక్కడున్న వారిని కంటతడి పెట్టిస్తోంది. మంచాల జెడ్పీటీసీ మర్రి నిత్యారెడ్డి.. సుష్మ మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం సుష్మ భర్త ఈశ్వర్, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కొంత ఆర్ధిక సాయం చేశారు. ఇది పూర్తిగా ప్రభుత్వం వైఫల్యమే కారణమని జెడ్పీటీసీ ఆరోపించారు. ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమె వెంట సర్పంచ్ వినోద మూర్తి, ఎంపీటీసీ జయనందం తదితరులు పాల్గొన్నారు. మౌనిక పిల్లలు పిల్లల ఆమయాక చూపులు అదే విధంగా మాడ్గుల మండలం కొలుకుల పల్లి పంజాయతీ పరిధిలోని రాజీవ్ తండాకు చెందిన మౌనికకు నాలుగేళ్ల కిందట శ్రీనివాస్ నాయక్‌తో పెళ్లి జరిగింది. వీరికి మాను శ్రీ(3), గౌతమ్(15 నెలలు) ఇద్దరు పిల్లలు. శ్రీనివాస్ నాయక్ వ్యవసాయం, కూలీ పనులు చేస్తుంటాడు. మౌనిక భర్తతో కలిసి పనులకు వెళ్తూ కుటుంబానికి ఆసరాగా ఉండేది. అయితే మౌనిక తల్లి తిరిగిరాదని లోకాలకు వెళ్లిందని తెలియక పిల్లలు అమాయక చూపులు చూస్తున్నారు. భర్త శ్రీనివాస్ నాయక్ సైతం కన్నీటి పర్యంతమవుతున్నాడు. మమత, ఇద్దరు పిల్లలు భర్తకు చేదోడువాదోడు ఇక ఇదే మండలం నర్సాయపల్లికి చెందిన మమత, మల్లేష్ గౌడ్లకు అయిదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్. వర్షిత్(4), విహాన్(2). పేద కుటుంబానికి చెందిన మల్లేష్ గౌడ్ వ్యవసాయం చేసుకుంటూ డీసీఎం వ్యాన్ నడుపుకుంటున్నాడు. వ్యవసాయంలో భర్తకు చేదుడో వాదోడుగా ఉండే మమత ఇలా తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో పిల్లలు, భర్త భోరున విలపిస్తున్నారు. -
మహిళల మృతి పట్టదా.. బీహార్‌కు ఎలా వెళ్తారు: కేసీఆర్‌పై కోమటిరెడ్డి ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇబ్రహీంపట్నం కు.ని ఆపరేషన్ల ఘటన సంచలనంగా మారింది. ఈ ఆపరేషన్లలో వైద్యుల నిర్లక్ష్యంగా నలుగురు మహిళలు మృతిచెందారు. దీంతో, ప్రభుత్వ తీరుపై ప్రతిపక్ష నేతలు, ప్రజలు మండిపడుతున్నారు. కాగా, మహిళల మృతిపై కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా కేసీఆర్ సర్కార్, సీఎంపై ఫైరయ్యారు. కేసీఆర్ బీహార్ పర్యటనను ప్రస్తావిస్తూ కోమటిరెడ్డి ఓ లేఖ రాశారు. ఈ లేఖలో పేదల ప్రాణాల కంటే మీకు రాజకీయాలే ముఖ్యమా సీఎం కేసీఆర్‌ను కోమటిరెడ్డి ప్రశ్నించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విఫలమై నలుగురు మహిళలు మరణిస్తే మీకు వారిని పరామర్శించే తీరిక లేదు. కానీ విమానంలో పట్నాకు వెళ్లి రాజకీయాలు మాట్లాడే టైం ఉందా? అంటూ కోమటిరెడ్డి సదరు లేఖలో కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లు విఫలమై నలుగురు మహిళలు మరణిస్తే మీకు వారిని పరామర్శించే తీరిక లేదు. కానీ విమానంలో పట్నాకు వెళ్లి రాజకీయాలు మాట్లాడే టైం ఉందా? పేదల ప్రాణాల కంటే మీకు రాజకీయాలే ముఖ్యమా? — Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) August 31, 2022 అనుకూల మీడియాలో వైద్య ఆరోగ్య శాఖ గురించి అనవసర ప్రచారం చేయించే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కనీస బాధ్యత లేకుండా వ్యవహరించడం దారుణం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి బాధ్యత వహిస్తూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా చేయాలి. — Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) August 31, 2022 -
‘గదిలో కింద పడుకోబెట్టి గంటలో 34 మందికి ఆపరేషన్లు ఎలా చేస్తారు?’
సాక్షి, హైదరాబాద్: ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటనను తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. మహిళల మృతి నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం బాధితులను ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పరామర్శించారు. మంత్రి హరీష్ రావు బుధవారం నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి బాధితులను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ.. ఆరేళ్లలో 12 లక్షల మందికి ఆపరేషన్లు చేశాం. ఎప్పుడూ ఇలా జరగలేదు. ఈ ఆపరేషన్లు చేసిన డాక్టర్ల లైసెన్స్‌లను రద్దు చేశాము. ఈ ఘటనపై కమిటీ నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటాము అని స్పష్టం చేశారు. మరోవైపు.. ఇబ్రహీంపట్నం ఆపరేషన్ల ఘటనపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సైతం స్పందించారు. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. గంటలో 34 మందికి ఎవరైనా ఆపరేషన్లు చేస్తారా.? ఇలా మహిళల ప్రాణాలతో ఆటుకుంటారా?. టెస్టులు చేయకుండా, ఆరోగ్య పరిస్థితి తెలుసుకోకుండా ఇలా కు.ని ఆపరేషన్లు చేస్తారా?. వారిని ఆసుపత్రి గదిలో కింద పడుకోపెట్టి అంత తొందరగా ఆపరేషన్లు చేయాల్సిన అవసరం ఏముంది అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాగా, అపోలో ఆసుపత్రిలో 11 మంది, నిమ్స్‌లో 19 మంది చికిత్స పొందుతున్నారు. ఇది కూడా చదవండి: కు.ని.ఆపరేషన్‌పై భయాందోళనలు.. వ్యాసెక్టమీతో పురుషులకు వచ్చే ఇబ్బందులేంటి? -
తెలంగాణలో ఇలాంటి ఘటన ఇదే తొలిసారి.. విచారణకు ఆదేశించాం: డీహెచ్
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించిన ఘటనలో నలుగురు మహిళలు మృతి చెందారు. సోమవారం రోజున ఇద్దరు మృతి చెందగా, ఇవాళ ఇబ్రహీంపట్నం మున్సిపల్ సీతారాంపేటకు చెందిన లావణ్య, కొలుకుల పల్లికి చెందిన మౌనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. ఈనెల 25 మృతుల బంధువులు ఆందోళనకు దిగే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ముందస్తు చర్యగా పోలీసులు ఇబ్రహీంపట్నం- సాగర్ హైవేపై భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. కుని ఆపరేషన్లు తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా జరిగే ప్రక్రియ. గతేడాది రాష్ట్రంలో 38వేల మందికి పైగా కు.ని. ఆపరేషన్లు నిర్వహించాం. ఇబ్రహీంపట్నంలో ఆపరేషన్లు చేసిన వైద్యుడు చాలా అనుభవజ్ఞుడు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఇలాంటి ఘటనలు మొదటసారి. కాజ్ ఆఫ్ డెత్ కోసం నలుగురికి పోస్టుమార్టం నిర్వహించాం. మిగతా 30 మంది ఇళ్లకు వెళ్లి ఆరోగ్య పరిస్థితి మానిటరింగ్ చేస్తున్నాం. 30 మందిలో ఏడుగురిని హైదరాబాద్ ఆస్పత్రికి తరలించాం. మరో ఇద్దరు మహిళలను నిమ్స్‌కు తరలించాం. చనిపోయిన వారికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా, డబుల్ బెడ్రూం, వారి పిల్లల చదువులకు ప్రభుత్వం సహకారం అందిస్తుంది. ఈ ఘటనలో ఇద్దరు వైద్యాధికారులపై సస్పెన్షన్ వేటు వేశాము. ఘటనపై విచారణ జరిపి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించామని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. చదవండి: (వికటించిన కుటుంబనియంత్రణ ఆపరేషన్) -
వికటించిన కుటుంబనియంత్రణ ఆపరేషన్
-
వికటించిన కుటుంబనియంత్రణ ఆపరేషన్.. ముగ్గురు మృతి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: మౌలిక సదుపాయాల లేమి, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వెరసి అనేక మంది తల్లీపిల్లలకు తీరని కడుపుకోతను మిగుల్చుతోంది. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్యసేవలు పొందవచ్చని భావించి ఎంతో ఆశతో ఆస్పత్రులకు చేరుకుంటున్న గర్భిణులు, బాలింతల ను మృత్యుపాశాలు వెంటాడుతున్నాయి. రోగుల నిష్పత్తికి సరిపడా మౌలిక సదుపాయాలు, వైద్య సిబ్బ ందిని ఏర్పాటు చేయాల్సిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పట్టానట్టుగా వ్యవహరించడమే ఇందుకు కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తల్లులను కోల్పోయిన పిల్లలు ►ఇబ్రహీంపట్నం సీహెచ్‌సీలో కు.ని చికిత్సలు వికటించి రెండు రోజుల్లో ముగ్గురు తల్లులు మృత్యువాత పడగా, మరొకరు వెంటిలేటర్‌పై చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. పిల్లలు గుక్కపట్టి ఏడుస్తున్నారు. ►ఆమనగల్లు మండలం గౌరారం గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త ఈశ్వరమ్మ కొంత కాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి (ఆదిలక్ష్మీ నర్సింగ్ హోం/సీబీఎం) తరలించారు. ఈ నెల 23న వైద్యులు ఆమెకు గర్భసంచి తొలగింపు సర్జరీ చేశారు. తీవ్ర రక్తస్రావంతో ఆమె మృతిచెందగా పిల్లలు అనాథలయ్యారు. బిడ్డలను కోల్పోయిన తల్లులు ►కొందుర్గు మండలం, తంగెళ్లపల్లికి చెందిన మేఘమాల పురిటి నొప్పులతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు గత గురువారం చికిత్స కోసం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అడ్మిట్ చేసుకున్న సిబ్బంది ఆ తర్వాత నిర్లక్ష్యం చేశారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత నొప్పులు అధికమై బిడ్డ కడుపులో అడ్డం తిరగడంతో తమ వల్ల కాదంటూ చేతులెత్తేశారు. హుటాహుటిన ప్లేట్లబురుజు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే బిడ్డ చనిపోయింది. ►నందనవనంలో నివసించే సరిత(24) పురిటి నొప్పులు రావడంతో ప్రసవం కోసం ఈ నెల 4న వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి చేరుకుంది. పరీక్షించిన వైద్యులు ప్రసవానికి మరో నెల ఉందన్నారు. నొప్పులు భరించలేక పోతున్నానని సరిత చెప్పడంతో అడ్మిట్ చేశారు. ఉదయం అడ్మిటైన గర్భిణిని సాయంత్రం వరకు ఎవరూ పట్టించుకోలేదు. చివరికి సిజేరియన్ చేయగా అప్పటికే కడుపులోని బిడ్డ కడుపులోనే కన్నుమూసింది. అట్టుడికిన ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నం: కు.