Strict action
-
సీఐ నారాయణస్వామిపై ఈసీ చర్యలు
-
ఈ రూల్ కాదంటే ఇంటికే.. ఉద్యోగులకు మెటా హెచ్చరిక!
కరోనా భూతం అధికంగా విజృంభించిన సమయంలో 'వర్క్ ఫ్రమ్ హోమ్' విధానం అమలులోకి వచ్చింది. అయితే మహమ్మారి దాదాపు అంతరించిపోయినప్పటికీ.. ఈ రోజుకి కూడా చాలా మంది ఇంటి నుంచి పనిచేయదానికి అలవాటు పడి ఆఫీసులకు రావడానికి ససేమిరా అంటున్నారు. ఈ తరుణంలో ప్రముఖ కంపనీ గట్టి వార్ణింగ్ ఇచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మెటా కంపెనీ ఉద్యోగులు తప్పకుండా ఆఫీసులకు రావాలని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ నియమం ఉల్లంగిస్తే ఉద్యోగం వదిలి ఇంటికి వెళ్లిపోవచ్చని కూడా స్పష్టం చేసింది. వచ్చే నెల 05 నుంచి (సెప్టెంబర్ 05) వారానికి మూడు రోజులు ఆఫీసుకు వచ్చి పనిచేయాల్సిందే అంటూ ఉద్యోగులకు నోటీసులు కూడా జారీ చేసినట్లు సమాచారం. సెప్టెంబర్ 5 నుంచి ఉద్యోగులు ఆఫీసుకు వస్తున్నారా? లేదా? తనిఖీ చేయాలని సంస్థ మేనేజర్లను సూచించింది. ఆఫీస్‌లో సమయం గడపడం వల్ల మెరుగైన పనితీరును సాధించవచ్చని జుకర్‌బర్గ్ గతంలో సూచించారు. అంతే కాకుండా ఉద్యోగుల మధ్య మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి, టీమ్ వర్క్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. ఇదీ చదవండి: టమాటా ధరలు తగ్గింపుపై కేంద్ర కీలక ప్రకటన! మరింత.. ఇప్పటికే చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి పూర్తిగా స్వస్తి పలికాయి. కావున ఉద్యోగులందరూ తప్పకుండా ఆఫీసులకు రావాలని.. అక్కడ నుంచే వర్క్ చేయాలనీ వెల్లడించారు. దీంతో చేసేదేమీ లేక చాలామంది ఆఫీసుల బాట పట్టారు. ఇక త్వరలో మెటా ఉద్యోగులు కూడా ఆఫీసుల నుంచి పనిచేయాల్సిందే అంటూ స్పష్టమవుతోంది. -
అలాంటివి మేము అంగీకరించం.. చర్యలు తీసుకుంటాం! భారత్‌కి హామీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు మోదీ పునరుత్పాదక ఇంధన, వాణిజ్యం, రక్షణ రంగాలలో ఇరు దేశాల మధ్య సంబంధాలను పెంపొందించే లక్ష్యంతో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్‌తో విస్తృత చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలో ఆలయాల ధ్వసం ఘటనలపై కూడా తాము ఇరువురం మాట్లాడుకున్నట్టు మోదీ తెలిపారు. తాను మరోసారి ఈ ఆలయ ధ్వంస గురించి ఆల్బనీస్‌తో చర్చించానని, ఇలాంటి విధ్వంసాలకి పాల్పడే వారిపై తప్పక కఠిన చర్యలు తీసుకుటామని మరోసారి హామీ ఇచ్చారని చెప్పారు. అంతేగాదు భారత్ ఆస్ట్రేటియా మధ్య స్నేహపూర్వక సంబంధాలను, వారి చర్య లేదా ఆలోచనల ద్వారా దెబ్బతీసే ఏ అంశాలను అంగీకరించమని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి అంశాలకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారని తెలిపారు. ఇదిలా ఉండగా జనవరి 12న ఆస్ట్రేలియాలో మిల్‌పార్క్‌లోని బీఏపీఎస్ స్వామి నారాయణ మందిర్, జనరవి 16న క్యారమ్ డౌన్స్‌లోని శ్రీ విష్ణు దేవాలయాలు హిందూ వ్యతిరేక శక్తులచే ధ్వసమయ్యాయి. కాగా, సిడ్నీలోని ర్యాలీ అల్బనీస్ భారత ప్రధాని మోదీతో కలసి పాల్గొని భారతీయ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిని ఒకరోజు తర్వాత ఈ చర్చలు జరిగాయి. (చదవండి: జోబైడెన్ హత్యకు యువకుడి యత్నం.. ట్రక్కుతో వైట్‌హౌస్‌పై దాడి) -
Maharashtra: ‘వసూల్ రాజా’లకు ఫడ్నవీస్ వార్నింగ్
సాక్షి, ముంబై: మాతాడి ప్రాంతంలో వేతన జీవులనుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడితే చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హెచ్చరించారు. నేవీముంబైలోని వేతన జీవులు ఆదివారం నిర్వహించిన ఓ ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. వాషిలోని ఏపీఎంసీ మార్కెట్లో మాతాడి వర్కర్లు అంతర్భాగమని, వారి నుంచి ఇతరులెవరైనా బలవంతపు వసూళ్లకు పాల్పడితే కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే మాతాడీ ప్రాంతంలో వేతన జీవులనుంచి వసూల్ రాజాలకు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని అనేక ఫిర్యాదులు వచ్చాయని, వారి వల్ల మాతాడీ ప్రాంతానికి చెడ్డపేరు వస్తుందన్నారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. ముంబైలోని వొర్లి–సెవ్రీ ఎలివేటెడ్ రోడ్ నిర్మాణంలో నిర్వాసితులైన వారి కష్టాలు వినేందుకు ఏక్నాథ్ శిందే రెండు కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. -
ఇబ్రహీంపట్నం: కు.ని. ఆపరేషన్ల ఘటనపై కఠిన చర్యలు
సాక్షి, రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటనపై తెలంగాణ సర్కాలు చర్యలు తీసుకుంది. రంగారెడ్డి డీఎంహెచ్‌వో స్వరాజ్యలక్ష్మిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డీసీహెచ్ఎస్ ఝాన్సీలక్ష్మిపైనా బదిలీవేటుతో పాటు ఆపరేషన్ చేసిన డాక్టర్ సునీల్‌కుమార్‌పైనా క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. ఇక ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన తెలంగాణ సర్కాణ కఠిన చర్యలు తీసుకుంది. మొత్తం 13 మందిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని టీచింగ్ ఆసుపత్రులు, వైద్య విధాన పరిషత్ హాస్పిటళ్లు, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు వీటిని పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ వైద్యారోగ్యశాఖ. ఏం జరిగిందంటే.. ఆగస్టు 25న ఇబ్రహీంపట్నంలో 34 మంది మహిళకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు (డీపీఎల్ క్యాంప్) చేశారు. అయితే శాస్త్రచికిత్స వికటించి నలుగురు మహిళలు మృతిచెందారు. ఈ ఘటపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆధ్వర్యంలో విచారణ కమిటీని నియమించింది. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కమిటీ సిఫారసు చేసింది. దీంతో బాధ్యులపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకున్నది. ఇదీ చదవండి: ఇకపై తల్లిదండ్రులుంటేనే పిల్లలు ఇంటికి! -
ఆ పబ్స్ పై కఠిన చర్యలు తీసుకుంటాం: డీసీపీ శిల్పవల్లి
