
సాక్షి, హైదరాబాద్: బైక్ వెనుక టైర్‌లో చున్నీ చుట్టుకోవడంతో విద్యార్థిని కిందపడి చనిపోయింది. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం యాచారం మండల కేంద్రానికి చెందిన సనా(18) ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆదివారం సాయంత్రం తన సోదరుడి బైక్‌పై కళాశాల నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా మార్గమధ్యలోని క్రీడా క్షేత్రం సమీపంలో ఆమె చున్నీ వెనుక టైర్‌లో చుట్టుకుంది.
దీంతో ఆమె బైక్‌పై నుంచి కింద పడిపోయింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సనా సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లింగయ్య తెలిపారు.
చదవండి: తల్లిని డ్రమ్‌లో పెట్టి సిమెంట్‌తో కప్పేశాడు!
Comments
Please login to add a commentAdd a comment