ని ఆపరేషన్లు వికటించి ముగ్గు రు మహిళలు మృతి చెందిన సంఘటనతో సోమవా రం ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మృతుల కుటుంబసభ్యులు, బంధువులు స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో బైఠాయించారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. సుష్మ మృతదేహన్ని అంబులెన్స్‌లో ఉంచి ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు చిలుక మధుసూదన్‌రెడ్డి తదితరులు వీరికి మద్దతుగా నిలిచారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా వైద్యాధికారి స్వరాజ్వలక్ష్మిని చుట్టుముట్టి నిలదీశారు. ఎక్స్‌గ్రేషియా.. డబుల్ బెడ్రూం.. విచారణకు హామీ ఆందోళన చేస్తున్న వారికి ఆర్డీఓ వెంకటాచారి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని ప్రకటించినా ససేమిరా అనడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఆర్డీఓ విషయాన్ని ఫోన్‌ద్వారా కలెక్టర్‌కు విన్నవించారు. రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని, డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తామని, పూర్తిస్థాయి విచారణ జరిపి సంబంధిత వైద్యాధికారులపై చర్యలు తీసుకుంటామని సర్దిచెప్పారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు శాంతించారు. సమగ్ర విచారణ జరిపిస్తాం ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని కమిషనర్ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ ప్లానింగ్ అడిషనల్ డైరెక్టర్ రవీందర్ నాయక్ తెలిపారు. సోమవారం ఆయన ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిని డిప్యూటీ డీహెంహెచ్‌ఓ నాగజ్యోతితో కలిసి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఈ నెల 25న డీపీఎల్ క్యాంపులో 34 మందికి ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేసినట్లు చెప్పారు. వీరిలో నలుగురికి మాత్రమే ఆరోగ్య సమస్యలు తలెత్తాయన్నారు. వీరిలో ముగ్గురు చనిపోవడం బాధాకరమన్నారు. ఈ ఘటనపై ఎక్స్పర్ట్ కమిటీ వేసి విచారణ జరిపిస్తామని, త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. – ఫ్యామిలీ ప్లానింగ్ అడిషనల్ డైరెక్టర్ రవీందర్ నాయక్ చదవండి: (తెలంగాణలో భారీగా పెరిగిన క్రైం రేటు.. దేశంలోనే నెం.1) -
ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ వద్ద ఆరుగురు విద్యార్థులు గల్లంతు
-
Ranga Reddy: కాంగ్రెస్‌లో ‘కుర్చీ’లాట!
మునిసిపల్ అధ్యక్ష పదవి కోసం ముసలం పుట్టి.. ముదిరి పాకానపడుతోంది. నువ్వానేనా అంటూ ‘కుర్చీ’కోసం పార్టీ పెద్దల చుట్టూ ఆశావహులు వరుస కట్టగా.. పార్టీ శ్రేణులు మాత్రం పోటీదారుల పట్ల పెదవి విరుస్తున్నారు. స్వలాభం కోసమే తప్ప.. పార్టీ భవిష్యత్ పట్టని వారికి పీఠం కట్టబెట్టొద్దంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, రంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీలో ముసలం ముదురుతోంది. పార్టీ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ అధ్యక్ష పదవి కోసం పోటీ తీవ్రమైంది. ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు పండాల శివగౌడ్ పార్టీ కార్యకలాపాలపై చొరవ చూపడంలేదన్న విమర్శలు వస్తున్నాయి. గత మున్సిపల్ ఎన్నికలప్పుడు ఈ పదవిలో శివగౌడ్‌ను నియమించారు. మున్సిపాలిటీ పరిధిలో పార్టీని సమన్వయంతో ముందుకు తీసుకేళ్ళడం, పటిష్టపరచడం, పార్టీ కార్యక్రమాలపై స్పందించడంలో ఆయన విఫలమైయ్యాడని కార్యకర్తలు విమర్శిస్తున్న నేపథ్యంలో కొత్త వ్యక్తిని నియమించేందుకు అధిష్ఠానం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆశావహుల్లో ఆశలు మొలకెత్తుతున్నాయి. కాంగ్రెస్ తరపున కౌన్సిలర్‌గా పోటీ చేసి ఓడిపోయిన మైనార్టీ వర్గానికి చెందిన ఎండీ గౌస్ కొంతకాలంగా అధ్యక్ష పదవి కోసం తహతహలాడుతూ ప్రయత్నాలు చేస్తున్నాడని, అదేవిధంగా కౌన్సిలర్ ఆకుల మమత భర్త ఆనంద్ నేను సైతం అంటున్నట్లు సమాచారం. వీరితో పాటు మరో ఇద్దరు! అధ్యక్ష పదవి పోటీలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆనంద్ వరెస్స్ గౌస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం ఆనంద్, గౌస్‌ల మధ్య తీవ్ర పోటీ ఉందని, ఇందు కోసం ఇరువురు పార్టీ పెద్దల దర్శనం కోసం రాష్ట్ర రాజధాని కార్యాలయం చుట్టూ ప్రదర్శనలు చేస్తుండటంతో పార్టీలో వార్ మొదలైంది. ఆనంద్‌కు పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెట్టొద్దని పలువురు ఆ పార్టీ కౌన్సిలర్లు అధిష్ఠానానికి విన్నవించినట్లు సమాచారం. మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉన్నప్పటికీ నాయకత్వలోపం స్పష్టంగా కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికల ముందు పలువురు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. కార్యకర్తలను ఏకతాటిపై నడిపించే నాయకత్వం లేకపోవడంతో మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆ పార్టీ చతికిలపడిపోయింది. 24 స్థానాల్లో కేవలం 6 కౌన్సిలర్ల స్థానాలకే కాంగ్రెస్ పరిమితమైంది. తాజాగా ఆకుల ఆనంద్‌కు అధ్యక్ష పదవి ఇచ్చే అంశంపై విభేదాలు తలెత్తుతున్నాయి. కొంతమంది కౌన్సిలర్లు ఆనంద్ అభ్యర్తిత్వాన్ని తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై మున్సిపాలిటీలో పార్టీ ఏ దారిన వెళుతుందో వేచిచూడాల్సిందే.ఇదిలా ఉండగా మున్సిపాలిటీలో బలంగా ఉన్న పార్టీ రోజురోజుకూ బలహీనపడిపోతుండంతో పార్టీ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. కాంగ్రెస్ కౌన్సిలర్లకు టీఆర్ఎస్ గాలం పార్టీలో అటు నియోజకవర్గ స్థాయిలో, ఇటు మండల, మున్సిపాలిటీ స్థాయిల్లో గ్రూప్ తగాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆపార్టీలోని లొసుగులను అధికార పార్టీ టీఆర్ఎస్ సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను కారెక్కించే దిశగా రాయబారాలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. నలుగురు కౌన్సిలర్లు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని వినికిడి. ఇదే జరిగితే మున్సిపాలిటీలో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పరిస్థితి మరింత దయనీయంగా మారే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. (క్లిక్: ఘాటెక్కి.. చప్పబడ్డ విష్ణు విందు) -
బైక్ టైర్లో చున్నీ చుట్టుకుని.. రోడ్డుపై పడి విద్యార్థిని మృతి
సాక్షి, హైదరాబాద్: బైక్ వెనుక టైర్లో చున్నీ చుట్టుకోవడంతో విద్యార్థిని కిందపడి చనిపోయింది. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం యాచారం మండల కేంద్రానికి చెందిన సనా(18) ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆదివారం సాయంత్రం తన సోదరుడి బైక్‌పై కళాశాల నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా మార్గమధ్యలోని క్రీడా క్షేత్రం సమీపంలో ఆమె చున్నీ వెనుక టైర్లో చుట్టుకుంది. దీంతో ఆమె బైక్‌పై నుంచి కింద పడిపోయింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సనా సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లింగయ్య తెలిపారు. చదవండి: తల్లిని డ్రమ్‌లో పెట్టి సిమెంట్‌తో కప్పేశాడు! -
రియల్టర్ల జంట హత్య: ఇబ్రహీంపట్నం ఏసీపీపై వేటు
సాక్షి, హైదరాబాద్: అనుకున్నట్టుగానే ఇబ్రహీంపట్నం ఏసీపీ కె.బాలకృష్ణారెడ్డిపై వేటు పడింది. సంచలనం రేపిన ఇబ్రహీంపట్నం కర్ణంగూడ రియల్టర్ల జంట హత్యల కేసులో విధుల పట్ల నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణ నేపథ్యంలో బాలకృష్ణారెడ్డిని అంబర్‌పేట సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌కు బదిలీ చేస్తూ రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన స్థానంలో భువనగిరి ట్రాఫిక్ ఏసీపీ ఎం.శంకరయ్యను నియమించారు. ఇదే వ్యవహారంలో ఇబ్రహీంపట్నం పీఎస్‌లో దీర్ఘకాలంగా విధుల్లో ఉన్న మరో పోలీసు అధికారిపై కూడా త్వరలోనే వేటు పడనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఈ వ్యవహారంలోఇబ్రహీంపట్నం సబ్ ఇన్స్పెక్టర్ విజయ్, ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ రైటర్‌గా పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ బాలకృష్ణను అంబర్‌పేట హెడ్ క్వార్టర్స్‌కు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం సీరియస్.. కర్ణంగూడలోని లేక్‌విల్లా ఆర్చిడ్స్‌లో నెలకొన్న భూ వివాదాలపై అసోసియేషన్ ప్రతినిధులతో పాటు శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిల హత్య కేసులో ప్రధాన నిందితుడు మేరెడ్డి మట్టారెడ్డి గతంలో ఇబ్రహీంపట్నం పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కానీ, పోలీసులు శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలకు మద్దతుగా నిలిచినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో పోలీసులకు భారీ స్థాయిలోనే ముడుపులు ముట్టాయని ఆరోపణలు వినిపించాయి. ఏం చేయలేని స్థితిలో మట్టారెడ్డి హత్యకు పథకం రచించినట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. పోలీసుల వ్యవహారంపై సీరియస్ అయిన సర్కారు.. శాఖాపరమైన విచారణకు పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఇక్కడ పరారీ..అక్కడ జైలులో.. హత్య జరిగిన 48 గంటల్లోనే కేసును చేధించిన పోలీసులు ప్రధాన నిందితుడు మట్టారెడ్డితో సహా ఖాజా మోహియుద్దిన్, బుర్రి భిక్షపతి, సయ్యద్ రహీమ్, సమీర్ అలీ, రాజు ఖాన్‌లను అరెస్ట్ చేయగా.. హత్యలో వినియోగించిన రెండు తుపాకులను తయారు చేసిన చందన్ సిబాన్, సోనులు పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ ఇద్దరు నిందితుల కోసం బీహార్‌కు వెళ్లిన ప్రత్యేక బృందాలకు షాకింగ్ న్యూస్ తెలిసిందే. అప్పటికే నిందితులు ఇద్దరిపై బీహార్‌లో పలు కేసులు ఉండటంతో వారిద్దరు స్థానిక జైలులో ఉన్నట్లు తెలిసింది. దీంతో ఉత్తి చేతులతో తిరుగు ప్రయాణమైన రాచకొండ పోలీసులు.. పిటీ వారెంట్‌ను సమర్పించి నిందితులు ఇద్దరిని హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.∙ -
ఐదుగురు పోలీసులపై వేటు తప్పదా..!
ఇబ్రహీంపట్నం రూరల్: సంచలనం రేపిన రియల్టర్ల జంట హత్యల కేసులో కొంతమంది పోలీసులపై వేటు తప్పదని తెలుస్తోంది. రెండు నెలలుగా లేక్‌విల్లాలోని భూ తగాదాల్లో శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, మట్టారెడ్డి మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ తగాదాల్లో అనేకమార్లు మాట్లాడినప్పటికీ సయోధ్య కుదరలేదు. ఈ క్రమంలో శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి ఇద్దరూ మట్టారెడ్డిని బెదిరించినట్లు సమాచారం. అదేరోజు తనకు ప్రాణహాని ఉందని వారిద్దరిపై మట్టారెడ్డి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పట్టించుకోలేదని తెలిసింది. ఉన్నత స్థాయి అధికారి నోటీసుకు ఫిర్యాదు వెళ్లినా స్పందన లేదని.. దీంతో భయాందోళనకు గురైన మట్టారెడ్డి.. ఎలాగైనా వారిద్దరి నుంచి ప్రాణాలు కాపాడుకోవాలని ఇలా హత్యకు కుట్ర చేసినట్లు సమాచారం. భారీగా ముడుపులు..! పోలీసులకు శ్రీనివాస్‌రెడ్డి నుంచి భారీగా ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏకంగా శ్రీనివాస్‌రెడ్డికి మద్దతుగా ఓ పెద్ద స్థాయి పోలీసు అధికారి లేక్‌విల్లాను పరిశీలించి వెళ్లారని సమాచారం. కేసును కనీసం పట్టించుకోలేదని మట్టారెడ్డి ఆరోపించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై రాచకొండ పోలీసు కమిషనర్ సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ఫిర్యాదు చేసినా బాధ్యతారహితంగా వ్యవహరించిన వారిపై వేటు వేయాలని రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఐదుగురు పోలీసులపై వేటు పడే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఫిర్యాదు చేసినా స్పందన లేకే.. రెండు నెలలుగా కర్ణంగూడలో భూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయని లేక్‌విల్లా ఆర్చిడ్స్ ఓనర్స్ అసోసియేషన్ వారు గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక కౌన్సిలర్లపై కేసులు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారు. మట్టారెడ్డి కేసుపై ఎటూ తేల్చలేదు. ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతోనే తన ప్రాణాలు కాపాడుకోవడానికి హత్య చేసినట్లు మట్టారెడ్డి అంగీకరించినట్లు తెలిసింది. మట్టారెడ్డి ఫిర్యాదు చేసినప్పుడే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుని ఉంటే హత్యల దాకా వచ్చేది కాదని చర్చించుకుంటున్నారు. ఐదుగురు నిందితులకు రిమాండ్ జంట హత్యల కేసులో ప్రధాన నిందితులను ఇబ్రహీంపట్నం పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. మేరెడ్డి మట్టారెడ్డి, ఖాజా మోహియుద్దీన్, బుర్రి భిక్షపతి, సయ్యద్ రహీం, సమీర్ అలీని సాయంత్రం ఇబ్రహీంపట్నం కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు. (చదవండి: కటకటాల్లో గజదొంగ నాయక్) -
ఇబ్రహీంపట్నం కాల్పుల కేసులో వీడిన మిస్టరీ
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన ఇబ్రహీంపట్నం రియల్టర్ల జంట హత్యల కేసులో మిస్టరీ వీడింది. మట్టారెడ్డి సహా ఐదుగురి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు ఆయుధాలు, 20 రౌండ్ల బులెట్లు స్వాధీనం చేసుకున్నారు. మట్టారెడ్డిని కీలక సూత్రధారిగా పోలీసులు తేల్చారు. లేక్‌విల్లా భూ వివాదమే హత్యకు కారణంగా పోలీసులు నిర్థారించారు. చదవండి: టార్గెట్ శ్రీనివాస్‌రెడ్డా..?లేక రాఘవేందర్‌రెడ్డా..? ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ మీడియాకు వెల్లడించారు. 48 గంటల పాటు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నామని తెలిపారు. మట్టారెడ్డికి గతంలో నేర చరిత్ర ఉందని తెలిపారు. మట్టారెడ్డి గెస్ట్ హౌస్ వద్ద సీపీ ఫుటేజీ లభించడంతో కీలక ఆధారం లభించిందని సీపీ తెలిపారు. -
ఇబ్రహీంపట్నం కాల్పుల కేసును చేధించిన రాచకొండ పోలీసులు
రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం కాల్పుల కేసును రాచకొండ పోలీసులు గురువారం చేధించారు. మట్టారెడ్డి గ్యాంగే హత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. మట్టారెడ్డితో పాటు ముగ్గురు అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. మట్టారెడ్డి, మొహినుద్దీన్, నవీన్‌తోపాటు మరో ఇద్దురిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్రెడ్డిని కాల్చి చంపింది సుపారీ గ్యాంగ్‌గా తేల్చారు. మోహినుద్దిన్ మట్టారెడ్డి వాచ్‌మెన్‌గా, నవీన్ శ్రీనివాస్‌రెడ్డి బినామీగా పోలీసులు గుర్తిచారు. -
టార్గెట్ శ్రీనివాస్‌రెడ్డా..?లేక రాఘవేందర్‌రెడ్డా..?
హైదరాబాద్/ఇబ్రహీంపట్నం : సంచలనం సృష్టించిన ఇబ్రహీంపట్నం రియల్టర్ల జంట హత్యల కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ హత్యలో ఏడెనిమిది మంది హంతకులు పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు కారు, ద్విచక్ర వాహనంపై వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలికి దగ్గర్లోనే పెట్రోల్ బంక్ ఉండటంతో అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌లో నిందితులు, వాహనాల రాకపోకలు ఏమైనా నిక్షిప్తమయ్యాయా? అనేదానిని పోలీసులు పరిశీలిస్తున్నారు. దుండగుల కాల్పుల్లో అల్మాస్‌గూడకు చెందిన నవారు శ్రీనివాస్ రెడ్డి, ఆర్ఎన్ రెడ్డి నగర్ ద్వారకామయినగర్ కాలనీకి చెందిన కోమటిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మృతి చెందడంతో.. కేసు ఛేదనలో పోలీసులు పూర్తిగా సాంకేతిక అంశాలపై ఆధారపడాల్సి వచ్చింది. సెల్‌ఫోన్ టవర్ లొకేషన్, కాల్ డేటా రికార్డ్ (సీడీఆర్) ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ప్రత్యక్ష సాక్షుల పాత్ర ఉందా? ► కాల్పులు జరిగిన ఘటనా స్థలానికి అత్యంత చేరువలో 10 నుంచి 15 గుడిసెలు ఉన్నాయి. వీరంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారు. వెంచర్‌లోని రోడ్లు, డ్రైనేజీ వర్క్స్, గుంతలు తీయటం వంటి పనులు చేస్తుంటారు. మంగళవారం శివరాత్రి పండగ కావటం, ఉదయం 8 గంటల ప్రాంతంలోనే కాల్పులు జరగడంతో ఆ సమయంలో గుడిసె వాసులు అక్కడే ఉండి ఉంటారని.. అనుమానాస్పద వ్యక్తులు వెంచర్లోకి రావటం, తూటాల శబ్దం వంటివి ఏమైనా గమనించారా? కాల్పులను ప్రత్యక్షంగా చూశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ► గుడిసెవాసుల్లోని 20 మంది మహిళలు, పురుషులను పోలీసులు బుధవారం విచారించారు. మంగళవారం శ్రీనివాస్ రెడ్డి మృతదేహం వద్ద జాగిలంతో పరిశీలించిన డాగ్ స్క్వాడ్‌ను బుధవారం మరోసారి రంగంలోకి దింపారు. ఘటన జరిగిన రోజు నేరుగా ఇబ్రహీంపట్నం రోడ్ వైపు పరుగెత్తిన జాగిలం.. బుధవారం మాత్రం మృతదేహం పడిన చోటే తిరిగింది. వెంచర్ బయటికి వెళ్లకపోవడం గమనార్హం. భూ వివాదాలే కారణం.. కానీ.. ► భూ వివాదాలే హత్యకు కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చినప్పటికీ.. ఆ తగాదా కర్ణంగూడలోని 10 ఎకరాల భూమి విషయంలోనా లేక వేరే ఏమైనా భూ తగాదాలా, సెటిల్మెంట్లా? అనేవి తేల్చే పనిలో పోలీసులు పడ్డారు. దీంతో రియల్టర్ల హత్యకు సుపారీ ఎవరు ఇచ్చారనేది పోలీసులకు సవాల్‌గా మారింది. ప్రతి రోజు ఉదయం శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలు కర్ణంగూడలోని తమ పొలానికి వచ్చి కాసేపు గడుపుతారనే సమాచారం తెలిసిన వ్యక్తే హత్యకు పథకం రచించి ఉంటాడని, అతనే హంతకులకు వారి సమాచారం అందించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ► శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి ఘటనా స్థలానికి రాకముందే హంతకులు అక్కడ కాపు కాస్తున్నా రని తెలిసింది. మృతులు ఇద్దరికీ ఆయుధ లైసెన్స్‌లు లేవని, స్వాధీనం చేసుకున్న బుల్లెట్, షెల్స్ ఆధారంగా హంతకులు రెండు తుపాకులు వాడినట్లు పోలీసులు నిర్ధారించారు. లాఅండ్ఆర్డర్ పోలీసులతోపాటు స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ), సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్), ఇంటలిజెన్స్ వంటి ఎనిమిది ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. స్థిర చరాస్తులపై దర్యాప్తు.. ► భూ వివాదాలు, సెటిల్మెంట్లే హత్యకు కారణ మని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో స్థిర, చరాస్తులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో రియల్టర్ మట్టారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి డ్రైవర్ కృష్ణ, ప్రధాన అనుచరులు హఫీజ్, నవీన్‌లను రెండు రోజుల నుంచి విచారిస్తున్నారు. శ్రీనివాస్‌రెడ్డికి నమ్మిన బంటైన కృష్ణ.. చిన్నతనం నుంచి శ్రీనివాస్ వెంటే ఉంటున్నాడని స్థానికులు చెబుతున్నారు. ► చర్లపటేల్గూడలోని పదెకరాలు కొనుగోలు చేసిన శ్రీనివాస్‌రెడ్డి.. ఆ భూమిని కృష్ణ పేరు మీదనే డెవలప్మెంట్కు తీసుకున్నట్లు సమాచారం. ఎప్పుడూ చుట్టూ అనుచరులు, సెక్యూరి టీతో ఉండే శ్రీనివాస్‌రెడ్డిని మీర్‌పేట నయీంగా పిలుస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. ► పట్నంతో పాటు అబ్దుల్లాపూర్‌మెట్, పెద్ద అంబర్‌పేట, అనాజ్‌పూర్, హయత్‌నగర్‌లో పెద్ద మొత్తంలో సెటిల్మెంట్లు చేస్తుంటాడని తెలిసింది. తుర్కయాంజాల్‌లో పెద్ద డీల్‌తో పాటు వనస్థలిపురంలో స్థలంవివాదంపై కోల్‌కతా వెళ్లి సెటిల్మెంట్ చేసినట్లు సమాచారం. ఉప్పందించిందెవరో..? ఇబ్రహీంపట్నం: మండల పరిధిలోని కర్ణంగూడలో మంగళవారం జరిగిన జంట హత్యల కేసు మిస్టరీ వీడలేదు. ఇక్కడ చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో ఇద్దరు రియల్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి మృతిచెందిన విషయం తెలిసిందే. కేసును ఛేదించేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ముఖ్యంగా తమ అనుచరులు లేకుండా శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి సైట్ వద్దకు వస్తున్నట్లు దుండగులకు ఎవరు ఉప్పందించారనేది కీలకంగా మారింది. ఈ విషయం తేలితే కేసు మిస్టరీని సులువుగా ఛేదించే అవకాశం ఉందని ఓ పోలీసు అధికారి చెప్పారు. సుపారీ గ్యాంగ్ కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో రెక్కీ నిర్వహించి పక్కా ప్రణాళికతో ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. స్పెషల్ టీంలతో దర్యాప్తు జంట హత్య కేసు మిస్టరీని ఛేదించేందుకు పోలీసు ఉన్నతాధికారులు ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎస్ఓటీ, ఐటీ సెల్, సీసీఎస్, ఎస్బీ, ఇంటెలిజెన్స్ ఇలా వేర్వేరు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో క్లూస్‌టీంకు లభించిన ఆధారాలు, బుల్లెట్లను పరిశీలిస్తున్నారు. కాల్పులకు వాడిన తుపాకులు, బుల్లెట్లు అక్రమంగా కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. కాల్పులు జరిగిన ప్రదేశానికి కొద్ది దూరంలో ఉన్న గుడిసెవాసులను, లేక్ విల్లాలో పనిచేస్తున్న కూలీలను పోలీసులు బుధవారం విచారించారు. కాల్పుల శబ్దం వినబడిందా? ఈ గొడవను మీరు చూశారా..? దుండగులను మీరు గుర్తు పట్టగలరా..? అనే కోణంలో వారిని విచారించారు. టార్గెట్ ఒక్కరేనా..? దుండగులు ఒక్కరినే టార్గెట్ చేసి వచ్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి ఒకే వాహనంలో ఉండటంతో దుండగులు ఇద్దరినీ హత్య చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే.. ఎవరిని టార్గెట్ చేసింది ఇంకా నిర్ధారణకు రాలేకపోతున్నారు. వీరి లక్ష్యం భూదందా, సెటిల్మెంట్లలో సిద్ధహస్తుడైన శ్రీనివాస్‌రెడ్డా..? లేక హత్య కేసులో జైలుకెళ్లి వచ్చిన రాఘవేందర్‌రెడ్డా..? అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరిపై వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన పాత కేసులను పరిశీలిస్తున్నారు. -
ఇబ్రహీంపట్నం రియల్టర్ల హత్యకు ధరణి పోర్టల్ తప్పిదాలే కారణం
-
ఇబ్రహీంపట్నం కాల్పుల కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: ఇబ్రహీంపట్నం కాల్పుల కేసు కీలక మలుపు తిరిగింది. కాల్పుల ఘటనను కిరాయి హంతకుల సుపారి హత్యగా పోలీసులు ప్రాధమికంగా నిర్ధారణ చేశారు. పాతకక్షల నేపథ్యంలో జరిగిన హత్యలుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక హత్య కేసులో రాఘవేందర్‌రెడ్డి నిందితుడని, శ్రీనివాస్‌రెడ్డిపై సైతం పలు కేసుల్లో ఉన్నట్లు తెలిపారు. వీరిద్దరూ కలిసి కొంతకాలంగా పలు లాండ్ అగ్రిమెంట్స్, డెవలప్మెంట్లు చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్యలకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అందులో భాగంగా ఎనిమిది స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు. మట్టారెడ్డితో పాటు శ్రీనివాస్‌రెడ్డి అనుచరులు.. హఫీజ్, కృష్ణలను పోలీసులు విచారిస్తున్నారు. నేడు(బుధవారం) పలువురు భూమి యజమానులను పోలీసులు విచారించనున్నారు. లేక్ వ్యూ విల్లాస్ యజమానులను వద్ద సైతం పోలీసులు వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. శ్రీనివాస్‌రెడ్డి అనుచరులు కృష్ణా, అఫీజ్‌లపైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. వివాదస్పద లేక్ విల్లా డెవలప్మెంట్ డ్రైవర్ కృష్ణ పేరుతో అగ్రిమెంట్ ఉన్నట్లు గుర్తించారు. హఫీజ్ పేరు మీద అబ్ధుల్లాపూర్‌మెట్‌లో కొంత భూమి రిజిస్ట్రేషన్ అయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. -
భూమిపై గురిపెట్టి.. నోట్లో గన్ పెట్టి
సాక్షి, హైదరాబాద్/ఇబ్రహీంపట్నం, ఇబ్రహీంపట్నం రూరల్: నగరశివారు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భూవివాదం ఇద్దరు రియల్టర్ల దారుణ హత్యకు దారితీసింది. సంచలనం సృష్టించిన ఈ ఘటన మంగళవారం ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగూడ సమీపంలో చోటుచేసుకుంది. ఉదయం 8 గంటల ప్రాంతంలో స్థిరాస్తి వ్యాపారులు నవారు శ్రీనివాస్‌రెడ్డి (38), కోమటిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి (40)లు తమ వాహనంలో వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు వారిపై కాల్పులు జరిపారు. అల్మాస్‌గూడకు చెందిన శ్రీనివాస్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడ్డ ద్వారకామయినగర్ కాలనీకి చెందిన రాఘవేందర్ రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఘటనా స్థలాన్ని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణలతో కలిసి సందర్శించారు. హతులిద్దరికీ నేరచరిత్ర ఉండటంతో ఈ కేసును ఛేదించడం పోలీసులకు సవాల్‌గా మారింది. నోట్లో గన్ పెట్టి..: శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్ రెడ్డి ఉదయం 6 గంటలకు ఇంట్లో నుంచి బయలుదేరి తమ స్కార్పియో వాహనంలో కర్ణంగూడలోని లేక్‌విల్లా అర్చిడ్స్కు చేరుకున్నారు. అక్కడ ఓ స్థల వివాదంపై నల్లగొండకు చెందిన మట్టారెడ్డితో మాట్లాడిన అనంతరం తిరుగుముఖం పట్టారు. కొన్ని మీటర్ల దూరం ప్రయాణించారో లేదో గుర్తు తెలియని వ్యక్తులు నాటు తుపాకీతో వీరిపై కాల్పులు జరిపారు. శ్రీనివాస్‌రెడ్డి తలలో రెండు బుల్లెట్లు, రాఘువేందర్రెడ్డి ఛాతి భాగంలో ఒక తూటా వెళ్లాయి. శ్రీనివాస్‌రెడ్డి కారు దూకి పారిపోతుండగా.. దుండగులు ఆయనను పట్టుకొని తుపాకీని నోట్లో పెట్టి కాల్చినట్లు తెలుస్తోంది. రాఘువేందర్ రెడ్డి కారులో పారిపోతుండగా వాహనం అదుపుతప్పింది. దీంతో ఆయన అపస్మారక స్థితికి చేరుకోవడంతో కారులోనే సుమారు అరగంటపాటు కొట్టుమిట్టాడినట్లు స్థానికులు చెప్పారు. పోలీసులు రాఘువేందర్ను బీఎన్‌రెడ్డి నగర్‌లోని ప్రైవేట్ అస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఘటనాస్థలంలో పోలీసులకు ఒక బుల్లెట్ లభ్యం కాగా.. కారులో రెండు బుల్లెట్ షెల్స్ లభించాయి. శ్రీనివాస్‌రెడ్డి అనుచరులుగా భావిస్తున్న హఫీజ్, కృష్ణతోపాటు మట్టారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. భూ వివాదమే కారణమా? ఇబ్రహీంపట్నం పరి«ధిలోని చర్లపటేల్‌గూడ రెవెన్యూ పరి«ధిలో ఇరవై ఏళ్ల క్రితం కొంతమంది రైతులు నల్లగొండ జిల్లాకు చెందిన ఇంద్రారెడ్డి అనే రియల్టర్‌కు కొంత భూమిని విక్రయించారు. ఆయన ఆ స్థలాన్ని వేరే వ్యక్తులకు విక్రయించగా.. వాళ్లు లేక్‌విల్లా ఆర్చిడ్స్ పేరుతో సుమారు 200–300 మంది కొనుగోలుదారులకు విక్రయించారు. ఒక్కో ప్లాట్ 1,111 గజాల విస్తీర్ణంలో ఉంటుంది. అయితే ధరణి వచ్చాక ఆ భూమి తిరిగి ఇంద్రారెడ్డి పేరుపై ఉన్నట్లు చూపించింది. రైతుబంధు పథకం కూడా వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈక్రమంలో ఇంద్రారెడ్డి నుంచి పదెకరాల స్థలాన్ని శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్ రెడ్డి కొనుగోలు చేశారు. దీంతో ముగ్గురి మధ్య వివాదం తలెత్తింది. ఎలాగైనా భూమిని దక్కించుకోవాలని భావించి శ్రీనివాస్‌రెడ్డి పదెకరాల పొలం చదును చేసి బోర్లు వేసి వ్యవసాయ భూమిగా మార్చాడు. మట్టారెడ్డి, ఇంద్రారెడ్డిలు శ్రీనివాస్‌రెడ్డితో రాజీ పడాలని నిర్ణయించుకున్నారు. దీనిపై ఇంద్రారెడ్డి, మట్టారెడ్డి సోమవారం రాత్రి ఫోన్లో మాట్లాడుకున్నారు. న్యాయవాది హత్య కేసులో దోషి రాఘవేందర్ రెడ్డి భార్య స్వాతిరెడ్డి హైకోర్టులో అడ్వొకేట్‌గా పనిచేస్తున్నారు. 2004లో ఓ మహిళా న్యాయవాది హత్య కేసులో రాఘవేందర్ రెడ్డి (ఏ–2) నిందితుడిగా ఉన్నట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. ఈ నేరంలో రాఘవేందర్‌కు కోర్టు జీవితకాలం శిక్ష విధించగా, శిక్ష అనంతరం ఇటీవలే రాఘవేందర్ బయటకు వచ్చినట్లు సీపీ చెప్పారు. ఇదిలాఉండగా.. రెండు నెలల క్రితం మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో శ్రీనివాస్ రెడ్డిపై భూ కబ్జా కేసు నమోదైందన్నారు. శ్రీనివాస్ రెడ్డి సొంత బావనే కేసు పెట్టాడని, బావ మీద శ్రీనివాస్ రెడ్డి కూడా కేసు పెట్టాడని వివరించారు. కేసును చాలెంజ్‌గా తీసుకున్నాం: రాచకొండ సీపీ జంట హత్యల కేసు దర్యాప్తునకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఈ టీమ్‌లో లా అండ్ ఆర్డర్ పోలీసులతోపాటు స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) పోలీసులున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ చెప్పారు. ఈ కేసును చాలెంజ్‌గా తీసుకుని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని పేర్కొన్నారు. మృతులు శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిల సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి కాల్ డేటా, వాట్సాప్ చాట్ ఇతరత్రా వివరాలను రాబట్టేందుకు సెల్ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. చివరిసారిగా మృతులు ఎవరితో మాట్లాడారు? సంఘటనాస్థలం వద్ద ఎవరెవరి సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఉన్నాయి? అనే వివరాలు ఆరా తీస్తున్నారు. వీరిని హత్య చేసే అవసరం ఎవరికి ఉంది? ఎవరికి సుపారీ ఇచ్చారు? తుపాకీ ఎక్కడిది? అనే ప్రశ్నలకు పోలీసులు సమాధానం వెతికే పనిలో పడ్డారు. -
ఇబ్రహీంపట్నంలో కొనసాగుతోన్న షర్మిల పాదయాత్ర
-
సభా వేదిక పేచీ: కోమటిరెడ్డి వర్సెస్ రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ ఆధ్వర్యంలో ఈనెల 18న ఇబ్రహీంపట్నంలో జరగాల్సిన ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ సభా వేదిక మారింది. భువనగిరి పార్లమెంటు స్థానం పరిధిలోని ఇబ్రహీంపట్నం నుంచి చేవెళ్ల లోక్‌సభ పరిధిలోకి వచ్చే మహేశ్వరం సమీపానికి సభా వేదికను మార్చాలని నిర్ణయించారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తంచేసినందునే ఈ మార్పు జరిగిందని తెలుస్తోంది. ఈనెల 9న ఇంద్రవెల్లిలో సభావేదికపై నుంచే ఇబ్రహీంపట్నం సభను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కానీ, తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా, తనను అడగకుండా తన పార్లమెంటు స్థానం పరిధిలోకి వచ్చే ఇబ్రహీంపట్నంలో సభ ఎలా ప్రకటిస్తారని కోమటిరెడ్డి అభ్యంతరం తెలిపారు. దీనికి సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ తీరుపై ఆయన పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కె.సి.వేణుగోపాల్ వరకు వ్యవహారం వెళ్లడంతో ఆయన కోమటిరెడ్డితో ఫోన్లో మాట్లాడినట్టు సమాచారం. అనంతరం కోమటిరెడ్డి, రేవంత్‌లు ఫోన్లో మాట్లాడుకున్నారని, తనకు ఈనెల 17 నుంచి 21 వరకు బొగ్గు, స్టీల్ పార్లమెంటరీ స్టాం డింగ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో స్టడీ టూర్ ఉన్నందున తాను సభకు రాలేనని, ఆ టూర్ కోసం గోవాకు వెళ్తున్నానని కోమటిరెడ్డి స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నంలో సభ పెట్టి ఎంపీ కోమటిరెడ్డి హాజరుకాకపోతే సమస్యలు వస్తాయనే ఉద్దేశంతోనే సభాస్థలిని మా ర్చాలని నిర్ణయించారని, ఇందుకోసం ఔటర్‌రింగ్‌రోడ్డు సమీపంలోని పలు ప్రాంతాలను పరిశీలిస్తున్నారని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. గతంలో కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ మహబూబ్‌నగర్ జిల్లా నుంచి రేవంత్ పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్ర ముగింపు సభను ఏర్పాటు చేసిన రావిర్యాలలోనే దళిత గిరిజన దండోరా సభను కూడా నిర్వహించాలని నిర్ణయించినట్టు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, ఇబ్రహీంపట్నం సభకు పోలీసులు అను మతి నిరాకరించారు. ఇక్కడ సభ నిర్వహిస్తే ట్రాఫిక్ సమస్య తలెత్తుందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. -
ఆన్లైన్ క్లాసులు అర్థంకాక విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, ఇబ్రహీంపట్నం (మైలవరం): ఆన్లైన్ క్లాసులు అర్థంకాక మనస్తాపం చెంది విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఫెర్రీ ప్రాంతానికి చెందిన నడకుదిటి సత్యన్నారాయణ ఆదివారం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. తన కుమారుడు ఎన్.దినేష్ (18) గొల్లపూడిలో ఓప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఆన్లైన్ క్లాసులు అర్థం కాకపోవటంతో తోటి విద్యార్థులు చులకన భావంతో చూస్తున్నారని ఈనెల 13న పురుగుల మందు తాగగా మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ ఆరోగ్యం విషమించి మృతి చెందాడు. (ఏపీలో సూళ్లకు కొత్త టైం టేబుల్) -
భారీ వరద: ఏ క్షణామైనా తెగిపోయే ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : నగర శివారులోని రాజేంద్రనగర్ మైలార్ దేవుపల్లి సమీపంలోని పల్లె చెరువు ప్రమాదకర స్థాయికి చేరుకుంది.. భారీ వరదలతో నిండుకుండాలా మారిపోయింది. వరద ఉధృతి క్షణక్షణం పెరుగుతూ ఉండటంతో చెరువుకట్ట ఏ క్షణామైనా తెగిపోయే ప్రమాదం ఉంది. చెరువు కట్ట తెగకుండా ఇరిగేషన్ శాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సిమెంట్ బస్తాల్లో ఇసుకను నింపి కట్టకు సపోర్టుగా వేస్తున్నారు. కొంతమేర వర్షం తగ్గినప్పటికీ.. వరద తగ్గకపోవడంతో ఇప్పటికే కట్టకు చిన్నబిన్న బుంగలు పడి నీరు బయటకు వస్తోంది. చెరువులో నీటినిల్వ ప్రమాదకరస్థాయికి చేరుకోవడంతో సుభాన్ కాలనీ వాసులు భయాందోళనలో ఉన్నారు. (హైదరాబాద్ సీపీ ఇంట్లోకి వరదనీరు) గతవారం రోజులుగా వస్తున్న వరదలకు ఇప్పటికే సుభాన్ కాలనీలో ఐదు అడుగుల మేర బురద చేరింది. కార్లు, ద్విచక్రవాహనాలు బుదరలో ఇరుక్కుపోయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో కనీసం వాహనాల ఆనవాళ్లు కూడా కనిపించనంత బురద చేరింది. తమ పరిస్థితిని పట్టించుకోవడానికి ఏ ఒక్క అధికారి కూడా రాలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో పల్లె చెరువు సమీప ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పల్లె చెరువు జలదిగ్బంధనంలో చాంద్రాయణగుట్ట, ఫలక్ నామా ప్రాంతాలు చిక్కుకోనున్నాయి. పల్లె చెరువు ప్రాంతాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పరిశీలించారు. ఎలాంటి ప్రమాదం జరుగకముందే స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతకుముందు స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ ఇక్కడ పర్యటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటామని.. పల్లె చెరువు సమీపంలో ఎక్కడ కూడా కబ్జాలు గురైన దాఖలాలు లేవన్నారు. -
ఫార్మానే వద్దంటే.. రోడ్డెందుకు?
సాక్షి, యాచారం: ఫార్మా ఏర్పాటే వద్దంటే.. రోడ్డు విస్తరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకని రైతులు మండిపడ్డారు. ఫార్మాసిటీ రోడ్డు విస్తరణకు సంబంధించి నందివనపర్తి గ్రామంలో అధికారులు బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించారు. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ వెంకటాచారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొప్పు సుకన్యభాషా, వైస్ ఎంపీపీ కె.శ్రీనివాస్‌రెడ్డి, నందివనపర్తి సర్పంచ్ కంబాలపల్లి ఉదయశ్రీ, తహసీల్దార్ నాగయ్యలు పాల్గొన్నారు. ఫార్మాసిటీకి వంద అడుగుల రోడ్డు కోసం ఇరువైపులా 60 ఎకరాల వ్యవసాయ భూమి కావాల్సి ఉంది. భూమిని సేకరించడానికి నింబంధనల ప్రకారం నోటిఫికేషన్లు ప్రకటించిన అధికారులు బుధవారం నందివనపర్తిలో ప్రజాభిప్రాయ సేకరణ సభ ఏర్పాటు చేశారు. సభ ప్రారంభంలో భూసేకరణ నింబంధనలను ఆర్డీఓ వెంకటాచారి రైతులకు వివరించారు. ఫార్మాసిటీ వల్ల ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని, ఫార్మాను అడ్డుకోవద్దని సూచించారు. సభలో గందరగోళం ఆర్డీఓ వెంకటాచారి మాట్లాడుతుండగానే రైతులు లేచి.. సార్ అసలు ఫార్మాసిటీ ఏర్పాటే వద్దని అంటుంటే.. రోడ్డు విస్తరణ ఎందుకు అని ప్రశ్నించారు. రైతులకు మద్దతుగా వేదికపై కూర్చున్న ఎంపీపీ, వైస్ ఎంపీపీలు లేచి ఫార్మాకు వ్యతిరేకంగా మాట్లాడుతుండగానే రైతులంతా ఒక్కసారిగా గందరగోళం సృష్టించారు. కొంతమంది రైతులు అధికారులపై కుర్చీలు వేశారు. టెంటును కూల్చేశారు. సభలో ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో ఇబ్రహీంపట్నం ఏసీపీ యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు రైతులను, ఆందోళనకారులను పక్కకు తోసేశారు. కొంతమంది ఆందోళనకారులను, రైతులను అరెస్టు చేసి వాహనంలో యాచారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సభ వద్ద ఉన్న మరికొందరు రైతులతో పాటు బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో అధికారులపై దాడులు చేయడానికి యత్నించగా అధికారులు అర్ధంతరంగా ప్రజాభిప్రాయ సేకరణ సభను నిలిపేసి వెళ్లిపోయారు. కాగా, నింబంధనల ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ సభను పూర్తి చేసినట్లు తహసీల్దార్ తెలిపారు. ఇదేక్కడి దారుణం.. ఫార్మానే వద్దంటే.. అధికారులు బలవంతంగా ప్రజాభిప్రాయ సేకరణ, పట్టా భూముల సేకరణకు జనరల్ అవార్డు పాస్‌చేయడం దారుణమని మాజీ ఎమ్మెల్యే ముదిరెడ్డి కోదండరెడ్డి అన్నారు. నందివనపర్తిలో రైతులకు మద్దతుగా ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫార్మాకు వ్యతిరేకంగా రైతుల్లో ఆందోళన తీవ్రమవుతున్న నేపథ్యంలో సర్కారు బలవంతంగా భూసేకరణకు దిగడం అన్యాయమని మండిపడ్డారు. రైతులకు మద్దతుగా న్యాయస్థానాలను ఆశ్రయించి బలవంత భూసేకరణను అడ్డుకుంటామన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫార్మాను రద్దు చేసి రైతుల భూములను తిరిగి ఇస్తామని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర కార్యదర్శి మరిపల్లి అంజయ్యయాదవ్, బీజేపీ మండల అధ్యక్షుడు తాండ్ర రవీందర్, బీజేపీ నాయకులు కొండూరి రామనాథం, గోగికార్ రమేష్, విజయకుమార్, నాగరాజు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మస్కు నర్సింహ, నానక్‌నగర్ మాజీ సర్పంచ్ ముత్యాల వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదం: కల్వర్టును ఢీకొట్టిన అంబులెన్స్
సాక్షి, కృష్ణా: జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి వస్తున్న అంబులెన్స్ ఇబ్రహీంపట్నం కల్వర్టును ఢీకొట్టిన ఘటనలో 67 ఏళ్ల వృద్ధుడు మృతి చెందగా మరో ముగ్గురికి గాయలయ్యాయి. వివరాలు.. కరోనా రోగులను తీసుకుని హైదరాబాద్ నుంచి బయలుదేరిన అంబులెన్స్ ఈరోజు(శుక్రవారం) తెల్లవారు జామున సత్యనారాయణపురం వద్ద అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఘటన స్థలానికి చేరుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను విజయవాడలోని ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తి పశ్చిమ గోదావరి జిల్లా పాడేరుకు చెందిన గ్రంధి రంగ నాయకుడుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
ఇబ్రహీంపట్నం: రంగారెడి జిల్లా ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం నేత మస్కు నర్సింహ(52) అనారోగ్యంతో మృతి చెందారు. ఘగర్, బీపీ లెవల్స్ పెరగడంతో పది రోజుల క్రితం ఆయన నిమ్స్‌లో చేరారు. గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతోపాటు ఉపిరితిత్తులు ఇన్ఫెక్షన్కు గురికావడంతో నర్సింహ ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొం దుతూ ఆదివారం అర్ధరాత్రి పన్నెండున్నర గంటల సమయంలో ఆయన కన్నుమూశారు. యాచారం మండలం చింతుల్ల గ్రామానికి చెందిన నర్సింహకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. విద్యార్థి దశ నుంచి రాజకీయల్లో ఆయన చురుకైన పాత్ర పోషించారు. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నుంచి సీపీఎం అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. కాగా, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సీతారాములు నిమ్స్ వద్ద నర్సింహ భౌతికకాయంపై ఎర్రజెండా కప్పి నివాళులు అర్పించారు. నర్సింహ మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ప్రజాసేవలో నిమగ్నమైన దళిత నేత చిన్నవయసులోనే మరణించడం బాధాకరమని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విచారం వ్యక్తం చేశారు. -
మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులకు కరోనా సోకడం రాష్ట్ర ప్రజానీకాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్కు చెందిన నేతలు ఎక్కువగా వైరస్ బారిన పడటం ఆ పార్టీలో గుబులు రేపుతోంది. తాజాగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యేకు సన్నిహితంగా మెలిగిన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఇటీవల ఆయన నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో ప్రభుత్వ అధికారులు, పార్టీ శ్రేణులు భయాందోళనకు గురవుతున్నారు. -
ప్రభుత్వ భూముల కబ్జాపై విచారణ
ఇబ్రహీంపట్నం: నగరానికి సమీపం లోని ఇబ్రహీంపట్నంలో అతి విలువైన ప్రభుత్వ భూములు కబ్జాదారుల గుప్పిట్లోకి వెళ్తున్నాయని, దీనిపై సీబీసీఐడీతో విచారణ జరి పించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ భూములను అక్రమంగా కాజేసి ప్లాట్లు చేస్తున్న విషయంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లిస్తుంటే..మన రాష్ట్రంలో ఆర్టీసీని కేసీఆర్ నాశనం చేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలవకుంటే మంత్రులకు పదవులుండవని, ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవని సీఎం కేసీఆర్ హెచ్చరించడాన్ని ఖండించారు. నిజామాబాద్‌లో ఎంపీ స్థానానికి ఆయన కూతురు కవిత ఓడిపోయినప్పుడు కేసీఆర్ ఎందుకు తన పదవికి రాజీనామా చేయలేదని వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. -
ఈ అడ్డాల వద్ద జర భద్రం బిడ్డా..!
శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ భవనాలు, కల్వర్టులు, బ్రిడ్జిలు, గోదాములు, అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి. పోకిరీలు, మందుబాబులు, పేకాటరాయుళ్ళు, గంజాయి తీసుకునేవాళ్లకు ఇవి కేరాఫ్ అడ్రస్ అయ్యాయి. రాత్రి పొద్దుపోయేదాక కొందరు ఇక్కడే మకాం వేస్తుండటం గమనార్హం. దీంతో ఈ ప్రాంతాల గుండా వెళ్లేందుకు మహిళలు, యువతులు జంకుతున్నారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఇలాంటి ‘అడ్డా’లపై సాక్షి బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించగా పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. వణుకు పుట్టిస్తున్న చటాన్‌పల్లి చటాన్‌పల్లి శివారులోని ఈ బ్రిడ్జి కిందే పాశవిక ఘటన చోటుచేసుకుంది బైపాస్ రోడ్డులోని సర్వీస్‌రోడ్డు పక్కన పెరిగిన ముళ్లచెట్లు షాద్‌నగర్‌టౌన్: మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చటాన్‌పల్లి శివారులో 44వ జాతీయ రహదారి కిందే పాశవిక దుర్ఘటన జరిగింది. నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించే రహదారి ఇది. సంఘటనా స్థలానికి కొద్ది దూరంలోనే బైపాస్ కూడలి, హోటళ్లు, దాబాలు ఉన్నాయి. ఈ రహదారి పై పోలీసుల పెట్రోలింగ్ వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. కాని కింద జాతీయ రహదారి పక్కన ఉన్న సర్వీస్ రోడ్డు, ఇక్కడ ప్రాంతాలు అత్యంత నిర్మానుష్యంగా ఉంటాయి. ఈ సర్వీసు రోడ్డు ఇరువైపులా మొత్తం ముళ్లు, కంప చెట్లు ఉంటాయి. కొత్తూరు దాటిన తర్వాత జాతీయ రహదారి పై షాద్‌నగర్ వరకు బైపాస్ గుండా సీసీ కెమెరాలు లేక పోవడంతో నిఘా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. రాత్రి వేళల్లో స్తంభాలకు కనీసం వీధి లైట్లు కూడా లేక పోవడం పలు అనర్థాలకు కారణం అవుతోంది. నిరంతం పెట్రోలింగ్ వ్యవస్ధను కొనసాగించడం, సర్వీసు రోడ్లను అభివృద్ధి చేయడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వార ప్రమాదాలను నివారించేందుకు అవకాశం ఉంది. ‘జస్టిస్ ఫర్ దిశ’ ఘటన షాద్‌నగర్ ప్రాంతానికి భాగస్వామ్యం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దారుణాలు అనేకం మహిళలను దారుణంగా హతమార్చి షాద్‌నగర్ ప్రాంతంలో పడేసి పోవడం, మహిళలపై అత్యాచారాలు చేసి హత్యలు చేయడం వంటి సంఘటనలు ఇక్కడ చోటు చేసుకున్నాయి. అయితే గతంలో 2007లో షాద్‌నగర్ ప్రాంతంలో 11 మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. వరుస హత్య సంఘటనలు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. అప్పట్లో ఈ సంఘటలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యాయి. వరుస హత్య కేసుల మిస్టరీని చేజించేందుకు పోలీసులు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. అయితే వివిధ ప్రాంతాల నుండి మహిళలను ఇక్కడికి తీసుకొచ్చి అత్యాచారం హత్య చేసిన సంఘటనలు షాద్‌నగర్ ప్రాంతం ప్రజల మనస్సుల్లో ఇంకా మెదులుతూనే ఉన్నాయి. పోలీసులు ఇకనైనా మేలుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అక్కడికి వెళ్తే ఇక అంతే..? రావిర్యాల ఆర్సీఐ రోడ్డులో భయానక పరిస్థితులు తుక్కుగూడ: తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో శ్రీశైలం హైవే రోడ్డు నుంచి ఆర్సీఐ రోడ్డులో ప్రభుత్వ భూములతో పాటు, అటవీ భూములు విస్తరించాయి. ఈ భూములు జనావాసాలకు దూరంగా ఉండటంతో అసాంఘిక కార్యకలాపాలకు వేదికలుగా మారాయి. నిత్యం హైదరాబాద్ నుంచి యువత ఈ రోడ్డు నుంచి రావిర్యాలలో ఉన్న వండర్లాకు పర్యటన కోసం వస్తూ ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గతేడాది ఇక్కడ ఓ మహిళను గుర్తుతెలియని వ్యక్తులు అత్యచారం చేసి అంతమొందించారు. అప్పటి నుంచి ఈ రోడ్డు వెంట వెళ్లాలంటే ప్రయాణికులు జంకుతున్నారు. ముఖ్యంగా రాత్రి వెళ్లడమంటే.. సాహసం చేయడమే. ఇటువంటి భయానక పరిస్థితులు ఉన్నా పోలీసులు పెద్దగా నిఘా పెట్టకపోవడం విమర్శలకు దారితీస్తోంది. వెంచర్లలో తిష్ట.. రాత్రి వేళ మందుబాబులకు నిలయం.. శంషాబాద్: పట్టణం పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డూఅదుపూ లేదు. పట్టణం చుట్టూ విస్తరించిన వెంచర్లన్నీ దాదాపుగా మదుబాబులకు కేంద్రాలుగా మారుతున్నాయి. కొన్ని వెంచర్ల చుట్టూ ప్రహరీలు, అందులో ఓ గది నిర్మించి గాలికి వదిలేస్తున్నారు. ఇటువంటి వెంచర్లలో జులాయిలు జల్సాలు చేస్తున్నారు.సింప్లెక్స్ ఉన్న నిర్మానుష ప్రాంతంలో నిత్యం మందుబాబులకు అడ్డాగా మారుతోంది. రాళ్లగూడ, తొండుపల్లి, ఊట్పల్లి, సిద్ధులగుట్ట మార్గం, కొత్వాల్‌గూడ, హుడా కాలనీల్లో మద్యం తాగిన సందర్భంలో అనేకసార్లు గొడవలు జరిగాయి. శంషాబాద్ పట్టణం నుంచి నర్కూడ వైపు వెళ్లే దారిలో వెంచర్లలో నిత్యం మందుబాబులు తిష్ట వేస్తుంటారు. గగన్‌పహాడ్ ట్రాన్స్జెండర్లకు అడ్డాగా మారింది. చీకటి పడితే ఇక్కడ చాలు పదుల సంఖ్యలో ట్రాన్స్జెండర్లు దారి వెంట రాకపోకలు జరిపేవారిని ఆకర్షిస్తూ జుగుప్సాకరంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రహదారి పక్కనే ఓ మూతబడిన మద్యం కంపెనీకి చెందిన ఖాళీ స్థలంలో అన్ని కార్యకలాపాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. చీకటి పడితే భయమే.. తుర్కయంజాల్ మాసాబ్ చెరువు వద్ద గల రాతి నిర్మాణం తుర్కయంజాల్: నగర శివారు ప్రాంతమైన తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో నాగార్జునసాగర్ రహదారిపై గల మాసాబ్ చెరువు కట్ట మందుబాబులకు అడ్డాగా మారింది. చీకటి పడిందంటే చాలు ఇక్కడ బహిరంగంగానే మద్యం తాగుతున్నారు. రాత్రి 10 గంటల వరకు ఇదే పరిస్థితి. ముఖ్యంగా వాహనాలను రోడ్డు పక్కన నిలిపి మద్యం తాగడం ఇక్కడ నిత్యం జరిగే తంతు. ఈ చెరువు తూము వద్ద గల రాతి కట్టడంపై పొద్దుపోయేవరకు యువతీ యువకులు అక్కడే కాలక్షేపం చేస్తుంటారు. చెరువుకు రెండు పక్కలా నిర్మానుష ప్రాంతాలు ఉంటాయి. కట్టపై అంతంత మాత్రంగానే పోలీసుల గస్తీ ఉంటుంది. కొన్ని సార్లు అక్కడి నుంచి పెట్రోలింగ్ వాహనాలు వెళ్లినా.. మద్యం సేవిస్తున్న వారిని ఏమనక పోవడం గమనార్హం. నిత్యం మద్యం బాటిళ్లు, పేకాటకార్డులు దర్శనం భయంగొల్పుతున్న ఇబ్రహీంపట్నం పాత బస్టాండ్ గోదాం ఇబ్రహీంపట్నం: పట్టణంలోని పాత బస్టాండ్ గోదాముల్లో, పాత పోలీస్ స్టేషన్, వినోభానగర్‌లో అసంపూర్తిగా నిర్మాణం నిలిచిన డిగ్రీ కళాశాల భవనాలు ఆసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా మారాయి. పోకిరీలు, మందుబాబులు, పేకాటరాయుళ్ళు, గంజాయి తీసుకునేవాళ్లు ఇక్కడే తిష్ట వేస్తున్నారు. రాత్రిళ్లు పొద్దు పోయేవారు ఇక్కడే మకాం వేస్తున్నారు. డిగ్రీ కళాశాలలో మద్యం బాటిళ్ళు, పేకాట కార్డులు దర్శనమిస్తున్నాయి. పాత బస్టాండ్ గోదాంల వద్ద ఉదయం నుంచి బైక్‌లు అడ్డంగా పార్క్‌చేసి గంటల తరబడి అక్కడే టైంపాస్ చేస్తున్నారు. మందుబాబులు, పోకిరీలు రాత్రిళ్ళు బైఠాయిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కళాశాల భవనంలోని ఓ గదిలో ఖాళీ మద్యం సీసాలు -
టిప్పర్ ఢీకొని అత్తాకోడళ్లు మృతి
ఇబ్రహీంపట్నం రూరల్: మృత్యువు టిప్పర్ రూపంలో దూసుకొచ్చి అత్తాకోడళ్లను బలి తీసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. సీఐ నరేందర్ వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని కొత్తపేటలో నివసించే కొత్తపల్లి రమ (56) ఆంధ్రాబ్యాంకు క్యాషియర్. ఆమె కుమారుడు సంతోష్ కౌటిల్యకు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని బల్కాపురం గ్రామానికి చెందిన హిమజ (28)తో ఫిబ్రవరిలో వివాహం చేశారు. సంతోష్ హైదరాబాద్‌లోని డెల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తుండగా హిమజ గృహిణిగా ఉంటోంది. శనివారం లైసెన్స్ రెన్యువల్ కోసం కొత్తపేట నుంచి ఇబ్రహీంపట్నం ఆర్టీఏ కార్యాలయానికి అత్తాకోడళ్లు స్కూటీపై బయల్దేరారు. రమ హెల్మెట్ ధరించి స్కూటీ నడుపుతుండగా హిమజ వెనకాల కూర్చుంది. రాగన్నగూడ రైస్ మిల్లు వద్దకు రాగానే వెనకాలే ఇబ్రహీంపట్నం వస్తున్న టిప్పర్ (టీఎస్ 12 యూబీ 2673) వీరిని వేగంగా ఢీకొట్టింది. దీంతో బైక్ మీద నుంచి పడిపోయిన అత్తాకోడళ్లు టిప్పర్ వెనుక చక్రాల కింద పడి నలిగిపోయారు. టిప్పర్ ఇద్దరిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందారు. రమ భర్త గతంలోనే మృతిచెందాడు. మృతదేహాలను హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు సీఐ నరేందర్, ఎస్ఐ సురేశ్ తెలిపారు. ప్రమాదంలో తల్లి, భార్య మృతితో సంతోష్ కన్నీరుమున్నీరయ్యాడు. -
ఏమైతదో ఏమో.. కిటికీలో నుంచే దరఖాస్తులు
ఇబ్రహీంపట్నం: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు దరఖాస్తులను కిటికిలో నుంచే తీసుకుంటున్నారు. వివిధ పనులపై కార్యాలయానికి వచ్చిన వారిని లోపలికి అనుమతించడం లేదు. తహసీల్దార్ విజయారెడ్డి హత్య అనంతరం కార్యాలయం సిబ్బంది భయభ్రాంతులకు గురవుతున్నారు. వారం తర్వాత విధుల్లోకి చేరిన రెవెన్యూ సిబ్బంది ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ బాధితులను లోపలికి పిలిస్తే గేటు వద్ద వారిని వీఆర్ఏలు తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. -
ఆ భూమి విలువ రూ. 100 కోట్లు: మంచిరెడ్డి
సాక్షి, హైదరాబాద్ : అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో తనపై వస్తున్న ఆరోపణలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి స్పందించారు. నిందితుడు టీఆర్ఎస్ కార్యకర్త అని, ఎమ్మెల్యే అనుచరులే హత్య చేయించారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తనపై చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. తన మీద ఓడిపోయిన మల్రెడ్డి ఓటమి తట్టుకోలేకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. భూ కబ్జాదారులు అంటూ ప్రచారం చేస్తున్న వారే అసలు కబ్జాదారులని విమర్శించారు. విజయారెడ్డి మరణం దురదృష్టకరమని, ఆమె హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. విజయారెడ్డి మరణాన్ని రాజకీయం చేస్తున్నారని, ఈ కేసుపై పోలీసుల దర్యాప్తు చేస్తున్నారని ఆయన తెలిపారు. నిందితుడు సురేశ్ భూములు కొనుగోలు చేసింది మల్రెడ్డి రంగారెడ్డి, రాంరెడ్డి కుటుంబ సభ్యులేనని, మొత్తం 412 ఎకరాలపై పూర్తి దర్యాప్తు చేయాలని కోరారు. పాస్ పుస్తకాలు లేకుండా భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, 90 నుంచి 101 సర్వేలో మొత్తం భూమిపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సైతం ఈ భూములపై దర్యాప్తు జరిపించాలని ఎమ్మెల్యే కోరారు. ఆ భూమి విలువ రూ. 100 కోట్లు నాలుగు సర్వేల్లో ఉన్న భూమి విలువ 100 కోట్లు ఉంటుందని మంచిరెడ్డి అన్నారు. 1980లో ప్లాట్లు అన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, 16 ఎకరాల భూమిని కబ్జా చేసుకున్నది మల్ రెడ్డి రంగారెడ్డి కుటుంబ సభ్యులేనని ఆరోపించారు. తాను 30 లక్షల రూపాయలు తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అంతేగాక న్యాయ పరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిందితుడు సురేష్ గత ఎన్నికల్లో కాంగ్రెస్‌లో ఉన్నాడని, మల్ రెడ్డి రంగారెడ్డి సోదరులతో పాటు ఇంకా అనేక మంది ఇందులో భాగమై ఉన్నారని ఆరోపించారు. -
నేడు లాజిస్టిక్ హబ్‌ను ప్రారంభించనున్న కేటీఆర్
సాక్షి, రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం మండలం మంగళ్పల్లిలో లాజిస్టిక్ హబ్ (వస్తు నిల్వ కేంద్రం) సిద్ధమైంది. ఇప్పటివరకు 60 శాతం పనులు పూర్తికావడంతో కమర్షియల్ ఆపరేషన్ ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శుక్రవారం దీనిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరంలో వాహనాల రద్దీని నియంత్రించడం, వాయు కాలుష్యం తగ్గించడం కోసం హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేశారు. 22 ఎకరాల విస్తీర్ణంలో రూ.20 కోట్ల వ్యయంతో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో దీన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. -
నిండు గర్భిణిని హతమార్చిన భర్త!
సాక్షి, ఇబ్రహీంపట్నం: కట్టుకున్న భార్య.. నిండు గర్భిణి.. భార్యనేను కనికరం లేకుండా కడతేర్చాడో ఓ భర్త. ఈ హృదయ విదారక సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలోని చింతపల్లిగూడ గేట్ సమీపంలోని చోటుచేసుకుంది. ఎస్ఐ మోహన్ కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం అజీలపురం గ్రామానికి చెందిన సరిత (22)కు రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలం పోచమ్మగడ్డతండాకు చెందిన ఆటో డ్రైవర్ రాజు (25)తో 2018 మే నెలలో వివాహమైంది. కట్నకానుకల కింద రూ.పది లక్షలు ఇచ్చారు. అయితే కొన్నాళ్లు బాగానే ఉన్నా వీరి కాపురంలో అదనపు కట్నం చిచ్చుపెట్టింది. అదనంగా కట్నం తేవాలని తరచూ సరితను భర్త వేధించడం మొదలుపెట్టాడు. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. ఈ విషయమై అప్పట్లో మర్రిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేయడంతో కౌన్సిలింగ్ ఇప్పించారు. అయితే పెద్దల సమక్షంలో రాజీకి వచ్చినా ఆ తర్వాత యథావిధిగానే పరిస్థితి ఉంది. అయితే రెండు రోజుల కిందట ఏడు నెలల గర్భవతిగా ఉన్న భార్యను ఆస్పత్రిలో చూపిస్తానని చెప్పి రాజు ఇంటి నుంచి ఆమెను తీసుకెళ్లాడు. క్యాబ్‌లో కందుకూర్ నుంచి మంగళ్‌పల్లికి భార్యతో పాటు వచ్చాడు. చింతపల్లిగూడ గేట్ సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి ఆమె చున్నీని మెడకు బిగించి ఊపిరి ఆడకుండా చేసి హతమార్చేశాడు. ఆ తర్వాత బావమరిది నర్సింహకు ఫోన్ చేసి మీ సోదరి ఇంట్లో కనిపించడం లేదని చెప్పాడు. దీంతో నర్సింహా శనివారం కందుకూర్ పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టాడు. అయితే ఆదివారం చింతపల్లిగూడ గేట్ పొదల్లో సరిత శవమై తేలిందని కబురు అందింది. డాగ్‌స్క్వాడ్‌తో చుట్టుముట్టు పరిసరాలను పరిశీలించారు. ఈలోపే కందుకూర్ పోలీస్‌స్టేషన్‌లో రాజు లొంగిపోయాడు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబసభ్యుల ఆందోళన అదనపు కట్నం కోసం వేధిస్తూ సరితను హతమార్చడంతో కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని అజిలాపూర్ గ్రామస్తులు ఆదివారం రాత్రి ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించారు. తన సోదరి మృతిచెందడంతో మనస్తాపం చెందిన సోదరుడు నర్సింహ ఒంటిపై పెట్రోల్ పోసుకోని ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రధాన రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో ప్రయాణికులు, వాహనదా రులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ఎంతచెప్పినా ఆందోళనకారులు వినిపించుకో లేదు. చివరికి పోలీసులు కల్పించుకుని ఆందోళ నకారులతో మాట్లాడి శాంతింపజేశారు. -
అప్పు తీర్చలేకే హత్య
సాక్షి, ఇబ్రహీంపట్నం: అప్పు ఇచ్చిన వ్యక్తిని అతి కిరాతకంగా అంతమొందించాడో ఓ కిరాతకుడు. హత్య చేసి అటవీ ప్రాంతానికి తీసుకొచ్చి పెట్రోల్ పోసి తగులబెట్టాడు. హత్య కేసును యాచారం పోలీసులు ఛేదించి, ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని కటకటాల్లోకి నెట్టారు. గురువారం సాయంత్రం ఇబ్రహీంపట్నం ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ యాదగిరిరెడ్డి వివరాలు వెల్లడించారు. కడ్తాల్ మండలం పల్లెచెల్కతండాకు చెందిన జెర్పుల బిచ్చానాయక్(40) ఎల్బీనగర్ సమీపంలోని గాంధీనగర్‌లో నివాసముంటూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన కిట్టిగౌరి రవి(33) గత కొన్నేళ్ళుగా ఎల్బీనగర్లోని శివమ్మనగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. రవి కూడా ఆటో నడుపుతూ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు. గత రెండేళ్ల క్రితం బిచ్చానాయక్, రవిల మధ్య పరిచయం ఏర్పడింది. గత ఫిబ్రవరి నెలలో రవి వద్ద బిచ్చానాయక్ రూ. 3లక్షల అప్పు తీసుకున్నాడు. తీసుకున్న అప్పు చెల్లించాలని ఒత్తిడి తేస్తుండటంతో.. రవిని ఎలాగైనా అంతమొందించాలని బిచ్చానాయక్ నిర్ణయించుకున్నాడు. ఈ నెల 15న రవికి మద్యం తాగించి హత్య చేయాలని వేసిన పథకం విఫలమైంది. దీంతో 21వ తేదీన హత్యకు మరోసారి పథకం రూపొందించాడు. దీని ప్రకారం కర్మన్‌ఘాట్ ప్రాంతంలోని తిరుమల వైన్స్‌లో రవికి బిచ్చానాయక్ మద్యం తాగించాడు. అక్కడి నుంచి సాగర్‌రింగ్‌రోడ్డులోని ఓంకార్ నగర్‌కు ఆటోలో తీసుకొచ్చి మద్యం మత్తులో ఉన్న రవి తలపై రాయితో దాడి చేసి, నైలాన్ తాడును మెడకు బిగించి హత్య చేశాడు. మృతదేహాన్ని కుర్మిద్దకు తీసుకువచ్చి.. హత్య చేసిన అనంతరం రవి మృతదేహాన్ని యాచారం మండలం కుర్మిద్ద గ్రామ పరిధిలో అటవీ ప్రాంతంగా ఉండే తాటికుంట మైసమ్మ టెంపుల్ దారిలో పడేసిన బిచ్చానాయక్ పెట్రోల్ పోసి తగులబెట్టాడు. అక్కడి నుంచి నగరంలోని చంద్రాయణగుట్ట ఆటో గ్యారేజిలో ఆటోను పార్కు చేసి వెళ్లిపోయాడు. గుర్తుతెలియని వ్యక్తి హత్యగా కేసు నమోదు చేసుకున్న యాచారం పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇదే సమయంలో ఎల్బీనగర్ పీఎస్‌లో 21వ తేదీ నుంచి రవి కనిపించడంలేదని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా కుటుంబసభ్యులు హత్యకు గురైన వ్యక్తి రవిగా గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తులో భాగంగా హత్య చేసిన అనంతరం సొంత గ్రామం పల్లెచల్కతండాకు పారిపోయిన బిచ్చానాయక్‌ను æపట్టుకున్నారు. తమదైన శైలిలో పోలీసులు విచారించగా రవిని తానే హత్యచేసినట్లు బిచ్చానాయక్ నేరాన్ని అంగీకరించాడు. నిందితుడు బిచ్చానాయక్‌ను యాచారం పోలీసులు రిమాండ్‌కు తరలించారు. హత్యకు గురైన రవికి భార్యతోపాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నట్లు తెలిపారు. -
ఇబ్రహీంపట్నంలో కారు బీభత్సం