-
‘లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు’
సాక్షి, విజయవాడ: ప్రజారోగ్యం కోసమే లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నామని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. నగరంలో అనవసరంగా రోడ్లపై తిరిగే వారిపై 77 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. కరోనా నియంత్రణ కోసమే కఠినంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. అందరూ ఇంట్లోనే ఉండి ఉగాది జరుపుకోవాలని సూచించారు. విజయవాడ నగరంలోకి ఇతర జిల్లాల వాహనాలు రాకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అత్యవసరమయితే తప్ప వాహనాలు అనుమతించేది లేదని సీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. (కరోనా ఎఫెక్ట్: అనుకున్నట్లే వాయిదా పడింది..) -
ఐసీసీ చర్యలు తీసుకుంటుంది
పాచెఫ్‌స్ట్రూమ్: అండర్–19 ప్రపంచకప్ ఫైనల్లో బంగ్లాదేశ్ కుర్రాళ్ల శ్రుతిమించిన అతి ఉత్సాహంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చర్యలు తీసుకుంటుందని యువ భారత జట్టు మేనేజర్ అనిల్ పటేల్ తెలిపారు. ఈ విషయాన్ని మ్యాచ్ రిఫరీ గ్రేమ్ లెబ్రూయ్ స్వయంగా తన వద్దకు వచ్చి చెప్పారని ఆయన అన్నారు. ‘నిజానికి అసలేం జరిగింది మాకు కచ్చితంగా తెలియదు. కానీ అంతా నిర్ఘాంతపోయారు. ఆఖరు నిమిషాల్లో ఏం జరిగిందనే విషయంపై ఐసీసీ అధికారులు ఆరా తీస్తారు. ఇందు కోసం వీడియో ఫుటేజీలు పరిశీలిస్తారు’ అని అనిల్ తెలిపారు. మ్యాచ్ ముగియగానే బంగ్లా కుర్రాళ్ల ఆనందం, వెర్రి తలకెక్కింది. ఒక్కసారిగా మైదానంలోకి దూసుకొచ్చి భారత ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకొని విపరీత ధోరణిలో ప్రవర్తించారు. పేసర్ షరీఫుల్ ఇస్లామ్ అయితే అందరికంటే అతి ఎక్కువ చేశాడు. భారత ఆటగాళ్లకు మరీ దగ్గరగా వచ్చి అనుచిత సంజ్ఞలు చేశాడు. మ్యాచ్ జరిగే సమయంలోనూ షరీఫుల్ బంతి సంధించిన ప్రతీసారి స్లెడ్జింగ్‌కు పాల్పడటం టీవీ కామెంటేటర్లను విస్మయానికి గురిచేసింది. భారత కెప్టెన్ ప్రియమ్ గార్గ్ బంగ్లా ఆటగాళ్ల ప్రవర్తనపై అసంతృప్తి వెలిబుచ్చా డు. ‘గెలుపోటములు సహజం. ఆటలో భాగమే. కానీ సంబరమైనా, బాధయినా మనం నియంత్రించుకోవాలి. మరీ ఇంత చెత్తగా స్పందించకూడదు. అతి చేష్టలకు పాల్పడకూడదు’ అని అన్నాడు. బంగ్లా సారథి అక్బర్ అలీ కూడా తమ ఆటగాళ్లు మరీ అంత అతిగా స్పందించకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. -
మహిళల రక్షణకు చర్యలు తీసుకోండి
న్యూఢిల్లీ: మహిళల రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర హోంశాఖ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది. గత కొద్ది రోజులుగా వెలుగు చూస్తున్న అత్యాచార ఘటనలు, దాడుల నేపథ్యంలో లేఖ రాస్తున్నట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్‌భల్లా తెలిపారు. మహిళల రక్షణ ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని ఆయన చెప్పారు. మహిళలకు రక్షణ కల్పించేందుకు చట్టాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, అయినప్పటికీ పోలీసులు వెంటనే స్పందించడం ద్వారా మరింత మెరుగైన ఫలితాలు ఉంటాయన్నారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదుచేయడంలో పోలీసులు విఫలమైతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మహిళలు, బాలికలకు సంబంధించిన ఫిర్యాదుల విషయంలో పోలీసులు వేగంగా స్పందించాలని కోరారు. ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ సిస్టం ఫర్ సెక్సువల్ అఫెన్సెస్ (ఐటీఎస్ఎస్ఓ) పోర్టల్ ద్వారా ఆయా రాష్ట్రాలలోని అత్యాచార కేసుల విచారణను రెండు నెలల్లోగా పూర్తయ్యేలా పర్యవేక్షణ చేసుకోవచ్చని అందులో సూచించారు. -
ర్యాగింగ్ రాక్షసి
సాక్షి, పార్వతీపురం,(విజయనగరం) : టీనేజ్‌లో రంగుల ప్రపంచం. బాధ్యతలు తెలియని ప్రాయం. చిన్న బాధకు కందిపోయే మనస్సు. అప్పుడే ఆకర్షణలకు లోనవుతున్నారు. కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్లు.. కొత్త కొత్త బైకుల్ని చూసి మనసు పారేసుకుంటారు. బ్రాండెడ్ డ్రెస్‌లు కొని ధరించాలని ఉవ్విళ్లూరుతారు. ఇవన్నీ దొరకాలంటే.. చేతినిండా పైసలు కావాలి. టీనేజ్ యువత సులభ సంపాదనకు అలవాటు పడుతోంది. ఇందులో భాగంగా తోటి విద్యార్థులను వేధించడం, సీనియర్లు జూనియర్లతో ఖర్చులు పెట్టించడం, కొత్తగా కళాశాల్లో చేరే అమాయక విద్యార్థుల బలహీనతను కనిపెట్టి వారిని బెదిరించి ఖర్చు పెట్టించడం.. ఇవన్నీ ర్యాగింగ్‌లో భాగమయ్యాయి. కళాశాలల్లో ర్యాగింగ్ వెర్రి తలలు వేస్తోంది. పోలీసులు మహిళా రక్షక్ పేరిట కమిటీలను ఏర్పాటు చేసినా ప్రయోజనం లేకపోతోంది. ఈ సందర్భంగా విద్యార్థుల మధ్య స్నేహ సంబంధాలు వృద్ధి చెందేలా.. ర్యాగింగ్ నిరోధించేలా కళాశాలల యాజమాన్యాలు తీసుకోవలసిన చర్యలపై అవగాహన కథనమిది. కళాశాలలు, వసతిగృహాలు, క్యాంపస్‌ల ఆవరణల్లో వివిధ రూపాల్లో ర్యాగింగ్ సాగుతోంది. గతంలో పలుచోట్ల బాలికల వసతిగృహాల్లోను ఈ దుమారం రేగడం తెలిసిందే. గత ఏడాది విజయనగరం పట్టణంలో విద్యార్థినులను ఆకతాయిలు వేధిస్తే పోలీసులు బుద్ధి చెప్పడం తెలిసిందే. వివిధ కారణాలతో ఇలాంటివి ఒకటి, రెండు మాత్రమే బయటికి వస్తున్నాయి.కళాశాల బయట ప్రధాన ఆర్టీసీ బస్టాండ్లు తదితర ప్రాంతాల్లో సీనియర్లే కాకుండా... బయటి వ్యక్తులు కూడా ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారు. అమ్మాయిలు చూసీ చూడనట్టు ఉండటంతో ఆకతాయిలు మరింత రెచ్చిపోతున్నారు. ఎవరైనా కామెంట్ చేస్తే గట్టిగా ఎదిరించాలని.. బహిరంగ ప్రాంతాల్లో పోలీసు నిఘా పెట్టాలని మహిళా సంఘాలు సూచిస్తున్నాయి. పాఠశాలలు, కళాశాలలకు ఆడపిల్లలు వెళ్లే సమయాల్లో బస్సులో ప్రయాణించే కొందరు ఆకతాయిలు ఇబ్బంది పెట్టడం, ద్వందార్థాలతో వారిని కించపరచడం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే ఆడపిల్లలు ఫిర్యాదు చేయాలి. లేదంటే ఏడాది పొడవునా ఆకతాయిలు రెచ్చిపోయి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ర్యాగింగ్ నిరోధానికి కళాశాల యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తే వారు దీన్ని ప్రోత్సహించినట్టు భావించి శిక్షించాలని చట్టం చెబుతోంది. దీనికి కళాశాల ప్రిన్సిపల్, కరస్పాండెంట్ కమిటీలోని అధ్యాపకులు, వార్డెన్ బాధ్యులే. దీనికి తోడు ఇలాంటి కళాశాలలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయ సహకారాలను నిలిపివేస్తారు.ర్యాగింగ్‌కు పాల్పడితే బాధితులు ఫిర్యాదు చేయాలి. విద్యార్థులు క్రమ శిక్షణను అలవరచుకోవాలి. యాజమాన్యాలు సైతం ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలి. సుప్రీంకోర్టు ఆదేశాలివి.. దేశ వ్యాప్తంగా ర్యాగింగ్ నిరోధానికి సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. దీని ప్రచారం కోసం కమిటీని ఏర్పాటు చేసింది. దీని సిఫార్సులను విధిగా అమలు చేయాలి. కళాశాలకు కొత్తగా వచ్చే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు సీనియర్లు, జూనియర్ల మధ్య స్నేహభావం పెంపొందించేందుకు సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలను ఆయా కళాశాలల్లో విస్తృతంగా నిర్వహించాలి. ప్రతి కళాశాలలో ర్యాగింగ్ నిరోధక పర్యవేక్షణ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలి. పోలీసుల టోల్ ఫ్రీ నంబరు విద్యార్థులు ర్యాగింగ్‌కు గురైతే వెంటనే 100 టోల్‌ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేయొచ్చు. వెంటనే కంట్రోల్ రూమ్ అధికారులు, స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తారు. లేదంటే స్థానిక పోలీస్ స్టేషన్‌కు నేరుగా తెలపొచ్చు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ మానవ నవరుల శాఖ టోల్‌ఫ్రీ నంబర్ 18001805522కు కూడా ఫిర్యాదు చేయొచ్చు. సంఘటన జరిగిన వెంటనే బాధితులు లేదా స్నేహితులు హెల్ప్‌లైన్‌ను సంప్రదించొచ్చు. బాధితుల పేరు, ప్రాంత కంట్రోల్ రూమ్‌లో నమోదవుతాయి. అక్కడి అధికారులు తక్షణమే స్పందించి సంస్థ, విశ్వవిద్యాలయం అధికారులకు సమాచారం ఇస్తారు. సంఘటన తీవ్రమైందని భావిస్తే కంట్రోల్ రూమ్ నుంచి నేరుగా జిల్లా మేజిస్ట్రేట్, ఎస్పీలకు సమాచారం అందిస్తారు. తీసుకోవలసిన జాగ్రత్తలు కళాశాల నోటీసు బోర్డులో ర్యాగింగ్ నిరోధక హెల్ప్‌లైన్ నంబరు ఉండాలి. ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేయాలి. ప్రిన్సిపల్ ఆయా విభాగాల అధిపతులు, కమిటీ సభ్యులు, స్క్వాడ్ సబ్ డివిజన్ జిల్లా పోలీసు అధికారుల ఫోన్ నంబర్లు ఉండాలి. కానీ జిల్లాలోని చాలా కళాశాలల్లో వీటి గురించి పట్టించుకోవడం లేదు. ప్రతి కళాశాలలో మనస్తత్వ నిపుణుడిని నియమించాలి. విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇప్పించాలి. విధిగా తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించాలి. పోస్టర్లు, బ్యానర్లు, కరపత్రాలను ప్రచురించాలి. -
అత్యాచార నిందితులపై కఠిన చర్యలు
పాలకొండ : బాలికలపై జరుగుతున్న అత్యాచారాలకు సంబంధిం చి నిందితులపై బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కఠిన చర్యలు తీసుకుంటుందని కమిషన్ రాష్ట్ర సభ్యుడు పి.వి.వి.ప్రసాద్ అన్నా రు. సీతంపేట మండలానికి చెందిన 8 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచార కేసును పరిశీలించేందు గురువారం రాత్రి పాలకొండ ఏరి యా ఆస్పత్రికి వచ్చిన ఆయన వైద్యులతో మాట్లాడారు. డీఎస్పీ జి.స్వరూపరాణికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేసు నమోదైన వెంటనే బాధితురాలికి రూ.4లక్షలు పరిహారం అందజేస్తామని తెలిపారు. కేసు నీరు గార్చకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఆయనతో పాటు చైల్డ్‌లైన్ సంస్థ జిల్లా కో ఆర్డినేటర్ రమణ, ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎల్.శాంతకుమారి ఉన్నారు. -
స్కామ్‌స్టర్స్‌పై ఉక్కుపాదం
న్యూఢిల్లీ: దేశాన్ని కుదిపేస్తున్న పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) కుంభకోణంపై ప్రధాని మోదీ తొలిసారి పెదవి విప్పారు. నీరవ్, పీఎన్బీల పేర్లను ప్రస్తావించకుండా మోదీ మాట్లాడారు. ఆర్థిక అవకతవకలకు పాల్పడే వారిపై తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఇలాంటి కుంభకోణాలను గుర్తించేందుకు ఆర్థిక సంస్థలు, వాటి పర్యవేక్షక విభాగాలు∙శ్రద్ధతో పనిచేయాలన్నారు. ఆంగ్ల దినపత్రిక ఎకనమిక్ టైమ్స్ నిర్వహించిన ప్రపంచ వాణిజ్య సదస్సులో శుక్రవారం మోదీ మాట్లాడారు. ‘ఆర్థిక అవకతవకలపై మా ప్రభుత్వం ఇప్పటికే కఠిన చర్యలు తీసుకుంటోందనీ, ఇకపై కూడా అలాగే వ్యవహరిస్తామని నేను స్పష్టంచేస్తున్నాను’ అని అన్నారు. 2011 నుంచి 2017 మధ్య నీరవ్ మోదీ బ్యాంకు అధికారులతో కుమ్మక్కై అక్రమంగా ఎల్వోయూలు జారీ చేయించుకుని బ్యాంకును రూ.11,400 కోట్లకు మోసగించడం తెలిసిందే. ‘నిబంధనలు, విధానాలను రూపొందించేవారు తమ పనిని జాగ్రత్తగా చేయాలని నేను కోరుతున్నాను’ అని మోదీ అన్నారు. జీఎస్టీ వల్ల పన్ను ఆదాయం పెరిగిందనీ, గతంలో 60 లక్షల మంది పన్నులు కడుతుండగా ఇప్పుడు ఆ సంఖ్య కోటికి చేరిందని ఆయన అన్నారు. ఆర్థిక లోటు, ద్రవ్య లోటుల్లో తగ్గుదల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాక తదితరాలే భారత వృద్ధి గురించి చెబుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత వాటా 3.1 శాతానికి పెరిగిందనీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో 21 శాతం భారత్‌దేనని మోదీ వెల్లడించారు. -
కఠిన చర్యలే మందు
పక్షం రోజుల వ్యవధిలో రెండోసారి ప్రధాని నరేంద్ర మోదీ గోరక్షణ పేరుతో చెల రేగిపోతున్న మూకల గురించి మాట్లాడవలసి వచ్చింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ అంశాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. మత హింసను అరికట్టడానికి సహకరించమని కూడా ఆయన అన్ని పార్టీలకూ విజ్ఞప్తి చేశారు. గత నెలాఖరున అహ్మదాబాద్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించినప్పుడు ఆయన ఆవు పేరిట వివిధచోట్ల దాడులపై ఆందోళన వ్యక్తంచేశారు. గాంధీ పుట్టిన గడ్డపై పుట్టామన్న సంగతి మరిచి కొందరు హింసకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇలాంటి దాడుల్లో బాధి తులుగా మారుతున్నవారంతా ప్రధానంగా దళితులు, ముస్లిం, సిక్కులు. ఇవి ఏదో ఒక ప్రాంతానికో, రాష్ట్రానికో పరిమితమై లేవు. స్థాయీ భేదం ఉండొచ్చు తప్ప ఈశాన్య రాష్ట్రాలతో మొదలుపెట్టి దాదాపు అన్నిచోట్లా అవి అడపా దడపా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ ఘటనలు ఇతరత్రా హింసాత్మక ఉదంతాలకు సైతం స్ఫూర్తినిచ్చాయి. 2015 అక్టోబర్‌లో ఆవు మాంసం ఇంట్లో ఉన్నదన్న అనుమా నంతో అఖ్లాక్ అనే ఒక కుటుంబ పెద్దను మూకలు కొట్టి చంపాయి. అతని కుమా రుణ్ణి తీవ్రంగా గాయపరిచాయి. గత నెల 22న ఈద్ పండుగ సందర్భంగా కొత్త బట్టలు కొనుక్కుని ఉత్సాహంతో రైల్లో స్వస్థలం వెళ్తున్న పదిహేనేళ్ల బాలుడితో, అతని స్నేహితులతో కొందరు దుండగులు తగాదా పడి, మతం పేరుతో దూషిం చారు. ఆవును చంపి తినడం తప్పుకాదంటున్నాడని లేనిపోని మాటలు పుట్టిం చారు. తీవ్రంగా కొట్టి నడుస్తున్న రైలు నుంచి బయటకు నెట్టారు. ఆ బాలుడికి సకాలంలో వైద్య సాయం అందకపోవడంతో ప్లాట్‌ఫాంపైనే కన్నుమూశాడు. రాజస్థాన్‌లో నిరుపేద మహిళలు గత్యంతరం లేక కాలకృత్యాలు తీర్చుకోవడానికి బయటకు వెళ్లినప్పుడు వారిని సర్కారీ సిబ్బంది ఫొటోలు తీయడానికి ప్రయత్నిస్తే అడ్డుకున్నాడని ఆగ్రహించి జాఫర్ ఖాన్ అనే వ్యక్తిని కొట్టి చంపారు. మూడు రోజులక్రితం యూపీలోని మొయిన్‌పురి వద్ద రైల్లో వెళ్తున్న ముస్లిం కుటుంబంపై గుంపు దాడి చేశారు. మరో స్టేషన్ సమీపించేలోపు తమ ముఠాను ఫోన్లు చేసి పిలిపించుకుని అందరూ కలిసి ఇనుప రాడ్లతో ఆ కుటుంబసభ్యులను తీవ్రంగా కొట్టారు. మహిళలు, పిల్లలు అన్న విచక్షణ కూడా చూపలేదు. కుటుంబంలో మతి స్థిమితం లేని బాలుణ్ణి కూడా వదల్లేదు. ఇంత ద్వేషం, ఇంత అసహనం, ఇంత ఆగ్రహం ఈ గుంపులకు ఎక్కడినుంచి వస్తోంది? అకారణంగా ఎందుకిలా దాడులకు తెగిస్తున్నారు? కారణం స్పష్టమే. ప్రభుత్వాలు ఇలాంటి ఉదంతాల్లో ఉదాసీనంగా ఉంటున్నాయి. ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించని పోలీసులపై చర్యలకు సిద్ధపడటం లేదు. దర్యాప్తు ఎలా జరుగుతున్నదో, చార్జిషీటు దాఖలులో జాప్యం, నిందితులకు బెయిల్ రావడం వగైరాలపై ఆరా ఉండటం లేదు. దానికితోడు కొందరు బీజేపీ నేతలు మొదలుకొని మంత్రి పదవుల్లో ఉన్నవారి వరకూ బాధ్యతారహితంగా మాట్లాడటం పరోక్షంగా గోరక్షణ పేరుతో రెచ్చిపోతున్న మూకలకు బలాన్నిస్తోంది. ఇలాంటి దౌర్జన్యాల అవసరం లేకుండానే గోరక్షణకు చట్టాలున్నాయి. వాటిని ఉల్లంఘించినవారిపై సమాచారమిస్తే ప్రభుత్వ యంత్రాంగాలు చర్యలు తీసుకుంటాయి. అలా తీసుకోని పక్షంలో ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావొచ్చు. కానీ దీన్ని వదిలిపెట్టి వీ«ధుల్లో స్వైరవిహారం చేయడం, హత్యలకు ఒడిగట్టడం, జనాన్ని భయపెట్టాలని చూడటం దారుణం. ఇలాంటి మూకలపై రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని మోదీ సూచించడం హర్షించదగ్గదే. అయితే ఆ మాటను పదే పదే చెప్పించుకునే స్థితిలో ప్రభుత్వాలుండటం ఆందోళన కలిగిస్తుంది. శాంతిభద్రతల అంశం మౌలికంగా రాష్ట్రాల పరిధిలోనిది. గోరక్షణ పేరుతో హింసకు పాల్పడేవారూ లేదా దాన్ని ప్రోత్స హించేవిధంగా మాట్లాడేవారూ ఏ పార్టీకి చెందినవారైనా వెనువెంటనే కేసులు పెట్టి అరెస్టు చేయాలని ఒక్క ఉత్తర్వు జారీచేస్తే పోలీసులు కాదంటారా? పాలకులుగా ఉన్నవారు చేతగానితనంతో ఉండిపోవడం వల్ల మాత్రమే ఇదంతా కొనసాగు తోంది. మత హింసను అరికట్టడంలో విపక్షాలు సహకారం అందించాలనడం అభినందనీయమే అయినా అలాంటి ఉదంతాలపై ధర్నాలు, ఆందోళనలు నిర్వ హించడం ద్వారా ఆ పార్టీలు ప్రభుత్వాల దృష్టికి తెస్తూనే ఉన్నాయి. కదలిక లేని దల్లా ప్రభుత్వాల్లోనే. శాంతిభద్రతల విషయంలో విఫలమైనప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం సంజాయిషీ కోరడం అసాధారణమేమీ కాదు. గతంలో అలాంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అలా చేస్తే కనీసం సంజాయిషీ ఇచ్చుకోవాలన్న భయంతోనైనా ప్రభుత్వాలు కదులుతాయి. మోదీ చెప్పారు గనుక కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆ దిశగా దృష్టి పెట్టాలి. ఎప్పుడెప్పుడు గోరక్షణ పేరుతో మూకలు దాడులకు, హత్యలకు దిగాయన్న అంశంపై సమగ్రమైన నివేదికలు తెప్పించుకోవాలి. ఆ ఉదంతాల్లో తీసుకున్న చర్యలేమిటో, అందుకు సంబంధించిన కేసుల దర్యాప్తు ఎంతవరకూ వచ్చిందో, అందులో నిందితులకు శిక్షలు పడినవెన్నో సేకరించాలి. చర్యలు సరిగా లేవనుకున్నప్పుడు తగిన సూచనలు చేయాలి. ఆ విషయంలో ఏమవుతున్నదో ఎప్పటికప్పుడు ఆరా తీయాలి. బాధిత కుటుంబాలకు వైద్య చికిత్స, ఆర్ధిక సాయం, పునరావాసం ఏమేరకు అందాయో తెలుసుకోవాలి. ఇవన్నీ చేయడానికి ముందు పార్లమెంటు ఉభయసభల్లో సమగ్రమైన చర్చ జరగాలి. అధికార, విపక్ష సభ్యులు పరస్పర విమర్శలు, ఆరోపణలతో కాలక్షేపం చేయకుండా మూక దాడులను ఆపడానికి ఏం చేయాలన్న అంశంపై కేంద్రీకరించాలి. ప్రభుత్వం కప్పదాటు వైఖరిని విడనాడాలి. కొందరు సామాజిక కార్యకర్తలు సూచిస్తున్నట్టు ప్రత్యేక చట్టం తెచ్చే అంశాన్ని సైతం పరిశీలించాలి. కేవలం మాటల వల్ల ఫలితం ఉండటం లేదని అర్ధమయ్యాక కఠిన చర్యలకు ఉపక్రమించడమే వివేకవంతమైన పని. అప్పుడు మాత్రమే చట్టబద్ధ పాలనలో ప్రజలకు విశ్వాసం కలుగుతుంది. అరా చకం అంతమవుతుంది. -
చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు : డీఎస్పీ
పుట్టపర్తి టౌన్: పుట్టపర్తి ప్రశాంతతకు భంగం కలిగేలా ప్రవర్తిస్తే కఠినచర్యలు తీసుకుంటామని పుట్టపర్తి పట్టణ డీఎస్పీ ముక్కాశివరామిరెడ్డి హెచ్చరించారు. ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి కరణం రామక్రిష్ణ ఆస్తులను ఇతరులకు అమ్మిన కేసులో నిందితులను అరెస్ట్ చేసి సోమవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ ముక్కాశివరామిరెడ్డి మాట్లాడుతూ నకిలీ రిజిస్ట్రేష¯ŒS పత్రాలపై సాక్షి సంతకాలు చేసిన డేరంగుల విష్ణు, ఎంబీఏ విద్యార్థి రవికుమార్‌ను, రామక్రిష్ణ సంతకాలను ఫోర్జరీ చేసిన చంద్రశేఖర్‌రెడ్డిని, నకిలీ పాసుపుస్తకాలు తయారు చేసిన చంద్రశేఖర్‌రెడ్డిని, వారికి సహకరించిన తిరుపాల్నాయుడును పుట్టపర్తి పట్టణ సీఐ బాలసుబ్రమణ్యం బృందం అరెస్ట్ చేసిందన్నారు. మరో నిందితుడు నారాయణస్వామి పరారీలో ఉన్నాడని, ఆయనను సైతం త్వరలోనే ఆరెస్ట్ చేస్తామని చెప్పారు. -
మళ్లీ నిర్మిస్తే జైలుకే
కూల్చివేసిన కట్టడాలను తిరిగి నిర్మిస్తే కఠిన చర్యలు * మంగళవారం ఒక్కరోజే 204 నిర్మాణాల కూల్చివేత సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని నాలాలపై కట్టడాలు, వివిధ ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం మోపుతోంది. కూల్చిన వాటిని తిరిగి నిర్మిస్తే కేసులు పెట్టి జైలుకు పంపడానికి సైతం వెనుకాడవద్దని నిర్ణయించింది. అంతేగాకుండా కూల్చివేతల ఖర్చును సైతం వారి నుంచి వసూలు చేస్తామని హెచ్చరించింది. ఇందుకోసం జీహెచ్ఎంసీ యాక్ట్‌లోని 669 సెక్షన్‌ను ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. అక్రమ నిర్మాణాల కూల్చివేతను చేపట్టిన జీహెచ్ఎంసీ అధికారులు.. ఒత్తిళ్లకు తలొగ్గవద్దంటూ ముఖ్యమంత్రి కూడా ఆదేశించడంతో మంగళవారం మరింత ముమ్మరం చేశారు. నాలాలపై నిర్మాణాలు, అనుమతి లేని నిర్మాణాలతోపాటు శిథిలమైన భవనాలను కూల్చివేస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే దాదాపు 204 నిర్మాణాలను కూల్చివేశారు. ఆగని అక్రమ నిర్మాణాలు... అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ(బీఆర్ఎస్) కోసం ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసిన తర్వాత కూడా భారీయెత్తున అక్రమ నిర్మాణాలు జరిగినట్లు జీహెచ్ఎంసీ దృష్టికి వచ్చిం ది. దీంతో అధికారులు గత జనవరిలో సర్వే జరిపించారు. గతేడాది అక్టోబర్ 28 నాటికి నిర్మాణమై ఉన్న వాటికి మాత్రమే బీఆర్ఎస్ వర్తిస్తుంది. కానీ ఆ తర్వాత కూడా 583 అక్రమ నిర్మాణాలు జరిగాయి. వాటిలో దాదాపు 460 నిర్మాణాలను కూల్చివేశారు కూడా. అయితే ఆ తరువాత కూడా అక్రమ నిర్మాణాలు జరిగాయి. దీంతో భవిష్యత్తులో ఎవరూ అక్రమ నిర్మాణాల జోలికి పోకుండా ఉండేందుకుగాను జీహెచ్ఎంసీ యాక్ట్ 669ను ప్రయోగించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. దీని ప్రకారం అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేయడంతో పాటు నిర్మించుకుంటున్నవారిని అరెస్టు చేయవచ్చని జీహెచ్ఎంసీ చీఫ్ సిటీప్లానర్ దేవేందర్‌రెడ్డి తెలిపా రు. ఇప్పుడు కూల్చివేస్తున్న నిర్మాణాలను ఎవరైనా తిరిగి నిర్మిస్తే ఈ యాక్ట్‌ను ప్రయోగిస్తామని హెచ్చరించారు. కూల్చివేతల వ్యయాన్ని సైతం వారి నుంచే రాబడతామన్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది, అధికారులెవరైనా అక్రమాలను ప్రోత్సహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా అక్రమ నిర్మాణాల పట్ల నిర్లక్ష్యం కనబరిచే అధికారులు, సిబ్బందిని ఏకంగా సర్వీసు నుంచే తొలగిం చేలా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టౌన్ ప్లానింగ్ విభాగంలో త్వరలో ఖాళీ పోస్టులను భర్తీ చేయనుండడంతో కఠిన చర్యలకు అవకాశముంటుందని భావిస్తున్నారు. వేగంగా కూల్చివేతలు... నాలాలపై ఆక్రమణల తొలగింపునకు బెంగళూరు విధానాన్ని అనుసరిస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు.. వేగంలో మాత్రం ఆ నగరాన్ని మించిపోయారు. బెంగళూరులో నాలాలపై 1,913 నిర్మాణాల్ని గుర్తించి నెలరోజుల్లో 200 నిర్మాణాలను కూల్చివేశారు. జీహెచ్ఎంసీ ఒక్కరోజులోనే 204 అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. అక్రమ నిర్మాణాల కూల్చివేతపై జీహెచ్ఎంసీ అధికారులను మంత్రి కేటీఆర్ అభినందించారు. ‘ఇవాళ చేసింది గుడ్జాబ్.. ఇదే ఉత్సాహంతో ముందుకు సాగండి..’ అని అధికారులకు మెసేజ్ పంపారు. ‘బడా’ అక్రమాలను వదిలేస్తున్నారు? * రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో బడాబాబుల జోలికి వెళ్లకుండా కేవలం నిరుపేదలకు చెందిన నిర్మాణాలనే కూలుస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఓల్డ్ కర్నూల్ రోడ్డుపై ఫంక్షన్‌హాళ్లను నిర్మించి వరద నీరు వెళ్లకుండా అడ్డుకున్న వారి నిర్మాణాలను వదిలేసి.. తమపై ప్రతాపం చూపుతున్నారని వాపోయారు. * బంజారాహిల్స్ రోడ్ నంబర్ 11లోని అంతగానికుంట చెరువు (తాజ్‌బంజారా లేక్)ను ఆక్రమించి నాలా వెంబడి 600 గజాల స్థలంలో ప్రైవేట్ వ్యక్తి పార్కు నిర్మించుకున్నట్లు గుర్తించారు. * కూకట్పల్లి సర్కిల్లోని హైదర్‌నగర్ బృందావన్ కాలనీలో ఇంటి నిర్మాణానికి మాత్రం అనుమతి పొంది మూడు షట్టర్లు వేశారు.వాటిని పూర్తిగా కూల్చకుండా తూతూమంత్రంగా సగం కూల్చి వెళ్లిపోయారు. * బేగంపేట్ అల్లంతోట బావి ప్రాంతంలో నాలాను ఆక్రమించి వేసుకున్న దాదాపు 40 గుడిసెలను అధికారులు నేలమట్టం చేశారు. అధికార యంత్రాంగం భారీగా అక్కడికి చేరుకోవడంతో గుడిసెల్లో నివాసం ఉంటున్నవారు ఆందోళనకు దిగడంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. చివరకు కూల్చివేశారు. * సోమవారం బాలాజీనగర్ డివిజన్ పరిధిలోని ఆంజనేయనగర్‌లో చేపడుతున్న అక్రమ నిర్మాణాల తొలగింపును మూసాపేట డివిజన్ కార్పొరేటర్ తూము శ్రవణ్‌కుమార్ నిలిపివేయగా వెళ్లిపోరుున అధికారులు.. మంగళవా రం అటువైపు రాకపోవడం గమనార్హం. కోర్టుల్లో 6 వేల కేసులు జీహెచ్ఎంసీలో అక్రమ నిర్మాణాలకు సంబంధించి వివిధ కోర్టుల్లో ఉన్న కేసులపై జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సెల్స్‌తో మేయర్ రామ్మోహన్, కమిషనర్ జనార్దన్‌రెడ్డి సమావేశమయ్యారు. మొత్తం గా దాదాపు 6 వేల కోర్టు కేసులు ఉన్నాయని వారు ఈ సందర్భంగా వివరించారు. ఫిర్యాదులే ఫిర్యాదులు అక్రమ నిర్మాణాల గురించి ఫిర్యాదు చేసే వారికి సీఎం కేసీఆర్ రూ.10వేల నజరానా ప్రకటించడంతో జీహెచ్ఎంసీకి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. రెండు రోజుల్లోనే 118 ఫిర్యాదులు వచ్చినా.. నజరానాకు సంబంధించి విధివిధానాల కోసం జీహెచ్ఎంసీ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాస్తున్నారు. ఒకే అక్రమ నిర్మాణం గురించి ఎక్కువ మంది తెలియజేస్తే బహుమతిని ఎవరికి ఇవ్వాలి, అందరికీ పంచి ఇవ్వాలా... బహుమతుల మొత్తాన్ని ప్రభుత్వం అందజేస్తుందా, జీహెచ్ఎంసీ ఖజానా నుంచి ఇవ్వాలా అన్న విషయాలపై స్పష్టత కోరనున్నారు. అయితే ఇప్పటికే గుర్తించిన అక్రమ నిర్మాణాలకు ఇది వర్తించదని.. కొత్తగా జరుగుతున్న నిర్మాణాలకు వర్తిస్తుందని జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీ గుర్తించిన అక్రమ నిర్మాణాలేవో ప్రజలకు తెలియనందున ఆ వివరాలను జీహెచ్ఎంసీ వెబ్సైట్లో పొందుపర్చాలని అధికారులు యోచిస్తున్నారు. -
వారిపై ఉక్కుపాదం మోపాలి: బాబా రాందేవ్
నాగపూర్: జమ్ముకశ్మీర్‌లో ఆందోళనలు చేపడుతున్న వేర్పాటువాదులపై కఠినచర్యలు తీసుకోవాలని యోగా గురు బాబా రాందేవ్ ప్రభుత్వానికి సూచించారు. కశ్మీరీ ప్రజలు 90 శాతం మంది శాంతిని కోరుకుంటున్నారని.. మిగిలిన వారు మాత్రమే సమస్యలను సృష్టిస్తున్నారన్నారు. ఆదివారం నాగపూర్‌లో మీడియాతో మాట్టాడుతూ.. అశాంతికి కారణమౌతున్న వారిపై ఉక్కుపాదం మోపాలని రాందేవ్ బాబా కోరారు. జమ్ముకశ్మీర్ సమస్య పరిష్కారానికి ప్రభావవంతమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని, అవి ఫలితం దిశగా ఉండాలని బాబా రాందేవ్ సూచించారు. భద్రత, అంతర్జాతీయ వ్యవహారాలు, నూతన పథకాల విషయంలో నరేంద్రమోదీ ప్రభుత్వ పాలన బాగుందని కితాబిచ్చారు. -
గర్భిణులు మరణిస్తే కఠిన చర్యలు
అధికారులపై కలెక్టర్ ముత్యాలరాజు ఆగ్రహం నెల్లూరు(పొగతోట): గ్రామీణ ప్రాంతాల్లో ఇకపై గర్భిణులు మరణిస్తే సంబంధిత వైద్యాధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు హెచ్చరించారు. మంగళవారం స్థానిక గోల్డన్జూబ్లీ హాల్లో వైద్య ఆరోగ్య శాఖ, ఐసీడీఎస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఇటివల కాలంలో ఎనిమిది మంది గర్భిణులు మరణించారన్నారు. వైద్య సిబ్బంది క్షేత్రస్థాయిలో సక్రమంగా విధులు నిర్వహించకపోవడం, పౌష్టిక ఆహారం లభించకపోవడంతోనే వారు మరణిస్తున్నారన్నారు. సిబ్బంది తప్పించుకోవడానికి గర్భిణుల మృతికి హార్టు ఎటాక్ తదితర కారణాలు చూపుతున్నారన్నారు. నిరుపేదలకే హార్టు ఎటాకులు వస్తాయా ఇతరులకు రావా అని కలెక్టర్ ప్రశ్నించారు. పీహెచ్‌సీల్లో వైద్య సేవలు, సౌకర్యాలు సక్రమంగా లేనందునే గర్భిణులు ప్రైవేట్ ఆస్పత్రుల వైపు వెళుతున్నారని తెలిపారు. పీహెచ్‌సీల్లో సిబ్బంది ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తప్పకుండా విధులు నిర్వహించాలన్నారు. 3.45 గంటలకు వైద్యాధికారులు, సిబ్బంది లేకపోయినా చర్యలు చేపడతామని హెచ్చరించారు. సీహెచ్‌సీలకు ఇద్దరు వైద్యాధికారులను నియమించాలని డీఎంహెచ్ఓకు సూచించారు. ఒకరు పీహెచ్సీలో ఉండి ఓపీ చూడాలన్నారు. మరొక డాక్టర్ గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి వ్యాధులు తదితరాలను పరిశీలించాలన్నారు. ఇ–హాస్పిటల్ రిజిస్ట్రేషన్ అన్ని సీహెచ్‌సీలు చేయాలన్నారు. దాని వలన రోగులు ఎంత మంది వస్తున్నారు, గర్భిణులు, హైరిస్క్ గర్భిణులు వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బాల్యవివాహాలు జరుగుతుంటే ఐసీడీఎస్ అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వరసుందరం, నెల్లూరు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ భారతి, డీసీహెచ్ఓ డాక్టర్ సుబ్బారావు, ఐసీడీఎస్ పీడీ విద్యావతి, సీడీపీఓలు, వైద్యాధికారులు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. -
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు
సీపీ సుధీర్‌బాబు వరంగల్ : నగరంలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని వరంగల్ పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు హెచ్చరించారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలు ప్రాంతాల్లోని బహిరంగప్రదేశాలు, మద్యం షాపుల ముందు మందు బాబులు ఇష్టారాజ్యంగా మద్యం సేవిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై సీపీ గురువారం పత్రికలకు ప్రకటన జారీ చేశారు. విచ్చలవి డిగా మద్యం సేవిస్తున్నందున నగరంలోని ప్రజలతో పాటు మహిళ లు, విద్యార్థులు, పిల్లలు, ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసిందన్నారు. వీరి వల్ల అభద్రతాభావం వ్యక్తం అవడంతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశాలు ఉండడంతో సీపీ ప్రత్యేక దృష్టి సారించిన ట్లు తెలిసింది. పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెక్షన్ 144 ప్రకారం 2016 ఏప్రిల్ 1వ తేదీ నుంచి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడాన్ని ని షేదిస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి నుంచి నిషేదిత ఉత్తర్వులను ఉల్లంఘించిన వ్యక్తులపై ఇప్పటి వరకు 220 కేసులు నమోదు చేయడంతో పాటు 238 మంది మ ద్యపాన ప్రియులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. వీరికి కోర్టు రూ.40,640 జరిమానా విధించింది. ఈ నిషేదాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కమిషనరేట్ పరిధిలోని పోలీస్‌స్టేçÙన్ల పరిధిలో గస్తీ ముమ్మ రం చేశారు. ఇందుకోసం ప్రతి పోలీ ‹స్డివిజన్ పరిధిలో ప్రత్యేక బృం దా లు ఏర్పాటు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగినా, అసభ్యం గా ప్రవర్తించినా 100 నంబర్‌కు డయల్ చేయాలని,లేక 9491089257 వాట్స ప్ నంబర్‌కు ఫొటోలు, వీడియో, సమాచారం అందిస్తే వెంటనే చర్య లు తీసుకుంటామని సీపీ తెలిపారు. -
సీఎమ్మార్ ఇవ్వకపోతే చర్యలు
జేసీ ఇంతియాజ్ నెల్లూరు(పొగతోట): కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎమ్మార్)ను నిర్దేశించిన సమయంలోపు పూర్తి స్థాయిలో సరఫరా చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ హెచ్చరించారు. కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో సీఎస్డీటీలు, రైస్‌మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. వచ్చే నెల పదో తేదీలోపు 75 శాతం సీఎమ్మార్‌ను సరఫరా చేయాలని సూచించారు. రైస్ మిల్లర్లకు 2.15 లక్షల టన్నుల సీఎమ్మార్‌ను సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్దేశించామని వివరించారు. ఇప్పటి వరకు 86 వేల టన్నుల సీఎమ్మార్‌ను సరఫరా చేశారన్నారు. బాయిల్డ్ రైస్‌ను ఎఫ్సీఐకు సరఫరా చేయాలని పేర్కొన్నారు. రెడ్, బ్లూ రెండు రకాల గన్నీ బ్యాగుల్లో సీఎమ్మార్‌ను సరఫరా చేయాలని పేర్కొన్నారు. అనంతరం రైస్‌మిల్లర్లు తమ సమస్యలను జేసీ దృష్టికి తీసుకొచ్చారు. ఎలాంటి సమస్యలు ఉన్నా సీఎమ్మార్‌ను పూర్తిస్థాయిలో సరఫరా చేయాల్సిందేనని జేసీ స్పష్టం చేశారు. డీఎస్ఓ ధర్మారెడ్డి, డీఎం కొండయ్య, ఏఎస్ఓలు, సీఎస్డీటీలు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు సుబ్రహ్మణ్యంరెడ్డి, కోటేశ్వరరావు, నాగేశ్వరరావు, శ్రీనివాసులురెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయని వారిపై కఠిన చర్యలు
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోని వారిపై కఠిన చర్యలు తీసుకునే అంశంపై ఆలోచన చేయాలని ఉమ్మడి హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నిచోట్ల ఇంకుడు గుంతలున్నాయి? ఎన్నిచోట్ల లేవో పరిశీలించాలని పేర్కొంది. ఇంకుడు గుంతలు లేని చోట్ల వాటిని ఏర్పాటు చేసేందుకు వీలుగా శాశ్వత ప్రాతిపదికన ఒక కమిటీ వేయాలని స్పష్టం చేసింది. ఇంకుడు గుంతల ఏర్పాటుకు కొంత గడువునిచ్చి, అప్పటికీ ఏర్పాటు చేసుకోకుంటే నీటి కనెక్షన్లు రద్దు చేసే అంశాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే కమిటీ పరిశీలించాలంది. రెండు వారాల్లో కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ తరఫు న్యాయవాదులు చెప్పడంతో దాన్ని రికార్డ్ చేస్తూ తదుపరి విచారణను జూన్ 20కి వాయిదా వేసింది. ప్రభుత్వం అన్ని సూచనలు, సలహాలతో దీనిపై ఓ నివేదిక తయారు చేసి దానిని కోర్టు ముందుంచాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని నగరంలో భవన నిర్మాణ నిబంధనలు, జీవో 350ల ప్రకారం ఇంకుడు గుంతల ఏర్పాటుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ నగరానికి చెందిన ఎస్.వైదేహిరెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని గురువారం ధర్మాసనం మరోసారి విచారించింది. -
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: జూపల్లి
కవాడిగూడ: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి జూపల్లి అధికారులు, సిబ్బందిని హెచ్చరించారు. గురువారం ఆయన ఇందిరాపార్కు సమీపంలోని ఆప్కో లీవరీ విభాగాన్ని (స్టాక్ సప్లై) తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయ పరిసరాల్లో పరిశుభ్రతను పాటించకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం స్టాక్ సప్లై వివరాలను అడిగి తెలుసుకున్నారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా లేకపోవడం, స్టాక్ వివరాలు సరిగా లేకపోవడంపై అధికారులను నిలదీశారు. కంప్యూటర్లో వివరాలను చూపించాలని ఆదేశించినా సిబ్బంది తప్పించుకునే ప్రయత్నం చేయడంతో డేటాను పెన్‌డ్రైవ్‌లో తీసుకువెళ్లారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ త్వరలో చేనేత శాఖ మంచి రోజులు రాబోతున్నాయన్నారు. జూన్ 2వ తేదీ తర్వాత ఆప్కో విభజన జరుగుతుందన్నారు. వీటిలో స్టాక్, బ్యాంకు బ్యాలెన్స్‌లో అధిక వాటా తెలంగాణకే దక్కుతుందన్నారు. పాఠశాలలు, ఆర్టీసీ, ఆసుపత్రులు, అంగన్ వాడీలకు ఆప్కో వస్త్రాలను పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆప్కో మార్కెటింగ్ అధికారి వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
చర్యలు తీసుకుంటున్నా ఫలితమేదీ?
ఈ ఏడాది పెరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు సాక్షి, ముంబై: జరిమానా విధింపుతోపాటు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారి సంఖ్య ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆందోళనకు గురవుతున్నారు. గత సంవత్సరం జనవరి నుంచి నవంబరు వరకు 11 నెలల్లో చేపట్టిన ఈ డ్రైవ్‌లో 600 మంది పట్టుబడ్డారు. ఈ సంవత్సరం ఏకంగా 2,353 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ సంఖ్య దాదాపు నాలుగు రెట్లు పెరిగిందనే విషయం స్పష్టమైంది. గతంలో జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక శాతం మద్యం సేవించడం వల్లే జరిగినట్లు తేలింది. ఇందులో మద్యం ప్రియులు నిర్వాకంవల్ల ఏటా వందలాది మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అంతేసంఖ్యలో తీవ్రంగా గాయపడుతున్నారు. దీన్ని నివారించేందుకు నగరంలో అక్కడక్కడా ట్రాఫిక్ శాఖ సిబ్బంది రాత్రి వేళల్లో మద్యం ప్రియులను పట్టుకునేందుకు ప్రత్యేకంగా నాకాబందీలు చేపడుతోంది. బ్రీత్ అనలైజర్ పరికరం ద్వారా వారికి పరీక్షలు నిర్వహిస్తోంది. కొన్ని సందర్భాలలో రక్తపరీక్ష కూడా చేయాల్సి వస్తుంది. అందులో మద్యం సేవించినట్లు తేలితే వారికి రూ.2,500 జరిమానా విధించి కోర్టులో హాజరు పరుస్తారు. తరువాత కోర్టు ఇచ్చిన తీర్పును బట్టి వారికి జైలు శిక్ష లేదా కొన్ని నెలలపాటు డ్రైవింగ్ లెసైన్ రద్దు చేయడం లాంటి చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ వీరి సంఖ్య తగ్గుముఖం పట్టకపోవడంతో పోలీసులు ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలాఉండగా 2011లో చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 1,114 మంది వాహన చోదకులను పట్టుకున్నారు. అంతకు ముందు కూడా సంఖ్య అధికంగానే ఉంది. ఆ తరువాత నిబంధనలను కొంతమేర కఠినతరం చేశారు. ఇందులోభాగంగా జరిమానా జైలు శిక్ష, లెసైన్సు రద్దు కాలపరిమితిని పెంచడంలాంటివి చేశారు. దీంతో 2013లో ఈ సంఖ్య కొంత తగ్గుముఖం పట్టింది. అయితే ఈ సంవత్సరం ఈ సంఖ్య ఏకంగా నాలుగు రెట్ల్లు పెరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. -
సొమ్ముంటే సాక్ష్యాలు చూపాల్సిందే..
