సాక్షి, విజయవాడ: ప్రజారోగ్యం కోసమే లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నామని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. నగరంలో అనవసరంగా రోడ్లపై తిరిగే వారిపై 77 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. కరోనా నియంత్రణ కోసమే కఠినంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. అందరూ ఇంట్లోనే ఉండి ఉగాది జరుపుకోవాలని సూచించారు. విజయవాడ నగరంలోకి ఇతర జిల్లాల వాహనాలు రాకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అత్యవసరమయితే తప్ప వాహనాలు అనుమతించేది లేదని సీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు.
(కరోనా ఎఫెక్ట్: అనుకున్నట్లే వాయిదా పడింది..)
ప్రజారోగ్యం కోసమే కఠిన నిర్ణయాలు
Published Tue, Mar 24 2020 7:49 PM | Last Updated on Tue, Mar 24 2020 7:58 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment