
సాక్షి, రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటనపై తెలంగాణ సర్కాలు చర్యలు తీసుకుంది. రంగారెడ్డి డీఎంహెచ్‌వో స్వరాజ్యలక్ష్మిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
డీసీహెచ్‌ఎస్ ఝాన్సీలక్ష్మిపైనా బదిలీవేటుతో పాటు ఆపరేషన్ చేసిన డాక్టర్ సునీల్‌కుమార్‌పైనా క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. ఇక ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన తెలంగాణ సర్కాణ కఠిన చర్యలు తీసుకుంది.
మొత్తం 13 మందిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని టీచింగ్ ఆసుపత్రులు, వైద్య విధాన పరిషత్ హాస్పిటళ్లు, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు వీటిని పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ వైద్యారోగ్యశాఖ.
ఏం జరిగిందంటే..
ఆగస్టు 25న ఇబ్రహీంపట్నంలో 34 మంది మహిళకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు (డీపీఎల్ క్యాంప్) చేశారు. అయితే శాస్త్రచికిత్స వికటించి నలుగురు మహిళలు మృతిచెందారు. ఈ ఘటపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆధ్వర్యంలో విచారణ కమిటీని నియమించింది. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కమిటీ సిఫారసు చేసింది. దీంతో బాధ్యులపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకున్నది.
ఇదీ చదవండి: ఇకపై తల్లిదండ్రులుంటేనే పిల్లలు ఇంటికి!
Comments
Please login to add a commentAdd a comment