►రూ.50 వేలకంటే ఎక్కువ తీసుకువెళ్లేవారిపై నిఘా ►13 చెక్నాకాల ఏర్పాటుచేసిన పోలీసులు ►హవాలా కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి ►నేరచరితులపై ముందస్తు చర్యలు ►లెసైన్సుడ్ తుపాకులు డిపాజిట్ చేయాలని వినతి సాక్షి, ముంబై : అసెంబ్లీ ఎన్నికల నిమిత్తం మాల్‌ప్రాక్టీస్‌ను నిరోధించేందుకు నగర పోలీసులు సమాయత్తమయ్యారు. ఇందుకు గాను రూ.50 వేల కన్నా ఎక్కువ డబ్బు ఉన్న వారి నుంచి అవసరమైన పత్రాలను తనిఖీ చేస్తున్నారు. పత్రాలు లేని వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు నిర్ణయించారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు డబ్బును ఎరగా ఉపయోగించి ఓటర్లను ప్రలోభపరిచే అవకాశముందనే అనుమానంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే కొందరు దేశీయ, చట్టవిరుద్ధంగా కలిగి ఉన్న 13 తుపాకీలను, 29 తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా నేర చరిత్ర కలిగిన 4,813 దుండగులపై కూడా చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా, ఇకమీదట రూ.50 వేలకు పైగా నగదును కలిగిఉన్న వారిని పోలీసులు ప్రశ్నించనున్నారు. ఇందుకు సంబంధించిన విత్‌డ్రా స్లిప్‌ను పోలీసులకు వారు చూపించాల్సి ఉంటుంది. ఏ ఉద్దేశంతో విత్‌డ్రా చేశారనే తదితర అంశాలను పోలీసులకు తెలియజేయాల్సి ఉంటుంది. ఈ వివరాలను తెలియచేయడంలో సదరు వ్యక్తి విఫలమైతే సదరు సొమ్మును సీజ్ చేసి ఎన్నికల కమిషన్‌కు స్వాధీనపరచనున్నట్లు ముంబై పోలీస్ అధికార ప్రతినిధి ధనుంజయ్ కులకర్ణి పేర్కొన్నారు. హవాలా కార్యకలాపాలు చేసేవారు తమ పర్యవేక్షణలో ఉంటారన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు హవాలాలను ఉపయోగించుకొని రాష్ట్రానికి డబ్బు తరలిస్తుంటారని ఆయన పేర్కొన్నారు.ముందుజాగ్రత్త చర్యగా 13 చెక్నాకాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇవి రైల్వేలపై కూడా నిఘా ఉంచనున్నాయి.దీంతోపాటు లెసైన్సుడ్ తుపాకీలను కలిగి ఉన్నవారు వాటిని డిపాజిట్ చేయాల్సిందిగా కోరామన్నారు. ఇప్పటికే 288 మంది తమ ఆయుధాలను డిపాజిట్ చేశారు. అంతేకాకుండా కొందరు నేరస్తులకు నాన్‌బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేశామన్నారు. ఇప్పటికే 1,808 వారెంట్లు అమలు చేశామని కులకర్ణి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల తేదీని ప్రకటించడంతో జిల్లా మెజిస్ట్రేట్, పోలీసు కమిషనర్ ఆధ్వర్యంలో లెసైన్సు కలిగిన తుపాకీల వివరాలను సమీక్షించారు. దీంతో ఓ పట్టికను తయారు చేసి సదరు వ్యక్తులను తమ ఆయుధాలను డిపాజిట్ చేయమని కోరామన్నారు. -
24కు బదులు 94
గోదావరిఖనిటౌన్ :మధ్యాహ్న భోజన పథకంలో అవకతవకలకు పాల్పడుతున్న ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి విషయం డీఈవో ఆకస్మిక తనిఖీలో వెల్లడైంది. గోదావరిఖని గాంధీనగర్ ప్రభుత్వ బాలుర పాఠశాలలో 24 మంది విద్యార్థులు ఉండగా ప్రతీ దినం 94 మంది విద్యార్థులు వస్తున్నట్లు రిజిస్టర్లో హెచ్ఎం వెంకటేశ్వర్లు చూపిస్తున్నారు. శనివారం డీఈవో లింగయ్య ఆకస్మిక తనిఖీ నిర్వహించడంతో విషయం వెలుగుచూసింది. కేవలం ఇరవై మంది లోపే విద్యార్థులు భోజనం చేస్తున్నట్లు బయటపడింది. కొంతకాలంగా సాగుతున్న ఈ తంతులో రూ.లక్షల్లో అక్రమాలు జరిగాయని తెలుస్తోంది. అందరూ అందరే.. ఈ అక్రమాలు పాఠశాల సిబ్బందికి, ప్రధానోపాధ్యాయుడికి తెలిసే జరుగుతున్నాయని తెలిసింది. రెండేళ్లుగా ఇలా చేస్తున్నారని, ఈ విషయంలో ఉపాధ్యాయులు, సిబ్బంది అంతా కుమ్మక్కయ్యారని తెలుస్తోంది. ప్రతీ విద్యార్థికి రోజుకు రూ.4 చొప్పున ప్రభుత్వం కేటాయిస్తోంది. ఈ లెక్కన అక్రమాలు లక్షల్లో జరిగినట్లు సమాచారం. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ప్రభుత్వ పాఠశాలల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా విద్యాధికారి లింగయ్య హెచ్చరించారు. విద్యార్థుల సంక్షేమాన్ని చూడాల్సిన ఉపాధ్యాయులు ధనార్జన కోసం, వారి జీవితాలతో ఆటలాడద్దని అన్నారు. గోదావరిఖని బాలుర పాఠశాలలో అక్రమాలకు పాల్పడిన ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లుపై వేటు పడక తప్పదని తెలిపారు. త్వరలోనే ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం, విద్యార్థుల శ్రేయస్సు కోసం మరిన్ని చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. -
రోడ్డు ప్రమాదాలకు చెక్..
- బ్లాక్ స్పాట్ల గుర్తింపునకు ఆదేశాలు - ఇప్పటికే సగం స్థలాలకు మరమ్మతులు - ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠినచర్యలు సాక్షి, ముంబై: తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న స్థలాలను ‘బ్లాక్ స్పాట్’గా గుర్తించి, వాటిని సరిచేయడానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల ట్రాఫిక్, రవాణా విభాగాల ఉన్నతాధికారులు బ్లాక్ స్పాట్లకు సంబంధించి పూర్తి వివరాలతో ఢిల్లీకి రావాల్సిందిగా ఇటీవల హైవే రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ ఆదేశించారు. మాజీ మంత్రి గోపీనాథ్ ముండే రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కేంద్ర ప్రభుత్వం రోడ్డు భద్రతకు సంబంధించి ఎక్కువ శ్రద్ధ వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, ఏడాదిలో మూడు అంతకంటే ఎక్కువ ప్రాణాంతకమైన రోడ్డు ప్రమాదాలు వరుసగా జరిగితే ఆ ఘటన స్థలాన్ని బ్లాక్ స్పాట్‌గా గుర్తిస్తారు. రాష్ట్రంలో ప్రతి ఏడాదీ 13 వేల మంది రోడ్డు ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్నారు. అయితే తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న స్థలాలను ఇప్పటివరకూ ప్రభుత్వం సరిచేయకపోవడం గమనార్హం. ప్రమాదాలు జరుగుతున్న 150 స్థలాలను ‘బ్లాక్ స్పాట్స్’గా గుర్తించారు. ఇందులో 131 స్థలాలను నేషనల్ హైవేపైనా, 19 స్థలాలను స్టేట్ హైవేపైనా గుర్తించారు. వీటిలో జాతీయరహదారిపైన గుర్తించిన 63 స్థలాలను, రాష్ట్ర హైవేపైనా గుర్తించినా అన్ని స్థలాలను బాగుచేయించారు. దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో రాష్ట్రం రెండవ స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. హైవే పోలీసు అధికారులు అందజేసిన వివరాల మేరకు.. ముంబై-అహ్మదాబాద్ హైవేపైన ఉన్న ఠాణే జిల్లాలోని కుడే నుంచి సతివాలి సెక్షన్ వరకు ఉన్న మార్గం రాష్ట్రంలోనే చాలా అపాయకరమైందిగా గుర్తించారు. ఈ స్థలంలో 2011-13 మధ్య కాలంలో దాదాపు 14 ప్రాణాంతకమైన ప్రమాదాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇక్కడ రోడ్డు ప్రమాదాల సంఖ్యను కొంత మేర తగ్గించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు అధికారి తెలిపారు. బ్లాక్ స్పాట్లను హైవే పోలీస్ విభాగం గుర్తిస్తుండగా, ప్రజా పనుల విభాగం, నేషనల్ హైవే అథారటీ (ఎన్హెచ్ఏఐ) ఈ ఘటనా స్థలాలను సరి చేయనున్నాయని హైవే డిప్యూటీ సూపరింటెండెంట్ బలిరామ్ కదమ్ తెలిపారు. రాష్ట్ర పోలీసులు అందజేసిన గణాంకాల ప్రకారం.. 2011లో 68,438 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా, ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన 58,41,782 మందిపై కేసు నమోదు చేశారు. అదేవిధంగా రూ.70.44 కోట్లను జరిమానా రూపంలో వసూలు చేశారు. 2012లో 66,316 రోడ్డు ప్రమాదాలు జరుగగా, 53,60,536 మందిపై ట్రాఫిక్ నియమాలు ఉల్లఘించినందుకు గాను కేసు నమోదు చేసి రూ.68.31 కోట్లను జరిమానా రూపంలో వసూలు చేశారు. 2013లో 63,019 రోడ్డు ప్రమాదాలు జరుగగా, 51,97,460 మందిపై ట్రాఫిక్ నియమాలు ఉల్లఘించిన కేసులు నమోదు చేసి, వారినుంచి రూ.63.62 కోట్లను వసూలు చేశారు. కాగా, 2014లో ఏప్రిల్ వరకు 21,049 రోడ్డు ప్రమాదాలు జరుగగా, 18,85,498 మందిపై ట్రాఫిక్ నియమ ఉల్లంఘన కేసులు నమోదు చేశారు. వారి నుంచి రూ.23.20 కోట్లను జరిమానా రూపంలో వసూలు చేశారు.