చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు : డీఎస్పీ | Strict action against illegal activities : dsp | Sakshi
Sakshi News home page

చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు : డీఎస్పీ

Published Tue, Jan 24 2017 12:36 AM | Last Updated on Fri, May 25 2018 5:52 PM

Strict action against illegal activities : dsp

పుట్టపర్తి టౌన్: పుట్టపర్తి ప్రశాంతతకు భంగం కలిగేలా ప్రవర్తిస్తే కఠినచర్యలు తీసుకుంటామని పుట్టపర్తి పట్టణ డీఎస్పీ ముక్కాశివరామిరెడ్డి హెచ్చరించారు. ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి కరణం రామక్రిష్ణ ఆస్తులను ఇతరులకు అమ్మిన కేసులో నిందితులను అరెస్ట్‌ చేసి సోమవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా డీఎస్పీ ముక్కాశివరామిరెడ్డి మాట్లాడుతూ నకిలీ రిజిస్ట్రేష¯ŒS పత్రాలపై సాక్షి సంతకాలు చేసిన డేరంగుల విష్ణు, ఎంబీఏ విద్యార్థి రవికుమార్‌ను, రామక్రిష్ణ సంతకాలను ఫోర్జరీ చేసిన చంద్రశేఖర్‌రెడ్డిని, నకిలీ పాసుపుస్తకాలు తయారు చేసిన చంద్రశేఖర్‌రెడ్డిని, వారికి సహకరించిన తిరుపాల్‌నాయుడును పుట్టపర్తి పట్టణ సీఐ బాలసుబ్రమణ్యం బృందం అరెస్ట్‌ చేసిందన్నారు. మరో నిందితుడు నారాయణస్వామి పరారీలో ఉన్నాడని, ఆయనను సైతం త్వరలోనే ఆరెస్ట్‌ చేస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement