
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌ను ఏపీ పభుత్వం ఆదివారం నిర్వహించనుంది. రేపు ఒక్కరేజే 8 లక్షల కరోనా వైరస్ వ్యాక్సిన్ వేసేలా లక్ష్యం పెట్టుకుంది. ఈ మేరకు అన్ని జిల్లాల్ల కలెక్టర్లకు వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు కూడా ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ అందించాలని తెలిపింది. ఇప్పటికే ఒక్కరోజులోనే 6 లక్షల వ్యాక్సిన్లు వేసి ఏపీ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.
ఇప్పటివరకు కోటి 22లక్షల 83వేల 479 వ్యాక్సిన్ డోసులను ప్రభుత్వం ప్రజలకు అందించింది. ఇప్పటివరకు 5లక్షల 29వేల మంది ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు తొలి డోస్ వ్యాక్సిన్ వేశారు. వ్యాక్సినేషన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు రెండు సార్లు ఒక్కరోజులో 6 లక్షల కరోనా వాక్సిన్ డోస్‌లను వైద్య ఆరోగ్యశాఖ అందించింది. ఇప్పటివరకు 26,41,739 మందికి ప్రభుత్వం రెండు డోసుల టీకాను వేసింది.
చదవండి: ఏపీ ఎంసెట్ షెడ్యూల్ ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment